AP State Board Syllabus AP SSC 10th Class Telugu Solutions 12th Lesson చిత్రగ్రీవం Textbook Questions and Answers.
AP State Syllabus SSC 10th Class Telugu Solutions 12th Lesson చిత్రగ్రీవం
10th Class Telugu 12th Lesson చిత్రగ్రీవం Textbook Questions and Answers
ఉన్ముఖీకరణ : చదవండి – ఆలోచించి చెప్పండి
రక్తాలు ఓడుతూన్న మా రాస్పెలదార్ గబగబా ఏదో రాసి ఆ కాగితాన్ని నా కాలికి కట్టారు. కట్టి నన్ను వంజరం లోంచి వదలిపెట్టారు. అతని కళ్లల్లో కనిపించిన ఆందోళనను బట్టి, వాళ్ళంతా తీవ్రమైన ఆపదలో ఉన్నారనీ, ముఖ్యస్థావరం నుంచి సత్వర సహాయం ఆశిస్తున్నారనీ అర్థమయింది. వెంటనే కాలికి కట్టిన సమాచార పత్రంతో సహాగాలిలోకి ఎగిరాను. ఎలాగైనా సరే ఘోండ్”వేచి ఉండే ప్రధాన స్థావరం దగ్గరకు చేరుకొని తీరాలన్న తవన. ‘చేరాలి. చేరి తరాలి’ అని మనసులో పదేవదే అనుకొన్నాను. పలికిన ప్రతీసారీ ఆ మాటలు విష్యమంత్రాల్లా నా మనసులో బాగా నాటుకొనిపోయి నాకు నూతన జవసత్త్వాలను అందించసాగాయి. అప్పటికే బాగా పైకి చేరుకొన్నాను. కాబట్టి ఒక్కసారి నాలుగు దిక్కులా కలయజూసి, పడమట దిశను గుర్తుపట్టి ఆ దిశగా ఎగర నారంభించాను. వంకర టింకర మార్గాల్లో పిచ్చిగా ఎగిరి, చిట్టచివరకు గమ్యంచేరి ఘోండ్ చేతిమీద వాలాను. రస్సెల్దార్ అందించిన ఆ సమాచారాన్ని ఘోండ్ గబగబా చదివి, సంతోషంతో దుక్కిటెద్దులా రంకె పెట్టారు. ప్రేమగా నా తల నిమిరారు.
ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న 1.
ఈ పేరాలోని మాటలు ఎవరు చెబుతున్నారు?
జవాబు:
ఈ పేరాలోని మాటలు, ఒక పక్షి చెపుతున్నది.
ప్రశ్న 2.
సమాచారాన్ని ఎవరి దగ్గర నుండి ఎవరికి ఆ పక్షి చేర్చింది.
జవాబు:
సమాచారాన్ని రాస్సెల్ దార్ నుండి ఊండకు చేర్చింది.
ప్రశ్న 3.
సమాచారాన్ని చేరవేయడానికి ఏ పక్షిని ఉపయోగించి ఉంటారు? ఎందుకు?
జవాబు:
సమాచారాన్ని చేరవేయడానికి పావురాన్ని ఉపయోగించి ఉంటారు. పావురానికి దిశాపరిజ్ఞానం ఉంది. అందువల్ల పావురాన్ని ఉపయోగించి ఉంటారు.
ప్రశ్న 4.
సమాచారాన్ని చేరవేసిన పక్షిలోని గొప్ప లక్షణాలు ఏవి?
జవాబు:
ఎలాగైనా సరే, ఘోండ్ వేచి ఉండే ప్రధాన స్థావరం దగ్గరకు చేరుకొని తీరాలన్న తపన ఆ పక్షిలో ఉంది. ఈ పక్షి రాస్సెల్ దార్ కళ్ళలోని ఆందోళనను గుర్తించింది.
ఇవి చేయండి
I. అవగాహన – ప్రతిస్పందన
ప్రశ్న 1.
“మనుషుల్లాగే పక్షులకు, జంతువులకు కూడా తమ పిల్లలను పెంచడం ఎలాగో తెలుసు” దీనిమీద మీ అభిప్రాయాన్ని తెల్పండి. కారణాలను వివరిస్తూ మాట్లాడండి.
జవాబు:
మనం చదివిన “చిత్రగ్రీవం” కథలో తల్లి పక్షి, తండ్రి పక్షి పిల్ల పక్షికి (చిత్రగ్రీవానికి) ఆహారాన్ని పెట్టాయి. తండ్రి పక్షి, దాని బద్ధకాన్ని పోగొట్టి, ఎగిరేలా చేసింది. ఎగిరేటప్పుడు చిత్రగ్రీవానికి తల్లి సాయపడింది. చిత్రగ్రీవానికి ఆయాసం వచ్చింది. అప్పుడు తల్లి పక్షి, దాన్ని దగ్గరకు తీసుకొని లాలించింది.
లోకంలో పక్షులు తమ పిల్లల రక్షణ కోసం గూళ్లను నిర్మిస్తున్నాయి. పిల్లలు ఎగిరి వాటి ఆహారం తెచ్చుకోనే వరకూ, అవే ఆహారాన్ని పిల్లలకు అందిస్తున్నాయి. జంతువులు తమ పిల్లలకు తాము పాలిచ్చి పెంచుతున్నాయి.
తల్లి కుక్క తన పిల్లలకు పరుగుపెట్టడం, కరవడం, వగైరా నేర్పుతుంది. తమ పిల్లల జోలికి ఇతరులు రాకుండా తల్లి జంతువులు కాపాడతాయి. తమ పిల్లల జోలికి వస్తే ఆవు, గేదె వగైరా జంతువులు తమ కొమ్ములతో పొడుస్తాయి. తమ దూడలు తమ దగ్గరకు రాగానే, అని పొదుగులను చేపి పాలిస్తాయి.
ఇందువల్ల పక్షులకూ, జంతువులకూ తమ పిల్లల్ని పెంచడం తెలుసునని నా అభిప్రాయం.
ప్రశ్న 2.
పాఠం ఆధారంగా కింది పట్టికను పూరించండి. పేరా సంఖ్య
పేరా సంఖ్య | పేరాలో వివరించిన ముఖ్యమైన విషయాలు | పేరాకు తగిన శీర్షిక |
1వ పేరా : | ||
2వ పేరా : | ||
10వ పేరా: | ||
15వ పేరా : | ||
16వ పేరా : |
జవాబు:
పేరా సంఖ్య | పేరాలో వివరించిన ముఖ్యమైన విషయాలు | పేరాకు తగిన శీర్షిక |
1వ పేరా : | 1) కోల్ కతా నగరంలో పిల్లలు పావురాలను బాగా పెంచుతారు. 2) ఎన్నో శతాబ్దాల నుంచి రాజులూ, రాజులూ పావురాలను పెంచుతున్నారు. సామాన్యులు సైతం రంగురంగుల పావురాలను పెంచుతున్నారు. |
భారతదేశం – పావురాల పెంపకం |
2వ పేరా : | మన దేశంలో పావురాలు ఎగురుతూ, కనువిందు చేస్తూ ఉంటాయి. పావురాలు బృందాలుగా ఎగురుతూ ఉంటాయి. అవి ఎంతదూరం ఎగిరి వెళ్ళినా, తిరిగి తమ యజమాని ఇంటికి చేరతాయి. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. పావురాలకు దిశా జ్ఞానం ఉంది. పావురాలు తమ యజమానులు అంటే ప్రాణం పెడతాయి. వాటికి ఉన్న అంతఃప్రేరణతో అవి యజమాని ఇంటికి చేరతాయి. |
పావురాల దిశా పరిజ్ఞానం |
10వ పేరా: | తల్లి పక్షి గుడ్డులోని శబ్దం వింటుంది. తల్లి పక్షి శరీరంలో స్పందన కనిపిస్తుంది. తల్లి పక్షిలో దివ్యస్పందన కలిగి, రెండు ముక్కుపోట్లతో అది గుడ్డును పగులకొట్టింది. పిల్ల పక్షి బలహీనంగా ఉంటుంది. తల్లి పిల్లను తన రొమ్ములో దాచుకుంటుంది. | పావురం గుడ్లను పొదగడం |
15వ పేరా : | చిత్రగ్రీవం గూటి అంచున కూర్చుంది. అది చీమను ముక్కుతో పొడిచి, దాన్ని రెండు ముక్కలు చేసింది. పావురం చీమను తినే వస్తువు అనుకుంది. నిజానికి చీమ పావురాలకు మిత్రుడు. అందుకే పావురం పశ్చాత్తాపపడింది. పావురం తిరిగి ఆ తప్పు చేయలేదు. | పావురం చీమను చంపడం |
16వ పేరా : | చిత్రగ్రీవానికి వయస్సు ఐదు వారాలు. అది గూటి దగ్గర మూకుడు నుండి నీళ్ళు తాగడం నేర్చుకొంది. ఆహారం కోసం తల్లిదండ్రులమీదే ఆధారపడుతోంది. యాజమాని పెట్టే గింజల్ని గొంతులో పైకి, కిందికీ ఆడిస్తూ తినేది. తాను గొప్పగా తినగలుగుతున్నానని దానికి గర్వంగా ఉండేది. తన చురుకుదనాన్ని తన తల్లిదండ్రులకు చెప్పమన్నట్లు, అది యజమానివైపు చూచేది. కానీ చిత్రగ్రీవం మిగిలిన పావురాలన్నింటి కన్నా మందకొడి. | చిత్రగ్రీవం చదువు |
3. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) చిత్రగ్రీవం ఏ వయస్సులో ఏమేం చేయగలిగిందో రాయండి.
జవాబు:
- చిత్రగ్రీవం పుట్టిన రెండో రోజు నుండే, దాని తల్లిదండ్రులు గూటి వద్దకు వచ్చినప్పుడల్లా అది తన ముక్కు తెరచి, తన గులాబీ రంగు శరీరాన్ని బంతివలె ఉబ్బించేది.
- చిత్రగ్రీవం, తన మూడు వారాల వయసులో దాని గూటిలోకి వచ్చిన చీమను చూసి తినే వస్తువు అనుకొని తన ముక్కుతో దానిని పొడిచి రెండు ముక్కలు చేసింది.
- ఐదోవారంలో చిత్రగ్రీవం తను పుట్టిన గూడు నుండి బయటకు గెంతి, పావురాళ్ల గూళ్ల దగ్గర పెట్టిన మట్టి మూకుడులో నీటిని, తాగగల్గింది.
- అదే వయసులో యజమాని ముంజేయి మీద కూర్చుని అరచేతిలో గింజల్ని పొడుచుకు తినేది. చిత్రగ్రీవం గింజలను తన గొంతులో పైకి కిందికి ఆడించి, తర్వాత టక్కున మింగేది.
- గాలిదుమారం వచ్చినపుడూ, సూర్యుని కిరణాలు కంటిలో పడినపుడూ, చిత్రగ్రీవం తన కళ్లమీదకు దాని కనురెప్పల పక్కనున్న చర్మపు పొరను సాగదీసి కప్పేది.
- చిత్రగ్రీవం ఏడవ వారంలో ఎగరడం నేర్చుకుంది.
ఆ) చిత్రగ్రీవానికి దాని తల్లిపక్షి, తండ్రిపక్షి నుండి ఏమేమి సంక్రమించాయి?
జవాబు:
చిత్రగ్రీవం తల్లి పక్షి నుండి తెలివితేటలు సంపాదించుకుంది. తండ్రి పక్షి నుండి వేగం, చురుకుదనం, సాహసం ‘ సంపాదించుకుంది. తండ్రి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పింది. తల్లి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడంలో సాయపడింది.
ఇ) చిత్రగ్రీవం గురించి వివరిస్తూ అది సుందరమైనదని, మందకొడిదని, ఏపుగా ఎదిగిందని రచయిత ఎందుకన్నాడు?
జవాబు:
చిత్రగ్రీవం తల్లిదండ్రులు చిత్రగ్రీవం దగ్గరనే ఉండి దాన్ని లాలిస్తూ, దాని బాగోగులు చూస్తూ ఉండడం వల్ల, ఆహారం అందించడంలో శ్రద్ధ తీసుకోవడం వల్ల చిత్రగ్రీవం మహా ఏపుగా పెరిగింది.
చిత్రగ్రీవానికి ఐదోవారం వచ్చింది. అయినా చిత్రగ్రీవం తన ఆహారం కోసం ఇంకా తల్లిదండ్రులమీదే ఆధారపడి ఉంది. అందువల్లే శక్తియుక్తులు పెంపొందించుకోడంలో పావురాలు అన్నింట్లోనూ చిత్రగ్రీవమే మందకొడి అని రచయిత అన్నాడు.
చిత్రగ్రీవం పుట్టిన తర్వాత వారాలు గడిచేకొద్దీ దానికి ఈకలు పెరిగాయి. దానికి ఒక్కసారిగా నిండుగా ఈకలు పెరిగాక, ఆ ఈకలు అతి సుందరమైన రంగులతో నిండాక, అందంలో చిత్రగ్రీవానికి సాటిరాగల పావురం లేదని స్పష్టమయ్యింది.
ఈ) చిత్రగ్రీవం గురించి మనకు వివరిస్తున్నది ఎవరు? తాను చేసిన పనికిమాలిన పని అని దేన్ని గురించి చెప్పాడు?
జవాబు:
చిత్రగ్రీవం గురించి మనకు ధనగోపాల్ ముఖర్జీ గారు వివరించారు. ధనగోపాల్ ముఖర్జీ గారు, పావురాల గూళ్లను శుభ్రం చేస్తూ, గూటిలో ఉన్న రెండు గుడ్లనూ పక్క గూట్లో పెట్టారు. మొదటి గూడు శుభ్రం చేయడం పూర్తి అయ్యాక తిరిగి ఒక గుడ్డును గూట్లో పెట్టారు. రెండవ గుడ్డును కూడా ఆ గూట్లో పెడుతుండగా, తండ్రి పావురం ధనగోపాల్ ముఖర్జీ గారి ముఖంపై దాడిచేసింది. ఆయన గుడ్లను దొంగిలిస్తున్నాడని తండ్రి పావురం అనుకుంది. అప్పుడు ముఖర్జీ గారు రెండవ గుడ్డును నేలపై జారవిడిచారు.
పావురం గూడును బాగుచేసేటప్పుడు పావురాలు తనపై దాడిచేస్తాయని ఊహించకపోవడమే ముఖర్జీగారు చేసిన ‘పనికిమాలిన పని’.
ముందే పక్షిదాడి గూర్చి ఊహించి ఉంటే, రెండవ గుడ్డు పగిలిపోయేది కాదు.
ఉ) పిల్లపక్షి నిస్సహాయంగా ఉన్నప్పుడు, గాభరాపడినప్పుడు తల్లిపక్షి ఏం చేసింది?
జవాబు:
తండ్రి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పడం కోసం చిత్రగ్రీవాన్ని పిట్టగోడమీద నుండి కిందికి గెంటింది. అప్పుడు చిత్రగ్రీవం నిస్సహాయంగా, రెక్కలు విప్పి గాలిలో తేలింది. అది చూసిన తల్లి పక్షి, చిత్రగ్రీవానికి సాయంగా తానూ ఎగిరింది. ఆ రెండూ ఆకాశంలో పదినిమిషాలు ఎగిరి, గిరికీలు కొట్టి కిందికి వాలాయి. తల్లి పక్షి రెక్కలు ముడుచుకొని శుభ్రంగా కిందికి వాలింది. చిత్రగ్రీవం మాత్రం నేలను రాసుకుంటూ వెళ్లి, రెక్కల్ని టపటపలాడిస్తూ, బాలన్సు చేసుకుంటూ, ముందుకు సాగి ఆగింది.
అప్పుడు తల్లి పక్షి చిత్రగ్రీవం పక్కకు చేరి, దాన్ని ముక్కుతో నిమిరింది. చిత్రగ్రీవం రొమ్ముకు తన రొమ్ము తాకించింది. చిన్నపిల్లాడిని లాలించినట్లు చిత్రగ్రీవాన్ని అది లాలించింది.
ఊ) “ధనగోపాల్ ముఖర్జీ” చేసిన సాహితీసేవ ఏమిటి?
జవాబు:
ధనగోపాల్ ముఖర్జీ గారు జంతువులకు సంబంధించిన తొమ్మిది పిల్లల పుస్తకాలు రాశారు. వీటిలో 1922లో ఆయన రాసిన “కరి ది ఎలిఫెంట్”, 1924లో రాసిన “హరిశా ది జంగిల్ ల్యాడ్” 1928లో రాసిన “గోండ్ ది హంటర్”, పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందాయి.
ఈయన రాసిన చిత్రగ్రీవం పుస్తకం 1928లో న్యూ బెరీ మెడల్‌ను గెల్చుకుంది. బాలసాహిత్యంలో విశిష్ట కృషి చేసిన వారికి “అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్” వారు ఇచ్చే విశిష్ట పురస్కారమే ఈ “న్యూ బెరీ మెడల్”. ఈ బహుమతిని గెల్చుకున్న ఏకైక భారతీయ రచయిత మన ముఖర్జీ గారే.
4. కింది పేరా చదవండి. సరైన వివరణతో ఖాళీలు పూరించండి.
చాతకపక్షుల ముక్కులు చాలా చిన్నవి. తాము ఎగురుతూనే గాలిలోని కీటకాలను పట్టుకోగలవు. నోరు బార్లా తెరచి తమవైపుకు వచ్చే చాతకపక్షుల బారి నుండి కీటకాలు తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. చాతకపక్షులు పరిమాణంలో చాలా చిన్నవి. వాటికి బరువులెత్తే సామర్థ్యం కూడా తక్కువే! అందుకే అవి వాటి గూళ్ళ నిర్మాణంలో గడ్డీగాదం, పీచూపత్తి, సన్నపాటి చెట్టురెమ్మలు… వంటి తేలికపాటి వస్తువులనే వాడతాయి. వాటి కాళ్ళు పొట్టిగా ఉంటాయి. పొడవాటి కాళ్ళున్న పక్షుల్లో ఉండే చురుకుదనం వీటి కాళ్ళల్లో కనిపించదు. అందుకని ఇవి గెంతడం, దభీమని దూకడం వంటి పనులు చెయ్యలేవు. ఐతే వాటి కొక్కేల్లాంటి కాలివేళ్ళ పుణ్యమా అని అవి తమ గోళ్ళతో ఎలాంటి జారుడు ప్రదేశాల్లోనైనా అతుక్కుపోయి ఉండిపోగలవు. కాబట్టి అవి అనితరసాధ్యమైన నైపుణ్యంతో, కుశలతతో పాలరాతి వంటి నున్నటి గోడల్ని, ప్రదేశాలను పట్టుకొని వెళ్ళగలవు. తమ గూళ్ళను నిర్మించుకోవడానికి ఇళ్ళ చూరుల దిగువన గోడల్లోని తొర్రలను ఎన్నుకొంటాయి. రాలిన ఆకుల్నీ, గాలిలో ఎగిరే గడ్డిపోచల్ని ముక్కున కరచుకొని గూట్లోకి చేరుస్తాయి. వాటిని తమ లాలాజలాన్ని జిగురులా వాడి గూటి ఉపరితలం మీద అతికిస్తాయి. వాటి లాలాజలం ఓ అద్భుత పదార్థం. అది ఎండి గట్టిపడిందంటే మామూలుగా వాడే ఏ జిగురూ దానికి సాటిరాదు. ఇదీ చాతకపక్షుల వాస్తుకళానైపుణ్యం.
అ) చాతకపక్షులు తేలికపాటి వస్తువులతో గూళ్ళను నిర్మించుకుంటాయి. ఎందుకంటే …………………….
జవాబు:
చాతకపక్షులు తేలికపాటి వస్తువులతో గూళ్ళను నిర్మించుకుంటాయి. ఎందుకంటే వాటికి బరువులెత్తే సామర్థ్యం తక్కువ.
ఆ) చాతకపక్షులు దభీమని దూకడం, గెంతడం చెయ్యలేవు. ఎందుకంటే ……………………………
జవాబు:
చాతకపక్షులు దభీమని దూకడం, గెంతడం కూడా చెయ్యలేవు. ఎందుకంటే వాటి కాళ్ళు పొట్టిగా ఉంటాయి.
ఇ) నున్నటి గోడలు, ప్రదేశాల్లో కూడా చాతకపక్షులు జారకుండా ఉండడానికి కారణం ………………….
జవాబు:
నున్నటి గోడలు, ప్రదేశాల్లో కూడా చాతకపక్షులు జారకుండా ఉండడానికి కారణం వాటికి ఉన్న కొక్కేల్లాంటి కాలివేళ్ళు.
ఈ) చాతకపక్షుల లాలాజలం వాటి గూటి నిర్మాణంలో ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే ………………
జవాబు:
చాతకపక్షుల లాలాజలం, వాటి గూటి నిర్మాణంలో ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే వాటి లాలాజలం ఎండి గట్టిపడిందంటే మామూలుగా వాడే ఏ జిగురూ దానికి సాటిరాదు.
ఉ) వాస్తు కళా నైపుణ్యం అంటే …………..
జవాబు:
వాస్తు కళానైపుణ్యం అంటే ఇళ్ళను నిర్మించే విద్యలో నేర్పరిదనం.
II. వ్యక్తి కరణ-సృజనాత్మకత
1. కింది ప్రశ్నలకు ఆలోచించి ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
అ) చిత్రగ్రీవాన్ని గురించి మీకు ఆశ్చర్యం కలిగించిన విషయాలు ఏవి?
జవాబు:
చిత్రగ్రీవం తనకు మూడు వారాల వయస్సు ఉన్నప్పుడు తన గూట్లోకి వచ్చిన నల్ల చీమను ముక్కుతో పొడిచి రెండు ముక్కలు చేసింది. అయితే ఆ చీమ దానికి తినడానికి పనికిరానిది. ఆ విషయం గ్రహించిన చిత్రగ్రీవం తన జీవితంలో మళ్ళీ ఎప్పుడూ మరో చీమను చంపలేదు.
తాను చేసిన పని పొరపాటు అని గ్రహించిన పావురం తిరిగి ఆ తప్పును తిరిగి చేయకపోవడం, నాకు ఆశ్చర్యం కల్గించింది.
ఆ) మానవులను పావురాలకు మిత్రులూ, సహచరులని రచయిత ఎందుకు అన్నాడు?
జవాబు:
“ఏనుగులు, పావురాలు తమ తమ యజమానుల పట్ల గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. వీటిని మించి యజమాని పై విశ్వాసాన్ని ప్రదర్శించే ప్రాణిని తాను చూడలేదని రచయిత చెప్పాడు.
అడవులలోని ఏనుగులు, నగరాల్లోని పావురాలు తమ యజమానులంటే ప్రాణం ఇస్తాయి. అవి రోజంతా ఎక్కడెక్కడ తిరిగినా, ఏ ఆకాశ సీమలో ఎగిరినా, చివరకు అవి వాటికి ఉన్న అద్భుతమైన ‘అంతఃప్రేరణాబలం’తో తమ మిత్రుడూ, సహచరుడూ అయిన మానవుడి పంచకే చేరుతాయి”.
అందువల్లనే రచయిత, మానవులను పావురాలకు మిత్రులు, సహచరులు అని అన్నాడు.
2. కింది ప్రశ్నలకు ఆలోచించి పదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
అ) చిత్రగ్రీవాన్ని గురించి మీ సొంతమాటల్లో వర్ణించండి.
జవాబు:
‘చిత్రగ్రీవం’ అనేది ఒక పావురం. దానిని తల్లి పక్షి, తండ్రి పక్షి అనురాగంగా పెంచాయి. తల్లిదండ్రుల శ్రమ, శ్రద్ధ వల్ల చిత్రగ్రీవం మహా ఏపుగా పెరిగింది. దానికి గులాబీరంగు మారి తెలుపురంగు వచ్చింది. ముళ్ళపందిలాంటి ఈకలు వచ్చాయి. దాని కళ్లు దగ్గర, నోటి దగ్గర ఉన్న, పసుపు పచ్చని చర్మాలు రాలిపోయాయి. పొడవాటి, గట్టిపాటి సూదిలాంటి ముక్కు ఏర్పడింది.
పుట్టిన ఐదోవారానికి చిత్రగ్రీవం గూడు నుండి బైటికి గెంతి, మూకుళ్లలో నీళ్ళు త్రాగేది. చిత్రగ్రీవం మందకొడిగా ఉండేది.. మూడు నెలల వయస్సు రాగానే, దాని ఒళ్ళంతా సముద్రపు నీలిరంగు ఈకలు ధగధగా మెరిశాయి. దాని మెడ ప్రాంతం, సూర్యకాంతిలో ఇంద్రధనుస్సు వర్ణాల పూసల గొలుసులా శోభిల్లింది. తండ్రి పక్షి చిత్రగ్రీవానికి ఎగరడం బలవంతంగా నేర్పింది. ఎగరడంలో అలసిన చిత్రగ్రీవాన్ని తల్లి పక్షి లాలించింది.
చిత్రగ్రీవానికి నిండుగా ఈకలు పెరిగాయి. ఆ ఈకలు అతి సుందరమైన రంగులతో నిండాయి. అందుకే, చిత్రగ్రీవానికి సాటిరాగల పావురం లేదు.
ఆ) శిశువుల పెంపకంలో పక్షులకు, మానవులకు మధ్య ఉన్న సామ్యాలను రాయండి.
(లేదా)
పిల్లల పెంపకంలో పక్షులకు, మానవులకు మధ్యగల పోలికలను వివరంగా సొంతమాటలలో పాఠ్యభాగం ఆధారంగా రాయండి.
జవాబు:
చంటిపిల్లల నోటికి తల్లి తన పాలను అందించినట్లే, పక్షిపిల్లల నోటికి తల్లి పక్షి, తండ్రి పక్షి ఆహారాన్ని అందిస్తాయి. పిల్లలకు తల్లి మంచి పక్కను ఏర్పాటు చేసినట్లే, పక్షి పిల్లలకు, తల్లి పక్షి, తండ్రి పక్షి ఆచితూచి గూట్లో వస్తువులను ఉంచి, పిల్లపక్షికి సుఖసౌకర్యాలను కల్పిస్తాయి.
తల్లి పిల్లలకు పదార్థాలను ఉడకపెట్టి, మెత్తగా చేసి, నోట్లో పెడుతుంది. అలాగే తల్లి పక్షి, తండ్రి పక్షి గింజల్నీ, విత్తనాల్నీ కాసేపు తమ నోటిలో నాననిచ్చి, మెత్తపరచి ఆ తర్వాతనే పక్షిపిల్లల నోట్లో పెడతాయి.
తల్లిదండ్రులు పిల్లలకు పాకడం, లేచి నిలబడడం, నడవడం నేర్పుతారు. వారు పిల్లల చేతులను పట్టుకొని జాగ్రత్తగా వారికి నడపడం నేర్పుతారు. అప్పుడప్పుడు పిల్లలు నడుస్తూ పరుగు పెడుతూ పడిపోతారు. అప్పుడు తల్లిదండ్రులు పిల్లలను దగ్గరకు తీసుకొని లాలిస్తారు.
చిత్రగ్రీవానికి తండ్రి ఎగరడాన్ని అలాగే నేర్పింది. బలవంతంగా చిత్రగ్రీవాన్ని తండ్రి పక్షి, ఆకాశంలోకి తోసింది. దానితో అప్రయత్నంగా రెక్కలు విప్పి చిత్రగ్రీవం ఎగిరింది. ఎగరడంలో అది అలిసిపోగా, తల్లి పక్షి చిత్రగ్రీవాన్ని లాలించింది.
ఈ విధంగా చిత్రగ్రీవం పెంపకానికీ, పిల్లల పెంపకానికి పోలికలు ఉన్నాయి.
3. సృజనాత్మకంగా/ప్రశంసిస్తూ రాయండి.
అ) ‘చిత్రగ్రీవం’ అనే పావురంపిల్ల ఎలా పుట్టిందీ ఎలా ఎగరడం నేర్చుకొన్నదీ తెలుసుకున్నారు కదా! అట్లాగే మీకు తెలిసిన లేదా మీ పరిసరాల్లోని ఏదైనా పక్షి / జంతువు గురించి మీరు కూడా ఒక కథనాన్ని రాయండి. (ఈ పాఠంలాగా).
జవాబు:
“ధోనీ” (కుక్కపిల్ల)
మా పక్క ఇంటివాళ్ళకూ కుక్కపిల్లలంటే మహాప్రేమ’. తనను పెంచుకుంటున్న యజమానిపై విశ్వాసం చూపడంలో కుక్కను మించిన జంతువు కనబడదు. మా పక్కింటి అబ్బాయి ఒక కుక్కను పెంచుకోవాలని ఆశపడుతున్నాడు.
వాళ్ళింట్లో ఒక కుక్క గర్భవతిగా ఉంది. ఒక రోజున దానికి మూడు పిల్లలు పుట్టాయి. అందులో ఒక పిల్ల అందంగా. తెల్లగా పాలరంగులో ఉంది. దానికి మంచి బొచ్చు ఉంది. దాన్ని చూస్తే ముద్దుగా ఉంది. దానికి ధోనీ అని పేరు పెట్టాలని ఆ పిల్లవాడి ఆశ. ఆ పిల్లాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. క్రికెట్ అంటే బాగా ఇష్టం. అందుకే ముద్దు వచ్చే ఆ కుక్క పిల్ల ధోనీగా మారింది.
ఆ ధోనీ అంటే దాని తల్లికి బాగా ఇష్టం. ధోనీకి తల్లి కుక్క కడుపునిండా పాలిచ్చేది. ధోనీ తోకను ఊపుతూ కులాసాగా మా వీధిలో తిరుగుతూ ఉంటుంది. ‘ధోనీ’ అంటే మా వీధి వాళ్ళంతా ఇష్టపడతారు. దానికి మా పక్కింటబ్బాయి స్నానం చేయించి పాలు, బిస్కెట్లు, కోడిగుడ్లు, మాంసం పెడతాడు. ధోనీ క్రమంగా టైగర్ లా పెరిగింది.
ఒక రోజున ‘ధోనీ’ వాళ్ళింట్లోకి అడుగుపెడుతూ ఉన్న దొంగపై దూకి అతని పిక్క పట్టుకొంది. అది చూసిన మా పక్కింటి అబ్బాయి ‘ధోనీ’ అని ప్రేమగా పిలిచాడు. అంతే! దొంగను వదలి తోక ఊపుకుంటూ, ఆ అబ్బాయి దగ్గరకు అది పరుగుపెట్టింది. ‘ధోనీ’ని పోలీసు కుక్కగా చేయాలని మా పక్కింటి అబ్బాయి చూస్తున్నాడు.
ఆ) ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ టవర్ల నుండి వచ్చే వేడిమికి కొన్ని పక్షిజాతులు అంతరించిపోతున్నాయి. అలాగే ఎండాకాలంలో తీవ్రమైన వేడికి తాళలేక, తాగడానికి నీరు అందక, మృత్యువాతపడుతున్నాయి. పక్షులు ఇందుకోసం తమను కాపాడడానికి తగిన చర్యలు చేపట్టమని తమ తోటకు వచ్చిన పిల్లలతో సంభాషించాయి అనుకోండి. ఆ పిల్లలకూ, పక్షులకూ మధ్య జరిగే సంభాషణను ఊహించి రాయండి.
జవాబు:
“తోటలో మిత్రులు – పక్షులతో సంభాషణ”
రాము : ఓరేయ్ గోపాల్! పూలమీద తూనీగలు ఎగిరేవి కదా! ఇప్పుడు కనబడడం లేదేం?
గోపాల్ : ఈ మధ్య పక్షి జాతులు అనేక రకాలుగా నశిస్తున్నాయని అంటున్నారు కదా!
పిచ్చుక : బాబుల్లారా! మీ దృష్టి మా మీద పడింది. సంతోషము. మా పక్షులు ఎలక్ట్రిక్ తీగల మీద వాలితే చచ్చిపోతున్నాయి. రోజూ ఎన్ని కాకులూ, చిలుకలూ, గోరింకలూ అలా చస్తున్నాయో ! మీకు తెలుసా?
రాము : నిజమే. పక్షులు అంతరిస్తే, మన పర్యావరణం దెబ్బ తింటుంది కదా! మరేం చేయాలి?
చిలుక : నాయనా ! మీ పెరళ్ళలో జామ చెట్లు లేవు. మామిడి చెట్లు, సపోటాలు, సీతాఫలాల చెట్లూ లేవు. మేము ఏమి తిని బ్రతకాలి?
గువ్వ : నాయనా! మాకు తాగడానికి నీళ్ళు దొరకడం లేదు. మీరు చెరువులు పూడ్చివేస్తున్నారు. నూతులు కప్పివేస్తున్నారు. గ్రామాలలో మేము బతికే దారే లేదు.
గోరింక : గాలిలో హాయిగా ఎగురుదామంటే, ఈ సెల్ ఫోను టవర్లు, టి.వి. టవర్లు అడ్డుగా ఉంటున్నాయి. ఆ తరంగాల ప్రభావంతో మేము చస్తున్నాము.
గోపాల్ : మీరు చెప్పే మాటలు వింటూంటే భయంగా ఉంది. ఇంక మేము మీ పక్షులను టి.వి.ల్లోనే చూడాలేమో!
పక్షులు : మేము హాయిగా తిరగడానికి మీ గ్రామాల్లో చెట్లు పాతండి. చెరువులు, కాలువలూ పూడ్చి వేయకండి. మీ మీ పెరళ్లలో పూలమొక్కలూ, పండ్ల మొక్కలు పెంచండి.
రాము, గోపాల్: సరే. మీరు మాకు ఎన్నో విషయాలు చెప్పారు. తప్పకుండా పక్షులను రక్షించే కేంద్రాలను గురించి మా పెద్దలతో మాట్లాడతాం.
పక్షులు : మంచిది. కృతజ్ఞతలు.
భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని
1. “ధనగోపాల్ ముఖర్జీ” రాసిన “చిత్రగ్రీవం ఓ పావురం కథ” అనే పుస్తకాన్ని లేదా పక్షుల గురించి తెలిపే ఏదైనా ఒక పుస్తకాన్ని గ్రంథాలయం నుండి చదవండి. మీరు తెలుసుకున్న వివరాలు రాసి ప్రదర్శించండి.
(లేదా)
అంతర్జాలం ద్వారా ఏవైనా రెండు పక్షుల వివరాలు, వాటి చిత్రాలు సేకరించి, రాసి ప్రదర్శించండి.
జవాబు:
అ) చిలుక: ఇది అందంగా ఉంటుంది. దీనిని పెంచుకుంటారు. ఇవి రెండు రకాలు.
1) చిలుకలు
2) కాక్కటూ
చిలుకలకు బలమైన వంకీ తిరిగిన ముక్కు, బలమైన కాళ్ళు ఉంటాయి. కొన్ని పంచరంగుల చిలుకలు ఉంటాయి. ఇవి పరిమాణంలో 3.2 నుండి 10 అం|| పొడవు వరకూ ఉంటాయి. ఇవి గింజలు, పండ్లు మొగ్గలు, చిన్న మొక్కలను తింటాయి. కొన్ని జాతుల చిలుకలు పురుగుల్ని తింటాయి. చిలుకలు చెట్టు తొట్టెలలో గూళ్లు కట్టుకుంటాయి.
ఇవి తెలివైన పక్షులు. ఇవి మనుష్యుల గొంతును పోలి మాట్లాడతాయి. పెంపుడు జంతువుల వ్యాపారం, వేట, పోటీ, కారణాల వల్ల ఇవి తొందరగా అంతరించిపోతున్నాయి. జ్యోతిషంలో చిలుక ప్రధాన పాత్ర వహిస్తుంది. పల్లెలలో సైతం చిలుక జోస్యం చెప్పేవారు కనిపిస్తారు.
ఆ) పిచ్చుక :
ఇది చిన్న పక్షి. ఇవి చిన్నగా, బొద్దుగా గోధుమ – ఊదా రంగుల్లో ఉంటాయి. చిన్న తోకతో పొట్టిగా ఉండే బలమైన ముక్కు కలిగి ఉంటాయి. పిచ్చుకలలో పెద్దగా తేడాలుండవు. ఇవి గింజలను తింటాయి. కొన్ని చిన్న చిన్న క్రిమి కీటకాలను తింటాయి. కొండపిచ్చుకలు పట్టణాల్లో నివసించి ఏదైనా తింటాయి. ఇది 4.5′ నుండి 7′ వరకు పొడవు ఉంటుంది. పిచ్చుకలు శరీర నిర్మాణంలో గింజలను తినే పక్షులలాగే ఉంటాయి. నాలుకలో ఒక ఎముక అధికంగా ఉంటుంది.
ప్రాచీన పిచ్చుకలు యూరప్, ఆఫ్రికా, ఆసియాలో విస్తరించాయి. జీవనశైలిలో పెద్దవేగంగా వచ్చిన మార్పు, పిచ్చుకపై బ్రహ్మాస్త్రంగా పరిణమించింది. పచ్చదనం అంతరించిపోవడం, రసాయనాలతో పళ్ళు, ఆహారధాన్యాల ఉత్పత్తి వల్ల పిచ్చుకలు అంతరిస్తున్నాయి. సెల్యూలర్ టవర్ల నుండి వచ్చే అయస్కాంత కిరణాలు, ఆ జాతికి ముప్పుగా పరిణమించాయి.
2. “చిత్రగ్రీవం” అనే పక్షి పేరు పంచతంత్ర కథలో కూడా ఉంది. పంచతంత్రం కథల పుస్తకం చదవండి. మీరు చదివిన కథ రాసి ప్రదర్శించండి.
జవాబు:
పంచతంత్ర కథల్లో చిత్రగ్రీవుడి కథ
‘చిత్రగ్రీవుడు’ పావురాల రాజు, అతగాడు తన పావురాలతో ఆకాశంలో తిరుగుతున్నాడు. గోదావరీ తీరంలో ఒక మర్రిచెట్టు ఉంది. ఒక బోయవాడు వచ్చి ఆ చెట్టు దగ్గరలో నూకలు చల్లి దానిమీద వల వేశాడు. “పక్షులు నూకల కోసం వలమీద వాలతాయి. వాటిని పట్టుకొని అమ్ముకుందాం” అనుకున్నాడు.
ఆ చిత్రగ్రీవుడితో ఎగురుతున్న పావురాలు ఆ నూకలను చూశాయి. అవి నేలమీద వాలి, నూకలను తిందామనుకున్నాయి. “ఇది మనుష్యుల సంచారం లేని అడవి. ఈ నూకలు ఇక్కడకు ఎందుకు వస్తాయి ? కాబట్టి ఈ నూకలకు ఆశపడకండి” అని చిత్రగ్రీవుడు స్నేహితులకు చెప్పాడు. ఒక ముసలి పావురం చిత్రగ్రీవుడి మాటలు కాదంది. నూకలు తిందామంది. సరే అని పావురాలు కిందికి దిగాయి. వలలో చిక్కుకున్నాయి.
పావురాలు ముసలి పావురాన్ని తిట్టాయి. చిత్రగ్రీవుడు “తిట్టకండి. మనం అంతా కలసి ఎగిరిపోదాం. నాకో స్నేహితుడు ఉన్నాడు. మనల్ని రక్షిస్తాడు” అని చెప్పింది. పావురాలు అన్నీ కలసి వల ఎత్తుకొని, చిత్రగ్రీవుడి స్నేహితుడు హిరణ్యకుడు అనే ఎలుక ఉండే కన్నం దగ్గర వాలాయి. హిరణ్యకుణ్ణి చిత్రగ్రీవుడు గొంతెత్తి పిలిచాడు. హిరణ్యకుడు స్నేహితుని మాట విని పావురాల బంధాలన్నీ తన పళ్లతో కొరికివేశాడు. పావురాలు చిత్రగ్రీవుణ్ణి, హిరణ్యకుణ్ణి మెచ్చుకున్నాయి. అందుకే మనందరికీ మంచి స్నేహితులు ఉండాలి.
III. భాషాంశాలు
పదజాలం
1. కింది పదబంధాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) శ్రద్ధాసక్తులు
జవాబు:
వాక్యం : విజయం సాధించాలంటే పనిలో శ్రద్ధాసక్తులు చూపించాలి.
ఆ) ప్రేమ ఆప్యాయతలు
జవాబు:
వాక్యం : తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రేమ, ఆప్యాయతలు కురిపించాలి.
ఇ) వన్నెచిన్నెలు
జవాబు:
వాక్యం : మా ఆవుదూడ వన్నెచిన్నెలు చూసి నేను మురిసిపోతాను.
ఈ) సమయసందర్భాలు :
జవాబు:
వాక్యం : సమయసందర్భాలు లేకుండా హాస్యంగా మాట్లాడడం నాకు నచ్చదు.
ఉ) హాయిసౌఖ్యాలు
జవాబు:
వాక్యం : తల్లిదండ్రులు, బిడ్డల హాయిసౌఖ్యాల గురించి శ్రద్ధ పెట్టాలి.
2. కింది పదాలను వివరించి రాయండి.
అ) విజయవంతం కావడం అంటే
జవాబు:
విజయవంతం కావడం అంటే తాను ప్రారంభించిన పని ఏ విఘ్నమూ లేకుండా పూర్తి అవడం.
ఆ) ఉలుకూ పలుకూ లేకపోవడం అంటే
ఉలుకూ పలుకూ లేకపోవడం అంటే ఎవరు ఏమి మాట్లాడినా, తన మనస్సులో ఏమి ఉన్నా, పైకి మాత్రం మాట్లాడకుండా, నోరు మూసుకు కూర్చోడం.
3. కింద తెలిపిన వాటిని గురించి పాఠంలో ఏఏ పదాలతో వర్ణించారు?
అ) గద్దింపులు : కువకువ కూయడం
ఆ) పావురాలు : రకరకాల రంగురంగుల పావురాలు
ఇ) గువ్వలు : నీలికళ్లతో కువకువలాడడం
ఈ) పావురాల గుంపు : పెనుమేఘాలు
ఉ) పావురం మెడ : హరివిల్లు
ఊ) పుట్టిన పిల్లపక్షి : బలహీనమైన, నిస్సహాయమైన, అర్భకమైన
ఋ) చిత్రగ్రీవం ముక్కు : పొడవాటి, గట్టిపాటి, సూదిలాంటి బలమైన
ఎ) చిత్రగ్రీవం ఒళ్ళు : సముద్రపు నీలిరంగు
ఏ) చిత్రగ్రీవం మెడ ప్రాంతం : ఇంద్రధనుస్సు వర్ణాల పూసల గొలుసులా
వ్యాకరణాంశాలు
1. కింది అలంకారాల లక్షణాలు రాయండి. అ) శ్లేష
జవాబు:
లక్షణం : అనేకమైన అర్థాలు గల శబ్దాలను ఉపయోగించి చెబితే ‘శ్లేష’ అనబడుతుంది.
ఉదా :
1) రాజు కువలయానందకరుడు
2) మానవ జీవనం సుకుమారం
ఆ) అర్ధాంతరన్యాసం :
జవాబు:
లక్షణం : విశేష విషయాన్ని, సామాన్య విషయంతో కాని, సామాన్య విషయాన్ని విశేష విషయంతో కాని సమర్థించి చెప్పడం. దీన్ని “అర్థాంతరన్యాసాలంకారం’ అంటారు.
ఉదా :
1) హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా!
2) మేఘుడు అంబుధికి పోయి జలం తెచ్చి ఇస్తాడు. లోకోపకర్తలకు ఇది సహజగుణం.
2. కింది ఛందోరీతుల లక్షణాలు రాయండి.
అ) సీసం
జవాబు:
సీసం – (లక్షణం ) :
1) సీసంలో నాల్గు పాదాలుంటాయి. ప్రతిపాదం 2 భాగాలుగా ఉంటుంది. పాదంలోని రెండు భాగాల్లోనూ, ఒక్కొక్క భాగంలో 4 గణాల చొప్పున ఉంటాయి. మొత్తం పాదంలోని 8 గణాల్లో, ఆరు ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు క్రమంగా ఉంటాయి.
2) యతి పాదంలోని రెండు భాగాల్లోనూ మూడవ గణం మొదటి అక్షరంతో సరిపోతుంది. యతిలేనిచోట ప్రాసయతి చెల్లుతుంది.
3) సీసంలోని నాల్గు పాదాల తరువాత, ఒక తేటగీతి కాని లేక ఆటవెలది గాని తప్పనిసరిగా ఉంటుంది.
ఉదా :
సీ|| “హరిహర బ్రహ్మలఁ బురిటి బిడ్డలఁజేసి జోలఁ బాడిన పురంద్రీలలామ”
గమనిక :
పై పద్యంలో రెండు చోట్ల ప్రాస యతులు.
ఆ) ఆటవెలది
జవాబు:
ఆటవెలది – (లక్షణం ) :
- ఇది ‘ఉపజాతి’ పద్యం.
- ఈ పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి.
- 1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉంటాయి. .
- 2, 4 పాదాల్లో వరుసగా ఐదు సూర్యగణాలు ఉంటాయి.
- ప్రతిపాదంలోనూ నాల్గవ గణంలోని మొదటి అక్షరంతో యతి. యతిలేని చోట “ప్రాసయతి” ఉంటుంది.
- ప్రాసనియమం పాటించనవసరంలేదు.
ఉదా :
ఆ||వె : “పొదలి పొదలి చదల బొంగారి పొంగారి
మించి మించి దిశల ముంచి ముంచి”
ఇ) తేటగీతి
జవాబు:
తేటగీతి – (లక్షణం ) :
1) ఇది ‘ఉపజాతి’ పద్యం.
2) ఈ పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి.
3) ప్రతి పాదానికి వరుసగా 1 సూర్య, 2 ఇంద్ర, 2 సూర్య గణాలు ఉంటాయి.
4) నాలుగవ గణం మొదటి అక్షరం యతి. ప్రాస యతి కూడా వేయవచ్చు.
5) ప్రాసనియమం లేదు.
3. కింది వాక్యాలలోని అలంకారాన్ని గుర్తించండి.
అ) శ్రీమంత్ చొక్కా మల్లెపూవులా తెల్లగా ఉంది.
జవాబు:
ఈ వాక్యంలో ‘ఉపమాలంకారం’ ఉంది. ఈ
ఉపమాలంకార లక్షణం :
ఉపమాన, ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడం ‘ఉపమాలంకారం’.
సమన్వయం : ఇందులో 1) ఉపమానం, 2) ఉపమేయం, 3) ఉపమావాచకం, 4) సమానధర్యం ఉంటాయి.
పై ఉదాహరణలో
1) మల్లెపూవు (ఉపమానం)
2) చొక్కా (ఉపమేయం)
3) వలె (ఉపమావాచకం)
4) తెల్లగా ఉంది (సమానధర్మం )
4. కింది పద్యపాదాలు పరిశీలించండి.
గమనిక :
పై పద్యంలో గగ, భ, జ, స, అనే గణాలు వాడబడ్డాయి. ఒకటవ, మూడవ పాదాల్లో మూడేసి గణాలు ఉన్నాయి. రెండవ, నాల్గవ పాదాల్లో ఐదేసి గణాలున్నాయి.
ఒకటి, రెండు పాదాలు కలిసి మొత్తం 8 గణాలు (3 + 5 = 8)
రెండు, నాల్గు పాదాలు కలిసి మొత్తం 8 గణాలు (3 + 5 = 8)
ఒకటి, రెండు పాదాలు కలిపిన | రెండు, నాల్గు పాదాలు కలిపిన | గణాలలో,| 8 గణాలలో, ఆరవ గణం ‘జగణం’ ఉంది.
రెండు, నాల్గు పాదాల చివరి అక్షరం ‘గురువు’ ఉంది.
ఇలాంటి లక్షణాలు కల పద్యాన్ని “కందపద్యం” అంటారు.
కందము :
పద్య నియమాలు తెలిసికొందాం.
- ఈ పద్యంలో గగ, భ, జ, స, నల అనే గణాలు ఉంటాయి.
- మొదటి పాదం లఘువుతో మొదలయితే, అన్ని పాదాల్లో మొదటి అక్షరం లఘువు ఉండాలి. గురువుతో మొదటి పాదం మొదలయితే, అన్ని పాదాల మొదటి అక్షరం గురువు ఉండాలి.
- రెండు, నాల్గవ పాదాలలోని చివరి అక్షరం గురువుగానే ఉంటుంది.
- 1, 2 పాదాల్లో (3 + 5 = 8 గణాలు); 3, 4 పాదాల్లో (3 + 5 = 8) గణాలు ఉంటాయి. ఈ 8 గణాల్లో ఆరవ గణం తప్పక నలం కాని, జగణం కాని కావాలి.
- 2, 4 పాదాల్లో యతి ఉంటుంది. నాల్గవ గణం మొదటి అక్షరానికి, ఏడవ గణం మొదటి అక్షరానికి యతి ఉండాలి.
- ప్రాస నియమం ఉండాలి. (4 పాదాల్లో) 7) పద్యంలోని 1 + 2 పాదాలు కలిపిన 8 గణాల్లో బేసిగణం ‘జగణం’ ఉండరాదు.
అబ్యాసం
“వినదగు నెవ్వరు జెప్పిన” అనే పద్యానికి లక్షణ సమన్వయం చేయండి.
సమన్వయం :
- మొదటి పాదంలో 3 గణాలు, రెండవ పాదంలో 5 గణాలు, మొత్తం 8 గణాలు ఉన్నాయి. ఈ పాదాలలో గగ, భ, జ, స, నల అనే గణాలే ఉన్నాయి.
- మొత్తం (1 + 2) పాదాలకు ఉన్న 8 గణాలలో ఆరవ గణం ‘నలం’ ఉంది. రెండవ పాదం చివర గురువు ఉంది.
- యతి 4, 7 గణాల మొదటి అక్షరాలకు సరిపోయింది. (వి – వి)
- ప్రాస నియమం ఉంది.
- బేసి గణంగా ‘జగణం’ లేదు.
కాబట్టి ఇవి కంద పద్యపాదాలు.
అదనపు సమాచారము
సంధులు
1) ప్రపంచపు వెలుగు = ప్రపంచము + వెలుగు – పుంప్వాదేశ సంధి
2) ధాన్యపు గింజలు = ధాన్యము + గింజలు – పుంప్వాదేశ సంధి
3) ఉత్తరపు గాలి = ఉత్తరము + గాలి – పుంప్వాదేశ సంధి
4) నీలివర్ణపు ఈకలు = నీలివర్ణము + ఈకలు – పుంప్వాదేశ సంధి
5) సముద్రపు నీలిరంగు = సముద్రము + నీలిరంగు – పుంప్వాదేశ సంధి
6) చర్మపు పొర = చర్మము + పొర – పుంప్వాదేశ సంధి
7) జ్ఞానపు పావురాలు = జ్ఞానము + పావురాలు – పుంప్వాదేశ సంధి
8) అమాయకపు నల్లచీమ = అమాయకము + నల్లచీమ – పుంప్వాదేశ సంధి
9) మందిరాలు = మందిరము + లు – లులనల సంధి
10) వర్షాలు = వర్షము + లు – లులనల సంధి
11) మండుటెండ = మండు + ఎండ – టుగాగమ సంధి
12) నీలాకాశము = నీల + ఆకాశము – సవర్ణదీర్ఘ సంధి
13) శ్రద్ధాసక్తులు = శ్రద్ధా + ఆసక్తులు – సవర్ణదీర్ఘ సంధి
14) బాగోగులు = బాగు + ఓగులు – ఉత్వ సంధి
15) నాలుగంతస్తులు = నాలుగు + అంతస్తులు – ఉత్వసంధి
16) జలకాలాడు = జలకాలు + ఆడు – ఉత్వసంధి
17) చిట్టచివర = చివర + చివర – ఆమ్రేడిత సంధి
18) మొట్టమొదలు = మొదలు + మొదలు – ఆమ్రేడిత సంధి
19) పూరిల్లు = పూరి + ఇల్లు – ఇత్వ సంధి
20) నిస్సహాయము = నిః + సహాయము – విసర్గ సంధి
21) మనోహరం = మనః + హరము – విసర్గ సంధి
22) ముంజేయి = ముందు + చేయి – ప్రాతాది సంధి
23) పూఁదోట = పూవు + తోట – ప్రాతాది సంధి
24) తల్లిదండ్రులు = తల్లి + తండ్రి – గసడదవాదేశ సంధి
సమాసాలు
సమాస పదం | విగ్రహవాక్యం | సమాసం పేరు |
1) మూడు వారాలు | మూడు సంఖ్యగల వారాలు | ద్విగు సమాసం |
2) మూడు గంటలు | మూడు సంఖ్యగల గంటలు | ద్విగు సమాసం |
3) మూడు నెలలు | మూడు సంఖ్యగల నెలలు | ద్విగు సమాసం |
4) నాలుగడుగులు | నాలుగు సంఖ్యగల అడుగులు | ద్విగు సమాసం |
5) రెండు ముక్కలు | రెండు సంఖ్యగల ముక్కులు | ద్విగు సమాసం |
6) రెండు గుడ్లు | రెండు సంఖ్యగల గుడ్లు | ద్విగు సమాసం |
7) ఇరవై నిమిషాలు | ఇరవై సంఖ్యగల నిమిషాలు | ద్విగు సమాసం |
8) ఇరవై లక్షలు | ఇరవై సంఖ్యగల లక్షలు | ద్విగు సమాసం |
9) పది లక్షలు | పది సంఖ్యగల లక్షలు | ద్విగు సమాసం |
10) శ్రద్ధాసక్తులు | శ్రద్ధయు, ఆసక్తియు | ద్వంద్వ సమాసం |
11) వన్నెచిన్నెలు | వన్నెయు, చిన్నెయు | ద్వంద్వ సమాసం |
12) శక్తియుక్తులు | శక్తియు, యుక్తియు | ద్వంద్వ సమాసం |
13) సుఖసౌకర్యాలు | సుఖమును, సౌకర్యమును | ద్వంద్వ సమాసం |
14) అసంఖ్యాకం | సంఖ్యలేనిది | నఞ్ తత్పురుష సమాసం |
15) అసంకల్పితం | సంకల్పితం కానిది | నఞ్ తత్పురుష సమాసం |
16) అసాధ్యం | సాధ్యం కానిది | నఞ్ తత్పురుష సమాసం |
17) అప్రయత్నం | ప్రయత్నం కానిది | నఞ్ తత్పురుష సమాసం |
18) మహానగరం | గొప్పనగరం | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
19) యువరాజు | యువకుడైన రాజు | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
20) యువరాణి | యువతియైన రాణి | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
21) పెంపుడు పావురాలు | పెంచుకొంటున్న పావురాలు | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
22) తెల్లజెండాలు | తెల్లవైన జెండాలు | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
23) నీలాకాశం | నీలమైన ఆకాశం | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
24) చిన్ని బృందాలు | చిన్నవైన బృందాలు | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
25) కులీన వంశము | కులీనమైన వంశము | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
26) దివ్య సంకల్పం | దివ్యమైన సంకల్పము | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
27) పెద్ద పక్షులు | పెద్దవైన పక్షులు | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
28) మండుటెండ | మండుతున్న ఎండ | విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
29) యథాస్థానం | స్థానమును అతిక్రమింపక | అవ్యయీభావ సమాసం |
30) అతిసుందరం | మిక్కిలి సుందరం | అవ్యయీభావ సమాసం |
31) వెలుగు వెల్లువ | వెలుగుల యొక్క వెల్లువ | షష్ఠీ తత్పురుష సమాసం |
32) పావురాల బృందాలు | పావురాల యొక్క బృందాలు | షష్ఠీ తత్పురుష సమాసం |
33) హరివిల్లు | హరియొక్క విల్లు | షష్ఠీ తత్పురుష సమాసం |
34) దిశాపరిజ్ఞానం | దిశల యొక్క పరిజ్ఞానం | షష్ఠీ తత్పురుష సమాసం |
35) చిత్రగ్రీవం | చిత్రమైన గ్రీవము కలది | బహుహ్రీహి సమాసం |
36) భారతదేశం | భారతము అనే పేరుగల దేశం | సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం |
37) బాగోగులు | బాగును, ఓగును | ద్వంద్వ సమాసం |
నానార్థాలు
1. మిత్రుడు : స్నేహితుడు, సూర్యుడు, శత్రుదేశపు రాజు
2. పుణ్యము : ధర్మము, నీరు, బంగారము
ప్రకృతి – వికృతులు
రాజ్ఞి – రాణి
విశ్వాసము – విసువాసము
ఆశ్చర్యం – అచ్చెరువు
ప్రాణం – పానం
దిశ – దెస
వంశము – వంగడము
పుణ్యము – పున్నెము
పక్షి – పక్కి
పిత్స – పిట్ట
కుడ్యం – గోడ
శక్తి – సత్తి
యుక్తి – ఉత్తి
సుఖం – సుకం
స్వతంత్రమ్ – సొంతము
ఆకాశము – ఆకసము
నిమేషము – నిముసము
ఆహారము – ఓగిరము
అద్భుతము – అబ్బురము
ముహూర్తము – మూర్తము
చిత్రం – చిత్తరువు
పర్యాయపదాలు
1. నగరము : పురము, పట్టణము, పురి, పత్తనము
2. ఏనుగు : కరి, హస్తి, వారణము, ఇభము
3. అద్భుతము : అబ్బురము, అచ్చెరువు, వింత
4. ఆకాశము : గగనము, అంబరము, నభము, మిన్ను
5. గింజ : బీజము, విత్తు, విత్తనము
6. ముఖము : మొహం, ఆస్యము, వక్రము, ఆననము, మోము
7. తల్లి : జనని, జనయిత్రి, మాత, అమ్మ
8. తండ్రి : జనకుడు, అయ్య, నాయన, పిత
9. కన్ను : అక్షి, నేత్రము, నయనం, చక్షువు
వ్యుత్పత్యర్థాలు
1. చిత్రగ్రీవము : చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలది (పావురం)
2. పక్షి : పక్షములు (తెక్కలు) కలిది (పిట్ట)
రచయిత పరిచయం
పాఠ్యం పేరు : ‘చిత్రగ్రీవం’
పాఠ్య రచయిత : ధనగోపాల్ ముఖర్జీ (మూలం)
దాసరి అమరేంద్ర (అనువాద రచయిత)
దేని నుండి గ్రహింపబడింది : “చిత్రగ్రీవం” పుస్తకం నుండి
న్యూబెరీ మెడల్ : 1928లో అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారు ‘న్యూ జెరీ మెడల్’ బహుమతిని ‘ధనగోపాల్ ముఖర్జీ’కి ఇచ్చారు.
న్యూ బెరీ మెడల్ బహుమతిని ఎవరికి ఇస్తారు? : అమెరికాలో బాలసాహిత్యంలో విశేష కృషి చేసినవారికి ఈ బహుమతిని ఇస్తారు.
ధనగోపాల్ ముఖర్జీ విశిష్టత : ఈయన ‘న్యూ జెరీ మెడల్’ బహుమతిని గెల్చుకున్న ఏకైక భారతీయ రచయిత.
ముఖర్జీ పుట్టుక : 1890లో కోల్ కతాలో
విద్యాభ్యాసం : ముఖర్జీ 19వ ఏటనే అమెరికా వెళ్ళి, కాలిఫోర్నియా’, ‘స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు.
ముఖ్య వ్యాపకాలు : రచనలు చేయడం, ఉపన్యాసాలు ఇవ్వడం.
రచనలు : జంతువులకు సంబంధించి తొమ్మిది రచనలు చేశారు.
ప్రాచుర్యం పొందిన రచనలు :
1) 1922లో రాసిన “కరి ది ఎలిఫెంట్”
2) 1924లో రాసిన “హరిశా ది జంగిల్ ల్యాడ్” చాలా ప్రసిద్ధములు.
3) 1928లో రాసిన ‘గోండ్ ది హంటర్’
పుట్టుక
కోల్‌కతా = కలకత్తా (పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రాజధాని.)
మహానగరం = పెద్ద పట్టణం
డజను = పన్నెండు
గిరిక్ ల పావురాలు = గిరికీలు కొట్టే పావురాలు
మచ్చిక చెయ్యడం = ప్రేమించడం (దగ్గరకు, తియ్యడం)
అలరించే = సంతోషపెట్టే
విశిష్టమైన = మిక్కిలి శ్రేష్ఠమైన
శతాబ్దాలు (శత + అజ్ఞాలు) = నూర్ల సంవత్సరాలు
నిరుపేదలు = మిక్కిలి బీదవారు
పూరిల్లు (పూరి + ఇళ్లు) = గడ్డితో నేసిన ఇళ్లు
ఆప్యాయత = ప్రీతి
ఆసక్తి = ఆపేక్ష
పూదోటలు (పూవు + తోటలు) = పూలతోటలు
ఫౌంటెన్లు = నీటిని పైకి వెదజల్లే యంత్రాలు
ఉండడం కద్దు = ఉండడం ఉంది
ఉల్లాసకరమైన = సంతోషాన్ని ఇచ్చే
గిరికీలు కొట్టు = గిరికీలు తిరిగే (గాలిలో చక్కర్లు కొట్టే)
సంకేతాలు = సంజ్ఞలు
అసంఖ్యాకమైన = లెక్కపెట్టలేనన్ని
నీలాకాశం (నీల + ఆకాశం) = నీలంరంగు ఆకాశం
పెనుమేఘాలు = పెద్ద మేఘాలు
బృందాలు = గుంపులు
చెక్కర్లు కొడతాయి = తిరుగుతాయి
బృహత్తర సమూహం = మిక్కిలి పెద్ద గుంపు
రూపొందుతాయి = రూపం సంతరించుకుంటాయి (తయారవుతాయి)
స్థూలంగా = దాదాపుగా
పరిమాణం = సైజు
ఆకృతి = ఆకారం
దిశా పరిజ్ఞానం = దిక్కుల యొక్క జ్ఞానం
విశ్వాసం = నమ్మకం
సన్నిహిత పరిచయం = దగ్గరి పరిచయం
వనసీమ = అరణ్యసీమ
గజరాజులు = శ్రేష్ఠమైన ఏనుగులు
ప్రాణం పెడతాయి = ప్రాణం ఇస్తాయి (బాగా ప్రేమిస్తాయి.)
అంతఃప్రేరణాబలం = మనస్సు కలిగించే ప్రేరణ యొక్క బలం
సహచరుడు = చెలికాడు
పంచకు = వసారాకు
చిత్రగ్రీవం = పావురం (చిత్రమైన కంఠం గలది)
విచిత్రవర్ణభరితం = విచిత్రమైన రంగులతో నిండినది
హరివిల్లు మెడగాడు = ఇంద్రధనుస్సు వంటి మెడ కలవాడు
ఉట్టిపడలేదు = స్పష్టంగా కనబడలేదు
వన్నెచిన్నెలు = విలాసాలు
ఆచూకీయే = జాడయే
అతిసుందరమైన = మిక్కిలి అందమైన
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
కోల్ కతా నగరంలోని పిల్లలు పక్షుల ప్రేమికులని ఎలా చెప్పగలరు?
జవాబు:
కలకత్తా నగరంలో ప్రతి మూడవ కుర్రాడి వద్ద కనీసం ఒక డజను వార్తలు మోసే పావురాలు, గిరిక్స్ పావురాలు, పిగిలిపిట్టలు, బంతి పావురాలూ ఉంటాయి. కాబట్టి కోల్ కతా నగరం పిల్లలు పక్షుల ప్రేమికులని చెప్పగలం.
ప్రశ్న 2.
మీ ప్రాంతంలో ఏఏ పక్షులు ఎక్కువగా ఉంటాయి? వాటి కోసం మీరేం చేస్తున్నారు?
జవాబు:
మా ప్రాంతంలో కాకులూ, చిలుకలూ ఎక్కువగా ఉంటాయి. రోజూ మధ్యాహ్నం నేను భోజనం తినే ముందు మా ఇంట్లో వండిన పదార్థాలు అన్నీ కలిపి ఒక ముద్ద చేసి, కాకికి పెట్టిన తరువాత నేను తింటాను. మా పెరడులోని జామచెట్టు కాయలు అన్నీ చిలుకలకే వదలి పెడతాను.
ప్రశ్న 3.
పావురాల గురించి ఆశ్చర్యం కలిగించే విషయాన్ని తెలుసుకున్నారు కదా! అట్లే మిగతా పక్షుల్లో ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమున్నాయి?
జవాబు:
కాకులకు మంచి స్నేహభావం ఉంటుంది. ఏదైనా ఒక కాకికి ప్రమాదం వస్తే మిగతా కాకులన్నీ అక్కడ చేరి, తమ బాధను అరుపుల ద్వారా తెలుపుతాయి. ఒక కాకికి ఆహారం దొరికితే, ఆ కాకి మిగతా వాటిని కూడా పిలుచుకు వచ్చి, ఆ ఆహారాన్ని తినేటట్లు చేస్తుంది.
ప్రశ్న 4.
విశ్వాసం ప్రదర్శించడం అంటే ఏమిటి?
జవాబు:
విశ్వాసం ప్రదర్శించడం అంటే యజమాని యందు ప్రేమను చూపించడం. యజమానికి ఏ కష్టమూ రాకుండా చూడడం. అవసరమైతే యజమాని కోసం తన ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధం కావడం.
ప్రశ్న 5.
‘అంతః ప్రేరణాబలం’ అంటే ఏమిటి? దీనివల్ల మనం ఏం చేయగలం?
జవాబు:
‘అంతః ప్రేరణాబలం అంటే మనస్సు గట్టిగా ప్రేరేపించడం వల్ల చేసే కార్యం. ఒక్కొక్కప్పుడు మనకు అక్కడ పదిమందీ ఉన్నా, అందులో ఒక వ్యక్తిపైనే మక్కువ ఏర్పడుతుంది. అతడితోనే ప్రేమగా ఉంటాం. దానికి కారణం ఏమిటో తెలియదు. దానికి కారణం బహుశః అంతః ప్రేరణాబలం కావచ్చు. అంటే మన మనస్సు యొక్క ప్రేరణ.
మొదలెడతాను = ప్రారంభిస్తాను
కులీన వంశానికి = శ్రేష్ఠమైన వంశానికి
అమోఘంగా = ఫలవంతంగా
వార్తాహరి = వార్తలను మోసుకువెళ్ళేది
రూపొందింది = రూపాన్ని పొందింది (తయారయ్యింది)
సంతరించుకుంది = సంపాదించుకుంది
త్రుటిలో = కొద్ది సేపట్లో
దుర్ఘటన = చెడ్డ సంఘటన
ఆకూ అలములు = ఆకులూ, తీగలు
యథాస్థానం = ఉన్నచోటున
దృఢంగా = బలిష్టంగా
తాకింది = తగిలింది
దారుణం = భయంకరం
ఛిన్నాభిన్నము = ముక్కలు ముక్కలు
సంగ్రహించడానికి = అపహరించడానికి
సంఘటన = పరిస్థితి
అడపాదడపా = అప్పుడప్పుడు
నిర్వహించేది = నెరవేర్చేది
పరిజ్ఞానం = పూర్ణజ్ఞానం
రూపొంది = ఏర్పడి
క్షుణ్ణంగా = బాగా (సంపూర్తిగా)
ఆహ్వానించడం = పిలవడం
తారాడటం = కదలియాడడం (తిరగడం)
నెట్టేసేది = గెంటేసేది
మహా ఆత్రంగా = మిక్కిలి వేగిరపాటుగా (తొందరగా)
స్పందన = కదలిక
దివ్యసంకల్పం = గొప్ప సంకల్పం
తల నిక్కించి = తల పైకెత్తి
నిస్సహాయమైన = ఏ సహాయమూలేని
అర్భకమైన = బలంలేని
నిస్సహాయత = శక్తిహీనత
మరుక్షణం = తరువాతి క్షణం
పొదవుకుంది = దాచుకుంది (కప్పుకుంది)
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
మీరు ఎప్పటికీ మరచిపోలేని రోజు ఏది? ఎందుకు?
జవాబు:
మా నాన్నగారు నాకు చేతి గడియారం, సైకిలు కొని ఇచ్చిన రోజును నేను ఎప్పటికీ మరువలేను.
ప్రశ్న 2.
తెలివిమాలిన పనులు అంటే ఏమిటి?
జవాబు:
తెలివిలేని మూర్ఖులు చేసే పనులను, తెలివిమాలిన పనులు అంటారు.
ప్రశ్న 3.
మీ మీద మీకే ఎప్పుడైనా కోపం వచ్చిందా? ఎందుకు?
జవాబు:
మా అమ్మగారు నన్ను సినిమాకు వెళ్ళవద్దన్నారు. మరునాటి పరీక్షకు చదువుకొమ్మన్నారు. అన్నీ చదివాను కదా అని, నా అభిమాన హీరో సినిమా కదా అని, సినిమాకు వెళ్ళాను. మరునాడు పరీక్షలో బాగా రాయలేక పోయాను. అప్పుడు నా మీద నాకే కోపం వచ్చింది.
ప్రశ్న 4.
పావురం గూడు ఎలా ఉందో తెలుసుకొన్నారు కదా! మీకు తెలిసిన పక్షి గూళ్లు ఎలా ఉంటాయో చెప్పండి. పక్షి గూళ్లన్నీ ఒకేలా ఉంటాయా?
జవాబు:
మా పెరటిలో కరివేపచెట్టుకు పిచ్చుక గూడు పెట్టింది. అది సన్నటి దారాల వంటి పీచుతో గూడు కడుతుంది. ఎండిన బీరకాయలా వేలాడుతూ ఉంటుంది. కొన్ని పక్షులు పుల్లముక్కలతోనూ, కొన్ని ఈత, కొబ్బరి వగైరా ఆకులతోనూ గూళ్లు కడతాయి. కాబట్టి అన్ని పక్షిగూళ్లు ఒకేలా ఉండవు.
ప్రశ్న 5.
‘దివ్య సంకల్పం చోటు చేసుకోవడం’ అంటే ఏమిటి?
జవాబు:
ఒకప్పుడు ఎందుకు చేస్తామో తెలియకుండానే కొన్ని, పనులు మనం చేస్తాం. సరిగ్గా ఆ సమయానికి చేయడం వల్ల ఆ పని చక్కగా పూర్తి అవుతుంది. చేసిన పని జయప్రదం అవుతుంది.
ఏదో దేవతల సంకల్పం ఉండడం వల్లనే ఆ పనిని సరిగ్గా అదే సమయంలో మొదలు పెట్టి ఉంటాం. దానినే దివ్య సంకల్పం చోటు చేసుకోవడం అంటారు.
చిత్రగ్రీవం చదువు
దృశ్యాలు = కనబడే వస్తువులు
వెలుగు వెల్లువ = కాంతి ప్రవాహం
అనురాగం = ప్రేమ
లాలిస్తే = బుజ్జగిస్తే
మోతాదు = హెచ్చుతగ్గూకాని పదార్థం
అరకొరజ్ఞానం = మిడిమిడి జ్ఞానం
దోహదం చేస్తాయి = ప్రోత్సహిస్తాయి
ఉత్పత్తి చేసిన – = పుట్టించిన
బాగోగులు (బాగు + ఓగులు)= మంచి చెడ్డలు
ఆహార సేకరణ = ఆహారం సంపాదన
నిమగ్నము = మునిగినది
ఏపుగా = సమృద్ధిగా
బొడిపెలు = చెట్టునందలి బుడిపులు
ఏకఖండంగా = ఒకే ముక్కగా
తునకలు = ముక్కలు
ఘనకార్యం = గొప్పపని
సందేహం = అనుమానం
స్టూలంగా = సుమారుగా (దాదాపుగా)
మందకొడి = మెల్లగా నడవడం (చురుకు లేకపోవడం)
నిరాటంకంగా = ఆటంకం లేకుండా
మండుటెండ = మండే ఎండ
పిల్లగాళ్లకు = పిల్లలకు
సంకోచం = మోమాటం
నిమ్మకు నీరెత్తినట్లు = గుట్టుచప్పుడు కానట్లు
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
పిల్లపక్షిని దానితల్లి ఎలా పెంచిందో తెలుసుకున్నారు కదా! మరి మిమ్మల్ని ఎవరు, ఎలా పెంచారో చెప్పండి.
జవాబు:
నేను మా అమ్మగారికి ఆమె 16వ సంవత్సరంలో పుట్టానట. నా చెల్లికీ, నాకూ కేవలం ఒక సంవత్సరం మాత్రమే తేడా ఉంది. మా చెల్లిని మా అమ్మ పెంచితే, నన్ను మా అమ్మమ్మ గారు పెంచి పెద్ద చేశారు.
ప్రశ్న 2.
“ఘనకార్యం చేయడం” అనే వాక్యం నుండి మీరేం గ్రహించారు? ఇలా దీన్ని ఇంకా ఏ ఏ సందర్భాలలో వాడతారు?
జవాబు:
మనం ఒక పనిని చేస్తాం. ఆ పనివల్ల నష్టం వస్తుంది. అప్పుడు పక్కవారు ‘చేశావులే పెద్ద ఘనకార్యం’ అని మనల్ని పరిహాసం చేస్తారు. ఏదైనా చాలా మంచి పని చేసినపుడు కూడా వారు ఘనకార్యం చేశారు అని పొగిడే సందర్భాల్లో కూడా దీన్ని వాడతారు.
ప్రశ్న 3.
“ఏ మాటకామాటే” అని ఏయే సందర్భాలలో ఉపయోగిస్తారు?
జవాబు:
“ఏ మాటకామాటే చెప్పుకోవాలి అని నిజం చెప్పేటప్పుడు చెపుతారు. ఒక వ్యక్తిలోని మంచి చెడ్డలను ఉన్నవి ఉన్నట్లు పైకి చెప్పేటప్పుడు, “ఏ మాటకామాటే” అనుకోవాలి అంటూ ప్రారంభిస్తారు.
ఉదా : ఏ మాటకా మాటే చెప్పుకోవాలి, మా అమ్మాయికి “అంత తెలివి లేదు.
ప్రశ్న 4.
‘పావురం’ కంటిలోని ప్రత్యేకతను గుర్తించారు కదా! ఇంకా ఇతర జంతువుల పక్షులకు సంబంధించిన ప్రత్యేకతలు ఏమున్నాయి?
జవాబు:
చీమలు పదార్థాలను కూడబెడతాయి. తేనెటీగలు తేనెను జాగ్రత్త చేస్తాయి. కుక్కలు వాసనను బట్టి వస్తువును గ్రహిస్తాయి. అందుకే కుక్కల సాయంతో నేరగాళ్లను పోలీసులు పట్టుకుంటున్నారు.
పచార్లు చెయ్యడం = తిరగడం
నిరాశాభరితము = నిరాశతో నిండినది
చిట్టచివరకు (చివరకు + చివరకు) = ఆఖరుకు
సంకోచాన్ని = మిక్కిలి కలతను (మిక్కుటమైన సంతాపాన్ని)
అధిగమించి = దాటి
బాలెన్సు = సరితూగేలా చెయ్యడం
ప్రక్రియ = పని
అప్రయత్నంగా = ప్రయత్నం లేకుండా
శోభిల్లసాగింది = ప్రకాశింపసాగింది
మహత్తరమైన = మిక్కిలి గొప్పదైన
తతంగం = వ్యవహారం
పరిధిలో = పరిమితిలో
అసాధ్యం = సాధ్యం కానిది
మంద్రంగా = గంభీరంగా
నిర్మలంగా = ప్రశాంతంగా
బడుద్దాయ్ = బద్దకస్తుడు
ఉలుకూపలుకూ = మాటామంతీ
చిర్రెత్తుకొచ్చింది = కోపం వచ్చింది
ఫక్కీ = తీరు
గద్దించసాగింది = అదలించసాగింది (బెదరింప సాగింది)
స్వీయరక్షణ = తన రక్షణ
అసంకల్పితంగా = సంకల్పం లేకుండానే (అనుకోకుండా)
అవధులు = హద్దులు
జలకాలాడుతున్న = స్నానం చేస్తున్న
యథాలాపంగా = ఆకస్మికంగా
రొప్పసాగింది = అరవడం మొదలు పెట్టింది
ఉత్తేజంతో = గొప్ప తేజస్సుతో
ఆలోచించండి – చెప్పండి
ప్రశ్న 1.
‘నిమ్మకు నీరెత్తడం’ అని ఏ ఏ సందర్భాలలో వాడతారు?
జవాబు:
ఒక వ్యక్తి నవనవలాడుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడంటారు.
ఒక వ్యక్తి విషయాన్ని కప్పిపుచ్చి, ఎవరికీ తెలియకుండా, మాట్లాడకుండా ఉన్నప్పుడు, నిమ్మకు నీరెత్తినట్లు మాట్లాడకుండా ఉన్నాడంటారు.
తనలో లోపమున్నా, అది పైకి తెలియకుండా కప్పిపెట్టి ఉంచినపుడు, నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాడంటారు.
ప్రశ్న 2.
‘మహత్తర ఘట్టానికి చేరుకోడం’ అంటే ఏమిటి ? దీనికి కొన్ని ఉదాహరణలు తెల్పండి.
జవాబు:
ఏదైనా గొప్పపనిని చేయడానికి ప్రయత్నిస్తాం. అది చివరికి ఫలించి పూర్తికావడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు ఆ పని “మహత్తర ఘట్టానికి చేరుకొంది” అంటారు.
- గ్రామంలో దేవాలయం కట్టిద్దామని ప్రయత్నం చేస్తారు. విగ్రహ ప్రతిష్ఠ దానిలో జరుగుబోతూ ఉంటే “మహత్తర ఘట్టానికి చేరుకొంది” అంటారు.
- ప్రాజెక్టు నిర్మాణం జరిగి, ప్రారంభోత్సవానికి సిద్ధమైనపుడు మహత్తర ఘట్టానికి చేరుకొంది అంటారు.
ప్రశ్న 3.
మే నెల చివరి రోజుల్లో వాతావరణం ఎలా ఉందో తెలుసుకొన్నారు కదా! చలికాలంలో వాతావరణం ఎలా ఉంటుందో మీ మాటల్లో వర్ణించండి.
జవాబు:
అది డిసెంబరు నెల. సాయంత్రం అయ్యేటప్పటికి చలి ప్రారంభం అవుతుంది. పిల్లలు, పెద్దలూ స్వెట్టర్లు వేసుకుంటారు. మంచినీళ్ళు కూడా తాగబుద్ధి పుట్టదు. రగ్గు కప్పినా చలి ఆగదు. చెట్లమీది నుండి పొగమంచు బొట్లు బొట్లుగా పడుతుంది. వర్షం వచ్చిందేమో అనిపిస్తుంది. పొగమంచు మూసివేయడంతో రోడ్డుమీద ప్రయాణాలు చేసేవారికి దారి కనబడదు. నీళ్ళపొయ్యి దగ్గరకు చిన్నా పెద్దా అంతా చేరతారు.
ప్రశ్న 4.
చిత్రగ్రీవం ఎగరడానికి దాని తండ్రిపక్షి ఏం చేసింది? తల్లిపక్షి ఏం చేసింది ? అట్లాగే చిన్న పిల్లలు నడక నేర్చుకోవడం ఎలా జరుగుతుందో చెప్పండి.
జవాబు:
చిత్రగ్రీవాన్ని తండ్రి పక్షి గద్దించింది. ఆ గద్దింపుల నుండి తప్పించుకోడానికి చిత్రగ్రీవం పక్క పక్కకు జరిగింది. చిత్రగ్రీవం మీద తండ్రి పక్షి, తన భారాన్ని అంతా మోపింది. చిత్రగ్రీవం కాలుజారింది. చిత్రగ్రీవం తన రక్షణకోసం, అప్రయత్నంగా రెక్కలు విప్పి గాలిలో ఎగిరింది. తల్లి పక్షి చిత్రగ్రీవానికి సాయంగా తానూ ఎగిరింది. ఎగరడం వల్ల రొప్పుతున్న చిత్రగ్రీవాన్ని తల్లి పక్షి లాలించింది.
చిన్న పిల్లలు నడక నేర్చుకోడానికి వీలుగా పెద్దవారు చిన్న పిల్లల వేళ్లు పట్టుకొని దగ్గరుండి నడిపిస్తారు. గోడసాయం ఇచ్చి పిల్లల్ని నడిపిస్తారు. పిల్లలు పడిపోతే, వారిని దగ్గరకు తీసుకొని బుజ్జగిస్తారు.