TS 10th Class Telugu Question Paper June 2023

Reviewing TS 10th Class Telugu Model Papers and TS 10th Class Telugu Question Paper June 2023 can help students identify areas where they need improvement.

TS 10th Class Telugu Question Paper June 2023

పార్ట్స్ – A & B

మార్కులు : 80
సమయం : 3 గం.

సూచనలు :

  1. ‘పార్ట్ – ఎ’ లో ఇచ్చిన ప్రశ్నలకు జవాబులను జవాబు పత్రంలో రాయండి.
  2. ‘పార్ట్ – బి’ లో ఇచ్చిన అన్ని ప్రశ్నలకు జవాబులను అందులోనే రాసి ‘పార్ట్ – ఎ’ జవాబు పత్రంతో జతచేయండి.

పార్ట్ – A

సమయం : 2 గం. 30 ని.లు
మార్కులు : 60

1. అవగాహన – ప్రతిస్పందన (20 మార్కులు)

అ) కింది పేరాలను చదువండి. పట్టికను పూరించండి. (5 × 1 = 5)
కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నార చీరలను సీతారామ లక్ష్మణులు ధరించారు. తల్లిదండ్రులకు నమస్కరించారు. సుమిత్ర లక్ష్మణునితో “నాయనా, శ్రీరాముణ్ణి నీ తండ్రి అయిన దశరథుల వారిలాగా, సీతను నన్నుగా భావించు. అడవిని అయోధ్య అనుకో. సుఖంగా వెళ్ళి రమ్మని” దీవించింది. సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామ లక్ష్మణులు రథాన్ని ఎక్కారు. రథం వేగంగా ముందుకు సాగుతున్నది. శ్రీరాముణ్ణి విడవలేక కొందరు పౌరులు ఆ రథానికి రెండు వైపులా, వెనుక భాగంలో వేలాడారు. దశరథుడు తీవ్రమైన బాధతో కౌసల్యా మందిరానికి వచ్చాడు. కౌసల్యాదేవి శోకమూర్తిలా ఉంది. సుమిత్రాదేవి ఆమెను ఓదార్చింది.

శ్రీరాముని రథాన్ని నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు. అయోధ్యకు మళ్ళీ పొండని వాళ్ళకు శ్రీరాముడు ఎంతగానో చెపుతున్నాడు. రథం తమసా నదీ తీరానికి చేరింది. ఆ రాత్రి అందరూ అక్కడే విడిది చేశారు. తెల్లవారుతున్నది. అలసట చేత పౌరులందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఇంకా వాళ్ళను శ్రమ పెట్టడం శ్రీరామునికి ఇష్టం లేదు. అందుకని వాళ్ళు నిద్రలేచే లోపే అక్కడి నుండి వెళ్ళాలని లక్ష్మణునితో అన్నాడు. సుమంత్రుని సారథ్యంలో సీతారామ లక్ష్మణులు అక్కడి నుండి బయలుదేరారు. నిద్రలేచిన పౌరులు శ్రీరాములు కనబడకపోవడంతో తికమక పడ్డారు. తమ మొద్దు నిద్రను తామే నిందించుకొన్నారు. చేసేది లేక అయోధ్యకు తిరుగుముఖం పట్టారు.

ప్రశ్న 1.
కౌసల్యాదేవిని ఓదార్చినవారు
జవాబు:
కౌసల్యాదేవి సుమిత్రాదేవి ఓదార్చింది.

ప్రశ్న 2.
నారచీరలు తెచ్చినవారు
జవాబు:
కైకేయి నార చీరలు తెచ్చింది.

ప్రశ్న 3.
ప్రజలను అయోధ్యకు మళ్ళిపొండని చెప్పినవారు.
జవాబు:
ప్రజలను అయోధ్య మళ్ళిపొండని శ్రీరాముడు చెప్పాడు.

ప్రశ్న 4.
కౌసల్యా మందిరానికి వచ్చినవారు
జవాబు:
దశరథుడు తీవ్రమైన బాధతో కౌసల్యా మందిరానికి వచ్చాడు.

ప్రశ్న 5.
తమ మొద్దునిద్రను తామే నిందించుకొన్నవారు
జవాబు:
పౌరులు తమ మొద్దు నిద్రను తామే నిందించుకొన్నారు.

TS 10th Class Telugu Question Paper June 2023

ఆ) కింది పద్యాలలో ఏదైనా ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయండి. (5 ×  1 = 5)
ప్రశ్న 6.
అనవుడు నల్లనవ్వి కమలానన యిట్లను, లెస్సగాక, యో
మునివర ! నీవు శిష్యగణముంగొని చయ్యన రమ్ము విశ్వనా
థునికృప పేర్మి నెందఅతిథుల్ చనుదెంచినఁ గామధేనువుం
బని గొనునట్లు పెట్టుదు నపారములైన యభీప్సితాన్నముల్
జవాబు:
అనవుడున్ = వేదవ్యాసుడు ఇట్లు చెప్పగా
కమలాపన
(కమల + ఆనన) = పద్మం వంటి ముఖం గల ఆ మత్తైదువ
అల్ల = కొంచెం (మెల్లగా)
నవ్వి = నవ్వి
ఇట్లనున్ (ఇట్లు + అనున్) = ఇలా చెప్పింది
లెస్సగాక = మేలు అగునుకాక ! (మంచిది)
ఓ మునివర = ఓ మునీశ్వరుడా !
నీవు = నీవు
శిష్యగణమున్ = శిష్యులందరినీ
కొని = తీసుకొని
చయ్యనన్ = శీఘ్రంగా
రమ్ము = రమ్ము (మా ఇంటికి భోజనానికి రా)
విశ్వనాథుని = విశ్వనాథుడైన పరమేశ్వరుని యొక్క
కృప పేర్మిన్ = దయాతిశయం చేత (అధికమైన దయచేత)
ఎందఅతిథుల్
(ఎందఱు + అతిథుల్) = ఎంతమంది అతిథులు
చనుదెంచినన్ = వచ్చినప్పటికీ
కామధేనువున్ = దేవతల కామధేనువును
పనిగొనునట్లు = స్వాధీనం చేసికొన్న విధంగా (కామధేనువు చెప్పుచేతల్లో ఉన్న విధంగా)
అపారములైన
(అపారములు + ఐన) = అంతులేని అభీప్సితాన్నముల్
(అభీప్సిత +అన్నముల్) = కోరిన అన్న పదార్థాలను
పెట్టుదున్ = పెడతాను

(లేదా)
శా. కారే రాజులు ? రాజ్యముల్ గలుగవే?
గర్వోన్నతిం బొందరే ? వారేరీ సిరి మూల గట్టుకొని పోవంజాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే ? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు ? వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా!
జవాబు:
భార్గవా = భృగు వంశంలో పుట్టిన ఓ. శుక్రాచార్యా!
కారే, రాజులు = పూర్వము నందు రాజులు అనేవారు లేరా? (ఉన్నారు కదా !)
రాజ్యముల్ = (వారికి) రాజ్యములు
కలుగవే = లేవా ? (ఉన్నాయి కదా !)
గర్వోన్నతిన్
(గర్వ + ఉన్నతిన్) = అధికమైన గర్వాన్ని
పొందరే = (వారు) పొందలేదా? (పొందారు కదా !)
వారు = అటువంటి రాజులు
ఏరీ = (ఇపుడు) ఎక్కడ ఉన్నారు?
సిరిన్ = వారు సంపాదించిన సంపదలను
మూటగట్టుకొని
మూట + కట్టుకొని = మూటగా కట్టుకొని
పోవం జాలిరే = వెళ్ళగలిగారా? (పోయినపుడు తమ వెంట తీసికెళ్ళరా?)
భూమిపైన్ = ఈ లోకంలో
పేరైనన్ (పేరు + ఐనన్) = వారి పేరైనా
కలదే = ఉన్నదా?
శిబి ప్రముఖులున్ = శిబి చక్రవర్తి వంటి గొప్పదాతలైన రాజులునూ
యశఃకాములై = కీర్తిని కోరుకున్నవారై
ప్రీతిన్ = సంతోషంతో
కోర్కులు = యాచకుల కోరికలు
ఈరే = ఇచ్చి యుండలేదా ? (ఇచ్చారు)
ఇక్కాలమున్ (ఈ + కాలమున్) = ఈ నాటికినీ,
వారలన్ = ఆ శిబిచక్రవర్తి వంటి దాతలను
మఱచిరే = మరచిపోయారా? (లోకులు మరిచిపోలేదు కదా !)

ఇ) కింది పేరాలను చదువండి. ఇచ్చిన ప్రశ్నలకు 1, 2 వాక్యాలలో జవాబులు రాయండి. (5 × 2 = 10)
రామప్ప దేవాలయం వరంగల్లు జిల్లా పాలం పేటలో కలదు. గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు 1213లో దీనిని నిర్మించాడు. కాకతీయ దేవాలయాలన్నింటికీ ఇది తలమానికమైంది. ఇది ఏక మందిరం. నక్షత్ర ఆకారంలో నిర్మించబడింది. పై కప్పులో రామాయణం, భాగవతం, శివపురాణం గాథలు చెక్కారు. వివిధ భంగిమల్లో మదనికా శిల్పాలు, నాగినీ శిల్పాలు చెక్కబడ్డాయి. ఇందులోని నంది విగ్రహం ఎటువైపు నుండి చూసినా తమవైపే చూస్తున్నట్లు కన్పిస్తుంది. దేవాలయ గోపురాన్ని నీటితో తేలియాడే ఇటుకలతో నిర్మించారు.

జాయప సేనాని రచించిన నృత్య రత్నావళి కాకతీయుల కాలం నాటి దేశి, మార్గ నృత్య రీతులను తెలిపే ఏకైక గ్రంథం. కాకతీయుల కాలంలో ‘పేరిణి’ నాట్యం విశేష ప్రచారంలో ఉండేది. పేరిణిని పురుషులు ప్రదర్శిస్తారు. కాకతీయుల కాలంలో వీరులు యుద్ధభూమికి వెళ్ళేటప్పుడు ప్రేరణగా చేసిన నాట్యం ఇది. కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత పేరిణి కూడా మరుగున పడి అంతరించింది. ప్రముఖ నాట్యాచార్యుడు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ నృత్య రత్నావళిలోని నాట్య సంప్రదాయాలను, రామప్ప దేవాలయంలోని నృత్య శిల్పాలను పరిశీలించి పేరిణి నృత్య ప్రక్రియను పునరుద్ధరించారు.
ప్రశ్నలు :

ప్రశ్న 7.
నృత్య రత్నావళి రచయిత ఎవరు ? ఆ గ్రంథం దేని గురించి తెలుపుతుంది?
జవాబు:
నృత్య రత్నావళి రచించినవారు ‘జాయప సేనాని’. ఈ గ్రంథం కాకతీయుల కాలంనాటి దేశి, మార్గ నృత్యరీతులను తెలుపుతుంది.

ప్రశ్న 8.
రామప్ప దేవాలయం పైకప్పు విశేషాలు ఏమిటి?
జవాబు:
రామప్ప దేవాలయం పైకప్పులో రామాయణం, భాగవతం, శివపురాణం గాథలు చెక్కారు.

TS 10th Class Telugu Question Paper June 2023

ప్రశ్న 9.
నటరాజ రామకృష్ణ గారు పేరిణి నృత్యాన్ని ఎలా పునరుద్ధరించగలిగారు?
జవాబు:
నటరాజ రామకృష్ణ గారు నృత్య రత్నావళిలోని నాట్య సంప్రదాయాలను, రామప్ప దేవాలయంలోని నృత్య శిల్పాలను పరిశీలించి పేరిణి నృత్య ప్రక్రియను పునరుద్ధరించారు.

ప్రశ్న 10.
రామప్ప దేవాలయ నంది విగ్రహం ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
రామప్ప దేవాలయ నంది విగ్రహం ప్రత్యేకత ‘దానిని ఎటువైపు నుంచి చూసినా తమవైపే చూస్తున్నట్లు’ కనిపిస్తుంది.

ప్రశ్న 11.
పేరిణి నాట్యం ఎవరు, ఎప్పుడు ప్రదర్శిస్తారు?
జవాబు:
పేరిణిని పురుషులు ప్రదర్శిస్తారు. వీరులు యుద్ధభూమికి వెళ్ళేటప్పుడు ప్రేరణగా ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తారు.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత (40 మార్కులు)

అ) కింది ప్రశ్నలకు 5 నుండి 6 వాక్యాలలో జవాబులు రాయండి. (4 × 3 = 12)
ప్రశ్న 12.
‘నరరూపుడై పుట్టియున్న రాక్షసుడు’ అని కవి ఎటువంటి వారిని అంటున్నారు?
జవాబు:

  1. కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు.
  2. మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్మును అపహరించేవాడు.
  3. కులగర్వంతో బీదల ఇళ్ళను నాశనం చేసేవాడు.
  4. లంచాల విలువను పెంచేవాడు.
  5. చెడు ప్రవర్తనతో తిరిగేవాడు.
  6. వావివరుసలను పాటించనివాడు.
  7. నవ్వుతూ ముచ్చట్లు చెపుతూ ఎదుటివారిని నాశనం చేసేవాడు.
  8. తల్లిదండ్రులను ఇంటి నుండి వెళ్ళగొట్టేవాడు. నరరూప రాక్షసులు.

పై లక్షణాలు కల్గినవారిని కవి “నరరూపుడై పుట్టియున్న రాక్షసుడు” అని అంటున్నారు.

ప్రశ్న 13.
తెల్గుజోదులు ఎటువంటి వారని కవి అన్నాడు?
జవాబు:
‘వీర తెలంగాణ’లోని తెల్గు జోదులు ఎటువంటివారో కవి దాశరథి కృష్ణమాచార్యులు ఇలా చెప్పారు. అమ్మా ! తెలంగాణమా ! నీ పిల్లలలో ప్రకాశించే విప్లవాత్మకమైన చైతన్యము ఊరకనే పోలేదు. తెలుగువీరులు భూమండలాన్ని అంతా సరిదిద్ది. ఉజ్జ్వలమైన ఉదయకాల సూర్యుని ఆహ్వానించి, దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. ఓహో నీ పిల్లలంతా వీరులు, యోధులే కాదు పరోపకారులైన తెలుగువీరులు అని కీర్తించారు.

ప్రశ్న 14.
భూమిక పాఠ్యభాగ రచయితను గురించి రాయండి.
జవాబు:
‘భూమిక’ పాఠాన్ని ‘గూడూరి సీతారాం’ గారు వ్రాశారు. గూడూరి సీతారాంగారు, 1936లో రాజన్న సిరిసిల్లా జిల్లా దగ్గర ఉన్న ‘హనుమాజీ పేట’ గ్రామంలో జన్మించారు. ఈయన, సుమారు 80 కథలు వ్రాశారు. ఈయన (1) మారాజు, (2) లచ్చి, (3) పిచ్చోడు, (4) రాజమ్మ రాజీ రకం వంటి ప్రసిద్ధ కథలు వ్రాశారు. తెలంగాణ సాహిత్యంలో పేద కులాల జీవితాలనూ, ‘అట్టడుగు వర్గాల భాషనూ, ఈ యన అక్షరబద్ధం చేశాడు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ తొలిరకం కథలకు, ఈయన దిక్సూచిగా నిలబడ్డాడు. తెలంగాణ భాషనూ, యాసనూ ఒలికించడం, ఈయనకు గల ప్రత్యేకత.

ప్రశ్న 15.
“వారీ రామచంద్రా ! ఇగపటు తిరుపతి లడ్డు” అని ఎవరన్నారు ? ఏ సందర్భంలో అన్నారు? ఈ మాటలు ఏ పాఠంలోనివి?
జవాబు:
సంస్కృతాంధ్ర భాషల్లోని కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితుడైన కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు, తిరుమల రామచంద్ర గారికి తిరుపతి లడ్డు ఇస్తూ “వారీ రామచంద్రా ! ఇగపటు తిరుపతి లడ్డూ” అని అన్నారు. ఈ మాటలు డా. సామల సదాశివగారి ‘యాది’ అనే వ్యాస సంపుటి నుండి స్వీకరించబడిన ‘ఎవరి భాష వాళ్ళకు వినసొంపు’ అనే పాఠంలోనివి.

TS 10th Class Telugu Question Paper June 2023

ఆ) కింది ప్రశ్నలకు 10 నుండి 12 వాక్యాలలో జవాబులు రాయండి. (3 x 7 = 21)
ప్రశ్న 16.
వేదవ్యాసునికి కాశీలో ఎదురైన పరిస్థితులను ‘భిక్ష’ పాఠం ఆధారంగా తెలపండి.
జవాబు:
భిక్షా ధర్మంతో వేదవ్యాస మహర్షి శిష్యులతో కలిసి కాశీ నగరంలోని బ్రాహ్మణ వీథిలో భిక్ష కోసం ఇల్లిల్లూ తిరిగేవాడు. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు వ్యాసుణ్ణి పరీక్షిద్దామనుకున్నారు. నిత్యము భిక్ష పెట్టే కాశీనగర బ్రాహ్మణ స్త్రీలు శివుని మహిమచే ఆ రోజు వ్యాసునికి, అతని శిష్యులకు ఎవరూ భిక్ష పెట్టలేదు. వంట అవుతోందనీ, మళ్ళీ రమ్మనీ, తమ ఇంట్లో దేవకార్యమనీ ఇలా చెప్పి బ్రాహ్మణ స్త్రీలు వ్యాసునికి భిక్ష పెట్టలేదు. ఇలా రెండవ రోజూ విశ్వనాథుని మాయవల్ల ఏ ఇల్లాలు భిక్ష పెట్టలేదు.

ఆకలికి తట్టుకోలేక వ్యాస మహర్షి కాశీనగరాన్ని శపించబోయాడు. అప్పుడు పార్వతి వ్యాసుణ్ణి మందలిస్తుంది. “గొంతు దాకా తినడానికి మాధుకర భిక్ష దొరకలేదని శివుని అర్ధాంగి లక్ష్మియైన పవిత్ర కాశీ నగరాన్ని శపించాలనుకోవడం తగునా ? దొరికిన దుంపలతో సరిపెట్టుకొని జీవనం సాగించే మునులు నీకన్నా తెలివితక్కువ వాళ్ళా ! ‘ఉన్న ఊరు కన్న తల్లితో సమానం’ అనే నీతి నీకు తెలియదా ? అని మందలించి, ఆకలితో ఉన్న నీతో ఇలా మాట్లాడటం మావంటి గృహిణులకు మంచిది కాదు. మా ఇంటికి భోజనానికి రా ! అని పిల్చి, వ్యాసునికి, అతని శిష్యులకు విశ్వనాథుని అనుగ్రహంతో భోజనాలు పెట్టింది.

వేద విభజన చేసి, పంచమ వేదంగా మహాభారతాన్ని రచించి అష్టాదశ పురాణాలను రచించిన బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు. ఒకరోజు కాశీ విశ్వనాథుడు వ్యాసుణ్ణి పరీక్షించాలని సంకల్పించాడు. దాని ఫలితంగా ఆకలిని తట్టుకోలేక విచక్షణ కోల్పోయి వ్యాసునికి ఈ పరిస్థితులు ఎదురైనాయి.

(లేదా)
నగర జీవనాన్ని అలిశెట్టి ప్రభాకర్ వర్ణించిన తీరును మీ సొంత మాటల్లో రాయండి.
జవాబు:
నగరాలు, అరణ్యాలు వలె రణగొణ ధ్వనులతో నిండి యుంటాయి. నగరాల నాలుగు రోడ్ల కూడలిలో వినిపించే ధ్వనులు, ఢంకా నాదంలా, జలపాతం హోరులా వినిపిస్తాయి. ఆ ధ్వనులు, నగర జీవుల బతుకు పోరాటంలోంచి వచ్చిన ఉఱుములు. పల్లెల్ని వదలి నగరాలకు వలస వచ్చినవారు, తలదాచుకోవడానికి చోటులేక, ఇనప్పెట్టెల్లాంటి ఇరుకు ఇళ్ళల్లో, మురికివాడల్లో నివాసం ఉంటారు. వారివి ఊపిరాడని బ్రతుకులు. నగరంలో ప్రతివ్యక్తి, చదువదగ్గ పుస్తకం వంటివాడు. కాని ఎవరూ ఆ బతుకు పుస్తకం పేజీలు తిప్పి చదవరు. నగరంలో పిల్లలు బస్సుల్లో, రిక్షాల్లో కాన్వెంట్లకు వెడుతూ, పువ్వుల్లా పేవ్ మెంట్లపై సందడి చేస్తూ ఉంటారు. నగరంలో పెద్ద భవంతుల ప్రక్కనే, పేదల పూరిళ్ళు కూడా ఉంటాయి. నగరంలో ఐశ్వర్య దరిద్రాలు, సమాంతర రేఖల్లా కన్పిస్తాయి. నగరంలో వెరైటీ సమస్యలు ఉంటాయి. నగర జీవులలో ఎవరికీ తీరిక ఉండదు. వారి కోరికలు తీరవు.

నగర జీవులవి అసహజపు నవ్వులు. వారివి పాదరసం నడకలు. నగరాల్లో రోడ్లపై అన్నివైపుల నుండి ప్రమాదాలు వస్తూ ఉంటాయి. నగరం అనే వృక్షంపై, నగరవాసులు ఏకాకులుగా జీవిస్తారు. నగరం అర్ధం కాని రసాయనశాల వంటిది. నగరం చిక్కువీడని పద్మవ్యూహం వంటిది. అలిశెట్టి ప్రభాకర్ నగర జీవితాన్ని గూర్చి పై విధంగా చెప్పాడు.

ప్రశ్న 17.
ఆది హిందువులలో చైతన్యాన్ని తేవడానికి భాగ్యరెడ్డి వర్మ పాటుపడిన విధానాన్ని మీ పాఠం ఆధారంగా తెలపండి.
జవాబు:
ఆదిహిందువులు అనుభవిస్తున్న అవస్థల నుండి వారిని గట్టెక్కించడానికి భాగ్యరెడ్డివర్మ చాలా కృషి చేశాడు. అంకిత భావంతో పనిచేశాడు. తమ దుస్థితికి కారణం, తమ అజ్ఞానం, ఉదాసీనతే అనే విషయం నిమ్నవర్గాల వారు గ్రహించేలా చేశాడు వర్మ. మానవులలో ఎక్కువ, తక్కువలు లేవని ఆదిహిందువులు తెలుసుకొనేలా చేశాడు. 3,348 ఉపన్యాసాలు ఇచ్చి ఆదిహిందువులను చైతన్యపరిచాడు. దేవదాసీ, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకొన్నాడు. ఆదిహిందువులకు చదువుపై శ్రద్ధ కలిగించాడు. తాగుడు మాన్పించాడు. మూఢాచారాలు మాన్పించాడు. ఆటల ప్రదర్శన నిర్వహించాడు. ఆదిహిందువులకు ప్రభుత్వం అండగా నిలిచేలా చేశాడు. ఆదిహిందువులకు పాఠశాలలు ఏర్పాటు చేయించాడు.

(లేదా)
“స్వీయ రాష్ట్రం సిద్ధించింది గనుక, ఇక జాతి సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడవలసి ఉంది.” అన్న రచయిత మాటలను సమర్ధిస్తూ రాయండి.
జవాబు:
వలస పాలనలో అణచివేతకు గురై ఎందరో తెలంగాణ అమర వీరుల త్యాగంతో తెలంగాణ ప్రజలకు స్వీయ రాష్ట్రం సిద్ధించింది. ఇక జాతి సర్వతోముఖాభివృద్ధి కోసం తెలంగాణ భాష, సంస్కృతులకు ప్రాణం పోయాలి. ఉత్కృష్టమైన తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరించాలి. తెలంగాణా అస్తిత్వాన్ని సమున్నతంగా నిలబెట్టే కృషి ఏ ఒక్క రంగానికో -పరిమితమైంది కాదు. ఇదొక సమిష్టి యజ్ఞం. పరాయి పాలనలో తెలంగాణ సమాజం ఎంతో క్షోభను, సంక్షోభాన్ని అనుభవించింది. సామాజిక జీవనం ఛిద్రమైంది. సామాజిక సంబంధాలు తెగిపోయాయి. తెలంగాణ సమాజం ఇప్పుడు ప్రశాంతతను, పచ్చని బతుకును కోరుతున్నది. అందుకే రచయిత జాతి సర్వతోముఖాభివృద్ధి కోసం పాటు పడాలని పిలుపునిస్తున్నాడు.

ఈ పునర్నిర్మాణం అంత సులభమైంది కాదంటాడు రచయిత. దానికోసం మనమంతా శక్తియుక్తులన్నీ కూడ గట్టుకొని నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగితేనే ఈ విషాదం నుంచి బయట పడగలం. జనానికి తక్షణం కావాల్సింది కడుపునిండా తిండి. రేపటి గురించి గుబులు లేని జీవితం. కనీస అవసరాలు తీరడం, గౌరవమైన బ్రతుకు ప్రజల ప్రాథమిక హక్కు ఈ హక్కులకై మనమంతా పాటుపడాలని…. చెప్పిన మాటలు సమర్థనీయమని నేను విశ్వసిస్తున్నాను.

TS 10th Class Telugu Question Paper June 2023

ప్రశ్న 18.
వాలి, సుగ్రీవుల మధ్య వైరం కలుగడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటో వివరించండి.
జవాబు:
ఋక్ష విరాజుని కుమారులైన వాలి, సుగ్రీవులు ఇంద్ర సూర్యుల అంశతో జన్మించారు. వాలి మహా బలశాలి. సుగ్రీవుడు ధర్మాత్ముడు. ఋక్ష విరాజుని తర్వాత వాలి కిష్కింధకు రాజైనాడు. మాయావి అనే రాక్షసునికి, వాలికి వైరం ఉంది. ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. సుగ్రీవాదులెంతా వారించినా వాలి వినకుండా వానితో యుద్ధానికి సిద్దమయ్యాడు. వాలి, సుగ్రీవులను చూడగానే మాయావి భయంతో పారిపోయాడు. అలా వెళ్ళి ఒక పెద్ద భూగృహంలో దాక్కొన్నాడు మాయావి. అతన్ని వెంబడిస్తూ వాలి, సుగ్రీవులు గుహ వద్దకు చేరారు. సుగ్రీవుణ్ణి బిలం ద్వారం దగ్గరే ఉంచి, వాలి ఆవేశంతో మాయావిని చంపి వస్తానని వెళ్ళాడు. సంవత్సరమైంది వాలి జాడే లేదు. సుగ్రీవునికి ఆందోళన ఎక్కువైంది. ఇంతలో నురుగుతో కూడిన రక్తం గుహలో నుంచి బయటకు వస్తున్నది. లోపల నుండి రాక్షసునివి, వాలివి అరుపులు వినిపిస్తున్నాయి.

మాయావి చేతిలో వాలి చనిపోయాడనుకొన్నాడు సుగ్రీవుడు. రాక్షసుడు బయటకు వస్తాడేమోనని పెద్ద బండతో ఆ బిల ద్వారాన్ని మూసేశాడు సుగ్రీవుడు, కిష్కింధకు వచ్చిన సుగ్రీవుడు విషయాన్ని మంత్రులకు చెప్పాడు. వారు సుగ్రీవుని రాజును చేశారు. కొంతకాలం గడిచింది. అక్కడ వాలి, మాయావిని చంపి, బండను తొలగించి బయటకు రాగా అక్కడ సుగ్రీవుడు కనబడలేడు. రాజ్యానికి వచ్చిన వాలికి సుగ్రీవుడు రాజై కనబడ్డాడు. ఓహో ! ద్వారానికి రాయి అడ్డుపెట్టి, తనను అడ్డు తొలగించుకోవాలని, ఆ తర్వాత రాజు కావాలనే ఉద్దేశంతోనే ఈ పని చేసి ఉంటాడని వాలి భావించాడు. ‘కన్నెర్ర చేశాడు. సుగ్రీవుణ్ణి రాజ్యభ్రష్టుడిని చేశాడు వాలి. మంచి ఉద్దేశంతో సుగ్రీవుడు చేసిన పని ఇలా వాలి, సుగ్రీవుల మధ్య వైరం కలుగడానికి దారితీసింది.

(లేదా)
విశ్వామిత్రుడు తన యాగరక్షణ కోసం ఎవరి వద్దకు వెళ్ళాడు ? ఏమన్నాడు? చివరకు ఏం జరిగిందో రాయండి.
జవాబు:
విశ్వామిత్రుడు తన యాగరక్షణ కోసం దశరథుని వద్దకు వెళ్ళాడు. ఆ దశరథునితో, విశ్వామిత్రుడు ఈ విధంగా· అన్నాడు. “ఓ రాజా ! నేనొక యజ్ఞాన్ని సంకల్పించాను. కానీ మారీచ, సుబాహులనే రాక్షసులు యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. నేను శపించడానికి శక్తి ఉన్నా యజ్ఞ దీక్షలో ఉన్నాను. కాబట్టి అది నాకు తగని పని. అందుకు నీ కుమారుడు, సత్య పరాక్రముడు అయిన శ్రీరాముణ్ణి పది దినాల పాటు నా వెంట పంపు. నా వెంట వచ్చి యాగరక్షణ చేయడం వల్ల శ్రీరామునికి అనేక శ్రేయములు కలుగుతాయి.

. ఈ మాటలు వినగానే దశరథుని గుండెలో రాయి పడ్డది. “మహర్షీ! నా రాముడు 16 ఏండ్లు కూడా నిండని వాడు. యుద్ధ విషయాలతో తగిన పరిచయం లేనివాడు. కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి. మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది.
“ఇచ్చిన మాట తప్పడం మీ ఇంటా వంటా లేదు. నీవందుకు సిద్ధపడితే నేను ఒట్టి చేతులతో తిరిగి వెళతాన”ని కోపంగా పలికాడు విశ్వామిత్రుడు. పరిస్థితిని గమనించిన వశిష్ఠుడు, దశరథునితో “వివిధాస్త్ర ప్రయోగదక్షుడైన విశ్వామిత్రుని వెంట రాముణ్ణి పంపడంలో సంశయించవద్దని”, “రాముణ్ణి పంపితే మేలు జరుగుతుంద”ని చెప్పాడు. అప్పుడు దశరథుడు, విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులను యాగరక్షణార్థం పంపాడు.

III. సృజనాత్మకత (1 × 7 = 7)

ప్రశ్న 19.
భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తే విజయం లభిస్తుందనే నీతి వచ్చునట్లు ఒక కథను రాయండి.
జవాబు:
నీతి కథ
నీతి : : భయపడకుండా, నిరుత్సాహ పడకుండా ముందుకు నడిస్తే విజయం లభిస్తుంది.
రోజూ హుషారుగా స్కూలు నుంచి వచ్చే కాత్యాయని ఈ రోజు అలా లేదు. రాగానే అమ్మా ! అంటూ గొంతుచుట్టూ చేతులు పెనవేసి స్కూలులో జరిగిన సంగతులన్నీ ఏకరువు పెట్టి, ఉదయం నుండి అమ్మకు దూరంగా ఉన్నాననే దిగులును తీర్చుకునేది. అమ్మా ! నీ వంట సూపర్. అది అంత రుచిగా ఉందీ, ఇది ఇంత రుచిగా ఉందీ అంటూ మాట కలిపేది. ఇవాళ ఏం జరిగిందని ఇలా ఉందని తల్లి ఆరా తీస్తే, అమ్మా ! అంటూ భోరున ఏడ్చేసింది. మొన్న జరిగిన పరీక్షల ఆధారంగా మెరిట్ని చూస్తూ పిల్లలను రెండు సెక్షన్లుగా చేశారు. కాత్యాయినిని డల్లర్ సెక్షన్లో వేశారు. తన ఫ్రెండ్స్ అంతా మెరిట్ సెక్షన్లో ఉన్నారు. “నన్ను రేపటి నుండి అందరూ డల్లర్ కాత్యాయిని అని పిలిస్తే తట్టుకోలేనమ్మా! ఆ బాధలో నాకు ఆకలి కూడా కాలేదు. అన్నం తినకుండానే ఏడుస్తూ కూర్చున్నాను” – అంటూ చెప్పింది.

పరిస్థితి అర్థమైంది అమ్మకు. కాలం వేగంగా పరుగెడుతోంది. దానితోపాటు పిల్లలూ పరుగెత్తాలి. వాళ్ళను దానికి తగినట్లుగా సంసిద్ధత చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకొని దానికి తగినట్లుగా TG 10th
మాటలు చెప్పాలి. అప్పుడే వాళ్ళు భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిచి విజయం సాధిస్తారు. ఆ బాధ్యత తల్లిదా ? తండ్రిదా, లేదా టీచర్లదా ? గజిబిజిగా పరుగులు తీస్తూ, మాకు ఖాళీ లేదు, ఆ బాధ్యత మీదే! అంటూ తప్పించుకోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత పడాలి. కాత్యాయని వాళ్ళ అమ్మ కూడా బాధ్యత పడింది. తన బిడ్డ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసింది. కన్నీళ్ళు తుడుస్తూ…..

అమ్మా ! కాత్యాయనీ ! నీవు డల్లర్పు ఎలా అవుతావు ? ఈసారికి నీకు మార్కులు తగ్గాయి అంతే ! మార్కులు అనేవి పిల్లలకు కొలమానం కాదు. మంచి ప్రవర్తనే ప్రమాణంగా తీసుకోవాలి. అయినా మీ స్కూల్లో నీలాగా పాడే పిల్లలు. ఎవరున్నారు ? నీలాగా చక్కని సంస్కారం, స్నేహం ఎంతమందికున్నాయి ? నీకు మార్కులు రాకపోయినా, నాకు ఇష్టమే. కానీ నీవు ఇలా పిరికిదానిలా ఉంటే నాకు నచ్చదు.

ఈ విషయాన్ని నీవు స్పోర్టివ్ గా తీసుకో, కష్టపడు. ఈసారి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకో. మెరిట్ సెక్షన్లోని నీ ఫ్రెండ్స్ ప్రక్కన మళ్ళీ కూర్చో. దీని గురించి ఆలోచించు. నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి. ముందున్న కాలికి గర్వంలేదు. వెనకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు. వాటి స్థానం మారడానికి ఒక్క క్షణం చాలు అని” – అంటూ చెప్పిన అమ్మ మాటల్లోని అంతర్యాన్ని గ్రహించింది కాత్యాయనీ, “అమ్మా ! ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. నేను బాధపడను. చక్కగా చదువుతాను. ఉన్నత స్థానాన్ని సాధిస్తాను.” అని అమ్మ చేతి ముద్దలను ఆనందంగా తింది. కాత్యాయనీ రేపటి రోజున మంచి మార్కులు సాధించవచ్చు లేదా సాధించకపోవచ్చు. కానీ మంచి మార్పును తన తల్లి మాటలతో పొందింది. తల్లిదండ్రులు పిల్లల్లోని శక్తిని ప్రేరేపించాలి. పిల్లల్లో ఎవరూ డల్లర్స్ కారు. స్లో లెర్నర్సు అంతే. ఈ విషయం మనం గ్రహించాలి. పిల్లలకు చక్కగా నేర్చుకోవాలి. అప్పుడే పిల్లలు భయపడకుండా, నిరుత్సాహపడకుండా ముందుకు నడిచి విజయం సాధిస్తారు.

(లేదా)
గోలకొండ పట్టణానికి మాటలు వస్తే, ఆ పట్టణం తన గొప్పదనాన్ని మనకు ఏ విధంగా చెబుతుందో ఊహించి గోలకొండ పట్టణ, ‘ఆత్మకథ’ రాయండి.
జవాబు:
నేను గోల్కొండ పట్టణాన్ని తెలంగాణలోనే ఎంతో విశిష్టతను సంతరించుకన్న నా వైభవాన్ని వర్ణించడానికి కవులకు సైతం మాటలు చాలవు. చిరస్మరణీయమైన నా కట్టడంలోని సాంకేతిక నైపుణ్యాన్ని ఎందరో చరిత్రకారులు అభివర్ణించే ప్రయత్నం చేశారు. గోల్కొండ వైభవాన్ని కళ్ళతో చూడాల్సిందే కాని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. నా నిర్మాణ పథకానికి కర్త ఆజంఖాన్ అనే ఇంజనీర్. నన్ను అందంగా తీర్చిదిద్దిన వారిలో మొదటివాడగు కులీకుతుబ్షా, నాల్గవవాడగు ఇబ్రహీం కుతుబ్షా, ఐదవవాడగు మహమ్మద్ కులీ కుతుబ్షా, ఏడవ వాడగు అబ్దుల్లా కుతుబ్షా చాలా శ్రద్ధ వహించారు. నగీనాబాగ్ రమ్యోద్యానమణి. ‘దిల్కుషా’ భవనం మనోహరమైన రాజమందిరం. ఇంకా మిద్దెల మీది తోటలు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మజ్నూ బురుజు సమీపంలోని ‘దొడ్డ బాల్బోవా’ వృక్షం ఆఫ్రికా నుండి తేబడినది. ‘కటోరా హవుజు’ జలాశయం నా ప్రత్యేకత. వజ్రాలకు గోలకొండ పుట్టినిల్లు.

నా ప్రాంతంలో చెలామణిలో ఉన్న నాణెము హోను. దీనిని పెగోడా అని కూడా అంటారు. నన్ను పాలించిన పాదుషాలలో ఇబ్రహీం కుతుబ్షా విద్యాప్రియుడు. ఇతనికి ఆంధ్రభాష పట్ల అభిమానం ఉంది. జింకలు వనం, ద్రాక్ష తోటలతో నా ప్రాంతం పర్యాటకులకు ఆహ్లాదాన్నిస్తాయి. 1589లో ‘మహమ్మారి’ పీడ నా ప్రాంతంలోని ఎంతోమంది ప్రాణాలు తీసింది. 1591లో మహమ్మారి పీడ వదిలినదానికి జ్ఞాపక చిహ్నంగా హైదరాబాద్లో చార్మీనార్ నిర్మాణం చేశారు. మహమ్మద్ కులీకుతుబ్షా పాదుషావారు. 250 సంవత్సరాలు సకల సంపద వైభవముతో విరాజిల్లిన, ప్రపంచమును మిరుమిట్లు గొలిపిన నన్ను ఔరంగజేబు చక్రవర్తి మోసంగా జయించి, సర్వనాశనం చేశాడు. అంతటితో నా అందచందాలు, వైభవాలు ఠీవి మాసిపోయాయి.

పార్ట్ – B

మార్కులు : 20
సమయం : 30 ని.లు.

సూచనలు :
1) విద్యార్థులు జవాబులను ఈ ప్రశ్నపత్రంలోనే నిర్దేశించిన విధంగా కేటాయించిన స్థలంలో రాయాలి.
2) పూర్తి చేసిన ‘పార్ట్ – బి’ ప్రశ్నా పత్రాన్ని ‘పార్ట్ – ఎ’ జవాబు పత్రంతో జతచేయాలి.

I. భాషాంశాలు (10 మార్కులు)

అ) పదజాలం
కింది పదాలను సొంత వాక్యాలలో ప్రయోగించండి. (2 × 1 = 2)
ప్రశ్న 1.
గుండె పగులు : __________
జవాబు:
గుండె పగులు : ఈ రోజుల్లో పిల్లల ప్రవర్తన, మాటతీరు పెద్దలకు గుండె పగిలేలా ఉంటున్నాయి.

ప్రశ్న 2.
మాయ మాటలు: __________
జవాబు:
మాయ మాటలు : మాయ మాటలు చెప్పి ఎక్కువ కాలం మోసం చేయలేము.

కింది వాటికి సరైన జవాబును గుర్తించి ఆ సంకేతాన్ని (A/B/C/D) బ్రాకెట్లలో రాయండి.
ప్రశ్న 3.
-పౌర్ణమి రాత్రి ఇందుబింబము నిండుగా ప్రకాశిస్తుంది. (గీత గీసిన పదానికి అర్థం)
A) ప్రతిబింబము
B) రవిబింబము
C) చంద్రబింబము
D) సూర్యబింబము
జవాబు:
C) చంద్రబింబము

ప్రశ్న 4.
ముళ్ళు గుచ్చుకోకుండా కాళ్ళకు ముచ్చెలు వేసుకోవాలి. (గీత గీసిన పదానికి అర్థం).
A) దండలు
B) చెప్పులు
C) గొలుసులు
D) సంకెళ్ళు
జవాబు:
B) చెప్పులు

TS 10th Class Telugu Question Paper June 2023

ప్రశ్న5.
చెరువులో పద్మములు వికసించాయి. ఆ చెరువుకు కమలములే అందాన్ని తెచ్చిపెట్టాయి.
(పై వాక్యాలలో సమానార్థక పదాలు)
A) పద్మములు, కమలములు
B) చెరువులు, కమలములు
C) పద్మములు, చెరువులు
D) వికసించు, తెచ్చు
జవాబు:
A) పద్మములు, కమలములు

ప్రశ్న 6.
రణము, యుద్ధం – అను సమానార్థకాలు కలిగిన పదం
A) అభాండము
B) అభండము
C) భాండము
D) భండనము
జవాబు:
D) భండనము

ప్రశ్న 7.
ప్రతి జీవి మృత్యువు పొందును. మనిషికి కూడా మిత్తి తప్పదు.
(పై వాక్యాలలోని ప్రకృతి – వికృతి పదాలు)
A) ప్రతి – కూడా
B) పొందు – తప్పు.
C) జీవి – మనిషి
D) మృత్యువు – మిత్తి
జవాబు:
D) మృత్యువు – మిత్తి

ప్రశ్న 8.
‘సాజం’ – వికృతి పదానికి ప్రకృతి పదం
A) సమజం
B) సహజం
C) సజం
D) సజాం
జవాబు:
B) సహజం

ప్రశ్న 9.
ప్రతీరోజు ఉదయం మిత్రుడు తూర్పున ఉదయిస్తాడు. మంచి మిత్రుడు దొరకడం గొప్ప అదృష్టం.
(పై వాక్యాలలో ‘మిత్రుడు’ పదానికి నానార్థాలు)
A) సూర్యుడు, స్నేహితుడు
B) సూర్యుడు, చంద్రుడు
C) మిత్రువు, శత్రువు
D) ఉదయించు, ఉదయం
జవాబు:
A) సూర్యుడు, స్నేహితుడు

ప్రశ్న 10.
భవుని భార్య – అను వ్యుత్పత్తి అర్థం కలిగిన పదం
A) జనని
B) పావని
C) భరణి
D) భవాని
జవాబు:
D) భవాని

II. వ్యాకరణాంశాలు: (10 మార్కులు)

కింది వాటికి సరైన జవాబును గుర్తించి ఆ సంకేతాన్ని ( A / B / C / D) బ్రాకెట్లలో రాయండి. (10 × 1 = 10)
ప్రశ్న 11.
అమ్మహాసాధ్వి – పదాన్ని విడదీస్తే
A) అ + మ్మహాసాధ్వి
B) ఆ + మహాసాధ్వి
C) అమ్మ + హాసాధ్వి
D) అమ్మః + సాధ్వి
జవాబు:
B) ఆ + మహాసాధ్వి

ప్రశ్న 12.
వృద్ధులు అనగా
A) ఎ, ఒ
B) ఏ, ఓ
C) ఐ, ఔ
D) అం, ఆః
జవాబు:
C) ఐ, ఔ

ప్రశ్న 13.
బహువ్రీహి సమాసానికి ఉదాహరణ
A) కమలాక్షుడు
B) కమల దళము
C) కమల పుష్పము
D) తామర కలువలు
జవాబు:
A) కమలాక్షుడు

ప్రశ్న 14.
మూడు తరాలు – అనునది ఏ సమాసం?
A) ద్వంద్వ సమాసం
B) రూపక సమాసం
C) ద్విగు సమాసం
D) తత్పురుషము
జవాబు:
C) ద్విగు సమాసం

ప్రశ్న 15.
1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్ర గణాలు మరియు 2, 4 పాదాల్లో ఐదు సూర్యగణాలు కలిగిన పద్యం
A) ద్విపద
B) సీసం
C) తేటగీతి
D) ఆటవెలది
జవాబు:
D) ఆటవెలది

TS 10th Class Telugu Question Paper June 2023

ప్రశ్న 16.
‘అనిదంపూర్వ యశస్వి యాతడగు నన్నా ! విశ్వనాథేశ్వరా ! ఇది ఏ పద్యపాదం ?
A) శార్దూలము
B) మత్తేభము
C) ఉత్పలమాల
D) చంపకమాల
జవాబు:
B) మత్తేభము

ప్రశ్న 17.
ఉపమేయానికి, ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు చెపితే అది ఏ అలంకారం?
A) స్వభావోక్తి
B) అతిశయోక్తి
C) శ్లేషాలంకాం
D) రూపకాలంకారం
జవాబు:
D) రూపకాలంకారం

ప్రశ్న 18.
మా పాఠశాల భవనము ఆకాశాన్ని తాకుచున్నది – ఈ వాక్యంలోని అలంకారం
A) అతిశయోక్తి
B) రూపకం
C) స్వభావోక్తి
D) శ్లేష
జవాబు:
A) అతిశయోక్తి

ప్రశ్న 19.
నకులునిచేత వంట చేయబడినది – ఇది ఏ వాక్యం?
A) పరోక్ష
B) ప్రత్యక్ష
C) కర్మణి
D) కర్తరి
జవాబు:
C) కర్మణి

ప్రశ్న 20.
“నేను చదువుతాను” అన్నాడు సహదేవుడు. (ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మారిస్తే)
A) నేను చదువుతానన్నాడు సహదేవుడు.
B) తాను చదువుతానని అన్నాడు సహదేవుడు.
C) తాను చదువలేనని అన్నాడు సహదేవుడు.
D) నేను, సహదేవుడు చదువుకొంటాము.
జవాబు:
B) తాను చదువుతానని అన్నాడు సహదేవుడు.

Leave a Comment