AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

SCERT AP 9th Class Physics Study Material Pdf Download 2nd Lesson గమన నియమాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Physical Science 2nd Lesson Questions and Answers గమన నియమాలు

9th Class Physical Science 2nd Lesson గమన నియమాలు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కింది వాటికి కారణాలు వివరించండి. (AS 1)
ఎ) కంబళిని కర్రతో కొడితే, దుమ్ము పైకి లేస్తుంది.
బి) బస్సు పైన వేసిన సామాన్లని తాడుతో కట్టకపోతే పడిపోతాయి.
సి) ఒక పేస్ బౌలర్ బంతి విసిరే ముందు దూరం నుంచి పరిగెత్తుతూ వస్తాడు.
జవాబు:
ఎ) కంబళిని కర్రతో కొడితే అది చలనంలోకి వస్తుంది. కంబళిలోని దుమ్ము కణాలు నిశ్చల జడత్వం వలన నిశ్చలస్థితిలోనే ఉంటాయి కాబట్టి.

బి) బస్సు చలనంలో ఉన్నప్పుడు సామాన్లన్ని కూడా గమన జడత్వం వలన అవి కూడా బస్సు వేగాన్ని కలిగి ఉంటాయి. బస్సు సడన్ గా నిశ్చలస్థితికి రాగానే వస్తువులు మాత్రము గమన జడత్వంలోనే ఉంటాయి కాబట్టి అవి పడిపోతాయి. కనుక.

సి) ఒక పేస్ బౌలర్ బంతి విసిరే ముందు దూరం నుంచి పరుగెత్తుటకు కారణం బంతికి గమన జడత్వంను అందించుటకు
(లేదా) బంతికి ద్రవ్యవేగమును అందించుటకు.

ప్రశ్న 2.
8 కి.గ్రా., 25 కి.గ్రా. ద్రవ్యరాశులు గల రెండు వస్తువులలో ఏ వస్తువు అధిక జడత్వం కలిగి ఉంటుంది? ఎందుకు? (AS 1)
జవాబు:
25 కేజీల ద్రవ్యరాశిగల వస్తువుకు అధిక జడత్వముండును. ఎందుకనగా జడత్వమును నిర్ణయించునది ద్రవ్యరాశి కాబట్టి.

ప్రశ్న 3.
2.2 మీ./సి. వేగంతో కదులుతున్న 6.0 కి.గ్రాల బంతి యొక్క ద్రవ్యవేగం ఎంత? (AS 1)
జవాబు:
బంతి వేగం (V) = 2.2 మీ./సె.
బంతి ద్రవ్యరాశి (m) = 6 కిలోలు
బంతి ద్రవ్యవేగము (P) = mv = 6 × 2.2 = 13.2 కి.గ్రా.మీ/సె.

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

ప్రశ్న 4.
ఇద్దరు వ్యక్తులు 200N ఫలిత బలంతో ఒక కారుని 3 సెకండ్ల పాటు నెట్టారు. (AS 1)
ఎ) కారుకి అందిన ప్రచోదనం ఎంత?
జవాబు:
వ్యక్తులు ప్రయోగించిన బలం = (F) = 200 N
కాలము = t = 3 సె||
ప్రచోదనము (I) = బలం × కాలం = 200 × 3 = 600 న్యూటన్ – సెకను

బి) కారు ద్రవ్యరాశి 1200 కిలోగ్రాములు అయితే, దాని వేగంలో మార్పు ఎంత?
జవాబు:
కారు ద్రవ్యరాశి = m = 1200 కి.గ్రా.
కారుపై ప్రయోగించిన బలం = 200 N
కాలం = 3 సె.
ప్రచోదనము = ద్రవ్యరాశి × వేగంలోని మార్పు
F × t = m × (v – u)
\(\mathrm{v}-\mathrm{u}=\frac{\mathrm{F} \times \mathrm{t}}{\mathrm{m}}=\frac{200 \times 3}{1200}=\frac{1}{2}=0.5\) మీ./సె.
∴ వేగంలోని మార్పు = v – u = 0.5 మీ./సె.

ప్రశ్న 5.
0.7 కి.గ్రా ద్రవ్యరాశి గల వస్తువులో 3 మీ./సె² త్వరణాన్ని కలుగజేయడానికి ఎంత బలాన్ని ఉపయోగించాలి? (AS 1)
జవాబు:
వస్తువు ద్రవ్యరాశి = m = 0.7 కేజీలు
త్వరణం = a = 3 మీ./సె².
బలం (F) = ద్రవ్యరాశి × త్వరణం = 0.7 × 3 = 2.1 N

ప్రశ్న 6.
5 కి.గ్రా. ద్రవ్యరాశి గల వస్తువు 10 మీ./సె. వేగంతో కదులుతోంది. దానిపై 20 సె.ల పాటు బలాన్ని ప్రయోగించడం వల్ల అది 25 మీ/సె. వేగాన్ని పొందితే, వస్తువుపై ప్రయోగించిన బలం ఎంతో తెల్పండి. (AS 1)
జవాబు:
వస్తువు ద్రవ్యరాశి = m = 5 కి.గ్రా.
వస్తువు తొలి వేగము = u = 10 మీ./సె.
బలం ప్రయోగించబడిన కాలం = t = 20 సె.
వస్తువు తుది వేగము = v = 25 మీ./సె.
వస్తువుపై ప్రయోగించబడిన బలం = F = ma
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 1
∴ వస్తువుపై ప్రయోగించబడిన బలం = 3.75 న్యూటర్లు

ప్రశ్న 7.
న్యూటన్ మూడు గమన నియమాలను ఉదాహరణలతో వివరించండి. (AS 1)
జవాబు:
1) న్యూటన్ మొదటి గమన నియమము :
ఫలిత బలం పనిచేయనంతవరకు నిశ్చలస్థితిలో ఉన్న వస్తువు అదే స్థితిలోనూ, సమచలనంలో ఉన్న వస్తువు అదే సమచలనంలోనూ ఉండును.
ఉదా 1 : నిశ్చలంగా ఉన్న ఒక బస్సు ఒక్కసారిగా ముందుకు కదిలితే అందులో నిలబడి ఉన్న ప్రయాణీకుడు వెనుకకు పడతాడు, కారణము బస్సు ఒక్కసారిగా త్వరణాన్ని పొంది ముందుకు కదిలినది, కానీ అందులో వ్యక్తి “జడత్వం” వల్ల తను ముందు ఉన్న స్థానంలోనే ఉండేందుకు ప్రయత్నిస్తాడు. అందువల్లనే వెనక్కి పడిపోతాడు.

ఉదా 2 : బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి, ఒక్కసారిగా బస్సు ఆగితే ముందుకు పడతాడు, కారణము బస్సు వేగముకు సమాన వేగంతో అతను ప్రయాణిస్తున్నాడు. బస్సు ఒక్కసారిగా ఆగినప్పుడు జడత్వం వలన అతని శరీరం మాత్రం వెంటనే తన గమనస్థితిని మార్చుకోలేదు. అందుకే ముందుకు పడతాడు.

2) రెండవ గమన నియమము : వస్తువు ద్రవ్యవేగంలో మార్పు రేటు, దానిపై పనిచేసే ఫలిత బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దాని దిశ ఫలిత బలదిశలో ఉంటుంది.
ఉదా 1 : సిమెంట్ గచ్చుపై కంటే ఇసుక నేల మీద దూకడం సురక్షితము. ఎందుకనగా మృదువైన, మెత్తని తలాలు వస్తువుని ఆపడంలో ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల “ఆపే దూరం” ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ద్రవ్యవేగంలో మార్పు రేటు తక్కువగా ఉంటుంది. ఫలితంగా కాలికి తక్కువ దెబ్బ తగులుతుంది.

ఉదా 2 : వేగంగా వస్తున్న క్రికెట్ బంతిని “క్యాచ్” చేసేటప్పుడు ఆ వ్యక్తి తన చేతులను వెనుకకు లాగుతాడు. ఈ సందర్భంలో అతడు బంతి వేగాన్ని తగ్గించడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు.

ఇలా చేయడం వల్ల బంతి ద్రవ్యవేగంలో మార్పు రేటు తక్కువగా ఉంటుంది. ఫలితంగా చేతులపై బంతి ప్రయోగించే బలం తగ్గుతుంది.

3) మూడవ గమన నియమము : ఎల్లప్పుడూ చర్యకు దానికి సమానంగా మరియు వ్యతిరేక శిశలో ఉంటుంది. ఇది దృఢ వస్తువులకు మాత్రమే. చర్య, ప్రతిచర్య జంట బలాలు. వాటి పరిమాణం సమానం. దిశలో వ్యతిరేకం మరియు వేరు వేరు వస్తువులపై పని చేస్తాయి. కావున అవి ఎప్పుడూ రద్దు కావు.

వివరణ:
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 2

  1. రెండు వస్తువులు పరస్పరం బలాలు ప్రయోగించుకుంటున్నప్పుడు
  2. ప్రతిక్రియ జరిపేటప్పుడు, A వస్తువు B వస్తువుపై కలుగజేసే బలం FAB (చర్య)
  3. B వస్తువు A వస్తువుపై కలుగజేసే బలం FRA (ప్రతిచర్య)
  4. న్యూటన్ మూడో గమన నియమం వలన ఈ రెండు బలాలు పరిమాణంలో సమానంగాను, దిశలో వ్యతిరేకంగాను, ఉంటాయి.
    FAB = – FBA
    చర్య = ప్రతిచర్య
  5. దీనిని బట్య జంట బలాలు ఒకే వస్తువు పై కాక, రెండు వేర్వేరు వస్తువులపై పనిచేస్తాయి.
    ఉదా 1:
    i) పక్షులు ఎగిరేటప్పుడు వాటి రెక్కలతో గాలిని కిందకి నెడతాయి. అప్పుడు గాలి కూడా పక్షిని వ్యతిరేకదిశలో (పైకి) నెడుతుంది.
    ii) రెక్కలు గాలి మీద ప్రయోగించే బలం, గాలి పక్షి రెక్కలపై ప్రయోగించే బలాలు రెండూ సమాన పరిమాణంలో, వ్యతిరేక దిశలో ఉంటాయి.
    ఉదా 2 :
    నీటిలో ఈదుతున్న చేప నీటిని వెనక్కి నీరు చేపని ముందుకు నెట్టే బలం రెండూ పరిమాణంలో సమానంగా, దిశ పరంగా వ్యతిరేకంగా ఉంటాయి. నీరు చేపపై కలిగించే బలం వల్ల చేప ముందుకు కదులుతుంది.

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

ప్రశ్న 8.
వేగంగా వెళ్తున్న బస్సు అద్దాన్ని ఒక ఈగ గుద్దుకుంటే, బస్సు మీద, ఈగ మీద ఒకే బలం ప్రయోగించబడుతుందా? ఎందుకు? (AS 1, AS 7)
జవాబు:
న్యూటన్ మూడవ గమన నియమం ప్రకారం బస్సు మీద, ఈగ మీద ఒకే బలం ప్రయోగించబడుతుంది.

ప్రశ్న 9.
ఒక బిండిని గుర్రం లాగదాన్ని ‘దివ్య’ చూసింది. గుర్రం ఎంత బలంతో బండిని లాగుతుందో, అంతే బలంతో బండి సర్రాన్ని కూడా లాగుతుందని ఆమె భావించింది. “మరి బండి ఎలా కదులుతుంది?” అని ఆమెకు సందేహం కలిగింది. అంతేగాక ఆమె మదిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఆ ప్రశ్నలేవో ఊహించండి. (AS 2)
జవాబు:

  1. గుర్రం ఎంత బలాన్ని నేలపై ఉపయోగిస్తుంది?
  2. గుర్రంకు – బండికి మధ్య ఏ నియమం పనిచేస్తుంది?
  3. గుర్రం ముందుకు ఎందుకు వంగవలసి వస్తుంది?
  4. గుర్రం తక్కువ బలాన్ని ఉపయోగిస్తే బండి కదలదా?
  5. సైకిలులాగా, ఎందుకు తేలికగా గుర్రపు బండి కదలటం లేదు?
  6. మరి బండి ఎలా కదులుతుంది?

ప్రశ్న 10.
గెలీలియో ప్రకారం ఫలిత బలం పని చేయనంతవరకు, వస్తువు దాని స్థితిలోనే కొనసాగుతుందని మనకు తెలుసు. అదే విధంగా అరిస్టాటిల్ ప్రకారం ప్రతి వస్తువు కదులుతూ దానంతట అదే నిశ్చలస్థితికి వస్తుందని కూడా మనకు తెలుసు. వీటిలో ఏది సరైనదో మనం చెప్పగలమా? గెలీలియో తెలిపిన నియమాన్ని మీరు ఏ విధంగా అభినందిస్తారు? (AS 6)
జవాబు:
గెలీలియో, అరిస్టాటిల్ నియమాలలో ఏది సరైనదో మనకు చెప్పడం సాధ్యమే.

  1. భూమి మీద కదులుతున్న ఏ వస్తువైనా క్రమంగా నిశ్చలస్థితికి వస్తుందని మన ప్రాచీన తత్త్వవేత్తల భావన.
  2. ఆ కాలంలో గొప్ప తత్త్వవేత్త అయిన అరిస్టాటిల్ కూడా ఇలాగే ఆలోచించి, కదిలే ఏ వస్తువైనా చివరకు నిశ్చలస్థితికి రావాలి కాబట్టి, వాటిపై ఎటువంటి వివరణా అవసరం లేదని భావించాడు.
  3. ఆ సమయంలో గెలీలియో తన ఆలోచనాత్మక ప్రయోగాలను నునుపుతలం గల వాలు బల్లలపై చేశాడు.
  4. గెలీలియో, తలం ఎంత నునుపుగా ఉంటే వదిలిన గోళీ అంత దూరం ప్రయాణం చేస్తుందని గమనించాడు. ఏదీ అడ్డురాకపోతే గోళీ అనంత దూరం ప్రయాణిస్తుందని వివరించాడు.
  5. ఈ విధంగా ఏ బాహ్య బలం పనిచేయనంత వరకు కదులుతున్న వస్తువు అదే గమన స్థితిలో ఉంటుందని చెప్పడం ద్వారా గెలీలియో ఆధునిక విజ్ఞానశాస్త్రానికి తెరతీశాడు. కావున నేను గెలీలియో ప్రాథమిక ప్రయోగాలను పరిశీలించి, అతనిని అభినందిస్తున్నాను. .

ప్రశ్న 11.
20 మీ./సె. సమ వడితో ఒక కారు పడమర వైపు ప్రయాణిస్తుంటే, దానిపై గల ఫలిత బలం ఎంత? (AS 1, AS 7)
జవాబు:
కారు వడి = 20 మీ./సె.
కారు పడమర వైపు సమ వేగంతో ప్రయాణిస్తుంది, కావున త్వరణము శూన్యము.
∴ ఫలిత బలము = శూన్యము.

ప్రశ్న 12.
30 కి.గ్రాల ద్రవ్యరాశి గల ఒక వ్యక్తి 450 న్యూటన్ల బలాన్ని భరించగల ‘తాడు’ సహాయంతో కొండ ఎక్కుతున్నాడు. అతను సురక్షితంగా ఎక్కడానికి కావల్సిన గరిష్ఠ త్వరణం ఎంత? (AS 1, AS 7)
జవాబు:
వస్తువు ద్రవ్యరాశి = m = 30 kg
తాడు తన్యత (T) = 450 న్యూ.
త్వరణం = a = ?
T = N = ma
450 = 30 xa
450 a = 30 = 15 మీ./సె

∴ గరిష్ఠ త్వరణం = a = 15 మీ./సె.

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

ప్రశ్న 13.
కదులుతున్న రైలులో ఉన్న ఒక ప్రయాణికుడు ఒక నాణాన్ని నిట్ట నిలువుగా పైకి విసిరిన, అది అతని వెనుకవైపు పడింది. ఆ రైలు ఎటువంటి చలనంలో ఉంది? (AS 7)
ఎ) ధన త్వరణం బి) సమచలనం సి) ఋణ త్వరణం డి) వృత్తాకార చలనం
జవాబు:
ఎ) ధన త్వరణం.

ప్రశ్న 14.
నిశ్చలస్థితిలో ఉన్న 1.4 కి.గ్రా.ల ద్రవ్యరాశి గల వస్తువు మీద 0.2 సెకన్ల పాటు బలం ప్రయోగించబడింది. బలం ప్రయోగించడం ఆపిన తర్వాత ఆ వస్తువు 2 సెకన్లలో 4 మీ. దూరం కదిలింది. ప్రయోగించిన బల పరిమాణం ఎంత? (AS 1)
జవాబు:
వస్తువు ద్రవ్యరాశి = m = 1.4 కి.గ్రా.
బలం ప్రయోగించిన కాలం = t1 = 0.2 సె||
బల ప్రయోగం ఆపిన తర్వాత
వస్తువు ప్రయాణించిన దూరం = 4 మీ.
వస్తువు ప్రయాణించిన కాలం = t2 = 2 సె||
ప్రయోగించబడిన బలం (F) = m . a
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 3
∴ ప్రయోగించబడిన బలం = F = 14 న్యూ.

ప్రశ్న 15.
పటాలలో ఉన్న 2 కి.గ్రా.ల ద్రవ్యరాశి గల వస్తువు యొక్క త్వరణాన్ని కనుక్కోండి. (AS 1)
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 4
జవాబు:
1) 2 × 10 = 20 kg. ద్రవ్యరాశిపై, 30 N బలం క్రింది వైపు పనిచేస్తుంది.
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 5

ప్రశ్న 16.
రెండు రబ్బరు బాండ్ల సహాయంతో సాగదీసి వదిలినపుడు ఒక వస్తువు 2 మీ./సె². త్వరణాన్ని పొందింది. ఇలా చేయడంలో రబ్బరు బాండు ఒక ప్రమాణ పొడవుకి సాగిందనుకుందాం. రెండోసారి నాలుగు రబ్బరు బాండ్ల సహాయంతో రెట్టింపు ద్రవ్యరాశి గల వస్తువును లాగితే అది పొందే త్వరణం ఎంత? (రబ్బరు బాండ్లను పైన తెలిపిన ప్రమాణ పొడవుకు సాగదీయాలి.) (AS 1)
జవాబు:
మొదటిసారి రెండు రబ్బరు బాండ్ల సహాయంతో సాగదీసి వదిలినపుడు వస్తువు పొందు త్వరణం 2 మీ/సె².
రెండవసారి నాలుగు రబ్బరు బాండ్ల సహాయంతో రెట్టింపు ద్రవ్యరాశిగల వస్తువును లాగితే పొందు త్వరణం, రెండు సందర్భాలలో ప్రయోగించబడిన బలం సమానము. కావున అవి ఒకే త్వరణాన్ని కలిగి ఉంటాయి.
∴ కావలసిన త్వరణం = 2 మీ/సె².

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

ప్రశ్న 17.
ఒక గుర్రం స్థిర వడితో బండిని లాగాలంటే అది ఎల్లప్పుడూ నేలపై బలాన్ని ప్రయోగిస్తూ ఉండాలి. ఎందుకో వివరించండి. (AS 1)
జవాబు:

  1. గుర్రం, బండిపై బలాన్ని ప్రయోగించగానే, బండి చక్రాలకు రోడ్డుకి మధ్యన గల ఘర్షణ బలం గుర్రం ఉపయోగించిన బలానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.
  2. గుర్రం స్థిరవడితో బండిని లాగాలంటే అది ఎల్లప్పుడూ ఘర్షణ బలానికి సమానమైన బలాన్ని బండిపై ప్రయోగించాలి.

ప్రశ్న 18.
5 N బలం m1 ద్రవ్యరాశి గల వస్తువులో 8 మీ./సె². త్వరణాన్ని, m2 ద్రవ్యరాశి గల వస్తువులో 24 మీ/సె². త్వరణాన్ని తీసుకురాగలుగుతుంది. రెండు వస్తువులను జతచేసిన వ్యవస్థపై అదే బలాన్ని ప్రయోగిస్తే అది పొందే త్వరణం ఎంత? (AS 1)
జవాబు:
మొదటి వస్తువుపై ప్రయోగించబడిన బలం = F = 5 N
మొదటి వస్తువు త్వరణం = a = 8 మీ./సె².
న్యూటన్ 2వ నియమం ప్రకారం F = m1a ⇒ m1 = F/a = \(\frac{5}{8}\)
రెండవ వస్తువుపై ప్రయోగించబడిన బలం = F = 5N
రెండవ వస్తువు త్వరణం = a = 24 మీ/సె²
న్యూటన్ 2వ గమన నియమం ప్రకారం F = m2a ⇒ m2 = \(\frac{\mathrm{F}}{\mathrm{a}}=\frac{5}{24}\)
ఈ రెండు వస్తువులను జతచేసిన వ్యవస్థ కావున
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 6

రెండు వస్తువులను జత చేసిన వ్యవస్థపై ఒకే బలం ప్రయోగించడం వలన ఏర్పడు త్వరణము 6 మీ./సె². అగును.

ప్రశ్న 19.
400 గ్రా. ద్రవ్యరాశి గల సుత్తి 30 మీ./సె. వేగంతో కదులుతూ ఒక మేకును తాకింది. మేకు సుత్తిని 0.01 సె.కాలంలో నిశ్చలస్థితికి తీసుకురాగలిగితే, మేకు సుత్తి మీద ప్రయోగించే బలం ఎంత? (AS 1)
జవాబు:
సుత్తి ద్రవ్యరాశి = m = 400 గ్రా = 0.4 కి.గ్రా
సుత్తి తొలివేగం = u = 30 మీ./సె.
సుత్తి తుదివేగం = V = 0
మేకును సుత్తి తాకిన కాలం = t = 0.01 సె.
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 7
∴ మేకు వ్యతిరేకదిశలో సుత్తి పై 1200 న్యూ. బలం కలుగజేయును.

ప్రశ్న 20.
పటంలో ఒక వ్యవస్థ చూపబడింది.
ఈ వ్యవస్థలోని చెక్కదిమ్మల త్వరణాన్ని, తాడులో తన్యతను కనుక్కోండి. (AS 1)
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 8
g = 10 మీ/సె² గా తీసుకోండి.
జవాబు:
వ్యవస్థలో m1 = m2 = 3 కి.గ్రా.
త్వరణం = g = 10 మీ/సె²

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

ప్రశ్న 21.
పటంలో చూపిన విధంగా ఘర్షణ లేని సమాంతర తలంపై మూడు చెక్కదిమ్మలను అమర్చి 30 న్యూటన్ల బలంతో తాడుని లాగుతున్నారు. ప్రతి చెక్కదిమ్మ ద్రవ్యరాశి 10 కి.గ్రా. అయితే ప్రతి చెక్కదిమ్మ యొక్క త్వరణం ఎంత? చెక్కదిమ్మలను కలిపిన తాడులో తన్యత ఎంత? (AS 1)
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 9
జవాబు:
మూడు చెక్కదిమ్మల ద్రవ్యరాశులు m1, m2 మరియు m3 లనుకొనుము.
∴ m1 = m2 = m3 = 10 కి.గ్రా.
చెక్కదిమ్మలపై పనిచేయు బలం = F = 30 N

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 11

తాడులో తన్యతలు T1 మరియు T2 లనుకొనుము.
మొదటి సందర్భంలో తన్యత = T1 = m1 × a = F
= 10 × 1 = 10 N
రెండవ సందర్భంలో తన్యత = T2 = F = (m1 + m2) a
= (10+ 10) (1) = 20 N

ప్రశ్న 22.
టేబుల్ చివర ఒక దీర్ఘ చతురస్రాకారంలో కత్తిరించిన కాగితాన్ని పెట్టి దానిపై మందమైన ఐదు రూపాయల బిళ్లని పటంలో చూపినట్లు నిలబెట్టండి. మీ వేలితో వేగంగా కాగితాన్ని నెట్టండి. ఈ కృత్యాన్ని జడత్వంతో ఏ విధంగా వివరించగలవు? (AS 2)
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 10
జవాబు:
కాగితాన్ని వేలితో గట్టిగా లాగడం వలన కాగితం చలనములోనికి వస్తుంది. ఐదు రూపాయల బిళ్ల నిశ్చల జడత్వం వలన చలనములోనికి రాకుండానే టేబుల్ పై ఉంటుంది.

ప్రశ్న 23.
ఏకరీతి గల రెండు గోళాలను తీసుకోండి. గోళాలు కదిలేందుకు వీలుగా మీ నోటు పుస్తకాలను రెండువైపులా పెట్టి చిన్న దారిని ఏర్పాటు చేయండి. ఇప్పుడు దారిలో ఒక గోళాన్ని పెట్టి, రెండవ గోళీతో కొట్టండి. (క్యారంబోర్డు స్ట్రైకర్ తో కొట్టినట్లు) అలాగే ఒక గోళీ స్థానంలో రెండు, మూడు, నాలుగు గోళీలను పెట్టి గోళీలను కొట్టింది. పరిశీలనల నుంచి మీరు ఏం వివరించగలరు? (AS 5)
జవాబు:
న్యూటన్ మూడవ గమన నియమం ప్రకారం ఒక గోళీ రెండవ గోళీ పై బలాన్ని చూపగా, రెండవ గోళీ మూడవ గోళీ పై వ్యతిరేక దిశలో బలాన్ని చూపుతుంది.
చర్య = – ప్రతిచర్య కావున
అదే విధముగా 3వ గోళీ 4వ గోళీ పై, 4వ గోళీ 3వ గోళీ పై చర్యా, ప్రతిచర్యలకు లోనవుతాయి.

ప్రశ్న 24.
1500 కి.గ్రాల ద్రవ్యరాశి గల వాహనం 1.7 మీ/సె². ఋణ త్వరణంలో ఆగడానికి రోడ్డుకి, వాహనానికి మధ్య గల ఇలం ఎంత ఉండాలి? (AS 7)
జవాబు:
వాహన ద్రవ్యరాశి = m = 1500 కి.గ్రా.
ఋణ త్వరణము = – a = – 1.7 మీ/సె².
బలము (F) = ద్రవ్యరాశి × త్వరణం = 1500 × – 1.7 = – 2550 N
∴ రోడ్డుకి, వాహనానికి మధ్యన గల బలం 2550 N లు చలనదిశకు వ్యతిరేక దిశలో పనిచేయును.

ప్రశ్న 25.
ఎత్తులో ఉన్న ఒక హోపర్ ఇసుకను జారవేసే యంత్రానికి కింద ఉన్న ట్రక్కు 20 మీ/సి. సమవేగంతో వెళ్తుంది. సెకనుకు 20 కిలోల చొప్పున ఇసుక ట్రక్కు మీద పడుతుంటే, ఇసుక పడటం వల్ల ట్రక్కు మీద ప్రయోగింపబడిన బలం ఎంత? (AS 7)
జవాబు:
ట్రక్కు వేగము = 20 మీ/సె.
హోపర్ సెకనుకు 20 కిలోల చొప్పున ఇసుకను ట్రక్ పై వేస్తున్నది.
న్యూటన్ రెండవ నియమము ప్రకారం
బలం = ద్రవ్యరాశి × వేగంలోని మార్పురేటు
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 12

కాని ఇసుకను కొంత ఎత్తు నుండి జారవేసే హోపర్ వంటి పరికరాల విషయంలో దాని వేగంలో మార్పుండదు, కాని అది వేసే ఇసుక పరిమాణంలో సెకను, సెకనుకి మార్పుండును. అనగా వేగం స్థిరము, ద్రవ్యరాశిలో మార్పు వస్తుంది.
∴ F = వేగము × ద్రవ్యరాశిలో మార్పురేటు.
F = v × \(\frac{\Delta \mathrm{m}}{\Delta \mathrm{t}}\) = 20 × 20
F = 400 న్యూ.
∴ ఇసుక పడటం వల్ల ట్రక్కుపై ప్రయోగించబడిన బలం (F) = 400 న్యూ.

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

ప్రశ్న 26.
నిశ్చలస్థితిలో ఉన్న ఇద్దరు స్కేటింగ్ చేసే వ్యక్తులు ఒకరినొకరు తోసుకున్నారు. వీరిలో 60 కి.గ్రా. ద్రవ్యరాశి గల వ్యక్తి 2 మీ/సె. వేగాన్ని పొందితే, 40 కి.గ్రా. ద్రవ్యరాశి గల రెండవ వ్యక్తి పొందే వేగం ఎంత? (AS 7)
జవాబు:
వ్యవస్థలో తొలి ద్రవ్యవేగం = శూన్యము = m1u1 + m2u2
మొదటి వ్యక్తి ద్రవ్యరాశి = m1 = 60 కి.గ్రా,
మొదటి వ్యక్తి తుది వేగము = v1 = 2 మీ./సె.
రెండవ వ్యక్తి ద్రవ్యరాశి = m2 = 40 కి.గ్రా.
రెండవ వ్యక్తి తుది వేగము = v2 = ?
∴ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ప్రకారం
m1u1 + m2u2 = m1v1 + m2v2
m1v1 + m2v2 = 0
m2v2 = -m1v1
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 13

∴ రెండవ వ్యక్తి వ్యతిరేక దిశలో 3 మీ./సె. త్వరణాన్ని కలిగి ఉన్నాడు.

ప్రశ్న 27.
m ద్రవ్యరాశి గల బంతి ‘V’ వడితో గోడను లంబంగా ఢీకొట్టి అదే వడితో వెనుకకు మరలింది. గోడ బంతిపై ప్రయోగించే సరాసరి బలాన్ని మరియు బల దిశను కనుక్కోండి. (అభిఘాత సమయం ‘t’) (AS 7)
జవాబు:
బంతి ద్రవ్యరాశి = m
బంతి తొలివడి = u = – v (↑ ↑)
బంతి తుదివడి = v= v (అదే వడి కావున దిశ వేరే)
ప్రయోగ కాలము = 1 అనుకొనుము.
న్యూటన్ రెండవ గమన నియమం ప్రకారం
∴ F = ma
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 14
బలదిశ గోడ నుండి దూరముగా ఉండును.

9th Class Physical Science 2nd Lesson గమన నియమాలు Textbook InText Questions and Answers

9th Class Physical Science Textbook Page No. 24

ప్రశ్న 1.
టేబుల్ మీది గుడ్డను ఒక్కసారిగా లాగిన, దాని మీద పెట్టిన పాత్రలు దాదాపు కదలకుండా అలాగే ఉండేలా చేసే ట్రిక్ (గారదీ)ని మీరు చూసే ఉంటారు ! ఈ గారడీని సమర్థవంతంగా నిర్వహించడానికి ఏం కావాలి?
జవాబు:
ఒక టేబుల్ క్లాత్, ఏదైనా ఒక వస్తువు కావాలి. ఈ గారడీ చేసే వ్యక్తి గుడ్డను చాలా నైపుణ్యంతో టేబుల్ పై నుండి లాగాలి.

ప్రశ్న 2.
ఎటువంటి గుధ ఉపయోగిస్తావు? దళసరి కాన్వాస్ గుడ్డనా లేదా పల్చని సిల్కు గుడ్డనా?
జవాబు:
దళసరి కాన్వాస్ గుడ్డను ఈ గారడీ చేయడానికి వాడాలి.

ప్రశ్న 3.
టేబుల్ గుడ్డపై పెట్టిన పాత్రలు అధిక ద్రవ్యరాశిని కలిగి ఉండాలా? తక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉండాలా?
జవాబు:
టేబుల్ గుడ్డపై పెట్టిన పాత్రలు కొద్దిగా ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉండాలి. తేలికపాటి వస్తువులైన ప్లాస్టిక్ కప్పులు, స్పాంజ్ లు వాడకూడదు.

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

ప్రశ్న 4.
గుడ్డను ఒక్కసారిగా ఎక్కువ బలాన్ని ప్రయోగించి లాగాలా? లేదా సున్నితంగా, నిలకడగా బలాన్ని ప్రయోగించాల్సి ఉంటుందా?
జవాబు:
గుడ్డను తక్కువ బలంతో ఒక్కసారిగా లాగండి.

ప్రశ్న 5.
10 కి.మీ./సె. వేగంతో శూన్యంలో ప్రయాణిస్తున్న రాకెట్ నుండి విడిపోయిన చిన్న వస్తువు యొక్క వేగం ఎంత ఉంటుంది?
జవాబు:
నిర్దిష్ట వేగంతో చలిస్తున్న ఒక్క వస్తువు నుండి విడిపోయిన మరొక చిన్న వస్తువు కూడా అదే వేగంతో ప్రయాణిస్తుంది. కావున 10కి.మీ/ సెకను వేగంతో శూన్యంలో ప్రయాణిస్తున్న రాకెట్ నుండి విడిపోయిన చిన్న వస్తువు యొక్క వేగము కూడా 10కి.మీ/సెకన్ ఉంటుంది.

9th Class Physical Science Textbook Page No. 27

ప్రశ్న 6.
ప్రక్క పటాన్ని గమనించండి. 80 కి.గ్రా.ల ద్రవ్యరాశి గల దృఢమైన వ్యక్తి పటంలో చూపిన విధంగా గరిష్ఠంగా ఎంత బరువును పైకి ఎత్తగలడు?
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 15
జవాబు:
వ్యక్తి అతని బరువుకు సమానమైన భారమును ఎత్తగలడు. ఎందుకనగా ఫలితబలము శూన్యము.
కావున T – mg = 0 = mg = T
ఇక్కడ g = 10, ద్రవ్యరాశి = 80 కి.గ్రా.
∴ T = 80 × 10 = 800 N

ప్రశ్న 7.
తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ యొక్క ద్రవ్యవేగం ఎంత?
జవాబు:
ద్రవ్యవేగము = ద్రవ్యము X వేగము
∆t = m (v – u)
ఇక్కడ వస్తువు తొలివేగము (u) మరియు తుది వేగము (v)లు సమానము కావున m (v – u) = ∆t = 0
∴ తిరుగుతున్న ఫ్యాను యొక్క ద్రవ్యవేగము శూన్యము.

ప్రశ్న 8.
ఫలిత బలం లేనప్పుడు వస్తువు వక్రమార్గంలో చలించగలదా?
జవాబు:
చలించగలదు. ఉదాహరణకు మనము ఒక వక్రమార్గములో ప్రయాణించుచున్నపుడు, అభికేంద్ర బలము వలన మనము ఆకర్షించబడతాము. అదే సమయంలో మనపై అపకేంద్రబలము పనిచేయును. ఈ ఫలితబలము వలన మన వాహన టైర్లకు, రోడ్డుకు మధ్య ఘర్షణ బలము ఏర్పడును.

ప్రశ్న 9.
తాడు యొక్క ద్రవ్యరాశిని విస్మరించినప్పుడు దానిలో ఉన్న తన్యత ఏకరీతిగా ఉంటుందని ఎలా నిరూపిస్తావు?
జవాబు:
ఒక తాడుకు రాయిని కట్టి నీటిలో వ్రేలాడదీసినపుడు దాని ద్రవ్యరాశి గురుత్వాకర్షణ (8)పై ఆధారపడును. అదే విధముగా అదే రాయిని గాలిలో వ్రేలాడదీసిన దాని ద్రవ్యరాశి కూడా ‘g’ పై ఆధారపడును. దీనిని బట్టి తాడు యొక్క ద్రవ్యరాశిని విస్మరించినప్పుడు దానిలో ఉన్న తన్యత ఏకరీతిగా ఉంటుందని గ్రహించవచ్చును.

9th Class Physical Science Textbook Page No. 31

ప్రశ్న 10.
ఒక బంతిపై భూమి ప్రయోగించే బలం 8N అయితే, ఆ బంతి భూమిపై ప్రయోగించే బలం ఎంత?
జవాబు:
బంతిపై ప్రయోగించిన బలం = 8N
బంతి భూమిపై ప్రయోగించే బలం = బంతిపై ప్రయోగించిన బలం = 8N

ప్రశ్న 11.
ఒక చెక్క దిమ్మ క్షితిజ సమాంతర తలంపై ఉంది. దానిపై కిందికి లాగే అభిలంబ బలం గురుత్వాకర్షణ బలం, పైకి నెట్టే అభిలంబ బలం పనిచేస్తాయి. ఆ రెండు బలాలు పరిమాణంలో సమానంగా ఉంటూ, వ్యతిరేక దిశలలో ఉంటాయా? ఆ బలాల జతను చర్య – ప్రతిచర్య జతగా చెప్పవచ్చా? మీ స్నేహితులతో చర్చించండి.
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 16
జవాబు:

  1. చెక్కదిమ్మపై గురుత్వాకర్షణ బలం, పైకి నెట్లే అభిలంబ బలం సమానంగా మరియు వ్యతిరేక దిశలలో ఉంటాయి.
  2. ఆ బలాల జతను చర్య – ప్రతిచర్య జతగా చెప్పవచ్చును.

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

ప్రశ్న 12.
మంటలను ఆర్పడానికి ఉపయోగించే గొట్టాల నుండి అతి వేగంగా నీరు బయటకు వస్తుంది. ఆ గొట్టాలను పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకు?
జవాబు:
మంటలను ఆర్పడానికి వాడు గొట్టాలను పట్టుకున్నపుడు అది మన చేతులపై బలాన్ని కలుగజేస్తుంది. ప్రతిచర్యగా మనము ఆ గొట్టముపై బలంను ప్రదర్శించవలెనన్న సాధ్యపడదు. కావున ఆ గొట్టాలను పట్టుకోవడం చాలా కష్టం.

9th Class Physical Science Textbook Page No. 33

ప్రశ్న 13.
భూవాతావరణంలోకి ప్రవేశించిన ఒక ఉల్క మండిపోయింది. అలా మండినప్పుడు దాని ద్రవ్యవేగము ఏమైనట్లు?
జవాబు:
భూవాతావరణంలోకి రాగానే ఉల్క మండిపోవటం వలన దాని ద్రవ్యవేగము శూన్యమవుతుంది.

ప్రశ్న 14.
బంతిని నిట్టనిలువుగా పైకి విసిరినప్పుడు, భూ ఉపరితలం నీ కాళ్లపై ప్రయోగించే అభిలంబ బలంలో ఏమైనా మార్పు వస్తుందా?
జవాబు:
నా శరీరాన్ని తుల్యము (balance) చేయుటకు భూఉపరితలము ప్రదర్శించు అభిలంబ బలము పెరుగును.

ప్రశ్న 15.
చెట్టుపై నుండి జారిపడిన కొబ్బరికాయ నేలని తాకి ఆగిపోయింది. దాని ద్రవ్యవేగం ఏమైందని చెప్పగలం?
జవాబు:
కొబ్బరికాయ నేలను తాకి ఆగిపోవుట వలన దాని ద్రవ్యవేగము శూన్యము అగును.

ప్రశ్న 16.
కొన్ని కార్లలో రక్షణ కొరకు గాలి సంచులు వాడతారు. ఎందుకు?
జవాబు:
గాలి సంచులుగల కార్లకు ప్రమాదములు జరిగినపుడు ప్రచోదన కాలము పెరుగుట వలన కారు నడుపు వ్యక్తిపై ప్రయోగించబడు బలము తగ్గి, అతను ప్రాణహాని నుండి రక్షించబడతాడు.

9th Class Physical Science Textbook Page No. 24

ప్రశ్న 17.
అన్ని వస్తువులూ ఒకే జడత్వాన్ని కలిగి ఉంటాయా? వస్తువుల జడత్వాన్ని నిర్ణయించే అంశాలు ఏవి? ఉదాహరణతో వివరించండి.
జవాబు:
అన్ని వస్తువులూ ఒకే జడత్వాన్ని ప్రదర్శించవు. జడత్వమును నిర్ణయించు అంశము ఆ వస్తువుకుండే ద్రవ్యరాశి,

ఉదాహరణ :

  1. మైదానంలో ఒక ఫుట్ బాల్ ను కాలితో తన్నినట్లయితే, అది కొంత వేగంతో తన్నిన దిశలో వెళ్తుంది.
  2. అదే పరిమాణము గల ఒక రాయినిగాని తన్నినట్లయితే దాని చలనంలో ఎటువంటి మార్పును గమనించవు మరియు నీ కాలికి దెబ్బ తగులుతుంది.
  3. దీనికి కారణము రాయికి అధిక ద్రవ్యరాశి ఉండటం వలన బంతికి తక్కువ ద్రవ్యరాశి ఉండటం వలన త్వరగా స్థితిని మార్చుకోగలిగినది.
  4. ఈ విధంగా పదార్థ ద్రవ్యరాశి వస్తు జడత్వంను నిర్ణయిస్తుంది.

9th Class Physical Science Textbook Page No. 32

ప్రశ్న 18.
పోల్ వాల్ట్ ఆడేవారు స్పాంజ్ తో చేసిన పరుపు మీద దూకుతారు. ఎందుకు?
జవాబు:
స్పాంజ్ పరుపుపై ఫలిత ద్రవ్యవేగము తక్కువగా ఉండును. కావున పోల్ వాల్ట్ ఆడేవారిపై తక్కువ ప్రతిచర్యా బలం పని చేస్తుంది.

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

ప్రశ్న 19.
ఇసుక నేల మీద దూకటం సురక్షితమా లేదా సిమెంటు గచ్చుపై దూకటం సురక్షితమా? ఎందుకు?
జవాబు:
సిమెంటు గచ్చుపై కన్నా ఇసుకపై దూకటం సురక్షితము. ఎందుకంటే మృదువైన మెత్తటి తలాలు వస్తువుని ఆపటంలో ఎక్కువ సమయాన్ని తీసుకోవటం వల్ల ఆ పేదూరం ఎక్కువగా ఉంటుంది.

ఉదాహరణ సమస్యలు

9th Class Physical Science Textbook Page No. 25

ప్రశ్న 1.
సమతలంపై ఉంచిన ‘M’ ద్రవ్యరాశి గల వస్తువు పై క్షితిజ సమాంతరంగా 100 బలం నిరంతరంగా ప్రయోగించడం వల్ల ఆ వస్తువు నిలకడగా కదులుతుంది.
ఎ) స్వేచ్ఛా వస్తు పటాన్ని (FBD) (ఒక నిర్దిష్ట సమయం వద్ద ఆ వస్తువుపై పనిచేస్తున్న అన్ని బలాలను చూపే పటం) గీయండి.
బి) ఘర్షణ విలువ ఎంత?
సాధన:
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 17
వస్తువు నిలకడగా కదులుతుందని ఇవ్వబడింది. అంటే క్షితిజ సమాంతర, క్షితిజ లంబ దిశలో ఆ వస్తువుపై పనిచేసే ఫలిత బలం శూన్యం అని అర్ధం.

ఆ వస్తువుపై క్షితిజ సమాంతర దిశలో ఘర్షణ బలం (f), నెట్టిన బలం (F). లు పనిచేస్తున్నాయి.

క్షితిజ సమాంతర దిశలో ఫలిత బలం
Fnet, x = 0 అని మనకు తెలుసు.
F + (-f) = 0
F = f

కాబట్టి ఆ వస్తువుపై పనిచేసే ఘర్షణ బలం = 10 న్యూటన్లు.

9th Class Physical Science Textbook Page No. 27

ప్రశ్న 2.
1కి.గ్రా. ద్రవ్యరాశి మరియు 1 మీటరు పొడవు గల చాప గచ్చుపై పరచబడి ఉంది. చాప ఒక చివరను పట్టుకుని దాని – పొడవు వెంట రెండవ చివరివైపు 1 మీ/సె. స్థిర వడితో చాప మొత్తం చలనంలోకి వచ్చేంత వరకు చాప పూర్తిగా తిరగబడేంత వరకు) లాగాలంటే చాపపై ఎంత బలాన్ని ప్రయోగించాలి?
సాధన:
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 18
పటం 10లో చూపిన విధంగా చాప చివర బాగాన్ని 1 మీ/సె. స్థిర వడితో లాగుతున్నప్పుడు చలనం లోకి వచ్చే చాప భాగపు ద్రవ్యరాశి క్రమంగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ద్రవ్యరాశి స్థిరంగా ఉండదు.

మొత్తం చాప చలనంలోకి రావడానికి పట్టే సమయం,
∆t = చాప చివర భాగం కదలిన దూరం / వడి = 2/1 = 2 సె.
(చాప చివరి భాగం కదిలిన దూరం = 1మీ + 1మీ = 2 మీటర్లు)
న్యూటన్ రెండవ గమన నియమం నుండి
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 19

∆m అనేది ∆t సమయంలో వచ్చే ద్రవ్యరాశిలోని మార్పును సూచిస్తుంది. 2 సెకన్ల కాలంలో ద్రవ్యరాశిలో వచ్చే మార్పు మొత్తం చాప ద్రవ్యరాశికి సమానం.
Fnet = (1 మీ/సె) X (1 కి.గ్రా) / 2 సె. = 1/2 న్యూటన్
క్షితిజ సమాంతర దిశలో ఒకే బలం పనిచేస్తుంది కనుక చాప చివర ప్రయోగించాల్ని బలం 1/2 న్యూటన్.

9th Class Physical Science Textbook Page No. 28

ప్రశ్న 3.
న్యూటన్ గమన నియమాలను అటవుడ్ ఒక ప్రయోగం ద్వారా నిరూపించాడు. పటంలో చూపినట్లు అటవుడ్ యంత్రంలో కప్పి ద్వారా పంపిన సాగే గుణం లేని ఒక తాడుకు రెండు చివరలలో m1 మరియు m2 ద్రవ్యరాశులు గల భారాలు వేలాడుతుంటాయి. (m1 > m2) అయిన, ఆ రెండు భారాల త్వరణాలను, తాడులో తన్యతను లెక్కించండి.
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 20
సాధన:
పటంలో చూపినట్లు తాడులో గల తన్యత ఎల్లప్పుడూ వస్తువులను పైకి లాగుతుంది.
m1 ద్రవ్యరాశి యొక్క FBD ద్వారా ఆ ద్రవ్యరాశిపై తన్యత, (T) పై వైపుకు, దాని భారం (m1 g) కిందవైపుకు పని చేస్తున్నాయని గ్రహించవచ్చు.
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 21
m1 పై ఫలిత బలం,
Fnet = m1a
m1g – T = m1a ………….. (1)
m1 పై ఫలిత బలం కలగజేసే త్వరణం ‘a’ m1 కిందకి కదులుతుంటే m2 పైకి వెళ్తుంది. కనుక వాటి త్వరణాల పరిమాణాలు సమానం.
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 22
m2 యొక్క FBD పటం నుండి
Fnet = T – m2g = m2a ……………. (2)
(1), (2) సమీకరణాలను సాధించగా
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 23

9th Class Physical Science Textbook Page No. 33

ప్రశ్న 4.
12000 కి.గ్రా. ద్రవ్యరాశి (m1) గల ఫిరంగి నున్నని సమాంతర తలంపై ఉంది. అది 300 కి.గ్రా. ద్రవ్యరాశి (m2) గల గుండును క్షితిజ సమాంతర దిశలో v2 = 400 మీ./సె. వేగంతో విడుదల చేస్తే, ఆ ఫిరంగి వేగం (v1) ఎంత?
సాధన:
ఫిరంగి ద్రవ్యరాశి (m1) = 12000 కి.గ్రా
గుండు ద్రవ్యరాశి (m2) = 300 కి.గ్రా
ఫిరంగి వేగము (v1) = ?
గుండు వేగము (v2) = 400 మీ./సె.
ఫిరంగి పేల్చిన తర్వాత దాని వేగం v1 అనుకొనుము.
వ్యవస్థ తొలి ద్రవ్యవేగం శూన్యం.
వ్యవస్థ తుది ద్రవ్యవేగం = m1v1 + m2v2.
రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమము ప్రకారం
m1v1 + m2v2 = 0
m1v1 = – m2v2
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 24

ఫిరంగి పేలిన తర్వాత దాని వేగం = 10 మీ/సె.
ఫిరంగి వ్యతిరేక దిశలో కదులుతుంది.

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

పరికరాల జాబితా

చెక్క ట్రాక్, కాగితపు రింగు లేదా బంతి, పెన్నుమూత, గాజు గోళీ, సీసా, క్యారమ్ బోర్డు నమూనా, చెక్క దిమ్మలు, చెక్క స్కేలు, సాగే గుణం లేని తాడు, బెలూన్, స్ట్రా ముక్క, తాడు, రెండు కోడిగుడ్లు, మెత్తని దిండు, కప్పీ, రెండు స్ప్రింగ్ త్రాసులు, పరీక్ష నాళిక, రబ్బరు కార్కు, బున్సెన్ బర్నర్, దారము, స్టాండు, నీరు

9th Class Physical Science 2nd Lesson గమన నియమాలు Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

కాగితపు రింగుపై ఉంచిన పెన్ను మూత చలనాన్ని వివరించటం :

ప్రశ్న 1.
జడత్వాన్ని నిరూపించు ప్రయోగాన్ని తెల్పుము.
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 25
జవాబు:
ఉద్దేశ్యం : వస్తువు యొక్క జడత్వాన్ని నిరూపించుట.

కాగితపు రింగు కావలసిన పరికరాలు :
పెన్నుమూత, కాగితపు రింగు, వెడల్పు మూతిగల సీసా.

పద్ధతి :

  1. ఒక దళసరి కాగితంతో రింగును తయారుచేయండి.
  2. పటంలో చూపినట్లు ఒక సీసామూత మీద ఆ రింగును నిలబెట్టండి.
  3. సీసామూతికి సరిగ్గా పైన పేపరు రింగుపై ఒక పెన్నుమూతను నిలబెట్టండి.
  4. కాగితపు రింగును ఒక్కసారిగా వేగంగా మీ చేతితో లాగండి.
  5. పెన్నుమూత, వెడల్పు మూతిగల సీసాలోనికి పడిపోతుంది.

వివరణ :
పై ప్రయోగాన్ని బట్టి మార్పును వ్యతిరేకించే లక్షణం పెన్నుమూత ప్రదర్శించినది కావున దానికి జడత్వ లక్షణం కలదని చెప్పవచ్చును.

కృత్యం – 2

స్టైకరుతో కొట్టిన కేరమ్ బోర్డు కాయిన్ చలనాన్ని పరిశీలించడం :

ప్రశ్న 2.
స్ట్రైకరుతో కొట్టిన కేరమ్ బోర్డు కాయిన్ చలనాన్ని పరిశీలించు ప్రయోగాన్ని వివరింపుము.
జవాబు:
ఉద్దేశ్యం :
స్ట్రైకరుతో కొట్టినపుడు కేరమ్ బోర్డు కాయిన్ చలనాన్ని పరిశీలించుట.

కావలసిన పరికరాలు :
క్యారమ్ బోర్డు, కాయిన్స్, స్టైకరు.
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 26

పద్ధతి :

  1. క్యారమ్ బోర్డుపై కాయిన్లను ఒకే నిలువు వరుసలో నిలబెట్టండి.
  2. కింది కాయినను స్ట్రైకర్ తో గట్టిగా కొట్టండి.
  3. పటంలో చూపినట్లు కింది కాయిన్ మాత్రమే వరుస నుండి బయటకు వస్తుంది.
  4. క్యారమ్ కాయిన్ల దొంతర నిలువుగా కిందకు దిగింది.

వివరణ :
పై ప్రయోగం ద్వారా వస్తువు పై పనిచేసే ఫలిత బలం శూన్యం అయినదని అర్ధమవుతుంది.

కృత్యం – 3

రెండు చెక్కపెట్టెలను ఒకే బలంతో నెట్టడం :

ప్రశ్న 3.
అధిక ద్రవ్యరాశి గల వస్తువు అధిక జడత్వాన్ని కలిగి ఉంటుందని చూపండి.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 27

  1. రెండు వేరు వేరు ద్రవ్యరాశులు గల చెక్కదిమ్మెలను గచ్చుపై ఒక సరళరేఖపై ఉంచండి.
  2. రెండు దిమ్మలను చెక్క స్కేలు సహాయంతో ఒకే బలంతో ముందుకు నెట్టండి.
  3. తక్కువ ద్రవ్యరాశి గల చెక్కదిమ్మ ఎక్కువ త్వరణాన్ని పొంది ఎక్కువ దూరం వెళ్ళింది.
  4. ఎక్కువ ద్రవ్యరాశి గల చెక్కదిమ్మ తక్కువ త్వరణాన్ని పొంది తక్కువ దూరం కదులుతుంది.
  5. ఈ పరిశీలన వల్ల ఎక్కువ ద్రవ్యరాశి గల వస్తువు ఎక్కువ జడత్వాన్ని పొందుతాయని తెలుస్తుంది.

కృత్యం – 4

ప్రశ్న 4.
ఫలిత బలం – త్వరణం
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 28

నున్నగా ఉన్న తలం మీద ఒక మంచు ముక్క నుంచి నెమ్మదిగా నెట్టవలెను. అది వేగాన్ని ఎలా పుంజుకుంటుందో (ఎలా త్వరణాన్ని పొందుతుందో) గమనించవలెను. ఇప్పుడు ఫలిత బలాన్ని పెంచి, వేగంలో మార్పుని గమనించవలెను.
మంచు ముక్క త్వరణం పెరుగుతుంది.

కృత్యం – 5

ప్రశ్న 5.
ద్రవ్యరాశి – త్వరణం
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 29

ఒక మంచు ముక్కపై కొంత బలాన్ని ప్రయోగించినపుడు, అది త్వరణాన్ని పొందుతుంది. ఇప్పుడు ఎక్కువ ద్రవ్యరాశి గల మంచు ముక్కపై దాదాపు అంతే బలాన్ని ప్రయోగించి, త్వరణాన్ని పరిశీలించవలెను.

ఎక్కువ ద్రవ్యరాశి గల మంచుముక్క, తక్కువ ద్రవ్యరాశి గల మంచు ముక్క పొందిన త్వరణాన్ని పొందలేదు.

గమనించినది :
ద్రవ్యరాశి స్థిరంగా ఉన్నప్పుడు ఫలిత బలం ఎక్కువగా ఉంటే త్వరణం కూడా అధికంగా ఉంటుంది. అలాగే ఫలిత బలం స్థిరమైనప్పుడు ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటే ఆ వస్తువుపై పొందిన త్వరణం తక్కువగా ఉంటుంది.

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

కృత్యం – 6

రెండు స్ప్రింగు త్రాసులను వ్యతిరేకదిశలో లాగటం :

ప్రశ్న 6.
రెండు స్ప్రింగ్ త్రాసుల ద్వారా న్యూటన్ మూడవ గమన సూత్రాన్ని ప్రయోగపూర్వకముగా నిరూపించుము.
(లేదా)
చర్య, ప్రతిచర్య బలాలు పరిమాణంలో సమానమని, దిశలో వ్యతిరేకమని నిరూపించు ప్రయోగమును తెల్పుము.
జవాబు:
ఉద్దేశ్యం : చర్య, ప్రతిచర్య బలాలను చూపుట.

కావలసిన పరికరాలు : రెండు స్ప్రింగు త్రాసులు, వాటి కొక్కెములు.
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 30

పద్ధతి :
వ్యతిరేక దిశలో పనిచేసే బలాలు

  1. ఒకే విధమైన కొలతలుగల రెండు స్ప్రింగు త్రాసులు తీసుకోండి.
  2. వాటి కొంకీలను పటంలో చూపినట్లు కలపండి.
  3. ఇరువైపుల నుండి స్ప్రింగు త్రాసులు పట్టుకొని లాగండి.
  4. అవి రెండూ సమాన రీడింగులను సూచిస్తాయి.
  5. ఆ త్రాసులలోని స్ప్రింగులు ఒకదానిపై ఒకటి సమాన (F1 = F2) దిశలో, వ్యతిరేకంగా (F1 = – F2 ) బలాలు కలుగజేసుకుంటాయి.
  6. ఈ రెండు వ్యతిరేక బలాల్ని కలిపి చర్య – ప్రతిచర్య బలాల జత అంటాము.

కృత్యం – 7

బెలూన్ రాకెట్:

ప్రశ్న 7.
బెలూన్ రాకెట్ ప్రయోగాన్ని న్యూటన్ మూడవ గమన నియమంతో ఏ విధముగా వివరించవచ్చును?
జవాబు:
ఉద్దేశ్యం :
బెలూన్ రాకెట్ ద్వారా న్యూటన్ మూడవ సూత్రాన్ని పరీక్షించుట.

పరికరాలు :
బెలూన్, దారము, స్ట్రా. టేపు.
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 31

పద్ధతి :

  1. ఒక బెలూన్లోకి గాలి ఊది బయటికి వెళ్ళకుండా మూతిని గట్టిగా వేళ్ళతో పట్టుకోండి.
  2. ఒక దారాన్ని స్ట్రా గుండా పంపండి.
  3. పటంలో చూపిన విధంగా బెలూను స్టాకు టేపుతో అతికించండి.
  4. దారం ఒక చివరి కొనను మీరు పట్టుకొని, రెండవ చివరను మీ స్నేహితుడిని పట్టుకోమనండి.
  5. బెలూన్ మూతి వద్ద వేళ్ళను తీసివేయండి. మూతి ఉన్న దిశ ఎడమ దిశ అనుకొనుము.
  6. బెలూన్లోని గాలి మూతి ద్వారా బయటికి కొంత వేగంతో, ఎడమవైపుకు వెళుతుంది.
  7. బెలూన్ కుడి చేతి వైపుకు కదులుతుంది. దానికి అంటిపెట్టుకున్న స్ట్రా కూడా దానితోపాటు వెళు 190ది.

ఈ విధముగా చర్య (గాలి వెళ్ళడం), ప్రతిచర్య (బెలూన్ వెళ్ళడం) సమానముగా ఉండి, వాటి దిశలు వ్యతిరేకముగా కలవని తెలియుచున్నది.

ప్రయోగశాల కృత్యం

ప్రశ్న 8.
రెండు విభిన్న వస్తువుల మీద పనిచేయు చర్య, ప్రతిచర్య బలాలను ప్రయోగపూర్వకముగా చూపుము.
జవాబు:
ఉద్దేశ్యం :
రెండు విభిన్న వస్తువుల మీద పనిచేసే చర్య, ప్రతిచర్య బలాలను చూపుట.

కావలసిన పరికరాలు :
పరీక్షనాళిక, రబ్బరు కార్కు, బున్సెన్ బర్నర్, స్టాండు, దారం.
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 32

పద్ధతి :

  1. ఒక పరీక్ష నాళికలో కొద్దిగా నీరు తీసుకొని దాని మూతిని రబ్బరు కార్కుతో మూయండి. –
  2. పటంలో చూపిన విధంగా రెండు దారాల సహాయంతో పరీక్ష నాళికను క్షితిజ సమాంతరంగా వేలాడదీయండి.
  3. బుస్సెన్ బర్నర్ సహాయంతో పరీక్ష నాళికను వేడి చేయండి.
  4. వేడిచేయటం వలన పరీక్షనాళికలోని నీరు ఆవిరైపోతుంది.
  5. ఆ ఆవిరి రబ్బరు కారును బయటకు నెట్టే వరకు పరీక్ష నాళికను వేడి చేస్తూనే ఉండాలి.
  6. కార్కు బయటకు రావడం (చర్య), పరీక్ష నాళిక వెనుకకు జరగడం (ప్రతిచర్య) ఒక్కసారిగా గమనించవచ్చు.
  7. కార్కు ద్రవ్యరాశి, పరీక్షనాళిక ద్రవ్యరాశి కన్నా తక్కువ కావడం వలన పరీక్షనాళిక కన్నా కార్కు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది.
    పై ప్రయోగం ద్వారా చర్య, ప్రతిచర్య బలాలను గమనించవచ్చును.

AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు

ప్రశ్న 9.
గ్రుడ్డును జారవిడవడం
AP Board 9th Class Physical Science Solutions 2nd Lesson గమన నియమాలు 33
రెండు కోడి గ్రుడ్లను తీసుకొని వాటిని ఒకే ఎత్తు నుండి, ఒకటి గట్టి గచ్చు మీద పడేటట్లుగా, రెండవది మెత్తని దిండు మీద పడేటట్లుగా వదలండి. తలాన్ని తాకిన తరువాత ఆ గ్రుడ్లలో గమనించిన మార్పులు వివరించుము.
జవాబు:

  1. గట్టి గచ్చు మీద గ్రుడ్డు పగిలిపోతుంది కారణం, అధిక బలం అతిస్వల్ప కాలంలో పని చేయడమే.
  2. మెత్తని దిండు మీద పడిన గ్రుడ్డు పగలదు కారణం, తక్కువ బలం ఎక్కువ కాలం పాటు పని చేసింది.

పై రెండు సందర్భాలలో గ్రుడ్డు పగులుతుందా, పగలదా అని నిర్ణయించేది గ్రుడు మీద పనిచేసే ఫలిత బలమే అని తెలుసుకున్నాను.

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం

SCERT AP 9th Class Physics Study Material Pdf Download 1st Lesson చలనం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Physical Science 1st Lesson Questions and Answers చలనం

9th Class Physical Science 1st Lesson చలనం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
“ఆమె స్థిరవడితో నిర్దిష్ట దిశలో పరిగెడుతుంది.” ఈ వాక్యాన్ని చలనానికి సంబంధించిన భావనల ఆధారంగా తక్కువ పదాలలో రాయండి. (AS 1)
జవాబు:
“ఆమె స్థిర వేగంతో చలిస్తుంది”.

కారణం :
నిర్దిష్ట దిశలో స్థిరవడిని స్థిర వేగం అంటారు.

ప్రశ్న 2.
పటంలో A, B అనే రెండు కార్ల చలనాన్ని చూపే s – t (స్లు ఇవ్వడం జరిగింది. ఏ కారు వడి ఎక్కువ? ఎందుకు? (AS 1)
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 1
జవాబు:
A – కారు ఎక్కువ వడి కలిగి ఉంటుంది.

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 2
కారణం :
A, B ల నుండి X, Y అక్షాలకు లంబాలను గీచినపుడు, కారు తక్కువ సమయం (t1)లో ఎక్కువ దూరం (s1) ప్రయాణించినట్లుగా తెలుస్తుంది.
(లేదా)
OA మరియు OBరేఖల వాలులు ఏదైనా బిందువు వద్ద కనుగొనండి. OA వాలు ఎక్కువ రెట్లుగా గమనిస్తాము. కావున ఈ వడి ఎక్కువ.

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం

ప్రశ్న 3.
వది, వేగాల మధ్య భేదమేమి? వివరించండి. (AS 1)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 3

ప్రశ్న 4.
స్థిర త్వరణం అనగానేమి? (AS 1)
జవాబు:

  1. వేగంలో మార్పురేటును త్వరణం అంటారు.
  2. త్వరణం అనేది ఒక వస్తువు యొక్క వేగంలో మార్పు ఎంత త్వరగా జరుగుతుందో తెలియజేస్తుంది.
  3. నిర్దిష్ట కాలవ్యవధులలో ఒక వస్తువు వేగంలో మార్పులు సమానంగా ఉంటే, ఆ వస్తువు త్వరణాన్ని సమత్వరణం అంటారు.
  4. ఉదాహరణకు మనం ఒక కారు నడుపుతున్నామనుకుందాం. ఆ కారు వేగాన్ని ఒక సెకనులో 30 కి.మీ/గం. నుండి 35 కి.మీ/గం||కు, తర్వాత సెకనులో 35 కి.మీ/ గం|| నుండి 40 కి.మీ | గం||కు, అదే క్రమంలో ప్రతి సెకనుకు దాని వేగాన్ని పెంచుతున్నామనుకుందాం. ఈ సందర్భంలో కారు వేగం ప్రతి సెకనుకు 5 కి.మీ/గం. చొప్పున పెరుగుతుంది. దీనినే ‘స్థిరత్వరణం’ అంటారు.

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 4

ప్రశ్న 5.
“ఒక కారు 70 కి.మీ./గం|| స్థిరవేగంతో వక్రమార్గంలో చలిస్తుంది.” అని మీ స్నేహితుడు మీతో అంటే అతను చెప్పిన దానిని మీరెలా సరిచేస్తారు? (AS 1)
జవాబు:
“ఒక కారు 70 కి.మీ./ గం. స్థిరవడితో వక్రమార్గంలో చలిస్తుంది.”

కారణం :
వక్రమార్గంలో వడి స్థిరంగా వుంటుంది. కాని వేగం మారుతూ ఉంటుంది.

ప్రశ్న 6.
ఒక కణం స్థిర వేగంతో చలిస్తుంది. ఏదేని నిర్ణీత కాలవ్యవధిలో దాని సరాసరి వేగం, తక్షణ వేగంతో సమానంగా ఉంటుందా? లేదా? వివరించండి. (AS 2, AS 1)
జవాబు:
ఇక్కడ వేగం స్థిరంగా వుంది. కావున ఏదేని నిర్ణీత కాలవ్యవధిలో దాని సరాసరి వేగం తక్షణ వేగంతో సమానంగా ఉంటుంది.
ఉదా :
ఒక తిన్నని రోడ్డుపై ఒక కారు 10 మీ/సె ఫిరవేగంతో చలిస్తున్నదనుకొనుము.
1 సె||లో కారు ప్రయాణించిన దూరం (AB) = 10 మీ.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 5

అదే విధంగా 2 సె॥లో కారు ప్రయాణించిన దూరం (AC) = 10 × 2 = 20 మీ.
∴ A నుండి C కు గల సరాసరి వేగం = \(\frac{20}{2}\) = 10 మీ/సె.
∴ A లేదా B లేదా C లేదా ఏదేని బిందువు వద్ద దాని తక్షణ వడి = 10 మీ/సె.

ప్రశ్న 7.
ఒక వస్తువు త్వరణం స్థిరంగా ఉన్నప్పుడు దాని వేగందిశ పూర్తిగా వ్యతిరేక దిశలోనికి మారగలదా? ఒక ఉదాహరణతో వివరించండి. అలా మారడం వీలుకాదనుకుంటే ఎందుకు కాదో వివరించండి. (AS 2, AS 1)
జవాబు:
నిట్టనిలువుగా పైకి విసిరిన వస్తువు విషయంలో ఇది నిజమగును.
ఉదా: ఒక వస్తువును నిట్టనిలువుగా పైకి విసిరామనుకోండి. అది పైకి పోవునపుడు దాని వేగం పై దిశలో వుంటుంది. కాని అదే వస్తువు క్రిందికి పడేటప్పుడు దాని వేగ దిశ క్రిందికి ఉంటుంది. ఈ రెండు సందర్భాలలోను త్వరణం (సంఖ్యాత్మకంగా) సమానంగా ఉంటుంది. కాని దిశ మాత్రం వ్యతిరేకంగా ఉంటుంది.

ప్రశ్న 8.
పటంలో చూపిన విధంగా ఒక కణం వక్రమార్గంలో చలిస్తుంది. A నుండి B కి, స్థానభ్రంశ సదిశను గీయండి. (AS 5)
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 6
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 7

ప్రశ్న 9.
ఒక వస్తువు వడి ఏకరీతిగా తగ్గుతూ వుంటే దాని చలనాన్ని తెలిపే దూరం – కాలం గ్రాఫ్ గీయండి. (AS 5)
జవాబు:
బ్రేకులు వేసిన తరువాత ఒక కారు చలనాన్ని గమనించండి. దాని చలనం క్రింది విధంగా వున్నదనుకోండి.

కాలము (t) సెకండ్లలో దూరము (s) మీటర్లలో
0 20
1 18
2 16
3 14
4 12
5 10

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 8

ప్రశ్న 10.
తాబేలు మరియు కుందేలుల పరుగు పందెం కథ మీరు వినే ఉంటారు. తాబేలు ప్రయాణించే వడి కంటే కుందేలు ప్రయాణించే వడి ఎక్కువ. రెండూ ఒకే చోటు నుండి పరుగుపందెం ప్రారంభించాయి. కుందేలు కొంత దూరం ప్రయాణించి చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుంది. కుందేలు నిద్ర లేచి చేరవలసిన గమ్యం వైపు పరిగెత్తింది. కుందేలు గమ్యానికి చేరేసరికి తాబేలు అప్పటికే గమ్యాన్ని చేరింది. ఈ కథను దూరం-కాలం గ్రాస్లో చూపండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 9

  1. OX – తాబేలు చలనము.
  2. ‘OABC-కుందేలు చలనము.
  3. కుందేలు, తాబేలు ‘O’ వద్ద బయలుదేరినాయి.
  4. ‘t1 కాలం తరువాత కుందేలు ‘A’ వద్ద, తాబేలు ‘P’ వద్ద వున్నాయి.
  5. తరువాత ‘t2‘ సమయం వరకు కుందేలు విశ్రాంతి తీసుకుంది.
  6. ‘t2‘ కాలం తరువాత తాబేలు Qవద్ద ఉన్నది కాని కుందేలు స్థానభ్రంశం చెందలేదు.
  7. ‘t3‘ కాలం తరువాత తాబేలు తన గమ్యస్థానమైన Xను చేరుతుంది.
  8. కాని ఆ గమ్యాన్ని కుందేలు ‘t4‘ సమయం తరువాత చేరుకున్నది.

ప్రశ్న 11.
4 సె.లో ఒక చిరుత 100 మీ. దూరం పరిగెడుతుంటే, దాని సరాసరి వడి ఎంత? అదే చిరుత 2 సె.లో 50 మీ.దూరం పరిగెడినచో దాని సరాసరి వడి ఎంత? (AS 1, AS 7)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 10

ప్రశ్న 12.
రెండు రైళ్లు 30 కి.మీ./గం. వడితో ఒకే ట్రాక్ పై వ్యతిరేక దిశల్లో చలిస్తున్నాయి. ఒక పక్షి ఒక రైలు నుండి రెండవ రైలుకు 60 కి.మీ./గం. వడితో ఎగరగలదు. రెండు రైళ్ల మధ్య 60 కి.మీ. దూరం ఉన్నప్పుడు పక్షి ఎగరటం ప్రారంభించింది. పక్షి రెండవ రైలును తాకి మరల మొదటి రైలు వైపు, మరల మొదటి రైలు నుండి రెండవదాని వైపు, ఆ రెండు రైళ్లు ఢీకొనేంత వరకు ఎగిరింది. పక్షి ఎన్నిసార్లు ప్రదక్షిణాలు చేసింది ? పక్షి ప్రయాణించిన దూరం ఎంత? (AS 1)
జవాబు:
1వ పద్దతి:
ప్రతి రైలు వేగము = 30 కి.మీ / గం||
మొదటి రైలు, రెండవ రైలు కూడా ఒక గంటలో 30 కి.మీ. ప్రయాణించగలవు.
రెండు రైళ్ళ మధ్య దూరము = 60 కి.మీ
కావున రెండు రైళ్ళు ఒక గంటలో ఢీకొంటాయి.
పక్షి ఒక రైలు నుండి రెండవ రైలుకు 60 కి.మీ / గం. వేగంతో చలిసుంది.

∴ రెండు రైళ్ళు ఢీకొనుటకు ముందు పక్షి 60 కి.మీ దూరం ప్రయాణించును.
కాని రెండు రైళ్ళు ఢీకొనక ముందు, ఢీకొన్న తరువాత ఆ పక్షి అనంతమైన ప్రదక్షిణలు చేస్తుంది.

2వ పద్దతి:
రెండు రైళ్ళ సాపేక్ష వేగం = 60 కి.మీ./ గం||
రెండు రైళ్ళు ఢీకొనుటకు పట్టు సమయం = t సె॥ అనుకొనుము.
రెండు రైళ్ళ మధ్యదూరం = 60 కి. మీ.
∴ \(t=\frac{d}{s}=\frac{60}{60}=1\) గం||
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 11
పక్షి వేగము = 60 కి.మీ.
1 గం||లో పక్షి ప్రయాణించిన దూరం = 60 కి.మీ.
ఉదాహరణకు పక్షి B నుండి ‘X’ కి.మీ. దూరంలో (A వద్ద) ఉందనుకోండి. అప్పుడు ఆ పక్షి ‘t’ సమయంలో A రైలును ‘C’ వద్ద ఢీ కొట్టును.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 12

ప్రశ్న 13.
ఒక రాయిని భావిలోకి జారవిడిచినప్పుడు అది 2 సెకన్లలో నీటి ఉపరితలాన్ని తాకినది. ఆ రాయి ఎంత వేగంతో ఉపరితలాన్ని తాకినది మరియు పై నుండి నీటి ఉపరితలం ఎంత లోతులో ఉన్నది? (AS 1)
(g = 10m/s², V= U + at, S = Ut + 1/2 at²)
జవాబు:
దత్తాంశం ప్రకారం; t = 2 సె; 1 = (0 మీ./సె [∵ స్వేచ్ఛగా పడుతున్న రాయి); v = ?
లోతు, s = ?; a = g = 10 మీ./సె²
i) v = u + at; v = 0 + 10 × 2 = 20 మీ./సె
ii) s = ut + \(\frac{1}{2}\) at² = 0 + \(\frac{1}{2}\) × 10 × 2² = \(\frac{1}{2}\) × 10 × 4 = 20 మీ.
∴ రాయి ఉపరితలాన్ని తాకిన వేగం = 20 మీ/సె
పై నుండి నీటి ఉపరితలంలోతు = 20 మీ.

ప్రశ్న 14.
ఒక వస్తువు 6 మీ/సె వేగంతో కదులుతూ తరువాత 3 సెకన్లలో 2 మీ/సె² చొప్పున త్వరణం చెందినది. సమయంలో
వస్తువు ఎంత దూరం ప్రయాణించినది ? (S = Ut + 1/2 at²) (AS 1)
జవాబు:
దత్తాంశం ప్రకారం
u = 6 మీ/సె. ; t = 3 సెకనులు; a = 2 మీ./సె²
s = ut + \(\frac{1}{2}\) at² = 6 × 3 + \(\frac{1}{2}\) × 2 × 3² = 18 + 9 = 27 మీ.
∴ 3 సెకనుల సమయంలో వస్తువు ప్రయాణించిన దూరం = 27 మీ.

ప్రశ్న 15.
ఒక కారు 40 మీ/సె వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు బ్రేకు వేయగా 8మీ దూరం ప్రయాణించి ఆగినది. కారు త్వరణాన్ని కనుగొనండి. (v² – u² = 2as) (AS 1)
జవాబు:
దత్తాంశం ప్రకారం
u = 40 మీ/సె.; V = 0 (కారు ఆగినది కనుక); S = 8మీ.; a = ?
v² – u² = 2as
0 – 40² = 2 × a × 8
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 13
కారుత్వరణం = 100 మీ/సె².
త్వరణానికి ‘-‘ గుర్తు ఉన్నది కనుక కారుత్వరణం ఋణత్వరణం.

ప్రశ్న 16.
ఒక కణం సమత్వరణ చలనంలో ఉంది. ఆ కణం ‘n’ వ సెకనులో పొందిన స్థానభ్రంశానికి సమీకరణాన్ని ఉత్పాదించండి. [Sn = u + a(n – 1/2)] (AS 1)
జవాబు:
సెకనులో వస్తువు పొందిన స్థానభ్రంశం S = ut + \(\frac{1}{2}\) + at² (సమచలన సమీకరణం)
∴ ‘n’ సెకనులలో వస్తువు పొందిన స్థానభ్రంశం Sn(sec) = un + \(\frac{1}{2}\) an² ………….. (1)
∴ (n – 1) సెకనులలో వస్తువు పొందిన స్థానభ్రంశం, S(n-1)sec = u (n – 1) + \(\frac{1}{2}\) a (n – 1)²………….. (2)
∴ nవ సెకనులో వస్తువు పొందిన స్థానభ్రంశం Sn = S(a sec) – S(n – 1)sec
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 14

ప్రశ్న 17.
ఒక కణం ‘O’ బిందువు నుండి బయలుదేరి, స్థిర త్వరణంతో చలిస్తూ ‘O’ బిందువును విడిచి పెట్టింది. 5 సెకన్ల తర్వాత దాని వడి 1.5 మీ./సె. 6వ సెకను చివర అది నిశ్చలస్థితికి వచ్చి మరల వెనుకకు తిరిగి చలిస్తుంది. అది నిశ్చల స్థితికి వచ్చేలోపు ఆ కణం ప్రయాణించిన దూరమెంత ? వెనుదిరిగిన కణం ఎంత వేగంతో ‘O’ బిందువును చేరుతుంది? (AS 1)
జవాబు:
5వ సెకనులో వేగం = 1.5 మీ/సె.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 15
6వ సెకనుకు నిశ్చల స్థితికి వస్తుంది.
∴ 6వ సెకనులో తుదివేగం v = 0 మీ/సె.
6వ సెకనులో త్వరణం v = u + at
0 = 1.5 + a.1
∴ a = -1.5 మీ/సె² (∵ 5వ సెకనులో వేగం, 6వ సెకనులో తొలివేగమవుతుంది. కాలం = 6 – 5 = 1 సె॥)
6 సెకనుల తరువాత, వస్తువు నిశ్చలస్థితికి వస్తుంది.
v = 0, a = – 1.5 మీ/సె², u = ? t = 6 సె.
v = u + at
0 = u + (-1.5) × 6
∴ u = 9 మీ/సె.
నిశ్చలస్థితికి వచ్చేసరికి అనగా 6 సెకనులలో వస్తువు ప్రయాణించిన దూరం
s = ut + \(\frac{1}{2}\) at² = 9 × 6 + \(\frac{1}{2}\) ×- 1.5 × 6²
s = 54 – 27 = 27 మీ.

ఇప్పుడు కణం వెనుకకు మరలుతుంది.
v = 0 మీ/సె, t = 6 సె, a = -1.5 మీ/సె².
v = u + at
v = (0 – 1.5 × 6
v = – 9
∴ తిరుగు ప్రయాణంలో వేగం = -9 మీ/సె.

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం

ప్రశ్న 18.
ఒక కణం స్థిరత్వరణం ‘a’ తో నిశ్చలస్థితి నుండి బయలుదేరి ‘t’ కాలం ప్రయాణించిన తర్వాత దాని త్వరణం దిశ పూర్తిగా వ్యతిరేక దిశలోకి మారింది. కాని దాని త్వరణం పరిమాణంలో ఏ మార్పు లేదు. ఆ కణం తిరిగి బయలుదేరిన బిందువుకు చేరడానికి ఎంత సమయం పడుతుంది? (AS 1)
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 16
ఒక కణం ‘a’ వద్ద బయలుదేరినదనుకొనుము.
దాని తొలివేగం u = 0 మీ/సె
స్థానభ్రంశం = 6 మీ.
త్వరణం = a మీ/సె²
కాలము = t సెకనులు

స్థానభ్రంశం s = ut + \(\frac{1}{2}\) at = ot – \(\frac{1}{2}\)at
s = \(\frac{1}{2}\)at² ……… (1)
తుదివేగం (v) = u + at = v = at ………… (2)
‘t2‘ కాలం తరువాత దాని దిశను మార్చుకుంటుంది. కాని పరిమాణం సమానంగా ఉంటుంది. అప్పుడు కణం B నుండి Aకి కదులుతుంది.
స్థానభ్రంశం = -s మీ.
త్వరణం = – a మీ/సె²
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 17

ప్రశ్న 19.
ఒక రైలు దాని వడిని 20 సెం.మీ/సె. త్వరణంతో పెంచుకోగలదు. అలాగే తన వడిని 100 సెం.మీ/సె. త్వరణంతో తగ్గించుకోగలదు. అయితే ఒకదానితో ఒకటి 27 కి.మీ. దూరంలో ఉన్న రెండు రైల్వేస్టేషన్ల మధ్య ఆ రైలు ప్రయాణించడానికి పట్టే కనీస కాలం ఎంత? (AS 1)
జవాబు:
ఒక రైలు త్వరణం α = 20 సెం.మీ/సె²
దాని రుణ త్వరణం β = 100 సెం.మీ/సె²
రెండు స్టేషన్ల మధ్య దూరం s = 2.7 కి.మీ = 27 × 104 సెం.మీ.
రైలు, రెండు స్టేషన్ల మధ్య ప్రయాణించడానికి పట్టే కనీస కాలం t సె|| అనుకొనుము.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 18
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 19

ప్రశ్న 20.
50 మీ. పొడవు గల రైలు 10 మీ/సె. స్థిర వడితో చలిస్తుంది. ఆ రైలు ఒక విద్యుత్ స్తంభాన్ని మరియు 250 మీ. పొడవు గల బ్రిడ్జిని దాటడానికి పట్టే కాలాన్ని లెక్కించండి. (AS 1)
జవాబు:
(i) రైలు పొడవు = 50 మీ.
రైలు వడి V = 10 మీ./సె.
రైలు విద్యుత్ స్తంభాన్ని దాటుటకు అది ప్రయాణించిన దూరము = రైలు పొడవు (s) = 50 మీ.
∴ రైలు విద్యుత్ స్తంభాన్ని దాటుటకు పట్టు కాలము \(\mathrm{t}=\frac{\mathrm{s}}{\mathrm{v}} \Rightarrow \mathrm{t}=\frac{50}{10}=5\) సెకనులు

(ii) బ్రిడ్జి పొడవు = 250 మీ. రైలు బ్రిడ్జిని దాటుటకు ప్రయాణించిన దూరం (s)= రైలు పొడవు + బ్రిడ్జి పొడవు
⇒ s = 50 + 250 = 300 మీ.
రైలు బ్రిడ్జిని దాటుటకు పట్టు కాలము \(\mathrm{t}=\frac{\mathrm{s}}{\mathrm{v}} \Rightarrow \mathrm{t}=\frac{300}{10}=30\) సెకనులు

ప్రశ్న 21.
పటంలో చూపిన విధంగా ఒకే ఎత్తు గల మూడు రకాలైన తలాల నుంది, ఒకే రకమైన మూడు బంతులను జారవిడిచినచో, ఏ బంతి త్వరగా నేలను చేరుతుంది? వివరించండి. (AS 2 AS 1)
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 20
జవాబు:
మొదటి కొండపై నుండి జారవిడిచిన బంతి ముందుగా నేలను చేరును.

కారణం:

  1. మొదటి కొండపైనున్న బంతి రేఖీయ చలనంలో ఉండును.
  2. కావున దాని వడి మరియు వేగము ఒకే పరిమాణం, దిశ కలిగియుండును.
  3. రెండవ మరియు మూడవ కొండల పైనున్న బంతులు వక్రమార్గంలో ప్రయాణించును.
  4. కావున వీటి వేగ దిశ నిరంతరం మారును.

ప్రశ్న 22.
నిశ్చలస్థితి నుండి బయలుదేరిన ఒక వస్తువు యొక్క వడి ఏకరీతిగా పెరుగుతున్నట్లయితే వస్తువు యొక్క చలనాన్ని చూపే దూరం – కాలం ను గీయండి. (AS 5)
జవాబు:
ఒక కారు క్రింది పట్టికలో చూపిన విధంగా చలిస్తున్నదనుకొనుము.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 21

కాలము (t) సెకండ్లలో దూరము (s) మీటర్లలో
0 0
1 3
2 6
3 9
4 12
5 15

ప్రశ్న 23.
ఒక కారు తన ప్రయాణ కాలంలో మొదటి సగం కాలం 80 కి.మీ./గం. వడితోను, మిగిలిన సగం కాలం 40 కి.మీ./గం. వడితోనూ ప్రయాణిస్తే, దాని సరాసరి వడి ఎంత?
జవాబు:
మొత్తం ప్రయాణించిన కాలం = xగం|| అనుకొనుము.
మొదటి సగం కాలం (అనగా \(\frac{x}{2}\)గం॥) లో దాని వడి = 80 కి.మీ | గం||
∴ \(\frac{x}{2}\) గం||లలో ప్రయాణించు దూరం = 80 × \(\frac{x}{2}\) = 40 x కి.మీ/గం.
మిగిలిన సగం కాలములో వడి = 40 కి.మీ/గం.
∴ మిగిలిన \(\frac{x}{2}\) గం||లలో ప్రయాణించిన దూరం = 40 × \(\frac{x}{2}\) = 20 x కి.మీ/గం.
∴ మొత్తం ప్రయాణించిన దూరం = 40x + 20x = 60x కి.మీ.
మొత్తం ప్రయాణానికి పట్టిన కాలం = x గం||
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 22

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం

ప్రశ్న 24.
ఒక కారు తాను ప్రయాణించిన మొత్తం దూరంలో మొదటి సగం దూరం 50 కి.మీ./గం. వడితోనూ, మిగిలిన సగం దూరం 10 కి.మీ./గం. వడితోనూ ప్రయాణిస్తే, ఆ కారు సరాసరి వడి ఎంత? (AS 1)
జవాబు:
కారు ప్రయాణించిన మొత్తం దూరం = x కి. మీ. అనుకొనుము.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 23

ప్రశ్న 25.
ఒక కణం మొదటి 5 సెకనుల్లో 10మీ. దూరం తర్వాత 3 సెకనులలో 10మీ. దూరం ప్రయాణించింది. ఆ కణం సమత్వరణంతో చలిస్తుందనుకొంటే ఆ కణం తొలివేగాన్ని, త్వరణాన్ని మరియు తదుపరి 2కె.లో ప్రయాణించిన దూరాన్ని కనుగొనండి. (AS1, AS7)
జవాబు:
మొదటి 5 సెకన్లలో ప్రయాణించిన దూరం = 10 మీ.
t1 = 5 సె||; s1 = 10 మీ.
s = ut + \(\frac{1}{2}\) at² అని మనకు తెలుసు.
10 = u × 5 + \(\frac{1}{2}\) a . 5²
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 24

తరువాతి 2 సె॥లలో వస్తువు ప్రయాణించిన దూరం కనుగొనుటకు ముందు ఈ రెండు సెకనులకు తొలివేగాన్ని కనుగొనాలి. ఇది 8సె|| తరువాత తుదివేగానికి సమానము.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 25

∴ కణం తరువాత 2 సె॥॥లలో 8.33 మీ. దూరం ప్రయాణిస్తుంది.

ప్రశ్న 26.
ఒక కారు నిశ్చలస్థితి నుండి బయలుదేరింది. అది కొంతసేపు స్థిర త్వరణం “α” తో ప్రయాణించి, ఆ తర్వాత స్థిర ఋణత్వరణం “β” తో చలిస్తూ నిశ్చలస్థితికి వచ్చింది. ఆ కారు యొక్క మొత్తం ప్రయాణ కాలం “t” అయితే, ఆ కారు పొందే గరిష్ఠ వేగమెంత? (AS 2, AS7)
జవాబు:
త్వరణం a = α మీ/సె²
తొలివేగం u = 0 మీ/సె²
కాలం = t1 సె|| అనుకొనుము.
v = u + at సమీకరణం నుండి
⇒ v= 0 + αt1 ⇒ v = αt1
∴ \(t_{1}=\frac{v}{\alpha}\)సె
ఋణత్వరణం = – β మీ/సె²
ఇక్కడ ‘α’ త్వరణంతో ప్రయాణించే వస్తువు తుది వేగమే తిరుగు ప్రయాణంలో తొలివేగం ‘u’ అవుతుంది.
∴ u = αt1 మీ/సె
తుదివేగం v = 0 మీ/సె.
v = u + at సమీకరణం నుండి
0 = αt1 + (-β)t2
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 26

ప్రశ్న 27.
బస్సుకు 48 మీ. దూరంలో ఒక మనిషి నిలబడి ఉన్నాడు. బస్సు బయలుదేరగానే, ఆ వ్యక్తి 10 మీ./సె. స్థిరవేగంతో బస్సు వైపు పరిగెత్తాడు. బస్సు నిశ్చలస్థితి నుండి 1 మీ./సె.² త్వరణంతో చలిస్తుంది. ఆ వ్యక్తి ఆ బస్సు పట్టుకోగల కనీస సమయాన్ని లెక్కించండి. (AS 1 AS 7)
జవాబు:
బస్సును మనిషి n సెకనులలో పట్టుకోగలడు అనుకుందాం.
బస్సు నిశ్చలస్థితిలో ఉన్నది.
u = 0 మీ/సె ; a = 1 మీ/సె²
ఆ బస్సు n సెకనులలో 8 దూరం ప్రయాణిస్తుందనుకొనుము.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 27

మనిషి బస్సును పట్టుకోవడానికి పట్టు కనీస సమయం = 8 సె॥

9th Class Physical Science 1st Lesson చలనం Textbook InText Questions and Answers

9th Class Physical Science Textbook Page No. 5

ప్రశ్న 1.
ఒక వస్తువు కొంత దూరం ప్రయాణించి తిరిగి బయలుదేరిన చోటుకే చేరుకుంటే దాని స్థానభ్రంశమెంత? ఈ సందర్భానికి నిజ జీవితంలోని ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఒక వస్తువు కొంత దూరం ప్రయాణించి తిరిగి బయలుదేరిన చోటుకి చేరుకుంటే దాని స్థానభ్రంశం ‘సున్న’.
ఉదా : ఒక వ్యక్తి తన ఇంటి నుండి బయలుదేరి మార్కెట్టుకి వెళ్ళి తిరిగి ఇంటికి చేరుకున్నప్పుడు అతని స్థానభ్రంశం ‘సున్న’ అవుతుంది.

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం

ప్రశ్న 2.
దూరం, స్థానభ్రంశముల పరిమాణములు ఎప్పుడు సమానమవుతాయి?
జవాబు:
ఒక వస్తువు ఒక సరళరేఖ వెంబడి ఒకే దిశలో రెండు బిందువుల మధ్య చలించినపుడు ఆ వస్తువు దూరం, స్థానభ్రంశ పరిమాణములు సమానమవుతాయి.

9th Class Physical Science Textbook Page No. 6

ప్రశ్న 3.
ఒక కారు 5 గంటల్లో 200 కి.మీ. దూరం ప్రయాణించిన, దాని సరాసరి వడి ఎంత?
జవాబు:
కారు ప్రయాణించిన మొత్తం దూరం = 200 కి.మీ
ప్రయాణించిన కాలం = 5 గం||లు
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 28

ప్రశ్న 4.
ఏ సందర్భంలో సరాసరి వేగం శూన్యమవుతుంది?
జవాబు:
ఒక వస్తువు యొక్క స్థానభ్రంశం శూన్యమయినపుడు దాని సరాసరి వేగం శూన్యమవుతుంది.

ప్రశ్న 5.
ఒక వ్యక్తి కారులో 25 గంటలు ప్రయాణించాడు. కారు ఓడోమీటర్లో తొలి, తుది రీడింగులు వరుసగా 4849 మరియు 5549 గా గుర్తించాడు. అయితే పూర్తి ప్రయాణంలో అతని సరాసరి వడి ఎంత?
జవాబు:
కారు ప్రయాణించిన దూరము = 5549 – 1849 = 700 కి.మీ.
ప్రయాణించిన కాలము = 25 గం||లు
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 29

9th Class Physical Science Textbook Page No. 9

ప్రశ్న 6.
a) రోడ్డుపై అతి వేగంతో ప్రయాణించే వాహనదారులకు పోలీసులు జరిమానా విధించడం మీరు గమనించి ఉంటారు. ఈ జరిమానా వారి వడి ఆధారంగా విధిస్తారా? లేదా సరాసరి వడి ఆధారంగా విధిస్తారా? వివరించండి.
జవాబు:
తక్షణ వడి ఆధారంగా జరిమానా విధిస్తారు.

b) ఒక విమానం ఉత్తర దిశలో 300 కి.మీ/గం. వేగంతోనూ, మరొక విమానం దక్షిణ దిశలో 300 కి.మీ/గం. వేగంతోనూ ప్రయాణిస్తున్నవి. వాటి వడులు సమానమా? లేదా వేగాలు సమానమా? వివరించండి.
జవాబు:

  1. వాటి వడులు సమానము.
  2. వేగము పరిమాణములో సమానము కాని దిశ మాత్రము వ్యతిరేకము.

c) చలనంలో గల ఒక కారులోని స్పీడోమీటరు స్థిర విలువను చూపుతుంది. దీని ఆధారంగా కారు స్థిర వేగంతో చలిస్తుందని చెప్పగలమా? వివరించండి.
జవాబు:

  1. కారులోని స్పీడోమీటరు ముల్లు, కారు వడి యొక్క స్వల్ప మార్పులకు కూడా దాని స్థానాన్ని మార్చుకుంటుంది.
  2. కాని ఈ సందర్భంలో స్పీడోమీటరు స్థిర విలువను చూపిస్తుంది. కావున కారు స్థిర వేగంతో చలిస్తుందని చెప్పవచ్చు.

9th Class Physical Science Textbook Page No. 11

ప్రశ్న 7.
ఒక చీమ బంతి ఉపరితలంపై కదులుతుంది. దాని వేగం స్థిరమా? అస్థిరమా? వివరించండి.
జవాబు:
వేగం దిశ అస్థిరము.

వివరణ:
చీమ, బంతి ఉపరితలంపై కదులుతున్నది. కావున అది వృత్తాకార మార్గంలో చలించాలి. వృత్తాకార మార్గంలో వేగ దిశ నిరంతరం మారుతుంది. కావున వేగదిశ అస్థిరము.

ప్రశ్న 8.
వడి మారుతూ చలనదిశలో మార్పులేని చలనాన్ని సూచించే సందర్భాలకు ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
రోడ్డుపై ప్రయాణించే బస్సు

9th Class Physical Science Textbook Page No. 13

ప్రశ్న 9.
300 కి.మీ/గం. స్థిరవేగంతో చలించే కారు త్వరణమెంత?
జవాబు:
వేగం = 300 కి.మీ/ గం|| = \(300 \times \frac{5}{18}=\frac{500}{6}=83.33\) మీ/సె॥
వేగము స్థిరంగా ఉన్నది. కావున త్వరణం కూడా స్థిరము.
∴ త్వరణము = 83.33 మీ/సె²

ప్రశ్న 10.
ఒక విమానం వేగం 1000 కి.మీ./గం. నుండి 1005 కి.మీ/గం.కు చేరటానికి 10 సెకనులు పట్టింది. స్కేటింగ్ చేసే వ్యక్తి వేగం శూన్యం నుండి 5 కి.మీ/గం. చేరటానికి 1 సెకను పట్టింది. వీరిలో ఎవరి త్వరణం ఎక్కువ?
జవాబు:
విమానం :
∴ స్కేటింగ్ చేసే వ్యక్తి యొక్క త్వరణం ఎక్కువ.

ప్రశ్న 11.
ఒక వాహన వేగం 100 కి.మీ/గం. నుండి నిశ్చల స్థితికి రావటానికి 10 సెకనులు పట్టిన ఆ వాహన త్వరణం ఎంత?
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 31 AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 32

ప్రశ్న 12.
“స్థానంలో మార్పు ఎంత త్వరితగతిన వస్తుందో తెలిపే భావనే త్వరణం” అని మీ స్నేహితుడు అన్నాడు. మీ స్నేహితుడిని మీరు ఏ విధంగా సరి చేస్తారు?
జవాబు:
“నిర్ణీత దిశలో స్థానంలో మార్పు ఎంత త్వరితగతిన వస్తుందో తెలిపే భావనే త్వరణం”.

9th Class Physical Science Textbook Page No. 1

ప్రశ్న 13.
భూమి చలనంలో ఉన్నప్పటికీ, ఆ చలనాన్ని మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాము?
జవాబు:

  1. భూమి చలనంలో వున్నది.
  2. భూమి మీద ఉన్న మనం కూడా భూమి వేగానికి సమానమైన వేగంతో చలిస్తున్నాము. అనగా భూమికి, మనకు సాపేక్ష చలనం ఉన్నది.
  3. కావున భూమి చలనమును మనం గుర్తించలేకపోతున్నాము.

ప్రశ్న 14.
మీ తరగతి గది గోడలు చలనంలో ఉన్నాయా? లేదా? ఎందుకు?
జవాబు:
పరిశీలకుని దృష్టిలో గోడలు స్థిరంగా వున్నాయి.
చలనంలో ఉన్న భూమి దృష్ట్యా చూసినపుడు గోడలు కూడా చలనంలో వున్నాయని చెప్పవచ్చు.

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం

ప్రశ్న 15.
నిశ్చలస్థితిలో ఉన్న రైలులో మీరు కూర్చుని ఉన్నప్పుడు అది కదులుతున్న అనుభూతిని ఎప్పుడైనా పొందారా? ఎందుకు?
జవాబు:
ఒక నిశ్చలస్థితిలోనున్న రైలులో కూర్చుని ఉన్నప్పుడు, అవతలి ట్రాక్ పైనున్న రైలు కదలికలోకి వచ్చినప్పుడు ఇటువంటి అనుభూతి కలుగుతుంది.

9th Class Physical Science Textbook Page No. 2

ప్రశ్న 16.
ఈ మార్పులు ఎందుకు వస్తాయి?
జవాబు:
భూమి గోళాకారంగా వుందని మనకు తెలుసు. అందువల్ల భూ ఉపరితలంపై గీసిన లంబదిశ భూమి మీద అది గీసిన స్థలంపై ఆధారపడి వుంటుంది. కాబట్టి భూ ఉపరితలంపై ఏ స్థానానికి ఆధారం చేసుకొని దిశను చెబుతున్నామో తెలియనంత వరకు పైకి, క్రిందకి అనే దిశలకు అర్థం లేదు.

ప్రశ్న 17.
ఈ పదాలు సాపేక్షమైనవా? కావా?
జవాబు:
కుడి, ఎడమ; పైకి, కిందకు; పొడవు, పొట్టి అనే పదాలు పరిశీలకుని పరంగా సాపేక్షమైనవి.

9th Class Physical Science Textbook Page No. 4

ప్రశ్న 18.
ప్రయాణికుడు ఏ సమాధానం ఇస్తాడో మీకు తెలుసా?
జవాబు:
రోడ్డుపై నిలుచున్న పరిశీలకుడి పరంగా కారు చలనంలో వుంటుంది. కాని కారులో ఉన్న ప్రయాణికుడి పరంగా చూస్తే కారు నిశ్చలస్థితిలో వుంటుంది. వస్తు చలనం, పరిశీలకుడిపై ఆధారపడి వుంటుంది. కాబట్టి ‘చలనం’ అనేది పరిశీలకుడు, చలించే వస్తువుల ఉమ్మడి ధర్మం.

ప్రశ్న 19.
చలనాన్ని మనం ఏవిధంగా అవగాహన చేసుకుంటాం?
జవాబు:
పరిశీలకుడి పరంగా ఒక వస్తుస్థానం కాలంతోపాటు నిరంతరం మారుతూంటే ఆ వస్తువు చలనంలో వుంది అంటాము.

9th Class Physical Science Textbook Page No. 7

ప్రశ్న 20.
ఒక నిర్దిష్ట సమయం దగ్గర కారు వడి ఎంత ఉంటుందో మనం తెలుసుకోగలమా?
జవాబు:
కారు ప్రయాణిస్తున్నప్పుడు ఏ సమయంలోనైనా దాని వడిని మనం స్పీడోమీటరు చూసి నిర్ణయించవచ్చు.

ప్రశ్న 21.
‘t3‘ సమయం వద్ద కారు వడి (తక్షణ వడి) ఎంత?
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 33
ఏదైనా ఇచ్చిన సమయం వద్ద గ్రావాలు, ఆ సమయంలో కారు వడిని తెలుపుతుంది. గ్రాఫ్ పై ఏదైనా ఒక బిందువు వద్ద ఆ గ్రాఫ్ యొక్క వాలును ఆ బిందువు వద్ద గీసిన స్పర్శరేఖతో తెలుసుకోవచ్చు. ఈ వాలు, ఆ సమయంలో ఆ కారు యొక్క వడిని తెలుపుతుంది.

9th Class Physical Science Textbook Page No. 8

ప్రశ్న 22.
దానికి కట్టిన వస్తువు ఏ దిశలో చలిస్తుంది?
జవాబు:
వృత్తాకార మార్గంలో చలిస్తున్న వస్తువు, ఆ వస్తువును వదిలిన బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ దిశలో చలిస్తుంది.

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం

ప్రశ్న 23.
ఏ రకమైన చలనాన్ని సమచలనం అంటారు? ఎందుకు?
జవాబు:
ఒక వస్తువు స్థిరవేగంతో చలిస్తూ వుంటే ఆ చలనాన్ని ‘సమచలనం’ అంటారు.

9th Class Physical Science Textbook Page No. 9

ప్రశ్న 24.
మీరు గీసిన గ్రాఫ్ ఏ ఆకారంలో ఉంది?

కాలము (t) సెకండ్లలో దూరము (s) మీటర్లలో
0 0
1 4
2 8
3 12
4 16

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 34
జవాబు:
సమచలనంలో వున్న వస్తువు చలనానికి గీసిన గ్రాఫు ఒక సరళరేఖను సూచిస్తుంది.

9th Class Physical Science Textbook Page No. 10

ప్రశ్న 25.
మీరు గీసిన గ్రాఫ్ ఏ ఆకారంలో ఉంది?
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 35
అసమ చలనంలో ఉన్న వస్తువు యొక్క చలనానికి గీసిన గ్రాఫు ఒక వక్ర రేఖ.

ప్రశ్న 26.
ఆ గ్రాఫ్ సరళరేఖ రూపంలో ఉందా? లేదా మరేదైనా రేఖ లాగా ఉందా? ఎందుకు?
జవాబు:
అసమచలనానికి గీసిన గ్రాఫ్ ఒక సరళరేఖ కాదు. ఎందుకనగా దాని వడి నిరంతరం, అసమంగా మారుతూ ఉంది.

9th Class Physical Science Textbook Page No. 11

ప్రశ్న 27.
వడి స్థిరంగా ఉంది, వేగం నిరంతరంగా మారే సందర్భాలకు కొన్ని ఉదాహరణలివ్వగలరా?
జవాబు:
సమవృత్తాకారచలనంలోనున్న వస్తువుల వడి స్థిరంగా ఉంటుంది. కాని వేగం నిరంతరం మారుతూ ఉంటుంది.
ఉదా: భూభ్రమణం, భూమి చుట్టూ చంద్రుని చలనం మొ||వి.

ప్రశ్న 28.
ఈ చలనంలో రాయి వడి స్థిరమా? ఎందుకు?
జవాబు:
రాయి వడి నిరంతరం మారుతూ ఉంటుంది. కావున అది అసమ చలనం.

ప్రశ్న 29.
రాయి చలనదిశ స్థిరంగా ఉంటుందా?
జవాబు:
రాయి చలనదిశ నిరంతరం మారుతూ ఉంటుంది.

ప్రశ్న 30.
వడి, చలన దిశలు రెండూ నిరంతరం మారే చలనాలకు కొన్ని ఉదాహరణలివ్వండి.
జవాబు:
రాకెట్ చలనము, క్షితిజ సమాంతరంగా విసిరిన వస్తువు, కాలితో తన్నిన ఫుట్ బాల్, బౌలర్చే విసరబడిన క్రికెట్ బంతి మొదలగునవి.

9th Class Physical Science Textbook Page No. 12

ప్రశ్న 31.
త్వరణం అనగానేమి? ఒక వస్తువు త్వరణంలో ఉందని ఎలా తెలుసుకోగలవు?
జవాబు:

  1. త్వరణం అనేది ఒక వస్తువు యొక్క వేగంలో మార్పు ఎంత త్వరగా జరుగుతుందో తెలియజేస్తుంది.
  2. ఇది వేగంలోని మార్పు రేటుకి సమానము.
  3. మనం బస్సు లేదా కారులో ప్రయాణించేటప్పుడు బస్సు డ్రైవరు యాక్సలరేటర్‌ను నొక్కితే మనం వెనకకు పడతాం. మనం పొందిన త్వరణం వలన మనం కూర్చొన్న సీట్లను శరీరం గట్టిగా వెనుకకు నొక్కుతుంది. ఈ విధంగా త్వరణం మన అనుభవంలోకి వస్తుంది.

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం

ప్రశ్న 32.
వస్తువు వడి ఏ బిందువు వద్ద గరిష్ఠంగా వుంది?
జవాబు:
‘B’ వద్ద వస్తువు వడి గరిష్ఠము.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 36

ప్రశ్న 33.
వస్తువుకు త్వరణం ఉన్నదా? లేదా?
జవాబు:
చలనంలోనున్న ఏ వస్తువుకైనా త్వరణం ఉంటుంది.

ఉదాహరణ సమస్యలు

9th Class Physical Science Textbook Page No. 9

ప్రశ్న 1.
‘h’ఎత్తు గల మనిషి సరళరేఖా మార్గంలో ‘v’ వడితో ‘H’ఎత్తు గల వీధిదీపం కింది నుండి ప్రయాణిస్తున్నాడు. వీధిదీపం నుండి వచ్చే కాంతి ఆ మనిషిపై పడి అతని నీడను ఏర్పరచింది. అతను కదులుతున్నప్పుడు నీదకూడా అతనితో పాటు కదులుతుంది. ఆ మనిషి నీడ యొక్క చివరిభాగంలో గల తల ఎంత వడితో కదులుతుందో కనుక్కోండి.
సాధన:
ఇటువంటి సమస్యను సాధించాలంటే మనిషి, అతని నీడ యొక్క చివరి భాగాల చలనాలను పోల్చాలి. ఇవి రెండూ ఒక మూల బిందువు ‘0’ నుండి చలించడం ప్రారంభించాయనుకొందాం. ఇది పటంలో చూపబడింది. “OD” మనిషి ఎత్తును సూచిస్తుంది. అలాగే OA దీపస్తంభం ఎత్తును (H) సూచిస్తుంది.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 37

‘t’ కాలంలో మనిషి, అతడి నీడ యొక్క చివర భాగంలో గల తల ప్రయాణించిన దూరాలు ‘S’ మరియు ‘S’లు అనుకుందాం.

ఈ చలనం వల్ల పటంలో చూపినట్లు ∆ABD, ∆ACO అనే రెండు సరూప త్రిభుజాలు ఏర్పడతాయి.

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 38
S/t అనేది మనిషి నీడ యొక్క చివర భాగంలో తల వడిని తెల్పుతుంది. దీనిని ‘V’ తో సూచిస్తే, పై సమీకరణం నుండి మనం నీడ, యొక్క చివర భాగంలో తల వడి
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 39

9th Class Physical Science Textbook Page No. 12

ప్రశ్న 2.
400 మీ దూరంలో గల రెడ్ సిగ్నల్ లైటును చూసి 54 కి.మీ./గం. వేగంతో ప్రయాణించే రైలు ఇంజను బ్రేకులు వేశారు. బ్రేకులు కలుగజేసిన త్వరణం a = 0.3 మీ/సె అయితే 1 నిముషం తర్వాత రైలు ఇంజన్ సిగ్నల్ స్తంభానికి ఎంత దూరంలో ఉంటుంది?
సాధన:
రెడ్ సిగ్నల్ ను చూసినపుడు బ్రేకులు వేస్తే రైలు ఇంజన్ రుణత్వరణంతో చలిస్తుంది. ‘I’ కాలం తర్వాత ఆగిపోయిందనుకుందాం.
తొలివేగం 4 = 54 కి.మీ/గం. = 54 × 5/18 = 15 మీ/సె.
తుదివేగం V = 0 (ఇచ్చిన సందర్భానికి)
a = – 0.3 మీ/సె². (ఇంజన్ ఋణత్వరణంతో చలిస్తుంది.)
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 40

1 నిముషం తర్వాత రైలు ఇంజన్, సిగ్నల్ స్తంభానికి మధ్య దూరం I = L – S = 400 – 375 = 25 మీ.

ప్రశ్న 3.
ఒక వస్తువు సమత్వరణంతో సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ సరళరేఖా మార్గంపై గల రెండు బిందువుల వద్ద వస్తు వేగాలు వరుసగా u, v అయిన ఆ రెండు బిందువులకు మధ్య బిందువు వద్ద వస్తువు వేగం ఎంత?
సాధన:
వస్తువు సమత్వరణాన్ని ‘a’ అనుకుందాం.
ఇచ్చిన బిందువుల మధ్య దూరం ‘s’ అనుకుందాం.
v² – u² = 2as …………. (1)

ఈ రెండు బిందువులకు మధ్యబిందువు వద్ద వస్తువు వేగం v0 అనుకుందాం. (ఆ బిందువును ‘M’ గా పటంలో చూపడం జరిగింది.) అప్పుడు v²0 – u² = 2as/2
సమీకరణం (1) లోని 2as విలువను పై సమీకరణంలో ప్రతిక్షేపించగా
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 41

9th Class Physical Science Textbook Page No. 16

ప్రశ్న 4.
నిశ్చలస్థితి నుండి బయలుదేరిన ఒక కారు సమత్వరణం ‘a’ తో ‘t’ కాలం పాటు ప్రయాణించింది. కారు సరళరేఖా మార్గంలో ప్రయాణించినట్లయితే ‘t’ కాలంలో అది పొందే సరాసరి వడి ఎంత?
సాధన:
కారు నిశ్చలస్థితి నుండి ప్రారంభమైంది కాబట్టి దాని తొలి వేగం u = 0
‘t’ కాలంలో కారు ప్రయాణించిన దూరం
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 42

ప్రశ్న 5.
ఒక కణం 9 మీ./సె. వేగంతో తూర్పు దిశలో ప్రయాణిస్తుంది. అది పడమర దిశలో 2మీ./సి². స్థిరత్వరణాన్ని కలిగి ఉంటే దాని ప్రయాణంలో 5వ సెకనులో కణం ప్రయాణించిన దూరం ఎంత?
సాధన:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 43
తొలి వేగం U : + 9 మీ./సె.
త్వరణం a = -2 మీ./సె.²

ఈ సమస్యలో త్వరణం, వేగ దిశలు పరస్పరం వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఎంత సమయంలో ఆ కణం నిశ్చలస్థితికి వస్తుందో ముందుగా నిర్ణయించాలి. ఆ కాలాన్ని ‘t’ అనుకుందాం.
v = u + at నుండి
0 = 9 – 2t ⇒ t = 4.5 సె.
4.5 సె. నుండి 5 సె. వరకు కణం త్వరణదిశలో చలిస్తుంది. కనుక \(\frac{1}{2}\) సెకనులో అది కదిలిన దూరాన్ని లెక్కిద్దాం.
ఈ సందర్భంలో t = 4.5 సె. వద్ద 1 = 0.
\(\frac{1}{2}\) సె.లో ప్రయాణించిన మొత్తం దూరం,
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 44
5వ సెకనులో ప్రయాణించిన మొత్తం దూరం s0 అనుకుంటే అది 2s కు సమానం అవుతుంది.
s0 = 2s = 2 (1/4) = 1/2 మీ.

పరికరాల జాబితా

తాడు, రాయి, ఎలక్ట్రికల్ కేసింగ్, స్టీలు పళ్లెం, గాజు గోళీలు, డిజిటల్ వాచ్

9th Class Physical Science 1st Lesson చలనం Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

ప్రయాణించే మార్గాన్ని గీయడం, దూరం – స్థానభ్రంశాల మధ్య తేడాను గమనించడం :
1. దూరం, స్థానభ్రంశాల మధ్య తేడాను గుర్తించడానికి ఒక కృత్యమును తెలిపి, గ్రాఫును గీయుము.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 45

  1. ఒక బంతిని తీసుకొని క్షితిజ తలానికి కొంతకోణం చేసే విధంగా విసరండి.
  2. బంతి ప్రయాణించిన మార్గాన్ని గమనించి తెల్లకాగితములపై ఆ మార్గాన్ని గీయండి.
  3. ఈ పటం నిర్ణీతకాలంలో బంతి గాలిలో ప్రయాణించిన దూరాన్ని తెలుపుతుంది.
  4. ASB వక్రరేఖ పొడవు బంతి ప్రయాణించిన దూరాన్ని తెలుపుతుంది.
  5. సరళరేఖ \(\overrightarrow{\mathrm{AB}}\) పొడవు బంతి స్థానభ్రంశాన్ని తెలుపుతుంది.

స్థానభ్రంశం :
నిర్దిష్ట దిశలో వస్తువు కదిలిన కనిష్ఠ దూరాన్ని . స్థానభ్రంశమని అంటారు. దీనిని సదిశతో సూచిస్తారు.

దూరం :
నిర్ణీత కాలంలో వస్తువు కదిలిన మార్గం మొత్తం పొడవును దూరము అంటారు.

AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం

కృత్యం – 2

స్థానభ్రంశ సదిశలను గీయడం : 2. కింది సందర్భాలలో A నుండి B కి స్థానభ్రంశ సదిశలను గీయుము.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 46
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 47

కృత్యం – 3

వస్తువు చలన దిశను పరిశీలించుట :
3. వృత్తాకార మార్గంలో చలించే ఒక వస్తువు వేగదిశ, ఆ వృత్తానికి ఏదైనా బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ దిశలో ఉంటుందని చూపండి.
జవాబు:

  1. ఒక తాడు చివర ఒక రాయి లేదా ఏదైనా వస్తువును కట్టి, తాడు రెండవ చివరను పట్టుకొని క్షితిజ సమాంతర తలంలో గుండ్రంగా తిప్పండి.
  2. అలా తిప్పుతూ తాడును వదిలి పెట్టండి.
  3. రాయిని మరలా అదే మాదిరిగా తిప్పుతూ వృత్తంలో వేరువేరు బిందువుల వద్ద నుండి తాడును వదలండి.
  4. తాడును విడిచి పెట్టే ప్రతి సందర్భంలో రాయి యొక్క చలన దిశను గమనించండి.
  5. వృత్తాకార మార్గంలో మీరు వదిలిన బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ దిశలో ఆ వస్తువు చలించడం మీరు గమనిస్తారు.
  6. కావున వృత్తాకార మార్గంలో చలించే వస్తువు వేగదిశ, ఆ వృత్తానికి ఏదైనా బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ దిశలో ఉంటుంది.

కృత్యం – 4

సమచలనాన్ని అవగాహన చేసుకోవడం :

4. సమచలనాన్ని ఒక కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
1. ఒక వ్యక్తి సైకిల్ పై రోడ్డుమీద సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తున్నాడనుకుందాం.
2. అతడు వివిధ సమయాల్లో ప్రయాణించిన దూరాలు క్రింది పట్టికలో ఇవ్వబడినవి.

కాలము (t) సెకండ్లలో దూరము (s) మీటర్లలో
0 0
1 4
2 8
3 12
4 16

3. పై విలువలకు దూరం – కాలం గ్రాఫ్ గీయండి. అది క్రింది విధంగా ఉండెను.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 48
4. సరళరేఖ రూపంలో గల గ్రాఫ్ ను పరిశీలిస్తే సైకిల్ పై ప్రయాణించే వ్యక్తి సమాన కాలవ్యవధులలో సమాన దూరాలు ప్రయాణించాడని తెలుస్తుంది.
5. అదే విధంగా గ్రాఫ్ నుండి, అతని సరాసరి వడి తక్షణ వడికి సమానమని తెలుస్తుంది.
6. సైకిల్ పై వెళ్ళే వ్యక్తి చలన దిశ స్థిరమని మనం భావిస్తే అతని వేగం స్థిరమని చెప్పవచ్చు.
7. ఒక వస్తువు స్థిరవేగంతో చలిస్తూవుంటే ఆ చలనాన్ని ‘సమచలనం’ అంటారు.

కృత్యం – 5

వాలు తలంపై బంతి చలనాన్ని గమనించుట :

5. వడి మారినప్పటికి చలన దిశ స్థిరంగా వుంటుందని నిరూపించే ఒక సందర్భాన్ని వివరించండి.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 49 AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 50

  1. పటంలో చూపిన విధంగా వాలు తలాన్ని ఏర్పాటు చేయండి.
  2. ఒక బంతిని తీసుకొని వాలుతలం పై చివర నుండి వదిలివేయండి.
  3. పటంలో వివిధ సమయాలవద్ద బంతి స్థానాలను చూపడం జరిగింది.
  4. బంతి గమనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, వాలు తలంపై క్రిందికి జారేబంతి వడి క్రమంగా పెరుగుతుందని, బంతి చలన దిశ స్థిరంగా ఉందని మనం గమనించ గలం.
  5. ఇప్పుడు బంతిని తీసుకొని అది కొంత వడి పొందే టట్లుగా వాలుతలం కింది భాగం నుండి పైకి నెట్టండి.
  6. బంతి కొంతభాగం పైకెళ్ళి మరల క్రిందికి రావడం గమనిస్తాము.
  7. ఈ సందర్భాలను గమనిస్తే బంతి వడి మారుతుండడాన్ని, దాని చలన దిశ స్థిరంగా వుండడాన్ని గమనించవచ్చు.

కృత్యం – 6

సమవృత్తాకార చలనాన్ని పరిశీలించుట :

6. “వది స్థిరంగా వుండి, వేగదిశ మారే” సందర్భాన్ని వివరించండి. (లేదా) సమవృత్తాకార చలనాన్ని వివరించండి.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 51

  1. ఒక చిన్న రాయిని తాడుకి కట్టి దీక్షితిజ సమాంతర తలంలో తిప్పండి.
  2. పటంలో చూపినట్లు రాయి చలన మార్గాన్ని, వివిధ స్థానాలలో వేగ సదిశలను గీయండి.
  3. రాయి వడి స్థిరమని భావించండి.
  4. రాయి వృత్తాకార మార్గం చలిస్తుందని మరియు దాని వేగ దిశ నిరంతరం మారుతుందని గమనిస్తాము.
  5. రాయి వడి మాత్రం స్థిరంగా వుంటుంది.
  6. వస్తువు వృత్తాకార మార్గంలో చలిస్తున్నప్పుడు దాని వడి స్థిరంగా ఉన్నా, వేగదిశ మాత్రం నిరంతరం మారుతుందని తెలుస్తుంది.

కృత్యం – 7

గాలిలోకి విసిరిన రాయి చలనాన్ని గమనించుట :

7. వది, చలనదిశలు రెండూ మారే సందర్భాన్ని ఒక ఉదాహరణతో వివరించండి.
జవాబు:
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 52

  1. క్షితిజ తలంతో కొంత కోణం చేసే విధంగా ఒక రాయిని విసరండి.
  2. అది ఎలా చలిస్తుందో పరిశీలించి, దాని మార్గాన్ని మరియు వేగ సదిశలను చూపే పటం గీయండి.
  3. బంతి వివిధ కాలవ్యవధులలో వివిధ దూరాలు ప్రయాణించి చివరిగా నిశ్చల స్థితికి రావడం గమనిస్తాము. అందువల్ల రాయి వడి స్థిరంగా ఉండదు.
  4. పటంలో చూపిన వేగ సదిశల ఆధారంగా, బంతి చలన దిశ కూడా స్థిరంగా ఉండదని తెలుస్తుంది.
  5. ఈ కృత్యం ద్వారా వడి, చలన దిశలు రెండూ కూడా నిరంతరం మారుతుండడాన్ని గమనించవచ్చు.

ప్రయోగశాల కృత్యం

8. వాలు తలంపై కదిలే వస్తువు త్వరణం, వేగాలను కొలిచే విధానాన్ని వివరించుము.
జవాబు:
ఉద్దేశం : వాలు తలంపై కదిలే వస్తువు త్వరణం, వేగాలను కొలవడం.

పరికరాలు :
గాజు గోళీలు, ఒకే పరిమాణంలో గల పుస్తకాలు, డిజిటల్ వాచ్, పొడుగాటి ప్లాస్టిక్ గొట్టం, స్టీలు పళ్ళెం.
AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 53

ప్రయోగపద్ధతి :

  1. సుమారు 200 సెం.మీ. పొడవుగల ప్లాస్టిక్ గొట్టాన్ని తీసుకోండి.
  2. దానిని పొడవు వెంట చీల్చి వస్తువులు కదిలే కాలువ వంటి మార్గంగా మార్చుకోండి. దీనినే ట్రాక్ అంటాము.
  3. ట్రాక్ పై 0 – 200 సెం.మీ. వరకు కొలతలను గుర్తించండి.
  4. ట్రాక్ ఒక చివరను పటంలో చూపిన విధంగా పుస్తకాలపై ఉంచండి. రెండవ చివరను నేలపై వుంచండి.
  5. రెండవ చివర వద్ద స్టీలు ప్లేటును వుంచండి.
  6. ట్రాకను అమర్చేటప్పుడు దాని ‘0’ రీడింగ్ నేలను తాకే వైపు ఉండాలి.
  7. ట్రాక్ లో పట్టే పరిమాణంగల గోళీని తీసుకోండి. 40 cm మార్కు నుండి గోళీని విడిచిపెట్టండి.
  8. గోళీని విడిచిపెట్టిన వెంటనే డిజిటల్ వాచ్ ను ‘ఆన్’ చేయండి.
  9. ఆ గోళీ క్రిందకు వస్తూ నేలపై వుంచిన స్టీలు ప్లేటును ఢీకొని శబ్దం చేస్తుంది. శబ్దం విన్న వెంటనే డిజిటల్ వాచ్ ను ఆపివేయండి.
  10. ఇదే ప్రయోగాన్ని (40cm కొలతతో) 2 లేక 3 సార్లు చేసి గణించిన విలువలు పట్టికలో రాయండి.
    AP Board 9th Class Physical Science Solutions 1st Lesson చలనం 54
  11. పై ప్రయోగాన్ని వేర్వేరు దూరాలతో చేసి వాటికి సంబంధించిన విలువలు పట్టికలో రాయండి.
  12. పై విలువలకు s – t గ్రాఫు గీయండి.
  13. ఇదే ప్రయోగాన్ని వేరు, వేరు వాలు కోణాల వద్ద చేసి త్వరణాలను కనుక్కోండి.

పరిశీలనలు:

  1. వాలు పెరిగిన కొద్దీ త్వరణం పెరుగుతుంది.
  2. గాజు గోళీలకు బదులు ఇనుప దిమ్మను వాడినప్పటికీ త్వరణం, వాలుల మధ్య సంబంధం మారదు. (ప్రయోగంలో వచ్చే సంఖ్యాత్మక విలువలు మారవచ్చు.)

AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

SCERT AP 9th Class Biology Study Material Pdf Download 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 11th Lesson Questions and Answers జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

9th Class Biology 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
ప్రకృతిలో వివిధ జీవ భౌగోళిక రసాయనిక వలయాల ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:

  1. ఒక ఆవరణము నుండి మరియొక ఆవరణ వ్యవస్థకి పదార్థాల మార్పిడికి జీవ భౌగోళిక రసాయనిక వలయాలు ఉపయోగపడతాయి.
  2. ఒక ప్రదేశము నుండి మరియొక ప్రదేశమునకు అణువుల మార్పిడికి జీవభౌగోళిక రసాయనిక వలయాలు దోహదపడతాయి.
  3. వాతావరణములో అధిక గాఢతలో ఉన్న నైట్రోజనను నత్రజని వలయము ద్వారా నేలలో ఉండే బాక్టీరియాచే నేలలోకి చేర్చబడుతుంది.
  4. జీవ భౌగోళిక రసాయనిక వలయాలు మూలకములను నిల్వచేయుటకు ఉపయోగపడతాయి.
  5. ఆవరణ వ్యవస్థ పనిచేయుటకు జీవ భౌగోళిక రసాయనిక వలయాలు సహాయపడతాయి.
  6. జీవ భౌగోళిక రసాయనిక వలయాలు సజీవులను సజీవులతోను, సజీవులను నిర్జీవులతోను మరియు నిర్జీవులను నిర్జీవులతోను కలుపుతాయి.
  7. పదార్థముల ప్రసారమును జీవ భౌగోళిక రసాయనిక వలయాలు నియంత్రిస్తాయి.

ప్రశ్న 2.
ఓజోన్ పొర తగ్గిపోవటానికి కారణమైన మానవ కార్యకలాపాలేవి? స్ట్రాటోస్పియర్ లో మానవ ప్రమేయం వలన ఓజోన్ పొర తగ్గడాన్ని నివారించడానికి అనుసరించవలసిన ప్రధాన సోపానాలేవి?
జవాబు:

  1. కొన్ని పరిశ్రమలు పాటిస్తున్న విధానాలు మరియు ఉత్పాదకాల వలన ఓజోను పొరను తగ్గించే పదార్థాలు వాతావరణంలోనికి విడుదల అవుతున్నాయి.
  2. ఈ పదార్థాలు బ్రోమిన్, క్లోరిన్ పరమాణువులను స్ట్రాటోస్పియర్‌లోకి చేరవేస్తున్నాయి.
  3. ఇవి అక్కడ జరిపే రసాయన చర్యల వలన ఓజోన్ పొరను నాశనం చేస్తున్నాయి.
  4. ఇందుకు ముఖ్యమైన ఉదాహరణ రిఫ్రిజిరేటర్లలో మరియు ఎయిర్ కండిషన్ వ్యవస్థలో వాడే క్లోరోఫ్లోరో కార్బనులు.
  5. క్లోరోఫ్లోరో కార్బన్స్ వాటి ఉత్పన్నాల వంటి ఓజోన్ పొరను తగ్గించే పదార్థాల ఉత్పత్తి మరియు సరఫరాను నియంత్రించినట్లయితే ఓజోన్ పొర తగ్గిపోవడాన్ని నివారించవచ్చు.

AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

ప్రశ్న 3.
జీవ భౌగోళిక రసాయనిక వలయాలు సమతాస్థితిలో ఉన్నాయని ఎలా చెప్పగలం?
జవాబు:

  1. నేల, నీరు మరియు వాతావరణములో వివిధ వాయువుల శాతం స్థిరంగా ఉండుట వలన మనం జీవ భౌగోళిక రసాయనిక వలయాలు సమతాస్థితిలో ఉన్నాయని చెప్పగలం.
  2. జీవ భౌగోళిక రసాయనిక వలయ పదార్థములు ఒక ఆవరణ వ్యవస్థ నుండి మరియొక ఆవరణ వ్యవస్థలోనికి మారినప్పటికి, అవి ఉండవలసిన పరిమాణము మారదు. ఇందువలన జీవ భౌగోళిక రసాయనిక వలయాలు సమతాస్థితిలో ఉన్నాయని చెప్పగలం.

ప్రశ్న 4.
జీవ భౌగోళిక రసాయనిక వలయాల సమతాస్థితిని మానవ కార్యకలాపాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయి?
జవాబు:

  1. భూమి వాతావరణ పరిస్థితులను నిర్ణయించే జీవ భౌగోళిక రసాయనిక వలయాలను మానవ కార్యకలాపాలు ప్రభావితం చేస్తున్నాయి.
  2. ఎరువుల వాడకం ఫాస్పరస్ మరియు నత్రజని వలయాలను ప్రభావితం చేశాయి.
  3. రైతులు ఉపయోగించిన ఫాస్ఫేటు ఎరువులు మొత్తం మొక్కలచే గ్రహించబడవు. ఎక్కువ మొత్తం వర్షపు నీటి ద్వారా నేల మరియు నీటి వనరులలోనికి చేరతాయి. నీటి వనరులు కాలుష్యం అవుతాయి.
  4. మానవుడు భూమి అంతర్భాగము నందు గల శిలాజ ఇంధనాలను వెలికితీయుట ద్వారా కార్బన్ వలయాన్ని ఆటంకపరిచాడు.
  5. వన నిర్మూలన ద్వారా మానవుడు వాతావరణములో CO2 పెరుగుదలకు కారణమయ్యాడు.
  6. పరిశ్రమల నుంచి సల్ఫర్ డై ఆక్సైడ్ ను విడుదల చేయడం ద్వారా ‘సల్ఫర్ వలయం ప్రభావానికి గురి అయినది.
  7. సల్ఫర్ డై ఆక్సైడ్ ఆక్సీకరణం వలన నేలలోనికి చేరటం, క్షయకరణం ద్వారా వాతావరణంలోనికి చేరటం మరియు వాతావరణంలో సల్ఫేట్ నుండి సల్ఫ్యూరిక్ ఆమ్లము ఏర్పడుతుంది.
  8. ఎక్కువగా చిక్కుడు వంశ పంటలు పెంచడం, రసాయనిక ఎరువులను ఉత్పత్తి చేయడం, పరిశ్రమలు మరియు వాహనాల నుండి కాలుష్య కారకాలు వెదజల్లబడడం వలన మానవులు ఒక సంవత్సరంలో లభ్యమయ్యే నత్రజనిని రెండింతలు చేయడం జరిగింది.

ప్రశ్న 5.
మొక్కల జీవన విధానంలో CO2 పాత్ర గురించి మీ అభిప్రాయం ఏమిటి?
జవాబు:

  1. జీవ సంబంధ కార్బన్ వలయంలో నిరీంద్రియ వాతావరణ కార్బన్ ను జీవసంబంధ రూపంలో మార్చడం మొదటి మెట్టు.
  2. మొక్కలలోనూ ఇతర జీవులైన ఉత్పత్తిదారులలోనూ కిరణజన్య సంయోగక్రియ ద్వారా జీవరూపంలో కార్బన్ స్థాపన చేయబడుతుంది.
  3. కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డై ఆక్సైడ్, నీరు సంయోగం చెంది సరళమైన చక్కెర అణువులైన గ్లూకోజ్ (C6H12O6) ఏర్పడడానికి కాంతి శక్తి సహాయపడుతుంది.
  4. అన్ని మొక్కలకు, జంతువులకు కార్బోహైడ్రేట్లు శక్తినిచ్చే వనరులుగా మారతాయి.
  5. మొక్కలలో కొంత కార్బన్ తాత్కాలిక శక్తిని ఇవ్వడానికి అనువుగా సరళ గ్లూకోజ్ గా ఉండిపోతుంది.
  6. మిగిలిన కార్బన్ శాశ్వతంగా వాడడానికి అనువుగా సంక్లిష్ట అణువులతో కూడిన పిండి పదార్థం రూపంలో నిల్వ చేయబడుతుంది.

ప్రశ్న 6.
కొలనులో మొక్కలన్నీ చనిపోయాయనుకోండి, వాటి ప్రభావం జంతువులపై ఎలా ఉంటుంది?
జవాబు:

  1. కొలనులో మొక్కలన్నీ చనిపోతే వాటిపై ఆధారపడి జీవించే జంతువులపై తీవ్ర ప్రభావం ఉంటుంది.
  2. ఎందుకంటే జంతువులు తమ ఆహార అవసరాల కోసం మొక్కలపై ఆధారపడతాయి.
  3. మొక్కలు చనిపోవుట వలన ఆహారం దొరకక మొక్కలపై ఆధారపడి జీవించే జంతువులన్నీ చనిపోతాయి.

AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

ప్రశ్న 7.
ఉష్ణోగ్రతపై గ్రీన్ హౌజ్ ప్రభావం ఎలా ఉంటుందో ప్రయోగపూర్వకంగా నిరూపించండి.
జవాబు:
ఉద్దేశం : ఉష్ణోగ్రత పై గ్రీన్‌హౌజ్ ప్రభావాన్ని పరీక్షించుట.

కావాల్సిన పరికరాలు : ప్లాస్టిక్ సీసా, (ఇనుప సీల), రెండు థర్మామీటర్లు, నోట్‌బుక్, పెన్సిల్.

విధానం :

  1. ఇనుప సీలతో ప్లాస్టిక్ సీసా పైభాగాన రంధ్రం చేయాలి.
  2. మొదటి థర్మామీటర్ ను రంధ్రంలో గుచ్చాలి.
  3. సీసా పక్కన రెండవ థర్మామీటరు ఉంచాలి.
  4. రెండు థర్మామీటర్లకు సమానంగా సూర్యరశ్మి సోకే విధంగా చూడాలి.
  5. 10 నిమిషాల తరువాత రెండు ధర్మామీటర్లలోని ఉష్ణోగ్రతలను నమోదు చేయాలి.
  6. ఉష్ణోగ్రత వివరాలను నోటు పుస్తకంలో నమోదు చేయాలి.
  7. పది నిమిషాల తరువాత మరియొకసారి ఉష్ణోగ్రతను నమోదుచేయాలి. ఇలా 2-3 సార్లు చేయాలి.

పరిశీలన :
సీసాలో ఉంచిన ధర్మామీటరులో అధిక ఉష్ణోగ్రత నమోదు అయింది.

వివరణ :
వేడెక్కిన సీసా లోపలి గాలి ప్రక్కలకు విస్తరించకుండా ప్లాస్టిక్ బాటిల్ నిరోధించింది. అందువలన ప్లాస్టిక్ బాటిల్ ఉష్ణోగ్రత పెరిగింది. ప్లాస్టిక్ బాటిల్ వలె, భూమిచుట్టూ గ్రీన్‌హౌజ్ వాయువులు ఉష్ణోగ్రతను బంధించుట వలన భూమి ఉష్ణోగ్రత పెరుగుతున్నది.

నిరూపణ :
గ్రీన్‌హౌజ్ వాయువుల వలన భూ ఉష్ణోగ్రత పెరుగుతుందని నిరూపించడమైంది.

ప్రశ్న 8.
మీకు దగ్గరలో ఉన్న ఒక నీటి గుంటలోని జీవులను పరిశీలించండి. ఆ నీటిలో కలుస్తున్న కాలుష్య కారక పదార్థాలను గుర్తించండి. వాటి జాబితా రాయండి. అవి నీటిలోని జీవులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో పరిశీలించండి. మీ పరిశీలనలపై నివేదిక తయారు చేయండి.
జవాబు:
నీటిలో కలుస్తున్న కాలుష్యకారక పదార్థములు :
కాగితములు, మొక్కలు, ఆకులు, శాఖలు, పేపరు, పేడ, చెత్త, మురికినీరు మొదలైనవి.

కాలుష్య కారక పదార్ధములు నీటిలో నివసించే జీవులపై చూపే ప్రభావం :

  1. ఎక్కువ మొత్తంలో నేలలో కలసిపోయే చెత్త పదార్థాలు తక్కువ నీటి స్థలంలో వేసినట్లయితే అనేక పర్యవసానాలు కలుగుతాయి.
  2. చిన్న నీటి గుంటలో ఎక్కువ మొత్తంలో కలసిపోయే చెత్త వేసినట్లయితే అది నీటిలో ఆక్సిజన్ సమస్య ఏర్పడుటకు కారణమవుతుంది.
  3. జీవ సంబంధమైన వ్యర్థ పదార్థాలను విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో భాగంగా సూక్ష్మజీవులు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ను వినియోగిస్తాయి.
  4. నీటి గుంటలో నివసించే జీవులకు తగినంత ఆక్సిజన్ లభించకపోవడం వలన ముఖ్యంగా చేపలు మరణిస్తాయి.
  5. ఈ విధముగా నేలలో కలసిపోయే చెత్త నీటి కాలుష్యానికి కారణమవుతుంది.

ప్రశ్న 9.
నత్రజని వలయాన్ని ఉదాహరణగా తీసుకొని సజీవ మరియు నిర్జీవ అంశాలు ఒకదానితో మరొకటి పరస్పరంగా ఎలా ఆధారపడతాయో వివరించండి.
జవాబు:
సజీవ, నిర్జీవ అంశాలు నత్రజని వలయంలో ఒకదానిపై ఒకటి ఆధారపడడం:
AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 1

  1. వాతావరణంలో ప్రాథమికంగా జడస్థితిలో ఉన్న నైట్రోజన్ ఉంటుంది. ఇది నిర్జీవ అంశము.
  2. నిర్జీవ అంశమైన వాతావరణం నుండి నేలలో ఉండే సజీవ అంశమైన నత్రజని స్థాపన బాక్టీరియా నత్రజనిని స్థాపించి తన శరీర కణములందు నిల్వ చేస్తుంది.
  3. నేలలోని వినత్రీకరణ బాక్టీరియా నైట్రేటులను అమ్మోనియాగా మారుస్తాయి.
  4. నిర్జీవ అంశమైన నేల నుండి సజీవ అంశాలైన మొక్కలు నైట్రేటులను మరియు అమ్మోనియం అయానులను గ్రహించి వాటిని ప్రోటీనులు మరియు కేంద్రకామ్లములుగా మారుస్తాయి.
  5. మొక్కలు మరియు జంతువులు మరణించినపుడు వాటి సేంద్రీయ పదార్థములో ఉన్న నత్రజని తిరిగి నేలకు, నీటిలోనికి చేరుతుంది.
  6. డీ నైట్రిఫైయింగ్ బాక్టీరియా అమ్మోనియంను నేల మరియు నీటిలోనికి విడుదల చేస్తాయి.
  7. నిర్జీవ అంశమైన నేల నుండి సజీవ అంశమైన వాతావరణంలోనికి ప్రవేశిస్తుంది. ఇది డీనైట్రిఫికేషన్ వలన జరుగుతుంది. దీని ద్వారా ఘనరూప నైట్రేట్ వాయురూప నత్రజనిగా మారుతుంది.

ప్రశ్న 10.
ఆక్సిజన్ వలయం, నైట్రోజన్ వలయం, జలచక్రం తెలిపే ఫ్లోచార్టు గీయండి.
జవాబు:
1. ఆక్సిజన్ వలయం
AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 2
2. నైట్రోజన్ వలయం
AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 1
3. జలచక్రం
AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు 3

ప్రశ్న 11.
ఓజోన్ పొర గురించి మీరేమి అవగాహన చేసుకున్నారు ? ఓజోన్ పొర యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ వక్తృత్వ పోటీకి, వ్యాసం రాయండి.
జవాబు:

  1. భూమిపైన వాతావరణం వివిధ పొరలుగా విభజింపబడింది.
  2. స్ట్రాటోస్ఫియర్ లో ఎక్కువ మొత్తం ఓజోన్‌ పూరిత వాతావరణం ఉంటుంది.
  3. ఇది భూమి ఉపరితలం నుండి 15-30 కి.మీ. దూరంలో వ్యాపించి ఉంటుంది.
  4. మూడు ఆక్సిజన్ పరమాణువులతో ఓజోన్ అణువు ఏర్పడుతుంది.
  5. ఓజోన్ నీలిరంగులో ఉంటుంది, మరియు ఘాటైన వాసన కలిగి ఉంటుంది.

ఓజోన్ పొర ప్రాముఖ్యత :

  1. ఓజోన్ తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ వాతావరణంలో ప్రధాన పాత్ర వహిస్తుంది.
  2. సూర్యుని నుండి వచ్చే ప్రభావవంతమైన, శక్తివంతమైన వికిరణం కొంత భాగాన్ని శోషించుకుంటుంది.
  3. తద్వారా అది భూమిపై చేరకుండా కాపాడుతుంది.
  4. ఓజోన్ పొర ప్రధానంగా సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలను శోషిస్తుంది.
  5. అతినీలలోహిత కిరణాలు జీవరాశులపై అనేక హానికరమైన ప్రభావాలను కలుగజేస్తాయి. అందులో ముఖ్యమైనది వివిధ రకాల చర్మ క్యాన్సర్.
  6. ఇంకా ఈ కిరణాల వలన పంటలకు, కొన్ని రకాల సముద్ర జీవులకు నష్టం వాటిల్లుతుంది.

AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

ప్రశ్న 12.
మానవ కార్యకలాపాలు పర్యావరణ ప్రమాదం అనే అంశంపై మీ జిల్లాలోని పిల్లల పత్రికకు పంపడానికి ఒక వ్యాసం తయారుచేయండి.
జవాబు:
భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలి పొరను వాతావరణం అంటారు. మానవులు కూడా పర్యావరణంలో ఒక భాగమై ఉన్నారు. అయినప్పటికీ పర్యావరణానికి అనుకూలంగా తమ కార్యకలాపాలను మార్చుకోలేకపోతున్నారు. మానవుడు చేసే హానికరమైన కార్యకలాపాల వల్ల పర్యావరణం పరిస్థితి దిగజారిపోతూ ఉన్నది.

మానవుడు నేల, నదులు, సముద్రాలు మరియు మహాసముద్రాలను తన యొక్క కార్యకలాపాల వలన కాలుష్యం చేస్తున్నాడు. దీని వలన అవి నేల పంటలు పండించడానికి, నీటి వనరుల వినియోగానికి పనికి రాకుండా పోతున్నాయి.

వన నిర్మూలన వలన అనేక జీవరాసులు ఆవాసం కోల్పోతున్నాయి. ఈ భూగోళం నుండి అనేక జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఆనకట్టలు కట్టడం, పరిశ్రమలు స్థాపించడం, అటవీ భూములు గృహ నిర్మాణానికి వినియోగించడం కారణంగా అనేక మొక్క జంతుజాతులు అంతరించిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి.

ఇతర ప్రదేశాల నుండి స్థానిక పరిసరాలలో కొత్త జీవజాతులు ప్రవేశపెట్టడం వలన అవి అనేక వ్యాధులు కలుగజేస్తుండడంతో స్థానిక జీవజాతులు నశించిపోతున్నాయి. సహజంగా ప్రవహించే నీటి వనరుల మార్గాలను మళ్ళించుట వలన వరదలు సంభవిస్తున్నాయి. సహజ వనరులను ఎక్కువ మొత్తంలో వినియోగిస్తున్నందున తక్కువ కాలంలో నిల్వలు తరిగిపోతున్నాయి. శిలాజ ఇంధనాలను మండించడం ఫలితంగా వాతావరణంలోకి వాయువులు విడుదల కావడంవల్ల పర్యావరణం కలుషితమవుతున్నది.

మానవుని కార్యకలాపాల వలన విడుదలయ్యే CO2 గ్రీన్‌హౌజ్ ఎఫెక్టుకు కారణమవుతుంది. ఎక్కువ మొత్తంలో గ్రీన్‌హౌజ్ వాయువులు విడుదల కావడం వలన భూగోళం వేడెక్కుతుంది. భూగోళం వేడెక్కుట వలన వరదలు, కరవు కాటకాలు, తీవ్ర వర్షాభావ పరిస్థితులు కలుగుతున్నాయి. భూగోళం వేడెక్కుట వలన సముద్రమట్టాలు పెరిగి పల్లపు ప్రాంతాలు మునిగిపోతాయి.

విపరీతమైన వ్యవసాయ విధానాలు, గనుల తవ్వకం కారణంగా నేల క్రమక్షయానికి గురవుతుంది. గనుల తవ్వకం వలన వృక్షసముదాయం నశించడమే కాకుండా, నేలలో అస్థిర పరిస్థితులు కలుగుతాయి.

అందువలన మనమందరమూ పర్యావరణమును రక్షించుకోవాలి. మొక్కలు నాటడం, సక్రమమైన వ్యవసాయ విధానాలు పాటించడం ద్వారా మనం మన భూగోళాన్ని కాపాడుకోవచ్చు. మానవుని కార్యకలాపాలు సక్రమమైన మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే మనం పర్యావరణానికి మిత్రులుగా ఉంటాం.

ప్రశ్న 13.
పాఠశాల అసెంబ్లీ సమావేశంలో చదివి వినిపించడానికి గ్రీన్‌హౌజ్ ఎఫెక్ట్ పై నినాదాలను తయారుచేయండి.
జవాబు:

  1. పచ్చదనం గురించి ఆలోచించండి. కానీ పచ్చగృహం కాదు.
  2. కాలుష్యాన్ని ఆపండి – భూగోళాన్ని కాపాడండి.
  3. మొక్కలు నాటండి – భూమిని కాపాడండి.
  4. గ్రీన్‌హౌజ్ వాయువులు మొక్కలకు మంచివి, కాని జంతు సముదాయమునకు కాదు.
  5. పచ్చగా ఉంచండి – భూమికి వాయువును చేర్చకండి. 6) పచ్చదనం గురించి ఆలోచించండి – చల్లగా ఉండండి.
  6. ప్రకృతిని కాపాడండి – అది మనలను కాపాడుతుంది.

ప్రశ్న 14.
ఇంధనాల దహనం శాస్త్రవేత్తలకు మరియు పర్యావరణవేత్తలకు ఎందుకు ఆందోళన కలుగచేస్తుంది?
జవాబు:

  1. ఇప్పుడు వాడుతున్న స్థాయిలో శిలాజ ఇంధనాలు దహనం చేస్తుంటే రాబోయే 50 నుండి 100 సంవత్సరాల కాలంలోపు అవి పూర్తిగా తరిగిపోతాయి.
  2. అది జరిగిన నాడు ప్రపంచంలో ఇంధనాలు ఎక్కడా దొరకక మానవ కార్యకలాపాలన్నీ స్తంభించిపోతాయి.
  3. శిలాజ ఇంధనాలను మండించినపుడు వాయురూపంలో వాతావరణంలోకి సల్ఫర్ డై ఆక్సైడ్, సల్ఫర్ ట్రై ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ మరియు నైట్రోజన్ డై ఆక్సైడ్లు విడుదల అవుతాయి.
  4. ఇవి వర్షపు నీటిలో గాని, వాతావరణంలో ఉండే తేమలో గాని కరిగి, ఆమ్లాలని ఏర్పరుస్తాయి.
  5. ఈ ఆమ్లాలు వర్షం ద్వారా భూమిని చేరతాయి. వీటిని ఆమ్లవర్షం అంటారు.
  6. ఇంధనాలు మండించినపుడు అధిక మొత్తంలో వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువ మొత్తంలో పరారుణ కిరణాలను గ్రహించుట వలన భూగోళం వేడెక్కుతుంది. దీనిని గ్లోబల్ వార్మింగ్ అంటారు.
  7. తద్వారా భూ ఉష్ణోగ్రతలు అధికమై సముద్రమట్టాలు పెరగడంతో పల్లపు ప్రాంతాలు మునిగిపోతాయి.
  8. గ్లోబల్ వార్మింగ్ వలన అతివృష్టి, అనావృష్టి కలిగి కరువు కాటకాలు సంభవిస్తాయి.

AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

ప్రశ్న 15.
జల సంచలన వలయాన్ని మనుషులుగా మనం ఎలా ప్రభావితం చేస్తున్నామో వివరించండి.
జవాబు:

  1. మనకు అందుబాటులో ఉన్న నీటి వనరులు మారకపోవచ్చు కాని మనము జల సంచలన వలయాన్ని మార్చవచ్చు. జనాభా పెరుగుట వలన మరియు జీవనస్థాయిలు పెరగడం వలన మనకు కావలసిన నీటి లభ్యత పెరగవచ్చు.
  2. నదులు, వాగులు, జలాశయములను కాలుష్యానికి గురిచేయుట ద్వారా మానవుడు జల సంచలన వలయాన్ని ప్రభావితం చేస్తున్నాడు.
  3. రసాయనిక పదార్థములను, అసహ్యకరమైన పదార్థములను నీటికి చేర్చుట ద్వారా నీటిని కలుషితం చేస్తున్నాము. సాంకేతికంగా మనం జల సంచలన వలయాన్ని మార్చలేము. .కానీ దానికి వ్యర్థ పదార్థములను చేర్చుట ద్వారా తారుమారు చేయగలం.

9th Class Biology 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు Textbook InText Questions and Answers

9th Class Biology Textbook Page No. 185

ప్రశ్న 1.
గ్లోబల్ వార్మింగ్ వలన కలిగే ఉపద్రవాలను గురించి రాయండి.
జవాబు:

  1. వాతావరణంలో అధిక మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్ మరియు ఇతర గ్రీన్ హౌజ్ వాయువులు ఎక్కువగా విడుదల కావటం వలన అవి ఎక్కువ వేడిని నిల్వ చేస్తాయి.
  2. దీని ఫలితంగా భూమిపైన ఉష్ణోగ్రత పెరుగుతుంది. తద్వారా భూమి వెచ్చబడటం జరుగుతుంది. దీనిని గ్లోబల్ వార్మింగ్ అంటారు.
  3. గ్లోబల్ వార్మింగ్ అంటే అధిక మొత్తంలో భూమి, సముద్రాల ఉష్ణోగ్రత నమోదు కావటం.
  4. గ్లోబల్ వార్మింగ్ భూమిపై వాతావరణ మార్పును, శీతోష్ణస్థితి మార్పును కలుగచేయటం వలన సముద్ర నీటిమట్టం పెరగటం, అధిక వర్షపాతం, వరదలు, కరవు కాటకాలు సంభవిస్తాయి.

9th Class Biology Textbook Page No. 185

ప్రశ్న 2.
శీతోష్ణస్థితిలో మార్పు సంభవించినపుడు మానవులు మరియు జంతువులపై ఎటువంటి ప్రభావం ఉంటుంది? చర్చించి మీ నోటుబుక్ లో రాయండి.
జవాబు:

  1. శీతోష్ణస్థితిలో మార్పు మానవులు మరియు జంతువులపై ప్రభావం చూపుతుంది.
  2. వాతావరణం మారినపుడు, ఆ మార్పునకు తట్టుకోలేక చాలా జీవులు మరణిస్తాయి.
  3. మరికొన్ని జీవులు సురక్షిత ప్రాంతాలకు వలసపోతాయి.
  4. ఇంకొన్ని జీవులు సుప్తావస్థ వంటి అనుకూలనాలను ప్రదర్శిస్తాయి.
  5. శీతోష్ణస్థితి మార్పులకు మానవుడు అనారోగ్యం పాలౌతాడు.
  6. శీతోష్ణస్థితి మార్పులకు ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.

AP Board 9th Class Biology Solutions 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు

9th Class Biology Textbook Page No. 186

ప్రశ్న 3.
మురికి కాలువల దగ్గర వాసన రావటానికి కారణాలు ఏమిటి?
జవాబు:

  1. మురికి నీటిలో ఆక్సిజన్ పరిమాణం తక్కువగా ఉంటుంది.
  2. ఆక్సిజన్ దొరకనపుడు వాయుసహిత బాక్టీరియాలు మరణిస్తాయి.
  3. అప్పుడు అవాయు బాక్టీరియాలు వ్యర్థ పదార్థాలను హైడ్రోజన్ సల్ఫేడ్ (H2O) మరియు ఇతర విషపదార్థాలుగా మార్చుతాయి.
  4. ఈ పదార్థాలు దుర్గంధమైన వాసనను కలిగిస్తాయి.
  5. అందువలన మురికి కాలువల దగ్గర వాసన వస్తుంది.

9th Class Biology 11th Lesson జీవ భౌగోళిక రసాయనిక వలయాలు Textbook Activities (కృత్యములు)

ప్రయోగశాల కృత్యము

ఉద్దేశం : ఉష్ణోగ్రతపై గ్రీన్ హౌజ్ ప్రభావాన్ని పరీక్షించుట.

కావాల్సిన పరికరాలు :
ప్లాస్టిక్ సీసా, (ఇనుప సీల), రెండు థర్మామీటర్లు, నోట్ బుక్, పెన్సిల్.

విధానం :

  1. ఇనుప సీలతో ప్లాస్టిక్ సీసా పైభాగాన రంధ్రం చేయాలి.
  2. మొదటి థర్మామీటరు రంధ్రంలో గుచ్చాలి.
  3. సీసా పక్కన రెండవ థర్మామీటర్‌ను ఉంచాలి.
  4. రెండు థర్మామీటర్లకు సమానంగా సూర్యరశ్మి సోకే విధంగా చూడాలి.
  5. 10 నిమిషాల తరువాత రెండు థర్మామీటర్లలోని ఉష్ణోగ్రతను నమోదు చేయాలి.
  6. ఉష్ణోగ్రత వివరాలను నోటు పుస్తకంలో నమోదు చేయాలి.
  7. పది నిమిషాల తరువాత మరియొకసారి ఉష్ణోగ్రతను నమోదుచేయాలి. ఇలా 2-3 సార్లు చేయాలి.

ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.
1) రెండు ‘ థర్మామీటర్లు ఒకే ఉష్ణోగ్రతను నమోదు చేశాయా? లేకపోతే ఏ థర్మామీటరు అధిక ఉష్ణోగ్రతను నమోదు చేసింది?
జవాబు:
సీసాలో గుచ్చిన థర్మామీటరు ఎక్కువ ఉష్ణోగ్రతను నమోదు చేసింది.

2) రెండు ఉష్ణోగ్రతలు సమానంగా ఉండకపోవటానికి కారణాలు ఏమిటి?
జవాబు:
ఎ) ప్లాస్టిక్ సీసా సూర్యరశ్మిని గ్రహించి నిల్వ చేయడం వలన వేడి బయటకు పోకుండా ఆపుతుంది.
బి) లోపలంతా వెచ్చగా ఉంటుంది.
సి) అందువలన సీసా నందు ఉంచిన థర్మామీటరు, సీసా బయట ఉంచిన థర్మామీటరు కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను నమోదు చేస్తుంది.

AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం

AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం

SCERT AP 9th Class Biology Guide Pdf Download 10th Lesson నేల కాలుష్యం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 10th Lesson Questions and Answers నేల కాలుష్యం

9th Class Biology 10th Lesson నేల కాలుష్యం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
నేల కాలుష్యం అంటే ఏమిటి? (AS 1)
జవాబు:
నేల కాలుష్యం :
నేల కాలుష్యం అనగా నేల సారం లేదా నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపే పదార్థాల చేరిక అని అర్ధం.

ప్రశ్న 2.
రసాయనిక ఎరువులు పంటలకు ఉపయోగకరం. కానీ అవి పర్యావరణ కాలుష్యానికి ఏ విధంగా కారణమవుతాయి? (AS 1)
జవాబు:

  1. నేలలో ఎరువులు వేసినప్పుడు ఎరువుల తయారీలో ఉపయోగించే ముడిపదార్థాల నుంచి వచ్చే కలుషితాల వల్ల నేల కలుషితం అవుతుంది.
  2. ఎక్కువగా భాస్వరపు ఎరువులు ఉపయోగించడం వల్ల లోహాలు అయిన ఆర్సినిక్, లెడ్ మరియు కాడ్మియం నేలలో మోతాదుకు మించి చేరి విషతుల్యం అవుతున్నాయి.
  3. ఎక్కువ మొత్తంలో రసాయనిక ఎరువులు ఉపయోగించటం వలన అవి సరస్సులు, నదులు, చెరువులను కాలుష్యానికి గురి చేస్తున్నాయి.
  4. అవి ఎక్కువ మొత్తంలో శైవలాల పెరుగుదలకు కారణమవుతున్నాయి. దీనిని యూటోఫికేషన్ అంటారు.
  5. ఎక్కువ మొత్తంలో పెరిగే శైవలాలు నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. మరియు నీటిలో ఆక్సిజన్ శాతాన్ని తగ్గిస్తాయి.
  6. నీటిలో నివసించే ఇతర జీవులకు ఆక్సిజన్ లభ్యం కాకపోవటం వలన అవి చనిపోతాయి.
  7. నత్రజని ఎరువుల నుండి విడుదలయ్యే అమ్మోనియా మరియు నైట్రోజన్ ఆక్సెడుల వలన గాలి కాలుష్యం అవుతుంది.
  8. వీటి వలన ఆమ్ల వర్చాలు ఏర్పడటమే కాకుండా పొగతో కూడిన పొగమంచును నగరాలలో ఏర్పరుస్తాయి.
  9. దీనివలన పర్యావరణ మరియు ఆరోగ్య సమస్యలైన శ్వాససంబంధ వ్యాధులు కలుగుతాయి.

AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం

ప్రశ్న 3.
మానవ, పశువుల వ్యర్థాలను పర్యావరణానికి మేలు చేసే విధంగా పారవేసే పద్ధతుల గురించి రాయండి. (AS 1)
జవాబు:

  1. ఈ మధ్య కాలంలో పశువుల వ్యర్థాలే కాకుండా మానవుని విసర్జిత పదార్థాలు ప్రత్యామ్నాయ మరియు శ్రేష్టమైన పద్ధతిలో ఇంధనం తయారీలో ఉపయోగించవచ్చు.
  2. వ్యర్థ పదార్థాల నుండి వాయు రహిత కిణ్వనము ద్వారా వాయువు ఉత్పత్తి అవుతుంది. ఆ వాయువును ఇంధనముగా వాడతారు.
  3. ఈ వాయువు జీవ వ్యర్థాల నుండి తయారయినది కాబట్టి దీనిని బయోగ్యాస్ అంటారు.
  4. బయోగ్యాస్ నందు మిథేన్, కార్బన్ డయాక్సెడ్ ఇంకా అతి తక్కువ ప్రమాణంలో హైడ్రోజన్, నైట్రోజన్, హైడ్రోజన్ సల్ఫేట్లు ఉంటాయి.

ప్రశ్న 4.
పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాల వలన కలిగే నేల కాలుష్యాన్ని తగ్గించడానికి ఏమేమి చర్యలు చేపట్టాలి? (AS 1)
జవాబు:

  1. పరిశ్రమల నుండి విడుదలయ్యే వ్యర్థాలను భౌతికంగా, రసాయనికంగా మరియు జీవ శాస్త్రీయంగా ప్రమాదకరంకాని పదార్థాలుగా వాటిని తయారు చేయాలి.
  2. ఆమ్ల మరియు క్షార వ్యర్థాలను ముందుగా తటస్థీకరించాలి.
  3. నీటిలో కరగని పదార్థములయితే అవి నేలలో కలిసిపోయే పదార్ధములయితే వాటిని సహజ పరిస్థితులలో నేలలో కలసిపోయే విధంగా చేయాలి.
  4. కర్మాగారాల నుండి విడుదలయ్యే పొగలో రేణురూప కలుషితాలను తగ్గించటం కోసం, స్థిర విద్యుత్తు అవక్షేపాల పద్ధతిని ఉపయోగించాలి.

ప్రశ్న 5.
వైద్య సంబంధ వ్యర్థాలు అంటే ఏమిటి? ఎందుకు వీటిని హానికరమైన వ్యర్థాలుగా పరిగణిస్తారు? ప్రమాదకరం కాకుండా వీటిని తొలగించుకొనే పద్ధతులు ఏమి? (AS 1)
జవాబు:

  1. ఆసుపత్రులందు తయారయిన వ్యర్థ పదార్థములను వైద్య సంబంధ వ్యర్థ పదార్థాలు అంటారు.
  2. ఆసుపత్రిలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాల వల్ల అనేక రకాల వ్యాధులు కలుగుతాయి. అందువలన వీటిని హానికరమైన వ్యర్థాలుగా పరిగణిస్తారు.
  3. సిరంజిలు, సూదులు, శస్త్ర చికిత్స పరికరాలు, ఆపరేషన్ థియేటర్ వ్యర్థాలు, మిగిలిన మందులు, బాండేజి గుడ్డలు, మానవ విసర్జితాలు మొదలైనవి వైద్య సంబంధ వ్యర్థాలకు ఉదాహరణలు.
  4. వైద్య సంబంధ వ్యర్థాలు ప్రమాదకరం కాకుండా వీటిని నివాస ప్రాంతాలకు దూరంగా నేలలో గోతులను తీసి పూడ్చివేయాలి.

ప్రశ్న 6.
ఎలాంటి వ్యవసాయ విధానాలు నేల కాలుష్యానికి కారణమవుతాయి? ఇవి ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయి? (AS 1)
జవాబు:

  1. విచక్షణారహితంగా ఎరువులు, శిలీంధ్ర నాశకాలు, కీటక సంహారకాలు, గుల్మనాశకాలు వాడడం, దున్ని వ్యవసాయం చేయడం, పంట మార్పిడి పద్ధతులు అవలంబించకపోవడమనేవి నేల కాలుష్యానికి కారణమవుతాయి.
  2. ఈ విధమైన వ్యవసాయ విధానాలు నేల మీద వ్యతిరేక ప్రభావాలు చూపిస్తాయి.
  3. రసాయనిక ఎరువులు వాడడం వల్ల మనం 20 – 30 సంవత్సరాల వరకే అధికోత్పత్తి సాధించగలం.
  4. ఆ తర్వాత నేల మొక్కలు మొలవడానికి కూడా పనికిరాకుండా పోతుంది.
  5. ఎక్కువ మొత్తంలో శిలీంధ్రనాశకాలు, క్రిమిసంహారకాలు, గుల్మనాశకాలు వినియోగించినట్లయితే నేల లవణీయత పెరిగిపోతుంది. మరియు పంటలు పండించడానికి ఆ నేల ఉపయోగపడదు.
  6. నేలకు ఎలాంటి అంతరాయం కలిగించకుండా పంటలు పండింఛడం, నేలను దున్నకుండా వ్యవసాయం చేయడం.
  7. నేలలో ఎరువులు వేయడానికి చాళ్ళను దున్నడం పనికి వస్తున్నప్పటికీ దీని వలన నేలలో ఉండే సూక్ష్మజీవులు
    చనిపోతాయి. అందువలన నత్రజని స్థాపన తగ్గిపోతుంది.
  8. ఒక రకం పంటను అన్ని కాలాలలో పండించడం వలన నేల కాలుష్యమవుతున్నది. తద్వారా పంట దిగుబడి తగ్గుతుంది.

AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం

ప్రశ్న 7.
మీ పరిసరాలలో కాలుష్యం కలిగించకుండా అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలను గుర్తించి క్రమంలో రాయంది. (AS 1)
జవాబు:

  1. సేంద్రియ ఎరువులు వినియోగం
  2. సేంద్రియ పురుగు మందులు వినియోగం
  3. సేంద్రియ కలుపు మందులు వినియోగం
  4. పరభక్షక కీటకాల వినియోగం
  5. దున్నకుండా వ్యవసాయం చేయడం
  6. నేలలో సరియైన pH విలువ ఉండేలా చూడటం
  7. పంట మార్పిడి పద్ధతి
  8. క్షారత్వ నిర్వహణ
  9. నేలలోని జీవులు

ప్రశ్న 8.
నేలకు ఉండే మూడు ప్రధాన ధర్మాలను తెలిపి అవి ఏ విధంగా మొక్కల మీద ప్రభావం చూపిస్తాయో రాయండి. (AS 1)
జవాబు:
1) నేలకు ఉండే మూడు ప్రధాన ధర్మాలు :
1. భౌతిక ధర్మాలు, 2. రసాయనిక ధర్మాలు, 3. జీవసంబంధ ధర్మాలు.

2) భౌతిక ధర్మాలు – మొక్కల మీద ప్రభావం :
a) నేలలో ఉన్న అసంఖ్యాకమైన సూక్ష్మజీవులు జైవిక పదార్థాలను మొక్కలకు ఉపయోగపడే పోషకాలుగా మారుస్తాయి.
b) నేలను వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తాయి.

3) రసాయనిక ధర్మాలు – మొక్కల మీద ప్రభావం :
a) మొక్కకు కావలసిన పోషకాల అందుబాటు నేల యొక్క pH విలువపై ఆధారపడి ఉంటుంది.
b) నేలలో pH విలువ తగ్గే కొద్దీ మొక్కకు కావలసిన పోషకాలైన సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మరియు సల్ఫర్ అందుబాటు తగ్గుతుంది.

4) జీవసంబంధ ధర్మాలు – మొక్కల మీద ప్రభావం :
a) నేలలో ఉన్న జీవరాశులు వృక్ష సంబంధ వ్యర్థాల మీద ఆధారపడి జీవిస్తూ నేలలోకి గాలి చొరబడడానికి నీరు నేలలోకి ఇంకేలా చేయడానికి తోడ్పడతాయి.
b) నేలలో ఉండే సూక్ష్మజీవులు జీవ సంబంధములను అనగా సేంద్రియ స్థితిలో ఉన్న వాటిని నిరింద్రియ పదార్థాలుగా మార్చి మొక్కలకు అందిస్తాయి.

ప్రశ్న 9.
ఉదజని సూచిక (pH) అంటే ఏమిటి? నేల ఉదజని సూచిక విలువ చాలా ఎక్కువగా ఉండటం లేదా చాలా తక్కువగా ఉండటం వలన కలిగే ఫలితాలు ఏమిటి? (AS 1)
జవాబు:

  1. నేలల ఆమ్ల మరియు క్లార స్వభావాలను తెలపడానికి pH ప్రమాణాలను ఉపయోగిస్తారు.
  2. మంచి నేలల pH విలువలు 5.5 నుండి 7.5 వరకు ఉంటాయి.
  3. pH విలువ 7 కన్నా తక్కువ కలిగిన నేలలను ఆమ్ల స్వభావం కలిగిన నేలలు అని, pH విలువ 7 కన్నా ఎక్కువ కలిగిన నేలలను క్షార స్వభావం కలిగిన నేలలు అని అంటారు.

ఉదజని సూచిక తక్కువగా ఉండడం వలన కలిగే ఫలితాలు :

  1. నీటిలో కరిగే లోహాలు అల్యూమినియం మరియు మాంగనీసు విషపదార్థాలుగా మారతాయి.
  2. కాల్షియం కొరత ఏర్పడవచ్చు.
  3. మొక్కలకు పోషకాలను అందించే సూక్ష్మజీవుల సంఖ్య తగ్గుతుంది.
  4. చిక్కుడు జాతి మొక్కలలో సహజీవన నత్రజని స్థాపన తీవ్ర ప్రభావానికి లోనవుతుంది.
  5. నేలలో తక్కువ సేంద్రియ పదార్థం ఉంటుంది.
  6. మొక్కలకు అందుబాటులో ఉండే పోషకాల సంఖ్య తగ్గుతుంది.

ఉదజని సూచిక ఎక్కువగా ఉండడం వలన కలిగే ఫలితాలు :

  1. మొక్కలు పోషకాలను గ్రహించడం మరియు సూక్ష్మజీవుల చర్యలు తగ్గిపోతాయి. తద్వారా మొక్కలకు అవి విషపదార్థాలుగా మారతాయి.
  2. ఉదజని సూచిక ఎక్కువగా ఉండుట వలన ఎక్కువ మొక్కలలో కణత్వచపు పొరలు మూయటం లేదా తెరవడం జరుగుతుంది.
  3. ఇది మొక్కల నిర్మాణం పైనా మరియు పోషకాలను పైకి గ్రహించే విధానం పైనా ప్రభావం చూపుతుంది.
  4. ఎక్కువ ఉదజని సూచిక వలన పోషకాలు అత్యధికంగా లభ్యమవడం లేదా అసలు లభ్యం కాకపోవడం జరుగుతుంది.

AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం

ప్రశ్న 10.
నేల సారవంతత అంటే ఏమిటి? నేలసారం పెంచుకోవడానికి మార్గాలేవి? (AS 1)
జవాబు:

  1. నేల సారవంతత నేల ధర్మాల మీద ఆధారపడి ఉంటుంది.
  2. ముఖ్యంగా నేలకు గల నీటిని నిలిపి ఉంచుకునే శక్తి, మొక్కలకు కావలసిన పోషకాలను కలిగి ఉండి అవసరమైన పరిమాణంలో నేరుగా అందించగలగడం అనే ధర్మాలు నేల సారవంతతను తెలియచేస్తాయి.
  3. సూక్ష్మజీవులు నేలలోని జైవిక పదార్థాన్ని తయారు చేయటంలో, పోషకాలను మెండుగా కలిగి ఉండే హ్యూమస్ తయారీలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి.
  4. నేలలో ఉండే పోషకాలు మట్టి కణాలతో బంధింపబడి ఉండకపోతే అవి మొక్కలకు అందుబాటులోకి రావు.
  5. సారవంతమైన నేల సూక్ష్మజీవులు జీవించడానికి అనుకూలంగా ఉంటుంది.
  6. నేల సారవంతతను పెంచడానికి సేంద్రియ ఎరువులు వినియోగిస్తారు.
  7. శిలీంధ్ర తంతువులు మొక్కల వేళ్ళు చొచ్చుకుపోలేని సూక్ష్మ ప్రదేశాలలోకి వెళ్ళి పోషకాలను సిద్ధం చేస్తాయి.
  8. నేల pH, ఆమ్ల, క్షార స్వభావాలు కూడా పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తీసుకురావడానికి తోడ్పడతాయి.
  9. వృక్ష మరియు జంతువుల వ్యర్థాలు కుళ్ళిపోయినపుడు నేలలోనికి పోషకాలు విడుదల అవుతాయి.

ప్రశ్న 11.
జీవ సంబంధ పదార్థం అంటే ఏమిటి? ఇది మొక్కలకు ఎందుకు ముఖ్యమైనది? (AS 1)
జవాబు:

  1. జీవ సంబంధ పదార్థాలలో కుళ్ళిన జంతు, వృక్ష కళేబరాలు, వాటి విసర్జితాలు ఉంటాయి.
  2. సేంద్రియ పదార్థాలలో మొక్కల పెరుగుదలకు అవసరమయ్యే పనికివచ్చే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం మొదలైన పోషకాలు ఉంటాయి.
  3. నేలలో 30 శాతం లేదా అంతకన్నా ఎక్కువ జీవ సంబంధ పదార్థాలను కలిగి ఉండే దానిని జైవిక నేల అంటారు.
  4. నేలలో ఉన్న జీవ సంబంధ పదార్థాలు నేలలో నీరు ఇంకడాన్నీ, నీటిని నిలువ ఉంచుకునే శక్తిని వృద్ధి చేస్తాయి.
  5. నేల నుండి తేమ ఆవిరి కాకుండా నిరోధిస్తాయి. 6) ఇలాంటి నేలలలో ఉండే అసంఖ్యాకమైన సూక్ష్మజీవులు జైవిక పదార్థాలను మొక్కలకు ఉపయోగపడే పోషకాలుగా మారుస్తాయి.

ప్రశ్న 12.
నేలలో జీవ సంబంధ పదార్థ స్థాయిపై ప్రభావితం చేసే కారకాలు ఏవి? నేలలో వీటిని ఎలా పెంచవచ్చు? (AS 1)
జవాబు:
1) నేలలో జీవ సంబంధ పదార్ధ స్థాయిపై ప్రభావం చూపే కారకాలు :
ఉష్ణోగ్రత, వర్షపాతం, సహజంగా పెరిగే చెట్లు, నేల స్వరూపం, నీటి పారుదల, పంటలు పండించడం, నేల దున్నడం మరియు పంట మార్పిడి పద్ధతులు.

2) ఉష్ణోగ్రత :
సేంద్రియ పదార్థం కుళ్ళిపోయే వేగం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కంటే తక్కువగా ఉన్నప్పుడు జరుగుతుంది.

3) ప్రతి 10°C ఉష్ణోగ్రత తగ్గుదలకు రెండు నుండి మూడు రెట్ల సేంద్రియ పదార్థం మరియు పోషకాలు నేలకు చేర్చబడతాయి.

4) వర్షపాతము :
వర్షపాతము పెరిగే కొద్ది ఏర్పడే సేంద్రియ పదార్థము పెరుగుతుంది.

5) నేల స్వభావం :
అతి నాణ్యమైన స్వరూపం గల నేలలో ఎక్కువ సేంద్రియ పదార్థం ఉంటుంది.

6) సహజంగా పెరిగే చెట్లు :
గడ్డి మైదానాలలో ఉండే నేలలలో ఎక్కువ మొత్తంలో సేంద్రియ పదార్థం ఉంటుంది.

7) నీటి పారుదల :
నీటి పారుదల సక్రమంగా లేని నేలలందు తేమ ఎక్కువగా ఉంటుంది. గాలి చొరబాటు తక్కువ. అందువలన సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉంటుంది.

8) పంటలు పండించడం మరియు దున్నడం :
పంటలు పండే నేలలందు చాలా తక్కువ మొత్తంలో సేంద్రియ పదార్థం. పోషక పదార్థాలు ఉంటాయి.

9) పంట మార్పిడి :
ప్రధాన ధాన్యపు పంట పండించిన తరువాత చిక్కుడు జాతికి చెందిన పంటలు పండిస్తే నేలలో ఎక్కువ మొత్తం సేంద్రియ పదార్థం ఉంటుంది.

AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం

ప్రశ్న 13.
జైవిక సవరణీకరణ (Bio-Remediation) అంటే ఏమిటి? ఇది నేల కాలుష్యాన్ని నియంత్రించడంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది? (AS 1)
జవాబు:

  1. జీవ సంబంధ పద్ధతుల ద్వారా కాలుష్య కారకాలను తొలగించడాన్ని జైవిక సవరణీకరణ అంటారు.
  2. అవక్షేపాలు, నేల, నీరు మొదలైన వాటిలో ఏర్పడే పర్యావరణ సమస్యలను తొలగించుకోవడానికి సాధారణంగా సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు.
  3. జైవిక సవరణీకరణంలో సూక్ష్మజీవులతోపాటు మొక్కలను కూడా ఉపయోగిస్తారు. దీనిని ఫైటోరిమిడియేషన్ అంటారు.
  4. లోహాల వంటి అకర్బన పదార్థాలు, తక్కువ స్థాయిలో గల రేడియోధార్మిక పదార్థాలు వంటి వాటి ద్వారా కలిగే కాలుష్యాన్ని తొలగించడానికి జైవిక పద్ధతులను ఉపయోగిస్తారు.

ప్రశ్న 14.
నేల స్వరూప స్వభావాలు నేలలో ఉండే పోషకాల మీద ప్రభావం చూపిస్తాయి. ఇవి వ్యవసాయం మీద ఎలాంటి ప్రభావం కలిగిస్తాయి? (AS 2)
జవాబు:

  1. వదులుగా, సూక్ష్మరంధ్రాలు కలిగిన నేల ఎక్కువ నీటిని గ్రహిస్తుంది. మరియు వేర్ల విస్తరణకు తోడ్పడుతుంది. వదులుగా ఉన్న నేల పోషకాలను మొక్కలు గ్రహించడంలో ఉపయోగపడుతుంది.
  2. సూక్ష్మమైన రేణువులు కలిగిన మట్టి, నేల యొక్క ఉపరితలమును పెంచుతుంది. తద్వారా పోషకాలను తనలో ఉంచుకోగలుగుతుంది.
  3. ఎక్కువ రంధ్రాలు కలిగిన నేల అనగా ఇసుకనేల తనగుండా ఎక్కువ మొత్తంలో పోషకాలను తనగుండా పోనిస్తుంది. తక్కువ మొత్తంలో పోషకాలు మొక్కలకు అందుబాటులో ఉంటాయి.
  4. సాధారణముగా వదులుగా ఉన్న, గాలి గలిగిన నేల నిర్మాణము మొక్కల పెరుగుదలకు అనుకూలము. పంట దిగుబడి ఎక్కువ వచ్చును.
  5. నేలను దున్నడం ద్వారా చిన్న మరియు పెద్ద మట్టి రేణువులు కలవడం అనేది దున్నడం ద్వారా చేయవచ్చు. ఎరువును దున్నడం ద్వారా నేలలో కలిసే విధంగా చేయవచ్చు.

ప్రశ్న 15.
నేలల సంరక్షణ ముఖ్యమైన అంశము. దీని గురించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఏమి జరుగుతుంది? (AS 2)
జవాబు:

  1. నేల అనేక జీవులు, మొక్కలకు ఆవాసం కనుక నేల సంరక్షణ మనకు అతి ముఖ్యమైన అంశము. ఎందువలనంటే నేల మానవులకు, జంతువులకు ఆహార వనరు.
  2. నేల పైభాగము క్రమక్షయమునకు గురి అయినట్లయితే అతి ముఖ్యమైన పోషక పదార్థాలను కోల్పోవటం వల్ల పంట దిగుబడి తగ్గుతుంది. అందువలన ఒక ఎకరాకు వచ్చే ఆహార దిగుబడి తగ్గుతుంది. కనుక నేలను సంరక్షించాలి.
  3. మొక్కల పెరుగుదలకు కావలసిన సేంద్రియ పదార్థం నేలలో ఉన్నది కనుక మనము నేలను సంరక్షించాలి.
  4. నేల సంరక్షణ చర్యలు చేపట్టకపోయినట్లయితే మృత్తికా క్రమక్షయము జరుగుతుంది.
  5. నేల నందు ఎక్కువగా పంటలు పండించినపుడు వాడే ఎరువుల వలన నేల లవణీయత పెరిగి, పంట పండించడానికి అనుకూలముగా ఉండదు. అందువలన నేలను సంరక్షించాలి.
  6. నేలను సంరక్షించకపోయినట్లయితే నేలలోని పోషకాలు తగ్గిపోతాయి.

ప్రశ్న 16.
నేలలో జీవించే ఏవైనా పది జీవుల పేర్లు రాయండి. ఇవి నేల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాయో రాయండి. (AS 4)
జవాబు:

  1. అతి సూక్ష్మమైన వైరస్లు, ఎలుకలు, నేల ఉడుతలు, బాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్లు, పేడ పురుగులు, వానపాములు వివిధ రకాలయిన పురుగులు ఉంటాయి.
  2. నేలలో నివసించే జీవులు వృక్ష సంబంధ వ్యర్థాల మీద జీవిస్తూ నేలలోకి, గాలి చొరబడడానికి, నీరు నేలలోకి ఇంకేలా చేయడానికి తోడ్పడతాయి.
  3. నేలలో ఉండే సూక్ష్మజీవులు జీవ సంబంధ మూలకాలను అనగా సేంద్రియ స్థితిలో ఉన్న వాటిని నిరింద్రియ పదార్థాలుగా మారుస్తాయి.
  4. నేలలో నిరింద్రియ పదార్థాలు పోగుపడకుండా వివిధ రకాలైన సూక్ష్మజీవులు నియంత్రిస్తూ ఉంటాయి.
  5. సూక్ష్మజీవులు జరిపే వివిధ జీవ, భౌతిక, రసాయనిక చర్యల వల్ల నేలను వ్యవసాయానికి, ఇతర ప్రయోజనాలకు నేల తోడ్పడేలా చేస్తాయి.

AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం

ప్రశ్న 17.
నేల కాలుష్యం కలిగించే కారకాలను, వాటిని తొలగించే పద్ధతులను వివరించే ఫ్లోచార్టను తయారు చేయండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం 1

ప్రశ్న 18.
మీ పరిసరాలలో కాలుష్యం కలిగించే చర్యలను గుర్తించండి. వాటిని ఎలా నివారించాలో సూచించే ఫ్లో చార్టును లేదా పట్టికను రూపొందించండి. (AS 5)
జవాబు:
మా పరిసరాలలో కాలుష్యం కలిగించే చర్యలు :
పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు, రసాయనిక పదార్థాలు, వ్యవసాయ క్రిమిసంహారకాలు, ఎరువులు మరియు కీటక సంహారకాలు, ఘనరూప వ్యర్థాలు.
AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం 2

ప్రశ్న 19.
కింది గుర్తును చూసి దీనికి అర్థం ఏమిటో చెప్పండి. (AS 5)
AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం 3
జవాబు:

  1. ఇది జైవిక సవరణీకరణకు సంబంధించిన గుర్తు.
  2. మొక్కలు జైవిక సవరణీకరణకు ఉపయోగపడతాయని అర్థం.

ప్రశ్న 20.
ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి ఆటంకం కలిగిస్తున్నాయంటారు ఎందుకు? (AS 6)
జవాబు:

  1. ప్లాస్టిక్ వినియోగం అత్యధికంగా ఉండటం వల్ల పర్యావరణంపై దాని యొక్క ప్రభావం అధికంగా ఉన్నది.
  2. ప్లాస్టిక్ సంచుల వినియోగం వలన నీటి ప్రవాహాలకు ఆటంకం ఏర్పడటం, నేలలోని సూక్ష్మరంధ్రాలను మూసివేయటం మురియు భూగర్భజల సేకరణకు ఆటంకం మొదలైనవి ఏర్పడుతున్నాయి.
  3. నేలలో ఉన్న సూక్ష్మజీవుల క్రియాత్మకతపై ప్లాస్టిక్ సంచులు ప్రభావం చూపిస్తాయి.
  4. ప్లాస్టిక్ సంచులను తిన్న జంతువులు చనిపోవడం జరుగుతుంది.
  5. ప్లాస్టిక్ సంచుల నుండి విడుదలయ్యే విషపూరిత రంగులు ఆహార పదార్ధములను కలుషితం చేస్తాయి.
  6. ప్లాస్టిక్ సంచులు నేలపై వెదజల్లబడతాయి లేదా సరియైన యాజమాన్య నిర్వహణలేని చెత్తకుప్పలందు పేరుకొని ఉంటాయి. ఇవి నేలలో కలసిపోవడానికి వందల సంవత్సరాల సమయం పడుతుంది.
  7. పేరుకొనిపోయిన ప్లాస్టిక్ సంచుల వలన పర్యావరణానికి హాని కలుగుతుంది.

ప్రశ్న 21.
నేల ఆరోగ్యం ఎంతో ముఖ్యమైన అంశం అని రాము చెప్పాడు. నీవు అతనిని ఎలా సమర్థిస్తావు? (AS 6)
జవాబు:

  1. నేల ఆరోగ్యం ఎంతో ముఖ్యమైన అంశం అని రాము చెప్పిన మాటను నేను సమర్ధిస్తాను.
  2. ఎందుకంటే ఆరోగ్యవంతమైన నేల ద్వారా వచ్చే ఆహార ఉత్పత్తులను తిన్న ప్రాణులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
  3. నేలలో ఉండవలసిన అంశాలు సమపాళ్ళలో ఉన్నప్పుడు ఆ నేల అధిక దిగుబడి కూడా ఇస్తుంది.

ప్రశ్న 22.
మీ గ్రామంలో మీరు ఏ ఏ నేల కాలుష్య సమస్యలను గుర్తించారు? వాటికి కారణాలను, అవి తొలగించడానికి సూచనలను రాయండి. (AS 7)
జవాబు:
మా ఊరిలో నేను గుర్తించిన నేల కాలుష్య సమస్యలు :

నేల కాలుష్య సమస్య కారణం తొలగించడానికి సూచనలు
1. మురికి కాలువల్లో చెత్త పేరుకొనిపోవడం నీటి ప్రవాహంలో ఘనరూప పదార్థాలు అడ్డుపడడం 1. కాలువలలో ఘనరూప వ్యర్థాలు వేయకుండా చూడాలి.
2. ఎప్పటికప్పుడు కాలువలో పూడిక తీయాలి.
2. దుర్వా సన ఒకే ప్రదేశంలో వ్యర్థాలు పారవేయడం నివాస ప్రదేశాలకు దూరంగా వ్యర్థాలను పారవేయాలి.
3. ఆసుపత్రి వ్యర్థాల వలన నేల కాలుష్యం జనావాస ప్రదేశాలలో ఆసుపత్రి వ్యర్థాలు వేయడం సుదూర ప్రాంతాలలో నేలలో గోతులు తీసి పూడ్చాలి.
4. మల విసర్జన వల్ల కాలుష్యం, దుర్వాసన రోడ్లకు ఇరువైపులా మల విసర్జన పాయఖానాలను మల విసర్జనకు వినియోగించాలి.
5. నేల లవణీయత పెరుగుదల ఎక్కువ మొత్తంలో రసాయనిక ఎరువులు వాడడం సేంద్రియ ఎరువులను వినియోగించాలి.

AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం

ప్రశ్న 23.
ఘనరూప వ్యర్థాలు అంటే ఏమిటి? ఘనరూప వ్యర్థాల యాజమాన్యానికి సరైన పద్ధతులను సూచించండి. (AS 7)
జవాబు:

  1. వివిధ చర్యల ద్వారా సమాజం చేత ఒకసారి వాడుకొని పారేయబడిన కర్బన, అకర్బన పదార్థాలు వ్యర్థాలు అన్నింటిని ఘనరూప వ్యర్థాలు అంటారు.
    ఘనరూప వ్యర్థాల యాజమాన్యానికి సరైన పద్ధతులు :
  2. తగ్గించడం (Reduce), తిరిగి ఉపయోగించడం (Reuse), మరల వాడుకునేందుకు వీలుగా మార్చడం (Recycle), తిరిగి చేయడం (Recover) (4R system) అనే పద్ధతుల ద్వారా ఘనరూప వ్యర్థాలను తగ్గించవచ్చు.
  3. కాగితం, గాజు, కొన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులను తిరిగి ఉపయోగించుకునే విధంగా తయారుచేయడం.
  4. ఘనరూప వ్యర్థాల యాజమాన్యంలో వ్యర్థాల సేకరణ, అనుకూలమైన ప్రదేశాలకు రవాణా చేయడం, పర్యావరణానికి విఘాతం కలిగించని పద్ధతుల ద్వారా తొలగించడం అనే దశలు పాటించాలి.
  5. ఘనరూప వ్యర్థాల యాజమాన్యంలో వీటిని నివాస ప్రాంతాలకు దూరంగా నేలలో గోతులను తీసి పూడ్చడమనేది అందరికి తెలిసిన పద్ధతి.
  6. ఘనరూప వ్యర్థాలను ఎరువుగా మార్చడం, అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద మండించడం కూడా చేయవచ్చు.

9th Class Biology 10th Lesson నేల కాలుష్యం Textbook InText Questions and Answers

9th Class Biology Textbook Page No. 159

ప్రశ్న 1.
మనం ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలను పడేస్తూపోతే ఏమవుతుంది?
జవాబు:

  1. మనం ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలను పడేస్తూపోతే అవి పరిసరాలను కాలుష్యపరుస్తాయి.
  2. నేల కాలుష్యానికి గురి చేస్తాయి. దుర్వాసన వెదజల్లుతాయి.
  3. ఒక్కొక్కసారి వ్యాధులను వ్యాప్తి చేయడంలో కారకమవుతాయి.
  4. మనుష్యుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.

9th Class Biology Textbook Page No. 161

ప్రశ్న 2.
ఈ రోజు మీ పాఠశాల / ఇంట్లో ఉత్పత్తి అయిన వ్యర్థాలు ఏవి? వాటిలో కుళ్ళిపోని వ్యర్థాలు ఏవి? ఇవి ఏ విధంగా నేల కాలుష్యానికి కారణమవుతున్నాయి?
జవాబు:
ఈ రోజు మా పాఠశాల / ఇంట్లో ఉత్పత్తి అయిన వ్యర్థాలు :
వంటింటి చెత్త, పండ్ల తొక్కలు, మిగిలిన అన్నం, మినుముల పొట్టు, గాజు ముక్కలు, పెన్నులు, పాలిథీన్ కవర్లు, కార్డుబోర్డు, పేపరు, రబ్బరు, టీ గ్లాసులు, బిస్కెట్లు, చాక్లెట్ల కవర్లు, ఐస్ క్రీం పుల్లలు మొదలగునవి.

కుళ్లిపోని వ్యర్థాలు :
గాజు ముక్కలు, పాలిథీన్ కవర్లు, రబ్బరు, టీ గ్లాజులు (ప్లాస్టిక్), ఇవి ఎక్కువ కాలం నేలలో కలిసిపోకుండా ఉంటాయి. నేలలోనికి విష పదార్థాలను విడుదల చేస్తాయి. నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి.

9th Class Biology Textbook Page No. 156

ప్రశ్న 3.
నేలల ఆమ్ల లేదా క్షార స్వభావం ఎక్కువైతే ఏం జరుగుతుంది?
జవాబు:

  1. నేలలందు ఆమ్ల లేదా క్షార స్వభావం ఎక్కువైతే మొక్కలకు లభ్యమయ్యే పోషకాలు తగ్గిపోతాయి.
  2. తద్వారా పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది.

AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం

9th Class Biology Textbook Page No. 157

ప్రశ్న 4.
ఒక నేల సారవంతమైనది ఎలా చెప్పగలవు? జట్లతో చర్చించి మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
నేల సారవంతమైన ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. అవి :

  1. సారవంతమైన నేల మంచి దిగుబడిని ఇస్తుంది.
  2. సారవంతమైన నేల మంచి పోషకాలను కలిగి ఉంటుంది.
  3. ఈ నేలకు నీటిని నిలుపుకొనే సామర్ధ్యం అధికం.
  4. మొక్కలకు పోషకాలను నేరుగా అందిస్తుంది.
  5. సూక్ష్మజీవులు జీవించటానికి అనుకూలంగా ఉంటుంది.
  6. వేర్ల పెరుగుదలకు సౌకర్యంగా ఉంటుంది.
  7. సారవంతమైన నేల మంచి ఆవాసంగా ఉంటుంది.

9th Class Biology 10th Lesson నేల కాలుష్యం Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

1. కింది సూచనల ఆధారంగా పట్టిక నింపండి.
1) పాఠశాల విరామ సమయంలో వేణు ఒక పండు తింటున్నాడు.
2) పండ్ల తొక్కను వరండాలో మూలకు పడేశాడు.
3) అతని మిత్రుడు రాము అలా చేయడం తప్పు అన్నాడు. మనం వ్యర్థాలను వరండాలో వేయరాదు. తరగతి గదిలో ఉన్న చెత్తబుట్టలో వేయాలి అన్నాడు.
4) ఏయే వ్యర్థాలను ఎక్కడ వేయాలో కింది పట్టికలో రాయండి.

తడి చెత్త పొడి చెత్త
1. కూరగాయల చెత్త బిస్కట్ కవర్లు
2. అరటి తొక్కలు పాలిథీన్ కవర్లు
3. ఆహార పదార్థాలు వాడిన కాగితాలు
4. పండ్ల తొక్కలు ప్లాస్టిక్ వస్తువులు
5. పేడ గాజు వస్తువులు
6. చొప్ప అట్ట ముక్కలు

పేడ, చొప్ప వంటి తడి చెత్తను నిర్దేశిత ప్రదేశంలో వేయాలి. మిగిలిన తడి చెత్తలను ఒక చెత్త బుట్టలోనూ, పొడి చెత్తలను మరొక చెత్త బుట్టలోనూ వేయాలి.

కృత్యం – 2

2. పై పట్టికలో మీరు రాసిన వాటిలో ఒక రోజులో మీరు పారవేసే తడి చెత్త బరువును కొలవండి.
జవాబు:
1) మీ ఇంటిలో గల సభ్యుల సంఖ్యతో ఆ బరువును భాగించండి.

2) ఉదాహరణకు ఒక ఇంటిలో గల సభ్యుల సంఖ్య 4. వారు ఒక రోజు పడవేసే తడి చెత్త బరువు సుమారు 400 గ్రా.
ఆ ఇంటి తలసరి తడి చెత్త = 400 ÷ 4 = 100 గ్రా.
ఒక సంవత్సరానికి తయారయ్యే తలసరి చెత్త = 100 గ్రా. × 365
= 36500 గ్రా. = 36.5 కి.గ్రా.

AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం

కృత్యం – 3

3. చెత్తను కుళ్ళింపజేయడం

  1. పాలిథీన్ సంచి లేదా ప్లాస్టిక్ బకెట్ లేదా ఏదైనా ఒక డ్రమ్ము వంటి పాత్రను తీసుకోవాలి.
  2. దానిని సగం వరకు మట్టితో నింపాలి.
  3. దీనిలో తడి చెత్త మరియు ఇతర చెత్తలను వేయండి.
  4. ఈ చెత్తలో కచ్చితంగా కూరగాయల తొక్కలు, రబ్బరు, ప్లాస్టిక్ వంటి పదార్థాలుండాలి.
  5. దీనికి మరికొంత మట్టిని జత చేయాలి.
  6. దీనిపై నీళ్ళను క్రమం తప్పకుండా రోజూ చల్లుతూ ఉండండి.
  7. ప్రతి 15 రోజులకు ఒక్కసారి దాని లోపల తవ్వి చూడాలి. ఇలా చేసేటప్పుడు చేతి తొడుగులు ధరించాలి.
  8. పని పూర్తయిన తరువాత చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

కింద ఇచ్చిన పట్టికలో పరిశోధనలు నమోదు చేయాలి.
AP Board 9th Class Biology Solutions 10th Lesson నేల కాలుష్యం 4

AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

SCERT AP 9th Class Biology Study Material Pdf Download 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 9th Lesson Questions and Answers వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

9th Class Biology 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
జీవులలో అనుకూలనాలు అంటే ఏమిటి? అనుకూలన యొక్క ఆవశ్యకత ఏమిటి? (AS 1)
జవాబు:

  1. వివిధ పరిస్థితులలో జీవించే జీవులు కొంతకాలం తరువాత వాటికి అనుకూలంగా మారతాయి లేదా అభివృద్ధి చెందుతాయి. వీటినే జీవులలోని అనుకూలనాలు అంటారు.
  2. అనుకూలనాలు ఒక జనాభాలో కనపడే సాధారణ లక్షణం. ఎందుకంటే ఇవి జీవులకు మనుగడ సాగించడానికి పురోగతి చూపుతాయి.
  3. ఆవరణ వ్యవస్థలలో జరిగే ప్రస్ఫుట, వైవిధ్య మార్పులకు అనుగుణంగా జీవులు జీవించడానికి వివిధ రకాల అనుకూలనాలు చూపాలి.

ప్రశ్న 2.
రెందు ఉదాహరణలిస్తూ జీవులు ఆవరణ వ్యవస్థలో అనుకూలనాలు ఎలా ఏర్పరచుకున్నాయో వివరించండి. (AS 1)
జవాబు:

  1. మడ అడవులు తడి మరియు లవణీయత అధికంగా ఉన్న ప్రదేశాలలో పెరుగుతాయి.
  2. వీటి వేర్ల నుండి శ్వాసరంధ్రాలు అనే వింతైన భాగాలు అభివృద్ధి చెందుతాయి.
  3. ఈ భాగాలు ఉపరితలం దగ్గర పెరిగే పార్శ్వ వేర్ల నుండి, నేల నుండి బయటకు పొడుచుకుని వస్తాయి. ఇవి దాదాపుగా 12 అంగుళాల పొడవు ఉంటాయి.
  4. నీటి పరిసరాలలో పెరిగే ఈ మొక్కలు వేర్ల ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి.
  5. మరియొక ఉదాహరణ కలబంద మొక్కల్లో పత్రాలు ముండ్లుగా మార్పు చెందుటవలన బాష్పోత్సేకం ద్వారా నీరు వృథా కాదు.
  6. కాండంలోని కణజాలం నీటిని నిలువ చేసి రసభరితంగా ఉంటాయి.
  7. ఈ మార్పు ద్వారా నీటి కొరత పరిస్థితులు ఏర్పడినపుడు మొక్కలు వాటిని తట్టుకొని జీవించగలవు.
  8. ఇలాంటి పరిస్థితులు ఎడారి ప్రాంతాలలో కనబడతాయి.

AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

ప్రశ్న 3.
క్రింది జీవులలో కనిపించే ప్రత్యేక అనుకూలనాలు ఏవి? (AS 1)
ఎ. మడ అడవుల చెట్లు బి. ఒంటె సి. చేప ది. డాల్సిన్ ఇ. ఫ్లవకాలు
జవాబు:
ఎ. మడ అడవుల చెట్లు:
AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 1

  1. మడ అడవులు తడి, ఉప్పు నీటి సమస్యను ఎదుర్కొనడానికి చిత్రమైన మార్గాలు అవలంబిస్తాయి.
  2. వీటి పార్శ్వపు వేర్లనుండి శ్వాసరంధ్రాలు అనే భాగాలు అభివృద్ధి చెందుతాయి.
  3. ఈ భాగాలు నేల నుండి దాదాపుగా 12 అంగుళాలు పొడవు ఉంటాయి.
  4. నీటి పరిసరాలలో పెరిగే ఈ మొక్కలు వేర్ల ద్వారా శ్వాసక్రియ జరుగుటకు మడ అడవుల చెట్లు తోడ్పడతాయని భావిస్తారు.

బి. ఒంటె:
AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 2

  1. ఒంటె మోపురం కొవ్వును తదుపరి అవసరాల కోసం నిల్వచేస్తుంది.
  2. పొడవైన కనుబొమ్మలు కంటిని ఇసుక, దుమ్ము నుండి రక్షిస్తాయి.
  3. నాశికారంధ్రాలు స్వేచ్చాయుతంగా మూసుకోవటం వలన వీచే ఇసుక నుండి రక్షణ పొందుతుంది.
  4. పొడవైన కాళ్ళు వేడెక్కిన ఇసుకనేల నుండి శరీరాన్ని దూరంగా ఉంచుతాయి.

సి. చేప :
AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 3

  1. చేప శరీరం పొలుసులచే కప్పబడి ఉంటుంది.
  2. చేపలు నీటిలో ఈదడానికి తెడ్ల వంటి వాజాలు అనే ప్రత్యేక నిర్మాణాలు కలిగి ఉంటాయి.
  3. చేపలలో ఫోటర్స్ అనే గాలితిత్తులు ఉండడం వలన నీటిలోని వివిధ స్థాయిలలో నివసించగలుగుతున్నాయి.
  4. మొప్పల ద్వారా చేపలు శ్వాసిస్తాయి.

డి. డాల్ఫిన్ :
AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 4

  1. చర్మం క్రింద మందపాటి కొవ్వుపొర, చలి నుండి రక్షిస్తుంది.
  2. ఈదటానికి ఈత తిత్తి తోడ్పడుతుంది.
  3. ఫ్లోటర్స్ అనే గాలితిత్తుల వలన నీటిలోని వివిధ స్థాయిలలో నివసించగల్గును.

ఇ. ప్లవకాలు :

  1. నీటిపై తేలియాడే మొక్కలు ప్లవకాలు. ఇవి అతి సూక్ష్మమైనవి.
  2. కిరణజన్య సంయోగక్రియ జరిపే ప్లవకాలు కణాలలో ఉండే నూనె బిందువుల సహాయంతో నీటిపై తేలతాయి.

AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 5

ప్రశ్న 4.
యూఫోటిక్ మండలంలోని జీవి అబైసల్ మండలంలో జీవించాలంటే కావలసిన అనుకూలనాలు ఏవి? (AS 1)
జవాబు:
అబైసల్ మండలంలో జీవించడానికి కావలసిన అనుకూలనాలు :

  1. భక్షించబోయే జంతువులు తప్పించుకోకుండా ఉండేందుకు పెద్ద జంతువులకు విశాలమైన నోరు, పెద్దగా వంకర తిరిగిన పళ్ళు ఉండాలి.
  2. అస్థిపంజరం ఉండకుండా, బల్లపరుపు శరీరాలు ఉండాలి.
  3. పొట్ట కింద, కళ్ళ చుట్టూ మరియు శరీర పార్శ్వభాగాలలో కాంతిని ఉత్పత్తి చేసే ప్రత్యేక అవయవాలు ఉండాలి.
  4. జీవులు చీకటిలో కూడా ప్రకాశవంతంగా కనబడాలి.

ప్రశ్న 5.
సముద్ర నీటి చేపలు మంచినీటి చేపల కన్నా ఎక్కువగా నీరు తీసుకుంటాయి. దీనిని మీరు అంగీకరిస్తారా? ఎందుకు? (AS 1)
జవాబు:

  1. అవును. సముద్రపు నీటి చేపలు మంచినీటి చేపల కన్నా ఎక్కువగా నీరు తీసుకుంటాయి.
  2. సముద్రంలోని చేపల శరీరంలోని లవణీయత సముద్ర నీటి సాంద్రత కంటే తక్కువ ఉంటుంది.
  3. కావున ద్రవాభిసరణం ద్వారా కోల్పోయిన నీటి కొరతను పూరించడానికి అధిక పరిమాణంలో నీరు గ్రహిస్తాయి.
  4. నీటిలోని లవణాలను మూత్రపిండాలు మరియు మొప్పలలోని ప్రత్యేక కణాల ద్వారా విసర్జిస్తాయి.

ప్రశ్న 6.
కొలను/ సరస్సులోని జీవులపై ఉష్ణోగ్రత ప్రభావాన్ని, వాటి అనుకూలనాలను పట్టికలో వివరించండి. (AS 1)
జవాబు:

  1. వేసవిలో లోతైన సరస్సు, కొలనులలో ఉపరితల నీటి భాగం వేడెక్కుతుంది. లోతైన భాగాలు చల్లగా ఉంటాయి.
  2. అందువలన జీవులు పగటిపూట నీటి లోతునకు,రాత్రి నందు నీటి ఉపరితలానికి వస్తాయి.
  3. ఉష్ణమండల ప్రాంతాలలో వేసవిలో నీరు వేడెక్కి ఆవిరి అవుతుంది. తద్వారా నీటి యొక్క లవణీయత పెరుగుతుంది.
  4. ఆక్సిజన్ సాంద్రత మరియు లభ్యమయ్యే ఆహార పరిమాణం తగ్గుతుంది.
  5. శీతల ప్రాంతాలలో నీటి ఉపరితలం గడ్డకట్టుకుపోతుంది. ఈ కాలంలో జంతువులు సరస్సు నందు నీరు గడ్డకట్టని ప్రదేశంలో జీవిస్తాయి.
  6. శీతాకాలంలో కొలను మొత్తం గడ్డకట్టుకుపోతుంది. తద్వారా దానిలో ఉండే జీవులన్నీ మరణిస్తాయి.
  7. నీటిలో నివసించే జీవులు అధిక ఉష్ణోగ్రతను మరియు అధిక శీతలాన్ని తట్టుకోవడానికి గ్రీష్మకాల సుప్తావస్థ మరియు శీతాకాల సుప్తావస్థను అవలంబిస్తాయి.

AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

ప్రశ్న 7.
మడ అడవుల ఆవరణ వ్యవస్థ మీరు చదివిన సముద్ర ఆవరణ వ్యవస్థ కంటే భిన్నంగా ఎందుకు ఉంటుంది? (AS 1)
జవాబు:

  1. మన దేశం మడ అడవుల పరిమాణంలో కోరింగ మడ ఆవరణ వ్యవస్థ రెండవ స్థానంలో ఉంది.
  2. కాకినాడకు 20 కి.మీ. దూరంలో ఉన్న మడ అడవుల ఆవరణ వ్యవస్థ అనేక రకాల మొక్కలకు మరియు జంతువులకు ప్రసిద్ధమైనది.
  3. మడ అడవులు నివసించే ప్రదేశపు పరిస్థితులకు అనుకూలనాలు చూపిస్తాయి.
  4. లవణీయతను తట్టుకొని నిలబడగలిగే అనేకమైన మొక్క జాతులు అనగా రైజోపొర, అవిసీనియా, సొన్నరేట ఏజిసిరాకు నిలయం కోరింగ మడ అడవులు.
  5. అనేకమైన పొదలు మరియు గుల్మములు మడ అడవుల ఆవరణ వ్యవస్థలో ఉంటాయి.
  6. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సముద్రతీర ప్రాంతములలో విస్తారమైన మరియు అధిక ఉత్పత్తిని ఇచ్చే అడవులను మడ అడవులు ఏర్పరుస్తాయి.
  7. ఏ ఇతర ప్రదేశాల్లో నివసించలేని మొక్కలు మరియు జంతు జాతులు మడ అడవులలో ఉంటాయి.
  8. ఉష్ణమండల మరియు సమశీతోష్ణ మండలములలో లవణీయతను తట్టుకొని నిలబడగలిగే అడవులు మడఅడవులు.

ప్రశ్న 8.
అత్యల్ప చలి, అధిక వేడి నుండి కప్ప ఎలా రక్షించుకుంటుంది? (AS 1)
జవాబు:

  1. కప్ప లాంటి ఉభయచరాలు కాలాన్ని బట్టి అనుకూలనాలు చూపిస్తాయి.
  2. అత్యుష్ఠ, అతిశీతల పరిస్థితుల నుండి రక్షించుకోవడానికి నేలలో లోతైన బొరియలు చేసుకొని వాటిలో గడుపుతాయి.
  3. అనుకూల పరిస్థితులు ఏర్పడే వరకు కదలక నిశ్చలంగా అందులోనే ఉంటాయి.
  4. ఈ కాలంలో జీవక్రియల రేటు తగ్గి జంతువు దాదాపుగా స్పృహలేని నిద్రావస్థకు చేరుకుంటుంది.
  5. దీనినే శీతాకాల సుప్తావస్థ లేదా గ్రీష్మకాల సుప్తావస్థ అంటారు.

ప్రశ్న 9.
కొర్రమట్ట (మరల్) మరియు రొహూ చేపలు నదుల్లో ఉంటాయి. అవి కోరింగ ఆవరణ వ్యవస్థలో జీవించగలవా? ఎందుకో ఊహించండి. (AS 2)
జవాబు:

  1. అవును. కొర్రమట్ట మరియు రొహూ చేపలు కోరింగ ఆవరణ వ్యవస్థలో జీవించగలవు.
  2. ఎందువల్లనంటే కోరింగ ఆవరణ వ్యవస్థలోనికి కోరింగ, గాచేరు మరియు గౌతమి, గోదావరి ఉపనదులు ప్రవహిస్తాయి.
  3. కోరింగ ఆవరణ వ్యవస్థలో లవణీయత పెరిగినట్లయితే మంచినీటి చేప శరీరములోనికి నీరు ప్రవేశిస్తుంది.
  4. చేప శరీరములోనికి ప్రవేశించిన నీటిని మూత్రము ద్వారా విసర్జించవచ్చు.
  5. కానీ శరీరములో లవణ సమతుల్యతను ఉంచడానికి మంచినీటి చేప మూత్రపిండాలు మరియు మొప్పలలో ఉండే లవణగ్రాహక కణాలచే లవణాలను తిరిగి గ్రహిస్తుంది.

ప్రశ్న 10.
కొన్ని నీటి మొక్కలను సేకరించి వాటి కాండాలు, ఆకులు స్లెదు తయారు చేసి సూక్ష్మదర్శినిలో పరిశీలించి మీ పరిశీలనలు నమోదు చేయండి. (ఉదా : గాలి గదులు ఉన్నాయి/లేవు మొదలైనవి) ఇప్పుడు కింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. (AS 3)
ఎ) అవి నీటిపై ఎందుకు తేలుతాయి?
బి) అవి తేలడానికి ఏవి సహాయపడతాయి?
సి) సూక్ష్మదర్శినిలో గమనించిన భాగాల పటాలు గీయండి. (AS 5)
జవాబు:
ఎ) శరీర భాగాల్లో గాలి గదులు ఉండుట వలన
బి) తేలడానికి గాలితో నిండిన గాలిగదులు సహాయపడతాయి.
సి) సూక్ష్మదర్శినిలో గమనించిన భాగాల పటాలు
AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 6

ప్రశ్న 11.
సమీపంలోని చెరువు కుంటను సందర్శించి మీరు గమనించిన జీవులు, వాటిలోని అనుకూలనాల జాబితాను తయారు చేయండి. (AS 4)
జవాబు:

  1. చెరువు ఒడ్డున తక్కువ లోతుగల భాగాన్ని లిటోరల్ మండలం అంటారు.
  2. చెరువు ఒడున వెచ్చగా ఉండే పై భాగంలో నత్తలు, చేపలు, ఉభయచరాలు, తూనీగ గుడ్లు, లార్వాలు ఉన్నాయి.
  3. తాబేళ్ళు, పాములు, బాతులు భక్షకాలుగా జీవిస్తాయి. నాచు, బురద తామర, వాలిస్ నేరియా, హైడ్రిల్లా ఉన్నాయి.
  4. ఈ మండలంలో అనేక జీవులు అభివృద్ధి చెందిన దృష్టిజ్ఞానం కలిగి ఉంటాయి.
  5. ఈ మండలంలో వేగంగా ఈదగలిగే జీవులు, తక్కువ రంగు గల బూడిద వర్గం శరీరం గల జీవులు ఉన్నాయి.
  6. లిమ్నెటిక్ మండలంలో డాప్సియా, సైక్లాప్స్, చిన్ని ప్రింప్ చేపలు ఉన్నాయి. అంతర తామర, గుర్రపుడెక్క, బుడగ తామర, శైవలాలు ఉన్నాయి.
  7. చేపలు పరిసరాలలో కలసిపోయే విధంగా ప్రకాశవంతంగా ఉండే బూడిద వర్ణం, వెండి – నలుపు రంగు కలిగిన పొలుసులు ఉంటాయి.
  8. మొక్కలలో గాలి గదులు, ఆకుల పైన మైనం పూత ఉంటుంది.
  9. ప్రొఫండల్ మండలంలో రొయ్యలు, పీతలు, ఇసుక దొండులు, నత్తలు, తాబేళ్ళు ఉన్నాయి.
  10. ఇవి నీటి అడుగు భాగానికి చేరే మృత జంతువులను భక్షించడానికి అనువుగా పెద్దనోరు, వాడియైన దంతాలను కలిగి ఉంటాయి.

AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

ప్రశ్న 12.
ఇంటర్నెట్ నుండి ఒక సరస్సు యొక్క సమాచారాన్ని సేకరించి వివిధ మండలాల్లోని జీవులు, వాటిలో కనబడే అనుకూలనాల పట్టికను తయారుచేయండి. (AS 4)
జవాబు:

మండలం మండలంలోని జీవులు అనుకూలనాలు
లిటోరల్ మండలం నత్తలు, రొయ్యలు, చేపలు, ఉభయచరాలు, నాచులు, బురద తామరలు,వాలి నేరియా, హైడ్రిల్లా మొక్కలు.
భక్షకాలు అయిన తాబేళ్లు, పాములు, బాతులు ఉంటాయి.
అభివృద్ధి చెందిన దృష్టి జ్ఞానం కలవి. వేగంగా ఈదుతాయి. మొక్కలలో గాలిగదులు, ఆకులపై మైనంపూత ఉంటాయి. నేలమీద నీటిలో నివసించగలిగిన జంతువులు ఉంటాయి.
లిమ్నెటిక్ మండలం మంచినీటి చేపలు, దాప్నియా, సైక్లాప్స్, చిన్ని ఫ్రింప్ చేపలు, నీటిపై తేలే గుర్రపు డెక్క, అంతర తామర, బుడగ తామర, శైవలాలు. నీటిలో ఈదడానికి తెడ్ల వంటి వాజాలు , నీటిలో వివిధ స్థాయిలలో తేలడానికి ఫోటర్స్ అనే గాలితిత్తులు, గాలిగదులు, ఆకులపై మైనం పూత.
ప్రొఫండల్ మండలం రొయ్యలు, పీతలు, ఈల్ వంటి చేపలు, ఇసుక దొండులు, నత్తలు, తాబేళ్ళు. మృత జంతువులను భక్షించుటకు వీలుగా అనుకూలనాలు కలిగి ఉంటాయి.

ప్రశ్న 13.
బంగాళాఖాతంలోని కోరింగ ఆవరణ వ్యవస్థలో ఏవైనా నదులు కలుస్తున్నాయా? వాటి సమాచారం సేకరించండి. (AS 4)
జవాబు:
కోరింగ ఆవరణ వ్యవస్థలోనికి కోరింగ నది, గాదేరు నది మరియు గౌతమి, గోదావరి నదుల ఉపనదులు కలుస్తున్నాయి.

ప్రశ్న 14.
సరస్సు పటం గీచి, వివిధ మండలాలను గుర్తించండి. ఆ మండలాలను అలా ఎందుకు పిలుస్తారో తెల్పండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 7
సరస్సు ఆవరణ వ్యవస్థ మండలాలు :
1. లిట్టోరల్ మండలం 2. లిమ్నెటిక్ మండలం 3. ప్రొఫండల్ మండలం

లిటోరల్ మండలం :
సరస్సు ఒడ్డున తక్కువ లోతుగల భాగం. కిరణజన్య సంయోగక్రియ ఎక్కువ జరిగే భాగం.

లిమ్నెటిక్ మండలం :
సరస్సు నీటి పై భాగం (ఉపరితలం) లో బయటకు కనిపించే భాగం. ఎక్కువ కాంతిని స్వీకరిస్తుంది.

ప్రొఫండల్ మండలం :
తక్కువ వెలుతురు కలిగి చల్లగా ఉండే ప్రదేశం. ఎక్కువ లోతుగల సరస్సు అడుగుభాగం.

ప్రశ్న 15.
భూమిపై గల అద్భుతమైన జీవులు ఉభయచరాలు. వాటి అనుకూలనాలను మీరు ఎలా ప్రశంసిస్తారు? (AS 6)
జవాబు:

  1. మెడలేని, నడుము చిన్నదిగా ఉన్న ఉభయచర జీవి శరీర ఆకారం ఈదడానికి అనుకూలమైనది.
  2. తడిగా ఉన్న పలుచని చర్మము, చర్మ శ్వాసక్రియనందు వాయువుల మార్పిడికి ఎంతో అనుకూలమైనది.
  3. ముందరి కాళ్ళు శరీరపు ముందు భాగమును, నేలను తాకకుండా చేస్తాయి.
  4. వెనుకకాళ్ళు ఎక్కువ దూరం గెంతడానికి, దిశ మార్చుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి.
  5. తల పై భాగం మీద కళ్ళు అమరియుండుటవలన తన ముందు ఎక్కువ ప్రదేశమును చూడగలుగుట ద్వారా శత్రువు గమనమును అంచనా వేయవచ్చు.
  6. నోరు వెడల్పుగా, పెద్దదిగా ఉండుట వలన ఆహారమును పట్టుకోవడానికి, తినడానికి అనుకూలం.
  7. నోటి ముందటి భాగములో నాలుక ఉండుట వలన దాడికి గురైన ఆహారము అతుక్కుంటుంది.
  8. కప్ప డిపోల్ లార్వాగా నీటిలో జీవనం గడుపుతుంది. మొప్పల సహాయంతో గాలి పీలుస్తుంది.
  9. లార్వా పెద్దదై కప్పగా మారినప్పుడు మొప్పల స్థానంలో ఊపిరితిత్తులు ఏర్పడి నేలమీద కూడా శ్వాసించడానికి వీలవుతుంది.
  10. ఈ విధముగా కప్ప యొక్క శరీరము నేల మరియు నీటిలో జీవించడానికి అనువుగా ఉంది. ఉభయచర జీవులకు ఉన్న జీవన సౌలభ్యము మరి ఏ ఇతర జీవులలో మనము చూడము.

ప్రశ్న 16.
‘గులకరాళ్ళ మొక్కలు’ శత్రువుల బారి నుండి తమను తాము రక్షించుకునే విధానాన్ని నీవు ఎలా ప్రశంసిస్తావు? (AS 6)
జవాబు:

  1. గులకరాళ్ళ మొక్కలు శత్రువుల బారి నుండి అద్భుతమైన అనుకూలనాలతో తమను తాము రక్షించుకుంటాయి.
  2. వీటిని జీవం గల రాళ్ళు అంటారు. వాస్తవానికి ఇవి రాళ్ళు కావు.
  3. ఉబ్బిన ఆకులు ఎడారి పరిస్థితులకు అనుకూలంగా నీటి నష్టాన్ని తగ్గించి నీటిని నిలువ చేస్తాయి.
  4. వాస్తవానికి ప్రతి గులకరాయి ఒక పత్రం. సూర్యరశ్మి పత్రంలోనికి ప్రవేశించడానికి వీలుగా కోసిన కిటికీలాంటి భాగాన్ని కలిగి ఉంటుంది.
  5. రాతిలా కనబడడం వలన జంతువులు మోసపోయి వాటిని తినకుండా వదిలేస్తాయి.
  6. ఇలా మొక్క రక్షించబడుతుంది. గులకరాళ్ళ మొక్కలు తమను తాము రక్షించుకునే విధము అభినందనీయము.

ప్రశ్న 17.
కొన్ని మొక్కలు, జంతువులు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే జీవిస్తాయి. ఈ రోజుల్లో మానవ చర్యల మూలంగా ఈ పరిస్థితులు నాశనం అవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? (AS 7)
జవాబు:

  1. మానవ కార్యకలాపాల వలన మొక్కలు, జంతువులు నాశనం కావటం వాస్తవం.
  2. మానవుడు చేసే వివిధ కార్యకలాపాలు అనగా అడవులను నరకడం, పశువులను మేపడం, అటవీ భూములను వ్యవసాయ భూములుగా మార్చడం, వేటాడటం, విచక్షణా రహితంగా జంతు పదార్థాల కోసం జంతువులను చంపటం మరియు కాలుష్యము వలన మొక్కల మరియు జంతువుల యొక్క మనుగడ కష్టసాధ్యమవుతున్నది.
  3. సరియైన నివారణ చర్యలు చేపట్టకపోయినట్లయితే భూగోళం నుండి మొక్కలు మరియు జంతువులు అదృశ్యం కావచ్చు.

9th Class Biology 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు Textbook InText Questions and Answers

9th Class Biology Textbook Page No. 137

ప్రశ్న 1.
రసభరిత పత్రాలు గల మొక్కలకు ఉదాహరణలు ఇవ్వండి. ఇవి ఎందుకు ఇలా ఉంటాయి?
జవాబు:

  1. బయోఫిల్లమ్, కిత్తనారలు, రసభరిత పత్రాలు గల మొక్కలకు ఉదాహరణలు.
  2. ఈ మొక్కలు వర్షాకాలంలో చాలా నీటిని శోషించి, నీటిని జిగురు పదార్థ రూపంలో మొక్క భాగాలలో నిలువ చేస్తాయి.
  3. దాని ఫలితంగా వీటి కాండం, పత్రాలు, వేళ్ళు కండరయుతంగా, రసభరితంగా ఉంటాయి.
  4. ఈ విధంగా నిలువచేసిన నీటిని నీరు దొరకని సమయంలో పొదుపుగా వాడుకుంటాయి.

ప్రశ్న 2.
ఎడారి మొక్కలకు వెడల్పైన ఆకులు ఉండవు ఎందుకు?
జవాబు:

  1. ఎడారి మొక్కలు నీటి కొరత బాగా ఉన్న ప్రదేశాలలో పెరుగుతాయి.
  2. వెడల్పైన ఆకులు ఉంటే బాష్పోత్సేకము ద్వారా ఎక్కువ మొత్తంలో నీటి నష్టం జరుగుతుంది.
  3. నీటి నష్టాన్ని నివారించడానికి ఎడారి మొక్కలలో ఆకులు చిన్నవిగా ఉంటాయి.

ప్రశ్న 3.
మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో కిత్తనార అనే ఎడారి మొక్కలు పొలాల గట్ల మీద కంచె మాదిరిగా పెంచుతారు. నిజానికి ఈ ప్రాంతాలు ఎదారులు కావు. మరి ఈ మొక్కలు అక్కడ ఎలా పెరుగుతాయి?
జవాబు:

  1. ఎడారులు కానప్పటికీ పొలాల గట్ల మీద వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కిత్తనార అనుకూలనాలు చూపిస్తుంది.
  2. ఎడారులు కానప్పటికీ ఈ రోజులలో కిత్తనార మన పరిసరాలలో కూడా పెరుగుతుంటాయి.
  3. ప్రకృతిలోని కిత్తనార వంటి మొక్కలు తమ అవసరాలను బట్టి తమ చుట్టూ అనుకూల పరిస్థితులు ఏర్పరచుకుంటాయి.

9th Class Biology Textbook Page No. 138

ప్రశ్న 4.
ఎడారి పరిస్థితుల్లో జీవించే జంతువులన్నీ అనుకూలనాలు కలిగి ఉంటాయా?
జవాబు:
అవును. ఎడారి పరిస్థితుల్లో జీవించే జంతువులన్నీ అనుకూలనాలు కలిగి ఉంటాయి.

9th Class Biology Textbook Page No. 138

ప్రశ్న 5.
కొన్ని జంతువుల శరీరాలపై పొలుసులు ఎందుకు ఉంటాయి?
జవాబు:

  1. పొలుసులు వాతావరణం నుండి జంతువులను కాపాడతాయి.
  2. ఎడారి జంతువులలో చర్మం ద్వారా నీటి నష్టం జరగకుండా ఉండడానికి పొలుసులు ఉపయోగపడతాయి.
  3. పొలుసుల వలన నీటి నష్టం జరుగదు. తద్వారా జంతువుకు తక్కువ నీరు అవసరం అవుతుంది.

9th Class Biology Textbook Page No. 138

ప్రశ్న 6.
బొరియల్లో నివసించే జంతువులు సాధారణంగా రాత్రివేళల్లో ఎందుకు సంచరిస్తాయి?
జవాబు:

  1. పగటిపూట ఉండే అత్యధిక వేడిమి నుండి రక్షించుకోవడానికి బొరియల్లో నివసించే జంతువులు సాధారణంగా రాత్రి వేళల్లో తిరుగుతాయి.
  2. సాధారణంగా ఇవి నిశాచర జీవులు.

9th Class Biology Textbook Page No. 145

ప్రశ్న 7.
జెల్లి చేపలు, విచ్ఛిన్నకారులు ఈ రెండింటిలో యూఫోటిక్ మండలంలో ఉండే జీవి ఏది?
జవాబు:
జెల్లి చేపలు.

9th Class Biology Textbook Page No. 145

ప్రశ్న 8.
యూఫోటిక్ జోన్ జీవులలో ఎలాంటి అనుకూలనాలు కనిపిస్తాయి?
జవాబు:

  1. యూఫోటిక్ జోన్లో నివసించే జీవులు చాలా వరకు తేలేవి, ఈదేవి.
  2. ఈ మండల జీవులు మెరిసే శరీరాలు కలిగి ఉంటాయి.
  3. ఇవి కాంతిని పరావర్తనం చెందించి ప్రకాశవంతంగా ఉన్న నీటి ఉపరితలంలో కలిసిపోయే విధంగా చేస్తాయి లేదా పారదర్శకంగా ఉంటాయి.
  4. స్పష్టమైన దృష్టి కలిగి ఉంటాయి.

AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

9th Class Biology Textbook Page No. 145

ప్రశ్న 9.
అబైసల్ జోన్ జీవులలో కనిపించే అనుకూలనాలు ఏవి?
జవాబు:

  1. భక్షించబోయే జంతువులు తప్పించుకోకుండా ఉండేందుకు పెద్ద జంతువులకు విశాలమైన నోరు, పెద్దగా వంకర తిరిగిన పళ్ళు ఉంటాయి.
  2. ఈ జీవులలో అస్థిపంజరం ఉండక, బల్లపరుపు శరీరాలు ఉంటాయి.
  3. ఈ జీవులకు పొట్ట కింద, కళ్ళ చుట్టూ మరియు శరీర పార్శ్వభాగంలో కాంతిని ఉత్పత్తి చేసే ప్రత్యేక అవయవాలు ఉంటాయి.
  4. కళ్ళు పనిచేయవు. మరికొన్ని జీవులకు చీకటిలో కూడా ప్రకాశవంతంగా కనిపిస్తాయి.

9th Class Biology Textbook Page No. 145

ప్రశ్న 10.
బెథియల్ జోన్ జీవులను యుఫోటిక్ (వెలుతురు గల) మరియు అబైసల్ (చీకటి) జోన్ జీవులతో పోల్చినపుడు కనపడే భేదాలేవి?
జవాబు:

  1. బెధియల్ మండలంలో ఎరుపు మరియు గోధుమ వర్ణపు గడ్డిజాతి మొక్కలు, సముద్రపు కలుపు స్పంజికలు ప్రవాళబిత్తికలు ఉంటాయి.
  2. స్థూపాకార నిర్మాణం గల స్క్విడ్లు, తిమింగలాలు వంటి జంతువులు ఉంటాయి.
  3. కొన్ని రకాల జంతువుల శరీరాలు బల్లపరుపుగా ఉంటాయి.
  4. కొన్నింటికి తక్కువ వెలుతురులో చూడడానికి వీలుగా సున్నితంగా ఉండే విశాలమైన పెద్ద కళ్ళు ఉంటాయి.

9th Class Biology Textbook Page No. 145

ప్రశ్న 11.
సముద్ర ఆవరణ వ్యవస్థలో జీవులు ఎందుకు అనుకూలనాలు కలిగి ఉంటాయి?
జవాబు:

  1. సముద్రములో ఒక నిర్ణీత స్థలంలో ఉండే లవణీయత, ఉష్ణోగ్రత, వెలుతురు లాంటి మార్పులకు అనుగుణంగా జీవులు అనుకూలనాలు కలిగి ఉంటాయి.
  2. సముద్రములో లోతు పెరిగే కొద్ది ఉత్పన్నమయ్యే పీడనాన్ని తట్టుకోవడానికి జీవులు అనుకూలనాలు కలిగి ఉంటాయి. ఊపిరితిత్తులను కుంచింపచేస్తాయి.
  3. సముద్రచరాలు వాటి శరీరంలో జరిగే మంచినీటి, ఉప్పునీటి ప్రతిచర్యలను తప్పక నియంత్రించాలి. వీటికొరకు ప్రత్యేకంగా అభివృద్ధి చెందిన మూత్రపిండాలు, మొప్పులు వంటి అవయవాలు సహాయపడతాయి.
  4. సముద్ర ఉపరితల, సముద్ర అడుగున ఉన్న నేలలోని ఉష్ణోగ్రత వ్యత్యాసాలను తట్టుకోవడానికి అనుకూలనాలను ప్రదర్శిస్తాయి.
  5. సముద్రలోతుల్లో నివసించే జీవులు అధిక పీడనం, చలి, చీకటి, తక్కువ పోషకాల లభ్యత వంటి పరిస్థితులలో జీవించడానికి రకరకాల అనుకూలనాలు చూపుతాయి.
  6. జీవులు సముద్ర అలల తాకిడికి, కొట్టుకొనిపోకుండా మరియు ఎక్కువ దూరం ప్రయాణించడానికి, వైవిధ్యమైన వాతావరణంలో జీవించడానికి అనుకూలనాలు కలిగి ఉంటాయి.

9th Class Biology Textbook Page No. 136

ప్రశ్న 12.
మనం ఆవాసం అని దేనిని అంటాం?
జవాబు:
జీవులు నివసించే ప్రదేశమును ఆవాసం అంటాం.

ప్రశ్న 13.
చెట్టు కేవలం కాకులకు మాత్రమే ఒక ఆవాసమా?
జవాబు:
కాదు, చెట్టు రకరకాలయిన పక్షులు, కీటకాలకు ఆవాసం.

9th Class Biology Textbook Page No. 136

ప్రశ్న 14.
ఆవాసం, ఆవరణ వ్యవస్థల మధ్య గల తేడా ఏమిటి? జీవులు ఆవాసంలో నివసిస్తాయా ? ఆవరణ వ్యవస్థలో నివసిస్తాయ?
జవాబు:
ఒక జీవి నివసించే ప్రదేశం ఆవాసం. దగ్గర సంబంధం కలిగిన రకరకాల జీవులు, నిర్జీవులు ఉండే ప్రదేశం ఆవరణ వ్యవస్థ. జీవులు ఆవరణ వ్యవస్థలో భాగమైన ఆవాసంలో జీవిస్తాయి.

9th Class Biology Textbook Page No. 137

ప్రశ్న 15.
అనుకూలనం అంటే ఏమిటి? మీ అభిప్రాయాన్ని వివరించండి.
జవాబు:

  1. వివిధ పరిస్థితులలో జీవించే జీవులు కొంతకాలం తరువాత వాటికి అనుకూలంగా మారతాయి లేదా అభివృద్ధి చెందుతాయి. వీటినే జీవులలోని అనుకూలనాలు అంటారు.
  2. ప్రకృతిలోని జీవులు తమ అవసరాలను బట్టి తమ చుట్టూ అనుకూల పరిస్థితులను ఏర్పరచుకుంటాయి.

9th Class Biology Textbook Page No. 140

ప్రశ్న 16.
నీటిలో నివసించే కొన్ని జంతువులు మీకు తెలిసే ఉంటాయి. కొన్నింటిని మీరు రోజూ చూస్తూనే ఉంటారు. వాటికి నీటిలో నివసించడానికి ఏమైనా అనుకూల లక్షణాలు ఉంటాయా?
జవాబు:

  1. నీటిలో నివసించే జీవులు నీటిలో నివసించడానికి కావలసిన అనుకూల లక్షణాలు కలిగి ఉంటాయి.
  2. నీటిలో తేలియాడడానికి జీవుల శరీరంలో గాలి గదులు ఉంటాయి. ఇవి ఈదడానికి కూడా ఉపకరిస్తాయి.
  3. తాబేళ్ళు, చేపలు నీటిలో ఈదడానికి తెడ్ల వంటి వాజాలు అనే ప్రత్యేక నిర్మాణాలు కలిగి ఉన్నాయి.
  4. చేపలు, తాబేళ్ళ శరీరాల్లో ఫ్లోటర్స్ అనే గాలితిత్తులు ఉండడం వలన నీటిలోని వివిధ స్థాయిలలో నివసించగలుగుతున్నాయి.
  5. ప్లవకాలు వంటి సూక్ష్మజీవులు శరీరాలలోని కణాలలో ఉండే నూనె బిందువుల సహాయంతో నీటిపై తేలుతాయి.

9th Class Biology Textbook Page No. 140

ప్రశ్న 17.
నీటి మొక్కలలో ఉండే మృదువైన కాండాలు వాటికి ఎలా ఉపయోగపడతాయి?
జవాబు:

  1. నీటి మొక్కలలో ఉండే మృదువైన కాండాలలో వాయుపూరిత మృదు కణజాలం ఉంటుంది.
  2. ఈ కణాల మధ్యలో వాయుగదులుంటాయి.
  3. ఇవి మొక్క నీటి మీద తేలడానికి ఉపయోగపడతాయి.

9th Class Biology Textbook Page No. 142

ప్రశ్న 18.
సహజీవనం, కోమోఫ్లాలను వివరించండి.
జవాబు:
సహజీవనం :

  1. రెండు వివిధ వర్గాల జీవులు కలిసి జీవిస్తూ పోషకాలను పరస్పరం మార్పిడి చేసుకుంటూ పరస్పరం లాభం చెందే విధానంను సహజీవన పోషణ అంటారు.
  2. ఇందులో ఒక జీవి తన సహజీవియైన మరియొక జీవికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
  3. రెండవ జీవి తన సహజీవికి నివాసాన్ని లేక పోషకాలని లేక రెండింటినీ అందిస్తుంది.
    ఉదా : లెగ్యుమినేసి (చిక్కుడు జాతి) మొక్కల వేర్ల మీది బుడిపెలు.
  4. ఇందులో మొక్కలు బాక్టీరియాకు ఆవాసాన్ని ఇస్తాయి. బాక్టీరియా వాతావరణంలోని నత్రజనిని మొక్కలకు అందచేస్తాయి.
  5. సహజీవనంలో రెండు జీవులు లాభం పొందవచ్చు లేదా ఏదో ఒక జీవి మాత్రమే లాభం పొందవచ్చు.

కోమోఫ్లాజ్:

  1. పర్యావరణములోని మార్పులకు అనుగుణంగా జంతువులు వాటి యొక్క శరీరపు రంగును, ఆకారమును మార్చుకొనుటను కోమోప్లాజ్ అంటారు.
  2. సాధారణంగా భక్షక జీవి నుండి రక్షణ పొందుటకు జంతువులు శరీరపు రంగు, ఆకారమును మార్చుకుంటాయి.
    ఉదా : ఊసరవెల్లి.

9th Class Biology Textbook Page No. 143

ప్రశ్న 19.
సముద్ర ఆవరణ వ్యవస్థలో ఉన్న వివిధ మండలములను పేర్కొనండి. దానిలోని నిర్జీవ అంశాలను, ఉండే వివిధ రకాల జీవులను రాయండి. పట్టిక ఆధారంగా కింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 8
ఎ) పటంలో కాంతి ప్రసారాన్ని బట్టి ఎన్ని మండలాలను చూడవచ్చు?
జవాబు:
మూడు మండలాలు.

బి) పట్టికలోని వివరాలను బట్టి ఎన్ని రకాల నిర్ణీవాంశాలను గురించి తెలుసుకోవచ్చు?
జవాబు:
మూడు నిర్జీవ అంశాలను గురించి తెలుసుకోవచ్చు.

సి) పటంలో చూపిన పరిస్థితులేగాక ఇంకేవైనా సముద్ర జీవుల అనుకూలనాలపై ప్రభావం చూపుతాయా?
జవాబు:
లవణీయత, ఆక్సిజన్, వర్షపాతం, గాలి, నేల, అలల వేగం, పి. హెచ్, పోషక పదార్థాలు, ఆర్థత మొదలైన అంశాలు ప్రభావం చూపుతాయి.

డి) లోతు పెరిగిన కొద్దీ ఉష్ణోగ్రత మరియు పీడనాల ప్రభావం ఎలా ఉంటుంది?
జవాబు:
లోతు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. పీడనం పెరుగుతుంది.

ఇ) ఏ జోనులో ఎక్కువ జంతువులున్నాయి? ఎందుకో ఊహించండి.
జవాబు:
బెథియల్ మండలంలో ఎక్కువ జంతువులు ఉన్నాయి.

9th Class Biology Textbook Page No. 145

ప్రశ్న 20.
మన రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో గల పులికాట్ సరస్సు మంచినీటి ఆవరణ వ్యవస్థకు చెందినదా? అవునో కాదో కారణాలు తెలపండి.
జవాబు:

  1. నెల్లూరు జిల్లాలో గల పులికాట్ సరస్సు ఉప్పునీటి ఆవరణ వ్యవస్థకు చెందినది.
  2. సరస్సునందలి నీటి లవణీయత ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా సోడియమ్, పొటాషియంకు చెందిన లవణాలు అధిక మొత్తంలో ఉంటాయి.

9th Class Biology Textbook Page No. 147

ప్రశ్న 21.
కొలనుల సమీపంలో చుట్టూ నివసించే పక్షులకు కాళ్ళు, వేళ్ళ మధ్య ఒక పలుచని చర్మం ఎందుకు ఉంటుంది?
జవాబు:
కాలి వేళ్ళ మధ్య చర్మం ఉండడం వలన కొలనుల సమీపంలో నివసించే పక్షులు ఈదడానికి, నేలపై నడవడానికి సహాయపడుతుంది.

AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

9th Class Biology Textbook Page No. 147

ప్రశ్న 22.
కొంగలకు పొడవైన కాళ్ళు మరియు పొడవైన ముక్కు ఎందుకుంటాయి?
జవాబు:

  1. నీటిలో నడిచే కొంగజాతి పక్షులు తమ సన్నని పొడవైన కాళ్ళతో లోతు తక్కువ గల కొలను మట్టిలో కీటకాల కోసం వెదుకుతూ జీవిస్తాయి.
  2. పొడవైన ముక్కు మట్టిని పెకిలించడానికి ఉపయోగపడుతుంది.

9th Class Biology Textbook Page No. 148

ప్రశ్న 23.
సముద్ర ఆవరణ వ్యవస్థలు మంచినీటి ఆవరణ వ్యవస్థల కంటే ఏ విధంగా భిన్నంగా ఉంటాయి?
జవాబు:

  1. సముద్ర ఆవరణ వ్యవస్థలందు నీటి లవణీయత 3.5% గా ఉంటుంది.
  2. సముద్ర ఆవరణ వ్యవస్థలు అతి పెద్దవిగా ఉంటాయి. భూఉపరితలం మీద మూడింట నాలుగు వంతులు ఆక్రమించి ఉంటాయి.
  3. మంచినీటి ఆవరణ వ్యవస్థల కంటే సముద్ర నీటి ఆవరణ వ్యవస్థలలో నివసించే జీవుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటాయి.

9th Class Biology Textbook Page No. 148

ప్రశ్న 24.
సముద్ర ఆవరణ వ్యవస్థ కంటే భిన్నంగా ఉన్న మంచినీటి ఆవరణ వ్యవస్థలో కనిపించే రెండు అనుకూలనాల గురించి చెప్పండి.
జవాబు:

  1. మంచినీటి లవణీయత ఉప్పునీటి లవణీయత కంటే చాలా తక్కువగా ఉంటుంది.
  2. మంచినీటి ఆవరణ వ్యవస్థ ద్వారా సకల జీవకోటికి త్రాగటానికి కావలసిన నీరు దొరుకుతుంది.

9th Class Biology Textbook Page No. 148

ప్రశ్న 25.
కాంతి ప్రసారం ఆధారంగా, మంచి నీటి మరియు సముద్ర ఆవరణ వ్యవస్థలో కనబడే పోలికలేమిటి?
జవాబు:
1) కాంతి ప్రసారం ఆధారంగా సముద్ర ఆవరణ వ్యవస్థను మూడు మండలాలుగా విభజించారు. అవి

  1. యుఫోటిక్ మండలం
  2. బెథియల్ మండలం
  3. అబైసల్ మండలం.

2) కాంతి ప్రసారం ఆధారంగా మంచినీటి ఆవరణ వ్యవస్థను మూడు మండలాలుగా విభజించారు. అవి

  1. లిటోరల్ మండలం
  2. లిమ్నెటిక్ మండలం
  3. ప్రొఫండల్ మండలం.

9th Class Biology Textbook Page No. 148

ప్రశ్న 26.
సముద్ర ఆవరణ వ్యవస్థతో పోల్చినపుడు మంచినీటి ఆవరణ వ్యవస్థలో కనిపించని మండలం ఏది?
జవాబు:
బెథియల్ మండలం సముద్ర ఆవరణ వ్యవస్థలో ఉంటుంది. మంచినీటి ఆవరణ వ్యవస్థలో ఉండదు.

ప్రశ్న 27.
సముద్ర, మంచినీటి ఆవరణ వ్యవస్థలలో వివిధ రకాల అనుకూలనాలకు దారితీసే ప్రధాన కారకాలేవి?
జవాబు:
కాంతి, లవణీయత, ఆహారం, ఆక్సిజన్, లోతు, ఉష్ణోగ్రత, పీడనం మొదలైనవి సముద్ర, మంచినీటి ఆవరణ వ్యవస్థలలో వివిధ రకాల అనుకూలనాలకు దారితీసే ప్రధాన కారకాలు.

ప్రశ్న 28.
ప్రపంచమంతటా మొక్కలన్నీ ఒకే సమయంలో ఆకులు రాల్చుతాయా?
జవాబు:

  1. ప్రపంచమంతటా మొక్కలన్నీ ఒకే సమయంలో ఆకులు రాల్చవు.
  2. సమశీతోష్ణ ప్రాంతంలోని మొక్కలు శీతాకాలం ప్రారంభం కాకముందే ఆకులు రాల్చుతాయి.
  3. ఉష్ణమండలాల్లోని కొన్ని మొక్కలు వేసవి మొదలు కాకముందే ఆకులు రాల్చుతాయి.

9th Class Biology Textbook Page No. 149

ప్రశ్న 29.
ముళ్ళు గల పత్రాలు కూడా ఉష్ణోగ్రతలకు అనుకూలనాలేనా?
జవాబు:
కాదు. తమను భక్షించే జీవుల నుండి రక్షణ కొరకు ఎడారి మొక్కలు పత్రాలపై ముళ్ళను ఏర్పరచుకుంటాయి.

ప్రశ్న 30.
మంచు కురిసే సమయంలో వృక్షాలకు వెడల్పైన ఆకులుంటే ఏమవుతుంది?
జవాబు:
మంచు కురిసే సమయంలో వృక్షాలకు వెడల్పైన ఆకులుంటే ఆకులమీద మంచు పేరుకుపోయి ఆకులు, కొన్నిసార్లు శాఖలు కూడా విరుగుతాయి.

ప్రశ్న 31.
ధృవపు ఎలుగు శరీరంపై దళసరిగా బొచ్చు ఎందుకు ఉంటుంది?
జవాబు:

  1. శీతల ప్రాంతాలలో నివసించే జీవులు దళసరి బొచ్చుతో శరీరాలను కప్పి ఉంచుతాయి.
  2. బొచ్చు ఉష్ణబంధకంగా పనిచేస్తూ తమ శరీరాల నుండి ఉష్ణం కోల్పోకుండా నిరోధిస్తుంది.

9th Class Biology Textbook Page No. 149

ప్రశ్న 32.
సీల్ జంతువులకు దళసరి కొవ్వు ఉండే చర్మం శీతల వాతావరణం నుండి రక్షించడానికి ఏ విధంగా తోడ్పడుతుంది?
జవాబు:

  1. సీల్ జంతువులు చర్మాల కింద దళసరి కొవ్వు పొరను నిలువ చేసుకుంటాయి.
  2. కొవ్వుపొర శరీరానికి ఉష్ణ బంధకంలా సహాయపడుతూ ఉష్ణం, శక్తిని ఉత్పత్తి చేయడంలో తోడ్పడుతుంది.

AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

9th Class Biology Textbook Page No. 150

ప్రశ్న 33.
వేసవి మరియు శీతాకాలపు సుప్తావస్థకు చెందిన సమాచారం సేకరించండి.
జవాబు:
వేసవికాల సుప్తావస్థ :
బాగా వేడిగా, పొడిగా ఉండే ప్రాంతాలలోని జీవులు అధిక ఉష్టాన్ని తప్పించుకోవటానికి నేలలో బొరియలు చేసుకొని జీవక్రియలను తగ్గించుకొని దీర్ఘకాలంపాటు నిద్రపోతాయి. దీనినే వేసవి నిద్ర లేదా వేసవి సుప్తావస్థ అంటారు.
ఉదా : కప్ప, నత్త.

శీతాకాల సుప్తావస్థ :
బాగా చలిగా ఉండే శీతల పరిస్థితులను తప్పించుకోవటానికి శీతల ప్రాంత జీవులు బొరియలు చేసుకొని దీరకాలంగా నిద్రపోతాయి. దీనినే శీతాకాల సుప్తావస్థ అంటారు. ఈ దశలో జీవక్రియలు కనిష్టస్థాయికి చేరుకుంటాయి. పరిసరాలు అనుకూలించినప్పుడు ఈ జీవులు సుప్తావస్ల నుండి మేల్కొంటాయి.
ఉదా : ధృవపు ఎలుగుబంటి, హెహగ్.

9th Class Biology 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

1. 1) కలబంద, లింగాక్షి మొక్కలను రెండు వేర్వేరు కుండీలలో తీసుకోవాలి.
2) ఒక్కో మొక్కకు 2 చెమ్చాల నీరు పోయాలి.
3) తరువాత రెండు రోజుల వరకు నీరు పోయకూడదు.
4) వారం రోజుల తరువాత మొక్కల పరిస్థితిని పరిశీలించాలి.
AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 9

పరిశీలనలు
1) పెరుగుదల చూపిన మొక్క ఏది?
కలబంద పెరుగుదల చూపినది.

2. ముందుగా వాడిపోయిన మొక్క వీది? ఎందుకని?
ముందుగా వాడిపోయిన మొక్క లింగాక్షి. కొన్ని రకాల మొక్కలు నీరు లేకపోతే త్వరగా వాడిపోతాయి.

కృత్యం – 2

2. 1) నీటి కుంటలలో పెరిగే ఒక మొక్కను సేకరించాలి. (ఉదా : హైడ్రిల్లా, వాలిస్ నేరియా, డక్ వీడ్)
2) ఇంటికి తీసుకునిపోయి మట్టిలో నాటి నీరు పోయాలి.

పరిశీలనలు :

  1. మొక్క పెరుగుదలను చూపదు.
  2. పరిసరాలలోని పరిస్థితులకు అనుగుణంగా నీటి అవసరాలను బట్టి ఒక్కొక్కరకం అనుకూలనాలు చూపుతాయి.
  3. మొక్కలు ఒక్కొక్క ప్రాంతంలో జీవిస్తూ అక్కడి పరిస్థితులకు అనువుగా మారతాయి.

AP Board 9th Class Biology Solutions 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

కృత్యం – 3

3. కొలను సమీపంలో మరియు చుట్టూ ఎన్నో జంతువులు నివసిస్తాయి. వాటిని వీలైతే దగ్గరగా పరిశీలించి శరీరం, కాళ్ళ లక్షణాల వివరాలు తెలిపే ఒక జాబితా తయారు చేయండి.
కొలను సమీపంలో నివసించే జంతువుల జాబితా :

కీటకాలు : దోమలు, డ్రాగన్ ఫ్రై, డామ్ సిప్లై, మేఫిక్స్, స్టోన్ ఫ్రై, డాబ్సోప్లై, కాడిస్ ప్లై, క్రేన్ ఫై, పేడపురుగు మొదలైనవి.
క్రస్టేషియనులు : కేఫిష్, స్కడ్స్, రొయ్యలు
మొలస్కా జీవులు : నత్తలు
అనెలిడ జీవులు : జలగలు
చేపలు : బ్లుగిల్, బాస్, కేట్ ఫిష్, స్కల్ఫిన్, విన్నో
సరీసృపాలు : పాములు, తాబేళ్లు
ఉభయజీవులు : కప్ప, పక్షులు, బాతులు, కొంగలు

కొలను చుట్టూ సమీపంలో నివసించే కొన్ని జంతువుల శరీర మరియు కాళ్ళ లక్షణాలు :
1. దోమ :
శరీరం ఖండితమైనది. 3 జతల కాళ్ళు కలిగినది.

2. రొయ్యలు :
కొలను అడుగు భాగంలో నివసించేవి. రొమ్ము భాగమున 5 జతల కాళ్లు, ఉదర భాగమున 5 జతల కాళ్ళు ఈదుటకు ఉంటాయి. శరీరము ఖండితమైనది మరియు బాహ్య అస్థిపంజరము కలది.

3. నత్త :
మెత్తని శరీరము చుట్టూ గట్టిదైన రక్షణ కవచము గలది. చదునైన పాదము సహాయంతో నత్త పాకుతుంది.

4. బాతులు :
రెండు కాళ్ళు గలిగిన పక్షులు, కాలివేళ్ళ మధ్య చర్మం ఉండటం వలన ఈ జీవులు ఈదడానికి, నేలపై నడవడానికి సహాయపడతాయి.

5. కేఫిష్ :
నాలుగు కాళ్ళు కలిగిన మంచినీటి క్రస్టేషియన్. శరీరం ఖండితమైనది. తల, రొమ్ము భాగం కలిసి ఉంటుంది. దీనినుండి నాలుగు జతల కాళ్ళు ఏర్పడతాయి. ఉదర భాగమునకు నాలుగు జతల ఉపాంగాలు అతుక్కుని ఉంటాయి.

6. డ్రాగన్ ఫ్రై :
రెండు జతల పారదర్శక రెక్కలు ఉంటాయి. సాగదీయబడిన శరీరము గలది. మూడు జతల కాళ్ళు గలవు.

7. వానపాము :
ఖండితమైన శరీరము గలది. పొడవైన మెత్తటి శరీరము కలది. కాళ్ళులేని జీవి.

8. చేప :
మంచినీటి కొలనులో జీవించేది. మొప్పల సహాయంతో శ్వాసిస్తుంది. వాజాల సహాయంతో ఈదుతుంది.

9. గోల్డ్ ఫిష్ (గండు చేప) :
మంచినీటిలో నివసించే చేప. మొప్పల సహాయంతో శ్వాసిస్తుంది. ఎక్వేరియంలో ఉంచబడే చేప. వాజాల సహాయంతో ఈదుతుంది.

10. గోదురు కప్ప :
చర్మం పొడిగా ఉంటుంది. కాళ్లు పొట్టిగా ఉంటాయి. కాలివ్రేళ్ల మధ్య చర్మం ఉండుట వలన ఈదడానికి, నేలపై నడవడానికి సహాయపడతాయి. ఉభయచర జీవి.

11. జలగ :
శరీరం ఖండితమైనది. సక్కర్ల సహాయంతో రక్తాన్ని పీల్చుతుంది.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

SCERT AP 9th Class Biology Guide Pdf Download 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 8th Lesson Questions and Answers వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
మన దేశంలో ధాన్యం ఉత్పత్తిలో పెంపుదల సాధించాలంటే ఏమి చేయాలో సూచించండి. (AS 1)
(లేదా)
ఒక పక్క జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. కాని పంటలు పండే భూమి మాత్రం తగ్గిపోతుంది. మరి పెరుగుతున్న జనాభాకు సరిపడేలా ఆహారోత్పత్తి పెంచాలంటే చేపట్టాల్సిన పరిష్కార మార్గాలు సూచించండి.
జవాబు:

  1. సాగుభూమి విస్తీర్ణాన్ని పెంచడం.
  2. ప్రస్తుతం సాగుచేస్తున్న భూమినందు ఉత్పత్తిని పెంచడం.
  3. ఎక్కువ దిగుబడినిచ్చే వరి సంకర జాతులను అభివృద్ధి చేయడం.
  4. వివిధ వాతావరణ పరిస్థితులలో పెరిగే నూతన రకములను ఉత్పత్తి చేయడానికి వరి మొక్క జన్యు వైవిధ్యమును పరిరక్షించడం.
  5. మంచి నీటిపారుదల పద్ధతులు, సరియైన యాజమాన్య పద్ధతులను పాటించాలి.
  6. పోషక పదార్థములను సక్రమముగా వినియోగించడానికి వరి పంట.యాజమాన్య పద్ధతులను అవలంబించాలి.
  7. సేంద్రియ ఎరువులను ఉపయోగించాలి.
  8. పంటమార్పిడి, మిశ్రమ పంటల పద్ధతులను అవలంబించాలి.

ప్రశ్న 2.
రసాయన ఎరువుల కంటే జీవ ఎరువులు ఏ విధంగా మెరుగైనవి? (AS 1)
జవాబు:

  1. జీవ ఎరువులు సహజ పోషకాలను నేలకు అందిస్తాయి.
  2. నేల నిర్మాణాన్ని మరియు నేల సేంద్రియ పదార్థాన్ని జీవ ఎరువులు పెంచుతాయి.
  3. జీవ ఎరువులు నీటి నిల్వ సామర్థ్యాన్ని మరియు నేల గట్టిపడే సమస్యలను తగ్గిస్తాయి.
  4. నేల మరియు నీటి కోరివేతను జీవ ఎరువులు తగ్గిస్తాయి.
  5. పంట యొక్క ఉత్పత్తిని జీవ ఎరువులు పెంచుతాయి.
  6. జీవ ఎరువుల వాడకం ద్వారా నేలలో హ్యూమస్ శాతం పెరిగి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

ప్రశ్న 3.
అ) అధిక దిగుబడినిచ్చే పంటలు పండించడానికి, రసాయన ఎరువులు ఎక్కువ వాడడం వలన కలిగే దుష్ఫలితాలు ఏమిటి? (AS 1)
జవాబు:

  1. రసాయనిక ఎరువులు సరస్సులు, నదులు మరియు వాగులను కలుషితం చేస్తాయి.
  2. నేలలో జీవించే వానపాములతో సహా ఇతర జీవులను నాశనం చేస్తాయి.
  3. రసాయనిక ఎరువులను వినియోగించుట ద్వారా కేవలం 20 నుండి 30 సంవత్సరాలు మాత్రమే అధిక ఉత్పత్తిని సాధించగలం.
  4. ఆ తరువాత నేల మొక్కల పెరుగుదలకు అనుకూలించదు.
  5. నేల సారాన్ని రసాయన ఎరువులు పాడు చేస్తాయి.
  6. రసాయన ఎరువుల వాడకం వలన పంటలు వ్యాధులకు గురి అవుతాయి.
  7. కొన్ని మొక్కలు పోషక పదార్థాలను గ్రహించడాన్ని నిరోధిస్తాయి.
  8. రసాయన ఎరువులు ఉపయోగించి పండించిన ఆహార పదార్థాలు అంత రుచికరంగా ఉండవు.

ఆ) అధిక దిగుబడినిచ్చే వంగడాలను రసాయన ఎరువులు లేకుండా పెంచవచ్చా? ఎలా? (AS 1)
జవాబు:

  1. అవును. అధిక దిగుబడినిచ్చే వంగడాలను రసాయన ఎరువులు లేకుండా పెంచవచ్చును.
  2. రసాయన ఎరువులు మరియు కృత్రిమంగా తయారయిన కీటక నాశనులకు బదులుగా జీవ ఎరువులను ఉపయోగించుట ద్వారా మనము అధికోత్పత్తిని పొందవచ్చు.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

ప్రశ్న 4.
విత్తనాలు విత్తడానికి ముందు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి? (AS 1)
జవాబు:

  1. విత్తనాలు విత్తే ముందు నేలను సిద్ధపరచాలి.
  2. నేలను వదులుగా చేయడానికి, గట్టిగా ఉన్న మట్టి గడ్డలను పగలగొట్టడానికి నేలను దున్నాలి.
  3. విత్తనాలు చల్లే ముందు నీళ్ళు పెట్టాలి. .
  4. నేలలో పుట్టే లేదా విత్తనముల ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టడానికి విత్తన శుద్ధి చేయాలి.

ప్రశ్న 5.
వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉండే ప్రదేశంలో మీ పొలం ఉంటే దానిలో ఏ రకమైన పంటలు పండిస్తావు? ఎలా పండిస్తావు? (AS 1)
జవాబు:

  1. జొన్న, సజ్జ, కంది, పెసలు, ఉలవలు మొదలగు పంటలను వర్షాభావ పరిస్థితులు గల మా పొలంలో పండిస్తాను.
  2. వర్షపు నీటిని సంరక్షించడం, చెక్ డ్యాంలను నిర్మించడం, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి, వాటర్ షెడ్ పథకము మరియు నేల మరియు నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా పై పంటలను పండిస్తాను.

ప్రశ్న 6.
కాలానుగుణంగా ఆశించే కీటకాలు పంట పొలాన్ని నాశనం చేయకుండా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటారు? (AS 1)
జవాబు:

  1. సాధారణంగా రైతులు కృత్రిమంగా తయారుచేసిన ఎరువులు, కీటకనాశనులు ఉపయోగించి పంటలపై వచ్చే కీటకాలను అదుపులో ఉంచుతారు.
  2. కొందరు కీటకాలను చేతితో ఏరివేయడం ద్వారా కీటకాల బారి నుండి పంట పొలాన్ని రక్షిస్తారు.
  3. కీటకాలకు హాని కలిగించే పరభక్షక కీటకాలను ఉపయోగించి పంట పొలం నాశనం కాకుండా చూస్తారు.
  4. చేతితో కీటకాలను ఏరి వేసే పద్ధతిలో పంటపొలం మధ్యలో దీపపుతెరలు ఉంచడంవల్ల కీటకాలన్నీ దాని ఆకరణకు లోనై ఒకే చోటికి చేరతాయి. ఇలా చేయడం వల్ల వాటిని ఏరివేయడం సులభం.
  5. కీటకనాశనులను అవసరమైన సందర్భాలలో వినియోగించడం వల్ల కూడా పంటపొలాన్ని కీటకాలు నాశనం చేయకుండా చూడవచ్చు.

ప్రశ్న 7.
ఒక రైతు తన పొలంలో చాలా కాలంగా ఒకే క్రిమిసంహారక మందును ఉపయోగిస్తున్నాడు. అయితే కింది వాటిపై దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? (AS 2)
అ) కీటకాల జనాభా
ఆ) నేల ఆవరణ వ్యవస్థ
జవాబు:
అ) కీటకాల జనాభా :

  1. రైతు క్రిమిసంహారక మందును ఎక్కువకాలం ఉపయోగించడం వలన కీటకాలు వ్యాధి నిరోధకతను పెంచుకుంటాయి.
  2. అందువలన కీటకాల జనాభా పెరుగుతుంది.

ఆ) నేల ఆవరణ వ్యవస్థ :

  1. క్రిమి సంహారకాలను ఎక్కువకాలం ఉపయోగించడం వల్ల ఆ మందులు నేలలోనే ఉండిపోతాయి.
  2. ఆ మందులు నేలలోని పురుగులను చంపివేస్తాయి. తద్వారా పంట దిగుబడి తగ్గుతుంది.
  3. నేలలో లవణాల శాతం పెరిగి నేల ఆవరణ వ్యవస్థ దెబ్బ తింటుంది.

ప్రశ్న 8.
రామయ్య తన పొలానికి భూసార పరీక్ష చేయించాడు. పోషకాల నిష్పత్తి 34-20-45గా ఉంది. ఈ నిష్పత్తి చెరకు పండించడానికి అనుకూలమేనా? ఏ రకమైన పంటలు పండించడానికి ఈ పొలం అనుకూలమని భావిస్తావు? (AS 2)
జవాబు:

  1. రామయ్య పొలము చెరకు పంట పండించడానికి అనుకూలం కాదు.
  2. ఎందుకంటే చెరకు పంట పండించడానికి నేలలో 90% నత్రజని ఉండాలి, కాని రామయ్య పొలంలో కేవలం 34% నత్రజని మాత్రమే ఉంది.
  3. భాస్వరము 20% ఉండడం వలన మొక్కజొన్నను, పొటాషియం 45% ఉండడం వలన వేరుశనగ పంటను పండించవచ్చు.

ప్రశ్న 9.
మీ సమీపంలోని పొలానికి వెళ్ళి రైతులు కలుపు నివారణకు పాటిస్తున్న పద్ధతులు గురించిన సమాచారం సేకరించి నివేదిక రాయండి. (AS 3)
జవాబు:
కలుపు నివారణకు పాటిస్తున్న పద్ధతులు :

రైతు పేరు నివారణ పద్ధతి
1. రామారావు కూలీలతో చేతితో ఏరివేయిస్తున్నాడు.
2. వెంకటయ్య ఈ రైతుది మెట్ట పొలం అయినందున గుంటక వంటి పరికరాలు వాడి నివారణ చేస్తున్నాడు.
3. సోమేశం కలుపు నాశకాలను చల్లి నివారణ చేస్తున్నాడు.
4. శ్రీనివాసరావు దుక్కిలోనే కలుపు వినాశకాలను వాడి, దున్ని కలుపును రాకుండా నివారిస్తున్నాడు.

ఈ నాలుగు పద్ధతులను చాలా మంది రైతులు పాటించుటను గమనించాను.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

ప్రశ్న 10.
మీ ప్రాంతంలోని ప్రధానమైన కలుపు మొక్కల జాబితా తయారుచేయండి. వాటిలో వేర్వేరు పంటలలో పెరిగే కలుపు మొక్కలను కింది పట్టికలో నమోదు చేయండి. (AS 4)
జవాబు:
ప్రధానమైన కలుపు మొక్కల జాబితా :
సైనోడాన్ డాక్టలాన్ (గరిక), సైపరస్ రొటండస్ (తుంగ), డిజిటారియా లాంగిఫోలియా, డాక్టలో క్లీనియమ్ కలోనమ్, సెటేరియా గ్లూకా, సైపరస్ డిఫార్మిస్, ఐకోర్నియా క్రాసిప్స్ (బుడగ తమ్మ), సాల్వీనియా మొలస్టా, ఆల్టర్ నాంతిర సెసైలిస్ (పొన్నగంటి), సెలోషియా అర్జెన్షియా (గురంగుర) లూకాస్ ఏస్పిరా (తుమ్మి), పోర్చు లేక ఒలరేషియా (పావలికూర), క్లియోమ్ విస్కోసా (కుక్కవామింట), సొలానమ్ నైగ్రమ్ (బ్లాక్ నైట్ షేడ్), అర్జిమోన్ మెక్సికానా (బాలరక్కొస), ఎబుటిలాన్ ఇండికమ్ (తుత్తురి బెండ), యూఫోర్బియా హిరా (పచ్చబొట్లు), వెర్నోనియా సిన్నోరా, ఇఖ్ నోక్లోవా కొలోనమ్ (ఉడలు), కొమ్మెలైనా బెంగాలెన్సిస్ (వెన్నవెదురు), అవినాఫాట్యువ (అడవియవలు), ఇళ్ల నోక్లోవా క్రస్ గల్లి (నీటిగడ్డి), ఎల్యు సైన్ ఇండికా (గూ గ్రాస్), ఎభిరాంథిస్ ఏస్పిరా (ఉత్తరేణి), ఇక్లిష్టా ప్రోస్టేట (గుంట కలగర లేదా) భృంగరాజ మొదలగునవి.

పంట రకం పంటపై పెరిగే కలుపు మొక్కలు
వరి గరిక, తుంగ, బుడగ తమ్మ, పొన్నగంటి
వేరుశనగ గురంగుర, గరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, కుక్కవామింట, తుమ్మి, పావలికూర, బాలరక్కిస.
మినుములు గరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, సాల్వీనియా మొలస్టా, పచ్చబొట్లు, బంగారు తీగ.
మొక్కజొన్న పచ్చబొట్లు, సొలానమ్ నైగ్రమ్, గరిక, తుంగ
పెసలు ఉడలు, గరిక, తుంగ, బాలరక్కొస, పావలికూర

ప్రశ్న 11.
మీ గ్రామ పటం గీచి, నీటివనరులను గుర్తించండి. నీవు ఒక మంచి రైతుగా వాటిని ఎలా ఉపయోగిస్తావు? ఏ ఏ వ్యవసాయ పద్ధతులను పాటిస్తావు? (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 1
నేను ఒక మంచి రైతుగా ఆ నీటి వనరులను సక్రమ పద్ధతిలో ఉపయోగిస్తాను. నీటివనరులు తక్కువగా ఉంటే బిందుసేద్యం పద్ధతిని ఉపయోగిస్తాను.

ప్రశ్న 12.
రసాయన ఎరువులు శిలీంధ్రనాశకాలు, కీటకనాశకాలు, కలుపు మందులు అధిక మోతాదులో వినియోగిస్తే పర్యావరణంపై కలిగే పరిణామాలు ఏమిటి? (AS 6)
జవాబు:

  1. మనం కీటకనాశనులు, శిలీంధ్రనాశకాలను, కలుపు మందులను అధిక మొత్తంలో వాడడం వలన ఈ మందులు నేలలోనే మిగిలిపోతాయి.
  2. వర్షాలు పడినప్పుడు నేల నుండి నీటిలో కరిగి నీటి వనరులను కూడా కలుషితం చేస్తాయి.
  3. నేల పొరలోకి దిగి నేలను కలుషితం చేసాయి.
  4. ఈ మందులను పొలంలో చల్లే రైతులు తరచుగా వీటి ప్రభావానికి గురి అయ్యి ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు.
  5. కీటకనాశనులు ఉపయోగపడే కీటకాలతో సహా మొత్తం కీటకాలను నాశనం చేస్తాయి.
  6. అధిక మొత్తంలో రసాయన ఎరువులు, కీటక నాశనులు, కలుపు ందులను వాడడం వలన కొంత కాలానికి నేల పంట పండించడానికి ఉపయోగపడదు.

ప్రశ్న 13.
“జీవ వైవిధ్యానికి సేంద్రియ ఎరువులు సహాయపడతాయి”. దీనిని నీవెలా సమర్థిస్తావు? (AS 6)
జవాబు:

  1. నేల మరియు నేలలో ఉండే జీవులపై జరిగిన జీవశాస్త్ర అధ్యయనము సేంద్రియ సేద్యమునకు అనుకూలమని నిరూపించబడినది.
  2. రసాయన పదార్థాలను, వృక్ష మరియు జంతు సంబంధమైన వ్యర్థాల నుండి బాక్టీరియా మరియు శిలీంధ్రాలు నేల పోషక పదార్థములను విడగొడతాయి.
  3. అంతేకాకుండా బాక్టీరియా మరియు శిలీంధ్రాలు ఆరోగ్యకరమైన దిగుబడిని ఇవ్వడానికి మరియు భవిష్యత్తుల్లో పండించబోయే పంటలకు అనుకూలమైన నేలను అందిస్తాయి.

ప్రశ్న 14.
“ఎక్కువ మోతాదులో శిలీంధ్రనాశకాలు వాడితే జీవవైవిధ్యం, పంట దిగుబడిపై తీవ్రమైన ప్రమాదం కలుగుతుంది”. దీనిని నీవెలా సమర్థిస్తావు? (AS 6)
జవాబు:

  1. ఎక్కువ మోతాదులో శిలీంధ్రనాశకాలు వాడితే అవి ఎక్కువ భాగం మృత్తికలలో చేరి మృత్తికలోని జీవులను నాశనం చేస్తాయి.
  2. వర్షము కురిసినప్పుడు మృత్తిక నుండి వర్షపు నీటి ద్వారా చెరువులు, నదులలోని నీటిలోకి చేరి జలజీవులకు హాని కలుగచేస్తాయి.
  3. ఈ మందులను పొలంలో చల్లే రైతులు తరుచుగా వీటి ప్రభావానికి గురి కావడం జరుగుతుంది. కొన్ని రసాయనిక పదార్థాలు శరీరంలోకి ప్రవేశించి, కొన్నిసార్లు ప్రాణాపాయం కలుగుతుంది.
  4. క్రిమి సంహారక మందులను పంటలపై చల్లినప్పుడు అవి పరాగ సంపర్కానికి ఉపయోగపడే కీటకాలను కూడా చంపివేస్తాయి.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

ప్రశ్న 15.
అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఉపయోగించడం వలన కలిగే ప్రతికూల ప్రభావం ఏమిటి? (AS 7)
జవాబు:
అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఉపయోగించడం వలన
i) అవి ఎక్కువ మొత్తంలో నేల నుండి పోషకాలను వినియోగించుకుంటాయి.
ii) నిరంతరం ఉపయోగించడం వలన నేల సారాన్ని కోల్పోతుంది.
iii) సారాన్ని పెంచటానికి రసాయన ఎరువులు వాడాల్సి ఉంటుంది.
iv) ఇది వ్యవసాయ ఖర్చును పెంచుతుంది.

ప్రశ్న 16.
రసాయన ఎరువులు ఉపయోగిస్తున్న రైతుకు సేంద్రియ ఎరువులు ఉపయోగించే విధంగా ఏ రకంగా వివరించి ఒప్పిస్తావు? (AS 7)
జవాబు:

  1. పోషక పదార్థాలు తిరిగి నేలలో కలిసే విధంగా మరియు మట్టిగడ్డలు చిన్నవిగా చేయడానికి జీవ ఎరువులు తోడ్పడతాయి.
  2. నేలలో ఉండే జీవుల మనుగడను జీవ ఎరువులు ఎక్కువ చేస్తాయి.
  3. సేంద్రీయ ఎరువులు పంట దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా చేస్తాయి.
  4. నేల యొక్క సహజ సమతౌల్యాన్ని కాపాడతాయి.
  5. కొన్ని పంటలకు వ్యాధులు సోకకుండా నివారిస్తాయి.
  6. పర్యావరణానికి హాని చేయని మిత్రులుగా సేంద్రియ ఎరువులు ఉంటాయి.

పైన పేర్కొన్న సేంద్రియ ఎరువుల యొక్క ఉపయోగాలను రైతుకు స్పష్టంగా వివరించి, వాటినే ఉపయోగించేలా ఆ రైతును ఒప్పిస్తాను.

ప్రశ్న 17.
వెంకటాపురం అనే గ్రామం తీవ్ర వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతం. సోమయ్య తన పొలంలో చెరకును పండించాలనుకుంటున్నాడు. ఇది లాభదాయకమా? కాదా? వివరించండి. (AS 7)
జవాబు:

  1. సోమయ్య తన పొలంలో చెరకును పండించాలనుకోవడం లాభదాయకం కాదు.
  2. ఎక్కువ నీటి లభ్యత కలిగిన ప్రదేశాలలో మాత్రమే చెరకు పండుతుంది.
  3. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రదేశాలలో ఆరుతడి పంటలు పండించడం లాభదాయకం.

ప్రశ్న 18.
“సహజ కీటకనాశన పద్ధతులు జీవ వైవిధ్యానికి దోహదం చేస్తాయి”. వ్యాఖ్యానించండి. (AS 7)
జవాబు:

  1. కొన్ని రకాల కీటకాలు మనకు హాని కలిగించే, నష్టం కలిగించే కీటకాలను అదుపులో ఉంచుతాయి. వీటిని మిత్ర కీటకాలు అంటారు.
    ఉదా : సాలెపురుగు, డ్రాగన్ ప్లే, క్రిసోపా మొదలగునవి.
  2. ట్రైకో డెర్మా బాక్టీరియం కాండం తొలిచే పురుగు గుడ్లలో నివసిస్తుంది.
  3. పొగాకును తినే గొంగళి పురుగు, ధాన్యాన్ని తినే గొంగళిపురుగు వంటి వాటిని గ్రుడ్ల దశలోనే బాక్టీరియాతో నాశనం చేయవచ్చు.
  4. బాసిల్లస్ తురంజనిసిన్ వంటి కొన్ని రకాల బాక్టీరియాలు కీటకాలను నాశనం చేస్తాయి.
  5. కొన్ని రకాల మిశ్రమ పంటలు కీటకాలను, వ్యాధులను అదుపులో ఉంచుతాయి.
  6. అందువలన సహజ కీటక నాశన పద్దతులు జీవ వైవిధ్యానికి దోహదం చేస్తాయి. దీని ద్వారా కేవలం హానికరమైన కీటకాలు మాత్రమే చనిపోతాయి.

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు Textbook InText Questions and Answers

9th Class Biology Textbook Page No. 115

ప్రశ్న 1.
బిందుసేద్యం వంటి నీటి సరఫరా పద్ధతి, పంటలకు, రైతులకు ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించండి.
జవాబు:

  1. నీటి వృథాను అరికట్టడానికి బిందుసేద్యం (Drip Irrigation) అత్యంత ప్రయోజనకరమైన పద్ధతి.
  2. బిందుసేద్యం పద్ధతిలో నీరు చిన్న చిన్న గొట్టాల గుండా సరఫరా అవుతుంది.
  3. ఈ గొట్టాలకు అక్కడక్కడ సన్నటి రంధ్రాలుంటాయి.
  4. ఈ రంధ్రాల గుండా నీరు చుక్కలు చుక్కలుగా పడుతుంది.
  5. ఈ పద్ధతి ద్వారా ఎరువులను వృథా కాకుండా మొక్కలకు అందించవచ్చును.

9th Class Biology Textbook Page No. 115

ప్రశ్న 2.
వాటర్ షెడ్ పథకం భూగర్భజలాలను పెంచడానికి ఎంతగానో తోడ్పడుతుంది. దీనిని నీవు ఎట్లా సమర్థిస్తావు?
జవాబు:

  1. వాటర్ షెడ్ తో పంటలకి కావల్సిన నీళ్ళు ఇవ్వడమే కాకుండా చుట్టూ ఉన్న జంతువులకి, పశువులకి, పక్షులకి నీళ్ళందించవచ్చు.
  2. నేలలో తేమ శాతాన్ని పెంచవచ్చు.
  3. నేలపై మట్టి కొట్టుకుపోకుండా ఆపడానికి కూడా పాటర్ షెడ్ ఉపయోగపడుతుంది.
  4. కొండవాలు ప్రాంతాల్లో, ఎత్తైన గుట్టల్లో పడ్డ వాన నీళ్ళని సద్వినియోగం చేసుకొని, చుట్టూ ఉన్న ఆవాసంలో అన్ని అవసరాలకి నీళ్ళని అందించే ఏకైక మార్గం వాటర్‌షెడ్.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 121

ప్రశ్న 3.
వర్మీ కంపోస్టు ఎరువు రసాయనిక ఎరువుల కంటే ఎలా మేలైనది?
జవాబు:

  1. రసాయనిక ఎరువుల వలన నేలకలుషితం, వాతావరణ కలుషితం జరుగుతుంది.
  2. రసాయనిక ఎరువులు వాడిన ఆహార పదార్థాలు తినడం వలన మానవుల ఆరోగ్యం పాడవుతుంది.
  3. కాని వర్మీ కంపోస్టు వాడడం వలన ఎలాంటి కాలుష్య లేదా ఆరోగ్య సమస్యలు ఏర్పడవు. అందువలన వర్మీ కంపోస్టు ఎరువు రసాయనిక ఎరువులకంటే చాలా మేలైనది.

9th Class Biology Textbook Page No. 109

ప్రశ్న 4.
a) నెలకు ఎంత ధాన్యం మీ ఇంట్లో అవసరం అవుతుందో అంచనా వేయటానికి ప్రయత్నించండి.
జవాబు:
నెలకు మా ఇంట్లో సుమారుగా 50 కి.గ్రా. ధాన్యం ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 600 కి.గ్రా. ధాన్యం అవసరమవుతుంది.

b) ఆ ధాన్యం పండటానికి ఎంత నేల అవసరమో ఊహించంది.
జవాబు:
600 కి.గ్రా. ధాన్యం పండటానికి సుమారు 1.4 చ.కి.మీ. నేల అవసరమవుతుంది.

9th Class Biology Textbook Page No. 109

ప్రశ్న 5.
ఈ క్రింది పట్టికను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 2
a) ఏ దశాబ్దంలో జనాభా పెరుగుదల అధికంగా ఉంది?
జవాబు:
1961-1971 దశాబ్దంలో జనాభా పెరుగుదల అధికంగా ఉంది.

b) ఏ దశాబ్దంలో ఆహారధాన్యాల ఉత్పత్తి అధికంగా ఉంది?
జవాబు:
1981-1991 దశాబ్దంలో ఆహారధాన్యాల ఉత్పత్తి అధికంగా ఉంది.

c) పై పట్టికలో ఏయే తేడాలు మీరు గమనించారు?
జవాబు:
జనాభా పెరుగుదలతో సమానంగా ఆహారధాన్యాల ఉత్పత్తి పెరగటం లేదు.

d) పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి జరుగుతున్నదా?
జవాబు:
లేదు, జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి జరగటం లేదు.

e) ఏ దశాబ్దంలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి సంతృప్తికరంగా లేదు?
జవాబు:
1991-2001 దశాబ్దంలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి జరగలేదు. పెరుగుదల రేటు కేవలం 0.56 మాత్రమే.

f) తగినంత ఆహారధాన్యాల ఉత్పత్తి జరగకపోతే ఏమి జరుగుతుంది?
జవాబు:
తగినంత ఆహారధాన్యాల ఉత్పత్తి జరగకపోతే, దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుంది.

g) 1991-2001 దశాబ్దంలో జనాభాని పోల్చితే సగమే ఆహారధాన్యాల, ఉత్పత్తి జరిగింది. ఫలితంగా ఆ దశాబ్దంలో ఏం జరిగి ఉంటుందని నీవు భావిస్తున్నావు?
జవాబు:
1991-2001 దశాబ్దంలో జనాభా పెరుగుదలకు సమానంగా ఆహారధాన్యాల ఉత్పత్తి జరుగలేదు. దానివలన దేశంలో తీవ్ర కరువు పరిస్థితి నెలకొని ఉండి ఉంటుంది. ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొని ఉంటారు.

9th Class Biology Textbook Page No. 110

ప్రశ్న 6.
ఆహారధాన్యాల ఉత్పత్తిలో పెంపుదలకు మీరిచ్చే సూచనలు రాయండి.
జవాబు:

  1. మంచి నాణ్యమైన వ్యాధి నిరోధకత కలిగిన వంగడాలు పంటకు ఎన్నుకోవాలి.
  2. నీటి వనరుల ఆధారంగా నేల స్వభావం పరిశీలించి సరైన పంటను ఎన్నుకోవాలి.
  3. సహజ ఎరువులకు ప్రాధాన్యమివ్వాలి.
  4. వ్యాధుల నివారణకు సహజ నియంత్రణ పద్ధతులు పాటించాలి.
  5. పంట మార్పిడి, అంతర పంటలకు ప్రాధాన్యమివ్వాలి.
  6. యంత్రాలు, ఆధునిక సాంకేతికతను వాడటం వలన అధిక దిగుబడి సాధించవచ్చు.

9th Class Biology Textbook Page No. 111

ప్రశ్న 7.
అధిక ఆహార ఉత్పత్తి సాధించటానికి కొన్ని పరిష్కార మార్గాలు చూపండి.
జవాబు:

  1. సాగునేల విస్తీర్ణాన్ని పెంచడం.
  2. ప్రస్తుతం సాగులో ఉన్న నేలలోనే అధిక దిగుబడి సాథించడం.
  3. అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేయడం.
  4. పంట మార్పిడి చేయడం.
  5. మిశ్రమ పంటలు పండించడం.
  6. స్వల్పకాలిక పంటలు పండించడం.

ఎ) పై వాటిలో ఏది ప్రయోజనకరమో చర్చించండి.
జవాబు:

  1. సాగునేల విస్తీర్ణాన్ని పెంచటం వలన అడవులను నరికివేయాల్సి వస్తుంది. కావున సరైన చర్యకాదు.
  2. ప్రస్తుతం సాగులో ఉన్న నేలలోనే అధిక దిగుబడి సాధించటం ప్రయోజనకర పద్దతి..
  3. ఈ పద్ధతిలోది, వంగడాల అభివృద్ధి, పంటమార్పిడి, మిశ్రమ పంటలు వంటి అన్ని పద్ధతులూ ఇమిడి ఉంటాయి.

9th Class Biology Textbook Page No. 112

ప్రశ్న 8.
ఈ క్రింది గ్రాఫ్ ను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 3
a) పై గ్రాఫ్ ఆధారంగా పంట దిగుబడిలో నీటిపారుదల ప్రాముఖ్యతను వివరించండి.
జవాబు:

  1. నీటిపారుదల పంటకు అత్యంత అవసరము.
  2. నీటిపారుదల సక్రమంగా ఉన్నప్పుడు పంట దిగుబడి బాగా ఉంది.
  3. సరిపడినంత ఎరువులు అందించినప్పటికి, నీటిపారుదల సక్రమంగా లేకుంటే మంచి దిగుబడి పొందలేము.

b) ఒకే పరిమాణంలో నత్రజని అందించినప్పటికీ నీటిపారుదల కల్పించిన పొలంలో, నీటిపారుదల కల్పించని పొలంలో పంట దిగుబడిలో తేడాలున్నాయా? ఉంటే అవి ఏమిటి?
జవాబు:

  1. తేడాలు ఉన్నాయి. ఒకే పరిమాణంలో నత్రజని అందించినప్పటికీ సరైన నీటిపారుదల ఉన్న పంటలు అధిక దిగుబడిని ఇచ్చాయి.
  2. నీటిపారుదల సక్రమంగా లేని పంటలు, ఎరువులు అందించినప్పటికీ సరైన దిగుబడిని ఇవ్వలేదు.

9th Class Biology Textbook Page No. 113

ప్రశ్న 9.
ఈ క్రింది గ్రాఫ్ ను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 4
a) పై గ్రాఫ్ లో ఏ నెలల్లో మొక్కలు అధిక నీటిని ఆవిరి రూపంలో విడుదల చేస్తున్నాయో గుర్తించండి.
జవాబు:
మే మరియు జూన్ నెలల్లో మొక్కల నుండి నీరు ఆవిరి రూపంలో అధికంగా కోల్పోతున్నాయి.

b) కొన్ని నెలలలో వర్షాలు అధికంగా ఉన్నప్పటికీ మొక్కలు విడుదలచేసే నీటి ఆవిరి పరిమాణం ఒకే విధంగా ఉంటుందా?
జవాబు:
వర్షాలు ఉన్నప్పుడు పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అందువలన మొక్కలు విడుదల చేసే నీటి ఆవిరి పరిమాణం తక్కువగా ఉంటుంది.

c) నీరు అధికంగా లభిస్తే మొక్కలపై నీటి ప్రభావం ఏవిధంగా ఉంటుంది?
జవాబు:

  1. నీరు అధికంగా లభించినపుడు మొక్కలు వేగంగా పెరుగుతాయి.
  2. భూమి నుండి పోషకాలను బాగా గ్రహించగలుగుతాయి.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 114

ప్రశ్న 10.
a) వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పత్ర రంధ్రాలు మూసుకొని పోతాయనుకున్నాం కదా ! మరి ఇది కార్బన్ డై ఆక్సైడ్ శోషణపై ఏ ప్రభావాన్ని చూపుతుంది?
జవాబు:

  1. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పత్ర రంధ్రాలు మూసుకొనిపోతాయి.
  2. అందువలన CO2 శోషణ మొక్కలలో తగ్గుతుంది.

b) కార్బన్ డై ఆక్సైడ్ శోషణ రేటులో మార్పు మొక్కలపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది?
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్ శోషణ రేటు తగ్గటం వలన మొక్కలలో ఆహారోత్పత్తి తగ్గుతుంది. దీనివలన మొక్కల పెరుగుదల తగ్గుతుంది. కొత్త కొమ్మలు, ఆకులు ఏర్పడవు.

c) ఇలాంటి సమయంలో మొక్కలకు నీళ్ళు లేకపోతే ఏమౌతుంది?
జవాబు:
ఇలాంటి సమయంలో మొక్కలకు నీళ్ళు లేకపోతే మొక్కల ఆరోగ్యం పాడైపోతుంది. పంట దిగుబడి తీవ్రంగా తగ్గుతుంది.

9th Class Biology Textbook Page No. 114

ప్రశ్న 11.
వ్యవసాయానికి నీరు ప్రధాన అవసరం. మీ గ్రామంలో వ్యవసాయం కోసం ఉన్న ముఖ్యమైన నీటి వనరులు ఏమున్నాయి? రైతులు వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నారు?
జవాబు:

  1. మా గ్రామంలో వ్యవసాయం కొరకు కాలువలు, చెరువులు ఉన్నాయి.
  2. వర్షపునీరు చెరువును చేరి నిల్వ చేయబడుతుంది.
  3. ఈ నీటిని పంటకాలువల ద్వారా పంట పొలాలకు మళ్ళించి వ్యవసాయం చేస్తారు.
  4. మా గ్రామంలో కొంత ప్రాంతం సాగర్ కాలువ కింద సాగుబడిలో ఉంది.

9th Class Biology Textbook Page No. 114

ప్రశ్న 12.
వరి పండించటానికి అధిక పరిమాణంలో నీరు అవసరం. ఇలా నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటల పేర్లు చెప్పగలరా?
జవాబు:
వరితోపాటుగా గోధుమ, చెరకు వంటి పంటలకు అధిక నీరు అవసరమౌతుంది.

9th Class Biology Textbook Page No. 115

ప్రశ్న 13.
తక్కువ నీరు కావలసిన పంటల పేర్ల జాబితా రాయండి.
జవాబు:
ప్రత్తి, జనపనార, సజ్జలు, మొక్కజొన్న, కొబ్బరి, మినుములు, పెసలు, వేరుశనగలకు తక్కువ నీరు అవసరం.

9th Class Biology Textbook Page No. 116

ప్రశ్న 14.
a) ఒక పొలంలో చాలా సంవత్సరాల పాటు ఒకే పంట సాగుచేస్తూ ఉంటే, నేలలోని పోషకాలు ఏమౌతాయి?
జవాబు:
ఒక పొలంలో చాలా సంవత్సరాల పాటు ఒకే పంట సాగుచేస్తే ఒకే విధమైన పోషకాలు శోషించబడి, నేలలో పోషకాల కొరత ఏర్పడుతుంది. అందువలన పంట దిగుబడి విపరీతంగా తగ్గుతుంది.

b) కోల్పోయిన పోషకపదార్థాలను నేల తిరిగి ఎలా పొందుతుంది?
జవాబు:
నేల కోల్పోయిన పోషకపదార్థాలను వృక్ష, జంతు వ్యర్థాలు కుళ్ళటం వలన హ్యూమస్ రూపంలో తిరిగి పొందుతుంది. కానీ ఇది చాలా నెమ్మదైన ప్రక్రియ. అందువలన రైతులు రసాయన ఎరువులు వాడుతున్నారు. ఇవి ఖర్చుతో కూడుకొని నేల ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.

9th Class Biology Textbook Page No. 116

ప్రశ్న 15.
ఒక రైతు తన పొలంలో గత 5 సంవత్సరాల నుండి చెరకు పంటను పండిస్తున్నాడు. మరో రైతు మొదటి సంవత్సరం చెరకు పంట, రెండవ సంవత్సరం సోయా చిక్కుళ్ళు, మూడవ సంవత్సరం తిరిగి చెరకు పంట పండించాడు. ఏ పొలంలో పోషకపదార్థాలు నశిస్తాయి? ఎందుకు?
జవాబు:
వరుసగా ఐదు సంవత్సరాలు చెరకు పండించిన రైతు పొలంలో పోషకాలు లోపిస్తాయి. చెరకు ఒకే విధమైన పోషకాలను ప్రతి సంవత్సరం నేల నుండి గ్రహిస్తుంది. కావున నేలలో ఆ పోషకాలు తగ్గిపోయి, పోషకాల కొరత ఏర్పడుతుంది.

పంట మార్పిడి పాటించటం వలన నేలలోని పోషకాల వినియోగం మారి, పోషకాలు పునరుద్ధరింపబడతాయి. పంట మార్పిడి విధానంలో లెగ్యూమినేసి పంటలు మంచి ఫలితాలను ఇస్తాయి.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 118

ప్రశ్న 16.
తమలపాకులను మిశ్రమపంటలుగా మాత్రమే పండిస్తారు. ఎందుకు?
జవాబు:

  1. తమలపాకు మొక్క తీగవలె ఉండి ఎత్తు మొక్కలకు అల్లుకొంటుంది.
  2. నేల అంతా ఖాళీగా ఉండుట వలన అంతర పంటకు అనుకూలంగా ఉంటుంది.
  3. అందువలన తమలపాకుతో పాటు పెసర, మినుము వంటి మిశ్రమపంటలు పండిస్తారు.
  4. దీనివలన రైతుకు రెండు పంటలు పండి ఆర్థికలాభం చేకూరుతుంది.
  5. నేలలో పోషకాలు పునరుద్ధరింపబడతాయి.

9th Class Biology Textbook Page No. 118

ప్రశ్న 17.
లెగ్యూమినేసి జాతికి చెందిన పంటల పేర్లు కొన్నింటిని చెప్పండి.
జవాబు:
చిక్కుడు, మినుము, పెసర, వేరుశనగ, పిల్లి పెసర వంటి పంటలు లెగ్యూమినేసి జాతికి చెందుతాయి. ఇవి నేలలో నత్రజనిని స్థాపించి పోషక విలువలను పెంచుతాయి.

9th Class Biology Textbook Page No. 118

ప్రశ్న 18.
నత్రజని స్థాపన చేసే బాక్టీరియాల పేర్లను తెలుసుకోండి.
జవాబు:
రైజోబియం, అజటో బాక్టర్, నైట్రోమోనాస్, సూడోమోనాస్ వంటి బాక్టీరియాలు నత్రజని స్థాపనకు తోడ్పడుతాయి. ఇవి వాతావరణంలోని నత్రజనిని నైట్రేట్లుగా మార్చి మొక్కలకు అందిస్తాయి.

9th Class Biology Textbook Page No. 122

ప్రశ్న 19.
ఈ క్రింది పట్టిక పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాలు రాయంది.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 5

a) పై పట్టిక నుండి మీరు ఏం గ్రహించారు?
జవాబు:
నత్రజని స్థాపనలో బాక్టీరియాతో పాటు, శైవలాలు కూడా పాల్గొంటున్నాయి. మరికొన్ని బాక్టీరియాలు, శైవలాలు, శిలీంధ్రాలు, ఫాస్పరస్ ను మొక్కలకు అందిస్తున్నాయి.

b) ఏ మూలకాలు అధికంగా సంశ్లేషణ చేయబడతాయి?
జవాబు:
నత్రజని నేలలో అధికంగా సంశ్లేషణ చేయబడుతుంది.

9th Class Biology Textbook Page No. 123

ప్రశ్న 20.
ఈ క్రింది పట్టికను పరిశీలించి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 6
a) పై పట్టిక ఆధారంగా చూస్తే మనం 50 కి.గ్రా.ల యూరియాను నేలకు అందిస్తే 23 కి.గ్రా. నత్రజని (466) నేలలోకి పునరుద్ధరింపబడుతుంది. అంతే పరిమాణంలో నత్రజని పొందాలంటే ఎంత అమ్మోనియం సల్ఫేట్ నేలలో కలపాలి?
జవాబు:
అంతే పరిమాణంలో (23 కి.గ్రా. ) నత్రజని పొందాలంటే సుమారు 100 కి.గ్రా. అమ్మోనియం సల్ఫేట్ (యూరియా)ను నేలలో కలపాలి.

b) 50 కి.గ్రా.ల సూపర్ ఫాస్ఫేట్ నేలలో కలిపితే ఎంత ఫాస్పేట్ నేలలోకి చేరుతుంది?
జవాబు:
50 కి.గ్రా. ల సూపర్ ఫాస్ఫేట్ నేలలో కలిపితే, 4 నుండి 4.5 కి.గ్రా. ఫాస్పేట్ నేలలోకి చేరుతుంది.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 123

ప్రశ్న 21.
స్థానిక వరి రకం (బంగారు తీగ) మరియు హైబ్రిడ్ వరి రకం (IR – 3) పై నత్రజని ఎరువులను చల్లడం వల్ల కలిగే ప్రభావాన్ని కింది స్లో చూడండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 7
a) నత్రజని ఎరువుల ప్రభావం బంగారు తీగ మరియు IR- 8 వరి రకాలపై చూపే ప్రభావంలో తేడా ఏమిటి?
జవాబు:

  1. నత్రజని ఎరువుల ప్రభావం, స్థానిక వరి రకం బంగారు తీగపై వ్యతిరేక ప్రభావం చూపింది.
  2. ఎరువు మోతాదు పెరిగేకొలది పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది.
  3. వరి రకం IR – 8 మీద నత్రజని ప్రభావం సానుకూలంగా ఉంది.
  4. నత్రజని ఎరువు మోతాదు పెరిగే కొలది హైబ్రిడ్ రకం IR-8 లో దిగుబడి కూడా పెరుగుతూ వచ్చింది.

9th Class Biology Textbook Page No. 125

ప్రశ్న 22.
మనుషుల ఆరోగ్యంపై క్రిమిసంహారులు, కలుపు నాశకాలు ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయి?
జవాబు:

  1. మనుషుల ఆరోగ్యంపై క్రిమిసంహారులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
  2. క్రిమిసంహారులను పిచికారి చేసే సమయంలో ఊపిరితిత్తులు తీవ్ర విష ప్రభావానికి లోనవుతాయి.
  3. వీటి వలన అనేక చర్మవ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడుతున్నాయి.
  4. కొన్ని హానికర రసాయనాలు నాడీవ్యవస్థను, రక్తప్రసరణ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి.

9th Class Biology Textbook Page No. 126

ప్రశ్న 23.
ఈ మధ్యకాలంలో పొద్దుతిరుగుడు పంటలో రైతులు చేతిగుడ్డతో పుష్పాలను అద్దుతూ పోతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో చెప్పగలరా?
జవాబు:

  1. రైతులు విచక్షణారహితంగా కీటకనాశనులు వాడటం వలన ఉపయోగకర కీటకాలు కూడా మరణించాయి.
  2. అందువలన మొక్కలలో పరాగసంపర్కం జరుగక పంట దిగుబడి తగ్గిపోయింది.
  3. దీనిని అధిగమించటానికి రైతులు పొద్దుతిరుగుడు పంటలలో చేతిగుడ్డతో పుష్పాలను అద్ది కృత్రిమ పరాగసంపర్కం చేయాల్సి వచ్చింది.

9th Class Biology Textbook Page No. 126

ప్రశ్న 24.
పంట పొలంలో కీటక నిర్మూలన గురించి స్నేహితులతో చర్చించండి. ప్రత్యామ్నాయాలు సూచించండి.
జవాబు:

  1. కీటక నిర్మూలన కొరకు కీటక నాశకాలు వాడటం వలన అవి పంట ఉత్పత్తులు, పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
  2. దీనిని అధిగమించటానికి రైతులు సహజ నియంత్రణ పద్ధతులు పాటించాలి.
  3. వెల్లుల్లి రసం, N.P.U ద్రావణం వంటి బయో పెస్టిసైడ్స్ వాడాలి.
  4. వ్యాధి క్రిములను తినే మిత్ర కీటకాలను ప్రోత్సహించాలి.
  5. పంట మార్పిడి విధానం, విత్తనశుద్ధి పద్ధతులలో వ్యాధులను ఎదుర్కొనవచ్చు.
  6. ఆకర్షక పంటలు వేసి కీటకాల తాకిడి తగ్గించవచ్చు.

AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు

9th Class Biology Textbook Page No. 127

ప్రశ్న 25.
పత్తి పొలాలలో జనుము మరియు బంతిపూలను ఎందుకు పండిస్తారో మీరు చెప్పగలరా?
జవాబు:

  1. పత్తి పొలాలలో జనుమును మరియు బంతిపూలను ఆకర్షక పంటగా పండిస్తారు.
  2. ఇవి కీటకాలను సులభంగా ఆకర్షిస్తాయి.
  3. అందువలన ప్రధానపంటలు కీటకాల నుండి రక్షింపబడతాయి.
  4. కీటకాలను ఎదుర్కొనటానికి ఇదొక సహజ నియంత్రణ పద్ధతి.

9th Class Biology 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

1. బాష్పోత్సేకము
1) ఒక పాలిథిన్ సంచిని తీసుకోవాలి.
2) ఆరోగ్యంగా ఉన్న మొక్క ఆకులను సంచిలో కప్పి ఉంచి దారంతో కట్టాలి.
3) 4-5 గంటలపాటు దానిని పరిశీలిస్తూ ఉండాలి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 8

పరిశీలనలు :

  1. ఆకులను పాలిథిన్ సంచితో కప్పి ఉంచినప్పుడు మొక్క ఎంత మొత్తంలో నీటిని నీటి ఆవిరి రూపంలో గాలిలోనికి విడుదల చేస్తుందో చూడవచ్చు.
  2. పిండి పదార్థాలను తయారుచేయడానికి మొక్క తాను పీల్చుకున్న నీటిలో 0.1 శాతం నీటిని మాత్రమే వినియోగించుకుంటుంది.
  3. బాష్పోత్సేకము రేటు రాత్రి కంటే పగలు ఎక్కువగా ఉంటుంది.

కృత్యం – 2

2. a) మీ గ్రామ చిత్రపటాన్ని గీసి, గ్రామంలోని ముఖ్యమైన నీటి వనరులను గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 9

b) ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల పటంలో నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువ మార్గాలను చూపండి. ఏ ఏ జిల్లాలకు నీటి వసతి లభిస్తుందో గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 10

కృత్యం – 3

3. మీ ప్రాంతంలో పంట పొలాల్లో కల్పించే ప్రముఖమైన కలుపు మొక్కల జాబితా తయారుచేయండి. అవి ఏ పంటతో పాటు పెరుగుతాయో రాయండి.
జవాబు:
కలుపు మొక్కల జాబితా :
సైనోడాన్ డాక్టలాన్, సైపరస్ రొటండస్ (తుంగ), డిజిటారియా లాంగిఫోలిమా, డాక్టలోనియమ్ కలోనమ్, సెటేరియా గ్లూకా, సైపరస్ డిఫార్మిస్, ఐకోర్నియా క్రాసిప్స్ (బుడగతమ్మ), సాల్వీనియా మొలస్టా, ఆల్టర్ నాంతిర సెసైలిస్ (పొన్నగంటి), సెలోషియా అర్జెన్షియా (గురంగుర), లూకాస్ ఏస్పిరా (తుమ్మి), పోర్చులేక ఒలరేషియా (పావలికూర), క్లియోమి విస్కోసా (కుక్కవామింటా), సొలానమ్ నైగ్రమ్ (బ్లాక్ నైట్ షేడ్), అర్జిమోన్ మెక్సికానా (బాలరక్కొస) ఎబుటిలాన్ ఇండికమ్ (తుత్తురి బెండ), యూఫోర్బియా హిరా (పచ్చబొట్లు), వెర్నోనియా సిన్నోరా, ఇఖనోక్లోవ కొలానమ్ (ఉడలు), కొమ్మలైనా బెంగా లెన్సిస్ (వెన్నవెదురు), అవినా ఫాట్యువ (అడవియవలు), ఇఖనోక్లోవ క్రస్ గల్లి (నీటి గడ్డి), ఎల్యుసైన్ ఇండికా (గూ గ్రాస్), ఎకిరాంథిస్ ఏస్పిరా (ఉత్తరేణి), ఇక్లిష్టా ప్రోస్టేట (గుంటకలగర లేదా బృంగరాజ) మొదలగునవి.

పంట రకం పంటపై పెరిగే కలుపు మొక్కలు
వరి గరిక, తుంగ, బుడగ తమ్మ, పొన్నగంటి
వేరుశనగ గురంగుర, గరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, కుక్కవామింట, తుమ్మి, పావలికూర, బాలరక్కిస.
మినుములు గరిక, తుంగ, తుత్తురి బెండ, వెన్న వెదురు, సాల్వీనియా మొలస్టా, పచ్చబొట్లు, బంగారు తీగ.
మొక్కజొన్న పచ్చబొట్లు, సొలానమ్ నైగ్రమ్, గరిక, తుంగ
పెసలు ఉడలు, గరిక, తుంగ, బాలరక్కొస, పావలికూర

ప్రయోగ కృత్యములు.

ప్రయోగశాల కృత్యము – 1

1. 1) తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు పండ్లలో ప్రతిదానికి ఉదాహరణ తీసుకోండి.
2) ముందుగా వాటిలో ఉన్న లక్షణాలను రాయండి.
3) ఆ పంటలలో ఏ మార్పులు మీరు కోరుకుంటున్నారో రాయండి. మీరు కోరుకుంటున్న మార్పులకు తగిన కారణాలు రాయండి.
AP Board 9th Class Biology Solutions 8th Lesson వ్యవసాయోత్పత్తుల పెంపుదల – మన ముందున్న సవాళ్లు 11

2. సొంత హైబ్రిడ్ పుష్పాలను ఉత్పత్తి చేయటం:
జవాబు:

  1. 5 లేక 6 ఎరుపు రంగు పుష్పాల (చంద్రకాంత) మొక్కలను ఎంపిక చేసుకోవాలి.
  2. మిగిలిన పుష్పాలన్నింటిని తెంచివేయాలి.
  3. ప్రతి పుష్పానికి ఉండే కేసరావళిని తొలగించాలి.
  4. పసుపు రంగు పుష్పాన్ని తీసుకొని, ఎరుపురంగు పుష్పంలో ఉండే కీలాగ్రంపై రుద్ది పరాగ సంపర్కం జరపాలి. (సాయంత్రం వేళల్లో చేయాలి)
  5. సంకరణం చేసిన మొక్కలను గుర్తించడానికి ఆ పుష్పాలుండే కాండాలకు తాడు కాని, దారం కాని గుర్తుగా కట్టాలి. ఎందుకంటే కొద్ది రోజుల్లో ఆ పుష్పాల నుండి ఏర్పడే గింజలను సేకరించాల్సి ఉంటుంది.
  6. ఒక వారం రోజుల్లో నల్లని విత్తనాలు ఏర్పడతాయి.
  7. విత్తనాలను రెండు వారాలపాటు ఎండనిచ్చి వేరొక కుండలో నింపాలి.
  8. కొత్త మొక్క పెరిగి పుష్పించే వరకు జాగ్రత్తగా సంరక్షించాలి.
  9. ఆ మొక్క నుండి ఏర్పడే పుష్పాలను పరిశీలించాలి.

పరిశీలనలు :
మొక్క నుండి ఏర్పడే పుష్పాలు నారింజ రంగులో ఉంటాయి. ఎరుపు మరియు పసుపు రంగు పుష్పాల కలయికతో నారింజ రంగు పుష్పాలు ఏర్పడతాయి.

AP Board 9th Class Biology Solutions 7th Lesson జంతువులలో ప్రవర్తన

AP Board 9th Class Biology Solutions 7th Lesson జంతువులలో ప్రవర్తన

SCERT AP 9th Class Biology Study Material Pdf Download 7th Lesson జంతువులలో ప్రవర్తన Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 7th Lesson Questions and Answers జంతువులలో ప్రవర్తన

9th Class Biology 7th Lesson జంతువులలో ప్రవర్తన Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
ప్రతిచర్య ఉపయోగం ఏమిటి? (AS 1)
ఎ) ఇది నేర్చుకోవలసి ఉంటుంది
బి) ప్రతిసారి వేరువేరుగా జరుగుతుంది
సి) ఇది నేర్చుకోవలసిన అవసరం లేదు
డి) ఏదీ కాదు
జవాబు:
సి) ఇది నేర్చుకోవలసిన అవసరం లేదు

ప్రశ్న 2.
బోనులో ఉన్న ఎలుకను బోనులోని ప్రత్యేక భాగానికి వెళ్ళినప్పుడు తక్కువ విద్యుత్ సరఫరా చేసి షాక్ కు గురిచేసిన, అది ఆ భాగము వైపు వెళ్ళడం మానివేస్తుంది. ఇది …. (AS 1)
ఎ) సహజాత ప్రవృత్తి బి) నిబంధన సి) అనుకరణ డి) ముద్రవేయడం
జవాబు:
బి) నిబంధన

ప్రశ్న 3.
భేదాలు తెలపండి.
ఎ) అనుకరణ మరియు అనుసరణ బి) సహజాత ప్రవృత్తి మరియు నిబంధన. (AS 1)
ఎ) అనుకరణ మరియు అనుసరణ
జవాబు:

అనుకరణ అనుసరణ
1) మనుష్యులు, జంతువులయందు అనుకరణను చూస్తాము. 1) జంతువులలో మాత్రం అనుసరణను చూస్తాము.
2) అనుకరణలో ఒక జంతువు లేదా మానవుడు మరొక జంతువు లేదా మానవుని ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. 2) అనుసరణ ద్వారా కోడి పిల్లలు, బాతు పిల్లలు చిన్నతనంలోనే తల్లిని గుర్తిస్తాయి.
3) కోప్లెర్ అనే శాస్త్రవేత్త చింపాంజీలలో గల అనుకరణ శక్తిమీద ప్రయోగాలు చేశాడు. 3) కోనార్డ్ లోరెంజ్ తెల్ల బాతులను స్వయంగా పెంచి అనుసరణను అధ్యయనం చేశాడు.

బి) సహజాత ప్రవృత్తి మరియు నిబంధన

సహజాత ప్రవృత్తి నిబంధన
1) ఇది పుట్టుకతో వచ్చే ప్రవర్తన. 1) ఇది పుట్టుకతో వచ్చే ప్రవర్తన కాదు.
2) ప్రత్యేకంగా నేర్చుకోవలసిన అవసరం లేదు. 2) ఇది నేర్చుకోవలసిన ప్రవర్తన.
3) పక్షులు గూడు కట్టుకోవడం, సంతానోత్పత్తికోసం భిన్న లింగజీవిని ఎంచుకోవడం ఉదాహరణలు. 3) పెద్దవాళ్ళు రాగానే గౌరవంగా లేచి నిలబడడం, పలుపుతాడు విప్పదీయగానే ఎద్దు అరక దగ్గరకు పోవడం నిబంధనకు ఉదాహరణలు.

AP Board 9th Class Biology Solutions 7th Lesson జంతువులలో ప్రవర్తన

ప్రశ్న 4.
మనుషుల ప్రవర్తన జంతువుల ప్రవర్తన కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? ఒక ఉదాహరణతో వివరించండి. (AS 1)
జవాబు:

  1. మానవులు కూడా ఇతరత్రా జంతువుల వలె ప్రవర్తనను కలిగి ఉంటారు.
  2. కానీ మానవుల ప్రవర్తన ఇతర జంతువుల కన్నా సంక్లిష్టంగా ఉంటుంది.
  3. ఎందుకంటే మానవులు ఇతర జంతువుల కన్నా తెలివైనవారు, ఆలోచించగల శక్తి కలిగినవారు.
  4. మానవులకు వాళ్ళ గురించి వాళ్ళకు బాగా తెలుసు.
  5. ఉదాహరణకి బాగా ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే భోజనం చేయాలనిపిస్తుంది. కానీ మర్యాద కోసం అందరూ కూర్చున్న తరువాతే భోజనం చేయడం మొదలు పెడతాం.
  6. కానీ జంతువులు తమకు ఆహారం దొరకగానే వెంటనే తింటాయి.

ప్రశ్న 5.
వరుసగా వెళ్తున్న చీమలను గమనించండి. కొన్నిసార్లు రెండు చీమలు మాట్లాడుకున్నట్లు మీకు అనిపిస్తుంది కదా ! మీ ఉపాధ్యాయున్ని అడిగి చీమలు ఎలా భావప్రసారం చేసుకుంటాయో మీ నోట్‌బుక్ లో రాయండి. (AS 3)
జవాబు:

  1. చీమలు వెదకులాడడం లేదా సమాచారం అందించడం అనేవి అవి విడుదల చేసే ఫెర్మెనుల వలన జరుగుతుంది.
  2. చీమలు రసాయన సంకేతాలయిన ఫెర్మెనులను స్పర్శకాలతో గుర్తించడం ద్వారా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. స్పర్శకాలను వాసనలు గ్రహించడానికి ఉపయోగిస్తాయి.
  3. ఒక జత స్పర్శకాలు చీమలకు అవి ఎటువైపు వెళ్ళాలి, వాసన తీవ్రత గురించిన సమాచారాన్ని అందిస్తాయి.
  4. చీమలు నేలమీద జీవిస్తాయి కనుక ఫెర్సె నులను విడుదల చేయుట ద్వారా మిగతా చీమలు దానిని అనుసరిస్తాయి.
  5. కొన్ని చీమలు వాటి యొక్క హనువులు (మాండిబుల్స్) ద్వారా శబ్దములను ఉత్పత్తి చేస్తాయి.
  6. శబ్దములను సమూహమునందలి ఇతర చీమలతో భావ ప్రసారానికి వినియోగిస్తాయి.
  7. ప్రమాదము ఉందనే విషయాన్ని మరియు ఆహారం ఉన్న ప్రదేశమును చీమలు ఫెర్మెనుల ఉత్పత్తి ద్వారా తెలుసుకుంటాయి.

ప్రశ్న 6.
నాగమ్మ తన వద్ద ఉన్న బాతుగుడ్లను, కోడిగుడ్లతో కలిపి పొదగేసింది. పొదిగిన తరువాత బాతు పిల్లలు కూడా కోడినే తమ తల్లిగా భావించాయి. దాని వెంటే తిరుగుతున్నాయి. దీనిని ఎలా వివరిస్తావు? (AS 3)
జవాబు:

  1. బాతు పిల్లలు, కోడి పిల్లలు గుడ్ల నుండి బయటకు వచ్చిన వెంటనే నడవగలుగుతాయి.
  2. బాతు పిల్లలు గుడ్ల నుండి బయటకు వచ్చిన వెంటనే కదులుతున్నది ఏదైనా కనిపిస్తే దాని వెనకే పోతాయి.
  3. బాతు పిల్లలు ఆ జీవితో గడుపుతూ దానినే తల్లిగా భావిస్తాయి.
  4. అనుసరణ అనే లక్షణం వలన బాతుపిల్లలు చిన్న వయసులోనే ఆ బాతుని తమ తల్లిగా భావించాయి.

ప్రశ్న 7.
“జంతువుల ప్రవర్తనను అర్థం చేసుకోవడం వలన జంతువుల పట్ల సానుకూల దృక్పథం జనిస్తుంది” దీనిని నీవు ఎలా సమరిస్తావు? సరియైన ఉదాహరణలతో వివరించండి. (AS 6)
జవాబు:

  1. జంతువులు వివిధ సందర్భాలలో ప్రదర్శించే ప్రవర్తనను అర్థం చేసుకోవడం వలన వాటిపట్ల సానుకూల దృక్పథం జనిస్తుంది. దీనిని నేను సమర్థిస్తాను.
  2. జంతువులు వాటి అవసరాలకు అనుగుణంగా అరవడం, ఘీంకరించడం చేస్తాయి. వివిధ రకాల హావ భావాలను ప్రదర్శిస్తాయి.
  3. ఉదాహరణకు పశువులు అరుస్తాయి. ఆ అరుపు పాటికి అవసరమైన నీరు, ఆహారం గురించి అయి ఉంటుంది.
  4. వాటికి కావలసిన నీరు, ఆహారం ఇచ్చిన తరువాత అవి ప్రశాంతంగా ఉంటాయి.
  5. కాకి చనిపోతే మిగిలిన కాకులు అన్నీ గుమిగూడి అరిచే అరుపులను మనము అవి వ్యక్తపరచే బాధగా గుర్తించాలి.
  6. చీమలు అన్నీ ఆహార సేకరణ కోసం బారులు తీరినప్పుడు మనం వాటిలో ఉన్న సమైక్య శక్తిని, సహకార స్వభావాన్ని గుర్తించాలి.
  7. కుక్కలు రాత్రి సమయములో మొరుగునప్పుడు అవి మనకు దొంగలు రాకుండా సహాయం చేస్తున్నాయని భావించాలి. కాని మనకు నిద్రాభంగం చేస్తున్నాయని భావించకూడదు.
  8. మనకు తోడూ నీడగా ఉండే జంతువుల యొక్క ప్రవర్తన పట్ల సానుభూతి దృక్పథం కలిగి వాటి యొక్క అవసరాలను తీర్చాలి. ‘నీవు జీవించు, జీవించనివ్వు’ అనే సూత్రాన్ని మనం పాటించాలి.

ప్రశ్న 8.
పాఠ్యాంశములో చర్చించిన అనేక రకాల జంతువుల ప్రవర్తనలను ఉదాహరణలతో వివరించండి. (AS 7)
(లేదా)
జంతువులలో సాధారణంగా ఏయే రకాలైన ప్రవర్తనలను గమనించవచ్చు ? వీటిని గూర్చి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
జంతువుల ప్రవర్తనలు నాలుగు రకములు. అవి :

  1. సహజాత ప్రవృత్తి
  2. అనుసరణ
  3. నిబంధన
  4. అనుకరణ.

1) సహజాత ప్రవృత్తి :
పుట్టుకతో వచ్చే ప్రవర్తనలను సహజాత ప్రవృత్తి లేదా సహజాత లక్షణాలు అంటారు. వీటిని నేర్చుకోవలసిన అవసరం ఉండదు. ఇవి జటిలమైనవిగా ఉంటాయి.
ఉదా : పక్షులు గూడు కట్టుకోవడం, సంతానోత్పత్తి కోసం భిన్న లింగజీవిని ఎంచుకోవడం, రక్షణ కోసం సమూహాలు ఏర్పాటు చేసుకోవడం.

2) అనుసరణ :
కోళ్ళు, బాతులు గుడ్లు పొదిగి బయటకు వచ్చిన వెంటనే నడవగలుగుతాయి. పిల్లలు వాటి తల్లిని పోల్చుకోగలుగుతాయి. ఈ లక్షణాన్ని అనుసరణ అంటారు. అనుసరణ అనే లక్షణం వలన కోడి, బాతు పిల్లలు తమ తల్లిని గుర్తించి, అనుసరించి ఆహారాన్ని, రక్షణను పొందుతాయి.

3) నిబంధన :
సహజంగా కాకుండా కృత్రిమంగా ఒక ఉద్దీపనకు ప్రతి చర్య చూపే ఒక రకమైన ప్రవర్తన నిబంధన. ఇది నేర్చుకోవలసినది. పుట్టుకతో రాని ప్రవర్తన.

ఉదాహరణకి, విద్యుత్ సరఫరా అవుతున్న కంచెలు కట్టి ఉన్న పొలంలో జంతువులను మేత మేయడానికి లోపలికి విడిచిపెట్టారు. గొర్రెలు కంచె వైపునకు పోగానే వాటికి చిన్నపాటి విద్యుత్ ఘాతం తగిలింది. అది అలవాటైన తరువాత విద్యుత్ సరఫరా ఆపివేసినా కూడా ఆ జంతువులు అటువైపు పోకపోవడం నిబంధన.

4) అనుకరణ:

  1. ఒక జంతువు యొక్క ప్రవర్తన వేరొక జంతువు ప్రదర్శిస్తే లేదా కాపీ చేస్తే అలాంటి ప్రవర్తనను ‘అనుకరణ’ అంటారు.
  2. ఉదాహరణకు కోఫ్టర్ అనే శాస్త్రవేత్త చింపాంజీలలో గల అనుకరణ శక్తి మీద ప్రయోగాలు చేశాడు.
  3. ఒక చింపాంజీ చెట్టుకు ఉన్న పండు కోయడానికి ప్రయత్నించింది. అది అందలేదు. కర్రపుల్లలు ఉపయోగించి పండు కోసింది. పుల్లతో గుచ్చి పండ్లను తినసాగింది.
  4. మిగతా చింపాంజీలు కూడా అలానే చేస్తాయి. ఈ విధంగా చింపాంజీలు కొత్త మెలకువలు నేర్చుకుంటాయి.

AP Board 9th Class Biology Solutions 7th Lesson జంతువులలో ప్రవర్తన

ప్రశ్న 9.
ఈ చిత్రం చూడండి. జంతువులు పిల్లల్ని ఎలా సంరక్షించుకుంటున్నాయి. ఇది వీటి సహజ లక్షణం. దీని గురించి నీ భావన ఏమిటి? ఇటువంటి దృశ్యాలను మీ పరిసరాలలో గమనించావా? నీ సొంత మాటల్లో వర్ణించండి. (AS 7)
AP Board 9th Class Biology Solutions 7th Lesson జంతువులలో ప్రవర్తన 1
జవాబు:

  1. జంతువులు పిల్లల్ని సంరక్షించడం అనేది వాటి సహజ లక్షణం. ప్రతి జంతువు తన పిల్లలను తమ కాళ్ళ మీద అవి నిలబడేవరకు రక్షించి కాపాడుతుంది.
  2. ఇటువంటి దృశ్యాలను మా పరిసరాలలో గమనించాను.
  3. గుడ్ల నుండి బయటకు వచ్చిన కోడి పిల్లలను కోడి తన వెంట తిప్పుకుంటూ ఆహారాన్ని సంపాదించి ఇస్తుంది.
  4. కోడి పిల్లలకు ఆపద ఎదురైనప్పుడు కోడి తన రెక్కల క్రింద దాచి రక్షణ కలుగచేస్తుంది.
  5. తన పిల్లలను గ్రద్ద తన్నుకుపోవడానికి ప్రయత్నించినపుడు తను వాటి వెంటపడి తరుముతుంది.
  6. కోడి తన పిల్లలు తమ కాళ్ళమీద నిలబడి ఆహారం సంపాదించేవరకు తన పిల్లలను సంరక్షిస్తుంది.
  7. పుట్టిన 10 నుండి 12 రోజులవరకు కళ్ళు కనపడని తన పిల్లలకు పిల్లి పాలు తాగటాన్ని అలవాటు చేస్తుంది.
  8. పిల్లి తన పిల్లలను శత్రువుల బారి నుండి రక్షణ కల్పించడానికి తరచూ వాటిని ఉంచే ప్రదేశాన్ని మారుస్తుంది.

9th Class Biology 7th Lesson జంతువులలో ప్రవర్తన Textbook Activities (కృత్యములు)

ప్రయోగశాల కృత్యము

ప్రశ్న 1.
బొద్దింక ప్రవర్తన అధ్యయనం : దీని కోసం ఒక పరిశోధన పెట్టి, కాల్షియం క్లోరైడ్ కావాలి.
పరిశోధన పెట్టె తయారీ సోపానాలు :
AP Board 9th Class Biology Solutions 7th Lesson జంతువులలో ప్రవర్తన 2

  1. ఒక చతురస్రాకారపు పెట్టె తీసుకొని దానిని కార్డుబోర్డు సహాయంతో 4 గదులుగా విభజించాలి.
  2. రెండు గదులకు చిన్న రంధ్రాలు చేయాలి. వీటి ద్వారా కాంతి ఉన్న భాగం ఉన్న భాగం ప్రసరించేలా చేయాలి.
  3. మిగతా రెండు గదులలో చీకటిని అలానే ఉండనీయాలి.
  4. వెలుగు ఉన్న ఒక గదిలో, చీకటి ఉన్న ఒక గదిలో దూదిని తడిపి తడి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి.
  5. వెలుగు ఉన్న ఒక గదిలో, చీకటి ఉన్న ఒక గదిలో కొంచెం కాల్సియం క్లోరైడును ఉంచి పొడి వాతావరణాన్ని ఏర్పాటుచేయాలి.
  6. నాలుగు గదులలో వేరువేరు స్థితులు ఉన్నాయి. అవి వెలుగు మరియు పొడి, వెలుగు మరియు తడి, చీకటి మరియు పొడి, చీకటి మరియు తడి.
  7. తరగతి విద్యార్థులను 4 జట్లుగా చేయాలి. ఒక్కొక్క జట్టు కొన్ని బొద్దింకలను వారికిష్టమైన వేరువేరు స్థితులున్న గదిలో ఉంచాలి.
  8. పెట్టి పై భాగంలో మూతతో కప్పి ఉంచాలి. మొత్తం అమరికను 15-20 నిమిషాలు వదలివేయాలి.
  9. తరువాత ప్రతి గదిలో ఉన్న బొద్దింకలను లెక్కించాలి.

బొద్దింక ప్రవర్తన – నివసించే పరిస్థితులు – పరిశీలన :
బొద్దింకలు ఎల్లప్పుడూ చీకటి మరియు తడి ప్రదేశాన్ని ఎంచుకుంటాయి. అందుచేతనే తడి మరియు చీకటి అరలో ఎక్కువ లేదా మొత్తం బొద్దింకలు చేరతాయి.

కృత్యం – 1

ప్రశ్న 2.
కింద పేర్కొనిన జంతువులలో వివిధ రకాల ప్రవర్తనలు పరిశీలించండి. అది సహజాత ప్రవృత్తి, అనుసరణ, నిబంధన అనుకరణ దేనికి చెందుతుందో గుర్తించండి.
– మన పెంపుడు కుక్క కొత్త వారిని చూస్తే మొరుగుతుంది, మీరు మీ కుక్కలను వంటగదిలోకి రాకుండా అలవాటు చేస్తే అవి ఎప్పటికైనా వంటింటిలోకి వస్తాయా?
జవాబు:
నిబంధన

డబ్బాలో పెట్టిన స్వీట్ ను చేరుకోవడానికి చీమలు వరుసలో వెళ్తాయి. చీమలకు డబ్బా దగ్గరకు చేరుకోవడానికి దారి ఎలా తెలుసు?
జవాబు:
నిబంధన.

రాత్రి మాత్రమే దోమలు, బొద్దింకలు తమ స్థానాలలో నుండి బయటకు వస్తాయి. వెలుతురుకు, చీకటికి తేడా వాటికి ఎలా తెలుస్తుంది?
జవాబు:
సహజాత ప్రవృత్తి

కేవలం రాత్రివేళల్లో మాత్రమే గుడ్లగూబ తిరుగుతుంది. ఆహారం వెతుకుతుంది. వాటికి రాత్రి, పగలుకు తేడా ఎలా తెలుస్తుంది?
జవాబు:
సహజాత ప్రవృత్తి

ఎద్దు మెడకి ఉన్న తాడు తీయగానే ఏ సూచనలు చేయనప్పటికీ అరక దున్నే సమయం కాగానే అరక దగ్గరికి వెళ్తుంది. నీరు తాగే సమయం కాగానే తొట్టివైపు వెళ్తుంది. ఎద్దులు ఎలా ఇట్లా ప్రతిస్పందిస్తాయి?
జవాబు:
నిబంధన

పక్షులు గూడు అల్లడానికి బలంగా ఉన్న మెత్తటి పదార్థాన్ని సేకరిస్తాయి. సేకరించే పదార్థము యొక్క నాణ్యత వాటికి ఎలా తెలుసు?
జవాబు:
సహజాత ప్రవృత్తి

కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు గుడ్డముక్కను చూడగానే ఒకదానితో ఒకటి పోట్లాడి దానిని చింపుతాయి.
జవాబు:
అనుకరణ

కొన్ని ప్రత్యేక కాలాల్లో కొన్ని పక్షులు చాలా దూరం నుండి మన చుట్టుప్రక్కల ప్రాంతాలకు వలస వస్తాయి. వాటికి ఇక్కడికి రావడానికి దారి ఎలా తెలుసు?
జవాబు:
సహజాత ప్రవృత్తి

AP Board 9th Class Biology Solutions 7th Lesson జంతువులలో ప్రవర్తన

కృత్యం – 2

ప్రశ్న 3.
మీ పరిసరాలలో ఏదేని ఒక జంతువును ఎన్నుకొని అది కింద ఇవ్వబడిన పరిస్థితులలో ఎలా ప్రవర్తిస్తుందో పరిశీలించండి.
1) జంతువు పేరు : కాకి

2) అది నివసించే ప్రదేశం :
ఎత్తైన చెట్లపై గూడు నిర్మించుకుంటుంది.

3) అది నివాసాన్ని ఎలా కట్టుకుంది :
సాధారణంగా చెట్ల యొక్క కొమ్మలు, ఆకులు, మాస్ మొక్కలు, గడ్డి పరకలతో నివాసాన్ని కడుతుంది.

4) ఆహార సేకరణ :
ఎ) కాకి నివసించే ప్రదేశం చుట్టుప్రక్కల కొద్ది దూరం ప్రయాణించి ఆహారాన్ని సేకరిస్తుంది.
బి) కాకి సర్వభక్షకం, దాదాపు అన్ని రకాల ఆహార పదార్థాలను తింటుంది.

5) బాహ్య లక్షణాలు :
ఎ) కాకులు సాధారణంగా నలుపు రంగులో ఉంటాయి.
బి) కొన్నిసార్లు తెల్లని లేదా ఊదారంగు ఈకలు శరీరంపై అక్కడక్కడ ఉంటాయి.

6) భావ వ్యక్తీకరణలు (సంతోషం, విచారం, భయం, ప్రాణభీతి, కోట్లాట, స్వీయరక్షణ / పిల్లల సంరక్షణ) :
ఎ) కాకులు సాధారణంగా రకరకాల కంఠ ధ్వనులను పలుకుతాయి.
బి) చుట్టుప్రక్కల జరిగే వివిధ రకాల ప్రేరణలకు అనుగుణంగా కాకులు శబ్దములను చేస్తాయి. వెళ్ళునప్పుడు, వచ్చేటప్పుడు కాకులు అరిచే సంజ్ఞలలో తేడా ఉంటుంది.
సి) కాకులు సంతోషము, విచారము, భయం, ప్రాణభీతి సమయములందు ‘కావ్ కావ్’ అను ధ్వనులను వ్యక్తపరుస్తాయి.

7) జట్టుతో దాని ప్రవర్తన :
ఎ) ఒక కాకికి ఆహారం దొరికితే ఇతర కాకులను అరుస్తూ పిలుస్తుంది.
బి) ఒక కాకి చనిపోతే మిగిలినవన్నీ గుమిగూడి అరుపుల ద్వారా తమ బాధను వ్యక్తపరుస్తాయి.

AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు

AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు

SCERT AP 9th Class Biology Guide Pdf Download 6th Lesson జ్ఞానేంద్రియాలు Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 6th Lesson Questions and Answers జ్ఞానేంద్రియాలు

9th Class Biology 6th Lesson జ్ఞానేంద్రియాలు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కారణాలను ఇవ్వండి.
అ) సాధారణంగా మనం తక్కువ కాంతిలో (చిరుకాంతిలో) కాంతివంతమైన రంగుల్ని చూడలేము. (AS 1)
జవాబు:

  1. నేత్రపటలంలో దండాలు, శంకువులు అనే కణాలుంటాయి.
  2. మన కంటిలో రొడాప్సిన్ అనే వర్ణద్రవ్యాన్ని కలిగిన దండాలు సుమారుగా 125 మిలియన్లు ఉన్నాయి.
  3. దండాలు అతి తక్కువ కాంతిలో అంటే చీకటిలో వస్తువులను చూడగలవు.
  4. కానీ వివిధ రంగులకు సంబంధించిన నిశితమైన తేడాలను మాత్రం దండాలు గుర్తించలేవు.

ఆ) మరీ తరచుగా చెవిలో గులిమి (మైనం)ను తొలగించడం అన్నది చెవి వ్యాధులకు దారి తీయవచ్చు.
జవాబు:

  1. వెలుపలి చెవినందు మైనంను ఉత్పత్తిచేయు సెరుమినస్ గ్రంథులు మరియు నూనె ఉత్పత్తి చేయు తైలగ్రంథులు ఉన్నాయి.
  2. ఇవి శ్రవణకుల్యను మృదువుగా ఉంచడానికి, మురికి మరియు ఇతర బాహ్య పదార్థములను శ్రవణకుల్యలోనికి ప్రవేశించడాన్ని నిరోధిస్తాయి.
  3. తరచుగా చెవిలో గులిమిని తొలగిస్తే బ్యా క్టీరియా, ఫంగస్ వల్ల చీము, కర్ణభేరికి ఇన్ఫెక్షన్ సాధారణంగా వస్తాయి.
  4. అందువలన గులిమిని తరచుగా తొలగించకూడదు.

ఇ) బాగా దగ్గు, జలుబు ఉన్నప్పుడు మనకు ఆహారం రుచి తెలియదు.
జవాబు:

  1. మనకు జలుబుగా ఉన్నప్పుడు నోటికి ఆహారం రుచి తెలియకపోవడానికి కారణం నాసికాకుహరం పూడుకున్నట్లు ఉండటం.
  2. తద్వారా ఆహారంలోని మధురమైన సువాసనను ముక్కు గ్రహించదు. అందువలన ఆహారం రుచి తెలియదు.

ఈ) ఉల్లిగడ్డలు కోస్తున్నప్పుడు మన కళ్ళ నుండి నీరు కారుతుంది.
జవాబు:

  1. ఉల్లిగడ్డనందలి కణములు అమైనో ఆమ్లాలను, సల్ఫోనిక్ ఆమ్లమును ఏర్పరచే సల్ఫాక్సెడ్ను కలిగి ఉంటాయి.
  2. ఇవి రెండు ఉల్లిగడ్డ కణమునందు వేరుగా ఉంచబడతాయి.
  3. మనము ఉల్లిగడ్డను కోసినపుడు వేరుగా ఉంచబడిన అమైనో ఆమ్లములు, సల్ఫాక్సైడ్ లు కలసి ప్రొపనిధియోల్ సల్ఫర్ ఆక్సైడ్ ను ఏర్పాటు చేస్తాయి.
  4. ప్రొపనిధియోల్ సల్ఫర్ ఆక్సెడ్ ఆవిరి అయి మన కళ్ళవైపు ప్రయాణిస్తుంది.
  5. ఇది మన కంటినందలి నీటితో చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లమును ఏర్పరచును.
  6. కంటినందు. సల్ఫ్యూరిక్ ఆమ్లము వలన కళ్ళు మండుతాయి. దీనివలన అశ్రుగ్రంథులు నీటిని స్రవిస్తాయి.
  7. అందువలన ఉల్లిగడ్డను మనము కోసిన ప్రతిసారి మన కళ్ళు నీటితో నిండుతాయి.

ప్రశ్న 2.
తప్పైన వాక్యాన్ని గుర్తించి, దాన్ని సరిచేసి వ్రాయండి. (AS 1)
అ) నేత్రపటలం మీద ప్రతిబింబం పడడమన్నదే “చూడడం”కు వెనుక ఉన్న నియమం లేక సూత్రం.
ఆ) చెవులు వినడానికి మాత్రమే పనికొస్తాయి.
ఇ) కంటిపాప నమూనాలు, వేలిముద్రల మాదిరిగానే వ్యక్తుల్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి.
ఈ) రుచిని కనుగొనడం (జిహ్వజ్ఞానం)లో లాలాజలం రుచికణికలకు సహాయపడుతుంది.
ఉ) మనం ఇంద్రియ జ్ఞానాలకు తగిన అనుకూలనాలు కలిగిలేము.
అ) నేత్రపటలం మీద ప్రతిబింబం పడడమన్నదే “చూడడం”కు వెనుక ఉన్న నియమం లేక సూత్రం.
జవాబు:
ఈ వాక్యము సరియైనదే. కెమెరా మాదిరిగానే కన్ను కాంతిని సేకరించి, కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి కంటిలో వెనుక భాగాన ఉండే నేత్రపటలంపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.

ఆ) చెవులు వినడానికి మాత్రమే పనికొస్తాయి.
జవాబు:
ఈ వాక్యము సరియైనది కాదు. ఎందుకంటే చెవులు వినడంతో బాటు మన శరీరం యొక్క సమతాస్థితిని సక్రమంగా ఉంచడానికి చెవులు ఉపయోగపడతాయి.

ఇ) కంటిపాప నమూనాలు, వేలిముద్రల మాదిరిగానే వ్యక్తుల్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి.
జవాబు:
ఈ వాక్యము సరియైనదే. ఎందుకంటే కంటిపాపలు ఎవరికి వారికి ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే వేలిముద్రల మాదిరిగానే వాటిని కూడా గుర్తింపు కోసం ఉపయోగిస్తారు.

ఈ) రుచిని కనుగొనడం (జిహ్వ జ్ఞానం)లో లాలాజలం రుచికణికలకు సహాయపడుతుంది.
జవాబు:
ఈ వాక్యము సరైనదే. ఎందుకంటే ఆహారంలో రుచిని కలుగజేసే రసాయనిక పదార్థాలు లాలాజలంలో కరుగుతాయి. ఈ లాలాజలం, రుచికణికల ద్వారా వాటి కుహరంలో ప్రవేశించి జిహ్వ గ్రాహకాలను తడుపుతుంది. తద్వారా లాలాజలం రుచికణికలకు సహాయపడుతుంది.

ఉ) మనం ఇంద్రియ జానాలకు తగిన అనుకూలనాలు కలిగి లేము.
జవాబు:
ఈ వాక్యము సరికాదు. ఎందుకంటే అన్ని జ్ఞానేంద్రియాలకు తగిన అనుకూలనాలు మన శరీరం కలిగి ఉంది.

AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 3.
రెండింటి మధ్య తేడాలు తెలపండి. (AS 1)
అ) దందాలు, శంకువులు

దండాలు శంకువులు
1. అతి తక్కువ కాంతిలో, చీకటిలో వస్తువులను చూడగలవు. 1. కాంతివంతమైన వెలుతురులో రంగులను గుర్తిస్తాయి.
2. వివిధ రంగులకు సంబంధించిన నిశితమైన తేడాలను గుర్తించలేవు. 2. నీలం, ఎరుపు, పసుపుపచ్చ వంటి రంగులు కాకుండా వాటి కలయికచే ఏర్పడు రంగులను కూడా గుర్తించగలవు.
3. దండాలు సుమారుగా 125 మిలియన్లు ఉంటాయి. 3. శంకువులు దాదాపు ఏడు మిలియన్లు ఉంటాయి.
4. దండాలలో రొడాప్సిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. 4. శంకువులలో అయెడాప్సిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది.
5. దండాలలో లోపములు ఉంటే రేచీకటి కలుగుతుంది. 5. శంకువులలో తేడాలుంటే రంగులను గుర్తించలేని లోపము కలుగుతుంది.

ఆ) కంటిపాప, తారక
జవాబు:

కంటిపాప తారక
1. కంటిలో తారక చుట్టూ ఉన్న రంగుగల భాగము. 1. కంటి మధ్యన ఉన్న గుండ్రటి భాగము.
2. కంటిపాప నీలం, ఆకుపచ్చ, బూడిద మరియు గోధుమరంగు వర్ణములో ఉండవచ్చు. 2. తారక నల్లని రంగులో ఉంటుంది.
3. కాంతి తీవ్రతకు అనుగుణంగా పెద్దగా మరియు చిన్నగా మారదు. 3. కాంతి తీవ్రతకు అనుగుణంగా పెద్దదిగాను, చిన్నదిగాను అవుతుంది.

ఇ) పిన్నా, కర్ణభేరి
జవాబు:

పిన్నా కర్ణభేరి
1. దీనిని వెలుపలి చెవి అంటారు. 1. దీనిని టింపానమ్ అని అంటారు.
2. ఇది మన తలభాగాన ఇరువైపులా కంటికి కనిపించే చెవిభాగము. 2. వెలుపలి చెవి మరియు మధ్యచెవి మధ్యన ఉంటుంది.
3. ఇది ఒక దొప్ప మాదిరిగా ఉంటుంది. 3. ఇది శంకువు ఆకారములో ఉంటుంది.
4. పిన్నా మృదులాస్థితో నిర్మితమైనది. 4. కర్ణభేరి ఒక పలుచని పొరలాంటి నిర్మాణము.
5. శబ్ద తరంగాలను సేకరిస్తుంది. 5. శబ్ద తరంగాలను ప్రకంపనాలుగా మారుస్తుంది.
6. ఇది వెలుపలి చెవి మొదటి భాగము. 6. ఇది వెలుపలి చెవి చివరి భాగము.

ఈ) నాసికా కుహరం, శ్రవణకుల్య
జవాబు:

నాసికా కుహరం శ్రవణ కుల్య
1. బాహ్య నాసికా రంధ్రములలోని ఖాళీ ప్రదేశం నాసికా కుహరం. 1. వెలుపలి, మధ్య చెవినందలి కాలువలాంటి నిర్మాణం శ్రవణ కుల్య.
2. నాసికా కుహరం అంతరనాసికా రంధ్రాల లోనికి తెరుచుకుంటుంది. 2. శ్రవణ కుల్య మధ్య చివర కర్ణభేరి ఉంటుంది.
3. అంతరనాసికా రంధ్రాలలోనికి పోయే గాలి నుండి దుమ్ము కణాలను వేరుచేస్తుంది. 3. వెలుపలి చెవి నుండి శబ్ద తరంగాలను కర్ణభేరికి తీసుకువెళుతుంది.
4. నాసికా కుహరం గోడలు శ్లేషస్తరాన్ని, చిన్న వెంట్రుకలను కలిగి ఉంటుంది. 4. శ్రవణ కుల్యనందు సెరుమినస్ మరియు తైల గ్రంథుల స్రావమైన గులిమి ఉంటుంది.

ప్రశ్న 4.
క్రింది ప్రక్రియలు ఎలా జరుగుతున్నాయి? (AS 1)
అ) మనం వస్తువును చూడగానే దాని నిజమైన ప్రతిబింబం నేత్రపటలంపై తలకిందులుగా ఏర్పడుతుంది.
ఆ) పిన్నా సేకరించిన శబ్ద తరంగాలు ప్రకంపనాలుగా మారతాయి.
ఇ) మనం మనచేతిని వేడి వస్తువుకు దూరంగా జరుపుతాం.
ఈ) ఘాటైన వాసన, మనం ముక్కు మూసుకునేలా చేస్తుంది.
అ) మనం వస్తువును చూడగానే దాని నిజమైన ప్రతిబింబం నేత్రపటలంపై తలకిందులుగా ఏర్పడుతుంది.
జవాబు:
మనం వస్తువును చూడగానే, కెమెరా మాదిరిగానే కన్ను కాంతిని సేకరించి, కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి కంటిలో వెనుక భాగాన ఉండే నేత్రపటలంపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబంలో ఎడమ కుడిగాను, తలకిందులుగాను ఉంటుంది.

ఆ) పిన్నా సేకరించిన శబ్ద తరంగాలు ప్రకంపనాలుగా మారతాయి.
జవాబు:
పిన్నా శబ్ద తరంగాలను సేకరిస్తుంది. సేకరించిన శబ్ద తరంగాలు శ్రవణకుల్యను చేరతాయి. అవి అప్పుడు కర్ణభేరిని తాకుతాయి. ఈ శబ్ద తరంగాలు, ప్రకంపనాలుగా మారతాయి.

ఇ) మనం మనచేతిని వేడి వస్తువుకు దూరంగా జరుపుతాం.
జవాబు:
జ్ఞానేంద్రియాలు చేసే పనులన్నింటికీ కేంద్రం మెదడు. అది జ్ఞానేంద్రియాల నుండి నాడీ సంకేతాలు తెచ్చే జ్ఞాననాడుల ద్వారా సమాచారాన్ని అందుకుంటుంది. తరువాత వాటిని విశ్లేషించి చాలకనాడులు అని పిలువబడే మరొక రకం నాడుల ద్వారా ప్రతిచర్యను చూపాల్సిన భాగాలకు సంకేతాలు పంపుతుంది. ఉదాహరణకు మన చేతిని వేడి వస్తువు దగ్గరకు తీసుకెళ్ళామనుకోండి. వెంటనే జ్ఞాననాడులు, చర్మానికి వేడి తగులుతుందనే సమాచారాన్ని మెదడుకు చేరుస్తాయి. మెదడు చేతిని దూరంగా జరపాల్సిందిగా చాలకనాడుల ద్వారా సమాచారం పంపుతుంది. అపుడు చేతిని వేడి వస్తువుకు దూరంగా జరుపుతాం.

ఈ) ఘాటైన వాసన, మనం ముక్కు మూసుకునేలా చేస్తుంది.
జవాబు:
ముక్కులోని గ్రాహక కణాలు ప్రేరణను, నాడీ సంకేతాలుగా మార్చి మెదడులో కింది భాగాన ఉండే ఝణకేంద్రాలకు చేరుస్తాయి. అక్కడ ఋణ జ్ఞానం (వాసన) ప్రక్రియ జరుగుతుంది. అలా ఘాటైన వాసన ముక్కులోని గ్రాహక కణాల ‘ నుండి మెదడుకు చేరుతుంది. వెంటనే మెదడు భరించలేని వాసన కనుక ముక్కు మూసుకోమని సంకేతాన్నిస్తుంది.

ప్రశ్న 5.
ఖాళీలను సరియైన పదాలతో పూరించండి. తరువాత ఆ పదాలు ఎలా సరిపోతాయో కారణాలు ఇవ్వండి. (AS 1)
1. రక్తపటలం కంటికి ………………. ఇస్తుంది.
జవాబు:
రక్షణ.
కారణం : ఈ పొర కంటి యొక్క అన్ని భాగాలను (తారక తప్ప) ఆవరించియుంటుంది కనుక.

2. నాలుకకు, ……………… కు మధ్య సంబంధం చాలా ఎక్కువ.
జవాబు:
ముక్కు
కారణం : వాసనకు, రుచికి సంబంధం ఉంది కనుక.

3. కంటిపాప నమూనా వ్యక్తుల ……………… కు ఉపయోగపడుతుంది.
జవాబు:
గుర్తింపు
కారణం : కంటి పాప ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి.

4. దృక్మడి కంటిని దాటి చోటు పేరు ………..
జవాబు:
అంధచుక్క
కారణం : అంధచుక్క దృక్మడి కంటినుండి బయటకు పోయేచోట ఉంటుంది కనుక.

5. కర్ణభేరి అనేది ……………..
జవాబు:
ప్రకంపించే పొర
కారణం : శబ్ద తరంగాలు కర్ణభేరిని తాకగానే ప్రకంపనాలు వస్తాయి కనుక.

AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 6.
సరియైనదాన్ని ఎంపిక చేయండి : (AS 1)
అ. కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్
ఎ) విటమిన్ ‘ఎ’
బి) విటమిన్ ‘బి’
సి) విటమిన్ ‘సి’
డి) విటమిన్ ‘డి’
జవాబు:
ఎ) విటమిన్ ‘ఎ’

ఆ. ఇంద్రియ జ్ఞానమన్నది ఒక సంక్లిష్టమైన విధానం. దీనిలో పాల్గొనేవి
ఎ) జ్ఞానేంద్రియాలు
బి) జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు
సి) జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు, మెదడు
డి) మెదడు, నాదీ ప్రేరణలు
జవాబు:
సి) జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు, మెదడు

ఇ. వెలుపలి చెవి గనుక శబ్ద తరంగాలని కేంద్రీకరించకపోతే ‘శ్రవణ కుల్య
ఎ) అనేక రకాల శబ్దాలను గట్టిగా వినగలదు
బి) ఏమి వినలేదు
సి) కొద్దిగా వినగలదు
డి) శబ్దం పుట్టుకని, రకాన్ని తెలుసుకోలేదు
జవాబు:
బి) ఏమి వినలేదు

ఈ. ఒక వ్యక్తి యొక్క కంటిగుద్దు కండరాలు పనిచేయకుండా పాడైతే, తప్పనిసరిగా కలిగే ప్రభావం?
ఎ) ఆ వ్యక్తి కళ్ళు మూసుకోలేడు
బి) కన్ను కదపలేడు, రంగుల్ని బాగా చూడగలడు
సి) కంటిలో నొప్పి వస్తుంది, కళ్ళు మూసుకోలేడు
డి) ఆ కండరాలకు చేరే నాడులు పనిచేయవు
జవాబు:
బి) కన్ను కదపలేడు, రంగుల్ని బాగా చూడగలడు

ఉ. ఒక వ్యక్తి నాలుక ఎక్కువ ఉప్పగా ఉన్న పదార్థం రుచి చూసింది. అప్పుడు ఆ వ్యక్తి
ఎ) ఉప్పటి పదార్థాలను తినడం నేర్చుకుంటాడు
బి) ఉప్పటి పదార్థాలను తినడానికి ఇష్టపడతాడు
సి) ఉప్పటి పదార్థాలను తినడానికి ఇష్టపడడు
డి) అంతకంటే తక్కువ ఉప్పదనం కలిగిన పదార్థాల రుచి తెలుసుకోలేడు.
జవాబు:
డి) అంతకంటే తక్కువ ఉప్పదనం కలిగిన పదార్థాల రుచి తెలుసుకోలేడు

ప్రశ్న 7.
మన చర్మానికి స్పర్శజ్ఞానం లేకపోతే ఏమవుతుంది? (AS 2)
జవాబు:

  1. శరీరము బయట నుండి సమాచారం గ్రహించడానికి చర్మమునందు అనేక జ్ఞాన గ్రాహకాలున్నాయి.
  2. చర్మమునందలి జ్ఞాన గ్రాహకాలు కనీసం ఐదు రకాల జ్ఞానాన్ని కలుగచేస్తాయి. అవి బాధ, వేడి, చలి, స్పర్శ మరియు పీడనము.
  3. ఐదు జ్ఞానేంద్రియాలను వర్గీకరించే క్రమంలో బాధ, వేడి, చలి, స్పర్శ మరియు పీడనములు అన్నింటిని స్పర్శజ్ఞానము గానే పరిగణించడం జరిగింది.
  4. మన చర్మానికి స్పర్శజ్ఞానం లేకపోయినట్లయితే బాధ, వేడి, చలి, స్పర్శ మరియు పీడనముల గురించిన జ్ఞానాన్ని మనం పొందలేము.

ప్రశ్న 8.
శ్రవణజ్ఞానం కోసం మీరు చేసిన ప్రయోగంలో రబ్బరు పొర మీకు ఏ విధంగా ఉపయోగపడింది? (AS 3)
జవాబు:
శ్రవణజ్ఞానం కోసం మనం చేసిన ప్రయోగంలో రబ్బరు పొర చెవిలోని కర్ణభేరి మాదిరిగా పని చేస్తుంది.

  • గరాటు మూతి వద్ద ‘ఓ’ అని అన్నపుడు శబ్ద తరంగాలకు బెలూన్ ముక్కపై గల ధాన్యపు గింజలు కదులుతాయి.
  • రబ్బరు షీటుని కలిగి ఉన్న గరాటు మూతిని స్నేహితుని ఛాతిపై ఉంచినపుడు గుండెచప్పుడు ల డ మని వినిపిస్తుంది.

ప్రశ్న 9.
మీ తరగతిలోని ఐదుగురు విద్యార్థులు ఒక జట్టుగా ఏర్పడి కంటి వ్యాధులు – లక్షణాలు గురించి సమాచారాన్ని నేత్రవైద్యుల సహాయకుల నుండి సేకరించండి. (AS 4)
(లేదా)
కంటికి వచ్చే ముఖ్యమైన వ్యాధులు, లోపాలను పేర్కొనండి.
జవాబు:

కంటి వ్యాధి పేరు, దోషము పేరు లక్షణాలు
1. వయసు సంబంధిత మాక్యులా (పచ్చచుక్క) క్షీణత ఈ వ్యాధి పరిస్థితిలో నేత్రపటలం నందలి మధ్యభాగమైన మాక్యులా లేదా ఫోవియా క్షీణించిపోతుంది. అంధత్వము వస్తుంది.
2. ఎస్టిగ్మాటిజమ్ నేత్రపటలం నందలి వంపు అసంపూర్ణంగా ఉండడం.
3. కంటిశుక్లం (కెటరాక్ట్) కంటి ముందరభాగంలో ఉండే పొర ఉబ్బి మెత్తగా అయి పగులుతుంది. కళ్ళు సరిగా కనపడవు.
4. సెంట్రల్ రెటినల్ వీన్ ఆక్లుసన్ నేత్రపటం నందలి సిరలో రక్తప్రవాహానికి ఆటంకం ఏర్పడడం.
5. కలర్ బ్లైండ్ నెస్ (వర్ణాంధత) సాధారణ పరిస్థితులలో రంగులను గుర్తించకపోవటం, చూడలేకపోవడం.
6. కండ్ల కలక కంటి ముందర పొర ఉబ్బుతుంది. కన్ను ఎరుపెక్కుతుంది, మండుతుంది, నీరు కారుతుంది.
7. శుక్లపటలం మార్పుచెందడం శుక్లపటలం మీద మచ్చలు, ఉబ్బటం వలన లేదా అక్రమాకారం ఉండడం వలన కళ్ళు మెరవడం, చూపు చెదరడం జరుగుతుంది.
8. డయాబెటిక్ రెటినోపతి మధుమేహం వలన కంటికి వచ్చు వ్యాధి నేత్రపటలం నందలి రక్తనాళాలలో మార్పు వలన కలుగుతుంది.
9. పొడికళ్ళు లేదా జిరాఫ్తాల్మియా కంటిలోని అశ్రుగ్రంథులు అశ్రువులను ఉత్పత్తి చెయ్యవు. కంటిపొర పొడిగా అవుతుంది.
10. దీర్ఘదృష్టి (హైపర్ మెట్రోపియా) ఇది వక్రీభవన దోషము. కన్ను సరిగ్గా కాంతిని ” వక్రీభవించదు. అందువలన ప్రతిబింబాలు నేత్రపటలం వెనుక ఏర్పడతాయి. దూరపు వస్తువులు కనపడతాయి. దగ్గర వస్తువులు సరిగ్గా కనపడవు.
11. గ్లూకోమా కంటిలోని దృక్మడి పాడయిపోతుంది. దీనివలన కంటిలో ఎక్కువ పీడనము కలుగుతుంది.
12. కెరోలైటిస్ శుక్లపటలం ఉబ్బుతుంది. అందువలన కన్ను ఎర్రగా మారి నొప్పి కలిగిస్తుంది. చూచునపుడు నొప్పి ఉంటుంది.
13. మాక్యులార్ ఎడిమా నేత్రపటలం నందలి మాక్యులా లేదా పచ్చచుక్క ఉబ్బుతుంది. మాక్యులా ఉబ్బుట వలన దృష్టి దోషము కలుగవచ్చు.
14. హ్రస్వదృష్టి (మయోపియా) ఇది వక్రీభవన దోషము. కన్ను కాంతిని సరిగా వక్రీభవించటం జరుగదు.
ప్రతిబింబాలు నేత్రపటలం ముందు ఏర్పడతాయి. దగ్గర వస్తువులు చూడడం, దూరపు వస్తువులు సరిగ్గా చూడలేకపోవటం జరుగుతుంది.
15. ఆప్టిక్ న్యూరైటిస్ కంటినందలి దృక్మడి పెద్దగా మారుతుంది.
16. రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ నెలలు నిండకుండానే పుట్టే పిల్లలలో నేత్రపటలం మీద అసాధారణంగా రక్తనాళాలు పెరుగుతాయి.
17. సీరైటిస్ కంటిలోని తెల్లగుడ్డు ఉబ్బటం వలన నొప్పి కలుగుతుంది. దీనినే స్క్లీరా అంటారు.
18. డిటాచ్ రెటీనా లేదా టార్న్ రెటీనా నేత్రపటలం ఒకటి లేదా ఎక్కువ స్థలాలలో చిరగడం, కంటి గోడల నుండి నేత్రపటలం పైకి నెట్టబడటం జరుగును.
19. నైట్ బ్లెండ్ నెస్ లేదా రేచీకటి ఈ వ్యాధితో బాధపడేవారు తక్కువ వెలుతురులోగాని, రాత్రి గాని వస్తువులను చూడలేరు.
20. ట్రకోమా కంటికి సోకే అంటువ్యాధి. రెండు కళ్ళకు వస్తుంది. ఇది క్లామీడియా ట్రాకోమేటిస్ అనే బాక్టీరియా వల్ల కలుగుతుంది.

AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు

ప్రశ్న 10.
కింది వాటి నిర్మాణాలను సూచించే పటాలను గీయండి. భాగాలను గుర్తించండి. (AS 5)
1) కన్ను 2) చెవి 3) నాలుక
జవాబు:
1) కన్ను :
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 1
2) చెవి :
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 2
3) నాలుక :
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 3

ప్రశ్న 11.
జ్ఞానేంద్రియాలు పనిచేయని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు మీరు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తారు? (AS 6)
జవాబు:

  1. జ్ఞానేంద్రియాలు పనిచేయని ప్రత్యేక అవసరాలు గల పిల్లల పట్ల మనం సానుభూతిని కలిగి ఉండాలి.
  2. అటువంటి పిల్లలు సక్రమమైన జీవితమును గడపటానికి కావలసిన సహకారం అందిస్తాను.
  3. వారు మామూలు మనుష్యులలాగానే జీవించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసమును వారిలో నింపుతాను.
  4. అంధులైన పిల్లలకు బ్రెయిలీ లిపి గురించి వివరిస్తాను. వారిని ప్రత్యేక శిక్షణ ఇచ్చు పాఠశాలల యందు చేర్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను.
  5. చెవులు పనిచేయని విద్యార్ధులకు మనము చేసే సంజ్ఞలు, సైగల ద్వారా విషయము అవగాహన అయ్యే విధముగా చేస్తాను.
  6. ప్రభుత్వము నుండి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కావలసిన సహాయమును అందే విధముగా కృషిచేస్తాను.
  7. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు తమకు ఎటువంటి కొరత లేదనే భావనను మరియు వారికి కొదువ లేదనే తృప్తిని అందిస్తాను.

ప్రశ్న 12.
ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి సహాయపడే జ్ఞానేంద్రియాల పనులను నువ్వెలా మెచ్చుకోగలవు? (AS 6)
జవాబు:

  1. జ్ఞానేంద్రియాల ద్వారా ప్రకృతి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తాము.
  2. మనం ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళతో, వీనులవిందైన సంగీతాన్ని చెవులతో, పూల సువాసనలను ముక్కుతో, ఆహారపదార్థాల రుచిని నాలుకతో ఆస్వాదిస్తున్నాము. చల్లని చిరుగాలిని చర్మంతో స్పర్శిస్తున్నాము.
  3. ఇటువంటివన్నీ మన జ్ఞానేంద్రియాలు ఎలా సమాచారాన్ని గ్రహిస్తున్నాయో, ఎలా ప్రతిస్పందిస్తున్నాయో మనకు ప్రత్యక్షంగా తెలియచేస్తున్నాయి.
  4. జ్ఞానేంద్రియాలు మన శరీరంలోని భాగాలు మాత్రమే కాదు, అవి మనమంటే ఏమిటో నిర్వచిస్తాయి.
  5. మన జీవితంలో అతిముఖ్యమైన విషయాల నుండి, అతి చికాకుపడే విషయాల వరకు ఏదీ జ్ఞానేంద్రియాల ప్రమేయం లేకుండా జరుగవు.
  6. మన కళ్ళు, చెవులు, చర్మం, నాలుక, ముక్కు గ్రహించే సమాచారం మిల్లీ సెకనుల వ్యవధిలో మెదడుకు అందచేయడం, అది సమాచారాన్ని సరిపోల్చుకోవడం, ప్రతిస్పందించడమనేది లేకపోతే ఈ ప్రపంచంలో పరిశోధనలకు అవకాశమే ఉండేది కాదు.

ప్రశ్న 13.
సాగర్ సరిగ్గా వినలేకపోతున్నాడు. అతనికి ఏం జరిగి ఉండొచ్చో ఊహించండి. అతనికి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? (AS 7)
జవాబు:

  1. సాగర్ పెద్ద ధ్వనులను వినడం వలన అతను సరిగా వినలేకపోవచ్చు. ఇటువంటి స్థితిని ధ్వని వలన కలిగే వినికిడి లోపం అంటారు.
  2. కొన్నిసార్లు ఎక్కువ ధ్వని తీవ్రతకు గురి అయిన చెవినందు మోగుతున్నట్లు, బుసకొడుతున్నట్లు, అరుపుల శబ్దములు ఉండే స్థితిని ‘టిన్నిటస్’ అంటారు.
  3. చెవి భాగములందు సమస్య ఉన్నా కూడా సరిగా వినబడకపోవచ్చు.
  4. వినికిడి లోపం బ్యాక్టీరియా మరియు వైరస్ట్ వలన కలగవచ్చు.
  5. కనుక సరిగా వినలేకపోవటానికి కారణమును కనుగొనమని సాగర్‌కు సలహా ఇస్తాను.
  6. పాటలను ఎక్కువ ధ్వనితో వినవద్దని సలహా ఇస్తాను.
  7. చెవి వ్యాధులందు నిపుణుడైన వైద్యుని సంప్రదించమని సాగర్ కు నేను సలహా ఇస్తాను.

9th Class Biology 6th Lesson జ్ఞానేంద్రియాలు Textbook Activities (కృత్యములు)

కృత్యం -1

1. పుష్పాల గురించి కొన్ని వాక్యాలు మీ నోటు పుస్తకంలో రాయండి. ఆ పనిలో పాల్గొన్న జ్ఞానేంద్రియాలు, వాటి ప్రేరణలు ప్రతిచర్యలు, జ్ఞాన, చాలక నాడుల విధులను రాయండి.
జవాబు:
పుష్పములు వివిధ రంగులలో ఉంటాయి.
పుష్పములు సువాసనలను వెదజల్లుతాయి.
పుష్పములను తాకినచో మృదువుగా ఉంటాయి.
పుష్పములు తియ్యని మకరందాన్ని ఉత్పత్తి చేస్తాయి.
ఈ వాక్యములు రాయడంలో పాల్గొన్న జ్ఞానేంద్రియాలు కన్ను మరియు చర్మం.
పుష్పముల గురించి రాయడమన్నది ప్రేరణ. వాటిని రాయడం ప్రతిచర్య.

జ్ఞాననాడులు వార్తలను లేదా సమాచారాన్ని మెదడుకు తీసుకొని వెళతాయి. చాలకనాడులు సమాచారాన్ని మెదడు నుండి శరీరపు వివిధ భాగాలకు తీసుకొని వెళతాయి.

AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు

కృత్యం – 2

2. ప్రేరణ కృత్యం.
జవాబు:
1) ఒక గ్లాసు నీటిలో చిటికెడు పంచదార కలపాలి.
2) కొంచెం తాగితే తియ్యగా అనిపించాయి.
3) ఆ నీటిలో ప్రతిసారి పావు టీ స్పూన్ చొప్పున పంచదార పరిమాణం పెంచుతూ వివిధ గాఢతల్లో ద్రావణాన్ని తయారుచేయాలి.
4) ప్రతిసారి రుచి చూడాలి.
5) 3 టీస్పూన్ల పంచదార వేసిన తరువాత రుచి స్థిరంగా ఉంటుంది.

కృత్యం – 3

3. మీ స్నేహితుని కంటి బాహ్య నిర్మాణం పరిశీలించండి. దాని పటం గీచి, భాగాలను గుర్తించండి. సాధారణ కాంతిలో మీ స్నేహితుని కంటిగుడ్డు పరిశీలించండి. తరువాత అతని కంటిలోకి టార్చిలైట్ కాంతి కిరణపుంజాన్ని వేసి మరలా పరిశీలించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 1

  1. నా స్నేహితుని కంటిలో కంటిరెప్పలు, కనురెప్ప రోమాలు, కనుబొమ్మలు, అశ్రుగ్రంథులు, నల్లగుడ్డు, తెల్లగుడ్డు ఉన్నాయి.
  2. కంటిలోకి టార్చిలైట్ కాంతికిరణ పుంజాన్ని వేసినపుడు కంటిని వెంటనే శుక్ల పటలంలో మూయడం జరిగింది.
  3. మరలా టార్చిలైట్ కాంతికిరణ పుంజాన్ని కంటిలో వేస్తూ స్నేహితుడు కళ్ళు తెరచినప్పుడు చిన్న నలుపురంగు భాగం పరిమాణం చిన్నదిగా అయినది.

కృత్యం – 4

4. అంధచుక్క పరిశీలన
జవాబు:
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 4

  1. పుస్తకాన్ని చెయ్యంత దూరంలో పెట్టుకోవాలి.
  2. కుడి కన్ను మూయాలి. ఎడమకంటితో + గుర్తుకేసి తీక్షణంగా చూడాలి.
  3. కుడి కంటిని అలా మూసే ఉంచి పుస్తకాన్ని నెమ్మదిగా కంటి దగ్గరకు తీసుకురావాలి.
  4. పుస్తకం 8 నుండి 10 అంగుళాల దూరంలో ఉన్నప్పుడు + గుర్తు మన ఎడమకన్ను అంధచుక్క దగ్గర ఉండడంతో కనపడకుండా పోతుంది.
  5. + గుర్తుకు బదులుగా మన దృశ్య వ్యవస్థ దానికి అటు ఇటు ఉన్న నీలిరేఖల సమాచారంతో కనిపించని ఆ ప్రాంతాన్ని పూర్తి చేస్తుంది.

కృత్యం – 5

5. మీ స్నేహితుని కన్నులో కంటిపాప, దాని చుట్టుపక్కలను పరిశీలించండి. తారక మీకు కనిపించిందా? మీ స్నేహితుల కళ్ళలోని కంటిపాప రంగులు, ఆకారాలు పరిశీలించండి. ఒకరి నుండి ఒకరికి ఏమైనా తేడా ఉన్నదా?
జవాబు:

  1. స్నేహితుని కంటిలో నల్లటి చుక్క తారక కనిపించింది.
  2. స్నేహితుల కళ్ళలోని కంటిపాపల రంగులు వేరువేరుగా ఉన్నాయి.
  3. స్నేహితుల ‘కంటిపాపలు కొందరిలో నీలంరంగుగాను, కొందరిలో ఆకుపచ్చగాను, కొందరిలో బూడిద మరియు గోధుమరంగులో ఉన్నాయి.
  4. కంటిపాపల ఆకారాలు అందరిలో గుండ్రంగా ఉన్నాయి. తేడా ఏమీ లేదు.

కృత్యం – 6

6. కాంతివంతంగా ఉన్న ప్రాంతం నుండి చీకటిగా ఉండే గదిలోకి వెళ్ళండి. ఏం జరుగుతుంది ? చీకటి గదిలో కొంతసేపు కూర్చోంది. అప్పుడు ఎండలోకి వెళ్ళండి. ఏం జరుగుతుంది?
జవాబు:
a) 1) కాంతివంతంగా ఉన్న ప్రాంతంలో ఉండే తారక చాలా చిన్నదిగా ఉంటుంది.
2) చీకటి గదిలోకి వెళ్ళినట్లయితే మొదట మనకు ఏమీ కనిపించదు. ఈ సమయంలో తారక యొక్క పరిమాణం పెరుగుట వలన నెమ్మదిగా గదిలోని వస్తువులు మనకు కనపడతాయి.

b) 1) చీకటి గదిలో నుండి ఎండలోకి వెళ్ళినప్పుడు మొదట మనకు ఏమీ కనిపించదు. నెమ్మదిగా తారక పరిమాణం ఎండకు అనుగుణంగా మారుట వలన మనము వస్తువులను చూడగలము.
2) ఒకే పరిమాణంలో ఉన్న రెండు తెల్లకాగితం ముక్కల్ని తీసుకోవాలి.
3) ఒక కాగితం మీద పంజరం పటాన్ని, మరొక కాగితం మీద చిలక పటం గీయాలి.
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 5
4) రెండింటి మధ్య పుల్ల ఉంచాలి. వాటి కొనల్ని జిగురుతో అంటించాలి.
5) ఆరిన తర్వాత పుల్లని వేగంగా తిప్పాలి.
6) వేగంగా పుల్లను తిప్పినపుడు చిలుక పంజరములో ఉన్నట్లు మనకు భ్రమ కలుగుతుంది.

AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు

కృత్యం – 7

7. 1) ఒక ప్లాస్టిక్ లేక ఇనుప గరాటును తీసుకోవాలి.
2) ఒక రబ్బరు బెలూన్ ముక్కను సాగదీసి, గరాటు మూతికి కట్టాలి.
3) దాన్ని రబ్బరు బ్యాండ్తో గట్టిగా కట్టాలి.
4) 4-5 బియ్యపు గింజల్ని రబ్బరు ముక్కపై వేయాలి.
5) గరాటు మూతి వద్ద స్నేహితుడిని ‘ఓ’ అని అనమనండి.

పరిశీలనలు:

  1. గరాటు మూతి వద్ద ‘ఓ’ అని అన్నపుడు శబ్ద తరంగాలకు బెలూన్ ముక్కపై గల ధాన్యపు గింజలు కదులుతాయి.
  2. రబ్బరు ఓటుని కలిగి ఉన్న గరాటు మూతిని స్నేహితుని ఛాతిపై ఉంచినపుడు గుండెచప్పుడు ల ‘ మని వినిపిస్తుంది.

కృత్యం – 8

8. 1) మీ స్నేహితుని కళ్ళకు గంతలు కట్టాలి.
2) నిమ్మకాయ, టీ, కాఫీ, బంగాళాదుంప, టొమాటో, చింతకాయ, పాలకూర, పెరుగు, వంకాయ పదార్థాలను గుర్తించమనాలి.
3) మనము ఎంపిక చేసిన పదార్థాలు పొడిగా ఉండకూడదు.
4) మీ స్నేహితుడు పదార్థాలను ముట్టుకోకూడదు. కేవలం వాసన మాత్రమే చూడాలి.
పై పదార్థాలను గుర్తించడానికి వాసన ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:

  1. జీవశాస్త్ర పరంగా వాసన అన్నది ముక్కులో ఉండే రసాయనాల సంఘటనతో ప్రారంభమవుతుంది.
  2. అక్కడ వాసనలు ప్రత్యేకమైన నాడీకణాలతో కూడిన గ్రాహక మాంసకృత్తులతో అంతరచర్య పొందుతాయి.
  3. ముక్కులోని నాడీకణాలు మాత్రమే బాహ్య ప్రపంచంతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటాయి.
  4. ముక్కులోపలి గోడల్లో ఉండే కణాలు వాసన కలిగిన రసాయనాలకి సూక్ష్మ గ్రాహకతను కలిగి ఉంటాయి.
  5. వాసన కలిగించే రసాయనాలు సంక్లిష్టమైనవి. భిన్నత్వాన్ని కలిగి ఉంటాయి.

కృత్యం- 9

9. 1) మీ స్నేహితుని కళ్ళకు గంతలు కట్టండి. అతనికి అల్లం ముక్క, వెల్లుల్లి, చింతకాయ, అరటిపండు ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వండి.
2) అతన్ని ఒక్కొక్కటి నాలుకకి ఒకసారి రాసుకొని రుచి చెప్పమనండి.
3) ప్రతి ఒక్కటి రుచి చూశాక నోటిని, నీటితో పుక్కిలించమనాలి.
4) స్నేహితులు అందరూ రుచిని చెప్పగలిగారు.
5) మీ స్నేహితుని ప్రతి పదార్థం నోట్లో పెట్టుకొని ఒక్కసారి కొరికి నాలుకతో చప్పరించమనాలి. ఇప్పుడు తేడా ఏ విధంగా ఉంది?
6) ఆహారం నోటిలోకి వెళ్ళగానే మనం దాన్ని కొరుకుతాం, నమలుతాం, సాలుకతో చప్పరిస్తాం.
7) ఇందువల్ల ఆహారం నుండి వెలువడే రసాయనాలు, మన రుచి కణికల్ని ప్రేరేపిస్తాయి.
8) దాంతో అవి ప్రేరణను మెదడుకి పంపి రుచిని తెలుసుకునేలా చేస్తాయి.
9) ఒకే విధమైన రుచికళికలు, వివిధ సంకేతాలు ఉత్పత్తి చేస్తూ వివిధ ఆహారపదార్థాల్లోని రసాయనాల్ని గుర్తించగలవు.

కృత్యం – 10

10. అద్దం ముందు నిలబడి, నాలుకను బయటకు తెచ్చి పరిశీలించండి. మీరు ఎన్ని రకాల నిర్మాణాల్ని మీ నాలుకపై చూడగలిగారో ఇచ్చిన పటంతో సరిచూడండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు 3

  1. నాలుకపై పొలుసులవంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇవి ఫిలి. ఫార్మ్ పాపిల్లే.
  2. గుండ్రంగా నాలుకపై కనిపించేవి ఫంగి ఫార్మ్ పాపిల్లే.
  3. నాలుక వెనుకవైపు గుండ్రంగా ఉండే పెద్ద పాపిల్లే సర్కం విల్లేట్ పాపిల్లే.
  4. నాలుకకు ఇరువైపులా ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణాలు ఫోలియేట్ పాపిల్లే.

కృత్యం – 11

11. 1) మీ స్నేహితుని కళ్ళకు గంతలు కట్టాలి.
2) ముక్కుకి గుడ్డ కట్టాలి.
3) కొంచెం జీలకర్ర ఇచ్చి నమలమనాలి.
4) మీరు ఇచ్చిందేమిటో చెప్పమనాలి.
5) ఇలాగే చిన్న బంగాళాదుంప ముక్కతో కూడా ప్రయత్నించాలి.
6) నా స్నేహితుడు జీలకర్ర గింజలను, చిన్న బంగాళాదుంపను గుర్తించెను.

కృత్యం – 12

12. 1) మూడు పంటిపుల్లలు కట్టగా కట్టాలి.
2) వాటి సన్నని కొనలు మూడూ ఒకే తలంలో ఉండేలా చూడాలి.
3) మీ స్నేహితుని చేతిమీద వాటిని ఒకసారి అదిమి ఎలా ఉందో అడగాలి.
4) తర్వాత స్నేహితుని కళ్ళు మూసుకోమనాలి.
5) బొటనవేలు కొన నుండి క్రమంగా అరచేయి అంతా ‘వాటిని తేలికగా గుచ్చుతూ, గుచ్చినప్పుడల్లా ఎన్ని కొనలు గుచ్చుకున్నట్లుందో అడిగి నమోదు చేయాలి.
6) వచ్చిన అంకెను బట్టి అరచేతిలో ఏ భాగంలో స్పర్శ జ్ఞానం ఎక్కువ ఉందో, ఏ భాగంలో తక్కువ ఉందో గుర్తించమనాలి.

పరిశీలనలు :

  1. అరచేతి మధ్యలో స్పర్శ జ్ఞానం ఎక్కువ ఉన్నది.
  2. తక్కువ స్పర్శ జ్ఞానం అరచేయి అంచుల వద్ద ఉన్నది.
  3. అందరి అరచేతుల్లో స్పర్శ జ్ఞానం ఒకే విధంగా ఉంటుంది.
  4. బొటనవేలు కొన వద్ద ఎక్కువ స్పర్శ జ్ఞానం ఉండి, క్రింద భాగంలో తక్కువగా స్పర్శ జ్ఞానం ఉంది.

AP Board 9th Class Biology Solutions 6th Lesson జ్ఞానేంద్రియాలు

కృత్యం – 13

13. సన్నగా చెక్కిన పెన్సిల్ కొనపై మీ బొటనవేలిని నెమ్మదిగా అదమండి. తరువాత మొద్దుగా ఉన్న కొనపై అదమండి. మీకెలా అనిపించింది?
పరిశీలనలు :

  1. సన్నగా చెక్కిన పెన్సిల్ కొనపై బొటనవేలిని అదిమినపుడు గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది.
  2. మొద్దుగా ఉన్న కొనపై అదిమినపుడు ఆ విధంగా అనిపించదు.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

SCERT AP 9th Class Biology Study Material Pdf Download 5th Lesson జీవులలో వైవిధ్యం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 5th Lesson Questions and Answers జీవులలో వైవిధ్యం

9th Class Biology 5th Lesson జీవులలో వైవిధ్యం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
జీవులలో ఉండే తేడాలు వైవిధ్యానికి ఏ విధంగా ఆస్కారం కల్పిస్తాయి? వివరించండి. (AS 1)
జవాబు:

  1. ఒకే జాతి జీవుల మధ్య ఉండే తేడాలను వైవిధ్యం అంటారు.
  2. వేరువేరు జాతుల మధ్య ఉన్న వైవిధ్యం కంటే, ఒక జాతి జీవుల మధ్య వైవిధ్యం తక్కువగా ఉంటుంది.
  3. ఒక జీవి చూపించే ప్రత్యేక లక్షణాలే జీవులు చూపించే వైవిధ్యానికి ఆధారంగా నిలుస్తాయి.
  4. నిత్య జీవితంలో మన చుట్టూ అనేక రకాలయిన మొక్కలను, జంతువులను చూస్తాము.
  5. మనము కొండ ప్రాంతాలు మరియు అటవీ ప్రాంతాలకు వెళ్ళినపుడు మనము రకరకాల మొక్కలను, జంతువులను గమనిస్తాం.
  6. నిజం చెప్పాలంటే ప్రపంచంలోని ప్రతిభాగము దానికే పరిమితమైన ప్రత్యేక రకమైన జీవులను కలిగి ఉంటుంది.
  7. అందువలన జీవులలో ఉండే తేడాలు వైవిధ్యానికి ఆస్కారం కల్పిస్తున్నాయి.

ప్రశ్న 2.
శాస్త్రవేత్తలు దేని ఆధారంగా మొదటగా వర్గీకరణ ప్రారంభించారు? (AS 1)
జవాబు:

  1. జీవులు వాటి శరీర నిర్మాణం ఆధారంగా వర్గీకరించబడ్డాయి.
  2. జీవుల మధ్య ఉన్న పోలికలు, విభేదాలను అనుసరించి జీవులు వర్గీకరించబడ్డాయి.
  3. చరకుడు, సుశ్రుతుడు మొక్కలను వాటి ఔషధ గుణములను అనుసరించి వర్గీకరించారు.
  4. పరాశర మహర్షి పుష్ప నిర్మాణం ఆధారంగా మొక్కలను వర్గీకరించాడు.
  5. అరిస్టాటిల్ జంతువులను అవి నివసించే ప్రదేశం అనగా భూమి, నీరు మరియు గాలి ఆధారంగా వర్గీకరించాడు.

ప్రశ్న 3.
ఏకదళ బీజాలు ద్విదళ బీజాల కంటే ఎలా భిన్నంగా ఉంటాయి? (AS 1)
జవాబు:

ఏకదళ బీజాలు ద్విదళ బీజాలు
1. మొక్కల గింజలలో ఒకే దళం కలిగి ఉంటాయి. 1. మొక్కల గింజలలో రెండు దళాలు కలిగి ఉంటాయి.
2. సమాంతర ఈనెల వ్యాపనం కలిగి ఉంటాయి. 2. జాలాకార వ్యాపనం కలిగి ఉంటాయి.
3. గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. 3. ప్రధాన వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి.
4. ఏకదళ బీజాలకు ఉదాహరణలు వరి, గోధుమ మొదలైనవి. 4. ద్విదళ బీజాలకు ఉదాహరణ వేప, మామిడి మొదలైనవి.

ప్రశ్న 4.
విట్టేకర్ ప్రకారం క్రింది జీవులు ఏ రాజ్యానికి చెందుతాయి? (AS 1)
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 1
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 2

ప్రశ్న 5.
నేను ఏ విభాగానికి చెందుతాను? (AS 1)
ఎ) నా శరీరంలో రంధ్రాలున్నాయి, నేను నీటిలో నివసిస్తాను. నాకు వెన్నెముక లేదు.
జవాబు:
ఫొరిఫెర

బి) నేను కీటకాన్ని. నాకు అతుకుల కాళ్ళున్నాయి.
జవాబు:
ఆల్డోపొడ

సి) నేను సముద్రంలో నివసించే జీవిని, చర్మంపై ముళ్ళు ఉండి, అనుపార్శ్వ సౌష్టవం కలిగి ఉంటాను.
జవాబు:
ఇఖైనోడర్మేట

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 6.
చేపలు, ఉభయచరాలు, పక్షులలో మీరు గమనించిన సాధారణ లక్షణాలను రాయండి. (AS 1)
జవాబు:

  1. చేపలు, ఉభయచరాలు, పక్షులు అన్నీ సకశేరుకాలు.
  2. ఇవి అన్నీ వెన్నెముక కలిగిన జీవులు.
  3. చేపలు, ఉభయచరాలు, పక్షులు అన్నీ అండజనకాలు.

ప్రశ్న 7.
వర్గీకరణ అవసరం గురించి తెలుసుకోవడానికి నీవు ఏ ఏ ప్రశ్నలు అడుగుతావు? (AS 2)
జవాబు:
ప్రశ్నలు :
i) వర్గీకరణ యొక్క అవసరం ఏమిటి?
ii) వర్గీకరణను ఎవరు, ఎప్పుడు చేశారు?
iii) వర్గీకరణ వలన ఉపయోగం ఏమిటి?
iv) వర్గీకరణలో నూతనముగా వచ్చిన మార్పులు ఏమిటి?
v) వర్గీకరణ అన్ని జీవులకు వర్తిస్తుందా?

ప్రశ్న 8.
స్లెడు తయారు చేసేటప్పుడు నీవు తీసుకున్న జాగ్రత్తలేమిటి? (AS 3)
జవాబు:
స్లెడును తయారుచేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :

  • పరిచ్ఛేదాలను పలుచగా కత్తిరించాలి.
  • పరిచ్ఛేదాలను వా గ్లాస్ ఉన్న నీటిలో ఉంచాలి.
  • పలుచటి పరిచ్చేదాలను మాత్రమే గాజు పలకపై ఉంచాలి.
  • పరిచ్ఛేదం ఆరిపోకుండా దానిపై గ్లిజరిన్ చుక్క వేయాలి.
  • భాగాలు స్పష్టంగా కనిపించటానికి అవసరమైన రంజకాన్ని ఉపయోగించాలి.
  • గాజు పలక పై ఉన్న పరిచ్ఛేదం ఎక్కువ కాలం ఉంచుటకు కవర్ స్లితో మూసి ఉంచాలి.
  • గాజు పలకపై కవర్ స్లిప్ ను ఉంచునపుడు గాలిబుడగలు లేకుండా చూడాలి.
  • అధికంగా ఉన్న నీటిని లేక గ్లిజరిన్ లేక వర్ణద్రవ్యాన్ని అద్దుడు, కాగితంతో తొలగించాలి.

ప్రశ్న 9.
ఒక రోజు కవిత పెసలు, గోధుమలు, మొక్కజొన్న, బఠాని మరియు చింతగింజలను నీటిలో నానవేసింది. అవి నీటిలో నానిన తరువాత నెమ్మదిగా పగలగొడితే అవి రెండు బద్ధలుగా విడిపోయాయి. ఇవి ద్విదళ బీజాలు. కొన్ని విడిపోలేదు. ఇవి ఏకదళ బీజాలు. కవిత పట్టికను ఎలా నింపిందో ఆలోచించండి. మీరూ ప్రయత్నించండి. (AS 4)
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 3
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 4

ప్రశ్న 10.
గ్రంథాలయం లేదా అంతర్జాలం నుండి సమాచారం సేకరించి ప్లాటిపస్ మరియు ఎకిడ్నాలను క్షీరదాలను మరియు సరీసృపాలను అనుసంధానం చేసే జీవిగా ఎలా చెప్పవచ్చో వివరించండి. (AS 4)
జవాబు:

  1. ఎకిడ్నా మరియు ప్లాటిపస్లు రెండూ మెనోట్రీమ్ గ్రూపునకు చెందిన జీవులు,
  2. ఈ రెండు కూడా అండజనక క్షీరదాలు. అయినప్పటికీ ఇవి సరీసృపాలు లేదా పక్షులు కావు.
  3. గుడ్లను పొదుగుతాయి. రెండూ పిల్లలకు పాలు ఇస్తాయి.
  4. ఇవి రెండూ ఆస్ట్రేలియా మరియు టాస్మేనియాలో కనిపిస్తాయి.
  5. ప్లాటిపస్ ముఖ్య లక్షణాలు మరియు అసాధారణ లక్షణాలు-బాతుకు ఉన్న ముక్కు వంటి నిర్మాణం దీనికి ఉండటం, క్షీరద లక్షణమైన దంతములు లేకపోవటం.
  6. స్పైనీ ఏంట్ ఈటర్ అయిన ఎకిడ్నాకు కూడా దంతములు లేవు. నాలుక ఆహారం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.
  7. గుడ్ల నుండి బయటకు వచ్చిన ఎకిడ్నా మరియు ప్లాటిపస్ పిల్లలు బొరియలలో నివసిస్తాయి. కానీ సరీసృపాలు కాదు. ప్రజనన సమయంలో ఎకిడ్నా ప్రాథమికమైన సంచిని అభివృద్ధి చేసుకుంటుంది.
  8. రెండు జీవులకూ గుంటలు చేయడానికి పదునైన గోళ్ళు కలవు.
  9. ప్లాటిపస్ మరియు ఎకిడ్నా నీటిని ఇష్టపడతాయి. ప్లాటిపస్ నీటిలో ఆహారం వేటాడుతుంది.
  10. ఎకిడ్నా నీటిలో ఉండుట ద్వారా తన శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరణ చేస్తుంది.

ప్రశ్న 11.
అనిమేలియా రాజ్యాన్ని వాటి లక్షణాల ఆధారంగా ఒక ఫ్లో చార్టు తయారుచేయండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 5

ప్రశ్న 12.
వెన్నెముక గల జీవులను ఉపరితరగతులుగా విభజిస్తూ ఫ్లోచార్ట్ తయారు చేయండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 6

ప్రశ్న 13.
శాస్త్రవేత్తలు వర్గీకరణపై చేసిన పరిశోధనలను నీవు ఏ విధంగా ప్రశంసిస్తావు? (AS 6)
జవాబు:

  1. శాస్త్రవేత్తలు చేసిన వర్గీకరణముల వలన వైవిధ్యము కలిగిన జీవుల అధ్యయనం సులభమయ్యింది.
  2. వివిధ మొక్కలు మరియు జంతువుల మధ్య గల సంబంధాలను వర్గీకరణ ద్వారా అవగాహన చేసుకోవచ్చు.
  3. జీవులు సరళస్థితి నుండి సంక్లిష్ట స్థితి వరకు జరిగిన పరిణామము వర్గీకరణ ద్వారా మనకు అవగాహన కలుగుతుంది.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 14.
‘గబ్బిలం పక్షి కాదు క్షీరదం’ అని సుజాత చెప్పింది. మీరు ఆమె మాటలను ఏ విధంగా సమర్థిస్తారు? (AS 7)
జవాబు:

  1. గబ్బిలం పక్షి కాదు క్షీరదం అని సుజాత చెప్పిన మాటను సమర్థిస్తాను.
  2. ఇతర క్షీరదాలవలె మానవునితో సహా గబ్బిలానికి శరీరం మీద వెంట్రుకలు లేదా రోమములు కలవు.
  3. గబ్బిలం ఉష్ణరక్త జంతువు.
  4. పుట్టిన గబ్బిలం పాలకోసం తల్లిపాల మీద ఆధారపడుతుంది.
  5. గబ్బిలములు క్షీరదములలో గల ఏకైక ఎగిరే క్షీరదము.

9th Class Biology 5th Lesson జీవులలో వైవిధ్యం Textbook InText Questions and Answers

9th Class Biology Textbook Page No. 63

ప్రశ్న 1.
వృక్షరాజ్యాన్ని వాటి లక్షణాల ఆధారంగా ఒక ఫ్లోచార్ట్ తయారు చేయండి. పేజి నెం. 63
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 8

ప్రశ్న 2.
మీ తరగతిలో నలుగురు లేదా ఐదుగురు విద్యార్థులు ఒక జట్టుగా ఏర్పడి పాఠశాల గ్రంథాలయం లేదా అంతర్జాలం నుండి ఏవైనా 20 మొక్కలు, 20 జంతువుల శాస్త్రీయ నామాలతో జాబితా రూపొందించండి. (పేజి నెం. 71)
జవాబు:
మొక్కల శాస్త్రీయ నామములు :

మొక్క పేరు శాస్త్రీయ నామం
1. మామిడి మాంగి ఫెరా ఇండికా
2. కొబ్బరి కాకస్ న్యూసిఫెర
3. తాటి బొరాసస్ ప్లాజెల్లి ఫెర్
4. గరిక గడ్డి సైనోడాన్ డాక్టలాన్
5. వరి ఒరైజా సటైవా
6. అరటి మ్యూసా పారడైసికా
7. మర్రి ఫైకస్ బెంగాలెన్సిస్
8. పెద్ద ఉసిరి ఎంబ్లికా అఫిసినాలిస్
9. తోటకూర అమరాంతస్ గాంజిటికస్
10. తులసి ఆసిమమ్ సాంక్టమ్
11. టేకు టెక్టోనా గ్రాండిస్
12. కనకాంబరము క్రొసాండ్ర ఇన్ఫండిబులిఫార్మిస్
13. వంకాయ సొలానమ్ మెలాంజినా
14. సపోట ఎక్రస్ జపోట
15. గడ్డి చామంతి ట్రెడాక్స్ ప్రొకంబెన్స్
16. ధనియాలు (కొత్తిమీర) కొరియాండ్రమ్ సటైవమ్
17. జామ సిడియమ్ గ్వజావ
18. గులాబి రోజా గ్రాండిప్లోరా
19. చింత టామరిండస్ ఇండికా
20. మందార హైబిస్కస్ రోజా – సైనెన్సిస్
21. బెండ అబెలియాస్మస్ ఎస్కూలెంటస్
22. జీడిమామిడి అనకార్డియం ఆక్సిడెంటాలిస్
23. పైనాపిల్ అనాన స్క్వామోజస్
24. ఆవాలు బ్రాసికా జెన్షియా
25. క్యా బేజి బ్రాసికా ఒలరేసియా రకం కాపిటేట
26. తేయాకు కెమెల్లియా సైనన్సిస్
27. నారింజ సిట్రస్ సైనన్సిస్
28. పసుపు కుర్కుమా లోంగా
29. ఉమ్మెత్త దతురా మెటల్
30. వెదురు డెండ్రోకాలమస్ కలోస్ట్రాఖియస్
31. మిరప కాప్సికమ్ ఫ్రూటి సెన్స్

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

జంతువుల శాస్త్రీయ నామములు :

జంతువు పేరు శాస్త్రీయ నామం
1. కాకి కార్పస్ స్పెండెన్స్
2. పిచ్చుక పాస్సర్ డొమెస్టికస్
3. కప్ప రానాటైగ్రీనా
4. కుక్క కేనిస్ ఫెమిలియారీస్
5. పిల్లి ఫెలిస్ డొమెస్టికస్
6. చింపాంజి ఎంత్రోపిథికస్ ట్రైగ్లో డైట్స్
7. కోడి గాలస్ డొమెస్టికస్
8. పావురము కొలంబియ లివియ
9. గేదే బుబాలస్ బుబాలిస్
10. తేనెటీగ ఎపిస్ ఇండికా
11. వానపాము ఫెరిటీమా పోస్తుమా
12. బొద్దింక పెరిప్లానేటా అమెరికానా
13. జలగ హిరుడినేరియా గ్రాన్యులోస
14. రొయ్య పాలియమాన్ మాక్మో సోనీ
15. ఈగ మస్కా సెబ్యులోం
16. నత్త పైలాగ్లోబోసా
17. గుడ్లగూబ బుబోబుబో
18. తాచుపాము నాజనాజ
19. గుర్రము ఈక్వస్ కబాలస్
20. రామచిలుక సిట్టిక్యుల క్రామెరి
21. చీమ హైమినోప్టెరస్ ఫార్మిసిడి
22. గాడిద ఇక్వియస్ అసినస్
23. కంగారు మాక్రోఫస్ మాక్రోపాజిడే
24. కుందేలు రొడెంటియా రాటస్
25. ఏనుగు ప్రోబోసిడియా ఎలిఫెండిడే
26. జిరాఫీ రాఫాకామిలో పారాలిస్
27. పంది ఆడియో డక్టలా సుయిడే
28. నీటి గుర్రం ఇప్పోకాంపస్ సిగ్నాంథిగే
29. నెమలి పావో క్రిస్టేటస్

9th Class Biology 5th Lesson జీవులలో వైవిధ్యం Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

ప్రశ్న 1.
మొక్కలలో ఆకుల పరిశీలన :

మొక్కలలో ఆకుల పరిశీలన. వివిధ రకాల మొక్కల ఆకులను సేకరించి వాటిని పరిశీలించి పట్టికను పూరించండి.
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 9
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 10
ఎ) పైన పరిశీలించిన ఆకులలో ఏ రెండు ఆకులైనా ఒకే విధంగా ఉన్నాయా? (ఆకారం, పరిమాణం, రంగులో)
జవాబు:
ఏ రెండు ఆకులూ పరిమాణంలోను, ఆకారంలోను ఒకే విధముగా లేవు.

బి) సేకరించిన ఆకులలో మీరు గుర్తించిన ముఖ్యమైన భేదాలను రాయండి. ఏ రెండు లక్షణాలలో ఎక్కువగా భేదాలు చూపుతున్నాయో గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 11
i) కొన్ని ఆకుల ఆకారం అండాకారంగాను, మరికొన్ని ఆకుల ఆకారం దీర్ఘవృత్తాకారంగాను ఉంది.
ii) పత్రపు అంచులు కొన్నిటికి నొక్కబడి, కొన్ని రంపము అంచుగలవిగా మరికొన్ని నొక్కులు లేనివిగా ఉన్నాయి.
iii) ఆకుల పొడవు, వెడల్పులలో ఆకులు అన్నీ వివిధ కొలతలలో ఉన్నాయి.

కృత్యం – 2

ప్రశ్న 2.
మొక్కల పరిశీలన :
మీ పరిసరాలలో గల 5 రకాల మొక్కలు వాటి పుష్పాలతో సేకరించి వాటి బాహ్య లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించండి. పరిశీలించిన అంశాలను పట్టికలో నమోదు చేయండి.
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 12

1. ఏయే లక్షణాలలో ఎక్కువ తేడాలు ఉండటం గమనించారు?
జవాబు:
కాండం పొడవు, కణుపుల మధ్య దూరం, ఆకుల, ఈనెల వ్యాపనంలో మరియు వేరు వ్యవస్థలలో తేడాలు ఉన్నాయి.

2. అతి తక్కువ భేదం చూపుతున్న లక్షణమేది?
జవాబు:
పుష్పం నందు అతి తక్కువ భేదం చూపుతున్నవి – పుష్పాలు గుత్తులుగా రావడం అనేది.

3. మీకు వాటిలో ఏమైనా పోలికలు కనిపించాయా? కనిపిస్తే అవి ఏమిటి?
జవాబు:
ఈనెల వ్యాపనంలోను, రక్షక ఆకర్షక పత్రాల సంఖ్యలోను వేరువ్యవస్థలోను పోలికలు ఉన్నాయి.

4. పీచు వేర్లు కలిగిన మొక్కలలో పుష్పాలు గుంపులుగా ఉన్నాయా? లేక వేరే విధంగా ఉన్నాయా?
జవాబు:
గుంపులుగా ఉంటాయి.

5. పై పట్టికలో పేర్కొన్న లక్షణాలు కాకుండా ఇంకేమైనా కొత్త లక్షణాలను మీరు పరిశీలించారా ? వాటిని నమోదు చేయండి.
జవాబు:
గులాబి చెట్లకు ముళ్ళుంటాయి.

6. పట్టికలో పేర్కొన్న లక్షణాలు ప్రాతిపదికగా పరిశీలిస్తే ఏ రెండు మొక్కలైనా ఒకేలా ఉన్నాయా?
జవాబు:
లేవు.

7. వేరు వేరు మొక్కలలో ఒకే రకమైన లక్షణాలు పరిశీలించినట్లయితే వాటిని పేర్కొనండి.
జవాబు:
వరి, మొక్కజొన్న నందు సమాంతర వ్యాపనం, పీచు వేరు వ్యవస్థ ఉన్నాయి. మామిడి, గులాబి, జామనందు తల్లివేరు వ్యవస్థ, జాలాకార ఈనెల వ్యాపనం ఉన్నాయి.

8. మీరు సేకరించిన మొక్కలలో ఏ రెండు మొక్కలలో అయినా ఎక్కువ లక్షణాలు ఒకే రకంగా ఉన్నాయా? అవి ఏమిటి?
జవాబు:
జామ, గులాబినందు ఎక్కువ లక్షణాలు ఒకే విధంగా ఉన్నాయి.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

కృత్యం – 3

ప్రశ్న 3.
విత్తనాలను పరిశీలిద్దాం :
వివిధ రకముల విత్తనములందు గల బీజదళాల సంఖ్యను నీవు ఏ విధముగా పరిశీలిస్తావు? నీ యొక్క పరిశీలనలను పట్టికయందు నమోదు చేయుము.
జవాబు:
విత్తనమునందు గల బీజదళాల సంఖ్యను పరిశీలించు విధము :

  1. పెసలు, కందులు, మినుములు, గోధుమ, వరి, వేరుశనగ, మొక్కజొన్న విత్తనములను సేకరించి వాటిని ఒక రోజు నీటిలో నానబెట్టాలి.
  2. వీటిలో మొక్కజొన్న విత్తనాన్ని తీసుకొని చేతివేళ్ళతో నొక్కాలి.
  3. మొక్కజొన్న విత్తనము నుండి తెల్లని నిర్మాణం బయటకు వస్తుంది.
  4. తెల్లని నిర్మాణమును పిండం లేదా పిల్లమొక్క అంటారు.
  5. పిండం కాకుండా మన చేతిలో మిగిలిన భాగంలో ఉన్న విత్తనం పైభాగంలో ఒకే బీజదళం ఉంటుంది.
  6. ఇదే విధంగా మిగిలిన అన్ని విత్తనాలనూ నొక్కి పరిశీలించాలి.
  7. భూతద్దం ద్వారా పరిశీలించిన అంశాలను పట్టికలో నమోదుచేయాలి.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 13

కృత్యం – 4

ప్రశ్న 4.
ఏకదళ, ద్విదళ బీజ మొక్కల లక్షణాలను పరిశీలిద్దాం :
ఏకదళ, ద్విదళ బీజ మొక్కలను సేకరించి వాటి లక్షణాలను పరిశీలించి పట్టికను పూరించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 14
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 15

కృత్యం – 5

ప్రశ్న 5.
కీటకాల బాహ్య లక్షణాలను పరిశీలిద్దాం.
మీ పరిసరాలలోని ఈగ, దోమ, చీమ, పేడ పురుగు, సీతాకోక చిలుక మాత్, బొద్దింక మొదలైన కీటకాలను పరిశీలించి పట్టికను పూర్తిచేయండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 16

1. అన్ని కీటకాలు ఒకే ఆకారం, పరిమాణం కలిగి ఉన్నాయా?
జవాబు:
కీటకాలు అన్నీ ఒకే ఆకారం, పరిమాణం కలిగి ఉండలేదు.

2. కాళ్ళను పరిశీలిస్తే వాటిలో కనిపించే తేడాలేమిటి?
జవాబు:
కొన్ని కీటకాలకు కీళ్ళు కలిగిన కాళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క కీటకము కాళ్ళనందు అతుకులు ఉన్నాయి.

3. రెక్కలను పరిశీలిస్తే వాటిలో కనిపించే తేడాలేమిటి?
జవాబు:
రెక్కలు పెద్దవిగాను, చిన్నవిగాను ఉన్నాయి. కొన్నింటిలో 1 జత రెక్కలు ఉంటే కొన్నింటిలో – (సీతాకోకచిలుక, మాత్, బొద్దింక) రెండు జతల రెక్కలు ఉన్నాయి. రెక్కలు వివిధ రంగులలో ఉన్నాయి.

4. రెక్కల సంఖ్యకి, కాళ్ళ సంఖ్యకి మధ్య ఏమైనా సంబంధం ఉందా?
జవాబు:
కాళ్ళ సంఖ్య స్థిరంగా ఉంటే అనగా 6 కాళ్ళు ఉంటే, రెక్కలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి.

5. ఏ రెండు కీటకాల లక్షణాలు ఒకేలా ఉన్నాయా? ‘అవును’ అయితే వాటిని మీ తరగతిలో ప్రదర్శించండి. ‘లేదు’ అయితే తేడాలను మీ నోట్‌బుక్ లో రాయండి.
జవాబు:
ఏ రెండు కీటకాల లక్షణాలు ఒకే విధంగా లేవు. సీతాకోకచిలుక, బొద్దింక కాళ్ళ సంఖ్యలోను, రెక్కలసంఖ్యలోను ఒకేవిధంగా ఉన్నప్పటికి ఆకారంలోను, రంగులోను తేడాను చూపిస్తున్నాయి.

కృత్యం – 6

ప్రశ్న 6.
మానవులలో వైవిధ్యాన్ని పరిశీలిద్దాం :
జంతువులలో వైవిధ్యం పరిశీలించడానికి పాఠశాలలోని పదిమంది పిల్లలను ఎంపిక చేసుకొని వారి వివరములను క్రింది పట్టిక యందు నింపండి. ఒక్కొక్క జట్టు యందు నలుగురు చొప్పున జట్లుగా ఏర్పడాలి.
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 17
జవాబు:
1. ఏ లక్షణం వీరిని విభజించడంలో ఎక్కువగా తోడ్పడుతుంది?
జవాబు:
‘ఎత్తు’ లక్షణం ద్వారా వీరిని విభజించవచ్చు.

2. ఏ లక్షణం గ్రూపులలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది?
జవాబు:
బొటన వేలిముద్ర

3. మీ తరగతిలో ఏ ఇద్దరు విద్యార్థులకైనా ఒకే విధమైన లక్షణాలు ఉన్నాయా?
జవాబు:
లేవు

4. మీ పట్టికను ఇతరులతో పోల్చి వివిధ పట్టికలలో ఉన్న అంశాల మధ్య తేడాలను నమోదు చేయండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

కృత్యం – 7

ప్రశ్న 7.
రెండు వేరు వేరు మొక్కలలో వైవిధ్యాన్ని పరిశీలిద్దాం.
రెండు వేరు వేరు వేప మొక్కలలోని వైవిధ్యంను పరిశీలించి కింది పట్టికను పూర్తి చేయంది.
సమాన పరిమాణాలలో ఉన్న రెండు వేప మొక్కలను ఎంపిక చేసుకొని వాటి లక్షణాలను పట్టికలో పూరించాలి.
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 18
1. ఒకే రకమైన రెండు వేపమొక్కలలో ఏ ఏ తేడాలను నీవు గమనించావు?
జవాబు:
పొడవులో తేడా, ఆకుల సంఖ్యలో తేడా గలవు.

2. అలాంటి తేడాలు వాటిలో ఉండడానికి కారణాలు ఏమై ఉండవచ్చునని ఊహిస్తున్నావు?
జవాబు:
ఒక్కొక్క మొక్క దాని లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి. మొక్క వయసు కూడా లక్షణాలలో తేడా ఉండడానికి కారణమవుతుంది.

కృత్యం – 8

ప్రశ్న 8.
వివిధ రకాల నాచు మొక్కలను పరిశీలిద్దాం.
నాచు మొక్క (మాస్)ను సేకరించి దానిని భూతద్దంతో గాని సంయుక్త సూక్ష్మదర్శినితో గాని పరిశీలించండి. బొమ్మ గీసి నాచు మొక్కల లక్షణములు రాయండి.
జవాబు:

  1. గోడలపైన, ఇటుకల మీద వానాకాలంలో పెరిగే ‘పచ్చని నిర్మాణాలను సేకరించాలి.
  2. వాటి నుండి కొంతభాగం ఒక స్లెడ్ పైన తీసుకొని సంయుక్త సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 19
పరిశీలనలు :

  1. నాచు మొక్క సైడ్ నందు కనిపించే పువ్వుల మాదిరి నిర్మాణాలను సిద్ధబీజాలు అంటారు.
  2. సిద్ధ బీజాలలో చాలా తక్కువ పరిమాణంలో ఆహారపదార్థాలు నిల్వ ఉంటాయి.
  3. సిద్ధబీజాలు సిద్ధబీజాశయము నుండి ఉత్పత్తి అవుతాయి.

ప్రయోగశాల కృత్యములు

ప్రశ్న 1.
ప్రయోగశాల నుండి హైడ్రాస్లెడ్ ను సేకరించి మైక్రోస్కోపులో పరిశీలించండి. బొమ్మను గీచి, భాగాలు గుర్తించి పరిశీనలను రాయండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 20
పరిశీలనలు :
1. హైడ్రా శరీరం ఏకకణ నిర్మితమా ? బహుకణ నిర్మితమా?
జవాబు:
బహుకణ నిర్మితము.

2. హైడ్రా శరీరం లోపల ఎలా కనిపిస్తుంది?
జవాబు:
హైడ్రా శరీరం లోపల ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది. దానిని శరీరకుహరం అంటారు.

3. హైడ్రాలో ఇంకేమైనా లక్షణాలు కనిపించాయా?
జవాబు:
1) హైడ్రా జీవుల అపముఖము వైపు ఒక సన్నని కాడ చివర ఉన్న ఆధారముతో అంటిపెట్టుకొని ఉంటుంది.
2) స్వేచ్ఛగా ఉండే ముఖభాగము హైపోస్టోమ్ మీద అమరి ఉంటుంది.
3) హైపోస్టోమ్ చుట్టూ 6-10 స్పర్శకాలు ఉంటాయి.
4) కాడ ప్రక్కభాగమున నోరు లేదా స్పర్శకాలతో కూడిన ప్రరోహము ఉంటుంది.

ప్రశ్న 2.
బద్దెపురుగు స్పెసిమన్ ను పరిశీలించి బొమ్మగీచి, భాగాలు గుర్తించండి. పరిశీలనలు రాయండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 21
పరిశీలనలు:
1. జీవి శరీరం ఎలా కనిపిస్తుంది?
జవాబు:
జీవి శరీరం చదునుగా ఉండి, రిబ్బన్ వలె ఉంటుంది. వీటిని ప్లాటీహెల్మింథిస్ లేదా చదును పురుగు అంటారు.

2. జీవి శరీరంలో ఏదైనా ఖాళీ ప్రదేశం కనిపించినదా?
జవాబు:
ఖాళీ ప్రదేశం లేదు. నిజ శరీరకుహరం ఏర్పడలేదు.

3. దాని తల మరియు తోక ఎలా ఉంది?
జవాబు:
తలభాగము చిన్నదిగా గుండుసూదంత పరిమాణంలో ఉంటుంది. తోక కలిగి ఉంటుంది.

ప్రశ్న 3.
నులిపురుగు స్పెసిమన్ ను పరిశీలించండి. గమనించిన అంశాలను నోటు పుస్తకంలో రాయంది. దాని బొమ్మ గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 22
పరిశీలనలు :
1. జీవి శరీరం బద్దెపురుగు (ప్లాటీ హెల్మింథిస్) ను పోలి ఉందా?
జవాబు:
జీవి శరీరం బద్దెపురుగును పోలియుండలేదు. శరీరం గుండ్రంగా ఉంది.

2. బద్దెపురుగు మరియు నులిపురుగులలో ఏమి తేడాలు గమనించారు?
జవాబు:
బద్దెపురుగు చదునుగా, శరీరకుహరం లేకుండా ఉంటుంది. నులిపురుగు గుండ్రంగా మిథ్యాకుహరం కలిగి ఉంటుంది.

3. స్పెసిమన్ లో దాని తల మరియు తోక ఎలా కన్పిస్తుంది?
జవాబు:
తల మరియు తోకలు చిన్నవిగా ఉండి మొనదేలి ఉంటాయి.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 4.
వానపాము స్పెసిమను పరిశీలించండి. మీరు గమనించిన అంశాలు నోటుపుస్తకంలో రాయండి. దాని బొమ్మ గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 23
పరిశీలనలు :
1. వానపాము ఎలా కదులుతుంది?
జవాబు:
వర్తులాకార మరియు నిలువు కండరాల ఏకాంతర సంకోచ, సడలికల వల్ల కదులుతుంది.

2. దాని రంగు ఎలా ఉంది? శరీరంలో వలయాలు ఉన్నాయా?
జవాబు:
ముదురు గోధుమ వర్ణంలో ఉంది. శరీరంలో వలయాలు ఉన్నాయి.

3. శరీర రంగులో, శరీర భాగాల్లో ఏమి తేడా గమనించారు?
జవాబు:
శరీర పైభాగము ముదురు గోధుమ రంగులో ఉంటుంది. శరీర అడుగుభాగము లేత గోధుమ రంగులో ఉంటుంది. శరీర భాగమునందు ఖండితములు 14 నుండి 17 వరకు ఉన్నాయి. చర్మం మందంగా ఉంది. అక్కడ చర్మం శ్లేష్మంను స్రవించి గట్టిపడుతుంది. శరీరమంతా వలయాకార ఖండితాలు ఉన్నాయి.

ప్రశ్న 5.
బొద్దింక స్పెసిమన్ పరిశీలించండి. మీరు గమనించిన అంశాలు నోటు పుస్తకంలో రాయండి. దాని బొమ్మ గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 24
పరిశీలనలు :
1. బొద్దింక చర్మం ఎలా కనిపిస్తుంది?
జవాబు:
బొద్దింక చర్మం గట్టిదైన అవభాసినితో ఆవరించబడి ఉంది.

2. వాటి చర్మంపై ఏదయినా గట్టిపొరను గమనించారా?
జవాబు:
గట్టి పొరను గమనించాము. దానిని అవభాసిని అంటారు.

3. బొద్దింక కాళ్ళను గమనించండి. అవి ఎలా కన్పిస్తున్నాయో చెప్పండి.
జవాబు:
బొద్దింకలో 3 జతల కాళ్ళున్నాయి. అవి కీళ్ళు కలిగిన కాళ్ళు.

4. బొద్దింక శరీరాన్ని ఎన్ని భాగాలుగా విభజించవచ్చు?
జవాబు:
బొద్దింక శరీరాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి : తల, రొమ్ము , ఉదర భాగం.

5. బొద్దింక మాదిరిగా కీళ్ళు కలిగిన కాళ్ళు ఉండే మరికొన్ని కీటకాల జాబితా రాయండి.
జవాబు:
సీతాకోక చిలుక, దోమ, ఈగ, గొల్లభామ, చీమ మొదలైనవి.

ప్రశ్న 6.
నత్త స్పెసిమనను పరిశీలించి గమనించిన అంశాలను నోటుపుస్తకంలో రాయండి. దాని బొమ్మ గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 25
పరిశీలనలు :
1. నత్త బాహ్య స్వరూపం ఎలా కన్పిస్తుంది?
జవాబు:
నత్త బాహ్య స్వరూపం మెత్తగా ఉండి గట్టి కర్పరంతో ఉంటుంది.

2. నత్తను కాసేపు కదలకుండా ఉంచండి. అది కదలికను ఎక్కడ నుంది మొదలు పెట్టింది? ఆ భాగం ఏమిటి?
జవాబు:
పాదము నుండి కదలికను మొదలుపెట్టింది.

3. నత్త శరీరం గట్టిగా ఉందా? మెత్తగా ఉందా?
జవాబు:
నత్త శరీరం గట్టిగా ఉంది.

4. నత్త శరీరంలో ఏవైనా స్పర్శకాలు వంటి నిర్మాణాలు గుర్తించారా?
జవాబు:
నత్త శరీరంలో స్పర్శకాలు వంటి నిర్మాణాలు ఉన్నాయి.

ప్రశ్న 7.
సముద్ర నక్షత్రం స్పెసిమను పరిశీలించండి. మీరు గమనించిన అంశాలను నోటు పుస్తకంలో రాయండి. దాని బొమ్మ గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 26
పరిశీలనలు:
1. సముద్ర నక్షత్రం శరీరం చర్మంపై ఏమి గమనించారు?
జవాబు:
సముద్ర నక్షత్రం శరీరం చర్మంపై ముళ్ళు ఉన్నాయి.

2. వాటికి చేతుల వంటి నిర్మాణాలు ఏమైనా ఉన్నాయా? అవి ఎలా ఉన్నాయి?
జవాబు:
జీవి శరీరం పంచభాగ వ్యాసార్ధ సౌష్టవము కలిగి ఐదు చేతుల వంటి నిర్మాణాలు ఉన్నాయి.

3. శరీరం మధ్యలో ఏదైనా రంధ్రాన్ని గమనించారా?
జవాబు:
సముద్ర నక్షత్రం మధ్య భాగంలో చిన్న రంధ్రము ఉన్నది. అది దాని యొక్క నోరు.

AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం

ప్రశ్న 8.
పాఠశాల ప్రయోగశాల నుండి చేప స్పెసిమన్ ను పరిశీలించండి. మీరు గమనించిన అంశాలు నోటుపుస్తకంలో రాయండి. దాని బొమ్మ గీచి, భాగాలు గుర్తించండి.
జవాబు:
పరిశీలనలు :
1. చేప యొక్క చర్మం గమనించి ఎలా ఉందో చెప్పంది.
జవాబు:
చేప చర్మం తేమగా, జిగటగా పొలుసులతో నిండియున్నది.
AP Board 9th Class Biology Solutions 5th Lesson జీవులలో వైవిధ్యం 27

2. పొలుసులు లేని భాగాలను చేపలో గుర్తించి రాయండి.
జవాబు:
తలభాగము, ఉదరభాగము నందు పొలుసులు ఉండవు.

3. చేప యొక్క నోటిని తెరచి చేప నోటిలో ఏముందో చెప్పంది.
జవాబు:
చేప నోటిలో దంతాలు అమరి ఉన్నాయి. నాలుక ఉన్నది.

4. చేప యొక్క చెవి భాగాన్ని తెరచి అక్కడ ఏమి చూసారో చెప్పండి.
జవాబు:
చేప యొక్క చెవిభాగాన్ని తెరచి చూస్తే అక్కడ ఎర్రగా దువ్వెన మాదిరిగా ఉన్న మొప్పలు ఉన్నాయి.

5. చేపను కోసి దాని గుండెను పరిశీలించండి.
జవాబు:
చేప గుండె ఎరుపురంగులో చిన్నగా ఉన్నది.

6. చేప హృదయంలో ఎన్ని గదులున్నాయో తెల్పండి.
జవాబు:
చేప హృదయంలో రెండు గదులున్నాయి.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

SCERT AP 9th Class Biology Guide Pdf Download 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 4th Lesson Questions and Answers ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

9th Class Biology 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కణాలలోని, బయటకు పదార్థాల కదలికలను నియంత్రించే నిర్మాణం (AS 1)
ఎ) కణకవచం
బి) కణత్వచం
సి) రెండూ
డి) పైవేవీ కావు
జవాబు:
బి) కణత్వచం

ప్రశ్న 2.
ఖాళీలను పూరించండి. (AS 1)
ఎ) పువ్వుల పరిమళం మనకు చేరే ప్రక్రియ …………..
బి) భోపాల్ విషాధంలో MIC అను వాయువు నగరమంతా వ్యాపించిన పద్ధతి
సి) పొటాటో ఆస్మోమీటర్ లోనికి నీరు ………………. పద్ధతి ద్వారా ప్రవేశిస్తుంది.
డి) తాజా ద్రాక్ష ఉప్పు నీటిలో ఉంచినప్పుడు కృశించుటకు కారణం. ………………
జవాబు:
ఎ) వ్యాపనం
బి) వ్యాపనం
సి) ద్రవాభిసరణం
డి) ద్రవాభిసరణం

ప్రశ్న 3.
త్వచానికి ఉండే పారగమ్య స్వభావం అంటే ఏమిటి? సరైన ఉదాహరణలతో వివరించండి. (AS 1)
జవాబు:
ద్రావితాలు, ద్రావణిని తమ గుండా ప్రసరింపనీయడాన్ని పారగమ్యత అంటారు.

ఉదాహరణ :

  1. ప్లాస్మాపొర తన గుండా కార్బన్ డై ఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్ మరియు క్రొవ్వులో కరిగే ఆల్కహాలు, ఈథర్ మరియు క్లోరోఫామ్ లను తన గుండా పోవటానికి అనుమతి ఇస్తుంది.
  2. ప్లాస్మాపొర తన గుండా పాలిసాకరైడ్లు, ఫాస్ఫోలిపిడ్లు మరియు ప్రోటీనులను తనగుండా పోవడానికి అనుమతి ఇవ్వదు.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

ప్రశ్న 4.
ఎండిన కూరగాయలు మంచినీటిలో ఉంచినపుడు తాజాగా తయారవుతాయి. కారణమేమి? (AS 1)
జవాబు:

  1. ఎండిన కూరగాయలందు నీరు తక్కువగా ఉంటుంది మరియు లవణాల గాఢత ఎక్కువగా ఉంటుంది.
  2. ఎండిన కూరగాయలను మంచినీటిలో ఉంచినపుడు అవి నీటిని గ్రహించి తాజాగా మారతాయి.
  3. మంచినీటిలో కూరగాయలను ఉంచినపుడు ద్రవాభిసరణ ప్రక్రియ జరిగి కూరగాయలలోనికి నీరు ప్రవేశిస్తుంది.

ప్రశ్న 5.
సముద్రపు నీటి నుండి మంచి నీటిని పొందే విధానం ఏది? (AS 1)
జవాబు:
వ్యతిరేక ద్రవాభిసరణము ద్వారా సముద్రపు నీటి నుండి మంచినీటిని పొందుతాము.

ప్రశ్న 6.
సముద్రపు చేపను మంచినీటి ఎక్వేరియమ్ లో ఉంచితే ఏమవుతుంది? (AS 2)
జవాబు:
సముద్రపు చేపను మంచినీటి ఎక్వేరియమ్ లో ఉంచితే చనిపోతుంది.

కారణాలు :

  1. సముద్రపు చేప శరీరము నందు లవణాలు ఎక్కువ గాఢతలో ఉంటాయి.
  2. సముద్రపు చేపను మంచినీటి ఎక్వేరియమ్ లో ఉంచినపుడు చేప శరీరములోనికి నీరు ద్రవాభిసరణము ద్వారా ప్రవేశిస్తుంది.
  3. ఎక్కువ మొత్తంలో నీరు చేప శరీరంలోనికి ప్రవేశించడం వలన కణములు ఉబ్బి పగిలిపోతాయి. చేప చనిపోతుంది.

ప్రశ్న 7.
డాక్టర్లు (ఉప్పునీటి ద్రావణం) సెలైనను మాత్రమే రక్తంలోకి ఎక్కిస్తారు. మంచినీరు కాదు. ఎందుకో రాయండి. (AS 2)
జవాబు:

  1. మంచి నీటిని సిరలోనికి ఎక్కించినపుడు దాని వలన కొద్దిమేర ‘కణముల విచ్ఛిన్నము జరుగుతుంది.
  2. ఎర్ర రక్తకణములు సాధారణముగా నీటిచేరిక వలన విచ్చిన్నం చెందుతాయి.
  3. ఎక్కువ మొతంలో శరీరంలోనికి మంచినీటిని ఎక్కించినపుడు ఎర్రరక్త కణములు విచ్చిన్నం అవటం మాత్రమే కాకుండా మెదడుకు నష్టం జరగటం, గుండె ఆగిపోవటం జరిగి మనిషి చనిపోవచ్చు.
  4. అందువలన డాక్టర్లు సరిపోయినంత మొత్తంలో గల ద్రవపదార్ధములు అనగా సెలైనును మాత్రమే రక్తంలోకి ఎక్కిస్తారు.

ప్రశ్న 8.
మన రక్తంలోకి అంతర సిరల ద్వారా 50% గ్లూకోజ్ ద్రావణాన్ని నేరుగా ఎక్కిస్తే ఏమవుతుంది? (AS 2)
జవాబు:

  1. 50% గ్లూకోజ్ ద్రావణాన్ని డెక్టోజ్ అంటారు. దీనిని మెదడు, వెన్నెముక సంబంధం గల ఒత్తిడిని తగ్గించడానికి మరియు శరీర అంతరభాగాలలో ద్రవపదార్థం చేరికను తగ్గించడానికి ఉపయోగిస్తారు.
  2. అంతర సిరల’ ద్వారా 50% గ్లూకోజ్ ద్రావణాన్ని నేరుగా ఎక్కిస్తే కొంతమందిలో ఇది వేదనాత్మకతను (ఎలర్జీ) కలిగిస్తుంది.
  3. వేదనాత్మక చర్యలు అనగా నాడులు ఉత్తేజం చెందడం, కీళ్ళ వద్ద వ్యాధి సోకటం, అవయవాలలోని కణజాలములు చనిపోవటం, వ్యాధిసోకిన భాగము వరకు సిరలందు రక్తం గడ్డకట్టడం మొదలైనవి.
  4. అందువలన గాఢత గల 50% గ్లూకోజ్ (డెక్టోజ్) ద్రావణాన్ని నీటికి కలిపి పలుచగా చేసిన తరువాత సిరగుండా ఎక్కించాలి.

ప్రశ్న 9.
పారగమ్యత సామర్థ్యం కణాలకి లేకపోతే ఏమవుతుంది? (AS 2)
జవాబు:

  1. కణములకు పారగమ్యత సామర్థ్యం లేకపోయినట్లయితే, అవి ముఖ్యమైన జీవక్రియలను నిర్వహించలేవు.
  2. ఆక్సిజన్, గ్లూకోజ్, విటమినులు, క్రొవ్వులు కణమునకు అందకపోయినట్లయితే కణములు జీవక్రియలను జరపలేవు.
  3. పరిపక్వం చెందిన కణములకు పారగమ్యత సామర్థ్యం లేకపోయినట్లయితే విషపదార్ధములు పేరుకొనిపోతాయి. తద్వారా కణం నశించిపోతుంది.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

ప్రశ్న 10.
వ్యాపనం గురించి తెలుసుకోవడానికి నీవు చేసిన ప్రయోగంలో నీవు గమనించిన దేమిటి? (AS 3)
జవాబు:
గమనించిన విషయాలు :

  1. ద్రవ, వాయుపదార్థాలలో వ్యాపనం జరుగుతుంది.
  2. ఎక్కువ గాఢత నుండి తక్కువ గాఢతకు పదార్థాలు కదలడం వలన వ్యాపనం జరుగుతుంది.
  3. వ్యాపనమనేది భౌతిక చర్య.
  4. గాలి లేదా నీరు లాంటి మాధ్యమంలో కొన్ని పదార్థాలను ఉంచినప్పుడు అవి ఆ మాధ్యమంలో సమానంగా విస్తరించడాన్ని వ్యాపనం (diffussion) అంటారు.

ప్రశ్న 11.
మీ స్నేహితులతో చర్చించి వ్యాపనం జరిగే సందర్భాల జాబితా రాయండి. (AS 4)
జవాబు:

  1. మా స్నేహితుడు రాసుకొచ్చిన సెంటు వాసన తరగతి గది అంతయూ వ్యాపిస్తుంది.
  2. మధ్యాహ్న భోజన సమయంలో మా స్నేహితురాలి క్యారేజిలో నుండి వచ్చిన మసాలా కూరవాసనను మేమందరం ఆస్వాదించాము.
  3. సాయంత్రం ఇంటికి వెళ్ళే సమయంలో మురికి కాలువ నుండి వచ్చిన దుర్గంధమును పీల్చలేకపోయాము.
  4. రాత్రికి మా ఇంటిలో దేవుని వద్ద వెలిగించిన అగరుబత్తి వాసన ఇల్లంతా వ్యాపించినది.
  5. మా వీధిలో వెళుతున్న పెళ్ళి ఊరేగింపునకు ముందు కాల్చిన బాణాసంచా వాసన మా వీధి అంతయూ వ్యాపించినది.

ప్రశ్న 12.
మీరు కోడిగుడ్డును ఉపయోగించి చేసిన ప్రయోగాన్ని వివరించే దశలను తెలిపే ఫ్లోచార్ట్ గీయండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 1

ప్రశ్న 13.
మీరు ఒక కొబ్బరికాయను కొన్నారు. దానిని ఊపినప్పుడు నీరు నిండుగా లేదని తెలిసింది. కొబ్బరికాయలోనికి రంధ్రం చేయకుండా నీరు నింపగలరా? ఎలా? (AS 6)
జవాబు:

  1. రంధ్రము చేయకుండా కొబ్బరికాయలోనికి నీరును నింపలేము.
  2. కొబ్బరికాయను నీళ్ళలో ఉంచినప్పటికి ద్రవాభిసరణం ద్వారా నీరు దానిలోనికి ప్రవేశించదు.
  3. కొబ్బరికాయ పెంకు నిర్జీవ కణములయిన దృఢ కణజాలముతో నిర్మితమైనది.
  4. నిర్జీవ కణాలలో ద్రవాభిసరణక్రియ జరుగదు.
  5. అందువలన కొబ్బరికాయకు రంధ్రము చేయకుండా నీరు నింపలేము.

ప్రశ్న 14.
నిత్య జీవితంలో వ్యాపనాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటావు? (AS 7)
జవాబు:

  1. గదిలో సిగరెట్ తాగినపుడు పొగ అణువులు గది అంతా వ్యాపించి వాసన కలుగచేస్తాయి.
  2. పంచదార స్ఫటికములను నీరు కలిగిన గ్లాసులో ఉంచిన పంచదార అణువులు వ్యాపనం ద్వారా నీరు అంతా వ్యాపిస్తాయి.
  3. బేకింగ్ పదార్థములను వండుతున్నప్పుడు ఇల్లంతా వాసన రావటానికి కారణం వ్యాపనం.
  4. తేయాకు సంచినందలి వర్ణద్రవ్యములు వ్యాపనం ద్వారా కరిగి నీటికి రంగును, రుచిని ఇస్తాయి.
  5. గాలిని శుభ్రపరిచే డియోడరెంట్ నందలి అణువులు వ్యాపనము ద్వారా గాలిలోనికి ప్రవేశిస్తాయి.
  6. వంటచేయడానికి ఉపయోగించే వాయువు సిలిండర్ నుండి బయటకు వచ్చిన గది నిండా వ్యాపనం ద్వారా చేరుతుంది.
  7. సోడానందలి కార్బన్ డై ఆక్సెడ్ వ్యాపనము ద్వారా బయటకు రావటం వలన సోడా నీరు కదలకుండా ఉంటుంది.
  8. అగర్బత్తీ, దోమల నివారణ మందులు వ్యాపన సూత్రంపై పనిచేస్తాయి.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

ప్రశ్న 15.
నిత్యజీవితంలో ద్రవాభిసరణ జరిగే 3 సన్నివేశాలను తెలపంది. (AS 7)
జవాబు:

  1. మొక్కల వేర్లలోనికి నీరు ద్రవాభిసరణ ద్వారా చేరుతుంది.
  2. కణాల మధ్య నీరు ప్రవహించడానికి కారణం ద్రవాభిసరణం.
  3. పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరచుకోవడం ద్రవాభిసరణ వల్ల జరుగుతుంది.
  4. ద్రవాభిసరణం మొక్కలలో నీరు, లవణాల కదలికలకు సహాయపడుతుంది.
  5. రక్తంలో మలినాలు వడపోయడానికి ద్రవాభిసరణం అవసరం.
  6. మన శరీరానికి కావలసిన నీరు మరియు లవణాలు పునఃశోషణం చేసుకోవడానికి ద్రవాభిసరణం ఉపయోగపడుతుంది.
  7. వాడిపోయిన క్యారెట్ ను నీటిలో ఉంచిన, ద్రవాభిసరణ ద్వారా నీరు ప్రవేశించి క్యారెట్ తాజాగా అవుతుంది.

9th Class Biology 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

1. కణంలోకి వచ్చేవి బయటకు పోయేవి.
పట్టికలో ఇచ్చిన పదార్థాల జాబితాను చూచి కణం లోపలికి ప్రవేశించే పదార్థాలను, కణం బయటకు వెళ్ళే పదార్థాలను (✓) తో గుర్తించండి.
జవాబు:

పదార్థం కణంలోకి ప్రవేశిస్తుంది కణం బయటకు వెళుతుంది
ఆక్సిజన్
గ్లూకోజ్
ప్రోటీన్లు
కొవ్వులు
విటమిన్లు
ఖనిజ లవణాలు
కార్బన్ డై ఆక్సైడ్
వ్యర్థాలు

ప్రయోగశాల కృత్యము

2. గాఢతల పరిశీలన :
వివిధ ద్రావణాల గాఢతను పరిశీలించు విధమును రాయండి.
(లేదా)
మీకు బీకరు, ఎండుద్రాక్ష, చక్కెర, నీరు అందిస్తే వీటితో ద్రవాభిసరణను ఎలా చూపిస్తావు?
జవాబు:
AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 2
ఎ) ఉద్దేశం : నీటిలో వేసిన ఎండు ద్రాక్షను పరిశీలించుట
పదార్థాలు / పరికరాలు : 1) బీకరు 2) కుళాయి నీరు 3) ఎండు ద్రాక్ష

విధానం:

  1. ఒక బీకరులో 100 మి.లీ నీరు తీసుకొని దానిలో ఎండు ద్రాక్ష వేయాలి.
  2. ఒక గంట తరువాత ఎండు ద్రాక్షను బయటకు తీసి మామూలు ఎండు ద్రాక్షతో పోల్చాలి.

పోలిక :
మామూలు ఎండు ద్రాక్ష కంటె నీటి నుండి బయటకు తీసిన ద్రాక్ష పరిమాణము పెద్దదిగా ఉన్నది.

బి) ఉద్దేశం : సంతృప్త చక్కెర ద్రావణంలో ఉంచిన తాజాద్రాక్షను పరిశీలించుట.
AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 3

పదార్థాలు / పరికరాలు :
1) బీకరు 2) కుళాయి నీరు 3) చక్కెర 4) తాజా ద్రాక్ష.

విధానం:

  1. 100 మి.లీ. చక్కెర ద్రావణాన్ని బీకరులో తీసుకొని అందులో తాజా ద్రాక్ష పండును వేయాలి.
  2. ఒక రాత్రి అంతా ఉంచి తెల్లవారగానే ద్రాక్షను తీసి పరిశీలించాలి.

గమనిక : తాజా ద్రాక్ష పరిమాణము తగ్గి ముడుచుకుపోయినది.

పరిశీలనలు:

  1. మొదటి ప్రయోగములో నీరు బీకరులో నుండి ఎండుద్రాక్షలోనికి ప్రవేశించినది.
  2. రెండవ ప్రయోగములో తాజా ద్రాక్ష నుండి నీరు బీకరులోనికి వెళ్తుంది.

నిర్ధారణ :
పై రెండు ప్రయోగములలో ద్రాక్ష త్వచంలోని కణాలు నీటిని లోపలికి మరియు బయటకు వెళ్ళడానికి సహకరించినవి.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

ప్రయోగశాల కృత్యము

3. ద్రవాభిసరణం (Osmosis) :
ద్రవాభిసరణను నిరూపించుటకు ఒక ప్రయోగమును వివరింపుము.
(లేదా)
ద్రవాభిసరణంను నిరూపించడానికి మీరు ప్రయోగశాలలో కృత్యం నిర్వహించారుగదా! క్రింది అంశాలను వివరించండి.
a) కావలసిన పదార్థాలు
b) తీసుకోవలసిన జాగ్రత్తలు
c) ప్రయోగ విధానం
d) ఫలితం
జవాబు:
ఉద్దేశం : బంగాళాదుంపను ఉపయోగించి ద్రవాభిసరణను నిరూపించుట.

కావల్సిన పదార్థాలు :
1) తాజా బంగాళాదుంప 2) ఉడికించిన బంగాళాదుంప 3) రెండు బీకర్లు లేదా కప్పులు 4) రెండు గుండు సూదులు 5) నీరు 6) పదునైన కత్తి 7) చక్కెర ద్రావణం.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 4
ప్రయోగ విధానం (లేదా) పద్ధతి :

  1. తాజా దుంపను తీసికొని పై పొట్టును తొలగించి దానిని తొట్టి లేదా కప్పు గిన్నె మాదిరిగా తయారుచేయాలి.
  2. తయారుచేసిన చక్కెర ద్రావణాన్ని బంగాళాదుంప కప్పు లేదా తొట్టియందు పోయాలి.
  3. చక్కెర ద్రావణ మట్టమును సూచిస్తూ గుండుసూది గుచ్చాలి.
  4. బంగాళాదుంప కప్పు లేక తొట్టిని బీకరులో ఉంచాలి.
  5. బీకరులో బంగాళాదుంప తొట్టి లేదా కప్పు సగం వరకు వచ్చేటట్లు నీరు నింపి అది మునగకుండా, తేలకుండా జాగ్రత్త తీసుకోవాలి.
  6. ఈ అమరికను ఒక అరగంట పాటు కదిలించకుండా ఉంచి పరిశీలించాలి.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 5
పరిశీలన:
బంగాళాదుంప కప్పు లేదా గిన్నెలోనికి బీకరులోని నీరు ప్రవేశించుట వలన చక్కెర ద్రావణమట్టం పెరుగుతుంది. పద్దతి : తరువాత బంగాళాదుంప కప్పులోనికి నీటిని, చక్కెర ద్రావణమును చక్కెర ద్రావణంలో బంగాళాదుంప గిన్నె బీకరులో ఉంచి అరగంట తరువాత పరిశీలించాలి. పరిశీలన : బంగాళాదుంప కప్పులోని నీరు బీకరులోనికి ప్రవేశించడం వల్ల క్రమేపి నీటిమట్టము తగ్గుతుంది.

నిర్ధారణ:

  1. పై రెండు సందర్భాలలోను నీరు చక్కెర ద్రావణం వైపు ప్రవహిస్తుంది. ఈ ప్రక్రియను ద్రవాభిసరణం అంటారు.
  2. ఈ ప్రక్రియలో నీరు తక్కువ గాఢత నుండి ఎక్కువ చక్కెర గాఢతవైపు బంగాళాదుంప పొర ద్వారా ప్రయాణిస్తుంది.

కృత్యం – 2

4. వడపోత:
వడపోత ప్రక్రియను ప్రయోగం ద్వారా వివరింపుము.
జవాబు:
ఉద్దేశం : వడపోత జరిగే విధానమును నిరూపించుట.

కావలసిన పదార్థాలు / పరికరాలు : రెండు బీకర్లు, ఒక గరాటు, వడపోత కాగితం, రిటార్ట్ స్టాండు, చక్కెర, అయోడిన్, గోధుమపిండి లేదా వరిపిండి.
AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 6

ప్రయోగ విధానం:

  1. ఒక రిటార్టు స్టాండునకు వడపోత కాగితమును అమర్చిన గరాటును బిగించాలి.
  2. గరాటు కింద బీకరును ఉంచాలి.
  3. 100 మి.లీ. నీటికి ఒక చెంచాడు గోధుమపిండి లేదా వరిపిండి కలిపి ద్రావణం తయారుచేయాలి.
  4. ఈ ద్రావణానికి ఒక చుక్క టింక్చర్ అయోడినను కలిపి వడపోయాలి.

పరిశీలన :

  1. వడపోత ద్వారా నీరు మరియు నీటిలో కరిగిన పిండి గరాటు కింద గల బీకరులోనికి చేరుతుంది.
  2. వడపోత కాగితం నీటిలో కరగని పిండిని తనగుండా ప్రయాణించడానికి అనుమతి ఇవ్వలేదు. పిండి అవక్షేపము వడపోత కాగితము మీద ఏర్పడినది.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

కృత్యం – 3

5. బాహ్య ద్రవాభిసరణం మరియు అంతర ద్రవాభిసరణ ప్రక్రియలను ప్రయోగపూర్వకముగా నిరూపించుము.
జవాబు:
ఉద్దేశం : బాహ్య మరియు అంతర ద్రవాభిసరణలను నిరూపించుట.

కావలసిన పదార్థాలు : మూడు బీకర్లు, పెట్రెడిష్, ఉప్పు, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం, రెండు సమాన పరిమాణంలో ఉన్న పచ్చి గుడ్లు, తుడవడానికి గుడ్డ, గుడ్డు చుట్టుకొలత కొలవడానికి సన్నని పొడవైన కాగితం, ఒక చెమ్చా.

పద్ధతి / ప్రయోగ విధానం :

  1. గుడ్లను సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో నాలుగు నుండి ఐదుగంటల పాటు ఉంచాలి.
  2. గుడ్లను చెమ్చాతో బయటకు తీయాలి. గుడ్డుపైన ఉండే కాల్షియం కార్బొనేట్ తో తయారైన పెంకు కరిగిపోతుంది.
  3. గుడ్లను కుళాయి కింద నీటిలో కడగాలి.
  4. గుడు చుట్టు సన్నని కాగితం చీలికను చుట్టి పెన్సిల్ లేదా పెన్నుతో గుర్తించి గుడ్ల చుట్టుకొలతను కొలవాలి.
  5. ఒక బీకరులో గాఢమైన ఉప్పునీటి ద్రావణాన్ని తయారు నీటితో కడగడం చేయాలి.
  6. రెండు గుడ్లలో ఒకదాన్ని మంచినీరు ఉన్న బీకరులోను, HCl లో ఉంచిన గుడ్డు రెండవ దాన్ని ఉప్పునీటి ద్రావణంలోను ఉంచాలి.
  7. బీకర్లను రెండు నుండి నాలుగు గంటల పాటు కదపకుండా అలాగే ఉంచాలి.
  8. గుడ్లను బయటకు తీసి తుడిచి వాటి చుట్టుకొలతను కాగితంతో కొలవాలి. దానిని నమోదుచేయాలి.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 7 AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 8
పరిశీలన :
ఉప్పు నీటి ద్రావణంలో ఉంచిన గుడ్డు కృశించుకుపోయినది. మంచినీటిలో ఉంచిన గుడు ఉబ్బియున్నది.

నిర్ధారణ :

  1. ఉప్పు నీటి ద్రావణంలో ఉంచిన గ్రుడు నుండి నీరు బాహ్యద్రవాభిసరణం వలన బయటకు పోతుంది.
  2. మంచి నీటిలో ఉంచిన గుడ్డు లోపలికి నీరు అంతర ద్రవాభిసరణ వలన వస్తుంది.

ప్రయోగశాల కృత్యము

6. పాక్షిక పారగమ్య త్వచాన్ని తయారుచేద్దాం :

పాక్షిక పారగమ్య త్వచాన్ని తయారుచేసి దాని సహాయముతో ద్రవాభిసరణమును నిరూపించండి.
(లేదా)
ఉడకబెట్టని కోడిగుడ్డు నుండి పాక్షిక పారగమ్య త్వచాన్ని ఎలా తయారుచేస్తావు?
జవాబు:
పాక్షిక పారగమ్య త్వచమును తయారుచేయుట :

  1. రెండు గుడ్లను తీసికొని వాటిని సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో నాలుగు నుండి ఐదుగంటల సేపు ఉంచాలి.
  2. గుడ్ల పైన ఉండే కాల్షియం కార్బొనేట్ తో తయారయిన ‘పెంకు కరిగిపోతుంది.
  3. గుడ్లను బయటకు తీసి కుళాయి నీటితో కడగాలి.
  4. పెంకు కరిగిన గుడ్లకు జాగ్రత్తగా పెన్సిల్ పరిమాణంలో ఉండే రంధ్రం చేయాలి. లోపలి పదార్థం అంతటినీ రంధ్రం ద్వారా నెమ్మదిగా బయటకు తీసివేయాలి.
  5. సంచిలాగా కనిపించే గుడ్ల పొర లోపలి భాగాన్ని నీటితో శుభ్రంగా కడగాలి.
  6. పారగమ్య త్వచాలు వాడటానికి సిద్ధంగా ఉన్నవి. ఇవి పాక్షిక పారగమ్యత్వచాలు.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 9
కోడిగుడ్డు పారగమ్య త్వచంతో ద్రవాభిసరణ ప్రయోగము :

ఉద్దేశం : పారగమ్య త్వచం ఉపయోగించి ద్రవాభిసరణమును నిరూపించుట.

కావలసిన పదార్థాలు / పరికరాలు : రెండు గుడ్లు పొరలు, మూడు బీకర్లు, చక్కెర, నీరు, దారం, కొలజాడి, సిరంజి.
AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 10AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక 11

ప్రయోగ విధానం :

  1. గుడ్డు పొర సంచిని తీసుకొని సిరంజి సహాయంతో 10 మి.లీ. సంతృప్త చక్కెర ద్రావణంతో నింపాలి.
  2. పొరకు ఉన్న రంధ్రాన్ని దారంతో కట్టాలి. 100 మి.లీ. నీటిని ఒక బీకరులో పోయాలి.
  3. చక్కెర ద్రావణం ఉన్న గుడ్డు పొర సంచిని బేకరులో ఉంచాలి.
  4. ఒక రాత్రి పూర్తిగా దానిని అలాగే వదలివేయాలి.
  5. సిరంజి సహాయంతో 10 మి.లీ. మంచినీటిని రెండవ గుడ్లు పొర సంచిలో నింపాలి.
  6. 100 మి.లీ. సంతృప్త చక్కెర ద్రావణాన్ని కొలజాడీతో కొలిచి బీకర్లో పోయాలి.
  7. ఈ అమరికను ఒక రాత్రి పూర్తిగా కదలించకుండా వదలివేయాలి.
  8. రెండవ రోజు గుడ్ల పొర సంచులను బయటకు తీసి వాటిలోపలి ద్రవాలను కొలిచి పరిశీలించాలి.

పరిశీలనలు:

  1. మొదటి కృత్యములో చక్కెర ద్రావణం నింపిన కోడిగుడ్డు త్వచములోనికి నీరు ప్రవేశించుట వలన నీటి పరిమాణము పెరిగినది.
  2. రెండవ కృత్యములో గుడ్డు పొర సంచి నుండి నీరు బీకరులోనికి ప్రవేశించుట వలన సంచి నందు నీటి పరిమాణం తగ్గినది.

నిర్ధారణ :
కోడిగుడ్డు త్వచం ద్వారా నీరు తక్కువ గాఢత గల ప్రదేశం నుండి ఎక్కువ గాఢత గల ద్రవంలోనికి ప్రయాణించినది. ఈ పద్ధతిని ద్రవాభిసరణం అంటారు.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

కృత్యం – 4

7. కాఫీ పొడితో వ్యాపనం

కాఫీ పొడిని ఉపయోగించి వ్యాపనమును పరిశీలించుము. పరిశీలనలను రాయుము.
జవాబు:

  1. చిన్న గిన్నెలో నీరు తీసుకోవాలి.
  2. కాఫీ పొడిని చిన్న ఉండగా తయారుచేయాలి.
  3. కాఫీ పొడి ఉండను నెమ్మదిగా నీటిలో జారవేయాలి.
  4. కాఫీ పొడి ఉండ బీకరు అడుగుకు చేరిన తర్వాత బీకరును కదపకుండా ఉంచి పరిశీలించాలి.

పరిశీలనలు:

  1. కాఫీ పొడి అణువులు నీటిలో కరగడం మొదలవుతాయి.
  2. స్ఫటికాల చుట్టూ ఉన్న నీరు మిగిలిన నీటికన్నా గాఢమైన రంగులో ఉంటుంది.
  3. సమయం గడచిన కొద్దీ నీరు మొత్తం రంగు మారుతుంది.
  4. మొదట నీరు లేత రంగులో ఉండి చివరకు నీరంతా ఒకే రంగులోకి మారుతుంది. వ్యాపనము ద్వారా కాఫీ పొడి అణువులు నీరు అంతా ప్రసరించి చివరికి ఒకే రంగులోకి మారుతుంది.

కృత్యం – 5

8. నీటిలో పొటాషియం పర్మాంగనేటు స్పటికం వ్యాపనం చెందు విధమును రాయండి.
జవాబు:

  1. పొటాషియం పర్మాంగనేటు స్ఫటికం ఒకదాన్ని శ్రావణం సహాయంతో పెట్రెడిష్ మధ్యలో ఉంచాలి.
  2. జాగ్రత్తగా పెట్రిడిలో నీళ్ళు పోయాలి.
  3. నీటిలో పర్మాంగనేటు పింక్ రంగు విస్తరించడం ప్రతి నిమిషానికీ గమనించాలి.
  4. పెట్రెడిష్ మధ్య నుండి అంచుల వరకు వ్యాపించే విధమును పరిశీలించాలి.

పరిశీలనలు :

  1. పొటాషియం పర్మాంగనేటు స్పటికం నీటిలో కరగడం మొదలవుతుంది.
  2. స్పటికం చుట్టూ ఉన్న నీరు మిగిలిన నీటికన్నా గాఢమైన రంగులో ఉంటుంది.
  3. సమయం గడచిన కొద్దీ నీరు మొత్తం రంగు మారుతుంది.
  4. మొదట నీరు లేత రంగులో ఉండి చివరకు నీరంతా ఒకే రంగులోకి మారుతుంది.

విసరణము :
ఎక్కువ గాఢత గల ప్రదేశం నుండి పొటాషియం పర్మాంగనేటు అణువులు తక్కువ గాఢత గల ప్రదేశమయిన నీటిలోనికి సమానంగా వ్యాపించే ప్రక్రియ విసరణము.

AP Board 9th Class Biology Solutions 4th Lesson ప్లాస్మా పొర గుండా పదార్థాల కదలిక

కృత్యం – 6

9. కాపర్ సల్ఫేటు స్ఫటికంను నీటిలో ఉంచినపుడు విసరణ జరుగు ప్రక్రియను వివరించుము.
జవాబు:

  1. కాపర్ సల్ఫేట్ స్పటికం ఒక దానిని శ్రావణం సహాయంతో పెట్రేడిష్ మధ్యలో ఉంచాలి.
  2. జాగ్రత్తగా పెట్టాడిలో నీరు పోయాలి.
  3. నీటిలో కాపర్ సల్ఫేట్ నీలం రంగు విస్తరించడం ప్రతి నిమిషానికి గమనించాలి.
  4. పెట్రెడిష్ మధ్య నుండి అంచులవరకు వ్యాపించే విధమును పరిశీలించాలి.

పరిశీలనలు:

  1. కాపర్ సల్ఫేట్ స్పటికం నీటిలో కరగడం మొదలవుతుంది.
  2. స్పటికం చుట్టూ ఉన్న నీరు మిగిలిన నీటికన్నా గాఢమైన రంగులో ఉంటుంది.
  3. సమయం గడచిన కొద్దీ నీరు మొత్తం రంగు మారుతుంది.
  4. మొదట నీరు లేత రంగులో ఉండి చివరకు నీరంతా ఒకే రంగులోకి మారుతుంది.

విసరణము :
ఎక్కువ గాఢత గల ప్రదేశం నుండి కాపర్ సల్ఫేట్ అణువులు తక్కువ గాఢత గల ప్రదేశమయిన నీటిలోనికి సమానంగా విస్తరించే ప్రక్రియ.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

SCERT AP 9th Class Biology Study Material Pdf Download 3rd Lesson జంతు కణజాలం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 3rd Lesson Questions and Answers జంతు కణజాలం

9th Class Biology 3rd Lesson జంతు కణజాలం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కణజాలం అనగానేమి? (AS 1)
జవాబు:
కణజాలం :
ఒకే నిర్మాణం కలిగి, ఒకే విధమైన విధుల్ని నిర్వర్తించే కణాల సమూహమును కణజాలం అంటారు.

ప్రశ్న 2.
హృదయ కండరం చేసే ప్రత్యేకమైన విధి ఏమిటి? (AS 1)
జవాబు:
హృదయకండరం చేసే ప్రత్యేకమైన విధి : హృదయ కండరం హృదయాన్ని ఆవరించి ఉండి, హృదయంలో సంకోచ వ్యాకోచాలను కలిగిస్తూ రక్త ప్రసరణలో పాత్ర వహిస్తుంది.

ప్రశ్న 3.
ఉండే స్థానం, ఆకారాన్ని అనుసరించి రేఖిత, అరేఖిత కండరాల మధ్య భేదాన్ని రాయండి. (AS 1)
జవాబు:

రేఖిత కందరం అరేఖిత కండరం
నిర్మాణం:
1) ప్రతి కండరం అనేక పొడవైన సన్నటి శాఖా రహితమైన తంతువులను పోలిన కణములను కలిగి ఉంటుంది. కణం స్థూపాకారంలో అనేక కేంద్రకాలను కలిగి ఉంటుంది.
1) కండర కణాలు పొడవుగా సాగదీయబడి కుదురు ఆకారంలో ఉంటాయి. కణంలో ఒకే కేంద్రకం ఉంటుంది.
2) కండరము పొడవుగా అనేక అడ్డుచారలు కలిగి ఉంటుంది. 2) అడ్డుచారలు ఉండవు.
స్థానం :
3) కాళ్ళు, చేతులందు మరియు అస్థిపంజరములోని ఎముకలకు అతికి ఉంటాయి.
3) ఆహారనాళం, రక్తనాళాలు, ఐరిస్, గర్భాశయం మరియు వాయునాళాల్లో ఉంటాయి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

ప్రశ్న 4.
కింది వాక్యాలు చదివి వాటి పేర్లు రాయండి. (AS 1)
ఎ) మన నోటి లోపలి పొరలలో ఉండే కణజాలం
బి) మానవుల శరీరపు ఎముకలతో కలిసి ఉండే కండరం
సి) జంతువులలో ఆహారపదార్థం రవాణా చేసే కణజాలం
డి) మన శరీరంలో కొవ్వు నిల్వచేసే కణజాలం
ఇ) మెదడులో ఉండే సంయోజక కణజాలం
జవాబు:
ఎ) స్తంభాకార ఉపకళా కణజాలము
బి) స్నాయుబంధనం
సి) రక్తకణజాలం
డి) ఎడిపోజ్ కణజాలం
ఇ) నాడీ కణజాలం

ప్రశ్న 5.
ఈ క్రింది అవయవాల్లో ఎటువంటి కణజాలం ఉంటుంది? (AS 1)
చర్మం, ఎముక, మూత్రపిండ నాళాల అంతర భాగం.
జవాబు:
చర్మం : సరిత ఉపకళా కణజాలము.
ఎముక : సంయోజక కణజాలము.
మూత్రపిండనాళాల అంతర్భాగం : ఘనాకార ఉపకళా కణజాలము.

ప్రశ్న 6.
ఒక్కొక్కసారి మోచేతిని గట్టిగా కొట్టినప్పుడు విద్యుత్ ఘాతం తగిలినట్టు అనిపిస్తుంది. ఎందుకు? (AS 1)
జవాబు:

  1. మానవులలో ముంజేటి లోపల ఎముక అయిన మూర ఎముకతో ఉన్న: నరము లేదా నాడి భుజము నుండి చేయి వరకు వ్యాపిస్తుంది.
  2. ఈ నరము మోచేయి దగ్గర ఉపరితలమునకు వస్తుంది.
  3. ఉపరితలమునకు వచ్చిన నరమునకు కండరముగాని, క్రొవ్వుగాని, ఏ ఇతర మెత్తటి కణజాలము గాని రక్షణ ఇవ్వదు.
  4. చిన్న ప్రేరణలకు కూడా ఈ నరము చాలా ఎక్కువగా ప్రతిస్పందిస్తుంది.
  5. అందువలన మనకు మోచేతి పై దెబ్బ తగిలినపుడు విద్యుత్ తం తగిలినట్టు అనిపిస్తుంది.

ప్రశ్న 7.
రక్తాన్ని ద్రవరూప కణజాలమని ఎందుకు అంటారు? (AS 1)
జవాబు:

  1. రక్తం అన్ని అవయవాల గుండా ప్రవహించుట ద్వారా శరీరములోని రకరకాల కణజాలములను, అవయవములను కలుపుతుంది. అందువలన రక్తమును కదలాడే ద్రవరూప సంయోజక కణజాలం అంటారు.
  2. ఇది మిగతా సంయోజక కణజాలముల కంటే భిన్నమైనది.
  3. రక్తములో రకరకాల కణములు ఉన్నాయి. ప్రతి కణమునకు నిర్దిష్టమైన పని ఉన్నది.
  4. కణేతర మాత్రిక ద్రవరూప ప్లాస్మాతో నిండియుంది. దీనిలో రక్తకణములు స్వేచ్చగా తేలియాడతాయి.
  5. అందువలన రక్తమును ద్రవరూప కణజాలం అంటారు.

ప్రశ్న 8.
రక్తంలో రక్తఫలకికలు లేకపోతే ఏమి జరుగుతుంది? (AS 2)
జవాబు:

  1. రక్తఫలకికలు రక్తాన్ని గడ్డకట్టించడంలో సహాయపడతాయి.
  2. రక్తఫలకికలు లేకపోతే రక్తము గడ్డ కట్టదు. తద్వారా గాయము నుండి రక్తము కారిపోతూనే ఉంటుంది.
  3. ఎక్కువ మొత్తంలో రక్త నష్టం జరిగితే గాయపడిన వ్యక్తి చివరకు చనిపోతాడు.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

ప్రశ్న 9.
మూడు రకాల కండర కణజాలాలలో గల భేదాలను పటం సహాయంతో వివరించండి. (AS 3)
జవాబు:
కండరాలు మూడు రకాలు. అవి : రేఖిత, అరేఖిత మరియు హృదయ కండరాలు.
1) రేఖిత కండరాలు:
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 4

  • ఇవి అస్థిపంజరంలో ఎముకలకు అతికి ఉండి కదలికలకు కారణమవుతాయి.
  • ఇవి మన అధీనంలో ఉంటాయి. కాబట్టి వీటిని నియంత్రిత కండరములు అంటారు.
  • ప్రతి కండరం అనేక పొడవాటి శాఖారహితమైన కణాలను కలిగి ఉండును.
  • ప్రతి కణం కండరం పొడవునా ఉండును.
  • కండరం పొడవునా అనేక అడ్డుచారలు కలిగి ఉంటాయి. కావున వీటిని రేఖిత కండరాలంటారు. వీటిలో అనేక కేంద్రకాలుంటాయి.

2) అరేఖిత కండరాలు :
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 5

  • ఇవి అన్నవాహిక, రక్తనాళాలలో ఉండి సంకోచ వ్యాకోచాలను కలిగిస్తాయి.
  • ఈ కండరాల కదలికలు మన అధీనంలో ఉండవు. కాబట్టి వాటిని అనియంత్రిత కండరాలు అంటారు.
  • ఇవి పొడవుగా సాగదీయబడి, కుదురు ఆకారంలో ఉంటాయి.
  • వీటిలో అడ్డుచారలుండవు. కాబట్టి వీటిని అరేఖిత కండరాలంటారు.
  • ఈ కణాలలో ఒక్క కేంద్రకం మాత్రమే ఉంటుంది. (ఏక కేంద్రకం).

3) హృదయ కండరాలు:
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 6

  • ఈ కండరాలు గుండెలో ఉంటాయి. ఇవి రక్తప్రసరణలో సహాయపడతాయి.
  • ఈ కణాలు శాఖలు కలిగి, పొడవుగా ఉంటాయి.
  • హృదయ కండరంలోని కణాలన్నీ చారలు కలిగి, ఉంటాయి.
  • దీనిలో కదలికలు మన అధీనంలో ఉండవు.
  • నిర్మాణంలో ఇది రేఖిత కండరాన్ని పోలి ఉన్న అనియంత్రిత చర్యలు చూపిస్తుంది.

ప్రశ్న 10.
కిట్ ను ఉపయోగించి మీ రక్తవర్గాన్ని కనుగొనడంలో మీరు అనుసరించిన విధానాన్ని రాయంది. (AS 3)
జవాబు:
ఉద్దేశ్యం : రక్త వర్గాలను కనుగొనడం.

కావలసిన పరికరాలు : రక్త పరీక్ష కిట్, స్లెడ్, మైనపు పెన్సిల్, డిస్పోసబుల్ సూదులు.

కిట్లో లేనివి : దూది, 70% ఆల్కహాల్, పంటిపుల్లలు.

ప్రయోగ విధానం:
1) ఒక తెల్ల పింగాణి పలక. తీసుకొని తుడిచి ఆరబెట్టాలి.
2) తెల్ల పింగాణి పలక మీద సమానదూరంలో మైనపు పెన్సిల్ లో మూడు వృత్తాలను గీయాలి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 1
3) ప్రతి వృత్తంలో ఒక్కొక్క సీరంను అంచులు తాకకుండా ఒక చుక్క వేయాలి. (ఉదా : మొదటి వృత్తంలో యాంటీ సీరం ‘A’ను, రెండవదానిలో యాంటీ సీరం ‘B’ ను, మూడవ వృత్తంలో ‘RhD’ సీరంను వేయాలి).
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 2
4) ఎడమచేతి ఉంగరపు వేలిని సర్జికల్ స్పిరిట్లో ముంచిన దూదితో తుడిచి, వేలు మీద సూదిని మెల్లగా గుచ్చి రక్తాన్ని బయటకు తీయాలి.
5) వేలుని కొద్దిగా ఒత్తుట వలన రక్తం రావడం మొదలవుతుంది.
6) ఒక చుక్క రక్తాన్ని వృత్తంలో పడేలా బొటనవేలితో వేలిని ఒత్తాలి. ఆ రక్తపు చుక్కలను సీరం ఎ, బి, RhD లకు కలపాలి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 3
7) మూడు వృత్తాలలో రక్తం సేకరించిన తర్వాత వేలి మీద సూదితో గుచ్చినచోట ఇంతకుముందు ఉంచిన దూదితో అణచి పెట్టాలి.
8) మూడు వేరు వేరు పంటి పుల్లలను తీసుకొని రక్తం, సీరంలను బాగా కలపాలి.
9) ఏ వృత్తములోనైనా రక్తం గడ్డ కట్టిందేమో పరిశీలించాలి. పారదర్శక ద్రవంలో చిన్న చిన్న తునకలుగా రక్తం గడ్డకట్టి తేలి ఉండేటట్లు ఉందేమో గమనించాలి.
10) ‘Rh’ వృత్తం వద్ద రక్తం గడ్డకట్టడానికి కొంచెం సమయం తీసుకుంటుంది.

ఫలిత నిర్ధారణ :
ఫలితాల అనుగుణంగా రక్తవర్గాన్ని నిర్ధారించవచ్చు. ఇందుకోసం కింది పట్టిక సహాయం తీసుకోవాలి.

యాంటి – ఎ యాంటి – బి రకం
రక్తం గడ్డకట్టింది రక్తం గడ్డకట్టలేదు
రక్తం గడ్డకట్టలేదు రక్తం గడ్డకట్టింది బి
రక్తం గడ్డకట్టింది రక్తం గడ్డకట్టింది ఎబి
రక్తం గడ్డకట్టలేదు రక్తం గడ్డకట్టలేదు

అలాగే RhD కారకంలో రక్తం గడ్డకట్టితే Rh* రక్తం, రక్తం గడ్డకట్టకపోతే Rh” అవుతుందని గమనించాలి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

ప్రశ్న 11.
మీ దగ్గర బంధువు/స్నేహితుల పాత రక్తనమూనాలను సేకరించి అందులోని అంశాల ఆధారంగా ఒక ప్రాజెక్టు నివేదికను తయారుచేయండి. (AS 4)
జవాబు:
నేను నా స్నేహితుని పాత రక్త నమూనాను పరిశీలించాను. అది క్రింది విధంగా ఉంది.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 7

Random blood sugar 115 mg/dl (80 – 140 mg/dl)
Microscopic -2 – 4 puscells / Hp of seen Malaria – Negative (-ve)
దీని ఆధారంగా తెల్లరక్త కణాల సంఖ్య సరైన మోతాదులో ఉందని గుర్తించాను. చీము కణాలు కణించటం వలన స్వల్పంగా ఇన్ ఫెక్షన్ ఉన్నట్లుగా భావించవచ్చు మలేరియా పరీక్ష ఋణాత్మకం కావున, రక్తంలో మలేరియా పరాన్నజీవి లేదని నిర్ధారించవచ్చు.

ప్రశ్న 12.
నాడీకణం పటం గీచి, భాగాలు రాయండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 8

ప్రశ్న 13.
రాము బలహీనంగా కనిపించడం చేత, వాళ్ళ నాన్న అతడిని ఆసుపత్రికి తీసుకుపోయాడు. డాక్టర్ రక్తపరీక్ష చేయించి రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని చెప్పారు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే జరిగే పరిణామాలను చర్చించి వ్రాయండి. (AS 6)
జవాబు:
హిమోగ్లోబిన్ తక్కువగా ఉండుట వలన కలిగే దుష్ఫలితాలు :

  1. రక్తము ఎర్రగా ఉండటానికి కారణం ఎరుపు వర్ణపు ప్రోటీను హిమోగ్లోబిన్.
  2. హిమోగ్లోబిన్ ఆక్సిజన్ మరియు కార్బన్ డై ఆక్సెడులను రవాణా చేయటంలో సహాయపడుతుంది.
  3. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే అది రక్తహీనతకు దారితీస్తుంది.
  4. రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. దీని వలన తక్కువగా ఊపిరి ఆడటం జరుగుతుంది.
  5. తక్కువ హిమోగ్లోబిన్ స్థాయి గుండెకు సంబంధించిన సమస్యలను ఎక్కువ చేస్తుంది.
  6. తక్కువ హిమోగ్లోబిన్ స్థాయి వలన మనుష్యులు ఎక్కువగా నీరసించిపోతారు. కణములు క్రియలను నిర్వహించడానికి కావలసిన ఆమ్లజని సరఫరా లేకపోవడం ప్రధాన కారణం.

ప్రశ్న 14.
రోగనిర్ధారణలో రక్తపరీక్ష యొక్క ఆవశ్యకతను నిజజీవిత సన్నివేశంలో వివరించండి. (AS 7)
జవాబు:
నా పేరు వివేక్. రెండు నెలల క్రితం నాకు జ్వరం వచ్చింది. మా నాన్న దగ్గరలో ఉన్న ఆర్.ఎం.పి వైద్యుని వద్దకు తీసుకెళ్ళాడు. అతను పరీక్షించి ఇంజక్షన్ చేసి మందులు ఇచ్చాడు. అవి వాడినప్పటికి జ్వరం తగ్గలేదు. ఐదు రోజుల గడచిపోయాయి. నేను బాగా నీరసించిపోయాను. అప్పుడు మా నాన్న నన్ను పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. డాక్టర్ పరీక్షించి రక్తపరీక్ష చేయించమన్నాడు. మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాల కొరకు రక్తపరీక్ష నిర్వహించారు.

రక్తపరీక్షలో టైఫాయిడ్ అని తేలింది. డాక్టర్ ధైర్యం చెప్పి మందులను కోర్స్ గా పదిహేను రోజుల పాటు వాడారు. నేను వ్యాధి నుండి , కోలుకున్నాను. వ్యాధిని నిర్ధారించటంలో రక్తపరీక్ష యొక్క ఆవశ్యకత నాకు అర్థమైంది. రక్తపరీక్ష ద్వారా అనేక వ్యాధులను నిర్ధారిస్తారని తెలుసుకొన్నాను. వ్యాధిని సరిగా నిర్ధారించకుండా చికిత్స చేయటం కూడా ప్రమాదకరమని తెలుసుకొన్నాను.

9th Class Biology 3rd Lesson జంతు కణజాలం Textbook Activities (కృత్యములు)

ప్రయోగశాల కృత్యము – 1

ఉద్దేశ్యం : సేకరించిన నమూనా నుండి కణజాలాలు గుర్తించుట.

కావలసిన పరికరాలు : మైక్రోస్కోప్, స్లెడ్, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం, శ్రావణాలు, బ్రష్,

ప్రయోగ విధానం :

  1. మీ దగ్గరలో ఉండే మాంసం అమ్మే చోటికి వెళ్ళి చిన్న కోడి మాంసం ముక్కని ఎముకతో సహా సేకరించాలి.
  2. మాంసం ముక్కను రెండు గంటల పాటు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ఉంచాలి. దాని నుండి పలుచని చర్మ భాగాన్ని తీసుకోవాలి.
  3. దాంట్లోని చిన్న భాగాన్ని శ్రావణం సహాయంతో ఒక స్లెడ్ పైన ఉంచాలి.
  4. మరొక సైడ్ ను దానిమీద ఉంచి రెండు స్లెట్లను గట్టిగా అణచి నొక్కాలి. చర్మపు పొర మరింత పలుచగా స్లెడ్ మీద పరుచుకుంటుంది.
  5. ఈ సైడ్ ను సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి. మీ ల్యాబ్ రికార్డులో దాని పటాన్ని గీయాలి.
  6. ఇచ్చిన పటంతో మీరు గీసిన పటాన్ని పోల్చండి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 9

ప్రశ్నలు:
1. రెండూ ఒకే మాదిరిగా ఉన్నాయా?
జవాబు:
ఒకే మాదిరిగా ఉన్నాయి.

2. అన్ని కణాలు ఒకేలా ఉన్నాయా?
జవాబు:
అన్ని కణాలు ఒకేలా ఉన్నాయి.

3. వాటి అమరిక ఏ విధంగా ఉంది?
జవాబు:
కణాలు వరుసలలో పొరలాగా అమరి ఉన్నాయి.

4. ఈ కణాలన్నీ దగ్గర దగ్గరగా అమరి ఉన్నాయా? ఒక త్వచం లేదా పొర మాదిరిగా ఏర్పడినాయా?
జవాబు:
కణాలు దగ్గర దగ్గరగా అమరి త్వచం లేదా పొర మాదిరిగా ఏర్పడినాయి.

5. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు లేదా కణాంతర అవకాశం ఉన్నదా?
జవాబు:
ఖాళీ ప్రదేశాలు లేవు.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

కృత్యం – 1

1. ఒక శుభ్రమైన స్పూనిగాని, ఐస్క్రీం పుల్లగాని తీసుకొని మీ బుగ్గ లోపలి భాగంలో ఉన్న సన్నని పొరని గీకాలి.
2. ఒక పలుచని పొరను స్పూన్ నుండి సేకరించి ఒక సైడ్ పైన ఉంచి సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి.
3. పరిశీలించిన దాని పటాన్ని మీ నోట్ పుస్తకంలో గీయాలి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 10

ప్రశ్నలు :
1. కణాలన్నీ ఏ విధంగా అమరి ఉన్నాయి?
జవాబు:
కణాలు అన్ని పలుచగా, బల్లపరుపుగా అమరి ఉన్నాయి.

2. కణాల మధ్య కణాంతర అవకాశాలు ఉన్నాయా?
జవాబు:
కణాల మధ్య కణాంతర అవకాశాలు లేవు.

3. చర్మంలో ఇవి ఎందుకు అనేక వరుసలలో అమరియుంటాయో ఒకసారి ఆలోచించండి?
జవాబు:
చర్మము మన శరీరానికి రక్షణ ఇస్తుంది. అందువలన ఇవి అనేక వరుసలలో అమరి ఉంటాయి.

4. మీరు వేడి టీ/ కాఫీగాని, చల్లని పానీయం గానీ తాగేటప్పుడు ఎలా అనిపిస్తుంది?
జవాబు:
వేడి టీగాని, కాఫీగాని తాగినపుడు నోరు కాలుతుంది. బయటకు ఊస్తాము. చల్లని పానీయం తాగినపుడు నోటిలోపలి పొరలు చల్లదనాన్ని భరించలేవు.

5. ఒకవేళ చర్మం కాలిపోయినట్లయితే ఏ కణజాలం దెబ్బతినే అవకాశం ఉంటుంది?
జవాబు:
ఉపకళా కణజాలం.

కృత్యం – 2

ఘనాకార ఉపకళ కణజాలాన్ని పరిశీలిద్దాం.

1. మీ పాఠశాలలో ఉన్న సైడ్ పెట్టి నుండి ఘనాకార ఉపకళా శాశ్వత సైడ్ ను తీసుకొని సూక్ష్మదర్శిని సహాయంతో జాగ్రత్తగా పరిశీలించాలి.
2. పరిశీలించిన దాని పటాన్ని మీ నోట్ పుస్తకంలో గీయాలి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 11

1. కణాలన్నీ ఎలా అమరి ఉన్నాయి?
జవాబు:
ఘనాకారపు కణాలు దగ్గర దగ్గరగా, కణాంతర అవకాశాలు లేకుండా అమరి ఉన్నాయి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

ప్రయోగశాల కృత్యము -2

ఉద్దేశ్యం :
సేకరించిన నమూనా నుండి కణజాలాలు గుర్తించుట.

కావలసిన పరికరాలు : మైక్రోస్కోప్, స్లెడ్, రక్త నమూనా, సిరంజి, దూది.

ప్రయోగ విధానం :

  1. ఒక క్రిమిరహితం చేసిన సిరంజి మరియు సూదిని తీసుకోవాలి.
  2. ఉపాధ్యాయుని సహాయంతో మీ వేలినుండి ఒక చుక్క రక్తం తీసుకోవాలి.
  3. జాగ్రత్తగా రక్తపు బొట్టును ఒక సైడ్ పైన రుద్దాలి.
  4. వేరొక సైడ్ సహాయంతో ఒక పలుచని పొర ఏర్పడేటట్లు అడ్డంగా రుద్దాలి.
  5. సూక్ష్మదర్శిని సహాయంతో సైడ్ ను పరిశీలించాలి.
  6. మీరు పరిశీలించిన అంశాల పటం గీచి, దానిని ఇవ్వబడిన పటంతో పోల్చాలి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 12

ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.

1. సైట్లో ఏమి పరిశీలించావు?
జవాబు:
రక్తములో ప్లాస్మాను, రక్తకణములను పరిశీలించాను.

2. ఏమైనా కణాలు కనబడుతున్నాయా?
జవాబు:
కనబడుతున్నాయి.

3. దానిలోని అన్ని కణాలు ఒకే రకంగా ఉన్నాయా?
జవాబు:
లేవు.

4. ద్రవరూపంలో ఉన్న పదార్థం ఏమైనా ఉన్నదా?
జవాబు:
ద్రవరూప ప్లాస్మా ఉన్నది.

15. రక్తం కూడా ఒక కణజాలమే అని ఒప్పుకుంటావా?
జవాబు:
అవును. రక్తం కూడా ఒక ద్రవరూప కణజాలమే.

కృత్యం – 3

1. పాఠశాల ప్రయోగశాల నుండి స్తంభాకార ఉపకళా కణజాలం యొక్క సైడ్ ను తీసుకుని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి.
2. మీరు పరిశీలన చేసిన దాని పటాన్ని గీయాలి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 13

ప్రశ్నలు :
1. మీరు పరిశీలన చేసిన దాని పటాన్ని గీయండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.

2. మీరు పరిశీలించిన కణాల్లో చిన్న కేశాల వంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయా?
జవాబు:
అవును కనిపిస్తున్నాయి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

ప్రయోగశాల కృత్యము – 3

ఉద్దేశ్యం : సేకరించిన నమూనా నుండి కణజాలాలు గుర్తించుట.

కావలసిన పరికరాలు : మైక్రోస్కోప్, సైడ్, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం, శ్రావణాలు, బ్రష్

ప్రయోగ విధానం :

  1. సేకరించిన మాంసం ముక్క నుండి కొంచెం కండరం తీసుకోవాలి.
  2. దీనిని సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలోగాని, వెనిగర్ లో గాని రెండు గంటల పాటు నానబెట్టాలి.
  3. దానిలో నుండి ఒక పలుచని ముక్కని శ్రావణం ద్వారా తీసుకొని ఒక స్లెడ్ పైన ఉంచాలి.
  4. దానిపైన ఇంకో సైడ్ పెట్టి నెమ్మదిగా నొక్కాలి.
  5. సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించిన దాని పటం గీయాలి.
  6. రెండు పటాలను పోల్చాలి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 14

ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.

1. కణాలన్నీ ఎలా అమరి ఉన్నాయి?
జవాబు:
కణాలన్నీ వరుసలలో ఒకదానిపై ఒకటి అమరి ఉన్నాయి.

2. త్వచకణజాలానికి, కండరకణజాలానికి మధ్య ఏమైనా తేడాలున్నాయా?
జవాబు:
కండర కణాలు పొడవుగా, సాగదీయబడి కేంద్రకమును కలిగి ఉన్నాయి.

ఎముకను పరిశీలించుట :
మాంసం ముక్క నుండి ఎముకను వేరుచేసి దాదాపు ఒక రోజంతా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలోగాని, వెనిగర్ లోగాని ఉంచి నానబెట్టాలి. ఒక కత్తి సహాయంతో ఎముక నుంచి పలుచని ముక్కను కోయాలి. రెండు స్లె మధ్య అణచి పెట్టాలి. ఎముక ఉన్న సైడ్ ని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి.

3. ఇంతకు ముందు చూసిన కణజాలానికి, ఇప్పుడు చూసిన దానికి ఏమైనా సంబంధాలున్నాయా?
జవాబు:
సాధారణంగా ఎముక కండరముతో కలుపబడి ఉంటుంది.

4. ఈ కణజాలాలు చలనానికి సహాయపడతాయా?
జవాబు:
సహాయపడతాయి.

5. అన్ని రకాల కణజాలాలు ఒకే రకమైన విధులు నిర్వర్తిస్తాయా?
జవాబు:
లేదు. వేరు వేరు కణజాలాలు రకరకాల విధులు నిర్వహిస్తాయి.

కృత్యం – 4

రక్తకణజాలం

1. మీ గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలో ఉండే ఆరోగ్య కార్యకర్తలను లేదా రోగ నిర్ధారణ చేసే నిపుణుడిని మీ తరగతికి ఆహ్వానించాలి.
2. అతనితో రక్తం యొక్క నిర్మాణం, విధులపై ఒక ముఖాముఖి ఏర్పాటు చేయాలి.
3. ముఖాముఖి ఏర్పాటు చేసే ముందు ఒక ప్రశ్నావళి తయారుచేయాలి.
4. ముఖాముఖి పూర్తి అయిన తరువాత రక్తంపై ఒక చిన్న పుస్తకం తయారు చేయాలి.
5. ఆ చిన్న పుస్తకాన్ని గ్రంథాలయంలో ఉంచాలి. బులెటిన్ బోర్డుపై ప్రదర్శించాలి.
జవాబు:
రక్తం గురించిన చిన్న పుస్తకం :

  1. రక్తం ద్రవరూప కణజాలం.
  2. రక్తంలో వివిధ రకాలయిన కణజాలాలున్నాయి. ప్రతీది భిన్నమైన నిర్దిష్టమైన పనిని నిర్వహిస్తుంది.
  3. ఈ కణాలన్నీ ప్లాస్మాలో స్వేచ్ఛగా తేలియాడుతూ ఉంటాయి.
  4. కణబాహ్య ప్రదేశం ద్రవపదార్థమైన ప్లాస్మాతో నింపబడి ఉంటుంది. రక్తం సంధాయక కణజాలమైనప్పటికీ రక్తంలో తంతువులు ఉండవు.
  5. ఒక ప్రౌఢ మానవుని శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తంలో ఒక అంశం అయిన ప్లాస్మాలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది.
  6. నీటితో పాటు ఇందులో గ్లూకోజు, ఎమినో యాసిడ్ల వంటి రకరకాల పోషకాలు కూడా ఉంటాయి.
  7. రక్తం గడ్డకట్టడానికి కావలసిన అనేక కారకాలు కూడా ప్లాస్మాలో ఉంటాయి. రక్తం రక్తనాళాలలో గడ్డకట్టకుండా హిపారిన్ అనే పదార్థం ఉపయోగపడుతుంది.
  8. రక్త కణాలు మూడు రకాలు 1. ఎర్ర రక్తకణాలు 2. తెల్ల రక్తకణాలు. 3. రక్తఫలకికలు.
    AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 12
  9. ఎర్ర రక్తకణాలను ఎరిత్రోసైటులు అంటారు. హిమోగ్లోబిన్ ఉండుట వలన ఇవి ఎర్రగా ఉంటాయి.
  10. హిమోగ్లోబిన్ ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సెల రవాణాలో ,సహాయపడుతుంది.
  11. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు రక్త కణాలు కాలేయం మరియు పిత్తాశయంలో తయారవుతాయి. ప్రౌఢ మానవులలో ఎముకలలో ఉండే మజ్జలో తయారవుతాయి.
  12. ఎర్ర రక్త కణాలు 120 రోజులు జీవిస్తాయి.
  13. రక్తంలో గల రెండవ రకపు కణాలు తెల్ల రక్తకణాలు. వీటిల్లో హిమోగ్లోబిన్ ఉండదు కాబట్టి వర్ణరహితంగా ఉంటాయి. వీటిని ల్యూకోసైటులు అంటారు.
  14. తెల్లరక్తకణాలు రెండు రకాలు – కణికాభకణాలు, కణికరహిత కణాలు.
  15. కణికాభ కణాలలో న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్ మరియు ఇసినోఫిల్స్ అని మూడు రకాలు ఉన్నాయి.
  16. ఇవి రక్తంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులను ఎదుర్కొని నాశనం చేస్తాయి.
  17. కణిక రహిత కణాలు లింఫోసైట్స్ మరియు మోనోసైట్స్ అని రెండు రకాలు.
  18. లింఫోసైట్స్ రక్తంలోకి వచ్చిన బాహ్య పదార్థాలను ఎదుర్కొని ప్రతిదేహాలను తయారు చేస్తాయి. లింఫోసైటులను సూక్ష్మరక్షక భటులంటారు.
  19. మోనోసైటులు రక్తంలో అమీబా మాదిరిగా కదులుతూ బాహ్య పదార్థాలను ఎదుర్కొని భక్షించి నాశనం చేస్తాయి. మోనోసైట్లను పారిశుద్ధ్య కార్మికులు అంటారు.
  20. రక్తఫలకికలకు కేంద్రకం ఉండదు. ఇవి రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి.

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

ప్రయోగశాల కృత్యము – 4

రక్త వర్గాన్ని కనుగొనటానికి నీవు చేసిన ప్రయోగాన్ని వివరింపుము.

ఉద్దేశ్యం : రక్త వర్గాలను కనుగొనడం.

కావలసిన పరికరాలు : రక్త పరీక్ష, కిట్, సైడ్, మైనపు పెన్సిల్, డిస్పోసబుల్ సూదులు.

కిట్లో ఉండవలసిన పరికరాలు :
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 15

కిట్లో లేనివి : దూది, 70% ఆల్కహాల్, పంటి పుల్లలు.

ప్రయోగ విధానం :
1) ఒక తెల్ల పింగాణి పలక తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 1
2) పటంలో చూపినట్లు తెల్ల పింగాణి పలక మీద ఒక మైనపు పెన్సిల్ లో మూడు వృత్తాలు గీయాలి. వృత్తాలను వేరుచేస్తూ అడ్డగీతలు గీయాలి.
3) ప్రతి వృత్తంలో పైన పేర్కొనిన మూడు సీరమ్ లు తీసుకొని ఒక్కొక్క చుక్క పటంలో చూపిన విధంగా అంచులలో వేయాలి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 2
4) ఎడమ చేతి ఉంగరపు వేలిని సర్జికల్ స్పిరిట్ ముంచిన దూదితో తుడిచి, సూదిని మెల్లగా గుచ్చి బయటకు తీయాలి.
5) వేలుని కొద్దిగా ఒత్తాలి – రక్తం రావడం మొదలవుతుంది.
6) ఒక చుక్క రక్తాన్ని వృత్తంలో పడేలా బొటన వేలితో వేలిని ఒత్తాలి. ఆ రక్తం చుక్కలను సీరంలు ఎ, బి, RhDని ఒక చొప్పున కలపాలి.
7) మూడు వృత్తాలలో రక్తం సేకరించిన తరువాత వేలిమీద సూదితో గుచ్చిన చోట ఇంతకు ముందు ఉంచిన దూదితో అణచిపెట్టాలి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 3
8) ఒక పంటి పుల్లను తీసుకొని సీరమ్ ను, రక్తాన్ని జాగ్రత్తగా కలపండి. వేరు వేరు వృత్తాలకు వేరు వేరు పంటి పుల్లలను ఉపయోగించి కలపాలి.
9) ఏ వృత్తాలలోనైనా రక్తం గడ్డకట్టిందేమో పరిశీలించాలి. ‘ఆర్ హెచ్’ వృత్తం వద్ద రక్తం గడ్డకట్టడానికి కొంచెం సమయం తీసుకుంటుంది.

ఫలిత నిర్ధారణ :
ఫలితాలకు అనుగుణంగా రక్తవర్గాన్ని నిర్ధారించవచ్చు. కింది పట్టిక సహాయం తీసుకోవాలి.

రక్తం వర్గం నిర్ధారించటం.

యాంటి – ఎ యాంటి – బి రకం
రక్తం గడ్డకట్టింది రక్తం గడ్డకట్టలేదు
రక్తం గడ్డకట్టలేదు రక్తం గడ్డకట్టింది బి
రక్తం గడ్డకట్టింది రక్తం గడ్డకట్టింది ఎబి
రక్తం గడ్డకట్టలేదు రక్తం గడ్డకట్టలేదు

అలాగే ఆర్ హెడ్ కారకంలో గాని రక్తం గడ్డకడితే Rh+ రక్తం గడ్డకట్టకపోతే Rh అవుతుంది.

గమనించిన ఫలితాలు పట్టికలో నమోదు

విద్యార్థి పేరు రక్తవర్గం
1. పి. ప్రణయ O
2. పి. ప్రబంధ O
3. పి. ప్రమోద A
4. వి. ఉమాదేవి A
5. కె. అనసూయ AB
6. యమ్. రాము B
7. ఎస్. రవి. A
8. ఎల్. లక్ష్మీకాంత్ AB
9. కె. గోపాల్ B
10. జి. ఉదయకిరణ్ B

AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం

కృత్యం – 5

5. మీ పాఠశాల ప్రయోగశాల నుండి మూడు రకాల కండరాల సైడ్ తీసుకొని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించండి. పరిశీలించిన అంశాలు క్రింది పట్టికలో నమోదు చేయండి.
జవాబు:

రేఖిత కండరాల లక్షణాలు అరేఖిత కండరాల లక్షణాలు హృదయ కండర లక్షణాలు
1. నియంత్రిత కండరాలు అనియంత్రిత కండరాలు అనియంత్రిత కండరాలు
2. కండరాల పొడవుగా అనేక అడ్డు చారలు కలిగి ఉంటాయి. పొడవుగా ఉంటాయి. అడ్డు చారలు ఉండవు. కణాలు చారలతో ఉంటాయి.
3. ప్రతి కండరం అనేక పొడవైన సన్నటి శాఖారహితమైన తంతువులు పోలిన కణాలు ఉంటాయి. చాలా కేంద్రకాలు ఉంటాయి. కండరాలు పొడవుగా సాగదీయబడిన కుదురు ఆకారంలో ఉంటాయి. ఒకే కేంద్రకం ఉంటుంది. కణాలు పొడవుగా, శాఖలు కలిగి ఉంటాయి. చాలా కేంద్రకాలు ఉంటాయి.
4. ఈ కండరాలు కాళ్ళు, చేతులతో ఉంటాయి. ఆహార వాహిక, రక్తనాళాలు ఐరిస్, గర్భాశయంలో ఉంటాయి. హృదయంనందు ఉంటాయి.

కృత్యం – 6

1. పాఠశాల ప్రయోగశాల నుండి నాడీకణం సైడ్ ను తీసుకొని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి.
2. పరిశీలించిన అంశాలు నోటు పుస్తకంలో రాయాలి.
AP Board 9th Class Biology Solutions 3rd Lesson జంతు కణజాలం 8
జవాబు:

  1. నాడీ కణాలను మూడు భాగాలుగా విభజించవచ్చు. 1. కణదేహం, 2. ఆక్టాన్, 3. డెండ్రైటులు.
  2. నాడీ కణదేహంలో ఉన్న జీవద్రవంలో ఒక కేంద్రకం తేలియాడుతూ ఉంటుంది. జీవద్రవంలో కొన్ని గ్రంథిరూప కణాలుంటాయి. వీటిని నిస్సల్ కణికలు అంటారు.
  3. కణదేహం నుండి బయటకు వచ్చిన నిర్మాణాలను డెండ్రైటులు అంటారు. ఇది శాఖలు కలిగి మొనదేలి ఉంటాయి.
  4. కణదేహం నుండి ఒకే ఒక్క పొడవాటి నిర్మాణం బయలుదేరుతుంది. దీనిని తంత్రిరాక్షం లేదా ఆక్లాస్ అంటారు.
  5. ఆక్టాన్లో కొంత భాగం ఒక పొరతో కప్పబడి ఉంటుంది. ఆ త్వచాన్నే మెయిలిన్ త్వచం అంటారు.
  6. ఆక్టాన్లో ఉండే కణుపుల వంటి భాగాన్ని రాన్ వియర్ సంధులు అంటారు.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం

SCERT AP 9th Class Biology Guide Pdf Download 2nd Lesson వృక్ష కణజాలం Textbook Questions and Answers.

AP State Syllabus 9th Class Biology 2nd Lesson Questions and Answers వృక్ష కణజాలం

9th Class Biology 2nd Lesson వృక్ష కణజాలం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
ఈ పదాలను నిర్వచించండి. (AS 1)
ఎ) కణజాలం
బి) విభాజ్య కణజాలం
సి) త్వచ కణజాలం
జవాబు:
ఎ) కణజాలం :
ఒకే నిర్మాణం కలిగి, ఒకే విధమైన విధుల్ని నిర్వర్తించే కణాల సమూహమును కణజాలం అంటారు.

బి) విభాజ్య కణజాలం :
పెరుగుతున్న భాగాల్లో ఉండే, విభజన చెందగలిగే కణజాలంను విభాజ్య కణజాలం అంటారు.

సి) త్వచ కణజాలం :
మొక్క భాగాలను వెలుపల కప్పి ఉంచే కణజాలంను త్వచ కణజాలం అంటారు. మొక్కకు రక్షణ ఇస్తుంది.

ప్రశ్న 2.
కింది వాటి మధ్య భేదములను తెల్పండి. (AS 1)
జవాబు:
ఎ) విభాజ్య కణజాలం, సంధాయక కణజాలం

విభాజ్య కణజాలం సంధాయక కణజాలం
1. ఎప్పుడూ విభజన చెందగలిగిన కణాలు ఉంటాయి. 1. విభజన చెందలేని కణాలు ఉంటాయి.
2. ఇది సరళ కణజాలం. 2. ఇది సరళ లేదా సంక్లిష్ట కణజాలం.
3. దీని యందు సజీవ కణాలు ఉంటాయి. 3. దీని యందు సజీవ (లేదా) నిర్జీవ కణములు ఉండవచ్చు.
4. చిక్కని జీవపదార్థము కణమునందు ఉంటుంది. 4. పలుచని జీవపదార్ధము కణము నందు ఉంటుంది.

బి) అగ్ర విజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలం

అగ్ర విభాజ్య కణజాలం పార్శ్వ విభాజ్య కణజాలం
1. వేరు, కాండం శాఖల అగ్రభాగాలలో ఉంటుంది. 1. మొక్క దేహం యొక్క పార్శ్వ అంచుల వద్ద ఉంటుంది.
2. వేరు, కాండములు పొడవుగా పెరగటానికి తోడ్పడతాయి. 2. కాండాలు, వేర్లు మందంలో పెరుగుదల చెందడానికి తోడ్పడతాయి.

సి) మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం

మృదు కణజాలం స్థూలకోణ కణజాలం
1. మృదు కణజాల కణాలు మృదువుగా, పలుచని గోడలు కలిగి, వదులుగా అమరి ఉంటాయి. 1. స్థూలకోణ కణజాల కణాలు దళసరి గోడలను కలిగి కొంచెం పొడవైన కణాలు కలిగి ఉంటాయి.
2. మృదు కణజాల కణాలు ఆహారనిల్వ చేస్తాయి. హరితరేణువులు మరియు పెద్దగాలి గదులను కలిగి ఉంటాయి. 2. ఇది కాండపు లేత కణజాలమునకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది.
3. కణకవచాలు, అసమాన మందంలో ఉంటాయి. 3. సెల్యులోజ్ తయారయిన కణకవచము ఉంటుంది.
4. కణాలు అండాకారంగా, గోళాకారంగా లేదా దీర్ఘచతురస్రాకారంగా ఉంటాయి. 4. కణములు సాగి గుండ్రంగా గాని, గోళాకారంలోగాని ఉంటాయి.

డి) దృఢ కణజాలం, మృదు కణజాలం

దృఢ కణజాలం మృదు కణజాలం
1. ఇది నిర్జీవ కణజాలం. 1. ఇది సజీవ కణజాలం.
2. కణకవచాలు మందంగా ఉంటాయి. 2. కణకవచాలు పలుచగా ఉంటాయి.
3. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు ఉండవు. 3. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు ఉంటాయి.
4. ఇది మొక్కకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది. 4. ఇది ఆహారనిల్వకు, కిరణజన్య సంయోగక్రియ జరుపుటకు మరియు మొక్కలు నీటిలో . తేలుటకు ఉపయోగపడుతుంది.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం

ఇ) దారువు, పోషక కణజాలం

దారువు పోషక కణజాలం
1. నీరు-పోషకాలను వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు సరఫరా చేస్తుంది. 1. ఆకు నుండి ఆహారపదార్ధములను మొక్క పెరుగుదల భాగాలకు సరఫరా చేస్తుంది.
2. దారువు నందు దారు కణములు, దారునాళములు, దారునారలు మరియు దారుమృదు కణజాలం ఉంటాయి. 2. పోషక కణజాలం నందు చాలనీ కణాలు చాలనీ నాళాలు, సహకణాలు పోషక కణజాల నారలు మరియు పోషక కణజాల మృదుకణజాలం ఉంటాయి.
3. దారు మృదుకణజాలం సజీవ కణజాలం. 3. పోషక కణజాల నారలు నిర్జీవ కణాలు.

ఎఫ్) బాహ్యచర్మం, బెరదు

బాహ్య చర్మం బెరడు
1. కాండము, వేరు, ఆకునందు వెలుపల ఉండు పొర. 1. బాహ్య చర్మం మీద అనేక వరుసలలో ఏర్పడినది బెరడు.
2. బాహ్య చర్మం సజీవ కణజాలం. 2. బెరడు నిర్జీవ కణజాలం.

ప్రశ్న 3.
నా పేరేంటో చెప్పండి. (AS 1)
ఎ) నేను మొక్క పొడవులో పెరుగుదలకు కారణమైన పెరుగుదల కణజాలాన్ని
బి) నేను మొక్కలలో వర్తులంగా పెరుగుదలకు కారణమైన పెరుగుదల కణజాలాన్ని
సి) నేను నీటి మొక్కల్లో పెద్ద గాలి గదుల్ని కలిగి ఉండే మృదు కణజాలాన్ని
డి) నేను ఆహారపదార్థాన్ని కలిగి ఉండే మృదు కణజాలాన్ని
ఇ) నేను వాయు మార్పిడికి, బాష్పోత్సేకానికి అత్యవసరమైన రంధ్రాన్ని
జవాబు:
ఎ) అగ్ర విభాజ్య కణజాలం
బి) పార్శ్వ విభాజ్య కణజాలం
సి) వాయుగత కణజాలం
డి) నిల్వచేసే కణజాలం
ఇ) పత్రరంధ్రం

ప్రశ్న 4.
కింది వాటి మధ్య పోలికలు రాయండి. (AS 1)
జవాబు:
ఎ) దారువు, పోషక కణజాలం

దారువు పోషక కణజాలము
1. దారువు నీరు మరియు పోషక పదార్థములను వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు సరఫరా చేస్తుంది. 1. ఇది ఆకుల నుండి ఆహార పదార్ధములను మొక్క ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది.
2. దారుకణాలు, దారునాళాలు, దారునారలు మరియు దారు మృదుకణజాలంలు దీనియందు ఉంటాయి. 2. పోషక కణజాలం నందు చాలనీ కణాలు చాలనీ నాళాలు, సహకణాలు, పోషక కణజాల నారలు మరియు పోషక కణజాల మృదుకణజాలం ఉంటాయి.
3. దారు మృదుకణజాలం మాత్రమే సజీవ కణజాలం. 3. చాలనీ కణాలు, చాలనీ నాళాలు, సహకణాలు మరియు పోషక మృదుకణజాలంలు సజీవ కణజాలాలు.
4. దారుకణాలు, దారునాళాలు, దారునారలు నిర్జీవ కణజాలంలు. 4. పోషక కణజాల నారలు మాత్రమే నిర్జీవ కణజాలం.
5. మొక్కకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది. 5. మొక్కకు యాంత్రిక బలమును ఇవ్వదు.
6. దారువు నీటి సరఫరాను ఏకమార్గములో నిర్వహిస్తుంది. వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు చేరుస్తుంది. 6. ఆహార పదార్థాల సరఫరా ద్విమార్గముల ద్వారా నిర్వహిస్తుంది. ఆకుల నుండి నిల్వ అంగాలు లేదా పెరుగుదల నిల్వ అంగాల నుండి పెరుగుదల ప్రదేశాలకు సరఫరా చేస్తుంది.

బి) విభాజ్య కణజాలం, త్వచ కణజాలం

విభాజ్య కణజాలం త్వచ కణజాలం
1. కణములు చిన్నవిగా పలుచని కణకవచములు కలిగి ఉంటాయి. 1. దీనియందలి కణముల కణకవచములు దళసరిగా ఉంటాయి.
2. విభజన చెందగలిగే కణాలు ఉంటాయి. 2. విభజన చెందలేని కణాలు ఉంటాయి.
3. ఇది వేరు, కాండము, కొనలు మరియు శాఖలు వచ్చే ప్రదేశములలో ఉంటుంది. 3. త్వచకణజాలం బాహ్యస్వచం, మధ్యస్త్వచం మరియు. అంతస్త్వచములుగా ఉంటుంది.
4. మొక్క పెరుగుదలకు సహాయపడుతుంది. 4. మొక్క భాగాలకు రక్షణ ఇస్తుంది. బాష్పోత్సేకము ద్వారా కలిగే నీటి నష్టాన్ని నివారిస్తుంది.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 5.
కింది వాక్యాలు చదివి కారణాలు రాయండి. (AS 1)
జవాబు:
ఎ) దారువు ప్రసరణ కణజాలం :

  1. దారువు వేర్ల నుండి నీటిని పోషక పదార్థములను మొక్క అగ్రభాగాలకు సరఫరా చేస్తుంది.
  2. వేర్ల నుండి పదార్థములను దూరభాగములకు రవాణా చేస్తుంది.
  3. వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు నీటి సరఫరా ఏకమార్గములో జరుగుతుంది.

బి) బాహ్య చర్మం రక్షణనిస్తుంది.

  1. బాహ్యచర్మము నందలి కణములు సాధారణముగా ఒక పొరయందు ఉంటాయి.
  2. బాహ్యచర్మము నందలి కణముల గోడలు దళసరిగా ఉంటాయి.
  3. నీటి ఎద్దడి, కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు పరాన్న జీవులు, రోగకారక జీవుల దాడి మొదలైన వాటి నుండి మొక్కలను బాహ్యచర్మం రక్షిస్తుంది.

ప్రశ్న 6.
కింది వాటి విధులను వివరించండి. (AS 1)
1) విభాజ్య కణజాలం 2) దారువు 3) పోషక కణజాలం
జవాబు:
1) విభాజ్య కణజాలం విధులు :

  1. మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను, మరమ్మతులను నిర్వహించేది విభాజ్య కణజాలం.
  2. దీని నుండి ఏర్పడిన కణములు మొక్క దేహంలో వివిధరకాల కణజాలాలుగా ఏర్పడతాయి.

2) దారువు విధులు :

  1. నీరు మరియు పోషక పదార్థములను వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు సరఫరా చేస్తుంది.
  2. మొక్కకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది.
  3. పోషక కణజాలం విధులు : ఆకులలో తయారయిన ఆహారపదార్థములు మొక్కలోని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది.

ప్రశ్న 7.
మొక్కల్లోని కణజాలాల గురించి మరింత విపులంగా తెలుసుకోవడానికి, మీరు ఎటువంటి ప్రశ్నలను అడుగుతారు? జాబితా రాయండి. (AS 2)
జవాబు:

  1. మొక్కలకు యాంత్రిక బలాన్ని, వంగే గుణాన్ని కలిగించే కణజాలమేది? (స్థూలకోణ కణజాలం)
  2. మొక్క దేహంలోనికి వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులను రానీయకుండా అడ్డుకునే కణజాలం? (బాహ్య చర్మం)
  3. అగ్రవిభాజ్య కణజాలం పాడైనా లేదా తెగిన ఏమి జరుగుతుంది? (మొక్క పొడవు అవడం ఆగిపోతుంది)
  4. కొబ్బరికాయపై తొక్కునందు ఉండు కణజాలం పేరేమిటి? (దృఢ కణజాలం)
  5. మొక్కలకు రకరకాల కణజాలాలు ఎందుకు కావాలి? (వివిధ రకముల పనుల నిర్వహణకు)

ప్రశ్న 8.
“బెరడు కణాలు వాయువులను, నీటిని లోనికి పోనీయవు” ఈ వాక్యాన్ని వివరించడానికి నీవు ఏ ప్రయోగం చేస్తావు? (AS 3)
జవాబు:

  1. వేప చెట్టు నుండి బెరడు వలచి పడవ (దోనె) ఆకారంలో తయారు చేసుకొన్నాను.
  2. ఒక పలుచటి వేప చెక్కను బెరడు లేకుండా తీసుకొన్నాను.
  3. వేపచెక్కను, బెరడును, నీటిలో పడవేశాను. రెండూ నీటి మీద తేలాయి.
  4. బెరడు వెలుపలి భాగం నీటిని తాకుతూ, లోపలిభాగం నీటిని తాకకుండా జాగ్రత్త పడ్డాను.
  5. ఒక రోజు ఆగిన తరువాత రెండింటినీ పరిశీలించాను.
  6. వేపచెక్క పైభాగం తడిగా కనిపించింది. వేపచెక్క నీటిని పీల్చటం వలన పైభాగం తడిగా మారిందని గ్రహించాను.
  7. బెరడు లోపలి భాగంలో ఎటువంటి మార్పు గాని, తేమ గాని కనిపించలేదు.
  8. అంటే బెరడు ద్వారా నీరు లోపలికి ప్రసరించలేదు.
  9. దీనిని బట్టి బెరడు నీటిని లోపలికి పోనివ్వదని నిరూపించాను.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం

ప్రశ్న 9.
మొక్కల్లోని త్వచకణజాలం, వాటికి ఎలా సహాయపడుతుందో తెలిపే సమాచారాన్ని సేకరించండి. గోడపత్రికలో ప్రదర్శించండి. (AS 4)
జవాబు:

  1. త్వచ కణజాలంనందు సాధారణముగా ఒక పొర ఉంటుంది. దీనిలోని కణములు వేరువేరు విధముగా ఉంటాయి.
  2. వాటి విధులు, స్థానాన్ని బట్టి ఈ కణజాలం మూడు రకాలుగా విభజించబడింది. అవి బాహ్యచర్మం లేక బహిస్త్వచం (వెలుపలి పొర), మధ్యస్వచం (మధ్య పొర), అంతస్త్వచం (లోపలి పొర).
  3. ఆకు బాహ్య చర్మంలో చిన్నరంధ్రాలు కనిపిస్తాయి. వాటిని పత్రరంధ్రాలు అంటారు.
  4. వేరులో అయితే కణాలు పొడవైన వెంట్రుక వంటి మూలకేశాలను కలిగి ఉంటాయి.
  5. జిగురునిచ్చే చెట్ల యొక్క త్వచకణజాలం నుండి జిగురు స్రవించబడుతుంది.
  6. నీటి ఎద్దడి, కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు, పరాన్న జీవులు, రోగకారక జీవుల దాడి మొదలైన వాటి నుండి మొక్కలను రక్షించేది త్వచ కణజాలం.

ప్రశ్న 10.
కాండం-అడ్డుకోత పటం గీచి, భాగాలు గుర్తించండి. (AS 5)
జవాబు:
AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 1

ప్రశ్న 11.
హరిత కణజాలం, వాయుగత కణజాలం, నిల్వ ఉంచే కణజాలం – ఈ మూడూ మృదుకణజాలాలే. అయినా వాటికి ప్రత్యేకమైన పేర్లు ఎందుకున్నాయి? (AS 6)
జవాబు:

  1. హరితకణజాలం, వాయుగత కణజాలం, నిల్వ ఉంచే కణజాలం ఇవి అన్నియు మృదు కణజాలంలే.
  2. ఈ మృదు కణజాలాలన్ని వివిధ రకాల పనుల నిర్వహణకై రూపాంతరం చెందాయి.
  3. హరిత రేణువులు కలిగి ఉండే మృదుకణజాలం హరిత కణజాలం. ఇది కిరణజన్య సంయోగక్రియ నిర్వహణకు ఉపయోగపడుతుంది.
  4. పెద్ద గాలి గదుల్ని కలిగి ఉండే మృదు కణజాలాన్ని వాయుగత కణజాలం అంటారు. ఇది మొక్కలు నీటిలో తేలుటకు సహాయపడుతుంది.
  5. నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాల నిల్వకు ఉపయోగపడే కణజాలాన్ని నిల్వచేసే కణజాలం అంటారు.

ప్రశ్న 12.
మొక్కల అంతర్భాగములను పరిశీలించేటప్పుడు వాటి నిర్మాణం, విధులు గురించి మీరెలా అనుభూతిని పొందారు? (AS 6)
జవాబు:

  1. మొక్క భాగాల అంతర్నిర్మాణమును పరిశీలించినపుడు కణములు రకరకములని అందువలన వాటి యొక్క విధులు నిర్దిష్టంగా ఉన్నాయని భావించాను.
  2. ఉదాహరణకు కాండములో దారువు, పోషక కణజాలం మరియు ఆకునందు వెలుపలి పొరనందు ఉండే పత్రరంధ్రములు వివిధ పనుల నిర్వహణకు ఉన్నాయి.
  3. కణములు కణజాలములుగా ఏర్పడి వివిధరకాల క్రియల నిర్వహణ ద్వారా మొక్క జీవించి ఉండడానికి కారణమవుతున్నాయని భావించాను.

ప్రశ్న 13.
మొక్క పెరుగుదలలో వివిధ రకాల కణజాలాలు ఎలా దోహదం చేస్తాయో మీ పరిసరాలలోని ఒక చెట్టును పరిశీలించి అన్వయించండి. (AS 7)
జవాబు:

  1. చెట్టు యొక్క గ్రీవ భాగాలలోనూ, అగ్రభాగంలోనూ మొగ్గలు ఉన్నాయి. ఇవి విభాజ్య కణజాలాన్ని కలిగి వేగంగా పెరుగుదల చూపుతున్నాయి.
  2. ఈ మొగ్గలు (కోరకాలు) కొత్త ఆకులను ఏర్పర్చి చెట్టు ఆకారాన్ని, పరిమాణాన్ని నియంత్రిస్తున్నాయి.
  3. ఆకులు, కాండము, కొమ్మలు పై భాగాన పలుచని పొరవంటి కణజాలం కప్పి ఉంది. దీనిని త్వచకణజాలం అంటారు. ఇది మొక్క భాగాలకు రక్షణ కల్పిస్తుంది.
  4. వృక్ష దేహాన్ని ఏర్పర్చుతూ ఇతర కణజాలాన్ని సరైన స్థితిలో ఉంచటానికి సంధాయక కణజాలం ఉంది. ఇది అధికంగా విస్తరించి ఎక్కువ మోతాదులో ఉంది.
  5. పదార్థాల రవాణాకు, కాండము నుండి కొమ్మల ద్వారా పత్రాలలోనికి విస్తరించిన నాళాల వంటి కణజాలం ఉంది. దీనిని ప్రసరణ కణజాలం అంటారు.
  6. ప్రసరణ కణజాలంలోని దారువు ద్వారా నీరు సరఫరా చేయబడితే పోషకకణజాలం ద్వారా ఆహారపదార్థాల రవాణా జరుగుతుంది.

9th Class Biology 2nd Lesson వృక్ష కణజాలం Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

1. మొక్కలోని భాగాలు – వాటి విధులు :

మొక్కల్లోని వివిధ భాగాల పనులను గురించి కింది తరగతుల్లో చదువుకున్నారు. కింది పట్టికలోని విధుల జాబితా చదవంది. ఆ విధుల నిర్వహణలో పాల్గొనే మొక్క భాగాల పేర్లు రాయండి.
జవాబు:

విధి భాగాల పేర్లు
1. నీటి సంగ్రహణ వేరు వ్యవస్థలోని దారువు
2. వాయువుల (గాలి) మార్పిడి ఆకులలోని పత్రరంధ్రాలు
3. కిరణజన్య సంయోగక్రియ ఆకులలోని పత్ర హరితం
4. బాష్పోత్సేకం ఆకులలోని పత్రరంధ్రాలు
5. ప్రత్యుత్పత్తి వేర్లు, కాండం, పత్రం, విత్తనాలు

1. మొక్కలు అన్ని రకాల జీవ క్రియలను ఎలా జరుపుకోగలుగుతున్నాయి?
జవాబు:
మొక్కలలో అమరియున్న వివిధ కణజాలముల ద్వారా మొక్కలు అన్ని రకాల జీవక్రియలు జరుపుకోగలుగుతున్నాయి.

2. ఈ క్రియల నిర్వహణలో సహాయపడటానికి మొక్కల్లో ప్రత్యేకమైన కణాల అమరిక ఏమైన ఉందా?
జవాబు:

  1. ఒకే రకమైన నిర్మాణం మరియు విధులను నిర్వహించే కణములన్ని సమూహములుగా ఉండి కణజాలములు ఏర్పడినాయి.
  2. కణజాలాలు అన్ని నిర్దిష్టమైన అమరిక కలిగియుండి మొక్కలకు జీవక్రియ నిర్వహణలో తోడ్పడతాయి.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం

కృత్యం – 2

ఉల్లిపొరలోని కణాలు :

2. సూక్ష్మదర్శిని సహాయముతో ఉల్లిగడ్డ పొరను నీవు ఏ విధముగా పరిశీలిస్తావు? బొమ్మ గీచి, భాగాలు గుర్తించి, నీ పరిశీలనలను రాయుము.
జవాబు:
ఉల్లిగడ్డ పొర పరిశీలన :

  1. ఒక ఉల్లిపొర ముక్కని తీసుకోవాలి.
  2. దానిని గాజుపలక మీద ఉంచాలి.
  3. దీని పైన ఒక చుక్కనీరు, ఆ తర్వాత ఒక చుక్క గ్లిజరిన్ వేయాలి.
  4. దానిపై కవర్‌పను నెమ్మదిగా ఉంచాలి.
  5. సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించాలి.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 2
పరిశీలనలు :

  1. కణములన్నియు ఒకే ఆకారం, నిర్మాణము కలిగి ఉన్నాయి.
  2. కణముల మధ్య ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి.
  3. కణములు వరుసలలో అమరి ఉన్నాయి.
  4. ప్రతి కణమునకు కణకవచము, కేంద్రకము మరియు కణజీవ పదార్ధము ఉన్నాయి.

కృత్యం – 3

ఆకు – పై పొరలోని కణాలు :

3. సూక్ష్మదర్శిని సహాయంతో తమలపాకును ఏ విధంగా పరిశీలిస్తావు? బొమ్మ గీచి, భాగాలను గుర్తించి, నీ పరిశీలనలను వ్రాయుము.
AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 3
కృత్యం :

  1. తమలపాకును గానీ, గోలగొండి ఆకును గానీ తీసుకొనవలెను.
  2. ఆకును మధ్యకు మడిచి చింపవలెను. చినిగిన చోట సన్నటి అంచు కనిపిస్తుంది.
  3. ఈ అంచును, ఉల్లిపొరను పరిశీలించినట్లే సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించవలెను.
  4. పరిశీలించిన దాని పటాన్ని గీయవలెను. పటంతో పోల్చవలెను.

పరిశీలనలు :

  1. పరిశీలించిన కణాలు అన్ని ఒకే మాదిరిగా లేవు. కొన్ని చిన్నవిగా, మరికొన్ని పెద్దవిగా ఉన్నాయి.
  2. కణాల అమరికలో తేడా ఉంది. అవి దగ్గర దగ్గరగా కణాంతరావకాశాలు లేకుండా అమరి ఉన్నాయి.
  3. కణాలు సమూహాలుగా ఉండి, నిర్దిష్టంగా అమరి ఉండటాన్ని పరిశీలించవచ్చు.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం

కృత్యం – 4

వేరు మూలలోని కణాలు :

4. ఉల్లిగడ్డ వేరుమూలంను నీవు ఏ విధముగా పరిశీలిస్తావు? సూక్ష్మదర్శిని సహాయముతో బొమ్మ గీయుము. నీ యొక్క పరిశీలనలను నమోదు చేయుము.
జవాబు:
వేరు మూలంలోని కణాల పరిశీలన :

  1. ఒక పారదర్శకమైన సీసాను తీసుకొని నీటితో నింపాలి. సీసా మూతి కంటే కొంచెం పెద్దదిగా ఉండే ఉల్లిగడ్డను తీసుకోవాలి. ఉల్లిగడ్డను సీసా మూతిపై ఉంచాలి.
  2. వేర్లు దాదాపు ఒక అంగుళం పొడవు పెరిగే వరకు కొద్దిరోజుల పాటు వేర్ల పెరుగుదలను గమనించాలి.
  3. ఉల్లిగడ్డను తీసుకొని కొన్ని వేర్ల కొనలను కత్తిరించాలి.
  4. ఒక వేరుకొనను తీసుకోవాలి. దాన్ని గాజుపలకపై ఉంచాలి.
  5. దానిపై ఒక చుక్క నీటిని, తరువాత ఒక చుక్క గ్లిజరినను వేయాలి.
  6. కవర్‌స్లితో కప్పి కవర్‌ స్లిప్ పై 2, 3 అదుడు కాగితాలను ఉంచాలి.
  7. నీడిల్ లేదా బ్రష్ వెనుకవైపు కొనతో కవర్ స్లిప్ పై సున్నితంగా కొట్టి పదార్థం పరచుకునేలా చేయాలి.
  8. కణాల నిర్మాణాన్ని, అమరికను సూక్ష్మదర్శినితో పరిశీలించాలి.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 4 AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 5

పరిశీలనలు :

  1. కణములన్నియు ఆకారపరంగా, నిర్మాణపరంగా ఒకే విధముగా లేవు.
  2. కణములన్నీ వివిధ వరుసలలో అమరి ఉన్నాయి.
  3. అగ్రవిభాజ్య కణజాలం వేరు తొడుగునకు క్రింద ఉన్నది.

కృత్యం – 5

పెరుగుతున్న వేర్లు :

5. ఉల్లిగడ్డ యొక్క కత్తిరించిన కొనలను సూక్ష్మదర్శినితో పరిశీలించుము. బొమ్మను గీచి పరిశీలనలను రాయండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 6

  1. ఉల్లిగడ్డను తీసికొని వేర్లను కత్తిరించాలి.
  2. కత్తిరించిన వేరు కొనలకు కొంచెం పైగా మార్కర్ పెతో గుర్తించాలి.
  3. ఉల్లిగడ్డను సీసామూత మీద ఉంచాలి.
  4. నాలుగు, ఐదు రోజులపాటు అలాగే ఉంచాలి.
  5. వేర్లు కొంచెం మునిగేలా, చాలినంత నీరు ఉండేలా తగు జాగ్రత్త తీసుకోవాలి.

పరిశీలనలు :

  1. నిర్దిష్ట రూపములో కణములు అమరియుండిన వేరుకొనను తొలగించిన వేరు పొడవు పెరుగుదల ఆగిపోతుంది.
  2. కణములు సమూహములుగా ఉన్నాయి.

కృత్యం – 6

కాండంకొన, వేరు కొనలో ఉన్న విభాజ్య కణజాలాన్ని సరిపోల్చడం.

6. కాండం కొన, వేరుభాగాలను పరిశీలించి కణాల అమరికను క్రింది పట్టిక నందు రాయండి.
జవాబు:

కణాల అమరిక (కణజాలాలు) కాండం కొన వేరుకొన
కొనభాగంలో అగ్ర విభాజ్య కణజాలం వేరు తొడుగునకు
వెనుక అగ్ర విభాజ్య కణజాలం
పార్శ్వ భాగంలో పార్శ్వ విభాజ్య కణజాలం పార్శ్వ విభాజ్య కణజాలం
శాఖలు వచ్చేచోట మధ్యస్థ విభాజ్య కణజాలం మధ్యస్థ విభాజ్య కణజాలం లేదు

కృత్యం – 7

ద్విదళబీజ కాండంలోని కణజాలాలు :

7. ద్విదళ బీజకాండము అడ్డుకోత తాత్కాలిక సైడ్ ను సూక్ష్మదర్శిని క్రింద పరిశీలించి, బొమ్మ గీచి, భాగములను గుర్తించుము. నీ యొక్క పరిశీలనలను రాయుము.
జవాబు:
ద్విదళ బీజకాండము అడ్డుకోత సైడ్ ను తయారుచేసి సూక్ష్మదర్శిని క్రింద పరిశీలించాలి.
AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 7

పరిశీలనలు:

  1. ద్విదళ బీకాండపు అడ్డుకోతనందు విభాజ్య కణజాలం, ప్రసరణ కణజాలం, త్వచకణజాలం మరియు సంధాయక కణజాలాలు ఉన్నాయి.
  2. కణములన్నియు ఒకేవిధమైన ఆకారము, నిర్మాణమును కలిగి యుండలేదు.

కృత్యం – 8

రియో ఆకు – ఉపరితల కణజాలం :

8. రియో ఆకును సూక్ష్మదర్శిని క్రింద పరిశీలించుము. మ్మ గీచి, భాగములను గుర్తించుము. నీ పరిశీలనలను రాయుము.
జవాబు:

  1. తాజాగా ఉన్న రియో ఆకును తీసుకోవాలి.
  2. ఒక్కసారిగా మధ్యలో చీల్చండి. చినిగిన అంచు వద్ద తెల్లటి పొర కనిపిస్తుంది.
  3. ఆ పొరను జాగ్రత్తగా తీసి సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించాలి.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 8
పరిశీలనలు :

  1. నిర్మాణపరంగా కణములన్నీ ఒకే విధముగా ఉన్నాయి.
  2. కణముల మధ్య ఖాళీ ప్రదేశములు లేకుండా దగ్గరగా అమరి ఉన్నాయి.
  3. ఇది మొక్క యొక్క త్వచ కణజాలం.
  4. దీనియందు పత్రరంధ్రము కలదు.

AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం

కృత్యం – 9

కణజాలాల పరిశీలన :

9. మీ ప్రయోగశాల నుండి హరిత కణజాలం, వాతయుత కణజాలం, నిల్వచేసే కణజాలాల సైట్లను సేకరించండి. మైక్రోస్కోపీతో పరిశీలించండి. మీరు గమనించిన లక్షణాలను నోటు పుస్తకంలో రాయండి.
జవాబు:
AP Board 9th Class Biology Solutions 2nd Lesson వృక్ష కణజాలం 9
గమనించిన లక్షణాలు:
i) హరిత కణజాలం :
ఈ కణజాలం హరిత రేణువులను కలిగి ఉంటుంది. అందువలన దీనిని హరిత కణజాలం అంటారు.

ii) వాతయుత కణజాలం :
ఈ కణజాలం మృదుకణజాలం. పెద్ద గాలిగదుల్ని కలిగి ఉంటుంది. అందువలన దీనిని వాయుగత మృదుకణజాలం లేదా వాతయుత కణజాలం అంటారు.

iii) నిల్వజేసే కణజాలం :
ఈ మృదు కణజాలం నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాలను నిల్వ చేస్తుంది. అందువలన దీనిని నిల్వచేసే కణజాలం అంటారు.