Students always start with AP Board Solutions Class 12 English and Once Upon a Time Summary in English Telugu for seamless learning.
Once Upon a Time Summary in Telugu & English
Once Upon a Time Summary in English
Gabriel Okara was an African (Nigerian) poet. His works are remarkable for their clever blending of African thought with English expression. They are also known for their clubbing of African oral traditions with modern techniques. The present poem, ‘Once Upon a Time ‘, glorifies honesty, sincerity and innocence. It criticises pretence. It contrasts childhood innocence with adult ‘experience’.
In a simple and symbolic style, Okara drives home the need to go back to ‘once upon a golden old time’. The poem is in the form of a conversation between a father and his son (listening). The speaker turns nostalgic, reflective, and regretful. He wants to unlearn all his present hypocritical manners and relearn his past innocent, warm and sincere ways. He feels sad about modern smiles that do not come from hearts. Handshakes are not genuine. Faces are different to suit places. Greetings are pretentious. Vexed with this sorrowful scenario, the speaker feels like relearning warmth, emotions, and hearty smiles. The poem ends with a hopeful note.
Once Upon a Time Summary in Telugu
గేబ్రియేల్ ఒకారా ఒక ఆఫ్రికన్ (నైజీరియన్) కవి. ఆయన రచనల ప్రత్యేకత: ఆఫ్రికన్ ఆలోచనల, ఆంగ్లేయ వ్యక్తీకరణల నైపుణ్య సమ్మేళనం. అంతేకాక ఆఫ్రికన్ మౌఖిక సాంప్రదాయాల, ఆధునిక కవితా ప్రక్రియల మిశ్రమానికి కూడా ఆయన రచనలు ప్రసిద్ధి. ప్రస్తుత గేయం “వన్స్ అపాన్ ఎ టైమ్’ నిజాయితీని, మనఃపూర్వకతను, అమాయకత్వాన్ని స్తుతిస్తుంది. ఆత్మ వంచనను ఖండిస్తుంది. అత్యంత సరళమైన, అయినా గంభీర సూచనాత్మక శైలిలో ఒకారా ఒకప్పటి స్వచ్ఛమైన స్వర్ణయుగానికి వెళ్ళాల్సిన ఆవశ్యకతను స్పష్టంగా చెబుతారు.
![]()
తండ్రి కొడుకుల సంభాషణ రూపంలో (కొడుకు శ్రోత మాత్రమే) కవిత కొనసాగుతుంది. కథకుడు గతకాల స్మృతులను నెమరు వేసుకుంటారు. తులనాత్మకంగా తనను తాను విశ్లేషించుకుంటారు. పశ్చాత్తాప పడతారు. ప్రస్తుత ఆత్మవంచన, నటనతో నిండిన కృత్రిమ ప్రవర్తనను మరిచి పోవాలనుకుంటారు. తన గతకాలపు అమాయకత్వాన్ని, ఆత్మీయతను, నిజాయితీ భరిత మనఃపూర్వక ప్రవర్తనను తిరిగి అలవరుచుకోవాలనుకుంటారు.
ఆధునిక కాలపు, పెదవులపై నుండి వచ్చే కృత్రిమ నవ్వుల పట్ల బాధను వ్యక్తీకరిస్తారు. కరచాలనాలు కూడా కల్మషరహితం కాదు. ముఖాలు పరిస్థితులకు అనుగుణంగా మారతాయి. అభివాదాలన్ని నటనలే. ఈ రకమైన విచారకర పరిస్థితులతో విసుగెత్తిపోయిన కథకుడు, మళ్ళీ పాతకాలపు ఆత్మీయతను, సహజ భావోద్వేగాలను, మనఃపూర్వక నవ్వులను, ‘ తిరిగి పొందాలనుకుంటారు. కవిత ఆశావాదపు స్ఫూర్తితో ముగుస్తుంది.
Once Upon a Time Word Meanings
once upon a time (phrase) some time ago; in olden days; కొంత కాలం క్రితం; పాత రోజులలో
laugh with their hearts (phrase) express happiness sincerely; మనఃపూర్వకంగా ఆనందాన్ని వ్యక్తీకరిస్తూ స్వచ్ఛంగా నవ్వుట
Laugh with their teeth (phrase) insincere laughing; పై పై నవ్వు; మనసులోంచి కాకుండా, పెదవులపైన నవ్వు
ice-block-cold eyes (phrase) eyes that express no warmth; ఆప్యాయత వ్యక్తీకరించని కళ్ళు; నిర్లిప్తతను సూచించే చూపు
search for my shadow (phrase) look for something that they think is hidden; ఏదో దాచి ఉన్నదని భావిస్తూ దాని కొరకు వెదుకుట
feel at home (phrase) feel free and comfortable; స్వేచ్ఛగా సౌకర్యంగా ఉండండి.
wear many faces (phrase) appear (or look) differently at various places; భిన్న ప్రదేశాలలో వేరువేరుగా కనిపించు; నటించు; wear masks; ముసుగులు ధరించు
homeface, office- face ….. examples of different appearances; ముఖాలకు ఉదాహరణలు
conforming smiles (phrase) smiles that suit the situations; పరిస్థితులకు అనుగుణమైన చిరునవ్వులు
portrait (n) /’pɔ:(r)treit/ (పో(ర్)ట్రెఇట్) a depiction of a person or mood; ఒక వ్యక్తి యొక్క, లేదా ఒక వ్యక్తి మానసిక స్థితి చిత్రణ ‘
Good-riddance (interjection) /gud ‘rIdǝns/ (గుడ్ రిడన్స్) expression of happiness when someone (one doesn’t like), leaves : (ఇష్టం లేనివారు) వెళ్ళినప్పుడు కలిగే సంతోషం వ్యక్తీకరణ. వదిలాడండి అని పొందే ఉపశమనం
muting things (phrase) all those habits, social manners and artificial behaviours that silence or suppress one’s true feelings and genuine self; ఒక వ్యక్తి యొక్క వాస్తవ అనుభూతులను, అసలైన వ్యక్తిత్వాన్ని అణచివేసే కృత్రిమ ప్రవర్తనా విధానాలు
![]()
a snake’s bare fangs (phrase) a snake’s pointed teeth that inject venom; పాము కోరలు; విషాన్ని ఎక్కించే పాము పళ్ళు