AP Inter 2nd Year Zoology Important Questions Chapter 4(a) అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం

Students get through AP Inter 2nd Year Zoology Important Questions Lesson 4a అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Zoology Important Questions Lesson 4(a) అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
ఆక్రోమెగాలి అంటే ఏమిటి? ఈ అపస్థితిని కలుగజేసే హార్మోన్ పేరు రాయండి. [AP MAR-15][TS MAR-17]
జవాబు:

  1. ఆక్రోమెగాలి అనేది హార్మోనులు అపస్థితి. పిట్యూటరీ గ్రంధి స్రవించే సొమాటోట్రోపిన్ హార్మోన్ లేదా పెరుగుదల హోర్మోన్ అధికస్రావం వలన ఇది జరుగుతుంది.
  2. ఈ వ్యాధి లక్షణాలు: దవడ, కాళ్లు మరియు చేతుల యొక్క ఎముకలు అసాధారణ పెరుగుదల, ముక్కు పెదవులు మరియు కనురెప్పలు మందంగా ఉండుట, అంగాల కొనలు వెడల్పుగా గొరిల్లా ఆకారాన్ని కలిగి ఉండుట.

ప్రశ్న 2.
యాంటిడైయూరిటిక్ హార్మోన్ అని దేనినంటారు? దీన్ని స్రవించే గ్రంథి పేరు రాయండి. [TS MAY-22]
జవాబు:

  1. ‘వాసోప్రెస్సిన్’ హార్మోన్ను ‘యాంటి డై యూరిటిక్’ హార్మోన్ అని అంటారు. [AP MAY-19]
  2. దీనిని స్రవించే గ్రంథి ‘న్యూరో హైపోఫైసిస్ (పరపిట్యూటరీ)’.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 4(a) అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం
ప్రశ్న 3.
బాల్యంలో పరిమాణం పెరుగుతూ, యుక్త వయస్సులో పరిమాణం తగ్గే గ్రంథి పేరేమి? సాంక్రమణ జరిగినప్పుడు ఈ గ్రంధి పోషించే పాత్ర ఏమిటి? [AP MAR-19]
జవాబు:

  1. ‘ధైమస్ గ్రంది’ శిశువుగా ఉన్నప్పటి నుంచి పెరుగుదలను ప్రారంభించి, యవ్వనారంభంలో గరిష్ట పరిమాణానికి చేరుతుంది. వయోవృద్ధులలో ఇది క్షీణించిపోతుంది.
  2. ఈ హార్మోన్T-లింఫోసైట్ల విభేదనంలో పొల్గొని ‘కణనిర్వర్తిత రోగనిరోధకత’ కు సహాయపడుతుంది. ఇది ప్రతిదేహాలు ఏర్పడటంలో సహాయపడి తద్వారా ‘దేహద్రవ నిర్వర్తిత రోగనిరోధకత’కు ఉపకరిస్తుంది.

ప్రశ్న 4.
డయాబెటిస్ ఇన్సిపిడస్, డయాబెటిస్ మెల్లిటస్ల మధ్యగల భేదాన్ని వివరించండి. [APMAR-16,20,22][TSMAY–17]
జవాబు:
డయాబెటిస్ ఇన్సిపిడస్

  1. దీనియొక్క లక్షణాలు అధికమూత్రం మరియు తీవ్రదాహం.
  2. ఇది వాసోప్రెస్సిన్ యొక్క అధిక విడుదల వలన కలుగుతుంది.

డయాబెటిస్ మెల్లిటస్

  1. దీని యొక్క లక్షణాలు చక్కెర కలిగిన అధిక మూత్రం మరియు కీటోన్ దేహాల విడుదల
  2. ఇది ఇన్సులిన్ యొక్క అల్పోత్పత్తి వలన కలుగుతుంది.

ప్రశ్న 5.
లాంగర్ హాన్స్ పుటికలని వేటినంటారు?
జవాబు:

  1. ‘క్లోమం’ యొక్క అంతస్రావక భాగమును ‘లాంగరోన్స్ పుటికలు’ అంటారు.
  2. ఇది ఆల్ఫా మరియు బీటాకణాలను కలిగి ఉంటుంది. ఇవి ‘గ్లూకగాన్ మరియు ఇన్సులిన్’ను సవిస్తాయి.

ప్రశ్న 6.
ఇన్సులిన్ షాక్ అంటే ఏమిటి? [AP MAR-15,18]
జవాబు:

  1. ఇన్సులిన్ షాక్: చక్కెర వ్యాధి కలిగిన వ్యక్తి యొక్క దేహంలోని ఇన్సులిన్ అధికోత్పత్తి లేదా అధిక స్రావత వల్ల రక్తంలో ‘గ్లూకోజ్ స్థాయి’ పడిపోతుంది. దీనినే ఇన్సులిన్ షాక్ అంటారు.
  2. దీనియొక్క లక్షణం హైపర్ గ్లైసీమియా – రక్తంలో ఇన్సులిన్ తక్కువ స్రవించబడటం వలన గ్లూకోజ్ స్థాయి తగ్గిపోతుంది.

ప్రశ్న 7.
పోరాట, పలాయన హార్మోన్ అని దేనినంటారు? [TS MAY-22] [TS MAR-15]
జవాబు:

  1. ‘ఎడ్రినాలిన్’ ( ‘ఎపినెఫ్రిన్’) మరియు ‘నార్ ఎడ్రినాలిన్’ (‘నార్ ఎపినెఫ్రిన్’). ఈ రెండు హర్మోనులను ‘పోరాట’ లేదా ‘పలాయన హర్మోన్లు అంటారు.
  2. ఇవి అధివృక్క దవ్వ ద్వారా ఒత్తిడి మరియు అత్యవసర పరిస్థితులకు అనుక్రియగా స్రవించబడతాయి.

ప్రశ్న 8.
ఆండ్రోజెన్లను వేటినంటారు? వీటిని స్రవించే కణాలేవి? [AP MAY-19]
జవాబు:

  1. ‘ఆండ్రోజెన్లు’ అనేవి పురుష లైంగిక హార్మోనులు ఉదా: టెస్టోస్టిరాన్
  2. వీటిని స్రవించే కణాలు ముష్కాలు యందు ఉన్న ‘లీడిగ్ కణాలు’.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 4(a) అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం

ప్రశ్న 9.
ఎరిత్రోపోయిటిన్ అంటే ఏమిటి? దీని విధి ఏమిటి? [AP MAR-19]
జవాబు:

  1. మూత్రపిండంలోని ‘గుచ్చసన్నిధి కణాలు’ (జక్టా గ్లామిరూలార్ కణాలు) స్రవించే హార్మోను ఎరిత్రోపోయిటిన్’ అంటారు.
  2. దీని విధి : అస్థిమజ్జ యందు ‘ఎర్ర రక్తకణాల’ ఉత్పాదన ప్రక్రియను ప్రేరేపించుట.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
మానవులలో అంతస్రావక గ్రంధులను, అవి స్రవించే హార్మోన్లను పేర్కొనండి. మానవులలోని అంతస్రావక గ్రంధులు – స్రావాలు:
జవాబు:
I) సోమాటోకైనిన్: ఇది దేహానికి అవసరమయ్యే హార్మోనుల విడుదలను ప్రేరేపిస్తుంది.

II) సోమాటోస్టాటిన్: ఇది హార్మోన్ విడుదలను నిరోధిస్తుంది.

III) పిట్యూటరీ గ్రంధి: ఈ గ్రంధి మూడు భాగాలను కల్గి ఉంటుంది. అవి
a) ఎడినో హైపోఫైసిస్
b) పార్స్ ఇంటర్మీడియా
c) న్యూహైపోఫైసిస్

a) ఎడినో హైపోఫైసిస్

  1. పెరుగుదల హర్మోన్ (GH సోమాటోట్రోపిన్ )
  2. ప్రోలాక్టిన్ (లాక్టోజెనిక్ హార్మోన్)
  3. థైరాయిడ్ ప్రేరక హార్మోన్ (TSH (లేదా) ధైరోట్రోపిన్)
  4. ఎడ్రినోకార్టికో ట్రోపిక్ హార్మోన్ (ACTH)
  5. పుటికాప్రేరక హార్మోన్ (FSH)
  6. ల్యుటినైజింగ్ హార్మోన్ (LH)

b) పార్క్స్ ఇంటర్మీడియా: మెలనోసైట్ ప్రేరక హార్మోన్ (MSH)

c) న్యూరో హైపోపైసిస్:

  1. ఆక్సిటోసిన్
  2. వాసోప్రెస్సిన్ (ADH యాంటీ డై యూరిటిక్ హార్మోన్)

III) పీనియల్ గ్రంధి: ఇది మెలటోనిన్ ను స్రవిస్తుంది.

IV) థైరాయిడ్ గ్రంధి: ఇది 1) థైరాక్సిన్ మరియు 2) కాల్సిటోనిన్ అనే రెండు హార్మోనులను స్రవిస్తుంది.

V) పారా థైరాయిడ్ గ్రంధులు: ఇది పారాధార్మోన్ను స్రవిస్తుంది.

VI) థైమస్ గ్రంధి (లేదా) బాల గ్రంధి : ఇది ‘ధైమో సిన్లు’ అనే పెప్టైడ్ హార్మోన్లను స్రవిస్తుంది.

VII) ఎడ్రినల్ (లేదా) అధివృక్క గ్రంధి : ఇది రెండు రకాల కణాజాలాలను కలిగి ఉంటుంది.
a) అధివృక్క వల్కలం
b) అధివృక్క దవ్వ

a) అధివృక్క వల్కలం:

  1. మినరలోకార్టికాయడ్స్ – ఇది ‘ఆల్టోస్టిరాన్’ అనే హార్మోను స్రవిస్తుంది.
  2. గ్లూకోకార్టికాయిడ్స్ – ఇది ‘కార్టిసాల్ లేదా హైడ్రోకార్టిసోనే’ అనే హార్మోనును స్రవిస్తుంది.
  3. 3) ఆండ్రోజెన్స్ – ఇది ‘టెస్టోస్టిరాన్’ అనే హార్మోనును స్రవిస్తుంది.

b) అధివృక్క దవ్వ:

  1. ఎడ్రినాలిన్ లేదా ఎపినెఫ్రిన్
  2. నార్ ఎడ్రినాలిన్ లేదా నార్ ఎపినెఫ్రిన్

VIII) క్లోమం:

  1. గ్లూకోగాన్
  2. ఇన్సులిన్

ఈ రెండు హార్మోనులు ఒత్తిడి మరియు అత్యవసర పరిస్థితులలో

IX) ముష్కాలు: ఆండ్రోజెన్స్ ‘టెస్టోస్టిరాన్’ ను స్రవిస్తాయి
అనుక్రియగా స్రవించబడతాయి.

X) స్త్రీబీజకోశాలు: ఈస్ట్రోజెన్ మరియు ప్రోజెస్టిరాన్ అనే హార్మోనులను స్రవిస్తాయి.

XI) మూత్రపిండాలు: ఎరిత్రోపాయిటిన్ అనే హార్మోను అస్థిమజ్జలో ఎర్రరక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.

XII) గట్: గ్యాస్టిన్, సెక్రిటిన్, కొలిసిస్టోకైనిన్ మరియు జఠర నిరోధక పెప్టైడ్.

ప్రశ్న 2.
న్యూరో అంతస్రావక అవయవంలాగా హైపోథలామస్ ఏ విధంగా పని చేస్తుందో వివరించండి.
జవాబు:

  1. హైపోథలామస్ థలామస్ క్రిందుగా, పూర్వమెదడు యొక్క ద్వారా గోర్ధపు ఆధారభాగంను ఏర్పరుస్తుంది.
  2. ఇది ఒకవైపు మెదడును అతికి ఉండి ఇంకొకవైపు పిట్యూటరీ గ్రంధిని అంటిపెట్టుకుని ఉంటుంది.
  3. దేహం యొక్క వివిధ విధులను పెద్ద మొత్తంలో నియంత్రిస్తుంది.
  4. ఇది అనేక నాడీ స్రావకకణాల సముదాయలను కలిగి ఉంటుంది. వీటినే కేంద్రకాలు అంటారు. ఇవి న్యూరోహార్మోనులను స్రవిస్తాయి. ఈ హార్మోనులు న్యూరో హైపోఫైసిస్ కు చేరవేయబడతాయి.
  5. హైపోథలామస్ యొక్క ఇతర రెండు హార్మోనులు:
    (i) పిట్యూటరీ గ్రంధిని ప్రేరిపించి హార్మోనులను స్రవించేలా చేసే ‘విడుదల హార్మోనులు’
    (ii) పిట్యూటరీ గ్రంధిని నియంత్రించి హార్మోనుల విడుదలను ఆపుదల చేసే ‘నియంత్రణ (లేదా) నిరోధక హార్మోనులు’
  6. ‘సోమాటోక్రెనిన్’ పిట్యూటరీ గ్రంధిని ప్రేరేపించి ‘సోమాటోట్రోపిన్’ను విడుదల చేయిస్తుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 4(a) అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం

ప్రశ్న 3.
పిట్యూటరీ గ్రంధి స్రావకాల గురించి వివరించండి. [TS MAY-17,19,22]
జవాబు:
పిట్యూటరీ (లేదా) పీయుష గ్రంధి హార్మోనులు: పిట్యూటరీ గ్రంధి ‘హైపోధలామస్’ క్రింది భాగానికి ‘కాలాంచిక’ అనే వృంతం సహాయంతో అతికి ఉంటుంది. దీనినే ‘మాస్టర్ గ్రంధి’ అని కూడా అంటారు. ఇది మిగతా అంతస్రావక గ్రంధులను నియంత్రిస్తుంది. దీనిలోని భాగాలు
A) పూర్వ పిట్యూటరీ (ఎడినో హైపోఫైసిస్)
B) పార్స్ ఇంటర్మీడియా
C) పర పిట్యూటరీ (న్యూరో హైపోఫైసిస్).

A) పూర్వపిట్యూటరీ: ఇది ఆరు ముఖ్యమైన హార్మోనులను స్రవిస్తుంది.
1) పెరుగుదల హార్మోన్: ఇది కాలేయ కణాలను ప్రేరేపించి ఇన్సులిన్ లాంటి పెరుగుదల కారకాలను(IGFS) విడుదల చేస్తుంది. ఎముకలు పొడవు పెరిగేలా ప్రేరేపిస్తుంది. ఇది కణవిభజన, ప్రోటీన్ల సంశ్లేషణను వేగవంతం చేస్తుంది.

2) ప్రొలాక్టిన్ – లాక్టోజెనిక్ హార్మోన్ (LTH): ఇది క్షీరగ్రంధుల పెరుగుదలకు మరియు క్షీరోత్పత్తికి తోడ్పడుతుంది. ఇది కార్పస్ లూటియమ్ను నిర్వహిస్తూ గర్భాన్ని కాపాడుతుంది.

3) థైరాయిడ్ ప్రేరక హార్మోన్ (TSH) or థైరోట్రోపిన్: ఇది థైరాయిడ్ గ్రంధిని ప్రేరేపించి థైరాయిడ్ హార్మోన్ సంశ్లేషణ మరియు విడుదలకు సహాయపడుతుంది.

4) ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ (ACTH) (లేదా) కార్టికోట్రోపిన్: ఇది అధివృక్క వల్కలాన్ని ప్రేరేపించి గ్లూకోకార్టికాయిడ్లు అనే స్టిరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణకు మరియు విడుదలకు తోడ్పడుతుంది.

5) పుటికాప్రేరక హార్మోన్ (FSH): ఇది స్త్రీలలో స్త్రీబీజకోశ పుటికల పెరుగుదల మరియు అభివృద్ధిని ప్రేరేపిస్తుంది. పురుషులలో శుక్రజననాన్ని నియంత్రిస్తుంది.

6) ల్యూటినైజింగ్ హార్మోన్ (LH): ఇది పురుషులలో ముష్కాలలో ఉన్న ‘లీడిగ్ కణాలను’ ప్రేరేపించి ఆండ్రోజెన్లు (టెస్టోస్టిరాన్) సంశ్లేషణ మరియు విడుదలకు దోహదం చేస్తుంది. స్త్రీలలో అండోత్పత్తిని ప్రేరేపించి, ‘అండోత్సర్గం’కు దోహదం చేస్తుంది. ఇది ‘బీజకోశాలను’ ప్రేరేపించి ఈస్ట్రోజన్ మరియు ప్రోజెస్టిరాన్ హార్మోనులను ఉత్పత్తి చేస్తుంది.

B) పార్స్ ఇంటర్మీడియా: ఇది ‘మెలటోనిన్’ అనే హార్మోను స్రవిస్తుంది. కాని మానవులలో దీని యొక్క ప్రభావం అంతగా ఉండదు.

C) పరపిట్యూటరీ: ఇది ‘ఆక్సిటోసిన్’ మరియు ‘వాసోప్రెస్సిన్’ అనే రెండు హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.

  1. ఆక్సిటోసిన్: ఇది శరీరపు నునుపు కండరాల సంకోచంను ప్రేరేపిస్తుంది. ప్రసవ సమయంలో గర్భాశయపు కండరాలలో సంకోచాలను కలుగజేస్తుంది. క్షీరగ్రంధులను నుండి క్షీరం చిందించడానికి తోడ్పడుతుంది.
  2. వాసోప్రెస్సిన్ (లేదా) యాంటిడై యూరిటిక్ హార్మోన్: ఇది నెఫ్రాన్లో ని దూరాగ్ర సంవళిత నాళికను ప్రేరేపించి, నీటిని శోషిస్తుంది. ‘అధిక మూత్ర విసర్జన’ ను నిరోధిస్తుంది.

ప్రశ్న 4.
పిట్యూటరీ కుబ్జులు, థైరాయిడ్ మరుగుజ్జులను తులనాత్మకంగా వివరించండి.
జవాబు:
A. పిట్యూటరీ కుబ్జులు లేదా పిట్యుటరీ మిడ్ గట్స్:

  1. పెరుగుదల హార్మోను యొక్క అధిక స్రావం వలన బాల్యపు పెరుగుదల ఆగిపోయింది. ఫలితంగా మరగుజ్జు రూపం (పిట్యూటరీ కుబ్జు) ఏర్పడుతుంది.
  2. పిట్యూటరీ కుబ్జులు ‘లైంగికంగా’ మరియు ‘మేధోపరంగా’ సాధారణ మానవుల వలే ఉంటారు.

B. థైరాయిడ్ మరుగుజ్జు:
(i) హైపోథైరాయిడిజమ్ గర్భం సమయంలో శిశువు అభివృద్ధిని లోపింపజేస్తుంది. ఈ అపస్థితిని ‘క్రెటినిజమ్’ అంటారు.

‘క్రెటినిజమ్’ యొక్క లక్షణాలు:

  1. పెరుగుదల లోపం
  2. మానసిక మాంద్యం
  3. అల్పబుద్ధి నిష్పత్తి
  4. చెవిటితనం
  5. మూగత్వం రెండు రకాల హార్మోను లోపాలను ప్రారంభ దశలో గుర్తించినచో సవరించుటకు అవకాశం ఉన్నది.

ప్రశ్న 5.
శరీరంలో హైపోథైరాయిడిజమ్, హైపర్ థైరాయిడిజమ్ ఎటువంటి ప్రభావం చూపుతాయో వివరించండి. [TS MAR-16][ AP MAR-17,16,22]
జవాబు:
హైపోథైరాయిడిజమ్:

  1. థైరాయిడ్ హార్మోనులు అయిన T3 మరియు T4 ల ఉత్పత్తి తగ్గినపుడు ఈ ‘హైపోథైరాయిడజమ్’ స్థితి ఏర్పడుతుంది.
  2. థైరాయిడ్ గ్రంధి ఉబ్బటం అనేది దీని యొక్క లక్షణం. దీనినే సరళగాయిటర్ లేదా అయోడిన్ లోపం గాయిటర్ అంటారు.
  3. ఆహారంలో అయోడిన్ లోపం లేదా థైరాయిడ్ గ్రంధుల యొక్క పనితీరులో మార్పు జరిగినపుడు ఈ స్థితికి దారి తీస్తుంది.
  4. హైపోథైరాయిడిజమన్ను గుర్తించి క్రమబద్దీకరించనపుడు ‘ థైరాయిడ్ మరుగుజ్జు’ కు దారి తీస్తుంది. దాని యొక్క లక్షణాలు పెరుగుదల లోపం, మానసిక మాంద్యం, అల్పబుద్ధి నిష్పత్తి, అసాధారణ చర్మం, చెవిటితనం మరియు మూగతనం మొదలైనవి.
  5. పెద్దవారి యందు మిక్సిడియా అనే అసాధారణ స్థితి ఏర్పడుతుంది. మానసిక, శారీరక మందకొడితనం, ఉబ్బిన ముఖం, పొడిచర్మం.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 4(a) అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం

హైపర్ థైరాయిడిజమ్:

  1. T3 మరియు T4 థైరాయిడ్ హార్మోనుల ఉత్పత్తి అసాధారణంగా పెరుగుతుంది.
  2. థైరాయిడ్ గ్రంధి యొక్క అధిక్రియా శీలత లేదా అతి స్రావకం అనేది గ్రంధిలో కణుతులు ఏర్పడటం వలన గానీ, లేదా క్యాన్సర్ వలన గాని జరుగుతుంది.
  3. పెద్దవారి యందు, ‘ఎక్సాప్తాల్మిక్ గాయిటర్’ వ్యాధిని అనగా కళ్ళు ఉబ్బి ముందుకు పొడుచుకొని వచ్చే స్ధితిని కలుగజేస్తుంది.
  4. అంతేకాకుండా దేహం యొక్క శరీరక స్థితి పై ప్రభావంను చూపి BMR జీవక్రియారేటును పెంచుతుంది.

ప్రశ్న 6.
అడిసన్స్ వ్యాధి, కుషింగ్స్ సిండ్రోమ్ల గురించి రాయండి. [TS MAR-17,18,19,20,22]
జవాబు:
1) అడిసన్స్ వ్యాధి: అడ్రినల్ వల్కలం స్రవించే గ్లూకోకార్టికాయిడ్ల (కార్టిసాల్) అల్పోత్పత్తి వల్ల అడిసన్స్ వ్యాధి కలుగుతుంది.
లక్షణాలు: బరువు కోల్పోవడం.

2) కుషింగ్స్ సిండ్రోమ్: అడ్రినల్ వల్కలం స్రవించే గ్లూకోకార్టి కాయిడ్ల అధికోత్పత్తి వల్ల కుషింగ్స్ సిండ్రోమ్ అనే అపస్థితి కలుగుతుంది.
లక్షణాలు: ముఖం గుండ్రంగా, చంద్ర బింబాకారంగానూ, అంగాలు కదురాకృతిగానూ, వీపుపై మూపురం, డోలన ఉదరం మరియు శరీరం యొక్క బరువు వేగంగా పెరుగుట.

ప్రశ్న 7.
డయాబెటిక్ రోగి మూత్రంలో చక్కెర ఎందుకు విసర్జితమవుతుంది.?
జవాబు:

  1. ‘గ్లూకాగాన్’ మరియు ‘ఇన్సులిన్” హార్మోనులు రక్తంనందు చక్కెర యొక్క ‘సమతాస్థితిని’ నిర్వర్తిస్తాయి.
  2. ‘ఇన్సూలిన్’ యొక్క అల్పోత్పత్తి వలన దేహ కణాలు చక్కెరను గ్రహించుకోలేవు మరియు వినియోగించుకోలేవు.
  3. కావున రక్తం నందు గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. ఇన్సులిన్ అల్పోత్పత్తి చాలా కాలం కొనసాగితే ‘డయాబెటిస్ మెల్లిటస్’ అనేవ్యాధికి దారితీస్తుంది.
  4. గ్లామరూలార్ వడపోత తరువాత ఏర్పడిన మూత్రం నందు ఉన్న అధిక చక్కెర మొత్తాలను మూత్రపిండాలను పునః శోషణం చేసుకోలేవు. అంతేకాకుండా హానికర ‘కీటోన్దేహలు’ కూడా ఏర్పడతాయి.

ప్రశ్న 8.
పురుష, స్త్రీ లైంగిక హార్మోన్లను వాటి చర్యలను వివరించండి.
జవాబు:
పురుష హార్మోనులు ‘ఆండ్రోజెన్’, స్త్రీ హార్మోనులు ‘ఈస్ట్రోజెన్’ మరియు ‘ప్రొజెస్టిరాన్’
1) పురుష హార్మోనులు:
(i) ఆండ్రోజెన్లు ముష్కాల యొక్క ‘లీడిగ్’ కణాల ద్వారా స్రవించబడతాయి. ‘లీడిగ్ కణాలు’ లేదా మధ్యాంతర కణాలు శుక్రోత్పాదక నాళికల మధ్యగల ఖాళీప్రదేశాలలో ఉత్పత్తి అవుతాయి.

(ii) టెస్టోస్టిరాన్, ఆండ్రోజెన్ల యొక్క ముఖ్యమైన హార్మోను. ఆండ్రోజెన్లు ఎపిడిడైమస్, శుక్రాశయాలు, శుక్రవాహిక, ప్రోస్టేట్ గ్రంధి మరియు ప్రసేకం మొదలయిన పురుష అనుబంధ లైంగిక అవయవాల అభివృద్ధి, పరిణితి మరియు విధి నిర్వహణకు అవసరం.

(iii) ఈ హార్మోనులు పురుషుల యొక్క ద్వితీయ లైంగిక లక్షణాలైన కండరాభివృద్ధి, ముఖం మరియు బాహుమూలలో రోమాలేర్పడటం, ఉగ్రప్రవర్తన, అల్పస్వరస్థాయి, పురుష కంఠ ధ్వని మొదలైన వాటిని ప్రేరేపిస్తాయి. ఆండ్రోజెన్లు శుక్రజననాన్ని ప్రేరేపిస్తాయి. ఇది పురుష లైంగిక ప్రవర్తనను నియంత్రిస్తాయి అంతేకాకుండా ప్రోటీనులు మరియు కార్బోహైడ్ యొక్క నిర్మాణాత్మక అంశాలపై ప్రభావం కలిగి ఉంటుంది. కావున వీటిని ‘అనబాలిక్ స్టిరాయిడ్స్ అని అంటారు.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 4(a) అంతస్రావక వ్యవస్థ, రసాయన సమన్వయం

2) స్త్రీ హార్మోనులు:
(i) అభివృద్ధి చెందే స్త్రీబీజకోశ పుటికలు ‘ఈస్ట్రోజెన్’ హార్మోన్ను సంశ్లేషణ చేస్తాయి. అండోత్సర్గం జరిగిన తరువాత పగిలిన పుటికాలైన ‘కార్పస్’ లూటియమ్’ ప్రోజెస్టిరోను ఉత్పత్తి చేస్తాయి.
(ii) ఈస్ట్రోజెన్ (స్త్రీలలో ద్వితీయ లైంగిక అవయవాలైన స్త్రీబీజకోశ పుటికల అభివృద్ధి, హెచ్చు స్వరస్థాయి, క్షీరగ్రంధులు మొదలైనవాటిని ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా లైంగిక ప్రవర్తనను నియంత్రిస్తుంది.
(iii)ప్రొజెస్టిరాన్ గర్భాశయ గోడలో బ్లాస్టోసిస్ట్ (పిండం) ప్రతిస్ధాపన కోసం గర్భాశయాన్ని సిద్ధం చేస్తుంది.
(iv) గర్భాశయ కండరాల సంకోచాన్ని నిరోధిస్తు, గర్భదారణకు తోడ్పడుతుంది. ఇది క్షీరగ్రంధులలో ఆల్వియోలైనాను ప్రేరేపించి క్షీరోత్పత్తికి కూడా తోడ్పడుతుంది.

ప్రశ్న 9.
హార్మోన్ల చర్యా విధానం గురించి రాయండి.
జవాబు:
హార్మోన్ల చర్యా విధానం:

  1. హార్మోనులు దేహం యొక్క వివిధ విధులను నియంత్రిస్తాయి.
  2. ఇవి నిర్ధేశిత కణాల పై పని చేస్తాయి. ఇవి రసాయన గ్రాహకాలు.
  3. కరిగే విధానాన్ని ఆధారంగా చేసుకుని ఇవి రెండు రకాలు A) కొవ్వులలో కరగనవి B) కొవ్వులలో కరిగేవి.

A) కొవ్వులలో కరగని హార్మోన్ల చర్యా విధానం:

  1. కొవ్వులలో కరగని హార్మోనులు కణత్వచ గ్రాహాకాలతో బంధించబడి, G ప్రోటీన్లను ప్రేరేపిస్తాయి.
  2. ఈ ప్రేరేపించబడిన G -ప్రోటీన్లు ఎడినైలేట్ సైక్లేజ్ను ఉత్తేజపరిచి ‘ద్వితీయ వార్తా హారులు’ అయినటువంటి cAMP (చక్రీయ అడినోసిన్ మోనోఫాస్ఫేట్) ఏర్పరుస్తాయి. ఇవి మిగతా చర్యలను ‘కాసేకేడ్’ పద్ధతిలో నిర్వహిస్తాయి. ఉదా: ఎపినెఫ్రిన్

B) కొవ్వులలో కరిగే హార్మోన్ల చర్యా విధానం:

  1. ఈ హార్మోన్లు కణత్వచం ద్వారా స్వేచ్ఛగా విసరణ చెందుతాయి.
  2. ఇవి కణద్రవ్యంలోని గ్రహకాలతో బంధనం ఏర్పరుచుకొని, హార్మోన్ – గ్రహక సమూహాన్ని ఏర్పరుస్తాయి.

Leave a Comment