Students always start with AP Board Solutions Class 12 English and I Am Sorry The Three Hardest Words To Say Summary in English Telugu for seamless learning.
I Am Sorry The Three Hardest Words To Say Summary in Telugu & English
I Am Sorry The Three Hardest Words To Say Summary in English
To err is human, to forgive is divine.
Desmond Tutu was an African religious leader. But he became universally famous for his outspoken opposition to apartheid (racial discrimination). This 1984 Nobel Laureate (for peace) is remembered the world over as a symbol of forgiveness, moral courage and hope in the face of injustice. His essay ‘I am Sorry: The Three Hardest Words to Say ‘ is a deep study of ‘forgiveness’. ‘Forgiveness’ is a profound and challenging concept. Tutu explores and explains it in simple and convincing ways. He quotes his experiences with his father and children to make the difficult idea easy to understand. His father used to beat his mother. His children irritated him multiple times. He treated those incidents as practice sessions in cultivating forgiveness. He admits that it is difficult to forgive. He declares forgiveness does not depend on others’ actions. He asserts that ‘forgiveness’ is for oneself. He labels forgiveness as the best form of self-interest.
He adds another angle. It is a fact that no one is completely good or bad. As such, everyone makes mistakes. Therefore, everyone needs to forgive others and requires forgiveness. Forgiveness frees one from the burden of past and pain. It is a noble trait. It is essential to admit one’s mistakes. Saying I am sorry’ is difficult. But it helps everyone. He concludes with his bitter experience of not talking to his father just before father’s death. Forgiveness heals, frees one from past wounds and provides peace. Thus, it is worth practising.
![]()
I Am Sorry The Three Hardest Words To Say Summary in Telugu
తప్పు చేయడం మానవ సహజం; క్షమించటం దైవత్వం.
డెస్మండ్ టుటు ఒక ఆఫ్రికన్ మత పెద్ద. కానీ ఆయన జాతి వివక్షను నిర్భయంగా వ్యతిరేకించడం ద్వారా ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు. ఈ నొబెల్ శాంతి పురస్కార గ్రహీతను (1984) ప్రపంచం శాశ్వతంగా గుర్తుపెట్టు కుంటుంది క్షమాగుణానికి, నైతిక ధైర్యానికి మరియు ఆశావాదానికి ప్రతీకగా ! ఆయన వ్యాసం ‘ఐ యామ్ సొరి’ ద త్రీ హార్డెస్ట్ వర్డ్ టు సెఇ – ‘క్షమాగుణం’ యొక్క లోతైన అధ్యయనం. క్షమాగుణం అనేది అత్యంత గంభీర, మరియు సవాలు విసిరే భావన. అంత సంక్లిష్ట భావనను, టుటు సరశ శైలిలో ఆమోదయోగ్య వాదనతో వివరిస్తున్నారు. ఇంత కష్టమైన ఆలోచనను అందరికి తేలికగా అర్థమవటం కోసం తన తండ్రితో మరియు పిల్లలతో ఎదురైన అనుభవాలను సోదాహరణంగా వివరిస్తున్నారు. తన తండ్రి, తల్లిని తరచుగా దెబ్బలు కొట్టేవాడు. ఇక పిల్లలు లెక్క లేనన్ని సార్లు విసిగించేవారు. అయితే ఆ సంఘటనలన్నింటిని కూడా క్షమాగుణం అలవరుచుకోవడానికి సాధనగా మలుచుకున్నారు టుటు. క్షమించటం ఎంత కష్టమో అని ఒప్పుకుంటున్నారు.
అయితే వారు గట్టిగా చెప్పేదేమిటంటే క్షమాగుణం ఎదుటివారి చర్యలపై ఆధారపడి ఉండదు. ఇంకా వారు నొక్కి వక్కాణించేది ఏమిటంటే క్షమాగుణం ఇతరుల కోసం కాదు, మనకోసమే. అత్యుత్తమ స్వీయ ఉపయుక్త గుణం క్షమాగుణం అంటున్నారు. మరొక కోణాన్ని కూడా ఆవిష్కరిస్తున్నారు వారు. ఏ ఒక్కరూ పూర్తిగా చెడు కాదు, మొత్తం మంచి కాదు అనేది వాస్తవం. ఈ కారణం చేత ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇతరులను క్షమించవలసిందే, మరియు ఇతరుల నుండి క్షమాభిక్ష కోరవలసిందే. క్షమాగుణం గతం నుండి, బాధ నుండి విముక్తిని కలిగిస్తుంది. అది సమున్నత గుణం.
ఎవరి తప్పును వారు ఒప్పుకోవటం మంచిది. “క్షమించండి” అనటం చాలా కష్టం. కానీ అలా అనటం అందరికి సహాయకారకం. తండ్రి మరణించటానికి ముందు, తండ్రి మాట్లాడమన్నా మాట్లాడలేని దురదృష్టపు, దోష భావనతో వ్యాసాన్ని ముగిస్తున్నారు. క్షమాగుణం నయం చేస్తుంది, గతకాలపు గాయాలను మాన్పుతుంది, మానసిక శాంతిని అందిస్తుంది. ఈ విధంగా అది పాటించదగ్గ విలువైన గుణం.
I Am Sorry The Three Hardest Words To Say Word Meanings
abused (v-pt) /əbu:sd/ (అబ్యూస్డ్) ill-treated; attacked with coarse language; దుష్టంగా ప్రవర్తించెను; దుర్భాషలాడెను
despair (n) /dr’speə(r)/ (డిస్పెఅర్) utter helplessness; పూర్తి నిస్సహాయత
incomprehensible (adj) /inka:mprə’hensibal/ (ఇన్కామ్ప్రహెన్సిబల్) very difficult to understand; అర్థం చేసుకొనుటకు చాలా కష్టమైనది
dwell on (phrase) think, speak, or write (about something) at length (ఏదైనా ఒక విషయం గురించి) ఎక్కువగా ఆలోచించు, రాయు లేదా మాట్లాడు (ఇక్కడ తండ్రి, తల్లిని వేధించిన బాధాకర జ్ఞాపకాలు)
inflicted (v-pt) /’fliktid/ (ఇన్ఫ్లిక్టిడ్) imposed; thrust upon; మీద ప్రయోగించెను; రుద్దబడెను
traumas (n-pl) /’trɔ:məz/ (ట్రోమజ్) severe emotional shocks and physical pains; తీవ్ర మానసిక క్షోభలు, శారీరక బాధలు
![]()
traded lives with (idiom) exchanged circumstances, roles or personal situations with someone else; పరిస్థితులు, పాత్రలు, వ్యక్తిగత స్థితులను పరస్పరం మార్చుకొనెను
perpetrator (n) /’p3:(r)petreItə(r)/ (ప(ర్)పెట్రెఇట(ర్)) one who has done something wrong; తప్పు చేసిన వ్యక్తి
remorse (n) /rı’mɔ:(r)s/(రిమో(ర్)స్), a feeling of being sorry; తప్పు చేశాననే భావన; పశ్చాత్తాప భావన
reparation (n) /repə’reI∫on/ (రెపరెఇషన్) compensation; నష్టపరిహారము; బాధానివారక చర్య
restitution (n) /resti’t∫υ:∫ən/ (రెస్టిస్ట్యూషన్) something paid or done to soothe hurt feelings; కలిగించిన బాధను తగ్గించేందుకు అందించే ఉపశమనము
sting (n) /stIη/ (స్టింగ్) a sharp, localised pain; ఒకే చోట కేంద్రీకృతమైన తీవ్ర బాధ; నొప్పి
retaliation (n) /ritæll’eI∫an/ (రిట్యాలిఎఇషన్) hitting back someone as you have been hit; ప్రతీకారము
respite (n) /’respaIt/ (రెస్పి౨ట్) a brief interval of relief; & కొద్ది కాలపు ఉపశమనము
marathon (n) /’mærəθən/ (మ్యారథన్) an extended or sustained activity; సుదీర్ఘంగా కొనసాగే కార్యక్రమము
squalls (n-pl) /’skw:lz/ (స్క్వోల్జ్) cries; అరుపులు, కేకలు, ఏడుపులు
slumber (n) /sl∧mbə(r)/ (స్లంబ(ర్)) a very light state of sleep; తేలికపాటి నిద్రా స్థితి
stumbled (v-pt) /st∧mbəld/ (స్టంబ్ లెడ్) fell; పడిపోయెను
fatigue (n) /fə’ti:g/ (ఫటీగ్) weariness caused by exertion; తీవ్ర పనివలన కలిగిన అలసట
pall (n) /pɔ:l/ (పోల్) a bad mood; బాధాకర మానసిక స్థితి
toddler (n) /’todlə(r)/ (టొడ్ల(ర్)) a young child; చిన్న పసిబాలుడు
tantrums (n-pl) /’tæntrǝmz/( ట్యాన్ ట్రమెజ్) childish display of bad temper; చిన్న పిల్లల అల్లరి ప్రవర్తన దాని ప్రదర్శ
resolve (n) /rI’zolv/ (రిజొల్వ్) determination; will power; దృఢ సంకల్పము; గట్టి నిర్ణయము
transgressions (n-pl) /træns’gre∫onz/ (ట్రాన్షన్) violations; ఉల్లంఘనలు; అతిక్రమణలు
fierce (n) /flǝ(r)s/ (ఫిఅ(ర్)స్) severe, cruel; తీవ్ర, క్రూర
apartheid (n) /ǝpa:(r)thert/ (అపా(ర్)ట్ ఇట్) racial segregation; జాతి వేర్పాటు; తెల్ల, నల్ల జాతుల అంతరాలు
the Bantu Education system inferior education meant for black children – provided as per the Bantu Education Act of 1953 South Africa an example of racial segregation; నాసి రకపు విద్యావిధానము – నల్ల జాతి పిల్లలకు ఉద్దేశించినది 1953 చట్టం ప్రకారము జాతి వివక్షకు ఉదాహరణ దక్షిణ ఆఫ్రికాలో
instituted (v-pt) /’Instrtjυ:tId/ (ఇన్స్టిట్యూటిడ్) began, founded; ప్రారంభించెను; స్థాపించెను
brainwashing (n) /’breInwD∫m/ (బ్రెఇన్వెషింగ్) the process of pressurizing someone into adopting different beliefs by
using systematic means; ఒక పద్ధతి ప్రకారం ప్రక్రియలను ఉపయోగిస్తూ వ్యక్తులు తమ అభిష్టానికి భిన్నమైన నమ్మకాలను చేపట్టేలా చేయడం
beckoned (v-pt) /’bekǝnd/ (బెకన్ ) invited; పిలిచెను
trying (adj) /traɪɪŋ/ (ట్రైఇంగ్) difficult to endure; testing; భరించుటకు కష్టమైన; పరీక్షించే
grief-stricken (adj) / ‘gri:f strikǝn/ (గ్రీఫ్ ఫ్రికన్) overcome with deep tirades (n-pl) sorrow; very sad; తీవ్ర విచారంతో
tirades (n – pl)/tar’reidz/ (ట్రెరెఇడ్జ్ long, angry or violent talks; దీర్ఘ, ఆవేశ లేదా కఠిన సంభాషణలు
cowering (v+ing) /’kauǝrin/ (కౌ అరింగ) lowering the head or the body in fear and moving backwards; తల లేదా శరీరాన్ని కిందికి వంచి వెనకడుగు వేయడం
obscured (v-pp) /ǝb’skjuǝ(r)d/(అబ్ స్క్య అ(ర్)డ్) dimmed; hidden; దాచివేయబడెను; కప్పివేయబడెను; మసకబారెను
redemption (n) /rr’demp∫ǝn/(రి డెమ్ ష్షన్) liberation from blame; తప్పు; విమర్శల నుండి విముక్తి
unfettered (adj) /∧n’fetǝ(r)d/(అన్ ఫెట(ర్)డ్) free from any guilt; ఏ రకమైన దోషభావన లేకుండా