AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు

AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు

SCERT AP 10th Class Biology Study Material 10th Lesson సహజ వనరులు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Biology 10th Lesson Questions and Answers సహజ వనరులు

10th Class Biology 10th Lesson సహజ వనరులు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
ప్రస్తుతం మీ పరిసరాలలో అతి తక్కువగా అందుబాటులో ఉన్న సహజ వనరు ఏది? అది మీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
జవాబు:
మా పరిసరాలలో తక్కువగా అందుబాటులో ఉన్న సహజ వనరు నీరు. ఇది నిత్యావసరమైనప్పటికి లభించటం కష్టంగా ఉంది. ప్రధానంగా మంచినీటి కోసం దూర ప్రాంతాలకు ప్రయాణించవలసి వస్తోంది. కావున ప్రాంత ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు.

ఎ) అంతకు ముందు లేదా పూర్వం ఈ వనరు అధికంగా ఉండేదా?
జవాబు:
పూర్వపు రోజులలో ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి ఉండేది కాదు. అందరికీ పుష్కలంగా నీరు లభించేది. బావుల నిండా నీరు ఉండేది. ఊరందరికీ సరిపడే నీరు లభించేది.

బి) కాలం గడుస్తున్న కొద్దీ ఈ వనరు ఎందుకు తగ్గిపోయింది?
జవాబు:
మారుతున్న ఋతుపవనాల వలన, నీటి వినియోగంలోని నిర్లక్ష్యం వలన నానాటికి భూగర్భ జలాలు క్షీణించాయి. భూగర్భ జలాలు క్షీణించటం వలన బావులు ఎండిపోయి నీటి కొరత ఏర్పడింది.

సి) ఈ వనరులను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? (నీవేం చేస్తావు?)
జవాబు:
నీరు అన్ని జీవులకూ జీవనాధారం. నీరు లేకుండా ఏ ప్రాణీ జీవించలేదు. అందువలన నీటి వనరులను సంరక్షించాలి. దీని కోసం

  1. ఇంకుడు గుంటలు నిర్మించి భూగర్భజలం పెంచాలి.
  2. ఇంకుడు చెరువులు, చెక్ డ్యామ్లు నిర్మించి నీటిని ఇంకింపచేయాలి.
  3. వ్యవసాయంలో సూక్ష్మనీటిపారుదల పద్ధతులు వాడాలి.
  4. వర్షపు నీటి నిల్వకు, చెరువులు, కాలువలు పూడిక తీయించాలి.

ప్రశ్న 2.
ప్రపంచ ఇంధన వనరుల గణాంక వివరాల నివేదిక ప్రకారం 2010 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 188.8 మిలియన్ టన్నుల నూనె నిలవలు ఉన్నాయి. ఇవి రాబోయే 46.2 సంవత్సరాలకు మాత్రమే సరిపోతాయి అని తెలియజేశారు. నూనె వనరులను పొదుపుగా ఉపయోగించుకోడానికి నీవు సూచించే చర్యలు ఏమిటీ? పొదుపుగా వాడుకోనట్లయితే జరిగే పరిణామాలు ఏమిటి?
జవాబు:
పెట్రోలు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలు తరిగిపోయే శక్తివనరులు. వీటిని విచక్షణారహితంగా వాడటం వలన త్వరలోనే అయిపోతాయి. కావున వీటి వినియోగంలో పొదుపు అవసరం.

నూనె వనరులను పొదుపుగా వాడటానికి చర్యలు :

  1. అధిక మైలేజీ ఇచ్చే వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  2. పబ్లిక్ రవాణా వ్యవస్థను వాడాలి.
  3. చిన్న చిన్న దూరాలకు సైకిళ్లను వాడాలి.
  4. సోలార్ వాహనాలను అభివృద్ధిపరచాలి.
  5. విద్యుత్ రంగాన్ని అభివృద్ధి పరచి సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలి.
  6. ప్రత్యామ్నాయ శక్తి వనరులను అభివృద్ధి చేసుకోవాలి.
  7. బయోడీజిల్, పెట్రో పంటలను ప్రోత్సహించాలి.
  8. పట్టణాలలో సిటీ సర్వీసులకు బదులు మెట్రోరైల్వే వ్యవస్థను వృద్ధిపరచాలి.

పొదుపుగా వాడకపోతే ఫలితాలు :

  1. పెట్రోలియం నిక్షేపాలు అన్నీ అయిపోతాయి. అందువలన బొగ్గు, పెట్రోలు వంటి వనరులు లభించవు.
  2. వాహనాలను, పరిశ్రమలను నడపలేము.
  3. మానవ జీవితం పూర్తిగా స్తంభించిపోతుంది.
  4. అభివృది అడుగంటి, వెనుకబడిపోతాము.
  5. శక్తి సంకటం’ ఏర్పడుతుంది.
  6. ప్రత్యామ్నాయ శక్తి వనరుల కోసం పోటీ ఏర్పడుతుంది.

ప్రశ్న 3.
కింద ఇవ్వబడిన సమాచారాన్ని చదివి, దాని కింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులివ్వండి.
[ శ్రీకాకుళం జిల్లాలో రెండు మండలాలలోని ఇరవైకి పైగా గ్రామాల నుండి ప్రజలు చేరి, ఒక ప్రైవేటు కంపెనీ సముద్ర తీరంలో తలపెట్టిన ఇసుక తవ్వకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రద్దుచేయకపోతే, వారి పోరును తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తీరప్రాంతం నుండి విలువైన ఖనిజాలను వెలికితీసే ఉద్దేశంతోనే ఇసుక తవ్వకాన్ని చేపట్టదలిచారు. ఇసుక తవ్వకం మొదలు పెట్టిన అటవీ సరిహద్దు ప్రాంతంలోనే ఈ ప్రజలు నివసిస్తారు.
ఎ) గ్రామ ప్రజలు ఈ విధంగా వ్యతిరేకించి పోరాడడం సరైనదేనా?
జవాబు:
గ్రామ ప్రజల వ్యతిరేక పోరాటం సరైనది.

బి) పోరాడడం వలన గ్రామస్తులు ఏ వనరులను కాపాడుకోగలరు?
జవాబు:
ఈ పోరాటం వలన గ్రామస్తులు విలువైన ఖనిజ వనరులను కాపాడుకోగలరు.

సి) ఇసుక నుండి వెలికితీసిన విలువైన ఖనిజాల వల్ల గ్రామస్తులు ఏమైనా లాభం పొందుతారా?
జవాబు:
ఖనిజ తవ్వకం ప్రైవేటు కంపెనీ చేపట్టింది కాబట్టి, గ్రామస్తులకు లభించే ప్రయోజనం ఏమీ ఉండదు.

డి) తీరప్రాంతంలో ప్రైవేటు కంపెనీ ఎందుకు తవ్వకాలను చేపట్టాలనుకుంది?
జవాబు:
విలువైన ఖనిజాల కోసం ప్రైవేటు కంపెనీ తీర ప్రాంత ఇసుకలో తవ్వకాలను చేపట్టింది.

ఇ) దీనిలో ప్రభుత్వ పాత్ర ఏమిటి?
జవాబు:
ఇటువంటి అక్రమ తవ్వకాలను నిరోధించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దీనికోసం కఠినమైన చట్టాలు, నిఘా వ్యవస్థను పెంచాలి.

ఎఫ్) ఇసుక తవ్వకం అక్కడి ప్రజల జీవనంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
జవాబు:
ఇసుక తవ్వకం వలన సముద్ర తీర ఆవాసం దెబ్బతింటుంది. సముద్రం ముందుకు రావడంతో తీరప్రాంత గ్రామాలకు నష్టం కలుగుతుంది. ఇది గ్రామ ప్రజల జీవన విధానాన్ని, ఆవాసాన్ని పాడుచేస్తుంది. కావున వారు తవ్వకాలను వ్యతిరేకించారు.

AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు

ప్రశ్న 4.
సుస్థిరాభివృద్ధి అంటే ఏమిటి? వనరుల యాజమాన్యంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది?
జవాబు:
అభివృద్ధి, సంరక్షణ రెండింటికి ప్రాధాన్యమిస్తూ, భావితరాలకు అవసరమయ్యే సహజ వనరులను అందుబాటులో ఉండే విధంగా మనం పర్యావరణాన్ని ఉపయోగించుకున్నట్లయితే అది సుస్థిరాభివృద్ధి అవుతుంది.
AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు 1

అభివృద్ధి పేరుతో మనం అడవులను, పరిసరాలను ధ్వంసం చేస్తూ ముందుకు సాగటం మంచి పరిణామం కాదు. దీనివలన భవిష్యత్ లో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది. చెట్లను నరికి ఎ.సి.లు వాడుకోవటం అభివృద్ధి అవుతుందా? అభివృద్ధితో పర్యావరణం సంరక్షించబడాలి. మనిషి పర్యావరణంలో ఒక ప్రాణి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంత ఎదిగినా ప్రకృతిలో ఒదిగినపుడే తన మనుగడకు క్షేమమని మరచిపో కూడదు. దీనికోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను విచక్షణాయుతంగా, పొదుపుగా, పునఃచక్రీయంగా, సమతాస్థితి కాపాడే విధంగా వాడుకోవాలి.

ప్రశ్న 5.
సహజ వనరుల సంరక్షణ – యాజమాన్యంపై వివరంగా రాయండి. .
జవాబు:
సహజ వనరులు మన అవసరాలను తీర్చటానికే గాని అత్యాశకు కాదు’ – అన్న గాంధీ మహాత్ముని వాక్యాన్ని మనం నిరంతరం గుర్తుచేసుకొంటూ, సహజ వనరులను సంరక్షించుకోవాలి. గాలి, నీరు, నేల, అడవి, ఖనిజాలు, సముద్రం, పర్వతాలు ఇవన్నీ సహజ వనరులే. వీటిని విచక్షణారహితంగా వాడుకొంటూ, వృథా చేస్తూ దుర్వినియోగం చేస్తున్నాము. దీని నివారణకు సరైన ‘సహజ వనరుల యాజమాన్యం ‘ ఉండాలి.

  1. సహజ వనరుల వినియోగంపై రాష్ట్రస్థాయి నుండి దేశీయ, అంతర్జాతీయ స్థాయిలలో స్పష్టమైన ప్రణాళికలతో కూడిన యాజమాన్య సంస్థలు ఉండాలి.
  2. సహజ వనరుల సంరక్షణకు నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి.
  3. సహజ వనరుల వినియోగంలో షరతులు ఉండాలి. వాటిని భంగపరచే వారిపై చర్య ఉండాలి.
  4. పెట్రోలు వినియోగం వలన CO2 ఏర్పడి గాలి కలుషితం జరుగుతుంది. పెట్రోలు వినియోగం బట్టి మొక్కలు, అడవుల వృద్ధి రేటు ఉండేలా ఆయా దేశాలు చర్యలు చేపట్టాలి.
  5. పరిశ్రమలు, చమురు కంపెనీలు జల కాలుష్యం కలిగిస్తున్నాయి. ఈ నష్టానికి యాజమాన్యం బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలి. జల వనరుల కాలుష్యాన్ని పూర్తిగా నివారించాలి.
  6. నేల సంరక్షణకు గాను ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలి.
  7. ఖనిజ వనరులను పరిమితంగా వాడుతూ, 4R సూత్రం పాటించాలి.
  8. ప్రత్యామ్నాయ వనరులకు ప్రాధాన్యమివ్వాలి.

ప్రశ్న 6.
స్థానికంగా ఉన్న వనరులను పునర్వినియోగించుకొనే కొన్ని మార్గాలను సూచించండి.
జవాబు:

  1. ఉపయోగించిన నీటిని పెరటి మొక్కలకు మళ్ళించాలి.
  2. వర్షపు నీటిని ఇంకుడు గుంటకు మళ్ళించాలి.
  3. ఎలక్ట్రానిక్ వస్తువులను బాగు చేయించే అవకాశం ఉంటే బాగు చేయించాలి.
  4. పారేసే వస్తువులను, వేరే విధంగా వాడవచ్చునేమో అని గమనించాలి.
  5. పాత బట్టలు, వస్తువులు ‘పేదవారికి దానం చేయాలి.
  6. చెట్ల ఆకులు, ఎండిన కొమ్మలు ఎరువుల తయారీకి వాడాలి.
  7. నేలలో కుళ్ళే పదార్థాలను వర్మీకంపోస్టు వాడాలి.
  8. 0% వ్యర్థాల నిర్వహణకు కృషిచేయాలి.
  9. సోలార్ కుక్కర్లకు, హీటర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  10. వాడేసిన వాటర్ బాటిళ్లలో మొక్కలు పెంచి కిచెన్ గార్డెన్ ను ఏర్పాటుచేయాలి.

ప్రశ్న 7.
అడవులను, వన్యజీవులను ఎందుకు సంరక్షించుకోవాలి?
జవాబు:
అడవులు ప్రకృతిలో ముఖ్యమైన సహజ వనరులు. భూమి విస్తీర్ణంలో అడవులు 33% ఉండాలి. కానీ మానవ విచక్షణా రహిత చర్యల వలన నేడు ఇవి 19 శాతానికి తగ్గిపోయాయి. ఈ పరిస్థితి కొనసాగితే మానవాళి గొప్ప ప్రమాదాన్ని ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ కింది కారణాల వలన మనం అడవులను, వన్యజీవులను కాపాడుకోవాలి.

  1. అడవులు జీవవైవిధ్యానికి పెట్టింది పేరు. అడవులను నరకటం వలన జీవవైవిధ్యం దెబ్బతిని ప్రకృతి సమతాస్థితి పాడైపోతుంది.
  2. అడవులు వర్షపాతాన్ని పెంచుతాయి.
  3. అడవులు నేల క్రమక్షయాన్ని అరికడతాయి.
  4. అనేక అటవీ ఉత్పత్తులు మానవ జీవనాధారాలు.
  5. అడవులు అనేక ఖనిజ నిక్షేపాలు కలిగి ఉన్నాయి.
  6. అడవి ఒక సహజ ఆవాసం.
  7. ప్రకృతిలోని ప్రతి ప్రాణికీ నిర్దిష్ట పాత్ర ఉంటుంది. అటువంటి కీలకపాత్రను ఆవాసంలో వన్యజీవులు పోషిస్తున్నాయి.
  8. వన్యప్రాణులు జీన్ బ్యాంలా పనిచేస్తాయి.
  9. వన్యప్రాణులు అంతరించే ప్రమాదంలో ఉన్నాయి. ఇవి అంతరించటం వలన జీవావాసాలు దెబ్బతింటాయి.

AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు

ప్రశ్న 8.
అడవుల సంరక్షణ విధానాలను కొన్నింటిని సూచించండి.
(లేదా)
“అడవుల సంరక్షణ మన బాధ్యత” దీనికి మీరు పాటించే విధానాలను కొన్నింటిని సూచించండి.
జవాబు:

  1. అటవీ సంరక్షణ జాతీయ స్థాయి సమస్య. కావున అడవుల సంరక్షణకు, అటవీ శాఖకు మరియు ఇతర శాఖలకు మధ్య మంచి సమన్వయాన్ని పెంచాలి.
  2. అటవీ సంరక్షణలో ప్రాంతీయ ప్రజల పాత్ర కీలకమైనది. కావున అటవీ సంరక్షణలో వీరిని బాధ్యులుగా చేయాలి.
  3. చెట్లను నరకటం, తొలగించటం వంటి పనులను పూర్తిగా నిషేధించాలి.
  4. వన మహోత్సవం’ వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి మొక్కలను విరివిగా నాటించాలి.
  5. పండుగలు, ఉత్సవాల సందర్భాలలో చెట్లను నాటే కార్యక్రమాన్ని అనుసంధానం చేయాలి.
  6. వంట చెరకు కోసం చెట్లు నరకకుండా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి.
  7. గడ్డి భూములను సంరక్షిస్తూ చెట్ల పెంపకాన్ని చేపట్టాలి.
  8. అటవీ సంరక్షణ చట్టం 1980ను కచ్చితంగా అమలు చేయాలి.
  9. అటవీ సరిహద్దు ప్రాంతాలలో చెక్పన్ల సంఖ్య పెంచాలి.
  10. అటవీ సంరక్షణకు కృషిచేస్తున్న బృందాలకు ప్రోత్సాహకాలు, బహుమతులు ప్రకటించాలి.
  11. ఎర్రచందనం, గంధం చెట్లు ఉన్న అడవుల్లో కాపలా పెంచాలి.
  12. చెట్లను నరకటం, నిర్మూలించటం నేరాలుగా పరిగణించి కఠినమైన శిక్షలు అమలు చేయాలి.

ప్రశ్న 9.
సహజ వనరులు చాలా వేగంగా అంతరించిపోతున్నాయి కదా! దీని వలన జరిగే పరిణామాలను ఊహించండి.
జవాబు:
సహజ వనరులను వేగంగా వినియోగించటం వలన అవి అంతరించిపోయే ప్రమాదం ఉంది. దీనివలన భవిష్యత్తులో బొగ్గు, పెట్రోలు నిల్వలు అడుగంటిపోతాయి. వీటి ఆధారంగా పనిచేసే పరిశ్రమలు, వాహనాలు మూలనపడతాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది. సమాజం శక్తి కొరతను ఎదుర్కొంటుంది. వాహనాలు లేని సమాజం మధ్యయుగం నాటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. చాలా పరిశ్రమలు శక్తి కొరతతో మూలనపడతాయి. వస్తు ఉత్పత్తి తగ్గి, ప్రజల జీవన విధానం దెబ్బతింటుంది. కావున మనం సహజ శక్తి వనరులను పొదుపుగా, విచక్షణతో వాడుకోవాలి.

ప్రశ్న 10.
ఒక పెట్రోలు బంకుకు వెళ్ళి నిర్వాహకుడితో శిలాజ ఇంధనాల వినియోగం గురించి ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళిని రూపొందించండి.
జవాబు:

  1. పెట్రోలును మీరు ఎక్కడ నుండి కొంటారు?
  2. ఒక్క రోజులో ఎంత పెట్రోలు విక్రయిస్తారు?
  3. పెట్రోలు వినియోగం రేటు గతంతో పోల్చితే పెరిగిందా?
  4. పెట్రోలు వినియోగం రేటు పెరగటానికి కారణం ఏమిటి?
  5. గతంతో పోల్చితే నేడు పెట్రోలు రేట్లు ఎలా ఉన్నాయి?
  6. పెట్రోలు రేట్లు ఎందుకు విపరీతంగా పెరుగుతున్నాయి?
  7. ఇదే పరిస్థితి కొనసాగితే పెట్రోలు వాడకం భవిష్యత్ లో ఎలా ఉంటుంది?
  8. అందరికీ సరిపడా పెట్రోలు ఉత్పత్తి సాధ్యం అని భావిస్తున్నారా?
  9. పెట్రోలు వినియోగానికి ప్రత్యామ్నాయం ఏమిటి?

ప్రశ్న 11.
ఇంధన వనరులు, నేలసారం కాపాడటం, వర్షపు నీరు భద్రపరచడం వంటి ఏదైనా ఒక అంశాన్ని ప్రదర్శించటానికి నమూనాను తయారుచేయండి. మీ ఆలోచనలతో నివేదిక రాయంది.
జవాబు:
వర్షపు నీటిని భద్రపర్చటంపై నమూనా తయారి:

  1. ఒక దీర్ఘచతురస్రాకారపు రేకు ముక్కను తీసుకొని, దాని అంచులు మడిచి ఇంటి పై కప్పును రూపొందించాను.
  2. దీర్ఘచతురస్రాకారపు అట్టముక్కను తీసుకొని దానిని క్రింద అమర్చి, ఇంటి నమూనాను ఏర్పాటు చేశాను.
  3. ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని దానిలో మట్టి, ఇసుక, కంకరను మూడు పొరలుగా అమర్చి ఇంటి పక్క నేలలో అమర్చాను. ఇది ఇంకుడు గుంట నిర్మాణ ప్రాధాన్యతను చూపుతుంది.
  4. ఇంటి పై కప్పును కొంచెం వాలుగా అమర్చి వర్షపు నీటిని ఒక మూలకు వచ్చే విధంగా అమర్చాను.
  5. ఈ వర్షపు నీటిని ఒక పైపు ద్వారా తీసుకొచ్చి ఇంకుడు గుంటకు అమర్చాను.
  6. తద్వారా వర్షపు నీరు ఇంకుడు గుంటను చేరుతుంది.

AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు 2

ప్రయోజనాలు:

  1. వర్షపు నీరు ఆదా చేయబడుతుంది.
  2. భూగర్భజలం పెరుగుతుంది.
  3. బోరులు, బావులు ఎండిపోవు.
  4. నీటి కొరత పరిష్కరింపబడుతుంది.
  5. పరిసర ప్రాంతాలలో నీరు నిలువదు.
  6. పరిసరాల పరిశుభ్రత కాపాడబడుతుంది.
  7. ఆరోగ్య సమస్యలు తలెత్తవు.

ప్రశ్న 12.
మీ ప్రాంతంలో సహజ వనరులను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్న గ్రామాలు, రైతులు, వారు అనుసరిస్తున్న విధానాలను తెలుసుకొని నివేదిక రాయండి.
జవాబు:
సహజ వనరుల సంరక్షణకు, మా ప్రాంత రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు విలువైన సూచనలతోపాటు తగిన సమాచారం ఇచ్చి వాటిని ఆచరించే విధంగా ప్రేరణ ఇచ్చారు. దీనివలన నేల, నీరు యొక్క సంరక్షణ అవసరాన్ని రైతులు తెలుసుకున్నారు. నేల, నీటి సంరక్షణకు రైతులు ఈ కింది పద్ధతులు పాటిస్తున్నారు.

నేల సంరక్షణ :

  1. రసాయన ఎరువుల స్థానంలో జీవ ఎరువులకు ప్రాధాన్యత.
  2. వర్మీకంపోస్ట్ వినియోగం, తయారీ.
  3. లెగ్యుమినేసి పంటలు పండించటం.
  4. పంట మార్పిడి పద్ధతి పాటించటం.
  5. అంతర పంటలకు ప్రాధాన్యత.
  6. నేలసార పరీక్షలు నిర్వహించి తగిన పంటను వేయుట.
  7. గట్లమీద కంది, బంతి వంటి చిన్న పంటలకు ప్రాధాన్యత.
  8. వరి స్థానంలో అపరాలవైపు మొగ్గు.

నీటి సంరక్షణ :

  1. చెరువు పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యం పెంచారు.
  2. కాలువలోని కలుపు నివారించి నీటి నష్టాన్ని తగ్గించారు.
  3. ఆరు తడి పంటలకు ప్రాధాన్యత ఇచ్చారు.
  4. నీరు అందని ప్రాంతాలలో మెట్ట పంటల సాగు.
  5. ఇంకుడు చెరువు నిర్మించి భూగర్భజల మట్టం పెంచారు.
  6. చెక్ డ్యామ్లు నిర్మించి నీటి నిల్వలు పెంచారు.

AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు

ప్రశ్న 13.
కాకినాడ వద్ద ONGC వారు చేపట్టిన సహజ వాయువు యొక్క డ్రిల్లింగ్ పనుల గురించి మీరు వినే ఉంటారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి, సహజవాయువు ఉత్పత్తిపై నివేదిక రాయండి.
జవాబు:

ఉత్పత్తి ఆదాయం
క్రూడ్ ఆయిల్ 562.38 బిలియన్
సహజ వాయువు 168.88 బిలియన్
L.P.G 31.48 బిలియన్
Naptha 76.80 బిలియన్
C2 – C3 13.44 బిలియన్
SKO 3.69 బిలియన్

Oil and Natural Gas Corporation Limited ను సంక్షిప్తముగా ONGC అంటారు. ఇది దేశీయ స్థాయిలో పేరెన్నిక గన్న ప్రముఖ పెట్రోలు మరియు సహజవాయు కంపెనీ. దీని ప్రధాన కార్యాలయం డెహ్రడూన్లో ఉండగా అనుబంధ కార్యాలయం ఒకటి కాకినాడలో ఉంది.

కృష్ణా-గోదావరి బేసిన్ ప్రాంతంలో సహజవాయువు నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయని గుర్తించి అక్కడ డ్రిల్లింగ్ ప్రక్రియలు నిర్వహించారు. చాలా మొత్తంలో సహజ వాయువును వెలికితీస్తున్నారు. అయితే ఈ సందర్భంలో సంభవించిన లీకులు మంటలను సృష్టించి ఆ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. దానితో దీనిని కోనసీమ గుండెలో కుంపటిగా అభివర్ణిస్తూ వచ్చారు.

సహజ వాయువు సేకరణలో కేవలం ఒక్క సహజ వాయువు మాత్రమే లభించదు. అదనంగా అనేక పదార్థాలు లభిస్తాయి. వీటిలో ప్రధానమైనవి-క్రూడ్ ఆయిల్, పెట్రోలియం. పెట్రోలియంను అంశిక స్వేదనం చేయటం వలన కిరోసిన్, డీజిల్, పెట్రోలు, తారు వంటి ఉప ఉత్పత్తులు లభిస్తాయి. ఇవన్నీ ప్రధాన శక్తి వనరులే.

2010లో పెట్రోలియం మరియు సహజవాయువు నియంత్రణ కమిటీ, కాకినాడ వాయు పంపిణీ విధానానికి అవార్డు ప్రకటించింది. GAIL మరియు హిందుస్థాన్ పెట్రోలియం, కాకినాడ పరిసర ప్రాంతాలకు సహజవాయువు సరఫరా కోసం భూఅంతర్భాగ పైపులైను,విధానం ఏర్పర్చింది. దీనివలన కాకినాడ పరిసర ప్రాంతాలైన సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం వంటి ప్రాంతాలకు గ్యాస్ సరఫరా జరుగుతున్నది. పైపు లైను ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతున్న మూడవ నగరంగా కాకినాడ పేరు తెచ్చుకొంది. మొదటి రెండు స్థానాలలో హైదరాబాద్, విజయవాడ ఉన్నాయి.

ప్రశ్న 14.
మీ పరిసర ప్రాంతాలలో ఏ పదార్థాన్నెనా పునఃచక్రీయం చేసే యూనిట్లు లేదా పరిశ్రమలు ఉన్నాయా? పదార్థ పునఃచక్రీయం ఎలా జరుగుతుందో రాయండి.
జవాబు:

  1. మా ప్రాంతంలో ఇనుము పునఃచక్రీయ పరిశ్రమ ఉంది. మిగిలిన వనరులతో పోల్చితే ఇనుము తయారీ కంటే పునఃచక్రీయం సులభం మరియు అవసరము.
  2. గృహాల నుండి, ప్రధానంగా ఆటోమొబైల్ పరిశ్రమ నుండి వాడి పడేసిన ఇనుప వస్తువులను సేకరిస్తారు.
  3. సేకరించిన అనుప వస్తువుల నుండి, రస్ట్ తొలగించి, నాణ్యత, మందం, ఆధారంగా విభజన చేస్తారు.
  4. విభజించిన ఇనుమును అణగగొట్టి పరిమాణం తగ్గించి పరిశ్రమలోనికి రవాణా చేస్తారు.
  5. ఈ వాడిన ఇనుము పరిశ్రమలోని కొలిమిలో బాగా కరిగించి ద్రవంగా మార్చుతారు.
  6. కరిగించిన ఇనుమును శుద్ధ ప్రక్రియలో దానిలో ఇతర మలినాలను తొలగిస్తారు.
  7. తయారీ వస్తువు ఆధారంగా పటుత్వం కొరకు కొన్ని ఇతర లోహాలను కలిపి మిశ్రమ లోహాలను ఏర్పరుస్తారు.
  8. కరిగించిన ఇనుమును అచ్చులుగా కావాల్సిన ఆకారంలో పోసి వస్తు తయారీకి వాడతారు.
  9. ఇనుము పునఃచక్రీయం వలన మనకు అవసరమైన ఇనుము దాదాపు 60% ఉత్పత్తి అవుతుంది. అంటే 60% మేర ఇనుప ఖనిజాన్ని ఆదా చేస్తున్నట్లు.
  10. భూమి నుండి ఖనిజం తవ్వి శుద్ధిచేసి ఇనుమును పొందే ప్రక్రియతో పోల్చితే పునఃచక్రీయ ప్రక్రియ సౌకర్యవంతంగా ఉంటుంది.

ప్రశ్న 15.
మన దేశంలో పెట్రోలియం వినియోగాన్ని సూచించే ఏదైనా గ్రాను సేకరించి పరిశీలించండి.
AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు 3
ఎ) మన అవసరాలకు తగినంత ఉత్పత్తి జరుగుతున్నదా?
జవాబు:
లేదు, పెట్రోలియం ఉత్పత్తికంటే వినియోగం అధికంగా ఉంది. కాబట్టి పెట్రోలు కొరత ఏర్పడుతుంది.

బి) ఏ కాలంలో గరిష్ట వినియోగం జరిగింది?
జవాబు:
2008-2010 మధ్యకాలంలో పెట్రోలు వినియోగం రేటు అధికంగా ఉంది.

సి) పది సంవత్సరాల కాలంలో ఉత్పత్తిలో మీరు గమనించిన మార్పు ఏమిటి? (ఉదా : 2004 నుండి 2014)
జవాబు:
పది సంవత్సరాల కాలంలో ప్రజల అవసరాలు తీర్చటం కోసం పెట్రోలియం ఉత్పత్తిని కూడా వృద్ధి చేయటం జరిగింది. అంటే వనరుల వినియోగం రేటు పెరిగింది. ఇది ఇంధన కొరతకు దారితీసే ప్రమాదం ఉంది.

డి) పెట్రోలియం ఉత్పత్తిని పొదుపుగా వాడుకోడానికి మీరు ఇచ్చే సూచనలు ఏమిటి?
జవాబు:
పెట్రోలియం పొదుపుగా వాడటానికి :

  1. అధిక మైలేజీ ఇచ్చే వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  2. మైలేజీ తగ్గిన వెంటనే వాహనాల ఇంజన్ ఆయిల్ ఫిల్టర్లు సరిచేయించాలి.
  3. ప్రతి చిన్న అవసరానికి కారు వాడకం మానెయ్యాలి.
  4. చిన్న చిన్న దూరాలకు సైకిళ్లు వాడాలి.
  5. పబ్లిక్ ప్రయాణ వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  6. ప్రయాణాన్ని పంచుకోవటం (Shared journey) అలవాటు చేసుకోవాలి.
  7. వాహనాలను నిర్ణీత వేగంతో నడపాలి.
  8. ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు ప్రాధాన్యం ఇవ్వాలి.

AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు

ప్రశ్న 16.
సహజ వనరులను సద్వినియోగం చేసుకోడమే దేశానికి మనం చేసే సేవ అని చెప్పవచ్చు. దీనిని నీవు సమర్థిస్తావా? ఎందుకు?
జవాబు:
సహజ వనరులను సద్వినియోగం చేసుకోవటమే దేశానికి మనం చేసే సేవ అని చెప్పటాన్ని నేను సమర్థిస్తున్నాను.

  1. పెరుగుతున్న జనాభా వలన వనరుల వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ పరిస్థితి కొంతకాలం కొనసాగితే, భవిష్యత్ తరాలకు వనరులు లభించవు.
  2. ప్రధానంగా శిలాజ వనరుల కొరత ఏర్పడుతుంది. పెట్రోలు, బొగ్గు నిల్వలు అడుగంటిపోతాయి. మనం సాధించిన అభివృద్ధి అంతా శక్తి పైన ఆధారపడి ఉంది.
  3. శక్తి రహిత ప్రపంచంలో ఏ పరిశ్రమలూ పనిచేయవు. ఏ రవాణా సాధనం నడవదు. అంటే మరలా మనం మధ్యయుగం నాటి పరిస్థితులకు వెళ్ళిపోతాము.
  4. ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలంటే వనరుల సద్వినియోగం ప్రతి పౌరుడు తన బాధ్యతగా భావించాలి.
  5. వనరుల వినియోగంలో విచక్షణ ఉపయోగింగ్ భాష్ తరాలకు వాటిని అందించాలి.
  6. తరిగిపోయే వనరులను తగ్గించి వాడటం అలవాటు చేసుకోవాలి.
  7. సౌరశక్తి, అలల శక్తి, పవనశక్తి వంటి ప్రత్యామ్నాయ వనరులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  8. వనరుల వినియోగంలో సాంకేతిక జ్ఞానం పెంచాలి. అప్పుడే భవిష్యత్ తరాలకు మనం శక్తిమయ ప్రపంచం అందించగలం. అదే మనం మన దేశానికి, రేపటి తరానికి చేసే సేవ.

ప్రశ్న 17.
జల వనరుల సౌలభ్యాన్ని బట్టి పంటల ఎంపిక, వ్యవసాయ విధానాలు ఉండాలి. ఈ విషయంలో రైతులకు అవగాహన కలిగించడానికి నినాదాలు తయారుచేయండి.
జవాబు:
వరి పంట వద్దు – ఆరు తడి పంటలు ముద్దు
నీటి వనరులు చూసుకో – సరైన పంటను ఎంచుకో
నీరు పుష్కలంగా లభిస్తే – వరి పంట సరే
వ్యవసాయం అంటే – వరి పంట ఒక్కటే కాదు
మైక్రో ఇరిగేషన్ వాడు – నీటిని ఆదాచేసి చూడు
బావి క్రింది సాగు అయితే – మెట్ట పంటలే మేలు
మంచాన్ని బట్టి కాళ్లు ముడుచుకోవాలి – నీటి లభ్యతను బట్టి పంటను మార్చుకోవాలి.

10th Class Biology 10th Lesson సహజ వనరులు Textbook InText Questions and Answers

10th Class Biology Textbook Page No. 228, 229

ప్రశ్న 1.
AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు 4
ఎ) గ్రామం – 1 లో ఎన్ని ఎకరాల భూమికి, నీటిపారుదల వసతి ఉంది?
జవాబు:
గ్రామం – 1 లో 947.75 ఎకరాలకు నీటిపారుదల వసతి ఉంది.

బి) గ్రామం – 1 లోని భూమి మొతానికి నీటిపారుదల వసతి కలిగించాలంటే ఎన్ని బావులు అవసరం?
జవాబు:
గ్రామం – 1 లోని భూమి మొత్తానికి నీటిపారుదల వసతి కల్పించాలంటే 620 బావులు అవసరం.

సి) గ్రామం – 1 లో బావుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ నీటిపారుదల వసతి గల భూ వైశాల్యం గ్రామం – 2 లో కన్నా ఎక్కువ. ఇది ఎలా సాధ్యం? నీటిపారుదల కలిగిన భూమి యొక్క వైశాల్యం పెరుగుతున్న జనాభాతో మారుతూ ఉంటుందా?
జవాబు:
గ్రామం – 1 లో బావుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికి వారు, సాగులో సూక్ష్మసేద్యం పాటించటం వలన ఎక్కువ భూమిని సాగుచేయగలిగారు. ఇంకుడు చెరువులు నిర్మించటం వలన బావులు ఎండిపోకుండా భూగర్భజలాన్ని కాపాడుకున్నారు. పెరుగుతున్న జనాభాకు తగినట్లు నీటిపారుదల కలిగిన భూమి వైశాల్యం పెరగదు. నీటి వనరుల లభ్యత ఆధారంగా నీటి పారుదల భూమి పెరుగుతుంది.

ప్రశ్న 2.
AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు 5
‘ఖ’ ఖరీఫ్ ను, ‘ర’ రబీపంటను సూచిస్తుంది.
ఎ) ఇప్పటి బావుల సంఖ్య 155 అయితే, ఐదేళ్ళ క్రితం వాటి సంఖ్య ఎంత?
జవాబు:
ఐదేళ్ల క్రితం 194 బావులు ఉండేవి.

బి) ‘బావుల సంఖ్య తగ్గిపోవడం’ అనేది ఏం సూచిస్తుంది?
జవాబు:
బావుల సంఖ్య తగ్గటం భూగర్భజలాలు తరిగిపోవటంను సూచిస్తుంది.

సి) బావుల సంఖ్య తగ్గిపోవడం పంటలపై ఏవిధమైన ప్రభావం చూపుతుంది?
జవాబు:
బావుల సంఖ్య తగ్గటం వలన వ్యవసాయంలో నీటి కొరత ఏర్పడింది. వరి పంట సాగు బాగా తగ్గింది.

డి) రెండు పట్టికలను పోల్చంది. రెండు గ్రామాల్లో ఉన్న నీటిపారుదల వసతి గల భూ వైశాల్యం గురించి రెండు పట్టికలు ఏం చెప్తున్నాయో రాయండి.
జవాబు:
గ్రామం – 1 లో నీటి పారుదల కలిగిన భూవైశాల్యం 25% అయితే వడ్డిచెర్లలో ఇది 15% మాత్రమే. గ్రామం – 2లో 175 బావులు ఉన్నప్పటికి, 5 సంవత్సరాలలో వాటిలో 68% బావులు ఎండిపోయాయి.

ఇ) ఏ గ్రామం ఎక్కువగా ప్రభావితమైంది?
జవాబు:
రెండు గ్రామాలలో గ్రామం – 2 ఎక్కువగా బోరుబావులను కోల్పోయి వ్యవసాయ సమస్యలను ఎదుర్కొన్నది. ఖరీలో 22%, రబీలో 50% వరిసాగును కోల్పోయింది.

ఎఫ్) గ్రామాల్లో పండించే పంటల రకాలలో వచ్చిన మార్పు ఏమిటి?
జవాబు:
గ్రామాలలో నీటి కొరత వలన వధిసాగు పూర్తిగా తగ్గిపోయింది. దాని స్థానంలో రైతులు మెట్ట పంటలైన పత్తి, నువ్వులు వైపు మొగ్గు చూపారు.

జి) ఒకవేళ గ్రామం-1లో 45% బావులు ఎండిపోతే, బావుల సంఖ్య 39% తగ్గిపోతే, ఎంత శాతం బావులు గొట్టపుబావులుగా మార్చబడ్డాయి?
జవాబు:
16% బావులు గొట్టపు బావులుగా మార్చబడ్డాయి.

10th Class Biology Textbook Page No. 230

హెచ్) రెండు గ్రామాల వివరాలను పోల్చండి. ఏ గ్రామంలోని బావులు ఎక్కువ సంఖ్యలో ఎండిపోయాయి? మరో గ్రామంలో ఈ విధంగా జరగకపోవడానికి గల కారణమేమిటి?
జవాబు:
గ్రామం – 1తో పోల్చుకుంటే, గ్రామం – 2 లో బావులు ఎక్కువ సంఖ్యలో ఎండిపోయాయి. వారు సరైన భూగర్భజల నిర్వహణ చేయకపోవటం వలన బావులు ఎండిపోయాయి.

ఐ) తక్కువ భూమి గల సన్నకారు రైతులు, ఎక్కువ భూమి గల రైతులలో ఎవరి బావులు ఎండిపోవడం వలన ఎక్కువ ప్రభావితమైనారు?
జవాబు:
బావులు ఎండిపోవుట వలన అధికంగా సన్నకారు రైతులు నష్టపోయారు. వారికున్న కొద్ది పాటి భూమి నిరుపయోగం కావటం వలన తీవ్ర ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొన్నారు.

జె) ఒకవేళ నీటివనరు తగ్గినా లేదా నీటి సదుపాయం లేకపోయినట్లయితే, అది నేల యొక్క స్వభావంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
జవాబు:
నీటి సదుపాయం లేని భూములు ఎండిపోతాయి. ఈ ప్రాంతంలో మొక్కలు, గడ్డి మరణించి జీవజాలం తగ్గిపోతుంది. తీవ్ర ఎండల వలన ఈ ప్రాంతం ఎడారిగా మారిపోతుంది.

కె) ఎండిపోతున్న బావులు ఆ ప్రాంత ప్రజలపై ఏవిధమైన ప్రభావం చూపుతున్నాయి?
జవాబు:
ఎండిపోతున్న బావులు ఆ ప్రాంత ప్రజల ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశాయి. చిన్నకారు రైతుల పంట భూములు నిర్వీర్యం అయినందున వారు వలస కూలీలుగా మారారు. మరికొందరు రైతులు వ్యవసాయం వదిలి ఇతర పనులలోనికి చేరారు. కొందరు పనికోసం పట్టణాలకు వలస వెళ్ళారు.

ఎల్) గ్రామం – 2 లో నీరు బాగా తగ్గిపోవడానికి గల కారణమేమిటి?
జవాబు:
గ్రామం – 2 రైతులకు భూగర్భ జల నిర్వహణపై అవగాహన లేదు. వారికి భూగర్భ జలం పెంచుకోవటం, ఇంకుడు చెరువులు నిర్మించటం, వర్షపు నీటిని ఆదా చేయటం వంటి పద్ధతులు తెలియవు. అందువలన గ్రామం – 2 ప్రాంతంలో నీటి వనరులు బాగా తగ్గిపోయాయి.

ప్రశ్న 3.
AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు 6
ఎ) చిన్న మరియు పెద్ద రైతులిద్దరికీ నీటి వనరు అందుబాటు ఒకే విధంగా ఉందా?
జవాబు:
లేదు, చిన్న రైతుల కంటే పెద్ద రైతులు అధిక నీటి వనరులు కలిగి ఉన్నారు. పెద్ద రైతుల బోరుబావులు ఎక్కువ లోతు కలిగి ఉండి అధిక నీటిని అందిస్తున్నాయి.

బి) ఒక ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తికి నీటి అందుబాటు ఒకేవిధంగా ఉండాలా?
జవాబు:
లేదు. ఒకే ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తికి నీటి అందుబాటు ఒకే విధంగా లేదు.

సి) రబీ కాలంలో కన్నా ఖరీఫ్ పంట కాలంలో ఒక బావి నుండి ఎక్కువ భూమికి నీటిపారుదల లభిస్తుంది. ఇది ఎలా సాధ్యపడుతుంది? దీనిని రైతు ఎలా వినియోగించుకోవాలి?
జవాబు:
ఖరీఫ్ పంట కాలంలో వర్షాలు కురుస్తాయి. అందువలన బావి నుండి ఎక్కువ భూమికి నీటిపారుదల లభిస్తుంది. అందువలన రైతులు ఖరీఫ్ కాలంలో ఎక్కువ భూమిని సాగుచేసుకోవాలి.

డి) ఒక బావి ద్వారా, 2.5% సాగుభూమికి నీటిపారుదల లభిస్తే, మొత్తం భూమికి నీరు అందాలంటే ఎన్ని బావులు అవసరం?
జవాబు:
సుమారుగా మొత్తం భూమికి నీరు అందాలంటే 40 బావులు అవసరమవుతాయి.

ఇ) బావుల సంఖ్య, బావి లోతు – ఈ రెండింటిలో ఏది ఖర్చుపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది?
జవాబు:
బావి లోతు పెంచటం కంటే కొత్త బావి తవ్వటం ఖర్చుతో కూడుకొన్న వ్యవహారం. అందుకే రైతులు బావిని తవ్వించేటప్పుడు ఎక్కువ లోతుకు ప్రాధాన్యం ఇస్తారు.

AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు

ఎఫ్) గ్రామం – 2 లో ఒక సన్నకారు రైతు సాగుభూమిపై ఖర్చు చేసే డబ్బు ఎంత? చిన్న రైతు ఈ డబ్బును ఏ విధంగా పొందుతాడు?
జవాబు:
గ్రామం – 2 లో సన్నకారు రైతు, సాగుభూమికి 20 వేల నుండి 45 వేల వరకు ఖర్చు చేస్తున్నాడు. రైతు ఈ పెట్టుబడి కోసం సాధారణంగా అప్పు చేస్తుంటాడు.

జి) సన్నకారు రైతు లేదా చిన్న రైతులు ఈ ఖర్చును తగ్గించుకోవాలంటే ఏ చర్యలు చేపట్టాలి? (ఉదా : నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు పెంచడం)
జవాబు:
సన్నకారు రైతు ఖర్చు తగ్గించాలంటే, ఆరు తడి పంటలు పండించాలి. సూక్ష్మ సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

హెచ్) నీటి పారుదల వసతి గల భూ వైశాల్యాన్ని మొత్తం పెంచాలంటే బోరుబావి యొక్క లోతును పెంచడమే తగిన పరిష్కారమా? అవును లేదా కాదు లేదా ఎందుకు?
జవాబు:
లోతు పెంచినంత మాత్రాన నీటి వసతి పెరగదు. ఆ ప్రాంతంలో భూగర్భజలం పెంచే చర్యలు చేపట్టాలి. ఇంకుడు చెరువులు నిర్మించాలి. వర్షపు నీటిని ఆదాచేయాలి.

10th Class Biology Textbook Page No. 231

ప్రశ్న 4.
AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు 7
ఎ) గ్రామం-2 లో ఏ పంట చిన్నరైతుకు చాలా లాభదాయకంగా ఉంటుంది?
జవాబు:
గ్రామం – 2 లో వరిసాగు రైతుకు లాభదాయకంగా ఉంది.

బి) గ్రామం-1, గ్రామం-2 లలోని పెద్ద, చిన్నరైతుల మధ్య ఉన్న తేడా ఏమిటి?
జవాబు:
గ్రామం-1, గ్రామం-2 లలో చిన్న, పెద్ద రైతుల ఆదాయంలో వ్యత్యాసం ఉంది.

సి) గ్రామం-1 లో వరికి బదులు ఏ పంట చిన్నరైతుకు లాభదాయకంగా ఉంటుంది?
జవాబు:
గ్రామం-1 లో వరికి బదులు పత్తి లాభదాయకంగా ఉంటుంది.

డి) వరి నీటిని అత్యధికంగా వినియోగించుకునే పంట అయినప్పటికీ, రైతులు ఎందుకు వరినే పండించాలనుకుంటున్నారు?
జవాబు:
వరికి వచ్చే ఆదాయం అధికంగా ఉంటుంది. మార్కెట్లో వరికి డిమాండ్ ఉండుటవలన వరినే పండించాలనుకుంటున్నారు.

ఇ) తరిగిపోతున్న నీటి వనరు యొక్క ప్రభావం రైతులపై ఏ విధంగా ఉంది?
జవాబు:
నీటి వనరులు తరిగిపోవుట వలన రైతులు క్రమేణ మెట్టపంటలకు ప్రాధాన్యమిస్తున్నారు.

ఎఫ్) గ్రామం-2 లో నివసిస్తున్న చిన్న రైతు యొక్క ఆదాయం అతని ఖర్చుకు సరిపద ఉన్నదా?
జవాబు:
గ్రామం-2 లో చిన్న రైతు వ్యవసాయ ఖర్చు 20 వేల నుండి 45 వేల వరకు ఉంటే ఆదాయం కేవలం 22 వేలు మాత్రమే ఉంది. కావున రైతు నష్టపోతున్నాడు.

జి) గ్రామం-2 లో చిన్న రైతుల యొక్క దయనీయమైన పరిస్థితులకు ఇతర ప్రధాన కారణాలేమైనా ఉన్నాయా?
జవాబు:
గ్రామం-2 లో రైతు దయనీయ పరిస్థితికి, నీటి కొరతతో పాటు, వ్యవసాయ పరిజ్ఞానం లేకపోవటం, ఋతుపవనాలు సక్రమంగా లేకుండుట వంటి ఇతర కారణాలు ఉన్నాయి.

హెచ్) గ్రామం-2 లో చిన్న రైతుకు వ్యవసాయం ఒక వృత్తిగా, లాభదాయకంగా ఉంటుందని అనుకుంటున్నారా?
జవాబు:
గ్రామం-2 లో చిన్నరైతుకు వ్యవసాయం లాభసాటి వృత్తికాదు.

AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు

ఐ) తన అవసరాలు తీర్చుకోవడానికి రైతు ఇతర వృత్తులను ఎంచుకోవాలా?
జవాబు:
వ్యవసాయంతో పాటు, పాడిపరిశ్రమ, వర్మీ కంపోస్ట్ వంటి వ్యవసాయ ఆధారిత వృత్తులు ఎంచుకోవటం మంచిది.

జె) గ్రామం-2 లో నీటి వసతి చిన్న రైతుపై ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది?
జవాబు:
నీటి వసతి సరిగా లేక చిన్నరైతు నష్టాలు చూస్తున్నాడు. అందువలన చిన్న రైతులు ఆర్థికపరమైన ఇబ్బందులకు గురికావలసి వస్తున్నది.

10th Class Biology Textbook Page No. 232

ప్రశ్న 5.
ఎ) బావులలోకి నీరు చేరేలా చేయడం ఎలా?
జవాబు:
ఇంకుడు చెరువులు, వర్షపు నీటిని భూమిలోనికి ఇంకింపచేయటం ద్వారా బావులలోనికి నీరు చేర్చవచ్చు.

బి) గ్రామం-2 లో ఎండిన బావులలోకి నీరు చేరేలా చేసినట్లయితే రైతుకు ఏ విధంగా సహాయపడుతుంది?
జవాబు:
గ్రామం-2 లో ఎండిన బావులలోనికి నీరు చేరినట్లయితే రైతులకు నీటి వసతి కలిగి పంటలు పండిస్తారు. అందువలన వారి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.

సి) పైన ఉదహరించిన అధ్యయనం, నీటి వనరు మరియు రైతులపై దాని యొక్క ప్రభావం గురించి ఏం చెబుతుంది?
జవాబు:
రైతు ఆర్థిక స్థితిగతులు నీటి వనరు లభ్యతపై ఆధారపడి ఉంటుందని అర్థమైంది.

డి) నీటిని విచక్షణతో ఎలా వినియోగించవచ్చని అనుకుంటున్నావు?
జవాబు:
నీటిని విచక్షణతో వినియోగిస్తే దాదాపు 25% నీరు ఆదాచేయవచ్చు. నీటి వృథాను అరికట్టడమే, నీటి విచక్షణా వినియోగం అవుతుంది.

ఇ) గ్రామం-2 లో కన్నా గ్రామం-1 లో రైతుల పరిస్థితి బాగుండదానికి కారణమేమిటి?
జవాబు:
గ్రామం-2 లో రైతులు భూగర్భజల వినియోగంపై అవగాహన పెంపొందించుకొన్నారు. భూగర్భ జలాలను పెంచుకొన్నారు. కావున వారి పరిస్థితి మెరుగుగా ఉంది.

ఎఫ్) గ్రామం-2, గ్రామం-1 లలో రైతులు భూగర్భ జలవనరులను ఏ విధంగా సంరక్షించుకుంటున్నారు?
జవాబు:
ఇంకుడు గుంటలు నిర్మించటం, చెక్ డ్యామ్ లు కట్టటం, ఇంకుడు చెరువులను నిర్మించటం, వర్షపు నీటిని సంరక్షించటం వంటి పద్ధతుల ద్వారా రైతులు భూగర్భ జలవనరులను సంరక్షించుకుంటున్నారు.

10th Class Biology Textbook Page No. 233

ప్రశ్న 6.
ICRISAT అంటే ఏమిటి? ఎక్కడ ఉంది? అది నిర్వహించే కార్యక్రమాలపై మీ ఉపాధ్యాయునితో చర్చించి నివేదిక తయారుచేయండి.
జవాబు:
‘ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ ఫర్ సెమి-ఎరిడ్ ట్రాపిక్స్’ను సంక్షిప్తంగా ఇక్రిసాట్ అంటారు. ఇది హైదరాబాద్లో ఉంది. భారతదేశం వంటి ఉష్ణ మండల ప్రాంతాలలో పండే పంటల పైన వీరు పరిశోధన చేస్తుంటారు. వరి వంగడ వృద్ధి, చెరకు, పత్తి పంటల దిగుబడులు పెంచటం, రైతుల ఆర్థిక స్థితి మెరుగుపర్చటం కోసం వీరు కృషి చేస్తుంటారు. వీరి సేవల వలన వ్యవసాయంలో ఆధునిక వంగడాలు, ఆధునిక సేద్య పద్ధతులు అందుబాటులోనికి వచ్చాయి.

ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమి-ఎండ్ ట్రాపిక్స్ (ICRISAT) గ్రామస్తులను పెద్ద సంఖ్యలో విద్యా వంతులను చేయడమే కాకుండా, సరైన ధరతో నీటి నిలువ మరియు నేల సంరక్షణా నిర్మాణాలు చేపట్టడానికి కావలసిన సాంకేతికతను అందించారు. ఈ పద్దతులన్నీ సామాజికంగా, వ్యక్తిగతంగా రైతుపై కేంద్రీకరింపబడ్డాయి. కొన్ని వనరులను తిరిగి పొందడానికి, కొన్నింటిని తరిగిపోకుండా సంరక్షించుకోవడానికి ఈ పద్దతులు సహకరించాయి. కావున సుస్థిర యాజమాన్యం చేపట్టడం జరిగింది.

10th Class Biology Textbook Page No. 235

ప్రశ్న 7.
ఎ) కొత్తపల్లి కేస్టడీలో సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడంలో వారు అనుసరించిన మార్గాలు ఏమిటి?
జవాబు:
కొత్తపల్లి కేస్టడీలో సహజవనరుల సంరక్షణకు –

  1. ఇంకుడు చెరువులు నిర్మించారు.
  2. బంజరు భూములలో మొక్కలు పెంచారు.
  3. గట్లమీద గైరిసీడియం మొక్కలు నాటారు.
  4. బోరుబావుల సంరక్షణ చేపట్టారు.
  5. నీటి పొదుపునకు సూక్ష్మ నీటిపారుదల పద్ధతులు అవలంభించారు.
  6. వెడల్పు పద్ధతి అవలంబించి నేల, నీటిని సంరక్షించారు.

బి) ఈ కేస్టడీలో నీటిని పొదుపు చేయడానికి ఏ ఏ పద్ధతులను అనుసరించినట్లుగా మీరు గుర్తించారు?
జవాబు:
ఈ కేస్టడీ ద్వారా నీటిని పొదుపు చేయటానికి ఈ క్రింది పద్దతులు తోడ్పడతాయి.

  1. రాళ్లు, మట్టి, కంకరతో నీటి ప్రవాహానికి గట్టు కట్టి ఇంకుడు చెరువులు నిర్మించటం.
  2. వర్షపు నీటిని నిల్వ చేసి భూమిలోకి మళ్ళించటం.
  3. ఏటవాలు ప్రాంతాలలో కాంటూర్ పట్టి పంటలు పండించుట.
  4. ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసి దానిలోనికి వర్షపు నీటిని మళ్ళించటం.
  5. డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ల ద్వారా సూక్ష్మ నీటి పారుదల పద్ధతులు పాటించటం.
  6. బోరుబావుల సంరక్షణ.
  7. పర్వత వాలు ప్రాంతాలలో చెక్ డ్యాములు నిర్మించటం.
  8. వాటర్‌షెడ్ పథకాలు అమలుచేయటం వంటి పద్ధతులు పాటించి నీటిని పొదుపు చేయవచ్చు.

ప్రశ్న 8.
ఎ) నీటి వనరుల పట్ల జాగ్రత్త వహించకుంటే ఏం జరుగుతుందనుకుంటున్నావు?
జవాబు:
‘నీటి వనరుల పట్ల జాగ్రత్త వహించకపోతే, మనం నీటి కొరతను ఎదుర్కొనవలసి వస్తుంది. తద్వారా పంటలు పండించలేము. ఇది ఆహార కొరతకు దారితీస్తుంది.

బి) భవిష్యత్తులో మన అవసరాలు ఏ విధంగా తీర్చుకోగలమనుకుంటున్నారు?
జవాబు:
సహజ వనరుల వినియోగం పట్ల ప్రజలలో అవగాహన పెంచి, వాటిని సక్రమంగా వినియోగించుకొనేలా జాగ్రత్తపడాలి. తరగని వనరుల వినియోగంపై దృష్టి పెట్టాలి. తరిగే వనరులకు ప్రత్యామ్నాయ వనరులు వెతకాలి.

సి) ఇతర రాష్ట్రాలు లేదా అవసరమైతే ఇతర దేశాలపై మనం ఆధారపడవలసి వస్తుందనుకుంటున్నారా?
జవాబు:
నీటి వినియోగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాబోయే రోజులలో మనం నీటి కొరకు ఇతర రాష్ట్రాలు, దేశాలపై ఆధారపడవలసి వస్తుంది.

డి) నీటిని పొదుపుగా వాడటానికి, సాగు విధానానికి ఎలాంటి సంబంధం ఉంది?
జవాబు:
నీటిని పొదుపుగా వాడటం ద్వారా పంట విస్తీర్ణాన్ని పెంచుకోవచ్చు. కరవు పరిస్థితులలో కూడా పంటలను సాగు చేసుకోవచ్చు. అధిక పంటలు పండించవచ్చు.

ఇ) ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయంలో నీటిపారుదల కోసం, వాడే నీటిని తగ్గించడం సాధ్యమా? అది ఏవిధంగా సాధ్యపడుతుంది?
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయంలో నీటిపారుదల కోసం వాడే నీటిని తగ్గించటం సాధ్యమే. మన రాష్ట్రంలో వరి ప్రధాన పంటగా ఉంది. దీనికి నీరు కావాలి. దీని స్థానంలో ఆరు తడి, మెట్ట పంటలకు ప్రాధాన్యమివ్వాలి.
ఎ) వరిలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ‘శ్రీవరి’ వంటి పద్ధతులు పాటించాలి.
బి) వరిని తక్కువ నీటితో మెట్టపంటగా కూడా పండించవచ్చు.
సి) ఇతర పంటలలో స్ప్రింక్లర్లు, డ్రిప్ వంటి వాటితో నీటి వనరులను సంరక్షించవచ్చు.

ఎఫ్) నీటి విస్తరణ, వినియోగానికి చట్టాలు అవసరమా? అయితే ఎందుకు?
జవాబు:
నీటి విస్తరణ, వినియోగానికి చట్టాలు అవసరము. అప్పుడే నీటిని జాగ్రత్తగా, పొదుపుగా వాడతారు. లేనిచో ఈ సహజవనరు దుర్వినియోగం అవుతుంది.

AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు

ప్రశ్న 9.
ఎంత శాతం భూవైశాల్యం ఇతర నీటి వనరుల వలన నీటిపారుదల సదుపాయం పొందింది?
జవాబు:
ఇతర వనరుల ద్వారా 5% భూవైశాల్యం నీటిపారుదల సౌకర్యం కలిగి ఉంది.

10th Class Biology Textbook Page No. 236

ప్రశ్న 10.
మన రాష్ట్రానికి ఈ నదులు ఎంతవరకు లాభదాయకంగా ఉండాలో అంతమేరకు ఉపయోగపడటం లేదు. దీనికి గల కారణం ఏమిటి?
జవాబు:
AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు 8
మన రాష్ట్రంలో నదులు, కాలువల ద్వారా 37% భూమి సాగులోనికి వచ్చింది. చెరువుల వలన 15% భూమి సాగుచేయబడుతుంది. నదీజలాలను మనం పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాము. చాలా నదీ జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి.

భూవిస్తీర్ణంలో చాలా భాగం నదీ పరీవాహక ప్రాంతాల కంటే ఎత్తులో ఉండుట వలన నదీ జలాలు అందటం లేదు. నదీ జలాల అనుసంధానం లేకపోవుట కూడా ఈ పరిస్థితికి ఒక కారణం.

ప్రశ్న 11.
భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఏమిటి?
జవాబు:
వ్యవసాయ నీటివనరులో భూగర్భ జలాల వాటా 43% ఉంది. ఈ భూగర్భ జలాన్ని సంరక్షించుకుంటే వ్యవసాయరంగం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనవలసి ఉంటుంది. మనమందరం త్రాగు నీటి కోసం భూగర్భజలాలపై ఆధారపడుతున్నాము. భూగర్భజలాలు లేకుంటే త్రాగునీటి కొరత ఏర్పడి జీవనం స్తంభించిపోతుంది.

ప్రశ్న 12.
భూగర్భజల వనరులు వేగంగా తరిగిపోతున్నాయి కదా! దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటి?
జవాబు:
ఋతుపవనాల రాకడతో మార్పులు సంభవించటం వలన భూగర్భజలాల వినియోగంపై ఒత్తిడి పెరిగింది. డ్రిల్లింగ్, లోతైన గొట్టపుబావులు, బోరుబావులను తవ్వడం వంటి చర్యల వలన, విచక్షణారహితంగా భూగర్భజలాన్ని వాడటం వలన, భూగర్భజలాలు తరిగిపోతున్నాయి.

ప్రత్యామ్నాయాలు :

  1. వర్షపు నీటిని భూమిలోనికి ఇంకింపచేయటం
  2. ఇంకుడు గుంటలు నిర్మించటం
  3. ఇంకుడు చెరువులు ఏర్పాటు చేయటం
  4. అడవుల పెంపకం వంటి చర్యల ద్వారా భూగర్భజలాన్ని పెంచవచ్చు.

ప్రశ్న 13.
గోదావరి నదీజలాలు మన రాష్ట్రంలోని ప్రాజెక్టులను నింపడానికి సరిపోడంలేదు. పైనున్న రాష్ట్రాలు పరిమితులకు మించి నీటిని వినియోగిస్తుండడమే దీనికి ప్రధాన కారణం. ఈ విషయాలలో దేశాలు, రాష్ట్రాలు అందరికీ న్యాయం కలిగేలంటే ఏం చేయాలి?
* సరిపడా నీటిపారుదల సౌకర్యం కలిగించాలంటే రాష్ట్రాలు, దేశాలు ఏ విధంగా పనిచేయాలి?
జవాబు:

  1. జల వనరుల పంపిణీకి జాతీయ స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలి.
  2. నీటి పంపిణీ యాజమాన్యం కేంద్రం అధీనంలో ఉంటాయి.
  3. జల పంపిణీ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఉండాలి.
  4. జనాభా ప్రాతిపదికన జల పంపిణీ జరగాలి.
  5. ఆనకట్టల నిర్మాణానికి, ఎత్తు పెంపుదలకు, కేంద్ర జల కమిటీ అనుమతిని తప్పనిసరి చేయాలి.
  6. జలాలపై ఆధారపడిన భూవిస్తీర్ణం ఆధారంగా నీటి వనరుల పంపిణీ జరగాలి.

10th Class Biology Textbook Page No. 237

ప్రశ్న 14.
నీరు తప్ప మీ పరిసరాలలోని ఏదైనా ఒక ముఖ్య వనరును గురించి రాయండి.
జవాబు:
గాలి, నీరు, నేల వలె పర్వతాలు, కొండలు కూడా ముఖ్యమైన సహజవనరులు. మా ప్రాంతంలో చిన్న కొండలు విస్తరించి ఉన్నాయి. వీటిని ప్రభుత్వం నుండి లీజుకు తీసుకొని రాళ్ల కొరకు పగలగొడుతున్నారు. దీనివలన మా పరిసర ప్రాంతాలలో క్రషింగ్ యూనిట్లు విస్తరించాయి. ఇక్కడ కొండ రాళ్ళను పగలగొట్టి, కంకర, చిప్స్, డస్టగా మార్చుతున్నారు. నష్టాలు : దీనివలన సహజ వనరులైన కొండలు అంతరించిపోతున్నాయి. కొండలు పేల్చడానికి ప్రేలుడు పదార్థాలు వాడటం వలన శబ్ద కాలుష్యం జరుగుతుంది. క్రషింగ్ యూనిట్ వలన పరిసరాలంతా దుమ్ము పేరుకుపోయింది. చెట్లపై ఈ రాతి దుమ్ము పేరుకుపోవటం వలన కిరణజన్యసంయోగక్రియ రేటు తగ్గి మొక్కలు మరణిస్తున్నాయి. పరిసరాలలోని జనాభా శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు.

పరిష్కారాలు :

  1. క్రషింగ్ యూనిట్ చుట్టూ ఎత్తైన ప్రహరీలు ఏర్పర్చాలి.
  2. పచ్చదనం కోసం మొక్కలను అధికంగా పెంచాలి.
  3. కొండలను సహజ వనరులుగా గుర్తించి పరిరక్షణ చర్యలు చేపట్టాలి.

10th Class Biology Textbook Page No. 238

ప్రశ్న 15.
మీ పరిసరాలలోని ఒక ప్రధాన వనరును వాడుతూ, సంరక్షించుకునే విధంగా ఇతరులను ఎలా సంసిద్ధులను
జవాబు:
మాది వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడ ప్రధాన వనరు నేల. నేల సంరక్షణ గురించి, నేల యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తాను.

  1. రసాయనిక ఎరువుల స్థానంలో జీవ ఎరువులకు ప్రాధాన్యమివ్వాలని వివరిస్తాను.
  2. పంట మార్పిడి పద్ధతి ఆవశ్యకతను తెలియజేస్తాను. 3. రక్షక పంటల ప్రయోజనాన్ని వివరిస్తాను.
  3. వర్మీ కంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువుల తయారీ, వాటి ప్రయోజనాలు తెలియజేస్తాను.
  4. నత్రజని పంటల అవసరం, వాటి ప్రాధాన్యం తెలుపుతాను.
  5. ఆరు తడి పంటల ప్రయోజనం తెలిపి, రైతులను సంసిద్ధులను చేస్తాను.

AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు

ప్రశ్న 16.
సుస్థిర యాజమాన్యానికి కొత్తపల్లి గ్రామస్తులు ఏం చేశారు?
జవాబు:
సుస్థిర యాజమాన్యానికి కొత్తపల్లి గ్రామస్థులు క్రింది చర్యలు చేపట్టారు.

  1. నేల, నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టారు.
  2. వెడల్పు, చాళ్లు తీయటం, తక్కువ ఎత్తు పెరిగే పంటలు పండించటం, కాంటూర్ సేద్యం వంటి నేల యాజమాన్య పద్ధతులు పాటించారు.
  3. సూక్ష్మ సేద్య పద్ధతులలో డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్లు వాడి నీటిని ఆదా చేశారు.
  4. వరి, చెరకు పంటల స్థానంలో ఆరు తడి పంటలకు ప్రాధాన్యం ఇచ్చారు.
  5. గట్లు స్థిరంగా ఉండటానికి, నేలలో పోషకాలు పెంచటానికి గట్ల వెంబడి గెరిసీడియం మొక్కలు పెంచారు.
  6. రోడ్ల వెంబడి, పొలాలగట్ల వెంబడి ఉపయోగకర మొక్కల జాతులను పెంచి బీడు భూములను అభివృద్ధి చేశారు

10th Class Biology Textbook Page No. 240

ప్రశ్న 17.
మీ పరిసర ప్రాంతాలలోని ఒక ‘లాన్’ ను పరిశీలించండి. దానిని కాపాడుకోవటానికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు?
జవాబు:
లాన్ సంరక్షణకు ఈ క్రింది చర్యలు తీసుకుంటాను.

  1. లాను ప్రతిరోజు సాయంత్రం నీటి సరఫరా చేయాలి.
  2. గుబురుగా పెరిగే ప్రాంతాలను కత్తిరించాలి.
  3. కొంత ఎత్తున పెరిగిన తరువాత సమంగా కత్తిరించాలి.
  4. లాలోని కలుపు మొక్కలను నిర్మూలించాలి.
  5. లాక్కు పోషకాలు అందిస్తూ ఉండాలి.

ప్రశ్న 18.
లాన్ నుండి తొలగించే వివిధ మొక్కల పేర్లను తోటమాలి నుండి కనుక్కోండి. రైతు కూడా పొలంలో ఇదే విధానాన్ని పాటిస్తాడా? లాస్ జీవవైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుందా?
జవాబు:
లాలో తుంగ వంటి కలుపు మొక్కలు ఉన్నాయి. వీటిని సాధారణంగా చేతితో పీకి వేస్తుంటారు. పొలంతో రైతులు కూడ ఇదే పద్ధతిని అవలంభిస్తుంటారు. లాలో ఒకేరకమైన గడ్డిజాతి పెరుగుతూ ఉంటుంది. కావున ఇది జీవవైవిధ్యాన్ని ప్రోత్సహించదు.

10th Class Biology Textbook Page No. 241

ప్రశ్న 19.
శిలాజ ఇంధనాలు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి?
జవాబు:
AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు 9
బొగ్గు, పెట్రోలు, సహజ వాయువులను “శిలాజ ఇంధనాలు” అంటారు. మనం ఉపయోగిస్తున్న శక్తి వనరులలో ప్రధానమైనవి శిలాజ ఇంధనాలే. పరిశ్రమలలో, వాహనాలలో, విద్యుత్ తయారీకి వీటిని విరివిగా వాడుతున్నాము.

పెట్రోలు వాహనాలలోనే కాకుండా ప్లాస్టిక్, సింథటిక్, రబ్బరు, నైలాన్, మందులు, సౌందర్య పదార్థాలు, మైనం, పరిశుభ్రత ఉత్పత్తులు, వైద్య పరికరాలు మొదలైనవి తయారు చేయడంలోనూ ఉపయోగిస్తారు.

ఎ) వాటిని ఎందుకు సంరక్షించుకోవాలి?
జవాబు:
శిలాజ ఇంధనాలు తరిగిపోయే వనరులు. వీటి నిల్వలు ఉపయోగిస్తున్న కొలదీ తరగిపోతాయి. తిరిగి వీటి ఉత్పత్తికి లక్షల సంవత్సరాలు పడతాయి. కావున ఈ వనరుల వినియోగంలో విచక్షణ అవసరం.

10th Class Biology Textbook Page No. 242

ప్రశ్న 20.
సౌర, పవన, జల, అలల విద్యుదుత్పత్తి గురించిన సమాచారాన్ని సేకరించండి. స్క్రిప్ పుస్తకం తయారుచేయండి.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు 10
సౌరశక్తి :
తరగని శక్తి వనరులలో సౌరశక్తి ఒకటి. సోలార్ ప్యానల్స్ ఉపయోగించి సౌరశక్తి నుండి విద్యుత్ తయారుచేస్తారు. దీనిని బ్యాటరీలలో నిల్వ చేసివాడవచ్చు. సోలార్ హీటర్లు, సోలార్ కుక్కర్లు, సోలార్ లైట్లు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. భవిష్యత్ కాలంలో సౌరశక్తి వినియోగం కొరకు, సోలార్ ఇళ్లు, సోలార్ వాహనాల కొరకు ప్రయోగాలు చేస్తున్నారు. ఇది కాలుష్యరహితం మరియు అనంతం.

AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు 11
పవనశక్తి :
ఎత్తైన ప్రదేశాలలో పర్వత స్నాయువులపైన గాలివేగం ఎక్కువగా ఉంది. ఈ పవనశక్తితో ఫ్యాన్లు తిప్పి తద్వారా, దానికి అమర్చిన టర్బైన్ తిప్పుతారు. అందువలన విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది తరగని వనరు. పరిసరాలు కలుషితం కాదు. అయితే అన్ని ప్రదేశాలకు ఇది అనుకూలంగా ఉండదు.

AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు 12
జలవిద్యుత్ :
విద్యుత్ ఉత్పత్తిలో జలవిద్యుత్ ది అగ్రస్థానం. నదులు, కాలువలపై ఆనకట్టలు పవన విద్యుత్ నిర్మించి నీటి మట్టం ఎత్తు పెంచుతారు. అందువలన నీటికి స్థితిశక్తి లభిస్తుంది. ఎత్తైన ప్రదేశం నుండి నీటిని క్రింద ఉన్న టర్బైన్స్ మీదకు పంపటం వలన టర్బైన్ తిరిగి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది తరగని వనరు. పర్యావరణ హితం. కావున ఈ ప్రక్రియ ప్రాధాన్యతను సంతరించుకుంది.

AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు 13
అలల విద్యుత్ :
సముద్రం తీర ప్రాంతంలో అలలను ఉత్పత్తి చేస్తుంది. ఈ అలలు గతిశక్తి కలిగి ఉంటాయి. అలల గతిశక్తి ఆధారంగా టర్బెన్స్ తిప్పి విద్యుత్ తయారుచేస్తారు. ఇది తరగని వనరు. పర్యావరణ హితం. తీర ప్రాంతాలలో కూడా ఇది బాగా అనుకూలం.

ఇటువంటి తరగని వనరులను వినియోగించుకోవటం వలన ఇంధన కొరతను, శక్తి సంకటాన్ని సమర్థవంతంగా అధిగమించవచ్చు.

ప్రశ్న 21.
అణువిద్యుత్ ప్రభావాల గురించి మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
జవాబు:
అణువిద్యుత్ తయారీకి రేడియో ధార్మిక పదార్థాలైన యురేనియం, థోరియం వంటి భారలోహాలు ఉపయోగిస్తారు. వీటిని మండించి ఉత్పత్తి అయిన ఉష్ణంతో నీటిని ఆవిరిగా మార్చి టర్బైన్ తిప్పటం వలన విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ ప్రదేశాలను అణు విద్యుత్ కేంద్రాలు అంటారు.

మన దేశంలో తారాపూర్ (మహారాష్ట్ర), కల్పకం (తమిళనాడు), Kaiga (కర్ణాటక), Kakrapar (గుజరాత్), Narora (ఉత్తరప్రదేశ్), Rawatbhata (కోట) రాజస్థాన్) Kudenkulam (తమిళనాడు) లో అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి.

దీని వినియోగంలో ఉన్న సమస్యలు :

  1. అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటు బాగా ఖర్చుతో కూడుకొన్న వ్యవహారం.
  2. రేడియో యాక్టివిటీ పదార్థాలు నీటిని చేరి జలకాలుష్యం కలిగిస్తాయి.
  3. రేడియో యాక్టివిటీ పదార్థాలకు, వాటి గనులకు రక్షణ సమస్య ఉంది.
  4. అణు విద్యుత్ కేంద్రాల నుండి వచ్చే లీకేజీలు ప్రమాదకర స్థితిని కలిగిస్తాయి.
  5. కార్బన్ ఉత్పత్తిని తగ్గించదు. అందువలన కాలుష్యం జరుగుతుంది. (థర్మల్ విద్యుత్ కేంద్రం వలె)

AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు

ప్రశ్న 22.
ఉత్తరాఖండ్ వంటి ప్రకృతి ప్రళయాలకు కారణాలు ఆలోచించండి.
జవాబు:
ఉత్తరాఖండ్ వంటి ప్రకృతి ప్రళయాలకు కారణాలు :

  1. సరైన నీటి పారుదల యాజమాన్యం లేకపోవడం.
  2. కొండల సంరక్షణ లేకపోవడం వలన చరియలు విరిగిపడిపోయాయి.
  3. కొండ చరియలు వరద ప్రవాహ దిశను మార్చి ఉధృతిని పెంచాయి.
  4. కొండ ప్రాంతాలలో చెట్లు నరకటం వలన క్రమక్షయం జరిగింది.
  5. చాలా పల్లపు ప్రాంతాలు ఆక్రమణలకు గురై పూడ్చివేయటం జరిగింది.
  6. ప్రకృతి మార్పుల వలన విపరీతమైన వర్షాలు కురవడం.
  7. వరద నీటిని సంరక్షించే, నియంత్రించే నిర్మాణాలు లేకపోవటం.
  8. కొండ ప్రాంతాలలో నీటి నియంత్రణ ఏర్పాట్లు లేకపోవటం.

10th Class Biology Textbook Page No. 243

ప్రశ్న 23.
ఏ ఏ వనరుల వినియోగాన్ని తగ్గించవచ్చు?
జవాబు:
నేల, విద్యుత్, పెట్రోలు, డీజిల్, బొగ్గు వంటి వనరుల వినియోగాన్ని తగ్గించవచ్చు. వీటి స్థానంలో ప్రత్యామ్నాయ వనరులు వాడి సహజ వనరులను సంరక్షించవచ్చు.

ప్రశ్న 24.
మన వనరులను సంరక్షించుకోవడానికి తిరిగి ఏ ఏ వస్తువులను వినియోగించవచ్చును?
జవాబు:

  1. ప్లాస్టిక్ కవర్ల బదులుగా గుడ్డ సంచులు వాడి పర్యావరణాన్ని కాపాడవచ్చు.
  2. కాగితం తయారీకి చెట్లను నరకకుండా రీసైక్లింగ్ కాగితం వాడవచ్చు.
  3. ఇనుమును ఖనిజం నుండి తయారుచేయకుండా వాడిన ఇనుమును పునఃచక్రీయం చేయవచ్చు.
  4. చాలా వ్యర్థాలను తిరిగి వాడుకొనే అవకాశం ఉంది. దీని వలన వనరులను సంరక్షించవచ్చు.

ప్రశ్న 25.
పండుగలు, ఉత్సవాల సందర్భాలలో పెద్ద ఎత్తున విద్యుత్ అలంకరణలు అవసరమని నీవు భావిస్తున్నావా?
జవాబు:
పండుగలు, ఉత్సవాల సందర్భాలలో పెద్ద ఎత్తున విద్యుత్ అలంకరణలు అవసరం లేదు. దీనివలన లక్షల కొద్ది డబ్బు వృధా కావటమే గాక, విద్యుత్ ఇంధన వనరులు దుర్వినియోగం అవుతాయి. కావున వీటిని చేపట్టకుండా ఉండటం మంచిది.

ప్రశ్న 26.
ఇంట్లోని చెత్తను పారవేసే ముందు వ్యర్థాలను ఎందుకు వేరు చేయాలి?
జవాబు:
ఇంట్లోని చెత్తను పారవేసేముందు వాటిని తడి, పొడి చెత్తలుగా వేరుచేయాలి. తడిచెత్త భూమిలో కుళ్ళిపోతుంది కావున వీటిని ఎరువుల తయారీకి వాడవచ్చు. పొడి చెత్తను విభజించి వాటిని పునఃచక్రీయం చేయవచ్చు. చెత్తను పారవేసే ముందు వేరుచేయకపోతే వాటి వినియోగం సాధ్యం కాదు.

ప్రశ్న 27.
చెత్తబుట్టలో వ్యర్థాలను పారవేయడానికి ప్లాస్టిక్ సంచిని పెట్టడం మంచిదేనా?
జవాబు:
చెత్తబుట్టలో వ్యర్థాలను పారేయటానికి ప్లాస్టిక్ సంచిని వాడటం మంచిది కాదు. ప్లాస్టిక్ సంచుల వినియోగం పెరిగి పర్యావరణం కలుషితం జరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోవటానికి లక్షల సంవత్సరాలు పడతాయి. కావున వీటి వినియోగాన్ని నిలిపివేయాలి.

ప్రశ్న 28.
పర్యావరణానికి కలిగే హానిని తొలగించటానికి ‘ఏర్పరచడం’ తిరిగి ఏయే కార్యక్రమాల ద్వారా సాధ్యమవుతుందో చర్చించండి.
జవాబు:

  1. వనమహోత్సవం వంటి కార్యక్రమాల ద్వారా చెట్లను నాటి తరిగిపోతున్న అడవులను రక్షించవచ్చు.
  2. ‘చెట్టు-నీరు’ వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టి వృక్షసంపద ‘పించవచ్చు.
  3. ఇంకుడు గుంటలు నిర్మించి, భూగర్భజలం పెంచవచ్చు.
  4. ప్రతి పుట్టినరోజున మొక్కను నాటటం అలవాటుగా మార్చాలి.

ప్రశ్న 29.
పెద్ద పెద్ద వృక్షాలను ఒక చోటనుండి మరొకచోట ,నాటటానికి ఉపయోగించే సాంకేతిక విజ్ఞానం గురించిన సమాచారం సేకరించి చర్చించండి.
జవాబు:

  1. పెద్ద వృక్షాలను ఒకచోట నుండి మరొకచోటకు తరలించే విజ్ఞానం మొక్కలపాలిట వరం వంటిది.
  2. ఈ ప్రక్రియలో హైడ్రాలిక్ యంత్రాలు, ప్రొక్లెయిన్స్, మూవర్స్ వంటి యంత్రపరికరాలు వాడతారు.
  3. ముందుగా మొక్కను తిరిగి నాటవలసిన ప్రదేశాన్ని ఎన్నుకొని మొక్క పరిమాణం ఆధారంగా హైడ్రాలిక్ యంత్రాలలో శంఖు ఆకారపు గోతి తవ్వుతారు.
  4. తరువాత మొక్కను వేరు వ్యవస్థ పాడవకుండా చుట్టూ ఉన్న మట్టితో సహా హైడ్రాలిక్ యంత్రాల సహాయంతో తవ్వుతారు.
  5. ఇలా తవ్వటం చెట్టు పరిమాణం దాని విస్తీర్ణంపై ఆధారపడి ఉంటుంది. చెట్టు కాండం నుండి నిర్దిష్ట దూరంలో పార వంటి పెద్ద యంత్రపలకలు కల్గిన మూవర్ చెట్టును మట్టితో సహా పెకిలించి లారీ వంటి నిర్మాణంపై ఉంచుతుంది.
  6. మూవర్ చెట్టును తనపైన ఉంచుకొని, దానిని నాటవలసిన స్థానానికి చేర్చి, ముందుగా తీసి ఉన్న గుంతలో మొక్కను ఉంచుతుంది.
  7. తిరిగి నాటిన మొక్క చుట్టూ, ఖాళీ ప్రదేశంలో మట్టిని చేర్చి నీరు పెట్టి మొక్కకు పోషణ చేకూర్చుతారు.
  8. ఈ ప్రక్రియ వలన సంవత్సరాలు తరబడి పెరిగిన పెద్ద వృక్షాలను సంరక్షించవచ్చు.

10th Class Biology Textbook Page No. 244

ప్రశ్న 30.
కొత్తపల్లి గ్రామాన్ని ఉదాహరణగా తీసుకొని ఆ గ్రామస్తులు మరియు ఇతర సంస్థల పాత్రను చర్చించండి.
జవాబు:
ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు గ్రామీణ అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. రైతు దేశానికి వెన్నెముకగా గుర్తించి, రైతు అభివృద్ధికి సహకరిస్తున్నాయి.

హైదరాబాద్ లోని ICRISAT వంటి సంస్థ దేశీయ వంగడాలపై పరిశోధన జరుపుతూ అధిక దిగుబడినిచ్చే వంగడాలకు కృషి చేస్తున్నాయి. రైతులకు నూతన వ్యవసాయ విధానాలపై అవగాహన పెంపొందిస్తున్నాయి. ప్రభుత్వాలు డ్రిప్ ఇరిగేషన్ పై 50% రాయితీలు ఇస్తున్నాయి.

IUCN అనే సంస్థ ప్రమాదం అంచున ఉన్న వన్యజాతులను, జాతీయ ఉద్యానవనాలను, సంరక్షణ, కేంద్రాలను పర్యావరణానికి సంబంధించిన అంశాల స్థాయిని పరిశీలిస్తుంది.

AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు

ప్రశ్న 31.
అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర సంస్థలు మాత్రమే వనరుల యాజమాన్యంలో పాత్ర వహిస్తాయా? ఈ యాజమాన్య ప్రక్రియ మొత్తంలో ఎవరెవరు పాల్గొంటారు?
జవాబు:
వనరుల యాజమాన్యం కేవలం అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర సంస్థలకు మాత్రమే పరిమితం కాదు. ఈ ప్రక్రియలో సమాజాన్ని, పౌరులను బాధ్యులుగా చేసినపుడు వనరుల యాజమాన్యం సక్రమంగా నిర్వహించబడుతుంది. వనరుల యాజమాన్యాన్ని ప్రతి పౌరుడూ బాధ్యతగా చేపట్టాలి. దీనికోసం ఆయా సంస్థలు ప్రజలలో వనరుల వినియోగం మీద వాటి ఫలితాలపైన పూర్తి అవగాహన కల్పించాలి. పెద్ద ఎత్తున ప్రజలలో, చర్చా కార్యక్రమాలు, వేదికలు ఏర్పాటు చేసి ప్రచారం చేపట్టాలి. వనరుల వినియోగంపైన రేపటి పౌరులైన బాలబాలికలకు అవగాహన పెంచాలి. వనరుల అంశాలను పాఠ్యాంశముగా బోధించాలి. ‘వనరుల సంరక్షణే – దేశ రక్షణ’ అని తెలియజెప్పాలి.

ప్రశ్న 32.
నీవు, నీ స్నేహితులు ఏ ఏ మార్గాల ద్వారా వనరులను సంరక్షిస్తారు? ప్రకృతిలో మనం కూడా ఒక ప్రధాన వనరేనా? ఏవిధంగా?
జవాబు:

  1. ఇంకుడు గుంటలు నిర్మించి నీటి వనరులను సంరక్షిస్తాము.
  2. వృథా నీటిని తోటకు మళ్ళించి నీరు ఆదా చేస్తాము.
  3. పాఠశాలలో, ఇంటి ఆవరణలో పెద్ద చెట్లను పెంచి మొక్కలను సంరక్షిస్తాము.
  4. ఆట స్థలంలో గడ్డి మొక్కలు పెంచి నేల క్రమక్షయం నివారిస్తాము.
  5. ఆటస్థలం చుట్టూ రక్షణ కొరకు, థెరీసిడియం మొక్కలు పెంచుతాము.

ప్రకృతిలో మనం కూడా ఒక ప్రధాన వనరే. దేశ అభివృద్ధి అంతా మానవ వనరుల వినియోగం పైనే ఆధారపడి ఉంటుంది. ఏ దేశంలో మానవ వనరులు పుష్కలంగా ఉంటాయో ఆ దేశానికి అభివృద్ధి అవకాశాలు ఎక్కువ. అయితే ఈ మానవ వనరులను సక్రమంగా, బాధ్యతాయుతంగా వినియోగించగలగాలి. అది సాధ్యం కానప్పుడు అధిక జనాభా వలన దేశం పేదరికంలోనికి నెట్టబడుతుంది.

ప్రశ్న 33.
మీ ఇంట్లో రోజుకు ఎన్ని లీటర్ల నీటిని వాడుతున్నారో కనుక్కోండి. అన్ని నీళ్ళు వాడడం అవసరమా? జాతీయ ప్రమాణాల ప్రకారం ఎంత నీరు అవసరం?
జవాబు:
మా ఇంటిలో రోజుకు 250 లీటర్ల నీటిని వాడుతున్నారు. వాస్తవానికి ఇంత నీరు అవసరం లేదు. నీటిని పొదుపుగా వాడుకొన్నట్లయితే 200 లీటర్ల నీరు సరిపోతుంది. అంటే రోజుకు సరాసరి 50 లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు.

10th Class Biology 10th Lesson సహజ వనరులు Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

మీరు నివసిస్తున్న పరిసరాలలో ఏ విధంగా నీరు ఉపయోగించబడుతోంది? దుర్వినియోగం చేయబడుతోందో మరియు పునఃచక్రీయం చేయబడుతుందో అధ్యయనం చేయండి. సహ విద్యార్థులు, ఉపాధ్యాయుల సహాయంతో ప్రశ్నావళిని రూపొందించి, ఐదు ఇళ్లను అధ్యయనం చేయండి. అందరికీ నీరు అందించే విధానాలను అన్వేషించి చర్చించండి.
జవాబు:
1. నీటి వినియోగం :

  1. ఇంటిలో నిత్య అవసరాలకు
  2. వ్యవసాయంలో పంట పొలాలకు
  3. జల విద్యుత్ తయారీకి నీరు వినియోగిస్తున్నారు.

2. దుర్వినియోగ సందర్భాలు :

  1. గృహ వినియోగంలో చాలా నీరు దుర్వినియోగం అవుతోంది.
  2. వాడిన నీరు వృథాగా కాలువలలో చేరుతోంది. ఈ నీటిని ఇతర ప్రక్రియలకు, మొక్కలు పెంచటం వంటి వాటికి వాడవచ్చు.
  3. వ్యవసాయంలో కాలువల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఈ ప్రక్రియలో చాలా నీరు వృథా అవుతోంది.
  4. పంట భూముల నుండి నీటిని అధికంగా వృథా చేస్తున్నారు. రసాయన ఎరువు వలన కలుషితం అవుతోంది.
  5. చెరువుల నుండి నీరు ఆవిరిగా మారి వృథా అవుతోంది.
  6. పంట కాలువల యాజమాన్యం సరిగా లేక నీటి వృథా జరుగుతోంది.

3. పునఃచక్రీయం :
పంట కాలువ మీద ఆనకట్ట కట్టి మినీ హైడల్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించిన నీటిని తిరిగి పంటకాలువలకు పంపి పునర్వినియోగం చేస్తున్నారు.

ప్రశ్నావళి :

  1. మీ ఇంటిలో ఎంత మంది సభ్యులు ఉన్నారు?
  2. రోజుకు ఎంత నీరు వాడుతున్నారు?
  3. మీకు ఉన్న నీటి వనరులు ఏమిటి?
  4. నీటి ఎద్దడి ఉన్నప్పుడు ఏం చేస్తారు?
  5. నీటిని పొదుపు చేయవచ్చు అని మీరు భావిస్తున్నారా?
  6. తక్కువ నీటి వినియోగానికి మీరు తీసుకొనే జాగ్రత్తలు ఏమిటి?

కృత్యం – 2

మీ ఇంట్లో, పరిసర ప్రాంతాలలో ఎన్ని రకాల కీటకాలున్నాయో కనుక్కోండి. అన్ని కాలాలలో ఒకే రకమైన కీటకాలు ఉంటాయా? కీటకాల పేర్లను చార్టుపై రాయండి (కీటకాల పేర్లు తెలియకపోతే పెద్దవారిని అడిగి తెలుసుకోండి). ప్రతి కాలంలో, వారానికొకసారైనా కీటకాల ఉనికిని నమోదు చేయండి. అన్ని కాలాల్లో ఈ కృత్యాన్ని చేస్తూ ఒక సంవత్సర కాలం అధ్యయనం చేయండి. ఎప్పుడు ఎక్కువ రకాల కీటకాలు కనిపిస్తున్నాయో కనుక్కోండి. తరవాత సంవత్సరాలలో ఆ కీటకాలేమైనా అదృశ్యమయ్యాయా అధ్యయనం చేయండి.
జవాబు:

  1. మా ఇంటి పరిసరాలలో ఈగ, దోమ, గొల్లభామ, సాలీడు, కొంకి పురుగు, బొద్దింక, తూనీగ, సీతాకోకచిలుక, మిడుత, రెక్కల పురుగు, మాత్, వడ్లచిలక వంటి కీటకాలు ఉన్నాయి.
  2. అన్ని కాలాల్లో ఒకే రకమైన కీటకాలు ఉండుటలేదు.
  3. వర్షాకాలంలో, ఇళ్లలో కనిపించే కీటకాలు అధికంగా ఉంటే శీతాకాలంలో పంటపొలాలపై కనిపించే కీటకాలు అధికంగా ఉండటం గమనించాను. వేసవి కాలంలో ఈగలు అధికంగా ఉండటం గమనించాను. పండ్ల రంగు ఆయా కాలాన్ని బట్టి మారుతూ ఉండటం గమనించాను.
  4. అన్ని కీటకాలు ప్రతి సంవత్సరం కనిపించుట లేదు. కొన్ని కీటకాలు అదృశ్యమవుతున్నాయి. దీనికి వాతావరణ పరిస్థితులలో, మార్పులు కారణమవుతున్నాయి. పరిస్థితులు అనుకూలించినపుడు మరలా మాయమైన కీటకాలు కనిపించటం ఆశ్చర్యం కలిగించింది.

కృత్యం – 3

ఈ రోజుల్లో ప్రజలు తవ్వకాల పట్ల సుముఖంగా లేరు. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రజలు తిరగబడుతున్నారు. ఇలాంటి సంఘటనలను గ్రంథాలయం లేదా వార్తా పత్రికల నుండి సేకరించి, ఖనిజాల తవ్వకాల ప్రభావంపై సెమినార్ ఏర్పాటు చేయండి.”
అభివృద్ధి పేరిట, పారిశ్రామికీకరణ పేరిట, చాలా సహజవనరులను, ప్రకృతిని మానవుడు ధ్వంసం చేస్తున్నాడు. అదృష్టం కొలది వీటి పరిణామాలపై మానవులలో అవగాహన పెరిగింది. ప్రకృతి వ్యతిరేక చర్యలను ప్రజలు ఖండిస్తున్నారు.

  1. తీర ప్రాంతాలలో ఇసుక తవ్వకాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
  2. కడప ప్రాంతంలో అణుశుద్ధి కర్మాగార స్థాపన పెద్ద ఎత్తున నిరసనను ఎదుర్కొంది.
  3. కృష్ణా, గోదావరి బేసిన్లో ఆయిల్ తవ్వకాలను ప్రజలు వ్యతిరేకించారు.
  4. కర్ణాటకలోని బయ్యారం ఇనుప ఖనిజ తవ్వకాలపై నిరసన వచ్చింది.
  5. ఖనిజ నిల్వల కోసం, ఇతర అవసరాల కోసం అడవుల నరికివేత తీవ్ర విమర్శలకు లోనైంది.
  6. ఆనకట్టల కోసం తవ్వకాలను, అడవుల నిర్మూలనను ప్రజలు ఖండిస్తున్నారు.
  7. తెక్రీడ్యామ్ నిర్మాణాన్ని సుందర్‌లాల్ బహుగుణ తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమం నడిపాడు.
  8. పర్యావరణ పరిరక్షణ కోసం మన రాష్ట్రంలో తెలుగుగంగ ప్రాజెక్టు మార్గాన్ని మార్చారు.

ఈ ఉద్యమం ప్రజలలో పర్యావరణంపై ఉన్న అభిమానాన్ని, చైతన్యాన్ని తెలియజేస్తుంది. ఇది అభినందనీయ మార్పు. స్వాగతించవలసిన పరిణామం.

కింది ఖాళీలను పూరించండి

1. జీవ ఇంధన ఉత్పత్తికి ……. మొక్కలను ఉపయోగిస్తారు. (జట్రోప)
2. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం ఆహారం కోసమే కాదు …………….. కోసం కూడా. (ఔషధాల)
3. తరిగిపోని ఇంధన వనరుకు ఉదాహరణ ………. (గాలి, నీరు)
4. భూగర్భజలాలు తగ్గిపోకుండా కాపాడుకోడానికి అనుసరించదగిన ఒక ప్రత్యామ్నాయ పద్ధతి ………… (ఇంకుడు గుంట)
5. వరిసాగు …………….. ప్రదేశాలకు అనువైనది. (అధికనీరు ఉన్న)

సరైన సమాధానాన్ని గుర్తించండి

1. ఇంకుడు గుంటల వలన ఉపయోగం
A) వ్యవసాయానికి నీరు అందించడం
B) భూగర్భజల మట్టాలు పెంచడం
C) వర్షపు నీటిని నిల్వచేయడం
D) వర్షాకాలంలో వచ్చే వరదలను అరికట్టడం
జవాబు:
B) భూగర్భజల మట్టాలు పెంచడం

2. తక్కువ నీటి సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో రైతులు అనుసరించదగిన విధానం
అ) స్వల్పకాలిక పంటలు పండించడం
ఆ) వ్యాపార పంటలు పండించడం
ఇ) బిందుసేద్యం చేయడం
ఈ) పంట విరామం ప్రకటించడం
A) అ, ఆ
B) అ, ఆ, ఇ
C) అ,ఈ
D) ఇ,ఈ
జవాబు:
B) అ, ఆ, ఇ

3. భారతదేశంలో అతివేగంగా అంతరించిపోతున్న ఇంధన వనరులు –
A) సహజవాయువు
B) బొగ్గు
C) పెట్రోలియం
D) అన్ని
జవాబు:
D) అన్ని

4. పరిసరాలలోకి హానికర రసాయనాలు పెద్దమొత్తంలో విడుదల కావడానికి కారణం
A) పరిశ్రమలు
B) గనులు
C) క్రిమిసంహారకాలు
D) ఆధునిక సాంకేతికత
జవాబు:
A) పరిశ్రమలు

AP Board 10th Class Biology Solutions 10th Lesson సహజ వనరులు

5. సుస్థిర అభివృద్ధి అనగా
A) వృథాను అరికట్టడం
B) స్థిరమైన పెరుగుదల
C) నష్టం వాటిల్లకుండా అభివృద్ధి చేయడం
D) తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి చేయడం
జవాబు:
C) నష్టం వాటిల్లకుండా అభివృద్ధి చేయడం

AP Board 10th Class Biology Solutions 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత

AP Board 10th Class Biology Solutions 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత

SCERT AP 10th Class Biology Study Material 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Biology 9th Lesson Questions and Answers మన పర్యావరణం – మన బాధ్యత

10th Class Biology 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
ఆహారపు గొలుసులో ఒక పోషకస్థాయి నుండి మరొక పోషకస్థాయికి బదిలీ అయిన శక్తి ఏమవుతుంది? (AS 1)
జవాబు:

  1. ఆహారపు గొలుసులో ఒక పోషకస్థాయి నుండి మరొక పోషకస్థాయికి శక్తి బదిలీ అవుతుంది.
  2. ఈ శక్తి బదిలీ పూర్తిగా 100 శాతం జరగదు. కొంత శక్తి జీవి జీవక్రియలకు వినియోగించుకుంటుంది.
  3. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక పోషకస్థాయి నుండి తరువాత పోషకస్థాయికి కేవలం 10-20% శక్తి మాత్రమే సరఫరా అవుతుంది. మిగిలిన 80% నుండి శక్తి జీవి జీవక్రియలకు, శరీర ఉష్ణానికి ఖర్చు చేయబడుతుంది.
  4. ఉదాహరణకు 10 కిలోల గడ్డిని ఒక శాకాహారి ఆహారంగా తీసుకొంటే, దాని నుండి లభించిన శక్తిని, ఆ శాకాహారి, జీవక్రియలకు వాడుకొంటుంది. అంటే గుండె కొట్టుకోవటానికి, పరుగెత్తటానికి, శరీర ఉష్ణానికి ఈ శక్తి ఖర్చు అవుతుంది. ఇలా ఖర్చు అయ్యే శక్తి విలువ 80% వరకు ఉంటుంది.
  5. జీవి తన అవసరాలకు పోను మిగిలిన శక్తిని జీవద్రవ్యరాశి రూపంలో శరీరంలో నిల్వ చేసుకొంటుంది. ఈ నిల్వ చేసుకొన్న తక్కువ శక్తి తరువాత పోషకస్థాయి అయిన మాంసాహారికి అందించబడుతుంది.

ప్రశ్న 2.
ఆవరణ వ్యవస్థలోని పిరమిడ్లు మరియు ఆహారపు గొలుసులు వేటిని సూచిస్తాయి? (AS 1)
జవాబు:
ఆవరణ వ్యవస్థలోని జీవుల మధ్య సంబంధాలను చూపటానికి లేదా వర్ణించటానికి ఆవరణ శాస్త్రవేత్తలు పిరమిడ్ భావనను ప్రతిపాదించారు. వివిధ పోషక స్థాయిలలో ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని పిరమిడ్ రూపంలో రేఖాత్మకంగా చూపే చిత్రాన్ని జీవావరణ పిరమిడ్ అంటారు. జీవావరణ పిరమిడ్లు ఆవరణ వ్యవస్థలోని జీవుల సంఖ్యను, వాటి జీవ ద్రవ్యరాశిని, ఆహారపు గొలుసులో శక్తి ప్రసరణను సూచిస్తాయి.

జీవుల మధ్య ఉండే ఆహార సంబంధాలను చూపే రేఖాత్మక చిత్రాన్ని ఆహారపు గొలుసు అంటారు. ఇది జీవుల మధ్య ఉండే ఆహార సంబంధాలను, ఒక జీవి ఆహారం పొందే విధానాన్ని, దాని ఆహార అలవాట్లను తెలుపుతుంది.

ప్రశ్న 3.
ఏదైనా ఒక ఆహారపు గొలుసు యొక్క సంఖ్యా పిరమిడ్ పై లఘుటీక రాయండి. కింద ఇవ్వబడిన సంఖ్యాపిరమిడ్ నుండి నీవు ఏం గ్రహించావు? (AS 1)
ఎ) చెట్టు బి) కీటకం సి) వడ్రంగి పిట్ట
జవాబు:
AP Board 10th Class Biology Solutions 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత 1
సంఖ్యాపిరమిడ్ :
ఆహారపు గొలుసులోని జీవుల సంఖ్యను పిరమిడ్ రేఖాపటంలో చూపటాన్ని సంఖ్యాపిరమిడ్ అంటారు. ఇది ఆహారపు గొలుసులోని వివిధ పోషక స్థాయిలలో ఉన్న జీవుల సంఖ్యను తెలుపుతుంది.

చెట్లు → కీటకాలు → వడ్రంగి పిట్ట

అనే ఈ ఆహారపు గొలుసును పరిశీలిస్తే చెట్ల సంఖ్య కీటకాల కంటే అధికంగాను, కీటకాలు, వడ్రంగి పిట్ట కంటే అధిక సంఖ్యలోనూ ఉంటాయి. అంటే ఆహారపు గొలుసులో పైకి పోతున్న కొలది జీవుల సంఖ్య తగ్గుతుంది. కావున ఈ సంఖ్యా పిరమిడ్ నిటారుగా ఉంటుంది.

ఇదే ఆహారపు గొలుసును ఒక చెట్టు పరంగా పరిశీలిస్తే చెట్ల సంఖ్య (ఒక్కటి) దానిపైన ఉన్న కీటకాల కంటే తక్కువ. అదే విధంగా కీటకాల కంటే వడ్రంగి పిట్టల సంఖ్య తక్కువగా ఉంటుంది. అంటే చెట్టు, వడ్రంగి పిట్టల సంఖ్య తక్కువగా ఉండి, కీటకాల సంఖ్య ఎక్కువగా ఉండుట వలన ఈ సంఖ్యాపిరమిడ్ శంఖు ఆకారంలో వస్తుంది.

AP Board 10th Class Biology Solutions 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 4.
జీవ ద్రవ్యరాశి అనగానేమి? కింద ఇవ్వబడిన ఆహారపు గొలుసును ఉదాహరణగా తీసుకొని, జీవద్రవ్యరాశి పిరమిడ్ ను గీయండి. (AS 1)
ఎ) గడ్డి బి) శాకాహారులు సి) మాంసాహారులు డి) గద్ద లేదా రాబందు
జవాబు:
AP Board 10th Class Biology Solutions 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత 2
శక్తిగా మార్చటానికి వీలైన వృక్ష, జంతు సంబంధ పదార్థాన్ని జీవద్రవ్యరాశి అంటారు. వివిధ ఆహారపు గొలుసుల జీవ ద్రవ్యరాశి పిరమిడ్లను నిర్మిస్తే అవి ఆహారపు గొలుసులోని జీవుల పరిమాణాన్ని సూచిస్తాయి.

గడ్డి → కీటకం → పాము → గద్ద
ఉత్పత్తి శాకాహారి → మాంసాహారి → అగ్రశ్రేణి మాంసాహారి

పై ఆహారపు గొలుసు యొక్క జీవద్రవ్యరాశి పిరమిడ్ ను నిర్మిస్తే అది అథోముఖంగా ఉంటుంది. ఈ ఆహారపు గొలుసులో పైకి వెళ్ళే కొలది జీవుల యొక్క జీవ ద్రవ్యరాశి పెరుగుతుండుట వలన పిరమిడ్ తలక్రిందులుగా ఏర్పడింది. కానీ సాధారణంగా భౌమ ఆవరణ వ్యవస్థలో జీవద్రవ్యరాశి పిరమిడ్లు శీర్షాభిముఖంగా ఉంటాయి.

ప్రశ్న 5.
ఈ పాఠం చదివిన తరువాత ‘విషపూరిత పదార్థాల వాడకం ఆవరణ వ్యవస్థను ఏవిధంగా ప్రభావితం చేస్తున్నాయి’ అనే దానిపై మీరు అర్థం చేసుకొన్న విషయాలను రాయండి. (AS 1)
జవాబు:
పరిశ్రమల నుండి వస్తున్న భారలోహాలు, వ్యర్థ జలాలు, వ్యవసాయ భూముల నుండి వస్తున్న రసాయన కలుషితాలు ఆవరణ వ్యవస్థలను విపరీతంగా నష్టపర్చుతున్నాయి. ఈ కలుషితాలు క్రమేణా జీవులలోనికి ప్రవేశించి హానికర వ్యాధులను కలిగిస్తున్నాయి. ఆహార గొలుసుతోపాటు ఈ హానికర రసాయనాలు అగ్రశ్రేణి మాంసాహారులలో, సాంద్రీకరణ చెంది దారుణమైన ఫలితాలు కలిగిస్తున్నాయి.

చిస్సౌ కార్పొరేషన్ వారి రసాయన పరిశ్రమల నుండి విడుదలైన మిథైల్ మెర్క్యురీ చేపల ద్వారా వాటిని తినే మనుషులలోకి చేరి ‘మినిమేటా’ అనే వ్యాధిని కలిగించింది. దీని ఫలితంగా అనేక జీవరాశులు మృత్యువాత పడ్డాయి. కావున విషపూరిత కలుషితాల ప్రభావాలను అర్థం చేసుకొని వాటిని వినియోగించటంలోనూ, తొలగించటంలోనూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మానవ జీవితం సక్రమంగా నడవగలుగుతుంది.

ప్రశ్న 6.
క్రిమికీటకాల బారి నుండి పంటలను, ఆహార పదారాలను నివారించే క్రిమిసంహారకాలను ఉపయోగించాలా? లేదా ప్రత్యామ్నాయాలను ఆలోచించాలా? ఈ విషయం గురించి మీ అభిప్రాయాన్ని, దానికి గల కారణాలను రాయండి. (AS 1)
జవాబు:
క్రిమికీటకాల బారి నుండి ఆహార పదార్థాలను రక్షించుకోవటం మన తక్షణ బాధ్యత. అయితే దానికోసం ఉపయోగిస్తున్న రసాయనిక క్రిమిసంహారకాలు పర్యావరణం పైన తీవ్ర హానికర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ రసాయనాలు హానికర కీటకాలనే కాకుండా ఉపయోగకరమైన అనేక కీటకాలనూ చంపుతున్నాయి. కావున వీటి వాడకం సరైన పద్దతి కాదు. ఈ రసాయనిక క్రిమిసంహారకాలకు ప్రత్యామ్నాయాలు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఇప్పటికే శాస్త్రవేత్తలు అనేక జీవ నియంత్రణ పద్ధతులను సూచిస్తున్నారు. పరభక్షకాలను ఉపయోగించడం, పరాన్నజీవులను ప్రయోగించటం, పంట మార్పిడి విధానం, ఆకర్షక పంటలు, జీవ రసాయనాల వాడకం వంటి పద్ధతులు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. వీటిని అనుసరించుట వలన మన ప్రయోజనాలతో పాటు, పర్యావరణం పరిరక్షింపబడుతుంది. ఇది మన పర్యావరణ నైతికతకు నిదర్శనం. కావున ఈ ప్రత్యామ్నాయ పద్ధతులపైన రైతులలో అవగాహన కల్పించి, ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. అప్పుడే మన జీవనం ‘పర్యావరణ మిత్ర’ గా కొనసాగుతుంది.

ప్రశ్న 7.
పోషకస్థాయి అంటే ఏమిటి? జీవావరణ పిరమిడ్లో ఇది దేనిని తెలియజేస్తుంది? (AS 1)
జవాబు:
ఆహారపు గొలుసు వివిధ జీవుల ఆహార సంబంధాన్ని తెలియజేస్తుంది. ఆహారపు గొలుసులోని ఒక్కొక్క అంతస్తును పోషకస్థాయి అంటారు. ఆహారపు గొలుసులో శక్తి ఒక పోషకస్థాయి నుండి మరొక పోషక స్థాయికి అందించబడుతుంది.

  1. పోషకస్థాయి ఆహారపు గొలుసులోని జీవుల సంబంధాలను తెలుపుతుంది.
  2. ఆహారపు గొలుసులో జీవుల స్థానాన్ని తెలుపుతుంది.
  3. జీవి ఆహార విధానాన్ని తెలియజేస్తుంది.
  4. ఆహారపు గొలుసులో జీవి స్థాయిని తెలియజేస్తుంది.
  5. ఆహారపు గొలుసు యొక్క విస్తృతిని తెలియజేస్తుంది.
  6. శక్తి ప్రసరణ మార్గాన్ని తెలియజేస్తుంది.

ప్రశ్న 8.
ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రసరణ గురించి వివరంగా తెలుసుకోవాలంటే నీవేమి ప్రశ్నలు అడుగుతావు? (AS 2)
జవాబు:

  1. ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రసరణ అవసరం ఏమిటి?
  2. ఆవరణ వ్యవస్థలో శక్తిపిరమిడ్ ఏ ఆకారంలో ఉంటుంది?
  3. ఆహారపు గొలుసులో ప్రతి స్థాయి వద్ద శక్తి నష్టం ఎంత ఉంటుంది?
  4. ఎంత శక్తి శాతం ఆహారపు గొలుసులో స్థాయి పెరిగినపుడు రవాణా అవుతుంది?
  5. ఆవరణ వ్యవస్థలో శక్తి ఉత్పత్తిదారులు ఏమిటి?
  6. శక్తి పిరమిడ్లో ఉత్పత్తిదారుల సంఖ్య అధికంగా ఉండవలసిన అవసరం ఏమిటి?

ప్రశ్న 9.
ఆహారపు వల నుండి మాంసభక్షకాలను తొలగిస్తే ఏం అవుతుంది? (AS 2)
జవాబు:

  1. ఆవాసంలో ప్రతి జీవికి నిర్దిష్టమైన, ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఏ ఒక్క జీవిని తొలగించినా దాని ప్రభావం ఇతర జీవులపైనా, పర్యావరణం పైనా ప్రభావం చూపుతుంది.
  2. ఉదాహరణకు ఆహారపు వల నుండి మాంసభక్షకాలను తొలగిస్తే శాకాహారుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. వాటి జనాభా అదుపు తప్పుతుంది. అంటే ఒక అడవిలో సింహం, పులులను తొలగిస్తే అవి ఆహారంగా తీసుకొనే, జింకలు, జిరాఫీ వంటి శాకాహారుల సంఖ్య పెరుగుతుంది.
  3. ఈ పరిస్థితి కొనసాగితే శాకాహారుల సంఖ్య బాగా పెరిగి, వాటి మధ్య ఆహారం కొరకు, ఆవాసం కొరకు పోటీ తీవ్రత పెరుగుతుంది. ఈ జీవుల ఆహార అవసరాలు ఒకే విధంగా ఉండుటవలన వాటి మధ్య పోటీ పెరిగి ఆహార కొరత ఏర్పడుతుంది.
  4. ఆహారం లభించక శాకాహారులు కొన్ని మరణించి, వాటి జనాభా నియంత్రించబడుతుంది. ఈ విధంగా ప్రకృతిలో సమతాస్థితి స్థాపించబడుతుంది. జీవుల మధ్య ఉండే ఈ సమతాస్థితి ప్రకృతి ధర్మాలలో ఒకటి.

AP Board 10th Class Biology Solutions 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 10.
మీ పెరటి తోటలోని ఒక మొక్కను పరిశీలించండి. ఉత్పత్తిదారులు, వినియోగదారుల సంబంధంపై సంక్షిప్త నివేదిక రాయండి. (AS 3)
జవాబు:

  1. మా పెరటిలో జామచెట్టు ఉంది. దానిపైన అనేక జీవరాసులు ఆవాసం ఉండటం గమనించాను. చెట్టు మొదటలో చీమలు, చిన్న కీటకాలు ఉండగా, బెరడు మీద రెక్కల కీటకాలు కనిపించాయి. చెట్టుమీద పక్షులు, ఉడతలు ఉన్నాయి.
  2. ఈ చెట్టును ఆవాసంగా భావిస్తే చెట్టుమీద ఉన్న అన్ని జీవరాసులకు, దాని ఆధారంగా జీవిస్తున్న చిన్న జీవులకు, జామచెట్టు ఉత్పత్తిదారు అవుతుంది.
  3. చెట్టుపై ఆధారపడి జీవిస్తున్న కీటకాలు వినియోగదారులు అవుతాయి. ఇవి మొక్క ఆకులను తింటూ జీవిస్తుంటే వీటిని ప్రాథమిక వినియోగదారులుగా పరిగణిస్తారు. చెట్టు కాయలను తింటూ జీవించే ఉడత కూడా ప్రాథమిక వినియోగదారి అవుతుంది.
  4. చెట్టుపై ఉన్న కీటకాలను ఆహారంగా తీసుకుని జీవించే ‘పక్షులు ద్వితీయ వినియోగదారులు అవుతాయి.
  5. ఈ జీవుల మధ్య సంబంధాన్ని ఆహారపు గొలుసుగా చూపిస్తే కింది విధంగా ఉంటుంది.
    AP Board 10th Class Biology Solutions 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత 3
  6. వీటి సంబంధాలను పిరమిడ్ ఆకారంలో క్రింది విధంగా చూపించవచ్చు.

AP Board 10th Class Biology Solutions 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత 4

ప్రశ్న 11.
జీవద్రవ్యరాశి పిరమిడను వివరించాలంటే ఎలాంటి సమాచారం అవసరమవుతుంది? (AS 4)
జవాబు:
శక్తిగా మార్చటానికి వీలైన వృక్ష, జంతు సంబంధ పదార్థాన్ని జీవద్రవ్యరాశి అంటారు. ఆహారపు గొలుసులోని ప్రతి స్థాయి వద్ద జీవద్రవ్యరాశిని గణించి వరుస క్రమంలో అమర్చటం వలన జీవద్రవ్యరాశి పిరమిడ్ ఏర్పడుతుంది.

జీవద్రవ్యరాశి పిరమిడను నిర్మించాలంటే :

  1. ఆహారపు గొలుసులోని జీవుల వివరాలు
  2. ఆహారపు గొలుసులో ప్రతి స్థాయి వద్ద ఉన్న జీవద్రవ్యరాశి పరిమాణం కావాలి.

జీవద్రవ్యరాశి పిరమిడ్ ప్రతి పోషక స్థాయిలోని జీవద్రవ్యరాశి పరిమాణాన్ని, వివిధ పోషక స్థాయిలలో ఉన్న రాశుల మధ్యగల సంబంధాన్ని తెలియజేస్తుంది.

జీవద్రవ్యరాశి పిరమిడను వివరించాలంటే-

  1. పిరమిడను నిర్మిస్తున్న జీవులు, వాటి ఆహార సంబంధాలు
  2. ప్రతి పోషక స్థాయిలో జీవుల జీవద్రవ్యరాశి.
  3. పోషక స్థాయిలో జరుగుతున్న శక్తినష్టం
  4. ప్రతి పోషక స్థాయిలో ఆహారపు గొలుసులో జమ అవుతున్న జీవద్రవ్యరాశి వంటి వివరాలు కావాలి.

సాధారణంగా జీవద్రవ్యరాశి పిరమిడ్లు రెండు రకాలుగా ఉంటాయి.

  1. ఊర్ధ్వముఖ జీవద్రవ్యరాశి పిరమిడ్లు
  2. అధోముఖ జీవద్రవ్యరాశి పిరమిడ్లు

ప్రశ్న 12.
ఎగువ పోషకస్థాయి వినియోగదారునిగా నిన్ను ఊహించుకొని, సంఖ్యాపిరమిడను గీసి దాని దిగువ స్థాయిల గురించి రాయండి. (AS 5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత 5

  1. మొక్కలు → గొర్రె → మానవుడు- ఈ ఆహారపు గొలుసు నందు మానవుడు ఎగువ పోషకస్థాయిలో ఉన్నాడు.
  2. మానవుని కంటే దిగువ పోషకస్థాయిలో గొర్రె, మేక వంటి శాకాహారులు ఉన్నాయి. ఇవి మొక్కలు ఉత్పత్తి చేసిన ఆహారాన్ని గ్రహిస్తాయి కావున వీటిని ప్రాథమిక వినియోగదారులు అంటారు.
  3. ఈ ప్రాథమిక వినియోగదారులు ఆహారం కోసం ఉత్పత్తిదారులైన మొక్కలపై ఆధారపడతాయి. అందువలన మొక్కలు పిరమిడ్ లో ఆధారభాగాన ఉన్నాయి.
  4. ఈ ఆహారపు గొలుసును సంఖ్యాపరంగా పరిశీలిస్తే శాకాహారుల కంటే మొక్కలు అధిక సంఖ్యలో ఉన్నాయి. మానవుని కంటే ఆవరణ వ్యవస్థలో శాకాహారులు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కావున ఈ పిరమిడ్ ఊర్ధ్వముఖంగా ఉన్నది.

ప్రశ్న 13.
మీ తోటి విద్యార్థులలో చైతన్యం కలిగించడానికి పర్యావరణ స్నేహపూర్వక కృత్యాలపై నినాదాలు రాయండి. (AS 7)
(లేదా)
సమాజమును చైతన్యం చేయుటకు పర్యావరణ స్నేహపూర్వక కృత్యాలపై నినాదాలు వ్రాయండి.
జవాబు:
పర్యావరణ స్నేహపూర్వక నినాదాలు :

  1. జీవించు – జీవించనివ్వు
  2. ప్రకృతిని సంరక్షించు – జీవ వైవిధ్యాన్ని సంరక్షించు
  3. పరిసరాలను శుభ్రంగా ఉంచు – సంతోషంగా ఉండు
  4. పర్యావరణ స్నేహభావంతో ఆలోచించు – పర్యావరణ స్నేహపూర్వకంగా జీవించు
  5. పర్యావరణాన్ని నీవు రక్షించు – పర్యావరణం నిన్ను రక్షిస్తుంది.
  6. పలు కాలుష్యాలను తగ్గించండి – జీవ వైవిధ్యాన్ని కాపాడండి.
  7. మన పర్యావరణం కోసం ఒక మొక్కను నాటుదాం.
  8. భూమి ఉన్నది ఒక్కటే – దానిని నాశనం చేయొద్దు.

AP Board 10th Class Biology Solutions 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 14.
క్రిమిసంహారకాల వాడకాన్ని ఆపివేసి నేల కాలుష్యం నివారించడానికి సహాయపడే ఏవైనా మూడు కార్యక్రమాలను సూచించండి. (AS 7)
(లేదా)
మీ ప్రాంతంలో క్రిమి సంహారకాలను అధికంగా వాడడం వల్ల నేల కాలుష్యానికి గురి అయింది. దీనిని నివారించడానికి ఏవైనా రెండు పద్ధతులను సూచించండి.
జవాబు:
క్రిమిసంహారకాల వాడకాన్ని ఆపివేయటానికి ఈ కింది కార్యక్రమాలు తోడ్పడతాయి.

1. జీవనియంత్రణ పద్ధతులు :
కీటకాలను అదుపులో ఉంచటానికి వాటిని తినే పరభక్షకాలను ఉపయోగించవచ్చు. కొన్నిసార్లు పరాన్నజీవులను ప్రవేశపెట్టి వ్యాధికారక కీటకాలను నిర్మూలించవచ్చు.

2. జీవరసాయనాలు వాడటం :
హానికర రసాయనిక మందుల స్థానంలో మొక్కల నుండి లభించే నింబిన్ (వేప) వంటి పదార్థాలను పిచికారీ చేసి, కీటకాలను అదుపులో ఉంచవచ్చు. పొగాకు, వెల్లుల్లి, పంచగవ్య, ఎపి వి ద్రావణం – దీనికి ఉదాహరణలు.

3. లింగాకర్షణ బుట్టలు :
మగ కీటకాలను ఆకర్షించటానికి పంట పొలాలలో లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి కీటకాలను బంధించవచ్చు. వీటిలో ‘ఫిరొమోన్’ రసాయనాలు వాడి మగకీటకాలను బంధిస్తారు.

10th Class Biology 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత Textbook InText Questions and Answers

10th Class Biology Textbook Page No. 208

ప్రశ్న 1.
పటం-1లో ఉన్న జంతువులను పరిశీలించండి. వాటి మధ్యగల ఆహార సంబంధాలను బాణపు గుర్తులతో చూపుతూ ఆహారపు గొలుసును తయారుచేయండి.
జవాబు:
గడ్డి → కుందేలు → పాము → గద్ద.

ప్రశ్న 2.
మీరు రాసిన లేదా తయారుచేసిన ఆహారపు గొలుసులోని ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల పేర్లను రాయండి.
జవాబు:
ఆహారపు గొలుసులో గడ్డి ఉత్పత్తిదారులు కాగా, మిగిలిన జంతువులు వినియోగదారులు.

ప్రశ్న 3.
మీరు గీసిన బాణపు గుర్తులు దేనిని సూచిస్తాయి?
జవాబు:
మేము గీసిన బాణపు గుర్తు ఆహార సంబంధాలను, శక్తి ప్రసరణను సూచిస్తుంది.

ప్రశ్న 4.
మీ పరిసరాలలో, కనీసం నాలుగు ఆహారపు గొలుసులను గుర్తించండి. వీటిలోని ఉత్పత్తిదారులు, వివిధ స్థాయిలలోని వినియోగదారుల పేర్లను రాయండి.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత 6

ప్రశ్న 5.
ఆహారపు గొలుసులు చాలా వరకు నాలుగు స్థాయిలనే ఎందుకు కలిగి ఉంటాయి?
జవాబు:
ఆహారపు గొలుసు ఉత్పత్తిదారులలో ప్రారంభమై అగ్రశ్రేణి మాంసాహారులలో పూర్తి అవుతుంది. ఈ ప్రక్రియలో మూడు లేదా నాలుగు స్థాయిలలో వినియోగదారులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఈ స్థాయి పెరిగే కొలది ఆహార లభ్యత కష్టమవుతుంది. అందువలన ప్రకృతిలో సాధారణంగా మూడు లేదా నాలుగు స్థాయిలలో ఆహార గొలుసులు ముగుస్తాయి.

ప్రశ్న 6.
ఉత్పత్తిదారుల నుండి వినియోగదారులకు వెళ్ళే కొద్దీ జీవుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది?
జవాబు:
ఆహారపు గొలుసులో స్థాయి పెరిగే కొలది శక్తి ప్రసరణ తగ్గుతుంది. సరిపడిన శక్తి కొరకు వినియోగదారులు, అధిక సంఖ్యలో వాటి కింది జీవులను ఆహారంగా తీసుకోవలసి ఉంటుంది. అందువలన ఆహార కొరత ఏర్పడి, అగ్రశ్రేణి మాంసాహారుల సంఖ్య తక్కువగా ఉంటుంది.

కావున ఆహారపు గొలుసులో ఉత్పత్తిదారుల కంటే వినియోగదారుల సంఖ్య తక్కువగా ఉంటుంది.

10th Class Biology Textbook Page No. 211

ప్రశ్న 7.
a) కింద ఇవ్వబడిన ఆహారపు గొలుసులకు సంఖ్యాపిరమిడ్లను గీయండి.
1) మర్రిచెట్టు → కీటకాలు → వడ్రంగి పిట్ట
2) గడ్డి → కుందేలు → తోడేలు
జవాబు:
AP Board 10th Class Biology Solutions 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత 7

b) పై రెండు ఆహారపు గొలుసుల సంఖ్యాపిరమిడ్ల నిర్మాణం ఒకే విధంగా ఉందా?
జవాబు:
రెండు ఆహారపు గొలుసుల సంఖ్యాపిరమిడ్ ఒకే విధంగా లేదు.

c) వ్యత్యాసాలేమైనా ఉన్నాయా? ఉంటే అవి ఏమిటి?
జవాబు:
మొదటి ఆహారపు గొలుసు సంఖ్యాపిరమిడ్ శంఖు ఆకారంలో ఉంటే, రెండవ ఆహారపుగొలుసు సంఖ్యాపిరమిడ్ త్రిభుజాకారంగా ఉంది. ఈ మొదటి ఆహారపు గొలుసులో ఉత్పత్తిదారుల సంఖ్య తక్కువ (ఒక్కటి) కావున పిరమిడ్ శీర్షాభిముఖంగా ప్రారంభమైంది. అగ్రభాగాన వినియోగదారులు, ప్రాథమిక వినియోగదారులు (కీటకాలు) సంఖ్య కంటే తగ్గుట వలన పిరమిడ్ శంఖు ఆకారంలోనికి వచ్చింది. రెండవ ఆహార గొలుసులో జీవుల సంఖ్య క్రమేణ తగ్గుట వలన పిరమిడ్ ఊర్వాభిముఖంగా ఉంది.

AP Board 10th Class Biology Solutions 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత

10th Class Biology Textbook Page No. 212

ప్రశ్న 8.
పిరమిడ్లు ఎప్పుడూ శీర్షాభిముఖంగానే ఉంటాయి. ఎందుకు?
జవాబు:
సాధారణంగా ఆవరణ వ్యవస్థలో జీవుల సంబంధాలను, మూడు పిరమిడ్స్ రూపంలో చూస్తాము. అవి.

  1. సంఖ్యాపిరమిడ్
  2. జీవద్రవ్యరాశి పిరమిడ్
  3. శక్తిపిరమిడ్.

1. సంఖ్యాపిరమిడ్ :
దీని అడుగు భాగాన ఉత్పత్తిదారులు ఉండి, వాటి పైన వినియోగదారులు ఉంటాయి. సాధారణంగా వినియోగదారులకంటే ఉత్పత్తిదారుల సంఖ్య అధికంగా ఉంటుంది. కావున సంఖ్యాపిరమిడ్ శీరాభిముఖంగానే ఉంటుంది.

2. జీవద్రవ్యరాశి పిరమిడ్ :
ఆహారపు గొలుసులో ముందుకు ప్రయాణించే కొలది శక్తి క్షీణిస్తుంది. కావున వాటి జీవ ద్రవ్యరాశి కూడా తగ్గుతూ పోతుంది. కావున ఈ పిరమిడ్ శీర్షాభిముఖంగా ఉంటుంది.

3. శక్తిపిరమిడ్ :
ఆహారపు గొలుసులో ప్రతిస్థాయి వద్ద శక్తి నష్టం 80-90% ఉంటుంది. కావున ఆహారపు గొలుసులో పైకి వెళుతున్న కొలది శక్తి క్షీణిస్తుంది. కావున ఈ పిరమిడ్ శీర్షాభిముఖంగా ఉంటుంది.

కానీ అన్ని సందర్భాలలో పిరమిడ్లు శీర్షాభిముఖంగా ఉండవు. సంఖ్యాపిరమిడ్, జీవద్రవ్యరాశి పిరమిడ్ ఒకేసారి తలకిందులుగా ఉంటాయి. కానీ శక్తి పిరమిడ్ మాత్రం ఎల్లప్పుడూ నిటారుగా ఉంటుంది.

10th Class Biology Textbook Page No. 216

ప్రశ్న 9.
AP Board 10th Class Biology Solutions 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత 8
పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

1) ఏ సంవత్సరంలో సరస్సులో నీరు విస్తరించిన ప్రదేశం ఎక్కువగా ఉంది? ఎందుకు?
జవాబు:
1967 సంవత్సరంలో సరస్సు నీటి విస్తీర్ణం అధికంగా ఉంది. ఎందుకంటే అప్పటికి సరస్సు ఆక్రమణలకు గురి కాలేదు. సరస్సులో పూడిక పేరుకోలేదు.

2) సరస్సులో దట్టంగా కలుపు పెరగడానికి కారణం ఏమిటని నీవు భావిస్తున్నావు?
జవాబు:
అధిక పోషక కలుషితాలు నీటిలో చేరటం వలన సరస్సులో దట్టంగా కలుపు పెరిగింది.

3) సరస్సు వైశాల్యం తగ్గిపోవడానికి కారణాలు ఏమిటి?
జవాబు:
సరస్సు వైశాల్యం తగ్గటానికి

  1. ఆక్రమణలు
  2. పంట భూములుగా మార్చటం
  3. రొయ్యల చెరువుల సాగు
  4. కలుషితాల వలన కలుపు మొక్కలు పెరగటం వంటి కారణాలు ఉన్నాయి.

4) పై కారణాలు కాలుష్యానికి దారితీస్తాయని చెప్పవచ్చా? ఎందుకు?
జవాబు:
ఈ కారణాలలో పంట భూములు, రొయ్యల సాగు వంటి కారణాలు సరస్సు నీటిని కలుషితం చేస్తాయి. పంట భూములకు చేసే రసాయనిక ఎరువులు, రొయ్యల చెరువు నుండి వచ్చే పోషక విలువలు కలిగిన నీరు, కలుపు మొక్కల పెరుగుదలకు తోడ్పడుతుంది.

5) కొల్లేరుకు సుదూర ప్రాంతాల నుండి పక్షులు వలస రావడానికి కారణాలు ఏమిటి?
జవాబు:
కొల్లేరు సరస్సు అధిక విస్తీర్ణం కలిగిన మంచినీటి ఆవాసం, కావున పక్షులకు ఇక్కడ ఆహారం పుష్కలంగా లభిస్తుంది. ఇక్కడకు వచ్చే పక్షులు చాలా వరకు వలస పక్షులు. అక్కడి వేసవి పరిస్థితులను తప్పించుకోవటానికి, ఇక్కడకు వస్తాయి. విదేశాలలో వేసవికాల ప్రారంభంలో మనకు శీతాకాలం ప్రారంభమవటం వలసపక్షుల రాకకు ప్రధాన కారణం.

6) సరస్సు కాలుష్యానికి గురైన ముప్పును ఏ విధంగా కనుగొన్నారు?
జవాబు:
ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా, సరస్సును ఫోటోలు తీసి, సరస్సు ఆక్రమణలను గుర్తించారు. కలుపు మొక్కల విపరీత పెరుగుదలను బట్టి కాలుష్య ముప్పును గుర్తించారు.

7) సరస్సులో కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి?
జవాబు:
మానవ సంబంధ కార్యకలాపాలను సరస్సు పరివాహక ప్రాంతంలో నియంత్రించాలి.
(లేదా)
– చేపలు, రొయ్యల చెరువులను సరస్సు పరివాహక ప్రాంతంలో తొలగించాలి.
(లేదా)
– సరస్సు పరివాహక ప్రాంతంలో వ్యవసాయ కార్యకలాపాలను చట్టప్రకారం తగ్గించాలి.

10th Class Biology Textbook Page No. 217& 218

ప్రశ్న 10.
AP Board 10th Class Biology Solutions 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత 9
పై పట్టికను పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
1) వలస పక్షుల మీద ప్రభావం చూపించే అంశాలు ఏమిటి?
జవాబు:
చేపల పెంపకం వలన వాటి రక్షణ పెరిగి, పక్షుల ఆహార కొరత ఏర్పడుతుంది. అందువలన వలస పక్షుల సంఖ్య తగ్గుతుంది.

2) భౌతిక సమస్యలకు, జీవ సంబంధ సమస్యలకు మధ్య ఏదైనా సంబంధం ఉందని నీవు భావిస్తున్నావా? అవి ఏమిటి?
జవాబు:
భౌతిక సమస్యలైన మేట వేయడం, వరదలు వంటి కారకాలు జీవులపై ప్రభావం చూపుతాయి. మేట వేయడం వలన సరస్సు విస్తీర్ణం తగ్గి జీవుల సంఖ్య తగ్గుతుంది. వరదల వలన చేపలు, కొట్టుకుపోయి, కలుషిత నీరు చేరి, మరణించటం జరుగుతుంది.

3) రసాయనిక సమస్యలు ఏర్పడడానికి కారణాలు ఏమై ఉంటాయి?
జవాబు:
వ్యవసాయంలో వాడే రసాయనిక ఎరువులు, పరిశ్రమల వ్యర్థ జలాల కలయిక వలన రసాయన సమస్యలు ఏర్పడుతున్నాయి.

4) నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతే ఏమవుతుంది?
జవాబు:
నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణం తగ్గితే, జలచర జీవులకు ఆక్సిజన్ అందక మరణిస్తాయి. ఇవి కుళ్ళిపోయి జల ఆవాసాన్ని మరింత కలుషితం చేస్తాయి.

5) మురికిగా, పోషక పదార్థాలు కలిగి ఉన్న నీటికి జైవిక ఆక్సిజన్ డిమాండ్ (Biological Oxygen Demand) ఎక్కువా? తక్కువా? తద్వారా కలిగే ప్రభావం ఏమిటి?
జవాబు:
మురికి, పోషక పదార్థాలు కలిగిన నీటికి (Biological Oxygen Demand) ఎక్కువ. అందువలన జలచరాలకు ఆక్సిజన్ కొరత ఏర్పడి అవి మరణించే ప్రమాదం ఉంది.

6) కొల్లేరు పరీవాహక ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులకు గురవడానికి కారణాలు ఏమిటి?
జవాబు:
సరస్సు నీరు కలుషితం కావటం వలన కొల్లేరు పరీవాహక ప్రాంత ప్రజలు అనేక వ్యాధులకు గురైనారు. డయేరియా వంటి రోగాలు బాగా విస్తరించాయి. తాగునీటి సమస్య ఏర్పడింది.

7) పక్షుల వలసపై కాలుష్యం ఎలాంటి ప్రభావం కలిగించిందని నీవు భావిస్తున్నావు?
జవాబు:
సరస్సు కలుషితం కావటం వలన వలస పక్షుల సంఖ్య గణణీయంగా తగ్గే అవకాశం ఉంది. పక్షులకు ఆహార కొరతతో పాటు, జీవనానికి పరిసరాలు సౌకర్యంగా ఉండవు. అందువలన వలస పక్షుల సంఖ్య తగ్గుతుంది.

10th Class Biology Textbook Page No. 219

ప్రశ్న 11.
మీకు తెలిసిన, మీరు విన్న ఏదైనా రెండు కీటక నాశనుల, శిలీంద్రనాశకాల పేర్లు తెలపండి.
జవాబు:

  1. నువాక్రాన్
  2. ఎండోసల్ఫాన్ వంటి కీటక నాశనులు, ఈగిల్ – 20 EW, మిల్ స్టాప్, స్పెక్టేటర్స్ వంటి శిలీంధ్ర నాశనులు మా ప్రాంతంలో విరివిగా వాడుతున్నారు.

AP Board 10th Class Biology Solutions 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 12.
మీరు క్రిములు, శిలీంధ్రాల నుండి ఆహారపు గింజలు, ధాన్యాలను సంరక్షించుకోవడానికి ఇంట్లో ఏ విధంగా నిలువ చేస్తారు?
జవాబు:

  1. ఆహార గింజలు, ధాన్యాల పరిరక్షణకు గ్రామీణ ప్రాంతాలలో ‘పురి’, గోదాము వంటివి నిర్మించి నిల్వ చేస్తారు.
  2. పట్టణ ప్రాంతాలలో రైతులకు ‘కోల్డ్ స్టోరేజీ’ లు అందుబాటులో ఉండుటవలన ధాన్యాల సంరక్షణ సులభమౌతుంది.
  3. ఇంటిలో ధాన్యాలను సంరక్షించటానికి, ‘వాస్పరిన్’ ‘జింక్ ఫాస్ఫేట్’ వంటి రసాయనాలు వాడి ధాన్యాన్ని నిల్వచేస్తాను. ఇవి ధాన్యాన్ని ఎలుకలు, కీటకాల నుండి రక్షిస్తాయి.
  4. నిల్వ చేసే ధాన్యాన్ని బాగా ఆరబెట్టుట వలన తేమ శాతం తగ్గి, శిలీంధ్రాల పెరుగుదలను అరికడతాను.

10th Class Biology Textbook Page No. 221

ప్రశ్న 13.
నీటి వనరులలోకి ఎక్కడి నుండి కలుషితాలు వచ్చి చేరుతున్నాయి? ,
జవాబు:
వ్యవసాయ భూముల నుండి వస్తున్న నీరు అధిక మోతాదులలో రసాయనాలను కలిగి ఉంటున్నాయి. పరిశ్రమల వ్యర్థాలను నిర్లక్ష్యంగా పారవేయటం వలన నీటి వనరులు కలుషితమవుతున్నాయి.

ప్రశ్న 14.
నీటిలో నివసించే చేపల శరీరాలలోకి భారలోహాలు ఎలా చేరుతున్నాయి?
జవాబు:
చేపలు, కాడ్మియం వంటి భారలోహాలు సున్నితత్వం కలిగి ఉంటాయి. దానితో కాడ్మియం సులభంగా చేపల్లోకి చేరిపోతుంది. అంతేకాక సీసం, కాడ్మియం, ఫెర్రస్, పాదరసం వంటి భారలోహాలను అధికంగా కలిగి ఉన్న పరిశ్రమల వ్యర్థాలు నీటిలో కలవడం వల్ల చేపల శరీరంలోనికి భారలోహాలు చేరుతున్నాయి.

ప్రశ్న 15.
పరిశోధకులు నీటిలో కాలుష్య పరిమాణం వర్షాకాలంలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు కదా! ఇది ఎందుకు జరుగుతుందని నీవు భావిస్తున్నావు?
జవాబు:
వర్షాకాలంలో వర్షాలు కురవటం వలన వరదలు ఏర్పడతాయి. ఈ వరద నీటిలోనికి రకరకాల కలుషితాలు చేరి, జలావాసాలను చేరతాయి. భూమిపై పారేసిన అనేక ఘన, వ్యర్ధ కలుషితాలు వరద నీటి ద్వారా జలావాసాలను చేరి కలుషితం చేస్తున్నాయి.

AP Board 10th Class Biology Solutions 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత

ప్రశ్న 16.
కలుషిత నీటిలో దొరికే చేపలను తినడం వలన ప్రజలు అనేక వ్యాధులకు గురికావడానికి కారణం ఏమిటి?
జవాబు:
పరిశ్రమల వ్యర్థాల వలన అనేక భారలోహాలు నీటిని చేరి, చేపల శరీరంలోనికి ప్రవేశిస్తున్నాయి. వీటిని మనుషులు తినటం వలన, భారలోహాలు మానవ శరీరంలో సాంద్రీకరణ చెంది రోగాలను కలిగిస్తున్నాయి. ఈ ప్రక్రియను “జైవిక వృద్ధీకరణ” అంటారు.

10th Class Biology Textbook Page No. 223

ప్రశ్న 17.
‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’ అనే అంశాన్ని చదివి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
జవాబు:
1) ఏ ఆహారపు గొలుసు గురించి పైన చర్చించడం జరిగింది.
జవాబు:
మొక్కల ధాన్యం → కీటకాలు → పిచ్చుక అనే ఆహారపు గొలుసు పైన చర్చించడం జరిగింది.

2) పంటపొలాలలోని ఆహారపు గొలుసును, ఈ ఉద్యమం ఏ విధంగా ఆటంకపరిచింది?
జవాబు:
ఉద్యమంలా పిచ్చుకలను నిర్మూలించటం వలన కీటకాల సంఖ్య విపరీతంగా పెరిగింది.

3) ఈ అవరోధాలు పర్యావరణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయి?
జవాబు:
కీటకాలు విపరీతంగా పెరిగి పంట పొలాలపై దాడిచేయటం వలన ఆహార దిగుబడి గణనీయంగా తగ్గింది.

4) ఆవరణ వ్యవస్థలో ఒక జీవిని చంపడం భావ్యమేనా? ఇది ఏ విధంగా ప్రమాదం కలిగించింది?
జవాబు:
ఆవరణ వ్యవస్థలో ఒక జీవిని చంపటం, లేదా తొలగించటం భావ్యం కాదు. ఇది ఇతర జీవుల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రకృతి సమతాస్థితిని దెబ్బతీస్తుంది.

5) వాస్తవానికి పిచ్చుకలే బాధ్యులా? పంట దిగుబడి తగ్గదానికి సరైన కారణం ఏమిటి?
జవాబు:
పంట దిగుబడి తగ్గటానికి సరైన కారణం పిచ్చుకలు కాదు. ఒకే నేలలో పంటలను మార్చకుండా పండించటం వలన పోషకాలు తగ్గి, పంట దిగుబడి తగ్గుతుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం కూడా పంటదిగుబడి తగ్గుదలకు కారణం.

6) శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారు? తప్పును సరిదిద్దుకునే విధంగా సహాయపడగలిగారా? ఎందుకలా చేయలేకపోయారు?
జవాబు:
శాస్త్రవేత్తలు చనిపోయిన పిచ్చుకల జీర్ణవ్యవస్థను పరిశీలించినపుడు వాటిలో కేవలం 1వంతు మాత్రమే ధాన్యం ఉంది. మూడు వంతులు పంటను పాడుచేసే కీటకాలు ఉన్నాయి. కావున పంట దిగుబడికి పిచ్చుకలు కారణం కాదని తేల్చారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పిచ్చుకల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది.

7) మానవ చర్యలు పర్యావరణం మీద ఏ విధమైన ప్రభావాన్ని కలిగిస్తున్నాయి?
జవాబు:
మానవ చర్యలు పర్యావరణం మీద తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. విచక్షణారహితంగా వాడుతున్న ఎరువులు పరిశ్రమల వ్యర్థాలు, ప్లాస్టిక్ వినియోగాలు, ఆవరణ వ్యవస్థను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. దీనివలన కొన్ని జీవజాతులు అంతరించే ప్రమాదానికి చేరుకున్నాయి.

8) ఇలాంటి విపత్తులు సంభవించకుండా, నీవు ఎలాంటి సలహాలు ఇస్తావు?
జవాబు:
ఇలాంటి విపత్తులు సంభవించకుండా ఉండాలంటే మానవుడు పర్యావరణానికి నష్టం కలిగించే చర్యలు మానుకోవాలి. పర్యావరణాన్ని రక్షించే చర్యలు చేపట్టాలి. దీనికి మనవంతు కృషిచేయాలి.

10th Class Biology 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

మీ పరిసరాలలో ఉన్న ఏదైనా (నీటి) ఆవరణ వ్యవస్థను పరిశీలించండి. అందులో ఉండే వివిధ ఆహారపు గొలుసులు, ఆహార జాలాలను గురించి 5 ది వరషీట్ ఆధారంగా నివేదిక రాయండి.
వర్క్ షీట్

జట్టుసభ్యుల పేర్లు : వివేక్, లిఖిత, తేది : మార్చి – 2

ఆవరణ వ్యవస్థ పేరు : చెరువు ఆవరణవ్యవస్థ
భౌగోళిక స్వరూపం (టోపోగ్రఫీ) :
AP Board 10th Class Biology Solutions 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత 11

గుర్తించిన ఉత్పత్తిదారులు మొక్కల పేర్లు / సంఖ్య : నాచు, నీటి మొక్కలు, వ్యక్త ప్లవకాలు
గుర్తించిన జంతువుల పేర్లు /సంఖ్యలో : చేపలు, పీతలు, కొంగలు, నత్తలు, వడ్రంగిపిట్ట, నీటికోడి
గుర్తించిన వినియోగదారుల పేర్లు /సంఖ్య : ………………………………………
శాకాహారులు (ప్రాథమిక వినియోగదారులు) : చేపలు, జంతుప్లవకాలు
మాంసాహారులు (ద్వితీయ వినియోగదారులు) : కొంగలు, నీటి కోడి
ఉన్నతస్థాయి మాంసాహారులు (తృతీయ వినియోగదారులు) : మానవుడు

వాటి మధ్యగల ఆహార సంబంధాలు, అలవాట్లు : చేపలను తింటూ చాలా పక్షులు జీవనం సాగిస్తున్నాయి.
ఆహారపు గొలుసు పటం : నీటి మొక్కలు → జంతుప్లవకాలు → చేపలు → కొంగ → మానవుడు

ఆహారజాలం పటం:
ఆవరణ వ్యవస్థలో నిర్జీవ అంశాలు : గాలి, నీరు, సూర్యరశ్ని, నేల స్వభావం, నీటి లవణాలు

ఆవరణ వ్యవస్థకు ఏవైనా ప్రమాదాలు పొంచి ఉన్నాయా? అవి ఏమిటి?
ఆక్రమణకు గురి అవుతున్నది. పూడిక పెరుగుతున్నది.
AP Board 10th Class Biology Solutions 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత 10

పరిష్కారాలు సూచించండి :

  1. చెరువు ఆక్రమణలను అరికట్టాలి.
  2. ప్రతి సంవత్సరం పూడిక తీయించాలి.
  3. పంట పొలాల నీరు చెరువులోకి చేరి రసాయన కలుషితాలు చేరకుండా నిరోధించాలి.
  4. చెరువు ప్రాధాన్యతపై ప్రజలలో అవగాహన పెంచాలి.
  5. చెరువు గట్లపై మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలి.

సరైన సమాధానాన్ని గుర్తించండి

1. ఆహారపు గొలుసు దేనితో మొదలవుతుంది?
A) శాకాహారి
B) మాంసాహారి
C) ఉత్పత్తిదారు
D) ఏదీకాదు
జవాబు:
C) ఉత్పత్తిదారు

2. దేనికోసం మొక్కలు పోటీపడవు?
A) నీరు
B) ఆహారం
C) స్థలం
D) పైవన్నీ
జవాబు:
B) ఆహారం

3. క్రిమిసంహారకాల వాడకాన్ని పూర్తిగా ఆపివేయడం అంటే
A) పురుగుమందుల వాడకంపై నియంత్రణ
B) పురుగుమందుల నిషేధం
C) పర్యావరణ స్నేహపూర్వక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం
D) జీవరసాయనాల పరిశ్రమలను మూసివేయించడం
జవాబు:
C) పర్యావరణ స్నేహపూర్వక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం

AP Board 10th Class Biology Solutions 9th Lesson మన పర్యావరణం – మన బాధ్యత

4. చార్లెస్ ఎలాన్ ప్రకారం కింది వానిలో సరైన వాక్యం
A) మాంసాహారులు పిరమిడ్ శిఖరభాగంలో ఉంటాయి.
B) పిరమిడ్ శిఖరభాగంలో ఎక్కువ శక్తి గ్రహించబడుతుంది.
C) పిరమిడ్ శిఖరభాగంలో ఉత్పత్తిదారులు ఉండవు
D) A మరియు C
జవాబు:
D) A మరియు C

AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

SCERT AP 10th Class Biology Study Material 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Biology 8th Lesson Questions and Answers అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

10th Class Biology 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కొత్త లక్షణాలు ఎలా ఉత్పన్నమవుతాయి?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తిలో జన్యుపదార్థాల కలయిక వలన కొత్త లక్షణాలు ఉత్పన్నమవుతాయి.

ప్రశ్న 2.
పరిణామంలో కొత్త లక్షణాలు తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వస్తాయా?
జవాబు:
పరిణామక్రమంలో జన్యు సంబంధ లక్షణాలు వారసత్వంగా వస్తాయి. జీవి సంపాదించిన కొన్ని లక్షణాలు (ఆర్జిత లక్షణాలు) వారసత్వంగా సంక్రమించవు.

ప్రశ్న 3.
పరిణామంలో కొత్త లక్షణాల పాత్ర ఏమైనా ఉంటుందా?
జవాబు:
పరిణామంలో కొత్త లక్షణాలు కీలకపాత్ర వహిస్తాయి. ఇవి జీవి మనుగడకు, అనుకూలనాలు రూపొందించుకోవటానికి, క్రొత్త జాతులు ఏర్పడటానికి తోడ్పడతాయి.

ప్రశ్న 4.
వైవిధ్యాలు అంటే ఏమిటి? జీవులకు వైవిధ్యాలు ఏ విధంగా ఉపయోగపడతాయి? (AS1)
జవాబు:
జీవుల మధ్య భేదాలను వైవిధ్యాలు అంటారు. చాలా దగ్గర సంబంధం కలిగిన జీవులలోనూ వైవిధ్యాలు కనిపిస్తాయి. వర్గీకరణలో పైకి పోయేకొలది జీవుల మధ్య వైవిధ్యాలు పెరుగుతుంటాయి.

వైవిధ్యాల ఉపయోగం :

  1. జీవుల మధ్యగల వైవిధ్యాల వలన వాటిని గుర్తించటానికి తోడ్పడతాయి.
  2. వైవిధ్యాలు కొత్త జాతుల ఆవిర్భావానికి దారితీస్తాయి.
  3. జీవపరిణామానికి వైవిధ్యాలు ముడిపదార్థాలు. వీటి వలనే జీవపరిణామం కొనసాగుతుంది.
  4. శాస్త్రవేత్తలు వర్గీకరణ విధానంలో వైవిధ్యాలను పరిగణలోనికి తీసుకొంటారు.
  5. ఎక్కువసార్లు వైవిధ్యాలు జీవులకు లాభదాయకంగా ఉండి మనుగడకు తోడ్పడతాయి.

AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 5.
ఒక విద్యార్థి (పరిశోధకుడు) శుద్ద పొడవు మొక్క (TT) ను శుద్ద పొట్టి మొక్క (tt) తో సంకరణం జరపాలనుకొన్నాడు. మరి F1 F2 తరాలలో ఎలాంటి మొక్కలు వచ్చే అవకాశం ఉంది? వివరించండి. (AS1)
జవాబు:
శుద్ధ పొడవు మొక్క (TT) ను శుద్ధ పొట్టి మొక్క (tt) తో సంకరణం చేయగా

F1 తరం :
F2 తరంలో అన్నీ పొడవు మొక్కలు వస్తాయి. కానీ ఇవి సమయుగ్మజాలు కావు. పొట్టి లక్షణ కారకం వీటిలో అంతర్గతంగా ఉంటుంది. ఇవన్నీ విషమయుగ్మజాలు (Tt).
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 1

F2 తరం :
ఈ విషమయుగ్మజ మొక్కలకు స్వపరాగ సంపర్కం జరిపితే F2 తరం మొక్కలు వస్తాయి.
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 2

  1. ఈ మొక్కలలో మూడవ వంతు మొక్కలు పొడవుగా ఉండగా, ఒక వంతు మొక్కలు పొట్టిగా ఉన్నాయి. కావున వీటి దృశ్యరూపాన్ని 3 :1 గా భావించవచ్చు.
  2. వీటి జన్యు రూపాలను పరిశీలిస్తే ఒక వంతు సమయుగ్మజ పొడవు మొక్కలు (TT), రెండు వంతులు విషమయుగ్మజ పొడవు మొక్కలు (Tt), ఒక వంతు సమయుగ్మజ పొట్టి మొక్కలు (1) ఉన్నాయి.

కావున వీటి జన్యురూప నిష్పత్తిని 1:2:1 గా నిర్ధారించవచ్చు.

ప్రశ్న 6.
ఒక శాస్త్రవేత్త జనకతరంలోని ఎలుకల తోకలను కత్తిరించాడు. మరి ఎలుకల సంతతిలో తోకలుంటాయా? ఉండవా? మీ అభిప్రాయాన్ని వివరించండి. (AS1)
జవాబు:

  1. జనకతరంలో తోకలు కత్తిరించబడిన లక్షణం తరువాత తరానికి అందించబడదు. కావున వాటి సంతతి ఎలుకలు తోకను కలిగి ఉంటాయి.
  2. జీవి శరీరంలో వచ్చిన ఈ మార్పులు తన జీవిత కాలంలో సంపాదించుకొన్నవి. ఇటువంటి లక్షణాలను ‘ఆర్జిత లక్షణాలు’ అంటారు.
  3. ఈ ఆరిత లకణాలు అనువంశికంగా సంక్రమించవని ‘వీస్మస్’ ఎలుక తోకల ప్రయోగంతో నిరూపించాడు.
  4. కేవలం, బీజకణాల జన్యుపదార్థంలోని మార్పులు మాత్రమే అనువంశికంగా సంక్రమిస్తాయి.

ప్రశ్న 7.
ఒక మామిడితోటలో ఒక రైతు మామిడి పండ్లు బాగా కాసిన చెట్టునొకదాన్ని చూశాడు. కానీ దానికి తెగుళ్లు, ఉండటం, క్రిమిసంహారక మందులను వాడినట్లు పరిశీలించాడు. అలాగే మరో మామిడి చెట్టును చూశాడు. దానికి క్రిమిసంహారకాలను ఉపయోగించలేదు. కానీ తక్కువ మామిడిపండ్లను కలిగి ఉన్నది. అయితే ఆ రైతు ఎక్కువ మామిడిపండ్లనిచ్చే, క్రిమిసంహారకాలు వాడనవసరం లేని చెట్లుంటే బాగుంటుందని అనుకున్నాడు. మరి ఆ రైతు కోరుకున్న ప్రకారం ఒక కొత్త మామిడి చెట్టును సృష్టించవచ్చా? ఏ విధంగా సాధ్యమవుతుందో వివరించండి. (AS1)
జవాబు:

  1. రైతు కోరుకున్న ప్రకారం కొత్త మామిడి చెట్టును సృష్టించవచ్చు. ఈ సందర్భంలో రైతు, అధిక ఫలాలను ఇచ్చే మంచి లక్షణాన్ని ఒక చెట్టు నుండి, వ్యాధి నిరోధకత కలిగిన మంచి లక్షణాన్ని మరొక చెట్టు నుండి కోరుకుంటున్నాడు.
  2. రెండు వేరు వేరు జీవులలోని మంచి లక్షణాలను ఒక మొక్కలోనికి తీసుకురావటానికి సంకరణం ఒక మంచి పద్దతి.
  3. ఈ ప్రక్రియలో ఒక మొక్క నుండి సేకరించిన పరాగరేణువులను మరొక మొక్క కీలాగ్రానికి చేర్చి పరపరాగ సంపర్కం చేస్తారు.
  4. ఫలితంగా వచ్చే తరం రెండింటి లక్షణాలు కలిగి కొత్త లక్షణాలు గల మొక్కగా రూపొందుతుంది.
  5. అంటే అధిక ఫలసాయం, వ్యాధినిరోధకత కలిగిన కొత్త రకం మొక్క ఏర్పడుతుంది.

AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 8.
ఏక సంకర సంకరీకరణం ప్రయోగాన్ని ఒక ఉదాహరణతో వివరించండి. అనువంశికతా సూత్రాలలో దేనిని మనం అర్థం చేసుకోవచ్చు? వివరించండి. (AS1)
జవాబు:
ఏక సంకర సంకరీకరణం :
ఒక లక్షణం ఆధారంగా నిర్వహించిన సంకరణ ప్రయోగాన్ని ఏక సంకర సంకరీకరణం అంటారు.

ఉదాహరణ :
మెండల్ బఠానీ గింజ రంగు అనే లక్షణం ఆధారంగా ఏకసంకరణ ప్రయోగం చేశాడు. ఈ ప్రయోగంలో పసుపు (YY), ఆకుపచ్చ (y) వంటి శుద్దజాతుల బఠానీ మొక్కల మధ్య పరపరాగ చేయగా
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 3

  1. మొదటి తరం (F1) లో అన్నీ పసుపు రంగు గింజలే ఏర్పడినవి.
  2. F2 తరం మొక్కలలో ఆత్మపరాగ సంపర్కం జరపగా, మూడు వంతులు పసుపు రంగు గింజలు కలిగిన మొక్కలు, ఒక వంతు ఆకుపచ్చ రంగు కలిగిన విత్తన మొక్కలు ఏర్పడ్డాయి. అంటే వాటి దృశ్య రూప నిష్పత్తి 3 : 1.

నిర్ధారణ :
(F) తరంలో బయటపడిన ఆకుపచ్చ రంగు (1) లక్షణం F1 తరంలో కనిపించలేదు. అంటే F1 తరంలో ఆకుపచ్చరంగు కలిగించే జన్యువు ఆధిపత్యం చేసింది. దీనినే బహిర్గత సూత్రం (Law of Dominance) అంటారు.

బహిర్గత సూత్రం :
ఒక లక్షణానికి కారణమైన రెండు వేరు వేరు కారకాలు (విషమయుగ్మజం) ఉన్నా వాటిలో ఒకటి మాత్రమే సంతతిలో బహిర్గతమౌతుంది. మరొకటి అంతర్గతంగా ఉండిపోతుంది. దీనినే ‘బహిర్గత సూత్రం’ అంటారు.

ప్రశ్న 9.
స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అంటే ఏమిటి? ఒక ఉదాహరణతో వివరించండి. (AS1)
జవాబు:
ఏ లక్షణానికైనా కారణమైన రెండు కారకాలు (యుగ వికల్పకాలు) ఒక్కొక్కటి ఒక్కో జనకుడి నుండి (తల్లి, తండ్రి) సంతతికి లభిస్తాయి. అయితే జనకుల యుగ్మవికల్పకాలలో ఏదో ఒక కారకం యథేచ్చగా (Random) సంతతికి అందించటం జరుగుతుంది.

దీనినే పృథక్కరణ లేదా అలీనత సూత్రం (Law of Segregation) అని కూడా అంటారు.

ఉదాహరణ :
మెండల్ తన ద్విసంకరణ ప్రయోగం ద్వారా స్వతంత్ర జన్యువ్యూహన సిద్ధాంతం ప్రతిపాదించాడు. ఈ ప్రయోగం నందు రెండు రకాల శుద్ధ సమయుగ్మజ మొక్కల విత్తనాలు తీసుకొన్నాడు. అవి 1. గుండ్రని పసుపు రకానికి (RY) చెందినవి. 2. ముడతలు ఆకుపచ్చ రకానికి చెందినవి (ry). వీటి మధ్య సంకరణం జరపగా

F1 తరం :
మొదటి తరంలోని మొక్కలు అన్నీ గుండ్రని పసుపు విత్తనాలే వచ్చాయి. ఎందుకంటే పసుపు (1), గుండ్రని (R) రెండు లక్షణాలు బహిర్గత లక్షణాలు కాబట్టి.

AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 4
F2 తరం :
F1 తరం మొక్కలను ఆత్మపరాగ సంపర్కం జరపగా

  1. గుండ్రని పసుపు విత్తనాలు గల మొక్కలు : 9
  2. ముడతలు పడిన పసుపు విత్తనాలు : 3
  3. గుండ్రని ఆకుపచ్చని విత్తనాలు : 3
  4. ముడతలు పడిన ఆకుపచ్చని విత్తనాలు : 1 ఏర్పడ్డాయి. అంటే వీటి దృశ్యరూప నిష్పత్తి 9:3:3:1.

నిర్ధారణ :
రంగు, ఆకారం నిర్ణయించే కారకాలు F1 తరంలో చేరేటప్పుడు దేనికవి స్వతంత్రంగా వ్యవహ రించటం వలన నాలుగు రకాల మొక్కలు ఏర్పడటానికి అవకాశం కుదిరింది. దీనినిబట్టి యుగ్మ వికల్పకాలలోని జన్యువులు (కారకాలు) సంక్రమణం చెందేటప్పుడు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. దీనినే ‘స్వతంత్ర జన్యువ్యూహన సిద్ధాంతం’ (Law of Segregation) అంటారు.

ప్రశ్న 10.
మానవులలో లింగ నిర్ధారణ ఎలా చోటు చేసుకుంటుంది? ఉదాహరణతో వివరించండి. (AS1)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 5

  1. ప్రతీ మానవ కణంలో 23 జతల (46) క్రోమోజోమ్ లుంటాయి. వానిలో 22 జతలను శారీరక క్రోమోజోమ్ (Autosomes) అనీ, మిగిలిన ఒక జతను లైంగిక క్రోమోజోమ్ లు (Allosomes or sex chromo somes) అనీ అంటారు.
  2. లైంగిక క్రోమోజోమ్లు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి (X) మరియు రెండవది (Y). ఈ రెండు క్రోమోజోమ్లు లింగ నిర్ధారణ చేస్తాయి.
  3. ఆడవారిలో రెండు XX క్రోమోజోమ్లుంటాయి. మగవారిలో XY క్రోమోజోమ్లుంటాయి.
  4. స్త్రీ సంయోగబీజాల (అండం) లో ఒకే ఒక X క్రోమోజోమ్ ఉంటుంది.
  5. పురుష సంయోగబీజాలలో (శుక్రకణాల్లో) రెండు రకాలుంటాయి. X క్రోమోజోమ్ ను కలిగినవి, Y క్రోమోజోమ్ ను కలిగినవి.
  6. X క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం, X క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిస్తే ఫలదీకరణ జరిగి XX క్రోమోజోమ్ లు గల అమ్మాయి అవుతుంది.
  7. Y క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం, X క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిస్తే ఫలదీకరణ జరిగి XY క్రోమోజోమ్ లు గల అబ్బాయి అవుతాడు.

ప్రశ్న 11.
డార్విన్ యొక్క ‘ప్రకృతివరణం’ సిద్ధాంతాన్ని ఒక ఉదాహరణతో వివరించండి. (AS1)
జవాబు:
ప్రకృతివరణ సిద్ధాంతాన్ని ‘చార్లెస్ డార్విన్’ ప్రతిపాదించాడు. దీని ప్రకారం ప్రకృతి మాత్రమే ఒక జీవి మనుగడ సాగించాలా లేక నశించాలా అని నిర్ణయిస్తుంది. ఏ జీవి మనుగడకు అవసరమైన లక్షణాలు కలిగి ఉంటాయో అవి మాత్రమే ప్రకృతిలో జీవించగలిగి మిగిలినవి మరణిస్తాయి. దీనిని ‘ప్రకృతి వరణం’ (Natural Selection) అంటారు.

ఉదా : ఒక కుందేలుకు పుట్టిన ఐదు పిల్లలలో మూడు వేగంగా పరిగెత్తే ధర్మం కలిగి ఉన్నాయి. రెండు వేగంగా పరిగెత్తలేవు. శత్రువు దాడి చేసినపుడు వేగంగా పరిగెత్తే కుందేళ్లు తప్పించుకొని జీవించగలుగుతాయి. పరిగెత్తలేనివి మరణిస్తాయి.

ఈ సందర్భంలో వేగంగా పరిగెత్తటం వాటి మనుగడకు తోడ్పడింది. ఈ అనుకూలనం ఉన్న జీవులను ప్రకృతి మనుగడకు ఎన్నిక చేసింది.

AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 12.
వైవిధ్యాలు అంటే ఏమిటి? సరైన ఉదాహరణతో వివరించండి. (AS1)
జవాబు:
జీవుల మధ్యగల భేదాలను వైవిధ్యాలు అంటారు. ప్రతి రెండు జీవుల మధ్య వైవిధ్యాలు ఉంటాయి. ఈ వైవిధ్యాలు ఒక జాతి జీవుల మధ్య తక్కువగాను, వర్గీకరణ పైకి పోల్చిన కొలది వైవిధ్యాలు అధికంగాను ఉంటాయి. ఉదా : మన చుట్టూ ఉన్న మనుషులలో ఏ ఇద్దరూ ఒకే రకంగా ఉండరు. వారి మధ్య స్పష్టమైన తేడాలు ఉంటాయి. ఈ తేడాలను వైవిధ్యాలు అంటారు. ఒకే కుటుంబం వారిలో కొన్ని పోలికలు ఉంటాయి కావున వైవిధ్యాలు తక్కువగా ఉంటాయి. వేరే కుటుంబ సభ్యులతో పోల్చితే వైవిధ్యాలు అధికంగా కనిపిస్తాయి.

ప్రశ్న 13.
సాధారణంగా ఆవుల్లో మీరు పరిశీలించిన వైవిధ్యాలు ఏమిటి? (AS1)
జవాబు:
రెండు ఆవులను పరిశీలించినపుడు
1. కొమ్ములు :
ఒకదాని కొమ్ములు పొట్టిగా, లావుగా ఉంటే, మరొకదాని కొమ్ములు పొడవుగా ఉన్నాయి.

2. రంగు :
ఒక ఆవు పూర్తిగా తెల్లగా ఉంటే, మరొక ఆవు అక్కడక్కడ ఎర్ర మచ్చలతో ఉంది.

3. ఎత్తు :
ఒక ఆవు ఎత్తు ఎక్కువగా ఉంటే, మరొకటి కొంచెం తక్కువ ఎత్తులో ఉంది.

4. పరిమాణం :
ఒక ఆవు ఎత్తు బలంగా, లావుగా ఉంటే, మరొకటి బక్క పల్చగా ఉంది.

5. కళ్లు :
ఒక ఆవు కళ్లు గుండ్రంగా పెద్దవిగా ఉంటే, మరొకదాని కళ్లు చిన్నవిగా ఉన్నాయి.

6. పొదుగు :
ఒక ఆవు పొదుగు పెద్దదిగా ఉంటే, మరొక ఆవు పొదుగు చిన్నదిగా ఉన్నది.

7. వీపు :
ఒక ఆవు వీపు బల్లపరుపుగా, చదునుగా ఉంటే, మరొక ఆవు వీపు ఎత్తుగా ఉంది.

8. కాలిగిట్టలు:
ఒక ఆవు కాలిగిట్టలు పొడవుగా ఉంటే, మరొక ఆవు కాలిగిట్టలు గుండ్రంగా ఉన్నాయి.

ప్రశ్న 14.
మెండల్, బరానీ మొక్కలోని ఏయే లక్షణాలను ప్రయోగాల కోసమై ఎన్నుకున్నాడు? (AS1)
జవాబు:

లక్షణం బహిర్గత లక్షణం అంతర్గత లక్షణం
1. పువ్వు రంగు నీలి ఎరుపు తెలుపు
2. పువ్వు స్థానం గ్రీవస్థం శిఖరస్థం
3. విత్తనం రంగు పసుపు ఆకుపచ్చ
4. విత్తనం ఆకారం గుండ్రనివి ముడతలు గలవి
5. ఫలం ఆకారం నునుపైనవి నొక్కులు గలవి
6. ఫలం రంగు ఆకుపచ్చ పసుపు
7. కాండం పొడవు పొడవు పొట్టి

ప్రయోగాల కోసం మెండల్ ఎన్నుకున్న ముఖ్య లక్షణాలు :
1. పరిపక్వ విత్తనాల ఆకారంలో తేడాలను గుర్తించుటకు – విత్తనాలు గుండ్రంగా ఉన్నాయా లేదా ముడతలు కలిగి ఉన్నాయా అని పరిశీలించి, గుండ్రని మరియు ముడతలు గల వాటిని ఎంచుకున్నాడు.

2. బీజదళాలు లేదా అంకురచ్చదం రంగులో తేడాలను గుర్తించుటకు – విత్తన బీజదళాలు లేదా అంకురచ్ఛదం పాలిపోయిన పసుపు, ప్రకాశవంతమైన పసుపు మరియు ఆరెంజ్ రంగుతోగాని, ఆకుపచ్చ రంగుతో ఉన్నవి ఉన్నాయి. రంగుల్లో ఈ భేదం చూడగానే కనిపిస్తుంది. ఎందుకంటే విత్తన కవచం పారదర్శకంగా ఉంటుంది కాబట్టి.

3. వితన కవచం రంగులో తేడాను గుర్తించుట- విత్తన కవచం తెల్లగా (తెల్ల పూలు ఉన్న వానిలో) బూడిద, లేత బూడిద, ముదురు గోధుమరంగు నీలి చుక్కలు గల / లేకుండా (ధ్వజం ఊదా రంగులో, రెక్కలు నీలం, ఎరుపు కలిసిన రంగులో గల పూలున్న వానిలో) ఉంటాయి. బూడిద విత్తన కవచం గల గింజలను మరిగే నీటిలో వేస్తే అవి గాఢమైన గోధుమ వర్ణంలోకి మారుతాయి.

4. పరిపక్వ ఫలం యొక్క ఆకారంలో తేడాలు గుర్తించుట- పరిపక్వ ఫలం నిండుగా లేదా నునుపుగా మరియు నొక్కులు కలిగిగాని ఉంటుంది. నొక్కులు కలిగిన ఫలంలో గింజల మధ్యలో నొక్కులున్నందున లోపల గింజలు ముడతలుపడి ఉంటాయి.

5. అపరిపక్వ ఫలం యొక్క రంగుల్లో తేడాలు గుర్తించుటకు – అపరిపక్వ ఫలాలు ఉంటే లేత నుంచి ముదురు ఆకుపచ్చ లేదా పసుపురంగులో ఉంటాయి.

6. పుష్పాల స్థానంలో తేడాలు గుర్తించుటకు-గ్రీవస్థం లేదా శిఖరస్థం. పుష్పాలు గ్రీవాలలో ఉంటే కాండం పొడవునా గ్రీవాలలో ఉంటాయి. ఒకవేళ శిఖరస్థం అయితే శాఖల చివరలో అన్యత గుచ్చంగా, గుత్తులుగా ఉంటాయి. ఆ మొక్కల కాండం చివరి భాగం అడ్డుకోతను గమనిస్తే వెడల్పుగా మారినట్లు చూడవచ్చు.

7. కాండం పొడవులో భేదం గుర్తించుటకు- కాండం పొడవు వేర్వేరు రకాలుగా ఉంటుంది (కానీ ప్రతి మొక్కకు పొడవు స్థిర లక్షణమై ఉంటుంది).

ప్రశ్న 15.
మెండల్ ‘లక్షణాంశాలు’ (traits) అనే పదాన్ని ఏ విధంగా ఉపయోగించాడు? ఒక ఉదాహరణతో వివరించండి. (AS1)
జవాబు:
1. మెండల్ లక్షణాంశాలు (traits) అనే పదాన్ని, లక్షణాలు కలిగించే కారకాలుగా ఉపయోగించాడు.
2. ఈ కారకాంశములనే నేడు మనం “జన్యువులు’ అని పిలుస్తున్నాము. అనువంశికతకు ఇవి మూలకారణాలు.

3. మెండల్ ప్రకారం లక్షణాంశాలు :

  1. లక్షణాలను నిర్ణయిస్తాయి.
  2. ఒక లక్షణానికి ఒక జత కారకాలు ఉంటాయి.
  3. జనకతరం నుండి తరువాత తరానికి అందుతాయి.
  4. ఒకేరకమైన లక్షణాంశములు ఆ జాతి మిగిలిన జీవులలో కూడా ఉంటాయి.

ఉదా : ఒక పొడవు బఠానీ మొక్కను పరిశీలిస్తే
1. పొడవు లక్షణం కలిగించే కారకాలు ఒక జత ఉంటాయి.
2. పొడవు మొక్క సంతతి పొడవుగా ఉంటుంది. అంటే పొడవు లక్షణ కారకం తరువాత తరానికి అందించబడింది.
3. పొడవు మొక్కలన్నింటిలోనూ ఇటువంటి కారకాలు ఉంటాయి.
4. ఇదే విధంగా బఠానీ మొక్కలోని ప్రతి లక్షణానికి ఒక జత ‘లక్షణాంశాలు’ ఉంటాయి.

ప్రశ్న 16.
జనకతరం, F1 తరాల మధ్య మెండల్ గుర్తించిన భేదాలు ఏమిటి? (AS1)
జవాబు:

జనకతరం F2 తరం
1) ఇది లక్షణాల పరంగా శుద్ధమైనవి. 1) ఇవి మిశ్రమ లక్షణాలు కల్గి ఉండవచ్చు.
2) జన్యుపరంగా సమయుగ్మ స్థితిలో ఉంటాయి. 2) సమయుగ్మజం మరియు విషమయుగ్మజాలు ఏర్పడతాయి.
3) నిర్దిష్ట లక్షణాలు కల్గి ఉంటాయి. 3) సంకరణ తేజం వలన మెరుగైన మిశ్రమ లక్షణాలు రావచ్చు.
4) జన్యురూపం, దృశ్యరూప నిష్పత్తులు ఒకే విధంగా ఉంటాయి. 4) దృశ్యరూప నిష్పత్తి జన్యురూప నిష్పత్తి కంటే విభిన్నంగా ఉంటుంది.
5) అనువంశికత అధ్యయనంలో మొదటితరం జీవులు. 5) ఇవి F1 తరం నుండి ఏర్పడే రెండవ తరం జీవులు.
6) ఆత్మపరాగ సంపర్కం వలన ఒకే రకమైన అవే జీవులు ఏర్పడతాయి. (సమయుగ్మజాలు) 6) ఆత్మపరాగ సంపర్కం వలన అంతర్గత జన్యువులు బయట పడతాయి (విషమయుగ్మజాలు)
7) దృశ్యరూప నిష్పత్తి : 1 : 1
జన్యురూప నిష్పత్తి : 1 : 1
7) దృశ్యరూప నిష్పత్తి : 3 : 1
జన్యురూప నిష్పత్తి : 1 :  2 : 1

ప్రశ్న 17.
శిశువు లింగ నిర్ధారణకు కారణం మగవారే. దీనిని అంగీకరిస్తావా? మీ సమాధానాన్ని ఫ్లోచార్టు ద్వారా వివరించంది. (AS1)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 6

  1. శిశువు నిర్ధారణకు మగవారే కారణము అని అంగీకరిస్తాను.
  2. మగవారు XY అనే లింగ నిర్ధారణ క్రోమోజోమ్స్ కలిగి ఉంటారు.
  3. ఆడవారు XX అనే లింగ నిర్ధారణ క్రోమోజోమ్స్ కలిగి ఉంటారు.
  4. కావున పురుష సంయోగబీజాలు X లేదా Y క్రోమోజోమ్స్ కలిగి ఉంటే, స్త్రీ సంయోగబీజాలు మాత్రం X క్రోమోజోమ్స్ కలిగి ఉంటాయి.
  5. స్త్రీ సంయోగబీజం (1)తో పురుష X క్రోమోజోమ్ కలిగిన సంయోగబీజం కలిస్తే సంయుక్తబీజం XX క్రోమోజోమ్స్ కలిగి ఆడశిశువు ఏర్పడుతుంది.
  6. స్త్రీ సంయోగబీజం (1) తో పురుష Y క్రోమోజోమ్ కలిగిన సంయోగబీజం కలిస్తే సంయుక్తబీజం XY క్రోమోజోమ్స్ కలిగి మగశిశువు ఏర్పడుతుంది.
  7. దీనిని బట్టి ఆడ, మగ వ్యత్యాసం స్త్రీ సంయోగబీజంతో కలిసే పురుష సంయోగబీజంపై ఆధారపడి ఉంటుంది. అంటే లింగ నిర్ధారణకు మగవారే కారణం.

ప్రశ్న 18.
సమరూప, అనురూప అవయవాలను గురించి క్లుప్తంగా వివరించండి. (AS1)
(లేదా)
నిర్మాణ సామ్య అవయవాలు అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
సమరూప (లేదా) నిర్మాణ సామ్య అవయవాలు :
ఒకే రకమైన ప్రాథమిక నిర్మాణం కలిగి వేరు వేరు విధులను నిర్వర్తించే అవయవాలను సమరూప అవయవాలు అంటారు.
ఉదా :
తిమింగలంలోని వాజాలు – ఈదడానికి
గబ్బిలం రెక్కలు – ఎగరడానికి
చిరుత ముందరి కాళ్ళు – పరుగెత్తడానికి
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 7

అనురూప లేదా క్రియాసామ్య అవయవాలు :
ఒకే రకమైన విధులను నిర్వర్తిస్తూ, వేరు వేరు నిర్మాణాలను కలిగిన అవయవాలను అనురూప లేదా క్రియాసామ్య అవయవాలు అంటారు.
ఉదా :
పక్షి రెక్కలు – ఎగురుటకు
గబ్బిలం రెక్కలు – ఎగురుటకు

ప్రశ్న 19.
శిలాజాలకు సంబంధించిన సమాచారాన్ని శాస్త్రవేత్తలు ఎలా ఉపయోగిస్తారు? (AS1)
జవాబు:

  1. శిలాజాల అధ్యయనాన్ని “పురాజీవశాస్త్రం” (Palaeontology) అంటారు .
  2. శిలాజాలపై పరిశోధన చేసే శాస్త్రవేత్తలను “జియాలజిస్టు ” (Geologists) అంటారు.
  3. జియాలజిస్టు శిలాజాలను అధ్యయనం చేసి…..
    1. గత కాలంలో జీవించిన జీవుల వివరాలు తెలుపుతారు.
    2. అంతరించిపోయిన జీవ జాతుల గురించి తెలుపుతారు.
    3. జీవ పరిణామ క్రమం గురించి నిదర్శనాలు చూపుతారు.
    4. ఒకప్పటి భూమి మీద జీవన పరిస్థితులు వివరిస్తారు.
    5. మానవ ఆవిర్భావక్రమము తెలుపుతారు.
    6. రెండు వర్గాల జీవుల మధ్యగల సంబంధాలను తెలుపుతారు.
    7. జీవులు అంతరించిపోవటానికి గల కారణాలు తెలుపుతారు.
    8. సంధాన సేతువుల ద్వారా వర్గవికాసక్రమాన్ని వివరిస్తారు.

ప్రశ్న 20.
మెండల్ తన ప్రయోగాల కోసం బఠానీ మొక్కను ఎన్నుకున్నాడు. అందుకు గల కారణాలు ఏమై ఉంటాయని మీరు భావిస్తున్నారు? (AS2)
జవాబు:
మెండల్ తన ప్రయోగాల కోసం బఠానీ మొక్కను ఎన్నుకోవటానికి గల కారణాలు :
1. బఠానీ అధిక వైవిధ్యాలు కలిగిన మొక్క :
మెండల్ తన ప్రయోగాల కోసం దాదాపు ఏడు విభిన్న లక్షణాలను ఎన్నుకున్నాడు. ఇవన్నీ స్పష్టంగా ఉండి పరిశీలించటానికి అనువుగా ఉన్నాయి. ఉదా : పువ్వురంగు, పువ్వుస్థానం.

2. బఠానీ ద్విలింగ పుష్పం కలిగిన మొక్క :
కావున ఇది పరపరాగ సంపర్కం, ఆత్మపరాగ సంపర్కం జరపటానికి వీలుగా ఉంటుంది.

3. పుష్ప నిర్మాణం :
పుష్పంలో కేసరావళి, అండకోశం పెద్దవిగా ఉండుట వలన పరాగ సంపర్కం సులభం.

4. బఠానీ మొక్క ఏకవార్షికం :
కావున ప్రయోగ ఫలితాలు త్వరగా తెలుస్తాయి. తక్కువ కాలంలో ఎక్కువ ప్రయోగాలు నిర్వహించవచ్చు.

AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 21.
లామార్క్ ప్రతిపాదించిన ఆర్జిత గుణాల అనువంశికతా సూత్రం ఒకవేళ సరైనదే అయితే ప్రపంచం ఎలా ఉండేది? (AS2)
జవాబు:
లామార్క్ ప్రతిపాదించిన ఆర్జిత గుణాల అనువంశికత సూత్రం సరైనది కాదు. ఇది సరైనది అయితే ఒక జీవి జీవితకాలంలో పొందిన మార్పులు తరువాత తరానికి అందుతాయి.

  1. కాళ్లు, చేతులు లేనివారికి కాళ్లు, చేతులు లేని పిల్లలే పుడతారు.
  2. ఆడవాళ్లు ముక్కు చెవులు కుట్టించుకుంటారు. లామార్క్ సూత్రం నిజమైతే, పుట్టే పిల్లలకు ముక్కు, చెవులు కుట్టిన పిల్లలు పుడతారు.
  3. ఎండలో పనిచేసే రైతులు, శ్రామికులు నల్లని చర్మం కలిగి ఉంటారు. వారి పిల్లలందరూ నల్లగానే పుడతారు.
  4. మనిషి తన జీవితంలో అనేక నైపుణ్యాలు సంపాదిస్తాడు. లామార్క్ సూత్రం ప్రకారం ఈ నైపుణ్యాలన్నీ పిల్లలకి చేరతాయి. అంటే ఏ శిక్షణా లేకుండానే పెయింటర్ కొడుకు పెయింట్ వేస్తాడు, శిల్పి కొడుకు శిల్పాలు చెక్కుతాడు.
  5. ఒక వ్యక్తి జిమ్ కి వెళ్ళి దారుడ్య దేహం సంపాదిస్తే అతని సంతతి దారుడ్య దేహంతో పుడతారు. కానీ ఇవన్నీ అసాధ్యాలు.

ప్రశ్న 22.
మీ పరిసరాలలో పెరిగే పూలమొక్కలను పరిశీలించండి. వాటి మధ్య పోలివున్న, వేరువేరుగా ఉన్న లక్షణాలను గుర్తించి రాయండి. (AS3)
జవాబు:
మా పరిసరాలలో పెరిగే ప్రధాన పూలమొక్కలు మల్లి, మందార.
భేదాలు :

మల్లి మందార
1. పుష్పం తెలుపురంగులో ఉంటుంది. 1. పుష్పం ఎరుపురంగులో ఉంటుంది.
2. పరిమాణం చిన్నదిగా ఉండును. 2. పరిమాణం పెద్దదిగా ఉండును.
3. సువాసన కలిగి ఉంటుంది. 3. వాసన ఉండదు.
4. ఆకర్షకపత్రాలు చిన్నవి. 4. ఆకర్షకపత్రాలు పెద్దవి.
5. కేసరావళి విడిగా ఉంటాయి. 5. కేసరావళి కీలానికి అంటి ఉన్నాయి.
6. కీలాగ్రం శాఖారహితంగా ఉంది. 6. కీలాగ్రం ఐదు శాఖలుగా చీలి ఉంది.
7. రాత్రిపూట వికసిస్తాయి. 7. పగలు వికసిస్తాయి.
8. రక్షకపత్రాలు చిన్నవి. 8. రక్షకపత్రాలు పెద్దవి.

పోలికలు :

  1. మల్లి, మందార రెండూ కూడా ద్విలింగ పుష్పాలు,
  2. ఈ రెండు పుష్పాలు సంపూర్ణ పుష్పాలు.

ప్రశ్న 23.
మీ కుటుంబ సభ్యుల అనువంశికతా సూత్రం లక్షణాలు/ గుణాలను గురించిన సమాచారాన్ని సేకరించండి. సమాచారాన్ని విశ్లేషించి రాయండి. (AS4)
జవాబు:

  1. నా పేరు గోపి. మా నాన్న ఆరు అడుగుల ఎత్తుతో శారీరకంగా దృఢంగా ఉన్నారు. మా తాత కూడా బాగా ఎత్తు ఉండి దృఢంగా ఉండేవాడని చెప్పారు. దీనినిబట్టి ఎత్తు, శారీరక దృఢత్వం అనువంశికంగా సంక్రమించాయని భావిస్తున్నాను. నేను కూడా భవిష్యత్ లో ఎత్తుగా, దృఢంగా పెరుగుతాను.
  2. మా అమ్మ జుట్టు పొడవుగా, నునుపుగా ఉంటుంది. మా నాన్న జుట్టు ఒత్తుగా, ఉంగరాలు తిరిగి ఉంటుంది. మా చెల్లెలు మా అమ్మలా పొడవైన జుట్టు కలిగి ఉంది. మా నాన్నలా నేను ఉంగరాల జుట్టు కలిగి ఉన్నాను. ఈ లక్షణం మా తల్లిదండ్రుల నుండి సంక్రమణ చెందిందని భావిస్తున్నాను.
  3. మా అమ్మ మంచి రంగుతో ఉండగా, మా నాన్న రంగు తక్కువగా ఉంటాడు. నేను మా అమ్మలా మంచి రంగు కలిగి ఉండగా, మా పెద్ద అన్నయ్య నాన్న వలె తక్కువ రంగుతో ఉన్నాడు. కావున రంగు లక్షణంగా నేను మా అమ్మ నుండి పొందితే, మా అన్నయ్య నాన్న నుండి పొందాడు.
  4. నా ముక్కు మొనతేలి పొడవుగా ఉంటుంది. మా అమ్మ నీది అచ్చము ‘మీ తాత ముక్కు’ అంటుంది. కానీ ఇటువంటి ముక్కు మా నాన్నకు కాని, అమ్మకు కాని లేదు. ఈ లక్షణం మా తాత నుండి, నాన్న ద్వారా నాకు సంక్రమించిందని భావిస్తున్నాను.

ప్రశ్న 24.
జీవ పరిణామ నిదర్శనాలకు సంబంధించిన కింది సమాచారంపై మీ అభిప్రాయాన్ని రాయండి.
“పక్షులు, సరీసృపాలు, ఉభయచరాల మాదిరిగానే క్షీరదాలు నాలుగు కాళ్లు కలిగి ఉన్నాయి. వీటన్నింటిలో పూర్వాంగాల” నిర్మాణం ఒకే విధంగా ఉన్నప్పటికి అవి చేయాల్సిన పనులకు అనుగుణంగా అవయవాలు రూపాంతరం చెందాయి. (AS4)
జవాబు:

  1. ఒకే రకమైన నిర్మాణం కలిగిన జీవులు ఒకే పూర్వపు జీవి నుండి పరిణామం చెంది ఉంటాయి.
  2. ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాల ముందు కాళ్ల నిర్మాణం ఒకే రకంగా ఉంది. అంటే ఈ జీవులు ఒకే రకమైన జీవి నుండి పరిణామం చెందాయి.
  3. పరిణామక్రమంలో జీవులు వివిధ పరిసరాలకు అలవాటుపడటం వలన వాటి జీవన విధానానికి తగినట్టు, ముందు కాళ్లు మార్పు చెందాయి.
  4. కప్పలలో దుమకటానికి, సరీసృపాలలో పాకటానికి, పక్షులలో ఎగరటానికి, క్షీరదాలలో నడవటానికి అనుగుణంగా ముందరి కాళ్లు మార్పు చెంది జీవన అనుకూలనాలు పొందాయి.
  5. అయినప్పటికి ఇవన్నీ ఒకే జీవి నుండి పరిణితి చెందాయని వాటి నిర్మాణం ఆధారంగా నిర్ణయించవచ్చు.

ప్రశ్న 25.
“కార్బన్ డేటింగ్ పద్దతి” గురించిన సమాచారాన్ని సేకరించండి. భౌతిక శాస్త్రాన్ని బోధించే ఉపాధ్యాయులతో ఈ విషయమై ఏమేమి చర్చించారో రాయండి. (AS4)
జవాబు:

  1. శిలాజాల వయస్సును నిర్ధారించటానికి పురాజీవ శాస్త్రవేత్తలు ‘కార్బన్ డేటింగ్ పద్ధతి’ అనే ప్రక్రియను ఉపయోగిస్తారు.
  2. సాధారణ కార్బన్ 6C12 గా ఉండగా, కార్బన్ ఐసోటోప్ 6C14 గా ఉంటుంది.
  3. 6C14 కార్బన్ ఐసోటోప్ రేడియోధార్మిక స్వభావం కలిగి విఘటనం చెందుతూ ఉంటుంది.
  4. ఒక గ్రాము పదార్థం విఘటనం చెంది అరగ్రాము పదార్థంగా మారటానికి పట్టే కాలాన్ని ‘అర్జజీవిత కాలు’ అంటారు.
  5. లభించిన శిలాజంలో సాధారణ కార్బన్, ఐసోటోప్ కార్బన్ నిష్పత్తిని గణించి, మిగిలిన ఐసోటోప్ కార్బన్ ఆధారంగా శిలాజం ఎంత కాలం నాటిదో అంచనా వేస్తారు.
  6. శిలాజాల వయస్సును నిర్ణయించే ప్రక్రియను ‘కార్బన్ డేటింగ్ పద్దతి’ అంటారు.
  7. ఇది ఒక రేడియోమెట్రిక్ డేటింగ్ పద్దతి. ఈ ప్రక్రియలో 58,000-62,000 సం||రాల నుండి నేటి వరకు శిలాజ వయస్సు నిర్ణయించవచ్చు.
  8. ఈ ప్రక్రియను “విల్లర్డ్ లిల్లి” 1949 సం||లో కనిపెట్టి నోబెల్ బహుమతిని పొందాడు.
  9. ఈ ప్రక్రియ ద్వారా సముద్ర గర్భ శిలాజాలను, ఈజిప్ట్ మమ్మీల వయస్సును నిర్ధారించగలిగినారు.
  10. పురాజీవ శాస్త్రంలో ఇది ఒక కీలక ప్రక్రియ.

ప్రశ్న 26.
స్వంతత్ర వ్యూహన సిద్ధాంతాన్ని చూపే గదుల చిత్రాన్ని బట్టి ఒక ఫ్లోచార్టును గీయండి. నిష్పత్తిని వివరించండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 8

ప్రశ్న 27.
మెండల్ ప్రయోగాలలోని ఏక సంకర సంకరణం జరిపే విధానాన్ని గురించి గళ్ల చదరాన్ని గీసి వివరించండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 3

  1. మెండల్ తన ఏక సంకరణ ప్రయోగానికి శుద్ధవంశపు పొడవు (TT), పొట్టి (tt) మొక్కలను ఎన్నుకొన్నాడు.
  2. వాటి సంకరణం వలన F, తరం ఏర్పడింది. ఇవన్నీ పొడవుగా ఉన్నాయి. అంటే పొట్టి లక్షణం అంతర్గతం.
  3. F1 తరం మొక్కల మధ్య ఆత్మ పరాగ సంపర్కం జరపగా F2 తరం లభించింది.
  4. F2 తరంలో మూడు వంతులు పొడవు మొక్కలు, ఒక వంతు పొట్టి మొక్కలు ఏర్పడ్డాయి. అంటే వీటి దృశ్యరూప నిష్పత్తి 3:1, మరియు జన్యురూప నిష్పత్తిని 1:2:1 గా నిర్ధారించాడు.

ప్రశ్న 28.
గడిచిపోయిన జీవ మహాయుగాలలో మానవ పరిణామం ఎలా జరిగిందో తెలిపేందుకు ఒక చార్టును తయారు చేయండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 9
ఎప్స్ — రామాపిథికస్ + ఆస్ట్రియోపిథికస్ – + హెూమోఎరక్టస్ + నియాండర్ఆల్ + సూమో సెపియన్

ప్రశ్న 29.
ప్రకృతి ఉపయోగకరమైన లక్షణాలను మాత్రమే ప్రోత్సహిస్తుందని తెలియజేసేలా ఒక కార్టూను తయారుచేయండి. (AS6)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 10

ప్రశ్న 30.
‘మనుగడ కోసం పోరాటం’ను అర్థం చేసుకోవటానికి మీ పరిసరాలలోని ఏయే ఉదాహరణలను లేదా ఏయే సందర్భాలను మీరు పరిశీలించారు? (AS7)
జవాబు:
మనుగడ కోసం పోరాటాన్ని మన నిత్యజీవితంలో అనేక సందర్భాలలో పరిశీలిస్తాము.

ఉదాహరణ 1 :
ఒక కుండీలో అధిక విత్తనాలు పోసినపుడు అవి నేల, నీరు, సూర్యరశ్మి కోసం తీవ్రంగా పోటీపడతాయి. ఈ పోటీలో సరైన అనుకూలనాలు కలిగిన, సమర్థవంతమైన విత్తనాలు మాత్రమే పోటీని తట్టుకొని మొలకెత్తుతాయి.

ఉదాహరణ 2 :
మా బజారులో వీధి కుక్కలు ఐదు ఉన్నాయి. ఎవరైనా అన్నం పారేసినపుడు ఆ ఐదు కుక్కలూ గుమికూడి కొట్లాడుకుంటాయి. వాటిలో బలంగా ఉన్న కుక్క మిగిలిన వాటిని పారద్రోలి ఆహారం సంపాదించుకొంటుంది.

ఉదాహరణ 3 :
మా క్లాసులో 40 మంది విద్యార్థులం ఉన్నాము. అందరం బాగా చదువుతాము. మొదటి ర్యాంకు కొరకు పోటీపడతాము. కానీ ఒక్కడే మొదటి ర్యాంక్ పొంది స్కూల్ లీడర్‌గా ఎన్నిక అవుతాడు.

ఉదాహరణ 4 :
మా పట్టణంలో ఒకే బజారున అనేక బట్టల షాపులు ఉన్నాయి. వారి మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. వారిలో ఎవరైతే వినియోగదారుల్ని ఆకర్షించగలరో వారు మాత్రమే లాభదాయక వ్యాపారం చేయగలరు.

ప్రశ్న 31.
మానవ పరిణామం గురించి స్వగతం తయారుచేయండి. (AS7)
జవాబు:
భూమి మీద అత్యున్నత మేధాసంపత్తి గల జీవిగా పిలవబడే మానవుడు అను నేను అన్ని సాధారణ జీవులవలె పరిణామం చెంది ఈ స్థాయికి వచ్చానంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆదిమానవుని వలె 7 లక్షల 50 వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైన నా పరిణామం వేడు నన్ను అగ్రస్థాయిలో నిలిపింది. మొదట ‘హోమో హెబిలస్’ గా పిలవబడిన నేను మిగిలిన ప్రేమేట్స్ మాదిరిగా ఒక జంతువుగా అడవిలో సంచరించటం ప్రారంభించాను. ఇది సుమారు 1.6 నుండి 2.5 మిలియన్ సంవత్సరాల క్రితం మాట.

తరువాత నేను చింపాంజి, గొరిల్లాల వలె కాకుండా నిటారుగా నిలబడటం నేర్చుకొన్నాను. ఇది నా జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన. దీనివలన నా రెండు చేతులు ఉపయోగంలోకి వచ్చాయి. అప్పుడు నన్ను ‘హోమో ఎరెక్టస్’ అన్నారు. తరువాత జంతువులతో వేరైన నేను మనిషిగా అడుగులు వేశాను. సంఘజీవనం స్థాపించాను. నన్ను అపుడు ‘నియాండర్తలెన్సిస్’ గా పిలిచారు. తరువాత 12.5 లక్షల సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఇపుడు ఆధుని మానవుడిగా ‘ హోమో సెపియన్’గా పిలవబడుతూ, నా ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాను.

10th Class Biology 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు Textbook InText Questions and Answers

10th Class Biology Textbook Page No. 177

ప్రశ్న 1.
ఎన్ని లక్షణాలలో నీవు నీ తల్లిదండ్రులను పోలి ఉన్నావు?
జవాబు:
రంగు, ముఖం, ఆకారం, జుత్తు, కళ్ళు వంటి లక్షణాలలో నేను నా తల్లిదండ్రులను పోలి ఉన్నాను.

ప్రశ్న 2.
మీ తల్లిదండ్రుల ఇరువురిలో లేకుండా నీలో మాత్రమే కనిపిస్తున్న పోలికలు ఏమైనా ఉన్నాయా? అని ఏమిటి?
జవాబు:
ఉన్నాయి. నా చెవి తమ్మెలు, ఆకారం నా తల్లిదండ్రులలో ఎవరికి లేవు.

AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

ప్రశ్న 3.
అవి ఎక్కడి నుండి వచ్చి ఉంటాయని నీవు భావిస్తున్నావు?
జవాబు:
ఈ లక్షణం మా తాత నుండి నాన్న ద్వారా నాకు సంక్రమించిందని భావిస్తున్నాను.

10th Class Biology Textbook Page No. 178

ప్రశ్న 4.
వైవిధ్యాలన్నీ గుర్తించగలిగేలా ఉంటాయా?
జవాబు:
కొన్ని వైవిధ్యాలు చాలా సూక్ష్మంగా ఉండి గుర్తించటానికి వీలుగా ఉండవు. పెద్ద పరిమాణంలో ఉండే వైవిధ్యాలు గుర్తించడానికి వీలుగా ఉంటాయి.

10th Class Biology Textbook Page No. 189

ప్రశ్న 5.
X క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం, X క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిసి ఫలదీకరణం జరిగితే ఏమి జరుగుతుంది?
జవాబు:
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 17
X క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం, X క్రోమ్ జోమ్ ఉన్న అండంతో కలిసి ఫలదీకరణం జరిగితే XX క్రోమోజోములతో ఏర్పడిన అమ్మాయి పుడుతుంది.

ప్రశ్న 6.
శిశువు లింగ నిర్ధారణ చేసేది అమ్మానాన్నలలో ఎవరు?
జవాబు:
శిశువు లింగనిర్ధారణ చేసేది నాన్న.

ప్రశ్న 7.
ఆడపిల్ల పుట్టిందని స్త్రీని నిందించడం సరైనదేనా?
జవాబు:
సరికాదు.

ప్రశ్న 8.
లింగం అనేది ఒక లక్షణమా? గుణమా? దీనికి మెండల్ ప్రతిపాదించిన బహిర్గతత్వ సూత్రం వర్తిస్తుందా?
జవాబు:
లింగం అనేది ఒక లక్షణము లేదా గుణము. దీనికి “మెండల్” ప్రతిపాదించిన బహిర్గతత్వ సూత్రం వర్తిస్తుంది.

ప్రశ్న 9.
మనలో ఉన్న లక్షణాలన్నీ మన తల్లిదండ్రులను పోలి ఉంటాయా?
జవాబు:
మనలో ఉన్న లక్షణాలన్నీ మన తల్లిదండ్రులను పోలి ఉండవు.

10th Class Biology Textbook Page No. 197

ప్రశ్న 10.
కప్ప టాడ్ పోల్ డింభకం. కప్ప కన్నా ఎక్కువగా చేపను పోలి ఉంటుంది. ఇది దేనిని సూచిస్తుంది? అంటే చేపల నుండి కప్పలు పరిణామక్రమం ఫలితంగా ఏర్పడ్డాయని భావించవచ్చా?
జవాబు:

  1. జీవులు తమ పిండాభివృద్ధిలో తమ పూర్వీకుల లక్షణాలను ప్రదర్శిస్తాయి.
  2. జీవుల పిండాభివృద్ధిని పరిశీలించి వాటి పూర్వీకులను అంచనా వేయవచ్చు.
  3. కప్ప టార్పాల్ డింభకం ఎక్కువగా చేపను పోలి ఉంటుంది.
  4. దీనినిబట్టి కప్పలు (ఉభయచరాలు) చేపల నుండి ఏర్పడ్డాయని నిర్ధారించవచ్చు.

ప్రశ్న 11.
సుప్రసిద్ధ పిండాభివృద్ధి శాస్త్రవేత్త అయినా తొలిదశలో ఉన్న ఒక పిండాన్ని వేరొకదాని నుండి వేరుగా గుర్తించటం కష్టం. ఈ విషయం ఏమి తెలియజేస్తుంది?
జవాబు:

  1. జీవుల పిండాభివృద్ధిలో పిండాలన్నీ ఒకే విధంగా ఉండుటవలన పిండాభివృద్ధి శాస్త్రవేత్తలు వాటిని గుర్తించలేరు.
  2. దీనినిబట్టి జీవులన్నీ ఒకేరకమైన ఉమ్మడి జీవి నుండి పరిణామం చెందాయని నిర్ధారించవచ్చు.
  3. జీవులలోని ఈ ఐక్యతా నిదర్శనం పరిణామవాదానికి బలమిస్తుంది.

ప్రశ్న 12.
ప్రతిజీవి జీవితచరిత్ర పూర్వీకుల నిర్మాణాత్మక లక్షణాలను ప్రదర్శిస్తోందా?
జవాబు:
ప్రతిజీవి జీవిత అభివృద్ధి దశలో తన పూర్వీకుల ‘లక్షణాలను ప్రదర్శిస్తుంది. దీనినిబట్టి, నేడు మనం చూస్తున్న జీవులు, ఇంతకు ముందు ఉన్న జీవుల పరిణామ ఫలితం అని నిర్ధారించవచ్చు. పరిణామానికి పిండాభివృద్ధి ఒక నిదర్శనం.

10th Class Biology Textbook Page No. 199

ప్రశ్న 13.
ఆర్కియోప్టెరిక్స్ అనే సంధాన సేతువు దేనిని పోలి ఉంటుంది? పక్షులనా లేక సరీసృపాలనా?
జవాబు:
ఆర్కియోప్టెరిక్స్ ఒక శిలాజము. దీని లక్షణాలు పరిశీలించినపుడు, అది సరీసృపాలు, పక్షుల రెండింటి లక్షణాలను కలిగి ఉంది. కావున దీనిని సరీసృపాలకు, పక్షులకు సంధాన సేతువులా భావిస్తారు. సరీసృపాల నుండి పక్షులు పరిణామం చెందాయని చెప్పటానికి ఆర్టియోప్టెరిక్స్ ఒక శిలాజ నిదర్శనం.

ఆర్కియోప్టెరిక్స్ పొడవైన తోక, పొలుసులు వంటి సరీసృపాల లక్షణాలను, ఈకలు, దంతాలు కలిగిన దవడలు, రెక్కలు వంటి పక్షుల లక్షణాలను కలిగి ఉంది.

ప్రశ్న 14.
ఒక అడవిలో రెండు రకాలైన జింకలు ఉన్నాయనుకుందాం. ఒక రకం చాలా వేగంగా పరుగెత్తగలవు. కానీ రెండవ రకం అంత వేగంగా పరుగెత్తలేవు. సింహాలు, పులులు, జింకలను వేటాడి ఆహారంగా తీసుకొంటాయి. మరి ఏ రకం జింకలు మనుగడ సాగిస్తాయో ఊహించండి. ఏ రకం జింకల జనాభా క్రమంగా అనువంశికత తగ్గిపోతుంది? ఎందుకు?
జవాబు:

  1. సింహాలు, జింకలను వేటాడినపుడు వేగంగా పరిగెత్తేవి తప్పించుకొని జీవించగలుగుతాయి.
  2. వేగంగా పరిగెత్తలేని జింకలు సింహాలకు పులులకు ఆహారం కావటం వలన వాటి జనాభా తగ్గిపోతుంది. క్రమేణ ఆ వీటి జనాభా అడవి నుండి తొలగించబడుతుంది.
  3. వేగంగా పరిగెత్తటం అనే అనుకూలనం జీవుల మనుగడకు తోడ్పడింది.
  4. ఇంకా చెప్పాలంటే ప్రకృతి, వేగంగా పరిగెత్తే జీవులను ఎంపిక చేసుకొంది. ఈ సహజ ప్రక్రియనే ‘ప్రకృతివరణం’ అంటారు.

10th Class Biology 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

నీలో ఉన్న లక్షణాలను మీ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో పోల్చి పట్టికలో రాయండి.
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 11

1) నీలోనూ, మీ అమ్మలోనూ, మీ అమ్మమ్మలోనూ కనిపించే లక్షణాలు ఏమిటి?
జవాబు:
నా చర్మ రంగు తెలుపు. ఇది అమ్మలోనూ, అమ్మమ్మలోనూ కనిపిస్తుంది.

2) నీలో, మీ అమ్మమ్మలో కనిపించే లక్షణాలు ఏవి?
జవాబు:
చర్మం రంగు

3) మీ అమ్మమ్మ నుండి ఆ లక్షణాలు నీకు ఎలా సంక్రమించాయని నీవు అనుకొంటున్నావు?
జవాబు:
మా అమ్మమ్మలోని లక్షణం నాకు అమ్మ ద్వారా సంక్రమించింది.

4) నీలోనూ, మీ అమ్మలోనూ ఉంది మీ అమ్మమ్మలో కనిపించని లక్షణాలు ఏవైనా ఉన్నాయా?
జవాబు:
పొడవు ముక్కు లక్షణం నాలోనూ మా అమ్మలోనూ ఉంది. కాని అమ్మమ్మలో కనిపించలేదు.

5) మీ అమ్మ ఈ లక్షణం ఎక్కడి నుండి పొంది ఉంటుందని నీవు అనుకుంటావు?
జవాబు:
మా అమ్మ ఈ లక్షణాన్ని తాతయ్య నుండి పొంది ఉంటుంది.

కృత్యం – 2

మీ తరగతిలోని స్నేహితులలో ఎవరైనా ఆరుగురిని ఎంపిక చేసుకోండి. క్రింది పట్టికలో ఇచ్చిన లక్షణాలను పరిశీలించి రాయండి.
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 12

1) మీలోని లక్షణాలు ఎక్కువగా మీ తల్లిదండ్రులను పోలి ఉంటాయా? మీ స్నేహితులను పోలి ఉంటాయా?
జవాబు:
మాలోని లక్షణాలు ఎక్కువగా మా తల్లిదండ్రులను పోలి ఉంటాయి.

2) మీరు మీ తల్లిదండ్రుల కంటే భిన్నంగా ఉండటం, మీ స్నేహితుని కంటే భిన్నంగా ఉండటం ఒకటే అని భావిస్తున్నారా? ఎందుకు?
జవాబు:
రెండూ ఒకటిగా నేను భావించటం లేదు. నేను మా తల్లిదండ్రులను పోలి ఉండి కేవలం కొన్ని లక్షణాలలో మాత్రమే విభేదిస్తున్నాను. అయితే నా స్నేహితుడికి నాకు ఏ మాత్రం పోలికలు లేవు, పూర్తి భిన్నంగా ఉన్నాను.

కృత్యం – 3

బరాని లేదా చిక్కుడు కాయలోని విత్తనాలను పరిశీలించండి. ఒక నిర్ణయానికి రావటానికి (సామాన్యీకరణ కోసం) ఎక్కువ కాయలను, విత్తనాలను పరిశీలించండి.
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 13
1) ఒకే రకంగా ఉన్న రెండు విత్తనాలు గమనించగలిగారా?
జవాబు:
లేదు. విత్తనాలు విభిన్నంగా ఉన్నాయి.

2) ఇవి వేరుగా ఉండటానికి కారణమేమి?
జవాబు:
విత్తనాలు లైంగిక ప్రత్యుత్పత్తి వలన ఏర్పడతాయి. ఈ ప్రక్రియలో పురుష, స్త్రీ జన్యు పదార్థం కలసి విభిన్న లక్షణాలు ఏర్పడతాయి. ఈ కొత్త లక్షణాలనే వైవిధ్యాలు అంటారు.

3) వైవిధ్యాలు ఎందువలన ముఖ్యమైనవిగా భావించాలి? ఒక జీవికి లేదా జనాభాకు వైవిధ్యాలు ఏ విధంగా ఉపయోగం కలిగిస్తాయి?
జవాబు:

  1. వైవిధ్యాలు జీవుల మనుగడకు తోడ్పడతాయి.
  2. వైవిధ్యాలు అనుకూలనాలను పెంపొందిస్తాయి.
  3. వైవిధ్యాలు జీవులను, ఇతర జీవుల నుండి వేరుగా గుర్తించటానికి తోడ్పడతాయి.
  4. వైవిధ్యాలు జాతి అభివృద్ధికి దోహదపడతాయి.
  5. విచ్చిన్న వైవిధ్యాలు వలన కొత్త జీవులు ఏర్పడతాయి.
  6. జాతుల ఉత్పత్తిలో వైవిధ్యాలు తోడ్పడతాయి.

AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

కృత్యం – 4

మెండల్ అనువంశికతా సూత్రాలను సులభంగా అర్థం చేసుకోడానికి ఒక కృత్యం చేద్దాం.

కావలసిన పరికరాలు :

  1. 3 సెం.మీ. పొడవు మరియు 1 సెం.మీ. వెడల్పు గల చార్టు ముక్కలు-4 12
  2. 2 సెం.మీ. పొడవు మరియు 1 సెం.మీ. వెడల్పు గల చార్టు ముక్కలు-4
  3. ఎరుపు గుండీలు – 4
  4. తెల్ల గుండీలు – 4
  5. చార్టు, స్కేలు, స్కెచ్ పెన్, పెన్సిల్.

పద్దతి : 2 × 2 గడులుండేలా చార్టుపై గీసి అంకెలు, గుర్తులను రాయండి.

AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 14
ఆట – 1 : శుద్ధజాతి (Pure breed) :

మీరు తయారు చేసిన 4 పొడవు 4 పొట్టిగా ఉండే చార్లు ముక్కల్ని తీసుకోండి. జతలుగా ఏర్పరచేటపుడు ప్రతిజతలో పొట్టివిగానీ, పొడవుగానీ లేదా రెండూగాననీ ఉంటాయి.

ఇపుడు రెండు సంచులు తీసుకోండి. ప్రతి సంచిలో 4 కాగితం పట్టీలు ఉండేలా రెండు సంచులలో వేయండి. ప్రతి సంచిలో 2 పొడవు, 2 పొట్టి పట్టీలు ఉంటాయన్నమాట.

‘A’ సంచిని పురుషబీజకణంగానూ ‘B’ సంచిని స్త్రీ బీజకణంగానూ భావించండి. ఇప్పుడు ‘A’ సంచిలో నుండి చేతికి అందిన ఒక పట్టీని తీసుకుని గళ్ళచదరంలో 1వ గడిలో ఉంచండి. అలాగే ‘B’ సంచిలో నుండి కూడా చేతికి అందిన ఒక కాగితం పట్టీని తీసుకుని 1వ గడిలో ఉంచండి. మీ సంచుల్లో కాగితం పట్టీలు అయిపోయేదాకా ప్రతి గడిలో రెండు చొప్పున ఉంచుతూ ఆడండి. మీ సంచి ఖాళీ అయ్యేసరికి ప్రతి గడిలో రెండేసి కాగితం పట్టీలు ఉంటాయన్నమాట. వాటిని గమనించినట్లయితే రెండు పొడవు, రెండు పొట్టి, ఒకటి పొడవు, ఒకటి పొడవు, ఒకటి పొట్టి జతలు కనిపిస్తాయి.

1) రెండూ పొడవు పట్టీల జతలు ఎన్ని ఉన్నాయి?
జవాబు:
రెండూ పొడవు పట్టీ జతలు – 1 వచ్చింది.

2) రెండూ పొట్టి పట్టీల జతల సంఖ్య ఎంత?
జవాబు:
రెండు పొట్టి పట్టీ జతలు – 1 వచ్చింది.

3) ఒకటి పొట్టి, ఒకటి పొడవు కలిగిన జతలు ఎన్ని ఉన్నాయి?
జవాబు:
ఒకటి పొట్టి, ఒకటి పొడవు కలిగిన జతలు – 2 వచ్చాయి.

4) ప్రతి రకం ఎంత శాతంగా ఉన్నాయి? వాటి నిష్పత్తి ఎంత?
జవాబు:
ఈ ఆట ద్వారా పొడవు, పొట్టి పట్టీల జతలు ఏర్పడడం యాదృచ్ఛికంగా జరుగుతుంది అని గమనించాను.

5) ఈ ఆట ద్వారా మీరు ఏమి గమనించారు?
జవాబు:

  1. ప్రతిసారి పొడవు పట్టీ జతల సంఖ్య పొట్టి పట్టీ జతల సంఖ్యకు సమానంగా ఉండటం గమనించాను.
  2. పొడవు, పొట్టి పట్టీ జతల కంటే, పొట్టి పొడవు పట్టీ జతల సంఖ్య అధికంగా ఉండటం గమనించాను.

కృత్యం – 5

AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 15
రెక్కల పురుగుల జనాభా క్రమంగా పెరుగుతూ ఉంది. అనుకోకుండా హఠాత్తుగా అవి ఉండే పొదలకు ఏదైనా తెగులు సోకిందనుకోండి. అప్పుడు ఆకులు నశించడం లేదా వాటి సంఖ్య తగ్గిపోవటం వలన రెక్క పురుగులకు సరైన ఆహారం లభించదు. పస్తులు ఉండాల్సివస్తుంది. కనుక రెక్కల పురుగు బరువు తగ్గిపోతుంది. కాని ఈ మార్పు జన్యు పదార్థమైన DNA ను మార్చలేదు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు మొక్కల తెగుళ్ళు తగ్గి పొదలు మునిపటిలా ఆరోగ్యంగా మారిపోయాయి.
1) అప్పుడు రెక్క పురుగుల బరువులో ఎలాంటి తేడాలు వస్తాయని నీవు భావిస్తున్నావు?
జవాబు:
రెక్కల పురుగులకు ఆహారం సంవృద్ధిగా దొరకటం వలన తిరిగి అవి బలంగా లావుగా తయారవుతాయి. ఈ మార్పు జన్యుపరమైనది కాదు కావున ఈ లక్షణం వాటి తరువాత తరానికి అందించబడదు.

కృత్యం – 6

వెన్నెముక గల జీవుల పిండాభివృద్ధిలోని వివిధ దశలను పరిశీలిద్దాం. వాటిలోని పోలికలు, భేదాలను గుర్తించి మీ మిత్రులతో చర్చించండి.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు 16

  1. వెన్నుముక వెన్నెముక గల జీవుల పిండాభివృద్ధి దశలు ఆసక్తికరంగా ఉన్నాయి.
  2. ప్రాథమిక దశలో అన్ని జీవుల పిండాలు ఒకే విధంగా ఉండి, వేరు వేరుగా గుర్తించటం అసాధ్యంగా ఉంది.
  3. దీనినిబట్టి ఈ జీవులన్నీ ఒకే పూర్వజీవి నుండి పరిణామం చెందాయని భావించవచ్చు.
  4. రెండవ దశలో చేప, సాలమాండర్ పిండాలు పొడవుగా ఉండి కొంచెం విభిన్నంగా ఉన్నాయి.
  5. మిగిలిన జీవులైన తాబేలు, కోడి, పంది, ఆవు, కుందేలు, మనిషి యొక్క పిండాలు ఒకే విధంగా ఉండి, వేరుగా గుర్తించటం కష్టంగా ఉంది.
  6. మూడవ దశలో చేప, సాలమాండర్ పిండాలు ఒక విధంగా ఉంటే, పక్షులు, సరీసృపాల పిండాలు ఒక విధంగా, క్షీరదాల పిండాలు ఒక విధంగా ఉన్నాయి.
  7. దీనినిబట్టి జీవుల మధ్యగల సంబంధాలను, సారూప్యతను అంచనా వేయవచ్చు.
  8. జీవులన్నీ ఒకే పూర్వపు జీవి నుండి పరిణామం చెందాయని చెప్పటానికి పిండోత్పత్తిశాస్త్రం తిరుగులేని నిజాలను ఇస్తుంది.

కింది ఖాళీలను పూరించండి

1. జీవులలో మార్పులకు దారితీసే విధానాన్ని .. …………. అంటారు. (పరిణామం)
2. మెండల్ ప్రయోగాలు …………… ………… ను వివరిస్తాయి. (అనువంశికత)
3. స్వతంత్ర వ్యూహన సిద్ధాంతాన్ని వివరించే ప్రయోగాలలో పరిశీలించిన లక్షణాలు (గుండ్రని, ముడతలు, పసుపు, ఆకుపచ్చ)
4. ఎరుపు రంగు పుష్పాలున్న మొక్కతో తెలుపు రంగు పుష్పాలున్న మొక్కను పరాగ సంపర్కం చేసినపుడు ఏర్పడే మొక్కల్లో ……………….. శాతం అంతర్గత లక్షణం గల మొక్కలుంటాయి.
(100)
5. TT, YY లేదా TE, Yy లలో వ్యక్తమయ్యే లక్షణం …………. (బహిర్గత లక్షణం)
6. ఆడ శిశువులలో 23 జతల క్రోమోజోములుంటాయి. ఆమెకు 18 సంవత్సరాల వయసు వచ్చినపుడు ఆమెలో జతల శారీరక క్రోమోజోములు, ………………. జతల లైంగిక క్రోమోజోములుంటాయి. (22, ఒక)
7. జనాభా ………… శ్రేణిలో పెరుగుతుంటే ఆహార వనరులు ……….. శ్రేణిలో పెరుగుతాయి. (గుణశ్రేణి, అంకశ్రేణి)
8. సరిగా నడవలేని మేక ఎక్కువకాలం జీవించలేదు. డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఇది …………. ను తెలియజేస్తుంది. (ప్రకృతివరణం)
9. తిమింగలంలో ఈదడానికి ఉపయోగపడే వాజముగా మారిన ముంజేతి నిర్మాణం గుర్రంలో ………………… కు ఉపయోగపడేలా మార్పు చెంది ఉంటుంది. (పరుగెత్తడానికి)
10. శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని ………………… అంటారు. (శిలాజశాస్త్రం)

సరైన సమాధానాన్ని గుర్తించండి

1. కింది వానిలో గులాబి మొక్కకు సంబంధించి వైవిధ్యానికి దోహదపడనిది
A) రంగులు గల ఆకర్షక పత్రాలు
B) ముళ్లు
C) తీగలు
D) పత్రం
జవాబు:
A) రంగులు గల ఆకర్షక పత్రాలు

2. మెండల్ ప్రకారం యుగ్మవికల్పకాలలో ఉండే లక్షణం
A) జన్యువులు జతలుగా ఉండడం
B) లక్షణానికి బాధ్యత వహించడం
C) బీజకణాల ఉత్పత్తి
D) అంతర్గ లక్షణంగా ఉండడం
జవాబు:
A) జన్యువులు జతలుగా ఉండడం

3. ప్రకృతి వరణం అనగా
A) ప్రకృతి యోగ్యత కలిగిన లక్షణాలను ఎంపిక చేయడం
B) జీవులతో ప్రకృతి ప్రతిచర్య జరపడం
C) ఉపయోగంలేని లక్షణాలను ప్రకృతి వ్యతిరేకించడం
D) A మరియు B
జవాబు:
A) ప్రకృతి యోగ్యత కలిగిన లక్షణాలను ఎంపిక చేయడం

AP Board 10th Class Biology Solutions 8th Lesson అనువంశికత – తరతరాలలో వైవిధ్యాలు

4. పురాజీవ శాస్త్రవేత్త దీనితో సంబంధం కలిగి ఉంటాడు
A) పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు
B) శిలాజ నిదర్శనాలు
C) అవశేష అవయవ నిదర్శనాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

SCERT AP 10th Class Biology Study Material 7th Lesson జీవక్రియలలో సమన్వయం Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Biology 7th Lesson Questions and Answers జీవక్రియలలో సమన్వయం

10th Class Biology 7th Lesson జీవక్రియలలో సమన్వయం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
నోరు నుండి పాయువు వరకు వ్యాపించి ఉన్న ఆహారనాళంలో ఆహారం ఏ ఏ భాగాల గుండా ప్రయాణిస్తుందో రాయండి.
జవాబు:
ఆహారం ఆహారనాళంలో ఈ క్రింది మార్గంలో ప్రయాణిస్తుంది.
ఆహారం → నోరు → ఆస్యకుహరం → గ్రసని → ఆహారవాహిక → జీర్ణాశయం → ఆంత్రమూలం → చిన్న ప్రేగు → పెద్దప్రేగు → పురీషనాళం → పాయువు

ప్రశ్న 2.
జీర్ణాశయంలో ఆహారాన్ని విచ్చిన్నం చేయడంలో ఏ జీవక్రియ తోద్పడుతుంది?
జవాబు:
ఆహారాన్ని విచ్ఛిన్నం చేయటంలో జీర్ణక్రియ తోడ్పడుతుంది.

ప్రశ్న 3.
జీవక్రియలలోని ఏ ఒక్క జీవక్రియ అయినా పనిచేయటంలో విఫలమైతే, శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
జవాబు:
జీవక్రియలన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తాయి. వీటి మధ్య పూర్తి సమన్వయం ఉంటుంది. ఏ ఒక్క జీవక్రియ పనిచేయకపోయినా అది జీవి మరణానికి దారితీస్తుంది.

ప్రశ్న 4.
ఆకలి కోరిక అంటే ఏమిటి? (AS1)
జవాబు:

  1. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోతే వెంటనే మనకు ఆకలి వేస్తున్నట్లుగా అనిపిస్తుంది.
  2. అలాగే జీర్ణాశయం ఖాళీ అయినప్పుడు అందులో స్రవించబడే ప్రోటీన్ శ్రేణులతో కూడిన ‘గ్రీలిన్’ అనే హార్మోన్ స్రవిస్తుంది.
  3. జీర్ణాశయ గోడల్లోని కొన్ని కణాలు ‘గ్రీలిన్’ (Ghrelin) ను స్రవిస్తాయి.
  4. జీర్ణకోశంలో ఈ హార్మోన్ స్రవించడం వల్ల ఆకలి సంకేతాలు ఉత్పత్తి అవుతాయి.
  5. జీర్ణకోశం నుండి మెదడుకు ఆకలి సంకేతాలు చేరగానే ఆకలి కోరికలు జీర్ణాశయంలో మొదలవుతాయి.
  6. ముందు మెదడులోని డైయన్ సెఫలాన్ మరియు వేగస్ నాడి (10వ కపాలనాడి) ఈ సంకేతాలను చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ‘ఆకలి కోరికలు’ దాదాపు 30-45 నిమిషాల వరకు కొనసాగుతాయి.
  7. గ్రీలిన్ స్థాయి పెరిగినపుడు ఆకలి ప్రచోదనాలతో పాటూ ఆహారం తినాలనే ఉద్దీపన భావన కలుగుతుంది.

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 5.
మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయటానికి శరీరంలో ఏయే వ్యవస్థలు తోడ్పడతాయి? (AS1)
జవాబు:

  1. శరీరంలో జరిగే జీవక్రియలలో అనేక వ్యవస్థలు సమన్వయంగా పనిచేస్తాయి.
  2. ఆహారం జీర్ణం చేయటానికి ఒక్క జీర్ణవ్యవస్థనే కాకుండా, నాడీవ్యవస్థ, అంతఃస్రావవ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ సమన్వయంతో వ్యవహరిస్తాయి.
  3. అంతస్రావీ వ్యవస్థ స్రవించే గ్రీలిన్, లెప్టిన్ వంటి హార్మోన్లు, ఆకలి సంకేతాలను ఏర్పర్చటంతో పాటు, ఆకలిని నియంత్రించటంలో తోడ్పడతాయి.
  4. ఆకలి సంకేతాలు, నాడుల ద్వారా మెదడుకు చేరి సంబంధిత ఆదేశాలు ఇవ్వబడతాయి.
  5. చిన్నప్రేగులో జీర్ణమైన ఆహారం రక్తప్రసరణ వ్యవస్థలోనికి శోషణం చెందుతుంది.

ప్రశ్న 6.
ఆహారపదార్థాల వాసన ఆకలిని పెంచుతుందని రఫి అన్నాడు. అతని వ్యాఖ్య సరైనదేనా? ఎలా? (AS1)
జవాబు:

  1. ఆహారపదార్థాల వాసన ఆకలిని పెంచుతుందన్న వాదనతో నేను ఏకీభవిస్తాను.
  2. రుచి, వాసన బాగా దగ్గర సంబంధం కలిగి ఉంటాయి.
  3. ఆహారం మంచి వాసన కలిగి ఉండటం వలన, ఘ్రాణ గ్రాహకాలు ప్రతిస్పందించి వార్తలను మెదడుకు పంపుతాయి.
  4. మంచివాసన వలన తినాలనే కోరిక మరింత పెరిగి ఎక్కువగా తింటాము. కావున మంచివాసన ఆకలిని పెంచుతుందని నిర్ధారించవచ్చు.
  5. దీనికి వ్యతిరేక సందర్భం కూడమనకు అనుభవమే. ఆహారం రుచిగా ఉన్నా, చెడువాసన వస్తే దానిని మనం తినలేము.

ప్రశ్న 7.
పెరిస్టాలిసిస్ మరియు సంవరిణీ కండరాల గురించి రాయండి. (AS1)
జవాబు:
పెరిస్టాల్స స్ :

  1. ఆహార వాహికలో ఆహార ముద్ద ప్రయాణిస్తున్నపుడు, ఏర్పడే అలల వంటి చలనాన్ని “పెరిస్టాలటిక్ చలనం” అంటారు. ఈ ప్రక్రియను “పెరిస్టాల్సస్” అంటాం.
  2. నోటిలో ఆహారం నమలబడిన తరువాత ముద్దగా మారుతుంది. మ్రింగుట అనే ప్రక్రియ వలన ఆహార ముద్ద ఆహారవాహికలోనికి ప్రవేశిస్తుంది.
  3. ఆహారవాహికలోని స్తంభాకార కండరాల సడలింపు వలన, బోలస్ ముందు భాగం పొడవు తగ్గి గొట్టం వెడల్పు అవుతుంది.
  4. ఇదే సందర్భంలో ఆహార ముద్ద (బోలస్) పైన ఉన్న వలయ కండరాలు సంకోచం చెందటం వలన బోలస్ క్రిందకు నెట్టబడుతుంది.
  5. ఇలా ఆహారవాహికలో కండరాల సంకోచ సడలింపు వలన తరంగం వంటి చలనం ఏర్పడి బోలస్ ఆహారవాహికను చేరుతుంది. ఈ ప్రక్రియనే “పెరిస్టాలిసిస్” అంటారు.

సంవరణి కండరము:

  1. జీర్ణాశయం యొక్క పరభాగంలో, స్వయం నియంత్రిత కండరం ఉంటుంది. దీనిని “జఠర సంవరిణి” (Pyloric sphincter) అంటారు.
  2. ఇది ఆంత్రమూలంలోనికి ప్రవేశించే ఆహారాన్ని నియంత్రిస్తుంది.
  3. జీరాశయంలోని ఆహారం ఆమగుణం కలిగి పాక్షికంగా జీర్ణమైన తరువాత, ఈ కండరం తెరుచుకొంటుంది.
  4. అందువలన జీర్ణాశయంలోని ఆహారం కొంచెం కొంచెంగా ఆంత్రమూలం చేరుతుంది.
  5. ఆంత్రమూలంలో చేరిన ఆహారం ఆధారంగా ఈ కండరం మూసుకుపోతుంది..
  6. దీనివలన నిర్దిష్ట పరిమాణంలో ఆహారం ఆంత్రమూలానికి చేరి, పూర్తిగా జీర్ణమౌతుంది.

ప్రశ్న 8.
కింద ఇచ్చిన జీర్ణవ్యవస్థలోని భాగాన్ని పరిశీలించండి. ఇది ఏమిటి? ఇది నిర్వర్తించే పనులను రాయండి. (AS1)
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 2
జవాబు:

  1. పటంలో చూపబడిన బొమ్మ మానవ జీర్ణ వ్యవస్థలోని జీర్ణాశయం.
  2. జీర్ణాశయం జీర్ణవ్యవస్థలో ఆహారవాహిక తరువాత భాగం. ఇది పెద్దదిగా సంచివలె ఉండే కండర నిర్మాణం.
  3. జీర్ణాశయ పూర్వభాగాన్ని హార్దిక జీర్ణాశయం అని, పరభాగాన్ని జఠర జీర్ణాశయం అని పిలుస్తారు.
  4. జీర్ణాశయ గోడలు, మందంగా ఉండి జఠర గ్రంథులను కలిగి ఉంటాయి. ఇవి జఠర రసాన్ని స్రవిస్తాయి.
  5. జీర్ణాశయం యొక్క పరభాగం ‘U’ ఆకారంలో వంపు తిరిగి ఆంత్రమూలంగా మారుతుంది.

జీర్ణాశయ విధులు :

  1. జీర్ణాశయం ప్రధానంగా, ఆహారనిల్వకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆహారం 4 గంటల నుండి 5 గంటల వరకు నిల్వ ఉంటుంది.
  2. జఠర రసం హైడ్రోక్లోరిక్ ఆమ్లమును కలిగి ఉంటుంది. ఇది ఆహారంతో పాటు ప్రవేశించిన సూక్ష్మ కస్తా
  3. జీర్ణాశయ కండరాలు వలయ, ఆయత, వాలు కండరాలను కలిగి ఆహారాన్ని బాగా చిలుకుతుంది. ఆ గువలన జీర్ణరసాలతో ఆహారం బాగా కలిసి పోతుంది.
  4. జఠర రసం, లాలాజలంతో క్షారయుతమైన ఆహారాన్ని తటస్థం చేయటం వలన జీర్ణక్రియ ప్రక్రియ వేగవంతమవుతుంది.
  5. జఠర రసంలో లైపేజ్, రెనిన్, అమిలాప్సిన్ వంటి జీర్ణ ఎంజైమ్స్ ఉండి ఆహార పదార్థాలను జీర్ణం చేస్తాం.
  6. ఈ ఎంజైమ్స్ వలన జీర్ణాశయంలో ఆహారం పాక్షికంగా జీర్ణమవుతుంది. దీనిని ‘క్రైమ్’ అంటారు.

ప్రశ్న 9.
క్రింది వానికి తగిన కారణాలు తెలపండి. (AS1)
ఎ) నాలుకతో అంగిలిని నొక్కి పట్టుట ద్వారా రుచిని త్వరగా తెలుసుకోగలం.
బి) ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు రుచి తెలియదు.
సి) రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినపుడు మనకు ఆకలి వేస్తుంది.
ది) చిన్న ప్రేగు చుట్టుకొని ఉన్న పైపు మాదిరిగా ఉంటుంది.
జవాబు:
ఎ) నాలుకతో అంగిలిని నొక్కి పట్టుట ద్వారా రుచిని త్వరగా తెలుసుకోగలం.
నోటిలో ఆహారం, లాలాజలంలో కరిగి ద్రవస్థితికి మారుతుంది. నాలుకతో అంగిలిని నొక్కటం నెలన ఈ ద్రవ ఆహారం నాలుక మీద ఉన్న రుచి మొగ్గలలోనికి ప్రయాణిస్తుంది. రుచి మొగ్గలలోని రుచి గ్రాహక కణాలు ఆహార రుచిని గ్రహించి మెదడుకు సందేశాలు పంపుతుంది.

బి) ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు రుచి తెలియదు.
నాలుక మీద ఉన్న రుచి మొగ్గలు, ఆహారం రుచిని గుర్తిస్తాయి. ఈ రుచి మొగ్గలు, శరీర ఉగ్రతకు దగ్గరగా ఉన్న ఆహారపదార్థాల రుచిని సులువుగా గుర్తిస్తాయి. పదార్థం బాగా వేడిగా ఉన్నప్పుడు రుచి మొగ్గలలోని గ్రాహక కణాలు రుచిని సరిగా గుర్తించలేవు. అందువలన ఆహారం వేడిగా ఉన్నప్పుడు రుచి తెలియదు.

సి) రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినపుడు మనకు ఆకలి వేస్తుంది.

  1. ఆకలి శరీరానికి ఆహార అవసరం తెలిపే సంకేతం.
  2. జీర్ణమైన ఆహారం రక్తంలోనికి గ్లూకోజ్ రూపంలో శోషణ చెంది శరీర కణాలకు సరఫరా చేయబడుతుంది.
  3. రక్తంలోని గ్లూకోజు, కణజాలం వినియోగించుకోవటం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది.
  4. రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినపుడు జీర్ణాశయ గోడలు గ్రీలిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి.
  5. ఈ హార్మోన్ జీర్ణాశయంలో ఆకలి సంకేతాలను ఉత్పత్తి చేస్తుంది.

డి) చిన్నప్రేగు చుట్టుకొని ఉన్న పైపు మాదిరిగా ఉంటుంది.
చిన్న ప్రేగు ప్రధానవిధి శోషణ. జీర్ణమైన ఆహారం రక్తంలోనికి ప్రవేశించే ప్రక్రియను శోషణ అంటారు. శోషణ ప్రక్రియ జరగటానికి, ఎక్కువ ఉపరితలం అవసరం. అందువలన చిన్నప్రేగు పొడవుగా ఉంటుంది. పొడవైన చిన్నప్రేగు కొద్ది స్థలంలో అమరటానికి అనువుగా అనేక మడతలు పడి చుట్టుకొని ఉంటుంది. దీని వలన పొడవైన – చిన్నప్రేగు కొద్ది తలంలో అమరిపోతుంది. శోషణాతలం వైశాల్యం పెంచటానికి చిన్న ప్రేగు లోపలి గోడలు ముడతలు పడి ఆంత్రచూషకాలుగా మారతాయి. ఇవి జీర్ణమైన ఆహారాన్ని ‘శోషించుకొని రక్తంలోనికి చేర్చుతాయి.

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 10.
కింది వాని మధ్యలో ఉండే భేదాలు రాయండి. (AS1)
ఎ) బోలస్ – కైమ్
బి) చిన్నప్రేగు – పెద్దప్రేగు
సి) మాస్టికేషన్-రుమినేషన్
డి) మొదటి మెదడు – రెండవ మెదడు
జవాబు:
ఎ) బోలస్ – కైమ్ :

బోలస్ క్రైమ్
1. నోటిలో ఏర్పడిన ముద్దను “బోలస్” అంటారు. 1. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని “క్రైమ్” అంటారు.
2. ఇవి లాలాజలంతో కలిసి ఏర్పడుతుంది. 2. ఇది జీర్ణరసాల చర్య వలన ఏర్పడుతుంది.
3. ఘనస్థితిలో ఉండే ముద్ద వంటి నిర్మాణము. 3. ద్రవస్థితిలో ఉండే ఆహారపదార్ధం.
4. ఆహార వాహిక ద్వారా జీర్ణాశయం చేరుతుంది. 4. సంవరిణీ కండరము ద్వారా ఆంత్రమూలాన్ని చేరుతుంది.
5. లాలాజల ప్రభావం వలన క్షారయుతంగా ఉంటుంది. 5. జఠర రస ప్రభావం వలన ఆమ్లయుతంగా ఉంటుంది.

బి) చిన్నప్రేగు – పెద్ద ప్రేగు :

చిన్నపేగు పెద్దప్రేగు
1. జీర్ణాశయం తరువాత భాగం. 1. జీర్ణవ్యవస్థలో చిన్నపేగు, పెద్ద ప్రేగుగా కొనసాగించబడుతుంది.
2. పరిమాణం చిన్నదిగా ఉంటుంది. 2. పరిమాణం పెద్దదిగా ఉంటుంది.
3. ఎక్కువ పొడవు కలిగి ఉంటుంది. 3. పొడవు తక్కువగా ఉంటుంది.
4. మెలి తిరిగి చుట్టుకొని ఉంటుంది. 4. చతురస్రాకారంలో అమరి ఉంటుంది.
5. పాక్షిక జీర్ణక్రియ జరుగుతుంది. 5. జీర్ణక్రియ జరగదు.
6. ఆహార పదార్థాల శోషణ దీని ప్రధానవిధి. 6. నీటి పునఃశోషణ దీని ప్రధానవిధి.
7. కీర్ణం కాని పదార్థాలను పెద్ద ప్రేగుకు చేర్చుతుంది. 7. జీర్ణం కాని పదార్థాలను మలం రూపంలో విసర్జిస్తుంది.

సి) మాస్టికేషన్ – రుమినేషన్ :

మాస్టికేషన్ రుమినేషన్
1. నోటిలో ఆహారాన్ని ముక్కలుగా చేసే ప్రక్రియను “మాసికేషన్” అంటారు. 1. జీర్ణాశయం నుండి ఆహారాన్ని తిరిగి నోటిలోనికి తెచ్చుకొని ననులడాన్ని “రుమినేషన్” అంటారు.
2. ఆహార సేకరణలో ఇది ప్రాథమిక ప్రక్రియ. 2. మాస్టికేషన్ జరిగిన తరువాత రుమినేషన్ జరుగుతుంది.
3. దాదాపు అన్ని జంతువులలో మాస్టికేషన్ ఉంటుంది. 3. నెమరు వేయు జంతువులలో మాత్రమే రుమినేషన్ ఉంటుంది.
4. మాస్టికేషన్ తరువాత ఆహారం ఆహారవాహిక ద్వారా జీర్ణాశయం చేరుతుంది. 4. రుమినేషన్లో ఆహారం జీర్ణాశయం నుండి ఆహార వాహిక ద్వారా నోటిలోనికి చేరుతుంది.

డి) మొదటి మెదడు – రెండవ మెదడు :

మొదటి మెదడు రెండవ మెదడు
1. తల ప్రాంతంలో ఉండే నాడీవ్యవస్థలోని ప్రధానభాగం. 1. ఉదర భాగంలో ఉండే జీర్ణవ్యవస్థ అనుసంధాన నాడీకణజాలాన్ని రెండవ మెదడు అంటారు.
2. పరిమాణంలో పెద్దది. 2. పరిమాణంలో చిన్నది.
3. తెలివితేటలు, ఆలోచించటం, నిర్ణయాలు తీసుకోవటం చేయగలదు. 3. తెలివితేటలు, ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవటం చేయలేదు.
4. 350 గ్రాముల పరిమాణం కల్గి ఉంటుంది. 4. ఇది 9 మీటర్ల పొడవు గలిగిన జీర్ణనాడీవ్యవస్థ.

ప్రశ్న 11.
మీ నోరు ఒక నమిలే యంత్రం అని ఎలా చెప్పగలవు? (AS1)
జవాబు:

  1. జీర్ణవ్యవస్థ మొదటి భాగం నోరు. ఇది ఆహారాన్ని ముక్కలుగా చేసి లాలాజలంతో కలుపుతుంది.
  2. నోటిలో ఆహారాన్ని ముక్కలుగా చేయటానికి రెండు దవడల మీద దంతాలు అమరి ఉంటాయి.
  3. నోటిలో ఉండే దంతాలు నాలుగు రకాలు. ఇవి వివిధ పనులను నిర్వహిస్తాయి.
  4. కుంతకాలు కొరకటానికి, రదనికలు చీల్చటానికి, ముందుచర్వణకాలు నమలడానికి, చర్వణకాలు విసరడానికి తోడ్పడతాయి.
  5. ఈ నాలుగు రకాల దంతాలు ఆహారాన్ని ముక్కలుగా చేయటం వలన దీనిని నమిలే యంత్రంగా పరిగణించవచ్చు.
  6. నోటిలో నమలబడిన ఆహారం లాలాజలంతో కలిసి ఆహారం ముద్దగా మారుతుంది. దీనిని “బోలస్” అంటారు.

ప్రశ్న 12.
మాస్టికేషన్ అంటే ఏమిటి? అందుకు తోడ్పడే వివిధ రకాల దంతాలను గురించి వివరించండి. (AS1)
జవాబు:
నోటిలో ఆహారం నమలబడి చూర్ణం చేయడాన్ని ‘మాస్టికేషన్’ అంటారు. ఈ ప్రక్రియకు నోటిలో నాలుగు రకాల దంతాలు తోడ్పడతాయి. అవి
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 1

ప్రశ్న 13.
ఆహార పదార్థాలు నోటి నుండి ఆహారవాహిక ద్వారా జీర్ణాశయాన్ని చేరే మార్గంలో కందర వ్యవస్థ నియంత్రణ ఏ విధంగా పనిచేస్తుంది? (AS1)
జవాబు:

  1. జీర్ణవ్యవస్థలో ఆహార పదార్థాల కదలిక కండర వ్వవసచే నియంత్రించబడుతుంది.
  2. నోటిలో నమలబడిన ఆహారం ముద్దగా మారుతుంది. దీనిని “బోలస్” అంటారు.
  3. మ్రింగుట అనే ప్రక్రియ వలన బోలస్ ఆహారవాహికలోకి నెట్టబడుతుంది.
  4. ఆహారవాహికలో అలలవంటి తరంగచలనం వలన, ఆహారం జీర్ణాశయం చేరుతుంది. ఈ చలనాన్ని “పెరిస్టాలిటిక్ చలనం” అంటారు.
  5. పెరిస్టాలిటిక్ చలనంలో బోలస్ పైన ఉన్న వలయ కండరాలు సంకోచం చెంది ఆహారాన్ని క్రిందకు నెడతాయి.
  6. అదే సమయంలో బోలస్ క్రింద ఉన్న ఆయత కండరాలు సడలి ఆహారం క్రిందకు జారటానికి మార్గం సుగమం చేస్తాయి.
  7. ఈ కండర సంకోచ సడలింపులు ఏకాంతరంగా జరుగుతూ ఆహారవాహికలో అలవంటి చలనాన్ని ఏర్పర్చి ఆహారాన్ని జీర్ణాశయంలోకి చేర్చుతాయి.

ప్రశ్న 14.
చిన్నప్రేగు చుట్టుకొని అనేక ముడుతలుగా ఉండటానికి గల కారణం ఏమైనా ఉందా? జీర్ణక్రియకు అది ఏ విధంగా తోడ్పడుతుంది? (AS1)
జవాబు:

  1. జీర్ణవ్యవస్థలో చిన్నప్రేగు కీలకపాత్రను పోషిస్తుంది. ఇది అంత్యజీర్ణక్రియను సమర్ధవంతంగా నిర్వహించటంతో పాటు శోషణ ప్రక్రియను నిర్వహిస్తుంది.
  2. జీర్ణమైన ఆహారం, రక్తంలోనికి పీల్చుకోబడటాన్ని ‘శోషణం’ అంటారు.
  3. శోషణాతలం వైశాల్యం పెంచటానికి చిన్న ప్రేగు పొడవుగా ఉంటుంది. పొడవైన చిన్న ప్రేగు తక్కువ విస్తీర్ణంలో అమరటం కోసం అనేక మడతలుగా చుట్టుకొని ఉంటుంది.
  4. చిన్నప్రేగు లోపలి తలం ముడతలు పడి ఆంత్రచూషకాలుగా ఏర్పడి ఉంటుంది. దీని వలన శోషణాతలం వైశాల్యం పెరుగుతుంది.
  5. చిన్న ప్రేగు శోషణతోపాటు, జీర్ణక్రియను కూడ నిర్వహిస్తుంది. చిన్న ప్రేగు గోడలలోని ఆంత్ర గ్రంథులు ఆంత్రరసాన్ని స్రవిస్తాయి.
  6. ఆంత్రరసంలోని ఎంజైమ్స్ అంత్య జీర్ణక్రియను పూర్తిచేస్తాయి.

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 15.
కింది భాగాలలో పెరిస్టాలిసిస్ విధులను తెలపండి. (AS1)
ఎ) ఆహారవాహిక బి) జీర్ణాశయం సి) చిన్నప్రేగు డి) పెద్దప్రేగు
జవాబు:
ఎ) ఆహారవాహిక :
ఆహారవాహికలోని ‘పెరిస్టాల్ సిస్’ చలనం వలన ఆహారం నోటి నుండి జీర్ణాశయంకు చేరుతుంది.

బి) జీర్ణాశయం :
జీర్ణాశయంలోని పెరిస్టాల్ సిస్ చలనం వలన ఆహారం జఠర రసంతో బాగా కలపబడి జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఆహారాన్ని చిలకటానికి, కదపటానికి జీర్ణాశయంలో ‘పెరిస్టాలిసిస్’ తోడ్పడుతుంది.

సి) చిన్నప్రేగు :
చిన్న ప్రేగులో పెరిస్టాల్ సిస్ వలన ఆహారం నెమ్మదిగా ముందుకు కదిలి పెద్ద ప్రేగును చేరుతుంది.

డి) పెద్దప్రేగు :
పెద్ద ప్రేగులో పునఃశోషణ జరిగిన పిదప, వ్యర్ధపదార్థాలు క్రమేణా ముందుకు జరిగి పాయువు ద్వారా విసర్జింపబడతాయి.

ప్రశ్న 16.
జీర్ణనాడీ వ్యవస్థను రెండవ మెదడుగా పరిగణించటం ఎంతవరకు సమంజసం? (AS1)
జవాబు:

  1. జీర్ణనాళంలోని నాడీవ్యవస్థ నాడీకణాలతో కూడిన ఎంతో సంక్లిష్టమైన వలయాన్ని కలిగి ఉంటుంది. శాస్త్రవేత్తలు ఈ వ్యవస్థను రెండవ మెదడుగా పిలుస్తారు.
  2. జీరనాళంలోని నాడీకణజాల సముదాయం కేవలం జీర్ణక్రియ జరపటం లేదా అప్పుడప్పుడు ఆకలి కోరికలు సంకేతాలు పంపడం వరకే పరిమితం కాకుండా ముఖ్యమైన సమాచారాన్ని పంపే న్యూరోట్రాన్స్ మీటర్లో నిక్షిప్తమై ఉంటుంది.
  3. శరీరం దిగువ భాగంలో ఉంటూ రెండవ మెదడుగా పిలువబడే జీర్ణ మండలంలోని నాడీవ్యవస్థ కపాలంలోని పెద్ద మెదడుతో సంధించబడి ఉంటుంది.
  4. ఈ నాడీవ్యవస్థ కొంత వరకు మానసిక స్థాయిని నిర్ణయించడంతోపాటు, శరీరంలోని కొన్ని వ్యాధులను నియంత్రించటంలో కీలకపాత్ర వహిస్తుంది.
  5. మానసిక వత్తిడి కలిగినపుడు విరోచనాలు కావటం దీనికి ఉదాహరణ.
  6. సమాచార సంకేతాలను పంపటంతో పాటు, మానసిక స్థాయిని నియంత్రించే ఈ నాడీమండలాన్ని రెండవ మెదడుగా పరిగణించటం సమంజసం.

ప్రశ్న 17.
ఆహార పదార్థాలను చూసిన వెంటనే రాజేష్ ఆకలిగా ఉందన్నాడు. షీలా తనకు ఆకలిగా లేదన్నది. దేని వలన రాజేషకు ఆకలివేయటం, షీలాకు ఆకలి వేయకపోవటం జరిగింది? (AS2)
జవాబు:
రాజేష్ చూచిన ఆహార పదార్థం తనకు బాగా ఇష్టమైనది అయి ఉంటుంది. కావున దానిని చూసిన వెంటనే తనకు తినాలనే కోరిక కలిగింది. ఆహారం తినాలనే తపన మెదడు నుండి జీర్ణాశయానికి సంకేతాలు పంపిస్తుంది. అందువలన జీర్ణాశయంలో గ్రీలిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయి ఆకలి వేసింది.

షీలా చూసిన ఆహారం తనకు ఇష్టము లేనిది అయి ఉంటుంది. అందువలన దానిని తినాలనే ఆసక్తి షీలాకు లేదు. అందువలన షీలాకు ఆకలి వేయలేదు.

దీనినిబట్టి ఆకలి, రుచి, వాసనలను బట్టి ప్రభావితం అవుతుందని నిర్ధారించవచ్చు.

ప్రశ్న 18.
రుచి మరియు వాసన ఏ విధంగా సంబంధం కల్లి ఉన్నాయి? (AS2)
జవాబు:

  1. ఆహారం యొక్క రుచి, వాసన మీద ఆధారపడి ఉంటుంది.
  2. ఒక పదార్థం రుచిగా ఉన్నప్పటికి సరైన వాసన లేకుంటే మనం తినలేము.
  3. వాసనను బట్టి పదార్ధం యొక్క రుచిని అంచనా వేయవచ్చు.
  4. మంచి వాసన ఉన్న పదార్థాలు రుచిగా ఉండటం మన నిత్యజీవిత అనుభవం.
  5. దీనిని బట్టి రుచికి వాసనకు సంబంధం ఉందని నిర్ధారించవచ్చు.

ప్రశ్న 19.
ఆహార పదార్థాల చలనంలో మీరు పరిశీలించిన కండర సంవరిణీలు ఏమిటి? వాటి గురించి క్లుప్తంగా వివరించండి. (AS1)
జవాబు:

  1. ఆహారవాహిక ప్రారంభంలో ఒక సంవరిణీ కండరం ఉంటుంది. ‘మ్రింగుట’ వలన ఆహారం ఈ కండరాన్ని దాటి ఆహారవాహికలోనికి ప్రవేశిస్తుంది.
  2. జీర్ణవ్యవస్థలో రెండవ సంవరిణీ కండరం జీర్ణాశయం పరభాగంలో ఉంది. దీనిని జఠర సంవరిణీ కండరం అంటారు.
  3. ఇది జీర్ణాశయం నుండి ఆంత్రమూలంలోనికి ప్రవేశించే ఆహారాన్ని నియంత్రిస్తుంది. ఆహార పదార్థాల ఆమ్లత్వం మరియు ఆంత్రమూలంలోని ఆహార పరిమాణం ఆధారంగా ఇది నియంత్రించబడుతుంది.
  4. ఆహార నాళ చివరి భాగంలో పాయువు సంవరిణీ కండరం (Anal sphincter) ఉంటుంది. దీని లోపలి సంవరిణీ కండరం అనియంత్రితంగాను, బాహ్య సంవరిణీ కండరం నియంత్రితంగాను పనిచేస్తుంది.
  5. ఈ కండరం మల విసర్జనను నియంత్రిస్తుంది.

ప్రశ్న 20.
లాలాజల గ్రంథుల నాళాలు మూసుకొనిపోతే ఏమవుతుంది? (AS2)
జవాబు:

  1. లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి. లాలాజలంలోని ఎమైలేజ్ ఎంజైమ్ పిండి పదార్థాలపై చర్య జరిపి చక్కెరగా మార్చుతుంది.
  2. లాలాజల గ్రంథులు మూసుకొని పోతే నోటిలోనికి లాలాజలం స్రవించబడదు. దీని వలన
    a) ఆహారం ముద్దగా మారి బోలను ఏర్పర్చలేదు. అందువలన ఆహారం మ్రింగటం కష్టమౌతుంది.
    b) ఆహారం కరిగి ఉన్నప్పుడు మాత్రమే నాలుకలోని రసాయన గ్రాహకాలు రుచిని గ్రహిస్తాయి. లాలాజలం లేకుంటే మనకు ఆహార రుచి తెలియదు.
    c) లాలాజలంలోని ఎంజైమ్ పిండి పదార్థాలను జీర్ణం చేస్తుంది. లాలాజలం లేకుంటే వాటిలో జీర్ణక్రియ జరగదు. పిండి పదార్థాలు చక్కెరగా మారవు.

ప్రశ్న 21.
జీర్ణక్రియలో ఇమిడి ఉన్న నాడుల సమన్వయాన్ని అర్ధం చేసుకోవటానికి ఒక ప్రశ్నావళిని తయారుచేయండి. (AS2)
జవాబు:

  1. జీర్ణక్రియలోని గ్రంథులు ఎలా ప్రేరేపించబడతాయి?
  2. జీర్ణక్రియ స్రావాలు ఎప్పుడు నిలిపివేయబడతాయి?
  3. గ్రంథుల పనికి, నాడీవ్యవస్థకు మధ్యగల సంబంధం ఏమిటి?
  4. జీర్ణ మండల నాడీవ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుందని నీవు భావిస్తున్నావా?
  5. న్యూరోట్రాన్స్ మీటర్స్ అంటే ఏమిటి? జీర్ణక్రియలో వాటి పాత్ర ఏమిటి?
  6. మానవ శరీరంలో రెండవ మెదడుగా దేనిని పరిగణిస్తున్నారు? ఎందుకు?

ప్రశ్న 22.
చిన్న ప్రేగుల ఆకారం, పొడవు ఆహారనాళం మాదిరిగానే ఉంటే ఏం జరుగుతుంది? (AS2)
జవాబు:

  1. చిన్నప్రేగుల ప్రధాన విధి శోషణ. ఇది జీర్ణమైన ఆహారాన్ని రక్తంలోనికి పీల్చుకొంటుంది.
  2. శోషణ సమర్థవంతంగా జరగటానికి అది బాగా పొడవు ఉండి, మెలితిరిగి ఉంటుంది.
  3. లోపలి తలం ముడతలు పడి ఉండుట వలన శోషణకు ఉపరితల వైశాల్యం పెరుగుతుంది.
  4. చిన్నప్రేగుల ఆకారం, పొడవు ఆహారనాళం మాదిరిగా ఉంటే.
    a) చిన్నప్రేగు పొడవు తగ్గుతుంది.
    b) చిన్నప్రేగులో శోషణాతల వైశాల్యం తగ్గుతుంది.
    c) అందువలన శోషణ ప్రక్రియ సమర్థవంతంగా జరగదు.
    d) జీర్ణక్రియ యొక్క ప్రధాన ఉద్దేశల నెరవేరదు.

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 23.
లాలాజలం యొక్క చర్యను అర్థం చేసుకోవటానికి పిండిపై ఎలాంటి ప్రయోగం చేశారు? ప్రయోగ పద్దతిని మరియు పరికరాలను గురించి వివరించండి. (AS3)
జవాబు:
ఉద్దేశం :
పిండిపదార్థాలపై లాలాజల చర్యను అర్థం చేసుకోవటం.

పరికరాలు :
పిండిపదార్థం, అయోడిన్, లాలాజలం, పరీక్షనాళిక, నీరు.

విధానం :

  1. ఒక పరీక్షనాళికలో సగం వరకు నీటిని తీసుకొని, పిండి పదార్థాన్ని కలపటం వలన పిండి ద్రావణం ఏర్పడినది.
  2. దీనిని వాగ్లాస్లో తీసుకొని అయోడిన్ కలపటం వలన పిండి ద్రావణం నీలిరంగుకు మారింది.
  3. నీలిరంగు పిండి ద్రావణాన్ని రెండు సమభాగాలుగా చేసి రెండు పరీక్షనాళికలలో తీసుకొన్నాను.
  4. ఒక పరీక్ష నాళికలో ఒక టీ స్పూన్ లాలాజలం కలిపాను. రెండవ పరీక్షనాళికలో ఏమీ కలపలేదు.
  5. రెండు పరీక్షనాళికలను 45 నిమిషాలపాటు స్థిరంగా ఉంచి పరిశీలించాను.

పరిశీలన :
లాలాజలం కలిపిన పరీక్షనాళికలోని పిండి ద్రావణం రంగును కోల్పోయింది. దీనికి ఒక చుక్క సజల టింక్చర్ అయోడిన్ కలిపినా నీలిరంగు ఏర్పడలేదు.

వివరణ :
మొదటి పరీక్షనాళికలోని అయోడిన్ నీలిరంగుగా మారలేదంటే, పిండి పదార్థం లేదని అర్థం. కలిపిన లాలాజలం పిండి పదార్థంపై పనిచేయుట వలన పిండి పదార్థం చక్కెరగా మారింది. అందువలన ద్రావణం నీలిరంగుకు మారలేదు.

నిరూపణ :
లాలాజలం పిండి పదార్థంపై పనిచేసి దానిని చక్కెరగా మార్చుతుంది.

ప్రశ్న 24.
రుచిని గుర్తించుటలో అంగిలి యొక్క పాత్రను నిర్ధారించేలా ఒక చిన్న ప్రయోగాన్ని సూచించండి. (AS3)
జవాబు:
ఉద్దేశం : రుచిని గుర్తించటంలో అంగిలి పాత్రను నిర్ధారించుట.

పరికరాలు :
చక్కెర గుళికలు, చక్కెర ద్రావణం, సాహెచ్

విధానం :

  1. కొంచెం చక్కెరను నాలుకపై ఉంచుకొని నోరు తెరిచే ఉంచాను. నాలుక అంగిలిని, తాకకుండా జాగ్రత్త పడ్డాను. స్టాప్ వాచ్ ఉపయోగించి, నాలుకపై ఉంచిన చక్కెర గుళికల రుచి ఎంగసేపటికి తెలిసిందో గమనించి సమయం నమోదు చేశాను.
  2. రెండవ సందర్భంలో నోటిలో చక్కెరను అంతే పరిమాణంలో ఉంచి, నోరు మూసుకొన్నాను. ఈ సందర్భంలో నాలుక అంగిలిని తాకింది. స్టాప్ వాచ్ ఉపయోగించి నాలుక రుచిని గుర్తించటానికి పట్టే సమయం గుర్తించాను.

పరిశీలన :
నోరు తెరిచి ఉన్నప్పటికంటే, నోరు మూసి, అంగిలి నాలుకకు తగిలిన సందర్భంలో తక్కువ సమయంలో చక్కెర రుచిని గుర్తించగలిగాను.

వివరణ :
నోరు మూసినపుడు, అంగిలి ఆహార పదార్థాలను రుచి మొగ్గలలోనికి నెట్టటం వలన రుచిని త్వరగా గుర్తించగలిగాను. దీనినిబట్టి రుచిని గుర్తించటంలో అంగిరి ప్రధానపాత్ర వహిస్తుందని అర్ధమైంది. నిరూపణ : రుచిని గుర్తించటంలో అంగిలి కీలకపాత్ర వహిస్తుంది.

ప్రశ్న 25.
మీ పాఠశాల గ్రంథాలయం నుండి ఆకలికి సంబంధించిన సమాచారాన్ని మరియు చిత్రాలను సేకరించి ఒక నివేదిక తయారుచేయండి. (AS4)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 3 AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 4

  1. ఆకలి జంతువుల యొక్క సహజ స్వభావం. ఇది శరీరం పోషకాలను కోరుకొనే స్థితి.
  2. జీర్ణాశయంలోని గ్రీలిన్ హార్మోన్ వలన ఆకలి సంకేతాలు మెదడుకు చేరతాయి.
  3. మెదడులోని డైయన్ సెఫలాన్ (ద్వారగోర్లం) ఆకలిని నియంత్రిస్తుంది.
  4. ఆకలి సంకేతాలు మెదడుకు 10 వ కపాలనాడి (వేగన్నడి) ద్వారా చేరతాయి.
  5. ఆకలి కోరికలు 30 నుండి 45 నిమిషాల పాటు జరుగుతాయి.
  6. ఆకలి కోరికను నియంత్రించటానికి లెఫ్టిన్ హార్మోన్ స్రవించబడుతుంది. ఇది ఆకలిని అణిచివేస్తుంది.
  7. ఆకలి, పదార్థం యొక్క రుచి, వాసన అలవాట్లపైన కూడ ఆధారపడి ఉంటుంది.
  8. మానవులలో ఆకలివేయటం ఒక నిబంధన సహిత ప్రతిచర్య. కావున మనకు రోజు నిర్దిష్ట సమయానికి ఆకలి వేస్తూ ఉంటుంది.
  9. ఆకలి సమయానికి ఆహారం తీసుకోకపోయినా, ఆహారం లభించని పరిస్థితులలో శరీరంలో నిల్వ ఉన్న ఆహారం వినియోగించబడుతుంది.
  10. జీవులు సుప్తావస్థలో ఉన్నప్పుడు, ఆకలి జీర్ణక్రియ ప్రక్రియలు అత్యంత కనిష్టంగా జరుగుతాయి.

ప్రశ్న 26.
ఆహార పదార్థాల నుండి రుచి సంవేదన మెదడుకు చేరే క్రమాన్ని బ్లాక్ చిత్రం గీసి చూపండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 5

ప్రశ్న 27.
ఆహారవాహికలో పెరిస్టాల్టిక్ కదలికలను చూపే చిత్రం గీసి, భాగాలు గుర్తించండి. ఆహారవాహిక లోపలి తలంలోని శ్లేష్మస్తరం యొక్క ఆవశ్యకతను వివరించండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 6

  1. నోటిలోని ఆహారం, ఆహారవాహిక ద్వారా జీర్ణాశయం చేరుతుంది.
  2. ఆహారవాహికలోని ‘పెరిస్టాల్టిక్’ కదలికల వలన ఆహారం క్రిందకు జరుగుతుంది.
  3. ఆహారనాళపు గోడలు జారుడు గుణం గల జిగురు పదార్థాన్ని స్రవిస్తాయి. దీనిని శ్లేష్మం (Mucus) అంటారు.
  4. ఆహారనాళంలో ఆహారం సులువుగా కదలటానికి శ్లేష్మం తోడ్పడుతుంది.
  5. శ్లేష్మం చమురులా పనిచేస్తూ ఆహారవాహిక గోడలకు హాని జరగకుండా కాపాడుతుంది.
  6. దీనివలన ఆహార బోలస్ ఆహారవాహికలో సులభంగా కదులుతూ, కిందికి జరుగుతుంది.

ప్రశ్న 28.
చిన్నప్రేగులోని ఆంత్రచూషకాల నిర్మాణాన్ని తెలిపే చిత్రం గీయండి. జీర్ణవ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థలలో గల సహ సంబంధాన్ని వివరించండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 7

  1. శరీరంలో జీర్ణవ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ సమన్వయంగా పనిచేస్తుంటాయి.
  2. జీర్ణక్రియ వలన జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగులోనికి చేరుతుంది.
  3. చిన్న ప్రేగు లోపలి తలం అనేక ముడతలు పడి, వ్రేళ్ళ వంటి ఆంత్రచూషకాలను ఏర్పరుస్తుంది.
  4. ఈ ఆంత్రచూషకాలలో రక్తకేశనాళికలు, లింఫ్ గ్రంథులు విస్తరించి ఉంటాయి.
  5. జీర్ణమైన సరళ పదార్థాలు ఆంత్రచూషకంలోని రక్తంలోనికి విసరణ చెందుతాయి.
  6. రక్తంలోనికి చేరిన ఆహారపదార్థాలు శరీరమంతా సరఫరా చేయబడతాయి.

ప్రశ్న 29.
ఆహారపదార్థాల వాసన లేదా వాటిని చూసిన వెంటనే ఆకలి ప్రేరేపింపబడుతుంది. దీనిని సూచిరిచే చిత్రాన్ని గీయండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 8

ప్రశ్న 30.
నోటి నుండి జీర్ణాశయం వరకు ఆహారపదార్థాల కదలికలను చూపే పటాన్ని గీయండి. ఆహార కదలికలకు ఏ ఏ నాడులు, కండరాలు తోడ్పడతాయి? (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 6

  1. ఆహారం ఆస్యకుహరంలోనికి ,నెట్టడానికి 5వ కపాల నాడి దవడలోని అంతర కండరాలను నియంత్రిస్తుంది.
  2. నోటిలో ఉండే వలయాకారపు కండరాలు ఆహారాన్ని నోటి కుహరంలో నెట్టడంలోనూ మరియు నోటిలో చుట్టూ కదిలించడంలోనూ సహాయపడతాయి.
  3. ఆహారాన్ని నేరుగా మింగడం సాధ్యం కాదు. కాబట్టి దంతాలు ఆహారాన్ని విసిరి, నమిలి, చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఈ విధానాన్ని నమలడం ద్వారా చూర్ణం చేయడం (Mastication) అంటారు.
  4. ఈ పనికోసం దవడలోని ఉపరితల కండరాలు ఆహారాన్ని దంతాల కిందికి నెట్టి కొరకడం మరియు నమలడం క్రియలను నిర్వహిస్తాయి.
  5. దవడలోని అంతర కండరాలు ఆహారం నమిలేటప్పుడు దవడను పైకి, కిందకు, ముందుకు, వెనుకకు కదిలించడంలో తోడ్పడతాయి.
  6. ఆహారవాహికలో ఆహారం పెరిస్టాల్ సిస్ వలన క్రిందకు నెట్టబడి జీర్ణాశయం చేరుతుంది.
  7. పెరిస్టాల్సిస్ ప్రక్రియలో ఆహారవాహికలోని వలయ కండరాలు, నిలువు కండరాలు ఏకాంతరంగా సంకోచసడలింపులు జరుపుతాయి.

ప్రశ్న 31.
పాషాప్ ప్రయోగాన్ని ప్రతిబింబించేలా ఒక కార్టూన్ గీసి, దానికి సరిపోయేలా ఒక నినాదాన్ని రాయండి. (AS6)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 9

ప్రశ్న 32.
విసిరే యంత్రమైన జీర్ణాశయాన్ని మీరు ఎలా అభినందిస్తారు? ఈ ప్రక్రియ ఎలా సమన్వయం చేయబడుతుంది? (AS6)
జవాబు:

  1. జీర్ణాశయం జీర్ణవ్యవస్థలో పెద్ద భాగం. ఇది ఆహారాన్ని కొన్ని గంటల పాటు నిల్వ చేస్తుంది. ఈ మార్కులు
  2. జీర్ణాశయం గోడలు, పెరిస్టాల్‌ సిస్ కదలికను జరిపి ఆహారాన్ని కదపటం ద్వారా బాగా చిలకబడుతుంది.
  3. జీర్ణాశయం లేకపోతే ఆహారం మనం నిల్వ చేసుకోలేము. జీర్ణక్రియను సమర్థవంతంగా నిర్వర్తించుకోలేము.
  4. జీర్ణాశయంలోని జఠర రసము, ఆహారాన్ని పాక్షికంగా జీర్ణం చేసి ద్రవస్థితికి తీసుకువస్తుంది. దీనిని కైమ్ అంటారు.
  5. వాస్తవానికి జీర్ణాశయం రుబ్బు రోలు వంటి నిర్మాణం. ఇది కండర మరియు నాడీవ్యవస్థల సమన్వయంతో కదలికలను నిర్వహిస్తుంది.
  6. జీర్ణవ్యవస్థలో కీలకపాత్ర వహించే జీర్ణాశయం అద్భుతమైనది. దాని సేవలు అభినందనీయం.

ప్రశ్న 33.
ఎంతో వైవిధ్యంతో కూడిన జీవ ప్రక్రియలను గురించిన మీ భావాలతో ఒక కవితను రాయంది. (AS7)
జవాబు:
అద్భుతమైనది ప్రకృతి
ఇంకెంతో అద్భుతమైనది మానవ జీవి
అన్ని జీవుల కంటే మెరుగైనది
తెలివితేటలలో ముందున్నది

జీవక్రియలన్ని సంక్లిష్టము
అయినా అన్నింటి మధ్య సమన్వయం
కలిసికట్టుగా పనిచేస్తాయి
జట్టుగా జీవక్రియలను నిర్వహిస్తాయి

కలిసి పనిచేస్తే కలుగు విజయం
ఐకమత్యమే మహాబలం
ఇది శరీరధర్మ శాస్త్ర చక్కని సూత్రం
ఆచరిస్తే మన అభివృద్ధి ఖాయం

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 34.
ప్రస్తుత పాఠ్యాంశాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆహారం తీసుకొనే సమయంలో అలవాటు చేసుకోవాల్సిన ఏ రెండు అంశాలను గురించి మీ మిత్రునికి సలహా ఇస్తారు? (AS7)
జవాబు:

  1. ఆహారం తీసుకొనే సమయంలో ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. ఆత్రుతగా, గబగబా మింగరాదు. నోటితో ఆహారం బాగా నమలటం వలన జీర్ణాశయంపై ఒత్తిడి తగ్గుతుంది. కావున భోజనానికి సమయం కేటాయించుకొని నెమ్మదిగా తినాలి.
  2. రోజు నిర్దిష్ట వేళకు భోజనం చేయటం అలవాటు చేసుకోవాలి. దీనివలన జీర్ణరసాలు నిర్దిష్టంగా పనిచేస్తాయి. ఆహార సమయంలో మార్పు జీర్ణవ్యవస్థను ఇబ్బందికి గురి చేస్తుంది.
  3. ఆహారం తినేటప్పుడు మాట్లాడుతూ తినటం కంటే, మౌనంగా తినటం మంచిది.

10th Class Biology 7th Lesson జీవక్రియలలో సమన్వయం Textbook InText Questions and Answers

10th Class Biology Textbook Page No. 154

ప్రశ్న 1.
మనకు ఆహారం అవసరం అని ఎలా తెలుస్తుంది?
జవాబు:
రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గితే వెంటనే మనకు ఆకలి వేసినట్లు అనిపిస్తుంది. అలాగే జీర్ణాశయం ఖాళీ అయినపుడు, జీర్ణాశయ గోడలలోని కొన్ని కణాలు ‘గ్రీలిన్’ అనే హార్మోను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్ ఆకలి సంకేతాలను ఉత్పత్తి చేసి మెదడుకు పంపుతుంది. మెదడుకు సంకేతాలు చేరగానే ఆకలి కోరికలు జీర్ణాశయంలో మొదలవుతాయి.

ప్రశ్న 2.
కేంద్రీయ లేదా పరిధీయ నాడీవ్యవస్థలలో ఏ నాడీవ్యవస్థ ఆకలి ప్రచోదనాలను నియంత్రిస్తుంది?
జవాబు:
పరిధీయ నాడీవ్యవస్థలోని స్వయంచోదిత నాడీవ్యవస్థ ఆకలి ప్రచోదనాలను నియంత్రిస్తుంది.

ప్రశ్న 3.
ఎలాంటి నియంత్రణలు ఆకలి ప్రచోదనాలపై ప్రభావం చూపుతాయి? అవి హార్మోన్ల సంబంధమైనవా లేదా నాడీ సంబంధమైనవా లేదా రెండూనా?
జవాబు:
ఆకలి నియంత్రణ పై హార్మోన్స్, నాడీవ్యవస్థ సమన్వయంగా పనిచేస్తాయి. జీర్ణాశయం ఖాళీ అయినపుడు ‘గ్రీలిన్ అనే హార్మోన్ స్రవించబడి, ఆకలి సందేశాలను నాడీ మార్గం ద్వారా మెదడుకు పంపుతుంది.

శరీరంలోని స్వయంచోదిత నాడీవ్యవస్థ ఆకలి కోరికలను నియంత్రిస్తుంది. మెదడులోని డైయన్ సెఫలాన్ మరియు వేగస్ నాడీ ఈ సంకేతాలను చేరవేయటంలో కీలకపాత్ర వహిస్తాయి.

10th Class Biology Textbook Page No. 155

ప్రశ్న 4.
ఆకలి ప్రచోదనాలను ఉత్పత్తి చేసే క్రియలో పాలుపంచుకొనే ఏవైనా నాలుగు వ్యవస్థలను సూచించండి.
జవాబు:
ఆకలి ప్రచోదనాలను ఉత్పత్తి చేయటంలో 1. అంతఃస్రావీ వ్యవస్థ 2. నాడీవ్యవస్థ పాల్గొనగా వాటి ఆదేశాలను నిర్వహించటంలో 3. జీర్ణవ్యవస్థ 4. రక్తప్రసరణ వ్యవస్థ పాల్గొంటాయి.

ప్రశ్న 5.
చెడిపోయిన ఆహారాన్ని గుర్తించడంలో ప్రధానపాత్ర పోషించే భాగమేది?
జవాబు:
చెడిపోయిన ఆహారం దుర్గంధం వేస్తుంది. వాసన ద్వారా ముక్కు చెడిపోయిన ఆహారాన్ని గుర్తిస్తుంది. పాడైపోయిన ఆహారం రుచి సరిగా ఉండదు. కావున నాలుక కూడా చెడిపోయిన ఆహారం గుర్తిస్తుంది.

ప్రశ్న 6.
రుచికరమైన భోజనం చేస్తున్నప్పుడు అందులోని సువాసన ఆకలిని పెంచుతుందని భావిస్తున్నారా?
జవాబు:
రుచి ఆహార వాసనపై ఆధారపడి ఉంటుంది. ఆహారంలోని సువాసన ముక్కు ద్వారా గ్రహించబడి మెదడుకు సందేశాలు పంపించటం వలన, తినాలనే కోరిక పెరుగుతుంది. కావున భోజనం చేస్తున్నప్పుడు అందులోని సువాసన ఆకలిని పెంచుతుందని భావిస్తున్నాను.

10th Class Biology Textbook Page No. 156

ప్రశ్న 7.
ఆహార పదార్థాలను నోటిలో వేసుకొన్నప్పుడు ఏమవుతుంది?
జవాబు:

  1. ఆహార పదార్థాలను నోటిలో వేసుకొన్నప్పుడు అవి నోటిలోని లాలాజలంలో కరుగుతాయి.
  2. కరిగిన ఆహారం నాలుక మీద ఉన్న రుచి మొగ్గలలోనికి చేరుతుంది.
  3. రుచి మొగ్గలలోని రసాయన గ్రాహకాలు రుచిని గుర్తిస్తాయి.

ప్రశ్న 8.
రుచిని తెలుసుకోవటానికి ఉపయోగపడే నోటి భాగాలు ఏవి?
జవాబు:
రుచిని తెలుసుకోవటానికి నోటిలోని లాలాజలం, నాలుక మీది రుచి మొగ్గలు ప్రధానపాత్ర వహిస్తాయి.

10th Class Biology Textbook Page No. 157

ప్రశ్న 9.
రుచిపై ప్రభావం చూపే మరేవైనా ఇతర ఉద్దీపనలు ఉన్నాయా?
జవాబు:

  1. రుచిపై ప్రభావం చూపే కారకాలలో వాసన ముఖ్యమైనది. జలుబు చేసినపుడు ముక్కు సరిగా వాసన గ్రహించక పోవటం వలన మనకు పదార్థాలు చప్పగా ఉంటాయి.
  2. అతివేడి, అతి చల్లని పదార్థాల రుచిని కూడ మనం గుర్తించలేము. అంటే రుచి పదార్ధ ఉష్ణోగ్రత పై కూడ ఆధారపడి ఉంటుంది.

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 10.
బాగా వేడిగా ఉన్న పాలు లేదా టీ తాగినపుడు రుచి స్పందన ఏమవుతుంది?
జవాబు:
బాగా వేడిగా ఉన్న పాలు లేదా టీ తాగినపుడు నాలుక వాటి రుచిని సరిగా గుర్తించలేదు. రుచి మొగ్గలు శరీర ఉష్ణోగ్రత నగరగా ఉండే పదార్థాల రుచిని సరిగ్గా గుర్తించగలుగుతాయి. కాని కొన్ని పదార్థాలు కొంచెం వేడిగా ఉన్నప్పు. ఎకరంగా ఉంటాయి. ఉదా : పాలు, టీ, వేడి కూరలు కొన్ని పదార్థాలు చల్లగా ఉన్నప్పుడు రుచికరంగా ఉంటాయి.
ఉదా : ఐస్ క్రీం, పుచ్చకాయ

ప్రశ్న 11.
ఏ ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడు పదార్థాలు రుచికరంగా ఉంటాయని నీవు భావిస్తున్నావు?
జవాబు:
శరీర ఉష్ణోగ్రతలకు, ఇంచుమించు దగ్గరగా ఉన్న పదార్థాలు రుచికరంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. అంటే 35°C నుండి 40°C మధ్య పదార్థాలు రుచిగా ఉంటాయి.

10th Class Biology Textbook Page No. 158

ప్రశ్న 12.
కింది ఫ్లోచార్టు రుచి జ్ఞానానికి సంబంధించి ఎలాంటి మార్గాన్ని నిర్దేశిస్తుంది?
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 17
జవాబు:

  1. ఫ్లోచార్టు ఆధారంగా రుచి, ముక్కు, నోరు, నాలుక పనితీరుపై ఆధారపడుతుందని తెలుస్తుంది.
  2. ముక్కులోని వాసన గ్రాహకాలు, నోటిలోని లాలాజల గ్రంథులు, నాలుక మీద రుచిగ్రాహకాలు కలిసి రుచిని గుర్తించటంలో తోడ్పడతాయి.
  3. జలుబు చేసినపుడు రుచిని సరిగా గుర్తించకపోవటం, వాసన గ్రాహకాలు సరిగా పనిచేయకపోవటం వలన జరుగుతుంది.
  4. అదే విధంగా నోరు తడి ఆరినపుడు, రుచిని గ్రహించలేము.
  5. ఆహారాన్ని అంగిలి రుచి మొగ్గలలోనికి నొక్కినపుడు మనం రుచిని గ్రహించగల్గుతున్నాము.

ప్రశ్న 13.
నోటిలో లాలాజల గ్రంథులు పనిచేయకపోతే ఏం జరుగుతుంది?
జవాబు:

  1. నోటిలో లాలాజల గ్రంథులు పనిచేయకపోతే, ఆహారం మెత్తగా నమలబడదు.
  2. ఆహారం బోలగా మారదు కావున మ్రింగటం కష్టమవుతుంది.
  3. ఆహారం కరగదు కావున, రుచిని గుర్తించలేము.

ప్రశ్న 14.
రుచిగ్రాహకాలు పనిచేయకపోతే మనం తీసుకొనే ఆహారంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది?
జవాబు:

  1. రుచిగ్రాహకాలు పనిచేయకపోతే, మనం ఆహారం రుచిని గుర్తించలేము.
  2. రుచిలేని ఆహారాన్ని ఇష్టముగా తినలేము.

10th Class Biology Textbook Page No. 159

ప్రశ్న 15.
నోట్లో యాంత్రికంగా ముక్కలు చేసే ప్రక్రియ ఎలా జరుగుతుంది?
జవాబు:
మన నోటిలో దవడల మీద నాలుగు రకాల దంతాలు ఉంటాయి. ఇవి ఆహారాన్ని ముక్కలు చేయటంతో పాటు చూర్ణం చేస్తాయి. ఈ ప్రక్రియలో ఆహారాన్ని దంతాల మధ్యకు చేర్చటానికి నాలుక సహాయపడుతుంది.

ప్రశ్న 16.
ఆహారాన్ని ముక్కలు చేయటానికి నోటిలోని ఏ భాగాలు తోడ్పడతాయి?
జవాబు:
ఆహారాన్ని ముక్కలు చేయటానికి 1. దంతాలు 2. నాలుక 3. లాలాజల గ్రంథులు తోడ్పడతాయి.

ప్రశ్న 17.
ఆహారాన్ని ముక్కలు చేయటంలో ఏయే వ్యవస్థలు ఈ ప్రక్రియలో భాగమవుతాయి?
జవాబు:
ఆహారాన్ని ముక్కలు చేయటంలో 1. జీర్ణవ్యవస్థ 2. కండర వ్యవస్థ (నాలుక, దంతాల కదలిక) 3. నాడీవ్యవస్థ (ఆదేశాలు) పాల్గొంటాయి.

10th Class Biology Textbook Page No. 160

ప్రశ్న 18.
నోటిలో ఆహారం ఉన్నప్పుడు లాలాజలం స్రవించే స్థాయి పెరుగుతుందా?
జవాబు:
నోటిలో ఆహారం ఉన్నప్పుడు లాలాజలం అధికంగా స్రవించబడుతుంది. దీనివలన ఆహారం బాగా నమలటంతోపాటు ‘ ‘బోలస్’ ఏర్పడటం సులభమౌతుంది.

ప్రశ్న 19.
లాలాజలం లేకుండా ఆహారం నమిలే ప్రక్రియ జరుగుతుందా?
జవాబు:
లాలాజల గ్రంథులు, దవడ మరియు నాలుక క్రిందనే ఉంటాయి. నమిలేటప్పుడు దవడ కదలిక వలన లాలాజలం అధికంగా స్రవించబడుతుంది. లాలాజలం లేకుండా ఆహారం నమిలే ప్రక్రియ జరగదు.

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 20.
లాలాజలం నిర్వహించే ఇతర విధులు ఏమైనా ఉన్నాయా?
జవాబు:

  1. లాలాజలం ఎమైలేజ్ (టైలిన్) ఎంజైమ్ ను కలిగి ఉండి పిండి పదార్థాలను చక్కెరగా మార్చును.
  2. ఆహారం మెత్తగా నమలటంలో లాలాజలం తోడ్పడుతుంది.
  3. నమిలిన ఆహారం ముద్దగా (బోలస్) మారటానికి లాలాజలం అవసరం.
  4. ఆహారము ఆహారనాళంలో సులువుగా జారటానికి లాలాజలం తోడ్పడుతుంది.

10th Class Biology Textbook Page No. 161

ప్రశ్న 21.
ఆహారపదార్థపు ఉపరితల పరిమాణం పెరగటం వల్ల లాభం ఏమిటి?
జవాబు:
ఆహారపదారపు ఉపరితల పరిమాణం పెరగటం వలన, ఎంజైమ్స్ పని చేసే స్థలం పెరుగుతుంది. అందువలన ఆహారం సులువుగా జీర్ణమవుతుంది.

ప్రశ్న 22.
ఆహారాన్ని నమలకుండా మింగితే ఏం జరుగుతుంది?
జవాబు:
ఆహారాన్ని నమలకుండా మింగితే, ఆహార పరిమాణం తగ్గి ఎంజైమ్స్ పని చేసే విస్తీర్ణం తగ్గుతుంది. అందువలన ఆహారం త్వరగా జీర్ణమవ్వదు.

ప్రశ్న 23.
లాలాజల ఎమైలేజ్ ఆహారంపై చర్య జరపటానికి మాధ్యమ స్వభావం ఎలా ఉండాలి?
జవాబు:
లాలాజలం ఎమైలేజ్ ఆహారంపై చర్య జరపటానికి మాధ్యమ స్వభావం క్షారయుతంగా ఉండాలి.

ప్రశ్న 24.
నోటిలో pH మారుతూ ఉంటుందని నీవు అభిప్రాయపడుతున్నావా?
జవాబు:
తినే ఆహార స్వభావం బట్టి, ఆహారం తినే సమయంలో నోటిలో pH మారుతూ ఉంటుంది.

ప్రశ్న 25.
నోటిలో జరిగే జీర్ణక్రియలో తోడ్పడే వివిధ వ్యవస్థలేవి?
జవాబు:
నోటిలో జరిగే జీర్ణక్రియలో కండర వ్యవస్థ, నాడీవ్యవస్థ కూడ పనిచేస్తాయి.

ప్రశ్న 26.
నోటిలోని జీర్ణప్రక్రియ తరువాత ఆహారం ఎక్కడికి వెళుతుంది?
జవాబు:
నోటిలోని జీర్ణక్రియ తరువాత ఆహారం ముద్దగా మార్చబడి ఆహారవాహికలోనికి నెట్టబడుతుంది. ఆహారవాహిక ద్వారా ఆహారం జీర్ణాశయం చేరుతుంది.

10th Class Biology Textbook Page No. 162

ప్రశ్న 27.
కింది రేఖాపటం ఆహారవాహిక యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక లక్షణాలను వివరిస్తుంది. పటాన్ని పరిశీలించి ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 18
1. ఈ సమాచార రేఖాచిత్రం ఆహారవాహిక గురించి ఏమి తెలియజేస్తోంది?
జవాబు:
ఆహారవాహిక, పొడవైన గొట్టంవలె ఉండి, గ్రసని జీర్ణాశయాన్ని కలుపుతుంది. ఇది పెరిస్టాలసిస్ చలనం ద్వారా ఆహారాన్ని జీర్ణాశయం చేర్చుతుంది. ఇది స్థితిస్థాపక కండరాలను కలిగి, శ్లేష్మాన్ని స్రవిస్తుంది.

2. ఆహారవాహిక ఏ విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది?
జవాబు:
ఆహారవాహిక పొడవైన గొట్టం వంటి నిర్మాణం కలిగి ఉంది.

3. ఆహారవాహికలో ఆహారం ప్రయాణించడానికి శ్లేష్మసరం ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:
ఆహారవాహికలో శ్లేష్మం జారుడు పొరవలె పనిచేసి ఆహారాన్ని క్రిందకు జార్చుతుంది.

4. బంగాళాదుంపలు గొట్టం గుందా కదలడానికి నూనె ఎలా సహాయపడుతుంది?
జవాబు:
సూనె జారుడు పదార్థంగా పనిచేసి బంగాళదుంపలు క్రిందికి జారేలా చేస్తుంది.

10th Class Biology Textbook Page No. 163

ప్రశ్న 28.
ఆహారవాహికలో ఆహార ముద్ద స్థానంలో మార్పు ఎలా సంభవిస్తుంది?
జవాబు:
ఆహారవాహికలోని వలయ కండరాలు సంకోచం వలన ఆహార ముద్ద క్రిందకు జారుతుంది. ఇదే సందర్భంలో నిలువు కండరాల సడలింపు వలన ఆహారవాహిక మార్గం వెడల్పై ఆహారం సులువుగా క్రిందకు జారుతుంది.

ప్రశ్న 29.
బంగాళదుంప కదిలే ప్రయోగానికి, ఆహారవాహికలోని ఆహార చలనానికి మధ్య పోలికలు మీరు గమనించారా? అవి ఏమిటి?
జవాబు:
నెకిట్యూబ్ లో బంగాళదుంప కదలిక ఆహారవాహికలోని ఆహార ముద్ద కదలికను పోలి ఉంటుంది. ఈ ప్రక్రియలో సైకి ట్యూట్ ను ఆహారవాహికతోనూ, బంగాళదుంపను ఆహార ముద్దతోనూ, ట్యూబ్ కు రాసిన నూనెను, లాలాజలంతోనూ పోల్చవచ్చు.

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 30.
ఆహారవాహికలో ఆహార బోలన్ సులభంగా కదలడానికి సహాయపదేదేమిటి?
జవాబు:
ఆహారవాహికలో ఆహారం సులభంగా కదలడానికి లాలాజలం సహాయపడుతుంది. ఇది ఆహారం సులువుగా జారటానికి తోడ్పడుతుంది.

ప్రశ్న 31.
సాధారణంగా ఆహారాన్ని నమలకుందా మింగకూడదని లేదా తొందరపడి త్వరత్వరగా తినవద్దని సలహాలిస్తుంటారు. ఎందుకని? ఆలోచించండి.
జవాబు:
ఆహారాన్ని నమలకుండా మింగటం వలన జీర్ణక్రియ ఎంజైమ్స్ సరిగా పనిచేయలేవు. అందువలన ఆహారం జీర్ణమవటం కష్టమవుతుంది. ఆహారాన్ని బాగా నమిలినపుడు లాలాజలం ఎక్కువగా చేరి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అందువలన తొందరపడి త్వరత్వరగా తినవద్దని సలహాలిస్తుంటారు.

10th Class Biology Textbook Page No. 164

ప్రశ్న 32.
ఆహారనాళం మాదిరిగా జీర్ణాశయం ఒక గొట్టంలా కాకుండా సంచిలా ఎందుకు నిర్మితమై ఉంది?
జవాబు:
ఆహారాన్ని నిల్వ చేయటం జీర్ణాశయం యొక్క ప్రధాన విధి. ఆహార నిల్వకు జీర్ణాశయ పరిమాణం పెద్దదిగా ఉండాలి. అందువలన జీర్ణాశయం గొట్టంలా కాకుండా సంచిలా ఉంది.

ప్రశ్న 38.
జీర్ణాశయంలో ఈ ప్రక్రియలు ఎలా జరుగుతాయి?
జవాబు:

  1. జీర్ణాశయంలో 3 నుండి 4 గంటల పాటు ఆహారం నిల్వ చేయబడుతుంది.
  2. నిల్వ చేయబడిన ఆహారం జీర్ణాశయ గోడలచే చిలకబడుతుంది.
  3. జీర్ణాశయ గోడలు స్రవించే జఠర రసం ఆహారాన్ని జీర్ణం చేస్తుంది.

ప్రశ్న 34.
జీర్ణాశయపు కండరాలు చర్య జరిపేలా ఉత్తేజపరిచే అంశం ఏమిటి?
జవాబు:
ఆహారం జీర్ణాశయాన్ని చేరినపుడు, జీర్ణాశయ గోడలు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని స్రవిస్తుంది. దీనివలన నాడీవ్యవస్థ ఉత్తేజితమై, జీర్ణాశయ గోడలలో సంకోచ సడలికలు జరుపుతుంది.

ప్రశ్న 35.
కలుపుట మరియు చిలుకుట ప్రక్రియలను జీర్ణాశయం ఎందుకు నిర్వహిస్తుంది?
జవాబు:
జీర్ణాశయంలో ఆహారం కలపటం, చిలకటం వలన ఆహారం జీర్ణరసాలతో బాగా కలిసిపోయి, జీర్ణక్రియ సమర్ధవంతంగా జరుగుతుంది.

ప్రశ్న 36.
అసంపూర్ణంగా జీర్ణమైన ఆహారం స్వల్ప మోతాదులో జీర్ణాశయం నుండి ఆంత్రమూలంలోనికి ఎందుకు చేరుతుంది?
జవాబు:

  1. జీర్ణాశయం తరువాత, ఆహారం తరువాత భాగమైన ఆంత్రమూలంలోనికి చేరుతుంది.
  2. ఆంత్రమూలం చిన్నదిగా ఉండే వంపు తిరిగిన భాగం.
  3. ఈ ప్రాంతంలో ముఖ్యమైన కాలేయం, క్లోమం వంటి జీర్ణ గ్రంథులు తమ జీర్ణరసాన్ని స్రవిస్తాయి.
  4. ఆంత్రమూలంలో ఆహారం పూర్తిగా జీర్ణం కావలసి ఉంటుంది.
  5. కావున జీర్ణాశయం నుండి స్వల్ప మోతాదులో ఆహారం ఆంత్రమూలంలోనికి చేరుతుంది.

10th Class Biology Textbook Page No. 165

ప్రశ్న 37.
పెరిస్టాల్ సిస్ చర్య జరగటంలో ఏ ఏ భాగాలు ఇమిడి ఉంటాయి?
జవాబు:
పెరిస్టాల్ సిస్ చర్య జరగటంలో వలయకండరాలు, నిలువు కండరాలు, ఏకాతరంగా సంకోచ సడలింపులు జరుపుతాయి.

ప్రశ్న 38.
పెరిస్టాల్సస్ ఏ దిశలో జరుగుతుంది? (ఆహారనాళంలోని ఏ చివర నుండి మొదలవుతుంది?)
జవాబు:
పెరిస్టాల్సస్ నోటివైపు నుండి క్రిందకు జీర్ణాశయం వైపు జరుగుతుంది.

ప్రశ్న 39.
పెరిస్టాలిసిస్ అపసవ్యదిశలో జరిగితే ఏమి జరుగుతుంది?
జవాబు:
పెరిస్టాల్సస్ అపసవ్యదిశలో జరిగితే, జీర్ణాశయంలోని ఆహారం బయటకు వస్తుంది. దీనినే ‘వాంతి’ అంటారు.

10th Class Biology Textbook Page No. 167

ప్రశ్న 40.
చిన్నప్రేగు ఎందుకు పొడవుగా మెలికలు తిరిగి చుట్టలా ఉంటుంది?
జవాబు:

  1. జీర్ణమైన ఆహారాన్ని రక్తంలోనికి పీల్చుకోవడాన్ని శోషణ అంటారు. ఇది చిన్న ప్రేగులో జరుగుతుంది.
  2. శోషణాతల వైశాల్యం పెంచటానికి అనువుగా చిన్నప్రేగు పొడవుగా మెలికలు తిరిగి ఉంటుంది.

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 41.
చిన్నప్రేగులో శోషణ ఎలా జరుగుతుంది?
జవాబు:
చిన్న ప్రేగు గోడల లోపలి తలంలో వేల సంఖ్యలో వేళ్ళవంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని ఆంత్రచూషకాలు (villi) అంటారు. వీటిలో ఉండే రక్తనాళాలు, శోషనాళాలు జీర్ణమైన ఆహారాన్ని గ్రహిస్తాయి. దీనినే “శోషణ” అంటారు.

10th Class Biology Textbook Page No. 168

ప్రశ్న 42.
మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు విరేచనాలు కావటం లాంటి పరిస్థితులు మీరు అనుభవించే ఉంటారు. ఇది మనకు ఏమి తెలుపుతుంది?
జవాబు:

  1. మానసిక ఒత్తిడికి లోనైనపుడు విరోచనాలు కావటం మనం అనుభవించే ఉంటాము.
  2. దీనినిబట్టి నాడీవ్యవస్థ, జీర్ణవ్యవస్థ, అంతఃస్రావీ వ్యవస్థలు ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయని చెప్పవచ్చు.

10th Class Biology Textbook Page No. 169

ప్రశ్న 43.
చిన్నప్రేగుల్లోంచి బయటకు ఏమి కదులుతుంది?
జవాబు:
జీర్ణమైన ఆహారం చిన్నప్రేగులలోకి పీల్చుకోబడుతుంది. మిగిలిన జీర్ణంకాని ఆహారం చిన్న ప్రేగు నుండి పెద్ద ప్రేగుకు చేరుతుంది. పెద్ద ప్రేగులో జీర్ణంకాని ఆహారం నుండి నీరు పీల్చుకోబడి మలం ఏర్పడుతుంది. ఇది మల విసర్జన ద్వారా శరీరం నుండి పాయువు ద్వారా బయటకు విసర్జించబడుతుంది.

ప్రశ్న 44.
వ్యర్థాల విసర్జన యొక్క రెండు ప్రధాన మార్గదర్శకాలు పైన చూపబడ్డాయి. రెండింటిలో కేవలం ప్రేగుల ద్వారా జరిగే ప్రక్రియ ఏది?
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 19
జవాబు:
జీర్ణంకాని ఆహారం మలం రూపంలో ప్రేగుల ద్వారా విసర్జింపబడుతుంది.

ప్రశ్న 45.
మల విసర్జనాన్ని శరీరంలోని ఏ భాగం నియంత్రిస్తుంది? ఈ చర్య నియంత్రితమా? అనియంత్రితమా? ఎందుకు?
జవాబు:

  1. మల విసర్జన పాయువు ద్వారా జరుగుతుంది. పాయువు రెండు సంవరిణీ కండరాలు (Anal sphincter) కలిగి మల విసర్జనను నియంత్రిస్తుంది. వీటిలో లోపలి సంవరిణీ కండరం అనియంత్రితంగాను, బాహ్య సంవరిణీ కండరం నియంత్రితంగాను పనిచేస్తుంది.
  2. నిర్ణీత స్థాయి వరకు మల విసర్జన నియంత్రిత చర్యగా ఉంటుంది. చిన్నపిల్లల్లో ఇది పూర్తిగా అనియంత్రితంగా ఉండి పెరిగే కొలది, నియంత్రితంగా మారుతుంది.

10th Class Biology Textbook Page No. 170

ప్రశ్న 46.
ఆహారనాళంలో ఎక్కడైనా సంవరిణీ కండరాలు ఉన్నాయా? ఎక్కడ?
జవాబు:

  1. ఆహారనాళం ప్రారంభంలో గ్రసని వద్ద ఒక సంవరిణీ కండరం ఉంటుంది. ఆహారం మ్రింగడాన్ని ఇది నియంత్రిస్తుంది.
  2. జీర్ణాశయం, ఆంత్రమూలం మధ్యన ‘సంవరణీ కండరం’ ఉంటుంది. ఇది ఆంత్రమూలంలో ప్రవేశించే ఆహారాన్ని నియంత్రిస్తుంది.
  3. ఆహారనాళం చివరి భాగాన పురీషనాళం పాయు సంవరణీ కండరం కల్గి ఉంటుంది. ఇది మల విసర్జనను నియంత్రిస్తుంది.

ప్రశ్న 47.
ఒక వేళ వ్యక్తి తన శరీరానికి కావాల్సిన పరిమాణం కన్నా ఎక్కువ ద్రవాలను తీసుకున్నాడనుకుందాం. అప్పుడు ఎక్కువగా ఉన్న ద్రవం శరీరం నుండి ఏ విధంగా తొలగించబడుతుంది?
జవాబు:
ఎక్కువగా తీసుకొన్న నీరు చిన్నప్రేగు, పెద్దప్రేగు ద్వారా రక్తంలోనికి పీల్చుకొనబడుతుంది. ఈ నీరు మూత్రపిండాలను చేరినపుడు వడపోతకు గురై, అధికంగా ఉన్న నీరు రక్తం నుండి వేరు చేయబడుతుంది. ఈ నీరు మూత్రపిండాల నుండి మూత్రం రూపంలో విసర్జించబడుతుంది. అధికంగా నీరు త్రాగినపుడు మూత్రవిసర్జన కూడా అధికంగా ఉంటుంది.

ప్రశ్న 48.
జీవక్రియ ప్రక్రియలు సజావుగా సాగడానికి కావాల్సిన శక్తి ఎక్కడి నుండి సమకూరుస్తుంది?
జవాబు:
జీవక్రియలకు కావలసిన శక్తి శ్వాసక్రియ నుండి సమకూరుతుంది. ఆహారపదార్థాలను ఆక్సీకరణం చెందించి, శ్వాసక్రియ, మిగిలిన జీవక్రియలకు కావాల్సిన శక్తిని అందిస్తుంది.

ప్రశ్న 49.
ప్రేగుల నుండి రక్తంలోకి చేరిన జీర్ణమైన ఆహార పదార్థాలు ఏమవుతాయి?
జవాబు:
ప్రేగుల నుండి రక్తంలోకి చేరిన జీర్ణమైన ఆహారపదార్థాలు కణాలకు అందించబడతాయి. ఈ పదార్థాలు కణ శ్వాసక్రియ చెంది కణానికి కావలసిన శక్తిని అందిస్తాయి.

ప్రశ్న 50.
విడుదలైన శక్తి కణాలలో ఎక్కడ నిలవ ఉంటుంది?
జవాబు:
విడుదలైన శక్తి కణాలలో ATP (ఎడినోసిన్ ట్రై ఫాస్ఫేట్) రూపంలో నిలువ ఉంటుంది. దీనిని ఎనర్జీ కరెన్సీ అంటారు. కణం తన జీవక్రియల కొరకు దీనిని ఉపయోగించుకొంటుంది.

ప్రశ్న 51.
మన శరీరంలో ఎక్కువగా ఉన్న లవణాలను బయటకు పంపే వ్యవస్థ ఏది?
జవాబు:
శరీరంలో ఎక్కువగా ఉన్న లవణాలు రక్తంలో చేరి, మూత్రపిండాలలో వడపోతకులోనై వేరు చేయబడతాయి. ఇలా తొలగించిన లవణాలు మూత్రం రూపంలో విసర్జింపబడతాయి. మరికొన్ని లవణాలు స్వేదగ్రంథుల ద్వారా చెమట రూపంలో విసర్జింపబడతాయి.

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 52.
శరీరం నుండి లవణాలు ఏ మార్గం ద్వారా బయటకు వస్తాయి?
జవాబు:
శరీరం నుండి లవణాలు, మూత్రం ద్వారా బయటకు వస్తాయి. మరికొన్ని చెమట రూపంలో విసర్జింపబడతాయి.

10th Class Biology 7th Lesson జీవక్రియలలో సమన్వయం Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

→ కింది పట్టికను పరిశీలించండి. మీ దృష్టిలో ఆకలి వేయడానికి గల కారణాలను (✓) తో గుర్తించండి. మీ స్నేహితులతో చర్చించండి.
పట్టిక
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 10

1. ఏ ఏ కారకాలు ఆకలిని ఉత్తేజపరుస్తాయి?
జవాబు:
వాసన, రుచి, అలసట, నీరసం, ఆహార అవసరం వంటి కారకాలు ఆకలిని ఉత్తేజపరిచాయి.

2. ఆకలవుతోందని తెలిసేలా చేసే ఉద్దీపనల వలన ఫలితమేమిటి?
జవాబు:
ఆకలి ఉద్దీపనాల ఫలితంగా మనకు ఆహారం తీసుకోవాలనే కోరిక కల్గుతుంది. జీర్ణాశయంలో జీర్ణ ఎంజైమ్స్ స్రవించబడతాయి.

3. మనకు ఆకలి కలుగుతోందని తెలియజేయడానికి ఏ వ్యవస్థ సంకేతాలను పంపుతుంది?
జవాబు:
ఆకలి సంకేతాలు మెదడుకు పంపటానికి 10వ కపాల నాడి (వేగస్ నాడి) తోడ్పడుతుంది. నాడీవ్యవస్థ ద్వారా ఆకలి సంకేతాలు మనకు తెలుస్తాయి.

కృత్యం – 2

→ జీలకర్ర, సోంపు, ఆలుగడ్డ మరియు ఆపిలను నమలడం

ముందుగా వేళ్ళతో ముక్కు మూసుకోండి. కొంచెం జీలకర్రను నోటిలో వేసుకొని కాసేపు నమలండి. తరువాత కొన్ని సోంపు గింజలు నమలండి. వాటి రుచిని గుర్తించగలిగారా? రుచిని గుర్తించడానికి ఎంత సమయం తీసుకుంది? తరవాత నోటిని శుభ్రంగా కడిగి ఒక చిన్న ఆపిల్ ముక్కను నమలండి. తరువాత ఆలుగడ్డ ముక్కల్ని తీసుకొని నమలండి. అయితే నమిలేటపుడు ముక్కును మూసి ఉంచడం మాత్రం మరిచిపోవద్దు.
→ నీవు పరిశీలించిన అంశాలేమిటి?
జవాబు:

  1. ముక్కు మూసుకొన్నప్పుడు జీలకర్ర, సోంపు గింజల రుచిని సరిగా గుర్తించలేకపోయాను.
  2. రుచిని గుర్తించటానికి ముక్కు మూసుకొన్నప్పుడు ఎక్కువ సమయం పట్టింది.
  3. ముక్కును తెరిచి బంగాళదుంప, ఆపిల్ ముక్కలను నమిలినపుడు త్వరగా రుచిని గుర్తించగలిగాను.
  4. దీనినిబట్టి రుచిని గుర్తించటంలో నాలుక పాత్ర కూడా ఉందని నిర్ధారించవచ్చు.
  5. పదార్థం యొక్క రుచి వాసన మీద కూడ ఆధారపడుతుందని భావించవచ్చు.

→ రెండు పదార్థాల రుచులు విడివిడిగా గుర్తించగలిగారా? లేదా రెండింటి రుచి ఒకేలా ఉందా? కారణమేమిటి?
జవాబు:
రెండు పదార్థాల రుచులు విడివిడిగా గుర్తించగలం. రెండింటి రుచి ఒకేలాలేదు. రెండు పదార్థాలు వేరు వేరు రుచులను కలిగి ఉంటాయి.

కృత్యం – 3

→ చిటికెడు ఇంగువ లేదా వెల్లుల్లి తీసుకొని చేతిరుమాలు లేదా టిష్యూ పేపర్‌పై రుద్దండి. కళ్ళు మూసుకొని వాసన చూడండి. మీ స్నేహితుల సహాయంతో వివిధ ఆహార పదార్థాలను రుచి చూడంది.
→ ఆపిల్ కన్నా అల్లం వాసన ఘాటుగా ఉంటుందా? ఘాటైన వాసనలు రుచి స్పందనలపై ప్రభావం చూపిస్తాయని మీరు భావిస్తున్నారా?
జవాబు:
ఆపిల్ కన్నా అల్లం వాసన ఘాటుగా ఉంది. ఘాటైన వాసనలు రుచి పైన ప్రభావం చూపుతాయని నేను భావిస్తున్నాను.

→ మీరు ఎన్ని రకాల ఆహార పదార్థాలను సరిగ్గా గుర్తించగలిగారు?
జవాబు:
నేను దాదాపు 10 రకాల ఆహార పదార్థాల వాసనను సరిగ్గా గుర్తించగలిగాను.

→ వాసన మరియు రుచికి ఏదైనా సంబంధం ఉందని గ్రహించారా? అవి ఏమిటో రాయండి. కేవలం చూడడం ద్వారా ఆహారం రుచిగా ఉందని చెప్పగలరా?
జవాబు:
వాసనకు రుచికి మధ్య దగ్గర సంబంధం ఉంది. మనం రుచిని వాసన ద్వారా మరియు నాలుకతో గుర్తించగలము. కేవలం చూడటం ద్వారా ఆహారం రుచిగా ఉందని చెప్పలేము.

కృత్యం – 4 : నాలుక మీద చక్కెర గుళికలు

→ నాలుక పొడిగా ఉన్నపుడు రుచి తెలుస్తుందా?
జవాబు:
నాలుక పొడిగా ఉన్నప్పుడు రుచి తెలియలేదు.

→ ఏ విధానం త్వరగా రుచిని గ్రహించడంలో తోడ్పడింది? ఎందుకు?
జవాబు:
నాలుకను అంగిలితో నొక్కిపెట్టినపుడు రుచి త్వరగా గ్రహించబడినది. నాలుకను అంగిలి నొక్కినపుడు, ద్రవ ఆహారం, నాలుక మీద ఉన్న రుచి మొగ్గలలోనికి ప్రవేశించటం వలన రుచిని త్వరగా గుర్తించగల్గుతాము.

కృత్యం – 5

వెనిగర్లో ఉంచిన చాక్స్ ప్రయోగం ద్వారా మనం ఆహారాన్ని ఎందుకు నమలాలి? ఆహారం ఎలా విచ్చిన్నమవుతుందో తెలుసుకుందాం.

ఒక చాక్బస్ ముక్కను రెండు ముక్కలుగా చేయండి. ఒక ముక్కను చాలా చిన్న చిన్న ముక్కలుగా చేయండి. మరొక ముక్కను అలాగే ఉంచండి. రెండు బీకర్లు తీసుకోండి. లేదా రెండు మినరల్ వాటర్ బాటిళ్ళు తీసుకొని, పై భాగాన్ని కత్తిరించండి. ఇప్పుడు కింద మిగిలిన భాగాలను బీకర్లుగా ఉపయోగించుకోవచ్చు.

రెండు బీకర్లను సగం వరకు వెనిగర్ నింపండి. ఒక దానిలో చిన్న చిన్న ముక్కలుగా పొడిచేసిన చాక్సనను, మరొక దానిలో మిగిలిన చాక్బసన్ను వేయండి. మీ అమరికను కదపకుండా ఉంచండి. గంట తరువాత బీకర్లను పరిశీలించండి.
1. ఏ బీకరులోని చాక్బస్ త్వరగా కరిగింది? ముక్కలు చేసిన చాక్బస్ భాగమా? లేదా పూర్తిగా ఉన్న చాక్బస్ భాగమా?
జవాబు:
ముక్కలు చేసిన చాక్ పీస్ భాగం పూర్తిగా కరిగింది. చాక్ పీస్ ముక్కలు కావటం వలన వెనిగర్ దానిని త్వరగా కరిగించుకుంది.

కృత్యం – 6

దవడలో దంతాల అమరికను తెలిపే నమూనా లేదా పటాన్ని లేదా మీ స్నేహితుని నోటిలో గమనించండి. దంతాలన్నీ ఆకారం మరియు పరిమాణంలో ఒకేలా ఉన్నాయా? వాటి ఆకారానికి నిర్వహించే పనికి ఏదైనా సంబంధం ఉందా? దంత సూత్రం, దంతాల అమరిక విధానాన్ని వివరిస్తుంది. ఇచ్చిన పటం ఆధారంగా చర్వణకాలు ఏ పనులు నిర్వహిస్తాయో ఆలోచించండి. మీరు కింది తరగతులలో కుంతకాలు పదునైన అంచులు కలిగి ఉంటాయని రదనికలు కూసుగా ఉంటాయని చర్వణకాలు, అగ్ర చర్వణకాలు చదునుగా ఉంటాయని నేర్చుకున్నారు కదా!
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 11
1. కుంతకాలు ఏ విధంగా ఉపయోగపడతాయని మీరు భావిస్తున్నారు?
జవాబు:
కుంతకాలు ఆహారాన్ని కొరకటానికి తోడ్పడతాయి.

2. ఆహారాన్ని మెత్తగా నూరడానికి పనికివచ్చే దంతాలు ఏవి?
జవాబు:
ఆహారాన్ని మెత్తగా నూరడానికి, అగ్రచర్వణకాలు, చర్వణకాలు తోడ్పడతాయి.

3. ఆహారాన్ని చీల్చడానికి పనికివచ్చే దంతాలు ఏవి?
జవాబు:
ఆహారాన్ని చీల్చడానికి రదనికలు తోడ్పడతాయి.

4. దంత సూత్రం అంటే ఏమిటి? మీ దంత సూత్రాన్ని రాయండి.
జవాబు:
నోటిలో దంత రకాలను, వాటి సంఖ్యను, అమరికను తెలిపే సూత్రాన్ని దంత సూత్రం అంటారు.
మానవుని దంత సూతం : 2013
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 12

పటం ఆధారంగా కింది పట్టికను పూరించండి.
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 13

కృత్యం – 7 పిండిపై లాలాజలం యొక్క చర్య

ఒక పరీక్షనాళికను తీసుకొని సగం వరకు నీటితో నింపండి. దానికి చిటికెడు పిండి కలపండి. పిండి నీటిలో బాగా కలిసే వరకు పరీక్షనాళికను కదిలించండి. కొన్ని చుక్కల పిండి మిశ్రమాన్ని ఒక వాగ్లాస్లో తీసుకోండి. కొన్ని చుక్కల టింక్చర్ అయోడిన్ కలిపి పిండిపదార్థ పరీక్ష చేయండి. దానిలో ఏర్పడే నీలి – నలుపురంగు పిండి పదార్థాన్ని ధృవపరుస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రెండు సమాన భాగాలుగా చేయండి. రెండు పరీక్షనాళికల్లో ద్రావణం సమానంగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. ఒక పరీక్షనాళికలో ఒక టీ స్పూను లాలాజలం కలపండి. రెండవ పరీక్షనాళికలో ఏమీ కలపకుండా ఉంచండి. 45 నిముషాల తరువాత ఒక చుక్క సజల టింక్చర్ అయోడిన్ ద్రావణం పరీక్షనాళికల్లో కలపండి.

1. ద్రావణంలో ఏమైనా మార్పులు గమనించారా? ఈ మార్పు ఎందుకు జరిగింది?
జవాబు:
లాలాజలం కలిపిన పిండి ద్రావణానికి టింక్చర్ అయోడిన్ కలిపినపుడు అది నీలి రంగుకు మారలేదు. అంటే పిండి. పదార్థం లాలాజలంగా మార్చబడినది.

2. నోటిలో ఆహారం తీసుకున్నప్పుడు కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుందా?
జవాబు:
నోటిలో ఆహారం తీసుకొన్నప్పుడు లాలాజలం పిండి పదార్థంపై చర్యజరిపి దాని రూపాన్ని (చక్కెరగా) మారుస్తుందని నిర్ధారించవచ్చు.

కృత్యం – 8

గంట విరామంలో నోటిలోని pH ను పరీక్షించుట :

మీ రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడిని అడిగి ఒక pH కాగితాన్ని రంగుపట్టికతో సహా తీసుకోండి. (పటం చూడండి). ఒక చిన్న pH పేపర్ ముక్కను తీసుకొని నాలుకపై తాకించండి. దానిపైన ఏర్పడిన రంగును రంగుపట్టికలో జతచేసి చూడండి. pH విలువను గుర్తించండి. మధ్యాహ్న భోజనం తరువాత pH పేపరును నాలుక మీద ఉంచి పరీక్షించండి. మీ పరిశీలనలను నమోదు చేయండి. మీ పరిశీలనలను మీ స్నేహితుని పరిశీలనలతో పోల్చి చూడండి. కనీసం నాలుగు pH రీడింగులను గుర్తించండి.
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 14
1. నోటిలోని సాధారణ స్థాయి pH విలువ ఎంత? ఇది ఆమ్లయుతమా? క్షారయుతమా?
జవాబు:
నోటిలో సాధారణ స్థాయి pH విలువ 9 ఉన్నది. ఇది క్షారము.

2. pH లో ఏవైనా మార్పులు గమనించారా? ఆ మార్పు ఎలా వచ్చింది?
జవాబు:
భోజనం తరువాత pH విలువ వేరుగా ఉంది. pH విలువ 11 వరకు ఉంది. భోజనం చేయునపుడు అధిక లాలాజలం స్రవించబడుతుంది. కావున నోటిలో pH విలువ పెరుగుతుంది.

3. ఎలాంటి pH లో ‘లాలాజల ఎమైలేజ్’ బాగా చర్య జరపగలదు?
జవాబు:
లాలాజలంలో ‘ఎమైలేజ్’ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది క్షార మాధ్యమంలో బాగా పనిచేస్తుంది.

4. వివిధ రకాల ఆహారాలను తీసుకున్నప్పుడు నోటిలోని pH ఎలాంటి పాత్ర పోషిస్తుంది?
జవాబు:
వివిధ రకాల ఆహారాలను తీసుకున్నప్పుడు నోటిలోనికి లాలాజలం స్రవించబడుతుంది. ఈ లాలాజలం ఆహారాన్ని క్షార మాధ్యమంలోకి మార్చడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా వివిధ రకాల ఆహారాలను తీసుకున్నప్పుడు pH విలువ పెరగటం లేదా తగ్గటం జరుగుతుంది.

కృత్యం – 9

ఆహారవాహికలో ఆహారం (Food bolus) ఎలా ప్రయాణిస్తుందో గమనిద్దాం!
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 15

ఒక పాత సైకిల్ ట్యూబ్ ముక్కను తీసుకోండి. గొట్టం లోపలి భాగాన్ని నూనెతో పూత పూయండి. అలాగే రెండు బంగాళదుంపల్ని తీసుకొని శుభ్రంగా కడిగి, పొడిగా తుడిచి నూనెతో పూత పూయండి. తరువాత బంగాళదుంపలను సైకిలు ట్యూబ్లో ప్రవేశపెట్టండి. సెకీల్ ట్యూబ్ లో | గొట్టాన్ని పిసుకుతూ బంగాళదుంపను గొట్టంలో కదిలే లాగా చేయండి. బంగాళాదుంపలు బంగాళదుంప ల గొట్టంలో కదులుతున్న విధానాన్ని జాగ్రత్తగా పరిశీలించంది.
1. గొట్టం గుండా బంగాళాదుంపలు కదలడానికి ఎలా నొక్కాలి? నూనె ఎలా పనిచేస్తుంది?
జవాబు:
గొట్టం గుండా బంగాళదుంపలు కదలడానికి దుంప పై భాగాన నొక్కాలి. నూనె జారుడు పదార్థంగా పనిచేసి బంగాళ దుంప క్రిందకు జారుతుంది.

2. ఆహారవాహికలో ఉండే కండరాలు కూడా ఆహారాన్ని కిందికి నెట్టడానికి ఇదే విధంగా పనిచేస్తాయా?
జవాబు:
ఆహారవాహికలో కండరాలు కూడా ఆహారం మీద ఇలానే పనిచేసి ఆహారాన్ని క్రిందకు నెడతాయి. బోలకు పైభాగాన వలయ కండరాలు క్రింది భాగాన నిలువు కండరాలు ఏకాంతరంగా పనిచేస్తాయి.

కృత్యం – 10

పేపర్ గొట్టం మరియు మడిచిన కాగితాలు:

10 × 20 సెం.మీ. కొలతలు గల ఒక చార్టు పేపరును తీసుకోండి. దానిని మడిచి రెండు చివరలు అంటించి గొట్టంలా చేయండి. ఇప్పుడూ 20 × 20 సెం.మీ. కొలతలు గల మరొక చార్లు పేపరు తీసుకోండి. దానిని కూడా పైన చెప్పినట్టుగా గొట్టంలా తయారుచేయండి. దానిని మొదటి గొట్టంలో దూర్చండి. దూర్చగలిగారా?
జవాబు:
లేదు.

ఇప్పుడు 20 × 20 సెం.మీ. కొలతలు గల మరొక పేపరును తీసుకోండి. దానిని పటంలో చూపినట్లు వీలైనన్ని మడతలు మడవండి. రెండు చివరలను అంటించి గొట్టంలా చేయండి. మీ మదతల గొట్టం తయారైందన్నమాట. దానిని మొదటి గొట్టంలో దూర్చండి. దూర్చగలిగారా?
జవాబు:
ఔను
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 16

1. రెండు గొట్టాలకు ఉపయోగించిన కాగితాల వైశాల్యాన్ని పోల్చి చూడండి. వైశాల్యంలో తేడా కనిపించిందా? ఒకవేళ పెరిగినట్లు గమనిస్తే కారణాలు తెలుసుకోండి.
జవాబు:
రెండు గొట్టాలకు ఉపయోగించిన కాగితాల వైశాల్యాన్ని పోల్చి చూశాము. రెండవ గొట్టం (20 × 20) మొదటి గొట్టం (10 × 20) కంటే ఎక్కువ వైశాల్యం కలిగి ఉంది.

కారణం :
రెండవ గొట్టం, ఎక్కువ వైశాల్యం కలిగి ఉండటానికి కారణం అది అనేక మడతలు పడి ఉంది. ఈ మడతల వలన ఎక్కువ వైశాల్యం కలిగిన కాగితం తక్కువ స్థలంలో అమరింది. జీర్ణవ్యవస్థలో చిన్నప్రేగు కూడ ఇలానే అమరి ఉంటుంది.

ప్రయోగశాల కృత్యం

కాగితపు గొట్టం ఆమ్లం మరియు పత్ర ప్రయోగం:
14 మార్కులు -మీ ఐడి తోట నుండి రెండు ఆకుపచ్చని పత్రాలు సేకరించండి. ఒక పత్రానికి పెట్రోలియం జెల్లీ లేదా వాజ్ లీస్ పూయంది. మరొకదాన్ని అలాగే వదిలేయండి. 1 లేదా 2 చుక్కల బలహీన ఆమ్లాన్ని రెండు పత్రాలపై వేయండి. అరగంట తరవాత పత్రాలను పరిశీలించండి. మీ పరిశీలనలను మీ నోట్ బుక్ లో రాయండి.
1. పత్రాలలో ఎలాంటి మార్పులు గమనించారు?
జవాబు:
ఒక పత్రం పాడైపోయింది.

2. ఏ పత్రంలో మార్పులు గమనించారు? ఏ పత్రంలో మార్పు జరగలేదు. కారణాలేమిటి?
జవాబు:
వాజ్ లీన్ పూసిన పత్రం ఆమ్ల ప్రభావానికి లోనుకాకుండా తాజాగా ఉంది. వాజ్ లీన్ పూయని పత్రం ఆమ్ల ప్రభావానికి దెబ్బతిన్నది.

3. ఆమ్ల ప్రభావం నుంచి ఆకును రక్షించినదేమిటి?
జవాబు:
ఆమ్ల ప్రభావం నుంచి వాజ్ లీన్ ఆకును రక్షించినది.

కింది ఖాళీలను పూరించండి

1. మన దంతాల అమరిక నిష్పత్తి 3:2:1:2 అయితే దీనిలో 1 దేనిని సూచిస్తుందంటే ……….. (అగ్రచర్వణకాలు)
2. మాంసకృత్తుల దీర్ఘ శృంఖలాలు జీర్ణవ్యవస్థ …………. భాగంలో విచ్చిన్నం చేయబడతాయి. (ఆంత్రమూలం)
3. జీర్ణక్రియలో స్రవించబడే బలమైన ఆమ్లం (HCI) ……………….. లో ఉండే ఝణ గ్రాహికలు మెదడుకు సమాచారాన్ని చేరవేస్తాయి. (ముక్కు)
5. లాలాజలం యొక్క pH స్వభావం …………….. (క్షారస్వభావం)
6. కింది పేరా చదవండి.సరైన పదాలతో ఖాళీలు పూరించండి.
(1) …………….. హార్మోన్ స్థాయిలో హెచ్చుతగ్గుల ఫలితంగా ఆకలిలో భేదాలు మరియు ఆహార పదార్థాల వినియోగం ఆధారపడి ఉంటాయి. జీర్ణాశయం నిండి ఉన్న భావన ఉంటే మరి ఆహారం తీసుకోవాలని అనిపించదు. మరొక హార్మోన్. (2) ………… స్రవించబడితే ఆకలిని తగ్గించివేస్తుంది. మనం ఆహారాన్ని తీసుకొన్నప్పుడు నోటిలో చక్కగా నమలటం జరుగుతుంది. దీనికొరకు (3) ………. కండరాలు నమిలే ప్రక్రియకు తోడ్పడతాయి. అయితే (4) … దవడల కండరాలు, దవడలు పైకి, కిందకు ముందుకు, వెనుకకు కదలడానికి లేదా నమలడానికి (enteric nervous system) తోడ్పడతాయి. (5) ……………….. నాడులు దవడల కండరాల కదలికలను నియంత్రిస్తాయి. (6) ………….. నాడీవ్యవస్థ కారణంగా లాలాజలం ఉత్పత్తికావటం, లాలాజలంతో ఆహారాన్ని కలపటం, నమలటం మరియు సులువుగా మింగడం జరుగుతాయి. లాలాజలంలోని (7) …………..పిండిపదార్థాలను చక్కెరలుగా మార్చును. దాని ఫలితంగా ఆహారాన్ని నమలడం మరియు మింగడం వలన ఆహారవాహిక చేరటం (8) …………. మరియు (9) …………… వలన నియంత్రించబడతాయి. నాలుక రుచిగ్రాహకం కనుక రుచిని గ్రహించుటలో (10) …….. నాడి ముఖ్యమైనది.
జవాబు:
(1) లెఫ్టిన్, గ్రీలిన్, గాస్ట్రిన్, సిక్రిటిన్ (గ్రీలిన్)
(2) గ్రీలిన్, లెఫ్టిన్, సెక్రిటిన్, గాస్ట్రిన్ (లెప్టిన్)
(3) అంతర్గత కండరాలు, ఉపరితల కండరాలు, వలయకండరాలు, నిలువు కండరాలు. (ఉపరితల కండరాలు)
(4) ఉపరితల కండరాలు, అంతర్గత కండరాలు, మెడ కండరాలు, పొడవైన కండరాలు (అంతర్గత కండరాలు)
(5) 5వ కపాలనాడి, 2వ కపాలనాడి, 5వ ముఖనాడి, వెన్నునాడి (5వ కపాలనాడి)
(6) కేంద్రనాడీ వ్యవస్థ, ఉపరితల నాడీవ్యవస్థ, స్వతంత్ర నాడీ వ్యవస్థ (స్వతంత్ర నాడీ వ్యవస్థ)
(7) లైపేజ్, సుక్రేజ్, గాలక్రేజ్, అమైలేజ్ (అమైలేజ్)
(8) మెడుల్లా అబ్లాంగేటా, సెరిబ్రమ్, 8వ వెన్నునాడీ, కపాలనాడీ, 7వ కపాలనాడీ (మెడుల్లా అబ్లాంగేటా)
(9) మెదడు కాండం, మెడుల్లా అబ్లాంగేటా, మధ్యమెదడు, పాన్స్వెపోలి (మెదడుకాండం)
(10) 6వ కపాలనాడి, 5వ కపాలనాడి, 10వ కపాలనాడి, దృక్నడి (5వ కపాలనాడి)

సరైన సమాధానాన్ని గుర్తించండి

1. కింది ఏ సందర్భంలో అతిత్వరగా రుచి చూడగలుగుతావు?
A) నాలుకపై చక్కెర వేసుకొన్నపుడు
B) నాలుకపై చక్కెర ద్రావణాన్ని పోసినపుడు
C) నాలుకతో అంగిలి నొక్కిపట్టినపుడు
D) నమలకుండా, కదపకుండా వెంటనే మింగినపుడు
జవాబు:
C) నాలుకతో అంగిలి నొక్కిపట్టినపుడు

2. పెరిస్టాల్ సిస్ చలనం ఎందుకంటే
A) నిలువు కండరాల సంకోచం వలన
B) వలయం కండరాల సంకోచం వలన
C) స్వయంచోదిత నాడీవ్యవస్థ నియంత్రణ వలన
D) జీర్ణరసాల ప్రభావం వలన
జవాబు:
C) స్వయంచోదిత నాడీవ్యవస్థ నియంత్రణ వలన

3. జీర్ణాశయం, ఆంత్రమూలంలోనికి తెరచుకునే చోట ఉండే సంవరిణీ కండరం
A) కార్డియాక్
B) పైలోరిక్
C) ఆనల్
D) గ్యాస్ట్రిక్
జవాబు:
B) పైలోరిక్

4. ఆంత్రచూషకాలలోని ఏ భాగం ద్వారా గ్లూకోజ్ మరియు అమైనో ఆమ్లాల శోషణ జరుగును?
A) ఎపిథీలియల్ కణాలు
B) రక్తకేశనాళికలు
C) శోషరస నాళాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

5. ఆకలి సూచనలను నియంత్రించే మెదడులోని భాగం
A) మెడుల్లా
B) డైయన్సె ఫలాన్
C) సెరిబ్రమ్
D) మధ్య మెదడు
జవాబు:
B) డైయన్సె ఫలాన్

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

6. మానవులు “అంతర్గత దహన యంత్రం” వంటివారు. ఎందుకంటే
A) ఆహారపదార్థాలు జీర్ణమై శక్తి విడుదలవుతుంది
B) శ్వాసక్రియ ద్వారా CO2 వెలువరిస్తారు
C) జీర్ణక్రియ చివరి దశలో వ్యర్థాలను విసర్జిస్తారు
D) శక్తివంతమైన జీర్ణరసాలను స్రవిస్తాయి
జవాబు:
A) ఆహారపదార్థాలు జీర్ణమై శక్తి విడుదలవుతుంది

AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

SCERT AP 10th Class Biology Study Material 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Biology 6th Lesson Questions and Answers ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

10th Class Biology 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కేవలం మనుగడ కొనసాగించటానికే ప్రత్యుత్పత్తి ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారా?
జవాబు:

  1. లేదు. కేవలం మనుగడ సాగించటానికే ప్రత్యుత్పత్తి ఉపయోగపడుతుందని నేను భావించటం లేదు.
  2. ప్రత్యుత్పత్తి వలన జన్యుపదార్థ వినిమయం జరిగి కొత్త లక్షణాలు ఏర్పడతాయి.
  3. కొత్త లక్షణాలు జీవి మనుగడకు అవకాశాలను మెరుగుపర్చుతాయి.
  4. కొత్త లక్షణాలు కేంద్రీకరణ వలన కొత్త జాతులు ఏర్పడతాయి.
  5. ప్రకృతివరణానికి కావలసిన ముడిపదార్థాలను (వైవిధ్యాలను) ప్రత్యుత్పత్తి అందిస్తుంది.
  6. పారమీషియం వంటి ప్రాథమిక జీవులు లైంగిక ప్రత్యుత్పత్తి (సంయుగ్మము) వలన ఉత్తేజితమవుతాయి.
  7. బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు అనుకూల పరిస్థితులలో ద్విదావిచ్ఛిత్తి ద్వారా, అననుకూల పరిస్థితులలో బహుదా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. అంటే ప్రత్యుత్పత్తి అననుకూల పరిస్థితులను అధిగమించటానికి, సందర్భానుసారంగా మనుగడ సాగించటానికి తోడ్పడుతుంది.
  8. ప్లాస్మోడియం దోమలో లైంగిక ప్రత్యుత్పత్తిని, మానవునిలో అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుతూ తన మనుగడ అవకాశాలను మెరుగుపరచుకుంటుంది.

ప్రశ్న 2.
జీవులు ఎలా పెరుగుతాయి? దెబ్బ తగలడం వంటి సందర్భాలలో, పాడైపోయిన, తొలగించబడిన కణాల స్థానం ఎలా భర్తీ అవుతుంది? ఇందుకోసం ఉపయోగపడే ఏదైనా ప్రత్యేక ప్రత్యుత్పత్తి విధానం ఉందా?
జవాబు:

  1. కణవిభజన ప్రక్రియ వలన జీవులలో కణాల సంఖ్య పెరిగి జీవులు పెరుగుతాయి.
  2. పాడైపోయిన కణాల స్థానం భర్తీ చేయటానికి, కణాల మరమ్మత్తుకు కణవిభజన తోడ్పడుతుంది.
  3. ఇటువంటి సందర్భాలలో కణాలు ప్రధానంగా సమవిభజన చెంది, కణాల సంఖ్య పెంచుతుంది.

ప్రశ్న 3.
చేప మరియు కప్పలాంటి జీవులు ప్రతిసారీ అసంఖ్యాకమైన అందాలను విడుదల చేయటానికి గల కారణాలు ఏమిటి? (AS1)
జవాబు:

  1. చేప మరియు కప్పవంటి జీవులలో బాహ్యఫలదీకరణ జరుగుతుంది. ఇది ప్రకృతిచే నియంత్రించబడుతుంది.
  2. అంటే శుక్రకణాలు అండాలతో శరీరం బయట నీటిలో కలుస్తాయి.
  3. ఈ సందర్భంలో కొన్ని అండాలు, శుక్రకణాలు కొట్టుకొనిపోవచ్చు.
  4. కొన్ని శుక్రకణాలు అండాలను చేరకపోవచ్చు.
  5. ఫలదీకరణ చెందిన అండాలకు రక్షణ ఉండదు.
  6. ఎదుగుతున్న పిండాలను ఇతర జీవులు తినవచ్చు.
  7. కావున ఈ జీవులు అధిక సంఖ్యలో పిల్లలను ఉత్పత్తి చేయవలసిన అవసరం ఉంది.
  8. అధిక సంఖ్యలో పిల్లలను ఉత్పత్తి చేయటానికి ఈ జీవులు ప్రతిసారి అసంఖ్యాకమైన అండాలను, శుక్రకణాలను విడుదల చేస్తాయి.
  9. ఫలితంగా అధిక జీవులు ఏర్పడి, కొన్ని జీవులు నశించినప్పటికీ, తమ జాతిని కొనసాగించగలుగుతున్నాయి.

AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 4.
బాహ్య ఫలదీకరణం అంటే ఏమిటో వివరించండి. ఉదాహరణలు రాయండి. (AS1)
జవాబు:

  1. స్త్రీ, పురుష సంయోగబీజాల కలయికను ఫలదీకరణం అంటారు.
  2. ఈ ఫలదీకరణం స్త్రీ జీవి శరీరానికి బయట జరిగితే దాని బాహ్య లేదా బహిర్గత ఫలదీకరణం అంటారు.
  3. ఈ ప్రక్రియలో పురుషజీవి తన శుక్రకణాలను స్త్రీ జీవి అండాలను తమ చుట్టూ ఉన్న మాధ్యమంలోనికి (నీరు) విడుదల చేస్తాయి.
  4. ఈ మాధ్యమంలో శుక్రకణాలు అండాలతో కలసి ఫలదీకరణం జరుగుతుంది. ఉదా : చేపలు, కప్పలు.

ప్రశ్న 5.
కిందివాని మధ్య గల భేదాలను రాయండి. (AS1)
ఎ) కేసరావళి – అండకోశం
బి) సమవిభజన – క్షయకరణ విభజన
జవాబు:
ఎ) కేసరావళి – అందకోశం :

కేసరావళి అండకోశం
1. ఇవి పుష్ప మూడవ వలయంలో ఉంటాయి. 1. ఇవి పుష్పాసనం నాల్గవ వలయంలో ఉండే భాగము.
2. ఇవి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు. 2. ఇది అండాశయము, కీలము, కీలాగ్రము అను భాగాలను కలిగి ఉంటుంది.
3. కేసరావళి, కేసరదండము, పరాగకోశము అను భాగాలను కలిగి ఉంటుంది. 3. అండాశయములో అండములు ఉంటాయి.
4. పరాగకోశాలలో పరాగరేణువులు తయారవుతాయి. 4. ఇవి అండాశయంలో అండన్యాస స్థానం వద్ద అమరిఉంటాయి.

బి) సమవిభజన – క్షయకరణ విభజన :

సమవిభజన క్షయకరణ విభజన
1. శాఖీయ కణాలలో జరుగుతుంది. 1. లైంగిక కణాలలో జరుగుతుంది.
2. కేంద్రకం ఒక్కసారే విభజన చెందుతుంది. 2. కేంద్రకం రెండుసార్లు విభజన చెందుతుంది.
3. పిల్లకణాలు రెండు ఏర్పడతాయి. 3. నాలుగు పిల్లకణాలు ఏర్పడతాయి.
4. పిల్లకణాలు ద్వయ స్థితికంలో ఉంటాయి. 4. పిల్లకణాలు ఏకస్థితికంలో ఉంటాయి.
5. చాలా తరచుగా జరుగుతుంది. 5. అరుదుగా జరుగుతుంది.
6. పిల్లకణాలు శాఖీయ భాగాలను ఏర్పరుస్తుంది. 6. పిల్లకణాలు సంయోగబీజాలను ఏర్పరుస్తాయి.
7. ప్రథమదశ, మధ్యదశ, చలనదశ మరియు అంత్యదశ అనే ఉపదశలు ఉంటాయి. 7. ప్రతి దశ రెండుసార్లు ఉంటుంది. ప్రథమదశ – 1 లో 5 ఉపదశలు ఉంటాయి.
8. క్రోమోజోమ్ ల సంఖ్య మారదు. 8. పిల్లకణాలలో క్రోమోజోమ్ సంఖ్య సగానికి తగ్గించబడుతుంది.
9. విభజనకు ముందు క్రోమోజోమ్ లు రెట్టింపు అవుతాయి. 9. ప్రథమ క్షయకరణ విభజన తరువాత క్రోమోజోమ్స్ సంఖ్య రెట్టింపు అవుతుంది.
10. వినిమయం జరగదు. 10. వినిమయం జరుగుతుంది.

ప్రశ్న 6.
మొక్కల్లోని ఫలదీకరణ ప్రక్రియను గురించి వివరించండి. (AS1)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 1

  1. ఫలదీకరణము జరుగుటకు ముందు పరాగరేణువులు కీలాగ్రము మీదకి చేరుతాయి.
  2. అవి అంకురించి పరాగనాళములను ఇస్తాయి. అందులో ఒక్క పరాగనాళము మాత్రమే పిండకోశమును చేరుకోగలుగుతుంది.
  3. ఈ పరాగనాళములో రెండు పురుష సంయోగబీజాలు ఉంటాయి.
  4. సాధారణంగా అండం ద్వారం ద్వారా పరాగనాళిక అండములోనికి చేరుతుంది. దానిలో ఉన్న రెండు పురుష సంయోగబీజాలను, నాళిక ఆ అండ కోశంలోకి విడుదల చేస్తుంది
  5. ఆ రెండింటిలో ఒక పురుష సంయోగబీజము, స్త్రీ బీజకణం వైపు సమీపించి దానితో సంయోగము జరిపి, ద్వయ స్థితికలో ఉండే సంయుక్తబీజమును ఏర్పరుస్తుంది. ఇది మొదటి ఫలదీకరణము అవుతుంది.
    AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 3
  6. రెండవ పురుష సంయోగబీజము, ’27’ స్థితిలో ఉన్న ద్వితీయ కేంద్రకముతో సంయోగము చెంది ‘3n’ స్థితిలో ఉండే అంకురచ్ఛద కేంద్రకాన్ని ఏర్పరుస్తుంది. ఇది పిండకోశములో జరిగే రెండవ ఫలదీకరణము.
    AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 4
  7. మొదటి ఫలదీకరణము వలన ఏర్పడిన సంయుక్తబీజము పెరిగి పిండముగా అభివృద్ధి అవుతుంది. సంయుక్త బీజకేంద్రకము పలుసార్లు విభజన చెంది హృదయాకారపు నిర్మాణముగా మారి అండపు లోపలి స్థలాన్ని ఆక్రమించుకుంటుంది.
  8. బాగా ఎదిగిన పిండములో ప్రథమ కాండము, ప్రథమ మూలము, బీజదళములు ఉంటాయి. ద్విదళ బీజ మొక్కలు రెండు బీజదళాలను కలిగి ఉంటాయి. ఏక బీజదళ మొక్కలు ఒకే బీజదళాన్ని కలిగి ఉంటాయి.

ప్రశ్న 7.
అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలను గురించి తగిన ఉదాహరణలతో వివరించండి. (AS1)
జవాబు:
అలైంగికోత్పత్తి :
సంయోగబీజాల కలయిక లేకుండా, కేవలం ఒక జనకజీవి ప్రమేయంతోనే జరిగే ప్రత్యుత్పత్తిని “అలైంగిక ప్రత్యుత్పత్తి” అంటారు. దీనిలో క్రింది రకాలు కలవు.

1. విచ్చిత్తి :
ఒక జీవి కణ విభజన ద్వారా, రెండుగా విడిపోవడాన్ని “ద్విధావిచ్చిత్తి” అని, అంతకంటే ఎక్కువ భాగాలుగా విడిపోతే, దానిని “బహుధావిచ్చిత్తి” అని అంటారు.
ఉదా : పారమీషియం

2. కోరకీభవనం :
ఒక జీవి శరీరం నుండి అవే పోలికలతో ఉన్న నిర్మాణం బయటకు పెరుగుతాయి. అది జనక జీవి నుండి వేరై స్వతంత్రంగా జీవిస్తుంది. ఈ ప్రక్రియను “కోరకీభవనం” అంటారు.
ఉదా: ఈస్ట్

3. ముక్కలగుట :
కొన్ని జీవులు ప్రమాదవశాత్తు, తెగిపోయి, శరీర ఖండాల నుండి పూర్తి జీవిగా పెరుగుతాయి. ఈ ప్రక్రియలో శరీరంలోని ఏ ఖండమైనా మొత్తం శరీరాన్ని ఏర్పరుస్తుంది.
ఉదా : స్పెరోగైరా, చదునుపురుగులు

4. అనిషేక ఫలాలు :
ఫలదీకరణం జరగకపోయినా అండం పిల్ల జీవులుగా ఎదగటాన్ని ‘పారినోజెనెసిస్’ అంటారు. దీని వలన మొక్కలలో విత్తన రహిత కాయలు ఏర్పడతాయి.
ఉదా : తేనెటీగలు, చీమలు

5. పునరుత్పత్తి :
పూర్తిగా విభేదనం చెందిన అనేక జీవులు తమ శరీరఖండాల నుండి నూతన జీవిని ఇచ్చే సామర్థ్యాన్ని “పునరుత్పత్తి” అంటారు.
ఉదా : ప్లనేరియా, స్పంజికలు

6. శాఖీయ ప్రత్యుత్పత్తి :
కొన్ని మొక్కలు శాఖీయ భాగాలైన వేరు, కాండం, పత్రం వంటి శాఖీయ భాగాల నుండి కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి. దీనిని “శాఖీయోత్పత్తి” అంటారు.
ఉదా : మందార, రణపాల

AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 8.
లైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా అలైంగిక ప్రత్యుత్పత్తితో విభేదిస్తుంది? మూడు కారణాలు తెలపండి. (AS1)
జవాబు:
1. లైంగిక ప్రత్యుత్పత్తిలో, స్త్రీ, పురుష జీవులు రెండూ పాల్గొంటాయి. అలైంగిక ఉత్పత్తిలో ఒక జీవి నుండి మరొక జీవి ఏర్పడుతుంది.
2. లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ, పురుష సంయోగబీజాలు ఏర్పడతాయి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగబీజాలు ఏర్పడవు.
3. లైంగిక ప్రత్యుత్పత్తిలో, ఫలదీకరణ జరిగి కొత్త జీవులు ఏర్పడితే, అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఫలదీకరణ జరగదు. తల్లి జీవులను పోలిన జీవులు ఏర్పడతాయి.
వీటితో పాటు ఈ కింది భేదాలను గమనించవచ్చు.

లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి
1. ఒకటిగాని, రెండు జీవుల కలయిక వల్లగాని జరుగుతుంది. 1. ఒకే జీవిలో జరుగుతుంది.
2. మగ, ఆడ సంయోగబీజాలు ఏర్పడతాయి. 2. సంయోగబీజాలు ఏర్పడవు.
3. మగ, ఆడ సంయోగబీజాలు సంయోగం చెందుతాయి. 3. సంయోగబీజాలు సంయోగం చెందవు.
4. కణక్షయకరణ విభజనలు అవసరం అవుతాయి. 4. కణ సమవిభజనలు మాత్రమే అవసరమవుతాయి.
5. తరువాతి తరంలో ఏర్పడే జీవులు కొన్ని జనక లక్షణాలను, కొన్ని జనని లక్షణాలను కలిగి ఉంటాయి. 5. తరువాతి తరంలో ఏర్పడే జీవులు జనకతరపు జీవుల పోలికలను కలిగి ఉంటాయి.
6. జన్యు సంబంధ తేడాలకు ఎక్కువ అవకాశం ఉంది. 6. యాదృచ్ఛిక పరివర్తన ద్వారా మాత్రమే జన్యు సంబంధం తేడా ఉంటుంది.
7. జాతి పరిణామ క్రమములో ప్రకృతి వరణమునకు ఎక్కువ సహాయపడుతుంది. 7. జాతి పరిణామ క్రమములో ప్రకృతి వరణమునకు అంతగా సహాయపడదు.
8. స్త్రీ పురుష బీజకణములు ఏర్పడి వాటి కలయిక జరుగుతుంది. 8. సిద్ధ బీజములు, ద్విదావిచ్ఛిత్తి, అంటుకట్టుట, కణజాల వర్ధనము మొదలైన పద్ధతుల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది.

ప్రశ్న 9.
శుక్రకణాలు వాని విధులు నిర్వహించడానికై, ఏ విధమైన అనుకూలనాలను పొంది ఉన్నాయి? (AS1)
జవాబు:
శుక్ర కణనిర్మాణం తన విధి నిర్వహణకు అత్యంత అనుకూలంగా ఉంటుంది.
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 5

  1. తల నిర్మాణం గుండ్రంగా ఉండి ముందు భాగం మొనతేలి ఉండుటవలన సులువుగా చొచ్చుకు పోగల్గుతుంది.
  2. తలమీద ఉండే ఎక్రోసోమ్ నిర్మాణం అండాన్ని ఛేదించటానికి తోడ్పడుతుంది.
  3. మధ్యభాగం అధిక సంఖ్యలో మైటోకాండ్రియాలను కలిగి చలనానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
  4. తోక పొడవుగా ఉండి శుక్రకణ చలనానికి తోడ్పడుతుంది.
  5. తోక సహాయంతో శుక్రకణం చలిస్తూపోయి, ఎక్రోసోమ్ ద్వారా అండానికి రంధ్రం చేసి ఫలదీకరణ గావిస్తుంది.

ప్రశ్న 10.
ఫలదీకరణ చెందిన అండాన్ని గర్భాశయంలో నిలుపుకోవడం కోసం ఋతుస్రావచక్రం పనిచేస్తూ మరియు పునరావృతమవుతూ ఉంటుంది. సాధారణంగా ఋతుచక్రం మొదలై, పూర్తవుటకు ఎంత సమయం తీసుకుంటుంది? (AS1)
జవాబు:

  1. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో జరిగే మార్పుల వరుసక్రమాన్ని “ఋతుచక్రం” అంటారు.
  2. ఇది ప్రతి 28 రోజులకు ఒకసారి జరుగుతుంది.
  3. దీని మొదటిదశను పెరుగుదల దశ అంటారు. ఇది 14-16 రోజుల వరకు ఉంటుంది.
  4. రెండవ దశను స్రావక దశ అంటారు. ఇది 25 వ రోజు వరకు ఉంటుంది.
  5. ఋతుస్రావం 25-28 రోజుల మధ్య ఉంటుంది.

ప్రశ్న 11.
గర్భాశయంలో పెరుగుతున్న పిండానికి పోషణ అవసరం. పిండానికి పోషకాలు ఎలా అందించబడతాయి? (AS1)
జవాబు:

  1. పిండాన్ని చుట్టుతూ పరాయువు (chorion) అనే వెలుపలి పొర ఉంటుంది.
  2. ఇది గర్భాశయ కుడ్యంలోనికి చొచ్చుకొని పోతుంది.
  3. పరాయువు, గర్భాశయ కణజాలం కలిసి జరాయువును ఏర్పరుస్తాయి.
  4. ఈ జరాయువు ద్వారా పిండానికి ఆహారం, ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది.
  5. పిండం పెరిగే కొలది, జరాయువు, నాభిరజ్జువును ఏర్పరుస్తుంది.
  6. నాభిరువు రక్తనాళాలను కలిగి, తల్లికి, పిండానికి మధ్య వారధిలా పనిచేస్తుంది.

ప్రశ్న 12.
గర్భస్థ శిశువు ఏయే పదార్థాలను తల్లి రక్తం నుండి గ్రహిస్తుంది? (AS1)
జవాబు:
గర్భస్థ శిశువు తల్లి రక్తం నుండి ఆహారాన్ని, ఆక్సిజన్‌ను గ్రహిస్తుంది.

ప్రశ్న 13.
గర్భాశయంలోని ఉమ్మనీటి కోశం (amniotic sac) యొక్క విధి ఏమిటి? (AS1)
జవాబు:

  1. పిండాన్ని చుట్టుతూ బయటివైపు పరాయువు, దాని క్రింద ఉల్బం పొర ఉంటుంది.
  2. ఉల్బం లోపలి కుహరంలో ఉల్బక ద్రవం ఉంటుంది. ఇది పిండాన్ని ఆవరించి ఉంటుంది.
  3. ఈ ద్రవం ఎదుగుతున్న పిండానికి తేమను అందించటమే గాక, చిన్న చిన్న యాంత్రిక అఘాతాల నుండి రక్షణ కల్పిస్తుంది.

ప్రశ్న 14.
లైంగిక ప్రత్యుత్పత్తి యొక్క లాభాలేమిటి? (AS1)
జవాబు:

  1. లైంగిక ప్రత్యుత్పత్తి వలన, కొత్త లక్షణాలు ఉన్న జీవులు ఏర్పడతాయి.
  2. రెండు జీవుల ఉమ్మడి లక్షణాలు తరువాత తరానికి వస్తాయి.
  3. పరిసరాలలో సమర్థవంతంగా సర్దుబాటు చేసుకొనే సామర్థ్యం గల జీవులు ఏర్పడతాయి.
  4. కొత్త జాతుల ఉత్పత్తి లైంగిక విధానంలోనే సాధ్యం.
  5. ప్రకృతివరణానికి సహకరిస్తుంది.
  6. ప్రాథమిక జీవులలో లైంగికోత్పత్తి వలన జీవ పదార్థం చైతన్యవంతమౌతుంది.

ప్రశ్న 15.
జీవజాతుల యొక్క జనాభాలో నిలకడ/శాశ్వతంగా నిలుచుటకోసమై ప్రత్యుత్పత్తి ఎలా సహకరిస్తుంది? (AS1)
జవాబు:

  1. పుట్టిన ప్రతి జీవి కొంత కాలం తరువాత మరణిస్తుంది.
  2. మరికొన్ని జీవులు ప్రమాదవశాత్తు, వ్యాధులబారిన పడి, ఇతర జీవులకు ఆహారంగాను మరణిస్తాయి.
  3. మరణిస్తున్న జీవజాతిని నిలుపుకోవటానికి ప్రత్యుత్పత్తి ఒక్కటే మార్గం.

AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 16.
సమవిభజన మరియు క్షయకరణ విభజనల మధ్య భేదాలను రాయండి. (AS1)
జవాబు:
సమవిభజన – క్షయకరణ విభజన :

సమవిభజన క్షయకరణ విభజన
1. శాఖీయ కణాలలో జరుగుతుంది. 1. లైంగిక కణాలలో జరుగుతుంది.
2. కేంద్రకం ఒక్కసారే విభజన చెందుతుంది 2. కేంద్రకం రెండుసార్లు విభజన చెందుతుంది.
3. పిల్లకణాలు రెండు ఏర్పడతాయి. 3. నాలుగు పిల్లకణాలు ఏర్పడతాయి.
4. పిల్లకణాలు ద్వయ స్థితికంలో ఉంటాయి. 4. పిల్లకణాలు ఏకస్థితికంలో ఉంటాయి.
5. చాలా తరచుగా జరుగుతుంది. 5. అరుదుగా జరుగుతుంది.
6. పిల్లకణాలు శాఖీయ భాగాలను ఏర్పరుస్తుంది. 6. పిల్లకణాలు సంయోగబీజాలను ఏర్పరుస్తాయి.
7. ప్రథమదశ, మధ్యదశ, చలనదశ మరియు అంత్యదశ అనే ఉపదశలు ఉంటాయి. 7. ప్రతి దశ రెండుసార్లు ఉంటుంది. ప్రథమదశ -1లో 5 ఉపదశలు ఉంటాయి.
8. క్రోమోజోమ్ ల సంఖ్య మారదు. 8. పిల్లకణాలలో క్రోమోజోమ్ సంఖ్య సగానికి తగ్గించబడుతుంది.
9. విభజనకు ముందు క్రోమోజోమ్ లు రెట్టింపు అవుతాయి. 9. ప్రథమ క్షయకరణ విభజన తరువాత క్రోమోజోమ్స్ సంఖ్య రెట్టింపు అవుతుంది.
10. వినిమయం జరగదు. 10. వినిమయం జరుగుతుంది.

ప్రశ్న 17.
ఋతుస్రావ సమయంలో గర్భాశయ గోడల్లో జరిగే మార్పులేమిటి? (AS1)
జవాబు:

  1. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో వచ్చే మార్పుల వరుసక్రమాన్ని ఋతుచక్రం అంటారు.
  2. ఈ ప్రక్రియ చివరి దశలో ఋతుస్రావం జరుగుతుంది. ఈ ప్రక్రియ మూడు నుండి ఐదు రోజులు జరుగుతుంది.
  3. స్త్రీ బీజకోశం నుండి విడుదలైన అండం ఫలదీకరణ చెందకపోతే, గర్భాశయ కణాల నుండి వేరైపోతుంది.
  4. ఫలదీకరణ చెందని అండం నశించి, గర్భాశయ లోపలి పొరలతో పాటుగా విసర్జింపబడుతుంది. దీనినే “ఋతుస్రావం” అంటారు.
  5. ఋతుస్రావంలో నిర్జీవ అండము, గర్భాశయ పొరలు, కొంత రక్తముతో పాటుగా విసర్జించబడతాయి.
  6. ఈ ప్రక్రియలో గర్భాశయం లోపల ఏర్పడిన రక్తకణాల పొరలు వేరైపోతాయి.
  7. గర్భాశయ కుడ్యానికి రక్త ప్రసరణ తగ్గుతుంది.
  8. గర్భాశయ కండరాలు సంకోచించి, లోపలి పొరలను విసర్జిస్తాయి.
  9. ఈ మొత్తం ప్రక్రియలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కీలకపాత్ర వహిస్తుంది.

ప్రశ్న 18.
“ఏకకణ జీవులన్నీ అననుకూల పరిస్థితులలో సమవిభజన చెందుతాయి.”
పై వ్యాఖ్యను సమర్థిస్తారా? (AS2)
జవాబు:

  1. లేదు. నేను ఈ వాక్యాన్ని సమర్ధించటం లేదు.
  2. ఏకకణజీవులు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, సమవిభజన ద్వారా తమ సంతతిని వేగంగా వృద్ధి చేసుకొంటాయి. దీనినే “ద్విదా విచ్ఛిత్తి” అంటారు.
  3. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, ఇవి తమ చుట్టూ కోశాన్ని ఏర్పర్చుకొంటాయి.
  4. కోశములోని కేంద్రకం అనేక విభజనలు చెంది, బహుకేంద్రక స్థితి పొందుతుంది.
  5. తరువాత కోశము విచ్ఛిన్నమై అనేక పిల్లజీవులు ఏర్పడతాయి. ఈ ప్రక్రియను “బహుదా విచ్ఛిత్తి” అంటారు.
  6. అంటే ఏకకణ జీవులు అనుకూల పరిస్థితులలో ద్విదావిచ్ఛిత్తి ద్వారా, అననుకూల పరిస్థితులలో బహుదావిచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి.

ప్రశ్న 19.
విక్కీ వాళ్ళ నాన్న-రంగురంగుల పూలు మరియు పెద్దవైన ఫలాలు గల ఒక మొక్కను పెంచాలనుకున్నాడు. మీరు అతనికి సూచించే పద్ధతి ఏమిటి? ఎందుకు? (AS3)
జవాబు:

  1. రంగు రంగుల పూలు మరియు పెద్దవైన ఫలాలు గల మొక్కను పెంచుటకు నేను అంటుకట్టే విధానం (grafting) సూచిస్తాను.
  2. ఈ ప్రక్రియలో కోరుకొన్న లక్షణాలు ఉన్న మొక్కలను పొందే అవకాశం ఉంది.
  3. ఎరుపు, నీలం, పసుపు రంగు కలిగిన గులాబి ఛేదనాలను, ఒకే మొక్కకు అంటుకట్టుట వలన ఒక చెట్టుపైనే అన్ని రంగుల పూలు పూయించవచ్చును.
  4. పెద్దకాయలు కాస్తున్న చెట్టు కొమ్మను, మనం పెంచుతున్న చెట్టుకు అంటుకట్టి పెద్ద ఫలాలను పొందవచ్చును.
  5. అంటుకట్టటం వలన రెండు మొక్కలలోని వాంఛిత లక్షణాలను కలిపేందుకు అవకాశం కలుగుతుంది.
  6. నూతనత్వం కోసం ఒకే మొక్కపై, వివిధ రకాల మొక్కలు పెంచటానికి ఇది మంచి ప్రక్రియ.

ప్రశ్న 20.
ఉల్లిమొక్క నొకదాన్ని వేర్లతో సహా పెకిలించి, వేరుకొన అడ్డు ఛేదనాలను తీసుకోండి. వాటిని ఏదేని రంగుతో రంజనం చేసి సూక్ష్మదర్శినిని కింద పరిశీలించండి. కణవిభజన దశల బొమ్మలను గీసి, అవి ఏ దశకు చెందినవో గుర్తించండి. (AS3)
జవాబు:
ఉల్లి మొక్క వేరుకొన అడ్డుకోతలో నాకు ఈ క్రింది విభజన దశలు కనిపించాయి.
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 6

ప్రశ్న 21.
మీకు దగ్గరలోని గ్రామాన్ని సందర్శించి, అక్కడి రైతులు చెరకు, చామంతి మొదలైన పూలమొక్కలు, బంగాళదుంపలు, దొండకాయలు మొదలైన కూరగాయలు మొదలైన వాటిని ఎలా పండిస్తున్నారో అడిగి తెలుసుకోండి. మీరు సేకరించిన సమాచారంతో తగిన నివేదిక తయారు చేసి, తరగతిలో ప్రదర్శించండి. (AS4)
జవాబు:
మా గ్రామంలోని రైతులు ఈ క్రింది పంటలను పండించే విధానం అడిగి తెలుసుకొన్నాను.

చెరకు :
రైతులు చెరకును ముక్కలుగా నరికి, భూమిలో పాతి, చెరకు పంటను పండిస్తున్నారు. ఈ ప్రక్రియను ‘ఛేదనం’ అంటారు. ఇది ఒక శాఖీయోత్పత్తి పద్ధతి. ఈ పద్ధతిలో కనీసం రెండు కణుపులు ఉండే విధంగా చేధనాలు నరికి కణపు భూమిలో మునుగునట్లు పాతి పెడతారు. నేలలోని కణపు నుండి వేర్లు, పైన ఉన్న కణపు నుండి కొత్త మొక్కలు ఏర్పడతాయి.

చామంతి :
చామంతి మొక్కలను కూడా శాఖీయ వ్యాప్తి ద్వారా సాగుచేస్తున్నారు. చామంతి మొక్క కాండం నుండి కొన్ని శాఖలు భూమి ద్వారా ప్రయాణించి పైకి వస్తాయి. భూమిలో ఉన్న ప్రాంతం నుండి కొత్త వేర్లు ఏర్పడతాయి. తల్లి మే బంధం కలిగి ఉండగానే వేర్లను కలిగిన శాఖలను ‘అంట్లు’ అంటారు. చామంతిలోని ఈ అంట్లను పిలక మొక్కలు (సక్కర్స్) అంటారు. వీటిని తల్లి మొక్క నుండి వేరుచేసి వేరే ప్రాంతంలో మొక్కలుగా పెంచుతారు.

బంగాళదుంప :
బంగాళదుంప భూగర్భకాండము. ఇది ఆహారం నిల్వ చేయటం వలన లావుగా తయారవుతుంది. బంగాళదుంపలో కణుపులు నొక్కులుగా ఉంటాయి. ఈ ప్రాంతాలను ‘కన్నులు’ అంటారు. ఛేదనం ద్వారా కన్ను ప్రాంతాన్ని వేరు చేసి కొత్త మొక్కలను పెంచుతారు.

దొండకాయ : దొండకాయ మొక్క భూమిలో దుంపను కలిగి ఉంటుంది. ఇది కాండ రూపాంతరం. దీనిని భూమిలో పాతి పెట్టి కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తారు. గులాబి : గులాబి సాగులో ప్రధానంగా అంటుతొక్కుట, అంటుకట్టుట వంటి ఆధునిక శాఖీయ పద్ధతులు ఉపయోగించి సాగు చేస్తున్నారు.

ప్రశ్న 22.
సమవిభజనలోని వివిధ దశలతో కూడిన కణచక్రం గురించి ఒక ఫ్లోచార్టును తయారుచేయండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 8

ప్రశ్న 23.
పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థల చిత్రాలను గీసి, పేర్లు రాయండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 9 AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 10

ప్రశ్న 24.
ప్రక్క పటంలో చూపిన మొక్క భాగం ఏమిటో గుర్తించండి. దానిపై వ్యాఖ్య రాయండి. (AS5)
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 11
జవాబు:
పటంలో చూపబడిన నిర్మాణము అండకోశము.

  1. పుష్పానికి లోపలగా ఉండే నాల్గవ వలయంలో పుష్పాసనము మీద అండకోశము ఉంటుంది.
  2. దీనిలో అండాశయము, కీలము, కీలాగ్రము అను మూడుభాగాలు ఉంటాయి.
  3. అండకోశము ఫలదళాలతో తయారుచేయబడి ఉంటుంది.
  4. అండాశయము లావుగా ఉండి అండములను కలిగి ఉంటుంది.
  5. అండాశయముపై ఉండు కాడవంటి భాగమును కీలము అనియు, దాని చివరి భాగమును కీలాగ్రము అనియు అందురు.
  6. కీలాగ్రము పరాగరేణువులను స్వీకరించును.

ప్రశ్న 25.
మొక్కలలో జరిగే లైంగిక ప్రత్యుత్పత్తిని ఫ్లోచార్టు రూపంలో తెలియజేయండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 12

ప్రశ్న 26.
మొక్కలలో ఫలదీకరణను వివరించటానికి చక్కని చిత్రాన్ని గీసి పేర్లు రాయండి. పరాగరేణువు గురించి కొన్ని అంశాలను రాయండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 1

  1. పుప్పొడిరేణువులు పరాగకోశములో అభివృద్ధి చెందుతాయి. ఈ పరాగకోశంలో సిద్ధబీజాలు ఏర్పడే కణజాలం ఉంటుంది.
  2. ఈ కణజాలంలోని కొన్ని కణాల నుండి పరాగ మాతృకణాలు ఏర్పడతాయి. ఈ స్థితి వరకు ఈ కణాలు ద్వయ స్థితిక దశలో (2n) ఉంటాయి.
  3. ప్రతి పరాగ మాతృకణము క్షయకరణ విభజన చెంది నాలుగు పిల్ల కణాలను ఇస్తుంది.
  4. ఇవి పుప్పొడిరేణువులుగా అభివృద్ధి అవుతాయి. ఈ పరాగ రేణువులు ఏకస్థితిక దశలో ఉంటాయి.
  5. వీటిని సూక్ష్మసిద్ధబీజాలు అని, పురుష సంయోగబీజము అని పిండకోశం కూడా అంటారు.
  6. వీటిలో ఒక జట్టు క్రోమోజోమ్ లు మాత్రమే ఉంటాయి. పుప్పొడి రేణువుల అధ్యయనమును సిద్ధబీజ శాస్త్రము అంటారు.

ప్రశ్న 27.
ఒకవేళ జీవులలో క్షయకరణ విభజన జరగలేదనుకోండి. వాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? (AS6)
జవాబు:

  1. ఒకవేళ జీవులలో క్షయకరణ విభజన జరగకపోతే, తరతరానికి క్రోమోజోమ్ ల సంఖ్య రెట్టింపు అవుతుంది.
  2. క్రోమోజోమ్ సంఖ్యలోని మార్పు జీవుల లక్షణాలను పూర్తిగా మార్చివేస్తాయి.
    3. తరతరానికి క్రోమోజోమ్ సంఖ్య రెట్టింపు అవటం వలన జీవులలో విపరీత లక్షణాలు వస్తాయి.
  3. తరానికి, తరానికి మధ్య పోలికలు లేకుండా, జీవజాతిలో అనర్లం జరుగుతుంది.
  4. ప్రత్యుత్పత్తి యొక్క లక్ష్యం నెరవేరదు.

AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 28.
జీవం శాశ్వతత్వానికి తోడ్పడుతున్న కణవిభజనను నీవు ఏ విధంగా అభినందిస్తావు? (AS6)
జవాబు:

  1. కణవిభజన వలన కణాల సంఖ్య పెరుగుతుంది. దాని వలన జీవి అభివృద్ధి చెంది జీవక్రియలను నిర్వహించగలుగుతున్నది.
  2. ప్రాథమిక జీవులలో కణ విభజన ప్రత్యుత్పత్తి విధానంగా పనిచేస్తుంది. దీనినే విచ్చిత్తి అంటున్నారు.
  3. గాయాలు మాన్పటంలోనూ, చనిపోయిన కణాలను భర్తీ చేయటంలోనూ కణవిభజన కీలకపాత్ర వహిస్తుంది.
  4. కణవిభజన వలనే ప్రత్యుత్పత్తి విధానం కొనసాగి జీవులు తమ జాతిని నిలుపుకొంటున్నాయి.
  5. భూమి మీద జీవం ఏర్పడటం ఒక అద్భుత విషయం అయితే, ఆ జీవనం కొనసాగటానికి అవసరమైన కణ విభజన “ప్రక్రియ మరొక అద్భుతం.
  6. జీవరాశి మనుగడకు, వంశాభివృద్ధికి కణవిభజన కీలకమని నేను భావిస్తున్నాను.

ప్రశ్న 29.
లైంగిక వ్యాధులు వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి మీ అభిప్రాయాలను రాయండి. (AS7)
జవాబు:
కింద సూచించిన ఆరోగ్యకరమైన జీవన విధానాలను అలవర్చుకోవడం ద్వారా లైంగిక వ్యాధులను రాకుండా నిరోధించవచ్చు.

  1. ఆగంతకులు, తెలియనివారు, ఒకరికంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు.
  2. గర్భనిరోధక సాధనాలు అందుబాటులో ఉన్నప్పటికీ నియమబద్ధమైన, నీతివంతమైన జీవనం గడపాలి.
  3. ఒకవేళ గర్భం దాల్చినట్లు సందేహం కలిగితే మంచి డాక్టర్‌ను సంప్రదించి నిర్ధారించుకోవాలి. ఏదేని వ్యాధి సోకినట్లు నిర్ధారించబడితే సంపూర్ణంగా చికిత్స తీసుకోవాలి.

ప్రశ్న 30.
ఆర్ధిక ప్రాముఖ్యత గల మొక్కల పెంపకాన్ని మీ జిల్లా మరియు రాష్ట్రాలలో ఏ విధంగా చేపడుతున్నారో తగిన సమాచారాన్ని మీ పాఠశాల గ్రంథాలయం మరియు ఇంటర్నెట్ నుండి సేకరించండి. దాని ఆధారంగా ఒక నివేదిక (గ్రాఫ్) తయారుచేయండి. (AS3)
జవాబు:
మా జిల్లాలోని ఆర్థిక ప్రాముఖ్యత గల మొక్కల పెంపకం వివరాలు సేకరించి గ్రాఫ్ రూపొందించాను. ఈ గ్రాఫ్ ఆధారంగా నేను ఈ క్రింది పరిశీలనలు చేశాను.
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 7

  1. మా జిల్లాలో మొక్కల పెంపక విస్తీర్ణం క్రమేణా పెరగటం గమనించాను.
  2. దీని వలన బీడు భూములు, బంజరు భూములు సాగులోనికి వస్తున్నాయని భావించవచ్చు.
  3. జిల్లాలో ప్రధానంగా వరి పంట పండిస్తుండగా, నీటి కొరత ఉన్న ప్రాంతాలలో పత్తి, పొగాకు, మిరప పంటలు సాగు చేస్తున్నారు.
  4. కొండ ప్రాంత వాలునందు గతంలో మాదిరిగా కాకుండా, వాలు భూములను తోటలుగా మలచి బత్తాయి, నారింజ పండిస్తున్నారు.
  5. తోటల పెంపకంలో నీటి సౌకర్యం కొరకు ఆధునిక పద్ధతులైన ‘బిందుసేద్యం’ అవలంబిస్తున్నారు.
  6. మునగ, బొప్పాయి వంటి కాయ పంటలకు రైతులు ఉత్సాహం చూపించటం శుభసూచకం.
  7. నదీ పరీవాహక ప్రాంతం నేలలు బాగా సారవంతంగా ఉండుట వలన అరటి, పసుపు పంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
  8. మొత్తం మీద ప్రతి సంవత్సరం సాగుభూమి విస్తీర్ణత పెరుగుతున్నది. రైతులు మూస వ్యవసాయానికి బదులు కొత్త పద్ధతుల వైపు ఆకర్షితులౌతున్నారు.

10th Class Biology 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ Textbook InText Questions and Answers

10th Class Biology Textbook Page No. 124

ప్రశ్న 1.
పెరుగు తయారయ్యే క్రమంలో బాక్టీరియా ఏ విధంగా విభజన చెందిందని మీరు భావిస్తున్నారు?
జవాబు:
పెరుగు తయారవటానికి లాక్టోబాసిల్లస్ అనే బాక్టీరియా తోడ్పడుతుంది. ఈ ప్రక్రియలో ద్విదావిచ్ఛిత్తి ద్వారా బాక్టీరియా తమ సంఖ్యను వేగంగా వృద్ధి చేసుకుంటుంది.

10th Class Biology Textbook Page No. 125

ప్రశ్న 2.
ప్రస్తుత కాలంలో మనం విత్తనరహిత ఫలాలు అరటి, ద్రాక్ష మొదలగు పండ్లను అభివృద్ధి పరచగలిగాం. ఇది ఎలా జరుగుతుందని మీరు భావిస్తున్నారు?
జవాబు:

  1. విత్తనాలు లేని ఫలాలను అనిషేక ఫలాలు అంటారు.
  2. ఫలదీకరణ జరగకుండా అండాశయం నేరుగా ఫలంగా మారటం వలన ఇవి ఏర్పడతాయి.
  3. ‘జిబ్బరెల్లిన్’ అనే రసాయనిక పదార్థాలను ఉపయోగించి మనం అనిషేక ఫలాలు పొందవచ్చు.

ప్రశ్న 3.
పార్టినోజెనెసిస్ (అనిషేకఫలనం) ప్రక్రియలో రెండు జీవులూ పాల్గొంటాయా?
జవాబు:

  1. అనిషేక ఫలనంలో సంయోగం చెందకుండానే సంయుక్తబీజం అభివృద్ధి చెందుతుంది.
  2. ఈ ప్రక్రియలో రెండు జీవులు అవసరం లేదు.
  3. ఈ ప్రక్రియలో ద్వయస్థితిక అండాలు నేరుగా సంయుక్తబీజంగా మారి జీవులను ఉత్పత్తి చేస్తాయి.

ప్రశ్న 4.
పార్థినోజెనెసిస్ జరిపే మొక్కలు, జంతువుల గురించి మీ ఉపాధ్యాయునితో చర్చించండి. వార్తా వ్యాఖ్యను తయారు చేయండి.
జవాబు:

  1. ఫలదీకరణ చెందని అండాల నుండి జీవులు ఏర్పడే ప్రక్రియను పారినోజెనెసిస్ అంటారు.
  2. చాలా రకాల మొక్కలలో పార్టినోజెనెసిస్ ప్రక్రియ జరుగుతుంది. అరటి, ద్రాక్ష, పుచ్చకాయ వంటి జాతులలో పారినోజెనెసిస్ ప్రక్రియ వలన విత్తనాలు లేని కాయలు ఏర్పడతాయి.
  3. నిమటోడ్స్, నీటి ఈగలు, తేళ్ళు, ఎఫిడ్స్ తెనేటీగలు, కందిరీగలు, చీమలు వంటి అకశేరుకాల జీవితచక్రంలో పార్టీనోజెనెసిస్ కనిపిస్తుంది.
  4. కొన్ని ఉభయచరాలలోనూ, సరీసృపాలలోనూ పార్టనోజెనెసిస్ ప్రక్రియ ఉంటుంది.
  5. చేపలలో 20 జాతులు, బల్లులలో 25 జాతులు, కొన్ని రకాల పాములు, సాలమాండర్లలో పార్టీనోజెనెసిసనను గుర్తించారు.
  6. కామెడో డ్రాగన్స్, సుత్తితల చేపలు, బ్లాక్ టిప్ షాలలో కూడా ఇటీవలి కాలంలో పార్టీనోజెనెసిసను గుర్తించారు.

AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 5.
ముక్కలవడాన్ని పునరుత్పత్తి ప్రక్రియగా పేర్కొనవచ్చా? ఎందుకు?
జవాబు:
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 17
ప్లనేరియాలో పునరుత్పత్తి పునరుత్పత్తి, ముక్కలు కావడాన్ని పోలి ఉన్నప్పటికి మౌలికంగా కొన్ని భేదాలు కలవు. అవి :

ముక్కలు కావటం పునరుత్పత్తి
1) ఇది తక్కువ వ్యవస్థీకరణ చెందిన బహుకణ జీవులలో జరుగును. 1) ఇది ఉన్నత స్థాయి జీవులలో జరుగును. వీటిలో వ్యవస్థీకరణ బాగా వృద్ధి చెంది ఉంటుంది.
2) తెగిపోయిన రెండు ముక్కలు రెండు జీవులుగా వృద్ధి చెందుతాయి. 2) తెగిపోయిన రెండు ముక్కలు రెండు జీవులుగా వృద్ధి చెందకపోవచ్చు.
3) ఈ పక్రియలో ప్రత్యేకీకరించిన కణాలు ఉండవు. 3) పునరుత్పత్తి నిర్వహించటానికి, ప్రత్యేకీకరణ చెందిన కణాలు ఉంటాయి.

 

10th Class Biology Textbook Page No. 126

ప్రశ్న 6.
ఏ రకమైన విచ్ఛిత్తి ప్రక్రియ తక్కువ సమయంలో ఎక్కువ సమూహాలను ఉత్పత్తి చేయటానికి ఉపయోగపడుతుంది?
జవాబు:
‘బహుదా విచ్ఛిత్తి’ ప్రక్రియ తక్కువ సమయంలో, ఎక్కువ సమూహాలను ఉత్పత్తి చేయటానికి తోడ్పడును.

ప్రశ్న 7.
ఆశించిన లక్షణాలు గరిష్ఠంగా రాబట్టాలంటే ఏ రకమైన అలైంగిక విధానం అనుకూలమైనది?
జవాబు:
ఆశించిన లక్షణాలు గరిష్ఠంగా రాబట్టాలంటే, ‘అంటుకట్టు’ విధానం అనుకూలమైనది.

10th Class Biology Textbook Page No. 127

ప్రశ్న 8.
మీ తోటలో రెండు రకాల పండ్లను కాసే చెట్లు ఉన్నాయి అనుకుందాం. ఒక చెట్టుకు పెద్దవి, తక్కువ పండ్లను ఇచ్చే లక్షణం ఉంది. అయితే ఈ పండ్లు రుచిగా ఉన్నాయి. ఇంకొక చెట్టు చిన్నది, రుచిలేని పండ్లను అధిక సంఖ్యలో కాస్తుంది. వీటిలో ఏది నీకు లాభదాయకంగా ఉండటానికి ఏ ఏ లక్షణాలను ఎంపిక చేసుకుంటావు?
జవాబు:
మొదటి మొక్కలో పండ్లు పెద్దవిగా ఉండే లక్షణాన్ని, రెండవ మొక్కలో ఎక్కువ పండ్లను ఇచ్చే లక్షణాన్ని ఎంపిక చేసుకొంటాను.

ప్రశ్న 9.
వాంఛిత లక్షణాలున్న మొక్కలను ఉత్పత్తి చేయాలంటే ఏ రకమైన శాఖీయవ్యాప్తి ఉపయోగపడుతుంది?
జవాబు:
అంటుకట్టే ప్రక్రియ ద్వారా వాంఛిత లక్షణాలు ఉన్న మొక్కను ఉత్పత్తి చేసుకోవచ్చు.

ప్రశ్న 10.
కోరకీభవనం లేదా విచ్ఛిత్తి లేదా ముక్కలగుట విధానమేదైనా, ఏర్పడిన కొత్త జీవులు జనక జీవులను పోలి ఉంటాయి. ఇది నిజమేనా? ఎందువలన?
జవాబు:

  1. కోరకీభవనం, విచ్ఛిత్తి, ముక్కలగుట విధానాలలో ఏర్పడిన కొత్త జీవులు జనక జీవులను పోలి ఉంటాయి.
  2. ఇవన్నీ అలైంగిక పద్ధతులు. ఈ ప్రక్రియలో జనక జీవులలోని జన్యు పదార్థం కొత్త జీవులలోనికి చేరుతుంది కావున కొత్త లక్షణాలకు అవకాశం లేదు.

ప్రశ్న 11.
కృత్రిమ శాఖీయ ఉత్పత్తి, ప్రయోజనాలు, నష్టాలు గురించి సమాచారాన్ని మీ పాఠశాల గ్రంథాలయం నుండి లేదా అంతర్జాలం నుండి సేకరించి తరగతి గదిలో చర్చించండి.
జవాబు:
ప్రయోజనాలు:

  1. శాఖీయ ఉత్పత్తిలో వాంఛిత లక్షణాలు కలిగిన మొక్కలను సులువుగా పెంచుకోవచ్చు.
  2. తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలు పెంచవచ్చు.
  3. ‘విత్తన సుప్తావస్థ’ వంటివి ఉండవు కావున కాలం ఆదా అవుతుంది.
  4. అలంకరణ కోసం కొత్తరకం మొక్కలు ఉత్పత్తి చేయవచ్చు.
  5. అంటుకట్టే విధానంలో నూతనత్వం కొరకు ఒకే మొక్కపై విభిన్న లక్షణాలు గల మొక్కలు పెంచవచ్చు.

నష్టాలు :

  1. శాఖీయవ్యాప్తి అలైంగిక విధానం కనుక కొత్త లక్షణాలు ఏర్పడవు.
  2. వ్యాధి నిరోధకత అన్నింటికి ఒకే స్థాయిలో ఉంటుంది కావున వ్యాధులను సమర్థంగా ఎదుర్కొనలేవు.
  3. ఒక స్థాయికి మించి లక్షణాలను మెరుగుపర్చలేము.

10th Class Biology Textbook Page No. 129

ప్రశ్న 12.
ఫెర్న్, రైజోపన్లలో ఉండే సిద్ధబీజాలు, సిద్ధబీజాశయాల్లో మీరేవైనా పోలికలు గమనించారా?
జవాబు:

  1. ఫెర్న్, రైజోపన్లలో ఉండే సిద్ధబీజాలు ఒకే విధంగా ఉన్నాయి.
  2. ఇవి గుండ్రంగా, చిన్నవిగా ఉండి సూక్ష్మంగా ఉన్నాయి.
  3. ఇవి తేలికగా ఉండి, గాలి ద్వారా వ్యాపించే లక్షణాలు కలిగి ఉన్నాయి.
  4. ఫెర్న్ సిద్ధబీజాలతో పోల్చితే, రైజోపస్ సిద్ధబీజాలు మరింత నల్లగా, సూక్ష్మంగా ఉన్నాయి.

AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 13.
పుట్టగొడుగుల గురించి విన్నారా? అవి ఎలా పెరుగుతాయి? తరగతిలో చర్చించండి.
జవాబు:
పుట్టగొడుగులు శిలీంధ్ర వర్గానికి చెందిన జీవులు. ఇవి గుండ్రని తల కలిగి ఉంటాయి. దీనిని Pileus అంటారు. ఇది పెరిగి విప్పారినపుడు లోపలివైపున అనేక గాడుల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని Gills అంటారు. వీటికి ప్రత్యుత్పత్తిని నిర్వహించే సిద్ధబీజాలు ఏర్పడతాయి. ఈ సిద్ధబీజాలు గాలి ద్వారా వ్యాప్తి చెంది, కొత్త పుట్టగొడుగులను ఏర్పరుస్తాయి.

10th Class Biology Textbook Page No. 131

ప్రశ్న 14.
ముష్కాలు శరీరకుహర బయట కోశాలలో ఎందుకు ఉన్నాయో ఆలోచించండి.
జవాబు:
కారణాలు:

  1. ముష్కాలు శరీర ఉష్ణోగ్రత కంటే 2°C నుండి 2.5°C తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే పరిణితి చెందుతాయి.
  2. అందువలన శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఉండటానికి ముష్కాలు శరీరకుహర బయటకోశాలలో ఉన్నాయి.

10th Class Biology Textbook Page No. 135

ప్రశ్న 15.
రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి నిర్వహించే విధులేమిటి?
జవాబు:
రక్షక పత్రావళి :
సాధారణంగా రక్షక పత్రావళి ఆకుపచ్చరంగులో ఉండి పుష్పం వెలుపలి వలయంగా ఉంటుంది. మొగ్గదశలో పుష్పాన్ని రక్షించటం వీటి ప్రధాన విధి.

ఆకర్షక పత్రావళి :
ఇవి పెద్దవిగా ఉండి, రంగులతో ఆకర్షవంతంగా ఉంటాయి. ఇవి పుష్పంలోని రెండవ వలయం పరాగ సంపర్కం కొరకు కీటకాలను ఆకర్షించటం వీటి ముఖ్యమైన విధి.

ప్రశ్న 16.
మీరు సేకరించిన పుష్పం పటం గీసి, భాగాలు గుర్తించి, అవి నిర్వహించే విధులను రాయండి.
(లేదా)
పుష్పం అంతర్నిర్మాణం పటం గీచి, భాగములను గుర్తించుము.
జవాబు:
నేను సేకరించిన పుష్పం తూటి పుష్పం, ఇది ఉమ్మెత్త పుష్పాన్ని పోలి ఉంది. . దీనిలోని భాగాలు :
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 178

1. రక్షక పత్రాలు : ఇవి మొగ్గదశలో పుష్పానికి రక్షణ ఇస్తాయి.

2. ఆకర్షణ పత్రాలు : ఇవి పరాగ సంపర్కానికి కీటకాలను ఆకర్షిస్తాయి.

3. కేసరావళి : ఇవి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు. పరాగ రేణువులను ఉత్పత్తి చేస్తాయి.

4. అండకోశం : ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవము. ఇది అండాలను ఉత్పత్తి చేస్తుంది.

10th Class Biology Textbook Page No. 136

ప్రశ్న 17.
స్వపరాగ సంపర్కం జరుపుకొనే మొక్కలకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
చాలా లెగ్యుమినేసి మొక్కలలో స్వపరాగ సంపర్కం జరుగుతుంది. ఉదా : వేరుశనగ, సోయాచిక్కుడు, ఆర్కిడ్ జాతులు, పొద్దు తిరుగుడు, గడ్డి చామంతి వంటి మొక్కలు ద్విలింగ పుష్పాలను కలిగి స్వపరాగ సంపర్కానికి ప్రాధాన్యత ఇస్తాయి.

ప్రశ్న 18.
ఒక మొక్క స్వపరాగ సంపర్కం జరుపుతుందా లేదా అని చెప్పటానికి ఏవైనా గుర్తించదగిన లక్షణాలు ఉంటాయా?
జవాబు:
ఈ క్రింది లక్షణాల ఆధారంగా మొక్కలలో స్వపరాగ సంపర్కం జరుగుతుందా లేదా అని నిర్ధారించవచ్చు. అవి :

  1. పుష్పం ద్విలింగ పుషమై ఉండాలి.
  2. పుష్పంలోని స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఒకే సమయంలో పక్వానికి రావాలి.
  3. ప్రత్యుత్పత్తి అవయవాలు ఒకే ఎత్తులో ఉండాలి.
  4. వికసించని పుష్పాలలో స్వపరాగ సంపర్కానికి అవకాశాలు అధికం.

ప్రశ్న 19.
ఒకవేళ కేసరాలు కీలం కన్నా దిగువగా ఉంటే, సంయోగం ఎలా జరుగుతుంది?
జవాబు:
కేసరాలు కీలం కన్నా దిగువుగా ఉండే సందర్భంలో ఆత్మపరాగ సంపర్కానికి అవకాశాలు తగ్గుతాయి. ఈ మొక్కలు పరపరాగ సంపర్కానికి ప్రాధాన్యత ఇస్తాయి.

పరపరాగ సంపర్కం జరగని సమక్షంలో కీలాగ్రం క్రిందకు వంగి పరాగరేణువులను తాకుతాయి. అందువలన ఆత్మపరాగ సంపర్కం జరుగుతుంది.

AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 20.
కేసరావళి, అండకోశము వేరు వేరు పుష్పాలలో ఉండే మొక్కలలో ఏమి జరుగుతుంది?
జవాబు:

  1. కేసరావళి, అండకోశము వేరు వేరు పుష్పాలలో ఉంటే వాటిని “ఏకలింగ పుష్పాలు” అంటారు.
  2. ఏకలింగ పుష్పాలలో ఆత్మపరాగ సంపర్కానికి అవకాశం ఉండదు.
  3. కావున ఇవి పరపరాగ సంపర్కం ద్వారా ప్రత్యుత్పత్తిని నిర్వహిస్తాయి.

10th Class Biology Textbook Page No. 138

ప్రశ్న 21.
ఫలంలో ఏ ఏ పుష్పభాగాలు కనిపిస్తాయి?
జవాబు:

  1. వంకాయ వంటి కొన్ని ఫలాలలో రక్షక పత్రావళి శాశ్వతంగా ఉండి పోతుంది.
  2. అండాశయం ఫలంగా మారి కనిపిస్తుంది.
  3. అండాశయంలోని అండాలు విత్తనాలుగా మారతాయి.
  4. పుష్పవృంతం ఫలవృంతంగా ఉంటుంది.
  5. అండకవచాలు ఫలకవచాలుగా మారతాయి.
  6. అండన్యాస స్థానం ఫలం మధ్యలో కనిపిస్తుంది.

10th Class Biology Textbook Page No. 139

ప్రశ్న 22.
బీజదళాలు మొక్కకు ఏ విధంగా ఉపయోగపడతాయి?
జవాబు:
బీజదళాలు ఆహార పదార్థాలను నిల్వ చేసుకొంటాయి. మొక్క పెరిగి ఆహారం తయారీ కొరకు కొత్త ఆకులు ఏర్పడే వరకు, మొక్కకు బీజదళం ఆహారాన్ని అందిస్తాయి.

10th Class Biology Textbook Page No. 145

ప్రశ్న 23.
మాతృకణాల కంటే పిల్లకణాల… క్రోమోజోమ్ సంఖ్య సగానికి తగ్గించకపోతే ఏమౌతుంది? ఇది లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే సంతతిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
జవాబు:

  1. లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ, పురుష సంయోగబీజాలు కలిసి కొత్త జీవిని ఏర్పర్చుతాయి.
  2. ఈ సంయోగబీజాలు ఏర్పడేటప్పుడు క్షయకరణ విభజన జరిగి క్రోమోజోమ్ ల సంఖ్య సగానికి తగ్గించబడుతుంది.
  3. క్రోమోజోమ్ సంఖ్య తగ్గించబడనట్లయితే, రెండు కణాల కలయిక వలన కొత్త తరంలో క్రోమోజోమ్ సంఖ్య రెట్టింపు అవుతుంది.
  4. క్రోమోజోమ్ ల సంఖ్యలోని మార్పు జీవి లక్షణాలను పూర్తిగా మార్చేస్తుంది.
  5. జనకతరంతో పొంతన లేని కొత్తతరం ఏర్పడుతుంది.
  6. కొత్తతరంలో మనుగడకు తోడ్పడని విపరీత లక్షణాలు ఏర్పడతాయి.
  7. ఇలా తరతరానికి క్రోమోజోమ్ లు పెరగటం అవాంఛనీయం.

ప్రశ్న 24.
భారత ప్రభుత్వం వివాహం చేసుకోవటానికై తగిన వయస్సుగా మగపిల్లలకు 21 సంవత్సరాలు, ఆడపిల్లలకు 18 సంవత్సరాలుగా చట్టబద్దం చేసింది. ఎందుకు?
జవాబు:

  1. చిన్నతనంలో జరిగే వివాహాలను బాల్యవివాహాలు అంటారు.
  2. వీటి వలన స్త్రీలలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
  3. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పూర్తిగా ఎదిగి ఉండదు, కావున గర్భధారణ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
  4. చిన్న వయస్సులో కలిగే సంతానం తల్లి ఆరోగ్యం పైనే కాకుండా బిడ్డ ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
  5. భార్యాభర్తల మధ్య సఖ్యతను పెంచుకొనే మానసిక పరిపక్వత చిన్న వయస్సులో ఉండదు. అందువలన వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది.
  6. అందువలన భారత ప్రభుత్వం వివాహ వయస్సు మగపిల్లలకు 21, ఆడపిల్లలకు 18 సంవత్సరాలుగా చట్టం చేసింది.

ప్రశ్న 25.
ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు చాలు అనుకోవటం సామాజిక బాధ్యత అని భావిస్తారా?
జవాబు:
నేటి సమాజంలో జనాభా పెరుగుదల అతి ప్రమాదకర సమస్య. జనాభా విపరీతంగా పెరగటం వలన, ఆహార సమస్య, వనరుల కొరత, ఆవాస కొరత వంటి ప్రధాన సమస్యలు తలెత్తుతాయి. వీటిని పరిష్కరించటానికి పరిమిత కుటుంబం ఒక్కటే మంచి మార్గం. కావున ప్రతి ఒక్కరు పెరుగుతున్న జనాభా సమస్యను దృష్టిలో ఉంచుకొని పరిమిత కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక్కరు లేదా ఇద్దరు చాలు అనుకోవటం వలన జనాభా సమస్యను పరిష్కరించిన వారు అవుతారు. ప్రతివ్యక్తి దీనిని ఒక సామాజిక బాధ్యతగా భావించినపుడు మాత్రమే మనం జనాభా సమస్యను శక్తివంతంగా అరికడతాము.

ప్రశ్న 26.
ఆరోగ్యకరమైన సమాజమంటే ఏమనుకుంటున్నారు?
జవాబు:
సమాజంలోని ప్రజలందరికి ఆరోగ్య విషయాలపై సరైన అవగాహన ఉండి, ఆరోగ్య సూత్రాలను సక్రమంగా పాటించే సమాజాన్ని ఆరోగ్యకరమైన సమాజం అంటారు. వీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరు. వ్యాధుల సంక్రమణ నివారణపై అవగాహన కలిగి ఉంటారు. వ్యాధుల నివారణలో టీకాల పాత్రను తెలుసుకొని పిల్లలకు టీకాలు వేయిస్తారు. ఎయిడ్స్ వంటి లైంగిక వ్యాధులు సంక్రమించకుండా, తగుజాగ్రత్తలు పాటిస్తారు. ఆరోగ్యవిద్యను, కుటుంబ నియంత్రణను పాటిస్తారు.

ప్రశ్న 27.
బాల్యవివాహాలను ప్రోత్సహిస్తారా? ఎందుకు?
జవాబు:
బాల్యవివాహాలను నేను ప్రోత్సహించను. చట్టరీత్యా పురుషులకు 21 సంవత్సరాలు, స్త్రీలకు 18 సంవత్సరాల వివాహ వయస్సు. అలాకాకుండా బాల్యవివాహాలు చేయటం వలన అనేక సమస్యలు తలెత్తుతాయి. వాటిలో ప్రధానమైనది. ఆరోగ్యసమస్యలు, చిన్న వయస్సులో ఆడపిల్లలలో గర్భధారణకు కావలసినంత పరిపక్వత ఉండదు. బాల్యవివాహాల వలన త్వరగా గర్భవతులై ఆరోగ్యం పాడుచేసుకొంటారు. అంతేకాక జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకొనే మానసిక సామర్ధ్యం చిన్నతనంలో ఉండదు. దాని వలన వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమై, అనేక సాంఘిక దుష్ఫలితాలకు దారితీస్తుంది. కావున మనం బాల్య వివాహాలను ప్రోత్సహించరాదు.

10th Class Biology Textbook Page No. 146

ప్రశ్న 28.
ఎయిడ్స్ వ్యా ధికి కారణమైన వైరస్ ఏమిటి?
జవాబు:
HIV (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్) వలన AIDS వ్యాధి కలుగుతుంది.

ప్రశ్న 29.
స్థానిక ఆరోగ్య కార్యకర్తను మీ పాఠశాలకు ఆహ్వానించి HIV గురించి, సమాజంపై కలిగే దుష్ప్రభావాల గురించి చర్చించండి.
జవాబు:
స్థానిక ఆరోగ్య కార్యకర్తను మా పాఠశాలకు ఆహ్వానించి HIV గురించి అది సమాజంపై కలిగించే దుష్ఫలితాలను గురించి చర్చించాము. ఈ చర్చలో ప్రధానంగా ఎయిడ్స్ వ్యాధి సోకుతున్న వారిలో ప్రధానంగా యుక్త వయస్సు వారే ఉంటున్నారు. ఈ వ్యాధి బారిన పడి పారు అర్ధాంతరంగా జీవితాన్ని ముగించటం బాధాకరం. సమాజంలో ఉత్పాదకత అంతా యువకుల పైన ఆధారపడి ఉంటుంది. పనిచేసే తరం ఎయిడ్స్ బారిన పడటం వలన సమాజంలో ఉత్పాదకత తగ్గి ఆర్థికంగా పతనమౌతుంది.

కుటుంబంలో పోషణ చూచే ప్రధాన వ్యక్తి మరణించటం వలన ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందికి లోను కావటమే గాక, కుటుంబం వీధిన పడుతుంది. ఆ కుటుంబంలోని పిల్లలు సరైన మార్గదర్శకత్వం లేక అభివృద్ధి చెందలేకపోతారు. కావున సమర్థవంతమైన సమాజం కోసం, మనమందరం ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషిచేయాలి. ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంచాలి. ఎయిడ్స్ రహిత సమాజస్థాపనకు నాంది పలకాలి.

AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

ప్రశ్న 30.
AIDS రోగుల పట్ల, వారి కుటుంబం పట్ల వివక్షత చూపటం కూడా ఒక సామాజిక దురాచారమే. దీనిని మీరు అంగీకరిస్తారా? ఎందుకు?
జవాబు:
ఎయిడ్స్ రోగుల పట్ల, వారి కుటుంబాల పట్ల వివక్షత చూపరాదు. వాస్తవానికి ఎయిడ్స్ రోగికి కాని, వారి కుటుంబానికి కాని సరైన సహకారం, విశ్వాసం అందించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎయిడ్స్ రోగులకు మనం కలిగించే మనోనిబ్బరం, సానుకూల దృక్పథం వారి జీవితాన్ని మరింత పొడిగిస్తుంది. సాటి మానవులుగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు నైతిక సహకారం అందించటం మనందరి కర్తవ్యం. అలాగాక వారిని సమాజం నుండి దూరంగా ఉంచటం, వివక్షత చూపించటం ఒక సామాజిక దురాచారం. దీనిని మనం ప్రోత్సహించరాదు.

10th Class Biology Textbook Page No. 148

ప్రశ్న 31.
ఈ మధ్యకాలంలో డాక్టర్లు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా లింగనిర్ధారణ పరీక్షలను జరపడం లేదు. ఎందుకు?
జవాబు:

  1. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా లింగనిర్ధారణ చేసి, చాలా మంది ఆడ శిశువులను భ్రూణహత్యలు చేస్తున్నారు.
  2. ఇది మహా పాపమే కాకుండా, స్త్రీ పురుష నిష్పత్తిలో తీవ్ర వ్యత్యాసానికి దారితీస్తుంది.
  3. దీని వలన అనేక సాంఘిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
  4. అందువలన ప్రభుత్వం లింగనిర్ధారణ పరీక్షలను నిషేధించింది.
  5. కావున డాక్టర్లు ఇటీవలి కాలంలో లింగనిర్ధారణ పరీక్షలు జరపటం లేదు.

10th Class Biology 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1: పాలలో బాక్టీరియా వృద్ధి చెందడం

30 చెంచాల గోరు వెచ్చని పాలను ఒక గిన్నెలో తీసుకోండి. దానికి ఒక చెంచా పెరుగును కలపండి. మరొక గిన్నెలో అంతే పరిమాణంలో చల్లని పాలను తీసుకుని పెరుగు కలపండి. రెండు గిన్నెల మీద మూతపెట్టి సమయాన్ని నమోదు చేయండి. ప్రతి గంటకు ఒకసారి పెరుగు తయారైనది లేనిది పరిశీలించండి. పెరుగు గట్టిపడుతూ ఉండడం బాక్టీరియాల సమూహాలు పెరుగుతున్నాయనడానికి సంకేతం. రెండు గిన్నెలలో పెరుగు తయారవడానికి పట్టే కాలాన్ని లెక్కించండి.
1) రెండు గిన్నెలలోనూ ఒకే సమయానికి పెరుగు తయారయ్యిందా?
జవాబు:
రెండు గిన్నెలలో ఒకే సమయానికి పెరుగు తయారుకాలేదు. చల్లని పాల గిన్నెలో కన్నా గోరు వెచ్చని పాల గిన్నెలో పెరుగు త్వరగా తయారైనది.

2) ఒక స్పూను పెరుగులో ఉండే బాక్టీరియా సమూహాలు 30 స్పూన్ల పాలు పెరుగుగా మారడం వల్ల బాక్టీరియా 30 రెట్లు పెరిగాయని చెప్పవచ్చా?
జవాబు:
పాలలోని లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా పాలను పెరుగుగా మార్చుతుంది. అనుకూల గోరువెచ్చని వాతావరణంలో బాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. దానివలన పెరుగు పరిమాణం పెరుగుతుంది.

ఒక స్పూన్ పెరుగులో ఉండే బాక్టీరియా, 30 స్పూన్ల పాలు పెరుగుగా మారటం వల్ల బాక్టీరియా 30 రెట్లు పెరిగినట్లు భావించవచ్చు.

కృత్యం – 2 : పరాగరేణువును పరిశీలించడం:
ఒక స్లెడుపై ఒక చుక్క నీటిని వేయండి. మందార, బంతి, గడ్డిచామంతి వంటి ఏదైనా ఒక పుష్పాన్ని నీటిపైన మెల్లగా తట్టండి. నీటిలోకి రాలిన చుక్కల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇవే పరాగరేణువులు. వీటిని మొదట భూతద్దంతోనూ తరువాత సూక్ష్మదర్శిని కింద పరిశీలించండి.

మీ ప్రయోగశాల నుండి పరాగరేణువు సైడ్ ను తీసుకొని సూక్ష్మదర్శిని కింద ఉంచి పరిశీలించండి. మీరు , పరిశీలించిన పరాగరేణువు పటం గీయండి. మీరు గీసిన పటాన్ని కింది పటంతో పోల్చండి.
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 13
1) పరాగరేణువులో ఎన్ని కణాలు ఉంటాయి?
పటంలో పరాగనాళంలో రెండు కేంద్రకాలు ఉండడాన్ని గమనించారా? ఏకకణ దశలో ఉన్న పరాగరేణువు నుండి ఇవి ఏర్పడ్డాయని మీరు భావిస్తున్నారా?
జవాబు:

  1. పరాగరేణువులో రెండు కణాలు ఉంటాయి. అవి: 1. శాఖీయకణం 2. పురుషబీజకణం
  2. శాఖీయకణం విభజన చెంది పరాగనాళాన్ని ఏర్పర్చుతుంది.
  3. పరాగనాళం ద్వారా పురుషబీజ కణం ప్రయాణిస్తూ, రెండు కేంద్రకాలను ఏర్పరుస్తుంది.
  4. ఇవి స్త్రీ బీజకణంతో ఒకటి, ద్వితీయ కేంద్రంతో మరొకటి కలసి, మొక్కలలో ద్విఫలదీకరణను గావిస్తాయి.

కృత్యం – 3: విత్తనం మొలకెత్తడం

AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 14
కొన్ని వేరుశనగలు లేదా శనగలను తీసుకొని, రాత్రంతా నానబెట్టండి. తరువాత నీటిని ఒంపివేసి గింజలను తీసి గుద్దతో చుట్టి మూటకట్టండి. గింజలు తడి ఆరిపోకుండా నీరు చిలకరిస్తూ ఉండాలి. తరువాత రోజు గింజలను తీసుకొని జాగ్రత్తగా పప్పుబద్దలను తెరచి చూడండి. గింజలోని భాగాలను పరిశీలించండి. పక్క పటంతో పోలుస్తూ భాగాలను గుర్తించండి.
జవాబు:

  1. గింజల లోపల చిన్న పిండం కనిపించింది.
  2. ఇది రెండు వైపులా మొనతేలి పెరుగుదలను చూపుతున్నది.
  3. పై భాగం నుండి కాండ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. దీనిని “ప్రథమ కాండం” అంటారు.
  4. క్రింది వైపునుండి వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. దీనిని “ప్రథమ మూలం” అంటారు.

కృత్యం – 4 సమవిభజనలోని వివిధ దశలను పరిశీలించండి.

మీ ప్రయోగశాలలోని సమవిభజనలోని వివిధ దశలను చూపించే శాశ్వత స్లెడ్ లను తీసుకొని సూక్ష్మదర్శిని కింద ఉంచి జాగ్రత్తగా పరిశీలించండి. మీరు పరిశీలించిన వాటి పటాలు గీయండి. మీ పరిశీలనలను కింది పటాలతో పోల్చండి.
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 15
జవాబు:

  1. సమవిభజనలో నేను పరిశీలించిన దశలు పటంలోని బొమ్మలను పోలి ఉన్నాయి.
  2. కొన్ని కణాలలో కేంద్రక త్వచం కరిగిపోయి ఉంది. దీనిని ప్రథమదశగా గుర్తించాను.
  3. క్రోమోజోములు మందంగా మధ్య ఉన్న దశను మధ్యదశగా గుర్తించాను.
  4. క్రోమోజోములు ధృవాలవైపు జరుగుతున్న దశను చలనదశగా గుర్తించాను.
  5. రెండు కేంద్రకాలు ఉన్న కణాలను అంత్యదశలో ఉన్నట్లు గుర్తించాను.

ప్రయోగశాల కృత్యం

రైజోపసను లేదా సాధారణ బూజును సూక్ష్మదర్శిని సహాయంతో పరీక్షించాలంటే దానిని మనం నియమిత పరిస్థితులలో సొంతంగా పెంచాలి. ఇందుకోసం బ్రెడను గాని, రొట్టెను గాని, ఫలాలుగాని లేదా కూరగాయలు – గానీ ఉపయోగించవచ్చు. బూజు పెరగడానికి 4-10 రోజుల సమయం పడుతుంది. (ఎలర్జీకి కారణమయ్యే బూజు పెంచడం మంచిది కాదు. దీనివలన తీవ్రమైన ఉబ్బసానికి గురికావచ్చు.)
AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 16

రొట్టెను ఒక గంటపాటు ఆరుబయట ఉంచడం వల్ల దానికి కావలసిన సాంక్రమిక పదార్థాలను గ్రహిస్తుంది. రొట్టెను ఒక ప్లాస్టిక్ సంచిలో ఉంచి, దానిపై నీటిని చిలకరించండి. అది తేమను గ్రహిస్తుంది. ఇప్పుడు సంచి లోపల కొంతగాలి ఉండేలా దారంతో ముడివేయండి. ఈ సంచిని మిగతా ఆహార పదార్థాలకు దూరంగా, చీకటి మరియు వెచ్చగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. సాధారణంగా వంట గదిలో పొయ్యికి దగ్గరగా ఉండే అలమర దీనికి సరియైన ప్రదేశం. లేదా కిటికీ దగ్గర సంచిపైన పళ్ళెం బోర్లించి ఉంచవచ్చు. తేమ ప్రదేశాలలో బూజు బాగా పెరుగుతుంది. రెండు మూడు రోజుల్లో బూజు పెరగడం మొదలై ఒకటి రెండు వారాలలో పూర్తి స్థాయిలో పెరుగుతుంది.
1. రైజోపస్ సైడ్ ను తయారు చేయు విధానం తెలపండి.
(లేదా)
సునీత రొట్టె ముక్కనందు రైజోపస్ శిలీంధ్రంను పరిశీలించాలనుకుంటుంది.
i) ఆమెకు అవసరమైన పరికరాలను తెల్పండి.
ii) ఈ ప్రయోగ విధానంను వివరించండి.
జవాబు:
ఉద్దేశం : రైజోపస్ ప్లెడను తయారుచేయడం, కావలసిన పరికరాలు : కొద్దిగా బూజు, సైడ్ (గాజుపలక), కవర్ స్లిప్, నీరు, చేతి గౌజులు.

విధానం :

  1. సైడు మధ్యలో డ్రాపర్ ద్వారా నీటి చుక్కను వేయాలి.
  2. పంటిపుల్ల సహాయంతో కొంత బూజును తీసుకొని, దానిని సైడు మధ్యలో ఉండే నీటి చుక్కపై ఉంచాలి.
  3. ఇప్పుడు కవరు స్లిప్ యొక్క అంచు నీటి చుక్కను తాకేటట్లు సరిచేసి, కింద నీటి బుడగలు లేకుండా బూజుపై కవరు స్లిప్ను అమర్చాలి.
  4. కవరు స్లిప్ అంచుల్లో ఉండే నీటిని టిష్యూ పేపరుతో తొలగించాలి.
  5. సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాలి.

సరైన సమాధానాన్ని గుర్తించండి

1. అందాలను ఉత్పత్తి చేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగమేది?
A) అండాశయం
B) ఎపిడిడిమిస్
C) గర్భాశయ ముఖద్వారం
D) ఫాలోపియన్ నాళం
జవాబు:
B) ఎపిడిడిమిస్

AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

2. శుక్రకణం – అండంతో కలిసే ప్రక్రియను ఏమంటారు?
A) ఫ్రాగ్మంటేషన్
B) ఫర్మెంటేషన్
C) ఫెర్టిలైజేషన్
D) ఫ్యూజన్
జవాబు:
C) ఫెర్టిలైజేషన్

3. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ఏ భాగం శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది?
A) వాస్ డిఫరెన్స్
B) ఎపిడిడిమిస్
C) బ్లాడర్
D) శ్రోటమ్
జవాబు:
D) శ్రోటమ్

4. శుక్రకణం, అండం యొక్క పొరలను ఎలా ఛేదిస్తుంది? కింది వానిలో సరైనదానిని ఎన్నుకోండి.
A) అండ కవచంలోని రంధ్రాన్ని చీల్చడం ద్వారా
B) అండ కవచాన్ని రసాయనాలతో కరిగించడం ద్వారా
C) అండ కవచాన్ని కొరకడం ద్వారా
D) అండ కవచంలోని ఖాళీలను నొక్కడం ద్వారా
జవాబు:
B) అండ కవచాన్ని రసాయనాలతో కరిగించడం ద్వారా

5. అండం, శుక్రకణాలకన్నా పెద్దదిగా ఉంటుంది. ఎందుకు? సరైనదానిని ఎన్నుకోంది.
A) అండం ఎక్కువ కణాలను కలిగి ఉంటుంది.
B) ఫలదీకరణ అనంతరం పెరుగుదలకు కావల్సిన పోషక పదార్థాలను కలిగి ఉంటుంది.
C) మందమైన కణకవచాలను కలిగి ఉంటుంది.
D) పెద్ద కేంద్రకాన్ని కలిగి ఉంటుంది.
జవాబు:
B) ఫలదీకరణ అనంతరం పెరుగుదలకు కావల్సిన పోషక పదార్థాలను కలిగి ఉంటుంది.

6. కింది వానిలో గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావాన్ని చూపునవేవి? సరైనదానిని ఎన్నుకోండి.
A) సిగరెట్ పొగలోని రసాయనాలు
B) ఆల్కహాల్
C) మందులు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

AP Board 10th Class Biology Solutions 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

7. మానవ జీవిత చక్రంలోని దశలను సూచించుటకు కిందివానిలో ఏది సరైనది?
A) శిశుదశ – బాల్యదశ – కౌమారదశ – వయోజనదశ
B) బాల్యదశ – శిశుదశ – వయోజనదశ-కౌమారదశ
C) కౌమారదశ – శిశుదశ-వయోజనదశ-బాల్యదశ
D) పైవేవీ కావు
జవాబు:
A) శిశుదశ – బాల్యదశ – కౌమారదశ – వయోజనదశ

AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

SCERT AP 10th Class Biology Guide Pdf Download 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Biology 5th Lesson Questions and Answers నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

10th Class Biology 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
సమతాస్థితి, సమన్వయం అవసరమయ్యే కొన్ని పనులను చెప్పండి.
జవాబు:
మన శరీరంలో అనేక వ్యవస్థలు కలిసి పనిచేయడం వలననే అన్ని క్రియలు సక్రమంగా జరుగుతున్నాయి.

ప్రశ్న 2.
కండరాలలో కదలికలకు ప్రేరణ కలిగించేవి ఏమిటి?
జవాబు:
మన శరీరంలో ఉండే అవయవాలు, కణజాలాలు, కణాలు ఒక పద్ధతి ప్రకారం పని చేస్తాయి. ఇవన్నీ పరిసరాల నుండి సంకేతాలను గ్రహించి దానికనుగుణంగా ప్రతిస్పందిస్తాయి. ఈ ప్రతిస్పందనలే శరీరంలోనూ, శరీరం ద్వారానూ అనేక పనులు జరగటానికి ప్రేరణనిస్తాయి.

ప్రశ్న 3.
ఈ క్రింది ఖాళీలలో సరైన సమాచారాన్ని రాయండి. (AS1)
AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 1
జవాబు:
AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 2

ప్రశ్న 4.
జట్టుగా పనిచేయడం వలన మన శరీరం వివిధ విధులను నిర్వహించగలుగుతుందని మీరు అనుకుంటున్నారా? అయితే ఉదాహరణతో వివరించండి. (AS1)
జవాబు:
జట్టుగా పనిచేయటం వలన మన శరీరం వివిధ విధులను నిర్వహించగలుగుతుంది.
ఉదాహరణకు

చదవటం :
పుస్తకంలోని వాక్యాలను కళ్ళు గుర్తించి, సమాచారాన్ని మెదడుకు పంపుతాయి. మెదడు వాటిని నాలుకకు పంపుట వలన నోటితో మనం చదవగలుగుతున్నాము. అంటే మనం చదివే ప్రక్రియలో కళ్ళు – మెదడు – నోరు కలిసి పనిచేస్తున్నాయి.

వ్రాయటం :
తరగతి గదిలో టీచర్ నోట్స్ చెపుతున్నప్పుడు విద్యార్థి చెవుల ద్వారా వింటాడు. విన్న సమాచారం మెదడుకు చేరి సందేశాలను చేతికి పంపుతుంది. కావున విద్యార్థి నోట్స్ రాయగలుగుతున్నాడు. ఈ ప్రక్రియలో చెవి-మెదడు-చెయ్యి కలిసి పనిచేస్తున్నాయి.

నడవటం :
కళ్ళు దానిని గమనించి మెదడుకు సందేశాలు పంపగా మెదడు ఆదేశాలను కాళ్ళకు పంపుతుంది. కావున మనం నడవగలుగుతున్నాము. ఈ ప్రక్రియలో కళ్ళు -మెదడు-కాళ్ళు కలిసి పనిచేస్తున్నాయి.

ఆడటం :
ఆడటంలో కాళ్ళు, చేతులు, నడుం వంటి భాగాలు మెదడు ఆదేశాల మేరకు సమన్వయంగా పనిచేయటం వలన మనం రకరకాల ఆటలు ఆడగలుగుతున్నాము. ఇలా మన శరీరంలోని అవయవాలన్నీ కలిసి జట్టుగా పనిచేయటం వలన వివిధ పనులు నిర్వహించగలుగుతున్నాము. వాస్తవానికి ఏ అవయవం ఒంటరిగా పనిని నిర్వహించలేదు. అవయవముల జట్టు ఫలితంగానే అన్ని పనులు నిర్వహించగలుగుతున్నాము.

AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

ప్రశ్న 5.
మీ శరీరం అంతస్రావ్య వ్యవస్థ మరియు నాడీవ్యవస్థతో సమన్వయంగా పనిచేస్తుందనడానికి కొన్ని ఉదాహరణ లివ్వండి. (AS1)
జవాబు:

  1. మన శరీరంలో అంతస్రావ్య వ్యవస్థ మరియు నాడీవ్యవస్థ సమన్వయంగా పనిచేస్తాయి.
  2. ఆందోళన, ఆ ప్రమాదకర పరిస్థితులలో అభివృక్క గ్రంథి వల్కలం నుండి ఎడ్రినలిన్, నారడ్రినలిన్ హార్మోన్స్ స్రవించబడతాయి. ఇవి నాడీవ్యవస్థ నుండి వచ్చే ప్రచోదనాల వలన జరుగుతుంది.
  3. హైపోథాలమస్ మరియు పీయూషగ్రంథి స్రావాలు నాడీవ్యవస్థ అధీనంలో ఉంటాయి. అందుకే వీటి రసాయనాలను ‘న్యూరోహార్మోన్స్’ అంటారు.
  4. పీయూష గ్రంథి పరలంభికను ‘Neurohypophysis’ అంటారు. ఇది నాడీ కణజాలం కలిగి ఉండి, వినాళగ్రంథిగా పనిచేస్తుంది.
  5. నాడీ ప్రచోదనాలలో కీలకపాత్ర వహించే న్యూరోట్రాన్స్ మీటర్స్ నాడీ రసాయన సమన్వయానికి ఉదాహరణ.
    ఉదా: ఎసిటైల్ కొలిన్.

నిజ జీవిత నిదర్శనాలు:

  1. తల్లి బిడ్డకు పాలు ఇచ్చే సందర్భంలో చనుమొనలు (Nipple) చప్పరించటం వలన ఉద్దీపన జ్ఞాననాడి ద్వారా మెదడుకు చేరుతుంది. మెదడు ఆదేశం అనుసరించి పిట్యూటరీ గ్రంథి ‘ఆక్సిటాసిన్’ను ఉత్పత్తి చేస్తుంది. ఇది క్షీర గ్రంథులను ప్రేరేపించి పాలు విడుదల అవుతాయి. ఈ ప్రక్రియలో నాడీ రసాయనిక వ్యవస్థలు సమన్వయంగా పనిచేస్తాయి.
  2. లైంగిక ఉద్రేకాలలో గ్రాహకాల నుండి మెదడుకు సమాచారం చేరవేయటం వలన మెదడు ప్రతిస్పందించి ఆదేశాలు ఇస్తుంది. మెదడు ఆదేశాల మేరకు ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్స్ స్రవించబడి ప్రతిచర్యలు చూపుతాయి.

ప్రశ్న 6.
మీరు చెత్త ప్రోగు చేసే ప్రదేశం గుండా వెళ్తున్నారనుకోండి. మీరు వెంటనే ముక్కు మూసుకుంటారు. ఈ క్రియలో జరిగే సంఘటనలను 1-5 వరకు అవి జరిగే క్రమంలో అమర్చండి. (AS1)
ఎ) ఏక్సాన్ చివర విద్యుత్ ప్రచోదనాలు, రసాయనాలను విడుదల చేస్తాయి.
బి) డెండ్రైట్ కణాలపై చేరిన ఉద్దీపనాలు, రసాయనిక చర్యలు విద్యుత్ ప్రచోదనాలను ఉత్పత్తి చేస్తాయి.
సి) విద్యుత్ ప్రచోదనాలు కణదేహం ఏక్సాన్ ద్వారా పంపిస్తాయి.
డి) రసాయనాలు సినాప్ను దాటి తరువాత న్యూరాను చేరతాయి. అదే విధంగా అనేక విద్యుత్ ప్రచోదనాలు అనేక న్యూరాన్లను దాటుతాయి.
ఇ) చివరగా న్యూరాన్ నుండి విడుదలైన ప్రచోదనం గ్రంథి వైపు చేరడం వలన చెడువాసనను గుర్తించడానికి మరియు కండర కణాలు ముక్కును మూసుకోవడానికి ఉపయోగపడతాయి.
జవాబు:
చెత్తను ప్రోగుచేసే ప్రదేశం గుండా వెళుతున్నప్పుడు వెంటనే మనం ముక్కు మూసుకుంటాము. ఈ సంఘటనలోని చర్యలు ఈ క్రింది విధంగా వరుస క్రమంలో ఉంటాయి.
ఎ) డెండ్రైట్స్ కణాలపై చేరిన ఉద్దీపనాలు, రసాయనిక చర్యల ద్వారా విద్యుత్ ప్రచోదనాలను ఉత్పత్తి చేస్తాయి.
బి) విద్యుత్ ప్రచోదనాలు కణదేహం ఎక్సాన్ ద్వారా పంపిస్తాయి.
సి) ఏక్సాన్ చివర విద్యుత్ ప్రచోదనాలు, రసాయనాలను విడుదల చేస్తాయి.
డి) రసాయనాలు సైనాన్సు దాటిన తరువాత న్యూరాన్‌కు చేరతాయి. అదే విధంగా అనేక విద్యుత్ ప్రచోదనాలు అనేక న్యూరాన్లను దాటుతాయి.
ఇ) చివరిగా న్యూరాన్ నుండి విడుదలైన ప్రచోదనం గ్రంథి వైపు చేరడం వలన చెడువాసనను గుర్తించడానికి మరియు కండర కణాలు ముక్కును మూసుకోవడానికి ఉపయోగపడతాయి.

ప్రశ్న 7.
సినాప్స్ అంటే ఏమిటి? సమాచార ప్రసారంలో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? (AS1)
జవాబు:
కొన్ని ఎక్సాన్లు నిర్వాహక అంగాలైన కండరాలు, గ్రంథులు కణాలతోటి సంబంధం పెట్టుకుంటాయి. ఈ భాగాన్ని సినాప్స్ అంటారు. సినాప్స్ వద్ద నాడీ అంత్యాల త్వచాలు, నిర్వాహక అంగాల కణాలు ఒకదాని నుండి మరొకటి వేరుగా ఉంటాయి. వీటికి మధ్య ఖాళీ ప్రదేశం ఉంటుంది.

నాడీకణం, సైనాప్స్ మధ్య సంబంధం :
రెండు నాడీకణాల మధ్య విధిని నిర్వహించే ప్రాంతమే సైనాప్స్. ఇక్కడ ఒక నాడీకణం నుండి మరొక నాడీకణానికి సమాచారం బదలాయింపు జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఎటువంటి జీవ పదార్థ సంబంధం లేక చిన్న ఖాళీ ప్రదేశం లేకపోయినప్పటికీ సమాచారం రసాయనికంగా గాని లేక విద్యుత్ సంకేతాలు లేక రెండు విధాలుగా ప్రసారమవుతుంది. మెదడుపైన గాని, వెన్నుపాము పైన గాని మరియు వెన్నుపాము చుట్టూ సైనాలు ఉంటాయి. వీటి తరువాత వెన్నుపాము synopse లు ప్రాంతం నుండి ఏక్సాన్లు సంకేతాలను మన శరీరంలోని ప్రత్యేక భాగాలకు తీసుకుని వెళ్తాయి.

AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

ప్రశ్న 8.
కింది వాటి మధ్యగల తేడాలను రాయండి. (AS1)
అ) ఉద్దీపన మరియు ప్రతిస్పందన
ఆ) అపవాహక మరియు అభివాహక నాడులు
ఇ) కేంద్రీయ నాడీవ్యవస్థ మరియు పరిధీయ నాడీవ్యవస్థ.
ఈ) గ్రాహకం మరియు ప్రభావకం
జవాబు:
అ) ఉద్దీపన మరియు ప్రతిస్పందన :

ఉద్దీపన ప్రతిస్పందన
1. జీవులలో ప్రతిస్పందనను కలిగించే కారకాలను ఉద్దీపనాలు అంటారు. 1. ఉద్దీపనాలకు జీవులు చూపించే ప్రతిచర్యలను ప్రతిస్పందనలు అంటారు.
2. ఉద్దీపన ప్రతిస్పందన కారకము. 2. ఉద్దీపన ఫలితము ప్రతిస్పందన.
3. ఉద్దీపనలు అన్ని ప్రతిస్పందనను కలిగిస్తాయి. 3. అన్ని ఉద్దీపనలకు ప్రతిస్పందన ఒకే విధంగా ఉండదు.
4. ఉదా: గిచ్చటం (Pinching) 4. ఉదా : ప్రక్కకు జరగటం, కోప్పడటం.

ఆ) అపవాహక మరియు అభివాహక నాడులు :

అపవాహక నాడులు అభివాహక నాడులు
1. వార్తలను కేంద్రనాడీ వ్యవస్థ నుండి నిర్వాహక అంగాలకు చేర్చుతాయి. 1. జ్ఞానేంద్రియాల నుండి వార్తలను కేంద్రనాడీ వ్యవస్థకు చేర్చుతాయి.
2. వీటిని చాలక నాడులు అని కూడా అంటారు. 2. వీటిని జ్ఞాననాడులు అని కూడా అంటారు.
3. ఇవి కేంద్ర నాడీవ్యవస్థ నుండి బయలుదేరుతాయి. 3. ఇవి జ్ఞానేంద్రియాల నుండి ప్రారంభమవుతాయి.
4. నిర్వాహక అంగాలకు చేరతాయి. 4. కేంద్రనాడీ వ్యవస్థకు చేరతాయి.

ఇ) కేంద్రీయ నాడీవ్యవస్థ మరియు పరిధీయ నాడీవ్యవస్థ :

కేంద్రీయ నాడీవ్యవస్థ పరిధీయ నాడీవ్యవస్థ
1. మెదడు, వెన్నుపామును కలిపి కేంద్రీయ నాడీవ్యవస్థ అంటారు. 1. కపాలనాడులు, వెన్నునాడులను కలిపి పరిధీయ నాడీవ్యవస్థ అంటారు.
2. ఇవి శరీరంలో మధ్య (కేంద్ర) ప్రాంతంలో అమరి ఉంటాయి. 2. ఇవి శరీర మధ్య ప్రాంతం నుండి ప్రక్కలకు విస్తరిస్తాయి.
3. ఇవి నాడీవ్యవస్థలో కీలకమైనవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. 3. ఇవి కేంద్రీయ నాడీవ్యవస్థకు అనుబంధంగా సహాయకంగా పనిచేస్తాయి.
4. సమాచార విశ్లేషణకు, ప్రతిచర్యల ఆదేశాలకు ప్రాధాన్యత నిస్తాయి. 4. సమాచార రవాణాలో ప్రధానంగా పాల్గొంటాయి.

ఈ) గ్రాహకం మరియు ప్రభావకం :

గ్రాహకం ప్రభావకం
1. శరీరం లోపల మరియు బయట జరిగే మార్పులను గ్రహించే కణాలను గ్రాహకాలు అంటారు. 1. మెదడు పంపిన ఆదేశాలను నిర్వహించే అవయవాలు లేదా కణజాలాన్ని ప్రభావకం లేదా నిర్వాహక కణజాలం అంటారు.
2. ఇవి మార్పులను గ్రహించి ప్రచోదనాలను ఉత్పత్తి చేస్తాయి. 2. మెదడు నుండి వచ్చిన ఆదేశాలను అమలు పరుస్తుంది.
3. జ్ఞాననాడులతో సంబంధం కలిగి ఉంటాయి. 3. చాలక నాడులతో సంబంధం కలిగి ఉంటాయి.
4. జ్ఞానేంద్రియాలు గ్రాహక కణాలను కలిగి ఉంటాయి. 4. శరీరంలోని కండర కణజాలం, అవయవాలు ప్రభావకాలుగా వ్యవహరిస్తాయి.
5. ఉదా : కన్ను, చెవి. 5. ఉదా : కాళ్ళు , చేతులు.

ప్రశ్న 9.
మొక్కలలో కాంతి అనువర్తనం ఎలా జరుగుతుంది? (AS1)
జవాబు:

  1. మొక్కలు కాంతికి ప్రతిస్పందించడాన్ని కాంతి అనువర్తనం అంటారు.
  2. మొక్కలలో కాండము కాంతి అనువర్తనాన్ని ప్రదర్శిస్తుంది.
  3. మొక్కలపై కాంతి పడినపుడు కాండాగ్రంలోని విభాజ్య కణజాలం ఆక్సిన్స్ అనే ఫైటో హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది.
  4. ఆక్సిన్ ప్రభావం వలన కణాలు విభజన చెంది కాంతివైపుకు వంగుతాయి. దీనినే కాంతి అనువర్తనం’ అంటారు.

ప్రశ్న 10.
మొక్కలు ఉద్దీపనలకు ఎలా ప్రతిస్పందిస్తాయో ఉదాహరణలివ్వండి. (AS1)
జవాబు:
జంతువుల వలె మొక్కలు కూడా ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి. ఉదాహరణకు.

  1. వేసవి కాలంలో అధిక వేడికి నీటినష్టాన్ని తగ్గించటానికి ఆకులు రాల్చుతాయి.
  2. వర్షాలు కురిసి నీరు పుష్కలంగా ఉన్నప్పుడు వేగంగా పెరుగుతాయి.
  3. ఆకులు వేయటం, పుష్పించటం, కాయలు కాయటం కూడా మొక్కలలో వాతావరణానికి ప్రతిస్పందనలే.
  4. కాండాలు కాంతి వైపుకు పెరుగుతూ కాంతికి ప్రతిస్పందిస్తాయి. దీనిని కాంతి అనువర్తనం అంటారు.
  5. వేర్లు గురుత్వాకర్షణకు ప్రతిస్పందించి ఆ వైపుకు పెరుగుతాయి. దీనిని గురుత్వానువర్తనం అంటారు.
  6. అత్తిపత్తి వంటి మొక్కలు తాకినపుడు ముడుచుకుపోతాయి. దీనిని ‘థిగో ట్రాపిజం’ అంటారు.
  7. దోస, కాకర వంటి బలహీన కాండాలు నులితీగలను కలిగి ఉండి ఆధారం దొరకగానే వాటిని చుట్టుకొని ఎగబ్రాకుతాయి.
  8. ప్రొద్దుతిరుగుడులోని పుష్పం కాంతికి అనువర్తనం చూపుతూ ప్రతిస్పందన చూపుతుంది.

ప్రశ్న 11.
మొక్కలలో వేరు కాంతికి వ్యతిరేకంగా పెరుగుతాయనే విషయాన్ని చూపించటానికి ఒక ప్రయోగాన్ని సూచించండి. (AS1)
జవాబు:

  1. ఒక గాజు జాడీని తీసుకొని మట్టితో నింపాను. జాడీ గోడ భాగాన చిక్కుడు విత్తనం నాటాను.
  2. 4 నుండి 5 రోజులకు విత్తనం మొలకెత్తటం గమనించాను.
  3. జాడీని సూర్యరశ్మిలో ఉంచాను. కాండం కాంతి వైపుకు పెరుగుతుంటే వేరు దానికి వ్యతిరేకంగా పెరగటం గమనించాను.
  4. జాడీని కదిపి మొక్కను సమాంతరంగా ఉండేటట్లు చేశాను.
  5. తరువాత పరిశీలనలో కాండం పైకి కాంతివైపుకు, వేరు క్రిందకు పెరగటం గమనించాను.

ప్రశ్న 12.
మీ శరీరంలోని హార్మోన్ల ప్రభావం వలన కనబడే మార్పులకు ఉదాహరణలివ్వండి. (AS1)
జవాబు:

  1. మగవారిలో ముష్కాలు ‘టెస్టోస్టిరాన్’ అనే లైంగిక హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రభావం వలన మగవారిలో గడ్డం, మీసం పెరుగుదల, కండరాల అభివృద్ధి, శబ్ద తీవ్రత పెరుగుదల, లైంగిక అవయవాల వృద్ధి వంటి మార్పులు కనిపిస్తాయి.
  2. ఆడవారిలో స్త్రీ బీజకోశం ఆయిస్ట్రాయిడల్ అనే హార్మోను ఉత్పత్తి చేస్తుంది. దీని వలన ఆడవారిలో ద్వితీయ లైంగిక లక్షణాలు అయిన వక్షోజాల వృద్ధి, కటివలయం పెరుగుదల, ఋతుచక్రం, చర్మం కోమలంగా నిగారింపుగా మారటం, మొటిమలు వంటి మార్పులు కనిపిస్తాయి.

AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

ప్రశ్న 13.
నిర్మాణరీత్యా నాడీకణం, సాధారణ కణం కంటే ఏ విధంగా భిన్నమైనది? వివరించండి. (AS1)
జవాబు:

  1. నాడీకణ నిర్మాణం సాధారణ కణం కంటే చాలా విభిన్నంగా ఉంటుంది.
  2. నాడీకణాలు చాలా పొడవుగా ఉండి, మైలిన్ తొడుగుతో కప్పబడి ఉంటాయి.
  3. కణదేహం విస్తరించి, డెండ్రాలను ఏర్పరుస్తుంది.
  4. ఒక నాడీకణం మరొక నాడీకణంతో సంబంధం పెట్టుకోవటానికి అనువుగా టెలీడెండైట్స్ మరియు డెండ్రైట్స్ ఉంటాయి.
  5. ‘నాడీకణాలు విద్యుత్ ప్రచోదనానికి అణువుగా ఉంటాయి.
  6. నాడీకణాలు అన్ని ఒక వలవలె శరీరం అంతా విస్తరించి సంబంధం కలిగి ఉంటాయి.
  7. సమాచార విశ్లేషణ ప్రతిస్పందన సామర్థ్యాలు నాడీకణాలకు మాత్రమే సాధ్యం.
  8. నాడీకణాలు రక్షణ కొరకు పోషణ కొరకు ప్రత్యేక గ్లియల్ కణాలు కలిగి ఉంటాయి.
  9. ఏ ఇతర కణాలలో లేని విధంగా నాడీకణం జీవ పదార్థంలో నిస్సల్ కణికలు ఉంటాయి. నిస్సల్ కణికలు నాడీకణ ప్రత్యేకత.
  10. నాడీకణాలు నిర్మాణాత్మకంగా విభిన్నత కలిగి ఉంటాయి. కొన్ని మైలిన్ సహితంగా మరికొన్ని మైలీన్ రహితంగా ఉంటాయి.
  11. కొన్ని నాడీకణాలు ఏక ధృవంగా మరికొన్ని ద్విధృవంగా ఉంటాయి.
  12. క్రియాత్మకంగా కూడా నాడీకణాలు విభిన్నంగా ఉంటాయి. కొన్ని జ్ఞాననాడులుగా వ్యవహరిస్తూ మరికొన్ని చాలక నాడులుగా, మరికొన్ని మిశ్రమ నాడులుగా పనిచేస్తాయి.

ప్రశ్న 14.
నాదీకణ నిర్మాణం ప్రచోదనాల ప్రసారానికి అనువుగా ఉందా? విశ్లేషించండి. (AS1)
జవాబు:
నాడీకణం యొక్క ప్రధాన విధి సమాచార రవాణా, ఇది నాడీ ప్రచోదనాల ఆధారంగా జరుగుతుంది. కావున నాడీ ప్రచోదనాల రవాణాకు నాడికణం నిర్మాణం అనువుగా ఉంటుంది. అవి :

  1. శరీర కణజాలంలో నాడీకణం పొడవైన కణం. దీనివలన నాడీ ప్రచోదనాలను ఎక్కువ దూరం రవాణా చేయవచ్చు.
  2. నాడీకణాలు శాఖల వంటి డెండ్రైట్ను కలిగి ఉండి ఒకదానితో ఒకటి సంబంధం ఏర్పరుచుకొని వల వంటి నిర్మాణంగా మారతాయి. ఈ సంబంధం వలన ప్రచోదనాలు అన్ని భాగాలకు రవాణా అవుతాయి.
  3. ఆగ్జానను మైలీన్ తొడుగు కలిగి ఉండి ప్రచోదనాల విద్యుదావేశం క్షీణత చెందకుండా నిరోధిస్తుంది.
  4. మైలీన్ తొడుగులో ఉండే ర్వర్ కణుపులు నాడీ ప్రచోదన వేగాన్ని పెంచుతాయి.
  5. నాడీ అంత్యాలు సైనా ను కలిగి ఉండి, రసాయన సమాచారాన్ని నాడీ ప్రచోదనాలుగా మార్చుకుంటాయి.

ప్రశ్న 15.
మానవుడు తెలివైన జంతువు. ఈ విధమైన నిర్ణయానికి రావడానికి గల కారణాలు చర్చించండి. (AS1)
జవాబు:

  1. ఈ అనంత విశ్వంలో జీవం కలిగిన ఏకైక గ్రహం. భూమి అయితే దానిలో అత్యంత తెలివైన జీవి మనిషి, భూమిమీద అనేక కోట్ల జీవరాశులు ఉన్నప్పటికీ వాటికి లేని అనేక ప్రత్యేకతలు, సామర్థ్యాలు మనిషికి ఉన్నాయి.
  2. విషయాన్ని విశ్లేషించటం, తార్కికత, జ్ఞాపకశక్తి, ఊహించటం, సమస్వా సాధన వంటి అద్భుత మానసిక ప్రక్రియలు మనిషిలో అత్యున్నతంగా ఉన్నాయి. వీటి వలనే జంతు రాజ్యంలో మనిషి అగ్రస్థానంలో నిలబడగలిగినాడు.
  3. శబ్దాలను భాషగా మార్చి సమాచారాన్ని అత్యంత సమర్థంగా అందచేయగల జీవి కూడా మనిషే.
  4. భాషకు లిపిని ఏర్పర్చి సమాచారాన్ని గ్రంథస్థం చేసి తరువాత తరాలకు అందించటం వలన మనిషి విశేష జ్ఞానాన్ని సముపార్థించగలిగాడు.
  5. అన్ని జీవులు ప్రకృతికి లోబడి జీవిస్తుంటే మనిషి మాత్రమే, ప్రకృతి సత్యాలను అన్వేషించి నూతన ఆవిష్కరణలు చేసి తన జీవితాన్ని సుఖమయం చేసుకొన్నాడు.
  6. తన మేధాశక్తితో ప్రకృతి పదార్థాలను మేళవించి, చక్రం నుండి అంతరిక్ష ‘రోవర్’ వరకు అనేక నూతన వస్తువులను తయారుచేసుకొన్నాడు.

ఈ అంశాల ఆధారంగా మనిషి తెలివైన జీవిగా నిర్ధారించవచ్చు.

ప్రశ్న 16.
చేతిలో ఉండే నాడీకణ ఆక్సాన్, కాలిలో ఉండే నాడీకణ ఆక్సాన్ కన్నా చిన్నది. దీనిని నీవు ఎలా సమర్థిస్తావు? (AS1)
జవాబు:

  1. నాడీకణంలోని పొడవైన నిర్మాణాన్ని ఆగ్జాన్ అంటారు. కొన్ని ఆగ్దాన్లు కలసి నాడులను ఏర్పరుస్తాయి. ఇవి చాలా పొడవుగా విస్తరించి శరీరమంతా వ్యాపించి ఉంటాయి.
  2. చేతితో పోల్చితే కాళ్ళు ఎక్కువ పొడవుగా ఉంటాయి. కావున కాళ్ళులోని నాడీకణాలు పొడవైన ఆగ్దాన్లు కల్గి, ఉంటాయి.
  3. అందుచేత చేతిలో ఉండి నాడీకణ ఆక్సాన్, కాలిలో ఉండే నాడీకణ ఆక్సాన్ కన్న చిన్నవిగా ఉంటాయి.

ప్రశ్న 17.
అనేక ప్రచోదనాలకు సెకనులో పదో వంతులోనే ప్రతీకార చర్యలు చూపుతాం. మన శరీరంలో గల ఈ అద్భుతమైన నియంత్రిత వ్యవస్థ గురించి నీవు ఏమనుకుంటున్నావు? (AS1)
జవాబు:

  1. మన శరీరంలోని నాడీవ్యవస్థ, వేగం ఆశ్చర్యకరంగా ఉంటుంది.
  2. గ్రాహకాలు, ఉద్దీపనులకు ప్రచోదనాలు ఉత్పత్తి చేయటం, అవి మెదడును చేరి విశ్లేషించబడటం, మెదడు ఆజ్ఞలు తిరిగి నిర్వాహక అంగాలు నిర్వహించటం – ఈ క్రియలన్నీ సెకన్లలో జరగటం అద్భుతంగా అనిపిస్తుంది.
  3. మన మెదడు చురుకుదనం, పనితీరు, విశ్లేషణా వేగం అబ్బురపరిచే విధంగా ఉంది.
  4. నాడీ ప్రచోదనం నిముషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కొన్ని ప్రతీకార చర్యలు సెకన్లో పదోవంతులోనే పూర్తి అవటం, నాడీవ్యవస్థ సమర్థవంతమైన పనితీరుకు నిదర్శనం.

ప్రశ్న 18.
కిందివానిలో నియంత్రిత ప్రతీకార చర్య, అభ్యసిత ప్రతీకార చర్యలను గుర్తించండి. (AS1)
ఎ) కళ్ళు ఆర్పడం
బి) టేబులు తుడవడం
సి) కీబోర్డు వాయించడం
డి) నోటిలో ఆహారం పెట్టుకోగానే లాలాజలం ఊరటం
ఇ) విపరీతమైన శబ్దం విన్నపుడు చెవులు మూసుకోవడం.
జవాబు:
ఎ) కళ్ళు ఆర్పడం : ఇది మన ప్రమేయం లేకుండా నిరంతరం జరిగే స్వతంత్ర ప్రక్రియ. ఇది ఒక ప్రతీకార చర్య,

బి) టేబులు తుడవడం : మన అధీనంలో జరిగే ఒక నియంత్రిత చర్య.

సి) కీబోర్డు వాయించడం : ఇది నియంత్రిత చర్య. మెదడు ఆదేశాలను అనుసరించి జరిగే నియంత్రిత చర్య.

డి) నోటిలో ఆహారం పెట్టుకోగానే లాలాజలం ఊరటం : ఇది ఒక నిబంధన సహిత ప్రతిచర్య,

ఇ) విపరీతమైన శబ్దం విన్నపుడు చెవులు మూసుకోడం : ఇది ఒక ప్రతీకార చర్య,

ప్రశ్న 19.
ఒక కుండీలోని మొక్కను మీ గదిలోని కిటికీ పక్కన ఉంచితే ఏం జరుగుతుంది? (AS2)
జవాబు:

  1. కాంతి కిటికీ నుండి గదిలోనికి ప్రవేశించి మొక్కపై పడుతుంది.
  2. మొక్కలో కాండం కాంతి అనువర్తనాన్ని కలిగి ఉంటుంది.
  3. అంటే మొక్కలు కాంతి వైపుకు పెరుగుదలను చూపుతాయి.
  4. కావున కుండీలో మొక్క కిటికీ నుండి బయటకు కాంతి వైపుకు పెరుగుతుంది.

AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

ప్రశ్న 20.
మన శరీరంలోని చర్యలన్నింటినీ మెదడు చేత నియంత్రిస్తే ఏం జరుగుతుంది? (AS2)
జవాబు:

  1. మెదడు చేత నియంత్రించబడే ప్రతిచర్యలలో ప్రచోదనం ఎక్కువ దూరం ప్రయాణించవలసి ఉంటుంది.
  2. అందువలన ఆకస్మికంగా జరిగే అపాయాల నుండి మెదడు శరీరానికి రక్షణ కల్పించలేదు.
  3. ఆకస్మికంగా జరిగే ప్రమాదాల నుండి రక్షించటానికి మన శరీరంలో అసంకల్పిత ప్రతీకార చర్యావ్యవస్థ ఉంది.
  4. ఇది మెదడుతో ప్రమేయం లేకుండా పనిచేస్తుంది.
  5. కావున అన్ని క్రియలు మెదడు చేత నియంత్రించబడకూడదు.

ప్రశ్న 21.
డాక్టర్‌ను కలిసినపుడు క్లోమగ్రంథిని గూర్చి ఎటువంటి సందేహాలు అడుగుతావు? (AS2)
(లేదా)
మీ పాఠశాలకు పిల్లల ఆరోగ్యం పరీక్షించడానికి వచ్చిన డాక్టర్ గారిని క్లోమగ్రంథిని గురించి తెలుసుకోవడానికి నీవు ఎలాంటి ప్రశ్నలడుగుతావు?
జవాబు:

  1. శరీరంలో క్లోమం యొక్క ప్రాధాన్యత ఏమిటి?
  2. క్లోమ గ్రంథిని మిశ్రమ గ్రంథి అని అంటారు ఎందుకు?
  3. క్లోమానికి తరచుగా వచ్చే వ్యాధులు ఏమిటి?
  4. క్లోమ గ్రంథి సక్రమంగా పనిచేయటానికి మనం తీసుకునే ఆహార అలవాట్లలో మార్పు అవసరమా?
  5. శారీరక వ్యాయామం, క్లోమగ్రంథి పని తీరుపై ప్రభావం చూపుతుందా?
  6. చక్కెర వ్యాధికి, క్లోమగ్రంథికి గల సంబంధం ఏమిటి?

ప్రశ్న 22.
కుండీలో ఉన్న మొక్క మూలంలో మట్టి పడిపోకుండా ఏర్పాటుచేసి, దానిని తలకిందులుగా వేలాడదీయండి. మీ పరిశీలనల ద్వారా ఫోటోట్రోపిజమ్ ను వివరించండి. (AS3)
జవాబు:
ప్రయోగం:

  1. కుండీలో పెరుగుతున్న చిన్న మొక్కను తీసుకుని దాని ఆధారం గట్టిగా కట్టాను.
  2. తరువాత మొక్కను తలక్రిందులుగా వ్రేలాడదీసాను.
  3. ఒక వారం తరువాత మొక్కలోని మార్పులను గమనించాను.

పరిశీలనలు :
1. వ్రేలాడుతున్న మొక్క కొమ్మలు, నేరుగా క్రిందికి పెరగకుండా, వంపు తిరిగి, పైకి పెరగటం గమనించాను.

నిర్ధారణ :

  1. మొక్క తలక్రిందులుగా ఉన్న కాండం కొనలు, కాంతి వైపుకు వంగి పైకి పెరుగుతున్నాయి.
  2. కాంతివైపుకు మొక్కలు పెరిగే ఈ ధర్మాన్నే కాంతి అనువర్తనం అంటారు.

ప్రశ్న 23.
పక్షి ఈకను తీసుకుని మీ శరీరంలో వివిధ భాగాలను దానితో తాకండి. మీ శరీరంలో అత్యంత సున్నితమైన భాగాన్ని గుర్తించండి. నిద్రించే సమయంలో కూడా ఇదే విధంగా ఉంటుందా? (AS3)
జవాబు:
కోడి ఈకతో శరీరంలోని వివిధ ప్రాంతాలను తాకి చూచినపుడు

  1. శరీర ఇతర భాగాల కంటే ముఖం ఎక్కువ సున్నితంగా ఉన్నట్లు గుర్తించాను.
  2. పెదవులు, ముక్కుకొన, చెవి లోపలి భాగాలు అధిక స్పర్శజ్ఞానం కలిగి ఉన్నాయి.
  3. నిద్రపోతున్నప్పుడు కూడా ఈ ఫలితాలు ఇదే విధంగా ఉన్నాయి.

ప్రశ్న 24.
మొక్క అగ్రభాగంలో ఉత్పత్తి అయ్యే హార్మోనుల గురించి అధ్యయనం చేయడానికి నీవు ఏ పద్ధతి అనుసరిస్తావు? (AS3)
(లేదా)
కాండం కొనమీద ఫైటోహార్మోన్ ప్రభావం తెలుసుకోవటానికి నీవు ఏ ప్రయోగం నిర్వహిస్తావు?
(లేదా)
వెంట్ ప్రయోగాన్ని వివరించండి. ఈ ప్రయోగం ద్వారా వెంట్ ఏమని నిర్ధారించాడు ?
జవాబు:
AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 3
ప్రయోగం :
1926లో డచ్ వృక్ష శరీర ధర్మ శాస్త్రవేత్తలు వెంట్ మొక్క ద్వారా ఉత్పత్తి అయిన ఒక ప్రభావాన్ని ఏర్పరచడంలో సఫలీకృతులయ్యారు. ఓటు ధాన్యపు అంకురం యొక్క ప్రాంకురం కవచాన్ని కత్తిరించాడు. కాండం కొన పైన ఆగార్ ఆగార్ ముక్కకు పెట్టి గంటసేపు అలాగే ఉంచాడు. ఆగారు చిన్న చిన్న పెట్టెలుగా కత్తిరించి ప్రతి పెట్టె వంటి ఆగారిని తొడుగు కత్తిరించిన మొక్క కాండంపైన పెట్టాడు. వాటిని చీకటిలో ఉంచాడు. గంటలోపల నిర్దిష్టమైన వంపును ఆగార్ పెట్టిన భాగం నుండి వెంట్ ప్రయోగం దూరంగా కనబడింది.

పరిశీలన :
ప్రాంకుర కవచంతో సంబంధంలేని ఆగార్ కాండం కొనభాగం ఎటువంటి వంపును ప్రదర్శించలేదు. ఆగార్ ముక్క ఉంచిన భాగం వైపు కొద్దిగా వంపు కనబడింది.

నిర్ధారణ :
ఈ ప్రయోగం ఆధారంగా వెంట్ ఊహించిందేమిటంటే ప్రాంకుర కవచం కొనభాగం ప్రభావం రసాయనిక ఉదీపన వలన జరిగిందని ఈ రసాయనిక ఉద్దీపనలకు ఆక్సిన్లు అని పేరు పెట్టాడు. ఈ విధంగా వెంట్ ఆక్సిన్ అనే మొట్టమొదటి మొక్క హార్మోను కనుగొనగలిగారు.

ప్రశ్న 25.
వెన్నుపాము నియంత్రించే చర్యల గురించి మీ పాఠశాల గ్రంథాలయం నుండి వివరాలు సేకరించండి. (AS4)
జవాబు:

  1. వెన్నుపాము శరీర భాగాల నుండి వచ్చే సమాచారాన్ని మెదడుకు పంపుతుంది.
  2. మెదడు ఇచ్చే ఆదేశాలు వెన్నుపాము ద్వారానే నాడులకు చేరతాయి.
  3. వెన్నుపాము మధ్యస్థ నాడీకణం కలిగి ఉండి అసంకల్పిత ప్రతీకార చర్యలలో పాల్గొంటుంది.
  4. అసంకల్పిత ప్రతీకార చర్యలు మెదడుతో ప్రమేయం లేకుండా వెన్నుపాము నియంత్రణలో ఉంటాయి.
  5. అసంకల్పిత ప్రతీకార చర్యలు వెన్నుపాము ఆధీనంలో ఉండుట వలన ప్రతిచర్యా మార్గం ప్రయాణం తగ్గి, ప్రమాదాల నుండి రక్షణ ఇస్తుంది.
  6. ఉదా : 1. వేడిగా ఉన్న వస్తువులను తాకినపుడు చేతిని వెనక్కు తీసుకోవటం,
    2. కళ్ళ మీద కాంతి పడినప్పుడు కళ్ళుమూసుకోవటం.
    3. నాశికలోనికి ధూళి ప్రవేశిస్తే తుమ్మటం.

AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

ప్రశ్న 26.
కింది వాక్యాలను చదవండి. వినాళగ్రంథుల పనులతో పోల్చండి. (AS4)
ఎ) జీవులు ఫెరమోన్లనే రసాయన పదార్థాలను విడుదల చేస్తాయి.
బి) ఇవి నాళగ్రంథుల నుండి స్రావాలు వెలువడడానికి సిగ్నల్ గా పనిచేస్తాయి.
సి) కొన్ని జాతులలో ఇవి రసాయన వార్తాహరులు
డి) తేనెటీగలు ఆహారం లభ్యమయ్యే ప్రదేశానికి ఇతర తేనెటీగలను ఆకర్షించడానికి ఫెరమాన్లను ఉపయోగిస్తారు.
జవాబు:
హార్మోన్స్ అవే జీవులలో ఉత్పత్తి కాబడే రసాయన పదార్థాలు. ఇవి వినాళ గ్రంథులచే ఉత్పత్తి కాబడి, నేరుగా రక్తంలోనికి విడుదల అవుతాయి. ఇవి రక్తం ద్వారా ప్రయాణించి నిర్దిష్ట అవయవాలను ప్రేరేపించి నియంత్రణ – సమన్వయంలో పాల్గొంటాయి. మన శరీరంలో అనేక రకాల వినాళ గ్రంథులు ఉన్నాయి. ఇవి నిర్దిష్ట హార్మోన్స్ ఉత్పత్తి చేస్తాయి. ప్రతి హార్మోన్ నిర్దిష్ట విధిని నిర్వహిస్తుంది.

ప్రశ్న 27.
మీ పాఠశాల గ్రంథాలయం నుండి లేదా అంతర్జాలం నుండి కపాలనాడులు మరియు వెన్నునాదులకు సంబంధించిన సమాచారం సేకరించండి. (AS4)
జవాబు:
మన శరీరంలో కపాలనాడులు, కశేరునాడులు కలిసి పరిధీయ నాడీవ్యవస్థగా రూపొందుతాయి.

కపాలనాడులు :

  1. మెదడు నుండి ఏర్పడే నాడులను కపాలనాడులు అంటారు.
  2. వీటి సంఖ్య 12 జతలు
కపాల నాడి రకము పని
1. ఝణ నాడి జ్ఞాన నాడి వాసన సమాచారాన్ని పంపిస్తుంది.
2. దృక్ నాడి జ్ఞాన నాడి దృష్టి సమాచారాన్ని మెదడుకు పంపుతుంది.
3. నేత్రియ చాలక నాడి చాలక నాడి కనుగుడ్లను నలువైపులా తిప్పటానికి
4. టోక్లియల్ నాడి చాలక నాడి కనుగుడ్లను లోపలికి లాగడానికి
5. త్రిధారనాడి మిశ్రమ నాడి నమిలే కండరాలను ఉత్తేజపరుస్తుంది.
6. ఆబ్దుసెన్స్ నాడి చాలక నాడి కంటిని తిప్పటానికి
7. ఆస్యనాడి మిశ్రమ నాడి ముఖ వ్యక్తీకరణకు తోడ్పడే కండరాల ఉత్తేజం
8. శ్రవణనాడి జ్ఞాన నాడి శబ్దము, భ్రమణము, గురుత్వాకర్షణ అనుభూతులు
9. జిహ్వగ్రసని నాడి మిశ్రమ నాడి నాలుక నుండి రుచికి సంబంధించిన అనుభూతులు
10. వేగాస్ నాడి మిశ్రమ నాడి ఊపిరితిత్తుల కండరాలు, హృదయకండరాల నియంత్రణ
11. అనుబంధ నాడి చాలక నాడి మెడలోని కండరాలు పని చేయటానికి
12. అధోజిహ్వ నాడి చాలక నాడి నాలుక కండరాలకు సంకేతం పంపటం

కశేరునాడులు :

  1. వెన్నుపాము నుండి ఏర్పడే నాడులను కశేరు నాడులు అంటారు.
  2. వీటి సంఖ్య 31 జతలు.
  3. ఇవి వెన్నుపాము పృష్టమూలం జ్ఞాననాడిని, ఉదర మూలం చాలకనాడిని కలిగి ఉండుట వలన ఏర్పడతాయి.
  4. కశేరు నాడులను జ్ఞాన, చాలక నాడీ తంతువులను కలిగి ఉండుటవలన ఇవన్నీ మిశ్రమ నాడులు.
  5. వీటిని ప్రధానంగా 5 రకాలుగా విభజిస్తారు. అవి :
    1. గ్రీవ కశేరు నాడులు – (8)
    2. ఉరః కశేరు నాడులు – (12)
    3. కటి కశేరు నాడులు – (5)
    4. త్రిక కశేరు నాడులు – (5)
    5. పుచ్చ కశేరు నాడి – (1)

ప్రశ్న 28.
తంత్రికాక్షం – డెండ్రైట్, డెండ్రైట్ – డెండ్రైట్ మధ్య అనుసంధానం చేసే పటాన్ని గీయంది. ఇవి ఈ విధంగా ఎందుకు అనుసంధానం చేయబడి ఉంటాయి? (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 4

  1. నాడీకణాలు ఇతర నాడీకణాలతో సంబంధం కలిగి ఉంటాయి.
  2. ఈ సంబంధం రెండు కణదేహాల మధ్య గాని, ఒక నాడీ కణ ఆర్గాన్ మరొక కణదేహంలో గాని సంబంధం కలిగి ఉంటుంది.
  3. నాడీ అంత్యాలు దగ్గరగా అమరి మధ్య చిన్న ఖాళీ ప్రదేశం కలిగి ఉంటుంది. దీనిని సైనాప్స్ అంటారు.
  4. సైనాప్స్ వద్ద ప్రచోదనం, రసాయనికంగా గాని విద్యుత్ రూపంలో గాని దూకి వేరే డెండ్రైటు అందుతుంది.
  5. కావున డెండ్రైట్స్ సంబంధాల మధ్య సైనాప్స్ ఉంటుంది.

ప్రశ్న 29.
మెదడు పటం గీసి, భాగాలు గుర్తించి, మెదడు ఎలా రక్షించబడుతుందో వివరించండి. (AS1)
(లేదా)
మెదడు పటం గీచి భాగాలను గుర్తించండి.
జవాబు:
శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో మెదడు ఒకటి. దీనిని రక్షిస్తూ క్రింది భాగాలు ఉంటాయి.
AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 5

1. కపాలం :
మెదడును భద్రపరిచి రక్షణ ఇచ్చే కార్పస్ కల్లో జమ్ ఎముకల పెట్టె.

2. మెనింజస్ :
మెదడును చుట్టి ఉండే పొరలు. ఇవి మెదడుకు రక్షణ ఇస్తాయి.

3. మస్తిష్క మేరుద్రవం :
మెదడులోని బాహ్య మరియు మధ్య త్వచాల మధ్య మస్తిష్క మేరుద్రవం ఉండి మెదడుకు రక్షణ ఇస్తుంది.

ప్రశ్న 30.
నీవు రద్దీగా ఉండే వీధిలో నడుస్తున్నపుడు అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది. ఈ పరిస్థితిలో నీ శరీరంలోని అవయవాల మధ్య ఏ విధంగా సమన్వయం జరుగుతుంది? ఈ సందర్భాన్ని వివరించే రేఖాచిత్రాన్ని గీయండి. (AS5)
జవాబు:
1. నేను ట్రాఫిక్ లో ఉన్నప్పుడు పెద్ద శబ్దం వినిపిస్తే, ఆకస్మికంగా ఉలిక్కిపడి పక్కకు జరుగుతాను.
AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 6

ప్రశ్న 31.
నాడీకణం మోడలను సరైన పదార్థాలను ఉపయోగించి తయారుచేయండి. (AS5)
జవాబు:

  1. ఒక చిన్న గాజును తీసుకుని అట్టపై అంటించాను. ఇది ఎరుపు రంగులో ఉండి కేంద్రకాన్ని సూచిస్తుంది.
  2. దీనిచుట్టూ కొంచెం దూరంగా మట్టిగాజు ముక్కలను ‘C’ ఆకారంగా విరిచి అంటించాను. ఇది కణదేహాన్ని సూచిస్తుంది.
  3. కణదేహం మూల వద్ద నూలు దారపు ముక్కలు అంటించాను. ఇది డెండ్రైట్ను సూచిస్తుంది.
  4. కణదేహానికి క్రింద అమర్చిన పొడవైన నూలుదారం ఆగ్దానను సూచిస్తుంది.
  5. కణదేహంలో అమర్చిన నీలిరంగు మెరుపులు జీవపదార్థాన్ని తెలుపగా, దానిలో ఉంచిన గుండ్రని గింజలు నిస్సల్ కణికలను సూచిస్తాయి.

ఈ విధంగా నేను నాడీకణం నమూనాను నిర్మించాను.

AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

ప్రశ్న 32.
మీ సహాధ్యాయి తరగతి గదిలో చేసే పనులను 45 నిమిషాలు గమనించండి. ఆ పనులలో నియంత్రిత చర్యలు, అనియంత్రిత చర్యలు ఏవి? (AS5)
జవాబు:
నియంత్రిత చర్యలు :
(i) నిలబడటం (ii) కూర్చోవడం (iii) నవ్వడం (iv) త్రాగడం (v) కదలడం (vi) చప్పట్లు కొట్టడం (vii) పుస్తకాలు, మోయడం (viii) చదవడం (ix) వ్రాయడం (x) మాట్లాడటం

అనియంత్రిత చర్యలు :
(i) కళ్ళు ఆర్పడం (ii) ఆవలించడం (iii) శ్వాసపీల్చడం (iv) వినడం (v) మింగడం

ప్రశ్న 33.
నులితీగలు ఆధారానికి చుట్టుకొని తీగపైకి పాకటం గమనించడం ఉత్సాహంగా ఉంటాయి. ఈ అంశాల్ని నీవు ఎలా అభినందిస్తావు? (AS6)
జవాబు:

  1. ప్రాకే మొక్కలు బలహీన కాండాలు కలిగి ఉంటాయి.
  2. ఇవి పైకి ఎగబ్రాకటానికి నులితీగలు తోడ్పడతాయి.
  3. ఇవి సున్నితంగా ఉండి ఆధారానికి స్ప్రింగ్వలె చుట్టుకుపోవటం ఆసక్తికరంగా ఉంటుంది.
  4. నులితీగలు ఆధారం దొరికినపుడు వేగంగా పెరిగి చుట్టుకోవటం ఆశ్చర్యంగా ఉంది.
  5. మెత్తగా ఉండే నులితీగలు కాండం భారం మోయటం కూడా అద్భుతంగా అనిపించింది.
  6. నులితీగలు ఆధారాన్ని గట్టిగా చుట్టుకోవటం నాకు మరింత ఆశ్చర్యం కలిగించాయి. వాటిని లాగినపుడు తెగిపోతాయి తప్ప ఊడిరావు. ఇది నాకు ఆశ్చర్యంగా అనిపించింది.

ప్రశ్న 34.
హార్మోన్లు నిర్దిష్టమైన ప్రదేశంలో, నిర్దిష్టమైన పనిని నిర్వహించడానికి విడుదలవుతాయి. దీనిపై చక్కని వ్యాఖ్యానం రాయండి. (AS7)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 7

ప్రశ్న 35.
సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మెదడు – కలల గురించి చేసిన పరిశోధనలపై సమాచారం సేకరించి సైన్స్ క్లబ్ సమావేశంలో చర్చించండి. (AS7)
జవాబు:

  1. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన మనో విశ్లేషణా శాస్త్రవేత్త.
  2. మానసిక విశ్లేషణ ద్వారా, మానసిక ఋగ్మతలను నివారించవచ్చని నిరూపించాడు. మానసిక విశ్లేషణనే ‘మాటల వైద్యం’గా కూడా పరిగణిస్తారు.
  3. ఫ్రాయిడ్ మనస్సు వివరిస్తూ ‘ట్రోపోగ్రాఫికల్’ (Tropographical) నమూనాను ప్రతిపాదించాడు. దీని ప్రకారం మనస్సును నీటి పైన తేలుతున్న మంచుపర్వతంతో పోల్చాడు. పైకి కనిపించే కొంచెం భాగం చేతనగా (Conscious mind), పైకి కనిపించని పెద్ద భాగాన్ని అచేతనంగా (Unconscious mind) పిలిచాడు.
  4. 1923లో అభివృద్ధి చేసిన నిర్మాణాత్మక నమూనాలో మనస్సును 1) ఇడ్ 2) ఈగో 3) సూపర్ ఈగోగా అభివర్ణించాడు.
  5. ఫ్రాయిడ్ కలలను విశ్లేషిస్తూ ఇది అచేతనానికి రాజమార్గాలుగా చెప్పాడు.
  6. మనిషి ప్రవర్తనలో అచేతనం కీలకపాత్ర వహిస్తుందని ఫ్రాయిడ్ భావన.
  7. ఇడ్ స్వార్థాన్ని, ఈగో వాస్తవాన్ని, సూపర్ ఈగో నైతికతను ప్రతిబింబిస్తాయని తెలిపాడు.

10th Class Biology 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ Textbook InText Questions and Answers

10th Class Biology Textbook Page No. 101

ప్రశ్న 1.
ఉద్దీపనలకు ప్రతిస్పందన చూపటానికి సహాయం చేసే వ్యవస్థ ఏది?
జవాబు:
ఉద్దీపనలను గ్రహించి ప్రతిస్పందన చూపటానికి సహాయం చేసే వ్యవస్థ నాడీవ్యవస్థ.

ప్రశ్న 2.
ఉద్దీపనలకు ప్రతిస్పందన ద్వారా సంకేతాలు ఇచ్చే వ్యవస్థ ఏది?
జవాబు:
నాడీ వ్యవస్థ.

AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

ప్రశ్న 3.
సజీవులు ఈ సంకేతాలకే ఎందుకు ప్రతిస్పందిస్తాయి?
జవాబు:
సజీవులు ప్రతిస్పందనకు నిర్దిష్టమైన సమన్వయ వ్యవస్థలను కలిగి ఉన్నాయి. వీటి వలన సజీవులు ప్రతిస్పందనను చూపుతున్నాయి.

10th Class Biology Textbook Page No. 102

ప్రశ్న 4.
మన శరీరంలో రెండు రకాల నాడులు ఉంటాయని గాలన్ అభిప్రాయానికి రావడానికి కారణం ఏమిటి?
జవాబు:
మెడపై దెబ్బ తగిలిన రోగి తన చేతి స్పర్శను కోల్పోయాడు. కానీ అతని చేతి కదలికలు మామూలుగానే ఉన్నాయి. దీనినిబట్టి మన శరీరంలో రెండు రకాల నాడులు ఉంటాయని వాటిలో ఒకటి జ్ఞానానికి సంబంధించిందని, రెండవది చర్యకు సంబంధించిందని గాలన్ నిర్ణయానికి వచ్చాడు. ఈ రోగి విషయంలో జ్ఞాననాడులు దెబ్బతిన్నాయని, చర్యకు సంబంధించిన నాడులు మామూలుగానే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు.

10th Class Biology Textbook Page No. 106

ప్రశ్న 5.
ప్రతీకార చర్యల సందర్భంలో ఇంకా ఎటువంటి ఇతర అవయవాలు నిర్వాహకాంగాలుగా పనిచేస్తాయి?
జవాబు:
ప్రతీకార చర్యలలో కాళ్ళు, చేతులు, కళ్ళు, ఊపిరితిత్తులు నిర్వాహక అంగాలుగా పనిచేస్తాయి.
ఉదా : వేడి వస్తువు తాకినపుడు, కాళ్ళు, చేతులను వెనుకకు తీసుకొంటాయి. ఎక్కువ కాంతి పడినపుడు కళ్ళు మూసుకొంటాం. దుమ్ము, గాలి పీల్చినపుడు తుమ్ముతాము.

ప్రశ్న 6.
నాడుల మధ్య సమన్వయం గురించి ఇది ఏమి తెలియజేస్తుంది?
జవాబు:
మన శరీరంలోని నాడులు సమన్వయంతో పనిచేస్తున్నాయని, దానివలనే మనకు ప్రతీకార చర్యల ద్వారా రక్షణ లభిస్తుందని గ్రహించాను.

ప్రశ్న 7.
ఏదైనా ఒక పనిని దృష్టిలో ఉంచుకొని ప్రతీకార చర్యాచాపాన్ని గీయండి.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 12

10th Class Biology Textbook Page No. 109

ప్రశ్న 8.
వెన్నుపాము ఏ ఏ విధులను నిర్వర్తిస్తుందని నీవు భావిస్తున్నావు?
జవాబు:
వెన్నుపాము విధులు:

  1. వెన్నుపాము వార్తలను మెదడుకు చేరవేస్తుంది.
  2. మెదడు నుండి ఆదేశాలను నిర్వాహక అంగాలకు చేరవేస్తుంది.
  3. అసంకల్పిత ప్రతీకార చర్యలో కీలకపాత్ర వహిస్తుంది.

AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

ప్రశ్న 9.
మన శరీరం నిర్వహించే అన్ని విధులు నేరుగా మెదడు, వెన్నుపాము మాత్రమే నియంత్రిస్తాయని మీరు అనుకుంటున్నారా? ఎందుకు?
జవాబు:

  1. శరీరంలోని నియంత్రిత చర్యలన్నీ మెదడు అధీనంలో ఉంటాయి.
  2. రోజువారి జీవితంలోని అనేక పనులను మెదడు సమన్వయపరుస్తుంది.
  3. అసంకల్పిత ప్రతీకార చర్యలలో వెన్నుపాము కీలకపాత్ర వహించి ప్రమాదాల నుండి రక్షిస్తుంది.
  4. మొత్తం మీద మన శరీరం నిర్వహించే అన్ని విధులను మెదడు లేదా వెన్నుపాము నియంత్రిస్తాయి.

10th Class Biology Textbook Page No. 110

ప్రశ్న 10.
మీ అభిప్రాయం ప్రకారం వెన్నుపాములోని ఏ మూలం జ్ఞాన లేదా అభివాహినాడుల నుంచి సంకేతాలు పొందుతుంది?
జవాబు:
వెన్నుపాములోని పృష్ఠమూలం జ్ఞాన లేదా అభివాహినాడుల నుండి సంకేతం పొందుతుంది.

ప్రశ్న 11.
నాడీ అంత్యాలు కండర అంత్యాల వద్ద ఏ విధంగా పనిచేస్తాయని నీవు భావిస్తున్నావు?
జవాబు:

  1. నాడీ అంత్యాలు నిర్వాహక అంగాలైన కండర కణాలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి.
  2. నాడీ ప్రచోదనం డెండైట్స్ ద్వారా కండర కణానికి చేరతాయి.
  3. కండర కణాలలోని మైలిన్ తంతువులు, వీటికి ప్రతిస్పందిస్తాయి.
  4. అందువలన కండర కణాలు సంకోచించి ప్రతిచర్య చూపుతాయి.

ప్రశ్న 12.
పటంను పరిశీలించండి. కింది ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించండి.
AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 13
i) వెన్నెముకకు దగ్గరగా ఉన్న గాంగ్లియన్ల నుండి ఏర్పడిన నాడులు ఏ ఏ శరీర అవయవాలకు వెళతాయి?
జవాబు:
వెన్నుపాముకు దగ్గరగా ఉన్న గాంగ్లియన్ల నుండి ఏర్పడిన నాడులు. గర్భాశయం, మూత్రాశయం, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, రక్తనాళాలు, గుండె, ఊపిరితిత్తులు, నోరు, కళ్ళు వంటి శరీర అవయవాలకు వెళుతున్నాయి.

ii) మెదడు నుండి మొదలయ్యే నాడులు ఏ ఏ అవయవాలకు చేరుకుంటాయి?
జవాబు:
మెదడు నుండి వెలువడు నాడులను కపాలనాడులు అంటారు. ఇవి 12 జతలు ఉంటాయి. ఇవి కళ్ళు, ముక్కు చెవి, నాలుక, గుండె, క్లోమం, చర్మం, ఊపిరితిత్తులు, మెడ కండరాలకు చేరుకుంటాయి.

iii) సహానుభూత నాడీవ్యవస్థ ఏ ఏ అవయవాల విధులపై ప్రభావం చూపుతుంది?
జవాబు:
సహానుభూత నాడీవ్యవస్థ రక్తప్రసరణ, శ్వాసవ్యవస్థ, విసర్జన వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, నేత్రాల విధులపై తన ప్రభావాన్ని చూపుతుంది. ఈ వ్యవస్థను వివిధ అవయవ జీవక్రియల రేటును పెంచుతుంది.

AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

iv) సహానుభూత పరనాడీవ్యవస్థ ఏ ఏ అవయవాల విధులపై ప్రభావం చూపుతుంది?
జవాబు:
సహానుభూత పరనాడీవ్యవస్థ కూడ గుండె, రక్తనాళాలు, జీర్ణాశయం, చిన్న ప్రేగులు, మూత్రాశయం, పెద్దపేగు, గర్భాశయం, ఊపిరితిత్తులు నాలుక, కళ్ళ వంటి అవయవాలపై ప్రభావం చూపుతుంది.

10th Class Biology Textbook Page No. 111

v) సహానుభూత నాడీవ్యవస్థ నిర్వహించే విధులను గురించి నీవు ఏమి అర్థం చేసుకున్నావు?
జవాబు:
సహానుభూత నాడీవ్యవస్థ వివిధ అవయవాల జీవక్రియారేటును పెంచి వేగవంతం చేస్తుంది.

vi) సహానుభూత పరనాడీవ్యవస్థ నిర్వహించే విధులను గురించి నీవు ఏమి అర్ధం చేసుకున్నావు?
జవాబు:
సహానుభూత పరనాడీవ్యవస్థ సహానుభూత నాడీవ్యవస్థ క్రియలకు వ్యతిరేకంగా పనిచేసి వాటి జీవక్రియా రేటును తగ్గించి సాధారణ స్థాయికి చేర్చుతుంది.

10th Class Biology Textbook Page No. 115

ప్రశ్న 13.
కోపం ఎంత సమయం ఉంటుందో గమనించారా?
జవాబు:
కోపం సందర్భాన్ని బట్టి కొన్ని నిముషాల పాటు ఉంటుంది.

ప్రశ్న 14.
కోపం ఎందుకు తగ్గుతుంది?
జవాబు:
రక్తంలో ఎడ్రినలిన్ స్థాయి తగ్గటం వలన కోపం తగ్గుతుంది. దీనికి శరీరంలోని పునఃశ్చరణ యాంత్రికం (Feedback mechanism) తోడ్పడుతుంది.

ప్రశ్న 15.
కోపం ఎక్కువ సమయం ఉంటే ఏమవుతుంది?
జవాబు:
రక్తంలో ఎడ్రినలిన్ ఎక్కువగా విడుదలైనప్పుడు, కోపం ఎక్కువవుతుంది. ఈ స్థాయి కొనసాగితే, జీవక్రియలపై ప్రభావం ఉంటుంది. గుండె పని తీరు కండర వ్యవస్థ దెబ్బతింటాయి. కావున శరీరంలో పునశ్చరణ యాంత్రికంగా పనిచేసి ఎడ్రినలిన్ స్థాయిని సాధారణ స్థితికి తెస్తుంది.

ప్రశ్న 16.
రక్తంలో ఎడ్రినలిన్ ఎక్కువగా విడుదలైతే, జీవక్రియలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
జవాబు:
రక్తంలో ఎడ్రినలిన్ స్థాయి పెరిగితే, కోపం వంటి మానసిక స్థితులు ఏర్పడతాయి. హృదయస్పందన రేటు పెరిగి రక్తపీడనం పెరుగుతుంది. జీవక్రియల రేటు పెరిగి, మనిషి ఉద్రిక్తస్థాయికి చేరతాడు.

10th Class Biology Textbook Page No. 116

ప్రశ్న 17.
ఉద్దీపనలకు ప్రతిస్పందనలు చూపే మొక్కలకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:

  1. అత్తిపత్తి స్పర్శకు ప్రతిస్పందన చూపి ముడుచుకుపోతుంది.
  2. పొద్దు తిరుగుడు కాంతికి ప్రతిస్పందన చూపుతుంది.
  3. సౌర, కాకర వంటి బలహీన కాండం కలిగిన మొక్కలు నులితీగలతో ఆధారానికి చుట్టుకొని ప్రతిస్పందన చూపుతాయి.

10th Class Biology 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

కిందికి పడుతున్న కర్రను పట్టుకోడం.

పొడవైన స్కేలు లేదా అరమీటరు పొడవైన సన్నని కర్రను తీసుకోండి. మీ స్నేహితుడిని కర్ర ఒక చివర పటంలో చూపిన విధంగా బొటనవేలు, చూపుడువేళ్ళ మధ్య వేలాడే విధంగా పట్టుకోమనండి. మీరు కిందకు పడే కర్రను పట్టుకోవడానికి వీలుగా బొటనవేలు, చూపుడు వేళ్ళను కర్రను తాకకుండా దగ్గరగా ఉంచండి. ప్రస్తుతం మీ వేళ్ళ మధ్య ఉన్న కర్ర స్థానాన్ని పెన్సిలుతో గుర్తించండి. (స్థానం – ఎ) మీ స్నేహితుడిని కర్రను వదలమనండి. అదే సమయంలో మీరు దానిని పట్టుకోండి.
AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 8

మీరు కర్రను ఎక్కడ పట్టుకున్నారో అక్కడ పెన్సిలుతో గుర్తు పెట్టండి. (స్థానం – బి)
1. మీరు కర్రను మొదట పెన్సిలుతో గుర్తించిన చోటే (స్థానం – ఎ) పట్టుకోగలిగారా?
జవాబు:
లేదు. కర్రను మొదట పెన్సిలుతో గుర్తించిన చోటు కంటే పైన పట్టుకొన్నాను.

2. మీరు కర్రను పట్టుకున్న ప్రదేశం (స్థానం – బి) మొదట గుర్తించిన ప్రదేశం (స్థానం – ఎ) కంటే ఎంత పైన ఉన్నది?
జవాబు:
నేను కర్రను పట్టుకొన్న ప్రదేశం మొదట గుర్తించిన ప్రదేశం కంటే దాదాపు 30 సెం.మీ. పైన ఉంది.

3. ఇలా ఎందుకు జరిగింది?
జవాబు:
కర్రను వదిలిన సమాచారం, కళ్ళు గ్రహించి, మెదడుకు పంపి, మెదడు సమాచారాన్ని విశ్లేషించి చేతికి పంపినపుడు చేయి పట్టుకొంది. ఈ ప్రక్రియ జరగటానికి కొంత సమయం పట్టడం వలన కర్రను మొదట స్థానంలో పట్టుకోలేకపోయాను.

4. ఈ క్రియ ఎంత వేగంగా జరిగిందని మీరు అనుకుంటున్నారు?
జవాబు:
ఈ క్రియ అంతా 0.2 సెకన్లో జరిగిందని భావిస్తున్నాను.

AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

కృత్యం – 2 : నాడీకణ నిర్మాణం

నాడీకణ శాశ్వత స్లెడ్ ను సూక్ష్మదర్శినిలో పరిశీలించండి. పటం గీసి, భాగాలను గుర్తించండి. ఈ కింది బొమ్మతో పోల్చండి.
జవాబు:

  1. నేను పరిశీలించిన నాడీకణం స్లెడ్ బొమ్మను పూర్తిగా పోలి ఉంది.
  2. నాడికణంలోని కణదేహం ఆక్సాన్ స్పష్టంగా కనిపించాయి.
  3. ఆక్లాన్ పై ఉన్న కణుపులు గుర్తించాను. వీటిని రన్‌వీర్ కణుపులు అంటారు.
  4. నాడీ అంత్యాలు చిన్నవిగా అస్పష్టంగా ఉన్నాయి.

కృత్యం – 3

మోకాలిలో జరిగే ప్రతీకారచర్య (Knee jerk reflex)

ఒక కాలును మరొక కాలుపైన పెనవేసుకొని కూర్చోండి. దానివలన కాలు కింద భాగం వేలాడుతూ ఉంటుంది. మోకాలి చిప్ప కింద భాగాన్ని గట్టిగా కొట్టండి. తొడ ముందు భాగాన్ని మరొక చేతితో గట్టిగా పట్టుకొని తొడ కండరాలలో కలిగే మార్పును గమనించండి.

మనం చేతనావస్థలో (Conscious) ఉన్నప్పటికీ తొడ కండరాల సంకోచాన్ని ఆపలేము. అటువంటి ప్రతిచర్యలను ‘అనియంత్రిత చర్యలు అంటాం. మనం ఫుట్ బాలను తన్నినప్పుడు అదే తొద కందరం నియంత్రిత కండరంగా పనిచేస్తుంది.

మన శరీరంలో జరిగే క్రియలలో ఎక్కువభాగం అనియంత్రితంగా ఉంటాయనుకుంటున్నారా? ఎందుకు?
జవాబు:

  1. మన శరీరంలో చాలా క్రియలు మన అధీనం లేకుండా స్వతంత్రంగా జరుగుతుంటాయి.
  2. హృదయస్పందన రక్తసరఫరా మన అధీనంలో ఉండదు. సందర్భాన్ని బట్టి అనియంత్రంగా ఈ యంత్రాంగం పనిచేస్తుంది.
  3. శ్వాసరేటు, అనియంత్రితంగా జరిగిపోతూ ఉంటుంది.
  4. జీర్ణవ్యవస్థలోని, ఆహారవాహిక, జీర్ణాశయ ప్రేగులలోని చలనాలు అనియంత్రంగా జరుగుతుంటాయి.
  5. వినాళ గ్రంథుల స్రావాల సందర్భానుసారంగా అనియంత్రంగా జరుగుతుంటాయి. కావున మన శరీరంలో ఎక్కువ విధులు అనియంత్రంగా జరుగుతాయని భావిస్తున్నాను.

కృత్యం – 4

అత్తిపత్తి పత్రాలను ముట్టుకొని పత్రాలు ఎలా ప్రతిస్పందిస్తాయో చూడండి. మనం ముట్టుకున్నప్పుడు పత్రాలు , ముడుచుకున్నాయా? ఏ దిశలో ముడుచుకున్నాయి?
జవాబు:
AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 9
మైమోసాప్యూడికా మొక్క అడుగు భాగంలో ఉబ్బెత్తుగానున్న మెత్తటి తల్పం వంటి నిర్మాణం ఉంటుంది. దీనిని పల్యైని అంటారు. వీటి కణాలలో ఎక్కువగా కణాంతర అవకాశాలు మరియు ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది. నీటి పీడనం వలన పల్వైని ఆకును నిలువుగా ఉంచుతుంది. టచ్ మీ నాట్ మొక్క స్పర్శతో నాస్టిక్ చలనము (nastic movement) ను చూపిస్తుంది. దీనిని “థిగ్మో ట్రాపిజమ్” అంటారు. మనం ఆకులను ముట్టుకున్నప్పుడు విద్యుత్ ప్రచోదనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రచోదనాలు మొక్క హార్మోన్లపై ప్రభావాన్ని చూపుతాయి. ఈ హార్మోన్ల వలన పల్వైని కణాలు ఏవైతే ఆకు ఈనెలకు దగ్గరగా ఉన్నాయో కణం యొక్క వేరే భాగంవైపు వలస వెళ్ళడం వలన పల్వైని గట్టిదనాన్ని కోల్పోతుంది. దానీ ఫలితంగా ఆకు ముడుచుకొని పోతుంది. 20-30 నిమిషాల తరువాత పల్వైనిలోకి నీరు తిరిగి రావడం వలన అది గట్టిపడి ఆకులు తిరిగి నిలువుగా మారతాయి.

కృత్యం – 5

గాజు జాడీని తీసుకొని మట్టితో నింపండి. జాడి గోడ అంచు వెంబడే ఉండేలా చిక్కుడు విత్తనాన్ని నాటండి. ఇలా చేయడం వల్ల విత్తనం మొలకెత్తడాన్ని కాండం మరియు వేరు పెరుగుదలను చూడవచ్చు. 4-5 రోజుల తరువాత విత్తనాలు మొలకెత్తడాన్ని మనం గమనిస్తాం. జాదీని సూర్యరశ్మిలో పెట్టండి. కాండం, వేరు ఎలా పెరుగుతుందో పరిశీలించండి. మొక్కకు నాలుగైదు ఆకులు వచ్చిన తరువాత కుండీని అడ్డంగా పడుకోబెట్టినట్లుగా క్షితిజ సమాంతరంగా ఉంచండి. వారం రోజులపాటు వేరు మరియు కాండం పెరుగుదలను పరిశీలించండి.
AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 10 AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ 11

1. కాండం వారం తరువాత సమాంతరంగానే పెరుగుతున్నదా?
జవాబు:
లేదు. కాండం సమాంతరంగా లేదు.

2. కాండం యొక్క ఏ భాగం బాగా పెరిగింది? ఏ భాగంలో పెరుగుదల లేదు ? ఈ మార్పు తీసుకొని వచ్చింది ఏమిటని నీవు భావిస్తున్నావు?
జవాబు:
కాండం యొక్క అగ్రభాగం, పైకి పెరిగింది. మొక్కకు నాలుగైదు ఆకులు వచ్చిన తరువాత కుండీని అడ్డంగా పడుకోబెట్టినట్లుగా.

క్రింది ఖాళీలను పూరించండి

1. మెదడులోని అతి పెద్ద భాగము (మస్తిష్కం)
2. రెండు నాడీకణాలు కలిసే భాగం ……… (సైనాప్స్)
3. మొక్క అంత్యాలలో (కాండాగ్రం, వేరు అగ్రం) కణాల పొడవు మరియు విభేదనములకు కారణమైన హార్మోను ………… (ఆక్సిన్)
4. థైరాక్సిన్ పని …………… (జీవక్రియరేటు పెరుగుదల)
5. జిబ్బరెల్లిస్ మరియు ఆక్సిన్లు మొక్క పెరుగుదలకు సహకరిస్తే, అబ్ సైసిక్ ఆమ్లం మొక్క పెరుగుదలను నిరోధిస్తుంది. కొన్ని సంఘటనలు ఈ కింద ఇవ్వబడ్డాయి. వీటికి ఏ హార్మోన్ అవసరమవుతుంది? ఎందుకు?
ఎ) తోటమాలి తన తోటలో పెద్ద పెద్ద ధాలియా మొక్కలను పెంచడానికి పోషకాలతోపాటు ……. హార్మోన్ వాడతాడు. (జిబ్బరెల్లిన్)
బి) పొట్టి మొక్కలలో కొమ్మలు మందంగా మారడానికి ……… హార్మోన్ వాడాలి. (జిబ్బరెల్లిన్)
సి) విత్తనాలను దీర్ఘకాలంగా నిల్వ చేయడానికి ……… హార్మోన్ వాడాలి. (అబ్ సైనిక్ ఆమ్లం)
డి) కాండం కొనభాగం కత్తిరించిన తరవాత పార్శ్వ మొగ్గలు పెరగడానికి ………….. హార్మోన్ వాడాలి. (ఆక్సిన్)

సరైన సమాధానాన్ని గుర్తించండి

1. ఒక వ్యక్తి తన భావావేశాలపై నియంత్రణ కోల్పోయాడు. మెదడులో ఏ భాగం పనిచేయటం లేదు?
A) మస్తిష్కం
B) ద్వారగోర్థం
C) మధ్య మెదడు
D) అనుమస్తిష్కం
జవాబు:
B) ద్వారగోర్థం

2. అత్తిపత్తిలో ఆకులు ముడుచుకోవడం వలన జరిగే లాభం
A) కిరణజన్యసంయోగక్రియ తగ్గడం
B) మేసే జంతువుల నుండి రక్షణ
C) మొక్క హార్మోనుల విడుదల
D) పెరుగుదల నియంత్రణ
జవాబు:
B) మేసే జంతువుల నుండి రక్షణ

AP Board 10th Class Biology Solutions 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ

3. మధుమేహానికి సంబంధించిన గ్రంథి
A) థైరాయిడ్
B) క్లోమం
C) అధివృక్క
D) పీయూష
జవాబు:
B) క్లోమం

AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

SCERT AP 10th Class Biology Guide Pdf Download 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Biology 4th Lesson Questions and Answers విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

10th Class Biology 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
వ్యర్థ పదార్థాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి?
జవాబు:
జీవక్రియల ఫలితంగా కణాలలో వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి.

ప్రశ్న 2.
అవి ఎలా ఉత్పత్తి అవుతాయి?
జవాబు:
జీవక్రియల ఫలితంగా శరీరంలో వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అవుతాయి.

ప్రశ్న 3.
వాటిలో ఏ ఏ పదార్థాలు ఉంటాయి?
జవాబు:
వ్యర్థ పదార్థాలలో ప్రధానంగా నత్రజని సంబంధ పదార్థాలైన యూరియా, యూరిక్ ఆమ్లం, అమ్మోనియా, పైత్యరస వర్ణకాలు, అదనపు లవణాలు ఉంటాయి.

ప్రశ్న 4.
ఒకే జీవి విభిన్న పరిస్థితులలో ఉత్పత్తి చేసే వ్యర్థ పదార్థాలు ఒకే రకంగా ఉంటాయా?
జవాబు:
లేదు. జీవి విసర్జించే వ్యర్థ పదార్థాలు వేరు వేరు పరిస్థితులలో విభిన్నంగా ఉంటాయి.

AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 5.
విసర్జన అనగానేమి? మూత్రం ఏర్పడే విధానాన్ని తెల్పండి. (AS1)
జవాబు:
విసర్జన :
శరీరంలో జరిగే వివిధ జీవక్రియల వలన అనేక పదార్థాలు ఏర్పడతాయి. హాని కలిగించే పదార్థాలను వేరుచేసి బయటకు పంపడాన్ని విసర్జన అంటారు.

మూత్రం ఏర్పడే విధానం :
మూత్రం ఏర్పడే విధానంలో 4 దశలుంటాయి.

  1. గుచ్ఛగాలనం
  2. వరణాత్మక పునఃశోషణం
  3. నాభికాస్రావం
  4. అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం.

ప్రశ్న 6.
అమీబాలో విసర్జన ఎలా జరుగుతుంది? (AS1)
జవాబు:
విసర్జన వివిధ రకాలైన జీవుల్లో వేరువేరుగా ఉంటుంది. ఏకకణ జీవుల్లో ప్రత్యేకమైన విసర్జకావయవాలుండవు. కణంలోని వ్యర్థ పదార్థాలను వ్యావన పద్ధతిలో బయటికి (చుట్టూ ఉన్న నీటిలోనికి) పంపుతాయి. మంచి నీటిలో నివసించే అమీబా, పారమీషియం మొదలైనవి సంకోచరిక్తికల ద్వారా ద్రవాభిసరణ క్రమత చూపుతాయి. సంకోచరిక్తికలు కణంలోని అధికంగా ఉన్న నీటిని మరియు వ్యర్థ పదార్థాలను సేకరిస్తాయి. సంకోచరిక్తికలు (Contractile vacuole) కణద్రవ్యంలో కొద్ది కొద్దిగా జరుగుతూ కణ పరిధిని చేరి పగిలిపోవుట ద్వారా సేకరించిన వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. ప్రధానమైన విసర్జన కణద్రవాభిసరణ (Osmosis) ద్వారా జరుగుతుంది.

ప్రశ్న 7.
మానవులలో వివిధ విసర్జకావయవాలు ఏవి? అవి విసర్జించే పదార్థాలు ఏవి? (AS1)
జవాబు:

విసర్జక అవయవాలు విసర్జక పదార్థాలు
1) మూత్రపిండాలు మూత్రము
2) చర్మము స్వేదము, లవణాలు
3) ఊపిరితిత్తులు నీటి ఆవిరి, CO2
4) కాలేయము పైత్యరస వర్ణకాలు, యూరియా
5) పెద్ద ప్రేగు మలము

ప్రశ్న 8.
దీపక్ “నెఫ్రాన్లు, మూత్రపిండాల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు” అని చెప్పాడు. అతన్ని నీవెలా సమర్థిస్తావు? (AS1)
జవాబు:

  1. ప్రతి మూత్రపిండం సుమారు ఒక మిలియన్ కంటే ఎక్కువ (1.3 నుండి 1.8 మిలియన్) నెఫ్రాన్లచే నిర్మింపబడుతుంది. కావున నెఫ్రాను మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక ప్రమాణంగా వ్యవహరిస్తారు.
  2. మూత్రపిండాల ప్రధానవిధి రక్తం నుండి వ్యర్థాల తొలగింపు. ఈ ప్రక్రియ మొత్తం నెఫ్రాలో జరుగుతుంది. కావున నెఫ్రాను మూత్రపిండం యొక్క క్రియాత్మక ప్రమాణం అంటారు.

ప్రశ్న 9.
మొక్కలు వ్యర్థాలను ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటాయి? (AS1)
జవాబు:

  1. మొక్కలు అధికంగా ఉన్న నీటిని బాష్పోత్సేకం మరియు బిందుస్రావం ప్రక్రియల ద్వారా బయటకు పంపుతాయి.
  2. వ్యర్థాలను ఆకులు, బెరడు మరియు పండ్లలో నిల్వచేసి రాల్చటం ద్వారా తగ్గించుకొంటాయి.
  3. కొన్ని మొక్కలు వ్యర్థాలను స్వీయ రక్షణకు ఉపయోగించుకొంటాయి.
  4. మరికొన్ని మొక్కలు వ్యర్థ పదార్థాలను వేర్లు, ఆకులు, విత్తనాలలో విషపూరిత పదార్థాలుగా మార్చుకొని శాఖాహార జంతువుల నుండి రక్షించుకోవడానికి ఉపయోగించుకొంటాయి.
  5. వీటిలో ఉండే రసాయనాల వలన మొక్కభాగాలు తినడానికి వీలుకాని రుచితో ఉంటాయి. అందువలన ఆ మొక్కలను జంతువులు తినలేవు.
  6. కొన్ని రసాయనాలు ఎక్కువ విషపూరితంగా ఉండడంతో వాటిని తిన్న జంతువులు చనిపోతాయి.

AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 10.
కొందరు వ్యక్తులు డయాలసిస్ ఎందుకు చేయించుకుంటారు? దానిలో ఇమిడి ఉన్న సూత్రం ఏమిటి? (AS1)
(లేదా)
హీమోడయాలసిస్ అనగానేమి? ఆ విధానాన్ని వర్ణించండి.
జవాబు:
డయాలసిస్ :
మూత్రపిండాలు పనిచేయని వారిలో డయాలసిస్ యంత్రంతో రక్తాన్ని వడకడతారు. కృత్రిమంగా రక్తాన్ని వడగట్టే ప్రక్రియను హీమోడయాలసిస్ (Haemodialysis) అంటారు.
AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 1

నిర్మాణం :

  1. ఈ ప్రక్రియలో రక్తాన్ని ఒక ముఖ్యమైన ధమని ద్వారా బయటకు తెచ్చి రక్తస్కందనాన్ని నిరోధించే కారకాలను కలిపి (హెపారిన్ వంటివి) డయలైజర్ యంత్రంలోనికి పంపే ఏర్పాటును చేస్తారు.
  2. డయాలసిస్ యంత్రంలో రక్తం కొన్ని గదులు లేదా గొట్టాల వంటి సెల్లో ఫేన్ తో తయారైన నాళికల ద్వారా ప్రవహిస్తుంది.
  3. ఈ నాళికలు డయలైజింగ్ ద్రావణంలో మునిగి ఉంటాయి. ఒక సన్నని పొర నాళికలోని డయలైజింగ్ ద్రావణాన్ని, రక్తాన్ని వేరుచేస్తుంది.
  4. నాళాలలో ప్రవహిస్తున్న రక్తం నాళాల బయట ఉన్న డయలైజింగ్ ద్రావణం రెండూ ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. తేడా కేవలం నత్రజని వ్యర్థాలే.

పనిచేయు విధానం :
డయలైజింగ్ ద్రావణంలో నత్రజనియుత వ్యర్థాలుండవు కనుక డయలైజర్ లో రక్తం ప్రవహించేటప్పుడు నత్రజని వ్యర్థాలు వేరై రక్తం శుద్ధి చేయబడుతుంది. ఈ ప్రక్రియనే డయాలసిస్ అంటారు. ఈ ప్రక్రియ మూత్రపిండాల పనితీరుకు సారూప్యంగా ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం ద్రవాభిసరణ ఆధారంగా పనిచేస్తుంది.

ప్రశ్న 11.
ద్రవాభిసరణం అనగానేమి? మన శరీరంలో సమతుల్యత ఎలా సాధించబడుతుంది? (AS1)
జవాబు:
దేహంలో వివిధ భాగాలలోని ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచడాన్ని సమతుల్యత అంటారు. ద్రవాభిసరణం వలన ఈ సమతుల్యత సాధించబడుతుంది.

అధిక గాఢతగల ప్రదేశం నుండి అల్ప గాఢతగల ప్రదేశానికి, అణువులు విచక్షణా స్తరం గుండా రవాణా చెంది, రెండువైపులా గాఢతను సమానం చేయడాన్ని ద్రవాభిసరణం అంటారు. ఈ ప్రక్రియ వలన అణువులు అధిక గాఢత ప్రదేశం నుండి అల్పగాఢత ప్రదేశానికి రవాణా అవుతాయి.

ద్రవాభిసరణ వలన గాఢత సమం చేయబడుట వలన శరీర ద్రవాల మధ్య సమతుల్యత సాధించబడుతుంది.

ప్రశ్న 12.
రక్తప్రసరణ, విసర్జక వ్యవస్థలకు ఏమైనా సంబంధం ఉందా? ఉంటే ఏమిటి? (AS1)
జవాబు:
రక్తప్రసరణకు, విసర్జన వ్యవస్థకు దగ్గర సంబంధం ఉంది.

  1. అన్ని కణాల నుండి వ్యర్థపదార్థాలు రక్తంలో చేరి రవాణా చేయబడతాయి.
  2. రక్తంలో చేరిన వ్యర్థ పదార్థాలు మూత్రపిండాలను చేరతాయి.
  3. మూత్రపిండాలలో సూక్ష్మగాలనం వలన వ్యర్థ పదార్థాలు తొలగించబడతాయి.
  4. వ్యర్థాలను తొలగించిన రక్తం తిరిగి వృక్క సిర ద్వారా గుండెకు చేర్చబడుతుంది.
  5. ఈ విధంగా విసర్జక వ్యవస్థ పని చేయటానికి కావలసిన మలిన రక్తాన్ని రక్తప్రసరణ వ్యవస్థ అందించి, తిరిగి శుద్ధి చేయబడిన రక్తాన్ని తీసుకొనిపోతుంది.

ప్రశ్న 13.
కారణాలు తెలపండి. (AS1)
ఎ) వాసోప్రెస్సిన్ ఎల్లప్పుడూ స్రవించదు.
బి) మూత్రం మొదట ఆమ్లయుతంగా ఉండి తరువాత క్షారయుతంగా ఉంటుంది.
సి) అభివాహిధమని వ్యాసం కంటే, అపవాహిధమని వ్యాసం తక్కువగా ఉంటుంది.
డి) వేసవిలో మూత్రం చలికాలంలో కంటే చిక్కగా ఉంటుంది.
జవాబు:
ఎ) వాసోప్రెస్సిన్ ఎల్లప్పుడూ స్రవించదు :
జీవక్రియలకు సరిపడినంత నీరు శరీరంలో లేనప్పుడు, వాసోప్రెస్సిన్ స్రవించబడి, నీటి పునఃశోషణను పెంచుతుంది. అందువలన గాఢత చెందిన మూత్రం ఏర్పడుతుంది. నీరు ఎక్కువగా త్రాగిన సందర్భాలలో, శీతాకాలంలో శరీరం నుండి నీటి నష్టం తక్కువగా ఉండి శరీరానికి సరిపడినంత నీరు లభించినపుడు వాసోప్రెస్సిన్ స్రవించబడదు.

బి) మూత్రం మొదట ఆమ్లయుతంగా ఉండి తరువాత క్షారయుతంగా ఉంటుంది :
మూత్రంలో మొదట యూరియా కరిగి యూరికామ్లంగా ఉండుట వలన ఆమ్లయుతంగా ఉంటుంది. కానీ యూరియా తరువాత అమ్మోనియాగా . మారటం వలన మూత్రం క్రమంగా క్షారయుతంగా మారుతుంది.

సి) అభివాహిధమని వ్యాసం కంటే అపవాహిధమని వ్యాసం తక్కువగా ఉంటుంది :
అపవాహిధమని వ్యాసం తక్కువగా ఉండుట వలన రక్తనాళగుచ్ఛం (గ్లోమెరూలస్) లో పీడనం పెరిగి, రక్తం వడపోతకు గురి అవుతుంది. అందువలన రక్తం నుండి మలిన పదార్థాలు వేరు చేయబడతాయి.

డి) వేసవిలో మూత్రం చలికాలంలో కంటే చిక్కగా ఉంటుంది :
వేసవిలో పరిసరాల ఉష్ణోగ్రత అధికంగా ఉండుట వలన శరీరం చెమట ద్వారా ఎక్కువ నీటిని కోల్పోతుంది. శరీరం నీటిని కోల్పోవటం వలన మూత్రం తక్కువగా ఏర్పడుతుంది. తక్కువ మూత్రం ద్వారా వ్యర్థాలు విసర్జించబడటం వలన మూత్రం చిక్కగా ఉంటుంది. కావున వేసవి కాలంలో ఎక్కువ నీరు త్రాగటం ఆరోగ్యకరం.

AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 14.
భేదాలు రాయండి. (AS1)
ఎ) సమీపస్థ సంవళితనాళం, దూరస్థ సంవళితనాళాల విధులు
బి) మూత్రపిండాలు మరియు కృత్రిమ మూత్రపిండాలు
సి) విసర్జన మరియు స్రావం
డి) ప్రాథమిక మరియు ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు
జవాబు:
ఎ) సమీపస్థ సంవళితనాళం, దూరస్థ సంవళితనాళాల విధులు :

సమీపస్థ సంవళితనాళం దూరస్థ సంవళితనాళం
1) ఇది బౌమన్ గుళికకు దగ్గరగా ఉంటుంది. 1) ఇది బొమన్ గుళికకు దూరంగా ఉంటుంది.
2) ఇది హెశిక్యం యొక్క పూర్వభాగం. 2) ఇది హె)శిక్యం యొక్క పరభాగం.
3) ఇందులో నీరు, లవణాలు పునఃశోషణ  చేయబడతాయి. వరణాత్మక పునఃశోషణ దీని ప్రధాన విధి. 3) వ్యర్థాలు మూత్రనాళికలోనికి స్రవించబడతాయి. నాళికా స్రావం దీని ప్రధాన విధి.
4) ప్రాథమిక మూత్రం ఉంటుంది. 4) గాఢత చెందిన మూత్రం ఉంటుంది.

బి) మూత్రపిండాలు మరియు కృత్రిమ మూత్రపిండాలు :

మూత్రపిండాలు కృత్రిమ మూత్రపిండాలు
1) మానవునిలోని ప్రధాన విసర్జక అవయవం. 1) మూత్రపిండ విధిని నిర్వహించే పరికరము.
2) ఇది ఒక శారీరక అవయవం. 2) ఇది ఒక యంత్రపరికరం.
3) కణజాలాలు నెఫ్రాన్లతో నిర్మితం. 3) డయలైజర్లు నాళాలతో నిర్మితం.
4) పరిమాణాత్మకంగా చిన్నది. 4) పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది.
5) శరీరంలో ఇమిడి ఉంటుంది. 5) శరీరం బయట ఉంచి రక్తాన్ని సరఫరా చేస్తారు.
6) స్వయం ప్రతిపత్తి కలది. 6) మానవ ఆధీనంలో పనిచేస్తుంది.
7) సహజమైనది. 7) కృత్రిమమైనది.

సి) విసర్జన మరియు స్రావం :

విసర్జన స్రావం
1) వ్యర్థ పదార్థాలను శరీరం నుండి బయటకు పంపే ప్రక్రియ. 1) పదార్థాలను ఒక చోట నుండి మరొక చోటుకు రవాణా చేసే ప్రక్రియ.
2) క్రియాత్మకం కాని ప్రక్రియ. 2) క్రియాత్మక ప్రక్రియ.
3) మానవునిలో యూరియా, యూరికామ్లం, అమ్మోనియా విసర్జన పదార్థాలు. 3) ఎంజైమ్లు, హార్మోన్లు, లాలాజలం స్రావాలు.
4) మొక్కలలో ఆల్కలాయిడ్లు, రెసిన్ మొదలైనవి విసర్జితాలు. 4) జిగురులు, లేటెక్స్ వంటివి స్రావితాలు.

డి) ప్రాథమిక మరియు ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు :

ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు
1) శరీర నిర్మాణానికి, శక్తికి తోడ్పడతాయి. 1) రక్షణకు, ఇతర క్రియలకు తోడ్పడతాయి.
2) కిరణజన్యసంయోగక్రియ వలన ఏర్పడతాయి. 2) జీవక్రియల ఫలితంగా ఏర్పడతాయి.
3) జీవక్రియల వలన మొదటిగా ఏర్పడతాయి. కావున వీటిని ప్రాథమిక ఉత్పన్నాలు అంటారు. 3) ప్రాథమిక ఉత్పన్నాల వినియోగం వలన ఏర్పడతాయి. కావున వీటిని ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు అంటారు.
4) ప్రధానంగా దుంపలు, కాయలలో నిల్వ చేయబడతాయి. 4) ప్రధానంగా ఆకు, బెరడు, వేర్లలో నిల్వ చేయబడతాయి.
5) పోషకాలుగా పరిగణిస్తాము. 5) వ్యర్థాలుగా పరిగణిస్తాము.
6) ఉదా : కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు. 6) ఉదా : ఆల్కలాయిడ్లు, రెసిన్లు.

ప్రశ్న 15.
మానవ శరీరంలో ఒక జత చిక్కుడు గింజ ఆకారంలో ఉండే ‘P’ అనే అవయవాలు వెన్నెముకకు ఇరువైపులా పృశరీర కుడ్యానికి అంటిపెట్టుకుని ఉంటాయి. ఉపయోగపడని ప్రోటీన్లు విచ్ఛిన్నం కావడంవల్ల ఏర్పడే వ్యర్థం ‘Q’ రక్తం ద్వారా ‘R’ అనే ధమని ద్వారా ‘P’ కి చేరుతుంది. ‘P’ లో అసంఖ్యాకంగా ఉండే ‘S’ అనే వడపోసే నాళికలు రక్తాన్ని వడపోసి మిగిలిన రక్తాన్ని సిర ‘T’ ద్వారా ప్రసరణ వ్యవస్థలోకి పంపబడుతుంది.

వ్యర్థ పదార్థాలు ‘Q’ మరియు ఇతర లవణాలు అధికంగా ఉన్న నీటితో కలిసి పసుపు వర్ణంలో ‘U’ అనే ద్రవం ఏర్పడుతుంది. ఇది ‘P’ నుండి సంచి లాంటి నిర్మాణంలో ‘V’ లోనికి ‘W’ అనే నాళాల ద్వారా వెళుతుంది. తరువాత ఈ ద్రవం ‘X’ అనే ద్వారం ద్వారా బయటకుపోతుంది. (AS1)
ఎ) అవయవం ‘P’ ఏమిటి ? బి) వ్యర్థం ‘Q’ ఏమిటి?
సి) ధమని ‘R’ పేరేమిటి ? డి) సిర అనే ‘T’ పేరేమిటి?
ఇ), వడపోసే సూక్ష్మనాళిక ‘S’ను ఏమంటారు?
ఎఫ్) ద్రవం ‘U’ పేరేమిటి?
జి) ‘V’ నిర్మాణాల పేరేమిటి?
హెచ్) ‘W’ నాళాల పేరేమిటి?
ఐ) ద్వారం ‘X’ పేరేమిటి?
జవాబు:
ఎ) ‘P’ అంటే మూత్రపిండం.
బి) ‘Q’ అంటే యూరియా వంటి వ్యర్థ పదార్థం.
సి) ‘R’ అంటే వృక్క ధమని.
డి) ‘T’ అంటే అపవాహి రక్తనాళం
ఇ) ‘S’ అంటే నెఫ్రాన్.
ఎఫ్) ‘U’ అనగా మూత్రం,
జి) ‘V’ అంటే మూత్రాశయం.
హెచ్) ‘W’ అనగా మూత్రనాళాలు.
ఐ) ‘X’ అనగా ప్రసేకం.

AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 16.
‘B’ అనే విషపూరిత వ్యర్థాలు రక్తంలో చేరికవల్ల రక్తం మలినంగా మారి వ్యక్తి శరీరంలోని అవయవం ‘A’ చెడిపోతుంది. ఆ వ్యక్తి ప్రాణం రక్షించడానికి అతని చేతిలోని ధమని ద్వారా రక్తాన్ని మెలికలు తిరిగిన గొట్టాల ద్వారా పంపించారు. ఈ గొట్టాలు ‘E’ అనే పదార్థంతో చేయబడ్డాయి. ద్రావణం ‘F’ కలిగిన ట్యాంక్ లో ఉంచబడ్డాయి. ఈ ద్రావణంలో ‘G, H’ మరియు I అనే రక్తంతో, సమాన నిర్మాణం కలిగిన ఈ మూడు పదార్థాలు ఉన్నాయి. గొట్టాల గుండా రక్తం ప్రవహిస్తున్నపుడు రక్తంలోని వ్యర్థాలు ద్రావణం ‘F’ లోకి చేరాయి. శుభ్రమైన రక్తం తిరిగి సిర ద్వారా వ్యక్తి రక్తప్రసరణ వ్యవస్థలోకి చేరింది. (AS1)
ఎ) అవయవం ‘A’ ఏమిటి?
బి) వ్యర్థపదార్థం ‘B’ ఏమిటి?
సి) పదార్థం ‘E’, ద్రావణం ‘F’ ల పేర్లేమిటి?
డి) ద్రావణంలోని ‘G’, ‘H’ మరియు ‘I’ ఏమిటి?
ఇ) పైన పేర్కొనబడిన విధానం ఏమిటి?
జవాబు:
ఎ) ‘A’ అనే అవయవం మూత్రపిండం.
బి) ‘B’ అనే వ్యర్థ పదార్థాలు యూరియా, అమ్మోనియా.
సి) ‘E’ అనే పదార్థం ‘సెల్లో ఫేన్’, ‘F’ అనేది డయలైజింగ్ ద్రావణం.
డి) ద్రావణంలోని ‘G’ హెపారిన్, ‘H’ ప్రాథమిక మూత్రం మరియు ‘T’ నీరు
ఇ) పైన పేర్కొనబడిన విధానాన్ని ‘డయాలసిస్’ అంటారు.

ప్రశ్న 17.
ఎప్పటికప్పుడు శరీరంలోని వ్యర్థాలు బయటికి పంపకపోతే ఏమౌతుందో ఊహించండి. (AS2)
జవాబు:

  1. శరీరంలో ఏర్పడే వ్యర్థాలను బయటకు పంపకపోతే వాటి మోతాదు పెరిగిపోయి శరీర ద్రవ్యాల తులాస్థితి దెబ్బతింటుంది.
  2. తొలగించని వ్యర్థాలు విషపదార్థాలుగా మారి జీవక్రియలను దెబ్బతీస్తాయి.
  3. మరికొన్ని వ్యర్థాలు విషపదార్థాలుగా పరిణమించి మరణానికి దారితీస్తాయి.
  4. కావున వ్యర్థ పదార్థాల విసర్జన తప్పనిసరి. విసర్జన జరపకుండా జీవులు జీవించలేవు.

ప్రశ్న 18.
మీ మూత్రపిండాలు ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంచుకొనుటకు యూరాలజిస్ట్/నెఫ్రాలజిస్ట్ ని ఎటువంటి ప్రశ్నలు అడుగుతావు? (AS2)
జవాబు:

  1. మూత్రపిండాల ఆరోగ్యానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
  2. ఆహార నియమాలకు, మూత్రపిండాల పనితీరుకు గల సంబంధం ఏమిటి?
  3. మూత్రపిండాల పనితీరుకు రోజూ ఎంత నీరు అవసరము?
  4. ధూమపానం, ఆల్కహాల్ వ్యసనాలు మూత్రపిండంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి?
  5. శారీరక వ్యాయామానికి, మూత్రపిండాల పనితీరుకు ఏదైనా సంబంధం ఉందా?
  6. మూత్రపిండాలలో రాళ్లు ఎలా ఏర్పడతాయి? నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?

ప్రశ్న 19.
మీ పరిసరాలలో జిగురునిచ్చే మొక్కలేవి ? జిగురుని మొక్కల నుండి సేకరించడానికి ఎటువంటి విధానం అనుసరిస్తావు? (AS3)
జవాబు:

  1. మా పరిసరాలలో ప్రధానంగా వేప, తుమ్మ, మునగ చెట్ల నుండి జిగురు తీస్తారు.
  2. జిగురు కోసం ముందుగా చెట్ల బెరడును కొంచెం చెక్కి వదులుతారు.
  3. చెక్కిన ప్రాంతం నుండి చెట్టు జిగురు స్రవిస్తుంది.
  4. ఈ జిగురును చెక్కి నీళ్ళలో నానవేసి జిగురు చేస్తారు.
  5. దీఖిని పుస్తకాల బైండింగ్ వర్క్ లో విరివిగా ఉపయోగిస్తారు.

ప్రశ్న 20.
వివిధ రకాల మొక్కల నుండి లభించే ఆల్కలాయిడ్లకు సంబంధించిన సమాచారాన్ని అంతర్జాలం లేదా గ్రంథాలయం నుండి సేకరించి, నివేదిక తయారుచేయండి. (AS4)
జవాబు:
ఆల్కలాయిడ్లు మొక్కలలో ఏర్పడే నత్రజని సంబంధిత ఉప ఉత్పన్నాలు. ఇవి మొక్కలకు అనేక విధాలుగా ఉపయోగ పడటమేగాక మానవులకు కూడా ప్రయోజనకరంగా ఉన్నాయి.

  1. క్వినైన్ అనే ఆల్కలాయిడ్ ‘సింకోనా అఫిసినాలిస్’ అనే మొక్క బెరడు’ నుండి లభిస్తుంది. దీనిని మలేరియా నివారణకు ప్రముఖ ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
  2. ‘నికోటిన్’ అనే ఆల్కలాయిడ్ పొగాకు మొక్క నుండి లభిస్తుంది. దీనిని క్రిమిసంహారిణిగా ఉపయోగిస్తున్నారు.
  3. గంజాయి మొక్క నుండి మార్ఫిన్, కొకైన్ వంటి ఆల్కలాయిడ్లు లభిస్తున్నాయి. వీటిని మత్తుమందులుగాను, నొప్పి నివారిణులుగాను ఉపయోగిస్తున్నారు.
  4. సర్పగంధి మొక్క వేర్ల నుండి రిసర్ఫిన్ అనే ఆల్కలాయిడ్ లభిస్తుంది. దీనిని పాముకాటు నివారిణిగా ఉపయోగిస్తారు.
  5. కాఫీ మొక్క నుండి లభించే ‘కెఫిన్’ అనే ఆల్కలాయిడకు నాడీవ్యవస్థను ఉత్తేజపరచే శక్తి ఉంది. కావున దీనిని వేడి పానీయంగా సేవిస్తుంటారు.
  6. వేప నుండి లభించే ‘నింబిన్’ ఆల్కలాయిడ్ మంచి కీటకనాశినిగా ఉపయోగపడుతుంది. కావున దీనిని పొలాలకు కీటకనాశినిగానే కాకుండా, టూత్ పేస్టు, సబ్బుల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు.
  7. ఉమ్మెత్త మొక్క నుండి లభించే ‘స్కోపోలమైన్’ ఆల్కలాయిడ్ మత్తుమందుగా పనిచేస్తుంది.
  8. రిసర్ఫిన్, మార్ఫిన్ వంటి ఆల్కలాయిడ్లను మొక్కల నుండే గాక కృత్రిమంగా రూపొందిస్తున్నారు.
  9. ‘కురేరి’ (curare) ఆల్కలాయిడ్ ను కండర నొప్పి నివారణకు వాడుతున్నారు. అధిక మోతాదులో దీన్ని విషపదార్థంగా దక్షిణ ఆఫ్రికాలోని తెగలు బాణాలకు పూసి వాడుతుంటారు.
  10. నొవోకైన్ (Novocain) అనే సంశ్లేషిత ఆల్కలాయిడ్ ను కొకైన్ కు మారుగా వినియోగిస్తున్నారు. సంశ్లేషిత ఆల్కలాయిడ్లు, నిజమైన ఆల్కలాయిడ్ల కంటే తక్కువ దుష్ఫలితాలు కలిగి ఉండుట వలన ప్రాచుర్యంలోనికి వస్తున్నాయి.

ప్రశ్న 21.
మూత్రపిండం నిలువుకోత పటం గీచి, భాగాలు గుర్తించండి. (AS5)
(లేదా)
మూత్రపిండం యొక్క అంతర్నిర్మాణాన్ని చూపు చక్కని పటం గీచి భాగాలను గుర్తించుము. వృక్క ధమని, వృక్క సిరల పని ఏమిటి?
జవాబు:
AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 2

  1. వృక్పధమని, నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు కలిగిన ఆమ్లజని సహిత రక్తాన్ని మూత్రపిండాలకు సరఫరా చేస్తుంది.
  2. వృక్కసిర, నత్రజని వ్యర్థాలు శుభ్రపరచబడిన ఆమ్లజని రహిత రక్తాన్ని మూత్రపిండాల నుండి సేకరిస్తుంది.

ప్రశ్న 22.
వృక్కనాళిక (Nephron) నిర్మాణాన్ని పటం సహాయంతో వివరించండి. (AS5)
జవాబు:
నెఫ్రాన్ నిర్మాణం :
ప్రతి నెఫ్రాలోను 2 ముఖ్య భాగాలుంటాయి. అవి:

  1. మాల్ఫీజియన్ దేహం (Malphigian body)
  2. వృక్కనాళిక (Renal tubule)

AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 3

1) మాల్ఫీజియన్ దేహం (Malphigian body) :

  1. నెఫ్రా లో ఒకచివర వెడల్పయిన కప్పు ఆకారంలో ఉండే నిర్మాణాన్ని బౌమన్ గుళిక అంటారు. దానిలో ఉన్న రక్తకేశనాళికలతో ఏర్పడిన వలలాంటి నిర్మాణాన్ని రక్తకేశనాళికా గుచ్ఛం (Glomerulus) అంటారు.
  2. బొమన్ గుళిక, రక్తకేశనాళికాగుచ్ఛంలను కలిపి మాల్ఫీజియన్ దేహం అంటారు.
  3. రక్తకేశనాళికా గుచ్ఛం అభివాహి ధమనిక నుండి ఏర్పడుతుంది. దాని నుండి అపవాహి ధమనిక వెలువడుతుంది.
  4. అభివాహి ధమనిక వ్యాసం, అపవాహి ధమనిక వ్యాసం కంటే ఎక్కువగా ఉండడం వల్ల రరక్తకేశనాళికాగుచ్ఛంలో పీడనం పెరిగి దానిలోని పదార్థాలు వడపోతకు గురవుతాయి.
  5. బౌమన్ గుళిక గోడలలోని కణాలు ఉపకళాకణజాలంతో ఏర్పడతాయి. వీటిని పోడోసైట్లు అంటారు. పదార్థాల వడపోతకు వీలుకలిగించేలా పోడోసైట్ కణాల మధ్య సూక్ష్మరంధ్రాలు ఉంటాయి.

2) వృక్కనాళిక (Renal tubule) :

  1. వృక్కనాళికలలో 3 భాగాలుంటాయి. 1) సమీపస్థ సంవళితనాళం (Proximal Convoluted Tubule- PCT), 2) హెన్లీ శిక్యం (U ఆకారంలో ఉంటుంది. ) 3) దూరస్థ సంవళితనాళం (Distal Convoluted Tubule – DCT).
  2. దూరస్థ సంవళితనాళం, సంగ్రహణ నాళంలోనికి తెరచుకుంటుంది. సంగ్రహణ నాళాలు పిరమిడ్లు మరియు కెలిసెన్లుగా ఏర్పడి చివరికి ద్రోణి (Pelvis) లోనికి తెరచుకుంటాయి. ద్రోణి మూత్రనాళంలోకి తెరచుకుంటుంది.
  3. వృక్కనాళికలలోని అన్ని భాగాలు అపవాహి ధమనిక నుండి ఏర్పడిన నాళికాబాహ్య రక్తకేశనాళికల వలచేత కప్పబడి ఉంటాయి. నాళికాబాహ్య రక్తకేశనాళికలన్నీ కలిసి చివరన వృక్కసిరగా ఏర్పడతాయి.

AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 23.
మానవ విసర్జక వ్యవస్థలో విసర్జన జరిగే మార్గాన్ని రేఖాచిత్రం (Block diagram) ద్వారా చూపండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 4

ప్రశ్న 24.
మూత్రపిండంలో విసర్జన జరిగే విధానాన్ని వివరించే పటాన్ని గీయండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 5
PCT – సమీపస్థ సంవలిత నాళం
DCT – దూరస్థ సంవలిత నాళం

ప్రశ్న 25.
మానవుని విసర్జన వ్యవస్థలో అద్భుతంగా భావించిన అంశాలను రాయండి. (AS6)
జవాబు:

  1. మూత్రపిండంలో, విసర్జన క్రియ అంతా సన్నని నాళాలలో జరుగుతుంది అనే విషయం ఆశ్చర్యంగా ఉంది.
  2. మూత్రపిండం దాదాపు మిలియన్ నెఫ్రాన్లచే నిర్మించబడినది అనే విషయం అద్భుతంగా ఉంది.
  3. నెఫ్రాన్లో ఉపయోగపడే పదార్థాలు తిరిగి పీల్చుకోబడటం, శరీరం యొక్క తెలివితేటలను తెలుపుతుంది.
  4. ఒక మూత్రపిండం చెడిపోయినా, రెండవ మూత్రపిండం దాని విధిని తీసుకొంటుందని తెలుసుకొని అద్భుతంగా భావించాను.
  5. మూత్రపిండం యొక్క క్రియాశీలతకు ‘వాసోప్రెస్సిన్’ సహకారం అద్భుతం అనిపించింది.

ప్రశ్న 26.
ఈ పాఠంలో ‘బ్రెయిన్ డెడ్’ వ్యక్తుల గురించి చదివావు కదా ! నీవు ఏ రకమైన చర్చను చేపడతావు? ఎందుకు? (AS6)
జవాబు:
బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? మన శరీరంలో మెదడు మరణించినా ఇతర శరీర అవయవాలు పనిచేస్తుంటాయా? మెదడు ప్రమేయం లేకుండా ఇతర అవయవాలు ఎలా పని చేస్తాయి? వాస్తవానికి మెదడు ప్రమేయం లేకుండా ఇతర అవయవాలు పనిచేయజాలవు. కానీ ఆధునిక వైద్య పరిజ్ఞానము అందించిన సాంకేతికత ఆధారంగా గుండె, ఊపిరితిత్తులను పని చేయించవచ్చు. కానీ మెదడు ప్రతిస్పందన లేకుండా అవయవాలు పనిచేసి ప్రయోజనం ఏముంటుంది? కావున బ్రెయిన్ డెడు శాస్త్రీయంగా మరణంగా ధ్రువీకరించి ఇతర అవయవాలను తొలగిస్తారు.

బ్రెయిన్ డెడు నిర్ణయించిన తరువాత ఇతర అవయవాలను అవసరం ఉన్నవారికి దానం చేయవచ్చు. దీనిని అవయవదానం అంటారు. దాదాపు ఎనిమిది రకాల అవయవాలు దానం చేసి ఇతరుల ప్రాణాలను, జీవితాలను కాపాడవచ్చు. అవయవదానం యొక్క ప్రాధాన్యత చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసింది. దాని గురించి విస్తృతంగా తెలియ చెప్పవలసిన బాధ్యత మనందరిది.

ప్రశ్న 27.
అవయవదానం గురించి మనకు అతి తక్కువ అవగాహన ఉంది. ప్రజల్లో అవయవదానం పట్ల అవగాహన పెంచడానికి కొన్ని నినాదాలు రాయండి. (AS7)
జవాబు:

  1. అవయవదానం – మహాదానం
  2. మరణించే వారికి జీవం పోయవచ్చు – మరణించి కూడా జీవించవచ్చు
  3. అవయవదానం – బ్రతుకుదానం
  4. అవయవదానం చేద్దాం – సాటి మానవునిగా జీవిద్దాం
  5. అవయవాలను దానం చేద్దాం – కొందరికైనా వెలుగు నింపుదాం
  6. అవయవదానం – ప్రాణదానం

AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 28.
ఈ పాఠం చదివిన తరువాత మూత్రపిండాలు సక్రమంగా పనిచేయడానికి మీ ఆహారపు అలవాట్లలో ఎటువంటి మార్పులు చేయాలనుకుంటున్నావు? (AS7)
జవాబు:
ఈ పాఠం చదివిన తరువాత మూత్రపిండాలు సక్రమంగా పనిచేయటానికి నేను ఈ క్రింది ఆహారపు అలవాట్లు పాటిస్తున్నాను.

  1. రోజూ తగినంత నీరు త్రాగుతున్నాను.
  2. సరళ ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తున్నాను.
  3. కూల్ డ్రింక్స్ కు బదులుగా కొబ్బరినీళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నాను.
  4. ద్రాక్ష, పుచ్చకాయ, కమల వంటి పండ్లు ఎక్కువగా తీసుకుంటున్నాను.
  5. నియమానుసారం వ్యాయామం చేస్తున్నాను.
  6. ప్రోటీన్స్ ఉన్న ఆహారానికి ప్రాధాన్యత ఇస్తున్నాను.
  7. ఉడికించిన పదార్థాలు ఎక్కువగా తినుటవలన తగినంత నీరు లభిస్తుంది.
  8. అన్నం తిన్న తరువాత ఎక్కువ నీరు తీసుకొంటున్నాను.

10th Class Biology 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ Textbook InText Questions and Answers

10th Class Biology Textbook Page No. 83

ప్రశ్న 1.
అభివాహిధమనిక కంటే అపవాహిధమనిక సన్నగా ఉండటానికి కారణం ఆలోచించండి.
జవాబు:
అభివాహిధమనిక వ్యాసం, అపవాహిధమనిక వ్యాసం కంటే ఎక్కువగా ఉండడం వల్ల రక్తకేశనాళికాగుచ్ఛంలో పీడనం పెరిగి దానిలోని పదార్థాలు వడపోతకు గురవుతాయి.

10th Class Biology Textbook Page No. 84

ప్రశ్న 2.
నెఫ్రాన్ మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణమని ఎందుకంటారు?
జవాబు:
మూత్రపిండం సుమారు ఒక మిలియన్ కంటే ఎక్కువ నెఫ్రాన్లతో నిర్మితమౌతుంది. కావున నెఫ్రాన్ మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక ప్రమాణం. రక్తం యొక్క వడపోత నెఫ్రాని బౌమ గుళికలోనే జరుగుతుంది. కావున నెఫ్రాన్ మూత్రపిండం యొక్క క్రియాత్మక ప్రమాణం అంటారు.

ప్రశ్న 3.
అభివాహి, అపవాహి ధమనికలలో దేని వ్యాసం ఎక్కువగా ఉంటుంది?
జవాబు:
అభివాహి ధమని, అపవాహి ధమని కంటే ఎక్కువ వ్యాసం కలిగి ఉంటుంది.

AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 4.
రక్తకేశనాళికా గుచ్చంలో ఏ ఏ పదార్థాలు వడపోయబడతాయి?
జవాబు:
రక్తకేశనాళికాలైన గుచ్ఛంలో రక్తకణాలు తప్ప మిగిలిన పదార్థాలు, నీరు, లవణాలు, పోషకాలు వడపోతకు గురి అవుతాయి.

ప్రశ్న 5.
ఎక్కువ నీరు తాగితే ఎక్కువ మూత్రం విసర్జిస్తామా?
జవాబు:
శరీరంలో నీటి పునఃశోషణ నీటి పరిమాణం మరియు విసర్జించవలసిన పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ నీరు త్రాగటం వలన మిగిలిన నీరు అంతా మూత్రంగా విసర్జింపబడుతుంది. కావున ఎక్కువ మూత్రం విసర్జిస్తాము.

ప్రశ్న 6.
ఏఏ పదార్థాలు సమీపస్థ సంవళితనాళం నుండి బాహ్యరక్తకేశనాళికా వలలోనికి పునఃశోషణం అవుతాయి?
జవాబు:
శరీరానికి ఉపయోగకర పదార్థాలైన నీరు, లవణాలు, గ్లూకోజ్, ఎమైనో ఆమ్లాలు, విటమిన్ సి, సోడియం, పొటాషియంలు బాహ్యకేశనాళికా వలలోనికి విడుదల అవుతాయి.

10th Class Biology Textbook Page No. 85

ప్రశ్న 7.
దూరస్థ సంవళితనాళంలో స్రవించబడే పదార్థాలు ఏవి?
జవాబు:
రక్తకేశనాళికల నుండి మూత్రనాళికలోనికి వ్యర్థ పదార్థాలు స్రవించబడతాయి. రక్తంలో ఉండే యూరియా, యూరికామ్లం, క్రియాటినిన్, సోడియం, పొటాషియం, హైడ్రోజన్’ అయాన్లు స్రవించబడతాయి. ఇవి మూత్రం యొక్క గాఢతను, pH ను నియంత్రిస్తాయి.

10th Class Biology Textbook Page No. 86

ప్రశ్న 8.
ఎక్కువ నీరు తాగినపుడు వాసోప్రెస్సిన్ ఎందుకు ఉత్పత్తికాదో ఆలోచించండి.
జవాబు:
శరీరంలో నీరు తగ్గినపుడు వాసోప్రెస్సిన్ ఉత్పత్తి అయి, నీటి పునఃశోషణను పెంచుతుంది. అందువలన మూత్రం గాఢత చెందుతుంది. నీరు అధికంగా త్రాగినపుడు శరీరానికి సరిపడినంత నీరు ఉండుట వలన వాసోప్రెస్సిన్ ఉత్పత్తి కాదు.

AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 9.
శీతాకాలంలో ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయవలసి వస్తుంది. ఎందుకు?
జవాబు:
శీతాకాలంలో పరిసరాల ఉష్ణోగ్రత తక్కువగా ఉండుట వలన, శరీరం నుండి నీటి నష్టం తక్కువగా ఉంటుంది. కావున శరీరంలో మిగులు నీరు అధికంగా ఉండి మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. కావున ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.

ప్రశ్న 10.
ఒకవేళ నీటి పునఃశోషణ జరగపోతే ఏం జరుగుతుంది?
జవాబు:
నీరు పునఃశోషణ జరగపోతే, అధిక నీరు మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. ఇతర జీవక్రియల కోసం జీవి మరింత నీటిని తీసుకోవల్సి వస్తుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో జీవనం కష్టమౌతుంది. కావున జీవులు నీటి నష్టాన్ని తగ్గించటానికి నీటిని పునఃశోషణ చేస్తాయి.

10th Class Biology Textbook Page No. 89

ప్రశ్న 11.
మూత్రపిండాలు పనిచేయని వారికి దీర్ఘకాలిక పరిష్కారం ఏమైనా ఉందా?
జవాబు:
మూత్రపిండాలు పనిచేయని వారికి దీర్ఘకాలిక పరిష్కారం మూత్రపిండ మార్పిడి దగ్గర సంబంధీకుల నుండి మూత్రపిండాన్ని తీసుకొని రోగి శరీరంలో అమర్చుతారు. ఈ ప్రక్రియను “మూత్రపిండ మార్పిడి” అంటారు.

ప్రశ్న 12.
దాత నుండి సేకరించిన మూత్రపిండాన్ని రోగికి ఎక్కడ అమర్చుతారు?
జవాబు:
మూత్రపిండ మార్పిడిలో దాత నుండి సేకరించిన మూత్రపిండాన్ని నడుము క్రింది భాగాన అమర్చుతారు.

ప్రశ్న 13.
పనిచేయని మూత్రపిండాన్ని ఏం చేస్తారు?
జవాబు:
పనిచేయని మూత్రపిండాన్ని శరీరంలో అలానే ఉంచుతారు. మూత్రపిండ మార్పిడిలో కొత్త మూత్రపిండాన్ని మూత్రాశయానికి కొంచెం పైగా అమర్చుతారు. పనిచేయని మూత్రపిండం సంక్రమణ (ఇన్ ఫెక్షన్)కు లోనైతే దానిని తొలగించవలసి ఉంటుంది.

ప్రశ్న 14.
దాత ఒక మూత్రపిండంతోనే జీవించగలడా?
జవాబు:
రెండు మూత్రపిండాల పనిని ఒక మూత్రపిండం చేయగలదు. దీని కోసం మిగిలి ఉన్న మూత్రపిండం యొక్క పరిమాణం కూడా కొంచెం పెరుగుతుంది. అందువల్ల దాత ఒక మూత్రపిండంతోనే జీవించగలడు.

ప్రశ్న 15.
మన శరీరంలో ఇంకా ఏ ఏ విసర్జకావయవాలు ఉన్నాయి?
జవాబు:
మన శరీరంలో మూత్రపిండాలతో పాటుగా, ఊపిరితిత్తులు, చర్మం, కాలేయం, పెద్ద ప్రేగు వంటి విసర్జక అవయవాలు ఉన్నాయి.

10th Class Biology Textbook Page No. 90

ప్రశ్న 16.
శీతల ప్రాంతాలలో నివసించే వారికి అతి తక్కువ చెమట వస్తుంది లేదా చెమట పట్టదు. దీని వలన వారి శరీరంలోని ఇతర విసర్జకావయవాలలో ఎలాంటి మార్పులు వస్తాయి?
జవాబు:
శీతల ప్రాంతాలలో ఉష్ణోగ్రత తక్కువ కావున చెమట తక్కువ పడుతుంది. కాబట్టి వీరిలో స్వేద గ్రంథుల క్రియాత్మకత తక్కువగా ఉంటుంది. ఇటువంటి సందర్భాలలో శరీరం నుండి లవణాలను తొలగించటానికి మూత్రపిండాలు క్రియాత్మకంగా మెరుగుగా ఉంటాయి. చర్మం ద్వారా తొలగించాల్సిన లవణాలను మూత్రపిండాలు తొలగిస్తాయి.

10th Class Biology Textbook Page No. 91

ప్రశ్న 17.
మొక్కలు కూడా జంతువులలాగే విసర్జిస్తాయా?
జవాబు:
జంతువులలో వలె మొక్కలలో కూడా విసర్జన క్రియ జరుగుతుంది. అయితే విసర్జించే ప్రక్రియ విభిన్నంగా ఉంటుంది. మొక్కలలో విసర్జనకు ప్రత్యేక అవయవాలు ఉండవు. వ్యర్థ పదార్థాల విచ్ఛిన్నం నెమ్మదిగా జరిగి, మొక్క దేహ భాగాలలో నెమ్మదిగా పోగవుతాయి.

AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 18.
మొక్కలు వ్యర్థ పదార్థాలను ఏ విధంగా సర్దుబాటు చేస్తాయి లేదా బయటికి పంపిస్తాయి?
జవాబు:
మొక్కలు అధికంగా ఉన్న నీటిని భాష్పోత్సేకం (Transpiration) మరియు బిందుస్రావం (Guttation) ప్రక్రియల ద్వారా బయటికి పంపుతాయి. వ్యర్థ పదార్థాలను ఆకులు, బెరడు మరియు పండ్లలో నిల్వచేసి, పక్వస్థితిలో వాటిని రాల్చటం ద్వారా వ్యర్థాలను తగ్గించుకుంటాయి. కొన్ని మొక్కలు పండ్లలో వ్యర్థాలను శిలాజకణాలు (Raphides) గా నిల్వ చేస్తుంటాయి. కొన్ని మొక్కలు వ్యర్థ పదార్థాలను స్వీయరక్షణకు ఉపయోగపడే పదార్థాలుగా మార్చుకొంటాయి.

10th Class Biology Textbook Page No. 92

ప్రశ్న 19.
మొక్కలు నిర్దిష్ట కాలవ్యవధిలో ఆకులు, బెరడును రాలుస్తూ ఉంటాయి. ఎందుచేత?
జవాబు:
మొక్కలు తమ వ్యర్థ పదార్థాలను ఆకులు, బెరడులలో నిల్వ చేస్తుంటాయి. కొంత కాలానికి వాటిలో వ్యర్థ పదార్థాలు అధికంగా పోగవుతాయి. అప్పుడు వాటిని రాల్చివేస్తాయి.

10th Class Biology Textbook Page No. 93

ప్రశ్న 20.
మనకు హాని కలుగజేసే ఆల్కలాయిడ్లను చెప్పండి.
జవాబు:

  1. నికోటిన్ అనే ఆల్కలాయిడ్ వలన ఊపిరితిత్తుల కాన్సర్, గొంతు కాన్సర్ వస్తుంది.
  2. బాధా నివారిణిగా ఉపయోగించే మార్ఫినను ఎక్కువగా ఉపయోగిస్తే మూత్రపిండాలు పాడైపోతాయి.
  3. పుప్పొడి రేణువులలో ఉండే నత్రజని పదార్థాల ద్వారా ‘అలర్జీ’ వస్తుంది.

10th Class Biology Textbook Page No. 94

ప్రశ్న 21.
జట్రోపా మొక్కలలో ఏ భాగాన్ని జీవ ఇంధనం తయారీలో ఉపయోగిస్తారు?
జవాబు:
జట్రోపా మొక్క యొక్క కాయలను, విత్తనాలను జీవ ఇంధనం తయారీలో ఉపయోగిస్తున్నారు.

ప్రశ్న 22.
మొక్క వేర్లు కూడా స్రవిస్తాయా?
జవాబు:
“బ్రుగ్మన్స్” అనే వృక్ష శాస్త్రవేత్త వేర్లు నేల నుండి లవణాలను పీల్చుకోవటమే కాకుండా కొన్ని స్రావాలను నేలలోనికి స్రవిస్తుంటాయని కనుగొన్నాడు. కొన్నిసార్లు ఈ స్రావాలు బాక్టీరియా పెరుగుదలకు తోడ్పడతాయి.

ప్రశ్న 23.
ఫలసాయం తగ్గడానికి, వేర్ల స్రావాలకు ఏమైనా సంబంధం ఉందా?
జవాబు:
వేర్లస్రావాలు నేలలో అయాన్ల గాఢతను పెంచి నేల లవణీయతను పెంచుతాయి. అందువలన పంట దిగుబడి తగ్గుతుంది.

ప్రశ్న 24.
మన ఇంట్లో కుండీల్లోని మొక్కల్ని మార్చేటపుడు వేర్ల నుండి ప్రత్యేకమైన వాసనలు వస్తుంటాయి. ఎందుకు?
జవాబు:
వేర్ల స్రావాలు నేలలోనికి విడుదలవుతుంటాయి. ఈ స్రావాలు మొక్కలను పెకిలించినపుడు వెలుపలికి వచ్చి వాసనను కలిగిస్తుంటాయి.

ప్రశ్న 25.
కణాలన్నింటికి విసర్జన క్రియ అవసరమా?
జవాబు:
జీవంతో ఉన్న అన్ని కణాలు జీవక్రియను నిర్వహిస్తుంటాయి. ఫలితంగా వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి కావున కణాలన్నీ విసర్జన క్రియ జరుపుతాయి.

ప్రశ్న 26.
వైద్యులు తగినన్ని నీళ్ళు త్రాగడం మంచిదని సూచిస్తుంటారు. ఎందుకు?
జవాబు:
జీవక్రియలు జరగటానికి నీరు అత్యవసరం. తగినంత నీరు లేకుంటే కణాలలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను తొలగించ లేము. అందువలన వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి మూత్ర సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. కావున వైద్యులు తగినన్ని నీళ్ళు తాగడం మంచిదని సూచిస్తుంటారు.

AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

ప్రశ్న 27.
కొంతమంది పిల్లలు 15 లేదా 16 సంవత్సరాలు వచ్చేవరకు కూడా రాత్రిపూట నిద్రలో పక్క తడుపుతుంటారు. ఎందుకు?
జవాబు:
మూత్ర విసర్జన ప్రసేకం ప్రారంభంలో ఉన్న సంవరణీ కండరంచే నియంత్రించబడుతుంది. మొదట ఈ కండరం అనియంత్రితంగా వ్యవహరించినప్పటికి, పిల్లలు పెరిగే కొలది అదుపులోనికి వస్తుంది. కానీ కొంతమంది పిల్లలలో ఈ సంవరణీ కండరం నియంత్రణ లేకపోవుట వలన 15 లేదా 16 సంవత్సరాల వరకు నిద్రలో మూత్ర విసర్జన చేస్తుంటారు.

ప్రశ్న 28.
కలుపు మొక్కలు, కొన్ని అటవీ మొక్కలకు కీటకాలు, చీడపురుగులు ఎందువలన హాని చేయలేవు?
జవాబు:
కలుపు మొక్కలు, అటవీ మొక్కలు వ్యర్థ పదార్థాలను ఆకులు, కాండాలలో నిల్వ చేసుకొంటాయి. ఇవి చేదుగా ఉండి కీటకాలకు, చీడపురుగులకు రుచించదు. అందువలన ఇవి కలుపు మొక్కలు, అటవీ మొక్కలకు హాని చేయలేవు.

10th Class Biology 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 6
పట్టికలో సూచించిన వివిధ జీవ ప్రక్రియలలో ఏర్పడే వివిధ ఉత్పన్నాలేమిటో చర్చించి పట్టికలో రాయండి.
జవాబు:

జీవక్రియలు ఉత్పన్నాలు
కిరణజన్యసంయోగక్రియ కార్బోహైడ్రేట్స్, O2, H2O
శ్వాసక్రియ CO2, H2O, శక్తి
జీర్ణక్రియ మలము, లవణాలు

కృత్యం – 2

డిపార్టుమెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ
స్పెసిమన్ : ప్లాస్మా / సీరం (రక్తం పరీక్ష రిపోర్టు)

మి.మోల్స్ /లీ = మిల్లీమోల్స్ / లీటరు, మి.గ్రా/డె.లీ. = మిల్లీగ్రామ్ / డెసిలీటరు
స్పెసిమన్ : మూత్రం పరీక్ష రిపోర్టు
AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 11
24 గంటల మూత్రపరీక్ష అనగా ఒక వ్యక్తి నుండి 24 గంటలలో సేకరించిన మొత్తం మూత్రంలో నుండి 100-150మి.లీ. మూత్రం నమూనాగా తీసుకొని దానిని పరీక్ష చేస్తారు.
1) రక్తంలో ఉన్న పదార్థాలు ఏవి?
జవాబు:
రక్తంలో గ్లూకోజ్, సోడియం, పొటాషియం, క్లోరైడ్, యూరియా వంటి పదార్థాలు ఉన్నాయి.

2) మూత్రంలో ఉన్న పదార్థాలు ఏవి?
జవాబు:
మూత్రంలో యూరియా, యూరికామ్లం, ప్రోటీన్స్, సోడియం, పొటాషియం వంటి లవణాలు ఉన్నాయి.

3) రక్తం మరియు మూత్రం రెండింటిలోనూ ఉన్న పదార్థాలేమిటి?
జవాబు:
రక్తం, మూత్రపిండం రెండింటిలోనూ ప్రోటీన్స్, క్రియాటిన్, యూరికామ్లం, గ్లూకోజ్, సోడియం, పొటాషియం వంటి లవణాలు, యూరియా, యూరికామ్లం వంటి వ్యర్థాలు ఉన్నాయి.

4) చాలా పదార్థాలు రక్తం, మూత్రం రెండింటిలోనూ ఉన్నాయి. ఎందుకు?
జవాబు:
మూత్రం రక్తం వడపోత వలన ఏర్పడుతుంది. రక్తంలోని పదార్థాలను తొలగించటం వలన మూత్రం ఏర్పడుతుంది. కావున మూత్రంలోని పదార్థాలు రక్తంలోను కనిపిస్తాయి.

5) రక్తం మరియు మూత్రంలో సాధారణ స్థాయిని మించి ఉన్న పదార్థాలేమిటి?
జవాబు:
కాల్షియం, యూరికామ్లం, యూరియా వంటి పదార్థాలు మూత్రంలోనూ, క్రియాటినిన్, యూరికామ్లం, కొలెస్ట్రాల్, ప్రోటీన్లు వంటి పదార్థాలు రక్తంలో స్థాయిని మించి ఉన్నాయి.

6) ఏవేని పదార్థాలు సాధారణ స్థాయిని మించి ఉంటే ఏం జరుగుతుంది?
జవాబు:
స్థాయికి మించి ఉన్న పదార్థాలు హానికరంగా తయారవుతాయి.

7) ఏయే పదార్థాలను శరీరం నుండి తొలగించవలసిన అవసరమున్నదో పేర్కొనండి.
జవాబు:
యూరియా, యూరికామ్లం, క్రియాటినిన్ లవణాలను శరీరం నుండి తొలగించవలసిన అవసరం ఉంది.

ప్రయోగశాల కృత్యం

ఉద్దేశం :
మూత్రపిండం బాహ్య మరియు అంతర లక్షణాలను అధ్యయనం చేయుట.

కావాల్సిన పదార్థాలు :
మాంసం కొట్టులో సేకరించిన మేక లేదా గొర్రె మూత్రపిండం లేదా మూత్రపిండ 3D నమూనా, పదునైన బ్లేడ్, ట్రే మరియు నీళ్ళు.

పరిశీలనా విధానం :
మేక లేదా గొర్రె మూత్రపిండాన్ని సేకరించి, రక్తమంతా పోయేలా నీటితో శుభ్రంగా కడగాలి. పూర్తిగా ఆరిన తర్వాత దానిని ఒక ట్రేలో పెట్టి జాగ్రత్తగా పరిశీలించండి. నోట్ బుక్ లో మీ పరిశీలనలు నమోదుచేయండి. ఒక పదునైన బ్లేడు లేదా స్కాల్ షెల్ సాయంతో మూత్రపిండాన్ని నిలువుగా జాగ్రత్తగా కోసి, అంతర్గత నిర్మాణాన్ని పరిశీలించండి. ఇందుకోసం మీ ఉపాధ్యాయుని సహకారం తీసుకోండి. పరిశీలించిన దాని పటం గీయండి. మీరు గీసిన పటాన్ని పటం – 1, 2 లతో పోల్చండి.
AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ 12

1) మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉన్నాయి?
జవాబు:
మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నాయి.

2) ఏ రంగులో ఉన్నాయి?
జవాబు:
ఇవి ముదురు ఎరుపు రంగులో ఉన్నాయి.

3) మూత్రపిండం పై భాగంలో అతుక్కొని ఏవైనా నిర్మాణాలు ఉన్నాయా?
జవాబు:
పైన అధివృక్క గ్రంథి అతుక్కొని ఉంది.

4) మూత్రపిండాల లోపలి నిర్మాణం పటం – 2 మాదిరిగానే ఉందా?
జవాబు:
మూత్రపిండాల లోపలిభాగం పటంలో చూపిన మాదిరిగానే వెలుపలివైపు ముదురు రంగులోనూ, లోపలివైపు లేత రంగులోనూ ఉంది.

5) మూత్రపిండం అడ్డుకోతలో బయటిభాగం ఏ రంగులో ఉంది?
జవాబు:
మూత్రపిండం బయటిభాగం ముదురు ఎరుపు రంగులో ఉంది. దీనిని “వల్కలం” అంటారు.

6) ముదురు ఎరుపురంగు భాగం ఎక్కడ ఉంది?
జవాబు:
ముదురు ఎరుపురంగు భాగం మూత్రపిండం బయటి వైపున ఉంది.

7) మూత్రపిండాల గుంటభాగం (హైలస్) నుండి ఎన్ని నాళాలు బహిర్గతమవుతున్నాయి?
జవాబు:
మూత్రపిండాల గుంటభాగం నుండి వృక్కసిర, మూత్రనాళం బయటకు వచ్చాయి.

కింది ఖాళీలను పూరించండి

1. వానపాములోని విసర్జక అవయవాలు ……….. (వృక్కాలు (నెఫ్రీడియా)
2. మూత్రపిండం అడ్డుకోతలోని ముదురు గోధుమవర్ణపు భాగాన్ని …………. అంటారు. (వల్కలం)
3. జీవుల్లోని నీటి ప్రమాణం, అయాన్ల గాఢతను క్రమబద్ధీకరించడాన్ని …………. అంటారు. (ద్రవాభిసరణ)
4. నెఫ్రాన్లో ఉపయోగకరమైన పదార్థాల పునఃశోషణం ………….. జరుగుతుంది. (సమీపస్థ సంవళిత నాళం ద్వారా)
5. జిగురు మరియు రెసిన్లు ……………………….. పదార్థాలు. (ద్వితీయ ఉత్పాదక)
6. బొమన్ గుళిక మరియు రక్తకేశనాళికాగుచ్ఛాన్ని కలిపి …………………………. అంటారు. (నెఫ్రాన్)
7. మలేరియా నివారణకు ఉపయోగించే ఆల్కలాయిడ్ …………………… (క్వి నైన్)
8. డయాలసిలో ఇమిడి ఉన్న సూత్రం ……………. (ద్రవాభిసరణ)
9. రబ్బరును రబ్బరు మొక్క యొక్క ……………………….. నుండి తయారుచేస్తారు. (లేటెక్స్)
10. మొట్టమొదట మూత్రపిండ మార్పిడి చేసిన వైద్యుడు . ………. (చార్లెస్ హఫీ గెల్)

సరైన సమాధానాన్ని గుర్తించండి

1. మానవుని మూత్రపిండంలోని నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం ……….
A) న్యూరాన్
B) నెఫ్రాన్
C) నెఫ్రీడియా
D) జ్వాలాకణం
జవాబు:
B) నెఫ్రాన్

2. బొద్దింకలో విసర్జకావయవాలు …………………
A) మాల్ఫీజియన్ నాళికలు
B) రాఫైడ్స్
C) మూత్రనాళాలు
D) జ్వాలాకణం
జవాబు:
A) మాల్ఫీజియన్ నాళికలు

3. మానవ శరీరంలో మూత్రం ప్రయాణించే మార్గం
i) మూత్రపిండాలు ii) మూత్రనాళాలు iii) ప్రసేకం iv) మూత్రాశయం
A) i, ii, iv, iii
B) i, ii, iii, iv
C) iv, iii, i, ii
D) ii, iii, i, iv
జవాబు:
A) i, ii, iv, iii

AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

4. మాల్ఫీజియన్ నాళికలు ఏ జీవిలో విసర్జకావయవాలు?
A) వానపాము
B) ఈగ
C) బద్దెపురుగు
D) కోడి
జవాబు:
B) ఈగ

5. మానవ మూత్రంలోని ప్రధాన వ్యర్థం ఏది?
A) యూరియా
B) సోడియం
C) నీరు
D) క్రియాటినిన్
జవాబు:
C) నీరు

6. ఏ జీవిలో ప్రత్యేక విసర్జకావయవాలు ఉండవు?
A) పక్షులు
B) అమీబా
C) స్పంజికలు
D) A మరియు B
జవాబు:
B) అమీబా

7. ఈ కింది వానిలో ఏ హార్మోను మూత్రవిసర్జనతో ప్రత్యక్ష సంబంధం ఉంది?
A) ఎడ్రినలిన్
B) వాసోప్రెస్సిన్
C) ప్రొజెస్టిరాన్
D) ఈస్ట్రోజన్
జవాబు:
B) వాసోప్రెస్సిన్

8. మూత్రం పసుపురంగులో ఉండుటకు కారణం ఏమిటి?
A) యూరోక్రోమ్
B) బైలిరూబిన్
C) బైలివర్జిన్
D) క్లోరైడ్స్
జవాబు:
A) యూరోక్రోమ్

9. మూత్రం ఏర్పడే దశల క్రమం
A) వరణాత్మక పునఃశోషణం → గుచ్ఛగాలనం → నాళికాస్రావం
B) గుచ్ఛగాలనం → వరణాత్మక పునఃశోషణం → నాళికాస్రావం
C) వరణాత్మక పునఃశోషణం → నాళికాస్రావం → గుచ్ఛగాలనం
D) నాళికాస్రావం → వరణాత్మక పునఃశోషణం → గుచ్ఛగాలనం
జవాబు:
B) గుచ్ఛగాలనం → వరణాత్మక పునఃశోషణం → నాళికాస్రావం

10. మూత్రపిండం బాహ్య ప్రాంతంలో ఉండే నెఫ్రాన్ భాగం
A) హె శిక్యం
B) సమీపస్థ సంవళితనాళం
C) దూరస్థ సంవళితనాళం
D) బొమన్ గుళిక
జవాబు:
D) బొమన్ గుళిక

AP Board 10th Class Biology Solutions 4th Lesson విసర్జన – వ్యర్థాల తొలగింపు వ్యవస్థ

11. ఆహారం తిన్న తరువాత మూత్ర విసర్జన చేయాలన్న భావన ఎందుకు కలుగుతుంది?
A) మూత్రాశయంపై జీర్ణాశయ పీడనం
B) ఘనపదార్థాలు ద్రవ పదార్థాలుగా మారడం
C) ఆహారంలోని నీటి పరిమాణం
D) స్పింక్టర్ కండరాల కదలిక
జవాబు:
C) ఆహారంలోని నీటి పరిమాణం

AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

SCERT AP 10th Class Biology Guide Pdf Download 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Biology 3rd Lesson Questions and Answers ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

10th Class Biology 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
ఘన, ద్రవ మరియు వాయు పదార్థాలన్నింటిని ఒకే వ్యవస్థ ద్వారా రవాణా చేయటం సాధ్యమవుతుందని మీరు భావిస్తున్నారా? (AS1)
జవాబు:
ఘన, ద్రవ మరియు వాయు పదార్థాలను ఒకే వ్యవస్థ ద్వారా రవాణా చేయటం సాధ్యమే. ముఖ్యంగా పరిణితి చెందిన బహుకణ జీవులలో ఇది కనిపిస్తుంది. అందువలనే బహుకణ జీవులలో రవాణా వ్యవస్థలో వైవిధ్యం కనిపిస్తుంది. తీసుకొన్న ఆహారం, (ఘనపదార్థం), నీరు (ద్రవ పదార్థం), పీల్చిన గాలి (వాయుపదార్థం) రక్తం ద్వారానే అన్ని శరీరభాగాలకు రవాణా అవుతున్నాయి.

ప్రశ్న 2.
ప్రసరణ వ్యవస్థ అంటే ఏమిటి? ఇది జీవులకు ఏవిధంగా ఉపయోగపడుతుందో రాయండి. (AS1)
జవాబు:
ప్రసరణ వ్యవస్థ :
జీవులలో పదార్థాల రవాణాకు నిర్వహించే వ్యవస్థను ప్రసరణ వ్యవస్థ అంటారు. దీని ద్వారా శరీర కణజాలానికి అవసరమైన అన్ని పదార్థాలు రవాణా చేయబడతాయి.

ఆవశ్యకత :

  1. ఏకకణ జీవులలో పదార్థాల రవాణా, విసరణ (వ్యాపనం), ద్రవాభిసరణ వంటి సరళమైన పద్ధతులలో ప్రసరణ జరుగుతుంది.
  2. కాని బహుకణ జీవులలో ఎక్కువ పదార్థాలు రవాణా చేయటానికి ఈ పద్ధతిలో సంవత్సరాల కొలది సమయం అవసరమవుతుంది.
  3. ఈ అవసరమైన ఆలస్యాన్ని నివారించటానికి జీవులు ప్రత్యేకమైన వేగవంతమైన ప్రసరణ వ్యవస్థను ఏర్పర్చుకొన్నాయి.

ఉపయోగాలు : ప్రసరణ వ్యవస్థ వలన

  1. కణజాలాలకు ఆక్సిజన్ రవాణా చేయబడుతుంది.
  2. కణాలలో ఏర్పడిన CO2 తొలగించబడుతుంది.
  3. కణాలకు అవసరమైన పోషకాలు అందించబడతాయి.
  4. కణాలలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలు తొలగించబడతాయి.
  5. నిర్దిష్ట భాగాలకు హార్మోన్స్ అందించబడతాయి.
  6. రక్షణ వ్యవస్థలో కీలకపాత్ర వహిస్తుంది.

ప్రశ్న 3.
ప్లాస్మా మరియు రక్తం మధ్య గల సంబంధం ఏమిటి? (AS1)
జవాబు:
రక్తంలోని కణాంతర ద్రవాన్ని ప్లాస్మా అంటారు. ఇది ద్రవస్థితిలోని పదార్థం. రక్తం యొక్క మాతృక, రక్తకణాలు ప్లాస్మాలో తేలుతూ ప్రవహిస్తుంటాయి. రక్తకణాలు మరియు ప్లాస్మా కలయిక వలన రక్తం ఏర్పడుతుంది.
రక్తం = రక్తకణాలు + ప్లాస్మా

ప్లాస్మాలో 6.8% కర్బన పదార్థాలు 0.085-0.9% అకర్బన పదార్థాలు, వాయువులు, ప్రోటీనులు రక్షణ చర్యకు, రక్తస్కందనానికి తోడ్పడే పదార్థాలు ఉంటాయి. ప్రసరణ ప్రక్రియలో ప్లాస్మా కీలకపాత్ర వహిస్తూ, రక్త విధులను నిర్వహిస్తుంది.

AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 4.
గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని చేరవేసే భాగాలు ఏవి? (AS1)
జవాబు:
మానవ హృదయాన్నుండి రక్తాన్ని తీసుకుని పోయే రక్తనాళాలు : దైహిక మహాధమని, పుపుసమహాధమని, హృదయ ధమనులు.

దైహిక మహాధమని :
ఇది ఎడమ జఠరిక నుండి బయలుదేరి ఊపిరితిత్తులకు తప్ప మిగతా అన్ని శరీర భాగాలకు ఆమ్లజని సహిత రక్తాన్ని సరఫరా చేస్తుంది.

పుపుస మహాధమని :
ఇది కుడి జఠరిక నుండి బయలుదేరుతుంది. ఆమ్లజని రహిత రక్తాన్ని హృదయము నుండి ఊపిరితిత్తులకు తీసుకుపోతుంది.

హృదయ ధమనులు :
ఆమ్లజని సహిత రక్తాన్ని హృదయ కండరాలకు తీసుకుని వెళతాయి.

ప్రశ్న 5.
మన శరీరంలో గల మూడు ప్రధానమైన రక్తనాళాలను పేర్కొనండి. (AS1)
జవాబు:
శరీరంలో మూడు ప్రధాన రక్తనాళాలు
1. ధమనులు :
ఇవి గుండె నుండి శరీరభాగాలకు రక్తాన్ని తీసుకెళతాయి. ఇవి దృఢంగా ఉండి కవాటాలు లేకుండా, తక్కువ కుహరంలో శరీరం లోపలివైపున ఉంటాయి.

2. సిరలు :
ఇవి శరీర భాగాల నుండి రక్తాన్ని గుండెకు చేర్చుతాయి. ఇవి మృదువుగా ఉండి, కవాటాలతో చర్మం క్రింద విస్తరించి ఉంటాయి.

3. రక్తకేశనాళికలు :
ఇవి సన్నని వెంట్రుకల వంటి నిర్మాణాలు, కణజాలంతో సంబంధం కలిగి ఉంటాయి.

ప్రశ్న 6.
మన శరీరంలో అతిపెద్ద ధమని ఏది? ఇది పెద్దదిగా ఉండటానికి గల కారణమేమిటి? (AS1)
జవాబు:
బృహత్ ధమని శరీరంలోని పెద్ద ధమని. ఇది ఎడమ జఠరిక నుండి ప్రారంభమై గుండె బయటకు వచ్చి శరీరభాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది.

ఊపిరితిత్తులకు తప్ప’ శరీర అన్ని భాగాలకు రక్తాన్ని అందించాలి కావున ఈ బృహత్ ధమని ద్వారా అధిక రక్తం ప్రసరిస్తుంది. కావున బృహత్ ధమని పెద్దదిగా ఉంటుంది.

ప్రశ్న 7.
ఆక్సీకరణం చెందడం కోసం రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళాలు ఏవి? (AS1)
జవాబు:
శరీరంలో రక్తం ఊపిరితిత్తులలో ఆక్సీకరణం చెందుతుంది. కావున రక్తం పుపుస ధమని ద్వారా గుండె నుండి, ఆ తలకు వెలువడుతుంది. ఈ ధమని గుండె పై భాగాన రెండుగా చీలి రెండు ఊపిరితిత్తులకు రక్తాన్ని అందిస్తుంది.

ప్రశ్న 8.
లింఫ్ నాళాలు, సిరలలో ఉండి ధమనులలో లేని నిర్మాణాలు ఏమిటి? (AS1)
జవాబు:
కవాటాలు, లింఫ్ నాళాలు సిరలలో ఉంటాయి. కాని ధమనులలో ఉండవు. ఇవి రక్తాన్ని వెనుకకు రాకుండా నివారిస్తూ, ముందుకు నడిపిస్తాయి.

ప్రశ్న 9.
రక్తఫలకికల యొక్క ఉపయోగాలు రాయండి. (AS1)
జవాబు:
రక్తంలో ఉండే రక్తఫలకికలు రక్తస్కందన ప్రక్రియను ప్రారంభిస్తాయి. గాయం నుండి రక్తం స్రవించినప్పుడు రక్త ఫలకికల నుండి థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ విడుదల అవుతుంది. ఈ థ్రాంబోకైనేజ్ రక్తంలో ఉన్న ప్రోత్రాంబినను త్రాంబిన్ గా మారుస్తుంది. తాంబ్రిన్ ప్రభావం వలన ఫైబ్రిన్ తంతువులు ఏర్పడి, రక్తం గడ్డకడుతుంది.

AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 10.
కింది వాని మధ్య భేదాలు రాయండి. (AS1)
ఎ) సిస్టోల్ – డయాస్టోల్
బి) ధమనులు – సిరలు
సి) దారువు – పోషక కణజాలం
జవాబు:
ఎ) సిస్టోల్ – డయాస్టోల్

సిస్టోల్ డయాస్టోల్
1. గుండె సంకోచ దశను సిస్టోల్ అంటారు. 1. గుండె సడలే దశను డయాస్టోల్ అంటారు.
2. ఈ ప్రక్రియలో రక్తం ధమనులలోనికి ప్రవేశింపబడుతుంది. 2. ఈ ప్రక్రియలో రక్తం సిరల నుండి గుండెకు చేరుతుంది.
3. గుండె ఖాళీ చేయబడుతుంది. 3. గుండె రక్తంతో నింపబడుతుంది.
4. సిస్టోలిక్ పీడనం విలువ 120 mmHg. 4. డయాస్టోలిక్ పీడనం విలువ 80 mmHig.
5. సిస్టోలిక్ సమయం 0.38 నుండి 0.49 సెకనులు. 5. డయాస్టోలిక్ సమయం 0.31 నుండి 0.42 సెకనులు.

బి) ధమనులు – సిరలు

ధమనులు సిరలు
1. గుండె నుండి రక్తాన్ని తీసుకెళ్ళే రక్తనాళాలను ధమనులు అంటారు. 1. శరీర భాగాల నుండి రక్తాన్ని గుండెకు చేర్చే రక్త నాళాలను సిరలు అంటారు.
2. మందమైన గోడలు ఉంటాయి. 2. గోడలు పలుచగా ఉంటాయి.
3. ‘నాళ కుహరం చిన్నదిగా ఉంటుంది. 3. నాళ కుహరం పెద్దదిగా ఉంటుంది.
4. కవాటాలు ఉండవు. 4. కవాటాలు ఉంటాయి.
5. రక్తనాళాలపై పీడనం ఎక్కువ. 5. రక్తనాళాలపై పీడనం తక్కువ.
6. ఆమ్లజనిసహిత రక్తం ఉంటుంది. 6. ఆమ్లజనిరహిత రక్తం ఉంటుంది.
7. పుపుస ధమనిలో ఆమ్లజనిరహిత రక్తం ఉంటుంది. 7. పుపుస సిరలో ఆమ్లజనిసహిత రక్తం ఉంటుంది.
8. రక్తకేశనాళికలతో అంతమౌతాయి. 8. రక్తకేశనాళికల నుండి ప్రారంభమౌతాయి.

సి) దారువు – పోషక కణజాలం

దారువు పోషక కణజాలం
1. దారువు నీరు మరియు పోషక పదార్థములను వేర్ల మొక్క అగ్రభాగాలకు సరఫరా చేస్తుంది. 1. ఇది ఆకుల నుండి ఆహార పదార్థములను మొక్క నుండి ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది.
2. దారుకణాలు, దారునాళాలు, దారునారలు మరియు దారు మృదుకణజాలాలు దీనియందు ఉంటాయి. 2. పోషక కణజాలంనందు చాలనీ కణాలు, చాలనీ నాళాలు, సహకణాలు, పోషక కణజాల నారలు మరియు పోషక కణజాల మృదుకణజాలం ఉంటాయి.
3. దారువు మృదుకణజులం మాత్రమే సజీవ కణజాలం. 3. చాలనీ కణాలు, చాలనీ నాళాలు, సహకణాలు మరియు పోషక మృదుకణజాలాలు సజీవ కణజాలాలు.
4. చారుకణాలు, దారునాళాలు, దారునారలు నిర్జీవ కణజాలాలు. 4. పోషక కణజాల నారలు మాత్రమే నిర్జీవ కణజాలం.
5. మొక్కకు యాంత్రిక బలాన్ని ఇస్తుంది. 5. మొక్కకు యాంత్రిక బలమును ఇవ్వదు.
6. దారువు నీటి సరఫరాను ఏకమార్గములో నిర్వహిస్తుంది. వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు చేరుస్తుంది. 6. ఆహార పదార్థాల సరఫరా ద్విమార్గముల ద్వారా నిర్వహిస్తుంది. ఆకుల నుండి నిల్వ అంగాలు లేదా- పెరుగుదల నిల్వ అంగాల నుండి పెరుగుదల ప్రదేశాలకు సరఫరా చేస్తుంది.

ప్రశ్న 11.
మూలకేశాల ద్వారా ద్రవాభిసరణ పద్ధతిలో మొక్కలు నీటిని గ్రహించే విధానాన్ని వివరించండి. (AS1)
(లేదా)
మూలకేశాల ద్వారా ద్రవాభిసరణ పద్ధతిలో మొక్కలలోకి నీరు ప్రవేశించే విధానాన్ని పటం సహాయంతో వివరించండి.
జవాబు:
1. మృత్తిక నీరు, లవణాలతో కూడిన సజల ద్రావణం.

2. మూలకేశాలలోని కణరసం గాఢత మృత్తిక నీరు ద్రావణ గాఢతకంటే ఎక్కువ ఉంటుంది. అందువలన ద్రవాభిసరణ ద్వారా మూలకేశాలలోని రిక్తికలలోకి నీరు ప్రవహిస్తుంది.
AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 1
3. మూలకేశాలలోని పదార్థాల గాఢత నీరు లోపలికి ప్రవేశించడం వలన పెరుగుతుంది. దీని ఫలితంగా నీరు పక్కనున్న కణాలకు ప్రవహించి వాటి గాఢతను కూడా పెంచుతుంది. చివరిగా నీరు దారు నాళాలలోకి చేరుతుంది.

4. ఎక్కువ సంఖ్యలో మూలకేశాలు మరియు వేరు కణాలు ఈ ప్రక్రియలో పాల్గొనటం వలన దారు నాళాలలో పీడనం ఏర్పడుతుంది. ఈ పీడనం నీటిపైకి నెట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ మొత్తం పీడనాన్ని వేరు పీడనం (root pressure) అంటారు.

ప్రశ్న 12.
వేరు పీడనం అంటే ఏమిటి? ఇది మొక్కకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? (AS1)
జవాబు:
వేరు పీడనం :
వేరు నీటిని, పీల్చుకొన్నప్పుడు వెలువర్చే పీడనాన్ని వేరు పీడనం అంటారు.

ప్రయోజనం :
వేరు పీడనం వలన వేరులోనికి ప్రవేశించిన నీరు కాండంలోనికి నెట్టబడుతుంది. కాండంలోనికి చేరిన నీరు ఇతర ప్రక్రియల ద్వారా పైకి లాగబడుతుంది.

ప్రశ్న 13.
పోషక కణజాలం కొన్ని జంతువులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. దీనిని నీవు ఎలా సమర్థిస్తావు? (AS1)
జవాబు:

  1. పోషక కణజాలం ద్వారా మొక్కలలో ఆహార పదార్థాలు రవాణా అవుతాయి. అందువలన కొన్ని జీవులు ఈ పోషక కణజాలాన్ని ఆహారంగా వాడుకొంటాయి.
  2. ప్రధానంగా ఎఫిడ్స్ లేతకాండం చుట్టూ గుమిగూడి తొండాన్ని పోషక కణజాలంలోనికి చొప్పించి మొక్కల రసాన్ని – ఆహారంగా గ్రహిస్తాయి.
  3. చిట్టెలుకలు కొన్నిసార్లు ఆహారం కొరకు చెట్టు బెరడును తొలిచి ఆహారాన్ని సంపాదిస్తాయి. బెరడులో ఉండే పోషక కణాజాలాన్ని ఆహారంగా తీసుకొంటాయి.
  4. కుందేళ్ళు తమ పదునైన దంతాలతో చెట్ల పోషక కణజాలాన్ని కొరికి మొక్కలకు, అటవీ సంపదకు హాని చేస్తుంటాయి.

ప్రశ్న 14.
కింది పేరాలు చదవండి. ఖాళీలలో సమాచారాన్ని నింపండి.
→ గుండె నాలుగు గదులతో కూడిన కండరయుతమైన నిర్మాణం. గదులను విభజిస్తూ విభాజక పొర ఉంటుంది. గుండెలో గల విభాజక పొరలకు పేర్లు పెట్టండి.
ఎ) రెండు కర్ణికల మధ్య గల విభాజకాన్ని కర్ణికాంతర విభాజకం అంటారు.
బి) రెండు జఠరికల మధ్య గల విభాజకాన్ని ……………….. అంటారు.
సి) ఒక కర్ణిక దాని దిగువన ఉన్న జఠరికల మధ్య ఉన్న విభాజకాన్ని ……………….. అంటారు.
జవాబు:
బి) జఠరికాంతర విభాజకం
సి) కర్ణికా-జఠరికాంతర విభాజకం

→ గుండెలోని రెండు గదులను కలుపుతూ ఉండే మార్గాన్ని రంధ్రం (aperture) అంటారు. కర్ణికలు, జఠరికల మధ్య ఉండే రంధ్రాలకు పేర్లు పెట్టండి.
ఎ) కుడికర్ణిక, కుడి జఠరికలను కలుపుతూ ఉండే రంధ్రాన్ని …………….. అంటారు.
బి) ఎడమ కర్ణిక, ఎడమ జఠరికలను కలుపుతూ ఉండే రంధ్రాన్ని ……………………. అంటారు.
జవాబు:
ఎ) కుడి కర్ణికా జఠరికా విభాజక రంధ్రం
బి) ఎడమ కర్ణికా జఠరికా విభాజక రంధ్రం

→ తమ గుండా ఒక దిశలో మాత్రమే పదార్థాలు ప్రయాణించడానికి అనుమతించే రంధ్రాన్ని కవాటం అంటారు.
ఎ) గుండె గదుల మధ్య ఉండే కవాటాలకు పేర్లు రాయండి.
బి) ఎడమ కర్ణిక, ఎడమ జఠరికల మధ్య ఉండే కవాటం …………..
సి) కుడి కర్ణిక, కుడి జఠరికల మధ్య ఉండే కవాటం
జవాబు:
ఎ) అగ్రత్రయ కవాటం, అగ్రద్వయ కవాటం
బి) మిట్రల్ కవాటం (అగ్రద్వయ కవాటం)
సి) అగ్రత్రయ కవాటం

AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 15.
కాళ్ళలో ఉండే సిరల్లో కవాటాలు రక్తప్రవాహాన్ని అడ్డుకున్నాయనుకోండి. అప్పుడు జరిగే పరిణామాలేమిటో ఆ ఊహించండి. (AS2)
జవాబు:

  1. కాళ్ళలోని సిరలు కవాటాలు కలిగి ఉంటాయి. ఇవి రక్తాన్ని వెనుకకు ప్రయాణించకుండా నిరోధిస్తాయి.
  2. ఈ కవాటాలు రక్తప్రవాహాన్ని అడ్డుకుంటే, వీటిని అధిగమించి రక్తం ముందుకు ప్రసరించదు.
  3. అందువలన సిరలలో రక్తం నిల్వ పెరిగి సిరలు ఉబ్బిపోతాయి.
  4. రక్తం సిరల ద్వారా గుండెకు చేరదు కాబట్టి రక్తప్రసరణ అసంపూర్తి అవుతుంది.
  5. సరఫరా చేయటానికి రక్తం గుండెకు చేరదు కావున రక్తప్రసరణ స్తంభిస్తుంది.
  6. రక్తప్రసరణ జరగక జీవి మరణిస్తుంది.

ప్రశ్న 16.
మొక్కల మూలకేశ కణాలలోని కణద్రవ్యం గాఢత ఎక్కువయినపుడు ఏమి జరుగుతుంది? (AS2)
జవాబు:

  1. మొక్కల వేర్లమీద ఉండే సన్నని వెంట్రుకల వంటి నిర్మాణాన్ని మూలకేశాలు అంటారు. ఇవి ఒక కణమందం కలిగి నేల నుండి నీటిని, లవణాలను గ్రహిస్తాయి.
  2. మూలకేశాలలోనికి నీరు ప్రవేశించటం కణద్రవ్య గాఢత పైన ఆధారపడి ఉంటుంది. కణద్రవ్య గాఢత ఎక్కువగా ఉన్నప్పుడు, మట్టిలోని నీరు ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా కణాలలోనికి ప్రవేశిస్తుంది.
  3. ద్రవాభిసరణ వలన అల్పగాఢత నుండి, అధిక గాఢతగల కణద్రవ్యంలోకి నీరు చేరుతుంది.
  4. ప్రక్క కణంలో సాపేక్షంగా గాఢత ఎక్కువ ఉండుటవలన ఈ నీరు ప్రక్క కణాలలోనికి ద్రవాభిసరణ చెంది నీటి ప్రసరణ జరుగుతుంది.

ప్రశ్న 17.
జాన్ కాగితం కప్పు, సెలైన్ గొట్టాలను ఉపయోగించి స్టెతస్కోపును తయారుచేశాడు. అతడు అనుసరించిన విధానాన్ని రాయండి. (AS3)
జవాబు:
జాన్ స్టెతస్కోప్ నిర్మించటానికి ఈ క్రింది విధానం అనుసరించాడు.
AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 2

  1. ఒక కాగితం కప్పు తీసుకొని దాని మధ్యన రంధ్రం చేసి, ఒక చిన్న గొట్టం అమర్చాడు.
  2. రెండు సెలైన్ గొట్టాలను తీసుకొని వాటిని రబ్బరు ట్యూబ్ తో కలిపాడు.
  3. రబ్బరు ట్యూబ్ ను కాగితం కప్పుకు అమర్చిన గొట్టానికి కలిపాడు.
  4. అందువలన Y ఆకారంలో సెలైన్ గొట్టాలు అమర్చబడ్డాయి.
  5. దానికి క్రిందుగా కాగితం కప్పు వ్రేలాడుతూ ఉంది.
  6. సెలైన్ పైపులను చెవిలో ఉంచుకొని గుండెపై కాగితం కప్పు ఆన్చి హృదయ స్పందనను వినవచ్చు.
  7. ఇది హృదయస్పందనను పరిశీలించే స్టెతస్కోలా పని చేస్తుంది.

ప్రశ్న 18.
పోషక కణజాలం ద్వారా మొక్కలలో ఆహారం రవాణా జరుగుతుందని తెలపడానికి శాస్త్రవేత్తలు ఏ ప్రయోగాన్ని చేశారో వివరించండి. (AS3)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 3

  1. ఎఫిడ్ లేత కాండం చుట్టూ గుమికూడి మొక్కరసాన్ని పీలుస్తాయి. రసం పీల్చడానికి ఎఫిడ్ పొడవుగా, సూదిమాదిరిగా ఉండే తొండాన్ని (Proboscis) మొక్క కణజాలంలోకి చొప్పిస్తుంది.
  2. రసాన్ని పీల్చేటప్పుడు ఎఫిడ్లని చంపి కాండం అడ్డుకోతను జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రోబోసిస్ పోషక కణజాలంలోని దారు నాళాల వరకు మాత్రమే చొచ్చుకుపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
  3. ప్రోబోసి లో ఉన్న రసాన్ని విశ్లేషించడానికి శాస్త్రవేత్తలు కింది ప్రయోగాన్ని చేశారు. మొక్క రసాన్ని పీల్చేటప్పుడే ఎఫిడ్ను చంపి ప్రోబోసిస్ భాగం పోషక కణజాలంలో ఉండే విధంగా ఎఫిడ్ శరీర భాగాన్ని వేరుచేశారు.
  4. పోషక కణజాలంలోని స్వల్ప పీడనం వల్ల కోసిన ప్రోబోసిస్ మొక్క నుండి కీటకం ఆహారాన్ని సేకరించుట భాగం గుండా రసం చుక్కల రూపంలో కారుతుండడాన్ని గుర్తించారు.
  5. ఈ ద్రవరూప చుక్కలని సేకరించి విశ్లేషించగా అందులో చక్కెరలు మరియు ఆమైనో ఆమ్లాలు ఉన్నాయని తెలిసింది.

ప్రశ్న 19.
ఎఫి పై శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల సారాంశం ఏమిటి?
జవాబు:
ఎఫి పై శాస్త్రవేత్తల ప్రయోగాల వలన ఈ క్రింది అంశాలు నిర్ధారించారు.

  1. మొక్కలలో పోషక కణజాలం రవాణా ప్రక్రియలో పాల్గొంటుంది.
  2. ఆహార పదార్థాలు పోషక కణజాలం ద్వారా రవాణా అవుతాయి.
  3. పోషక కణజాలం కాండం పరిధీయ భాగంలో ఉంటుంది.
  4. సాధారణంగా పోషక కణాలలో ప్రసరణ అధోముఖంగా ఉంటుంది.
  5. పోషక కణజాలంలో పోషక ద్రవం కొంత వత్తిడితో ప్రసరిస్తుంది.
  6. చాలా కీటకాలు, పోషణ కొరకు పోషక కణజాలంపై ఆధారపడతాయి.
  7. కీటకాలు ప్రొబోసిస్ ద్వారా పోషక కణజాలం నుండి ఆహారం గ్రహిస్తాయి.
  8. పోషక కణజాలం కోసం కొన్ని క్షీరదాలు మొక్కలకు హానిచేస్తాయి.

ప్రశ్న 20.
మీ పాఠశాలలో ఉండే ఉపాధ్యాయుల లేదా మీ ఇంటి చుట్టుపక్కల ఉండే వారి రక్తపీడన సమాచారాన్ని సేకరించండి. వారిలో ఎక్కువ రక్తపీడనం (high B.P), తక్కువ రక్తపీడనం (low B.P.) గలవారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి నివేదిక రాయండి. (AS4)
జవాబు:
మా ఇంటి చుట్టుప్రక్కల ఉన్నవారి వద్ద నుండి రక్తపీడన సమాచారం సేకరించాను. వీరిలో కొందరు అధిక రక్తపీడనం కలిగి ఉంటే మరికొందరు తక్కువ రక్తపీడనం కలిగి ఉన్నారు.

అధికరక్తపీడనం :
రక్త పీడనం విలువ 120/80 కంటే అధికంగా ఉంటే దానిని అధిక రక్తపీడనం అంటారు. అధిక రక్తపీడనం గల వ్యక్తులు

  1. గుండె దడ కలిగి ఉంటారు.
  2. ఒక్కొక్కసారి కోపంతో ఊగిపోతారు.
  3. చెమటలు పట్టి నియంత్రణ కోల్పోతారు.
  4. చిన్నపనులకు అలసిపోతారు.
  5. వీరు మూత్రపిండ సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నారు.

అల్పరక్తపీడనం :
రక్తపీడనం విలువ 120/80 కంటే తక్కువగా ఉంటే దానిని అల్పరక్తపీడనం అంటారు. వీరు

  1. నీరసంగా, తల తిరుగుడు వంటి లక్షణాలు కలిగి ఉన్నారు.
  2. నాడీ స్పందన తక్కువగా ఉంటుంది.
  3. నీరసంతో పడిపోతుంటారు.
  4. చెమటలు పట్టటం, గుండెదడ ఉంటుంది.

ప్రశ్న 21.
ఏకవలయ, ద్వంద్వవలయ రక్తప్రసరణను తెలియజేసే పటం గీసి, రెండింటి మధ్య తేడాలు రాయండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 4

ఏకవలయ ప్రసరణ ద్వివలయ ప్రసరణ
1. గుండె ద్వారా రక్తము ఒకేసారి ప్రసరణ జరిగితే దానిని ఏకవలయ ప్రసరణ అంటారు. 1. రక్తం హృదయం ద్వారా రెండుసార్లు ప్రసరిస్తే దాన్ని ద్వివలయ ప్రసరణ అంటారు.
2. దీని యందు పుపుస ప్రసరణ వుండదు. 2. ఒకసారి హృదయం నుండి ఊపిరితిత్తుల మధ్య, రెండవసారి హృదయం, శరీర భాగాల మధ్య రక్తము ప్రసరించును.
3. నాలుగు గదుల గుండెగల జీవులలో ఇది జరుగును. 3. రెండు గదుల గుండె గల జీవులలో ఈ రక్త ప్రసరణ జరుగును.
. 4. ద్వివలయ ప్రసరణ కప్ప నుండి అభివృద్ధి చెందిన జీవుల లో జరుగును. 4. ఏకవలయ ప్రసరణము చేపల వంటి జీవులలో జరుగును.

ప్రశ్న 22.
ఆకుల గుండా జరిగే బాష్పోత్సేకాన్ని, వేళ్ళ గుండా జరిగే నీటి శోషణను తెలియజేసే నమూనా పటం గీయండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 5

ప్రశ్న 23.
మానవునిలో విస్తరించి ఉన్న రక్తప్రసరణ వ్యవస్థ నిర్మాణాన్ని నీవు దేనితో పోలుస్తావు? (AS6)
జవాబు:

  1. మానవుని రక్తప్రసరణ వ్యవస్థలో ప్రధానంగా 1. హృదయం 2. రక్తనాళాలు 3. రక్తం అనే భాగాలు ఉంటాయి.
  2. వీటి పని విధానం మా ఇంటిలోని నీటి సరఫరా వ్యవస్థను పోలి ఉంటుంది.
  3. ఇంటిలో మోటారు, నీటిని పంపు చేస్తుంది. ఇది రక్తప్రసరణ వ్యవస్థలోని గుండెతో పోల్చవచ్చు.
  4. నీరు ఎక్కడా బయటకు రాకుండా పైపులలో ప్రవహిస్తుంది. ఈ నీటి పైపులను శరీరంలోని రక్తనాళాలతో పోల్చవచ్చు.
  5. నీటి పైపు లోపల నీరు పీడనం కలిగిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది. దీనిని రక్తనాళాలలో ప్రవహిస్తున్న రక్తంతో పోల్చవచ్చు.

ప్రశ్న 24.
ఎత్తైన చెట్లలో జరిగే ప్రసరణ వ్యవస్థను గమనించినపుడు నీకు ఏమి అనిపిస్తుంది? (AS6)
జవాబు:

  1. ఎత్తైన చెట్లలో జరిగే ప్రసరణ వ్యవస్థను గమనించినపుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది.
  2. ఇంత ఎత్తుకు, గురుత్వ ఆకర్షణ శక్తిని అధిగమించి నీరు పైకి ఎలా లాగబడుతుందని అన్న ఆలోచన కలుగుతుంది.
  3. రెండు అంతస్తుల బిల్డింగ్ పైకి నీటిని పంపటానికి, 1. హావర్స్ మోటార్ వాడుతున్నాం. అంతకు రెండు రెట్లు ఎత్తు ఉన్న చెట్ల పైకి నీరు పంపడానికి ఎంత హార్స్ పవర్స్ అవసరమోగదా అనిపిస్తుంది.
  4. చిన్నచిన్న నాళాలలో, ఇంత ఎత్తుకు నీటిని పంపడం ప్రకృతి యొక్క గొప్పతనంగా భావించి అభినందిస్తాను.
  5. ప్రకృతిలోని ఈ యంత్రాంగం అమరిక, ఒక విశేషంలా తోస్తుంది.
  6. ప్రకృతిలో ఇటువంటి ప్రక్రియలను పరిశీలించినపుడు, ప్రకృతి అద్భుత మేధావిలాగా అనిపిస్తుంది.

AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 25.
హృదయస్పందనపై హాస్యాన్ని కలిగించే ఏదైనా ఒక కార్టూన్ ను తయారుచేయండి. (AS7)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 6

ప్రశ్న 26.
ఈ పాఠం చదివిన తరువాత ప్రయాణ సమయాల్లో కాళ్ల వాపు గురించి మీ పెద్దలకు నీవు ఏమి సలహాలిస్తావు? (AS7)
జవాబు:

  1. ఎక్కువసేపు కాళ్లు క్రిందకు వ్రేలాడదీసి కూర్చోటం వలన కణజాల ద్రవం పైకి రవాణా కాదు. అందువలన కాళ్ళ వాపు వస్తుంది. దీనిని ఎడిమా అంటారు.
  2. ఎడిమా ప్రధానంగా పెద్దవారిలో స్పష్టంగా కనిపిస్తుంది.
  3. ఎడిమా నివారించటానికి ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలి.
    ఎ) కాళ్ళను. కొంచెం ఎత్తులో పెట్టుకోవాలి.
    బి) కాళ్ళను వ్రేలాడ వేయకుండా, చాపుకొనే ఏర్పాటు చూచుకోవాలి.
    సి) మధ్య మధ్యలో నిలబడటంగాని, అటు ఇటూ కొంచెం సేపు నడవటం గాని చేయాలి.
    డి) కాళ్ళను మధ్యలో కదిలిస్తూ ఉండాలి.
    ఇ) ఒకే భంగిమలో కూర్చోకుండా భంగిమలు మార్చుతూ ఉండాలి.

10th Class Biology 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ Textbook InText Questions and Answers

10th Class Biology Textbook Page No. 60

ప్రశ్న 1.
ధమనులు, సిరల అడ్డుకోతకు రక్తప్రవాహ వేగానికి సంబంధం ఏమైనా ఉందా?
జవాబు:

  1. ధమనులలో హృదయస్పందన వలన రక్తం చాలా వేగంగా ఎక్కువ ఒత్తిడితో ప్రసరిస్తుంది. అందువలన దానిగోడలు ఆ’ మందంగా ఉన్నాయి.
  2. సిరలలో రక్త ప్రవాహ వేగం తక్కువ. కావున గోడలు పలుచగా ఉన్నాయి.

ప్రశ్న 2.
ఏ రక్తనాళాలలో కవాటాలు ఉంటాయి ? కవాటాల ఉపయోగం ఏమిటి ?
జవాబు:
సిరలు కవాటాలను కలిగి ఉన్నాయి. సిరలలో రక్తం గుండెవైపు ఏక మార్గంలో గురుత్వ ఆకర్షణను అధిగమించి ప్రయాణించవలసి ఉంటుంది. కావున రక్తం వెనుకకు రాకుండా ఈ కవాటాలు నిరోధిస్తుంటాయి.

ప్రశ్న 3.
చేతికి బిగుతుగా కట్టు కట్టినపుడు గుండెకు దూరంగా ఉన్న వైపున రక్తనాళాలు ఎందుకు ఉబ్బుతాయి?
జవాబు:
సిరలు గుండెకు రక్తాన్ని తీసుకొని వస్తాయి. చేతికి బిగుతుగా కట్టునప్పుడు వాటిలోని ప్రవాహం నిరోధించబడి, ఉబ్బి స్పష్టంగా కనిపిస్తాయి.

ప్రశ్న 4.
శరీరంలో లోపలివైపున ఉన్న రక్తనాళాలను (ధమనులను) బంధించినపుడు అవి హృదయం వైపు ఉబ్బటానికి కారణం ఏమిటి?
జవాబు:
శరీరం లోపలివైపున ఉన్న రక్తనాళాలను ధమనులు అంటారు. ఇవి హృదయం నుండి రక్తాన్ని తీసుకొని వెళతాయి. కావున వీటిని బంధించినపుడు రక్తనాళాలలో రక్తం పెరిగి, హృదయం వైపు ఉబ్బి స్పష్టంగా కనిపిస్తాయి.

ప్రశ్న 5.
గుండెలో కర్ణికలు, జఠరికల మధ్య కవాటాలు ఉంటాయి. ఈ కవాటాల వలన, సిరలలో ఉండే కవాటాల వలన కలిగే ప్రయోజనం ఒకటేనని నీవు భావిస్తున్నావా?
జవాబు:
కవాటాలు రక్తాన్ని ఏక మార్గంలో ప్రసరింప చేయటానికి తోడ్పడతాయి. దీనికి వ్యతిరేకమార్గంలో ప్రసరణ నిరోధిస్తాయి. గుండెలోని కవాటాలు, సిరలలోని కవాటాల వలన కలిగే ప్రయోజనం ఒక్కటే.

AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 6.
ధమనులు శరీరం లోపలి భాగంలో ఉంటే, సిరలు శరీరంలో పరధీయ భాగాలలో ఎందుకుంటాయో ఊహించండి.
జవాబు:

  1. ధమనుల యొక్క రక్తనాళాలపై పీడనం ఎక్కువ మరియు అవి గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకొని వెళతాయి. అందువలన శరీరం లోపలి భాగంలో ఉంటాయి.
  2. సిరలు యొక్క రక్తనాళాలపై పీడనం తక్కువ మరియు అవి శరీర భాగాల నుండి గుండెకు రక్తాన్ని చేరుస్తాయి. అందువలన సిరలు శరీరంలో పరధీయ భాగాలలో ఉంటాయి.

10th Class Biology Textbook Page No. 61

ప్రశ్న 7.
ధమనులు, సిరలు గురించి ఈ క్రింది పట్టిక పూరించండి.
(లేదా)
విలియం హార్వే అందించిన సమాచారం ప్రకారం ఈ క్రింది పట్టికను పూరింపుము.
జవాబు:
AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 13

10th Class Biology Textbook Page No. 63

ప్రశ్న 8.
పటం (ఎ) మరియు పటం (బి)లను గమనించండి.

పటాలలో ఎక్కడనుండైనా మొదలు పెట్టి బాణపుగుర్తుల మార్గంలో మీ పెన్సిల్ ను కదపండి. మీ మార్గంలో వచ్చిన భాగాలను చక్రీయంగా గుర్తించండి. రెండు ఫ్లోచార్టులను గమనించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. పటాలలో వివిధ శరీర భాగాలను గుర్తించే ప్రయత్నం చేయండి.
AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 14
1. పటం(ఎ) లో మీ పెన్సిల్ శరీర భాగాల ద్వారా ఎన్నిసార్లు ప్రయాణించింది?
జవాబు:
పటం-(ఎ) లో పెన్సిల్ శరీర భాగాల ద్వారా ఒకసారి ప్రయాణించింది.

2. పటం(బి) లో మీ పెన్సిల్ గుండె ద్వారా ఎన్ని సార్లు ప్రయాణించింది?
జవాబు:
పటం-(బి) లో పెన్సిల్ గుండె ద్వారా రెండు సార్లు ప్రయాణించింది.

3. పటం(బి) లో మీ పెన్సిల్ ఊపిరితిత్తుల ద్వారా ఎన్నిసార్లు ప్రయాణించింది?
జవాబు:
పటం(బి) లో పెన్సిల్ ఊపిరితిత్తుల ద్వారా ఒకసారి ప్రయాణించింది.

10th Class Biology Textbook Page No. 64

ప్రశ్న 9.
కాళ్ళలో ఎందుకు ఇలా వాపు వస్తుంది?
జవాబు:
ఎక్కువ సేపు ప్రయాణం చేస్తూ కూర్చున్నప్పుడు కాళ్ళలో చేరిన కణజాల ద్రవం పైకి సరఫరా చేయబడక కాళ్ళలో నిల్వ ఉంటుంది. అందువలన కాళ్ళు ఉబ్బిన వాపు కనిపిస్తుంది. ఈ లక్షణాన్ని ఎడిమా అంటారు. కొద్దిపాటి కదలికల వలన ఈ పరిస్థితి సర్దుబాటు అవుతుంది.

10th Class Biology Textbook Page No. 68

ప్రశ్న 10.
మొక్కలలో కూడా జంతువుల మాదిరిగా రక్తప్రసరణ వ్యవస్థ ఏదైనా ఉందా?
జవాబు:
మొక్కలలో కూడా రవాణా కొరకు ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది. ఇది పొడవైన నాళాలు కలిగి పదార్థ రవాణాను నిర్వహిస్తాయి. ఈ నాళికా కణజాలాన్ని ‘నాళికాపుంజం’ అంటారు. దీనిలో రెండు రకాల కణజాలం ఉంటుంది. పెద్ద నాళాలు కలిగి కణజాలం నీటి రవాణాలో పాల్గొంటుంది. దీనిని దారువు అంటారు. దారువు క్రింది కణజాలం తక్కువ పరిమాణంతో కూడిన నాళాలు కలిగి ఉంటుంది. దీనిని పోషకకణజాలం అంటారు. ఇది ఆహార పదార్థాల రవాణాలో పాల్గొంటుంది.

ప్రశ్న 11.
వేర్లు నేలలోని ఖనిజ లవణాలను శోషిస్తుందని మనకు తెలుసు కాని ఇది ఎలా సాధ్యమవుతుంది?
ఎ) దీని వెనుకనున్న యాంత్రికం ఏమిటి?
జవాబు:
ఖనిజలవణాల శోషణలో మొక్కలు కొన్నిసార్లు కణద్రవ్య శక్తిని వినియోగిస్తాయి. దీనిని ‘సక్రియా శోషణ’ అంటారు.

బి) వేర్లు నీటితో నేరుగా సంబంధాన్ని ఏర్పరుచుకుంటాయా?
జవాబు:
వేర్లు సన్నని మూలకేశాలను కలిగి ఉండి నీటితో సంబంధాన్ని కలిగి ఉంటాయి.

సి) నీరు ఎలా శోషించబడుతుంది?
జవాబు:
మూలకేశాలు నీటిని పీల్చుకోవటం ద్వారా కణాలలోని దారువు కణజాలంలోకి నీరు శోషించబడుతుంది. ఈ ప్రక్రియలో విసరణ, ద్రవాభిసరణ వ్యవస్థలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

10th Class Biology Textbook Page No. 71

ప్రశ్న 12.
బాష్పోత్సేకానికి, వర్షపాతానికి ఏమైనా సంబంధం ఉందా?
జవాబు:
బాష్పోత్సేకం వలన గాలిలో తేమ అధికంగా చేరుతుంది. తేమ ఉన్న గాలి వర్షాన్ని కలిగిస్తుంది. కావున మొక్కలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో (అడవులలో) వర్షపాతం కూడా అధికం.

10th Class Biology Textbook Page No. 73

ప్రశ్న 13.
మీ పరిసరాలలో ఏవైనా చెట్లు, మొక్కల బెరళ్ళను జంతువులు తొలచివేశాయా? పరిశీలించండి. వాటి జాబితా రాయండి. మీ జాబితాలో చెట్లు ఏ జాతికి చెందినవి, నష్టం ఎంత, నష్టం ఈ మధ్యనే జరిగిందా, పాతదా, కాండం మీద గీరినట్లుగా జంతువుల పళ్ళగాట్ల గుర్తులు కనిపిస్తున్నాయా?
జవాబు:
మా పరిసరాలలోని జామ, మామిడి చెట్లపై ఎలుక కొరికిన గీతలు, గాట్లు గమనించాను. కొన్నిసార్లు ఎలుకలు చెట్ల వేర్లను కొరకటం వలన చెట్లు మరణిస్తాయని మా పెద్దలు చెప్పారు.

ప్రశ్న 14.
ధమనుల గోడలు దృఢంగా, స్థితిస్థాపక శక్తి కలిగి ఉంటాయి. ఎందుకు?
జవాబు:
ధమనులు గుండె నుండి రక్తాన్ని తీసుకొనిపోతాయి. హృదయస్పందన వలన ధమనులలో రక్తపీడనం అధికంగా ఉంటుంది. ఈ పీడనాన్ని భరించటానికి ధమనుల గోడలు దృఢంగా ఉండి స్థితిస్థాపకతను కలిగి ఉంటాయి. పీడనం పెరిగినపుడు ధమనులు వ్యాకోచించి పీడనాన్ని తట్టుకొంటాయి.

AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

ప్రశ్న 15.
ధమనులను శాఖలుగా విస్తరించిన చెట్టుతో పోల్చుతారు. ఎందుకు?
జవాబు:
చెట్టు మొదటిలో ఒకే కాండం కలిగి ముందుకు వెళ్ళేకొలది అనేక శాఖలుగా చీలిపోయి విస్తరిస్తుంది. మన రక్తప్రసరణ వ్యవస్థలో ధమని కూడా గుండె ‘నుండి బయలు దేరి ముందుకు సాగే కొలది అనేక శాఖలుగా చీలి విస్తరిస్తుంది. అందువలన ధమనులను శాఖలుగా విస్తరించిన చెట్లతో పోల్చుతారు.

ప్రశ్న 16.
ధమనులతో పోల్చితే, సిరలలో రక్త ప్రవాహ మార్గం (lumen) పరిమాణం పెద్దదిగా ఉంటుంది. ఎందుకు?
జవాబు:
ధమనులలో, హృదయస్పందన వలన ఒత్తిడి ఉండుటవలన రక్తం బలంగా నెట్టబడుతుంది. కాని సిరలలో ప్రవేశించే రక్తంలో ఇటువంటి ఒత్తిడి ఉండదు. రక్తం స్వేచ్ఛగా ప్రసరించాలంటే సిరలలో కుహర పరిమాణం పెద్దదిగా ఉండాలి. అంతేగాక సిరల లోపల కవాటాలు స్థలాన్ని ఆక్రమిస్తాయి. కావున సిరలలో కుహర పరిమాణం పెద్దదిగా ఉంటుంది.

10th Class Biology 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ Textbook Activities (కృత్యములు)

కృత్యం -1

→ డాక్టరుగారి లాగే మీరు కూడా హృదయస్పందనను లెక్కించవచ్చు. బొమ్మలో చూపిన విధంగా మీ చూపుడు వేలు, మధ్య వేళ్ళను మణికట్టు లోపలి వైపుకు బొటనవేలును మణికట్టు కిందివైపుకు కొంచెం నొక్కిపెట్టినట్లుగా పటంలో చూపిన విధంగా ఉంచండి.
1) మీరు ఏం గమనించారు?
జవాబు:
లోపల నుండి లయబద్ధంగా మీ వేళ్ళను ఏదో తోస్తున్నట్లుగా అనిపిస్తోంది కదూ! ఈ లయనే ‘నాడీ స్పందన’ (Pulse) అంటాం.
AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 7

2) ఒక నిమిషానికి ఎన్ని స్పందనలు వస్తున్నాయో లెక్కించండి.
జవాబు:
నిముషానికి 72 సార్లు స్పందనలు గుర్తించాను.

ఇప్పుడు లేచి నిలబడి ఒక నిముషం పాటు ‘జాగింగ్’ చేయండి. మరలా ఒక నిమిషం పాటు నాడీ స్పందనను లెక్కించండి. మీ తరగతిలోని కొందరు విద్యార్థుల నాడీ స్పందనలను లెక్కించండి. ఇలా మూడు నమూనాలను లెక్కించి కింది పట్టికలో నమోదు చేయండి.
AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 8
AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 9

3) మీరు ఏం గమనించారు? విశ్రాంతిలోను, జాగింగ్ తర్వాత నాడీ స్పందన ఒకే విధంగా ఉందా?
జవాబు:
లేదు, జాగింగ్ తరువాత నాడీస్పందన రేటు పెరిగింది.

కృత్యం – 2

→ నాడీస్పందన రేటు వ్యక్తికి వ్యక్తికి మరియు సందర్భాన్ని బట్టి మారటాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి నాడీస్పందన స్థిరంగా ఉండదని, మనం భయపడినపుడు, ఉద్రేకపడినపుడు నాడీస్పందనరేటు పెరుగుతుందని అర్థమవుతోంది కదూ! మరికొన్ని సందర్భాలలో కూడా ఇలాంటి పరిస్థితిని గమనించవచ్చు. ఉదాహరణకు మనం మెట్లు ఎక్కేటపుడు, పరిగెత్తేటపుడు నాడీ స్పందనను పరిశీలించండి.

హృదయస్పందన, నాడీ స్పందనల మధ్య గల సంబంధాన్ని గురించి మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాడీస్పందనను మరొక విధంగా కూడా గుర్తించవచ్చు. కింది కృత్యాన్ని చేయండి.

ఇందుకోసం మీ సొంత స్టెతస్కోపును తయారుచేసుకోండి. ఒక చొక్కా గుండీని తీసుకోండి. అగ్గిపుల్లను నిటారుగా నిలబడేటట్లుగా గుండీ రంధ్రంలోకి చొప్పించండి. గుండీని మణికట్టు లోపలివైపున పటంలో చూపిన విధంగా ఉంచండి. అగ్గిపుల్లలో కదలికలను జాగ్రత్తగా గమనించండి. దీని సహాయంతో నాడీ స్పందనను లెక్కించండి.
AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 10
1) మీరు ఏమి గమనించారు?
జవాబు:
అగ్గిపుల్లలో కదలికలు గమనించాను.

2) మన నాడీ స్పందన ఎప్పుడు అధికమవుతుంది?
జవాబు:
జాగింగ్, వాకింగ్ తరువాత నాడీ స్పందన పెరిగింది.

3) నాడీ స్పందన దేనిని తెలియజేస్తుంది?
జవాబు:
నాడీ స్పందన హృదయస్పందనను తెలియజేస్తుంది.

కృత్యం – 3

→ లెన్నెక్ చేసిన ప్రయోగాన్ని మనమూ చేద్దాం. 10 అంగుళాల పొడవు, ఒక అంగుళం వ్యాసం ఉండేట్లుగా ఒక కాగితపు గొట్టాన్ని తయారుచేయండి. మీ స్నేహితుని మెడ నుండి ఆరంగుళాల కిందుగా, రొమ్ము మధ్య భాగానికి ఒక అంగుళం ఎడమవైపున కాగితపు గొట్టం ఒక చివరను ఆనించండి. రెండవ చివర చెవి ఉంచి జాగ్రత్తగా వినండి. ఒక నిమిషంలో ఎన్నిసార్లు హృదయం స్పందిస్తోందో లెక్కించండి. కనీసం పది మంది విద్యార్థుల హృదయస్పందనలను, నాడీస్పందనలను లెక్కించి కింది పట్టికలో నమోదు చేయండి.
AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 11
AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ 12

పై అంశాల ఆధారంగా హృదయస్పందన, నాడీస్పందనల మధ్య గల సంబంధాన్ని తెలియజేసే గ్రాఫ్ (Histogram) గీయండి. నమూనా గ్రాఫ్ ను పరిశీలించండి. అందులో నీలిరంగు పట్టీలు (a) హృదయ స్పందనను, ఎరుపురంగు పట్టీలు (b) నాడీస్పందనను తెలియజేస్తాయి.
→ హృదయస్పందనకు, నాడీ స్పందనకు మధ్య గల సంబంధం ఏమిటి?
జవాబు:
హృదయస్పందన రేటు నాడీ స్పందన రేటుకు సమానంగా ఉంది.

→ హృదయస్పందన రేటు, నాడీ స్పందన రేటు ఎప్పుడూ సమానంగా ఉంటాయా?
జవాబు:
ఔను, నాడీస్పందన రేటు, ఎల్లప్పుడూ హృదయస్పందన రేటుకు నిముషానికి సమానం.

పై పరిశీలనలను బట్టి రెండింటి మధ్య సంబంధం ఉన్నదని తెలుస్తోంది కదూ!

కృత్యం – 4

→ ధమనులు, సిరల పనితీరును పరిశీలించడానికి కింది కృత్యాలు చేయండి.

కాలుమీద కాలువేసుకొని బల్ల మీద కూర్చొండి. ఈ స్థితిలో ఒక మోకాలు మీద మరొక మోకాలు ఆని ఉంటుంది. ఒక పాదం నేలకు ఆని ఉంటే మరొక పాదం గాలిలో తేలుతున్నట్లు ఉంటుంది. ఇలా కొంచెంసేపు కూర్చుంటే హృదయస్పందనలకు లయబద్ధంగా కాలిలో కదలికలు రావడాన్ని మీరు గమనించవచ్చు.

ఇదే భంగిమలో చాలాసేపు కూర్చుంటే వేలాడుతున్న కాలు బరువెక్కినట్లు, సూదులు గుచ్చుతున్నట్లు, తిమ్మిరెక్కినట్లు అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో కారణాలు మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
జవాబు:
కాలు మడిచి కూర్చున్నప్పుడు, మడిచిన క్రింది భాగాలకు రక్త సరఫరా తగ్గుతుంది. అందువలన కణజాలానికి సరిపడినంత ఆక్సిజన్ అందదు. కణజాలంలో ఏర్పడిన ఆక్సిజన్ కొరత వలన తిమ్మిరెక్కినట్లు అనిపిస్తుంది. నిటారుగా నిలబడినపుడు తిరిగి రక్తప్రసరణ పునరుద్ధరింపబడి, తిమ్మిరి తగ్గుతుంది.

చేతిలో సిరలు రక్తంతో నిండి ఉబ్బేలా చేతిని గిరగిరా తిప్పండి. తరువాత చేతిని కిందికి జారవిడవండి. పైకి కనిపిస్తున్న సిరను మెల్లగా వేలితో నొక్కండి. వ్యతిరేకదిశలో రక్తం ప్రవహించడాన్ని గమనించవచ్చు. కవాటాలకు వ్యతిరేక దిశలో రక్తం ప్రవహిస్తూ సిర ఉబ్బినట్లుగా మీరు గమనించారా? ఇలా ఎందుకు జరుగుతుందో కారణాలను మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
జవాబు:
సిరలలో రక్తప్రసరణ గుండెవైపుకు ఉంటుంది. రక్తం వెనుకకు ప్రయాణించకుండా సిరలలోని కవాటాలు నిరోధిస్తాయి. చేతిని గిరగిరా తిప్పినపుడు అపకేంద్రబలం వలన రక్తం వెనుకకు నెట్టబడి సిర ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. తరువాత తిరిగి రక్త ప్రసరణ పునరుద్ధరించబడి సాధారణ స్థితి నెలకొంటుంది.

కృత్యం – 5: మూలకేశాల శోషణ

→ ఈ కృత్యాన్ని నిర్వహించడానికి సజ్జలు లేక ఆవాల విత్తనాలను మొలకెత్తించాలి. తడి అద్దుడు కాగితంపై పెంచిన ఆవాల మొలకలను తీసుకుని పరీక్షించండి. వేర్ల నుండి బయలుదేరిన సన్నని దారాల వంటి నిర్మాణాలను భూతద్దంతో పరిశీలించండి. వీటినే మూలకేశాలు అంటారు. వాటి ద్వారా నీరు మొక్కలలోకి ప్రవేశిస్తుంది. కొంత వేరు భాగాన్ని తీసుకుని దానిపై కొద్దిగా పొడి నీటి చుక్కను వేయండి. కవర్‌ స్లితో కప్పి చిదిమినట్లు అయ్యేలా నెమ్మదిగా నొక్కి సూక్ష్మదర్శినిలో పరీక్షించండి.
→ మీరు ఏం గమనించారు?
జవాబు:
సన్నగా పొడవైన నిర్మాణాలు కనిపించాయి. ఇవి ఒక కణ మందంతో పొడవుగా ఉన్నాయి. ఈ నాళాలు నీటి రవాణాలో పాల్గొంటాయి.

AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

కృత్యం – 6 : వేరు పీడనం

→ నీటి మట్టంలో పెరుగుదల గమనించారా?
జవాబు:
ఔను. నీరు M1 నుండి M2 కు పెరిగింది.

→ ఈ చర్యలో దారువు పాత్ర ఏమిటి?
జవాబు:
దారువు ద్వారా నీరు రవాణా జరుగుతుంది. నీటి అణువుల మధ్య ఆకర్షణ బలాల వలన దారునాళాల గోడలలో నీరు పైకి లాగబడి, నీటి స్తంభం ఏర్పడుతుంది.

ప్రయోగశాల కృత్యం

ఉద్దేశం : క్షీరదాల గుండె అంతర్నిర్మాణాన్ని పరిశీలించడం.

క్షీరదాలన్నింటిలో గుండె నిర్మాణాత్మకంగా ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి మనం ప్రయోగశాలలో గొర్రె లేక మేక గుండెను పరిశీలన కోసం తీసుకుందాం.

కావలసిన పరికరాలు :
గొర్రె లేక మేక తాజా గుండె, సోడా స్ట్రాలు, పదునైన బ్లేడు లేదా స్కాల్ పెల్, డిసెక్షన్ ట్రే, ఒక మగ్గు నీరు, డిసెక్షన్ కత్తెర, ఫోర్సెప్స్.

పరిశీలనా పద్దతి :
మేక లేక గొర్రె తాజా గుండెను తీసుకొని గుండె గదులలో రక్తం లేకుండా శుభ్రం చేసి పరిశీలన కోసం సిద్ధం చేయాలి.

సోడా స్ట్రాలను కత్తిరింపబడిన రక్తనాళాలలోకి ప్రవేశపెట్టాలి. ఇలా సిద్ధం చేసిన గుండెను పరిశీలిస్తూ, పరిశీలనలను మీ నోటు పుస్తకంలో రాయండి.

→ గుండెను కప్పుతూ ఎన్ని పొరలున్నాయి? (పొరలను కత్తెరతో కత్తిరించి తీసివేయండి.)
జవాబు:
రెండు పొరలు ఉన్నాయి.

→ గుండె ఏ ఆకారంలో ఉంది?
జవాబు:
గుండె శంఖం ఆకారంలో ఉంది. పైభాగం వెడల్పుగా క్రింది భాగం మొనతేలి ఉంది.

→ గుండెకు అతుక్కుని ఎన్ని రక్తనాళాల చివరులున్నాయి?
జవాబు:
నాలుగు రక్తనాళాలు ఉన్నాయి.

→ గుండె యొక్క ఏ చివర వెడల్పుగా ఉంది? ఏ చివర సన్నగా ఉంది?
జవాబు:
పైభాగం వెడల్పుగా, క్రింది భాగం సన్నగా ఉంది.

→ గుండె గోడలు అంతటా ఒకే మందంతో ఉన్నాయా?
జవాబు:
లేవు. జఠరికలో గోడలు మందంగా ఉన్నాయి.

→ గుండెలో ఎన్ని గదులున్నాయి?
జవాబు:
గుండెలో నాలుగు గదులు ఉన్నాయి.

→ అన్ని గదులు ఒకే పరిమాణంలో ఉన్నాయా?
జవాబు:
లేవు.

→ గుండె గదుల మధ్య ఇంకేమైనా ప్రత్యేకతలను గమనించారా?
జవాబు:
కర్ణికలు వెడల్పుగా, జఠరికలు పొడవుగా ఉన్నాయి.

→ గుండె గదులన్నీ ఒకదానితో ఒకటి కలుపబడి ఉన్నాయా?
జవాబు:
లేదు.

→ గుండె గదులు ఒకదానితో ఒకటి ఎలా కలుపబడ్డాయి?
జవాబు:
గుండె గదులు విభాజక రంధ్రాల ద్వారా కలుపబడ్డాయి.

→ గుండె గదులు ఒకదానితో ఒకటి ఎలా వేరుచేయబడ్డాయి?
జవాబు:
గుండె గదుల విభాజకాల ద్వారా వేరు చేయబడ్డాయి.

→ గుండె కింది గదులలో తెల్లని నిర్మాణాలను గమనించారా? ఏ భాగాలకు అవి అతుకబడి ఉంటాయి?
జవాబు:
ఈ తెల్లటి నిర్మాణాలను స్నాయురజ్జువులు అంటారు. ఇవి జఠరిక కుడ్యం లోపలి వైపున అతుకబడి ఉన్నాయి.

→ గుండెకు ఎన్ని రక్తనాళాలు అతుకబడి ఉన్నాయి?
జవాబు:
గుండెకు నాలుగు రక్తనాళాలు అతుకబడి ఉన్నాయి.

→ అన్ని రక్తనాళాలు దృఢంగా ఉన్నాయా? ఎన్ని రక్తనాళాలు దృఢంగా ఉన్నాయి?
జవాబు:
లేవు. రెండు నాళాలు దృఢంగా ఉన్నాయి.

→ రక్తనాళాల దృఢత్వానికి, రక్తప్రసరణకు సంబంధం ఉందని నీవు భావిస్తున్నావా?
జవాబు:
ఔను. దృఢంగా ఉన్న రక్తనాళాలను ధమనులు అంటారు. ఇవి గుండె నుండి రక్తాన్ని తీసుకెళతాయి. గుండె కలిగించే ఒత్తిడిని భరించటానికి ఇవి దృఢమైన గోడలు కలిగి ఉంటాయి.

సరైన సమాధానాన్ని గుర్తించండి

1. కార్డియాక్ అన్న పదం మన శరీరంలో ఈ అవయవానికి సంబంధించినది.
A) గుండె
B) ధమని
C) లింఫ్ గ్రంథి
D) కేశనాళిక
జవాబు:
A) గుండె

2. గుండెలో ఏ భాగంలో ఉండే రక్తంలో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది? ‘
A) కుడి కర్ణిక
B) కుడి జఠరిక
C) ఎడమ కర్ణిక
D) ఎడమ జఠరిక
జవాబు:
A & B

3. కింది వానిలో ఏ భాగం రక్త ప్రసరణను నియంత్రిస్తుంది?
A) ధమని
B) సిర
B) సిర
C) కవాటం
D) కేశనాళిక
జవాబు:
C) కవాటం

4. ఈ క్రింది వానిలో సరియైనది
A) దారువు పోషక కణజాలం ఒకదానిపై ఒకటి నాళాకారంలో అమరి ఉంటాయని రవి చెప్పాడు.
B) దారువు పోషక కణజాలం వేరుగా ఉండే నాళాలు కాదని జాన్ అన్నాడు.
C) దారువు పోషక కణజాలం కలిసి నాళాకారంగా ఏర్పడుతాయి అని సల్మా చెప్పింది.
D) ఆకారాన్ని ఆధారంగా చేసుకుని వాటిని నాళాకార నిర్మాణాలని హరి చెప్పాడు.
జవాబు:
D) ఆకారాన్ని ఆధారంగా చేసుకుని వాటిని నాళాకార నిర్మాణాలని హరి చెప్పాడు.

AP Board 10th Class Biology Solutions 3rd Lesson ప్రసరణ – పదార్థ రవాణా వ్యవస్థ

5. ఎఫిడ్ తన తొండాన్ని మొక్కలో …………. లోనికి చొప్పించి రసాన్ని పీలుస్తుంది.
A) దారువు
B) పోషక కణజాలం
C) దవ్వ
D) నాళికాపుంజం
జవాబు:
B) పోషక కణజాలం

AP Board 10th Class Biology Solutions 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

AP Board 10th Class Biology Solutions 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

SCERT AP 10th Class Biology Guide Pdf Download 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Biology 2nd Lesson Questions and Answers శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

10th Class Biology 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కింది వాటి మధ్య తేడాలు రాయండి. (AS1)
ఎ) ఉచ్చ్వాసం-నిశ్వాసం
బి) వాయుసహిత-అవాయు శ్వాసక్రియ
సి) శ్వాసక్రియ దహనం
డి) కిరణజన్యసంయోగక్రియ-శ్వాసక్రియ
జవాబు:
ఎ) ఉచ్చ్వాసం-నిశ్వాసం :

ఉచ్ఛ్వా సం నిశ్వాసం
1. గాలిని లోపలికి పీల్చే ప్రక్రియను ఉచ్ఛ్వాసం అంటారు. 1. గాలిని బయటకు పంపే ప్రక్రియను నిశ్వాసం అంటారు.
2. బాహ్య శ్వాసక్రియలో ఇది మొదటి ప్రక్రియ. 2. బాహ్య శ్వాసక్రియలో ఇది రెండవ ప్రక్రియ.
3. ఈ దశలో ఉరఃకుహరం పరిమాణం పెరుగుతుంది. 3. ఈ దశలో ఉరఃకుహర పరిమాణం తగ్గుతుంది.
4. వెలుపలి గాలి ఊపిరితిత్తులలోనికి ప్రవేశిస్తుంది. 4. ఊపిరితిత్తులలోని గాలి బయటకు పంపబడుతుంది.
5. ఉచ్ఛ్వాస గాలిలో ఆక్సిజన్ పరిమాణం ఎక్కువ. 5. నిశ్వాస గాలిలో ఆక్సిజన్ పరిమాణం తక్కువ.
6. CO2, నీటిఆవిరి, పరిమాణం తక్కువ. 6. CO2, నీటి ఆవిరి పరిమాణం ఎక్కువ.

బి) వాయుసహిత-అవాయు శ్వాసక్రియ :

వాయుసహిత శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ
1. C6H1206 + 602 → 6H2O+ 6CO2 + 686 K.Cal 1. C6H12O6 → C2H5OH + 2CO2 + 56 K.Cal
2. ఆక్సిజన్ అవసరం ఉంటుంది. ఆక్సిజన్ లేకపోతే ఈ చర్య జరగదు. 2. దీనికి ఆక్సిజన్ అవసరం లేదు. ఆక్సిజన్ లేకుండా ఈ చర్య జరుగుతుంది.
3. ఈ చర్యలో కార్బన్ డై ఆక్సైడ్, నీరు ఏర్పడతాయి. 3. ఈ చర్యలో కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడుతుంది. నీరు ఏర్పడదు. ఇథనాల్ లేక లాక్టిక్ ఆమ్లం వంటివి ఉత్పత్తి అవుతాయి.
4. దీనిలో ఎక్కువ శక్తి ఉత్పన్నమవుతుంది. 4. దీనిలో అతి తక్కువ -శక్తి ఉత్పన్నమవుతుంది.
5. దీనిలో మైటోకాండ్రియాతో సంబంధం ఉంటుంది. 5. దీనిలో మైటోకాండ్రియా ప్రమేయం ఉండదు.
6. క్రెబ్స్ వలయము, ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. 6. క్రెబ్స్ వలయము, ఎలక్ట్రాన్ రవాణా ఇందులో జరగదు.
7. ఈ చర్యలో 38 ATP అణువులు ఏర్పడతాయి. 7. ఈ చర్యలో 2 ATP అణువులు ఏర్పడతాయి.
8. ఈ శ్వాసక్రియ ముఖ్యంగా ఉచ్ఛ్వాస, నిశ్వాసములు జరుపు అభివృద్ధి చెందిన జీవులలో జరుగుతుంది. 8. ఈ శ్వాసక్రియ ఈస్టు కణములు, క్లోస్ట్రీడియం, ఆ బాక్టీరియా లాంటి నిమ్నస్థాయి జీవులలో జరుగును.
9. ఈ చర్యలో గ్లైకాలసిస్ తరువాత క్రెట్స్ వలయము జరుగుతుంది. 9. ఈ చర్యలో గ్లైకాలసిస్ తరువాత కిణ్వప్రక్రియ జరుగుతుంది.

సి) శ్వాసక్రియ దహనం :
(లేదా)
శ్వాసక్రియ, దహనక్రియ రెండూ ఆక్సీకరణ చర్యలు అయినప్పటికీ, చాలా విషయాలలో విభేదిస్తాయి. వివరించండి.

శ్వాసక్రియ దహన క్రియ
1. శ్వాసక్రియలో బయట నుంచి వేడిమిని అందించవలసిన వేడిమిని అందిస్తాము. 1. దహన క్రియలో చక్కెర అణువులు మండటానికి అవసరం లేదు.
2. చక్కెర నల్లగా మారడం గాని, మండటం గాని జరగదు. 2. ఈ క్రియలో చక్కెర మొదట నల్లగా మారి ఆ తరువాత మంటతో మండుతుంది.
3. శ్వాసక్రియలో శక్తి వివిధ దశలలో నెమ్మదిగా విడుదలౌతుంది. 3. దహన క్రియలో శక్తి ఒక్కసారిగా వేడిమి రూపంలో విడుదలౌతుంది.
4. శ్వాసక్రియ నీటి సమక్షంలో ఉన్నప్పుడు జరుగుతుంది. 4. దహనం నీరు లేకుండా ఉన్నప్పుడు జరుగుతుంది.
5. శ్వాసక్రియలో అనేక యోగికాలు, మాధ్యమిక పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. 5. దహనక్రియలో మాధ్యమిక పదార్థాలు ఉత్పత్తి కావు.
6. ఈ చర్యకు ఎంజైములు అవసరము. 6. ఈ చర్యకు ఎంజైములు అవసరం లేదు.
7. శక్తి అంచెలంచెలుగా విడుదల అగును. 7. శక్తి అంతా ఒకేసారి విడుదల అవుతుంది.
8. నియంత్రిత చర్య. 8. నియంత్రణ శ్రమతో కూడుకున్నది.
9. రసాయనబంధాలు అంచెలంచెలుగా విచ్చిన్నమౌతాయి. 9. రసాయనబంధాలు ఒకేసారి విచ్ఛిన్నమౌతాయి.

డి) కిరణజన్యసంయోగక్రియ – శ్వాసక్రియ :

కిరణజన్యసంయోగక్రియ త్వాసక్రియ
1. వృక్షాలలో మరియు కొన్ని ఫోటోసింథటిక్ బాక్టీరియాల్లో జరుగును. 1. అన్ని జీవుల్లో జరుగును.
2. పగటిపూట మాత్రమే జరుగును. 2. అన్నివేళలా (పగలు, రాత్రి) జరుగును.
3. కిరణజన్యసంయోగక్రియ జరపకుండా మొక్క కొద్దిరోజులు జీవించగలదు. 3. శ్వాసక్రియ లేకుండా ఏ జీవీ కొద్దినిమిషాలు కూడా జీవించలేదు.
4. మొక్కల్లో కొద్ది కణాలు మాత్రమే కిరణజన్య సంయోగక్రియని జరుపుతాయి. 4. సజీవి శరీరంలో అన్ని కణాలు శ్వాసక్రియను జరుపుతాయి.
5. హరితరేణువుల్లో జరుగుతుంది. దీనికి సూర్యకాంతి అవసరం. 5. వాయుసహిత శ్వాసక్రియ జీవపదార్థం, మైటోకాండ్రియాలలో జరుగును. దీనికి సూర్య కాంతి అవసరం లేదు.
6. ఈ చర్యలో కాంతిశక్తి బంధించబడుతుంది. 6. ఈ చర్యలో శక్తి విడుదలవుతుంది.
7. కార్బన్ డై ఆక్సైడ్, నీరు మూలపదార్థాలు/ ఆరంభ పదార్థాలు. 7. పిండిపదార్థాలు, కర్బన పదార్థాలు, ఆక్సిజన్’ వినియోగం అవుతాయి.
8. కార్బన్ డై ఆక్సైడ్, వినియోగం చెంది ఆక్సిజన్ విడుదల అవుతుంది. 8. ఆక్సిజన్ వినియోగం చెంది, కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది.
9. జీవి బరువుని పెంచుతుంది. 9. జీవి బరువుని తగ్గిస్తుంది.
10. వికిరణ కాంతిశక్తిని, రసాయనిక శక్తిగా మారుస్తుంది. 10. రసాయనశక్తిని గాని, గుప్తశక్తిని గాని ఇతర చర్యల కోసం విడుదల చేస్తుంది.
11. కాంతిశక్తిని ఉపయోగించి ATP ని ఉత్పత్తి చేస్తుంది. (కాంతి భాస్వీకరణము) 11. గ్లూకోజును ఆక్సీకరణం చేసి ATP ని ఉత్పత్తి. చేస్తుంది. (ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్)
12. నీటి అణువులోని హైడ్రోజన్ ని ఉపయోగించుకొని NADP ని NADPH2 గా క్షయకరణం చేస్తుంది. 12. NADH2, పిండిపదార్థాలలోని హైడ్రోజన్ నుండి ఏర్పడుతుంది.
13. ATP, NADPH2 ముఖ్యంగా కర్బన సమ్మేళనాలు తయారీకి ఉపయోగపడతాయి. 13. ATP, NADH2 లు కణంలోని చర్యలకు ఉపయోగపడతాయి.
14. ఇది నిర్మాణాత్మక చర్య. 14. ఇది విచ్ఛిన్న క్రియ.
15.AP Board 10th Class Biology Solutions 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 1 15. C6H12O6 + 602 → 6C02 + 6H2O + 686 K.Cal
16. ఇది ఉష్ణగ్రాహక చర్య. 16. ఇది ఉష్ణమోచక చర్య.

AP Board 10th Class Biology Solutions 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 2.
వాయుసహిత, అవాయు శ్వాసక్రియలలో ఏవైనా రెండు పోలికలు రాయండి. (AS1)
జవాబు:
వాయుసహిత, అవాయు శ్వాసక్రియలో రెండింటిలోనూ

  1. శక్తి వెలువడుతుంది.
  2. రెండింటిలోనూ గ్లైకాలసిస్ ఉమ్మడి దశ
  3. రెండింటిలోనూ పదార్థం వినియోగించబడుతుంది.
  4. రెండు చర్యలలో ఎంజైమ్స్ పాల్గొంటాయి.
  5. రెండు చర్యలు జీవనియంత్రిత చర్యలు.

ప్రశ్న 3.
ఒక్కోసారి ఆహారం శ్వాసనాళంలోకి పోయి ఇబ్బంది కలిగిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది? (AS1)
జవాబు:
గ్రసని ఆహార, శ్వాస మార్గాల కూడలి. ఈ ప్రాంతంలో వాయు, ఆహార కదలికలను నియంత్రిస్తూ ‘ఉపజిహ్వ’ ‘ఉంటుంది. ఇది మనం ఆహారం తినేటప్పుడు వాయునాళాన్ని మూసివేస్తుంది. మనం మాట్లాడుతూ లేదా ఆలోచిస్తూ భోజనం చేస్తున్నప్పుడు ఈ ఉపజిహ్వ వాయునాళాన్ని సరిగా మూయదు. అందువలన ఆహారం శ్వాసనాళంలోనికి చేరి ‘కొర’ పోతుంది.

ప్రశ్న 4.
కొండలు, గుట్టల వంటి ప్రదేశాల్లో నెమ్మదిగా నడిచినప్పటికీ శ్వాసక్రియ వేగంగా జరగడానికి కారణాలు రాయండి. (AS1)
జవాబు:
కొండలు, గుట్టలు వంటి ఎత్తైన ప్రదేశాలలోని గాలిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. కావున శరీరానికి సరిపడేలా .. ఆక్సిజన్ అందించటానికి ఎక్కువసార్లు శ్వాసించవలసి ఉంటుంది. అందువలన శ్వాసక్రియ రేటు పెరుగుతుంది.

ప్రశ్న 5.
రక్తకేశనాళికలోకి చేరడానికి వీలుగా గాలి వాయుగోణులలో నిలువ ఉంటుంది. ఈ వాక్యంలో సరిచేయవలసిన అంశాలు ఏమిటి? (AS1)
జవాబు:
రక్తకేశనాళికలో వాయు వినిమయం జరగటానికి వీలుగా గాలి వాయుగోణులలో నిలువ ఉంటుంది అని సరిచేయాలి. ఎందుకంటే రక్తకేశనాళిలోనికి గాలి అంతా చేరదు. గాలిలోని ఆక్సిజన్ మాత్రమే రక్తంలోనికి విసరణ చేంది, రక్తం నుండి CO2 గాలిలోనికి విసరణ చెందుతుంది. దీనినే వాయు వినిమయం అంటారు.

ప్రశ్న 6.
మొక్కలు పగలు కిరణజన్యసంయోగక్రియను, రాత్రి శ్వాసక్రియను నిర్వర్తిస్తాయి. మీరు ఈ అంశాన్ని అంగీకరిస్తారా? (AS1)
(లేదా )
మొక్కలు పగలు కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి. రాత్రి శ్వాసక్రియను జరుపుతాయి అని బాలు చెప్పాడు అతనితో నీవు ఏకీభవిస్తావా, లేదా? ఎందుకు?
జవాబు:
ఈ అంశాన్ని నేను అంగీకరించటం లేదు. ఎందుకంటే కిరణజన్యసంయోగక్రియకు కాంతి అవసరం కనుక మొక్కలు కిరణజన్యసంయోగక్రియను పగలు నిర్వహిస్తాయి. అయితే శ్వాసక్రియ శక్తిని వెలువర్చే క్రియ. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. పై వాక్యంలో మొక్కలు, రాత్రి శ్వాసక్రియను నిర్వహిస్తాయని చెప్పారు, కావున నేను దీనిని మాత్రం అంగీకరించటంలేదు. మొక్కలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎల్లవేళలా శ్వాసక్రియను నిర్వహిస్తుంటాయి.

ప్రశ్న 7.
సముద్రాల లోపలికి వెళ్ళి ఈతకొట్టేవాళ్ళు, పర్వతారోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలెండర్లను తీసుకొని వెళతారు ఎందుకు? (AS1)
జవాబు:
నేల ఉపరితలం నుండి పైకి వెళ్ళే కొలది గాలి నందు ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. సముద్ర మట్టానికి 13 కి.మీ. ఎత్తున, కేవలం 5 వంతుల ఆక్సిజన్ మాత్రమే లభ్యమౌతుంది. ఈ ఆక్సిజన్ శ్వాసించటానికి సరిపోదు కావున పర్వతారోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలెండర్లను తీసుకెళతారు.

సముద్రాలలోనికి వెళ్ళేవారు, నీటి నుండి ఆక్సిజన్‌ను గ్రహించలేరు. అంత లోతు నుండి ఆక్సిజన్ కోసం పైకి రాలేరు . కావున వారు తమవెంట ఆక్సిజన్ సిలెండర్లను తీసుకెళతారు.

ప్రశ్న 8.
గరిష్ఠ స్థాయిలో వాయు వినిమయం జరగడానికి వీలుగా వాయు గోణులు ఎలా మార్పు చెందాయో రాయండి. (AS1)
జవాబు:
వాయుగోణులు ఊపిరితిత్తుల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు. వాయు వినిమయం వీటి ప్రధాన విధి. వాయు వినిమయం కోసం వాయుగోణులు ఈ క్రింది అనుకూలనాలు కలిగి ఉంటాయి.

  1. అధిక సంఖ్యలో రక్తనాళాలు కలిగి ఉంటాయి. అందువలన రక్తం ఎక్కువ మొత్తంలో వాయు వినిమయానికి అందుబాటులో ఉంటుంది.
  2. గోళాకార నిర్మాణాలు కలిగి ఉంది. ఉపరితల వైశాల్యం పెంచుతాయి.
  3. గాలిని నిల్వ చేసుకొని వాయు వినిమయ రేటును పెంచుతాయి.
  4. అధిక సంఖ్యలో ఉండుట వలన వాయు వినిమయ రేటు పెరుగుతుంది.
  5. రక్తకేశనాళికలు పలుచగా ఉండి వాయు వినిమయానికి అనుకూలంగా ఉంటుంది.

ప్రశ్న 9.
శ్వాసక్రియలో చక్కెరల నుండి శక్తి ఎక్కడ విడుదలవుతుంది అనే ప్రశ్నకు మాల ‘ఊపిరితిత్తులు’ అని, రజియ ‘కండరాలు’ అని సమాధానం రాశారు. ఎవరి సమాధానం సరైనది? ఎందుకు? (AS1)
జవాబు:
శ్వాసక్రియలో శక్తి కండరాలు లేదా కణజాలం నుండి విడుదల అవుతుంది. ఊపిరితిత్తులలో కేవలం వాయు వినిమయం జరుగుతుంది. O2 గ్రహించబడి CO2 విడుదల చేయబడుతుంది. ఈ ప్రక్రియను బాహ్య శ్వాసక్రియ అంటారు. ఈ ప్రక్రియలో ఎటువంటి శక్తి వెలువడదు.

శ్వాసక్రియలో శక్తి విడుదల కణస్థాయిలో జరుగుతుంది. దీనిని కణశ్వాసక్రియ లేదా అంతర శ్వాసక్రియ అంటారు. , కావున శ్వాసక్రియలో శక్తి కణజాలంలో విడుదల అవుతుంది.

AP Board 10th Class Biology Solutions 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 10.
శ్వాసక్రియలో ఎపిగ్లాటిస్, డయాఫ్రమ్ పాత్ర ఏమిటి? (AS1)
జవాబు:
ఎపిగ్లాటిస్ :
గ్రసనిలో స్వరపేటికను కప్పుతూ, మూతవలె ఉండే నిర్మాణం ఎపిగ్లాటిస్. ఇది శ్వాస మార్గం, ఆహార మార్గాలను నియంత్రిస్తుంది. వాయునాళంలోనికి ఆహారం పోకుండా నియంత్రించటం దీని ప్రధానవిధి.

డయాఫ్రమ్ :
ఇది ఉరఃకుహరానికి క్రింద ఉండే కండరయుత నిర్మాణం. దీని కదలిక వలన ఉరఃకుహరంలో పీడనం మారి, బయటి గాలి లోపలికి, లోపలి గాలి బయటకు ప్రవేశిస్తుంది. పురుష శ్వాస కదలికలో డయాఫ్రమ్ కీలకపాత్ర వహిస్తుంది.

ప్రశ్న 11.
కణస్థాయిలో వాయు వినిమయం ఎలా జరుగుతుంది? (AS1)
జవాబు:

  1. ఆక్సిజన్తో కూడిన రక్తం కణజాలాలలోనికి సరఫరా అయినపుడు, కణజాలాలలో ఆక్సిజన్ వినియోగించబడి తక్కువ గాఢతతో ఉంటాయి.
  2. కావున రక్తం నుండి O2 కణజాలంలోని విసరణ చెందుతుంది. 3. కణ శ్వాసక్రియ వలన కణాలలో CO2 ఏర్పడి దాని గాఢత ఎక్కువగా ఉంటుంది.
  3. సాపేక్షంగా రక్తంలో CO2, గాఢత తక్కువ కావున కణజాలం నుండి CO2 రక్తానికి చేరుతుంది.
  4. ఈ విధంగా గాఢత ఆధారంగా కణజాలం, రక్తం మధ్య వాయు వినిమయం జరుతుంది.

ప్రశ్న 12.
బ్రాంఖియోల్ (శ్వాసనాళికల) వాయు వినిమయం ఎలా జరుగుతుంది? (AS1)
జవాబు:

  1. ఊపిరితిత్తులలోని బ్రాంఖియోల్ అనగా శ్వాసనాళికలు గాలితో నిండినపుడు, రక్తంలో ఆక్సిజన్ గాఢత సాపేక్షంగా తక్కువగా ఉంటుంది.
  2. అందువలన గాలి నుండి ఆక్సిజన్ రక్తంలోనికి విసరణ చెందుతుంది.
  3. అదే సందర్భంలో కణజాలం నుండి CO2 రక్తంలో చేరటం వలన రక్తంలో O2 గాఢత అధికంగా ఉంటుంది.
  4. అధిక గాఢతలో ఉన్న CO2, రక్తం నుండి ఊపిరితిత్తులలోని గాలిలోనికి విసరణ చెందుతుంది.
  5. ఈ ప్రక్రియను వాయు వినిమయం అంటారు. ఈ ప్రక్రియ మొత్తం గాఢత స్వభావం ఆధారంగా జరుగుతుంది.

ప్రశ్న 13.
కష్టమైన వ్యాయామాలు చేసినపుడు కండరాలలో నొప్పి కలుగుతుంది. కండరాల నొప్పికి, శ్వాసక్రియకు సంబంధం ఏమిటి? (AS1)
జవాబు:

  1. వ్యాయామం చేసినపుడు కండరాలలో శక్తి కొరకు అవాయు శ్వాసక్రియ జరుగుతుంది.
  2. అవాయు శ్వాసక్రియలో లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది.
  3. కండరాలలో లాక్టిక్ ఆమ్లం పెరిగినపుడు కండరాలు అలసిపోయి నొప్పి చెందుతాయి.
  4. కొంత విరామం తరువాత కండరాలలో లాక్టిక్ ఆమ్లం తొలగించబడి కండరాలు సాధారణ స్థాయికి చేరుకొంటాయి.
  5. కావున కండరాల నొప్పికి శ్వాసక్రియకు సంబంధం ఉందని నిర్ధారించవచ్చు.
  6. అధిక ఆక్సిజన్ లభ్యత కోసం ఆరుబయట వ్యాయామం చేయటం మంచిది.

ప్రశ్న 14.
ఆకులతో పాటు కాండం కూడా శ్వాసిస్తుందని రాజు చెప్పాడు. నీవు అతనిని సమర్థిస్తావా? ఎలా? (AS1)
జవాబు:

  1. ఆకులతో పాటు కాండం కూడా శ్వాసిస్తుంది అనే మాటను నేను సమర్థిస్తాను.
  2. శ్వాసక్రియలో O2 గ్రహించబడి CO2 విడుదల చేయబడుతుంది. ఈ ప్రక్రియను వాయు వినిమయం అంటారు.
  3. వాయు వినిమయం కోసం పత్రాలు, పత్రరంధ్రాలను కలిగి ఉంటే, కాండాలు ‘లెంటి సెల్స్’ అనే నిర్మాణాలు కలిగి ఉంటాయి.
  4. లెంటిసెల్స్ కాండ కణజాలంతో సంబంధం కల్గి వాయు వినిమయానికి తోడ్పడతాయి.
  5. కావున ఆకులతో పాటు కాండం కూడా. శ్వాసిస్తుందని నిర్ధారించవచ్చు.

ప్రశ్న 15.
శరీరంలో డయాఫ్రమ్ లేకపోతే ఏమవుతుంది? (AS2)
జవాబు:
పురుషుల శ్వాస కదలికలో డయాఫ్రమ్ కీలకపాత్ర వహిస్తుంది. డయాఫ్రమ్ లేకపోతే మన శ్వాసకదలికలు సమర్థవంతంగా ఉండవు. గాలి పీల్చటం, వదలటం కష్టంగా ఉంటుంది. శ్వాసక్రియ సమర్థవంతంగా జరగదు. శరీరానికి సరిపడినంత ఆక్సిజన్‌ను అందించలేము.

ప్రశ్న 16.
ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడిని కలిసే అవకాశం కలిగితే, అపుడు శ్వాసక్రియ గురించి అతడిని నీవు ఏ ఏ ప్రశ్నలు అడుగుతావు? (AS3)
జవాబు:

  1. శ్వాసక్రియ రేటు ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది?
  2. శ్వాసక్రియ రేటును యోగాసనాలలో ఎలా నియంత్రిస్తారు?
  3. జల స్తంభన విద్య సాధ్యమేనా?
  4. వేగంగా పరిగెత్తేవారు శ్వాస విషయంలో తీసుకొనే జాగ్రత్తలు ఏమిటి?
  5. ఊపిరితిత్తుల ఆరోగ్యం కొరకు తీసుకొనవలసిన జాగ్రత్తలు ఏమిటి?
  6. నికొటిన్ ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?

ప్రశ్న 17.
మీ పాఠశాల ప్రయోగశాలలో అవాయు శ్వాసక్రియ గురించి తెలుసుకోవటానికి మీరు చేసిన ప్రయోగంలో అనుసరించిన విధానం ఏమిటి? (AS3)
జవాబు:
ఉద్దేశం :
అవాయు శ్వాసక్రియ జరుగునపుడు ఆల్కహాలు ఏర్పడునని నిరూపించుట. కావలసిన పరికరాలు : గాజుసీసా, గ్లూకోజ్ ద్రావణం, ఈస్టు కణాలు, చిన్నబీకరు.
AP Board 10th Class Biology Solutions 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 2

ప్రయోగం చేయు విధానం :
వెడల్పు మూతిగల ఒక గాజుసీసా తీసుకొనవలెను. సున్నపుతేట నింపిన చిన్న బీకరును ఆ గాజు సీసాలో ఉంచవలెను. గాజు సీసాలో 200 మి.లీ. గ్లూకోజు ద్రావణం తీసుకుని దానికి కొంచెం రొట్టెలలో ఉపయోగించే ఈస్టు కలపవలెను. గ్లూకోజ్ ద్రావణం పైన నూనె పోసి కప్పవలెను. దీని వలన గాలి బైకార్బొ నేట్ గ్లూకోజ్ లో ప్రవేశించదు. గాజు సీసాకు గట్టి బిరడాను ద్రావణం బిగించవలెను. ఒకటి రెండు రోజులు తరువాత సీసా మూతను తీసి వాసన చూస్తే, అది ఆల్కహాలు వాసన వేడిచేసి చల్లార్చిన గ్లూకోజ్ ఉండడం గమనించవలెను. అలాగే సున్నపుతేట పాలవలె అవాయు శ్వాసక్రియలో వెలువడిన ఉష్ణం, మారడం గమనించవలెను.

పరిశీలన :
అవాయు పరిస్థితులలో శ్వాసక్రియ జరగడం వల్ల గ్లూకోజు ద్రావణం ఆల్కహాలుగా మారినది. కార్బన్ డై ఆక్సైడు విడుదలగుట వలన సున్నపు తేట పాలవలె మారినది.

నిర్ధారణ :
దీనిని బట్టి అవాయు పరిస్థితులలో కూడా శ్వాసక్రియ జరుగుతుందని తెలుస్తుంది.

ప్రశ్న 18.
చక్కెరను మండించే ప్రయోగంలో నీవు గమనించిన అంశాలు ఏమిటి? (AS3)
జవాబు:
చక్కెరను మండించే ప్రయోగంలో నేను గమనించిన అంశాలు :

  1. చక్కెరను వేడి చేసినపుడు అది కరిగి ద్రవస్థితికి మారింది.
  2. అధిక ఉష్ణోగ్రత వద్ద చక్కెర మండి CO2 ను విడుదల చేసింది.
  3. చక్కెర మండినపుడు శక్తి ఉష్ణరూపంలో వెలువడింది.
  4. ఇది ఒక భౌతికచర్య, నియంత్రణ కష్టమైనది.
  5. ఈ చర్యలో ఆక్సిజన్ వినియోగించబడింది కావున ఇది ఒక ఆక్సీకరణ చర్య.
  6. శక్తి అంతా ఒకేసారి విడుదల అవుతుంది.
  7. నీటి సమక్షంలో ఈ దహన ప్రక్రియ ఆగిపోతుంది.
  8. చక్కెర నల్లని కార్బగా మిగిలిపోయింది.

ప్రశ్న 19.
కప్పలో జరిగే చర్మీయ శ్వాసక్రియ గురించి సమాచారం సేకరించండి. నివేదిక తయారుచేసి మీ తరగతిలో ప్రదర్శించండి. (AS4)
జవాబు:

  1. కప్ప ఉభయచర జీవి. ఇది నీటిలోనూ, నేలమీద జీవిస్తుంది.
  2. నీటిలోనూ, నేలమీద కూడా చర్మం దాని ముఖ్యమైన శ్వాసేంద్రియం.
  3. కప్ప తీసుకొనే మొత్తం ఆక్సిజన్ పరిమాణంలో 3వ వంతు చర్మం ద్వారా తీసుకొంటుంది.
  4. కప్ప చర్మాన్ని ఎల్లవేళలా తడిగా ఉంచుకొంటుంది.
  5. చర్మం ఉపరితలం మీదికి శ్లేష్మాన్ని స్రవించే అనేక గ్రంథులు కప్ప చర్మంలో ఉన్నాయి.
  6. చర్మాన్ని తేమగా ఉంచటం కోసం, కప్పలు తరచుగా నీటిలోకి దుముకుతుంటాయి.
  7. వేడిగా, పొడిగా ఉండే వేసవి నేలల్లో, కప్పలు నేలలో లోతుగా బొరియలు చేసుకొని నివసిస్తాయి. వీటిని ‘గ్రీష్మకాల సుప్తావస్థ’ లేక ‘వేసవి నిద్ర’ అంటారు.
  8. శీతాకాలంలో కూడా బొరియలలో నిద్రిస్తాయి. దీనినే ‘శీతాకాల సుప్తావస్థ’ లేక ‘శీతాకాల నిద్ర’ అనీ అంటారు. ఈ కాలాలలో కప్పలు చర్మం ద్వారా శ్వాసిస్తాయి.

AP Board 10th Class Biology Solutions 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 20.
పొగాకు వినియోగం, కాలుష్యం మొదలైన వాటివల్ల కలిగే శ్వాసకోశ వ్యాధుల గురించి సమాచారం సేకరించండి. దానిపై మీ తరగతిలో చర్చించండి. (AS4)
జవాబు:
పొగాకు, సిగిరెట్ వినియోగం వలన ఏటా ఒక్క అమెరికాలోనే 4, 38,000 మంది చనిపోతున్నట్లు ప్రాథమిక అంచనా. పొగాకు వినియోగం వలన ఊపిరితిత్తుల కాన్సర్ వచ్చే అవకాశం 87% అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తల అంచనా. ప్రతిరోజు 1,100 మంది టీనేజర్స్ (17 సంవత్సరాలలోపు యువకులు) పొగాకుకు, పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడుతున్నారు. పొగాకు వినియోగం కేవలం శ్వాసకోస వ్యాధులపైనే కాకుండా, నోటి క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రమాదకర రోగాలనూ కలిగిస్తుంది.

పొగాకు వినియోగం వలన ఈ క్రింది ప్రమాదకర రోగాలు సంక్రమిస్తాయి.

1. క్రానిక్ బ్రాంకైటిస్ (Chronic bronchitis) :
ఇది దీర్ఘకాలిక వ్యాధి. వాయునాళంలో శ్లేష్మం పేరుకుపోవటం, విపరీతమైన దగ్గు దీని లక్షణాలు. దగ్గు దీర్ఘకాలికంగా ఉంటే శ్వాసనాళం, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి.

2. ఎంఫిసెమా (Emphysema):
ఈ వ్యాధిలో ప్రధానంగా వాయు గోణులు దెబ్బతింటాయి. ఆయాసం, శ్వాసపీల్చటంలో ఇబ్బంది. దగ్గు, అలసట, బరువు కోల్పోవటం, ఒత్తిడి వంటివి ఈ వ్యాధి లక్షణాలు.

3. లంగ్ కేన్సర్ (Lung’s cancer) :
వాయు మార్గంలోని కణజాలం నికొటిన్ ప్రభావం వలన అదుపులేని కణవిభజన జరుపుతూ వ్రణాలను ఉత్పత్తి చేస్తుంది. దీని వలన ఊపిరితిత్తి మార్గాలలో గడ్డలు ఏర్పడతాయి. శ్వాస సమస్యలు ఏర్పడతాయి. వ్రణాలు పెరిగే కొలది దగ్గు, రక్తస్రావం, ఛాతినొప్పి, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

శ్వాససంబంధ రోగాలు పొగ త్రాగేవారిలోనే కాకుండా వారి ప్రక్కన ఉండే వారిపై కూడా ప్రభావాన్ని చూపుతాయి. దీనినే Second hand smoke అంటారు. దీని ప్రభావం వలన, విసుగు, కళ్ళుమండుట, గొంతుమంట, దగ్గువంటి ప్రాథమిక లక్షణాలు కనిపిస్తాయి.

ప్రశ్న 21.
శ్వాసక్రియా మార్గాన్ని తెలియజేసే బొమ్మ గీసి, భాగాలు గుర్తించండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 3

ప్రశ్న 22.
శ్వాసక్రియలో జరిగే దశలను తెలిపే రేఖాచిత్రం (Block diagram) గీయండి. కణశ్వాసక్రియ గురించి మీరేమి తెలుసుకున్నారో రాయండి. (AS5)
జవాబు:
శ్వాసక్రియలో వివిధ దశలు ఉంటాయి. అయితే వీటి మధ్య విభజన స్పష్టంగా ఉండదు. అవి ఉచ్చ్వాస నిశ్వాసాలు, ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి, రక్తం ద్వారా వాయురవాణా, కణజాలాల్లో వాయు మార్పిడి మరియు కణశ్వాసక్రియ.
AP Board 10th Class Biology Solutions 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 4

కణశ్వాసక్రియ :

  1. కణస్థాయిలో జరిగే శ్వాసక్రియను కణశ్వాసక్రియ అంటారు. దీనినే అంతర శ్వాసక్రియ అని కూడా అంటారు.
  2. ఈ ప్రక్రియలో పరిసరాల నుండి గ్రహించబడిన ఆక్సిజన్ వినియోగించబడి, పదార్థం ఆక్సీకరణం చెందుతుంది.
  3. ఈ ప్రక్రియలో కొంత శక్తితో పాటు CO2 నీటి ఆవిరి వెలువడుతుంది. మరికొంత శక్తి ఉష్ణరూపంలో వెలువడుతుంది.
  4. కణశ్వాసక్రియ మొత్తం రెండు దశలలో జరుగుతుంది. అవి: 1 గ్లైకాలసిస్ 2. క్రైవలయం
  5. గ్లైకాలసిస్ కణద్రవ్యంలో జరగగా, క్రైవలయ చర్యలు మైటోకాండ్రియాలో జరుగుతాయి.
  6. మైటోకాండ్రియా నుండి శక్తి వెలువడుతుంది. కావున వీటిని కణశక్త్యాగారాలు అంటారు.

ప్రశ్న 23.
మన శరీరంలో జరిగే శ్వాసక్రియా యంత్రాంగాన్ని నీవెలా అభినందిస్తావు? (AS5)
జవాబు:
జీవులలో శ్వాసక్రియ ఒక అద్భుత జీవక్రియ. ఇది ప్రాణాధారం. అన్ని జీవక్రియలకు కావలసిన శక్తిని అందించే ఒకే వనరు శ్వాసక్రియ. ఈ ప్రక్రియలో ఆహారంలో పదార్థం ఆక్సీకరణం చెంది ATP శక్తిగా మారుతుంది. శ్వాసక్రియ దహనంవలె ఆక్సీకరణ చర్య అయినప్పటికి, చాలా వైవిధ్యం చూపుతుంది. శక్తిని వెలువర్చే ఈ క్రియ దహనంవలె కాకుండా 90% నీరు కలిగిన జీవద్రవ్యంలో ఎంజైమ్ సమక్షంలో నియంత్రిత చర్యగా జరగటం అద్భుతంగా ఉంటుంది. వెలువడే శక్తి అంతా ఒకేసారి కాకుండా అంచెలంచెలుగా శరీర అవసరాలకు తగినట్టుగా వెలువడటం కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. జీవి శరీర అవసరాలకు తగట్టు శ్వాసక్రియ రేటు పెరగటం, తరగటం కూడా అద్భుతవిషయం. సుప్తావస్థలో శ్వాసక్రియ రేటు కనిష్ఠంగా పడిపోవటం కూడా అద్భుతమైన విషయం.

ప్రశ్న 24.
మీ పాఠశాల సింపోజియంలో చర్చించటానికి అవాయు శ్వాసక్రియపై ఒక వ్యాసాన్ని తయారుచేయండి. (AS5)
జవాబు:
ఆక్సిజన్ రహిత పరిస్థితులలో, జరిగే శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ అంటారు. ఇది చిన్నచిన్న జీవులలోనూ, కండరాలలోనూ జరుగుతుంది. ఈ ప్రక్రియలో వెలువడే శక్తి కూడా తక్కువగా ఉంటుంది.
C6H12O6 → 2C2H5OH + 2CO2 + 54 K.Cal

అవాయు శ్వాసక్రియ, రెండు దశలలో జరుగుతుంది. మొదటి ప్రక్రియలో గ్లూకోజ్ అణువు విచ్చిన్నం చెందుతుంది. ఈ ప్రక్రియను గ్లైకాలసిస్ అంటారు. ఈ ప్రక్రియలో పైరూవిక్ ఆమ్లం ఏర్పడుతుంది. రెండవ దశను కిణ్వనం అంటారు. ఈ ప్రక్రియలో పైరూవిక్ ఆమ్లం మిథనాల్ లేదా లాక్టిక్ ఆమ్లంగా మార్చబడుతుంది. ఈ ప్రక్రియలో CO2 తో బాటు కొద్ది మొత్తంలో శక్తి వెలువడుతుంది.

అవాయు శ్వాసక్రియ, ఈస్ట్ వంటి శిలీంధ్రాలలోనూ, కొన్ని రకాల బాక్టీరియాలలోనూ గమనించవచ్చు.

ప్రశ్న 25.
హిమోగ్లోబిన్, క్లోరోఫిలు శ్వాసక్రియ గురించి మాట్లాడుకుంటున్నట్లుగా ఒక కార్టూన్ గీయండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 5

10th Class Biology 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ Textbook InText Questions and Answers

10th Class Biology Textbook Page No. 27

ప్రశ్న 1.
వాయు సంఘటనం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవటానికి ప్రీస్టే ప్రయోగాలు ఉపయోగపడతాయని ‘చెప్పవచ్చా? ఎలా?
జవాబు:
ప్రీస్టే ప్రయోగాలకు పూర్వం గాలి ఒకే పదార్థంగా భావించేవారు. కానీ ప్రీస్టే ప్రయోగాల వలన గాలి ఒకే అంశ పదార్థం కాదని, అది కొన్ని పదార్థాల మిశ్రమం అని నిర్ధారించబడింది. జంతువులు ఖర్చుచేసే వాయువు ఏదో, మొక్కలు భర్తీ చేస్తాయని ప్రీస్టే నిరూపించాడు.

ప్రశ్న 2.
లేవోయిజర్ ప్రకారం వస్తువులు దహనం చెందినపుడు వెలువడేది ఏమిటి?
జవాబు:
లేవోయిజర్ ప్రకారం వస్తువు దహనం చెందినపుడు స్థిరవాయువు లేదా బొగ్గుపులుసు వాయువు వెలువడుతుంది. దీనినే మనం కార్బన్ డై ఆక్సైడ్ అంటాము.

AP Board 10th Class Biology Solutions 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 3.
గాలి గురించి తన ప్రయోగం ద్వారా లేవోయిజర్ ఏమి తెలుసుకున్నాడు?
జవాబు:
మనం పీల్చటానికి తోడ్పడుతున్న గాలిలో ఉండే వాయువు వస్తువులు మండించటానికి తోడ్పడుతుందని లేవోయిజర్ – గ్రహించాడు. దీనికి ఆక్సిజన్ అని నామకరణం చేశాడు.

ప్రశ్న 4.
లేవోయిజర్ ప్రయోగాల ఆధారంగా మనం ఏ నిర్ధారణకు రావచ్చు?
జవాబు:
లేవోయిజర్ ప్రయోగాల ఆధారంగా మనం పీల్చే వాయువు పదార్థాలను మండించటానికి కూడా తోడ్పడుతుందని గుర్తించాడు. దానికి ఆక్సిజన్ అని నామకరణం చేశాడు.

10th Class Biology Textbook Page No. 28

ప్రశ్న 5.
లేవోయిజర్ అనుకొన్న బొగ్గుపులుసు వాయువు ఏమిటి?
జవాబు:
లేవోయిజర్ అనుకొన్న బొగ్గుపులుసు వాయువును నేడు మనం కార్బన్ డై ఆక్సైడ్ గా పిలుస్తున్నాము.

ప్రశ్న 6.
లేవోయిజర్ పరిశోధనల ప్రకారం పీల్చడానికి పనికి వచ్చే గాలి ఏమిటి?
జవాబు:
లేవోయిజర్ పరిశోధనల ప్రకారం మనం పీల్చడానికి పనికి వచ్చే గాలి ‘ఖర్చయ్యే వాయువు’. దీనినే ఆక్సిజన్ అని పిలుస్తారు.

ప్రశ్న 7.
తన ప్రయోగాల ద్వారా శ్వాసక్రియ విధానంలో ఏయే సోపానాలు ఉంటాయని లేవోయిజర్ పేర్కొన్నాడు?
జవాబు:
లేవోయిజర్ తన ప్రయోగాల ద్వారా శ్వాసక్రియలో రెండు ప్రక్రియలు ఉంటాయని గుర్తించినప్పటికి ఒక ప్రక్రియ గురించి మాత్రమే తెలుసుకోగలిగాడు. విడిచే గాలిలో బొగ్గుపులుసు వాయువు ఉంటుందని తెలుసుకోగలిగాడు.

ప్రశ్న 8.
మనచుట్టూ ఉన్న గాలితో పోల్చినపుడు విడిచేగాలి వేడిగా ఉండడాన్ని మీరు గమనించే ఉంటారు. శ్వాసక్రియ దీనికి కారణమవుతుందని మీరు అనుకుంటున్నారా?
జవాబు:
ఔను. శ్వాసక్రియలో కొంత శక్తి వేడిమి రూపంలో వెలువడుతుంది. ఈ వేడి శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచటానికి తోడ్పడుతూ, జీవక్రియలు జరగటానికి కూడా సహకరిస్తుంది. శ్వాసక్రియలో వెలువడే ఈ ఉష్ణం ఆధారంగానే మనం విడిచేగాలి వెచ్చగా ఉంటుంది.

10th Class Biology Textbook Page No. 29

ప్రశ్న 9.
ఏ వాయువు సున్నపు తేటసు పాలవలె తెల్లగా మారుస్తుంది?
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్ సున్నపు తేటను తెల్లగా పాలవలె మార్చుతుంది.

ప్రశ్న 10.
మన చుట్టూ ఉన్న గాలితో పోల్చినపుడు, మనం బయటకు వదిలే గాలిలో ఏ వాయువు ఎక్కువ పరిమాణంలో ఉంది?
జవాబు:
మనం బయటకు విడిచే గాలిలో CO2 పరిమాణం (41%) అధికంగా ఉంటుంది.

10th Class Biology Textbook Page No. 32

ప్రశ్న 11.
మనం ఆహారం తినే సమయంలో మాట్లాడకూడదని ఎందుకు అంటారు?
జవాబు:
గ్రసని ఆహార, శ్వాసమార్గాల కూడలి. ఈ ప్రాంతంలో ఆహారం, ఆహార నాళంలోనికి ప్రవేశించకుండా వాయునాళంలోనికి ప్రవేశించే ప్రమాదం ఉంది. స్వరపేటిక మీద ఉండే ఉపజిహ్విక ఈ మార్గంలో ఆహారాన్ని నియంత్రిస్తుంది. మనం మాట్లాడుతున్నప్పుడు ఇది సరిగా పనిచేయకపోవచ్చు. కావున ఆహారం తినే సమయంలో మాట్లాడకూడదని అంటారు.

ప్రశ్న 12.
శ్వాసక్రియలో ప్రక్కటెముక కండరాలు, ఉదరవితానముల పాత్ర ఏమిటి? స్త్రీ, పురుషులు ఇరువురిలో రెండు శ్వాసక్రియలో పాల్గొంటాయా?
జవాబు:
శ్వాసకదలికలలో ప్రక్కటెముకలు, ఉదరవితానం ప్రముఖ పాత్ర వహిస్తాయి. వీటి కదలిక వలన ఉరఃకుహర పరిమాణం పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. అందువలన వెలుపలి గాలి ఊపిరితిత్తులలోనికి, ఊపిరితిత్తుల నుండి మరలా ఆ ములుకు ప్రవేశిస్తుంది.

అయితే ఉదరవితానం పురుషులలో బాగా క్రియావంతంగా ఉండి శ్వాసకదలికలో ప్రముఖపాత్ర వహిస్తే, సీలలో ప్రక్కటెముకలు శ్వాసకదలికలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.

10th Class Biology Textbook Page No. 33

ప్రశ్న 13.
శ్వాసక్రియను ప్రభావితం చేసే ఇతర పరిస్థితులు ఏమిటి?
జవాబు:
శ్వాసక్రియ 1. ఆక్సిజన్ లభ్యత 2. ఉష్ణోగ్రత 3. ఆక్సీకరణం చెందే పదార్థ స్వభావం 4. ఎంజైమ్ ల క్రియాశీలక 5. పరిసరాలు 6. జీవి ఆరోగ్యపరిస్థితి వంటి ఇతర కారకాలపై ఆధారపడి ఉంటుంది.

AP Board 10th Class Biology Solutions 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 14.
మెదడు నుండి శ్వాస అవయవాలకు వెళ్ళే నాడులను కత్తిరించినట్లయితే శ్వాసక్రియ వెంటనే నిలిచిపోతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనివలన మనకు ఏం అర్థమవుతుంది?
జవాబు:
మెదడు నుండి శ్వాస అవయవాలకు వెళ్ళే నాడులను కత్తిరించినట్లయితే శ్వాసక్రియ నిలిచిపోతుంది. దీనినిబట్టి శ్వాసక్రియకు, మెదడుకు సంబంధం ఉందని తెలుస్తుంది. అంతేగాక శ్వాసక్రియను నియంత్రించే శ్వాసకేంద్రం మెదడులో ఉన్నట్లు నిర్ధారించవచ్చు.

10th Class Biology Textbook Page No. 34

ప్రశ్న 15.
శ్వాసక్రియ జరిగే సమయంలో ఏం జరుగుతుంది?
జవాబు:
శ్వాసక్రియ జరిగే సమయంలో పరిసరాల నుండి గ్రహించబడిన ఆక్సిజన్, ఆహారపదార్థాలను ఆక్సీకరణం చెందిస్తుంది. అందువలన పదార్థం నుండి శక్తి ఉష్ణముతో పాటు CO2 వెలువడుతుంది. అయితే క్రియలు ఒక వరుస క్రమంలో ఎంజైమ్స్ సమక్షంలో జరుగుతాయి.

ప్రశ్న 16.
నిశ్వాస సమయంలో శరీరం నుండి తొలగించబడిన వాయువు ఏది? ఇది ఎక్కడి నుండి వస్తుంది?
జవాబు:
నిశ్వాస సమయంలో శరీరం నుండి CO2 తొలగించబడుతుంది. ఇది శ్వాసక్రియలో పదార్థం ఆక్సీకరణం చెందటం వలన ఏర్పడుతుంది.

ప్రశ్న 17.
ఉచ్చ్వాస, సమయంలో ఊపిరితిత్తులలోనికి వెళ్ళే వాయువుల సంఘటనం ఏది?
జవాబు:
ఉచ్చ్వాస సమయంలో ఊపిరితిత్తులలోనికి వెళ్ళే వాయువులు
ఆక్సిజన్ – 21%
CO2 – 0.04% ఉంటాయి.

ప్రశ్న 18.
ఉచ్చ్వాస, నిశ్వాస వాయువుల సంఘటనంలో తేడా ఏమైనా ఉందా?
జవాబు:
ఉచ్ఛ్వాసం చెందే వాయువులలో ఆక్సిజన్ పరిమాణం ఎక్కువగా (21%) ఉంటే, నిశ్వాసం చెందే వాయువులలో CO2 పరిమాణం (4%) అధికంగా ఉంటుంది.

వాయువు ఉచ్చ్వాసించే వాయువులో గల శాతం నిశ్వాసించే వాయువులో గల శాతం
ఆక్సిజన్ 21 16
కార్బన్ డై ఆక్పైడ్ 0.03 44
నైట్రోజన్ 78 78

గమనిక : పట్టికలో ఇవ్వబడిన విలువలు సుమారైనవి మాత్రమే.

→ ఉచ్చ్వాసించే, నిశ్వాసించే వాయువులలో ఆక్సిజన్ పరిమాణంలో తేడాకు కారణమేమిటి?
జవాబు:
ఉచ్ఛ్వాస దశలో గాలి నుండి CO2 రక్తంలోనికి విసరణ చెందుతుంది. కావున ఈ గాలి నిశ్వాసం ద్వారా బయటకు వచ్చినపుడు O2 పరిమాణం తక్కువగా ఉంటుంది.

→ నిశ్వాసించే వాయువులలో కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం పెరుగుటకు కారణమేమిటి?
జవాబు:
ఉచ్చ్వాసదశలో రక్తం నుండి CO2 విసరణ చెంది ఊపిరితిత్తులలోనికి, గాలిలోనికి ప్రవేశిస్తుంది. కావున నిశ్వసించే గాలిలో CO2 పరిమాణం పెరుగుతుంది.

10th Class Biology Textbook Page No. 36

ప్రశ్న 20.
గ్లూకోజ్ అణువు విచ్చిన్నం చెందటం, అనేక క్రమానుగత రసాయన చర్యల ద్వారా జరుగుతుంది. ఇది శక్తి విడుదల కావడంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?
జవాబు:
గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం చెందడాన్ని ‘గ్లైకాలసిస్’ అంటారు. ఈ చర్యలో గ్లూకోజ్ అణువు అనేక దశలలో విచ్ఛిన్నం చెంది చివరికి పైరూవిక్ ఆమ్లంగా మారుతుంది. ఈ చర్యలన్నీ ఒకదాని తరువాత మరొకటి అనేక దశలలో జరుగుతాయి. కావున శ్వాసక్రియలో శక్తి కూడా ఒక్కసారిగా కాకుండా అంచెలంచెలుగా విడుదల అవుతుంది.

10th Class Biology Textbook Page No. 37

ప్రశ్న 21.
వాయుగోణులలోనికి కణాలకు కణశ్వాసక్రియ నిర్వహించడానికి ఆక్సిజన్ అవసరమా? ఎందుకు?
జవాబు:
పని నిర్వహించే ప్రతి కణజాలానికి శక్తి అవసరం. ఈ శక్తిని అవి శ్వాసక్రియ ద్వారా పొందుతాయి. శ్వాసక్రియ నిర్వహించటానికి ఆక్సిజన్ అవసరం కావున వాయుగోణులలోనికి కణాలు కణశ్వాసక్రియ నిర్వహించడానికి ఆక్సిజన్ అవసరము.

AP Board 10th Class Biology Solutions 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 22.
తీవ్రమైన వ్యాయామం చేసిన తరువాత మనకు కండరాలలో నొప్పి వస్తుంది కదా! కండరాలకు సరిపోయినంత ఆక్సిజన్ సరఫరా జరిగిందా?
జవాబు:
తీవ్రమైన వ్యాయామం చేసిన తరువాత కండరాలలో లాక్టిక్ ఆమ్లం పేరుకుపోయి నొప్పి వస్తుంది. ఈ స్థితిలో కండరాలలో ‘ఆక్సిజన్ లోటు’ ఏర్పడుతుంది. ఈ పరిస్థితులలో కండరాలకు సరిపోయినంత ఆక్సిజన్ సరఫరా జరగదు. జరిగిన తరువాత కండరాలు సాధారణ స్థితికి వస్తాయి.

10th Class Biology Textbook Page No. 38

ప్రశ్న 23.
కండరాలలో ఏ రసాయనాలు ఏర్పడతాయి?
జవాబు:
కండరాలు అవాయు శ్వాసక్రియ జరిపి, లాక్టిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తాయి. కండరాలలో లాక్టిక్ ఆమ్లం పేరుకుపోవటం వలన అలసిన అనుభూతి కలుగుతుంది. కొంత విరామం తరువాత లాక్టిక్ ఆమ్లం తొలగించబడి కండరాలు సాధారణ స్థితికి చేరుకొంటాయి.

10th Class Biology Textbook Page No. 41

ప్రశ్న 24.
బేకరీలలో రొట్టెల తయారీదారులు పిండికి ఈస్టు కలిపినపుడు ఏం జరుగుతుంది?
జవాబు:
బేకరీలలో రొట్టెల తయారీదారులు పిండికి ఈస్ట్ ను కలిపినపుడు, ఈస్ట్ పిండిలో అవాయు శ్వాసక్రియ జరుపుతుంది. “ఫలితంగా పిండిపదార్థం ఆల్కహాల్ గా మార్చబడి, CO2 వెలువడుతుంది. CO2 వెలువడుట వలన పిండి పరిమాణం పెరుగుతుంది. ఆల్కహాల్ వలన పిండి పులిసిన వాసన వస్తుంది.

ప్రశ్న 25.
శ్వాసక్రియ శక్తిని విడుదల చేసే ప్రక్రియ. దీనిని మీరు అంగీకరిస్తారా? ఎందుకు?
జవాబు:
ఔను, శ్వాసక్రియ శక్తిని విడుదల చేసే ప్రక్రియ. శ్వాసక్రియలో ఆహార పదార్థాలు ఆక్సీకరించబడి శక్తి వెలువడుతుంది. శక్తి ATP రూపంలో నిల్వచేయబడి కణక్రియల కొరకు వినియోగించబడుతుంది.

ప్రశ్న 26.
చక్కెరను మండించినపుడు ఏమి జరుగుతుంది?
జవాబు:
చక్కెరను మండించినపుడు మొదట అది ద్రవస్థితికి మారుతుంది. తరువాత అది మండి కార్బన్ డై ఆక్సైడ్ ను, శక్తిని వెలువరుస్తుంది. ఈ ప్రక్రియను దహనం లేదా మండుట అంటారు. ఇది శ్వాసక్రియవలె ఆక్సీకరణ చర్య.

10th Class Biology Textbook Page No. 42

ప్రశ్న 27.
శీతాకాలంలో చలికోటు (స్వెట్టర్) వేసుకున్నపుడు మనకు వెచ్చగా ఉంటుంది. చలికోటు మన శరీరం విడుదల చేసిన ఉష్ణాన్ని వృథా కాకుండా కాపాడుతుంది. అంటే మన శరీరం ఉష్ణాన్ని విడుదల చేసిందని అనుకోవచ్చా? ఇంకా ఏయే మార్గాల ద్వారా మన శరీరం ఉష్ణాన్ని కోల్పోతుంది?
జవాబు:

  1. మన శరీరం ఉపరితలం నుండి నిరంతరం ఉష్ణాన్ని కోల్పోతూనే ఉంటుంది. కాబట్టి మన శరీరం కోల్పోయిన ఉష్ణాన్ని పూరించడానికి నిరంతరం ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తూ ఉండాలి. దీని వలననే శరీర ఉష్ణోగ్రత నిరంతరం స్థిరంగా ఉంటుంది.
  2. మన పరిసరాలు చల్లగా ఉన్నప్పుడు, ప్రధాన చెవిడిప్ప, చేతివేళ్ళ ద్వారా ఉష్ణాన్ని త్వరగా కోల్పోతుంటాము. కావున ఈ భాగాలు ముందుగా చల్లబడతాయి.

ప్రశ్న 28.
శరీరం కోల్పోయే ఉష్ణోగ్రత, ఉత్పత్తి చేసే ఉష్ణోగ్రత ఒకే నిష్పత్తిలో ఉంటాయా?
జవాబు:
మనం శరీరం ఎల్లప్పుడూ నిర్దిష్ట ఉష్ణోగ్రతను (37°C) కలిగి ఉంటుంది. కావున మానవులు స్థిరోష్ణ జీవులు. శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉండాలంటే శరీరం కోల్పోయే ఉష్ణోగ్రత, ఉత్పత్తి చేసే ఉష్ణోగ్రత సమానంగా ఉండాలి. మన శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. కావున శరీరం కోల్పోయే ఉష్ణోగ్రత ఉత్పత్తి అయ్యే ఉష్ణోగ్రత సమానంగా ఉంటుంది.

ప్రశ్న 29.
ఉదయం నిద్రలేవగానే మీ శరీర ఉష్ణోగ్రతను కొలవండి. కొంచెం సేపు జాగింగ్ చేసిన తరువాత మరలా ఉష్ణోగ్రతను కొలవండి. రెండింటికి మధ్య ఏమైనా వ్యత్యాసం ఉందా? లేదా? వివరించండి.
జవాబు:

  1. ఉదయం నిద్రలేవగానే శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంది. కాసేపు జాగింగ్ చేసిన తరువాత శరీర ఉష్ణోగ్రత పెరిగింది.
  2. జాగింగ్ చేసినపుడు ఎక్కువ శక్తి అవసరం. శక్తి కోసం శ్వాసక్రియ రేటు పెరుగుతుంది.
  3. శ్వాసక్రియలో కొంత శక్తి ఉష్ణం రూపంలో వెలువడుతుంది. కావున జాగింగ్ తరువాత శరీర ఉష్ణోగ్రత పెరిగింది.

10th Class Biology Textbook Page No. 45

ప్రశ్న 30.
మొక్కలు, జంతువులలో జరిగే శ్వాసక్రియలలో నీవు ఏమేమి పోలికలు గమనించావు?
జవాబు:
మొక్కలు, జంతువులలో జరిగే శ్వాసక్రియలో చాలా పోలికలు ఉన్నాయి.

  1. రెండు జీవుల శ్వాసక్రియలో 0, గ్రహించబడుతుంది.
  2. CO2 విడుదల చేయబడుతుంది.
  3. పదార్థాలు ఆక్సీకరింపబడతాయి.
  4. శక్తి వెలువరించే ప్రక్రియ.
  5. విచ్ఛిన్నక్రియ రెండు రకాల జీవులలోనూ పదార్థం విచ్ఛిన్నం చేయబడుతుంది.

AP Board 10th Class Biology Solutions 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

ప్రశ్న 31.
మీరు ఎప్పుడైనా చిత్తడి ప్రదేశాలకు వెళ్ళినపుడు అక్కడ పెరిగే మొక్కల కాండం సేకరించండి. దానిలో గల రంధ్రాల సంఖ్య, పరిమాణాన్ని మామూలు ల మీద పెరిగే మొక్కల కాండంతో పోల్చి చూడండి. రెండూ ఒకే రకంగా ఉన్నాయా? భిన్నంగా ఉన్నాయా? ఎందుకు?
జవాబు:
చిత్తడి ప్రదేశాలలో పెరిగే మొక్క కాండం నేలమీద పెరిగే మొక్క కాండం కన్నా భిన్నంగా ఉంది. నేలమీద పెరిగే మొక్క కాండం పై రంధ్రాల సంఖ్య తక్కువగా ఉండి కొద్ది పరిమాణంలో ఉంటే, చిత్తడి ప్రదేశాలలో పెరిగే మొక్క కాండం అధిక రంధ్రాలు కలిగి అధిక పరిమాణంలో ఉన్నాయి.

చిత్తడి ప్రాంతాలలో పెరిగే మొక్కల వేర్లకు వాయులభ్యత తక్కువ. నేల అంతా నీటితో నిండి ఉంటుంది. కావున ఈ మొక్కలు కాండం ద్వారా గాలి పొందటానికి అధిక సంఖ్యలో రంధ్రాలు కలిగి ఉంటాయి.

ప్రశ్న 32.
వాయుమార్గంలో తేమ లేనట్లయితే ఏం జరుగుతుంది?
జవాబు:

  1. వాయుమార్గంలో తేమ లేనట్లయితే, దుమ్ము, ధూళి కణాలు గాలి నుండి తొలిగించబడవు.
  2. వేసవికాలంలో గాలి చల్లబర్చకుండా ఊపిరితిత్తులను చేరుతుంది. దీని వలన ఊపిరితిత్తులు దెబ్బతింటాయి.
  3. శీతాకాలంలో గాలి వాయుమార్గంలో తేమ వలన వెచ్చబడి ఊపిరితిత్తులను చేరుతుంది. లేనట్లయితే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి.

ప్రశ్న 33.
రెండు ఊపిరితిత్తులూ ఒకే పరిమాణంలో ఉంటాయా?
జవాబు:
మన శరీరంలోని రెండు ఊపిరితిత్తులూ ఒకే పరిమాణంలో ఉండవు. కుడి ఊపిరితిత్తి మూడు తమ్మెలు కలిగి ఎడమ దానికంటే పెద్దదిగా ఉంటుంది. ఎడమ ఊపిరితిత్తి రెండు తమ్మెలు కలిగి కొంచెం చిన్నదిగా ఉంటుంది.

ప్రశ్న 34.
వాయుకోశగోణులు అసంఖ్యాకంగాను, అతిచిన్నవిగాను ఎందుకు ఉంటాయి?
జవాబు:
వాయుగోణులు ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణంలో గాలి నుండి అణుస్థాయిలో వాయు వినిమయం జరపటానికి ఇవి సూక్ష్మంగా ఉంటాయి. పరిమాణంలో పెద్దవిగా ఉండే ఊపిరితిత్తులను నిర్మించటం కోసం ఇవి అసంఖ్యాకంగా ఉన్నాయి. ఊపిరితిత్తుల వైశాల్యం పెంచటంలో కూడా ఇవి కీలకపాత్ర వహిస్తాయి.

10th Class Biology 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

• మీ చేతిని నాసికా రంధ్రాలకు ఎదురుగా ఒక అంగుళం దూరంలో ఉంచండి. మీ శ్వాస బయటకు వచ్చి చేతిని తాకడం గమనించండి. ఈ కృత్యం పూర్తయ్యే వరకు చేతిని అక్కడ నుండి తీయకండి. ఒకటి రెండు నిమిషాలు నిలకడగా శ్వాసించండి. ఏదైనా ఆహార పదార్థాన్ని కొరికి బాగా నమిలి, మ్రింగే ముందుగా రెండవ చేతిని గొంతుపై ఉంచిన తరువాత ఆహారాన్ని మ్రింగడం.
1) మీరేం గమనించారు?
జవాబు:
ఆహారాన్ని మ్రింగుతున్నప్పుడు, గొంతులో కదలిక గుర్తించాను. అదే సమయంలో శ్వాస చేతికి తగలలేదు.

2) ఆహారాన్ని మ్రింగే సమయంలో మీ శ్వాసలో ఏమైనా తేడా గమనించారా?
జవాబు:
ఆహారాన్ని మింగుతున్నప్పుడు శ్వాస ఆగినట్లు గమనించాను.

3) ఆహారాన్ని మ్రింగే సమయంలో, ఆహారం శ్వాసనాళంలోనికి ప్రవేశించకుండా సహాయపడుతున్నది ఏది? జ. ఆహారాన్ని మ్రింగే సమయంలో ఆహారం శ్వాసనాళంలోనికి ప్రవేశించకుండా, గ్రసనిలో ఉండే ఉపజిహ్విక సహాయపడుతుంది.

కృత్యం – 2

* చక్కెరను మండించినపుడు ఏం జరుగుతుంది?
AP Board 10th Class Biology Solutions 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 6
పటంలో చూపిన విధంగా పరికరాలను అమర్చండి. ఒక పరీక్ష నాళికలో చక్కెరను తీసుకొని మంట సహాయంతో వేడి చేయండి. కొంచెం సేపటి తరువాత ఏం జరుగుతుందో గమనించండి.
1) చక్కెర కరిగిందా?
జవాబు:
వేడిచేసినపుడు చక్కెర కరిగింది.

2) ఇంకా ఎక్కువ సేపు పనిచేసినపుడు ఏం జరిగింది?
జవాబు:
చక్కెరను బాగా వేడిచేసినపుడు కార్బన్ డై ఆక్సైడ్ నీటితో పాటుగా శక్తి వేడి రూపంలో వెలువడుతుంది.

కృత్యం – 3

పిడికెడు శెనగలు లేదా రాగులు తీసుకోండి. మీ ప్రయోగానికి ఒక రోజు ముందు వాటిని నీళ్ళలో నానబెట్టండి. తరవాత వాటిని తీసి గుడ్డలో వేసి దారంతో గట్టిగా మూటకట్టండి. ఆ మూటను తరగతి గదిలో ఒక మూల ఉంచండి. రెండు రోజులపాటు పరిశీలించండి. గింజలు మొలకెత్తుతాయి. మొలకెత్తిన గింజలను తీసుకొని గాజుసీసాలో వేయండి. ఒక చిన్న బీకరు తీసుకొని దానిలో మూడు వంతుల వరకు సున్నపుతేట నింపండి. సీసా మూతికి దారం కట్టి సీసాను జాగ్రత్తగా గాజు జాడీలో ఉంచండి. జాడీ మూత బిగించండి. ఇలాగే పొడి విత్తనాలతో మరొక అమరికను సిద్ధం చేసుకోండి. రెండింటిని రెండు రోజులపాటూ కదపకుండా ఉంచండి. రెండు అమరికలను పరిశీలించండి.
AP Board 10th Class Biology Solutions 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 7

• మీ పరిశీలనలను నమోదు చేయండి.
1) ఏ జాడీలో ఉంచిన సీసాలో సున్నపు నీరు రంగు మారింది? ఎందుకు?
జవాబు:

  1. మొలకెత్తుతున్న గింజలు ఉన్న సీసాలోని సున్నపు నీరు రంగు మారింది.
  2. మొలకెత్తు గింజలు శ్వాసక్రియ జరిపి CO2 ను విడుదల చేయుటవలన, సున్నపునీరు CO2 సున్నపు నీటిని తెల్లగా పాలవలె మార్చింది.

కృత్యం – 4

మొలకెత్తిన గింజలను ఒక థర్మార్టైస్కులో తీసుకోండి. ఒక బిరడాను తీసుకొని, రంధ్రం చేసి దానిగుండా థర్మామీటరును అమర్చండి. ఈ థర్మామీటరు నొక్కు మొలకెత్తిన గింజల్లో మునిగి ఉండేలా జాగ్రత్తపడండి. ప్రతి రెండు గంటలకు థర్మామీటరులో ఉష్ణోగ్రత నమోదు చేయండి. మంచి ఫలితాల కోసం 24 గంటలపాటు పరిశీలించండి.

* మీ పరిశీలనల ఆధారంగా (కాలం – ఉష్ణోగ్రతలపై గ్రాఫ్ గీయండి.)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ 8

* ఉష్ణోగ్రతలలో పెరుగుదలను ఏమైనా గుర్తించారా?
జవాబు:
ఔను, సీసాలో ఉష్ణోగ్రత పెరిగింది.

ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుందా లేక రోజులో ఏదో ఒక సమయంలో అకస్మాత్తుగా పెరిగినట్లుగా ఉన్నదా?
జవాబు:
ఉష్ణోగ్రత క్రమంగా పెరగటం గమనించాను. ఒక్కసారిగా ఉష్ణోగ్రత పెరగలేదు.

* ఈ ఉష్ణం ఎక్కడ నుండి వచ్చిందని మీరు భావిస్తున్నారు?
జవాబు:
మొలకెత్తుతున్న గింజల శ్వాసక్రియ రేటు అధికంగా కలిగి కాలం గంటలలో ఉంటాయి. శ్వాసక్రియలో కొంత శక్తి ఉష్ణం రూపంలో వెలువడుట వలన, ధర్మాప్లాస్కులో ఉష్ణోగ్రత పెరిగినట్టు భావిస్తున్నాను.

ప్రయోగశాల కృత్యం

1. ఈ ప్రయోగం ద్వారా నీవు ఏ విషయాలు నిరూపించగలవు ?
జవాబు:
1. ఈ ప్రయోగం ద్వారా నేను అవాయు శ్వాసక్రియను నిరూపించగలను.
2. అవాయు శ్వాసక్రియలో CO2 వెలువడుతుందని నిరూపించగలను.

2. ఈ ప్రయోగంలో గ్లూకోజ్ ద్రావణాన్ని, ఎందుకు వేడిచేస్తారు?
జవాబు:
వేడిచేయటం వలన గ్లూకోజ్ ద్రావణంలోని ఆక్సిజన్ తొలగించవచ్చు. అందువలన అవాయు శ్వాసక్రియ పరిస్థితులు ఆకల్పిస్తాను.

AP Board 10th Class Biology Solutions 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

3. గ్లూకోజ్ ద్రావణంపై పారాఫిన్ మైనం ఎందుకు పోశావు?
జవాబు:
గాలిలోని ఆక్సిజన్ గ్లూకోజ్ ద్రావణంలో కలవకుండా నిరోధించటానికి పారాఫిన్ మైనం పోశాను.

4. ఈ ప్రయోగంలో సున్నపు తేటలో ఏం మార్పు గమనించావు?
జవాబు:
సున్నపు నీరు పాలవలె మారటం గమనించాను. ఇది CO2 ఆవిడుదలను నిర్ధారించింది.

5. ఈ ప్రయోగంలో ఏ జీవులు అవాయు శ్వాసక్రియను నిర్వహిస్తాయి?
జవాబు:
గ్లూకోజ్ ద్రావణానికి కలిపిన ఈస్ట్ కణాలు అవాయు శ్వాసక్రియ జరిపాయి.

కింది ఖాళీలను పూరించండి

1. విడిచేగాలిలో ………….. మరియు ……………… ఉంటాయి. (CO2, నీటి ఆవిరి)
2. గాలి, ఆహారం శరీరం లోపలికి వెళ్ళడానికి వీలుగా పనిచేసే కండరయుతమైన మూతవంటి నిర్మాణం …………… (ఉపజిహ్విక)
3. కణాలలో నిల్వ ఉన్న శక్తి ప్రమాణాన్ని ……………………. అంటారు. (ATP)
4. మొక్కలలో ……… భాగాలలో లెంటి సెల్స్ ఉంటాయి. ఇవి ……………….. చర్యకు తోడ్పడతాయి. (కాండ, వాయువినిమయం)
5. మాంగ్రూప్ లో శ్వాసక్రియ …………….. ద్వారా జరుగుతుంది. (శ్వాసవేర్లు)

సరైన సమాధానాన్ని గుర్తించండి

1. స్వరతంత్రులను ఇక్కడ గమనించవచ్చు.
A) వాయునాళం
B) స్వరపేటిక
C) నాశికాకుహరం
D) గ్రసని
జవాబు:
B) స్వరపేటిక

2. ఊపిరితిత్తులలో ఉండే గాలితిత్తుల వంటి నిర్మాణాలు
A) వాయుగోణులు
B) శ్వాసనాళాలు
C) శ్వాసనాళికలు
D) గాలిగదులు
జవాబు:
A) వాయుగోణులు

3. శ్వాసక్రియ ఒక విచ్ఛిన్నక్రియ ఎందుకంటే
A) సంక్లిష్ట ఆహార పరమాణువులు విచ్ఛిన్నం అవుతాయి.
B) కాంతి శక్తి మార్పు చెందుతుంది.
C) రసాయన శక్తి సంశ్లేషించబడుతుంది.
D) శక్తి నిల్వ చేయబడుతుంది.
జవాబు:
A) సంక్లిష్ట ఆహార పరమాణువులు విచ్ఛిన్నం అవుతాయి.

AP Board 10th Class Biology Solutions 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

4. కణాలలో శక్తి నిలువ ఉండే ప్రదేశం
A) కేంద్రకం
B) మైటోకాండ్రియా
C) రైబోసోమ్ లు
D) కణకవచం
జవాబు:
B) మైటోకాండ్రియా

AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

SCERT AP 10th Class Biology Guide Pdf Download 1st Lesson బలం Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Biology 1st Lesson Questions and Answers పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

10th Class Biology 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
కింది వాని మధ్య భేదాలు రాయండి. (AS1)
ఎ) స్వయంపోషణ-పరపోషణ
బి) అంతర గ్రహణం- జీర్ణక్రియ
సి) కాంతి చర్య- నిష్కాంతి చర్య
డి) పత్రహరితం-హరితరేణువు
జవాబు:
ఎ) స్వయంపోషణ – పరపోషణ :

స్వయంపోషణ పరపోషణ
1. జీవులు పోషకాలను స్వయంగా తయారు చేసుకొనే పద్ధతిని “స్వయంపోషణ” అంటారు. 1. పోషకాల కొరకు ఇతర జీవులపై ఆధారపడే ప్రక్రియను “పరపోషణ” అంటారు.
2. గాలి, నీరు వంటి నిరింద్రియ పదార్థాల నుండి ఆహారం తయారు చేసుకుంటాయి. 2. ఇతర జీవులను తినటం ద్వారా పోషకాలను గ్రహిస్తాయి.
3. కాంతిని శక్తి వనరుగా ఉపయోగించుకుంటాయి. 3. ఆహారపదార్థాల నుండి శక్తిని పొందుతాయి.
4. పత్రహరితం కలిగి ఉంటాయి.
ఉదా : ఆకుపచ్చని మొక్కలు
4. పత్రహరితం కలిగి ఉండవు.
ఉదా : జంతువులు

బి) అంతర గ్రహణం – జీర్ణక్రియ :

అంతర గ్రహణం జీర్ణక్రియ
1. ఆహార పదార్థాలను నోటిలోనికి గ్రహించే విధానమే “అంతర గ్రహణం”. 1. సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చే ప్రక్రియను “జీర్ణక్రియ” అంటారు.
2. ఆహారాన్ని సంపాదించటానికి ముఖభాగాలు, చేతులు, గోర్లు తోడ్పడతాయి. 2. ఆహారం జీర్ణం చేయటానికి జీర్ణరసాలు, ఎంజైమ్స్ తోడ్పడతాయి.
3. ఆహారం ముక్కలుగా చేయబడి గ్రహించబడుతుంది. 3. ముక్కలైన ఆహారాన్ని శోషణ చెందటానికి అనువుగా ద్రవస్థితికి మార్చబడుతుంది.
4. ఇది ఒక భౌతిక ప్రక్రియ. ఎటువంటి రసాయన చర్యలూ ఉండవు. 4. ఇది జీవరసాయనిక ప్రక్రియ. పదార్థ నిర్మాణం మారుతుంది.
5. జీర్ణక్రియలోని మొదటి ప్రక్రియ అంతర గ్రహణం. 5. అంతర గ్రహణం తరువాత జీర్ణక్రియ ప్రారంభమౌతుంది.

సి) కాంతి చర్య- నిష్కాంతి చర్య :
కాంతి సమక్షంలో జరిగే చర్యలకు, కాంతి ప్రమేయం లేని చర్యలకు మధ్యగల భేదాలు ఏమిటి ?

కాంతి చర్య నిష్కాంతి చర్య
1. కిరణజన్యసంయోగక్రియలోని మొదటి దశ. 1. కిరణజన్యసంయోగక్రియలోని రెండవ దశ.
2. కాంతిశక్తి గ్రహించబడుతుంది. 2. కాంతిశక్తితో ప్రమేయం లేదు. కానీ కాంతిచర్యలపై ఆధారపడుతుంది.
3. హరితరేణువులోని గ్రానాలో జరుగును. 3. హరితరేణువులోని అవర్ణిక (సోమా) లో జరుగును.
4. ATP, NADH లు అంత్య ఉత్పన్నాలు. 4. పిండిపదార్థం (గ్లూకోజ్) అంత్య ఉత్పన్నము.
5. శక్తిగ్రాహకాలు ఏర్పడతాయి. 5. శక్తిగ్రాహకాలు వినియోగింపబడతాయి.
6. ప్రధానంగా ఆక్సీకరణ చర్యలు. 6. ప్రధానంగా క్షయకరణ చర్యలు.
7. నీటి కాంతి విశ్లేషణ జరుగుతుంది. 7. కర్బన స్థాపన జరుగుతుంది.

డి) పత్రహరితం – హరితరేణువు :

పత్రహరితం హరితరేణువు
1. ఆకుపచ్చ వర్ణాన్ని కలిగించే వర్ణద్రవ్యం. 1. పత్రహరితాన్ని కలిగి ఉన్న కణాంగాన్ని హరితరేణువు అంటారు.
2. పత్రహరితం హరితరేణువులలో ఉంటుంది 2. హరిత రేణువులు కణద్రవ్యంలో డిస్క్ ఆకారంలో ఉంటాయి.
3. మెగ్నీషియం అణువును కలిగి ఉండే స్థూల అణువు 3. త్వచ నిర్మాణాలు కలిగిన కణాంగము
4. సౌరశక్తిని గ్రహిస్తుంది. 4. కిరణజన్యసంయోగక్రియను నిర్వహిస్తుంది.
5. కిరణజన్యసంయోగక్రియను ప్రారంభిస్తుంది. 5. కిరణజన్యసంయోగక్రియలోని చర్యలన్నీ హరిత రేణువులలో జరుగుతాయి

ప్రశ్న 2.
కింది వానికి కారణాలు చెప్పండి. (AS1)
ఎ) సజీవ ప్రపంచానికి కిరణజన్యసంయోగక్రియ శక్తికి మూలాధారమని ఎలా చెప్పగలవు?
జవాబు:
జంతువులన్నీ పరపోషకాలు. ఇవి మొక్కలపై ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఆధారపడి జీవిస్తుంటాయి. వీటికి ఆహారాన్ని అందించే ఏకైక క్రియ కిరణజన్యసంయోగక్రియ. కిరణజన్యసంయోగక్రియ ద్వారా మొక్కలు తయారుచేసిన ఆహారం సజీవ ప్రపంచానికి శక్తి ఆధారం అవుతుంది. కావున సజీవ ప్రపంచానికి కిరణజన్యసంయోగక్రియ మూలాధారమని చెప్పవచ్చు.

బి) నిష్కాంతి చర్యను కాంతితో సంబంధం లేకుండా జరిగే చర్య అని పిలవడం సముచితం.
జవాబు:
నిష్కాంతి చర్య ప్రారంభానికి శక్తి గ్రాహ్యకాలు అవసరం. ఇవి కాంతిచర్య నుండి ఏర్పడతాయి. శక్తి గ్రాహ్యకాలు ఏర్పడగానే కాంతి ఉన్నా లేకున్నా నిష్కాంతి చర్య కొనసాగుతుంది. కావున నిష్కాంతి చర్యను కాంతితో సంబంధంలేని చర్య అని పిలవడం సముచితం.

సి) కిరణజన్యసంయోగక్రియలో నిర్వహించే ప్రయోగాలకు ముందు మొక్కలోని పిండిపదార్థం తొలగించాలంటారు. ఎందుకో చెప్పండి.
జవాబు:
కిరణజన్యసంయోగక్రియను పిండిపదార్థం ఏర్పడటం వలన నిర్ధారిస్తారు. అయోడిన్ పరీక్ష జరిపి పిండిపదార్థం ఉంటే కిరణజన్యసంయోగక్రియ జరిగినట్లు భావిస్తారు. ఈ ప్రక్రియలో పత్రంలో పిండిపదార్థం ఉంటే కిరణజన్యసంయోగక్రియ జరగకపోయినా, జరిగేటట్లు ఫలితాలు వస్తాయి. అందువలన కిరణజన్యసంయోగక్రియ నిర్వహించే ప్రయోగాలకు ముందు మొక్కలోని పిండిపదార్థం తొలగిస్తారు.

డి) ఆకుపచ్చటి మొక్కలను సూర్యరశ్మిలో పెట్టి శ్వాసక్రియకు సంబంధించిన ప్రయోగాలు నిర్వహించలేము. ఎందుకు?
జవాబు:

  1. ఆకుపచ్చని మొక్కలను సూర్యరశ్మిలో ఉంచినపుడు, కిరణజన్యసంయోగక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియలో CO2 గ్రహించబడి O2 వెలువడుతుంది.
  2. శ్వాసక్రియ ప్రయోగాలలో CO2 విడుదలను నిర్ధారణ చేసి నిరూపిస్తారు.
  3. పగటి సమయంలో శ్వాసక్రియలో వెలువడిన CO2 కిరణజన్యసంయోగక్రియలో వినియోగించబడుతుంది. కావున శ్వాసక్రియను నిరూపించలేము.

AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

ప్రశ్న 3.
ఈ కింది వానికి ఉదాహరణలివ్వండి. (AS1)
ఎ) జీర్ణక్రియ ఎంజైమ్లు
బి) పరపోషణను పాటించే జీవులు
సి) విటమిన్లు
డి) పోషక ఆహారలోపం వలన కలిగే వ్యాధులు
జవాబు:
ఎ) జీర్ణక్రియ ఎంజైమ్లు : టయలిన్, లైపేజ్, అమిలాప్సిన్, ప్రొటియేజ్, పెప్సిన్ మొదలగునవి.

బి) పరపోషణను పాటించే జీవులు : ఆవు, మేక, పులి, సింహం, మానవుడు

సి) విటమిన్లు : విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి మొదలగునవి.

డి) పోషక ఆహారలోపం వలన కలిగే వ్యాధులు : క్వాషియార్కర్, మెగాస్మస్, నోటిపూత, అంధత్వం.

ప్రశ్న 4.
కిరణజన్యసంయోగక్రియకు కావాల్సిన ముడిపదార్థాలు మొక్కలు ఎక్కడ నుండి గ్రహిస్తాయి? (AS1)
జవాబు:
కిరణజన్యసంయోగక్రియకు కావలసిన పదార్థాలు :
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 1
1. కాంతి : మొక్కలు సూర్యుని నుండి కాంతిని గ్రహిస్తాయి. సూర్యశక్తి చిన్నరేణువులుగా భూమిని చేరతాయి. వీటిని ‘ఫోటాన్’ అంటారు. ఫోటాన్లలోని శక్తిని క్వాంటం శక్తి అంటారు.

2. CO2 : గాలిలో CO2 0.03% ఉంటుంది. గాలిలోని CO2 సూర్యరశ్మి మొక్కలు పత్రరంధ్రాల ద్వారా గ్రహిస్తాయి. నీటిలోని మొక్కలు కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ రూపంలో కార్బన్ డై ఆక్సైడ్ పత్రహరితం గ్రహిస్తాయి.

3. నీరు : మొక్కలు నేల నుండి వేర్ల ద్వారా నీటిని గ్రహిస్తాయి. వేర్ల ద్వారా గ్రహించిన నీరు ‘దారువు’ ద్వారా ఇతర భాగాలకు సరఫరా చేయబడుతుంది.

4. పత్రహరితం : ఇది మొక్కల ఆకుపచ్చభాగంలో ఉంటుంది. సూర్యకాంతిని గ్రహించటంలో తోడ్పడుతుంది.

ప్రశ్న 5.
స్వయంపోషణ జరగడానికి కావలసిన పరిస్థితుల గురించి వివరించండి. ఈ చర్యలో ఏర్పడే ఉత్పన్నాలు ఏవి? (AS1)
జవాబు:

  1. స్వయంపోషణలో ప్రధానమైనది కాంతి స్వయంపోషణ. ఈ ప్రక్రియను కిరణజన్యసంయోగక్రియ అంటారు.
  2. ఈ క్రియ జరగటానికి మొదటిగా పత్రహరితం అవసరం. దీనితో పాటుగా, నీరు, CO2, సూర్యరశ్మి తప్పనిసరి. ఈ నాలుగు కారకాలు లేకుండా స్వయంపోషణ జరగదు.
  3. స్వయంపోషణలో చివరిగా పిండిపదార్థం, నీటిఆవిరి మరియు ఆక్సిజన్ ఏర్పడతాయి.

ప్రశ్న 6.
రసాయన సమీకరణం సహాయంతో కిరణజన్యసంయోగక్రియ జరిగే విధానాన్ని ప్లోచార్ట్ సహాయంతో వివరించండి. (AS1)
జవాబు:
కాంతిని ఒక శక్తివనరుగా ఉపయోగించుకొంటూ, అంత్య ఉత్పత్తిగా కార్బోహైడ్రేట్సను తయారుచేయు ఆకుపచ్చని మొక్కలలోని జీవ రసాయనిక చర్యను ‘కిరణజన్యసంయోగక్రియ’ అంటారు.
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 2

కిరణజన్యసంయోగక్రియ ప్రధానంగా రెండు దశలలో జరుగుతుంది. అవి :
1. కాంతి చర్య
2. నిష్కాంతి చర్య.
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 3

1. కాంతి చర్య :
కాంతి సమక్షంలో జరిగే ఈ రసాయనిక చర్యను కాంతిచర్య అంటారు. ఇది హరితరేణువులోని థైలకాయిడ్ త్వచంలో జరుగుతుంది.

ఎ) ఫోటాలసిస్ :
ఈ ప్రక్రియలో కాంతిరేణువులోని శక్తిని వినియోగించుకొని నీటి అణువు విచ్ఛిన్నం చేయబడుతుంది. ఈ చర్యనే నీటి కాంతివిశ్లేషణ లేదా ఫోటాలసిస్ అంటారు. దీనిని “హిల్” అనే శాస్త్రవేత్త నిరూపించుట వలన “హిల్ చర్య” అంటారు.
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 4

బి) ఫోటోఫాస్ఫారిలేషన్ :
ఫోటాన్ కదలిక శక్తిని వినియోగించుకొని పదార్థం మరొక ఫాస్ఫేట్ తో కలిసి ATP గా మారుతుంది. ఈ చర్యను (ఫోటోఫాస్ఫారిలేషన్’ అంటారు.
ADP + P → ATP

సి) క్షయకరణచర్య : ఈ ప్రక్రియ NADH అణువు క్షయకరణం చెంది NADH2 గా మారుతుంది.
2NADH + H2 → 2NADH2

ఈ విధంగా కాంతి చర్యలో ATP, NADH2 లు ఏర్పడతాయి. వీటిని “శక్తిగ్రాహకాలు” అంటారు.

2. నిష్కాంతి చర్య :
కాంతి ప్రమేయం లేకుండా జరిగే ఈ చర్యలు, హరితరేణువులోని అవర్ణికలో జరుగుతాయి. ఈ చర్యలకు కాంతిచర్యలో ఏర్పడిన శక్తి గ్రాహకాలు తప్పనిసరి.

CO2 పదార్థం రిబ్యులోజ్ బై ఫాస్ఫేట్ తో కలిసి హెక్సోజ్ చక్కెరగా మారుతుంది. నిలకడలేని ఈ చక్కెర విచ్ఛిన్నం చెంది ఫాస్ఫాగ్లిజరిక్ ఆమ్లంగా మారుతుంది. ఈ ఫాస్ఫాగ్లిజరిక్ ఆమ్లం కొన్ని వరుస చర్యల తరువాత గ్లూకోజ్ గా మారి, పిండి పదార్థంగా నిల్వ చేయబడుతుంది.

CO2 → రిబ్యులోజ్ బై ఫాస్ఫేట్ → హెక్సోజ్ చక్కెర
హెక్సోజ్ చక్కెర → ఫాస్ఫాగ్లిజరిక్ ఆమ్లం
ఫాస్ఫాగ్లిజరిక్ ఆమ్లం → గ్లూకోజ్
గ్లూకోజ్ → పిండిపదార్ధం

AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

ప్రశ్న 7.
కిరణజన్యసంయోగక్రియలో ఏర్పడే ఏవైనా మూడు అంత్య ఉత్పన్నాల పేర్లు రాయండి. (AS1)
జవాబు:
కిరణజన్యసంయోగక్రియలో గ్లూకోజ్, ఆక్సిజన్ మరియు నీరు అంత్య ఉత్పన్నాలుగా ఏర్పడతాయి. గ్లూకోజ్ పిండి పదార్థంగా మార్చబడి నిల్వ చేయబడుతుంది.
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 2

ప్రశ్న 8.
కాంతి చర్య, నిష్కాంతి చర్యల మధ్య సంబంధ పదార్థంగా పనిచేసేది ఏది? (AS1)
జవాబు:
కాంతిచర్య అంత్య ఉత్పన్నాలుగా ATP మరియు NADP లు ఏర్పడతాయి. వీటిని “శక్తి గ్రాహకాలు” అంటారు. వీటిలోని శక్తిని ఉపయోగించుకొని కాంతితో ప్రమేయం లేకుండా నిష్కాంతి చర్యలు ప్రారంభమౌతాయి. ఇవి నిష్కాంతి చర్య ప్రారంభ పదార్థాలు.

ప్రశ్న 9.
చాలా రకాల ఆకుల పైభాగం కింది భాగం కంటే మెరుస్తుంటుంది. ఎందుకు? (AS1)
జవాబు:
ఆకుల అడుగు, పై భాగం అవభాసిని పొరచే కప్పబడి ఉంటుంది. ఆకు అడుగుభాగం కంటే పై భాగాన సూర్యరశ్మి బాగా సోకుతుంది. కావున, సూర్యరశ్మిని తట్టుకోవటానికి అవభాసిని పై తలాల భాగం మందంగా ఉంటుంది. మందమైన అవభాసిని వలన ఆకుల పై భాగం మెరుస్తూ ఉంటుంది.

ప్రశ్న 10.
చక్కని పటం సహాయంతో క్లోరోప్లాస్ట్ నిర్మాణం గురించి వివరించండి. (AS1)
(లేదా)
కిరణజన్య సంయోగ క్రియను నిర్వహించే కణాంగమును పటము సహాయంతో వివరించండి.
జవాబు:
హరితరేణువు నిర్మాణం :
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 5

  1. హరితరేణువులు ఆకులోని పత్రాంతర కణాలలో బాహ్యత్వచం సోమా థైలకాయిడ్ ఉంటాయి.
  2. ఆకుపచ్చని మొక్కలన్నిటిలో ఉండే హరిత రేణువులు కొవ్వుకణికలు స్ట్రోమా చక్రాభంగా ఉంటాయి.
  3. హరితరేణువు రెండు త్వచాలను కలిగి ఉంటుంది.
  4. దీనిలోపలి వర్ణరహిత పదార్థాన్ని అవర్గీక అంటారు.
  5. అవర్ణికలో దొంతరలుగా ఉండే థైలకాయిడ్లు ఉంటాయి. వీటిని పటలికారాశి లేక ‘గ్రానా’ అంటారు.
  6. ఇవి అవర్ణికా పటలికలతో కలుపబడి ఉంటాయి.
  7. పత్రహరితం, దానికి సంబంధించిన ఇతర వర్ణ ద్రవ్యాలు, హరితరేణువులోని థైలకాయిడ్ పొరలలో కొవ్వులో కరిగి ఉంటాయి.
  8. వర్ణద్రవ్యాలు కాంతిచర్య వ్యవస్థ I (PS I) మరియు కాంతిచర్య వ్యవస్థ II (PS II) లుగా ఉంటాయి.

ప్రశ్న 11.
జీర్ణాశయంలో ఆమ్లం పాత్ర ఏమిటి? (AS1)
జవాబు:

  1. జీర్ణాశయంలో స్రవించబడే జఠరరసం హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిగి ఉంటుంది.
  2. ఈ ఆమ్లం లాలాజలం యొక్క క్షార స్వభావాన్ని తగ్గించి జీర్ణ ఎంజైమ్ లు చురుకుగా పనిచేయటానికి తోడ్పడుతుంది.
  3. ఆహారంతో పాటు ప్రవేశించిన సూక్ష్మజీవులను సంహరించటానికి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది.

ప్రశ్న 12.
ఆహారం జీర్ణం చేయడంలో జీర్ణక్రియా ఎంజైమ్ పాత్ర గురించి రాయండి. (AS1)
జవాబు:

  1. ఆహారం జీర్ణం చేయటంలో ఎంజైమ్స్ కీలకపాత్ర వహిస్తాయి. ఎంజైమ్స్ పనిచేసే పదార్థాలను ‘అదస్తరాలు’ అంటారు.
  2. పనిచేసే స్వభావాన్ని బట్టి ఎంజైమ్స్ ను వర్గీకరిస్తారు. పిండిపదార్థంపై పనిచేసే ఎంజైమ్స్ ను “అమైలేజ్” అని, ప్రోటీన్స్ పై పనిచేసే వాటిని “ప్రోటియేజ్” అని, కొవ్వులపై పనిచేసే వాటిని “లైపేజ్” అని అంటారు.
  3. కొన్ని ఎంజైమ్స్ పదార్థాలకు నీటి అణువులను చేర్చి విచ్ఛిన్నం చేస్తాయి. వీటిని “జల విశ్లేషక ఎంజైమ్లు” అంటారు.
  4. ఎంజైమ్స్ పదార్థాలలోని రసాయన బంధాలను విచ్ఛిన్నం చేసి, వాటిని సరళపదార్థాలుగా మార్చుతాయి. ఈ క్రియనే “జీర్ణక్రియ” అంటారు.
  5. జీర్ణం కాబడిన సరళపదార్థాలు రక్తంలోనికి శోషణ చెందుతాయి.

AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

ప్రశ్న 13.
ఆహారం శోషించటానికి చిన్నప్రేగు నిర్మాణం ఎలా మార్పు చెంది ఉంటుంది? (AS1)
జవాబు:
చిన్నప్రేగు యొక్క ప్రధాన విధి శోషణ. జీర్ణమైన ఆహార పదార్థాలను రక్తంలోనికి తీసుకోవడాన్ని శోషణ అంటారు. ఈ ప్రక్రియ కొరకు చిన్నప్రేగు నిర్మాణం అనుకూలంగా ఉంటుంది.

  1. చిన్నప్రేగు పొడవుగా (8 మీటర్లు) ఉండుట వలన జీర్ణమైన ఆహారం పీల్చుకోవటానికి అధిక ప్రదేశం లభిస్తుంది.
  2. ఎక్కువ పొడవుగల కొద్ది ప్రదేశంలో అమరి ఉండటానికి చిన్నప్రేగు అనేక ముడతలు చుట్టుకొని ఉంటుంది.
  3. చిన్నప్రేగు యొక్క లోపలి గోడలు ముడతలు పడి వ్రేళ్ళవంటి నిర్మాణాలు ఏర్పరుస్తుంది. వీటిని ఆంత్రచూషకాలు అంటారు. ఇవి శోషణాతల వైశాల్యం పెంచుతాయి.
  4. ఆంత్రచూషకాలు, రక్తనాళాలు మరియు శోషరసనాళాలను కలిగి ఉండి శోషణ ప్రక్రియను నిర్వహిస్తాయి.

ప్రశ్న 14.
కొవ్వులు ఎలా జీర్ణమవుతాయి? ఎక్కడ జీర్ణమవుతాయి? (AS1)
జవాబు:

  1. జీర్ణవ్యవస్థలో కొవ్వులు ఆంత్రమూలంలో జీర్ణమౌతాయి. కొవ్వులను జీర్ణం చేసే ఎంజైమ్స్ ను “లైపేజ్”లు అంటారు.
  2. కాలేయంచే స్రవించబడే పైత్యరసం, కొవ్వు పదార్థాలను చిన్న అణువులుగా విడగొట్టుతుంది. ఈ ప్రక్రియను “ఎమల్సీకరణం” అంటారు.
  3. క్లోమం, క్లోమరసాన్ని స్రవిస్తుంది. దీనిలోని లైపేజ్ అనే ఎంజైమ్ కొవ్వులపై పనిచేసి కొవ్వు ఆమ్లాలుగా, గ్లిజరాల్ గా మార్చుతుంది.
    AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 6
  4. గ్లిజరాల్ కొవ్వు యొక్క సరళ అంత్య ఉత్పన్నం. ఇది చిన్న ప్రేగులోని శోషరసనాళం ద్వారా శోషణ చెంది శరీరానికి సరఫరా అవుతుంది.

ప్రశ్న 15.
ఆహారం జీర్ణం కావడంలో లాలాజలం పాత్ర ఏమిటి? (AS1)
జవాబు:
లాలాజలం ఆహారాన్ని ముద్దగా మార్చటంతోపాటు జీర్ణక్రియలో కూడా పాల్గొంటుంది. లాలాజలం టయలిన్ అనే ఎంజైమ్ కలిగి ఉంటుంది. ఇది పిండిపదార్థాలపై పనిచేసి వాటిని చక్కెరలుగా మార్చుతుంది. కావున నోటిలో నమిలిన ఆహారం కొంచెం సేపటికి తియ్యగా మారుతుంది.
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 7

ప్రశ్న 16.
జీర్ణవ్యవస్థలో చిన్న ప్రేగులు క్రమంగా ఆమ్లయుతంగా మారితే, ప్రోటీన్లు జీర్ణం కావటంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? (AS1)
జవాబు:

  1. చిన్నప్రేగులో అంత్య జీర్ణక్రియ జరుగుతుంది. చిన్న ప్రేగు గోడలు స్రవించే ఆంత్రరసం ఈ క్రియలో పాల్గొంటుంది.
  2. ఆంత్రరసంలోని పెప్టిడేజెస్ ఎంజైమ్ పెప్టైడ్స్ పై చర్య జరిపి వాటిని అమైనో ఆమ్లాలుగా మార్చుతుంది.
    AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 8
  3. ఈ చర్య తటస్థ మాధ్యమంలో చురుకుగా జరుగుతుంది. చిన్న ప్రేగు క్రమంగా ఆమ్లయుతంగా మారితే, ఈ జీర్ణక్రియ నెమ్మదించి, ప్రోటీన్స్ జీర్ణక్రియ అసంపూర్తి అవుతుంది.

ప్రశ్న 17.
జీర్ణనాళంలో పీచు పదార్థాల పాత్ర ఏమిటి? (AS1)
జవాబు:
పీచు పదార్థాలు జీర్ణనాళంలో జీర్ణం కావు. ఇవి ఎటువంటి పోషక విలువలు కలిగి ఉండవు. అయినప్పటికి జీర్ణక్రియలో కీలకపాత్ర వహిస్తాయి.

పీచుపదార్థాలు జీర్ణనాళంలోని ఆహారానికి బరువును చేకూర్చుట వలన ఆహారం సులువుగా కదులుతుంది. పీచుపదార్థం ఆహారనాళాలను శుభ్రం చేయటానికి తోడ్పడుతుంది. ఆహార కదలికలు సులువుగా ఉండుట వలన మలబద్దకం నివారించబడుతుంది. కావున మన ఆహారంలో పీచుపదార్థాలకు ప్రాధాన్యం ఉంది.

ప్రశ్న 18.
పోషకాహార లోపం అంటే ఏమిటి? ఏవైనా కొన్ని పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధుల గురించి రాయండి. (AS1)
జవాబు:
పోషకాహార లోపం :
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు లోపించిన ఆహారాన్ని తీసుకోవటం వలన జీవక్రియలో ఏర్పడే అసమతుల్యతను ‘పోషకాహార లోపం’ అంటారు.

పోషకాహార లోపం వలన కలిగే వ్యాధులు :
క్వాషియార్కర్ (Kwashiorkor)
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 9
ఇది ప్రోటీన్ లోపం వలన కలిగే వ్యాధి. శరీరంలోని కణాంతరావకాశాలలో నీరు చేరి శరీరమంతా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. కండరాల పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. కాళ్ళు, చేతులు, ముఖం బాగా ఉబ్బి ఉంటాయి. పొడిబారిన చర్మం, విరేచనాలతో బాధపడుతూ ఉంటారు.

మెరాస్మస్ (Marasmus)
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 10
ఈ వ్యాధి ప్రోటీన్లు, కేలరీలు రెండింటి లోపం వల్ల కలుగుతుంది. సాధారణంగా ఈ వ్యాధి వెంటవెంటనే గర్భం దాల్చడం వల్ల పుట్టే పిల్లల్లో లేదా ఎక్కువ కాన్సులయిన తల్లికి పుట్టేపిల్లల్లో సంభవిస్తుంది. ఈ వ్యాధిగ్రస్తులలో నిస్సత్తువగా, బలహీనంగా ఉండడం, కీళ్ళవాపు, కండరాలలో పెరుగుదల లోపం, పొడిబారిన చర్మం, విరేచనాలు మొదలైన లక్షణాలుంటాయి.

ప్రశ్న 19.
ఫంగె, బాకీరియాల వంటి జీవులలో పోషణ ఎలా జరుగుతుంది? (AS1)
జవాబు:

  1. ఫంగై, కొన్ని బాక్టీరియాలు, మృతకళేబరాలను కుళ్ళబెట్టి వాటి పోషకాలను గ్రహించుకుంటాయి.
  2. ఇవి జీర్ణరసాలను తమ పరిసర మాధ్యమంలోనికి స్రవించి పదార్థాలను జీర్ణం చేస్తాయి. జీర్ణమైన పదార్థాలను తరువాత శోషించుకుంటాయి.
  3. ఇటువంటి పోషణ విధానాన్ని ‘పూతికాహారపోషణ’ అంటారు. వీటిని పూతికాహారులు అంటారు.

ప్రశ్న 20.
గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం క్రమంగా పెరుగుతూ పోతుంటే అది కిరణజన్యసంయోగక్రియ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? (AS2)
జవాబు:

  1. గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం పెరుగుతుంటే కిరణజన్యసంయోగక్రియ రేటు క్రమంగా పెరుగుతుంది.
  2. ‘FACE’ ప్రయోగాలు అనుసరించి గాలిలో CO2 మోతాదు 475 నుండి 600 PPM కు పెరిగినపుడు కిరణజన్య సంయోగక్రియ రేటు 40% పెరిగింది.
  3. ఈ విలువకు మించి CO2 పెరిగినపుడు, కిరణజన్యసంయోగక్రియరేటు 40% పడిపోయింది.
  4. అధిక CO2 గాఢతలో పత్రరంధ్రాలు మూసుకుపోయి, వాయువును గ్రహించిన స్థితికి పత్రం చేరి కిరణజన్యసంయోగక్రియ రేటు పడిపోతుంది.

ప్రశ్న 21.
కిరణజన్యసంయోగక్రియ రేటు కంటే శ్వాసక్రియ రేటు ఎక్కువైతే ఏమౌతుంది? (AS2)
జవాబు:

  1. కిరణజన్యసంయోగక్రియలో CO2 గ్రహించబడి ), వెలువడుతుంది.
  2. అదేవిధంగా శ్వాసక్రియలో O2 గ్రహించబడి CO2 వెలువడుతుంది.
  3. ప్రకృతిలో ఈ రెండు క్రియలు సమతాస్థితిని పాటిస్తూ, వాయుస్థిరత్వానికి తోడ్పడుతున్నాయి.
  4. కిరణజన్యసంయోగక్రియ రేటు పెరిగితే, గాలిలో CO2 శాతం తగ్గి O2 శాతం బాగా పెరుగుతుంది.
  5. అధిక ఆక్సిజన్ గాఢతలో జీవులు జీవించలేవు. అది మరణానికి దారితీస్తుంది.
  6. కావున కిరణజన్యసంయోగక్రియ రేటు పెరగటం ప్రమాదకరం. రెండు క్రియలు సమతాస్థితిలో ఉండటం ప్రకృతి ధర్మం.

ప్రశ్న 22.
పిండిపదార్థాలు జీర్ణాశయంలో జీర్ణంకావని ఎలా చెప్పగలవు? (AS2)
జవాబు:

  1. జీర్ణాశయంలో జఠరరసం స్రవించబడి జీర్ణక్రియను నిర్వహిస్తుంది.
  2. జఠరరసంలో రెనిన్, లైపేజ్, పెప్సిన్ అనే ఎంజైమ్స్ ఉంటాయి.
  3. రెనిన్ పాల ప్రోటీన్స్ మీద పనిచేయగా, లైపేజ్ కొవ్వుల మీద, పెప్సిన్ ప్రోటీన్స్ మీద పనిచేసి వాటిని సరళ పదార్థాలుగా మార్చుతాయి.
  4. జఠరరసంలో పిండి పదార్థం పై పనిచేసే ఎంజైమ్స్ లేవు. కావున జీర్ణాశయంలో పిండిపదార్థాలు జీర్ణం కావు.

AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

ప్రశ్న 23.
ఆకులలో పిండిపదార్థాన్ని పరిశీలించటానికి మీరు మీ పాఠశాల ప్రయోగశాలలో అనుసరించిన విధానాన్ని తెలపండి. (AS3)
(లేదా)
ఆకులలో పిండి పదార్థాన్ని పరీక్షించే కృత్యాన్ని రాయండి. (కృత్యం -1)
(లేదా)
ఆకులలో పిండిపదార్థం ఉంటుందని నిరూపించే ప్రయోగంలో కావలసిన పరికరాలు, ప్రయోగ విధానము తెలిపి దాని నుండి వచ్చిన ఫలితంతో నీవేమి గ్రహించావో రాయండి.
జవాబు:
కావలసిన పరికరాలు :
త్రిపాది, బీకరు, నీరు, మిథైలేటెడ్ స్పిరిట్, పరీక్షనాళికలు, అయోడిన్ ద్రావణం, పెట్రెడిష్, డ్రాపర్, బున్సె న్ బర్నర్.

ప్రయోగ విధానం :

  1. కుండీలో పెరుగుతున్న ఏదైనా మొక్క నుండి ఒక ఆకును తీసుకోండి. ఆ ఆకు మెత్తగా పలుచనదై ఉండాలి.
  2. బొమ్మలో చూపిన విధంగా ప్రయోగానికి కావలసిన పరికరాలను సిద్ధం చేసుకోండి.
  3. పరీక్షనాళికలో మిథైలేట్ స్పిరిట్ ను తీసుకొని అందులో ఆకును ఉంచండి.
  4. పరీక్షనాళికను నీరు కలిగిన బీకరులో ఉంచి వేడి చేయండి.
  5. వేడి చేసినపుడు ఆకులోని పత్రహరితం (Chlorophyll) తొలగించబడుతుంది. అందువల్ల ఆకు లేత తెలుపు రంగులోకి మారుతుంది.

AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 11
ఫలితం : ఆకు ముదురు నీలం రంగులోకి మారినది.
గ్రహించినది : ఆకులలో పిండిపదార్థం ఉంటుందని గ్రహించితిని.

ప్రశ్న 24.
ఆకుపచ్చని మొక్కను సూర్యకాంతిలో ఉంచినపుడు, ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి అనటానికి నీవు ఎలాంటి ప్రయోగం చేస్తావు? (AS3)
(లేదా)
కాంతి సమక్షంలో మొక్కలు కిరణజన్య సంయోగక్రియను నిర్వర్తించేటపుడు ఆక్సిజన్ వెలువడుతుంది అని నిరూపించే ప్రయోగాన్ని వివరించండి.
జవాబు:
ఉద్దేశం :
కిరణజన్యసంయోగక్రియలో ఆక్సిజన్ ఏర్పడుతుందని నిరూపించుట.

కావలసిన పరికరములు :
1. గాజుబీకరు 2. గాజుగరాటు 3. పరీక్షనాళిక 4. హైడ్రిల్లా మొక్కలు 5. నీరు

ప్రయోగ విధానం :

AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 12

  1. కొన్ని హైడ్రిల్లా మొక్కలను తీసుకుని వాటిని వెడల్పు మూతిగల గరాటులో ఉంచవలెను.
  2. హైడ్రిల్లా మొక్కలతో కూడిన గరాటును, దాని కాడ పైకి ఉండునట్లుగా ఒక బీకరులో ఉంచవలెను.
  3. గరాటు కాడ పూర్తిగా మునుగు వరకు బీకరులో నీరు పోయవలెను.
  4. ఒక పరీక్ష నాళికను పూర్తిగా నీటితో నింపి, గాలి బుడగలు లేకుండా జాగ్రత్త వహించి, దానిని పటములో చూపినట్లు పరీక్ష నాళిక మూతి నీటిలో ఉండేటట్లు, గరాటు కాడపై బోర్లించవలెను.
  5. ఈ ప్రయోగమును సూర్యరశ్మిలో ఉంచవలెను. కొంచెం సేపు తర్వాత ఆ మొక్కల నుండి గాలిబుడగలు పైకి రావడం గమనిస్తాము.
  6. ఈ రగలు పరీక్ష నాళిక కొనభాగానికి చేరతాయి. అపుడు పరీక్ష నాళికల నీటిమట్టం తగ్గుతుంది.
  7. గాలిబుడగలు తగినంత చేరిన తర్వాత పరీక్షనాళిక మూతిని బొటనవేలితో మూసి నీటి నుండి పైకి తీసి వెలుగుతున్న పుల్లతో ఆ గాలిని పరీక్షించ వలెను.
  8. ఆ వెలుగుతున్న పుల్ల మరింత ఎక్కువ కాంతితో మండుతుంది.

నిర్ధారణ :
వస్తువులను ఎక్కువ కాంతివంతముగా మండించే ధర్మము ఆక్సిజనకు కలదు. కాబట్టి ఇక్కడ హైడ్రిల్లా మొక్కల నుండి వెలువడిన వాయువు ఆక్సిజన్ వాయువు అనియు, అది మొక్కలు కిరణజన్యసంయోగక్రియ జరిపినపుడు విడుదల అయినదనియు ఋజువగుచున్నది.

ప్రశ్న 25.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి పౌష్టికాహార లోపంతో బాధపడుచున్న వేరువేరు వయస్సు ఉన్న పిల్లల సమాచారాన్ని సేకరించి మీ సొంత పట్టికలో నమోదు చేసి తరగతిలో ప్రదర్శించండి.
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 13
జవాబు:

ప్రశ్న 26.
భూమిపైన ఆకుపచ్చని మొక్కలు లేకపోతే, భూమిపైన జీవరాశి మనుగడ కష్టమౌతుందా? దీనిని ఎలా సమర్థిస్తావు? (AS5)
జవాబు:

  1. భూమిపై అన్ని జీవరాశులకు కావలసిన ఆహారాన్ని ఆక్సిజన్‌ను అందించే ఏకైక ప్రక్రియ కిరణజన్యసంయోగక్రియ.
  2. భూమి మీద ఆకుపచ్చని మొక్కలు లేకపోతే, వాతావరణంలోనికి ఆక్సిజన్ తిరిగి చేరదు. కావున జీవులు మనుగడ సాగించలేవు.
  3. జంతువులన్నీ కూడా మొక్కలపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆహారం కొరకు ఆధారపడతాయి. కావున మొక్కలు లేకుండా ఈ జీవులు మనుగడ సాగించలేవు.

ప్రశ్న 27.
మీరు పరిశీలించిన పత్రరంధ్రం పటం గీయండి. కిరణజన్యసంయోగక్రియలో దీని పాత్రను తెలపండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 14

  1. కిరణజన్యసంయోగక్రియలో CO2 గ్రహించబడి ఆక్సిజన్ వెలువడుతుంది.
  2. ఈ వాయు వినిమయం పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది.
  3. పత్ర రంధ్రాలు మొక్కకు ముక్కువంటివి. ఇవి శ్వాసించటానికి మరియు కిరణజన్యసంయోగక్రియలో వాయు వినిమయానికి ఉపయోగపడతాయి.
  4. కిరణజన్యసంయోగక్రియలో గ్రహించబడే కార్బన్ డై ఆక్సైడ్ పత్రరంధ్రాలచే నియంత్రించబడుతుంది.
  5. రక్షక కణాల సడలింపు వ్యాకోచం వలన పత్రరంధ్ర పరిమాణం మారుతూ, వాయు వినిమయాన్ని నియంత్రిస్తుంది.

ప్రశ్న 28.
మానవుని జీర్ణవ్యవస్థ పటం గీచి, భాగాలు గుర్తించండి. ఏ ఏ భాగాలలో పెరిస్టాల్టిక్ చలనం ఉంటుందో, జాబితా రాయండి. (AS5)
జవాబు:
మానవుని జీర్ణవ్యవస్థలో ఈ క్రింది భాగాలలో పెరిస్టాల్టిక్ చలనం కనిపిస్తుంది.
1. ఆహారవాహిక :
ఆహారవాహికలో పెరిస్టాల్టిక్ చలనం వలన ఆహారం నోటి నుండి జీర్ణాశయం చేరుతుంది.

2. జీర్ణాశయం :
జీర్ణాశయంలోని పెరిస్టాల్టిక్ చలనాల వలన ఆహారం బాగా కలియబెట్టబడి చిలకబడుతుంది.

3. చిన్నప్రేగులు :
చిన్నప్రేగులలో పెరిస్టాల్టిక్ చలనం వలన చిన్నగా ముందుకు కదులుతూ శోషించబడుతుంది. శోషించబడని ఆహారం పెద్ద ప్రేగులకు చేరుతుంది.
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 15

4. పెద్ద ప్రేగు :
పెద్ద ప్రేగులో ఆహారంలోని నీరు పీల్చుకోబడి, వ్యర్థ పదార్థం ముందుకు నెట్టబడుతుంది.

ప్రశ్న 29.
ఆహారనాళంలో వివిధ అవయవాల గుండా ఆహారం ప్రయాణించే విధానాన్ని ప్రదర్శించేందుకు రహీమ్ ఒక నమూనాను తయారుచేశాడు. దానిని పరిశీలించండి. అవయవాల పేర్లు రాయండి. (AS5)
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 16
జవాబు:
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 17

ప్రశ్న 30.
కింది పటాన్ని పరిశీలించండి. కాంతి, నిష్కాంతి చర్యల గురించి మీరేమి అర్థం చేసుకున్నారో రాయండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 18
పటం ఆధారంగా అర్థంచేసుకొన్న విషయాలు :

  1. కిరణజన్యసంయోగక్రియ రెండు దశలలో జరుగుతుంది. కాంతి అవి :
    1. కాంతి చర్యలు
    2. నిష్కాంతి చర్యలు
  2. కాంతి చర్యలు హరిత రేణువులలోని గ్రానాలో జరుగుతాయి. ఈ చర్యలలో సౌరశక్తి పత్రహరితంచే గ్రహించబడుతుంది.
  3. కాంతి శక్తి ఆధారంగా నీటి అణువు విచ్చిన్నం చెందుతుంది. ఈ ప్రక్రియను ‘నీటి కాంతివిశ్లేషణ’ లేదా ‘ఫోటాలసిస్’ అంటారు.
  4. ఫోటాలసిలో ఏర్పడిన ఫోటాన్ చలనం ఆధారంగా ATP, NADPH పదార్థాలు ఏర్పడతాయి. వీటిని శక్తి గ్రాహకాలు అంటారు.
  5. శక్తిగ్రాహకాలు, నిష్కాంతి చర్యలో వినియోగించబడతాయి.
  6. నిష్కాంతిచర్యలో ‘రిబ్యులోజ్ బై ఫాస్ఫేట్’ అనే మాధ్యమిక పదార్థం CO2 ను గ్రహించి చక్కెరగా మారుతుంది.
  7. ఈ చక్కెర అనేక మార్పుల అనంతరం పిండి పదార్థంగా మారుతుంది.
  8. కాంతి పిండి పదార్థం రిబ్యులోజ్ బై ఫాస్పేట్ పునరుద్ధరణకు ఉపయోగించబడుతుంది.
  9. ఈ వలయ చర్యలను వివరించిన కెల్విన్ పేరు మీదుగా నిష్కాంతి చర్యను ‘కెల్విన్ వలయం’ అంటారు.

ప్రశ్న 31.
దాదాపు జీవ ప్రపంచమంతా ఆహారం కోసం మొక్కల పైనే ఆధారపడుతోంది కదా! ఆకుపచ్చని మొక్కలు ఆహారం తయారుచేసే విధానాన్ని నీవు ఎలా అభినందిస్తావు? (AS6)
జవాబు:

  1. ఆకుపచ్చని మొక్కలు ఆహారం తయారుచేసే కిరణజన్యసంయోగక్రియ ఒక అద్భుతమైన జీవక్రియ.
  2. ఈ జీవక్రియ సమస్త జీవరాశికి ఆహారం అందిస్తుంది. అన్ని జీవరాశులు తమ ఆహారం కొరకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ జీవక్రియపై ఆధారపడుతున్నాయి.
  3. జీవులకు ఆహారం అందించుటయేగాక, ఆక్సిజన్‌ను అందించే అద్భుత ప్రక్రియ కిరణజన్యసంయోగక్రియ. ఈ క్రియ ఆధారంగానే మనం శ్వాసించటానికి కావలసిన ఆక్సిజన్ లభిస్తుంది.
  4. మనకు జీవనాధారమైన ఈ క్రియ కొరకు మనం చెట్లపై ఆధారపడి ఉన్నాము. కావున చెట్లను పెంచడం, వాటిని రక్షించటం మన మనుగడకు ఆవశ్యకమని గుర్తించాలి.
  5. అద్భుతమైన కిరణజన్యసంయోగక్రియ, జీవక్రియ కోసం నేను చెట్లు పెంచుతాను.

ప్రశ్న 32.
గట్టిగా ఉండే ఆహార పదార్థాలు సైతం జీర్ణక్రియలో మెత్తని గుజ్జుగా మారిపోతాయి. అలాగే ఎక్కడ ఏ రకమైన ఎంజైమ్ అవసరమో ఆ ప్రత్యేక ప్రదేశంలోనే ఆ ఎంజైమ్ విడుదలవుతుంది. ఆశ్చర్యం కలిగించే ఈ అంశాలను సూచిస్తూ ఒక కార్టూన్ గీయండి. (AS7)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 19

ప్రశ్న 33.
ఈ పాఠం చదివిన తరువాత నీవు నీ ఆహారపు అలవాట్లలో ఏ ఏ మార్పులు చేసుకొంటావు? (AS7)
జవాబు:
ఈ పాఠం చదివిన తరువాత నా ఆహారపు అలవాట్లలో కింది మార్పులు చేసుకొన్నాను.

  1. ఆహారాన్ని తినేటప్పుడు బాగా నమిలి మింగుతున్నాను. అందువలన జీర్ణక్రియ సులభంగా జరుగుతున్నది.
  2. సరళమైన ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇస్తున్నాను. తద్వారా, జీర్ణక్రియ చురుకుగా పనిచేస్తున్నది.
  3. ఆహారపదార్థం, కాయలు, పండ్లకు ప్రాధాన్యం ఇవ్వటం వలన పీచు పదార్థం లభిస్తున్నది.
  4. భోజనానికి ముందు చేతులు పరిశుభ్రంగా కడగటం వలన సూక్ష్మజీవుల ప్రవేశం నివారిస్తున్నాను.
  5. భోజనం చేసేటప్పుడు మాట్లాడకుండా మౌనంగా భోజనం చేస్తున్నాను.

10th Class Biology 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ Textbook InText Questions and Answers

10th Class Biology Textbook Page No. 4

ప్రశ్న 1.
కిరణజన్యసంయోగక్రియకు కావలసిన పదార్థాలన్నీ సమీకరణంలో ఇమిడి ఉన్నాయని చెప్పగలమా?
జవాబు:
కిరణజన్యసంయోగక్రియ సమీకరణం :
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 2

ఈ సమీకరణంలో కిరణజన్యసంయోగక్రియకు అవసరమైన CO2, నీరు, కాంతి, పత్రహరితంతో పాటు, అంత్య ఉత్పన్నాలు కూడా సూచించబడ్డాయి.

10th Class Biology Textbook Page No. 5

ప్రశ్న 2.
ప్రయోగ అమరికను కదపకుండా పుదీనా మొక్కను గంట జాడిలో ప్రవేశపెట్టడానికి ‘జోసఫ్ ప్రీస్టే’ ఏం చేసి ఉంటాడు?
జవాబు:
ప్రయోగ అమరికను కదపకుండా పుదీనా మొక్కను గంట జాడిలో ప్రవేశపెట్టటం సాధ్యం కాదు. వాస్తవానికి జోసఫ్ ప్రీస్టే ‘గంట జాడిలో ఎలుకను ఉంచి అది జీవించిన సమయాన్ని లెక్కించాడు. రెండవ సారి పుదీనా మొక్కను గంట జాడిలో ఉంచి ఎలుక జీవించి ఉన్న సమయం అధికంగా ఉండటం గమనించాడు. ఇదే ప్రయోగాన్ని రెండు గంటజాడీలతో ఒకే సమయంలో నిర్వహించవచ్చు.

ప్రశ్న 3.
గంటజాడీ వెలుపల నుండి క్రొవ్వొత్తిని ఎలా వెలిగించి ఉంటాడు?
జవాబు:
వాస్తవానికి ప్రీస్టే తన ప్రయోగంలో కొవ్వొత్తిని వెలిగించి దానిపైన గంట జాడిని బోర్లించాడు. గంట జాడి వెలుపల నుండి క్రొవ్వొత్తిని వెలిగించటానికి, ఎలక్ట్రిక్ స్పార్క్ వంటి ఆధునిక పరికరాలు ఉపయోగించవలసి ఉంటుంది.

AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

ప్రశ్న 4.
కొవ్వొత్తికి, ఎలుకకు, పుదీనా మొక్కకు మధ్య మీరు ఏమైనా సంబంధాన్ని గుర్తించారా?
జవాబు:
జంతువుల శ్వాసక్రియలో – కొవ్వొత్తి మండే ప్రక్రియలో వినియోగించబడుతున్న వాయువు పుదీనా మొక్కచే భర్తీ చేయబడుతుంది. జీవుల శ్వాసక్రియలో ఆక్సిజన్ వినియోగించబడగా, మొక్కలు కిరణజన్యసంయోగక్రియ ద్వారా ఆక్సిజనన్ను విడుదల చేస్తాయి.

10th Class Biology Textbook Page No. 9

ప్రశ్న 5.
వివిధ రంగులు కలిగిన ఆకులు కూడా కిరణజన్యసంయోగక్రియను నిర్వహిస్తాయా?
జవాబు:
ఆకులో పత్రహరితం ప్రధాన వర్ణద్రవ్యంగా ఉన్నప్పటికీ, ఇతర రంగులకు కలిగించే వర్ణకాలు కూడా కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తాయి. కెరొటిన్, జాంథోఫిల్ వంటి వర్ణదాలు ఆకులలో పసుపు, ఎరుపు వర్ణకాలను ఏర్పరచి కిరణజన్యసంయోగక్రియను నిర్వహిస్తాయి.

ప్రశ్న 6.
మొక్కల్లో పత్రహరితం మరియు ఇతర వర్ణదాలు ఎక్కడ ఉంటాయి?
జవాబు:
మొక్కలలో పత్రహరితం మరియు ఇతర వర్ణదాలు హరితరేణువులో ఉంటాయి. హరితరేణువులోని థైలకాయిడ్ త్వచములో కిరణజన్య సంయోగక్రియ నిర్వహించే వర్ణదాలు అమరి ఉంటాయి.

ప్రశ్న 7.
మొక్కలలో కిరణజన్యసంయోగక్రియ జరిగే భాగాల పేర్లు చెప్పండి.
జవాబు:
మొక్కలలోని ఆకుపచ్చని భాగాలయిన పత్రాలు కిరణజన్యసంయోగక్రియ ప్రధాన వనరులు. వీటితో పాటుగా లేత కాండాలు, మొగ్గలు, కిరణజన్యసంయోగక్రియను నిర్వహిస్తాయి.

ప్రశ్న 8.
మొక్కలలో నూతనంగా ఏర్పడే ఎరుపురంగు చిగురాకులు కూడా కిరణజన్యసంయోగక్రియను నిర్వహిస్తాయని భావిస్తున్నారా?
జవాబు:
అవును. లేత ఆకులలో ఉండే కెరొటిన్, జాంథోఫిల్ వర్ణకాలు కిరణజన్యసంయోగక్రియను నిర్వహిస్తాయి. ఆకు పెరిగే కొలది వాటిలో పత్రహరితం తయారౌతుంది.

10th Class Biology Textbook Page No. 15

ప్రశ్న 9.
మనం తిన్న ఆహారం శరీరం లోపలికి వెళ్ళిన తరువాత ఏమౌతుంది?
జవాబు:
మనం తిన్న ఆహారం శరీరంలోనికి వెళ్ళిన తరువాత, జీర్ణవ్యవస్థలోని వివిధ భాగాలలో జీర్ణమై చిన్న ప్రేగులోకి పీల్చుకొనబడుతుంది.

10th Class Biology Textbook Page No. 18

ప్రశ్న 10.
జీర్ణక్రియా విధానం గురించి నీవు ఏమనుకొంటున్నావు?
జవాబు:
జీర్ణక్రియ చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. జీర్ణవ్యవస్థ ఆహారం వివిధ ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ జీర్ణమౌతుంది. జీర్ణక్రియ ఒక్కసారిగా కాకుండా దశల వారీగా ముందుకు కొనసాగుతుంది.

ప్రశ్న 11.
జీర్ణక్రియలో జరిగే ప్రధాన దశలు ఏవి?
జవాబు:
జీర్ణక్రియలో ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి. అవి :

  1. అంతర గ్రహణం
  2. జీర్ణక్రియ
  3. శోషణ
  4. మలవిసర్జన

10th Class Biology 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1: ఆకులలో పిండిపదార్థం

పత్ర పరిశీలన :
1. ఆకును వాచ్ గ్లాస్ లేదా పెట్రెడిష్ లో మడతలు పడకుండా వెడల్పుగా పరచండి. దానిపైన కొన్ని చుక్కలు అయోడిన్ లేదా బెటాడిన్ ద్రావణాన్ని చుక్కలు చుక్కలుగా వేయండి. పత్రాన్ని పరిశీలించండి. మీరు ఏమి మార్పులను గమనించారు?
జవాబు:
పత్రం నీలి రంగుగా మారింది.

2. కిరణజన్యసంయోగక్రియ ద్వారా కాంతిశక్తి రసాయనిక శక్తిగా మార్చబడుతుందని మీరు భావిస్తున్నారా?
జవాబు:
ఔను. కిరణజన్యసంయోగక్రియ ప్రారంభంలో శక్తి సూర్యుని నుండి గ్రహించబడుతుంది. ఈ సౌరశక్తి ఆధారంగా మొక్కలు ఆహారం తయారు చేస్తాయి. కావున సౌరశక్తి ఆహారంలో నిల్వ ఉంటే రసాయనిక శక్తిగా మార్చబడినది.

కృత్యం -2 : కిరణజన్యసంయోగక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ ఆవశ్యకత

2. కిరణజన్యసంయోగక్రియకు CO2 అవసరం అని ఎలా నిరూపిస్తావు?
(లేదా)
కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డై ఆక్సైడ్ అవసరమని నిరూపించే కృత్యాన్ని రాయండి.
జవాబు:
ఉద్దేశం : కిరణజన్యసంయోగక్రియకు CO2 అవసరమని నిరూపించుటకు

కావలసిన పరికరములు :

  1. కుండీలో పెరుగుచున్న పొడవాటి వెడల్పు తక్కువగల ఆకుపచ్చని ఆకులు గల మొక్క.
  2. వెడల్పు మూతిగల గాజుసీసా.
  3. సీసామూతికి సరిపడు కార్కు (రెండుగా చీల్చబడినది.)
  4. అయోడిన్ పరీక్షకు కావలసిన పరికరాలు.

AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 20

ప్రయోగ విధానం :

  1. పొడవాటి, వెడల్పు తక్కువ ఆకులు గల కుండీలో వున్న మొక్కను ఎంచుకోవాలి.
  2. ఆ మొక్కకు రెండు లేక మూడు రోజులు సూర్యరశ్మి తగులకుండా ఉంచాలి. దీనివలన ఆకులలో పిండిపదార్థం తయారవ్వదని నిర్ధారణ చేసుకోవచ్చు.
  3. వెడల్పు మూతిగల గాజుసీసాను, దానికి సరిపోయే బెండుమూతను తీసుకోవాలి. బెండుమూతను మధ్యగా కోసి రెండు భాగాలు చేయాలి.
  4. ప్రయోగం చేసేముందు ఆ సీసాలో కొంచెం పొటాషియం హైడ్రాక్సైడు ద్రావణం పోయాలి. ఇది సీసాలో ఉండే గాలిలోని కార్బన్ డై ఆక్సైడును పీల్చివేస్తుంది.
  5. ప్రయోగం చేసే రోజున ఉదయం, ఎంచిన ఆకు అర్ధభాగాన్ని, రెండుగా చీల్చిన కార్కు మధ్య భాగంలో ఉంచి, పటంలో చూపినట్లు, గాజుసీసాలోకి ఉంచాలి. ఈ ఆకును మొక్క నుండి వేరుచేయరాదు.
  6. ఆకు చివరివైపు భాగం సీసాలో ఉంటే, దాని కింద భాగం కార్కుకు పై భాగాన ఉంటుంది.
  7. సీసా మూతికి చుట్టూ గాలి చొరబడకుండా గ్రీజు కాని, వేజ్ లైను గాని పూయాలి.
  8. సీసాలో పోసిన క్షారద్రావణం ఆకుకు తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి.
  9. అలా అమర్చిన మొక్కను 3 – 4 గంటలు ఎండలో ఉంచాలి.
  10. తరువాత ఆ ఆకును సీసా నుండి తీసి, మొక్క నుండి వేరుచేసి పిండిపదార్థం కొరకు అయోడితో పరీక్షించాలి.
  11. సీసాలోవున్న పత్రం చివరిభాగం నీలిరంగుగా మారదు. కారుపై వున్న పత్రభాగం పిండిపదార్థం తయారుచేసికొనుట వలన నీలిరంగులోకి మారుతుంది.

ప్రయోగ ఫలితం :
సీసాలోని కార్కు వెలుపల ఉన్న పత్రభాగాలు రెండూ కూడా సూర్యకాంతిని పొంది నీరు, హరితరేణువులను కలిగి ఉంటాయి. సీసాలో ఉండే పత్రభాగానికి కార్బన్ డై ఆక్సైడు లభించలేదు. అందువలన అక్కడ పిండిపదార్థం తయారుకాలేదు. అందుచేతనే అయోడిన్ పరీక్ష చేసినపుడు ఆ భాగం నీలిరంగుగా మారలేదు.

నిర్ధారణ :
దీనిని బట్టి కిరణజన్యసంయోగక్రియకు కార్బన్ డై ఆక్సైడు అవసరమని ఋజువగుచున్నది.

గ్రహించినది :
1. మొక్కను మొదట చీకటిలో ఉంచిన తరువాత వెలుతురులో ఉంచటానికి కారణం ఏమిటి?
జవాబు:
మొక్కను చీకటిలో ఉంచినపుడు, పత్రంలో నిల్వ ఉన్న పిండి పదార్థం వినియోగింపబడుతుంది. తిరిగి కిరణజన్య సంయోగక్రియ జరిగి పిండిపదార్ధం ఏర్పడడానికి, మొక్కను తిరిగి సూర్యరశ్మిలో ఉంచారు.

AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

2. ఈ ప్రయోగంలో రెండు ఆకులను ఎందుకు పరీక్షించాలి?
జవాబు:
మొదటి ఆకును CO2 అందించకుండా, రెండవ ఆకుకు CO2 అందించి పరీక్షించుట వలన ఫలితాలను స్పష్టంగా నిర్ధారించవచ్చు. ఈ ప్రయోగంలో CO2 అందించని పత్రంలో పిండి పదార్థం ఏర్పడలేదు. అందించిన పత్రంలో పిండిపదార్థం ఏర్పడింది. కావున కిరణజన్యసంయోగక్రియ జరగటానికి CO2 అవసరమని నిర్ధారించవచ్చు.

కృత్యం – 3 : పిండి పదార్థం ఏర్పడడానికి కాంతి ఆవశ్యకత:

3. కిరణజన్యసంయోగక్రియకు కాంతి అవసరమని ఎలా నిరూపిస్తావు?
లేదా
పిండిపదార్థం ఏర్పడడానికి కాంతి అవసరమనే కృత్యాన్ని రాయండి.
జవాబు:
ఉద్దేశం : కిరణజన్యసంయోగక్రియకు కాంతి అవసరమని నిరూపించుట

కావలసిన పరికరములు :
కుండీలో పెరుగుచున్న ఆకుపచ్చని ఆకులు గల మొక్క, లైట్ స్క్రీన్.
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 21

నల్ల కాగితం ప్రయోగం ప్రయోగ విధానం :

  1. కుండీలో వున్న మొక్కను తీసుకొని, రెండు రోజులు దానిని చీకటిలో ఉంచాలి. దీని వలన ఆ మొక్క ఆకులోని పిండి పదార్థం సంపూర్ణంగా అదృశ్యమవుతుంది.
  2. ఒక ఆకుకు కాంతి పడకుండా చేసే లైట్ స్క్రీన్‌ను అమర్చాలి. లైట్ స్క్రీన్ మూత ఆకును పట్టి ఉంటుంది.
  3. మూతమీద ముందే చెక్కిన ‘S’ ఆకారపు నమూనా ఉంటుంది.
  4. మొక్కకు తగినంత నీరుపోసి 4 – 5 గంటలు ఎండలో ఉంచాలి. దీనివలన మూతమీద చెక్కిన ‘S’ ఆకారము ద్వారా మాత్రమే ఆకుపైన కాంతి ప్రసరిస్తుంది.
  5. తదుపరి మొక్క నుండి ఆకును వేరుచేసి, ఆ తరువాత లైట్ స్క్రీన్‌ను కూడా ఆకు నుండి తీసివేయాలి.
  6. పిమ్మట పిండిపదార్ధము కొరకు ఆ ఆకును అయోడిన్ పరీక్ష చేయాలి.
  7. సూర్యకాంతి గ్రహించిన ప్రదేశంలో మాత్రమే నీలంగా మారుతుంది.
  8. ఇలా మార్పు చెందినచోటు, మూతమీద చెక్కిన ‘S’ ఆకారపు నమూనాను పోలి ఉంటుంది. కాంతి గ్రహించనిచోట నీలిరంగుగా మారదు.

నిర్ధారణ :
దీనినిబట్టి కిరణజన్యసంయోగక్రియకు కాంతి లేక వెలుతురు అవసరమని ఋజువగుచున్నది.

పరిశీలన :
1. కొన్ని గంటల తరువాత మొక్క నుండి ఆకును వేరుచేయవలెను. పిండిపదార్థం కొరకు అయోడిన్ పరీక్షను నిర్వహించవలెను. ఏ భాగం నీలి నలుపు రంగులోకి మారింది? మిగిలిన భాగం ఎలా ఉంది?
జవాబు:
నల్ల కాగితం ఉన్న ప్రాంతం మినహా మిగిలిన ప్రాంతం నీలి నలుపు రంగులోకి మారింది.

2. కత్తిరించిన డిజైన్ ఆకారం గుండా కాంతి ప్రసరించిన ఆకుభాగం మాత్రమే అయోడితో నీలి నలుపు రంగులో మారటం గమనిస్తాం. కారణం ఏమిటి?
జవాబు:
పిండి పదార్థం ఉన్న ప్రాంతం నీలి నలుపు రంగుకు మారింది. మొక్కలలో కాంతి సోకిన భాగంలో నీలి నలుపుగా మారిందంటే ఆ ప్రాంతంలోనే కిరణజన్యసంయోగక్రియ జరిగింది. కనుక కిరణజన్యసంయోగక్రియ జరగటానికి సూర్యరశ్మి అవసరమని దీని ద్వారా నిరూపించవచ్చు.

కృత్యం – 4: లిట్మస్ కాగితం పరీక్ష
‘జీవక్రియలలో సమన్వయం’ పాఠంలో సూచించిన విధంగా పిండిపదార్థంపై లాలాజల ప్రభావాన్ని తెలిపే ప్రయోగం (కృత్యం-7) చేయండి. ‘ఫలితాల గురించి మీ తరగతిలో చర్చించండి.

పిండి పదార్థంపై లాలాజల ప్రయోగం ద్వారా ఈ క్రింది విషయాలు అవగాహన అయినాయి.

  1. లాలాజలం పిండిపదార్థం పై చర్య జరుపుతుంది. లాలాజలం కలిపిన పిండి పదార్థం అయోడిన్ పరీక్షలో నీలిరంగుగా మారలేదు. అంటే లాలాజల ప్రభావం వలన పిండిపదార్థం తన స్వభావాన్ని మార్చుకుంది.
  2. లాలాజలం పిండిపదార్థంపై పనిచేసి దానిని చక్కెరగా మార్చుతుంది. కావున మనం అన్నం నోటిలో పెట్టుకొన్నప్పుడు చప్పగా ఉండి నమిలే కొలది తియ్యగా అనిపిస్తుంది.
  3. లాలాజలంలో టయలిన్ అనే ఎంజైమ్ పిండిపదార్థంపై పనిచేస్తుంది. ఇది అమైలేజ్ వర్గానికి చెందిన ఎంజైమ్. దీని ప్రభావం వలన పిండిపదార్థం మాల్టోజ్ చక్కెరగా మారుతుంది.
    AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 22

కృత్యం – 5 : ఎంజైమ్ ల పట్టిక పరిశీలిద్దాం

జీర్ణవ్యవస్థలో పనిచేసే ఎంజైమ్ ల పట్టికను పరిశీలించండి. వివిధ రకాల జీర్ణరసాలు మరియు ఎంజైమ్ ల విధులను గురించి తరగతి గదిలో చర్చించండి.
AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ 23

1. కార్బోహైడ్రేట్స్ పై చర్యజరిపే ఎంజైమ్లు ఏవి?
జవాబు:
టయలిన్, అమైలేజ్ ఎంజైమ్స్, కార్బోహైడ్రేట్స్ పై పనిచేస్తాయి.

2. ఏ జీర్ణరసంలో ఎంజైమ్లు ఉండవు?
జవాబు:
పైత్యరసంలో ఎంజైమ్స్ ఉండవు.

3. ప్రోటీన్లపై చర్య జరిపే ఎంజైమ్ లు ఏవి?
జవాబు:
పెప్సిన్, ట్రిప్సిన్, పెప్టైడేజెస్ ఎంజైమ్స్ ప్రోటీన్లపై చర్య జరుపుతాయి.

కింది ఖాళీలను పూరించండి

1. మొక్కలు తయారుచేసుకునే ఆహారపదార్థం …………… రూపంలో నిల్వచేయబడుతుంది. (పిండిపదార్థం)
2. కిరణజన్యసంయోగక్రియ జరిగే ప్రదేశంగా పేర్కొనదగినది (హరితరేణువు)
3. క్లోమరసంలో ఉండే ఎంజైమ్లు ……………….. లను జీర్ణం చేయడానికి తోడ్పడతాయి. (అమైలేజ్, ట్రిప్సిన్)
4. చిన్నప్రేగులలో ఉపరితల వైశాల్యం పెంచడానికి వేళ్ళ వంటి నిర్మాణాలు కనబడతాయి. వీటిని ……. అంటారు. (ఆంత్రచూషకాలు)
5. జఠరరసంలో …. …………….. ఆమ్లం ఉంటుంది. (హైడ్రోక్లోరిక్)
6. ప్రేగులలో ఉండే బాక్టీరియా ……………………….. విటమినను సంశ్లేషిస్తుంది. (K)

సరైన సమాధానాన్ని గుర్తించండి

1. కిందివానిలో పరాన్నజీవులు (C)
i) ఈస్ట్ ii) పుట్టగొడుగు iii) కస్కుట iv) జలగ
A) (i), (ii)
B) (iii)
C) (iii), (iv)
D) (i)
జవాబు:
C) (iii), (iv)

2. కిరణజన్యసంయోగక్రియ రేటు కింది వాటితో ప్రభావితం కాదు
A) కాంతి తీవ్రత
B) ఆర్తత
C) ఉష్ణోగ్రత
D) కార్బన్ డై ఆక్సైడ్ గాఢత
జవాబు:
B) ఆర్తత

3. మొక్కను 48 గంటలపాటు చీకటిలో ఉంచిన తరువాత కిరణజన్యసంయోగక్రియకు సంబంధించిన ప్రయోగం చేస్తారు ఎందుకంటే
A) క్లోరోఫిల్ ను తొలగించుటకు
B) పిండిపదార్థాన్ని తొలగించుటకు
C) కిరణజన్యసంయోగక్రియ జరుగుటను నిరూపించుటకు
D) పిండిపదార్థం అయిపోతుందని తెలుసుకోవడానికి
జవాబు:
B) పిండిపదార్థాన్ని తొలగించుటకు

4. కింది వానిలో ఎంజైమ్ లేని జీర్ణరసం
A) పైత్యరసం
B) జఠరరసం
C) క్లోమరసం
D) లాలాజలం
జవాబు:
A) పైత్యరసం

5. ఏకకణ జీవులలో ఆహార సేకరణ క్రింది వాని ద్వారా జరుగుతుంది
A) శరీర ఉపరితలం ద్వారా
B) నోటి ద్వారా
C) దంతాల ద్వారా
D) రిక్తిక ద్వారా
జవాబు:
A) శరీర ఉపరితలం ద్వారా

AP Board 10th Class Biology Solutions 1st Lesson పోషణ – ఆహార సరఫరా వ్యవస్థ

6. కిరణజన్యసంయోగక్రియ జరిగేటపుడు మొక్కలో ఏ భాగం గాలిలో నుండి కార్బన్ డై ఆక్సైడ్ ను గ్రహిస్తుంది?
A) మూలకేశాలు
B) పత్రరంధ్రం
C) ఆకుఈనె
D) రక్షకపత్రాలు
జవాబు:
B) పత్రరంధ్రం

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం InText Questions

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం InText Questions

SCERT AP 10th Class Maths Textbook Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం InText Questions Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 10th Class Maths Solutions 14th Lesson సాంఖ్యకశాస్త్రం InText Questions

ఆలోచించి, చర్చించి, రాయండి:

ప్రశ్న 1.
వర్గీకృత మరియు అవర్గీకృత దత్తాంశానికి సగటును కనుగొనవచ్చు. వీటిలో ఏది అత్యంత ఖచ్చితమైన సగటు అని నీవు భావిస్తావు ? ఎందుకు ? (పేజీ నెం. 327)
సాధన.
వర్గీకృత దత్తాంశం ద్వారా అత్యంత ఖచ్చితమైన సగటును కనుగొనవచ్చును. . ఎందుకనగా వర్గీకృత దత్తాంశం తరగతులుగా విడగొట్టబడి ఉంటుంది. ఆ దత్తాంశం యొక్క పౌనఃపున్యాలు ఆ తరగతి ఆధారంగా నిర్ణయించబడి, ప్రతి ‘ అంశాన్ని పరిగణలోనికి తీసుకొంటాం. కావున, ఇది ఖచ్చితమైన సగటునిస్తుంది.

ప్రశ్న 2.
దత్తాంశ విశ్లేషణకు వర్గీకృత దత్తాంశము ఎప్పుడు అనువైనది ? (పేజీ నెం. 327)
సాధన.
దత్తాంశంలో రాశుల సంఖ్య చాలా ఎక్కువగా ఇచ్చినపుడు వర్గీకృత దత్తాంశం విశ్లేషణకు అనువైనది.

ప్రశ్న 3.
పై మూడు పద్ధతుల ద్వారా సాధించబడిన ఫలితము ఒకటేనా ? (పేజీ నెం. 331)
సాధన.
అవును.

ప్రశ్న 4.
ఒకవేళ x, మరియు f, లు చాలినంత చిన్నగా ఉంటే, : అపుడు ఏ పద్ధతిని ఎన్నుకోవడం అనుకూలమైనది ? (పేజీ నెం. 331)
సాధన.
ప్రత్యక్ష పద్ధతి.

ప్రశ్న 5.
ఒకవేళ xi మరియు fi ల విలువలు పెద్ద సంఖ్యలు అయినపుడు ఏ పద్ధతి సరియైన పద్ధతి ? (పేజీ నెం. 331)
సాధన.
సంక్షిప్త విచలన పద్ధతి.

AP Board 10th Class Maths Solutions 14th Lesson సాంఖ్యకశాస్త్రం InText Questions

ఇవి చేయండి:

ప్రశ్న 1.
ఈ క్రింది దత్తాంశానికి బాహుళకాన్ని కనుక్కోండి.
a) 5, 6, 9, 10, 6, 12, 3, 6, 11, 10, 4, 6, 7.
b) 20, 3, 7, 13, 3, 4, 6, 7, 19, 15, 7, 18, 3.
c) 2, 2, 2, 3, 3, 3, 4, 4, 4, 5, 5, 5, 6, 6, 6. (పేజీ.నెం. 334)
సాధన.
బాహుళకం
a) 6 (తరచుగా వచ్చు విలువ)
b) 3, 7 (ద్విబాహుళకం)
c) బాహుళకం లేదు. బాహుళక రహిత దత్తాంశము.

ప్రశ్న 2.
బాహుళకము ఎల్లప్పుడు దత్తాంశమునకు మధ్యలో
ఉంటుందా ? (పేజీ నెం. 334)
సాధన.
ఉండనవసరం లేదు.

AP Board 10th Class Maths Solutions 14th Lesson సాంఖ్యకశాస్త్రం InText Questions

ప్రశ్న 3.
10 క్రికెట్ మ్యా చ్ లో ఒక బౌలర్ తీసిన వికెట్లు క్రింది విధంగా ఉన్నాయి. 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3 (ఉదాహరణ – 4). ఈ దత్తాంశానికి మరొక రాశిని చేర్చగా బాహుళకము మారుతుందా ? వ్యాఖ్యానించండి. (పేజీ నెం. 334)
సాధన.
దత్తాంశానికి మరో అంశం కొత్తగా కలిపినపుడు దాని బాహుళకం – మారుతుందా లేదా అనేది మనం చేర్చిన దత్తాంశంపై ఆధారపడుతుంది. ఉదాహరణకు మనకు ఇచ్చిన దత్తాంశం నందు 0, 1, 2, 2, 2, 3, 3, 4, 5, 6 అను దానిలో 2 (3 సార్లు) ఉన్నది. కావున దీని బాహుళకం = 2.

అయితే మనం ఈ దత్తాంశానికి “3” అనే అంశాన్ని చేర్చితే ఆ దత్తాంశం 0, 1, 2, 2, 2, 3, 3, 3, 4, 5, 6 గా మారును. అపుడు ఈ క్రొత్త దత్తాంశానికి 2 మరియు 3 లు రెండూ కూడా బాహుళకం అగును. అపుడు దీనిని ద్విబాహుళక దత్తాంశం అందురు, కావున ‘3’ చేర్చుటువల్ల బాహుళకం మారును. 3 కాకుండా ఏ ఇతర అంశాన్ని చేర్చినా బాహుళకం మారదు అని గుర్తించాలి.

ప్రశ్న 4.
ఒకవేళ ఉదాహరణ-4లోని రాశులలోని గరిష్ఠవిలువ ‘8’కి మారిన, దాని ప్రభావం అట్టి దత్తాంశం యొక్క బాహుళకంపై ఉంటుందా ? .వ్యాఖ్యానించుము. (పేజీ నెం. 334)
సాధన.
4లోని రాశులలో, గరిష్ట విలువ 8కి మారిన, దాని ప్రభావం బాహుళకంపై ఉండదు, బాహుళకం మారదు. గరిష్ఠ, కనిష్ఠ విలువలకు. బాహుళకం మారనవసరం లేదు.”

AP Board 10th Class Maths Solutions 14th Lesson సాంఖ్యకశాస్త్రం InText Questions

ఆలోచించి, చర్చించి, రాయండి:

ప్రశ్న 1.
సందర్భాన్ని బట్టి మనము తరగతిలోని విద్యార్థుల అందరి సరాసరి మార్కులు, లేక ఎక్కువమంది విద్యార్థులు పొందిన మార్కులు కనుగొంటాము. . . (పేజీ నెం. 336)
a) మొదటి సందర్భంలో మనం ఏ కేంద్రీయస్థానపు విలువను కనుక్కొంటాం ?
సాధన.
సగటు.
b) రెండవ సందర్భంలో మనం ఏ కేంద్రీయస్థానపు విలువను కనుక్కొంటాం ?
సాధన. బాహుళకము.

ప్రశ్న 2. వేరువేరు తరగతి అంతరాలు గల దత్తాంశమునకు కూడా బాహుళకము’ను కనుగొనవచ్చునా ? (పేజీ నెం. 336)
సాధన.
లేదు. విభిన్న తరగతి అంతరాలతో బాహుళకం కనుగొనలేము.

AP Board 10th Class Maths Solutions 14th Lesson సాంఖ్యకశాస్త్రం InText Questions

ఉదాహరణలు:

ప్రశ్న 1.
ఒక పాఠశాలలోని 10వ తరగతికి చెందిన 30 మంది విద్యార్థులు గణితంలో పొందిన మార్కులు పట్టికలో ఇవ్వబడ్డాయి. విద్యార్థులు పొందిన మార్కుల సగటు కనుక్కోండి. (పేజీ నెం. 324)

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం InText Questions 1

సాధన.
పై దత్తాంశాన్ని క్రింద చూపిన పట్టికలో తిరిగి వ్రాయగా,

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం InText Questions 2

కాబట్టి, \(\overline{\mathbf{x}}\) = \(\frac{\Sigma \mathrm{f}_{\mathrm{i}} \mathrm{u}_{\mathrm{i}}}{\Sigma \mathrm{f}_{\mathrm{i}}}\)
= \(\frac{1779}{30}\) = 59.3
∴ మార్కుల సగటు = 59.3.

AP Board 10th Class Maths Solutions 14th Lesson సాంఖ్యకశాస్త్రం InText Questions

ప్రశ్న 2.
భారతదేశములోని వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గ్రామీణ ప్రాంత ప్రాథమిక పాఠశాలల్లో గల మహిళా ఉపాధ్యాయుల శాతముల వివరములు ఈ క్రింది పట్టికలో పొందుపరచబడినాయి. పై మూడు పద్దతులనుపయోగించి మహిళా ఉపాధ్యాయుల సగటు శాతాన్ని కనుక్కోండి. (పేజీ నెం. 330)

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం InText Questions 3

(NCERT వారు నిర్వహించిన 7వ అఖిలభారతీయ పాఠశాల విద్యా సర్వే గణాంకాల ప్రకారం)
సాధన.
తరగతి మధ్య విలువ xi కనుగొని, దానిని పట్టికలో పొందుపరుచుదాం.
ఇచ్చట a = 50, h = 10,
అపుడు di = xi – 50 మరియు ui = 10 –
ఇపుడు మనము di మరియు ui విలువలను కనుగొని పట్టికలో పొందుపరచగా

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం InText Questions 4

పై పట్టిక నుండి, Σfi = 35, Σfixi = 1390, Σfidi = – 360, Σfiui = – 36.
ప్రత్యక్ష పద్ధతి ద్వారా (\(\overline{\mathbf{x}}\)) = \(\frac{\Sigma \mathrm{f}_{\mathrm{i}} \mathrm{x}_{\mathrm{i}}}{\Sigma \mathrm{f}_{\mathrm{i}}}\)
= 1390 = 39.71
ఊహించిన సగటు పద్ధతి ద్వారా (\(\overline{\mathbf{x}}\)) = a + \(\frac{\Sigma \mathrm{f}_{\mathrm{i}} \mathrm{d}_{\mathrm{i}}}{\Sigma \mathrm{f}_{\mathrm{i}}}\)
= 50 + \(\frac{-360}{35}\)
= 50 – 10.29 = 39.71
సోపాన విచలన పద్ధతి ద్వారా (\(\overline{\mathbf{x}}\)) = a + \(\frac{\Sigma \mathrm{f}_{\mathrm{i}} \mathrm{u}_{\mathrm{i}}}{\Sigma \mathrm{f}_{\mathrm{i}}}\) × h
= 50 + \(\frac{-36}{35}\) × 10
= 39.71
∴ గ్రామీణ ప్రాంత ప్రాథమిక పాఠశాలల్లో గల మహిళా ఉపాధ్యాయుల సగటు శాతము = 39.71.

AP Board 10th Class Maths Solutions 14th Lesson సాంఖ్యకశాస్త్రం InText Questions

ప్రశ్న 3.
వన్డే క్రికెట్ ఆటలో బౌలర్లు సాధించిన వికెట్ల వివరాలను ఈ క్రింది పౌనఃపున్య విభాజన పట్టికలో చూపించనైనది. సరియైన పద్ధతిని ఎంచుకొని బౌలర్లు సాధించిన సగటు వికెట్లను కనుగొనుము. ఇట్టి సగటు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? (పేజీ నెం. 331)

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం InText Questions 5

సాధన.
ఇచ్చట తరగతి పొడవులు వేరువేరుగా ఉన్నాయి, మరియు xi విలువలు పెద్దవిగా ఉన్నాయి. అయినప్పటికినీ సగటు కనుగొనడానికి సంక్షిప్త విచలన పద్ధతినే ఎంచుకుందాము; ఇచ్చట a = 200 మరియు మీ = 20.

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం InText Questions 6

అందువల్ల (\(\overline{\mathbf{x}}\)) = a + \(\frac{\Sigma \mathrm{f}_{\mathrm{i}} \mathrm{u}_{\mathrm{i}}}{\Sigma \mathrm{f}_{\mathrm{i}}}\) × h
= 200 + \(\frac{-106}{45}\) × 20
= 200 – 47.11 = 152.89
∴ 45 మంది బౌలర్లు వన్డే క్రికెట్ లో సాధించిన వికెట్ల సగటు = 152.89.

AP Board 10th Class Maths Solutions 14th Lesson సాంఖ్యకశాస్త్రం InText Questions

ప్రశ్న 4.
10 క్రికెట్ మ్యా చ్ లలో ఒక బౌలర్ తీసిన వికెట్లు క్రింది కుటుంబ విధంగా ఉన్నాయి. 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3. కుటుంబా ఈ దత్తాంశానికి ‘బాహుళకాన్ని’ కనుక్కోండి. – (పేజీ నెం. 334)
సాదన.
దత్తాంశములోని అంకెలను (రాశులను) ఒక పౌన క్రమపద్ధతిలో అమర్చగా అనగా 0, 1, 2, 2, 2, 3, బాప 3, 4, 5, 6.
ఇపుర పై దత్తాంశంను పరిశీలించగా, ఎక్కువ మ్యాచుల్లో బాప బౌలర్ ‘2’ వికెట్లను తీసినట్లుగా స్పష్టంగా తెలియుచున్నది. (అనగా 3 సార్లు).
అందువల్ల ఇవ్వబడిన దత్తాంశం యొక్క బాహుళకము 2.

ప్రశ్న 5.
ఒక ఆవాస ప్రాంతంలో కొంతమంది విద్యార్థుల బృందం బాప 20 కుటుంబాలను సర్వే చేసి, కుటుంబ సభ్యుల పౌన: సంఖ్యను ఈ క్రింద చూపిన పౌనఃపున్య విభాజన పట్టికలో చూపనైనది. (పేజీ నెం. 335)

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం InText Questions 7

ఈ దత్తాంశానికి ‘బాహుళకాన్ని’ కనుక్కోండి.
సాధన.
ఇచ్చట, గరిష్ఠ తరగతి పౌనఃపున్యము 8, ఈ పౌనఃపున్యానికి సంబంధించిన తరగతి 3-5. అందువల్ల బాహుళక తరగతి 3-5.
ఇపుడు,
బాహుళక తరగతి = 3-5,
మధ్యంతర తరగతి యొక్క దిగువహద్దు (l) = 3,
తరగతి పొడవు (h) = 2
బాహుళక తరగతి పౌనఃపున్యము (f1) = 8,
బాహుళక తరగతికి ముందున్న తరగతి యొక్క
పౌనఃపున్యము (f0) = 7,
బాహుళక తరగతికి తరువాత నున్న తరగతి యొక్క .
పౌనఃపున్యము (f2) = 2.
పై విలువలను, ఈ క్రింది సూత్రములో ప్రతిక్షేపించుదాం.
బాహుళకం = l + \(\left(\frac{f_{1}-f_{0}}{2 f_{1}-f_{0}-f_{2}}\right)\) × h
= 3 + \(\left(\frac{8-7}{2 \times 8-7-2}\right)\) × 2
ఆ పై దత్తాంశం యొక్క బాహుళకము 3.286. (2×8-7-2).

AP Board 10th Class Maths Solutions 14th Lesson సాంఖ్యకశాస్త్రం InText Questions

ప్రశ్న 6.
ఒక తరగతిలో 30 మంది విద్యార్థులు ఒక గణిత పరీక్షలో పొందిన మార్కులు పౌనఃపున్య విభాజన పట్టిక ఈ క్రింది నీయబడినది. ఈ దత్తాంశానికి ‘బాహుళకము’ను కనుగొనుము. అదే విధంగా బాహుళకము మరియు సగటులను పోల్చి, వ్యాఖ్యానించుము. (పేజీ నెం. 335) తరగతి అంతరం విద్యార్థుల సంఖ్య తరగతి మధ్య విలువ

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం InText Questions 8

సాధన.
దత్తాంశములోని ఎక్కువ మంది విద్యార్థులు (7గురు) ’40-55′ తరగతి అంతరంలో మార్కులు సాధించియున్నారు.
కనుక ’40-55′ అనేది బాహుళక తరగతి అవుతుంది.
మధ్యంతర తరగతి యొక్క దిగువ హద్దు (l) = 40,
తరగతి పొడవు (h) = 15,
బాహుళక తరగతి యొక్క పౌనఃపున్యము (f1) = 7,
బాహుళక తరగతికి ముందున్న తరగతి పౌనఃపున్యము (f0) = 3,
బాహుళక తరగతికి తరువాత నున్న తరగతి పౌనఃపున్యము (f2) = 6.
బాహుళకము = l + \(\left(\frac{\mathrm{f}_{1}-\mathrm{f}_{0}}{2 \mathrm{f}_{1}-\mathrm{f}_{0}-\mathrm{f}_{2}}\right)\) × h
= 40 + \(\left(\frac{7-3}{2 \times 7-6-3}\right)\) × 15
= 40 + 12 = 52.

వ్యాఖ్యానం (Interpretation) :
పై దత్తాంశానికి బాహుళకము 52; అదే విధంగా సగటు 62 (ఉదాహరణ – 1, ద్వారా) అని తెలియుచున్నది. అనగా తరగతిలోని 52 మార్కులు పొందిన విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారని, ఒక్కొక్క విద్యార్థి యొక్క సగటు మార్కులు 62 అని తెలుస్తుంది.

AP Board 10th Class Maths Solutions 14th Lesson సాంఖ్యకశాస్త్రం InText Questions

ప్రశ్న 7.
ఒక పాఠశాలలోని 10వ తరగతి బాలికల ఎత్తు గురించి చేసిన సర్వే ఫలితాలు కింది పట్టికలో ఇవ్వబడ్డాయి. వారి ఎత్తుల మధ్యగతము కనుగొనండి (పేజీ నెం. 342)

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం InText Questions 9

సాధన.
మధ్యగతము కనుగొనుటకు మొదట తరగతి అంతరాలను, వాటి సంబంధిత పౌనఃపున్యములను కనుగొనవలెను. ఇచ్చిన విలువలు ఎగువహద్దు కన్నా తక్కువ సంచిత పౌనఃపున్యములు కావు, ఎత్తులు 140, 145, 150, …, లు ఎగువ హద్దులు, అనగా తరగతి అంతరాలు 140 కన్నా తక్కువ, 140 – 145, 145 – 150 ……. అవుతాయి.

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం InText Questions 10

పట్టికను పరిశీలిస్తే 140 కన్నా తక్కువ పొడవు గల బాలికల సంఖ్య 4 అనగా 140 కన్నా తక్కువ తరగతి యొక్క పౌనఃపున్యము 4.
145 సెం.మీ కన్నా తక్కువ పొడవు గలవారు 11 మంది. అనగా 140 – 145 తరగతి పౌనఃపున్యం 11 – 4 = 7.
ఇదే విధంగా మిగిలిన పౌనఃపున్యములను లెక్కించవచ్చు.
దత్తాంశంలోని రాశుల సంఖ్య n = 51,
\(\frac{1}{4}-\frac{1}{9}\)
\(\frac{n}{2}=\frac{51}{2}\) = 25.5
22 దత్తాంశంలోని 25. 5వ రాశి 145-150 తరగతికి చెందుతుంది.
∴ 145 – 150 మధ్యంతర తరగతి. మధ్యగత తరగతి దిగువహద్దు l = 145,
మధ్యగత తరగతికి ముందు తరగతి cf = 11,
సంచిత పౌనఃపున్యం మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యము f = 18,
మధ్యగత తరగతి పొడవు h = 5.
సూత్రమును ఉపయోగించి మధ్యగతం = l + \(\frac{\left(\frac{\mathrm{n}}{2}-\mathrm{cf}\right)}{\mathrm{f}}\) × h
= 145 + \(\frac{(25.5-11)}{18}\) × 5
= 145 + \(\frac{72.5}{4}\)
= 149.03
∴ బాలికల పొడవుల యొక్క మధ్యగతము 149.03 సెం.మీ అనగా తరగతిలో 50% మంది బాలికలు 149.03 సెం.మీ కన్నా ఎక్కువ పొడవు కలిగి ఉంటారు.
మిగిలిన 50% మంది 149.03 సెం.మీ. కన్నా తక్కువ ఫొడవు కలిగి ఉంటారు.

AP Board 10th Class Maths Solutions 14th Lesson సాంఖ్యకశాస్త్రం InText Questions

ప్రశ్న 8.
క్రింది దత్తాంశము యొక్క మధ్యగతము 525 మరియు దత్తాంశంలోని రాశుల మొత్తం 100 అయిన x, y విలువలను కనుగొనండి. (పట్టికలో CI అనగా తరగతి అంతరం, Fr అనగా పౌనఃపున్యం) (పేజీ నెం. 344)

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం InText Questions 11

సాధన.
దత్తాంశంలోని రాశుల సంఖ్య n = 100 అని ఇవ్వబడింది.
76 + x + y = 100, i.e., x + y = 24 (1)
మధ్యగతం 525 అను రాశి 500 – 600 తరగతికి చెందుతుంది.
కావున, l = 500, f = 20, cf = 36 + x, h = 100 .
సూత్రము ఉపయోగించి మధ్యగతము = l + \(\frac{\left(\frac{\mathrm{n}}{2}-\mathrm{cf}\right)}{\mathrm{f}}\) × h
525 = 500 + \(\frac{50-36-x}{20}\) × 100
525 – 500 = (14 – x) × 5
25 = 70 – 5x.
5x = 70 – 25 = 45
∴ x = 9.
సమీకరణం (1) నుండి 9 + y = 24
∴ y = 15.

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం InText Questions 12

గమనిక : వేరువేరు తరగతి అంతరాలు గల దత్తాంశమునకు కూడా ఇదే సూత్రమును ఉపయోగించి మధ్యగతమును కనుగొనవచ్చు.

ప్రశ్న 9.
ఒక ప్రాంతములోని 30 అంగళ్ళ యొక్క సంవత్సర ఆదాయములు క్రింది పట్టిక రూపంలో ఇవ్వబడ్డాయి. (పేజీ నెం. 349)

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం InText Questions 13

పై దత్తాంశమునకు రెండు ఓజీవ్ వక్రాలు గీయండి. అందు నుండి , లాభముల యొక్క మధ్యగతము కనుగొనండి.
సాధన.
ఇచ్చిన దత్తాంశములోని విలువలు దిగువ హద్దులు, సంబంధిత అవరోహణ సంచిత పౌనఃపున్యములు. వీటితో మొదట అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రము గీయుటకు అనువైన స్కేలు తీసుకొని
X-అక్షముపై దిగువహద్దులను, Y- అక్షముపై సంచిత లాభము పౌనఃపున్యములను గుర్తించి వాటిని కలుపుతూ సరళ వక్రమును గీయాలి.. ఇది అవరోహణ సంచిత
పౌనఃపున్య వక్రము అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన దత్తాంశము నుండి తరగతి అంతరాలు, పౌనఃపున్యములు, ఆరోహణ సంచిత పౌనఃపున్యములను తయారు చేయగా ఆరోహణ సంచిత పౌనఃపున్యం

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం InText Questions 14

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం InText Questions 15

పై దత్తాంశమునుండి ఏర్పడు బిందువులు (10, 2), (15, 14), (20, 16), (25, 20), (30, 23), (35, 27), (40, 30) బిందువులను అదే గ్రాఫ్ పై గుర్తించి సరళ వక్రముతో కలుపగా ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రము ఏర్పడుతుంది.

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం InText Questions 16

ఈ రెండు వక్రములు పరస్పరం ఖండించుకొన్న బిందువు నుండి X-అక్షం మీదకు లంబమును గీయగా, ‘ఆ లంబపాదము 17.5 అని గుర్తించవచ్చు. అనగా దత్తాంశము యొక్క మధ్యగతము (M) = 17.5 లక్షల రూపాయలు.

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4

SCERT AP 10th Class Maths Textbook Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 10th Class Maths Solutions 14th Lesson సాంఖ్యకశాస్త్రం Exercise 14.4

ప్రశ్న 1.
50 మంది శ్రామికుల దినసరి భత్యములు క్రింది పౌనఃపున్య విభాజనములో ఇవ్వబడ్డాయి.

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4 1

ఈ దత్తాంశమునకు ఆరోహణ సంచిత పౌనఃపున్యములను తయారు చేసి, ఓజీవ్ వక్రము గీయండి.
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4 2

ఓజీవ్ వక్రం కొరకు X-అక్షంపై ఎగువ హద్దులు, Y-అక్షంపై ఆరోహణ సంచిత పౌనఃపున్యాలు తీసుకొనవలెను. పై పట్టిక నుండి కావలసిన క్రమయుగ్మాలు = {(300, 12), (350, 26), (400, 34), (450, 40), (500, 50)}

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4 3

AP Board 10th Class Maths Solutions 14th Lesson సాంఖ్యకశాస్త్రం Exercise 14.4

ప్రశ్న 2.
ఒక పాఠశాలలో జరిగిన వైద్య పరీక్షలలో తరగతిలోని 35 మంది విద్యార్థుల బరువులు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4 4

ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రము గీచి దాని నుండి మధ్యగతమును గుర్తించండి. ఈ దత్తాంశమునకు సూత్ర సహాయంతో మధ్యగతము కనుగొని రెండు విలువలు సరిచూడండి..
సాధన

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4 5

⇒ \(\frac{n}{2}=\frac{35}{2}\) = 17.5
∴ మధ్యగతం = l + \(\left(\frac{\frac{\mathrm{n}}{2}-\mathrm{c} \cdot \mathrm{f}}{\mathrm{f}}\right)\) × h
l = 46, \(\frac{n}{2}\) = 17.5, cf = 14, f = 14, h = 2.
∴ మధ్యగతం = 46 + \(\frac{17.5-14}{14}\) × 2
= 46 + \(\frac{7}{14}\)
= 46 + 0.5
46.5 కి.గ్రా.
∴ ఓజీవ్ వక్రం మరియు సహజ పద్ధతి ద్వారా విద్యార్థుల బరువుల మధ్యగతం 46.5 కే.జీగా సరిచూడటమైనది.

AP Board 10th Class Maths Solutions 14th Lesson సాంఖ్యకశాస్త్రం Exercise 14.4

(లేదా)

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4 6

∴ ఓజివ్ వక్రం కొరకు X-అక్షంపై ఎగువ హద్దులు, Y-అక్షంపై ఆరోహణ సంచిత పౌనఃపున్యాలు తీసుకొనవలెను.
∴ కావలసిన క్రమయుగ్మాల సమితి = {(38, 0), (40, 3), (42, 5), (44, 9), (46, 14), (48, 28), (50, 32) (52, 35)}
∴ ఓజీవ్ వక్రానికి = \(\frac{n}{2}=\frac{35}{2}\) = 17.5 వద్ద లంబాన్ని గీయగా అది X – అక్షం పై చేయు నిరూపకమే దాని మధ్యగతం అగును.
∴ 35 మంది పిల్లల బరువుల మధ్యగతం = 46.5 కి.గ్రా.

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4 7

AP Board 10th Class Maths Solutions 14th Lesson సాంఖ్యకశాస్త్రం Exercise 14.4

ప్రశ్న 3.
ఒక గ్రామములోని 100 మంది రైతులు పొలములలో హెక్టారుకు దిగుబడి ధాన్యము క్రింది విభాజనము నందు ఇవ్వబడింది.

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4 8

ఈ దత్తాంశమునకు అవరోహణ సంచిత పౌనఃపున్యము తయారుచేసి ఓజీవ్ వక్రము గీయండి.
సాధన.

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4 9

∴ ఓజీవ్ వక్రం కొరకు X-అక్షంపై తరగతి దిగువ హద్దులు, Y-అక్షంపై అవరోహణ సంచిత పౌనఃపున్యాలు.
∴ కావలసిన క్రమయుగ్మాల సమితి = {(50, 100), (55, 98), (60, 90), (65, 78), (70, 54), (75, 16)}

AP Board 10th Class Maths Solutions Chapter 14 సాంఖ్యకశాస్త్రం Exercise 14.4 10