AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

Students get through AP Inter 2nd Year Zoology Important Questions Lesson 3a కండర – అస్థిపంజర వ్యవస్థ which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Zoology Important Questions Lesson 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
కండరం, నాడికి సంబంధించి ‘చాలక ప్రమాణం’ అంటే ఏమిటి?
జవాబు:
చాలక ప్రమాణం: ఒక చాలక నాడీకణం అక్షీయ తంతువులోని టీ లోడెండ్రైట్లు అంతమయ్యే కండర తంతువు భాగాన్ని ‘చాలక ప్రమాణం’ అంటారు.

ప్రశ్న 2.
త్రయావ్యవస్థ (Triad system) అంటే ఏమిటి? [TS MAY-19] [TS MAR-15,16,17,20,22]
జవాబు:

  1. త్రయావ్యవస్థ : ప్రతి Tనాళికను సార్కోప్లాజమిక్ రెటిక్యులమ్ యొక్క అంతసిస్టర్నేలు సన్నిహితంగా చుట్టి ఉంటాయి.
  2. ఒక T – నాళిక మరియు దానికి సన్నిహితంగా ఉన్న రెండు సిస్టర్నేలను కలిపి ‘త్రయావ్యవస్థ’ అంటారు.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ
ప్రశ్న 3.
ఏక్టిన్, మయోసిన్ మధ్య భేదమేమి? [AP MAR-15,19,22]
జవాబు:
ఏక్టిన్

  1. ఇది ఒక పలుచని సంకోచశీల ప్రోటీన్
  2. ఇది లేతవర్ణ పట్టీలో ఉంటుంది. దీనినే సమప్రసరక పట్టీ అని అంటారు.
  3. ఏక్టిన్ తంతువులు Zగీతలకు కలుపబడి ఉంటాయి.

మయోసిన్

  1. ఇది ఒక మందమైన సంకోచశీల ప్రోటీన్
  2. ఇది ముదురు (లేదా) నిష్కాంత వంతపు పట్టీలో ఉంటుంది. దీనినే అసమప్రసారక పట్టీ అని అంటారు.
  3. మయోసిన్ తంతువులు M గీతలకు కలుపబడి ఉంటాయి.

ప్రశ్న 4.
ఎర్రని కండర తంతువులు, తెల్లని కండర తంతువులు మధ్య ఉండే భేదాలను తెల్పండి. [TS MAR-18]
జవాబు:
ఎర్రని కండర తంతువులు

  1. ఎరన్రి కండర తంతువులు అధిక మయోగ్లోబిన్ మరియు మైటోకాండ్రియాలను కలిగి ఉంటాయి.
  2. వీటిని వాయు కండరాలు అని అంటారు.
  3. మైటోకాండ్రియాల నందు నిల్వ ఉన్న ఆక్సిజన్ ను వినియోగించుకుంటాయి.

తెల్లని కండర తంతువులు

  1. తెల్లని కండర తంతువులు తక్కువ మయోగ్లోబిన్ మరియు మైటోకాండ్రియాలను కలిగి ఉంటుంది.
  2. వీటిని అవాయు కండరాలు అని అంటారు.
  3. శక్తి కోసం అవాయు ప్రక్రియ పై ఆధారపడతాయి.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
కండర సంకోచానికి సంబంధించి జారుడు తంతు సిద్ధాంతాన్ని గురించి లఘుటీక రాయండి.
జవాబు:

  1. ‘జేన్ హన్సన్’ మరియు ‘హ్యూగ్ హక్సలె’ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన ‘స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం’ లేదా ‘జారుడు తంతు సిద్ధాంతం’ ద్వారా కండరం సంకోచించే విధానాన్ని వివరించవచ్చు.
  2. కండర సంకోచంలో సన్నని తంతువులు దళసరి తంతువులు మీదుగా లేదా మధ్యగా జారుతాయి. దీని ఫలితంగా కండర సూక్ష్మ తంతువులు కురచగా మారతాయి.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 1
  3. ప్రతి కండర తంతువులో ఏక్టిన్ మరియు మయోసిన్ అనే రెండు సంకోచశీల ప్రోటీన్లు ఉంటాయి. పలుచని ఏక్టిన్ ప్రోటీన్ ను కాంతివంతపు లేదా లేత వర్ణ పట్టీ ‘T’ అంటారు.
  4. దళసరి మయోసిన్ ప్రోటీన్ నిష్కాంతివంతపు పట్టీ ‘A’ లో ఉంటుంది.
  5. మందమైన మరియు సన్నని, సాగేగుణం ఉన్న తంతువును ‘Z’ గీత అంటారు. ఇది ‘I’ పట్టీ యొక్క మధ్య భాగంను ఖండిస్తుంది. దళసరి తంతువు మరియు పలుచని తంతువులు ఒకదానిపై ఒకటి చొచ్చుకొనే భాగాన్ని ‘A’ మండలం అంటారు.
  6. కండర సంకోచ సమయంలో మయోసిన్ తలలు బయటికి చొచ్చుకొని వచ్చి ఏక్టిన్ తంతువు యొక్క చైతన్య స్థానంలో బంధితమయ్యి అడ్డువంతెనలను ఏర్పరుస్తాయి.
  7. ఈ అడ్డువంతెనలు పలుచని తంతువులను ‘A’ పట్టీ మధ్య వైపుకి లాగుతాయి. ఏక్టిన్ తంతువును అంటిపెట్టుకొని ఉన్న ‘Z’ గీత కూడా లాగబడుతుంది. దీని వలన సార్కొమియర్ పొడవు తగ్గుతుంది. దీనినే ‘సడలడం’ అంటారు.
  8. కండరం తగ్గడం వలన ‘I’ పట్టీ పొడవు తగ్గుతుంది. ‘A’ పట్టీ దాని పొడవును తిరిగి పొందుతుంది. ‘H’ మండలం లేదా హెన్సెన్స్ చక్రిక కనిపించకుండా పోతుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

ప్రశ్న 2.
కండర సంకోచంలోని ముఖ్యమైన దశలను వివరించండి. [TS MAY-22]
జవాబు:
‘హ్యుగ్ హక్సలె’ మరియు ‘జేన్ హన్సన్’ అనే శాస్త్రవేత్తలు కండరం సంకోచించే విధానాన్ని ‘సైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం’ ద్వారా వివరించారు. అది 5 దశలలో జరుగుతుంది.

  1. కండర ఉద్దీపనం.
  2. అడ్డు వంతెనలు ఏర్పడటం
  3. పవర్ స్ట్రోక్
  4. రికవరీ స్ట్రోక్
  5. కండరం సడలడం.

1) కండర ఉద్దీపనం: కేంద్రనాడీ వ్యవస్థ (CNS) నుంచి నాడీ ప్రచోదనం నాడీసంధిని చేరగానే అసిటైల్ కొలైన్ ను విడుదల చేస్తుంది. ఇది సార్కోలెమ్మా వద్ద ‘క్రియాశక్మం’ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సార్కో ప్లాజమిక్ సిస్టర్నేలను T-నాళిక ద్వారా చేరుతుంది. సిస్టర్నేలోనికి కాల్షియం అయాన్లు విడుదలవుతాయి.

2) అడ్డూవంతెనలు ఏర్పడటం: కాల్షియం అయాన్లు ట్రోపోనిన్ Tn-c యొక్క ఉపప్రమాణంకు బంధించబడతాయి. ఏక్టిన్ అణువు యొక్క చైతన్య స్థానాలు బహిర్గతం అగానే ట్రోపోమయోసిన్ సంక్లిష్టం స్థానభ్రంశం చెంది దూరంగా కదులుతుంది. మయోసిన్ అడ్డువంతెన బహిర్గతమైన చైతన్య స్థానాలతో బంధించబడటానికి సిద్ధంగా ఉంటుంది. P, (అకర్బన ఫాస్ఫేట్)కూడా విడుదలవుతుంది.

3) పవర్ స్ట్రోక్: మయోసిన్ అడ్డు వంతెనలు, ఏక్టిన్ తంతువులను ‘M’ గీతవైపు ( A -పట్టీ మధ్యభాగంలో) లాగుతాయి. అందువల్ల I పట్టీ పొడవు తగ్గుతుంది. A పట్టీపొడవు Z గీతలు దగ్గరకు చేర్చబడతాయి. అప్పుడు కండర సంకోచం ఏర్పడుతుంది.

4) రికవరీ స్ట్రోక్: మయోసిన్ అడ్డువంతెనలు చేధింపబడి ADP విడుదలవుతుంది. మయోసిన్ కొత్త ATPతో బంధితమై సంకోచ వలయం పునఃప్రారంభమవుతుంది.

5. కండరం సడలడం: చాలక ప్రచోదనాలు ఆగిపోతాయి. Ca అయాన్లు తిరిగి సిస్టర్నేలలోనికి పంపబడతాయి. I పట్టీ మరియు A పట్టీలు తిరిగి వాటి స్థానంకు చేరతాయి. అప్పుడు ‘కండరం సడలడం’ జరుగుతుంది.

ప్రశ్న 3.
అస్ధి కండర నిర్మాణాన్ని వివరించండి?
జవాబు:
I) అస్టికందర నిర్మాణం:
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 2

  1. అర్ధికండరాలు(రేఖిత) ప్రాధమికంగా గమనంలో మరియు దేహకదలికలలో పాల్గొంటాయి.
  2. అస్ధికండరం అనేక ‘కండరకట్టలు’ (లేదా) ‘ఫాసికిల్’ తో నిర్మితమై ఉంటుంది.
  3. ప్రతి ఫాసికిల్ ‘స్థూపాకర కండర తంతువులు’ కలిగి ఉంటుంది.
  4. ఫాసికిల్స్ అన్ని కొల్లాజెన్తో నిర్మితమైన ‘ఫాసియా’ అనే సంయోజక కణజాలపు త్వచంతో కప్పబడి ఉంటుంది.
  5. ప్రతి రేఖిత కండరం వెలుపలి వైపు ‘సార్కోలెమ్మా’ ను కలిగి ‘సార్కో ప్లాజమ్’తో కప్పబడి ఉంటుంది.
  6. ఇది అనేక పరిధీయ కేంద్రకాలను (సిన్సేషియమ్) కలిగి ఉంటుంది.
  7. అంతర్జీవ ద్రవ్యజాలమ్ను ‘సార్కోప్లాజమిక్ ద్రవ్యజాలం’ అని కూడా అంటారు. ఇది కాల్షియమ్ అయాన్లను నిల్వచేస్తుంది.
  8. సార్కోప్లాజమ్ నందు అనేక ‘సమాంతర సూక్ష్మతంతువులు’ ఉంటాయి.

II) కండర సూక్ష్మతంతువు నిర్మాణం:

  1. ప్రతి కండర సూక్ష్మ తంతువు లేతవర్ణ పట్టీ మరియు చీకటి వర్ణ పట్టీలను ఒకదాని తరువాత ఒకటిగా కలిగి ఉంటుంది. లేతవర్ణపట్టీ ఏక్టిన్ తంతువును మరియు ముదురు వర్ణ పట్టీ మయోసిన్ తంతువులను కలిగి ఉంటాయి.
  2. ఏక్టిన్ తంతువులు 2 గీతకు అతకబడి ఉంటాయి .
  3. మయోసిన్ తంతువులు M గీతకు అతకబడి ఉంటాయి .
  4. ఒక Z గీత నుండి మరొక Z గీతకు మధ్యఉన్న కండర సూక్ష్మతంతువును ‘సార్కోమియర్’ అంటారు.
  5. లేత వర్ణ పట్టీను I పట్టీ అని, మరియు ముదురు వర్ణ పట్టీను A పట్టీ అని అంటారు.
  6. A పట్టీ యొక్క మధ్య భాగం నందు ఉన్న ప్రాంతాన్ని H పట్టీ లేదా ‘హెన్సన్స్ చక్రిక’ అంటారు.
  7. అంతర్వర్తన సార్కోలెమ్మా యొక్క సార్కో ప్లాజమిక్ సిస్టర్నే మరియు T-నాళిక రెండు కలిసి ‘త్రయావ్యవస్థ’ ను ఏర్పాటు చేస్తాయి.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

ప్రశ్న 4.
సంకోచశీల ప్రోటీన్లను గురించి లఘు వ్యాఖ్య రాయండి.
జవాబు:
కండరం యొక్క సంకోచకశీల ప్రోటీనులు రెండు. అవి ఏక్టిన్ మరియు మయోసిన్
1) ఏక్టిన్: ప్రతి ఏక్టిన్ తంతువు రెండు F ఏక్టిన్ తంతువులతో కుండలిగా చుట్టుకొని ఉంటుంది. ప్రతి F ఏక్టిన్ తంతువు G-ఏక్టిన్ తంతువు యొక్క పాలీమర్.

  1. ఏక్టిన్ తంతువులు ట్రోపోమయోసిన్ మరియు ట్రోపోనిన్ అనే రెండు ప్రోటీన్లతో కలిసి ఉంటుంది.
  2. ట్రోపోమయోసిన్ ప్రోటీన్ తంతువు F ఏక్టిన్ తంతువు పొడవునా అమరి ఉంటుంది.
  3. ట్రోపినిన్ నందు మూడు ఉపప్రమాణాలు ఉంటాయి. అవి Tn-T, Tn-I మరియు Tn-C.
  4. Tn-T ఉపప్రమాణం ట్రోపోమైసిన్తో బంధింపబడి ఉంటుంది. Tn-I అనే ఉపప్రమాణం నిరోధిక ప్రోటీన్
  5. Tn-C ఉపప్రమాణం Ca+ అయాన్లతో కలుపబడుతుంది.
  6. ట్రోపోనిన్ మరియు ట్రోపోమైసిన్ లను ‘నియంత్రణ ప్రోటీన్లు’ అంటారు.

2) మయోసిన్:
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 3

  1. ఇది చాలక ప్రోటీన్.
  2. ఇది రసాయనిక శక్తిని యాంత్రిక శక్తిగా మార్చగలదు.
  3. ప్రతి మయోసిన్ అణువు తంతువును చుట్టుకొని ఉన్న రెండు పాలిప్లైడ్ గొలుసులను కలిగి ఉంటుంది.
  4. ప్రతి గొలుసు ప్రోటీన్ మోనోమర్ అయిన ‘మీరోమయోసిన్లు’ కలిగి ఉంటాయి.
  5. ప్రతి మీరోమయోసిన్ చిన్న తల మరియు తోకలను కలిగి ఉంటుంది.
  6. పొట్టిగా ఉండే భుజంను కలిగిన తల ‘భారపు మీరోమయోసిన్’ ను ఏర్పరుస్తుంది.
  7. తోక ‘తేలిక మీరోమయోసిన్ న్ను’ ఏర్పరుస్తుంది.
  8. ప్రతి దళసరి మయోసిన్ తంతువులో సుమారు 200-300 వరకు మీరోమయోసిన్ అణువులు ఉంటాయి.
  9. తల భాగం Z గీత వైపుకుతిరిగి ఉంటుంది. ఇది తల మరియు పొట్టి భుజం రెండింటిని కలుపుతుంది.

ప్రశ్న 5.
కండర తంతువు అతిసూక్ష్మ నిర్మాణం చక్కని పటం గీయండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 4

ప్రశ్న 6.
కండర ఖండితం (సార్కోమియర్) చక్కని పటం గీచి, భాగాలను గుర్తించడండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 5

ప్రశ్న 7.
కోరి వలయం అంటే ఏమిటి? ప్రక్రియ గురించి వివరించండి.
జవాబు:
కోరి వలయం:

  1. నిరంతరంగా అస్ధికండరాలు సంకోచం చెందేటపుడు ఆక్సిజన్ లభించని పక్షంలో పాక్షికంగా ఆక్సీకరణం చెందిన లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది.
  2. లాక్టిక్ ఆమ్లం యొక్క అధిక భాగం రక్తం ద్వారా కాలేయంకు చేర్చబడుతుంది.
  3. ఇది పైరూవిక్ ఆమ్లంగా మార్చబడి, గ్లూకోనియోజెనిసిస్ సమక్షంలో గ్లూకోజ్ మార్చబడుతుంది.
  4. ఈ విధంగా ఏర్పడిన గ్లూకోజ్, రక్తం ద్వారా కండరాలను చేరి సంకోచంలో వినియోగింపబడుతుంది.
  5. కండర సంకోచం ఆగినపుడు ఈ గ్లూకోజ్ గ్లైకోజెన్ గా మార్చబడి నిలువచేయబడుతుంది.
  6. ఈ విధంగా రేఖిత కండరానికి మరియు కాలేయానికి మధ్య జరిగే గ్లూకోజ్ యొక్క ద్వంద రవాణాలను ‘కోరి వలయం’ అంటారు.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
కండర సంకోచ ప్రక్రియను వివరించండి.
జవాబు:
కండర సంకోచ విధానం: హ్యుగ్ హక్సలె’ మరియు ‘జేన్ హన్సన్’ అనే శాస్త్రవేత్తలు కండరం సంకోచించే విధానాన్ని ‘స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం’ ద్వారా వివరించారు.

ఈ సిద్ధాంతం కండర సంకోచం వలన సన్నని తంతువులు, మందమైన తంతువుల మీదుగా జారతాయని తెలియచేస్తుంది.

సంకోచ ప్రోటీన్ల రకాలు: ఏక్టిన్ మరియు మయోసిన్.

ఏక్టిన్: ఇవి సార్కోమియర్ యొక్క I పట్టీ నందు ఉండే సన్నని తంతువులు ఇవి Z గీతను అంటిపెట్టుకుని ఉంటాయి. ఈ ఏక్టిన్ అణువులు క్రియాత్మక స్థానాలను కలిగి ఉంటాయి.

సడలిక స్థితిలో ఉన్నపుడు ఈ క్రియాత్మక స్థానాలు ‘ట్రోపోమెయోసిన్ మరియు ట్రోపోనిన్లతో’ ఆవరించి ఉంటాయి.

మయోసిన్: ఈ ప్రోటీన్ A పట్టిక నందలి మందమైన తంతువులలో ఉంటుంది. ఇవి M గీతకు అంటి పెట్టుకొని ఉంటాయి.

ప్రతిమయోసిన్ తంతువు రెండు మీరోమయోసిన్ అణువులను కలిగి ఉంటుంది.

మీరోమయోసిన్ అణువు తల, పొట్టి భుజం మరియు తోకను కలిగి ఉంటుంది.

మీరోమయోసిన్ యొక్క తల Z గీతవైపుకు తిరిగి ఉంటుంది.

కండర సంకోచం 5 దశలలో జరుగుతుంది.

  1. కండర ఉద్దీపనం.
  2. అడ్డు వంతెనలు ఏర్పడటం
  3. పవర్ స్ట్రోక్
  4. రికవరీ స్ట్రోక్
  5. కండరం సడలడం.

1) కండర ఉద్దీపనం: కేంద్రనాడీ వ్యవస్థ (CNS) నుంచి నాడీ ప్రచోదనం నాడీసంధిని చేరగానే అసిటైల్ కొలైన్ ను విడుదల చేస్తుంది. ఇది సార్కోలెమ్మా వద్ద ‘క్రియాశక్మం’ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సార్కో ప్లాజమిక్ సిస్టర్నేలను T-నాళిక ద్వారా చేరుతుంది. సిస్టర్నేలోనికి ‘కాల్షియం’ అయాన్లు విడుదలవుతాయి.

2) అడ్డూవంతెనలు ఏర్పడటం: కాల్షియం అయాన్లు ట్రోపోనిన్ Tn-c యొక్క ఉపప్రమాణంకు బంధించబడతాయి.
ఏక్టిన్ అణువు యొక్క చైతన్య స్థానాలు బహిర్గతం అవగానే ట్రోపోమయోసిన్ సంక్లిష్టం స్థానభ్రంశం చెంది దూరంగా కదులుతుంది. మయోసిన్ అడ్డువంతెన బహిర్గతమైన చైతన్య స్థానాలతో బంధించబడటానికి సిద్ధంగా ఉంటుంది. P, (అకర్బన ఫాస్ఫేట్)కూడా విడుదలవుతుంది.

3) పవర్ స్ట్రోక్: మయోసిన్ అడ్డు వంతెనలు, ఏక్టిన్ తంతువులను ‘M’ గీతవైపు ( A -పట్టీ మధ్యభాగంలో) లాగుతాయి. అందువల్ల I పట్టీ పొడవు తగ్గుతుంది. A పట్టీపొడవు మరియు Z గీతలు దగ్గరకు చేర్చబడతాయి. అప్పుడు కండర సంకోచం ఏర్పడుతుంది.
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 6

4) రికవరీ స్ట్రోక్: మయోసిన్ అడ్డువంతెనలు చేధింపబడి ADP విడుదలవుతుంది. మయోసిన్ కొత్త ATPతో బంధితమై సంకోచ వలయం పునఃప్రారంభమవుతుంది.

5) కండరం సడలడం: చాలక ప్రచోదనాలు ఆగిపోతాయి. Ca అయాన్లు తిరిగి సిస్టర్నేలలోనికి పంపబడతాయి.
I పట్టీ మరియు A పట్టీలు తిరిగి వాటి స్థానంకు చేరతాయి. అప్పుడు కండరం సడలడం జరుగుతుంది.
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 7

ప్రశ్న 2.
కండరం సంకోచ సమయంలోని అంశాలను వరుసక్రమంలో వివరించండి.
జవాబు:
‘జేన్ హన్సన్’ మరియు ‘హ్యుగ్ హక్సలె’ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన ‘స్లైడింగ్ ఫిలమెంట్’ సిద్ధాంతం’ లేదా ‘జారుడు తంతు సిద్ధాంతం’ ద్వారా కండరం సంకోచించే విధానాన్ని వివరించవచ్చు.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

కండర సంకోచంలో సన్నని తంతువులు, దళసరి తంతువుల మీదుగా లేదా మధ్యగా జారుతాయి. ఈ చర్యలో అనేక బంధనాలు మరియు మయోసిన్ తంతువుల విడుదల జరుగుతుంది.

కండర సంకోచ ప్రక్రియలోని దశలు
I) కండర ఉద్దీపనం

  • నాడీ ప్రచోదన విడుదల): కండర సంకోచం ఉద్దీపనల ద్వారా ప్రేరితమై, తంతువును మరియు ‘నాడీ ప్రచోదన `కండర నాడీ సంధిని ‘ (చాలక అంత్య ఫలకంను) చేరుతాయి. ఈ విధంగా చేరిన వెంటనే అసిటైల్ కొలైన్ అనే నాడీ అభివాహకం సార్కొలెమ్మాలోకి ‘క్రియాశక్మం’ను ఉత్పత్తి చేస్తుంది.

II) అడ్డువంతెనలు ఏర్పడటం

  • Ca2+ విడుదల: త్రయావ్యవస్థ యొక్క T-నాళిక ద్వారా, ఈ క్రియాశక్మం, సార్కొప్లాజమిక్ రెటిక్యులమ్ ని సిస్టర్నేలను చేరి సార్కొప్లాజమ్లోనికి ‘కాల్షియం అయాన్లను’ విడుదల చేస్తుంది.
  • బంధనం: సార్కొప్లాజమ్ పెరిగిన కాల్షియం అయాన్లు పలుచని తంతువు యొక్క ట్రోపోనిన్ ఉండే ప్రమాణం Tn-c తో బంధించబడతాయి.
  • ATP జలవిశ్లేషణ: దీని ఫలితంగా ట్రోపోనిన్ మరియు ట్రోపోమయోసిన్లు ఏక్టిన్ యొక్క ఉత్తేజస్థానం నుండి స్థానభ్రంశం చెందటంతో ఏక్టిన్ చైతన్యస్థానాలు బహిర్గతమవుతాయి. ఈ చైతన్య స్థానాలు జలవిశ్లేషణ ద్వారా శక్తిని పొంది మయోసిన్ తలభాగంతో బంధించబడుతాయి (P విడుదలవుతుంది)

III) పవర్స్ట్రోక్

  • సంకోచం: మయోసిన్ అడ్డువంతెలను వలన ఏక్టిన్ తంతువులు ‘A’ పట్టీ ముఖ్యభాగంలోకి లాగబడతాయి. సంకోచం వలన ఏక్టిన్ తంతువులను పట్టీ ఉన్న ‘z’ గీతలు కూడా రెండు వైపుల నుంచిలోనికి లాగబడతాయి.
  • సంకోచం జరిగేటపుడు ‘I’ పట్టీ పొడవు తగ్గిపోతుంది. కానీ పట్టీ పొడవు యధాతదంగా ఉండిపోతుంది. సన్నని ఏక్టిన్ తంతువులు దళసరి ‘A’ పట్టీలోనికి లోతుగా లాగబడటం వలన ‘H’ మండలం సన్నగా మారుతుంది. సార్కోమియర్ పొడవు తగ్గుతుంది, దీనినే కండర సంకోచం అంటారు.

IV) రికవరీస్ట్రోక్

  • సంకోచం నియంత్రణ: నాడీ ప్రచోదన కండరనాడీ సంధి వద్ద అసిటైల్ కొలైన్ అసిటైల్ కొలినెస్టరేజ్ ఎన్జైమ్ వలన చేధించబడుతుంది. దీని వలన క్రియాశక్మంల విడుదల తగ్గుతుంది,.
  • చాలకనాడీ ప్రచోదన ఆగిన వెంటనే కాల్షియం అయాన్లు సార్కొప్లాజమిక్ రెటిక్యులమ్ సిస్టర్నేలలోనికి ATPase ద్వారా పంపుట వలన సార్కొప్లాన్లో Ca 2 + అయాన్ల గాఢత తగ్గుతుంది.
  • ట్రోపోనిన్ మరియు ట్రోపోమయోసిన్ల ఆకృతిలో మార్పు ఏర్పడుతుంది.

V) కండరం సడలడం

  • సడలడం: దీనివలన ఏక్టిన్ తంతువులపై నున్న చైతన్యస్థానాలు మయోసిన్ తలతో బంధితమయ్యే అవకాశం ఉండదు. ఈ కారణంగా ‘Z’ త్వచం తిరిగి తన యాధాస్థితిని చేరుతుంది. దీన్నే ‘సడలడం’ అంటారు.

అస్థి పంజరం

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
రెండు కపాల‘సూదనాల పేర్లు తెలిపి, అవి ఉండే ప్రదేశాలను పేర్కొనండి. [AP MAR-18,20]
జవాబు:

  1. రెండు కపాల సూదనాల పేర్లు ‘కిరీటసూదనం’, ‘లాంబాయిడ్ సూదనం’,
  2. ‘కిరీటసూదనం’ లలాటికాస్థి మరియు కుడ్యాస్థులు మధ్య ఉంటుంది.
  3. ‘లాంబాయిడ్ సూదనం’ కు కుడ్యార్థులు మరియు అనుకపాలాస్థులు మధ్య ఉంటుంది.

ప్రశ్న 2.
కపాలంలో కీలక ఎముక ఏది? అది ఎక్కడ ఉంటుంది? [TS MAR-18]
జవాబు:

  1. కపాలంలో కీలకమైన ఎముక ‘స్పీనకీయం’. ఇది ఇతర ఎముకలన్నింటితోను అనుసంధానం చెందడం వల్ల ఇది కీలకమైన ఎముకగా చెప్పవచ్చు.
  2. ఇది కపాలం యొక్క ఆధారంలో ఉంటుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

ప్రశ్న 3.
మానవ పుర్రెను ద్వికందయుత పుర్రె అనడానికి కారణమేమి?
జవాబు:
రెండు అనుకపాలాస్థుల మధ్య ‘మహవివరం’ అనే పెద్ద రంధ్రం ఉంటుంది. దీన్ని ఆవరించి ఇరువైపులా రెండు అనుకపాల కందాలు ఉంటాయి. వీటితో శీర్షధరం సంధితలాన్ని కలిగి ఉంటుంది. కావున మానవ పుర్రెను ‘ద్వికందయుత పుర్రె’ అంటారు.

ప్రశ్న 4.
మానవుడి చెవిలోని అస్థిఖండాల పేర్లు పరిణామ రీత్యా వాటి పుట్టుకను పేర్కొనండి. [AP,TS MAR-16]
జవాబు:
కర్ణాస్థి ఖండాలు:

  1. కూటకం – ఇది రూపాంతరం చెందిన క్రింది దవడలోని ఆర్టిక్యూలార్ ఎముక
  2. దాగిలి – ఇది రూపాంతరం చెందిన క్రింది ప్రలంబం
  3. కర్ణాంతరాస్థి – ఇది రూపాంతరం చెందిన క్రింది కాంఠిక అధోహనువు

ప్రశ్న 5.
కింది వాటి మధ్య ఉండే కీళ్ల రకాలను పేర్కొనండి.
(a) శీర్షధరం / అక్షకశేరుక
(b) మణిబంధకాస్థి/కరాభాస్థి
జవాబు:
(a) శీర్షధరం మరియు అక్షకశేరుకం మధ్య ఉండే కీలు ‘బొంగరపుకీలు’.
(b) మణిబంధకాస్ధి మరియు కరాభాస్థి మధ్య ఉండే కీలు శాడిల్కీలు.

ప్రశ్న 6.
కింది వాటి మధ్య ఉండే కీళ్ల రకాలను పేర్కొనండి (a) శీర్షధరం-అక్షకశేరుకం (b) తొడ ఎముక ఉదూఖలం.
జవాబు:
(a) శీర్షధరం మరియు అక్షకశేరుకం మధ్య ఉండే కీలు ‘బొంగరపుకీలు’.
(b) తొడ ఎముక మరియు ఉదూఖలం మధ్య ఉండే కీలు ‘బంతిగిన్నెకీలు’

ప్రశ్న 7.
కింది ఎముకల మధ్య కీలు ఏది?
(a) కపాల ఎముకలు
(b) చీలమండ ఎముకలు
జవాబు:

  1. కపాల ఎముకల మధ్య ఉన్న కీళ్ళను ‘సూదనాలు’ అంటారు. ఇవి కండరయుతంగా ఉంటాయి.
  2. చీల మండల ఎముక మధ్య ఉన్న కీలును ‘జారెడు కీలు’ అంటారు.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
మానవ కపాలంలోని ఎముకలను పేర్కొనండి.
జవాబు:
మానవ కపాలం 8 ఎముకలచే నిర్మితమై ఉంటుంది.:
1) లలాటికాస్థి: ఇది ఒకే ఒక ఎముక. ఇది నుదురు, కపాలం పూర్వ ఉదరభాగాన్ని మరియు నేత్రగుళిక పైభాగాన్ని ఏర్పరుస్తుంది.

2) కుడ్యాస్థులు: ఇవి ఒక జత ఎముకలు ఇవి కపాలకుహరం యొక్క పైకప్పును మరియు పక్క భాగాలను ఏర్పరుస్తాయి.

3) కణతాస్థులు: ఒక జత ఎముకలు కపాలం యొక్క పార్శ్య మరియు ఉదరభాగాలను ఆక్రమించి ఉంటాయి.

4) అనుకపాలాస్థి: ఇది ఒకే ఒక ఎముక. ఇది కపాలం యొక్క పరాంత మరియు పరాంత ఉదర భాగాలను ఏర్పరుస్తుంది. దీని యందు ‘మహవివరం’ అనే పెద్ద రంధ్రం ఉంటుంది. రంధ్రం ద్వారా మెదడు అంత్య భాగమైన మజ్జాముఖం, వెన్నుపాముతో కలుస్తుంది. మహవివర రంధ్రాన్ని ఆవరించి ఇరువైపులా రెండు ‘అనుకపాల కండరాలు’ ఉంటాయి.

5) స్ఫీనకీయం: ఇది ఒకే ఒక ఎముక. ఇది కపాలం యొక్క ఆధారాన్ని ఏర్పరుస్తుంది. ఇది కపాలం యొక్క ఇతర ఎముక లన్నింటితో అనుసంధానం చెంది ఉంటుంది.

6) సేవకం: ఇది ఒకే ఒక ఎముక. ఇది కపాలం యొక్క పీఠభాగపు పూర్వాంతంలో అమరి ఉంటుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

ప్రశ్న 2.
మానవుడి పర్శుకలపై లఘుటీక రాయండి. [AP MAR-20]
జవాబు:
పర్శుకలు:

  1. పర్శుకలు ఉరఃబోనును ఏర్పరుస్తాయి.
  2. మానవ ఛాతీ యందు 12 జతల పర్శుకలుంటాయి.
  3. పర్శుక పుష్ఠతలంలో వెన్నెముకతో, పృష్ఠఅంచు రెండు సంధి తలాలను కలిగి ఉంటుంది. కావున దీనిని ‘ద్విశీర్ష పర్శుకలు’ అంటారు.
  4. మొదటి ఏడు జతల పర్శుకలను ‘నిజపర్శుకలు’ అంటారు. ఇవి ఉదరతలంలో ఉరోస్థితోనూ కాచాభ మృదులాస్థి సహాయంతో అతికి ఉంటాయి.
  5. 8వ, 9వ,10వ జత పర్శుకలు 7వ జత పర్శుకలు యొక్క కాచాభ మృదులాస్థితో అతకబడి ఉంటాయి. కావున వీటిని ‘కశేరు – మృదులాస్థి పర్శుకలు’ లేదా ‘మిధ్యాపర్శుకలు’ అంటారు.
  6. 11వ మరియు 12వ జత పర్శుకలు ఉరోస్థితో అంటి ఉండవు. వీటిని ‘ఫ్లవక పర్శుకలు’ అంటారు.
  7. ఆఖరి ఐదు జతల పర్శుకలు (8,9,10,11 మరియు 12) ‘మధ్యాపర్శుకలు’.
  8. ఉరఃకశేరుకలు, పర్శుకలు మరియు ఉరోస్థికలిపి ‘పర్శుకలబోను’ ను ఏర్పరుస్తాయి.

ప్రశ్న 3.
మానవుడి పూర్వాంగపు ఎముకలను పేర్కొనండి.
జవాబు:
పూర్వాంగ ఎముకలు: ప్రతి పూర్వాంగంలోనూ 30 ఎముకలు ఉంటాయి.

  1. భుజాస్థి (Humerus) -1: భుజం నుండి మోచేయి వరకు ఉన్న ఎముక.
  2. రత్ని(Radius) -1 మరియు అరత్ని (Ulna) -2 (మోచేతి నుండి అరచేతి వరకు ఉన్న ఎముకలు)
  3. మణిబంధకాస్థులు(Carpals): 8 (మణికట్టు ఎముకలు)
  4. కరభాస్థులు(Metacarpals) (లేదా) అరచేతి ఎముకలు (Palmbones) 5
  5. అంగుళ్యాస్థులు(Phalanges): 14 (వేలు ఎముకలు)

ప్రశ్న 4.
మానవుడి కాలిలోని ఎముకలను పేర్కొనండి.
జవాబు:
చరమాంగ ఎముకలు: ప్రతి కాలియందు 30 ఎముకలు ఉంటాయి.

  1. తుంటి ఎముక (Femur) -1 (తుంటి (లేదా) తొడ ఎముక అతి పొడవైన ఎముక)
  2. అంతర్జంఘిక (Tibia) -1 మరియు బహిర్జంఘిక (Fibula)-1 (మోకాలు నుండి చీలమండ ఎముక వరకు)
  3. చీలమండ ఎముకలు (Tarsals) (7)
  4. ప్రపాదాస్థికలు(metatarsals) – 5 (పాదం యొక్క ఎముకలు)
  5. అంగుళ్యాస్ధులు(Phalanges) – 14 (వేళ్ళు యొక్క ఎముకలు)
  6. మోకాలి చిప్ప (Patella) స్నాయు బంధనంతో ఏర్పడిన సెసమాయిడ్ ఎముక

ప్రశ్న 5.
మానవుడి పూర్వాంగపు ఎముకల పటాన్ని గీయండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 8

ప్రశ్న 6.
శ్రోణిమేఖల చక్కని పటాన్ని గీయండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 9

ప్రశ్న 7.
సైనోవియల్ కీలు నిర్మాణాన్ని చక్కని పటం ద్వారా వివరించండి. [TS MAY-17][AP MAR-17,19][IPE-14][AP_MAY-19]
జవాబు:

  1. సైనోవియల్ కీలు: ఇది స్వేచ్ఛగా కదిలే కీలు.
  2. ఈ కీలు రెండు పొరలతో ఏర్పడిన సైనోవియల్ గుళికతో కప్పబడి ఉంటుంది.
  3. వెలుపలి పొర అధిక కొల్లాజెన్ తంతువులను కలిగి ఎముక యొక్క రెండు పర్యస్థికల వరకు సాగి ఉంటుంది.
  4. కీలు స్థానభ్రంశం చెందకుండా నిరోధిస్తుంది.
  5. లోపలి పొర ఏరియోలార్ కణజాలంతో మరియు స్థితిస్థాపకతంతువులతో ఏర్పడుతుంది.
  6. ఈ పొర సైనోవియలో ద్రవాన్ని స్రవిస్తుంది. దీనిలో ‘హయలురోనిక్ ఆమ్లం’ ఉంటుంది.
  7. ఈ ద్రవం కీళ్లవద్ద కందెనగా పనిచేసి ఎముకల స్వేచ్ఛా కదలికలకు సహాయపడుతుంది.
  8. బంతిగిన్నెకీలు, మడత బందుకీలు, బొంగరపుకీలు, జారెడుకీలు, కాండైలాయిడ్ కీలు మరియు శాడిల్ కీలు ఇవి అన్నీ కూడా సైనోవియల్ కీళ్లు.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 10

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
మానవుడి అక్షాస్థిపంజరాన్ని గురించి వివరించండి.
జవాబు:
మానవ పుర్రె నిర్మాణం: పుర్రె అనేది అక్షాస్థిపంజరం యొక్క భాగం. ఇది కపాల మరియు ముఖ ఎముకలతో నిర్మితమై ఉంటుంది.

కపాలం: ఇది మెదడును రక్షించే పెట్టె లాంటి నిర్మాణం ఇది ధృడమైన పెట్టె. ఇది కదిలే సూదనాలు ఉన్న మొత్తం 8 ఎముకలతో ఏర్పడుతుంది.
రెండు కపాల సూదనాల పేర్లు ‘కిరీటసూదనం’, ‘లాంబాయిడ్ సూదనం’.
‘కిరీటసూదనం’ లలాటికాస్థి మరియు కుడ్యార్థులు మధ్య ఉంటుంది.
‘లాంబాయిడ్ సూదనం’ కుడ్యాస్థులు మరియు అనుకపాలాస్థులు మధ్య ఉంటుంది.

1) లలాటికాస్థి: ఇది ఒకే ఒక ఎముక. ఇది నుదురు, కపాలం పూర్వఉదరభాగాన్ని మరియు నేత్రగుళిక పైభాగాన్ని ఏర్పరుస్తుంది.

2) కుడ్యాస్థులు: ఇవి ఒక జత ఎముకలు ఇవి కపాలకుహరం యొక్క పైకప్పును మరియు పక్క భాగాలను ఏర్పరుస్తాయి.

3) కణతాస్థులు: ఒక జత ఎముకలు కపాలం యొక్క పార్శ్య మరియు ఉదరభాగాలను ఆక్రమించి ఉంటాయి.

4) అనుకపాలాస్థి: ఇది ఒకే ఒక ఎముక. ఇది కపాలం యొక్క పరాంత మరియు పరాంత ఉదర భాగాలను ఏర్పరుస్తుంది. దీని యందు ‘మహవివరం’ అనే పెద్ద రంధ్రం ఉంటుంది. రంధ్రం ద్వారా మెదడు అంత్య భాగమైన మజ్జాముఖం, వెన్నుపాముతో కలుస్తుంది. మహవివర రంధ్రాన్ని ఆవరించి ఇరువైపులా రెండు ‘అనుకపాల కండరాలు’ ఉంటాయి.

5) స్ఫీనకీయం: ఇది ఒకే ఒక ఎముక. ఇది కపాలం యొక్క ఆధారాన్ని ఏర్పరుస్తుంది. ఇది కపాలం యొక్క ఇతర ఎముక లన్నింటితో అనుసంధానం చెంది ఉంటుంది.

6) సేవకం: ఇది ఒకే ఒక ఎముక. ఇది కపాలం యొక్క పీఠభాగ ముఖ ఎముకలు: ఇవి 14 ఎముకలు.
పూర్వాంతంలో అమరి ఉంటుంది.

  • నాసికాస్థులు అనేవి ముక్కుపై వారధిని ఏర్పరిచే ఒకజత ఎముకలు.
  • జంభికలు పై దవడను ఏర్పరుస్తాయి.
  • జైగోమాటిక్ ఎముకలు చెంపలకు ఆధారాన్ని ఇచ్చే ఎముకలు.
  • అశ్రు అస్థులు అనేవి నేత్రగుళికకు దగ్గర ఉండే చిన్న ఎముకలు.
  • తాల్వాస్థులు ఘనతాలువు పరాంత భాగాన్ని ఏర్పరచే జంట ఎముకలు.
  • నాసికా శంఖువులు అనేవి నాసికా కుహరం నందు చుట్టలుగా ఉండే ఎముకలు.
  • సిరిక అనేది నాసికా కుహరం ఉదరతలంలో ఉండే త్రిభుజాకార ఎముక.
  • హనువు అనేది కింది దవడను ఏర్పరుస్తుంది. ఇది ముఖ ఎముకలన్నింటిలోకి పొడవైనది మరియు ధృడమైనది. పుర్రె మొత్తం ఎముకల్లో ఇది ఒక్కటి మాత్రమే కదిలే ఎముక.

జ్ఞానాంగాలకు అనుబంధంగా ఉండే అస్థిపంజర నిర్మాణాలు:

  • నాసికా కుహరం: ‘నాసికావిదరం’ నాసిక కుహరాన్ని కుడి మరియు ఎడమ కుహరాలుగా విభజిస్తుంది. నేత్ర
  • గుళికలు: ఇవి ఎముకచే ఏర్పడిన పల్లపు నిర్మాణాలు.
  • కర్ణాస్థిఖండాలు: కూటకం, దాగిలి మరియు కర్ణాంత రాస్థి అనేవి మూడు మధ్య చెవి కుహరం నందు ఉంటాయి. ఇవి శబ్ధతరంగాలను చెవి నుండి అంతః చెవికి తీసుకువెళ్ళతాయి. కూటకం అనేది రూపాంతరం చెందిన చెవి ఆర్టికులార్. దాగిలి అనేది రూపాంతరం చెందిన ప్రలంబం మరియు కర్ణాంతరాస్థి అనేది రూపాంతరం చెందిన కాంఠిక అధోహనువు.
  • కాంఠి ఎముక: ఇది ‘U’ ఆకారంలో స్వరపేటిక మరియు హనువు మధ్యలో ఉండే ఎముక ఇది స్వరపేటిక తెరచి ఉండేలా చేస్తుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 3(a) కండర – అస్థిపంజర వ్యవస్థ 11

Leave a Comment