AP Inter 2nd Year Zoology Important Questions Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం

Students get through AP Inter 2nd Year Zoology Important Questions 8th Lesson అనువర్తిత జీవశాస్త్రం which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Zoology Important Questions 8th Lesson అనువర్తిత జీవశాస్త్రం

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
ఏ కారకాలు కలిస్తే పాడిపరిశ్రమ ఏర్పడుతుంది ?
జవాబు:
పాడిపరిశ్రమకు కావలసిన కారకాలు:

  1. ప్రజననం, పోషణ మరియు పాలు అమ్మకపు యాజమాన్యం.
  2. ఆదాయప్రాతిపదికన పాలు మరియు పాల ఉత్పత్తులు తయారి, ప్రాసెసింగ్ మరియు అమ్మకం

ప్రశ్న 2.
అంతఃప్రజననం యొక్క ఏవైనా రెండు ప్రయోజనాలను ఉదాహరించండి.
జవాబు:
అంతఃప్రజననం యొక్క ప్రయోజనాలు:

  1. అంతఃప్రజననం సమయుగ్మతను పెంచుతుంది మరియు జంతువుల యొక్క శుద్దప్రజననంకు సహాయపడుతుంది.
  2. మేలు రకపు జన్యువులను సంచితం చేయడానికి మరియు ఉపయుక్తం కాని జన్యువులను తొలగించడానికి సహాయపడుతుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం
ప్రశ్న 3.
జవాబు:
ఔట్ – క్రాస్, క్రాస్-బ్రీడ్ మధ్య భేదం తెల్పండి.

  1. బాహ్యాసంపర్కం: ఒకే ప్రజననాల మధ్య జరిగే సంపర్కం కాని 4-6 తరాల వరకు ఆ వంశంలో ఇరువైపులా ఒకే పూర్వీకులు ఉండరాదు. ఇటువంటి సంపర్కంను ‘బాహ్యాసంపర్కం’ అంటారు.
  2. పరప్రజననం: పరప్రజననం విధానం నందు ఒకమేలు జాతి ‘మగజీవిని’ వేరొక మేలు జాతి ‘ఆడజీవితో’ సంపర్కం చెందిస్తారు.

ప్రశ్న 4.
లేయర్లు, బ్రాయిలర్ పదాలను నిర్వచించండి. [TSMAR-20,22][AP MAY-19][ AP MAR-15,17]
జవాబు:

  1. గుడ్లకోసం మాత్రమే పెంచే పక్షులను ‘లేయర్’ పక్షులు అంటారు.
  2. మాంసం కోసం పెంచే పక్షులను ‘బ్రాయిలర్’ పక్షులు అంటారు. వీటిని 8-10 వారాల వయస్సు వరకు పెంచి ఆ తరువాత మార్కెట్కు పంపుతారు.

ప్రశ్న 5.
ఎపికల్చర్ అంటే ఏమిటి? [TS MAR-19]
జవాబు:

  1. తేనెటీగల పెంపకాన్ని ‘ఎపికల్చర్’ లేదా ‘తేనెటీగల పెంపకం’ అంటారు.
  2. వీటిని ‘తేనే’ మరియు ‘మైనం’ ల ఉత్పత్తి కొరకు పెంచుతారు.

ప్రశ్న 6. [TS MAR-15,17,18][ AP MAR-17,20]
తేనెటీగ కాలనీలో డ్రోన్, కూలీ ఈగ మధ్య భేదాలను తెల్పండి.
జవాబు:
డ్రోన్లేనెటీగ

  1. డ్రోన్ అనేది మగతేనెటీగ
  2. డ్రోన్లకు కొండేలు ఉండవు.
  3. వీటి జీవితకాలం చాలా తక్కువ
  4. ఇవి రాణి ఈగ కంటే చిన్నగా కూలీ ఈగ కంటే పెద్దగా ఉంటాయి.
  5. వీటి ప్రధాన పాత్ర రాణి ఈగతో సంయోగం చెందడం.

కూలీ తేనెటీగ

  1. కూలీ తేనెటీగ అనేది వంధ్య ఆడ ఈగ
  2. కూలీ తేనెటీగలకు కొండేలు ఉంటాయి.
  3. వీటి జీవితకాలం రెండు లేదా మూడు నెలలు.
  4. ఇవి డ్రోన్ల కంటే చిన్నగా ఉంటాయి.
  5. ఇవి మైనంను స్రవించి షట్భుజి ఆకారంలో గదులను నిర్మిస్తాయి. మకరందాన్ని నిల్వ ఉంచుతాయి. పుప్పొడిని సేకరించి ప్రొపోలిస్ ను తయారు చేస్తాయి.

ప్రశ్న 7.
ఫిషరీ అనే పదాన్ని నిర్వచించండి.
జవాబు:
ఫిషరీ: మానవ వినియోగం కొరకు వివిధ రకాల చేపలు లేదా కర్పర చేపలు లేదా జలచర జంతువులను పట్టడం, పెంచడం, శుభ్రపరచడం, వివిధ రకాలుగా నిలువచేసి అమ్మడం వంటి వాటిని చేయు పరిశ్రమను ‘ఫిషరీ’ అంటారు.

ప్రశ్న 8.
జలసంవర్ధనం, చేపల పెంపకం మధ్య వ్యత్యాసం తెల్పండి. [APMAR-16][TS MAR-15,20]
జవాబు:
జలసంవర్ధనం

  • చేప మరియు ఇతర జలచర జీవుల (రొయ్యలు, పీతలు, ఆల్చిప్పలు)ను దిగుబడి కొరకు నియంత్రిత పరిస్థితులలో సంవర్ధనం చేయడాన్ని జలసంవర్ధనం అంటారు.

చేపల పెంపకం

  • కేవలం వాజ చేపలను మాత్రమే సంవర్ధనంకు మరియు ప్రజననంకు వినియోగిస్తే దాన్ని ‘చేపల పెంపకం’ అంటారు.

ప్రశ్న 9.
హైపోఫైజేషన్ అనే పదాన్ని వివరించండి. [TS MAR-16]
జవాబు:

  1. హైపోఫైజేషన్ అనగా ప్రేరిత ప్రజననం (కృత్రిమ ప్రజననం). ఇందులో పిట్యూటరీ గ్రంధిని సేకరిస్తారు.
  2. పిట్యూటరీ స్రావాన్ని లేదా ఓవాప్రిమ్న బ్రూడ్ చేపలోకి ఇంజెక్ట్ చేస్తారు. దీని ద్వారా స్పాన్ విడుదల చేయించి విత్తనాలను ఉత్పత్తి చేయిస్తారు.

ప్రశ్న 10.
ఏవైనా రెండు భారత, రెండు విదేశీ కార్ప్ చేపల పేర్లు తెలపండి.
జవాబు:

  1. భారతదేశ కార్ప్ చేపలు: కట్ల కట్ల మరియు లేబియో రోహిత
  2. విదేశి కార్ప్ చేపలు:గ్రాస్ కార్ప్ మరియు సిల్వర్ కార్ప్.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం

ప్రశ్న 11.
ఏవైనా నాలుగు చేప ఉప ఉత్పత్తులను ఉదహరించండి. [AP MAR-18][ TS MAR-17] [TS MAY-22] [AP,TS MAR-19]
జవాబు:
చేప యొక్క ఉప ఉత్పత్తులు:

  1. షార్క్ మరియు కాడ్ చేపల నుండి చేసే కాలేయ నూనెలు.
  2. సార్లైన్ మరియు సాల్మన్ చేపల నుండి చేసే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు.
  3. చేపగ్వానో – స్క్రాప్ చేపల నుండి తయారు చేసే ఎరువు.
  4. ఐసిన్గ్లాస్ – పిల్లి చేపల ఎండిన గాలితిత్తుల నుండి వైన్ శుద్ధి కొరకు వినియోగించేవి.

ప్రశ్న 12.
ఇన్సులిన్లో ఎన్ని అమైనో ఆమ్లాలు, ఎన్ని పాలిపెప్టైడ్ గొలుసులు ఉంటాయి?
జవాబు:

  1. ఇన్సులిన్ 51 అమైనో ఆమ్లాలు ఉంటాయి.
  2. పాలిపెప్టైడ్ గొలుసు ‘A’ లో 21 అమైనో ఆమ్లాలు ఉంటాయి.
  3. పాలిపెప్టైడ్ గొలుసు ‘B’ లో 30 అమైనో ఆమ్లాలు ఉంటాయి.

ప్రశ్న 13.
వ్యాక్సిన్ పదాన్ని నిర్వచించండి. [AP MAR-19] [AP MAR-16]
జవాబు:

  1. వ్యాక్సిన్: ఇది ఒక ప్రత్యేక వ్యాధికి వ్యాధి నిరోధక శక్తిని పెంచే జీవ సంబంధిత తయారీ. వాక్సిన్ యందు బలహీనపరచబడిన లేదా చంపబడిన వ్యాధికారక సూక్ష్మజీవులు ఉంటాయి. కొన్ని సందర్భాలలో సూక్ష్మజీవుల యొక్క ప్రోటీన్లు కూడా వ్యాక్సిన్లుగా వినియోగించబడతాయి.
  2. ఉదా: సాబిన్ నోటి పోలియో వ్యాక్సిన్.

ప్రశ్న 14.
PCR కు సంబంధించి ఏవైన రెండు లక్షణాలను తెలపండి.
జవాబు:

  1. PCR అనగా పాలిమరేజ్ చైన్ రియాక్షన్. ఇది కొన్ని వ్యాధులను ప్రాధమిక దశలోనే గుర్తించుటకు సహాయపడుతుంది.
  2. PCR ఆంప్లీకేషన్ విధానం ద్వారా తక్కువ మొత్తంలో ఉన్న DNA లను గుర్తించవచ్చు..
  3. PCR ను HIV నిర్ధారణకు వినియోగిస్తారు.
  4. PCR ను క్యాన్సర్ అనుమానిత రోగగ్రస్తుల యందు ఉత్పరివర్తనాలను గుర్తించుటకు ఉపయోగిస్తారు.

ప్రశ్న 15.
ADA దేన్నిసూచిస్తుంది? ADA లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది?
జవాబు:

  1. ADA అనగా ‘ఎడినోసిన్ డిఎమినేజ్’. ఈ ఎన్ఎమ్ రోగనిరోధక వ్యవస్థ పని చేయడానికి ఎంతో కీలకమైనది.
  2. ADA లోపం వల్ల తీవ్ర సమ్మిళిత వ్యాధి నిరోధక లోపం (SCID) కలుగుతుంది.

ప్రశ్న 16.
జన్యు పరివర్తిత జంతువు పదాన్ని నిర్వచించండి.
జవాబు:

  1. జన్యుపరివర్తిత జంతువులు: తమ జీనోమ్కు అదనంగా వేరొక జన్యువును ప్రవేశపెట్టడానికి వాటి DNA సవరింపబడిన జంతువులను ‘జన్యుపరివర్తిత జంతువులు’ అంటారు.
  2. ఉదా: ‘ఎంఫిసీమా’ నివారణకు 0-1 యాంటిట్రిప్సిన్ ను ఉపయోగిస్తారు.

ప్రశ్న 17.
‘గార్డియన్ ఏంజెల్ ఆఫ్ సెల్ జీనోమ్’ అని దేన్ని సాధారణంగా పిలుస్తారు. [TS MAY-19][ TS MAR-16] [AP MAR-20]
జవాబు:

  1. P53 జన్యువును ‘కణ జీనోమ్’ ‘సంరక్షణ దేవత’ గా పిలుస్తారు. ఇది కణుతులను అణచివేసే జన్యువు.
    ఇది DNA సమగ్రతను పరిరక్షిస్తుంది.
  2. ఇది కణచక్రంను G1 తనిఖీ బిందువు వద్ద నిలిపి, పాడైన DNA మరమ్మత్తులో సహాయపడుతుంది.

ప్రశ్న 18.
కాన్సర్ కణాల ఏవైనా నాలుగు లక్షణాలు తెల్పండి.
జవాబు:
కాన్సర్ కణాల ముఖ్య లక్షణాలు:

  1. కాన్సర్ కణాలు త్వరితంగా పెరుగుతాయి మరియు నిరంతరం విభేదనం చెందుతాయి. 2) కాన్సర్ కణాలు సులువుగా గుర్తించబడి వేరే ప్రాంతాలకు బదిలి చెందుతాయి.
  2. కాన్సర్ కణాలు స్పర్శనిరోధకతను కోల్పోతాయి.
  3. కాన్సర్ కణాలు ప్రణాళికాబద్ద కణమరణానికి (ఎపోటోసిస్) గురికావు.
  4. కాన్సర్ కణాలు రక్తనాళాలను వాటి చుట్టూ ఉండి ఆకర్షిస్తాయి.

ప్రశ్న 19.
రేడియాగ్రాఫ్లను ఏ విధంగా పొందుతారు? [AP MAY-19]
జవాబు:

  1. X-కిరణాలను వినియోగించి తీసే ఫోటో గ్రాఫ్లను రేడియో గ్రాఫ్లు(లేదా) స్కయాగ్రాఫ్లు అంటారు.
  2. X-కిరణాల దేహాభాగాలపై ప్రసరింప చేస్తారు దేహా భాగాల గుండా ప్రయాణించిన ఈ కిరణాలను ఫోటోగ్రఫిక్ ఫిల్మ్ పై అభివృద్ధి చేస్తారు. వీటిని ఫ్లోరసెంట్ స్క్రీన్పై పరిశీలిస్తారు.
  3. సాంద్రత ఎక్కువ ఉన్న ఎముకలు X-కిరణాలను అధికంగా శోషించుకొని తెల్లగా కనిపిస్తాయి. మృదుకణజాలం బూడిద రంగులో కనిపిస్తుంది. కణజాలాల కాల్సీకరణ తెల్లగా, ఊపిరితిత్తులు నల్లగా కనిపిస్తాయి.

ప్రశ్న 20.
టోమోగ్రామ్ అంటే ఏమిటి? [AP MAY-22]
జవాబు:

  1. టోమోగ్రామ్: ఇది ఒక 3-D CAT స్కాన్ (కంప్యూటరైజ్డ్ ఏక్సియలోటోమోగ్రఫీ) దేహాన్ని కోతల రూపంలో చూడవచ్చును. CAT స్కాన్ అనేది వైద్య విధానంలో అనేక బీమ్ల X-కిరణాలను వినియోగించి తీసే దేహ చిత్రం
  2. రక్తం గడ్డకట్టినవి, కణుతులు, పుర్రెపగుళ్ళు, ఎముకల సాంద్రత తెలుసుకొనుటకు ఉపయోగిస్తారు.

ప్రశ్న 21.
MRI స్కాన్ హానికరం కాదు. నిరూపించండి. [ TS MAR-18]
జవాబు:

  1. MRI స్కాన్: MRI అనగా అయస్కాంత అనునాద చిత్రీకరణ. ఇది రేడియో తరంగాలు, అయస్కాంత తత్వాన్ని మరియు కంప్యూటర్ను ఉపయోగించి శరీరభాగాల చిత్రాలను ఏర్పరుస్తుంది.
  2. MRI లో X-కిరణంలో వలే అయనీకరణ రేడియోధార్మికతను వినియోగించరు. కావున MRI స్కానింగ్ చాలా సురక్షితమైన విధానం.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం

ప్రశ్న 22.
ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అంటే ఏమిటి? ECGలో సాధారణ భాగాలు ఏవి? [AP MAR-15]
జవాబు:

  1. ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్(ECG) అనేది గుండెలో కలిగే విద్యుత్ మార్పులను నమోదు చేయడానికి వాడే హానిలేని పద్ధతి
  2. ECG యొక్క ముఖ్యమైన భాగాలు:
    (i) తరంగాలు (P,Q,R,S మరియు T తరంగాలు)
    (iii) భాగం (S-T భాగం)
    (ii) అంతరాలు (P-R; Q-T; R-R అంతరాలు)
    (iv) సంక్లిష్టాలు (QRS సంక్లిష్టాలు)

ప్రశ్న 23.
దీర్ఘకాల P-R అంతరం దేన్ని సూచిస్తుంది?
జవాబు:

  1. P తరంగం ప్రారంభానికి మరియు Qతరంగా ప్రారంభానికి మధ్య ఉన్న అంతరాన్ని P-R అంతరం అంటారు. దీని కాలావధి 0.12 నుండి 0.2 సెకన్లు.
  2. దీర్ఘకాల P-R అంతరం A.V కణుపు నుండి P.V కణుపు ప్రచోదకాల ప్రసరణల జరిగే వాయిదాను సూచిస్తుంది.

ప్రశ్న 24.
ప్రాథమిక, ద్వితీయ ప్రతిదేహాల మధ్య భేదాన్ని తెల్పండి.
జవాబు:

  1. ప్రాథమిక ప్రతిదేహాలు అభిరుచిగల ప్రతిజనకాలతో చర్య జరుపుతాయి.
  2. ద్వితీయ ప్రతిదేహాలు ప్రాథమిక ప్రతిదేహాలతో చర్య జరుపుతాయి.

ప్రశ్న 25.
ప్రత్యక్ష, అప్రత్యక్ష ELISA ద్వారా సాంపిల్ ఏ పదార్థాలను గుర్తించవచ్చు? [AP MAY-22]
జవాబు:

  1. ప్రత్యక్ష ఎలీసాను ‘ప్రతిజనకాలను’ గుర్తించడానికి వినియోగిస్తారు.
  2. పరోక్ష లేదా అప్రత్యక్ష ఎలీసాను ‘ప్రతిదేహాలను’ గుర్తించడానికి వినియోగిస్తారు.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
పశుసంపదను మెరుగుపరచడానికి జంతు ప్రజననంలో వాడే వివిధ పద్ధతులు ఏవి?
జవాబు:
ప్రజనన పద్ధతులు ప్రధానంగా రెండు రకాలు అవి 1) అంతఃప్రజననం 2) బాహ్యా ప్రజననం

1) అంతఃప్రజననం: ఒకే ప్రజననానికి చెందిన జంతువుల మధ్యజరిగే సంపర్కం (లేదా) అతి దగ్గర సంబంధం ఉన్న జీవుల మధ్య జరిగే సంపర్కం. మేలైన మగసంబంధం ఉన్నజీవుల మధ్య జరిగే సంపర్కం. మేలైన ఆడజీవి అంటే అధికపాలు ఉత్పత్తి చేసేది. మేలైన మగజీవి అంటే మేలురకపు సంతానాన్ని ఇచ్చేది. సంతానాన్ని పరీక్షంచి వాటిలో మేలు రకాలను సంపర్కానికి వినియోగిస్తారు.

అంతః ప్రజననం రెండు రకాలు:

  • అతిసన్నిహిత ప్రజననం: దీనియందు మగ జనక జీవిని దానికి కలిగిన ఆడ సంతతితో (లేదా) ఆడ జనకజీవిని దానికి కలిగిన మగ సంతతితో సంపర్కాన్ని జరుపుతారు.
  • రేఖాప్రజననం: రేఖాప్రజననం యందు సన్నిహిత జంతువుల మధ్యే సంపర్కం జరుపుతారు. ఇది వాంఛిత లాభాదాయక లక్షణాలు ఉన్న జీవులను ఉత్పత్తి చేయుటకు ఉపయోగపడుతుంది.

2) బాహ్యాప్రజననం: సంబంధం లేని జంతువుల మధ్య జరిగే ప్రజననాన్ని ‘బాహ్యాప్రజననం’ అంటారు. ఇది మూడు రకాలు

a) బాహ్యాసంకరణం: ఒకే ప్రజననాల మధ్య సంపర్కం జరుగుతుంది కాని 4-6 తరాల వరకు ఆ వంశ వృక్షంలో పూర్వికులు (లేదా) ఒకే ఉమ్మడి వంశీకుల మధ్య జరగరాదు. అటువంటి సంపర్కం ద్వారా వచ్చే సంతతిని ‘బాహ్యాసంపర్కులు’ అంటారు. పెరుగుదల రేటును మరియు పాలదిగుబడిని పెంచుటకు చాలా ఉపయోగకరమైన విధానం. అంతః ప్రజనన మాంధ్యం నుంచి బయటపడటానికి ఇది సహాయపడుతుంది.

b) పరసంకరణం: పరప్రజననం యందు ఒక మేలు జాతి మగజీవితో వేరొక మేలు జాతి ఆడజీవిని సంపర్కం చేస్తారు. అటువంటి సంపర్కం ద్వారా పుట్టిన సంతతిని ‘పరప్రజనితాలు’ అంటారు.
ఉదా: హిసార్డోల్ అనేకొత్త ప్రజనన గొర్రెను పంజాబ్ లోని ‘బికనీర్ యూస్’ మరియు ‘మరీనో రామ్స్’ మధ్య సంపర్కం జరిపి అభివృద్ధి చేస్తారు.

c) అంతర జాతి సంకరణం: ఈ విధానంలో మగ మరియు ఆడజీవులు వేరు వేరు దగ్గరి ప్రజాతులకు చెందిన వాటి మధ్య సంపర్కం జరుపుతారు. వీటి సంతతి రెండు జనకుల యొక్క ఐచ్ఛిక లక్షణాలను పొందుతుంది. ఉదా: ‘మ్యూల్’ అనే జీవి మగ గాడిదకు మరియు ఆడగుర్రం కు సంపర్కం జరపగా పుట్టినది. ‘హిన్ని’ అనే జీవి మగ గుర్రాన్నికి మరియు ఆడ గాడిదకు సంపర్కం జరపగా పుట్టినది.
‘మ్యూల్’ ఆర్థికపరంగా ఎంతో విలువైనది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం

ప్రశ్న 2.
‘ప్రజననం’ అనే పదాన్ని నిర్వచించండి. జంతు ప్రజననంలో ఉద్దేశ్యాలు ఏమిటి?
జవాబు:
1) ప్రజననం (బ్రీడ్): చాలా లక్షణాల్లో అనగా పరిమాణం, ఆకృతి, లక్షణాలు మొదలగు వాటి యందు సామ్యాన్ని కలిగి యుండి వంశానుక్రమం వల్ల సంబంధం కలిగి యున్న జంతువుల సమూహాన్ని ‘ప్రజననం’ అంటారు.

2) జంతు ప్రజననం ఉద్దేశ్యాలు:

  • ఇది పశుసంవర్ధక శాఖకు చాలా ఉపయోగకరమైన అంశం.
  • జంతువుల దిగుబడిని పెంచుటయే దీని ముఖ్య ఉద్దేశం.
  • జంతువుల యొక్క వాంఛిత లక్షణాలను మరియు వాటి ఉత్పత్తులను పెంచుట దీని ముఖ్య ఉద్దేశం.

ప్రజననం యొక్క ప్రయోజనాలు:

  1. వ్యాధి నిరోధకత అధికంగా ఉన్న జంతువుల ఉత్పత్తి.
  2. పాలు, మాంసం, ఉన్ని మొదలైనవి వాటి యొక్క నాణ్యత మరియు పరిమాణంను పెంచడం.
  3. వేగవంతమైన పెరుగుదల రేటు.
  4. జన్యుప్రతిభను పెంచడం ద్వారా ఉత్పాదకత జీవితాన్ని పెంచడం.
  5. ముందస్తు పరిపక్వత
  6. దాణా మరియు మేతలో మితవ్యయం

ప్రశ్న 3.
మానవ సంక్షేమంలో పశు సంవర్ధన పాత్రను వివరించండి?
జవాబు:
1) పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార అవసరాలను తీర్చుట అనేది సాధారణ వ్యవసాయం మరియు పశుసంవర్ధనం ద్వారా సాధ్యంకాదు.

2) కావున, దీనికి గాను ఆహార ఉత్పత్తిని అధికం చేయుట కొరకు వినియోగించే జీవశాస్త్ర సూత్రాలు చాలా క్లిష్టతరంగా ఉంటాయి.

3) పశుసంవర్ధక శాఖ వ్యవసాయ విధానాలైన ప్రజననం మరియు పశుగణం పెంపుదలను సాధిస్తున్నాయి.

4) ఈ జంతువులు మరియు తేనెటీగలు వాటి యొక్క ఉత్పత్తులైన తేనే, సిల్క్ (పట్టు), మైనం, మాంసం, ఉన్న మొదలగు వాటి కొరకు మానవుల చేత సంరక్షించబడుతున్నాయి.

5) జీవించి ఉన్న పశుగణాన్ని నాణ్యతాపరంగా సంఖ్యాపరంగా పెంచే ఆవశ్యకత ఏర్పడింది.

6) కొత్త ప్రజనన పద్ధతులైన ‘బహుళ అండోత్సర్గం’ మరియు ‘పిండ బదలీ’ ద్వారా కృత్రిమ శుక్రనివేషణం జరిపి వాంఛిత అనువర్తిత జంతువులను ఉత్పత్తి చేస్తున్నారు.

7) కోళ్ల పెంపకంను కూడా ‘అధిక ఆహారఉత్పత్తి స్థాయికి’ అభివృద్ధి చేశారు. భారతదేశం గుడ్ల ఉత్పత్తి యందు మూడవస్థానంలో ఉన్నది.

8) పశుసంవర్ధక శాఖ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నాణ్యత ఉన్న ఆహారాన్ని ఉత్పత్తి చేయుటకు ఇంకా అనేక ప్రయత్నాలను క్షేత్ర స్థాయిలో జరుపుతున్నది.

ప్రశ్న 4.
MOET లో సహాయపడే వివిధ స్థాయిలను పేర్కొనండి. [AP MAY-19]
జవాబు:
MOET: MOET అనగా బహుళ అండోత్సర్గం మరియు పిండబదిలీ సాంకేతికత విధానం. సాధారణంగా ఒక ఆవు ఒకేసారి ఒకటి లేదా రెండు దూడలకు మాత్రమే జన్మనిస్తుంది. కాని ఈ విధానం ద్వారా ఒకేసారి 6-8 పిండాలను ఏర్పరచవచ్చును. ఆ విధానం ఈ క్రింది విధంగా ఉంటుంది.

  • దశ 1: పుట్టికా ఉద్దీపన హార్మోన్ అయిన FSH ను ఆవులకకు ఇస్తారు.
  • దశ 2: ఆ FSH పుటికా పరిపక్వతను మరియు అధి అండోత్సర్గాన్ని ప్రేరేపిస్తుంది ఒక వలయానికి ఒక అండానికి బదులు ఆవు 6-8 అండాను ఉత్పత్తి చేస్తుంది.
  • దశ 3: ఆవును ఉత్తమ జాతి ఎద్దుతో సంపర్కం జరపటం (లేదా) కృత్రమ శుక్రనివేషణం జరపటం జరుగుతుంది.
  • దశ 4: 8-32 కణాలను వివిధ దశలలో పిండాలను శస్త్రచికిత్స లేకుండా సేకరించి, అరువు ఆవు గర్భాశయంలోకి మారుస్తారు.

ఇప్పుడు జన్యుతల్లి మరొకసారి అధి అండోత్సర్గానికి సిద్దంగా ఉంటుంది. ఈ సాంకేతిక విధానమును పశువులు, గొర్రెలు, కుందేళ్లు, బర్రెలు, గుర్రాలు మొదలైన వాటలో ఉపయోగిస్తారు.

ఈ విధానం ద్వారా అధిక పాల దిగుబడినిచ్చే ప్రజననాలను, అధిక నాణ్యత ఉన్న మాంసం ఉత్పత్తి చేసే గిత్తలను ఉత్పత్తి చేయవచ్చు. తక్కువ కాల వ్యవధిలో మంద పరిమాణం పెంచవచ్చు.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం

ప్రశ్న 5.
నియంత్రిత ప్రజనన ప్రయోగాలపై లఘు వ్యాఖ్య రాయండి.
జవాబు:
నియంత్రిత ప్రజనన ప్రయోగాలు: కొన్ని సందర్భాలలో సాధారణ ప్రజననం అనుకూల ఫలితాలను ఇవ్వక పోవచ్చును మరియు మేలురకపు దున్నలు అందుబాటులో ఉండకపోవచ్చును. అటువంటి సందర్భాలలో రెండు కొత్త విధానాల ద్వారా పశుగణ ప్రజననం పెంచవచ్చును. అవి

  1. కృత్రిమ శుక్రనివేషణం (AI): ఈ విధానంలో మేలు రకపు ఎద్దుల నుండి శుక్రాన్ని సేకరించి, తాపంలో ఉన్న మేలు రకపు ఆవు ప్రత్యుత్పత్తి నాళంలోకి ప్రవేశపెడతారు.
  2. ఈ శుక్రాన్ని ఘనీభవించి నిల్వ చేయవచ్చు లేదా అవసరం ఉన్న ప్రాంతానికి రవాణా చేయవచ్చు.
  3. ఈ విధానం పాడి రైతులకు వారు కావలసిన లక్షణాలను ఉన్న పశువులను ఉత్పత్తి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
  4. ఇది పశువుల సంపదను జన్యుపరంగా మెరుగుపరచుకొవటానికి మరియు సుఖరోగాలు రాకుండా నియంత్రించుటకు సహాయపడుతుంది.
  5. కృత్రిమ శుక్రనినేషణం ద్వారా పాడి రైతులు అత్యధికంగా వివిధ సైర్ల నుంచి శుక్రాన్ని సేకరించి ఉత్తమ లక్షణాలున్న ఆవును ఎంపిక చేసి గర్భదారణ జరిపించి తమకు కావలసిన ప్రజనన లక్ష్యాన్ని పొందుటకు తోడ్పడుతుంది.
  6. మన దేశంలో రాయబరేలిలోని ‘సాలోన్’ గ్రామం వద్ద ఉన్న ప్రజనన కేంద్రంలో ‘విదేశి శుద్ద ప్రజననాల’ నుండి సేకరించిన నాణ్యమైన శుక్రకణాలను శీతల స్థితి యందు నిల్వచేస్తారు. కావలసిన వారు దీనిని పొందవచ్చును

2) ‘బహుళ అండోత్సర్గం’ మరియు ‘పిండబదిలీ సాంకేతికత’ (MOET): MOET విధానంలో ఆవులకు FSH పుటికా ఉద్దీపన హార్మోన్ను ఎక్కువ అండాలను (6-8) విడుదల చేయుటకు ఇస్తారు. ఈ అండాలు మేలు జాతి ఎద్దు యొక్క ‘వీర్యం’ తో కృత్రిమ శుక్రనివేషణం ద్వారా ఫలదీకరణంగావిస్తారు.

  • ఈ పిండాలు 8-32 కణాల దశలో ఉన్నపుడు శస్త్రచికిత్స లేకుండా సేకరించి ‘అరువు ఆవు’ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు.
  • ఈ విధానంను మంచి నాణ్యతమైన పశువుల మందను పెంచుటకు వినియోగిస్తారు.

ప్రశ్న 6.
పౌల్ట్రీ యాజమాన్యంలో ముఖ్యమైన అంశాలను వివరించండి.
జవాబు:
కోళ్ల పెంపకం పౌల్ట్రీ యాజమాన్యంలో ముఖ్యమైన అంశాలు:
1) మంచి ప్రజననాలు అనగా వ్యాధిరహిత మరియు ఎటువంటి వాతావరణ పరిస్థితులకైనా తట్టుకోగలిగినటువంటి కోళ్ళను ఎంచుకోవాలి. భారతదేశంలో ఉపయోగించే సంకర లేయర్లు BV-300, హైలైన్ పూనాపెరల్స్ మొదలైనవి. హబ్బర్ట్ మరియు వెంకాబ్ మొదలైనవి బ్రాయిలర్ రకాలు.

2) మేత/దాణాయాజమాన్యం: గరిష్ట ఉత్పత్తులను సాధించుటకు సంతులిత ఆహారం ఎంతో ముఖ్యమైనది. వివిధ దశల్లో ఉన్న లేయర్ల బ్రూడర్ మాష్, గ్రోయార్ మాష్, ప్రీలేయర్ మాష్ మరియు లేయర్ మాష్లను ఆహారం ఇవ్వాలి. బ్రాయిలర్లకు వివిధ దశలలో ప్రీస్టార్పర్ మాష్, స్టార్టర్ మాష్ మరియు ఫినిష్ మాష్లను ఆహారంగా ఇవ్వాలి.

3) ఆరోగ్యపరమైన జాగ్రత్తలు: కోళ్ళకు వైరల్ వ్యాధులైన రానికీట్, మారెక్ మరియు గంబొరోలకు నివారణ వాక్సినేషన్ ఇవ్వాలి. బాక్టీరియా వ్యాధులైన కోళ్లకలరా, ఇన్ ఫెక్టియస్ కొరైజా మరియు (కానిక్) రెస్పిరేటరీ డిసీజ్ (CRD) లకు యాంటి బయాటిక్స్ ఇచ్చి వ్యాధిరహితంగా ఉంచాలి.

4) సరియైన సురక్షిత క్షేత్ర పరిస్థితులు మరియు పరిశుభ్రత మెరుగైన ఉత్పాదకతను అందిస్తాయి.

ప్రశ్న 7.
‘ఏవియన్ ఫ్లూ’ గురించి సంక్షిప్తంగా చర్చించండి. [TS MAY-22] [AP,TS MAR-20]
జవాబు:
1) ఏవియన్ ఫ్లూ (పక్షుల ప్లూ): ఇది పౌల్ట్రీ పక్షులకు మరియు మానవులకు కూడా సోకే అతి ముఖ్యమైన మరియు ప్రమాదకరమైన వ్యాధి.

2) వ్యాధికారక జీవి: బర్డ్ ఫ్లూ వ్యాధి H5N1 అనే ఏవియన్ ఫ్లూ వైరస్ ద్వారా వస్తుంది. ఇది ఏకకాలంలో ‘ప్రపంచ వ్యాప్తంగా సోకే అంటు వ్యాధి’ (పాండెమక్ వ్యాధి)

3) వ్యాధి సోకే విధానం:ఇది అంటువ్యాధి కలుషితమైన ఉపరితలాలు తాకినా సంక్రమిస్తుంది. ఇన్ఫ్లూయెంజా రకపు వైరస్ సోకిన పక్షులు లాలాజలం, మలపదార్ధం ద్వారా 10 రోజుల వరకు ఈ వైరస్ ను విడుదల చేస్తాయి.

4) లక్షణాలు:మానవులలో H5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ సాధారణ ఫ్లూ లక్షణాలైన కఫంతో కూడిన పొడిదగ్గు, డయేరియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జర్వం, తలనొప్పి, వ్యాకులత, కండరాల నొప్పి, గొంతునొప్పి మొదలగునవి.

5) నివారణ:
(i) సరిగా వండని కోడి మాంసం తినకుండా ఉండటం.
(ii) పక్షులతో పనిచేసే మనుష్యులు రక్షణగా ఉండే దుస్తులు మరియు ముసుగు ధరించాలి.
(iii)వ్యాధి సోకిన పక్షులను పూర్తిగా పూడ్చి పెట్టడం (లేదా) తగులబెట్టి గాని కల్లింగ్ చేయాలి.

ప్రశ్న 8.
రాణి ఈగ గురించి సంక్షిప్తంగా చర్చించండి
జవాబు:

  1. రాణి ఈగ: సహనివేశంలో రాణి ఈగ మాత్రమే ఫలవంతమైన ద్వయస్థితిక ఆడజీవి
  2. ఇది సహానివేశంలో అతి పెద్ద జీవి.
  3. గుడ్లను పెట్టుట అనేది రాణి ఈగ పని.
  4. ఇది 5 సంవత్సరాల వరకు జీవించి ఉంటుంది.
  5. రాణి ఈగ శోభన ‘ఉడ్డయనం’ లో డ్రోన్ల నుంచి శుక్రకణాలను ఒక్కసారి మాత్రమే గ్రహిస్తుంది.
  6. శుక్రకణాలను శుక్రాశయంలో నిల్వ చేసుకొని జీవితాంతం ఉపయోగించుకుంటుంది.
  7. కొన్ని అండాలను శుక్రకణాలతో ఫలదీకరణం జరిపి విడుదల చేస్తుంది. ఫలవంతమైన అండాలు వంధ్య స్త్రీ జీవులుగా మార్పు చెందుతాయి.
  8. ఫలవంతం కాన్ని కొన్ని అండాలను కూడా విడుదల చేస్తుంది. ఈ అండాలు ‘ఆర్డినోటోకి’ అనే మగ అనిశేక జనన పద్ధతి’లో అభివృద్ధి చెందుతాయి . ఇవి ఏకస్థితికాలు.
  9. డింభకాలకు మొదటి ఎనిమిది రోజులు రాయల్ జెల్లీని ఆహారంగా ఇస్తాయి, తరువాత తేనెటీగ రొట్టెను ఆహారంగా ఇస్తాయి.
  10. రాణి ఈగగా అభివృద్ధి చెందే ఈగకు మాత్రమే ‘రాయల్ జెల్లీ’ని ఆహారంగా ఇస్తాయి.

ప్రశ్న 9.
తేనెటీగలు ఆర్ధిక రీత్యా ప్రాముఖ్యమైనవి – నిరూపించండి. [TS MAY-22] [APMAR-16]
జవాబు:
తేనెటీగల ఆర్ధిక ప్రాముఖ్యం:
తేనెటీగల ఉత్పత్తులైన తేనె, మైనం, ప్రొపోలిస్, తేనెటీగల విషం అనేక విధాలుగా ఉపయోగిస్తారు.

  1. తేనె ఫ్రక్టోస్, గ్లూకోజ్, ఖనిజాలు, విటమిన్లు, నీటికి మంచి వనరు.
  2. బీ మైనాన్ని సౌందర్య సాధనాలు, అనేక రకాల పాలిష్లు, కొవ్వొత్తుల తయారీలో వాడతారు.
  3. ప్రొపోలిస్ ను కాలిన ఉపరితల గాయాలకు, వాపులకు ఉపయోగిస్తారు.
  4. కూలి ఈగల కొండెం నుంచి తీసిన విషాన్ని రుమటాయిడ్ కీళ్ళవ్యాధి చికిత్సలో వాడతారు.
  5. తేనెటీగలు పరాగ సంపర్క కారులుగా, పొద్దు తిరుగుడు బ్రాసికా, ఏపిల్, పియర్ లాంటి మొక్కలలో పనిచేస్తాయి.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం

ప్రశ్న 10.
తేనెటీగల పెంపకానికి కావలసిన వివిధ కారకాలు ఏవి?
జవాబు:
తేనెటీగల పెంపకం విజయవంతం కావడానికి కావలసిన కారకాలు :

  1. వివిధ రకాల తేనెటీగలు, వాటి అలవాట్లు మరియు స్వభావం పై అవగాహన
  2. తేనెపట్టును ఉంచడానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేయడం (ఏపియరీ (లేదా) బీయార్ట్)
  3. తేనె పట్టును ఒక రాణి ఈగ మరియు చిన్న కూలీ ఈగల గుంపుతో పెంచడం.
  4. వివిధ ఋతువులలో తేనె పట్టులను పరిరక్షించడం.
  5. తేనె మరియు బీ మైనాన్ని సంగ్రహించి వాడుకొనే విషయాలపై పట్టు ఉండాలి.

ప్రశ్న 11.
భారత ఆర్ధిక వ్యవస్ధలో ఫిషరీస్ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. వివరించండి.
జవాబు:
ఫిషరీ ఆర్ధిక ప్రాముఖ్యం:
1) చేపల మాంసం ప్రోటీన్లను కలిగి ఉండి త్వరగా జీర్ణమవుతుంది. ఇది ప్రోటీన్ల ను, విటమిన్ A మరియు D లను ఖనిజాలను మరియు అయోడిన్ ను సమృద్ధిగా కలిగి ఉంటుంది. చేపలు మంచి ఎగుమతి విలువను కూడా కలిగి ఉన్నాయి.

2) ఉప ఉత్పత్తులు:
షార్క్ మరియు కాడ్ కాలేయ నూనెలలో విటమిన్ A మరియు D ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు (సార్డెన్ మరియు
సాల్మన్) చేపలలో విరివిగా లభిస్తాయి. వీటిని సబ్బుల తయారిలో మరియు విరివిగా వినియోగిస్తారు.

చేపగ్వానో: స్క్రాప్ చేపల నుంచి ఎరువులను తయారు చేస్తారు.

షాగ్రీన్ అనేది ఒక జిలాటినస్ పదార్ధం. దీనిని వైన్ను శుద్ధిచేయడంలో వినియోగిస్తారు. దీనిని చేపల ఎండిన గాలితిత్తుల నుంచి తయారు చేస్తారు.

చేపల పెంపకం, రొయ్యల పెంపకం, పీతలు పెంపకం, ముత్యపు చిప్పల పెంపకం వల్ల మరియు వీటి విదేశీ ఎగుమతుల ద్వారా విదేశీ మారకం పెరుగుతుంది.

భారతదేశపు ఆర్ధిక పరిస్థితి ఈ మత్యసంవర్ధనం ద్వారా ఒకస్థాయికి చేరింది.

ప్రశ్న 12.
ఇన్సులిన్ నిర్మాణాన్ని సంక్షిప్తంగా వివరించండి. [ AP MAR-15]
జవాబు:
ఇన్సులిన్ నిర్మాణం:

  1. ఇన్సులిన్ అనేది ప్రోటీన్ హార్మోన్. క్లోమ గ్రంధి యొక్క B కణాల ద్వారా స్రవించబడుతుంది.
  2. మానవ ఇన్సులిన్ రెండు (A మరియు B) పాలిపెప్టైడ్ గొలుసుల ’51’ అమైన్ ఆమ్లాలను కలిగి ఉంటుంది.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం 1
  3. దీనిలోని ‘A’ గొలుసు 21 అమైన్ ఆమ్లాలను మరియు ‘B’ గొలుసు 30 అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి.
  4. ఈ రెండు A,B ప్రోటీన్ గొలుసుల ద్విసల్ఫైడ్ బంధాలతో కలుపబడి ఉంటాయి.
  5. ఇన్సులిన్ ప్రోహార్మోన్ రూపంలో సంశ్లేషించబడి, ‘C’పెప్టైడ్ అనే అదనపు శృంఖలంను కలిగి ఉంటుంది.

ప్రశ్న 13.
వ్యాక్సిన్ను నిర్వచించండి. వివిధ రకాల వ్యాక్సీన్ల గురించి చర్చించండి.
జవాబు:
వ్యాక్సిన్లు: వ్యాక్సిన్లు అనేవి ఒక ప్రత్యేక వ్యాధికి నిరోధకతను పెంచుటకు జీవపరంగా తయారు చేయబడినవి. వ్యాక్సిన్ అనేపదాన్ని ‘ఎడ్వర్డ్ జెన్నర్’ కనుగొన్నాడు.
వ్యాక్సిన్ బలహీనపరచబడిన లేదా చంపబడిన సూక్ష్మజీవి లేదా సూక్ష్మజీవుల ప్రోటీన్లు లేదా వాటి నుండి విడుదలయ్యే విషపదార్ధాలను కలిగి ఉంటుంది.
ఈ క్రింది పేర్కొనబడినవి సాంప్రదాయక వ్యాక్సిన్లు:
1) వ్యాధి కారకత క్షీణించిన సంపూర్ణప్రాతినిధ్య వ్యాక్సిన్లు: ఇది క్షీణించిన లేదా కనిపించని, జీవించి యున్న సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. ఇవి చాలా వరకు వైరస్ వ్యాధుల నుండి రక్షిస్తాయి.
ఉదా: ఎల్లో జ్వరం, మశూచి, రుబెల్లా, గవదలు అనే వైరల్ వ్యాధుల నుండి మరియు టైఫాయిడ్ లాంటి బాక్టీరియల్ జ్వరం నుండి రక్షణ కల్పిస్తాయి.

2) నిష్క్రియా సంపూర్ణ ప్రాతినిధ్య వ్యాక్సిన్లు: ఇది మృత సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది.
ఉదా: ఇన్ఫ్లూయెంజా, కలరా, బ్యుబోనిక్ ప్లేగు, పోలియో, హెపటైటిస్- A, రేబిస్ మరియు సాబిన్స్ నోటి పోలియోవ్యాక్సిన్ .

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం

3) టాక్సాయిడ్లు: ఇవి కొన్ని సూక్ష్మజీవుల నిష్క్రియాత్మక బాహ్య విషాలను కలిగి ఉంటాయి.
ఉదా: డిప్తీరియా మరియు టిటానస్ వ్యాక్సిన్లు. ఈ వ్యాక్సిన్లు దేహాంలోకి ప్రవేశించిన వెంటనే దేహం యొక్క నిరోధక వ్యవస్థ ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తుంది. జ్ఞప్తి కణాలు ప్రతిజనకాలను గుర్తిస్తాయి.

సూక్ష్మ జీవులు వ్యాధికారక రూపంలో దేహంలోకి ప్రవేశించిన వెంటనే దేహం యొక్క నిరోధకవ్యవస్థ ప్రతిదేహల సహాయంతో వాటిని చంపుతుంది. వ్యాక్సిన్లు దేహనిరోధక వ్యవస్థ వ్యాధిని ఎదుర్కొనేలా చేయగల్గుతాయి. జీవసాంకేతిక వ్యాక్సిన్లు పునఃసంయోజక వాహాక టీకాలు మరియు DNA టీకాలు.

ప్రశ్న 14.
జన్యు చికిత్సలో రకాలను సంక్షిప్తంగా రాయండి?
జవాబు:
జన్యు చికిత్స అనగా జన్యువుల్ని వ్యాధిగ్రస్త కణాలు మరియు కణజాలాల్లోకి ప్రవేశపెట్టి వ్యాధులను నయం చేయడం. జన్యు చిక్సిత చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ.
ప్రాధమిక సాంకేతిక పద్ధతి: అసాధారణ జన్యువుకు బదులుగా సాధారణ జన్యువును ప్రవేశపెట్టుట వాహకం సాధారణ జన్యువు (చికిత్సార్ధక) ను లక్ష్య కణం (అసాధారణ) లోనికి ప్రవేశపెడుతుంది.
a) బీజకణ శ్రేణి జన్యు చికిత్స: ఈ జన్యు చికిత్స విధానంలో క్రియాత్మక సాధారణ జన్యువులను శుక్రకణాలు లేదా అండాలలోనికి ప్రవేశపెట్టి DNA జీనోమ్ను సమైక్యం చేస్తాయి. ఈ మార్పు అనువంశికం. కాని ఇది అంత సులువైనది కాదు. అనేక కారణాల వల్ల ఈ చికిత్స ‘శైశవ స్థాయిలోనే’ ఉండిపోయింది.

b) దేహకణ శ్రేణి జన్యు చికిత్స: ఈ విధానంలో దేహకణంలో క్రియాత్మక జన్యువును ప్రవేశపెడతారు. ఈ మార్పు తాత్కాలికం మరియు అనువంశికం కాదు. జన్యు ప్రవేశం అనేది దేహ బాహ్యంగా గాని (ex-vivo) లేదా లోపలగాని (in-vivo) ఉంటుంది. మొదటి జన్యు చికిత్స 1990 లో ఎడినోసిన్ డిఎమినేజ్ (ADA) లోపం ఉన్న, నాలుగు సంవత్సరాల పాపకు చేయబడింది. ఈ లోపం వల్ల తీవ్ర సమ్మిళిత వ్యాధి నిరోధక లోపం కలుగుతుంది. ఈ లోపం అనేది ఎముక మజ్జి (మూలుగ) మార్పిడి లేదా ఎన్ఎమ్ల ప్రతిస్థాపన ద్వారా నయం చేయవచ్చు. కానీ ఈ రెండు పూర్తిగా నయం చేయలేవు.

జన్యుపరంగా మార్పు చెందిన DNA లను కణంలోనికి (లేదా) (జన్యు) జీవన్న్ విధానం ద్వారా ప్రవేశపెడతారు. వ్యాధిని కలుగజేసే జన్యువులను చైతన్యరహితం చేయడానికి (జన్యు – నిశ్శబ్దత) సంశ్లేషిత (సింధటిక్) ఆలిగ్ డీ ఆక్సీన్యూక్లీయోసైడ్లను వాడుతున్నారు.

ప్రశ్న 15.
కాన్సర్ కణాల ఏవైనా నాలుగు ముఖ్య లక్షణాలను విశదీకరించండి.
జవాబు:
కాన్సర్ కణాల యొక్క ముఖ్య లక్షణాలు:
1) స్పర్శ నిరోధక లోపం: సాధారణ కణాలు ఒకదాన్ని ఒకటి తాకినపుడు విభజన చెందటం మరియు కణ కదలికను ఆపివేస్తాయి దీనినే ‘స్పర్శ నిరోధకం’ అంటారు. క్యాన్సర్ కణాలు నిరంతరం విభజన చెందుతూ, పెరుగుతుండటం వలన ఈ గుణాన్ని కోల్పోతాయి.

2) కెడ్హరిన్ల లోపం: క్యాన్సర్ కణాల యందు ఈ కెడరిన్లు లోపిస్తాయి. దీనివలన ఇవి కణితి నుంచి విడిపోయి వేరె కణజాలాలకు (మెటాస్టాసిస్) వ్యాపిస్తాయి.

3) చలనం లేకుండుట: సాధారణ కణాలలో DNA పాడైనచో తగిన సమయంలో విఫలమైన కణాలు ‘ప్రణాళిక బద్ద కణమరణానికి’ (అపోస్టాసిస్) గురి అవుతాయి. కాని క్యాన్సర్ కణాలు గురికావు.

4) ఏంజియోజెనెసిస్: వేగంగా పెరుగుతున్న క్యాన్సర్ కణుతులు, 02 మరియు పోషకాలను పొందుటకు సమీపంలో ఉన్న రక్తకణాల నుండి రక్తాన్ని అధికంగా పొందుతాయి. దీనినే ‘ఏంజియోజెనెసిస్’ అంటారు.

ప్రశ్న 16.
వివిధ రకాల క్యాన్సర్లను వివరించండి. [TS MAY-19] [AP MAR-18][ TS MAR-15,17,18]
జవాబు:
క్యాన్సర్ కణాల పుట్టుక ఆధారంగా, క్యాన్సర్లు ఈ క్రింది విధంగా విభజించారు:

  1. కార్సినోమా: ఉపకళా కణజాలాలు లేదా కణాలకు వచ్చే అతి సాధారణ క్యాన్సర్
  2. సార్కోమా: సంయోజక కణజాలాలకు సంక్రమించే క్యాన్సర్.
  3. ల్యుకేమియా: ఇది ఒక ద్రవ కణిత ఎముక మజ్జకు సంక్రమించే క్యాన్సర్. అదుపు లేకుండా తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. (ల్యూకేమియా-తెల్ల రక్తం]
  4. లింఫోమా: శోషరస వ్యవస్థకు సంక్రమించే క్యాన్సర్
  5. కుటుంబాల క్యాన్సర్: తల్లిదండ్రులు లేదా తాతా మామ్మ లనుండి అనువంశికంగా సంక్రమించే క్యాన్సర్లు.
  6. చెదురు మదురు క్యాన్సర్లు: కుటుంబ చరిత్ర లేకుండా ఎటువంటి అనువంశికత లేకుండా సంక్రమించే క్యాన్సర్.

ప్రశ్న 17.
MRI ఉపయోగించే విధానాన్ని రాయండి. [TS MAR-19][ AP MAR-17]
ప్రశ్న
MRI: MRI అనగా అయస్కాంత అనునాద చిత్రీకరణ

  1. ఇది రోగనిర్ధారణ యందు వినియోగించే రేడియాలజీ పద్ధతి. ఇందులో X-కిరణంలాగా అయనీకరణ రేడియోధార్మికతను వినియోగించరు.
  2. ఇది చాలా సురక్షితమైన పద్ధతి.
  3. ఇది దేహాంలోని అవయవాలు, మృదుకణజాలాలు, ఎముకలు మరియు ఏ ఇతర భాగాల యొక్క పూర్తి చిత్రాలను అయినా చిత్రీకరించగలదు.
  4. MRI స్కానింగ్ యంత్రం అనేది ఒక పెద్ద ‘వృత్తాకార అయస్కాంత’ గొట్టం.
  5. రోగిని కదిలే పరుపుపై ఉంచి దాన్ని అయస్కాంత గొట్టంలోకి పంపిస్తారు.
  6. మానవ దేహాం ప్రధానంగా ప్రోటాన్లను కలిగిన నీటి అణువులతో నిండి ఉంటుంది.
  7. అయస్కాంతం బలమైన అయస్కాంత క్షేత్రాన్ని కలుగజేస్తుంది. రెండవ రేడియో తరంగ దైర్ఘ్యపు విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని కొద్దిసేపు దేహంలోకి పంపుతారు.
  8. దేహంలోని వివిధ భాగాల యందు ఉన్న ప్రోటాన్లు వివిధ రకాల శక్తిని విడుదల చేస్తాయి. దీనిని MRI స్కానర్ గుర్తిస్తుంది.
  9. వివిధ కణజాలాల యొక్క చిత్రాలు వాటి మధ్య ఉన్న నీటి స్థాయిల వ్యత్యాసంను బట్టి ఉంటుంది.
  10. వెలువడిన సమాచారం కంప్యూటర్ ద్వారా ‘విధానీకరింపబడి’ ఒక ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.
  11. ప్రతిబింబాలు ఒక ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ గా మార్చబడతాయి.
  12. కొన్ని సందర్భాలలో రేడియో వ్యత్యాసకారకాలైన ‘గాడోలినియమ్’ను చిత్రాల ఖచ్చితత్వం పెంచడానికి వాడతారు.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం

ప్రశ్న 18.
ECG లో వివిధ తరంగాలు, అంతరాలను గూర్చి సంక్షిప్తంగా రాయండి. [AP MAR-19] [ TS MAY-17]
ప్రశ్న
E.C.G: ECG అనగా ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్’ (లేదా) ఎలక్ట్రోకార్డియోగ్రామ్’ అని అర్ధం. ఇది గుండెలో కలిగే విద్యుత్ మార్పులను నమోదు చేస్తుంది. 12 సెన్సార్ గ్రాహకాలను, 12 రకాల స్థానాలు (ఛాతి, చేతులు మొదలగునవి) యందు అమరుస్తారు 12 లీడ్స్ను ECG పరికరానికి అనుసంధానిస్తారు.
I) తరంగాలు:

  1. P-తరంగం: ఇది కర్ణికా విధృవణాన్ని (లేదా) సంకోచాల్ని సూచిస్తుంది. దీని కాలావధి 0.1 సెకన్లు.
  2. QRS సంక్లిష్టం తరంగాలు : ఇది జఠరికా విధ్రువణం(లేదా) సంకోచాన్ని సూచిస్తుంది.
    దీని కాలావధి 0.08 నుండి 0.1 సెకన్లు.
    Q తరంగం చిన్న ఋణాత్మక తరంగం
    R తరంగం పొడవైన ధనాత్మక తరంగం
    S తరంగం చిన్న ఋణాత్మక తరంగం
  3. T– తరంగం: ఇది ధనాత్మక తరంగం
    దీని కాలావధి 0.2 సెకన్లు.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం 2

II) అంతరాలు:

  1. P-R అంతరం: P తరంగం ప్రారంభానికి మరియు Qతరంగ ప్రారంభానికి మధ్య ఉన్న అంతరాన్ని P-R అంతరం అంటారు. దీని కాలావధి 0.12 నుండి 0.2 సెకన్లు ఉంటుంది.
  2. Q-T అంతరం: Qతరంగం ప్రారంభానికి మరియు T -తరంగం అంతానికి మధ్య ఉన్న అంతరాన్ని Q-T అంతరం అంటారు. ఇది హృదయరేటు పై ఆధారపడి ఉంటుంది. దీనికాలావధి 0.4 సెకన్లు ఉంటుంది. హృదయరేటు అధికంగా ఉంటే అంతరం తక్కువగా ఉంటుంది.

3. R-R అంతరం: ఇది ఇక ‘హార్ధిక వలయ’ కాలావధిని తెలియజేస్తుంది. దీని యొక్క కాలావధి 0.8 సెకన్లు ఉంటుంది.

ప్రశ్న 19.
అప్రత్యక్ష ELISA విధానాన్ని సంక్షిప్తంగా చర్చించండి. [ TS MAR-16]
జవాబు:
ELISA అనగా ‘ఎన్ఎమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ ఎస్సే’
ELISA అనేది వ్యాధి నిరోధకత లో ‘ప్రాధమిక చికిత్సా సాధనం’
అప్రత్యక్ష ELISA అనేది రోగి యొక్క సీరమ్ నందలి ప్రతి దేహాలను గుర్తించుటకు వినియోగించే పద్ధతి.
HIV అనేది అప్రత్యక్ష ELISA పరీక్ష

ప్రోటోకాల్ (ప్రయోగ ప్రణాళిక):

  1. దీనిని ప్రతిజనన HIV ప్రతిదేహాలను గుర్తించుటకు వినియోగిస్తారు.
  2. తెలిసిన ప్రతిజనన (ఉదా: HIV ప్రతిజనకం) ను ఫలకపుగుంతకు జత చేస్తారు.
  3. రోగి యొక్క యాంటి సీరమ్ను కలుపుతారు.
  4. రోగి యొక్క యాంటి సీరమ్లోని ప్రతిదేహాలు ఫలకపు గుంతపై పూసిన ప్రతిజనకాలతో బంధించబడతాయి.
  5. ఎన్ఎమ్ అనుసంధానిత యాంటి హ్యూమన్ సీరమ్ గ్లోబ్యులిన్లు (యాంటి HISGs) కలుపుతారు. అది అప్పటికే ప్రతిజనకాలకు అతకబడిన ప్రాధమిక ప్రతిదేహాలను అతుక్కొంటాయి.
  6. ఎన్ఎమ్కు అధస్త పదార్ధాన్ని కలపగా అవి చర్య జరిపి రంగులో మార్పును చూపిస్తుంది. దీన్ని ‘స్పెక్ట్రోఫోటోమీటరు’ ద్వారా కొలవవచ్చును.
  7. ELISA పరీక్ష ద్వారా HIVని ఖచ్చితంగా నిర్ధారించలేము. ఇది తప్పుడు ‘పాజిటివ్’ మరియు తప్పుడు ‘నెగెటివ్’ ఫలితాలను కొన్ని సందర్భాలలో ఇవ్వవచ్చును.

ప్రశ్న 20.
EEG మీద లఘువ్యాఖ్య రాయండి. [AP MAY-22]
జవాబు:
1) EEG: EEG అనగా ‘ఎలక్ట్రో ఎన్ సెఫలో గ్రఫీ’.

  1. ఇది మెదడు యొక్క విద్యుత్ క్రియాశీలతను నమోదు చేస్తుంది. లీడ్లు తలపై వివిధ స్థానాలలో ఉంచి వాటిని EEG పరికరానికి అమరుస్తారు.
  2. EEG సహాయంతో మూర్ఛరోగుల మూర్ఛ, కోమా, మెదడు మరణం మరియు నిద్రలేమిని గుర్తిస్తారు.

2) తరంగం: EEG యందు నమోదు చేయబడిన తరంగాలు ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి.

  1. సాధారణ ఆరోగ్యంగా ఉన్న మానవులలో ఏకరీతి తరంగాలు సహజంగా ఉంటాయి.
  2. కొన్ని న్యూరోలాజికల్ పరిస్ధితులలో తరంగాలు అసమరీతి లేదా క్రమ పద్దతి లేని తరంగాలు చెందుతాయి. అవి ఆల్ఫా, బీటా, మరియు థీటా తరంగాలు

3) ఆల్ఫా తరంగాలు: ఇవి సెకనుకు సుమారు 8-13 వలయాలను లయబద్ధంగా ఏర్పరుస్తాయి. ఈ రకమైన తరంగాలు మత్తుగా లేదా నిద్రావస్ధలో కళ్లు మూసుకొని ఉన్న వ్యక్తులలో కనిపిస్తాయి.

4) బీటా తరంగాలు: ఇవి సెకనుకు సుమారు 13-40 వలయాలను ఏర్పరుస్తాయి. వాటి కంపన పరిమితి తక్కువ ఇవి మానసికంగా బాగా క్రియాశీలంగా మరియు ఒత్తిడితో ఉన్న మనుష్యులలో ఉంటాయి.

5) డెల్టా తరంగాలు: వీటి యొక్క పౌనఃపున్యం చాలా తక్కువ సెకనుకు 3 వలయాల కంటే తక్కువ ఉంటాయి. అధిక కంపన పరిమితిని కలిగి ఉంటాయి. పూర్వ బాల్యదశలో, మెలకువగా ఉన్న స్థితిలో ఇవి సాధారణం. పెద్ద వాళ్ళలో ఇవి గాఢ నిద్రలో సంభవిస్తాయి.

6) థీటా తరంగాలు: థీటా పౌనఃపున్యం సెకనుకు 4 నుండి 7 వలయాలు. ఈ తరంగాలు 5 సంవత్సరాల కంటే
తక్కువ పిల్లల్లో సాధారణంగా ఉంటాయి. పెద్ద వాళ్ళ యందు. భావప్రధాన ఉద్విగ్నతల్లో (ఒత్తిడి) నమోదవుతాయి.

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
బాహ్య ప్రజననాన్ని సవివరంగా రాయండి.
జవాబు:
బాహ్య ప్రజననం:
మానవులు జంతువులను పెంచుట మరియు వాటిమధ్య ప్రయోగాలను జరిపి కావలసిన లక్షణాలు ఉన్న జంతువులను ఏర్పరుచుకోవటం అనేది అనాది కాలం నుండి జరుగుతున్నది.

దీనిలో రెండు రకాలు కలవు అవి 1) అంతః ప్రజననం మరియు 2) బాహ్యా ప్రజననం
అంతఃప్రజననం కొన్ని సందర్భాలలో హానికర అంతర్గత జన్యువులను బహిర్గత పరుస్తుంది.
దీని వలన జంతువులు ‘అంతః ప్రజనన మాంద్యంకు’ గురి అవుతున్నాయి.

ఈ సమస్యను అధిగమించుటకు మానవుడు అదే ప్రజననానికి చెందిన మేలు జాతి జంతువుల మధ్య సంపర్కం జరిపి మంచి ఫలితాలను పొందాడు.
బాహ్య ప్రజననం మూడు రకాలు అవి..

  1. బాహ్య సంకరణం
  2. పరసంకరణం
  3. అంతర జాతి సంకరణం

బాహ్యాప్రజననం: సంబంధం లేని జంతువుల మధ్య జరిగే ప్రజననాన్ని ‘బాహ్యాప్రజననం’ అంటారు. ఇది మూడు రకాలు
a) బాహ్యాసంకరణం: ఒకే ప్రజననాల మధ్య సంపర్కం జరుగుతుంది కాని 4-6 తరాల వరకు ఆ వంశ వృక్షంలో పూర్వికులు (లేదా) ఒకే ఉమ్మడి వంశీకుల మధ్య జరగరాదు. అటువంటి సంపర్కం ద్వారా వచ్చే సంతతిని ‘బాహ్యాసంపర్కులు’ అంటారు. పెరుగుదల రేటును మరియు పాలదిగుబడిని పెంచుటకు చాలా ఉపయోగకరమైన విధానం. అంతః ప్రజనన మాంధ్యం నుంచి బయటపడటానికి ఇది సహాయపడుతుంది.

b) పరసంకరణం: పరప్రజననం యందు ఒక మేలు జాతి మగజీవితో వేరొక మేలు జాతి ఆడజీవిని సంపర్కం చేస్తారు. అటువంటి సంపర్కం ద్వారా పుట్టిన సంతతిని ‘పరప్రజనితాలు’ అంటారు.
ఉదా: హిసారేల్ అనే కొత్త ప్రజనన గొర్రెను పంజాబ్ లోని ‘బికనీర్ యూస్’ మరియు ‘మరీనో రామ్స్’ మధ్య . సంపర్కం జరిపి అభివృద్ధి చేశారు.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 8 అనువర్తిత జీవశాస్త్రం

c) అంతర జాతి సంకరణం: ఈ విధానంలో మగ మరియు ఆడజీవులు వేరు వేరు దగ్గరి ప్రజాతులను చెందిన వాటి మధ్య సంపర్కం జరుపుతారు. వీటి సంతతి రెండు జనకుల యొక్క ఐచ్ఛిక లక్షణాలను పొందుతుంది.
ఉదా: ‘మ్యూల్’ అనే జీవి మగ గాడిదకు మరియు ఆడగుర్రం కు సంపర్కం జరపగా పుట్టినది.
‘హిన్ని’ అనే జీవి మగ గుర్రానికి మరియు ఆడ గాడిదకు సంపర్కం జరపగా పుట్టినది.
‘మ్యూల్’ ఆర్ధికపరంగా ఎంతో విలువైనది.

ప్రశ్న 2.
ECG నుంచి క్లినికల్ అనుమతులను సవివరంగా వివరించండి.
జవాబు:
ECG అనగా ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (లేదా) ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్.
‘ఇది గుండెలో కలిగే విద్యుత్ మార్పులను నమోదు చేయడానికి వాడే పద్ధతి.
ECG వరుస తరంగాలను కలిగి ఉంటుంది. ఇందులో సంక్లిష్టాలు మరియు అంతరాలు ఉంటాయి.
12 లీడ్స్ను ఛాతీ చట్టూ మరియు ధమనులు ఉన్న వివిధ ప్రాంతాలలో అమరుస్తారు. ఈ లీడ్స్ను ECG యంత్రానికి అనుసంధానిస్తారు.
తరంగాలు, అంతరాలు మరియు చికిత్సా అనుమతులు:

2) P-తరంగం: ఇది కర్ణికా విధృవణాన్ని లేదా సంకోచాల్ని సూచిస్తుంది. దీని కాలావధి 0.1 సెకను.
చికిత్సా అన్వయాలు: పెరిగిన తరంగం, పెద్దవైన లేదా పెరిగిన కర్ణికను సూచిస్తుంది.

3) QRS సంక్లిష్టం తరంగాలు : ఇది జఠరికా విధ్రువణం లేదా సంకోచాన్ని సూచిస్తుంది.
దీని కాలావధి 0.08 నుండి 0.1 సెకన్లు.
Q తరంగం చిన్న ఋణాత్మక తరంగం R తరంగం పొడవైన ధనాత్మక తరంగం
S తరంగం చిన్న ఋణాత్మక తరంగం
చికిత్సా అన్వయాలు: సంక్లిష్టంలో కాలావధి, డోలన పరిమితి, స్వరూపంలో కలిగే వైవిధ్యాలు, బండిల్ శాఖా అవరోధం, అవ్యవస్థతను తెలియజేస్తాయి.

4) T- తరంగం: ఇదీ ధనాత్మక తరంగ.ం దీని కాలావధి 0.2 సెకన్లు ఉంటుంది. ఇది జఠరికా పునఃధృవణాన్ని తెలియజేస్తుంది.
చికిత్సా అన్వయాలు: ఎత్తైన T తరంగం ‘మైపర్ కాలీమియా’ (రక్తంలో అధిక పొటాషియం) ను చిన్న చదునైన(లేదా) తిరగబడిన తరంగా ‘హైపోకాలేమియా’ (రక్తంలో తక్కువ పోటాషియం) ను సూచిస్తుంది.

5) P-R అంతరం: P తరంగం ప్రారంభానికి మరియు Qతరంగా ప్రారంభానికి మధ్య ఉన్న అంతరాన్ని P-R అంతరం అంటారు. దీని కాలావధి 0.12 నుండి 0.2 సెకన్లు ఉంటుంది.
చికిత్సా అన్వయాలు : P-R అంతరం కాలావధి పెరిగినట్లయితే సిరాకర్ణికా కణువు నుంచి కర్ణికాజఠరికా కణపు AVనోడ్ కు జరిగే ప్రసరణ వహనపు ఆలస్యాన్ని తెలియజేస్తుంది. దీని అర్ధం గుండే స్పందన తక్కువ అని దీనినే ‘బ్రాడీ కార్టియా’ అంటారు. P-R అంతరం ఎక్కువగా ఉంటే గుండెస్పందన ఎక్కువ అని, దీనినే ‘టాకీకార్డియా’
అంటారు.

6) Q-T అంతరం: Q తరంగం ప్రారంభానికి మరియు T -తరంగం అంతానికి మధ్య ఉన్న అంతరాన్ని Q-T అంతరం అంటారు. ఇది హృదయరేటుపై ఆధారపడి ఉంటుంది. దీనికాలావధి 0.4 సెకన్లు ఉంటుంది. హృదయరేటు అధికంగా ఉంటే ఈ అంతరం తక్కువగా ఉంటుంది.
చికిత్సా అన్వయాలు:QT అంతరం ఎక్కువ సేపు ఉన్నట్లయితే ‘మయోకార్డియల్షన్ఇన్ఫారిక్షన్’ (గుండెపోటు) మరియు హైపోథైరాయిడిజమన్ను సూచిస్తుంది. అనగా రక్తం నందు థైరాక్సిన్ హార్మోన్ తక్కువగా ఉన్నట్లు సూచిస్తుంది. అంతరం తక్కువ ఉంటే హైపర్ కాల్సీమియా’ (రక్తంలో కాల్షియం అధికం)ను సూచిస్తుంది.

7) ST అంతరం: S-Tఖండం S తరంగ అంతానికి మరియు T తరంగ ప్రారంభానికి మధ్య ఉంటుంది. ఇది సమవిద్యుత్ లేదా శూన్య ఓల్టేజి కాలం.
చికిత్సా అంతరం: S-T ఖండం పెరిగినట్టయితే ‘మయోకార్డియల్ ఇన్ఫారిక్షన్’ (గుండె పోటును సూచిస్తుంది. ఈ రకంగా ECG గుండె మరియు గుండెస్పందన కు ఉన్న విధుల లోపాలను తెలియజేస్తుంది.

Leave a Comment