Andhra Pradesh BIEAP AP Inter 2nd Year English Study Material Pdf and I Have a Dream Annotations Questions and Answers Pdf.
AP Inter 2nd Year English I Have a Dream Questions and Answers Annotations
I Have a Dream Annotations Pdf
Contextual Questions
Answer the following contextual questions in the given pattern.
a) Identify the essay and name the author of the given lines.
b) Discuss the context of the lines and appreciate them critically in about 75 words.
Question 1.
Now is the time to rise from the dark and desolate valley of segregation to the sunlit path of racial justice.
Answer:
‘Dare to Dream Big and Care to Achieve.’
The Speech and the Speaker: We hear the given words in the world-famous speech titled ‘I Have a Dream’. The touching talk was given by Martin Luther King Jr on 28 August 1963 during the March on Washington. The words come from the deep core of his heart. They are packed with the pain and anguish racial discrimination forced on his people. He finds fault with the 1863 Declaration. He dreams equality for his people.
Context and Critical Analysis: Martin Luther King refers to the 1863 Emancipation Proclamation. He criticises its total failure. He adds that millions of slaves waited for one hundred long years for justice. But it was of no use. He says that it is the fierce urgency of NOW. Blacks cannot suffer any more. ‘NOW’ is the time, he asserts, to rise from this gloomy, lonely and low place of racial separation to the brilliantly illuminated highway of equality, dignity and liberty.
Comment: The imagery and metaphors touch the hearts and move the brains!
కలలు కనండి ధైర్యంగా; సాకారం చేసుకోండి జాగ్రత్తగా !
ఉపన్యాసం మరియు ఉపన్యాసకులు : ‘ఐ హ్యావ్ ఎ డ్రీమ్’ పేరుతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఉపన్యాసంలో ఈ మాటలు వింటాము మనము. ఈ మనసులను స్పృశించే ప్రసంగం మనకు అందింది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ద్వారా. ఆగస్టు 28, 1963న ‘మార్చ్ ఆన్ వాషింగ్టన్’ సందర్భంగా చేసిన ఉపన్యాసం ఇది.
సందర్భం మరియు విమర్శనాత్మక విశ్లేషణ : మార్టిన్ లూథర్ కింగ్ ముందుగా 1863 నాటి ‘విముక్తి చట్టం’ గురించి మాట్లాడుతున్నారు. దాని పూర్తి వైఫల్యాన్ని విమర్శిస్తున్నారు. లక్షలాది బానిసలు వంద సంవత్సరాలుగా న్యాయం కొరకు ఎదురు చూస్తునే ఉన్నారు. కాని ఫలితం ఏమీ లేదు. కావున ఆయన ‘ఇప్పుడు’ న్యాయం జరగడం అత్యవసరం అంటున్నారు. నల్ల జాతీయులు ఇంకా ఎంతో కాలం ఈ బాధలు భరించరు. న్యాయం జరగవలసింది ‘ఇప్పుడు’ మాత్రమే. ఇది సమయం ఈ విభజన అనే విచార భరిత, చీకటి లోయ లోంచి స్వేచ్ఛ, సమానత్వం మరియు గౌరవం అనే తేజోమయ రాజమార్గంలోకి పయనించడానికి అంటున్నారు కింగ్.
వ్యాఖ్య : పద చిత్రాలు మరియు ఉపమేయాలు హృదయాలను స్పృశిస్తాయి మరియు మేధలను కదిలిస్తాయి.
![]()
Question 2.
I have a dream that one day this nation will rise up and live out the true meaning of its creed. We hold these truths to be self-evident, that all men are created equal.
Answer:
‘Dare to Dream Big and Care to Achieve.’
The Speech and the Speaker: We hear the given words in the world-famous speech titled ‘I Have a Dream’. The touching talk was given by Martin Luther King Jr on 28 August 1963 during the March on Washington. The words come from the deep core of his heart. They are packed with the pain and anguish racial discrimination forced on his people. He finds fault with the 1863 Declaration. He dreams equality for his people.
Context and Critical Analysis: King’s appeal is emotion- packed. He urges everyone to give up despair. He entreats all to be hopeful. He says he believes in the American dream. He asserts that wisdom prevails on the whites. He dreams of good days when the country truly understands its beliefs. He declares that the crystal clear creed is that all men are created equal. His words imply that social justice can no longer be stopped.
Comment: The words have powerful magnetic energy to pull millions into their fold.
కలలు కనండి ధైర్యంగా; సాకారం చేసుకోండి జాగ్రత్తగా !
ఉపన్యాసం మరియు ఉపన్యాసకులు : ‘ఐ హ్యావ్ ఎ డ్రీమ్’ పేరుతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఉపన్యాసంలో ఈ మాటలు వింటాము మనము. ఈ మనసులను స్పృశించే ప్రసంగం మనకు అందింది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ద్వారా. ఆగస్టు 28, 1963న ‘మార్చ్ ఆన్ వాషింగ్టన్’ సందర్భంగా చేసిన ఉపన్యాసం ఇది.
సందర్భం మరియు విమర్శనాత్మక విశ్లేషణ : కింగ్ యొక్క విన్నపము భావోద్వేగ భరితం. ఆయన ప్రతి ఒక్కరిని నిరాశను వదలండి అని కోరుకుంటున్నారు. అందరిని ఆశావాదంతో ముందుకు పదండి అని విన్నవించుకొంటున్నారు. ఆయనకు అమెరికను స్వప్నం పట్ల సంపూర్ణ నమ్మకము. తెల్లవారి వివేకము మేల్కొంటుంది అని ఆయన గట్టిగా చెబుతున్నారు. అమెరికనుల నమ్మకాన్ని అందరూ అర్థం చేసుకునే మంచి రోజులు వస్తాయని ఆయన కల కంటున్నారు. అందరూ పుట్టుక రీత్యా సమానులే అనేది సుస్పష్ట నమ్మకము. అతని మాటల అంతరార్థము : అన్యాయం ఇంక ఎంత కాలం నిలబడదు; సాంఘిక న్యాయం ఆగదు.
వ్యాఖ్య : ఈ పదాల శక్తివంత ఆకర్షణా శక్తి లక్షలాది మందిని తన ప్రభావంలోకి లాగగలుగుతుంది.
![]()
Question 3.
With this faith we will be able to transform the jangling discords of our nation into a beautiful symphony of brotherhood.
Answer:
‘Dare to Dream Big and Care to Achieve.’
The Speech and the Speaker: We hear the given words in the world-famous speech titled ‘I Have a Dream’. The touching talk was given by Martin Luther King Jr on 28 August 1963 during the March on Washington. The words come from the deep core of his heart. They are packed with the pain and anguish racial discrimination forced on his people. He finds fault with the 1863 Declaration. He dreams equality for his people.
Context and Critical Analysis: King’s words exhibit a hypnotic quality. He literally mesmerises millions. He wants everyone to be hopeful. He asserts that ‘faith’ makes one stronger. Belief makes miracles. These words infuse confidence. Self-belief results in competence. They together realise goals. Presently, racial inequality is like harsh noise. It is irritating. Soon, their faith will lead them to equality. And that equality will be like harmonious and melodious music. Brotherhood would ring in joy and smiles.
Comment: The metaphor of symphony is music to the readers’ ears.
కలలు కనండి ధైర్యంగా; సాకారం చేసుకోండి జాగ్రత్తగా !
ఉపన్యాసం మరియు ఉపన్యాసకులు : ‘ఐ హ్యావ్ ఎ డ్రీమ్’ పేరుతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఉపన్యాసంలో ఈ మాటలు వింటాము మనము. ఈ మనసులను స్పృశించే ప్రసంగం మనకు అందింది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ద్వారా. ఆగస్టు 28, 1963న ‘మార్చ్ ఆన్ వాషింగ్టన్’ సందర్భంగా చేసిన ఉపన్యాసం ఇది.
సందర్భం మరియు విమర్శనాత్మక విశ్లేషణ : కింగ్ యొక్క పదాలు వశీకరణ శక్తిని సూచిస్తున్నాయి. లక్షలాది మందిని అక్షరాలా మైమరపింప జేస్తున్నారు ఆయన. ప్రతి ఒక్కరిని ఆశావాదం వదులుకోవద్దు అంటున్నారు. విశ్వాసం అందరిని శక్తివంతులను చేస్తుంది అంటున్నారు. నమ్మకం అద్భుతాలు సృష్టించగలదు. ఈ పదాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొం దిస్తున్నాయి. ఈ స్వీయ నమ్మకం సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆ రెండు కలిసి లక్ష్యాలను చేరుకునేలా చేస్తాయి. ప్రస్తుతం జాతి వివక్ష కర్ణ కఠోర శబ్దాల రణగొణ ధ్వనిలా ఉంది. కానీ, త్వరలోనే వారి విశ్వాసం వారిని సమానత్వ తీరాలకు దారి తీస్తుంది. అప్పుడు, ఆ సమానత్వం సుస్వర రాగయుక్త, శ్రావ్య సంగీతంలా మనను అలరిస్తుంది. సోదర భావం ఆనందాన్ని మరియు చిరునవ్వులను ఆవిర్భవింప చేస్తుంది.
వ్యాఖ్య : రాగయుక్త స్వర సముదాయం అనే ఉపమేయం పాఠకుల చెవులకు సుమధుర సంగీతంలా తాకుతుంది !
![]()
Question 4.
So let freedom ring from the hilltops of New Hampshire… from every state and every city, we will be able to speed up that day when all of God’s children… will be free at last.
Answer:
‘Dare to Dream Big and Care to Achieve.’
The Speech and the Speaker: We hear the given words in the world-famous speech titled ‘I Have a Dream’. The touching talk was given by Martin Luther King Jr on 28 August 1963 during the March on Washington. The words come from the deep core of his heart. They are packed with the pain and anguish racial discrimination forced on his people. He finds fault with the 1863 Declaration. He dreams equality for his people.
Context and Critical Analysis: King rises sky-high as he concludes his talk. He wants freedom to embrace the vast
area of the U.S. He dreams that brotherhood floods valleys, plains, and touches hills. He adds that equality drenches states, cities, towns, villages and hamlets. He is so comprehensive that he leaves not even an inch of American soil. He classifies all Americans as God’s children. It is indeed a noble concept. He visualises freedom, brotherhood and dignity to ALL!
Comment: King’s visualisation draws universal energy for all Americans’ good.
కలలు కనండి ధైర్యంగా; సాకారం చేసుకోండి జాగ్రత్తగా !
ఉపన్యాసం మరియు ఉపన్యాసకులు : ‘ఐ హ్యావ్ ఎ డ్రీమ్’ పేరుతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఉపన్యాసంలో ఈ మాటలు వింటాము మనము. ఈ మనసులను స్పృశించే ప్రసంగం మనకు అందింది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ద్వారా. ఆగస్టు 28, 1963న ‘మార్చ్ ఆన్ వాషింగ్టన్’ సందర్భంగా చేసిన ఉపన్యాసం ఇది.
సందర్భం మరియు విమర్శనాత్మక విశ్లేషణ : ప్రసంగ ముగింపు దశలో కింగ్ ఆకాశం అంత ఎత్తుకు ఎదుగుతున్నారు. అమెరికా సువిశాల భూభాగం మొత్తం స్వేచ్ఛా పరిష్వంగంలో పరవశించాలని కోరుకుంటున్నారు. ఇక సమానత్వం అమెరికాలోని లోయలు, గుట్టలు, మైదానాలను, పుట్టలను వెల్లువలా ముంచెత్తుతుందని కల కంటున్నారు. ఇక సోదర భావం అందరిని తడిపి వేస్తుంది అంటున్నారు – నగరాలు, పట్టణాలు, గ్రామాలు మరియు పల్లెలు – అన్నింటినీ. ఆయన ఎంత విస్తృత భావనతో ఉన్నారు అంటే, అమెరికాలోని అంగుళ భాగాన్ని కూడా వదలలేదు. అమెరికాలోని అందరిని భగవంతుని పిల్లలుగా వర్గీకరించారు. అది అత్యంత సమున్నత భావన. వారు అందరికి స్వేచ్ఛ, సోదర భావం మరియు సమానత్వం అందుతున్నట్లుగా ఊహించుకుంటున్నారు.
వ్యాఖ్య : కింగ్ యొక్క దార్శనిక శక్తి విశ్వ శక్తిని ఆకర్షిస్తుంది అందరు అమెరికనుల శ్రేయస్సుకై !
I Have a Dream Questions and Answers
Answer the following questions in about 150 words each.
Question 1.
How relevant is Martin Luther King Jr.’s dream today ?
Answer:
‘DREAM BIG; SMALL AIM IS A BIG CRIME.’
Introduction: Martin Luther King Jr was an African American leader, humanist and rights activist. The world remembers this Nobel Peace Prize winner (1964) as a courageous leader, visionary speaker and symbol of hope. The present piece ‘I Have a Dream’ was his inspiring address on 28 Au- gust 1963. It was delivered on the occasion of the March on Washington. It is a dream for liberty, equality, fraternity and dignity. It is poetry in prose form.
Main Answer: Martin Luther King’s dream is relevant today. It continues to be relevant as long as man lives. For his dream is for brotherhood. It is against a social evil – racial discrimination. Some kind of social evil inflicts mankind always. As such, King’s dream remains relevant. Moreover, the speech highlights the value of unity, resilience, faith, and non-violence. They are qualities of permanent importance. Hence the talk is very much applicable at any time or place.
కలలు కనండి ధైర్యంగా; సాకారం చేసుకోండి జాగ్రత్తగా ! ఉపోద్ఘాతం : మార్టిన్ లూథర్ కింగ్ జూ॥ ఒక ఆఫ్రికన్ అమెరికన్ నాయకుడు, మానవతా వాది మరియు హక్కుల కార్యకర్త. ప్రపంచం ఈ నొబెల్ శాంతి (1964) పురస్కార గ్రహీతను నేటికి కూడా ఒక గొప్ప సాహసోపేత నాయకుడిగా, దార్శనిక వక్తగా, ఆశావాదానికి చిహ్నంగా గుర్తు పెట్టు కుంటుంది. ప్రస్తుత ఖండిక ‘ఐ హ్యావ్ ఎ డ్రీమ్’ 28 ఆగస్టు 1963న చేసిన ప్రేరణాత్మక ప్రసంగము. అది ‘మార్చ్ ఆన్ వాషింగ్టన్’ సందర్భంగా చేసిన ఉపన్యాసము. అది స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం మరియు గౌరవం కోసం కన్న కల. అది గద్య రూపంలోని పద్యం.
ప్రధాన సమాధానం : మార్టిన్ లూథర్ కింగ్ కల నేటికీ వర్తిస్తుంది. మానవ జాతి మనుగడ కొనసాగినంత కాలం కింగ్ కలను అన్వయించుకోవచ్చు. ఎందుకు అంటే, ఆయన కల సోదర భావం కొరకు. అది జాతి వివక్ష అనే సాంఘిక దురాచారంపై పోరు. అయితే, ఏదో ఒక రకమైన సాంఘిక దురాచారం మానవజాతిని ఎప్పటికీ పీడిస్తూనే ఉంటుంది. అందుచేత కింగ్ కలకు సార్వకాలీనత, సార్వజనీనత అన్వయం ఉంటుంది. పైగా కింగ్ ప్రసంగం ఐకమత్యం, నిబ్బరము, విశ్వాసం మరియు అహింస లాంటి మానవతా విలువల ఔన్నత్యాన్ని నొక్కి చెబుతుంది. అవి శాశ్వత ప్రాధాన్యత కల విలువలు. అందుకు కూడా ఈ మాటల మంత్రం అన్ని కాలాలకు అన్ని ప్రాంతాలకు ఉపయుక్తం.
![]()
Question 2.
Discuss the central theme of Martin Luther King Jr.’s ‘I Have a Dream’?
Answer:
‘DREAM BIG; SMALL AIM IS A BIG CRIME.’
Introduction: Martin Luther King Jr was an African American leader, humanist, and rights activist. The world remembers this Nobel Peace Prize winner (1964) as a courageous leader, visionary speaker and symbol of hope. The present piece ‘I Have a Dream’ was his inspiring address on 28 Au- gust 1963. It was delivered on the occasion of the March on Washington. It is a dream for liberty, equality, fraternity and dignity. It is poetry in prose form.
Main Answer: ‘I Have a Dream’ centres round equality. It opposes racial discrimination. It recommends liberty, fraternity and dignity for all. Its main theme is universal brotherhood. To achieve it, King proposes hope, patience, resilience, non-violence and love as means. The central idea is noble. Its presentation is artistic. The talk is touching. It mesmerises millions even today. Its theme and form appeal to all. Hence it forms a part of textbooks worldwide.
కలలు కనండి ధైర్యంగా; సాకారం చేసుకోండి జాగ్రత్తగా !
ఉపోద్ఘాతం : మార్టిన్ లూథర్ కింగ్ జూ॥ ఒక ఆఫ్రికన్ అమెరికన్ నాయకుడు, మానవతా వాది మరియు హక్కుల కార్యకర్త. ప్రపంచం ఈ నొబెల్ శాంతి (1964) పురస్కార గ్రహీతను నేటికి కూడా ఒక గొప్ప సాహసోపేత నాయకుడిగా, దార్శనిక వక్తగా, ఆశావాదానికి చిహ్నంగా గుర్తు పెట్టుకుంటుంది. ప్రస్తుత ఖండిక ‘ఐ హ్యవ్ ఎ డ్రీమ్’ 28 ఆగస్టు 1963న చేసిన ప్రేరణాత్మక ప్రసంగము. అది ‘మార్చ్ ఆన్ వాషింగ్టన్’ సందర్భంగా చేసిన ఉపన్యాసము. అది స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం మరియు గౌరవం కోసం కన్న కల.. అది గద్య రూపంలోని పద్యం.
ప్రధాన సమాధానం : ‘ఐ హ్యావ్ ఎ డ్రీమ్’ కు కేంద్ర బిందువు ‘సమానత్వం’. అది జాతి వివక్షకు వ్యతిరేకము. ఆ ఉపన్యాసం అందరికీ స్వేచ్ఛ, సోదర భావం మరియు గౌరవం అందాలని నినదిస్తుంది. దాని యొక్క ప్రధాన అంశం విశ్వమానవ సౌభ్రాతృత్వం (సోదర భావం). దానిని సాధించుటకు కింగ్ ప్రతిపాదించిన ఆయుధాలు : ఆశ, సహనము, నిబ్బరము, అహింస మరియు ప్రేమ. ఈ ఉపన్యాస కేంద్ర బిందువు. అత్యున్నత ఆశయము. ఇక దానిని వ్యక్తీకరించిన తీరు అత్యంత కళాత్మకము. ఆ ప్రసంగం మనసులను సున్నితంగా స్పృశిస్తుంది. నేటికి కూడా అది లక్షలాది మందిని అక్షరాల మంత్రముగ్ధులను చేస్తుంది. దాని భావం మరియు రూపం కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. కాబట్టే అది ప్రపంచ వ్యాప్తంగా పాఠ్యాంశం అవుతుంది.
Question 3.
Why is this speech considered one of the greatest speeches in history?
Answer:
‘DREAM BIG; SMALL AIM IS A BIG CRIME.’
Introduction: Martin Luther King Jr was an African American leader, humanist and rights activist. The world remembers this Nobel Peace Prize winner (1964) as a courageous leader, visionary speaker and symbol of hope. The present piece ‘I Have a Dream’ was his inspiring address on 28 Au- gust 1963. It was delivered on the occasion of the March on Washington. It is a dream for liberty, equality, fraternity and dignity. It is poetry in prose form.
Main Answer: Martin Luther King’s ‘I Have a Dream’ is considered one of the greatest speeches in history. Reasons are obvious and abundant. First, its theme touches divine heights. It records bitter pain of millions. The dream offers hope. It fills one with faith. It envisions liberty, equality, fraternity and dignity for all. This deeply humane theme is clothed in poetry par excellence. Imagery touches hearts. Metaphors mesmerise millions of minds. Repetition reinforces ideas. Musical rhythm overflows. Can we expect more?
కలలు కనండి ధైర్యంగా; సాకారం చేసుకోండి జాగ్రత్తగా !
ఉపోద్ఘాతం : మార్టిన్ లూథర్ కింగ్ జూ॥ ఒక ఆఫ్రికన్ అమెరికన్ నాయకుడు, మానవతా వాది మరియు హక్కుల కార్యకర్త. ప్రపంచం ఈ నొబెల్ శాంతి (1964) పురస్కార గ్రహీతను నేటికి కూడా ఒక గొప్ప సాహసోపేత నాయకుడిగా, దార్శనిక వక్తగా, ఆశావాదానికి చిహ్నంగా గుర్తు పెట్టుకుంటుంది. ప్రస్తుత ఖండిక ‘ఐ హ్యవ్ ఎ డ్రీమ్’ 28 ఆగస్టు 1963న చేసిన ప్రేరణాత్మక ప్రసంగము. అది ‘మార్చ్ ఆన్ వాషింగ్టన్’ సందర్భంగా చేసిన ఉపన్యాసము. అది స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం మరియు గౌరవం కోసం కన్న కల. అది గద్య రూపంలోని పద్యం.
![]()
ప్రధాన సమాధానం : మార్టిన్ లూథర్ కింగ్ జూ॥ యొక్క ఉపన్యాసం ‘ఐ ‘హ్యావ్ ఎ డ్రీమ్’ చరిత్ర యొక్క అత్యంత గొప్ప ప్రసంగాలలో ఒకటిగా నిలిచిపోతుంది. కారణాలు సుస్పష్టం మరియు అసంఖ్యాకం. ముందుగా ఆ ప్రసంగ ప్రధానాంశం దైవత్వపు ఎత్తులను తాకుతుంది. అది లక్షలాది మంది నల్లజాతీయుల ఆక్రందనను నమోదు చేస్తుంది. ఆ కల ఆశను రగిలిస్తుంది. అందరిలో విశ్వాసాన్ని నెలకొల్పుతుంది. అది అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం మరియు గౌరవం అందాలని ఆకాంక్షిస్తుంది. ఇక ఈ అత్యున్నత మానవతా విలువల సమాహారం అత్యుత్తమ కవితా రూపంలో అందించబడింది. పద చిత్రాలు గుండెలను తాకుతాయి. ఇక ఉపమేయాలు లక్షలాది మేధలను ప్రభావితం చేస్తాయి. పునరుక్తి ఆలోచనలకు అదనపు విలువను అందిస్తుంది. ఒక స్వరబద్ధ లయ అంతటా గలగలా పారుతుంది. ఇంకా ఎక్కువ ఆశిస్తామా ?