AP SSC 10th Class Hindi Solutions उपवाचक Chapter 3 अपने स्कूल को एक उपहार

AP State Board Syllabus AP SSC 10th Class Hindi Textbook Solutions उपवाचक Chapter 3 अपने स्कूल को एक उपहार Textbook Questions and Answers.

AP State Syllabus SSC 10th Class Hindi Solutions उपवाचक Chapter 3 अपने स्कूल को एक उपहार

10th Class Hindi उपवाचक Chapter 3 अपने स्कूल को एक उपहार Textbook Questions and Answers

प्रश्न 1.
राजू को उसका पुराना स्कूल कैसा लगता था?
उत्तर:
राजू अपने पुराने स्कूल में वह एक मेधावी छात्र रहा था। पुराने स्कूल में उसके बहुत सारे मित्र थे और सभी अध्यापक भी उसे पसंद किया करते थे। जब भी कोई कठिनाई होती तो राजू सबसे पहले उसकी मदद के लिए पहुँच जाता। उसकी टाँगें बहुत दुर्बल थीं, इस कारण उसे खेलने में रुचि न थी। जब भी उनके स्कूल में मैच होता, राजू अपने साथियों को खेलते हुए देखता और जोर – शोर से उनका उत्साह बढ़ाता। राजू का विचार था कि यदि स्वर्ग में भी स्कूल हो तो वह भी उसके पुराने स्कूल से ज्यादा अच्छा तो नहीं हो सकता।

प्रश्न 2.
राजू के प्रति नये स्कूल के साथियों का व्यवहार कैसा था?
उत्तर:
राजू नये स्कूल में प्रेवश करते ही सभी बच्चे उसके टांगों की ओर संकेत करके हँस रहे थे, और उसका मजाक उडाते थे। कुछ ही क्षणों में पूरा मैदान और बरामदे कौतूहल से देखने और उसकी ओर इशारा करके हँसनेवालों से भर गये। स्कूल के अध्यापक भी पास से ऐसे गुजरे जैसे कुछ हो ही नहीं रहा है। अध्यापक के राजू से पूछने पर उसने बताया कि वह एक गाँव के स्कूल से आया है। यह सुनकर सभी छात्र बहुत हँसे। लेकिन मधुर स्वभाव वाले राजू को गुस्सा नहीं आया। अगले दिन, उससे और अगला दिन और फिर महीने का हर दिन उसके लिए ऐसा ही रहा। उसका कोई मित्र भी नहीं बन पाया था। आधी छुट्टी में जब बाकी सभी लडके खेलने जाते तो वह कक्षा में ही बैठा रहता। अब तक पूरा स्कूल जान गया था कि राजू एक ‘गंवार’ लडका है और उसे अपने गाँव के स्कूल का बडा ‘घमंड’ है।

AP SSC 10th Class Hindi Solutions उपवाचक Chapter 3 अपने स्कूल को एक उपहार

प्रश्न 3.
राजू ने अपने स्कूल को किस तरह उपहार समर्पित किया?
उत्तर:
राजू बहुत मेधावी छात्र था। वह गाँव के स्कूल से शहर के स्कूल में पढ़ने के लिए आया था। वह जल्दी नहीं चल सकता था। सभी छात्र उसका बहुत मजाक उडाते थे | सभी छात्र जान गये थे कि राजू एक गंवार लडका है । आखिर राजू ने इस स्थिति से निबटने के लिए बड़ी चतुराई से एक योजना बनायी। इसलिए उसने घर पर अधिक रिश्रम किया। आखिर उसे नये स्कूल के समक्ष प्रमाणित करना था कि उसका पुराना गाँव का स्कूल कोई कम नहीं था। राजू अपनी पढ़ाई करता रहा। उसने परीक्षाएँ अच्छी तरह लिखीं। परिणाम निकलने के दिन पूरे आत्मविश्वास के साथ परीक्षा – फल देखने गया। फिर वह कक्षा में प्रथम आया था। प्रथम आने पर वह इतना प्रसन्न कभी नहीं हुआ था, क्योंकि अब उसने अपने स्कूल को सुंदर और समुचित उपहार समर्पित किया है।

अपने स्कूल को एक उपहार Summary in English

Raju was an intelligent student. He was a child prodigy. He would always come first in the class. He was fond of reading story books. His favourite subjects were Hindi and English. He would read books concerning science subject also. So he became well – versed in science and history. As to mathematics, he was a magician. He would answer the problems even before the teacher wrote on the blackboard.

In old school he had many friends. Teachers too liked him very much. If anybody else was in difficulties, he would go first to help him/her. In that school nobody cared for his physical disability. His legs were lean and weak. His knees were not strong enough to bear his body for much time. Hence, he would not play any games. But he would watch his friends playing games and encourage them. Inspired by him, they would play the games with much enthusiasm.

He thought about his old school throughout the night and he wished that his new school too would be like the old one. He was of the opinion that his old school was greater than the heaven. At the time of his leaving the old school, his friends sank in sorrow. Even his teachers and the headmaster requested his father to leave him there. As his father got transferred, he had to join another school.

The following day he woke up early and donned his uniform. He looked at himself in the mirror and thought that his new school too would be good. He didn’t take tiffin properly. His parents understood the situation and did not compel him. His father took him to school by his vehicle and saw him off smilingly.

AP SSC 10th Class Hindi Solutions उपवाचक Chapter 3 अपने स्कूल को एक उपहार

Raju would walk slowly while limping. The fellow students and everyday in the new school looked at his legs and made fun of him. The teachers also didn’t show any concern towards him.

Soon after the first period started, the teacher made Raju sit on the least row. Asked by the teacher, he introduced himself that he had come from a village school. On hearing that, the students as well as the teacher laughed at him. As he was a boy with composure, he controlled his anger. He felt the need of being bold. He thought that everything would be alright later. But this went on in every period. He was humiliated by the teachers and fellow students.

Raju wanted to prove that village schools are not less than those of town. That evening his parents asked him about the new school. But he kept quiet and gave a smile in reply. He even didn’t like to tell a lie.

In the classroom he was not given any chance to answer the questions asked by the teachers He could make friends with nobody. While the other students kept on playing in a recess during lunch time, he remained quiet in the classroom. Everyone thought that he was proud of his village school.

Finally, Raju made a plan to come out of this situation. He gave up raising his hand when the teachers asked questions. As a result ,the students and the teachers didn’t concentrate on him.

Raju wanted to get through the annual examinations with flying colours. So he worked hard. He wanted to prove that his old school was not a fools’ paradise.

AP SSC 10th Class Hindi Solutions उपवाचक Chapter 3 अपने स्कूल को एक उपहार

Everybody in the school expected that he would fail. They jeered at him why they saw him with books. But he continued his preparation boldly and ardently. The examinations were over within a week. After the examinations, he left for his village.

Later, he returned to the town one day before the results day. The following day he, confidently went to school along with his father to know result. He stood first in his class. His father felt very happy. Raju’s joy knew no bounds. He never felt so much happy like that, earlier. Thus, he presented a good and proper gift to his old school.

अपने स्कूल को एक उपहार Summary in Telugu

తన పాత పాఠశాలలో అతడు ఒక మేధావి విద్యార్థి. గత 5 సంవత్సరాలుగా తను తన తరగతిలో అందరి కంటే ముందుండేవాడు. అతనికి కథల పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అందుకని అతనికి ఆంగ్ల భాష, హిందీ భాష బాగా ఇష్టం. అతనికి సాధారణ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు కూడా చాలా ఇష్టం. అందువలన అతని విజ్ఞానశాస్త్రం మరియు చరిత్రకు సంబంధించిన విజ్ఞానం వికసించినది. అతడు లెక్కల విషయం (గణితశాస్త్రం) లో అయితే గణిత మాంత్రికుడే. ఉపాధ్యాయుడు నల్లబల్లపై ప్రశ్నలు వ్రాయడానికి పూర్వమే అతడు వాటికి సమాధానం చెప్పడానికి ధైర్యంతో చేతులెత్తేవాడు.

తనకు పాత పాఠశాలలో చాలా మంది మిత్రులు ఉన్నారు. ఉపాధ్యాయులు కూడా ఆ పిల్లవాణ్ణి ఇష్టపడేవారు. అతడు అందర్నీ సంతోషంగా కలుస్తూ “హలో” అని పలకరించేవాడు. ఎప్పుడయినా ఎవరైనా కష్టాలలో ఉంటే రాజు అందరికంటే ముందు తాను సహాయం చేయడానికి బయలుదేరేవాడు. తన పాత పాఠశాలలో ఎవ్వరూ కూడా తన బలహీనతను పట్టించుకునేవారు కాదు. అతని కాళ్ళు చాలా బలహీనంగా సన్నగా ఉండేవి. అతని మోకాళ్ళలో శక్తి లేదు. అధిక . సమయం తన కాళ్ళు తన శరీర భారాన్ని మోసేవికావు. అందువలన అతడు ఎక్కువ సమయం తన కాళ్ళపై నిలబడగలిగేవాడు కాదు. అందువలనే అతడు ఆటలు కూడా ఆడేవాడు కాదు. ఎప్పుడైనా తన పాఠశాలలో ఏవైనా ఆటల పోటీలు ఉంటే రాజు తన స్నేహితుల ఆటను చూస్తూ వారిని ఉత్సాహంగా ఉత్తేజపరిచేవాడు. తన స్నేహితులు ఆట ఓడిపోయేటట్లు – ఉంటే రాజు ప్రేరణతో వారిలో ఆశ సంచరించేది అంతే ఇంకేముంది నూతన స్పూర్తితో ఆట ఆడేవారు.

రాజు రాత్రంతా తన పాత పాఠశాలను గురించి ఆలోచిస్తూ తన నూతన పాఠశాల కూడా తన పాత పాఠశాల అంత మంచిదిగా ఉండాలని ప్రార్థించాడు. ఒకవేళ స్వర్గంలో కూడా పాఠశాల ఉండి ఉంటే అది కూడా తన పాత పాఠశాల కంటే మంచిగా ఉండదని రాజు అభిప్రాయం. తను పాఠశాల విడిచి వచ్చేటప్పుడు ఎంతమంది స్నేహితులు ఏడ్చారు? తన స్నేహితులు, ఉపాధ్యాయులు, అక్కడ దాకా ఎందుకు ప్రధానోపాధ్యాయులు కూడా తన తండ్రిగారితో అతడిని అక్కడే వదిలి వెళ్ళమని ప్రార్థించారు. కానీ వారెవరి మాటను పట్టించుకోలేదు. వాళ్ళ నాన్నగారు బదిలీ అయ్యిి. తన ఏకైక కుమారుణ్ణి అక్కడే వదిలి వెళ్ళాలనే విషయాన్ని వాళ్ళు ఆలోచించనే లేదు.

AP SSC 10th Class Hindi Solutions उपवाचक Chapter 3 अपने स्कूल को एक उपहार

మరుసటి రోజు ప్రాతఃకాలాన్నే రాజు త్వరగా లేచి తన యూనిఫారంను ధరించాడు. అద్దంలో తనను తాను చూచుకుని సమదుస్తులైతే బాగానే ఉన్నాయి. పాఠశాల కూడా బాగానే ఉండి ఉంటుంది అని అనుకున్నాడు. అతడేమి టిఫిన్ కూడా సరిగా తినలేదు. అమ్మ-నాన్నలు అర్థం చేసుకుని అతనిపై ఎటువంటి వత్తిడి చేయలేదు. నాన్నగారు తనను బడి (పాఠశాల) గేటు వరకు తన బండిపై తీసుకువెళ్ళి వదిలి నవ్వుతూ వీడ్కోలు చెప్పారు.

రాజు నెమ్మది – నెమ్మదిగా (ఎందుకంటే అతడు వేగంగా నడవలేడు.) కుంటుకుంటూ నడుస్తున్నాడు. అతని మధురమైన నవ్వును గుర్రుగా చూస్తూ, అతని కాళ్ళవైపు సైగచేసి నవ్వుతూ అతనిని అవహేళన చేస్తున్నారు. అక్కడి జనం.

కొద్ది క్షణాలలోనే మైదానం అంతా, వరండా అంతా కుతూహలంతో తననే చూస్తూ అతనివైపు సైగ చేస్తూ నవ్వుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. పాఠశాల ఉపాధ్యాయులు కూడా అక్కడేమీ జరగటం లేదన్నట్లు తన ముందుగానే వెళ్ళిపోసాగిరి.

మొదటి పీరియడ్ ప్రారంభం కాగానే ఉపాధ్యాయుడు రాజూని అందరికంటే వెనుక కూర్చోబెట్టెను. రాజూని తనను పరిచయం చేసుకొనమని చెప్పగా తను ఓ గ్రామ పాఠశాల నుండి వచ్చినట్లు చెప్పెను. అది విన్న ఉపాధ్యాయునితో సహా పిల్లలందరూ నవ్విరి. మధుర స్వభావం కల రాజు ఇంతకు ముందెన్నడూ కోపాన్ని ప్రదర్శించలేదు. అతడు స్వయంగా తనకు తాను ధైర్యంగా ఉండవలసిన అవసరాన్ని గుర్తించాడు. త్వరగానే అన్నీ సర్దుకుంటాయి అని అనుకున్నాడు. కాని పూర్తిగా రోజంతా ప్రతి పీరియడ్ లో ఇలాగే జరిగింది. ప్రతిసారి ఒక కొత్త ఉపాధ్యాయుడు రావడం, రాజును ప్రతిసారి అవమానించడం జరిగింది. రాజును, తన పాఠశాలను ఎగతాళి చేయడంలో వారు విజయాన్ని సాధించారా?

లేదు, రాజు వేరే మట్టితో తయారుచేయబడినవాడు. అతడు గ్రామ పాఠశాలలు పట్టణ పాఠశాలల కంటే తక్కువేమీ కాదని నిరూపించదలచాడు. ఆ రోజు సాయంత్రం రాజు తన అమ్మ-నాన్నలకు ఏమీ చెప్పలేదు. వాళ్ళు జిజ్ఞాసపూర్వకంగా అడుగుతున్న ప్రశ్నలకు జవాబులేమీ చెప్పకుండా నవ్వుతూ ఉండిపోయాడు. ఎందుకంటే తనకు అబద్దం చెప్పడం కూడా ‘ : ఇష్టం లేదు.

AP SSC 10th Class Hindi Solutions उपवाचक Chapter 3 अपने स्कूल को एक उपहार

మరుసటి రోజు, దాని మరుసటి రోజు, తర్వాత నెలలోని ప్రతిరోజూ అతనికి ఇలానే ఉంది. అతడు తరగతి గదిలో చెయ్యి ఎత్తినా తనను ప్రశ్నలకు జవాబులు చెప్పే అవకాశం ఇవ్వలేదు. అతనికి ఎవ్వరూ స్నేహితులు కూడా ఏర్పడలేదు. భోజన విరామ సమయంలో మిగిలిన పిల్లలందరూ ఆడుకుంటుంటే తను మాత్రం తరగతి గదిలోనే కూర్చునేవాడు. ఇప్పటి వరకూ అందరికీ తెలిసింది ఏమిటంటే రాజు ఒక గ్రామీణ బాలుడని, అతనికి తన గ్రామ పాఠశాల అంటే చాలా గర్వమని.

ఆఖరికి రాజు ఈ స్థితి నుండి బయటపడడానికి తెలివిగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. తరగతి గదిలో ఉపాధ్యాయులు ప్రశ్నలు అడిగినపుడు చేతులు ఎత్తడం మానేశాడు. తత్ఫలితంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అతనిపై దృష్టి పెట్టడం మానేసిరి. ఒక నెల తర్వాత వార్షిక పరీక్షలు ఉన్నవని రాజుకి తెలుసు. అందువలన రాజు ఇంటివద్ద ఎక్కువ పరిశ్రమ చేసెను. అతనికి తన కొత్త పాఠశాల ముందు తన పాత పాఠశాల (గ్రామ పాఠశాల) మూర్చుల స్వర్గం కాదని నిరూపించదలచాడు.

అందరూ రాజు తప్పుతాడని అనుకున్నారు. సమయం గడిచేకొలది విద్యార్థులందరూ చదువులో మునిగిపోయిరి. రాజు చేతిలో పుస్తకాలను చూసి వారు హేళనగా నవ్వుకొనసాగిరి. రాజు ఇప్పుడు చాలా ధైర్యంగా తన మనస్సులోనే నవ్వుకుంటూ చదువుకుంటూ ఉండెను. ఒక వారంలోనే పరీక్షలు అయిపోయినవి. రాజు రెండు వారాలు సెలవుపై తన
గ్రామం తిరిగి వెళ్ళెను. ఆ తరువాత పరీక్షా ఫలితాలు వస్తాయి.

పరీక్షా ఫలితాలు వెలువడే ముందురోజు రాజు తిరిగివచ్చెను. మరుసటి రోజు ఆత్మవిశ్వాసంతో తన తండ్రిగారితో పరీక్షా ఫలితాలను చూడటానికి వెళ్ళెను. ఒకసారి మరలా రాజు తన తరగతిలో ప్రథమస్థానం పొందెను. తన నాన్నగారు సంతోషించిరి. కానీ రాజు సంతోషానికి అవధులు లేవు. ప్రథమస్థానం పొందినప్పుడు అతడెప్పుడూ ఇంత ఆనందం . పొందలేదు. అతడు తన పాత పాఠశాలకు ఒక అందమైన సముచితమైన మంచి బహుమతిని సమర్పించెను.

Leave a Comment