Reviewing TS 10th Class Telugu Model Papers and TS 10th Class Telugu Question Paper March 2025 can help students identify areas where they need improvement.
TS 10th Class Telugu Question Paper March 2025
పార్ట్స్ – A & B
మార్కులు : 80
సమయం : 2 గం. 30 ని.లు
సూచనలు :
- ‘పార్ట్ – ఎ’ లో ఇచ్చిన ప్రశ్నలకు జవాబులను జవాబు పత్రంలో రాయండి.
- ‘పార్ట్ – బి’ లో ఇచ్చిన అన్ని ప్రశ్నలకు జవాబులను అందులోనే రాసి ‘పార్ట్ – ఎ’ జవాబు పత్రముతో జతచేయండి.
పార్ట్ – A
సమయం : 2 గం. 30ని.లు.
మార్కులు : 60
I. అవగాహన – ప్రతిస్పందన (20 మార్కులు)
అ) కింది పేరాలను చదివి, ప్రశ్నలకు 1,2 వాక్యాలలో జవాబులు రాయండి. (5 × 1 = 5)
ప్రశ్న 1.
వనాలకు బయలుదేరిన సీతారామలక్ష్మణులు ఎలా నడుస్తున్నారు?
జవాబు:
వనాలకు బయలుదేరిన సీతారామలక్ష్మణులు ముందు లక్ష్మణుడు వెనక సీత, ఆమె వెనక శ్రీరాముడు నడుస్తున్నారు.
ప్రశ్న 2.
ఎలాంటి ప్రదేశంలో శ్రీరాముడు నివాసముండాలని అనుకున్నాడు?
జవాబు:
జనులకు అందుబాటులో ఉండని, ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశంలో శ్రీరాముడు నివాసముండాలని అనుకున్నాడు.
ప్రశ్న 3.
చిత్రకూటం గురించి భరద్వాజుడు ఏమన్నాడు?
జవాబు:
చిత్రకూటం పవిత్ర స్థలమని, మహర్షుల నివాస స్థానమని భరద్వాజుడు అన్నాడు.
![]()
ప్రశ్న 4.
లక్ష్మణుడు పాటించిన అన్న ఆదేశమేమిటి?
జవాబు:
లక్ష్మణుడు అన్న ఆదేశముతో చిత్రకూటంలో నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు.
ప్రశ్న 5.
భరద్వాజుని ఆశ్రమం ఎక్కడ ఉన్నది?
జవాబు:
భరద్వాజుని ఆశ్రమం గంగా యమున సంగమ ప్రదేశంలో ఉన్నది.
ఆ) కింది పద్యాలలో ఏదైనా ఒక పద్యాన్ని పూరించి భావం రాయండి. (1 × 5 = 5)
ప్రశ్న 6.
కులమున్ రాజ్యము _______ .వదాన్యోత్తమా !
జవాబు:
కులమున్’ రాజ్యముఁ దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వభరు
డలఁతిం బోఁడు త్రివిక్రమస్ఫురణవాఁడై నిండు బ్రహ్మాండముం
గలఁడే మాన్ప నొకండు ? నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్
వలదీ దానము గీనము; బనుపుమా వర్జిన్ వదాన్యోత్తమా ! భావం
(లేదా)
ఘమడవ్వాడగు, వేడు ………విశ్వనాథేశ్వరా !
జవాబు:
ఘనుడవ్వాడుగు, వేడు. త్యాగమయ ‘దీక్షంబూని సర్వంసహా
జన దైన్యస్థితి-బోనడంచి సకలాశా పేశలానంద జీ
వన సంరంభము పెంచి, దేశజననీ ప్రాశస్త్యమున్ పంచునో
అనిదంపూర్వ యశస్వి యాతడగు నన్నా ! విశ్వనాథేశ్వరా !
ఇ) కింది పేరాను చదువండి. ఇచ్చిన ప్రశ్నలకు 1,2 వాక్యాలలో జవాబులు రాయండి. (5 × 2 = 10)
ప్రశ్న 7.
విద్యాదానం పైన సంఘసంస్కర్తల భావన ఏమిటి ?
జవాబు:
అన్నదానం కన్నా జీవితమంతా తృప్తినిచ్చే విద్యాదానం మిన్నయని సంస్కర్తల భావన.
ప్రశ్న 8.
ఉపకారశీలురు చేసిన గొప్పపని ఏమిటి ?
జవాబు:
అనేక పాఠశాలలను, కళాశాలలను, విశ్వవిద్యాలయాలను స్థాపించి తక్కువ ఖర్చుతో లేదా ఉచితంగా విద్యను అందించారు.
ప్రశ్న 9.
అన్నదానము వల్ల కలిగే లాభము ఎంతసేపు ఉంటుంది?
జవాబు:
అన్నదానము వల్ల కలిగే లాభము కొద్దిసేపు మాత్రమే ఉంటుంది.
![]()
ప్రశ్న 10.
విద్యాదానము యొక్క ప్రాశస్త్యాన్ని కవులు ఏమని పొగిడారు ?
జవాబు:
“నిత్యమయి, వినిర్మలమయి, నిశ్చలమయి యొప్పుచుండు విద్యాదాన మొకటి జగతి” అని విద్యాదానము యొక్క ప్రాశస్త్యాన్ని కవులు పొగిడారు.
ప్రశ్న 11.
పై పేరాకు సరైన శీర్షికను రాయండి.
జవాబు:
పై పేరాకు తగిన శీర్షిక ‘విద్యాదానం’.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత (40 మార్కులు)
అ) కింది ప్రశ్నలను 5 నుండి 6 వాక్యాలలో సమాధానాలు రాయండి. (4 × 3 = 12)
“జీవనభాష్యం” పాఠం రాసిన కవి గురించి తెలుపండి.
జవాబు:
డా|| సి. నారాయణ రెడ్డి గారు కరీంనగర్ జిల్లా హనుమాజీ పేట గ్రామంలో 1931 లో జన్మించారు. వీరు ప్రముఖ కవి, వక్త, పరిశోధకుడు. ఈయన సినీ గేయ రచయిత. ఈయన రచించిన ‘తెలుగు గజళ్ళు’ నుండి ‘జీవన భాష్యం’ అనే
పాఠం గ్రహించబడింది.
వీరి రచనలు :
- నాగార్జున సాగరం
- కర్పూర వసంత రాయలు
- మధ్యతరగతి మందహాసం,
- ద్విపదులు
- విశ్వంభర,
- ప్రపంచ పదులు మొదలయిన 70కి పైగా కావ్యాలు రచించారు.
అద్భుతమైన సినిమా పాటలు రాశారు. వీరి “విశ్వంభర” కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది. భారత ప్రభుత్వం వీరికి “పద్మభూషణ్” అనే బిరుదు నిచ్చింది. “ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు ప్రయోగములు” అన్న వీరి సిద్ధాంత గ్రంథము, ఎన్నో ప్రచురణలు పొందింది.
ప్రశ్న 13.
“తెలంగాణ నేలలో ఎంతో బలమున్నది” అని దాశరథి అనడానికి కారణం ఏమిటి?
జవాబు:
తెలంగాణ భూమి సారవంతమైనది. తెలంగాణ గడ్డపై పుట్టిన గడ్డిపోచకు కూడా పౌరుషం ఎక్కువ. అంటే తెలంగాణ వీరులకు మానసికబలం, పౌరుషం ఎక్కువని చెప్పడానికలా కవి చెప్పాడు.
ప్రశ్న 14.
రచ్చకట్ట వద్ద అక్కకు కనిపించిన కొత్తదనం ఏమిటి?
జవాబు:
యశోదారెడ్డి ఊరిలో ప్రజలు పాత ఆచారాలను వదలి కొత్తబాట పట్టారు. గ్రామంలో పెద్ద ఇళ్ళ ఆడవాళ్ళు సామాన్యుల కంటికి కనబడకుండా వారు ప్రయాణం చేసే బండ్లకు తెరలు కట్టే ఆచారం నేడు పోయింది. రచ్చబండపై గ్రామ పెద్దలతో కలిసి గ్రామస్థులు అందరూ నేడు కూర్చుంటున్నారు. గ్రామ పెద్ద రంగరాయడి వంటి వారి పెత్తనాన్ని, నేడు గ్రామాలలో ప్రజలు ధిక్కరిస్తున్నారు. పోలీసు పట్టేళ్ళ పెత్తనమూ, ప్రజలు పోలీసులకు లంచాలివ్వడమూ తగ్గిపోయింది.
ప్రజలు చీటికి మాటికి తగవులు, కొట్లాటలు మానారు. పంచాయతీలు, జరిమానాలు నేడు లేవు. ఏ గ్రామానికి ఆ గ్రామంలో తీర్పులు ఇస్తున్నారు. రాత్రిళ్ళు దొంగతనాలు లేవు. ప్రజలకు శిక్షలు లేవు. ప్రజలు ముష్టి ఎత్తుకోవడం మానేశారు. పిల్లలు మంచి వేషాలు వేసుకుంటున్నారు. పెళ్ళిళ్ళల్లో కూడా మేనాలు, పల్లకీలు, ప్రజలు నేడు మోయడం మానివేశారు. పని మనుషులను తమ తోడివారుగా గౌరవంగా, ఆదరణగా చూస్తున్నారు. ఈ విధంగా గ్రామంలో రచ్చకట్ట వద్ద అక్కకు కనిపించిన కొత్తదనం కనిపించడంతో అక్క ఆశ్చర్యపోయింది.
![]()
ప్రశ్న 15.
చార్మినారును ఎవరు, ఎందుకు నిర్మించారో తెలుపండి.
జవాబు:
భారతదేశంలోని తెలంగాణలోని హైదరాబాదులో ఉన్న ఒక స్మారక చిహ్నం. 1591 సంవత్సరంలో చార్మినార్ ను సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్షా నిర్మించాడు. ఈ చతురస్రాకార నిర్మాణం నాలుగు స్తంభాలు మరియు క్లిష్టమైన శిల్పాలతో అతని భార్య భాగమతి గౌరవార్థం నిర్మించబడింది. కుతుబ్షాహి రాజవంశం యొక్క ఐదవ రాజైన సుల్తాన్ మహ్మద్ కులీ కుతుబ్షా ఇతని కొత్త రాజధాని హైదరాబాదులో మొదటి భవనం అని చెబుతారు.
ఆ) కింది ప్రశ్నలకు 10 వాక్యాలలో జవాబులు రాయండి. (4 × 7 = 28)
ప్రశ్న 16.
“శతకపద్యాలు మన ప్రవర్తనను చక్కదిద్దుతాయి” అనే అంశాన్ని సమర్థిస్తూ రాయండి.
జవాబు:
శతక పద్యాలలో నీతులూ, భక్తిని బోధించే వాక్యాలూ ఉంటాయి. ఆ నీతులను పాటిస్తే అవి విద్యార్థుల జీవితాలను చక్కదిద్దుతాయి. ఉదాహరణకు క్రింది శతక పద్యాలలోని విషయాలు చూడండి.
- మల్లభూపాలీయంలో పండితుడికి డబ్బు కంటే సత్యభాషణము, మంచితనము, గురుభక్తి ముఖ్యమని చెప్పబడింది. దీనిని బట్టి విద్యార్థులు గురుభక్తి కలిగి అభివృద్ధిలోకి వస్తారు…
- భీమకవి వేణుగోపాల శతకంలో నరరూప రాక్షసుల లక్షణాలు చెప్పాడు. అవి విద్యార్థులు తెలుసుకొంటే వారు ఆ లక్షణాలు విడిచిపెట్టి మంచిగా మసలుతారు.
- మిత్రుడి మంచి లక్షణాలను శతక పద్యాల ద్వారా తెలుసుకొని విద్యార్థులు మంచి మిత్రులను సంపాదించుకొని జీవితంలో సుఖపడతారు.
- విశ్వనాథేశ్వర శతకంలో చెప్పిన విషయం తెలుసుకొని, విద్యార్థులు దేశభక్తిని పెంచుకొని, తాము త్యాగబుద్ధితో ఇతరుల దీనస్థితిని తొలగింపగల్గుతారు.
- నరసింహ శతకంలో చెప్పిన మంచి లక్షణాలు అలవాటు చేసుకొని విద్యార్థులు బాగుపడతారు..
- రాజులను ఆశ్రయించడం అనవసరం అని, దూర్జటి చెప్పినది తెలిసికొని విద్యార్థులు తమ కాళ్ళపై తాము నిలబడతారు.
- భగవంతుని పూజకు, సత్యము, దయ, ఏకాగ్రత ముఖ్యమని, గ్రహించి విద్యార్థులు దైవభక్తి కలవారు అవుతారు. ఈ విధంగా శతకములలోని నీతులు, విద్యార్థుల జీవితాలను అనగా మన ప్రవర్తనను తీర్చిదిద్దుతాయి.
(లేదా)
వ్యాసుని భిక్షాటన వృత్తాంతాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు:
భిక్ష పాఠ్య సారాంశం
వ్యాసుడు సకల విద్యలకూ గురువు. ఒకరోజు మధ్యాహ్న వేళలో ఆయన శిష్యులతో కలిసి కాశీ నగరంలో బ్రాహ్మణవాడలలో భిక్షాటనం కోసం వెళ్ళాడు. ఏవో కారణాలు చెప్పి, ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. ఆ రోజుకు ఉపవాసం ఉందామనీ, మరుసటి రోజు భిక్ష తప్పక దొరుకుతుందనీ వ్యాసుడు నిశ్చయించాడు. ఈశ్వరుడి మాయవల్ల మరుసటి రోజున కూడా ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. వ్యాసుడు కోపంతో భిక్ష పాత్రను నడివీధిలో పగులగొట్టి, కాశీవాసులకు మూడు తరాలపాటు ధనం, మోక్షం, విద్య, లేకపోవుగాక అని శపించబోయాడు.
ఇంతలో పార్వతీదేవి ఒక సామాన్య స్త్రీ రూపంలో ఒక బ్రాహ్మణ గృహం వాకిట్లో ప్రత్యక్షమయి, వ్యాసుని మందలించి తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది. అప్పుడు వ్యాసుడు “సూర్యుడు అస్తమిస్తున్నాడు. నాకు పదివేలమంది శిష్యులు ఉన్నారు. వారు తినకుండా నేను తినను. ఈరోజు కూడా నిన్నటి లాగే పస్తుంటాను” అన్నాడు. అప్పుడు పార్వతీదేవి నవ్వి “నీవు శిష్యులందరినీ నీ వెంట తీసుకొని రా ! ఈశ్వరుడి దయతో ఎంతమంది వచ్చినా, కావలసిన పదార్థాలు పెడతాను” అని చెప్పింది. వ్యాసుడు సరే అని, శిష్యులతో గంగలో స్నానం చేసి వచ్చాడు. పార్వతీదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి, భోజనశాలలో వారందరికీ భోజనం పెట్టింది.
ప్రశ్న 17.
“వినడానికైనా, మాట్లాడడానికైనా ఎవరి భాష వాళ్ళకు బాగుంటుంది.” ఎందుకో వివరించండి.
జవాబు:
సహజంగా వినడానికైనా, మాట్లాడడానికైన ఎవరి భాష వాళ్ళకు బాగుంటుంది. ఎందుకంటే ఏ ప్రాంతం వారు
ఆ ప్రాంతపు భాష మాట్లాడుతుంటే ఇంపుగాను, మంచిగాను ఉంటుంది. ఏ ప్రాంతంలో వారైనను చిన్నప్పటి నుండి పరిచయం అయిన భాష, ఆ ప్రాంతపు భాషకు కొంత యాస ఉంటుంది. అది ఆయా ప్రాంతాల వారికి సొంతం. పైగా పసందుగా మాట్లాడుకుంటారు.
ఉదా :
1) “తాళ్ళతోపులసిలుకలు, బళ్ళిరిసుకొని రెక్కలు తపతపలాడిచ్చి పొద్దు పొడుపుకు స్వాగతం పలుకుతున్నాయ్” అని అల్లం రాజయ్య గారు తెలంగాణ మాండలిక యాసలో రాస్తే, ఆ ప్రాంతం వారికి అది అందంగా వినసొంపుగా
ఉంటుంది.
ఒకే మాటను, ఒకే అర్థాన్ని ప్రకటించే మాటను వేర్వేరు ప్రాంతాల వాళ్ళు పలికే తీరు వేరువేరుగా ఉంటుంది. దీన్నే “మాండలికం” అని అంటారు. నిరంతరం వినడం మాట్లాడటం వల్ల ఆ భాష పట్ల ప్రత్యేక మమకారం ఏర్పడుతుంది. ఆత్మీయభావం కలుగుతుంది. భాషతో క మ్మదనంతో పాటు అమ్మతనం కన్పిస్తుంది. అందుకే అది వినసొంపుగా ఉంటుంది.
(లేదా)
భూమిక పాఠం ఆధారంగా నెల్లూరి కేశవస్వామి కథల గురించి మీరేమి తెలుసుకున్నారో వివరించండి.
జవాబు:
నెల్లూరి కేశవస్వామి సుప్రసిద్ధ కథా రచయిత. ఆయన రాసిన కొన్ని కథలు నేడు దొరకటల్లేదు. ఈయన తన కథలను కొన్ని సంపుటాలుగా వెలువరించాడు. ఈయన తొలికథల సంపుటి “పసిడి బొమ్మ” ఇది 1969లో వెలువడింది. ఇది భాస్కరభట్ల కృష్ణారావుగారికి అంకితం ఇవ్వబడింది. ఈయన రెండవ కథా సంకలనం “చార్మినార్” కథలు. ఇవి ఊహించి రాసిన కథలు కావు. ఇది సమాజంలోని మార్పులను కథలుగా రాసిన సామాజిక చరిత్ర రచన అని చెప్పాలి.
చార్మినార్ కథలు హైదరాబాదు సంస్కృతినీ, మానవ సంబంధాలనూ, అక్కడి ముస్లింల జీవితాలను అపూర్వంగా చిత్రించాయి. ఇవి మొత్తం 11 కథలు. హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ నగరంగా ఎదిగింది. ఆ నేపథ్యాలనూ ఆ జీవితాలనూ కేశవస్వామి చార్మినార్ కథల్లో చిత్రించాడు. ఈయన “యుగాంతం” కథ సార్థకమైనది. దీనిలో హైదరాబాద్ రాజ్యంలో పరిణామాలను ఒక చారిత్రక డాక్యుమెంటుగా రాశాడు. ఈ ఒక్క కథే రాసినా, కేశవస్వామి భారతదేశం గర్వించదగ్గ గొప్ప కథకుల్లో ఒక్కడు అయ్యేవాడు.
చార్మినార్ కథల్లో కేశవస్వామి హృదయం ఉంది. ఇవి నిజాం రాజ్యయుగం అంతరించిన పరిణామాలను చిత్రించిన కథలు, కేశవస్వామి రాసిన “రుహీ అపా” కథ, గొప్ప మానవీయ సంబంధాలనూ, కులమతాలకు అతీతంగా స్పందిచిన మనిషినీ చిత్రించిన కథ. ఈ కథలో ముస్లిం నవాబుల్లో ఉన్న హృదయ సంస్కారాన్ని రచయిత చక్కగా చూపించాడు. ఈయన ‘వంశాంకురం’ కథలో ముస్లిం పెళ్ళిసంబంధాలు ఎలా ఉంటాయో చెప్పాడు. నమ్మిన పేదల నమ్మకాలను ఎలా భగ్నం చేస్తారో’ ‘భరోసా’ కథలో చెప్పాడు. కేశవస్వామి వాసిలో, వస్తు నైపుణ్యంలో వాసికెక్కిన కథలు రాశాడు. ఈయన హిందీ కథా రచయితలు ప్రేమ చంద్ కిషన్ చందర్లతో పోల్చదగిన గొప్ప కథా రచయిత.
ప్రశ్న 18.
రామాయణములోని పాదుకాపట్టాభిషేక వృత్తాంతాన్ని వివరించండి.
జవాబు:
దశరథుడు శ్రీరాముని ఎడబాటును సహింపలేక ప్రాణాలు విడిచురు. రామలక్ష్మణులు అడవికి వెళ్ళారు. భరత శత్రుఘ్నులు మేనమామ ఇంటిలో ఉన్నారు. వశిష్ఠుడి ఆజ్ఞమేరకు, దశరథుని శరీరాన్ని తైలద్రోణిలో జాగ్రత్త చేశారు. దూతలు వెళ్ళి ఎనిమిదవరోజున భరత శత్రుఘ్నులను అయోధ్యకు తీసుకువచ్చారు. భరతుడు తండ్రికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. భరతుడు కైకను తప్పు పట్టాడు. శత్రుఘ్నుడు మంథర చంపడానికి సిద్ధమయ్యాడు. మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం స్వీకరించమన్నారు. పెద్దవాడైన రాముడే రాజు కావాలని భరతుడు పట్టుపట్టాడు. తాను వెళ్ళి రాముణ్ణి అయోధ్యకు తిరిగి తీసుకువస్తానని, భరతుడు అయోధ్యాపురవాసులతో కలిసి అడవికి బయలుదేరాడు.
భరతుడు శృంగిబేరపురం చేరాడు. గుహుడు భరతుడి మనస్సు తెలియక, తికమక పడ్డాడు. విషయం తెలిసి గుహుడు భరతుణ్ణి ఆహ్వానించాడు. భరతుడు గుహుడితో కలిసి, భరద్వాజాశ్రమం చేరి విందు స్వీకరించాడు. తరువాత చిత్రకూటం బయలుదేరాడు. భరతుడు సేనలతో వస్తూ ఉండడం చూసి, లక్ష్మణుడు పొరపాటుపడ్డాడు. భరతుడు రాముని మీదికి యుద్ధానికి వస్తున్నాడని, లక్ష్మణుడు రామునికి చెప్పాడు. భరతుడు అటువంటివాడుకాడని రాముడు లక్ష్మణునకు చెప్పాడు. భరత శత్రుఘ్నులు వెళ్ళి, రాముని పాదాలపై పడ్డారు. రాముడు కన్నీళ్ళు పెట్టాడు.
రాముడు భరతునికి రాజనీతులు బోధించాడు. రాముణ్ణి అయోధ్యకు తిరిగి రమ్మని భరతుడు కోరాడు. రాముడు తండ్రి మాటే తనకు శిరోధార్యం అన్నాడు. చివరకు భరతుని కోరికపై శ్రీరాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు. ఆ పాదుకల మీదనే రాజ్యభారం ఉంచి, తాను నారచీరలు ధరించి, నగరం వెలుపల ఉంటాననీ, పదునాల్గవ సంవత్సరం పూర్తి కాగానే, రామదర్శనం కాకపోతే తాను అగ్ని ప్రవేశం చేస్తానని భరతుడు రామునితో చెప్పాడు. భరతుడు నందిగ్రామం చేరి, రామపాదుకలకు పట్టాభిషేకం చేశాడు.
(లేదా)
హనుమంతుడు సీతాదేవి జాడను కనిపెట్టిన విధమును తెల్పండి.
జవాబు:
సీతకోసం రాక్షస భవనాలన్నీ వెతికాడు. రావణుని అంతఃపురం కూడా వెతికాడు. మహాసౌందర్యవతి అయిన మండోదరిని సీత అని భ్రమించాడు. కాని, అంతలోనే ఆమె సీతకాదని నిర్ణయించుకొన్నాడు. తర్వాత అశోకవనంలోకి వెళ్ళాడు. అణువణువు వెతికాడు. శింశుపావృక్షం ఎక్కాడు. దాని కింద ఒక స్త్రీ మలిన వస్త్రాలతో ఉంది. చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమె కృశించి ఉంది. దీనావస్థలో ఉంది. రాముని ఎడబాసిన సీత ఉండవలసిన స్థితిలో ఉంది. `అందుకే ఆమెను సీతగా గుర్తించాడు. ఆమె ధరించిన ఆభరణాలను చూశాడు. రాముడు చెప్పిన వాటితో అవి సరిపోయేయి.
ఋష్యమూక పర్వతం వద్ద చూచిన ఆభరణాలు ఆమె శరీరంపై కనిపించలేదు. కచ్చితంగా ఆమెను సీతగా నిర్ధారించుకొన్నాడు. రావణాసురుడు వచ్చి, సీతను భయపెట్టి వెళ్ళాడు. సీతాదేవికి వినబడేలా రామకథాగానం చేశాడు. సీత నాలుగు వైపులా చూసింది. దానితో ఆమెను సీతగా పూర్తిగా నిర్ధారించుకొన్నాడు. మొదట సీతాదేవి బాహ్య పరిస్థితులను గమనించాడు. తర్వాత ఆమె స్థితిని గుర్తించాడు. ఆమె మనసుకు నచ్చే రామకథను విన్పించి, ఆమె ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని గమనించాడు. ఆ విధంగా సీతను గుర్తించాడు.
ఇ) సృజనాత్మకత
ప్రశ్న 19.
వాహనాల వల్ల నగరాల్లో రోజురోజుకు ధ్వని, వాయుకాలుష్యాలు పెరిగిపోతున్నాయి. ఆ కాలుష్య నివారణ కోసం ఏయే చర్యలు చేపట్టాలో తెలియజేస్తూ ఒక “వ్యాసం” రాయండి.
ధ్వని వాయు కాలుష్యాలు
మన చుట్టూ ఉన్న గాలి, నీరు, నిప్పు, నేల ఆకాశాలే వాతావరణం. అవి కలుషితమైతే మానవుని జీవితం దుర్భరమవుతుంది. ఆధునిక నాగరికతా ప్రభావం వల్ల కర్మాగారాలు, యంత్రాలు, వాహనాల రాకపోకలు పెరిగాయి. మోటార్లు, కార్లు, రైళ్ళు, స్కూటర్లు, లారీలు రోజు రోజుకూ పెరిగి పెట్రోలు, డీజులు, కిరోసిన్లు కాలి పొగ వెలువడుతుంది. వివిధ కర్మాగారాల్ని జన నివాస మధ్యభాగంలో నెలకొల్పడం వల్ల విపరీతమైన శబ్ద కాలుష్యం ఏర్పడుతోంది.
ధ్వని కాలుష్యం : కంపించు అన్ని వస్తువులు ఉత్పత్తి చేయు ధ్వనులు మనకు కనబడవు. పౌనఃపున్యము 20 Hz ల కంటే ఎక్కువ, 20,000 Hz కంటే తక్కువగా ఉన్నప్పుడు మన చెవి ఆ ధ్వనులను గుర్తించగలదు. వీటిని శ్రావ్యతా పౌనఃపున్య హద్దులంటారు. లేదా శ్రవ్య పౌన్యపున్య అవధి అంటారు.
సహజంగా మానవుడు 90 డెసిబెల్స్ ధ్వనిని మాత్రమే గ్రహించగలుగుతాడు. అంతకన్నా ఎక్కువ ధ్వనిని ప్రసరింప గలిగితే అనగా 108 డెసిబెల్స్ శబ్దము దాటిన మానవుడు శాశ్వతంగా చెవిటివాడవుతాడు. ఈ ధ్వని కాలుష్యం వల్ల నష్టాలే కాని లాభాలు లేవు. అనారోగ్యం కలుగుతుంది. రక్తపోటు అధికమవుతుంది. కండరాలకు, జీర్ణకోశానికి, నరాలకు సంబంధించిన పెక్కు రోగాలు కల్గుతాయి. అలసట, తలనొప్పి అధికమవుంది. ఈ ధ్వని కాలుష్య నివారణకై శాస్త్రజ్ఞులు అనేక పరిశోధనలను కనిపెట్టుచున్నారు. ప్రపంచ దేశాల్లో కూడా దీనిపై సమగ్ర విధానమొకటి తయారుచేసి, ధ్వని కాలుష్యాన్ని నివారించుటకు తగు ప్రయత్నాలు చేస్తున్నారు.
వాయు కాలుష్యం : గాలిలో ఆక్సిజన్ 20% నత్రజనీ 78% కార్బన్ డై ఆక్సైడ్ 0.03, ఓజోన్, హైడ్రోజన్ వంటి అనేక ఉపయుక్తమైన వాయువులు మరికొన్ని ఇతర వాయువులు స్థిర నిష్పత్తిలో ఉంటాయి. వాతావరణ కాలుష్యం చేయు పదార్థాలలో CO, CO, NO పరిశ్రమల నుండి వెలువడు దుమ్ము, ధూళి వంటి ఇతర పదార్థాలు ముఖ్యమైనవి. పారిశ్రామిక అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఈ వాతావరణ కాలుష్యం అధికంగా ఉండి జీవులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. పారిశ్రామికీకరణం వల్ల, మోటారు వాహనాల వాడకం వల్ల, పెట్రోలు, బొగ్గు, కలప వంటి పదార్థాల దహనక్రియ వల్ల, థర్మల్ పవర్ కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులు, సిమెంటు ఫ్యాక్టరీలు, ఖనిజశుద్ధి కర్మాగారాల వంటి మానవ ప్రేరిత చర్యల వల్లేకాక, అగ్ని పర్వతాలు బ్రద్దలగుట వల్ల, సూర్య వికిరణ చర్య వంటి సహజ ప్రక్రియల వల్ల కూడా వాయు కాలుష్య భరితమవుతుంది.
తక్షణం జనాభా పెరుగుదలను నియంత్రించాలి. కర్మాగాలలో ఎత్తైన చిమ్నీలు వాడి వాయువులను శుద్ధి చేసి వాతావరణంలోనికి ‘ విడుదల చేయాలి. అడవుల విస్తీర్ణం భూ విస్తీర్ణంతో పోలిస్తే 1/5వ వంతు ఉండేటట్లు చూడాలి. కాలుష్యం కలుగచేసేవారిపై కఠిన చర్యలు తీసుకొనుటకు వీలుగా చట్టాలు చేయుట, రసాయనిక ఎరువులకు బదులుగా సేంద్రీయ సౌరశక్తిని వినియోగించాలి. క్రిమి సంహారక మందులకు బదులుగా చెట్ల నుండి వచ్చే క్రిమి సంహారకాలు ఉపయోగించాలి.
(లేదా)
మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే చెడుఫలితాలను, వాటి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేస్తూ “కరపత్రం” రాయండి.
జవాబు:
ప్రియమైన సోదర సోదరీమణులారా!
మారక ద్రవ్యాలు అనగా మానవ శరీరానికి మిక్కిలి హాని కలిగించే కొన్ని పదార్థాలు. వీటిని ప్రపంచమంతా “డ్రగ్స్” (Drugs) అని వ్యవహరిస్తారు. మాదుక (మారక) ద్రవ్యాల వాడకం ఒక ప్రమాదమైన వ్యసనం (Addiction) ఈనాటి యువతరాన్ని దారి మళ్ళించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది.
ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కన్నా తీవ్రమైన ప్రభావకాలు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6 శాతం జనాభా అనగా 185 మిలియన్ల మంది మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనాలు తెలుపుతున్నాయి. మాదక ద్రవ్యాలలో వివిధ రకాలున్నాయి. నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చరస్, గంజాయి, మారిజువానా, కొకైన్, ఎల్.ఎన్.డి మొదలైనవి ముఖ్యమైనవి. మాదక ద్రవ్యాల నిరోధానికి భారత ప్రభుత్వం నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్ స్టెన్నస్ చట్టాన్ని చేసింది. ఇలాంటి వ్యసనపరుల్ని మళ్ళీ మామూలు మనుషుల్ని చేయడం చాలా కష్టమైన పని. వీరిని డ్రగ్స్ అడిక్షన్ కేంద్రాలు, మానసిక వైద్యుల ద్వారా చికిత్స చేసి కాపాడవచ్చును.
ముద్రణ
విక్రమ్ పబ్లిషర్సు,
హైదరాబాదు, కాపీలు 5,00,000
ఇట్లు,
భారత మాదక ద్రవ్య నివారణ సంఘం,
హైదరాబాదు.
పార్ట్ – B
సమయం : 30 ని.లు.
మార్కులు : 20 సూచనలు :
1) విద్యార్థులు జవాబులను ఈ ప్రశ్న పత్రంలోనే నిర్దేశించిన విధంగా కేటాయించిన స్థలంలో రాయాలి.
2) పూర్తి చేసిన పార్ట్ – ‘బి’ ప్రశ్నా పత్రాన్ని పార్ట్ – ‘ఎ’ జవాబు పత్రంతో జతచేయాలి.
I. భాషాంశాలు
అ) పదజాలం :
కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. (10 మార్కులు) (2 × 1 = 2)
ప్రశ్న 1.
చెమ్మగిల్లిన కనులు : _______
జవాబు:
చెమ్మగిల్లిన కనులు : అత్యంత సంతోషంతో మాఅక్క కళ్ళు చెమ్మగిల్లాయి.
ప్రశ్న 2.
కోలాహలం : _______
జవాబు:
కోలాహలం : మా ఊర్లో తిరునాళ్ళు కోలాహలంగా జరుగుతాయి.
కింది వానికి సరైన జవాబును గుర్తించి ఆ సంకేతాన్ని (A/B/C/D) బ్రాకెట్లలో రాయండి. (8 × 1 = 8)
ప్రశ్న 3.
“తెలివైనవాడు తాను కూర్చున్న స్కంధాన్ని తాను నరుక్కోడు”. (ఇందులో స్కంధం అనగా…..)
A) కొమ్మ
B) రాయి
C) వస్త్రము
D) జలము
జవాబు:
A) కొమ్మ
ప్రశ్న 4.
“ఈ సంవత్సరం మానులన్నీ విరగ పూసినవి” (ఈ వాక్యంలో మానులు అనే పదానికి అర్థం)
A) చెరువులు
B) నదులు
C) నక్షత్రాలు
D) చెట్లు
జవాబు:
D) చెట్లు
![]()
ప్రశ్న 5.
“అందరికీ తొలి గురువు అమ్మ.” – ఈ వాక్యంలో తొలి అనే పదానికి సరైన పర్యాయ పదాలు.
A) మొదటి, చివరి
B) మొదటి, ఆది
C) ఆది, చివరి
D) ఆది, మధ్య
జవాబు:
B) మొదటి, ఆది
ప్రశ్న 6.
సంవత్సరము, ఏడాది అనే పర్యాయ పదాలు గల పదం.
A) పక్షము
B) మాసము
C) వర్షము
D) అయనము
జవాబు:
C) వర్షము
ప్రశ్న 7.
“బాష్పము” అనే పదానికి నానార్థాలు
A) కన్నీరు, ఆవిరి
B) చోటు, భూమి
C) బ్రతుకు, జీవనము
D) వస్త్రం, ఆకాశం
జవాబు:
A) కన్నీరు, ఆవిరి
ప్రశ్న 8.
“రెండు మాత్రల కాలంలో ఉచ్ఛరించేది, ఉపాధ్యాయుడు” అనే నానార్థాలు గల పదం
A) రాజు
B) కవి
C) గురువు
D) ప్రభువు
జవాబు:
C) గురువు
ప్రశ్న 9.
“ఆపదల యందు ధైర్యాన్ని విడువకపోవడం ధీరుల సహజ లక్షణం” – ఈ వాక్యంలో “సహజం” అనే పదానికి సరైన
వికృతిపదం
A) సమరం
B) సాజం
C) సాయం
D) సాహసం
జవాబు:
B) సాజం
ప్రశ్న 10.
“భాగీరథి” అనే పదానికి సరైన వ్యుత్పత్తి అర్థం
A) భృగువుచే తీసుకొని రాబడినది.
B) భార్గవునిచే తీసుకొని రాబడినది.
C) భాగ్యవంతునిచే తీసుకొని రాబడినది.
D) భగీరథునిచే తీసుకొని రాబడినది.
జవాబు:
D) భగీరథునిచే తీసుకొని రాబడినది.
ఆ) వ్యాకరణాంశాలు: (10 మార్కులు)
ఇ) కింది వానికి సరైన జవాబును గుర్తించి ఆ సంకేతాన్ని (A/B/C/D) బ్రాకెట్లలో రాయండి. (10 మార్కులు)
ప్రశ్న 11.
కింది వాటిలో త్రికసంధికి ఉదాహరణ కానిది
A) మనుమరాలు
B) ఇచ్చోట
C) ఎక్కాలము
D) అవ్విధము
జవాబు:
A) మనుమరాలు
ప్రశ్న 12.
‘అకారమునకు ఏ, ఐ లు పరమైతే ఐ కారం, ఓ, ఔ లు పరమైతే ఔ కారం ఏకాదేశంగా వస్తాయి’ అనేది ఏ సంధికి సంబంధించిన సూత్రం.
A) త్రికసంధి
B) రుగాగమసంధి
C) వృద్ధిసంధి
D) గుణసంధి
జవాబు:
C) వృద్ధిసంధి
ప్రశ్న 13.
మీనాక్షి – ఏ సమాసం?
A) ద్వంద్వ సమాసం
B) బహువ్రీహి సమాసం
C) ద్విగు సమాసం
D) విశేషణ పూర్వపద కర్మధారయం
జవాబు:
B) బహువ్రీహి సమాసం
ప్రశ్న 14.
క్రింది వాటిలో షష్ఠీ తత్పురుష సమాసానికి చెందిన విగ్రహ వాక్యము
A) కవుల యందు శ్రేష్ఠుడు
B) పరాశరుని యొక్క కుమారుడు
C) సూర్యుడు మరియు చంద్రుడు
D) భిక్ష కొరకు పాత్ర
జవాబు:
B) పరాశరుని యొక్క కుమారుడు
![]()
ప్రశ్న 15.
సీస పద్యానికి సరైన లక్షణం.
A) సీస పద్యానికి లక్షణం లేదు.
B) ప్రతిపాదంలో వరుసగా భరనభభరవ అనే గణాలు వస్తాయి..
C) ప్రతిపాదంలో వరుసగా నజభజజజర అనే గణాలు వస్తాయి.
D) ప్రతిపాదంలో 6 ఇంద్ర గణాలు 2 సూర్య గణాలు ఉంటాయి.
జవాబు:
D) ప్రతిపాదంలో 6 ఇంద్ర గణాలు 2 సూర్య గణాలు ఉంటాయి.
ప్రశ్న 16.
“భూవరా” పదానికి గురులఘువులు గుర్తిస్తే
A) UUI
B) IIU
C) UIU
D) IUI
జవాబు:
C) UIU
ప్రశ్న 17.
“ఆ కవితలలో ఉన్న జ్ఞానానికి వెలకట్టలేం” – ఈ వాక్యంలో ఉన్న అలంకారం.
A) ఉపమాలంకారం
B) శ్లేషాలంకారం
C) రూపకాలంకారం
D) ఛేకానుప్రాసాలంకారం
జవాబు:
B) శ్లేషాలంకారం
ప్రశ్న 18.
ఏదైనా ఒక వస్తువునుగాని, విషయాన్నిగాని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెపితే అది
A) రూపకాలంకారం
B) స్వభావోక్తి అలంకారం
C) ఉపమాలంకారం
D) అతిశయోక్తి అలంకారం
జవాబు:
D) అతిశయోక్తి అలంకారం
ప్రశ్న 19.
రాము పాట రాసి, పాడాడు. (ఇది ఏ వాక్యం ?)
A) సంయుక్త వాక్యం
B) సామాన్య వాక్యం
C) సంక్లిష్ట వాక్యం
D) ఏదీకాదు
జవాబు:
C) సంక్లిష్ట వాక్యం
ప్రశ్న 20.
కింది వాటిలో కర్తరి వాక్యం
A) యశోదారెడ్డిగారు ఎచ్చమ్మ కథలు రాశారు.
B) ఎచ్చమ్మ కథలు యశోదారెడ్డిగారిచే రాయబడ్డాయి.
C) తాను చెప్పిందే చేయాలని రఘు అన్నాడు.
D) ఎవరి భాష వాళ్ళకు వినసొంపుగా ఉంటుంది.
జవాబు:
A) యశోదారెడ్డిగారు ఎచ్చమ్మ కథలు రాశారు.