AP Board 6th Class Telugu Grammar

SCERT AP Board 6th Class Telugu Solutions 6th Class Telugu Grammar Notes, Questions and Answers.

AP State Syllabus 6th Class Telugu Grammar

1. వర్ణమాల

తెలుగు భాషలో 56 అక్షరాలున్నాయి. ఇవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలని మూడు విధాలు.

AP Board 7th Class Telugu Grammar 1

1. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు. – అ ఇ ఉ ఋు, ఇ, ఎ, ఒ – హ్రస్వాలు.
2. రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు – ఆ, ఈ, ఊ, ఋ, 2, ఏ, ఐ, ఓ, ఔ – దీర్ఘాలు.

* హల్లులు – విభాగం

‘క’ నుండి ‘మ’ వరకు గల అక్షరాలను అయిదు వర్గాలుగా విభజించవచ్చు. అవి :

క – ఖ – గ – ఘ – జ – ‘క’ వర్గం
చ – ఛ – జ – ఝ – 2 – ‘చ’ వర్గం
ట – ఠ – డ – ఢ – ణ – ‘ట’ వర్గం
త – థ – ద – ధ – న – ‘త’ వర్గం
ప – ఫ – బ – భ – మ – ‘ప’ వర్గం

AP Board 7th Class Telugu Grammar

1. కఠినంగా పలికే అక్షరాలు – క, చ, ట, త, ప – పరుషాలు
2. తేలికగా పలికే అక్షరాలు – గ, జ, డ, ద, బ – సరళాలు
3. వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలు – ఖ, ఘ, ఛ, ఝ, ఠ, డ, ఢ, ధ, ఫ, భ – వర్గయుక్కులు
4. ముక్కు సాయంతో పలికే అక్షరాలు – ఆ, ఇ, ణ, న, మ – అనునాసికాలు.
5. అంగిలి సాయంతో పలికే అక్షరాలు – య, ర, ఱ, ల, ళ, వ – అంతస్థాలు
6. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు – శ, ష, స, హ – ఊష్మాలు
7. పరుష, సరళాలు కాకుండా మిగిలిన హల్లులు – స్థిరాలు
8. ‘క’ నుండి ‘మ’ వరకు గల హల్లులు – స్పర్శాలు.

వర్ణోత్పత్తి స్థానాలు

AP Board 7th Class Telugu Grammar 2

ద్విత్వ, సంయుక్తాక్షరాలు

1. ద్విత్వాక్షరం :
ఒక హల్లుకు, అదే హల్లు తాలూకు ఒత్తు చేరితే, దాన్ని “ద్విత్వాక్షరం” అంటారు.
ఉదా : 1. క్క = క్ +్క(క్) + అ = క్క = ఇందులో కకారం రెండుసార్లు వచ్చింది.
2. త్త = త్ + త్ + అ = c = ఇందులో తకారం రెండుసార్లు వచ్చింది.

2. సంయుక్తాక్షరం :
ఒక హల్లుకు వేరొక హల్లు తాలూకు ఒత్తు చేరితే , దాన్ని “సంయుక్తాక్షరం” అంటారు.
ఉదా : 1. న్య = న్ + య్ + అ = న్య = ఇందులో నకారం, యకారాలనే రెండు హల్లులు వచ్చాయి.
2. క్ష్మి = 5 + క్ + మ్ + ఇ = క్ష్మి = ఇందులో కూర, షకార, మకారములనే మూడు హల్లులు కలిశాయి.

2. భాషాభాగాలు

1. నామవాచకం : పేర్లను తెలిపేది నామవాచకం.
ఉదా : రాముడు, వనం, సీత, కాకినాడ మొదలైనవి.

2. సర్వనామం : నామవాచకానికి బదులుగా ఉపయోగించేది సర్వనామం.
ఉదా : అతడు, ఆమె, అది, అవి మొదలైనవి.

3. విశేషణం : నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణం మొదలైన వానిని తెలి.పేది విశేషణం.
ఉదా : అందంగా, తెల్లని, పొడవైన మొదలైనవి.

4. క్రియ : పనిని తెలియజేసేది క్రియ. ఇది రెండు రకాలు.
1. సమాపక క్రియ
2. అసమాపక క్రియ

1. పని పూర్తయినట్లు తెలియజేసేది సమాపక క్రియ.
ఉదా : వచ్చాడు, రాసింది, నవ్వెను మొదలైనవి.

2. పని పూర్తవనట్లు తెలియజేసేది అసమాపక క్రియ.
ఉదా : వచ్చి, చూస్తూ, చూసి మొదలైనవి.

AP Board 7th Class Telugu Grammar

3. తెలుగు సంధులు

సంధి :
ఉచ్చరించడంలో సౌలభ్యం కోసం రెండు పదాలను కలిపి మాట్లాడతాం. ఇలా రెండు పదాలను కలపడాన్ని సంధి అంటారు.
ఉదా :
రాముడు + తడు = రాముతడు
మే + త్త = మేత్త
ది + మి = అదేమి మొదలైనవి.

తెలుగు సంధులు :
రెండు తెలుగు పదాల మధ్య జరిగే సంధులను తెలుగు సంధులు అంటారు.

సంధి కార్యం :
రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును ‘సంధి కార్యం’ అంటారు.

పూర్వస్వరం :
రెండు పదాల మధ్య సంధి జరిగినపుడు, మొదటి పదం చివరి అచ్చును పూర్వస్వరం అంటారు.

పరస్వరం :
రెండు పదాల మధ్య సంధి జరిగినపుడు, రెండవ పదం యొక్క మొదటి అచ్చును పరస్వరం అంటారు.
ఉదా : నేను + గి = నేనేగి
వీనిలో ‘నేను’ లోని ‘ఉకారము’ను పూర్వస్వరం అంటారు. గిలోని ‘ఏ కారము’ను పరస్వరం అంటారు.

సంధి జరిగినపుడు పూర్వస్వరం లోపిస్తుంది. పరస్వరం మిగులుతుంది.

1. ఉత్వ సంధి సూత్రం :
ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యంగా వస్తుంది.

ఉత్తు అంటే హ్రస్వమైన ఉకారము.
ఉదా : సమ్మతము + మిటి = సమ్మతమేమిటి
మాయము + య్యేవాడు = మాయమయ్యేవాడు
మొదలు + య్యాయి = మొదలయ్యాయి
ఎవరు + గగలరు = ఎవరాగగలరు.
కష్టము + నది = కష్టమైనది

గమనిక :
పైన పూర్వపదాలన్నిటిలోనూ చివరి అచ్చు హ్రస్వమైన ఉకారం పరస్వరం (ఏ, ఆ, అ, ఐ) ఏదో ఒక అచ్చు ఉంది. సంధులు కలిసినపుడు అన్ని పదాలలోనూ పూర్వస్వరం ఉత్తు (హ్రస్వమైన ఉకారం) లోపించింది. పరస్వరమే (ఏ, అ, ఆ, ఐ) ఆ హల్లు మీదికి చేరింది. కనుక ఇది ‘ఉత్వసంధి’ అని పిలువబడుతుంది.

2. ఇత్వ సంధి సూత్రం :
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది.

ఏమ్యాదులు :
ఏమి, మణి, కి (షష్ఠి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి మొదలైనవాటిని ఏమ్యాదులు అంటారు.

వైకల్పికం :
ఒకసారి సంధి జరుగుతుంది. ఒకసారి సంధి జరగకపోవచ్చు. దీనిని వైకల్పికం అంటారు.

ఇత్తు :
హ్రస్వమైన ఇకారం
ఉదా :
ఏమి + అంటివి = ఏమంటివి (సంధి జరిగినపుడు)
ఏమి + అంటివి = ఏమియంటివి (సంధి జరగనపుడు యడాగమం వస్తుంది)
మఱి + ఏమి = మఱేమి (సంధి జరిగినపుడు)
మఱి + ఏమి = మఱియేమి (సంధి జరగనపుడు యడాగమం వచ్చింది)
పైకి + ఎత్తినారు = పైకెత్తినారు
ఉన్నది + అంట = ఉన్నదంట
ఒకరికి + ఒకరు = ఒకరికొకరు

గమనిక :
పై ఉదాహరణలలో పూర్వపదం చివర హ్రస్వ ఇకారం ఉంది. పరపదం మొదట అచ్చు (ఏ, ఎ, అ, ఓ..) ఉంది. రెండూ కలిసినపుడు పూర్వపదం చివరగల హ్రస్వ ఇకారం (ఇత్తు) లోపించింది. పరస్వరమే (ఏ, ఎ, అ, ఒ, …..) ఆ హల్లు మీదికి చేరింది. కనుక దీనిని ‘ఇత్వ సంధి’ అంటారు.

సూత్రం-2 :
ప్రథమ, ఉత్తమ పురుష బహువచన క్రియల ఇకారానికి, సంధి వైకల్పికంగా జరుగుతుంది.
వచ్చిరి + పుడు = వచ్చిరిపుడు
వచ్చితిమి + పుడు = వచ్చితిమెపుడు

AP Board 7th Class Telugu Grammar

3. అత్వసంధి సూత్రం :
అత్తునకు సంధి బహుళంబుగానగు.

వివరణ :
అత్తు = హ్రస్వమైన అకారము

బహుళము :
1. సంధి ఒకసారి నిత్యంగా వస్తుంది.
ఉదా : సీ + మ్మ = సీతమ్మ
సుబ్బయ్య + న్నయ్య = సుబ్బయ్యన్నయ్య
రా + య్య = రాయ్య

2. సంధి ఒకసారి వైకల్పికంగా వస్తుంది.
ఉదా : మే + త్త = మేనత్త (సంధి జరిగినపుడు)
మే + త్త = మేనయత్త (సంధి జరగనపుడు యడాగమం)

3. సంధి ఒక్కొక్కసారి రాదు.
ఉదా : సీత + అన్నది = సీతయన్నది (సంధి జరుగక యడాగమం)
రామ! + అని = రామయని (సంధి జరుగక యడాగమం వచ్చింది)

4. ఇతర విధముగా సంధి వచ్చిన రూపం.
ఉదా : ఒక + ఒక = ఒకానొక

యడాగమం సూత్రం :
సంధిలేని చోట స్వరంబు కంటె పరమైన స్వరమునకు యడాగమంబగు.
ఉదా : మా + మ్మ = మామ్మ
రత్నగర్భ + అన = రత్నగర్భ
నాది + న్న = నాదిన్న
విరిగి + లుగుల = విరిగిన లుగుల
న్ని + పాయములను = ఎన్నియుపాయములను.

4. సంస్కృత సంధులు

రెండు సంస్కృత (తత్సమ) పదాలకు ఏర్పడే సంధులను సంస్కృత సంధులు అంటారు.

1. సవర్ణదీర్ఘ సంధి సూత్రం :
అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనపుడు వానికి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. సవర్ణములు అంటే అవే అక్షరాలు.

వివరణ :
అ(లేక) ఆ + అ(లేక) ఆ = ఆ
ఇ(లేక) ఈ + ఇ(లేక) ఈ = ఈ
ఋ (లేక) ఋ + ఋ(లేక) ఋ = ఋ

ఉదా : ఆహా + అన్వేషణ = ఆహారాన్వేషణ (అ + అ = ఆ)
1) విశ్వ + భిరామ = విశ్వదాభిరామ (అ + అ = ఆ)
2) రో + వేశము = రోషావేశము (అ + ఆ = ఆ)
3) పర + త్మ = పరమాత్మ (అ + ఆ = ఆ)
4) భాను + దయం = భానూదయం (ఉ + ఉ = ఊ)
5) పితృ + ణము = పితౄణము (ఋ + ఋ = ఋ)
6) కవి + ఇంద్రుడు = కవీంద్రుడు (ఇ + ఇ = ఈ)
7) ఋషి + శ్వరుడు = ఋషీశ్వరుడు (ఇ + ఈ = ఈ)
8) అతి + ఇంద్రియ శక్తి = అతీంద్రియ శక్తి (ఇ + ఇ = ఈ)

గుణసంధి సూత్రం :
అకారానికి ఇ, ఉ, ఋలు పరమైతే వానికి క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశంగా వస్తాయి. ఏ, ఓ, అలకు గుణములని పేరు కనుక. దీని పేరు గుణసంధి.
ఉదా :
రా + ఇంద్రుడు = రాజేంద్రుడు (అ + ఇ = ఏ)
రా + శ్వరం = రామేశ్వరం (అ + ఈ = ఏ)
+ పకారం = పరోపకారం (అ + ఉ = ఓ)
దే + న్నతి = దేశోన్నతి (అ + ఉ = ఓ)
రా + షి = రాజర్షి (అ + ఋ = అర్)
హా + షి = మహర్షి (ఆ + ఋ = అర్)

AP Board 7th Class Telugu Grammar

విభక్తులు :

ప్రత్యయాలు విభక్తులు
డు,ము,వు,లు ప్రథమా విభక్తి
ని(న్), ను(న్), ల(న్), కూర్చి, గురించి ద్వితీయా విభక్తి
చేత(న్), చే(న్), తోడ(న్), తో(న్) తృతీయా విభక్తి
కొఱకు(న్), కై (కోసం) చతుర్థి విభక్తి
వలన(న్), కంటె(న్), పట్టి పంచమీ విభక్తి
కి(న్), కు(న్), యొక్క లో(న్), లోపల(న్) షష్ఠీ విభక్తి
అందు(న్), న(న్) సప్తమీ విభక్తి
ఓ, ఓయి, ఓరి, ఓసి సంబోధన ప్రథమా విభక్తి

5. సమాసములు

సమాసం :
వేరు, వేరు అర్థాలు గల రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దానిని సమాసం అంటారు.
ఉదా :
రామబాణము – అనే సమాసపదంలో ‘రామ’ అనే, ‘బాణము’ అనే రెండు అర్థవంతమైన పదాలున్నాయి. వాటి కలయికతో ‘రామబాణము’ అనే సమాసపదం ఏర్పడింది. దీనిలో మొదటి పదము (రామ)ను పూర్వపదం అంటారు. రెండవ పదము (బాణము)ను ఉత్తరపదం అంటారు.

1. ద్వంద్వ సమాసం :
రెండు కాని, అంతకంటే ఎక్కువ కాని నామవాచకాలు కలిసి ఏర్పడేది ద్వంద్వ సమాసం. .. దీనిలో పూర్వపదానికి, ఉత్తర పదానికీ (రెండిటికీ) ప్రాధాన్యం ఉంటుంది.
ఉదా :
అన్నదమ్ములు ఎంతో మంచివారు.
దీనిలో ‘అన్నదమ్ములు’ ద్వంద్వ సమాసం.
అన్నయును, తమ్ముడును. – దీనిని విగ్రహవాక్యం అంటారు.

సమాసపదం విగ్రహవాక్యం సమాసం పేరు
1. తల్లిదండ్రులు తల్లియును, తండ్రియును ద్వంద్వ సమాసం
2. కష్టసుఖాలు కష్టమును, సుఖమును ద్వంద్వ సమాసం
3. ఆకలిదప్పులు ఆకలియును, దప్పికయును ద్వంద్వ సమాసం
4. అన్నపానీయాలు అన్నమును, పానీయమును ద్వంద్వ సమాసం
5. గంగా యమునలు గంగయును, యమునయును ద్వంద్వ సమాసం

2. ద్విగు సమాసం :
సమాసంలో పూర్వ (మొదటి) పదం సంఖ్యావాచకం అయితే దానిని ద్విగు సమాసం అంటారు.
ఉదా :
నవరసాలు – నవ (9) సంఖ్య గల రసాలు –
దీనిలో పూర్వపదం నవ అంటే తొమ్మిది కనుక ఇది ద్విగు సమాసం.

సమాసపదం విగ్రహవాక్యం సమాసం పేరు
1. రెండు జడలు రెండు (2) సంఖ్య గల జడలు ద్విగు సమాసం
2. ఏడురోజులు ఏడు (7) సంఖ్య గల రోజులు ద్విగు సమాసం
3. దశావతారాలు దశ (10) సంఖ్య గల రోజులు ద్విగు సమాసం
4. నాలుగువేదాలు నాలుగు (4) సంఖ్య గల వేదాలు ద్విగు సమాసం
5. త్రిమూర్తులు త్రి (3) సంఖ్య గల మూర్తులు ద్విగు సమాసం

AP Board 7th Class Telugu Grammar

6. వాక్యాలలో రకాలు

సామాన్య వాక్యం :
క్రియ ఉన్నా, లేకపోయినా, ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలుగా అంటారు.
ఉదా :
1. ఉష పాఠం చదువుతున్నది.
2. కిరణ్ మంచి బాలుడు

మొదటి వాక్యంలో క్రియ (చదువుతున్నది) ఉంది. రెండవ వాక్యంలో క్రియాపదం లేదు. అయినా రెండూ సామాన్య వాక్యాలే.

క్రియతో కూడిన సామాన్య వాక్యాలు :

  1. రాము అన్నం తిన్నాడు.
  2. గోపి పుస్తకం చదువుతున్నాడు.
  3. లత బాగా పాడుతుంది. . .

క్రియాపదం లేని సామాన్య వాక్యాలు :

  1. సుశీలకు కోపం ఎక్కువ.
  2. రాజుకు బద్ధకం తక్కువ.
  3. ఢిల్లీ మనదేశ రాజధాని.
  4. మన రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్.
  5. మన భాష తెలుగు భాష.

సంక్లిష్ట వాక్యం :
రెండు కాని, అంతకంటే ఎక్కువ కానీ సామాన్య వాక్యాలను ఒకసారే నామవాచకాన్ని ఉపయోగించి, రెండు కాని అంతకంటే ఎక్కువ కాని అసమాపక క్రియలను ఉపయోగించి ఒకే వాక్యంగా రాస్తే దానిని సంక్లిష్ట వాక్యం అంటారు.
ఉదా :
రాము అన్నం తిన్నాడు. రాము సినిమా చూశాడు.

సంక్లిష్ట వాక్యం : రాము అన్నం తిని సినిమా చూశాడు.

గమనిక :
పైన రెండు సామాన్య వాక్యాలున్నాయి. రెండింటిలోనూ ఒకే నామవాచకం (రాము) ఉంది.

రెండింటిలోనూ రెండు వేర్వేరు పనులు (అన్నం తినడం, సినిమా చూడడం) చేశాడు.

రెండింటినీ కలిపి సంక్లిష్టవాక్యంగా మార్చినపుడు నామవాచకం ఒక్కసారే ఉపయోగించాం. మొదటి క్రియా పదం (తిన్నాడు)ను అసమాపకం (తిని)గా మార్చాం. అది గమనించండి.

సామాన్య వాక్యాలు :
నాన్నగారు బజారుకు వెళ్లారు. నాన్నగారు కూరలు తెచ్చారు.

సంక్లిష్ట వాక్యం :
నాన్నగారు బజారుకు వెళ్లి, కూరలు తెచ్చారు.

AP Board 7th Class Telugu Grammar 3

సంయుక్త వాక్యాలు :
సమాన ప్రాధాన్యం గల రెండు గాని, అంతకంటే ఎక్కువ గాని సామాన్య వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా రాస్తే దానిని సంయుక్త వాక్యం అంటారు. రెండు వాక్యాలను కలపడానికి మరియు, కనుక, లేదా, కానీ మొదలైన పదాలను ఉపయోగిస్తారు.
ఉదా :
రాముడు అడవికి వెళ్లాడు.
సీత అడవికి వెళ్లింది.

సంయుక్త వాక్యం :
రాముడు మరియు సీత అడవికి వెళ్లారు.
సీతారాములు అడవికి వెళ్లారు.
(ఇలాగ రెండు రకాలుగానూ రాయవచ్చు)

AP Board 7th Class Telugu Grammar 4

ప్రశ్నార్థక వాక్యం :
(జవాబును కోరుతూ) ప్రశ్నను సూచించే వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు.

ఉదా : మీరెవరు?
1) మీదే ఊరు?
2) డాక్టరు గారున్నారా?
3) ఎక్కడికి వెడుతున్నావు?
4) ఎన్నవ తరగతి చదువుతున్నావు?
5) నేను చెప్పే పాఠం అర్థమవుతోందా? …….. మొదలైనవి.

AP Board 7th Class Telugu Grammar

ఆశ్చర్యార్థక వాక్యం :
ఆశ్చర్యం కలిగించే భావాన్ని కలిగిన వాక్యాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. ఈ వాక్యాలకు సాధారణంగా అబ్బ ! ఆహా ! ఓహో ! ఔరా ! …… వంటి అవ్యయాలుంటాయి.
ఉదా :
అబ్బ ! ప్రకృతెంత అందంగా ఉందో !
1) ఆహా ! ఏమి రుచి !
2) ఓహో ! ఈ చిత్రం ఎంత బాగుందో !
3) ఔరా ! 60 కిలోమీటర్లు నడిచావా !
4) ఆహా ! మీ ఇల్లు ఎంత బాగుందో !
5) అబ్బ ! ఈ సినిమా ఎంత బాగుందో !

అనుమత్యర్థక వాక్యం :
ఒక పని చేయడానికి అనుమతినిచ్చే వాక్యాన్ని అనుమత్యర్థక వాక్యం అంటారు.
ఉదా :
మీరు బడికి రావచ్చు.
1) ఆటలు ఆడుకోవచ్చు.
2) టి.వి. చూడవచ్చు.
3) రచనలు చేయవచ్చు.
4) పాటలు పాడవచ్చు.
5) గెంతులు వేయవచ్చు.

ఆశీరర్థక వాక్యం :
ఆశీస్సులను తెలియజేసే వాక్యమును ఆశీరర్థక వాక్యం అంటారు.
ఉదా : నీవు చిరకాలం వర్ధిల్లుగాక !
1) దీర్ఘ సుమంగళీ భవ !
2) ఆయురారోగ్యాలతో ఉండుగాక !
3) దీర్ఘాయుష్మాన్ భవ !
4) మీరంతా అభివృద్ధి చెందుగాక !
5) మీకు మంచి విద్యాబుద్ధులు కలుగుగాక !

నిషేధార్థక వాక్యం :
ఒక పని చేయవద్దని నిషేధించే వాక్యమును నిషేధార్థక వాక్యం అంటారు.
ఉదా : అల్లరి చేయకండి.
1) హద్దులు దాటవద్దు.
2) అనవసరంగా మాట్లాడవద్దు
3) ఎవ్వరినీ ఎగతాళి చేయకండి.
4) అబద్దాలు చెప్పకండి.
5) తప్పుడు పనులు చేయకండి.

Leave a Comment