Once Upon a Time Annotations Questions and Answers

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year English Study Material Pdf and Once Upon a Time Annotations Questions and Answers Pdf.

AP Inter 2nd Year English Once Upon a Time Questions and Answers Annotations

Once Upon a Time Annotations Pdf

Contextual Questions

Answer the following contextual questions in the given pattern.
a) Identify the poem and name the poet of the given lines.
b) Discuss the context of the lines and appreciate them criti- cally in about 75 words.

Question 1.
Once upon a time, son, they used to laugh with their hearts and laugh with their eyes :
Answer:
The Poem and the Poet : The given touching words oc- cur in the reflective poem ‘Once Upon a Time’. This nos- talgic poem was crafted by Gabriel Okara.

Context and Critical Analysis: These are the opening lines of the poem. The speaker addresses his son. He re- calls those golden old days. When the narrator was a child, people used to laugh with their hearts. Warmth overflowed their laughter. Their affection reflected in their bright eyes. That made human relations cordial.

Comment: The words reveal the speaker’s admiration for those old days. His nostalgia is conspicuous. He takes his readers with him to that glorious past.

కవిత మరియు కవి : ఇచ్చిన కదిలించే పదాలు పరిశీలనాత్మక కవిత ‘వన్స్ అపాన్ ఎ టైమ్’లోనివి. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొనే ఈ గేయ రూపకల్పన చేసినవారు గేబ్రియేల్ ఒకారా.

సందర్భం మరియు విమర్శనాత్మక విశ్లేషణ : ఇవి కవిత యొక్క ప్రారంభ పాదాలు. కథకుడు తన కుమారుడితో సంభాషిస్తున్నాడు. ఆయన గత కాలపు స్వర్ణయుగాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కథకుడు పసివాడుగా ఉన్నప్పుడు అందరూ మనఃపూర్వకంగా నవ్వేవారు. ఆ నవ్వులో వెచ్చదనం పొంగి పొర్లేది. వారి ఆప్యాయత వారి కళ్ళల్లో ప్రతిబింబించేది. అవి మానవ సంబంధాలను ప్రేమభరితంగా ఉంచేవి.

వ్యాఖ్య : ఇచ్చిన పదాలు కథకుడికి పాత రోజుల మానవ సంబంధాల పట్ల ఉన్న ఆరాధనను తెలియచేస్తున్నవి. అతని ఆ గతకాలపు స్మృతులు సుస్పష్టం. అతను తనతో పాటుగా పాఠకులను కూడా ఆ అద్భుత పాత కాలంలోనికి పయనింప చేస్తారు.

Question 2.
But now they only laugh with their teeth, while their ice-block-cold eyes search behind my shadow.
Answer:
The Poem and the Poet: The given touching words occur in the reflective poem ‘Once Upon a Time’. This nostalgic poem was crafted by Gabriel Okara.

Context and Critical Analysis: The given words form the last three lines of the first stanza of the poem. They project the picture of modern times. Smiles do not come from the heart. Only visible teeth tell us that it is their laughter. The eyes are emotionless. They are cold. This is quite opposite to the hearty laughter of the past. The words expose the pathetic state of present times.

Comment: ‘But’ is the operative word. It brings in the stark contrast between the past and the present. The poet’s regretful tone is striking here.

కవిత మరియు కవి : ఇచ్చిన కదిలించే పదాలు పరిశీలనాత్మక కవిత ‘వన్స్ అపాన్ ఎ టైమ్’లోనివి. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొనే ఈ గేయ రూపకల్పన చేసినవారు గేబ్రియేల్ ఒకారా.

సందర్భం మరియు విమర్శనాత్మక విశ్లేషణ : ఇచ్చిన పదాలు కవిత యొక్క మొదటి స్టాంజాలోని చివరి మూడు పంక్తులు. అవి ఆధునిక కాల చిత్రాన్ని . మనకు సమర్పిస్తున్నాయి. చిరునవ్వులు మనసులోంచి రావు. మనకు కన్పించేవారి పళ్ళు చెబుతాయి వారు నవ్వుతున్నారని. కళ్ళల్లో భావోద్వేగాలు కనిపించవు. అవి ప్రేమరహితంగా, మరియు నిర్లిప్తత నిలయాలుగా ఉంటాయి. ఇది పాత కాలపు మనఃపూర్వక, ఆప్యాయతా భరిత నవ్వుకు పూర్తి భిన్నం. ప్రస్తుత కాలపు దయనీయ స్థితిని ఈ పదాలు బహిర్గతం చేస్తున్నాయి.

వ్యాఖ్య : ‘కానీ’ అనే పదం ఇక్కడ కీలకం. గతానికి, ప్రస్తుతానికి ఉన్న తీవ్ర తేడాలను ఆ పదం స్పష్టం చేస్తుంది. కవి యొక్క పశ్చాత్తాప శైలి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

Once Upon a Time Annotations Questions and Answers

Question 3.
I have learned to wear many faces like dresses: homeface, officeface, streetface, hostface, cocktailface…
Answer:
The Poem and the Poet: The given touching words occur in the reflective poem ‘Once Upon a Time’. This nostalgic poem was crafted by Gabriel Okara.

Context and Critical Analysis: Okara continues his biting criticism of the hypocrisy of our times. He declares that those bad manners have infected him too. He too learnt to wear many faces. Homeface, officeface and streetface are some of them. It shows insincerity. Pretending to be what we are not is very bad. But that is the order of the day.

Comment: The words reveal the speaker’s regretful tone. They highlight what NOT to be. Repetition serves a valu- able purpose here.

కవిత మరియు కవి: ఇచ్చిన కదిలించే పదాలు పరిశీలనాత్మక కవిత ‘వన్స్ అపాన్ ఎ టైమ్’లోనివి. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొనే ఈ గేయ రూపకల్పన చేసినవారు గేబ్రియేల్ ఒకారా.

సందర్భం మరియు విమర్శనాత్మక విశ్లేషణ : ఆధునిక కాలపు ఆత్మవంచనా భరిత ప్రవర్తనను తీవ్రంగా తప్పు పడుతున్నారు కవి. ఆ తప్పుడు ప్రవర్తనా విధానాలు తనకూ అంటుకున్నాయని కథకుడు ఒప్పుకుంటున్నారు. ఆయన కూడా భిన్న ముఖాలను తగిలించుకోవటం అలవరుచుకున్నారు. ఇంటి ముఖము, కార్యాలయ ముఖము, బజారు ముఖము ఆ వివిధ ముఖాలలో కొన్ని. ఆ ముసుగు ధారణ మనలోని కపటాన్ని సూచిస్తుంది. మనం కాని వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడం చాలా చెడ్డది. కానీ ఆ తప్పుడు విధానమే నేటి నియమం అయింది.

వ్యాఖ్య : ఇచ్చిన పదాలు కథకుడి పశ్చాత్తాప ధోరణిని తెలుపుతున్నాయి. ఎలా ఉండకూడదో ఈ పదాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. పునరుక్తి ఇక్కడ ఒక గొప్ప పనిని చేస్తుంది.

Question 4.
But believe me, son. I want to be what I used to be when I was like you. I want to unlearn all these muting things.
Answer:
The Poem and the Poet: The given touching words occur in the reflective poem ‘Once Upon a Time’. This nostalgic poem was crafted by Gabriel Okara.

Context and Critical Analysis: Okara contrasts the honesty of the past with the hypocrisy of the present. Then he presents his desire. He wants to unlearn all those insincere manners. They silence his true self. So he tells his son that he wants to be what he was once. The words, ‘believe me ‘, emphasise his intention. His determination is to cast off his artificiality.

Comment: The words seek to give voice to the suppressed original nature. The desire to unlearn all that is bad to relearn all that is good is a lesson for all.

కవిత మరియు కవి : ఇచ్చిన కదిలించే పదాలు పరిశీలనాత్మక కవిత ‘వన్స్ అపాన్ ఎ టైమ్’లోనివి. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొనే ఈ గేయ రూపకల్పన చేసినవారు గేబ్రియేల్ ఒకారా.

సందర్భం మరియు విమర్శనాత్మక విశ్లేషణ: ఒకారా గత కాలపు నిజాయితీతో నేటి కాలపు ఆత్మవంచన (నటన)ను పోల్చి, తేడాలను మనకు ‘తెలుపుతున్నారు. తదుపరి తన మనసులోని మాటను (కోరికను) వివరిస్తున్నారు. నేటి నటనా భరిత కృత్రిమ ప్రవర్తనా విధానాలను మరిచి పోవాలనుకుంటున్నారు. అవి తన నిజ వ్యక్తిత్వాన్ని నిశ్శబ్దం చేస్తున్నాయి (అణగద్రొక్కుతున్నాయి). అందుకే అతను తన కుమారుడితో తాను గతంలో ఎలా నిజాయితీగా ఉన్నాడో అలా మారాలనుకుంటున్నట్లు చెబుతాడు. “నన్ను నమ్ము” అన్న మాటలు ఆయన ఉద్దేశ్యాన్ని నొక్కి చెబుతున్నాయి. ఆయన దృఢ నిశ్చయం ప్రస్తుత కృత్రిమత్వాన్ని దులిపేసుకోవాలని.

వ్యాఖ్య : ఈ మాటలు గొంతు నొక్కివేయబడిన సహజ నైజానికి కొత్త కంఠాన్ని ఇస్తున్నాయి. చెడును వదిలించుకొని, మంచిని అలవరుచు కోవాలనుకొనే కోరిక అందరికి ఒక పాఠం !

Once Upon a Time Questions and Answers

Answer the following questions in about 150 words each.

Question 1.
How does Once Upon a Time explore the theme of loss of innocence?
Answer:
Introduction: Gabriel Okara is renowned the world over as a poet and novelist. His works reflect his love for traditions and human values. His flair to combine African thought with English expression makes him dear to his readers. ‘Once Upon a Time’ is Okara’s nostalgic poem. It is at once reflective and regretful. It uses simple but symbolic style. And the message is profound. It condemns hypocrisy. It plans to promote innocence. The conversational tone drives home the message forcefully.

Main Answer: Okara’s ‘Once Upon a Time’ deals with multiple themes. The loss of innocence is the major theme. The speaker highlights how they were innocent once upon a time. He contrasts that innocence with today’s artificiality. He repeatedly laments the loss of innocence. He craves to regain that lost original self. Thus we see the theme of innocence pervade all through the poem, right from the title to the bottom line.

ఉపోద్ఘాతం : గేబ్రియేల్ ఒకారా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కవి మరియు నవలా రచయిత. ఆయన రచనలు సాంప్రదాయాల, మానవ విలువల పట్ల ఆయనకు ఉన్న మక్కువను తెలుపుతాయి. ఆఫ్రికన్ ఆలోచనను, ఆంగ్లేయ వ్యక్తీకరణను సమ్మిళతం చేయగల ఆయన ప్రతిభ ఆయనను పాఠకుల ప్రేమకు పాత్రుణ్ణి చేస్తుంది. ‘వన్స్ అపాన్ ఎ టైమ్’ ఒకారా యొక్క గతాన్ని గుర్తు తెచ్చుకునే కవిత. అది ఆలోచనాత్మకము మరియు పశ్చాత్తాపభరితము. అది సులభ మరియు సూచనాత్మక శైలిని అనుసరిస్తుంది. సందేశం చాలా గంభీరం మరియు లోతైనది. ఆత్మవంచనను ఖండిస్తుంది. నిష్కల్మష, నిష్కపట అమాయకత్వాన్ని పెంపొందించే ప్రణాళిక ఈ పద్యానిది. సంభాషణ రూపం కవిత సందేశాన్ని బలంగా పాఠకుల మదిలోకి చేరవేస్తుంది.

ప్రధాన సమాధానం : ఒకారా కవిత ‘వన్స్ అపాన్ ఎ టైమ్’ భిన్న కథాంశాలను చర్చిస్తుంది. అమాయకత్వాన్ని కోల్పోవడం అందులో ప్రధాన అంశం. గతంలో ప్రజలు ఎలా కల్లాకపటం లేకుండా, నిష్కల్మషంగా, అమాయకంగా ఉండే వారో నొక్కి చెబుతుంది ఈ గేయం. ఆయన అప్పటి అమాయకత్వాన్ని నేటి ఆత్మవంచనతో పోల్చి, తేడాను స్పష్టంగా చూపుతున్నారు. కోల్పోయిన అమాయకత్వం గురించిన తన విచారాన్ని, బాధను పదే, పదే తెలుపుతున్నారు. పోగొట్టుకున్న తన సహజ వ్యక్తిత్వాన్ని తిరిగి పొందాలనుకునే తన బలమైన కోరికను వ్యక్తీకరిస్తున్నారు. ఈ విధంగా కవిత నామధేయం నుండి చివరి పంక్తి వరకు సర్వత్రా విస్తరించిన ‘అమాయకత్వం ప్రాధాన్యతను’ మనం ప్రస్ఫుటంగా చూడవచ్చు.

Once Upon a Time Annotations Questions and Answers

Question 2.
In what ways does the poem portray the difference between childhood sincerity and adult hypocrisy?
Answer:
Introduction: Gabriel Okara is renowned the world over as a poet and novelist. His works reflect his love for traditions and human values. His flair to combine African thought with English expression makes him dear to his readers. ‘Once Upon a Time’ is Okara’s nostaligic poem. It is at once reflective and regretful. It uses simple but symbolic style. And the message is profound. It condemns hypocrisy. It plans to promote innocence. The conversational tone drives home the message forcefully.

Main Answer: Okara’s ‘Once Upon a Time’ portrays the difference between childhood innocence and adult hypocrisy. The opening lines picture the warmth, honesty, and originality of childhood. The following stanzas expose the insincere, cold, and artificial manners of adults. The contrast thus becomes not only conspicuous but also effective. This visible variation between innocence and hypocrisy serves a valuable purpose. That we see openly in the last lines, when the speaker expresses his desire to relearn those warm manners.

ఉపోద్ఘాతం : గేబ్రియేల్ ఒకారా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కవి మరియు నవలా రచయిత. ఆయన రచనలు సాంప్రదాయాల, మానవ విలువల పట్ల ఆయనకు ఉన్న మక్కువను తెలుపుతాయి. ఆఫ్రికన్ ఆలోచనను, ఆంగ్లేయ వ్యక్తీకరణను సమ్మిళతం చేయగల ఆయన ప్రతిభ ఆయనను పాఠకుల ప్రేమకు పాత్రుణ్ణి చేస్తుంది. ‘వన్స్ అపాన్ ఎ టైమ్’ ఒకారా యొక్క గతాన్ని గుర్తు తెచ్చుకునే కవిత. అది ఆలోచనాత్మకము మరియు పశ్చాత్తాపభరితము. అది సులభ మరియు సూచనాత్మక శైలిని అనుసరిస్తుంది. సందేశం చాలా గంభీరం మరియు లోతైనది. ఆత్మవంచనను ఖండిస్తుంది. నిష్కల్మష, నిష్కపట అమాయకత్వాన్ని పెంపొందించే ప్రణాళిక ఈ పద్యానిది. సంభాషణ రూపం కవిత సందేశాన్ని బలంగా పాఠకుల మదిలోకి చేరవేస్తుంది.

ప్రధాన సమాధానం : ఒకారా కవిత ‘వన్స్ అపాన్ ఎ టైమ్’ పసితనపు అమాయకత్వానికి మరియు పెద్దవారి ఆత్మవంచనకు మధ్య ఉన్న తేడాను చిత్రిస్తుంది. ప్రారంభపు పంక్తులు చిన్నారుల ఆప్యాయతను, నిజాయితీని మరియు సహజత్వాన్ని వర్ణిస్తాయి. తదుపరి పద్యభాగాలు పెద్దవారి కపట, కల్మష, ఆత్మవంచనా భరిత కృత్రిమ ప్రవర్తనను బహిర్గతం చేస్తాయి. తద్వారా రెండింటి మధ్య భిన్నత్వం ప్రస్ఫుటము మరియు ప్రభావవంతము అవుతుంది. ఈ సుస్పష్ట వైరుధ్యం (అమాయకత్వానికి మరియు ఆత్మవంచనకు మధ్య) ఒక విలువైన ఆశయాన్ని (లక్ష్యాన్ని) నెరవేరుస్తుంది. దానిని మనం చివరి పంక్తులలో స్పష్టంగా చూస్తాము. కథకుడు తన చిన్ననాటి ఆప్యాయతా భరిత అలవాట్లను తిరిగి నేర్చుకోవాలని అనుకుంటాడు.

Question 3.
How is pretence in human relationships presented in the poem? Give examples.
Answer:
Introduction: Gabriel Okara is renowned the world over as a poet and novelist. His works reflect his love for traditions and human values. His flair to combine African thought with English expression makes him dear to his readers. ‘Once Upon a Time’ is Okara’s nostalgic poem. It is at once reflective and regretful. It uses simple but symbolic style. And the message is profound. It condemns hypocrisy. It plans to promote innocence. The conversational tone drives home the message forcefully.

Main Answer: Okara’s poem ‘Once Upon a Time’ is biting criticism of pretence in human relationships. It is exposed in the poem repeatedly. ‘… laugh with their teeth’ is the first instance. Their ‘ice-block-cold eyes’ is another example. Handshakes that are not genuine are other illustrations. Greetings that say one thing and mean the opposite are the ultimate proof of pretence. And wearing multiple ‘masks’ (faces) is the crux of hypocrisy. With that, the condemnation culminates into the climax.

ఉపోద్ఘాతం : గేబ్రియేల్ ఒకారా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కవి మరియు నవలా రచయిత. ఆయన రచనలు సాంప్రదాయాల, మానవ విలువల పట్ల ఆయనకు ఉన్న మక్కువను తెలుపుతాయి. ఆఫ్రికన్ ఆలోచనను, ఆంగ్లేయ వ్యక్తీకరణను సమ్మిళతం చేయగల ఆయన ప్రతిభ ఆయనను పాఠకుల ప్రేమకు పాత్రుణ్ణి చేస్తుంది. ‘వన్స్ అపాన్ ఎ టైమ్’ ఒకారా యొక్క గతాన్ని గుర్తు తెచ్చుకునే కవిత. అది ఆలోచనాత్మకము మరియు పశ్చాత్తాపభరితము. అది సులభ మరియు సూచనాత్మక శైలిని అనుసరిస్తుంది. సందేశం చాలా గంభీరం మరియు లోతైనది. ఆత్మవంచనను ఖండిస్తుంది. నిష్కల్మష, నిష్కపట అమాయకత్వాన్ని పెంపొందించే ప్రణాళిక ఈ పద్యానిది. సంభాషణ రూపం కవిత సందేశాన్ని బలంగా పాఠకుల మదిలోకి చేరవేస్తుంది.

ప్రధాన సమాధానం : మానవ సంబంధాలలో ఆత్మవంచనను అతి తీవ్రంగా విమర్శిస్తుంది ఒకారా కవిత ‘వన్స్ అపాన్ ఎ టైమ్’. ఆ కపటాన్ని, నటనను ఈ కవిత పదే, పదే ఎత్తి చూపి దెప్పిపొడుస్తుంది. ‘పళ్ళెల్ల బెట్టి నవ్వటం’ మొదటి ఉదంతం. ‘ద్వేషభరిత, ప్రేమరహిత కళ్ళు’ మరొక ఉదాహరణ. ‘ఆప్యాయత లోపించిన కరచాలనం’ ఇంకొక వివరణ. ఇక పలకరింపులు పైకొక అర్థం లోన మరొక గూఢార్థం కలిగి ఉండటం పతాక స్థాయి మనుషుల నటనకు ! భిన్న ముఖాల ధారణ ఆత్మవంచనకు కేంద్ర బిందువు. ఈ విధంగా ఖండన తన అంతిమ గమ్యస్థాయిని అందుకుంటుంది !

Leave a Comment