Students always start with AP Board Solutions Class 12 English and My Vocation Summary in English Telugu for seamless learning.
My Vocation Summary in Telugu & English
My Vocation Summary in English
Pierre Jean de Beranger was a famous French poet whose poem was translated into English as ‘My Vocation’. Toru Dutt rendered it into English without surrendering the original spirit. Poetry is the speaker’s vocation. It has divine sanction. The speaker is neglected. God orders to seek company in singing – creating poetry. The wealthy and the powerful humiliate the narrator. Destiny’s message is to find dignity in creativity. To survive, the speaker takes up toil. Fate advises to find relaxation in recital.
Love and youth cheered the narrator, but they soon faded away. But the reply repeated: Poetry is your permanent power. And the narrator reconciles herself to divinity’s design. Everyone has a job. The calling that beckons the speaker is creative art – composing poetry. The poet’s personal lament turns into a universal and everlasting message. Resilience and spiritual support helps one overcome struggles. Art becomes the sustaining force amid sufferings. External things may pass by but internal strength stays on!
![]()
My Vocation Summary in Telugu
పెయర్ జహన్ డె బెరాహన ప్రఖ్యాత ఫ్రెంచ్ కవి. ఆయన కవిత ఆంగ్లంలోకి అనువదించబడింది ‘మై వొకెఇషన్’ పేరుతో అనువాదకురాలు ప్రముఖ భారతీయ కవయిత్రి తోరు దత్. ఫ్రెంచ్ కవిత సంపూర్ణ స్ఫూర్తిని అదనపు జీవంతో ఆంగ్లంలోకి అందించగలిగిన ధీశాలి తోరు దత్. కవితా రచన కథకురాలి వృత్తి, ప్రవృత్తి కూడా. ఆ పనికి ఆమెకు దైవిక అనుమతి ఉంది. కథకురాలిని ఎవరూ ఆదరించడం లేదు అని విచారిస్తుంది. భగవంతుడు కవిత్వమే నీ ఆప్యాయ సహచరి; కవితా ప్రవాహాన్ని సృష్టించు అంటారు. సంపన్నులు, అధికారులు కథకురాలిని పదే, పదే అవమానిస్తారు. అయితే విధి మళ్ళీ అంటుంది : సృజనాత్మకతలో హుందాతనం కనుగొనమని ! జీవనోపాధికై కథకురాలు కఠోర శ్రమతో కూడిన పని చేపడుతుంది. దైవం మళ్ళీ అంటుంది కవితా గానంలో విశ్రాంతి పొందమని ప్రేమ, యవ్వనం కథకురాలికి కొంత ఆనందాన్ని అందిస్తాయి.
కాని అవి అనతికాలంలోనే అంతర్ధానమవుతాయి. మళ్ళీ పై నుండి అదే సమాధానం: కవిత్వమే నీ శాశ్వత శక్తి, సహచరి ! విధి నిర్ణయానికి కథకురాలు సమాధాన పడుతుంది. సంతృప్తి చెందుతుంది. కవితా సృష్టిని తన ఉపాధిగా స్వీకరిస్తుంది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఉపాధి మాదిరిగానే, కవిత్వం తన వ్యాపకం, జీవనాధారం అని నిర్ణయించుకుంటుంది. కథకురాలి విచారానికి విశ్వవ్యాప్త అన్వయం ఉంది. అదే అన్ని కాలాలకు, అన్ని ప్రాంతాలకు వర్తించే సందేశమవుతుంది. నిబ్బరం; కష్టాలకు ఎదురొడ్డి నిలబడటము; దైవ కృప – దుఃఖాన్ని అధిగమించడానికి సోపానాలు. కష్టాల కడలిలో ఆధారాన్ని అందించేది కళ. బాహ్య అంశాలు అంతరించిపోతాయి. కాని అంతర్గత శక్తి అంతం వరకు అంటి పెట్టుకొనే ఉంటుంది మనని !
My Vocation Word Meanings
vocation (n) /vəυ’keI∫on/ (వఉకెఇషన్) an occupation; a calling; ఉపాధి మార్గము; ఉద్యోగము; వృత్తి
waif (n) /weIf/ (వెఇఫ్) an orphan; a homeless and neglected person; అనాథ; నిరాశ్రయుడు
contemned (v-pp/adj) /kən’temnd/ (కంటె మెన్ డ్) hated; despised; అసహ్యించుకోబడిన; ద్వేషించబడిన
anguish (noun) /’ængwif/ (యాంగ్విష్) intense emotional pressure; stress; pain; తీవ్ర భావోద్వేగం; ఆందోళన, బాధ
wring (v) /rɪŋ/ (రింగ్) squeeze; twist; పిండివేయు; మెలిపెట్టు
chant (v) /t∫a:nt/ (చాన్ ట్) sing; recite; పాడు; ఆలపించు
poor little thing (phrase) refers to the speaker; as addressed by God; కథకురాలిని దేవుడు ఉద్దేశించి పిలిచిన తీరు
Wealth (n) /welθ/ (వెల్త్) riches; సంపద. But here rich persons = సంపన్నులు
coach (n) /kəʊʧ/ (కఉచ్) a carriage; a car; వాహనము
besmeared (v-pp) /bI’smIə(r) d/ (బిస్మిఅ(ర్)డ్) covered with mud, dirt etc; మురికితో, బురదతో మరకలు చేయబడిన
jeered (v-pp) /ʤɪəd(r)d/ (జిఅ(ర్)డ్) mocked; హేళన చేయబడిన
minions (n-pl) /’minjənz/ (మిన్యన్జజ్) persons serving others; ఇతరులకు సేవ చేయువారు Here : minions of power = అధికారంలో ఉన్నవారు – (ధనవంతులు, అధికారులు కథకురాలిని అవమా నిస్తున్నారు, హేళన చేస్తున్నారు)
![]()
fright (n) /fraIt/ (ఫ్రైట్) sudden fear; ఆకస్మిక, తీవ్ర భయము
drudge (n) /drʌʤ/(డ్రడ్జ్) someone who works very hard for meagre pay; తక్కువ ప్రతిఫలానికి చాలా కఠిన శ్రమపడే వ్యక్తి
clipped (v-pp = adj) /klipt/ (క్లిప్ట్) cut; కత్తిరించి వేయబడిన
ripple (n) /’ripǝl/(రిప్పల్) a wavy motion; ee (short-lived; త్వరగా అంతరించేది)
fled (v-pt of ‘flee’) /fled/ (ఫ్లెడ్) ran away; పారిపోయెను
spring (n) /sprɪŋ/ (స్ప్రింగ్) name of a season; వసంత ఋతువు; symbol of joy; ఆనంద చిహ్నము; here = happiness
lot (n) /lot/(లొట్) fate; destiny; విధి; తలరాత
meed (n) /mi:d/ (మీడ్) return; reward; 30; బహుమతి