AP Inter 2nd Year Zoology Important Questions Chapter 7 జీవ పరిణామం

Students get through AP Inter 2nd Year Zoology Important Questions 7th Lesson జీవ పరిణామం which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Zoology Important Questions 7th Lesson జీవ పరిణామం

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
పాన్స్పెర్మియా అంటే ఏమిటి? [TS MAR-17]
జవాబు:

  1. పానెస్పెర్మియా పరిణామ సిద్ధాంతం ప్రకారం, జీవం అనేది విశ్వంలో ఎక్కడో నిరోధక శక్తి కలిగిన సిద్ధ బీజాల రూపంలో ఉండి ఉంటుంది. దీనినే ‘పాన్స్పెర్మియా’ అని అంటారు.
  2. ఈ జీవం అనుకోకుండా భూమిని చేరి ఉంటుంది.

ప్రశ్న 2.
జీవ పూర్వద్రవం పదాన్ని నిర్వచించండి. దీనినెవరు ఆవిష్కరించారు?
జవాబు:

  1. ‘జీవపరిణామ సిద్ధాంతం’ ప్రకారం హైడ్రోకార్బన్లు అమ్మోనియా మరియు నీటితో చర్యజరిపి వివిధరకాల కర్బన అణువులైన చక్కెరలు, అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, ప్యూరిన్ మరియు పిరమిడిన్లను ఏర్పరిచాయి. తరువాత ప్యూరిన్లు మరియు పిరమిడిన్లు న్యూక్లియోసైడ్లు మరియు న్యూక్లియోటైడ్లను ఏర్పరిచాయి.
  2. ఈ సిద్ధాంతాన్ని ఇంగ్లండ్కు చెందిన ‘J.B.S హాల్డేన్ ‘ సమర్ధించారు.

AP Inter 2nd Year Zoology Important Questions 7th Lesson జీవ పరిణామం
ప్రశ్న 3.
నిజకేంద్రక జీవులు ఏ విధంగా పరిణామం చెందాయి?
జవాబు:
నిజకేంద్రక జీవులు బహుశ రెండు పద్ధతుల ద్వారా ఏర్పడి ఉంటాయి.

  1. కొన్ని వాయు సహిత బాక్టీరియాలు, అవాయు కేంద్రక పూర్వజీవిలోనికి ప్రవేశించి తరువాత పరిణామ క్రమంలో మైటో కాండ్రియంగా మార్పుచెంది వాటి నుండి ‘ఆదిమ నిజకేంద్రక జీవులు’ ఉద్భవించాయి.
  2. ప్లాస్మాత్వచం అంతర్వర్తనం చెందడం ద్వారా త్వచనిర్మిత కణాంగాలు ఏర్పడి వాటి నుండి నిజకేంద్రక జీవులు ఉద్భవించాయి.

ప్రశ్న 4.
యురే, మిల్లర్లు తమ ప్రయోగంలో ప్రాథమిక వాతావరణాన్ని అనుకరించడానికి మిశ్రమంలో ఉపయోగించిన సంఘటనాంశాలేవి?
జవాబు:
యురే మరియు మిల్లర్ ప్రయోగశాలలో ప్రాధమిక వాతావరణాన్ని ఏర్పరచడానికి, నీటి ఆవిరి, మీథేన్, అమ్మోనియా మరియు హైడ్రోజన్ ల మిశ్రమాన్ని వినియోగించారు.

ప్రశ్న 5.
మీరు అధ్యయనం చేసిన ఏవేని నాలుగు సజీవ సేతువులను తెలపండి. [TS MAY-17]
జవాబు:
సంధాన సేతువులు:

  1. చేపలకు మరియు ఉభయచరాలకు మధ్య ఉండే సజీవ సేతువు యూస్తినో ప్టెరాన్.
  2. ఉభయచరాలు మరియు సరీసృపాలకు మధ్య ఉండే సజీవ సేతువు సైమూరియా.
  3. సరీసృపాలకు మరియు పక్షులకు మధ్య ఉండే సజీవ సేతువు ఆర్కియోప్టెరిక్స్.
  4. సరీసృపాలకు మరియు క్షీరదాలకు మధ్య ఉండే సజీవ సేతువు సైనోనేథస్.

ప్రశ్న 6.
జీవ జన్యు సిద్దాంతాన్ని (పునరావృత సిద్ధాంతాన్ని) నిర్వచించి దానికి ఒక ఉదాహరణను పేర్కొనండి. [ISM-17][AP M-20]
జవాబు:

  1. జీవ జన్యు సిద్ధాంతం (పునరావృత సిద్ధాంతం): ఈ సిద్ధాంతం ప్రకారం ‘ఒక జీవి జీవితచరిత్ర ఆ జీవి వర్గవికాస చరిత్రను పునరావృతం చేస్తుంది’. అనగా అభివృద్ధి దశలు వాటి పూర్వీకుల పరిణామ చరిత్రను పునరావృత్తం చేస్తాయి. ఉదా: (i) సీతాకోక చిలుక గొంగళిపురుగు దశ, అనెలిడా జీవుల దేహన్ని పోలి ఉంటుంది.
  2. ఉభయచరాల టాడ్పోల్ చేపలాగా తోక, రెండు గదుల హృదయం, మొప్పలను కలిగి ఉంటుంది.

ప్రశ్న 7.
అటావిజమ్ను ఉదాహరణతో నిర్వచించండి. [AP,TS MAR-20][ TS MAR-16][ TS MAY-17]
జవాబు:

  1. అటావిజం: అభివృద్ధి చెందిన దశలో అవశేషావయవాలు ఆకస్మికంగా పునరావృతమయ్యే విధానాన్ని ‘అటావిజం’ అంటారు.
  2. ఉదా: మానవుల శిశువు పుట్టుకతోనే తోకను కలిగి ఉండటం.

AP Inter 2nd Year Zoology Important Questions 7th Lesson జీవ పరిణామం

ప్రశ్న 8.
లామార్క్ ఆర్జితగుణాల ఆనువంశిక వాదానికి వ్యతిరేకంగా రెండు ఉదాహరణలు పేర్కొనండి.
జవాబు:

  1. ఉదా: 1. క్రీడాకారులలో అభివృద్ధి చెందిన కండరాలు తరువాత తరానికి సంక్రమించడం జరుగదు.
  2. ఉదా: 2 ఆభరణాల అలంకరణ కోసం చెవి తమ్మెకు రంధ్రాలు పొడవడం భారతదేశంలో ఆచరణలో ఉంది. కాని ఏ ఆడ శిశువు రంధ్రాలతో కూడిన చెవి తమ్మెలలో జన్మించలేదు.

ప్రశ్న 9.
ప్రకృతి వరణం అనే ఆలోచన విధానాన్ని రూపొందించడంలో డార్విన్ను ప్రభావితం చేసిన వారెవరు?
జవాబు:
ప్రకృతి వరణం అనే ఆలోచన విధానాన్ని రూపొందించడంలో డార్విన్ను ప్రభావితం చేసిన గ్రంథాలు – రచయితలు.

  1. “ఎస్సే ఆన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్” -ధామస్ మాల్తుస్.
  2. “ ప్రిన్సిపిల్స్ ఆఫ్ జియాలజీ” – సర్ ఛార్లెస్ లయల్.
  3. ‘ మూల రకం నుంచి విడిపోయే ఉన్ముఖత్వం ప్రదర్శించే రకాలు’- ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్

ప్రశ్న 10.
డార్విన్, లామార్క్ సిద్ధాంతాలలో ఏకీభవించే అంశం ఏది?
జవాబు:

  1. డార్వినిజమ్ మరియు లామార్కిజమ్ రెండు సిద్ధాంతాలు ఏకీభవించే అంశం ‘వైవిధ్యాలను కలిగి ఉండటం’.
  2. లామార్కిజమ్ సిద్ధాంతం ప్రాధమికంగా గుర్తించిన సాంకేతిక అంశం “పరిసరాలకు అనుకూలనంగా మారటం” డార్వినిజమ్ సిద్ధాంతం కూడా ‘మనుగడ కోసం పోరాటం’ అనే అంశంను తెలియజేస్తుంది. ‘ఉపయోగకరమైన వైవిధ్యాలు’ ఏర్పడినపుడు మాత్రమే జీవి మనుగడ సాగించగలుగుతుంది.

ప్రశ్న 11.
జన్యుభారం అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి. [TS MAR-20]
జవాబు:
1) జన్యుభారం: జనాభాలో హానికరమైన జన్యువులు ఉండటాన్ని ‘జన్యుభారం’ అంటారు. ఉదా:సికిల్ సెల్ ఎనిమియా కారక జన్యువులు.

2) సమయుగ్మజ ‘సికిల్ సెల్’ ఎనీమియా జన్యువు (రెండు జన్యువులు అంతర్గత) కలిగిన మానవులు మాత్రమే త్వరగా మరణిస్తారు.

3) విషమయుగ్మజ (ఒక జన్యువు బహిర్గతం మరియు రెండవది అంతర్గతం) జన్యువు కలిగిన మానవులు ఎక్కువ కాలం బతుకుతారు మరియు మలేరియా వ్యాధికి నిరోధకతను కలిగి ఉంటారు.

ప్రశ్న 12.
అల్లోపాట్రిక్ జాతులు, సింపాట్రిక్ జాతుల మధ్య విభేదాలను తెలపండి.
జవాబు:
అల్లోపాట్రిక్ జాతులు

  1. భౌగోళిక వివక్తత ద్వారా కొత్త జాతులు ఏర్పడితే వాటిని అల్లో పాట్రిక్ జాతులు అంటారు.

సింపాట్రిక్ జాతులు

  1. భౌగోళికంగా ఒకే నిర్దేశిత భూభాగంలో జీవించి ఉండే జీవుల నుండి కొత్త జాతులు ఏర్పడితే వాటిని సింపాట్రిక్ జాతులు అంటారు.

AP Inter 2nd Year Zoology Important Questions 7th Lesson జీవ పరిణామం

ప్రశ్న 13.
తోకలేని కోతి, మానవుడి లాంటి ప్రైమేట్ల శాస్త్రీయ నామాన్ని తెలపండి. ఏ మానవుడి లాంటి ప్రైమేట్ మొట్టమొదటగా శరీరాన్ని ఆచ్చాదన చేసుకొన్నాడు?
జవాబు:

  1. తోకలేని కోతి శాస్త్రీయ నామము – డ్రయోపిథికస్
  2. మానవుడి లాంటి ప్రాధమిక ప్రైమేట్ – రామాపిథికస్
  3. మొట్టమొదటిసారి శరీరాన్ని రక్షించుకోవడానికి ఆచ్ఛాదన చేసుకొన్న ప్రైమేట్ – హోమోనియాండర్తలెన్సిస్

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
నిర్మాణసామ్య, క్రియాసామ్య అవయవాలు గురించి వివరించండి. [AP,TS MAY-19][ TS MAY-17][ AP MAR-19,18,17,15][ TS MAR-15,18]
జవాబు:
నిర్మాణసామ్య అవయవాలు

  1. నిర్మాణం మరియు పుట్టుకలో ఒకే రకంగా ఉండి, వేర్వేరు విధులను నిర్వర్తించే అవయవాలను ‘నిర్మాణ సామ్య అవయవాలు’ అంటారు.
  2. ఇటువంటి అవయవాలు ‘ఉపయుక్త వికిరణం’ (లేదా) ‘అపసార పరిణామంను’ చూపిస్తాయి.
  3. ఉదా: పక్షుల రెక్కలు మరియు సీతాకోక చిలుక రెక్కలు
  4. పైన పేర్కొన్న జీవుల అవయవాలు అన్ని కూడా ఒక రకమైన ఎముకను కలిగి ఉన్నప్పటికి బాహ్యస్వరూపం మరియు విధులలో తేడాను కలిగి ఉంటాయి.

క్రియాసామ్య అవయవాలు

  1. పుట్టుకలో మరియు నిర్మాణంలో వేరు వేరుగా ఉన్నప్పటికి, ఒకే రకమైన విధులను నిర్వర్తించే అవయవాలను ‘క్రియాసామ్య అవయవాలు’ అంటారు.
  2. ఇవి ‘అభిసరణ పరిణామం’ ను చూపిస్తాయి.
  3. ఉదా: సకశేరుకాల పూర్వాంగాలు, తిమింగలం తెడ్డు, మానవుడి చేయి, మరియు గబ్బిలం రెక్క
  4. ఒకే ఆవాసంలో నివశిస్తూ ఒకే రకమైన జీవనాన్ని సాగించే జీవులు శరీర నిర్మాణంలో సారూప్యతను ప్రదర్శిస్తాయి.

ప్రశ్న 2.
ఉత్పరివర్తన సిద్ధాంతం గురించి లఘుటీక రాయండి. [TS MAY -19][AP MAR-15]
జవాబు:

  1. ఉత్పరి వర్తనాలు: జీవులలో హఠాత్తుగా, యాదృచ్ఛికంగా కలిగే అనువంశికత మార్పులను ‘ఉత్పరివర్తనాలు’ అంటారు.
  2. ఈ ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని “హ్యుగోడివ్రీస్” ప్రతిపాదించాడు.
  3. ‘ఈనోధీరా లామార్కియానా’ అనే శాస్త్రవేత్త ‘ఈవినింగ్ ప్రైమ్ రోజ్ మొక్క’ పై పరిశోధనలు జరిపాడు.
  4. ఈనోధీరామొక్క యందు నాలుగు రూపాలు ఉన్నాయని కనుగొన్నారు.
    (i) చిన్న కీలకం – ఈ . బ్రివిస్టైలిస్
    (ii) నునుపైన పత్రాలు – ఈ. లెవిఫోలియా
    (iii) పెద్ద రూపం – ఈ. జైగాస్
    (iv)మరుగుజ్జు రూపం – ఈ. ననెల్లా
  5. ఈ నాలుగు రూపాలు ఉత్పరివర్తన రూపాలు.
  6. ‘డార్విన్ ఉత్పరివర్తనాలను ‘ప్రకృతిక్రీడలు లేదా లంఘనాలు’ అని వర్ణించాడు.
  7. ‘బేట్సన్’ అనే శాస్త్రవేత వీటిని ‘విచ్చిన్న వైవిధ్యాలు’ అని పేర్కొన్నాడు.

ఉత్పరివర్తన సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు:

  1. సహజంగా ప్రజననం జరిపే జనాభాలోని జీవులలో ఉత్పరివర్తనాలు కాలానుగుణంగా సంభవిస్తాయి.
  2. ఉత్పరివర్తనాలు విచ్ఛిన్నంగా ఉంటూ తరతరాలికి సంచితం కాకుండా ఉంటాయి.
  3. ఉత్పరివర్తనాలు పరిపూర్ణమైనవి. వాటిలో మాధ్యమిక దశలు ఉండవు.
  4. ఇవి ప్రకృతి వరణానికి గురవుతాయి.

ప్రశ్న 3.
పారిశ్రామిక శ్యామలత్వం ఆధారంగా డార్విన్ ప్రకృతి వరణ సిద్ధాంతాన్ని వివరించండి. [AP.MAR-18,17,16][ TS MAR-15,16,17,19]
జవాబు:

  1. డార్విన్ యొక్క ప్రకృతి వరణ సిద్ధాంతం, ప్రకృతిలో పరిణామం ఏవిధంగా సంభవించిందో తెలియజేస్తుంది.
  2. ప్రకృతి వరణం సంభవిస్తుందని తెలపడానికి ఒక శాస్త్రీయ ఉదాహరణగా ‘పారిశ్రామిక శ్యామలత్వంను’ గురించి చెప్పవచ్చును. ఇది పెప్పర్డ్ మాత్ అనబడే ‘బిస్టన్ బెట్యూలేరియా’ చే ప్రదర్శించబడింది.
  3. ఈ మాత్లు రెండు రకాల వర్ణాలలో లభిస్తాయి. అవి బూడిద మరియు నలుపు రంగు.
  4. పారిశ్రామిక విప్లవానికి ముందు, ఇంగ్లాండ్ నందు బూడిద రంగు మాత్లు అధికంగా ఉండేవి.
  5. ఇంగ్లాండ్ నందు పరిశ్రమల అభివృద్ధి జరిగిన తరువాత నలుపు రంగు మాత్లు అధికంగా మరియు బూడిద రంగు మాత్లు తక్కువగా కనిపించాయి.
  6. పారిశ్రామికీకరణం వల్ల, కాలుష్యం అధికంగా విడుదలై చెట్ల బెరడుపై మసి చేరటం వలన అవి నలుపుగా మారాయి.
  7. కావున బూడిద రంగు మాత్లు నల్లబెరడుపై భక్షకజీవులకు సులభంగా కనిపించి వాటికి ఆహారంగా మారాయి.
  8. దీనివల్ల జనాభాలో బూడిదరంగు మాత్ల సంఖ్య తగ్గి నలుపురంగు మాత్ల సంఖ్య పెరిగింది.
  9. ఈ రకంగా ప్రకృతివరణం మెలనిక్ మాత్లు(నలుపు) వాటి సంఖ్యను పెంచుకోవడానికి అనుకూలంగా ఉండెను.
  10. పారిశ్రామిక కాలుష్యం ఆధారంగా ముదురు వర్ణ రూపాలలో సంభవించే ‘ప్రకృతివరణం’ను పారిశ్రామిక శ్యామలత్వం అని అంటారు.

AP Inter 2nd Year Zoology Important Questions 7th Lesson జీవ పరిణామం

ప్రశ్న 4.
జీవపరిణామంలో వివిధ వరణాల పాత్రను చర్చించండి. [TS MAR-19]
జవాబు:
జీవపరిణామ బలాల దృష్ట్యా ప్రకృతి వరణం మూడు రకాలు.
1) స్ధిరీకరణ వరణం: ఇది స్థిరమైన పర్యావరణంలో సంభవిస్తుంది. ఈ విధానం నందు జీవుల యొక్క సగటు దృశ్యరూపాలు నిల్వచేయబడతాయి. దృశ్యరూపాలు కలిగిన జీవులు తొలగించబడతాయి. కాబట్టి ఈ వరణం పరిణామ మార్పులను ప్రోత్సహించదు. ఇది దృశ్యరుప స్థిరత్వాన్ని అనేక తరాల వరకు నిలుపుతుంది.
ఉదా: ఇంగ్లాండ్లో జన్మించిన నవజాత శిశువుల బరువును అధ్యయనం చేసారు సగటు బరువు అయిన 8 పౌండ్ల కంటే అతి తక్కువ లేదా ఎక్కువ ఉన్న వారిలో మరణాలు అధికంగా సంభవించాయి.

2) దిశాయుత వరణం: ఈ రకమైన వరణం క్రమంగా మార్పులు కలిగే పర్యావరణంలో సంభవిస్తుంది. ఒక అంత్యంలో జీవులు క్రమంగా తొలగించబడతాయి. సగటు విలువలు క్రమేణా మరో అనుకూల అంత్యం వైపుకు మార్చబడతాయి.

ఉదా 1 : పొడవైన జీరాఫీలో ‘మెడ మధ్యమ లేదా సగటు విలువ’ క్రమంగా ‘పొడవు మెడ వైపు’కు జరిగింది. ఒక సారి దృశ్యరూప సగటు విలువ కొత్త యుక్తతమ వాతావరణ పరిస్థితులలో ఏకీభవించినపుడు దిశాయుత వరణం ఆగి స్ధిరీకరణ వరణం ప్రారంభమవుతుంది. జిరాఫి తల చెట్టు చివరకు వరకు సాగుతుంది.

ఉదా 2: DDT నిరోధకత: DDT కి నిరోధక శక్తిని కలిగిన దోమలు జీవించగలిగాయి మరియు ఆ దోమలు DDT కి నిరోధకతను వృద్ధి చేసుకున్నాయి. తట్టుకోలేని రకాలు నశింపబడ్డాయి.’

3) విచ్ఛిత్తి వరణం: ఈ వరణం నందు సమజాతీయ వాతావరణం, విషమ జాతీయ వాతావరణంగా మారడం జరుగుతుంది. అంత్యాల వద్ద గల దృశ్యరూపాజీవులు మనుగడ సాగించి, విడిపోయి వేరే జనాభాగా పెరుగుతాయి. దీనినే ‘ఉపయుక్త వికిరణం’ అని కూడా అంటారు.
ఉదా: నలుపు మరియు బూడిద వర్ణ పెప్పర్డ్ మాత్

ప్రశ్న 5.
నియోడార్వినిజం గురించి లఘుటీక రాయండి. [AP MAR-20][AP MAY-19]
జవాబు:
R.A ఫిషర్, సేవాల్ రైట్ మరియు ఎర్నెస్ట్ మేయర్ అనే శాస్త్ర వేత్తలు డార్విన్ అనంతర ఆవిష్కరణలను దృష్టిలో పెట్టుకొని ప్రకృతివరణాన్ని వివరించారు. ‘నియోడార్వినిజమ్’ (లేదా) ‘ఆధునిక జీవపరిణామ సంశ్లేషణ’ సిద్ధాంతం ప్రకారం ఐదు ప్రాధమిక కారకాలు జీవపరిణామంలో పాల్గొంటాయి. అవి
1) జన్యు ఉత్పరివర్తనాలు: జన్యు (DNA) నిర్మాణంలో సంభవించే మార్పులను ‘జన్యు ఉత్పరివర్తనాలు’ (లేదా) ‘బిందు ఉత్పరివర్తనాలు’ అంటారు. DNA లోని మార్పులు దృశ్యరూపాలను మారుస్తాయి మరియు సంతానంలో వైవిధ్యాలను ఏర్పరుస్తాయి.

2) క్రోమోజోమల్ ఉత్పరివర్తనాలు: క్రోమోజోమల్ యొక్క సంకలనం, పరిత్యాగం, విలోమం మరియు ద్విగుణీకరణం అనేవి క్రోమోజోమల్ ఉత్పరివర్తనాల క్రిందకు వస్తాయి. ఇవి దృశ్యరూపాలను మారుస్తాయి.

3) జన్యు పునఃసంయోజనం: క్షయకరణ విభజన యందు క్రోమోజోమ్ ముక్కల వినిమయం, జన్యువుల మార్పు అనేవి అనువంశిక వైవిధ్యాలను కలుగజేస్తాయి.

4) ప్రకృతి వరణం: ఇది ఎటువంటి జన్యు మార్పులను కలిగించదు, మార్పులు జరిగితే వాటిలో ఉపయోగపడే వాటిని మాత్రమే ఆమోదిస్తుంది. ఎన్నుకోబడిన వైవిధ్యాలు తరువాత తరానికి కొనసాగింపబడతాయి.

5) ప్రత్యుత్పత్తి వివక్తత: ఎటువంటి కారణం చేతనైనా జనాభాల మధ్య జన్యు మార్పిడి జరగకుండా ఉండటాన్ని ‘ప్రత్యుత్పత్తి వివక్తత’ అంటారు ఇటువంటి ‘ప్రత్యుత్పత్తి వివక్తత’ కలిగిన సమూహాలు కొత్త జాతి ఆవిర్భావానికి దారితీస్తాయి.

ప్రశ్న 6.
100 కుందేళ్లు హార్డీ మెయిన్ బర్గ్ జనాభాలో, 24 సమయుగ్మజ పొడవు చెవి కుందేళ్ళు, పొట్టి చెవి లక్షణం పొడవు చెవి లక్షణానికి అంతర్గత లక్షణం. ఒక జన్యువుకు కేవలం రెండు యుగ్మవికల్పాలు ఉన్నాయి అయితే కుందేళ్ళ అంతర్గత యుగ్మవికల్పం పౌనఃపున్యం కనుక్కోండి.
జవాబు:
మొత్తం కుందేళ్ళ సంఖ్య= 100
సమయుగ్మజ పొడవు చెవి ఉన్న కుందేళ్ళు =24.
పొట్టిచెవి లక్షణం అంతర్గతం
అంతర్గత యుగ్మ వికల్పం పౌనఃపున్యం కనుగొనుట:
బహిర్గత జన్యురక పౌనఃపున్యం
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 7 జీవ పరిణామం 1
P2 = 0.24
P2 = 0.24 ⇒ P= √24 = 0.49 (సుమారుగా)
p అనేది బహిర్గత యుగ్మవికల్పాల పౌనఃపున్యం మరియు q అనేది అంతర్గత యుగ్మ వికల్పాల పౌనఃపున్యం. కావున p+q = 1 ⇒ q = 1 – p = 1-0.49 = 0.51
కుందేళ్ళ యొక్క అంతర్గత యుగ్మవికల్ప పౌనఃపున్యం = 0.51.

ప్రశ్న 7.
జన్యు విస్థాపన అంటే ఏమిటి? స్థాపక జీవుల ప్రభావం ఉదాహరణగా తీసుకొని జెనెటిక్ విస్థాపనను వివరించండి. [TS MAR-18,20][ AP MAR-16,19]
జవాబు:
1) జన్యువిస్ధాపన: చిన్న జనాభాలో వరణం వల్ల కాకుండా యాదృచ్ఛికంగా జన్యు పౌనః పున్యంలో జరిగే మార్పును ‘జన్యువిస్ధాపన (లేదా) ‘సీవాల్ రైట్ ప్రభావం’ అంటారు.

2) ఒక జన్యువు రెండు యుగ్మ వికల్పకాలను కలిగి ఉండి ఒక యుగ్మవికల్ప పౌనఃపున్యం 1% అయినట్లయితే చిన్న జనాభాలో ఆ యుగ్మవికల్పాన్ని యాదృచ్చికంగా కోల్పోయే అవకాశం ఎక్కువ. అంతిమ ఫలితం అనేది యుగ్మ వికల్పా అవకాశం ఆ జనాభా పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.

AP Inter 2nd Year Zoology Important Questions 7th Lesson జీవ పరిణామం

3) జన్యువీస్ధాపన తక్కువ పౌనః పున్యం కలిగిన యుగ్మ వికల్పాలను తొలగించడం ద్వారా జనాభా యందు జన్యు వైవిధ్యాల పరిమాణాన్ని తగ్గిస్తుంది. జన్యువిస్థాపన ‘స్థాపక జీవుల ప్రభావం’ ద్వారా వివరించవచ్చును.

4) స్ధాపక జీవుల ప్రభావం: చిన్న జీవుల సమూహం మూల జనాభా నుంచి వేరయి కొత్త సహనివేశాన్ని వివక్త ప్రాంతంలో ప్రారంభిస్తే వాటిని కొత్త ‘జనాభా స్థాపకులు’ అంటారు. వీటి సంతతి జీవుల పౌనఃపున్యాలు తమ పూర్వీక పితృజనాభా పౌనఃపున్యాల కంటే వాటిని ప్రారంభించిన స్ధాపకుల పౌనఃపున్యాలను పోలి ఉంటాయి.
ఉదా : రెడ్ ఇండియన్స్ 100% O+ve రక్త సముదాయాన్ని కలిగి ఉంటారు. రెడ్ ఇండియన్ తెగలోని పూర్వీకులు అధికంగా O+ve సముదాయం కలిగి ఉండి ఇతర జనాభాల నుంచి ప్రత్యుత్పత్తి పరంగా తమని తాము వేరు చేసుకొన్నారు.

Leave a Comment