Andhra Pradesh BIEAP AP Inter 2nd Year English Study Material Pdf and Kindly Adjust to Our English Annotations Questions and Answers Pdf.
AP Inter 2nd Year English Kindly Adjust to Our English Questions and Answers Annotations
Kindly Adjust to Our English Annotations Pdf
Contextual Questions
Answer the following contextual questions in the given pattern.
a) Identify the essay and name the author of the given lines.
b) Discuss the context of the lines and appreciate them critically in about 75 words.
Question 1.
“If Americans can say ‘fall’ for autumn and ‘gotten’ for ‘have got’, why can’t Indians say ‘do the needful’ ?”
Answer:
The Article and the Author: We see the given words in the insightful article “Kindly Adjust to our English”. It was crafted by Shashi Tharoor, a noted Indian creative genius. The prescribed piece projects Shashi Tharoor as a writer with wit, humour, and rich vocabulary as his ready assets. While celebrating the uniqueness and creativity of Indian English, he impartially points out its shortcomings. ample number relevant examples support his stand and convince readers of his argument.
Context and Critical Analysis: Tharoor opens the write-up with a reference to the word ‘prepone’. He says it is an Indianism. He asserts that Indian English deserves serious consideration. He equates Indian English with American variant. He highlights the uniqueness and creative anglé of Indian English. He supports his arguments with relevant examples. ‘Fall’ and ‘gotten’ are typical American expressions accepted by the world.
Comment: Tharoor’s words emphasise the value of dignity and self-respect. They also demand equality. The words reveal Tharoor’s respect for values.
వ్యాసం మరియు రచయిత: ఇచ్చిన పదాలను మనము నిశిత పరిశీలనకు నిలయమైన వ్యాసము ‘కైండ్ అడస్ట్ టు అవర్ ఇంగ్లీష్’లో చూస్తాము. దాని రూపశిల్పి ప్రఖ్యాతిగాంచిన భారతీయ సృజనాత్మక మేధావి శశి థరూర్. నిర్దేశిత పాఠ్యాంశం శశి థరూరు చతురత, హాస్యము, సుసంపన్న పద సముదాయము సంపదలుగా కల రచయితగా చూపుతుంది. భారతీయ ఆంగ్లం యొక్క ప్రత్యేకత మరియు సృజనాత్మకతలను స్తుతిస్తూనే, దానిలోని లోపాలను నిష్పాక్షికంగా ఎత్తి చూపుతారు ఆయన. సందర్భోచిత ఉదాహరణలను ఎక్కువ సంఖ్యలో ఉటంకిస్తారు తన వాదనకు మద్దతుగా మరియు తన అభిప్రాయాన్ని పాఠకులు ఆమోదించేలా !
సందర్భము మరియు విమర్శనాత్మక విశ్లేషణ : థరూర్ ఈ రచనను ‘ప్రిపఉన్’ అనే పద వివరణతో ప్రారంభిస్తారు. ఆ పదం భారతీయుల సృష్టి కావున భారతీయ ప్రయోగము అంటారు. భారతీయ ఆంగ్లానికి ప్రపంచం గంభీరంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అర్హత ఉంది అంటారు. భారతీయ ఆంగ్లము అమెరికనుల ఆంగ్లానికి సమానమే అంటారు. భారతీయ ఆంగ్లం యొక్క ప్రత్యేకతను, సృజనాత్మకను గొప్పగా పేర్కొంటున్నారు థరూర్. తను పేర్కొన్న ప్రతి అంశానికి నిరూపణగా సంబంధిత ఉదాహరణలను ఉటంకిస్తున్నారు వారు. ‘ఫాల్’ మరియు ‘గొటెన్’ లాంటివి ప్రపంచం ఆమోదించిన అమెరికన్ ప్రయోగాలు.
వ్యాఖ్య : థరూర్ పదాలు ఆత్మగౌరవం మరియు హుందాతనంల విలువను ప్రముఖంగా చూపుతున్నాయి. అవి సమానత్వాన్ని బలంగా కోరుకుంటున్నాయి. విలువల పట్ల థరూర్కు ఉన్న గౌరవాన్ని బహిర్గతం చేస్తున్నాయి ఈ పదాలు.
![]()
Question 2.
“Some Indian English was created by our media ‘airdash’ and ‘history sheeter’.”
Answer:
The Article and the Author: We see the given words in the insightful article “Kindly Adjust to our English”. It was crafted by Shashi Tharoor, a noted Indian creative genius. The prescribed piece projects Shashi Tharoor as a writer with wit, humour, and rich vocabulary as his ready assets. While celebrating the uniqueness and creativity of Indian English, he impartially points out its shortcomings. ample number relevant examples support his stand and convince readers of his argument.
Context and Critical Analysis: Tharoor explains that Indianisms have different roots. He elaborates each source with example words. Here, he talks about the contributions of media to Indianisms. Two such words are ‘airdash’ and ‘history sheeter’. ‘Airdash’ refers to fast travel by air. ‘Frequent offenders’ are ‘history sheeters’. And Tharoor goes on enlisting examples from other areas.
Comment: The words show Tharoor’s keen insight, careful analysis and systematic presentation. That adds to the credibility of the argument.
వ్యాసం మరియు రచయిత : ఇచ్చిన పదాలను మనము నిశిత పరిశీలనకు నిలయమైన వ్యాసము ‘కైండ్ అడస్ట్ టు అవర్ ఇంగ్లీష్’లో చూస్తాము. దాని రూపశిల్పి ప్రఖ్యాతిగాంచిన భారతీయ సృజనాత్మక మేధావి శశి థరూర్. నిర్దేశిత పాఠ్యాంశం శశి థరూరన్ను చతురత, హాస్యము, సుసంపన్న పద సముదాయము సంపదలుగా కల రచయితగా చూపుతుంది. భారతీయ ఆంగ్లం యొక్క ప్రత్యేకత మరియు సృజనాత్మకతలను స్తుతిస్తూనే, దానిలోని లోపాలను నిష్పాక్షికంగా ఎత్తి చూపుతారు ఆయన. సందర్భోచిత ఉదాహరణలను ఎక్కువ సంఖ్యలో ఉటంకిస్తారు తన వాదనకు మద్దతుగా మరియు తన అభిప్రాయాన్ని పాఠకులు ఆమోదించేలా !
సందర్భం మరియు విమర్శనాత్మక విశ్లేషణ : భారతీయ ఆంగ్ల ప్రయోగాలకు విభిన్న మూలాలున్నాయని థరూర్ వివరిస్తున్నారు. ఆయన ప్రతి మూలాన్ని ఉదాహరణ పదాలతో విశదీకరిస్తున్నారు. ఇక్కడ వారు భారతీయ ఆంగ్ల పదాలకు పత్రికా రంగం అందించిన జాబితాను పేర్కొంటున్నారు. అలాంటివి రెండు : ‘ఎఇర్ డ్యాష్’ మరియు ‘హిస్టరి షీటర్’. వేగంగా విమానయానం చేయడం ‘ఎఇర్ డ్యాష్’, మరియు తరచుగా నేరాలకు పాల్పడేవారు ‘హిస్టరి షీటర్స్’. అదే మాదిరిగా ఇతర రంగాల నుంచి ఉద్భవించిన పదాల జాబితా ఇస్తున్నారు.
వ్యాఖ్య : ఈ పదాలు థరూర్ యొక్క నిశిత పరిశీలనను, శ్రద్ధా భరిత విశ్లేషణను మరియు క్రమానుగత వ్యక్తీకరణను సూచిస్తున్నాయి. ఈ లక్షణాలన్ని ఆయన వాదనకు విశ్వసనీయతను అందిస్తున్నాయి.
Question 3.
“What is your good name? is still the most polite form, in any version of English, for finding out the identity of your interlocutor.”
Answer:
The Article and the Author: We see the given words in the insightful article “Kindly Adjust to our English”. It was crafted by Shashi Tharoor, a noted Indian creative genius. The prescribed piece projects Shashi Tharoor as a writer with wit, humour, and rich vocabulary as his ready assets. While celebrating the uniqueness and creativity of Indian English, he impartially points out its shortcomings: example number relevant examples support his stand and convince readers of his argument.
Context and Critical Analysis: Shashi Tharoor keeps on explaining various Indianisms and their origins. One such wonderful phrase is ‘good name’. Native English speakers do not use this phrase. ‘Good name’ has its roots in Bengali. In that language, people use ‘bhalo naam’ to find out the formal name of a person. Now the phrase ‘good name’ is regarded as the most polite form to seek the listener’s name.
Comment: The words reveal Tharoor’s scientific approach in analysing different expressions and their origins. They show to learners a new path to study any subject.
వ్యాసం మరియు రచయిత : ఇచ్చిన పదాలను మనము నిశిత పరిశీలనకు నిలయమైన వ్యాసము ‘కైండ్ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్’లో చూస్తాము. దాని రూపశిల్పి ప్రఖ్యాతిగాంచిన భారతీయ సృజనాత్మక మేధావి శశి థరూర్. నిర్దేశిత పాఠ్యాంశం శశి థరూరన్ను చతురత, హాస్యము, సుసంపన్న పద సముదాయము సంపదలుగా కల రచయితగా చూపుతుంది. భారతీయ ఆంగ్లం యొక్క ప్రత్యేకత మరియు సృజనాత్మకతలను స్తుతిస్తూనే, దానిలోని లోపాలను నిష్పాక్షికంగా ఎత్తి చూపుతారు ఆయన. సందర్భోచిత ఉదాహరణలను ఎక్కువ సంఖ్యలో ఉటంకిస్తారు తన వాదనకు మద్దతుగా మరియు తన అభిప్రాయాన్ని పాఠకులు ఆమోదించేలా !
సందర్భం మరియు విమర్శనాత్మక విశ్లేషణ : థరూర్ భారతీయ ఆంగ్లంలో వినియోగించబడుతున్న వివిధ ప్రయోగాల పుట్టుకను వివరిస్తున్నారు. అలాంటి ఒక అద్భుత పద బంధం ‘గుడ్ నెఇమ్’. ఆంగ్లభాష మాతృభాషగా కల ఆంగ్లేయులు ఈ ప్రయోగాన్ని వాడరు. అయితే దీని మూలాలు బెంగాలి భాషలో ఉన్నాయి. బెంగాలీయులు ‘భాలో నామ్’ (గుడ్ నెఇమ్) అనే ప్రయోగాన్ని ఎదుటివారి లాంఛనప్రాయ పేరు (ముద్దు పేరు కాకుండా) ను తెలుసుకోవడానికి వాడుతారు. ఇప్పుడు ‘గుడ్ నెమ్’ అనే పదబంధం శ్రోత యొక్క పేరు తెలుసుకోవడానికి అత్యంత మర్యాదకర ప్రయోగంగా గుర్తింపు పొందింది.
వ్యాఖ్య : వివిధ పదబంధాలను, వాని మూలాలను వివరించటంలో థరూర్ పాటిస్తున్న శాస్త్రీయ పద్ధతిని తెలుపుతున్నాయి ఈ పదాలు. ఏ అంశాన్నైనా అధ్యయనం చేయాలనుకునేవారికి అవి మార్గదర్శకాలు.
Question 4.
“But acknowledging the legitimacy of Indian English doesn’t mean that anything goes.”
Answer:
The Article and the Author: We see the given words in the insightful article “Kindly Adjust to our English”. It was crafted by Shashi Tharoor, a noted Indian creative genius. The prescribed piece projects Shashi Tharoor as a writer with wit, humour, and a rich vocabulary as his ready assets. While celebrating the uniqueness and creativity of Indian English, he impartially points out its shortcomings. An ample number relevant examples support his stand and convince readers of his argument.
Context and Critical Analysis: Tharoor sings the glory of Indian English. He celebrates its uniqueness and creativity. He delves deep into the details of various Indian formulations and their origins. Yet, he sees the other side of the coin too. While he seeks universal approval and appreciation for Indian English, he warns Indians against making mistakes. One can not expect ‘anything’ to ‘go’. He is against expressions like ‘I will return back’.
Comment: Tharoor’s objective observation and impartial judgement are evident here.
వ్యాసం మరియు రచయిత : ఇచ్చిన పదాలను మనము నిశిత పరిశీలనకు నిలయమైన వ్యాసము ‘కైండ్ అడస్ట్ టు అవర్ ఇంగ్లీష్’లో చూస్తాము. దాని రూపశిల్పి ప్రఖ్యాతిగాంచిన భారతీయ సృజనాత్మక మేధావి శశి థరూర్. నిర్దేశిత పాఠ్యాంశం శశి థరూరన్ను చతురత, హాస్యము, సుసంపన్న పద సముదాయము సంపదలుగా కల రచయితగా చూపుతుంది. భారతీయ ఆంగ్లం యొక్క ప్రత్యేకత మరియు సృజనాత్మకతలను స్తుతిస్తూనే, దానిలోని లోపాలను నిష్పాక్షికంగా ఎత్తి చూపుతారు ఆయన. సందర్భోచిత ఉదాహరణలను ఎక్కువ సంఖ్యలో ఉటంకిస్తారు తన వాదనకు మద్దతుగా మరియు తన అభిప్రాయాన్ని పాఠకులు ఆమోదించేలా !
సందర్భం మరియు విమర్శనాత్మక విశ్లేషణ : భారతీయ ఆంగ్ల ఔన్నత్యాన్ని థరూర్ గొప్పగా గానం చేస్తున్నారు. దాని యొక్క ప్రత్యేకతను మరియు సృజనాత్మకతను స్తుతిస్తున్నారు. భారతీయ ఆంగ్ల ప్రయోగాల మూలాల లోతులకు వెళ్ళి వివరాలను శోధిస్తున్నారు. అయినప్పటికీ, ఆయన నాణెం ఆవలి వైపును కూడా చూస్తున్నారు. భారతీయ ఆంగ్లానికి విశ్వ వ్యాప్త ఆమోదాన్ని, అభినందనను ఆశిస్తూనే, భారతీయులను ఆంగ్ల ఉపయోగాలలో తప్పులు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఏ రకంగా ఆంగ్లాన్ని వాడినా నడుస్తుంది అనుకోవద్దు అంటున్నారు. ‘ఐ విల్ రిటర్న్ బ్యాక్’ లాంటి తప్పుడు ప్రయోగాలను ఆయన వ్యతిరేకిస్తున్నారు.
వ్యాఖ్య : థరూర్ యొక్క భావోద్వేగ రహిత, వాస్తవిక పరిశీలనను, నిష్పాక్షిక తీర్పును ప్రతిబింబిస్తున్నాయి ఈ పదాలు.
![]()
Kindly Adjust to Our English Questions and Answers
Answer the following questions in about 150 words each.
Question 1.
Why does Shashi Tharoor argue that Indian English should be seen as a legitimate variety of English?
Answer:
Introduction: Shashi Tharoor is one of the most prominent public personalities of India. He is an intellectual, thinker, and administrator of worldwide reputation. As an author, he won laurels for his wit, humour, fluency, and rich vocabulary. His insightful article ‘Kindly Adjust to our English’ proves Tharoor as a man with keen observation and clear expression. The essay sings the glory of Indian English. It celebrates the uniqueness and creativity of Indian English.
Main Answer: Shashi Tharoor first explains how some Indianisms have come into existence. He then shows that Indian English is evolving as a true living language. He adds that practical needs, sentiments, linguistic variety, social practices, and culture compel us to coin new expressions. He advocates for their legitimacy. He draws an analogy between the American and Indian variants. He reasons that Indian English deserves acceptance on par with American variety. Thus, Tharoor builds a strong case for the approval and appreciation of Indian English.
ఉపోద్ఘాతం : భారతదేశానికి చెందిన అత్యంత ప్రాధాన్యత కల ప్రజారంగంలో ఉన్న వ్యక్తులలో శశి థరూర్ ఒకరు. ఆయన విశ్వవ్యాప్త ఖ్యాతి గాంచిన మేధావి, ఆలోచనాపరుడు మరియు పరిపాలకుడు. ఒక రచయితగా తన చతురత, హాస్యం, ధారాళత మరియు సుసంపన్న పద సంపదకు పుష్కలంగా అభినందనలు పొందారు. ఆయన యొక్క నిశిత పరిశీలనాత్మక వ్యాసం ‘కైండ్ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్’ ఆయనను లోతుగా గమనించే, స్పష్టంగా వ్యక్తీకరించగల వ్యక్తిగా చూపుతుంది. ఈ రచన భారతీయ ఆంగ్లం యొక్క . ఔన్నత్యాన్ని కీర్తిస్తుంది. అంతేకాక భారతీయ ఆంగ్ల ప్రత్యేకతను మరియు సృజనాత్మకతను గొప్పగా చెబుతుంది.
ప్రధాన సమాధానం : శశి థరూర్ ముందుగా కొన్ని భారతీయ ఆంగ్ల ప్రయోగాలు ఎలా రూపుదిద్దుకొన్నాయో వివరిస్తున్నారు. ఒక సజీవ భాషవలె భారతీయ ఆంగ్లం క్రమానుగతంగా పరిణామం చెందుతూ వస్తుంది అని థరూర్ తెలుపుతున్నారు. వాస్తవిక అవసరాలు, అనుభూతులు, భాషా వైవిధ్యము, సాంఘిక ఆచరణలు మరియు సంస్కృతి కొత్త పదాలను రూపొందించేలా ఒత్తిడి చేస్తున్నవని థరూర్ అంటున్నారు. అలాంటి కొత్త పదాలను ఆమోదించాలని వారు వాదిస్తున్నారు. భారతీయ, అమెరికన్ ఆంగ్ల రకాల మధ్య సారూప్యతను చిత్రిస్తున్నారు థరూర్. కావున అమెరికన్ ఆంగ్లాన్ని అందరూ స్వీకరించినట్లుగానే, భారతీయ ఆంగ్లాన్ని కూడా వినియోగించాలని తార్కికంగా అంటున్నారు. ఈ విధంగా థరూర్ భారతీయ ఆంగ్లానికి ఆమోదాన్ని, అభినందనను ఆహ్వానిస్తూ బలమైన వాదనను నిర్మిస్తున్నారు.
Question 2.
Discuss with examples how Indian English reflects Indian culture and everyday life.
Answer:
Introduction: Shashi Tharoor is one of the most prominent public personalities of India. He is an intellectual, thinker, and administrator of worldwide reputation. As an author, he won laurels for his wit, humour, fluency, and rich vocabulary. His insightful article ‘Kindly Adjust to our English’ proves Tharoor as a man with keen observation and clear expression. The essay sings the glory of Indian English. It celebrates the uniqueness and creativity of Indian English.
Main Answer: Indian culture and everyday life have their impact on Indian English. Shashi Tharoor gives a graphic picture of this scenario. He cities relevant examples in support of his argument. Indian culture is clearly visible in the usage of words like ‘auntie’ and ‘uncle ‘. Other such examples are ‘do the needful’, ‘wheatish complexion’ and ‘your good name’. Phrases like ‘history sheeter’ and ‘waive off’ reflect the impact of everyday life on Indian English. Thus, Indian English is shown as a vigorous and living language.
ఉపోద్ఘాతం : భారతదేశానికి చెందిన అత్యంత ప్రాధాన్యత కల ప్రజారంగంలో ఉన్న వ్యక్తులలో శశి థరూర్ ఒకరు. ఆయన విశ్వవ్యాప్త ఖ్యాతి గాంచిన మేధావి, ఆలోచనాపరుడు మరియు పరిపాలకుడు. ఒక రచయితగా తన చతురత, హాస్యం, ధారాళత మరియు సుసంపన్న పద సంపదకు పుష్కలంగా అభినందనలు పొందారు. ఆయన యొక్క నిశిత పరిశీలనాత్మక వ్యాసం ‘కైండ్ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్’ ఆయనను లోతుగా గమనించే, స్పష్టంగా వ్యక్తీకరించగల వ్యక్తిగా చూపుతుంది. ఈ రచన భారతీయ ఆంగ్లం యొక్క ఔన్నత్యాన్ని కీర్తిస్తుంది. అంతేకాక భారతీయ ఆంగ్ల ప్రత్యేకతను మరియు సృజనాత్మకతను గొప్పగా చెబుతుంది.
ప్రధాన సమాధానం : భారతీయ సంస్కృతి మరియు దైనందిన జీవన విధానం భారతీయ ఆంగ్లంపై తమ ప్రభావాన్ని చూపుతాయి. ఈ విషయానికి సంబంధించిన సవివర చిత్రణను మనకందిస్తున్నారు శశి థరూర్. తన వాదనకు మద్దతుగా సంబంధిత ఉదాహరణలను పేర్కొంటున్నారు వారు. ‘ఆంటీ’ మరియు ‘అంకుల్’ లాంటి పదాల వాడుకలో భారతీయ సంస్కృతి ప్రభావం సుస్పష్టం. అలాంటి మరికొన్ని ఉదాహరణలు ‘డు ద నీడఫుల్’ ‘వీటిష్ కొంప్లెక్షన్’ మరియు ‘యువర్ గుడ్ నెఇమ్’. ఇక ‘హిస్టరి షీటర్ మరియు ‘వెఇవ్ ఆఫ్’ లాంటి పదబంధాలు భాషపై దైనందిన జీవన విధాన ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ విధంగా భారతీయ ఆంగ్లం సజీవమైనది మరియు ఉత్తేజభరితమైనదిగా ఇక్కడ చూపబడింది.
![]()
Question 3.
Tharoor makes a clear distinction between creative and Indianisms and plain errors. What does he mean by this?
Answer:
Introduction: Shashi Tharoor is one of the most prominent public personalities of India. He is an intellectual, thinker, and administrator of worldwide reputation. As an author, he won laurels for his wit, humour, fluency, and rich vocabulary. His insightful article ‘Kindly Adjust to our English’ proves Tharoor as a man with keen observation and clear expression. The essay sings the glory of Indian English. It celebrates the uniqueness and creativity of Indian English.
Main Answer: Shashi Tharoor is an objective observer. He is an impartial judge. He appreciates Indian creative formulations. He certifies that such creations have stood the ultimate test of time. Yet, he advises Indians against the impression that ‘anything goes’. He criticises mistakes like ‘I will return back’. He explains the reasons. The word ‘return’ means come ‘back ‘. Hence, ‘back’ is unnecessary here. Some other erroneous expressions are ’till’ (instead of ‘as long as ‘), and ‘waive off’ (for waive). Thus, Tharoor recommends acceptable English.
ఉపోద్ఘాతం : భారతదేశానికి చెందిన అత్యంత ప్రాధాన్యత కల ప్రజారంగంలో ఉన్న వ్యక్తులలో శశి థరూర్ ఒకరు. ఆయన విశ్వవ్యాప్త ఖ్యాతి గాంచిన మేధావి, ఆలోచనాపరుడు మరియు పరిపాలకుడు. ఒక రచయితగా తన చతురత, హాస్యం, ధారాళత మరియు సుసంపన్న పద సంపదకు పుష్కలంగా అభినందనలు పొందారు. ఆయన యొక్క నిశిత పరిశీలనాత్మక వ్యాసం కైండ్ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్’ ఆయనను లోతుగా గమనించే, స్పష్టంగా వ్యక్తీకరించగల వ్యక్తిగా చూపుతుంది. ఈ రచన భారతీయ ఆంగ్లం యొక్క ఔన్నత్యాన్ని కీర్తిస్తుంది. అంతేకాక భారతీయ ఆంగ్ల ప్రత్యేకతను మరియు సృజనాత్మకతను గొప్పగా చెబుతుంది.
ప్రధాన సమాధానం : శశి థరూర్ భావోద్వేగ రహిత పరిశీలకుడు మరియు నిష్పాక్షిక న్యాయ నిర్ణేత. భారతీయులు ఆంగ్ల పదాల సృజనాత్మక సృష్టిని వారు అభినందిస్తున్నారు. అలా రూపొందించబడిన పదాలు అంతిమమైన కాల పరీక్షకు నిలబడ్డాయని ధృవీకరిస్తున్నారు. అయినా, ఆయన భారతీయులకు ‘ఏదైనా నడుస్తుంది’ (anything goes) అనే భావన నుండి బయటపడమని సలహా ఇస్తున్నారు. ‘ఐ విల్ రిటర్న్ బ్యాక్’ లాంటి తప్పు ప్రయోగాలను విమర్శిస్తున్నారు. కారణాలను వివరిస్తున్నారు. ‘రిటర్న్’ అనే పదం అర్థం ‘కమ్ బ్యాక్’. కావున ‘బ్యాక్’ ఇక్కడ అనవసరం. అలాంటి మరికొన్ని. లోపభూయిష్ట ప్రయోగాలను ఉదహరిస్తున్నారు. అవి ‘యాస్ లొంగ్ యాస్’ బదులుగా ‘టిల్’ మరియు ‘వెఇవ్’ స్థానంలో ‘వెఇవ్ ఆఫ్’ లాంటివి. ఈ విధంగా, థరూర్ ఆమోదయోగ్యమైన ఆంగ్లాన్ని మాత్రమే వాడమని సిఫారస్ చేస్తున్నారు.