AP Inter 1st Year Zoology Notes Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

Students can go through AP Inter 1st Year Zoology Notes 4th Lesson జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Zoology Notes 4th Lesson జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

→ జంతువైవిధ్యం -IIలో కార్డేటా వర్గం, కొన్ని అనుబంధ ఉపవర్గాలు తరగతుల గురించి నేర్చుకుంటాము.

→ కార్డేటాల స్వాభావిక లక్షణాలు:

  1. పృష్ఠవంశం
  2. నాడీ దండం
  3. గ్రసనీ మొప్ప చీలికలు
  4. పాయు పరపుచ్ఛం

→ వర్గం (మూలార్థం) — ఉదాహరణలు

  1. కార్డేటా(పృష్ఠవంశం) — నీలి తిమింగలం[IPE]
  2. యూరోకార్డేటా (తోక పృష్ఠవంశం) — ఎసీడియ, సాల్ప
  3. సెఫాలోకార్డేటా (తల పృష్ఠవంశం) — బ్రాంకిమోస్టోమా
  4. వర్టిబ్రేటా- సకశేరుకాలు (వెన్నుముక కలవి) — చేపలు, పక్షులు, క్షీరదాలు
  5. ఏనేతా (దవడలు లేకుండా) — హగ్చేప
  6. సైక్లోస్టోమేటా (వర్తుల నోరు) — స్టైమ్ ఈల్
  7. నేతోస్టోమేటా (దవడ నోరు) — దవడలు గల చేపలు
  8. పిసెస్ (చేపలు) — సొరచేప (ఫార్మ్)
  9. కాండ్రికిస్ (మృదులాస్థిచేపలు) — సా చేప
  10. ఆస్టిక్స్ (అస్థి చేపలు) — కట్ల
  11. ఆంఫీబియా- ఉభయచరాలు (రెండు రకాల జీవనం) — కప్ప
  12. రెస్టీలియా -సరీసృపాలు (పాకడం) — పాములు
  13. ఏవిస్ (పక్షి) — పక్షులు
  14. మమ్మేలియా – క్షీరదాలు (తల్లిస్తనం) — ఆవులు

→ సొరచేపలలో, ‘పుచ్ఛవాజం – విషమ పాలి’ మరియు ‘ప్లాకాయిడ్ -పొలుసులు’ ఉంటాయి. [IPE]

AP Inter 1st Year Zoology Notes Chapter 4 జంతు వైవిధ్యం-II: కార్డేటాల క్లుప్త చరిత్ర

→ కట్ల చేపలో పుచ్ఛవాజం -సమపాలి మరియు ‘సైక్లాయిడ్ (లేదా) టీనాయిడ్ పొలుసులు’ ఉంటాయి. [IPE]

→ విషపూరిత సర్పాలు: నాజ నాజ (కొబ్రా), పైపర్ రసల్లె (గొలుసు రక్తపింజర) [IPE]

→ విషరహిత సర్పాలు: ట్యాస్ (రాట్ స్నేక్), ట్రోపిడోనోటస్ (నీటి పాము) [IPE]

→ మృదులాస్థి చేపలు అధికంగా సముద్రపు జీవులు. వీటి విసర్జక పదార్ధం యూరియోటెలిక్.

→ అస్థిచేపలు అన్ని రకాల జల ఆవాసాల్లో నివసిస్తాయి. వీటి విసర్జక పదార్ధం అమ్మోనోటెలిక్. [IPE]

AP Inter 1st Year Zoology Notes Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

Students can go through AP Inter 1st Year Zoology Notes 3rd Lesson జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Zoology Notes 3rd Lesson జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

→ ఈ ప్రపంచంలో ఉండే జంతువులలో 90% అకశేరుక వర్గానికి చెందిన జంతువులే ఉన్నాయి.

→ అకశేరుక వర్గాలు ‘వెన్నముక లేని’ జంతువులను కల్గి ఉంటాయి.

→ అకశేరుకాల స్వభావిక లక్షణాలు:

  1. ఖండిత దేహం
  2. కీళ్ళు గల ఉపాంగాలు
  3. బాహ్య అస్థిపంజరం
  4. మెదడు

AP Inter 1st Year Zoology Notes Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

→ అకశేరుక వర్గాలు (మూలార్థం) – ఉదాహరణలు:

  1. పొరిఫెరా (రంధ్రాలను కలిగి ఉండటం) – స్పంజికలు
  2. నిడేరియా(స్పర్శకాలలో కుట్టు కణాలు) – హైడ్రా, జెల్లిచేపలు, ప్రహళం
  3. టీనోఫోరా (కంకా కారలను కల్గి ఉండటం) – కోంబో జెల్లీలు
  4. ప్లాటి హెల్మింథిస్ (బల్లపరుపు జీవులు) – బల్లపరుపు జీవులు
  5. నిమటోడా (దారం వంటివి) – గుండ్రటి పురుగు
  6. అనెలిడా (వలయం) – జలగ
  7. ఆర్థ్రోపొడా (కీళ్ళుగల ఉపాంగాలు) – సాలీడు, కీటకాలు
  8. మొలస్కా (సున్నితం) – ఆక్టోపి, స్క్విడ్
  9. ఇకైనోడర్మేటా (ముళ్ళుకలిగినచర్మం) – స్టార్ చేప
  10. హెమి కార్డేటా (అర్ధసకేశరుకాలు) – ఎకార్న్ వర్మ్

→ లిమ్యులస్ ( రాచపీత) ఒక సజీవ శిలాజ ఆర్థ్రోపోడాజీవి . దాని శ్వాస అవయవాలు పుస్తకాకార మొప్పలు. [IPE]

AP Inter 1st Year Zoology Notes Chapter 3 జంతు వైవిధ్యం-I: అకశేరుక వర్గాలు

→ ‘అరిస్టాటిల్ లాంతరు’ అనగా సీఆర్చిన్ నోటిలో ఉన్న ఒక సంక్లిష్టమైన ఐదు దవడల నమిలే యంత్రాంగం[IPE]
ఉదా: ఎకైనస్ (సీఆర్చిన్)

→ ఆంధోజోవా జీవులను సాధారణంగా ‘సీ అనిమోన్లు’ అని అంటారు. ఇవి స్థాన బద్ధజీవులు. [IPE]

→ పాలీకీటా జీవులు సముద్రపు అనెలిడా జీవులు. ఇవి సాధరణంగా బ్రిసిల్ పురుగులు (లేదా) క్లామ్ వార్మ్స్ [IPE]

→ క్రస్టేషియాలు జలచర, స్పర్శ శృంగాలు కలిగిన ఆర్థ్రోపోడా జీవులు. ఉదా: మంచినీటి రొయ్య [IPE]

→ ఎకినాయిడ్లు ఇకైనోడర్మేటా వర్గానికి చెందినవి. ఉదా: సీ అర్చిన్ [IPE]

AP Inter 1st Year Zoology Notes Chapter 2 జంతుదేహ నిర్మాణం

Students can go through AP Inter 1st Year Zoology Notes 2nd Lesson జంతుదేహ నిర్మాణం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Zoology Notes 2nd Lesson జంతుదేహ నిర్మాణం

→ జంతుదేహనిర్మాణ వ్యవస్థలో జంతు కణాలు, కణజాలల నిర్మాణం, విధులు, రకాల గురించి అధ్యయనం చేస్తారు.

→ ‘కణజాలల అభివృద్ధి’ అనేది పరిణామ క్రమంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశం.

→ జంతు కణజాలాలు నాలుగు రకాలు: (i) ఉపకళా కణజాలం (ii) సంయోజక కణజాలం (iii)కండర కణజాలం (iv) నాడీ కణజాలం

→ ‘ఉపకళా కణజాలాలు’ స్రావకానికి, రక్షణ, వ్యాపనం మొదలైన వాటికి సహాయపడతాయి.

→ ‘సంయోజక కణజాలాలు’ ఇతర కణజాలలను బంధించడానికి మరియు ఊతమివ్వడానికి ఉపయోగపడతాయి.

→ ‘కండర కణజాలాలు’ వివిధ రకాల నియంత్రిత మరియు అనియంత్రిత కదలికలకు సహాయపడతాయి.

AP Inter 1st Year Zoology Notes Chapter 2 జంతుదేహ నిర్మాణం

→ ‘నాడీ కణజాలాలు’ వివిధ అవయవాలకు అనుసంధాయకంగా పని చేస్తూ జీవి మనుగడకు సహాయపడుతాయి.

→ ‘శీర్షత’ అనగా నాడీ కణాలు మరియు జ్ఞానకణాలు దేహం యొక్క పూర్వాంతంలో అమరి వుండటం.

→ ‘నాళంలో మరోక నాళం ‘అనే అమరిక మొదటిసారిగా నిమటోడా జీవులలో కనిపించింది. [IPE]

→ మూత్రపిండాల వంటి అవయవాలు సకశేరుకాలలో దైహిక వేష్టనంతో కప్పబడి, ఉదర భాగంలో మాత్రమే ఉంటాయి. ఈ విధంగా కప్పబడి వున్నటువంటి అవయవాలను ‘తిరోవేష్టన అవయవాలు’ అని అంటారు.

→ ‘మాస్ట్ కణాలు’ అనునవి హెపారిన్, హిస్టమన్, బ్రాడికైనిన్ మరియు సెరటోనిన్లను స్రవిస్తాయి. [IPE]

→ ‘స్నాయు బంధనం’ అనునది అస్థి కండరాలను ఎముకతో బంధించి ఉంచుతుంది. [IPE]

→ ‘బంధకం’ అనునది ఒక ఎముకను ఇతర ఎముకలతో బంధించి ఉంచుతుంది. [IPE]

→ తంతుయుత మృదులాస్థి అత్యంత ధృడమైన మృదులాస్థి. [IPE]

→ హేవర్షియన్ వ్యవస్థ అనేది ఘనాస్థి యొక్క సమూహం. దీనిలోని భాగాలు (i) హేవర్షియన్ కుల్య (ii)వలయ లామెల్లాలు(iii) లిక్విణులు (iv) సూక్ష్మకుల్యలు (v) వోల్కోమెన్సో కుల్యలు. [IPE]

→ ఆస్టియాన్: ధృడమైన ఎముకలో, హేవర్షియన్ కుల్య మరియు దాని చుట్టూ ఉన్న పటలికలు మరియు లిక్విణులు అన్నింటిని కలిపి ‘హేవర్షియన్ వ్యవస్థ’ లేదా ‘ఆస్టియాన్’ అని అంటారు. [IPE]

AP Inter 1st Year Zoology Notes Chapter 2 జంతుదేహ నిర్మాణం

→ సెసమాయిడ్ ఒక మృదువైన ఎముక. ఇది స్నాయుబంధకాలు అస్థీభవనం చెందుట వలన ఏర్పడతాయి. ఉదా: పాటెల్లా

→ రక్తం పరిమాణంలో మొత్తం RBCలు ఆక్రమించిన శాతాన్ని ‘హిమాటోక్రిట్ విలువ’ అంటారు.

→ హృదయ కండరం( మయోకార్డియమ్) అనేది గుండె యొక్క కణజాలం. [IPE]

→ హృదయ కండరం ‘గ్లానికి’ లోను కాదు. ఎందుకనగా దానిలో అధిక సంఖ్యలో ఉండే సార్కోసోమ్స్, మయోగ్లోబిన్ అణువులు మరియు అధిక రక్త సరఫరా వలన ‘నిరంతర వాయుశ్వాసక్రియ’ జరుగుతూ వుంటుంది. [IPE]

→ అస్థిపంజరం నిర్మాణాలను అంటిపెట్టుకొని ఉన్నటువంటి కండరాలను అస్థిపంజరం కండరం అంటారు. అస్థిపంజర కండరం స్నాయు బంధనం ద్వారా ఎముకలను అంటిపెట్టుకొని ఉంటుంది. [IPE]

AP Inter 1st Year Zoology Notes Chapter 1 జీవ ప్రపంచ వైవిధ్యం

Students can go through AP Inter 1st Year Zoology Notes 1st Lesson జీవ ప్రపంచ వైవిధ్యం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Zoology Notes 1st Lesson జీవ ప్రపంచ వైవిధ్యం

→ ‘జంతుశాస్త్రం’ ప్రపంచంలో ఉండే వివిధ రకాల జంతు సంబంధిత అంశాలను, లక్షణాలను అధ్యయనం చేస్తుంది.

→ మన భూమి మీద విస్తృత స్థాయిలో ఉన్న జీవులలో ఉండే జీవ భిన్నత్వాన్నే’ ‘జీవ వైవిధ్యం’ అంటారు.

→ ‘వర్గీకరణ శాస్త్రం’ అనేది జీవుల గుర్తింపు, నామీకరణ మరియు వర్గీకరణలను గురించి అధ్యయనం చేస్తుంది.

→ ICZN అనగా ‘అంతర్జాతీయ జంతు నామీకరణ నియమావళి’.

→ ‘వర్గీకరణ’ అనగా సారూప్యత కలిగిన జంతు సమూహాల విభజన.

AP Inter 1st Year Zoology Notes Chapter 1 జీవ ప్రపంచ వైవిధ్యం

→ జీవశాస్త్రీయ వర్గీకరణ – ప్రాధాన్యతా క్రమం:

  1. రాజ్యం
  2. వర్గం
  3. విభాగం
  4. క్రమం
  5. కుటుంబం
  6. ప్రజాతి
  7. జాతి

→ ‘జాతి’ అనునది వర్గీకరణకు ఒక ‘ప్రాధమిక ప్రమాణం’.

→ త్రినామ నామీకరణం: ఒక జీవిని ప్రజాతి, జాతి మరియు ఉపజాతి అనే మూడు పదాలతో నామీకరణ చేయుట. ఉదా: హోమోసెపియన్స్ సెపియన్స్ [IPE]

→ టాటోనిమ్ అనగా జీవుల యొక్క శాస్త్రీయ నామంలో ప్రజాతి పేరు మరియు జాతి పేరు ఒకటిగా ఉండటం. ఉదా:నాజా నాజా – భారతీయ నాగుపాము [IPE]

→ కణజాల శాస్త్రం:అనగా వివిధ కణజాలల యొక్క సూక్ష్మ నిర్మాణాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం [IPE]

→ బయోజెనిసిస్ సిద్ధాంతం పరిణామక్రమంలో ‘జీవం జీవం నుంచే ప్రారంభమవుతుంది’ అని తెలియజేస్తుంది. [IPE]

→ ప్రోటోస్టోమియా జీవులు అనగా ‘ఆంత్రరంధ్రం నోరుగా మార్పు’ చెందే యుమెటాజోవన్లు . ఉదా: అనెలిడా, ఆర్థ్రోపొడా, మొలస్కా, [IPE]

→ డ్యుటిరోస్టోమియా జీవులు అనగా ‘ఆంత్రరంధ్రము పాయువుగా మార్పు’ చెందే యుమెటాజోవన్లు .
ఉదా: ఇకైనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటా. [IPE]

AP Inter 1st Year Zoology Notes Chapter 1 జీవ ప్రపంచ వైవిధ్యం

→ కొన్ని జాతుల నాశనం (విలుప్తత) త్వరితంగా జరగడానికి దోహదపడే నాలుగు ప్రధాన కారణాలే ‘అరిష్ట చతుష్టయం’. [IPE]

  1. ఆవాసక్షీణత మరియు శకలీకరణ
  2. స్థానికేతర జాతుల చొరబాటు
  3. వనరుల అతి వినియోగం
  4. సహ విలుప్తతలు

→ ‘బయోడైవర్సిటీ హట్స్పాట్లు’ అనేవి జీవభౌగోళిక ప్రాంతాలు. ఇవి మానవుడి కారణంగా నాశనానికి గురయ్యే జీవవైవిధ్య సంరక్షణ కేంద్రాలు. [IPE]

→ ‘రివెట్పాపర్ దృగ్విషయం’ జీవావరణ వ్యవస్థలో కొన్ని జాతుల నాశనం వలన కలిగే పరిణామాలను వివరిస్తుంది. [IPE]

AP Inter 1st Year Botany Notes Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

Students can go through AP Inter 1st Year Botany Notes 12th Lesson పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Botany Notes 12th Lesson పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

→ మొక్క దేహం యొక్క వివిధ కణజాలాలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని ‘కణజాలశాస్త్రం’ అంటారు.

→ వివిధ కణజాలాల అంతర్నిర్మాణము, అమరికను అధ్యయనం చేయు శాస్త్రాన్ని ‘అంతర్నిర్మాణ శాస్త్రం’ అంటారు.

→ అంతర్నిర్మాణ పరంగా మొక్కదేహం విభిన్న రకాలైన కణజాలాలతో నిర్మితమై ఉంటుంది.

→ మొక్క కణజాలాలు వాటి విధి ఆధారంగా రెండు రకాలు:

  1. విభాజ్య కణజాలాలు
  2. శాశ్వత కణజాలాలు

→ విభాజ్య కణజాలంలో మొక్క దేహం పెరుగుదలకు దోహదపడే అపరిపక్వక కణాలుంటాయి.

AP Inter 1st Year Botany Notes Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

→ మొక్కలో ఉండే స్థానాన్ని బట్టి విభాజ్యకణజాలాలు మూడు రకాలు:

  1. అగ్రవిభాజ్యకణజాలం
  2. మధ్యస్థవిభాజ్యకణజాలం
  3. పార్శ్వవిభాజ్యకణజాలం

→ శాశ్వత కణజాలాలు రెండు రకాలు:

  1. సరళకణజాలం
  2. సంక్లిష్ట కణజాలం

→ సరళకణజాలం ఒకే రకమైన కణాలతో తయారవుతుంది. ఇది మూడు రకాలు

  1. మృదుకణజాలం
  2. స్థూలకణజాలం
  3. దృఢకణజాలం [IPE]

→ సంక్లిష్టకణజాలం ఒకటి కంటే ఎక్కువ రకాల కణాలతో తయారవుతాయి. వీటిలో పోషకకణజాలం, దారువు ఉంటాయి.

→ దారువు మొక్కకు నీటి సరఫరా చేస్తే, పోషకకణజాలం మొక్కకు ఆహారమును సరఫరా చేస్తాయి.

→ నిర్మాణం,స్థానం ఆధారంగా కణజాలం మూడు రకాలు [IPE]

  1. బాహ్యచర్మ కణజాలం
  2. మౌలిక (సంధాయక) కణజాలం
  3. నాళికా కణజాలం

→ బాహ్యచర్మకణజాలంలో బాహ్యచర్మకణాలు, పత్రరంధ్రాలు, కేశాలు, అవభాసినిలు ఉంటాయి. [IPE]

→ పత్రరంధ్రాలు పత్రాలు మరియు లేతకాండాలలో కనిపిస్తాయి.

→ వాయురంధ్రాలు ముదిరిన కాండాలు మరియు ముదిరిన వాయుగత వేర్లలో కనిపిస్తాయి.

→ మౌలిక కణజాలం మొక్క యొక్క ముఖ్యమైన సమూహాన్ని కల్గి ఉంటుంది.

→ ‘మౌలిక కణజాలం’ మూడు భాగాలను కల్గి ఉంటుంది: వల్కలం, పరిచక్రం, దవ్వ.

→ నాళికాకణజాల వ్యవస్థ పోషక కణజాలం, దారువులతో కూడి ఉంటుంది.

→ ఏకదళబీజ మొక్కలు, ద్విదళబీజ మొక్కలు వాటి అంతర్నిర్మాణంలో గుర్తించదగ్గ వైవిధ్యాన్ని చూపిస్తాయి. [IPE]

→ కాని అంతర్నిర్మాణపరంగా ఏకదళబీజకాండం, ద్విదళబీజకాండం కొంచెం ఎక్కువతక్కువలుగా ఒకే రకంగా ఉంటాయి.

AP Inter 1st Year Botany Notes Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

→ పరిచర్మం: బెండు విభాజ్య కణావళి (ఫెల్లోజన్), బెండు (కార్క్ లేదా ఫెల్లమ్) మరియు ద్వితీయ వల్కలం (ఫెల్లోడర్మ్) ఈ మూడింటిని కలిపి ‘పరిచర్మం’ అంటారు.

→ అధశ్చర్మం సూబరిన్ యుత కణాలతో నిర్మితమై ఉంటుంది. సంధాయక కణజాలం మృదుకణజాలయుతం.

→ అంతశ్చర్మం కణాలు కాస్పెరియన్ మందాలను కలిగి ఉంటాయి. పరిచక్రం మృదుకణజాలయుతం.

→ ద్విదళబీజ వేరు యందు దవ్వ కొద్దిగా లేదా ఉండదు. ఏకదళబీజ వేరు యందు బాగా అభివృద్ధి చెంది ఉంటుంది.

→ ద్విదళబీజాలలో నాళికా పుంజాలు సంయుక్తం, సహపార్శ్వం మరియు వివృతం

ఏకదళబీజాలలో నాళికా పుంజాలు సంయుక్తం, సహపార్శ్వం మరియు సంవృతం.

→ ద్విదళ బీజకాండము అడ్డుకోతలోని మూడు ముఖ్య భాగాలు: I. బాహ్యచర్మం II. వల్కలము III. ప్రసరణ స్తంభము

  1. బాహ్య చర్మం: ఇది కాండం యొక్క వెలుపలి పొర.
  2. వల్కలము: ఇది బాహ్యచర్మం మరియు ప్రసరణ స్తంభానికి మధ్యగల భాగం.
    దీనిలోని భాగాలు: a. అధశ్చర్మము b. సామాన్య వల్కలము c. అంతశ్చర్మము
  3. ప్రసరణ స్తంభము:ఇది కాండం కేంద్ర భాగంలో కనిపించే స్థూపం వంటి నిర్మాణము.
    దీనిలోని భాగాలు (i) పరిచక్రము (ii) నాళికాపుంజాలు (iii) దవ్వ (iv) దవ్వరేఖలు

→ ఏకదళబీజకాండం అడ్డుకోతలోని నాలుగు ముఖ్య భాగాలు: [IPE]

  1. బాహ్యచర్మము
  2. అధశ్చర్మము _
  3. సంధాయక కణజాలము
  4. నాళికా పుంజాలు

AP Inter 1st Year Botany Notes Chapter 12 పుష్పించే మొక్కల కణజాలశాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం

→ ద్విదళ బీజ వేరు అడ్డుకోతలోని మూడు ముఖ్య భాగాలు: [IPE]

  1. బాహ్యచర్మం
  2. వల్కలం
  3. ప్రసరణ స్తంభం

→ ఏకదళబీజ వేరు అడ్డుకోతలోని 3 ముఖ్య భాగాలు: [IPE]

  1. బాహ్యచర్మం
  2. వల్కలం
  3. ప్రసరణ స్తంభం

AP Inter 1st Year Botany Notes Chapter 11 కణచక్రం, కణ విభజన

Students can go through AP Inter 1st Year Botany Notes 11th Lesson కణచక్రం, కణ విభజన will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Botany Notes 11th Lesson కణచక్రం, కణ విభజన

→ ‘కణచక్రం’ కణం యొక్క జీవిత చక్రం, పుట్టుక, పెరుగుదల మరియు కణవిభజన వంటి అంశాలను తెలియజేస్తుంది.

→ కణవిభజన ప్రక్రియ ద్వారా ‘జనక కణం’ రెండు లేదా అంతకంటే ఎక్కువ పిల్ల కణాలుగా విభజన చెందుతుంది.

→ కణచక్రం రెండు దశలను కలిగి ఉంటుంది. అవి (i) అంతరదశ (ii) సమ విభజన దశ

→ అంతరదశ అనేది కణవిభజన తయారయ్యే కాలం.

→ సమవిభజన (M దశ) అనేది కణవిభజన జరిగే అసలైనదశ.

AP Inter 1st Year Botany Notes Chapter 11 కణచక్రం, కణ విభజన

→ అంతరదశను G1 దశ, ఏ దశ మరియు G2 దశ అనే ఉపదశలుగా విభజించవచ్చు. [IPE]

→ G1 దశలో, కణం పెరుగుదలను చూపుతూ సామాన్య జీవన ప్రక్రియలను జరుపుకుంటుంది. [IPE]

→ S దశలో, DNA ప్రతికృతి మరియు క్రోమోజోమ్లు రెట్టింపు అగుట జరుగుతుంది. [IPE]

→ G2 దశలో, కణద్రవ్య పెరుగుదల జరుగుతుంది. [IPE]

→ సమవిభజనను ప్రధమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంత్యదశ అను నాలుగు దశలుగా విభజించవచ్చు. [IPE]

→ క్రోమోజోమ్ల సంగ్రహణం అనేది ప్రధమ దశలో జరుగుతుంది. [IPE]

→ మిగతా దశలతో పోల్చితే క్షయకరణ విభజన I లోని ప్రధమ దశ క్లిష్టమైనది మరియు ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీనిని ఐదు ఉపదశలుగా విభజించారు. అవి
[IPE]

  1. లెప్టోటీన్
  2. జైగోటీన్పా
  3. కిటీన్డి
  4. ప్లోటీన్డ
  5. యాకైనెస్

→ మధ్యస్ధదశను క్రోమోసోమ్లు మధ్యస్థ ఫలకం వద్దకు చేరటం ద్వారా గుర్తించవచ్చును. [IPE].

AP Inter 1st Year Botany Notes Chapter 11 కణచక్రం, కణ విభజన

→ చలనదశలో సెంట్రోమియర్లు విభజన చెంది క్రొమాటిడ్లు ఎదురెదురు ధ్రువాల వైపుకు చలిస్తాయి.

→ క్రొమాటిడ్లు ధ్రువప్రాంతానికి చేరిన తరువాత క్రోమోసోమ్లు సాగడం ప్రారంభించి, కేంద్రకాంశం మరియు కేంద్రక త్వచం పునర్నిర్మితమవుతాయి. దీనినే అంత్యదశ అంటారు.

AP Inter 1st Year Botany Notes Chapter 10 జీవ అణువులు

Students can go through AP Inter 1st Year Botany Notes 10th Lesson జీవ అణువులు will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Botany Notes 10th Lesson జీవ అణువులు

→ జీవఅణువులు అనగా జీవులలో ఉండే అణువులు లేదా రసాయనాలు.

→ జీవ అణువుల రకాలు: (i) అకర్బన జీవ అణువులు (ii) కర్బన జీవ అణువులు

→ అకర్బన జీవ అణువులు: ఖనిజలవణాలు, వాయువులు మరియు నీరు.

→ కర్బన జీవ అణువులు : కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు, అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, ఎన్జైమ్స్, న్యూక్లియోటైడ్స్, ఆమ్లాలు, విటమిన్లు మొదలగునవి.

→ ప్రాధమిక జీవ ఉత్పన్నాలు: కొవ్వులు, నూనెలు, న్యూక్లియోటైడ్స్, అమైనో ఆమ్లాలు, చక్కెరలు మొదలగునవి. ద్వితీయ జీవ ఉత్పన్నాలు:ఆల్కలాయిడ్లు, ప్లావనాయిడ్స్, రబ్బర్, ఆవశ్యక నూనెలు, యాంటీబయాటిక్స్, వర్ణద్రవ్యకాలు, జిగురులు, సుగంధ ద్రవ్యాలు మొదలగునవి.

AP Inter 1st Year Botany Notes Chapter 10 జీవ అణువులు

→ జీవరాశుల న్నింటిలో ఎక్కువ సమృద్ధిగా ఉండే జీవ అణువు ‘నీరు’.

→ జీవులలో ఉండే కర్బన పదార్థాలు: అమైనో ఆమ్లాలు, మోనోశాఖరైడ్స్, నత్రజని క్షారాలు.

→ అమైనో ఆమ్లాలు 21 రకాలు మరియు న్యూక్లియోటైడ్లు 5 రకాలు.

→ కొవ్వులు మరియు నూనెలన్నీ గ్లిసరాయిడ్లు. ఇవి గ్లిసరాల్గా ఎస్టరీకరణం అయిన ఫాటీ ఆమ్లాలు.

→ జీవ వ్యవస్థలో స్థూల అణువులు (బృహదణువులు): ప్రోటీన్లు, కేంద్రకామ్లాలు మరియు పాలీశాఖరైడ్స్.

→ జీవ బృహదణువులు బిల్డింగ్ బ్లాక్ లతో నిర్మితమైన పాలిమర్లు.

→ అమైనో ఆమ్లాలతో ఏర్పడిన ప్రోటీన్లు ‘హెటిరోపాలిమర్లు’.

→ కేంద్రకామ్లాలు (DNA మరియు RNA) న్యూక్లియోటైడ్లతో ఏర్పడతాయి. ఇవి జన్యుపదార్ధంగా పనిచేస్తాయి.

→ ‘పాలిశాఖరైడ్స్’ మొక్కలు మరియు శిలీంధ్రాలలో కణకవచంను ఏర్పరుస్తాయి.

→ పాలిశాఖరైడ్స్ శక్తిని నిల్వ చేస్తాయి ఉదా: స్టార్చ్, గ్లైకోజెన్.

→ ప్రోటీన్లు వివిధ రకాల కణ విధులను నిర్వర్తిస్తాయి.

→ ఎక్కువ శాతం ప్రోటీన్లు ఎన్ఎమ్లుగాను, కొన్ని ప్రతి రక్షకాలుగాను, కొన్ని అభిగ్రాహకాలుగాను, కొన్ని హార్మోన్లుగాను ఉన్నాయి.

AP Inter 1st Year Botany Notes Chapter 10 జీవ అణువులు

→ ‘కొల్లాజన్’ అనేది జంతు ప్రపంచంలో అత్యంత సమృద్ధిగా లభించే ప్రోటీను.

→ ‘రుబిస్కో’ జీవావరణవ్యవస్థలో అత్యంత సమృద్ధిగా లభించే ప్రోటీను.

→ అమైనో ఆమ్లమునకు ఉదా: గ్లైసిన్ [IPE]
చక్కెరకు ఉదా: గ్లూకోజ్.
న్యూక్లియోటైడ్కు ఉదా:ఎడినైలిక్ ఆమ్లం
ఫాటి ఆమ్లంకు ఉదా:లెసిథిన్ గ్లిసరాల్

→ ప్రత్తి తంతువులు – సెల్యూలోజ్ [IPE]
బొద్దింక యొక్క బాహ్య అస్థిపంజరం – కైటిన్
కాలేయం – గ్లైకోజెన్
చెక్కుతీసిన బంగాళదుంప -స్టార్చ్

AP Inter 1st Year Botany Notes Chapter 9 కణం: జీవప్రమాణం

Students can go through AP Inter 1st Year Botany Notes 9th Lesson కణం: జీవప్రమాణం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Botany Notes 9th Lesson కణం: జీవప్రమాణం

→ కణం అనేది జీవనం యొక్క ప్రాధమిక ప్రమాణం. ఇది జీవులన్నింటిలో మౌలికమైన, నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం.

→ అన్ని జీవులు కణాలు మరియు కణసంకలితాలతో ఏర్పడి ఉంటాయి.

→ కణాలు ఆకారం, పరిమాణం మరియు విధులలో భిన్నంగా ఉంటాయి.

→ ‘కణసిద్ధాంతం’ ను ప్లీడన్ మరియు ష్వాన్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. తరువాత రుడాల్ఫ్ విర్షా అనే శాస్త్రవేత్త కణసిద్ధాంతానికి పరిపూర్ణత కల్పించాడు.

→ కణసిద్ధాంతం:

అన్ని జీవులు కణాలు మరియు కణసంకలితాలతో నిర్మితమవుతాయి.
(ii) కొత్త కణాలు పూర్వపు కణాల నుండి ఏర్పడతాయి.

AP Inter 1st Year Botany Notes Chapter 9 కణం: జీవప్రమాణం

→ కణాల రకాలు: (i) కేంద్రక పూర్వకణం (ii) నిజకేంద్రక కణం

→ వృక్ష కణాలు యొక్క ‘ద్రవాభిసరణతను’ నియంత్రించుటలో ‘రిక్తికలు’ ముఖ్య పాత్రను పోషిస్తాయి. [IPE]

→ మెటాసెంట్రిక్ క్రోమోసోమ్ మధ్యభాగంలో సెంట్రోమియర్ ను కలిగి రెండు సమాన బాహువులను ఏర్పరుస్తుంది.

→ కొన్ని క్రోమోసోమ్లలో ఉండే చిన్న ఖండికలాంటి నిర్మాణాన్ని ‘శాటిలైట్’ అంటారు.
ఇది ప్రధాన క్రోమెసోమ్ నుండి ద్వితీయ కుంచనం ద్వారా వేరు చేయబడుతుంది. [IPE]

→ ‘మధ్య పటలిక’ కాల్షియం పెక్టెట్తో తయారవుతుంది. ఇది ప్రక్కనున్న ఇతర కణాలను బంధించి ఉంచుతుంది.

→ హరిత వర్ణకాన్ని కలిగి ఉన్న కణాంగాలను ‘హరితరేణువులు’ అంటారు. [IPE]

→ మైటో కాండ్రియాలు ‘కణ శక్త్యాగారాలు’. [IPE]

→ కేంద్రక నిర్మాణం నాలుగు ప్రధాన అంశాలతో జరుగుతుంది. అవి: [IPE]

  1. కేంద్రక త్వచం
  2. కేంద్రకమాత్రిక
  3. క్రోమాటీన్ పదార్ధం
  4. న్యూక్లియోలస్

AP Inter 1st Year Botany Notes Chapter 9 కణం: జీవప్రమాణం

→ క్రోమోజోముల రకాలు (సెంట్రోమియర్ ఆధారంగా): [IPE]

  1. మెటాసెంట్రిక్
  2. సబ్మెటా సెంట్రిక్
  3. ఏక్రోసెంట్రిక్
  4. టీలోసెంట్రిక్

→ క్రొమాటిన్ మీద ఉన్న పూసల వంటి నిర్మాణాలను న్యూక్లియోసోమ్స్ అంటారు.

→ న్యూక్లియోసోమ్ నిజకేంద్రక క్రోమోజోమ్ యొక్క నిర్మాణాత్మక ప్రమాణం. [IPE]

AP Inter 1st Year Botany Notes Chapter 8 ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం

Students can go through AP Inter 1st Year Botany Notes 8th Lesson ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Botany Notes 8th Lesson ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం

→ మొక్కల సిస్టమాటిక్స్ అనేది మొక్కల వైవిధ్యాలు, చరిత్ర మరియు వాటి మధ్య ఉన్న పరిణామక్రమ అనుబంధం గురించి అధ్యయనం చేస్తుంది.

→ పుష్పించే మొక్కలను ‘ఆవృతబీజాలు’ అంటారు.

→ ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం పుష్పించే మొక్కల గుర్తింపు, నామీకరణ మరియు వర్గీకరణను గురించి అధ్యయనం చేస్తుంది.

→ వర్గీకరణ రకాలు: (i) ఆల్ఫావర్గీకరణ శాస్త్రం (ii) బీటా వర్గీకరణ శాస్త్రం (iii) ఒమేగా వర్గీకరణశాస్త్రం

→ ఆల్ఫావర్గీకరణ శాస్త్రం: పుష్పించే మొక్కల స్వరూప లక్షణాల మీదే ఆధారపడి చేసిన వర్గీకరణ శాస్త్రమును ఆల్ఫా వర్గీకరణ శాస్త్రం అంటారు.

AP Inter 1st Year Botany Notes Chapter 8 ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం

→ బీటా వర్గీకరణ శాస్త్రం: పుష్పించే మొక్కల స్వరూప లక్షణాలతోపాటు జన్యులక్షణాలు, అంతర్నిర్మాణం, శరీరధర్మాలను గురించి అధ్యయనం చేసే వర్గీకరణ శాస్త్రమును బీటా వర్గీకరణ శాస్త్రం అంటారు.

→ ఒమేగా వర్గీకరణ శాస్త్రం: స్వరూప లక్షణాలతో పాటు ఇతర వృక్షశాస్త్ర శాఖలు అయినటువంటి పిండోత్పత్తిశాస్త్రం, కణశాస్త్రం, వృక్ష రసాయన శాస్త్రం, పరాగరేణు శాస్త్రాల నుంచి లభించే సమాచారం మీద ఆధారపడి వర్గీకరించే శాస్త్రాన్ని ‘ఒమేగా వర్గీకరణ’ శాస్త్రం అని అంటారు. [IPE]

→ మృత్తిక లోపల ఫలాలు ఏర్పడడాన్ని భూఫలనం అంటారు. ఉదా: అరాఖిస్ హైపొజియా (వేరుశనగ). [IPE]

→ ‘పుష్పచిత్రం’ అనేది పుష్పభాగాలు మరియు వాటి యొక్క అమరికను చిత్రాల ద్వారా తెలియజేస్తుంది. [IPE]

→ ‘పుష్ప సంకేతం’ వివిధ పుష్ప భాగాలను చిహ్నల ద్వారా తెలియజేస్తుంది. [IPE]

→ ‘ఫాబేసి కుటుంబం’ యొక్క అనావశ్యక అంగాలు రక్షక పత్రాలు. [IPE]

→ ‘లిలియేసి కుటుంబం’ యొక్క ఆవశ్యక పుష్పభాగాలు కేసరావళి మరియు అండకోశం. [IPE]

→ ‘సోలనేసి కుటుంబం’ యొక్క ఆవశ్యక అంగాలు కేసరావళి, అండకోశం మరియు ఆకర్షక పత్రాలు. [IPE]

AP Inter 1st Year Botany Notes Chapter 8 ఆవృతబీజాల వర్గీకరణ శాస్త్రం

→ ఆర్ధిక ప్రాముఖ్యం కలిగిన ఫాబేసి కుటుంబం మొక్క ఉత్పత్తులు. [IPE]

  1. పప్పు ధాన్యాలు
  2. వంట నూనెలు
  3. కూరగాయలు
  4. కలప
  5. నీలి రంగు
  6. పశుగ్రాసం
  7. హరిత ఎరువు
  8. నారలు

AP Inter 1st Year Botany Notes Chapter 7 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి

Students can go through AP Inter 1st Year Botany Notes 7th Lesson పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Botany Notes 7th Lesson పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి

→ ‘పుష్పాలు’ ఆకృతి పరంగా మరియు పిండోత్పత్తిశాస్త్ర పరంగా గొప్ప అద్భుతాలు మరియు అవి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు మూలస్థానాలు.

→ ‘పరాగరేణువులు’ సూక్ష్మసిద్ధ బీజాశయంలో అభివృద్ధి చెందుతాయి.

→ ప్రతి ‘సూక్ష్మసిద్ధబీజం’ ఒక పరాగరేణువుగా పరిణితి చెందుతుంది.

→ పక్వదశ చేరే సమయంలో పరాగరేణువులు శాకీయ కణం, ఉత్పాదక కణములను కలిగి ఉంటాయి.

→ అండాశయంలో అండాలు ఉంటాయి. ప్రతి అండం రెండు కవచాలతో కప్పబడి ఉంటుంది.

→ స్థూలసిద్ద బీజం(స్త్రీ సంయోగ బీజం) పిండకోశంగా అభివృద్ధి చెందుతుంది.

→ పక్వదశలో పిండకోశం 7 కణాలయుతంగా లేదా 8 కేంద్రకాలయుతంగా ఉంటుంది.

AP Inter 1st Year Botany Notes Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు

→ పరాగసంపర్కం అనగా పరాగరేణువులు పరాగకోశం నుండి కీలాగ్రంకు చేరే యాంత్రిక రవాణా.

→ పరాగసంపర్క కారకాలు నిర్జీవ (గాలి మరియు నీరు లేక జీవకారకాలు(జంతువులు) అయి ఉంటాయి.

→ ఫలదీకరణం తరువాత, అండాశయం ఫలంగా మరియు అండాలు విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి.

→ అభివృద్ధి చెందిన పిండకోశంలోని భాగాలు: (i) స్త్రీ బీజ పరికరం (ii) కేంద్రక కణం (iii) ప్రతి పాదకణాలు

→ సూక్ష్మ సిద్ధ బీజాశయం యొక్క నాలుగు కుడ్య పొరలు: [IPE]

  1. బాహ్యచర్మం
  2. ఎండోధీసియం
  3. మధ్య పొరలు
  4. టపెటమ్

→ ఆవృతబీజంలో ఫలదీకరణ దశలు:

  1. అండాశయంలోకి పరాగనాళం ప్రవేశం: (a) రంధ్రసంయోగం (b) చలాజోగమి (c) మధ్యసంయోగం
  2. పిండకోశంలోకి పరాగనాళం
  3. పిండకోశంలోకి పురుష సంయోగబీజాల విడుదల
  4. త్రిసంయోగం (సింగమి)
  5. త్రిసంయోగం మరియు ద్విఫలదీకరణం [IPE]

AP Inter 1st Year Botany Notes Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు

Students can go through AP Inter 1st Year Botany Notes 6th Lesson ప్రత్యుత్పత్తి విధానాలు will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Botany Notes 6th Lesson ప్రత్యుత్పత్తి విధానాలు

1. ‘ప్రత్యుత్పత్తి ప్రక్రియ’ ఒక జాతి మనుగడను తరతరాలుగా కొనసాగేందుకు తోడ్పడుతుంది.

2. జీవులలో ప్రత్యుత్పత్తి రకాలు: (i) అలైంగిక ప్రత్యుత్పుత్తి (ii) లైంగిక ప్రత్యుత్పత్తి

3. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒకే జనకం పాల్గొంటుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో రెండు జనకాలు (పురుష మరియు స్త్రీ) పాల్గొంటాయి. [IPE]

4. అలైం గిక ప్రత్యుత్పత్తి లో సంయోగబీజాల కలయిక జరగదు. లైంగిక ప్రత్యుత్పత్తి యందు సంయోగబీజాల కలయిక జరుగుతుంది. [IPE]

AP Inter 1st Year Botany Notes Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు

5. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఫలదీకరణ జరగదు. లైంగిక ప్రత్యుత్పత్తి లో ఫలదీకరణ జరుగుతుంది. [IPE]

6. అలైంగిక ప్రత్యుత్పత్తిలో సంతతి తల్లిదండ్రులను పోలి ఉంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తిలో సంతతి తల్లిదండ్రుల పోలికలలో భేదాలను చూపుతాయి. [IPE]

7. అలైంగిక ప్రత్యుత్పత్తి శైవలాలు, శిలీంధ్రాలలో సాధారణం. ఇది గమన సిద్ద బీజాలు మరియు సిద్ధ బీజాల జరుగుతుంది.

8. ఆసృతబీజాలలోని అలైంగిక ప్రత్యుత్పత్తిని శాకీయ వ్యాప్తి లేదా శాకీయ ప్రత్యుత్పత్తి అంటారు.

9. ఆ వృతబీజాలలోని శాకీయ వ్యాప్తి రన్నర్స్, రైజోమ్స్, సక్కర్స్, ట్యూబర్స్, ఆఫ్సెట్స్ ద్వారా జరుగుతుంది. [IPE]

10. రెండు రకాల సంయోగ బీజాలు అనగా పురుష, స్త్రీ సంయోగ బీజాలు ఏర్పడే విధానాన్ని సంయోగబీజ జననం’అంటారు.

11. లైంగిక ప్రత్యుత్పత్తిలోని మూడు సంఘటనలు: ఫలదీకరణ పూర్వ సంఘటనలు, ఫలదీకరణ, ఫలదీకరణ అనంతర సంఘటనలు

12. ఫలదీకరణ పూర్వ సంఘటనలు: సంయోగబీజ జననం మరియు సంయోగబీజాల రవాణా

13. ఫలదీకరణ అనంతర సంఘటనలు: సంయుక్త బీజం ఏర్పడుట మరియు పిండ జననం

AP Inter 1st Year Botany Notes Chapter 6 ప్రత్యుత్పత్తి విధానాలు

14. మొక్కలు ఏకలింగశ్రయాలు మరియు ద్విలింగశ్రయాలు. శిలీంధ్రాలు ఏకలింగక మరియు ద్విలింగకంగా ఉంటాయి.

15. ఆవృత బీజాలలో పురుష సంయోగబీజాల రవాణా ‘పరాగసంపర్కం’ ద్వారా జరుగుతుంది.

16. సమసంయోగం (సింగమి) పురుష మరియు స్త్రీ సంయోగబీజాలలో జరుగుతుంది. ఇది బాహ్య లేదా అంతరంగా జరగవచ్చు.

17. సంయుక్త బీజం నుండి పిండం ఏర్పడే విధానాన్ని ‘పిండ జననం’ అంటారు. [IPE]

18. పుష్పించే మొక్కలలో ఫలదీకరణం తరువాత అండాశయం ఫలంగా మరియు అండాలు విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి.

AP Inter 1st Year Botany Notes Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం

Students can go through AP Inter 1st Year Botany Notes 5th Lesson పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Botany Notes 5th Lesson పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం

→ ‘మొక్కల స్వరూపశాస్త్రం’ మొక్కల రకాలు, ఆకారం, రంగు మరియు నిర్మాణం గురించి అధ్యయనం చేస్తుంది.

→ మొక్క దేహం ముఖ్యంగా రెండు రకాలు: 1. వేరువ్యవస్థ 2. కాండం వ్యవస్థ.

→ వేరు: పుష్పించే మొక్కల భూగర్భ భాగాన్ని వేరు అని అంటారు.

→ వేరు రకాలు: 1. తల్లి వేరు వ్యవస్థ 2. పీచు వేరు వ్యవస్థ

→ వేరు యొక్క సాధారణ విధులు: నీరు, ఖనిజముల శోషణ మరియు ప్రసరణ.

→ వేరు రూపాంతరం:వేరు తన సాధారణ విధులు కంటే మరికొన్ని ఇతర విధులను నిర్వర్తించడం కోసం తన ఆకారాన్ని, నిర్మాణాన్ని మార్చుకోవడాన్నే “వేరు రూపాంతరం” అంటారు.

AP Inter 1st Year Botany Notes Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం

→ వేరు రూపాంతర రకాలు-ఉదాహరణలు:

  1. నిల్వ వేర్లు : ఉదా: క్యారెట్, చిలకడదుంప
  2. ఊడ వేర్లు: ఉదా: మర్రిచెట్టు
  3. ఊత వేర్లు: ఉదా: చెరుకు, మొక్కజొన్న
  4. శ్వాసించే వేర్లు: ఉదా: అవిసీనియా మరియు రైజోఫోరా
  5. వెలమిన్ వేర్లు: ఉదా: వాండా
  6. పరాన్న జీవ వేర్లు / హాస్టోరియల్ వేర్లు:.
    (a) సంపూర్ణ పరాన్న జీవ వేర్లు ఉదా: కస్కూట
    (b) అసంపూర్ణ పరాన్న జీవ వేర్లు ఉదా: విస్కమ్, స్ట్రెయిగా
  7. బుడిపె వేర్లు: ఉదా: వేరుశనగ
  8. కిరణజన్య సంయోగ క్రియ జరిపే వేర్లు: ఉదా: టినియోఫెల్లమ్

→ కాండం: పుష్పించే మొక్కల వాయుగత భాగాన్ని కాండం అని అంటారు. [IPE]

→ కాండ రూపాంతరాలు: పరిసరాలకు అనుగుణంగా కొన్ని ప్రత్యేక విధులను నిర్వర్తించడానికి కొన్ని మొక్కల కాండాలలో ఏర్పడే శాశ్వత నిర్మాణాత్మక మార్పులనే ‘కాండ రూపాంతరాలు’ అంటారు. [IPE]

→ కాండ రూపాంతర రకాలు ఉదాహరణలు: [IPE]
I. భూగర్భ కాండ రూపాంతరాలు: ఉదా: అల్లంలో కొమ్ము, నీరుల్లిలో లశునం, కొలకేసియాలో కందాలు, బంగాళదుంపలో దుంపకాండం.

II. వాయుగత కాండ రూపాంతరాలు:
(a) కాండ నూలి తీగలు: ఉదా: దోసకాయ, పుచ్చకాయ
(b) ముళ్లు: ఉదా: బ్రహ్మజెముడు, యుపరియా, కాజురైనా
(c) పత్రాభ కాండాలు: ఉదా: బోగన్ విల్లా, సిట్రస్
(d) లఘు లశునాలు: ఉదా: పుష్ప కోరకాలు (అగేవ్), శాకీయ కోరకాలు(డయాస్కోరియా)

III. ఉపవాయుగత కాండ రూపాంతరాలు: ఉదా: (a) రన్నర్స్ (b) స్టోలన్స్ (c)ఆఫ్సెట్స్ (d) సక్కర్స్

→ కాండంపై పార్శ్వంగా ఉద్భవించే బల్లపరుపు నిర్మాణమును ‘పత్రం’ అంటారు. [IPE]

→ పత్రాలు ఆకుపచ్చరంగులో ఉంటూ కిరణజన్యసంయోగక్రియను జరుపుతాయి.

AP Inter 1st Year Botany Notes Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం

→ పత్రాలు వాటి యొక్క ఆకారము, పరిమాణము, గ్రీవం మరియు పత్రదళాలలో వైవిధ్యాలను ప్రదర్శిస్తాయి.

→ ఉబ్బి ఉండే పత్ర పీఠమును ‘తల్పం వంటి పత్ర పీఠం’ అంటారు. ఇది లెగ్యుమెనోసి మొక్కలలో కన్పిస్తుంది. [IPE]

→ ఈనెల వ్యాపనం:పత్రదళంలో ఈనెలు, పిల్ల ఈనెలు అమరి ఉండే విధానాన్ని ‘ఈనెల వ్యాపనం’ అంటారు. [IPE]

→ ప్రత్యుత్పత్తి కొరకు రూపాంతరం చెందిన ప్రకాండమే ‘పుష్పం’.

→ పుష్పవిన్యాసం: పుష్పవిన్యాసాక్షం మీద పుష్పాలు అమరి ఉండే విధానాన్ని పుష్పవిన్యాసం అంటారు.

→ ఆవృత బీజాలలోని పుష్పవిన్యాసాలు: నిశ్చిత పుష్పవిన్యాసం, అనిశ్చిత పుష్పవిన్యాసం.

→ మధ్యాభిసార పుష్పవిన్యాస రకాలు- ఉదాహరణలు:

  1. మధ్యాభిసార: ఉదా: క్రోటలేరియా(సామాన్య), మాంజిఫెరా (సంయుక్త)
  2. సమశిఖి : ఉదా: కాసియా(సామాన్య ), కాలిఫ్లవర్ (సంయుక్త) iii. గుచ్చము: ఉదా: నీరుల్లి(సామాన్య), కారట్ (సంయుక్త)
  3. శీర్షవత్: ఉదా: ట్రెడాక్స్ మరియు ప్రొద్దుతిరుగుడు v. కంకి: ఉదా: అభిరాంధస్ (సామాన్య), గడ్డి-పోయేసియే(సంయుక్త)
  4. స్పాడిక్స్ :ఉదా: కోలకేసియా (సామాన్య), కోకస్ (సంయుక్త)

→ సౌష్టవం ఆధారంగా పుష్పాలు మూడు రకాలు. సౌష్టవయుతం ( వ్యాసార్థపు సౌష్టవం), పాక్షిక సౌష్టవయుతం ( ద్విపార్శ్వ సౌష్టవం), సౌష్టవరహితం [IPE]

→ సయాథియంలో గిన్నె వంటి నిర్మాణ స్వరూపం ‘పరిచక్ర పుచ్ఛావళి’. ఇది యూఫోర్బియేసి కుటుంబంలో కన్పిస్తుంది. [IPE]

→ సౌష్టవయుత పుష్పంలో పుష్పాన్ని మధ్య నుంచి ఏ వ్యాసార్ధపు తలం నుంచైనా రెండు సమ భాగాలుగా విభజించవచ్చు. ఉదా: మందార, దతూర [IPE]

→ పాక్షిక సౌష్టవయుత పుష్పంలో పుష్పాన్ని మధ్య నుంచి ఏదో ఒక తలం నుంచి మాత్రమే నిలువునా రెండు సమ భాగాలుగా విభజించవచ్చు ఉదా: బఠాణి, చిక్కుడు
[IPE]

AP Inter 1st Year Botany Notes Chapter 5 పుష్పించే మొక్కల స్వరూపశాస్త్రం

→ ద్విదళబీజ మొక్కలు చతుర్భాగయుత మరియు పంచభాగయుత పుష్పాలను కలిగి ఉంటాయి.

→ ఏకదళబీజ మొక్కలు త్రిభాగయుత పుష్పాలను కలిగి ఉంటాయి.

→ పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు రక్షక పత్రావళి లేదా ఆకర్షణ పత్రావళి అమరి ఉన్న విధానాన్ని ‘పుష్పరచన అంటారు.

→ ఫలధీకరణం తరువాత అండాశయం ఫలంగా మరియు అండాలు విత్తనాలుగా మారుతాయి.

→ అండన్యాసం: అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని అండన్యాసం అంటారు.

→ ఫలదీకరణం చెందిన అండాశయం నుండి వచ్చే ఫలమును ‘నిజఫలం’ అంటారు. [IPE]

→ ఫలదీకరణ చెందని అండాశయం నుండి వచ్చే ఫలమును ‘అనిషేక ఫలం’ అంటారు. [IPE]