AP Inter 2nd Year Zoology Important Questions Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన

Students get through AP Inter 2nd Year Zoology Important Questions Lesson 2b విసర్జక పదార్థాలు, వాటి విసర్జన which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Zoology Important Questions Lesson 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
మూత్రపిండం లోపలికి, వెలుపలికి వెళ్ళే రక్తనాళాల పేర్లను తెలపండి.
జవాబు:

  1. మూత్రపిండంలోపలికి ప్రవేశించే రక్తనాళాన్ని ‘వృక్కధమని’ అంటారు.
  2. మూత్రపిండం నుండి బయటకు వెళ్ళే రక్తనాళాన్ని ‘వృక్కసిర’ అంటారు.

ప్రశ్న 2.
వృక్క శృంగాలు, వృక్క సూక్ష్మాంకురాలు అంటే ఏమిటి?.
జవాబు:

  1. మూత్రపిండం లోపలి భాగమైన దవ్వ అనేక శంఖాకార నిర్మాణాలుగా చొచ్చుకొని ఉంటుంది. వీటినే ‘వృక్కశృంగాలు’ అంటారు.
  2. ఇవి హెన్రీశిక్యం యొక్క జక్టా మెడుల్లరీ వృక్క ప్రమాణాలు మరియు నిటారు సంగ్రహణ నాళాలను కల్గిఉంటాయి.
  3. వృక్క శృంగాలు యొక్క కొన భాగంలో ఉండే వృక్క సూక్ష్మాంకురాలు ద్రోణిలోకి తెరచుకుంటాయి.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన
ప్రశ్న 3.
బెర్టిని స్తంభాలు అంటే ఏమిటి? [TS MAR-17, 19, 22][AP MAR-15, 19, 22]
జవాబు:
మానవుని యొక్క మూత్రపిండంలో ‘వృక్క శృంగాలను’ వేరుచేస్తూ ‘వల్కల ప్రొర్ధాలు’ ఉంటాయి వీటినే ‘బెర్టిని స్తంభాలు’ అంటారు.

ప్రశ్న 4.
మూత్రపిండంలో క్రియాత్మక, నిర్మాణాత్మక ప్రమాణం ఏది? దీనిలోని రెండు ముఖ్యమైన నిర్మాణాత్మక ప్రమాణాలు ఏవి?
జవాబు:

  1. నెఫ్రాను (లేదా) వృక్క ప్రమాణాలు అనేవి మూత్రపిండము యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు.
  2. నెఫ్రానులు రెండు రకాలు అవి: (i) వల్కల వృక్క ప్రమాణాలు (ii) జకామెడుల్లరీ వృక్క ప్రమాణాలు
  3. ప్రతి నెఫ్రానులో ఉండే రెండు ముఖ్యమైన నిర్మాణాత్మక ప్రమాణాలు బౌమన్ గుళిక మరియు వృక్కగుళిక.

ప్రశ్న 5. వల్కలం, జక్స్ మెడుల్లరీ నెఫ్రాన్స్ మధ్య తేడాలు తెలపండి. [TS MAR-20]
జవాబు:

  1. వల్కల వృక్క ప్రమాణాలు అనేవి వృక్క దవ్వయందు వృక్క కణంను కలిగి ఉంటాయి. ఇది వాసారెక్టా లేని చిన్న వంపు ఉన్న ‘హెన్లీశక్యం’ను కలిగి ఉంటుంది:
  2. జక్స్ట్ మెడుల్లరీ వృక్క ప్రమాణాలు అనేవి వృక్క దవ్వ యందు అమరి ఉంటాయి. ఇవి పొడవైన హెన్లీ శిక్యాలను మరియు వాసారెక్టాను కలిగి ఉంటాయి.

ప్రశ్న 6.
గుచ్ఛగాలనాన్ని నిర్వచించండి. [TS MAY-17,22] [AP MAR-17]
జవాబు:

  1. గుచ్ఛగాలనం: మూత్రం ఏర్పడే విధానంలో మొదటి దశలో బౌమన్ గుళిక కుహరంలో రక్తకేశనాళికా గుచ్ఛం ద్వారా రక్తం గాలన ప్రక్రియ జరిగి మూత్రం ఏర్పడుతుంది.
  2. నిష్క్రియాత్మక మరియు శక్తి వినియోగింపబడిన చర్యను ‘గుచ్ఛగాలనం’ అంటారు.

ప్రశ్న 7.
కేశనాళిక గుచ్చగాలనరేటు (GFR)ను నిర్వచించండి. (GFR).
జవాబు:

  1. గుచ్ఛగాలనరేటు(GFR): ఒక నిమిషం సమయంలో రెండు మూత్రపిండాల ద్వారా వడపోయబడిన గాలిత ద్రవ పరిమాణాన్ని ‘గుచ్ఛగాలన రేటు’ అంటారు.
  2. దీని విలువ సుమారు 125మిలి/ని.

ప్రశ్న 8.
తప్పనిసరి పునఃశోషణ అంటే ఏమిటి? ఇది నెఫ్రాన్లోని ఏ భాగంలో జరుగుతుంది?
జవాబు:

  1. ఆరోగ్యవంతుడైన మనిషి యొక్క గుచ్ఛగాలన రేటు (GFR) ఒక రోజుకి 180 లీ (లేదా) నిమిషమునకు 125మి.లి. సుమారు 85% గాలిత ద్రవం స్థిరమైన అనియంత్రిత విధానంలో సమీప నాళిక మరియు హెన్రీశిక్యం నుండి ‘పునఃశోషణం’ చెందుతుంది. దీనినే ‘వరణాత్మక పునః శోషణం’ అంటారు.
  2. వృక్క ప్రమాణం యొక్క నాళికయుత ఉపకళా కణాలు నీటిని మరియు పదార్థాలను పునఃశోషణం చేస్తాయి.

ప్రశ్న 9. జక్స్ గ్లామరులార్ కణాలు, మాక్యుల డెన్సా తేడాలను తెలపండి.
జవాబు:
జక్ట్స్ గ్లామరులార్ కణాలు

  1. జక్స్ గ్లామరులార్ కణాలు అభివాహి వృక్క ధమనిక కుడ్యంలో ఉంటాయి.
  2. ఇవి మార్పు చెందిన అభివాహి ధమనిక నునుపు కండర కణాలు.

మాక్యుల డెన్సా

  1. దూరాగ్ర సంవళిత నాళంలోని కొన్ని ఉపకళాకణాలు మార్పుచెంది గుంపుగా ఏర్పడిన ప్రాంతాన్ని మాక్యుల డెనా అంటారు.
  2. ఇవి గుంపుగా అభివాహి ధమనిక దూరస్థ సంవళిత నాళికతో సంబంధాన్ని ఏర్పరుచుకొనే ప్రాంతంలో ఉంటాయి.

ప్రశ్న 10.
జక్స్ గ్లామరులార్ పరికరం అంటే ఏమిటి? [AP MAR-18]
జవాబు:

  1. మాక్యులాడెన్సా మరియు జక్స్ గ్లామరులార్ కణాలు రెండూ కలిసి జక్స్ట్రా గ్లామరులార్ పరికరంను ఏర్పరుస్తాయి.
  2. ఇది మూత్రపిండాల విధిని నియంత్రిస్తుంది.

ప్రశ్న 11.
రెనిన్, రెన్నిన్ ఎన్ఎమ్ల మధ్య తేడా ఏమిటి? [TS MAY-19][AP,TS MAR-16]
జవాబు:

  1. ‘రెనిన్’ అనే ఎన్ఎమ్ మూత్రపిండాలలో ఉత్పత్తి అవుతుంది.
    ‘రెన్నిన్’ అనే ప్రోటియోలైటిక్ ఎన్జైమ్ జీర్ణాశయంలో ఉత్పత్తి అవుతుంది.
  2. రెనిన్ అనే ఎన్ఎజైమ్ ఆంజియో టెన్సినోజిన్ను ‘ఆంజియో టెన్సిన్-1’ గా మారుస్తుంది. ‘రెన్నిన్ అనే ఎన్ఎమ్ కెసిన్ను కాల్షియం ‘పారా కెసినేట్’గా మారుస్తుంది.

ప్రశ్న 12.
ద్రవాభిసరణ క్రమత అంటే ఏమిటి?
జవాబు:

  1. దేహంలో నీటి పరిమాణం మరియు కరిగిన ద్రావితాల సమతుల్యతను క్రమపరిచే విధానాన్నే ‘ద్రవాభిసరణ ప్రక్రియ’ అంటారు.
  2. జీవి దేహంలో ఉన్న నీటి సమతాస్థితిని నిర్వహిస్తుంది.

ప్రశ్న 13.
మూత్రం ఏర్పడటంలో కర్ణిక నాట్రియురిటిక్ పెప్టైడ్ పాత్ర ఏమిటి?
జవాబు:
ఏట్రియల్ నాట్రియురిటిక్ పెప్టైడ్ (ANP) రక్తనాళ వ్యాకోచాన్ని కలిగించి రక్తపీడనాన్ని తగిస్తుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
భూచర జీవులు సాధారణంగా యూరియోటెలిక్ లేదా యూరికోటెలిక్ కాని అమ్మోనోటెలిక్ కావు. ఎందుకు?
జవాబు:

  1. యూరియోటెలిక్ మరియు యూరికోటెలిక్ అనేవి నీటి సంరక్షణకై భూచర జీవులకు ఏర్పడిన అనుకూలనాలు.
  2. ఈ జీవులలో అమ్మోనియా అనేది ప్రాధమిక నత్రజని వ్యర్ధపదార్ధం. జలచర జీవులు అమ్మోనీయాను సులభంగా నీటిలోకి విసర్జిస్తాయి. కాని భూచర జీవులు ఈ విధంగా చేయలేవు.
  3. నీటి లభ్యత అధికంగా మరియు తగినంత ఉండే ప్రాంతంలో ఉండే భూచర జీవులు యూరియాను విసర్జిస్తాయి.
  4. సకశేరుకాల కాలేయంలో ఆర్నిధిన్ వలయం ద్వారా యూరియా ఏర్పడుతుంది. అమ్మోనియా కంటే యూరియా తక్కువ విషస్వభావాన్ని కలిగి వుంటుంది.
    ఉదా:వానపాములు, మృదులాస్థిచేపలు, ఉభయచరాలు మరియు క్షీరదాలు.
  5. నీరు తక్కువగా లభించే ప్రాంతాలలో నివసించే జీవులు ‘యూరిక్ ఆమ్లాన్ని’ విసర్జిస్తాయి. యూరిక్ ఆమ్లాన్ని పొడి (లేదా) పాక్షిక ఘనపదార్ధ రూపంగా విసర్జిస్తాయి.
    ఉదా: ఆర్థ్రోపోడాలు, భూచర నత్తలు, సరీసృపాలు, పక్షులు. వీటిని ‘యూరికోటెలిక్’ జీవులు అంటారు.

ప్రశ్న 2.
నత్రజని విసర్జకాలను అనుసరించి సకశేరుకాలను ఉదాహరణలతో గుర్తించండి. [TS MAY-22]
జవాబు:
సకశేరుకాలను అవి విసర్జించే నత్రజని వ్యర్థాల ఆధారంగా మూడు విధాలుగా విభజించారు.

  1. అమ్మోనోటెలిక్ జంతువులు
  2. యూరియోటెలిక్ జంతువులు
  3. యూరికోటెలిక్ జంతువులు

1) అమ్మోనోటెలిక్ జంతువులు: జలచర జీవులలో ప్రాధమిక నత్రజని వ్యర్ధపదార్ధం అమ్మోనియా. ఇది అత్యంత విషపూరితమైనది. ఇది కాలేయం నందు ఆమైనో ఆమ్లాల ఆక్సీడెటివ్ ‘డి అమినేషన్’ వల్ల ఏర్పడుతుంది.

2) యూరియోటెలిక్ జంతువులు: కొన్ని భూచర జీవులకు అమ్మోనియా విడుదలకు సరిపడా నీరు లభించదు, అటువంటి అమ్మోనియాను కాలేయం నందు తక్కువ విషస్వభావ పదార్ధం అయిన యూరియాగా ఆర్నిధిన్ వలయం ద్వారా మార్చి మూత్రపిండాల ద్వారా విసర్జిస్తాయి.
ఉదా:వానపాములు, మృదులాస్థిచేపలు, ఉభయచరాలు మరియు క్షీరదాలు.

3) యూరికోటెలిక్ జంతువులు: కొన్ని భూచర జీవులు నీటి లభ్యత తక్కువగా ఉన్నపుడు అమ్మోనియాను యూరిక్ ఆమ్లంగా మార్చి విసర్జిస్తాయి. అమ్మోనియాను యూరిక్ ఆమ్లంగా మార్చి కొద్దిపాటి నీటితో పాక్షిక ఘనపదార్ధంగా విసర్జిస్తాయి. నీటి సంరక్షణకు ఇది చక్కటి అనుకూలనం.
ఉదా: వాయునాళ ఆర్థ్రోపొడాలు, భూచర నత్తలు, సరీసృపాలు మరియు పక్షులు.

ప్రశ్న 3.
మూత్రపిండం నిలువుకోత పటం గీచి, భాగాలను గుర్తించండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన 1

ప్రశ్న 4.
మానవ మూత్రపిండం అంతర్నిర్మాణాన్ని వివరించండి. [AP MAY-22] [TS MAY-22]
జవాబు:
1) మూత్రపిండాల నిర్మాణం: మూత్రపిండాలు అనేవి ముదురు ఎరుపు రంగులో, తిరో ఆంత్ర వేష్టన త్వచంతో, చిక్కుడు గింజ ఆకారంలో, కశేరుదండానికి ఇరువైపులా, చివరి ఉరఃకశేరుకం యొక్క కటికశేరుకానికి అంటుకొని ఉంటాయి.

మూత్రపిండం యొక్క వెలుపలి తలం ‘కుంభాకారంగానూ’ మరియు లోపలి తలం ‘పుటాకారంగాను’ మధ్యలో ‘హైలమ్’ అనే లోతైన నోక్కుతో ఉంటుంది. వృక్క ధమని మరియు నాడులు హైలమ్ ద్వారా మూత్రపిండంలోకి మరియు వృక్కసిర మరియు వృక్క నాళం బయటికి వస్తాయి. ప్రతి మూత్రపిండం ‘ధృడమైన తంతుయుత గుళికతో ఆవరించబడి ఉంటుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన

2) అంతర్నిర్మాణం: మూత్రపిండాల అంతర్నిర్మాణం రెండు నిర్దిష్ట భాగాలైన వెలుపలి వల్కలం మరియు లోపలి దవ్వభాగాలను కలిగి ఉంటుంది. వల్కలం కణికయుతంగా, మాల్ఫీజియన్ నాళికలను, సమీప మరియు దూరాగ్ర సంవళిత నాళికలను కలిగి వుంటుంది. దవ్వ అనేక శంఖాకార, వృక్క శృంగాలుగా విభజింపబడి ఉంటుంది.
వల్కలం వృక్కశృంగాలులోనికి చొచ్చుకొనిపోయి వల్కల ‘ప్రొతాలను’ ఏర్పరుస్తుంది. వీటినే ‘బెర్టిని స్తంభాలు’ అంటారు. వృక్కశృంగాల యొక్క ఆధారం వల్కలం వైపునకు మరియు కొనభాగం ద్రోణివైపునకు అంతమవుతాయి. వృక్క శృంగాలు కొనభాగం, ద్రోణి ఏర్పరచిన కప్పులాంటి ‘కేలిసెస్ ‘లోకి చొచ్చుకుని వస్తుంది. ద్రోణి మూత్రనాళంగా వెలుపలికి బయలు చేరుతుంది.

3) వృక్క ప్రమాణం: వృక్క ప్రమాణం అనేవి మూత్రపిండం యొక్క ‘నిర్మాణాత్మక’ మరియు ‘క్రియాత్మక’ ప్రమాణాలు. కొన్ని వృక్క ప్రమాణాలు వల్కలం వరకు మాత్రమే నియంత్రించబడి, వాటి యొక్క హెనీ శక్యం చిన్నగా ఉండి దవ్వలోకి వ్యాపిస్తాయి. వీటినే ‘వల్కల వృక్క ప్రమాణాలు’ అంటారు. మిగిలిన వృక్క ప్రమాణాలు హెన్లీశిక్యాలు చాలా పొడవుగా ఉండి దవ్వలోపలి భాగానికి చేరుతాయి. వీటిని ‘జకామెడుల్లరీ వృక్క ప్రమాణాలు’ అంటారు. వృక్క ప్రమాణం యొక్క నాళాలు అన్నీ కలిసి ‘నిటారు సంగ్రహణనాళం’ ను ఏర్పరుస్తాయి. ఇది ‘వృక్క ద్రోణి’లోకి తెరుచుకుంటుంది.

ప్రశ్న 5.
మూత్ర విసర్జనను తెలపండి.
జవాబు:
మూత్ర విసర్జన:మూత్రాన్ని విడుదలచేసే ప్రక్రియను ‘మూత్రవిసర్జన’ అంటారు.

  1. మూత్రపిండాలలో ఏర్పడిన మూత్రాన్ని మూత్రనాళాలు మూత్రాశయానికి చేరుస్తాయి.
  2. మూత్రాశయం మూత్రంతో నిండుతుంది.
  3. మూత్రాశయం సాగడం ప్రారంభిస్తుంది.
  4. మూత్రాశయం గోడలలోని సాగుదలను గుర్తించే గ్రాహకాలు కేంద్రనాడీ వ్యవస్థకు సంకేతాలను పంపుతాయి.
  5. కేంద్ర నాడీ వ్యవస్థ చాలక సంకేతాలను మూత్రాశయ నునుపు కండరాల సంకోచానికి మరియు ప్రసేక సంవరణి సడలింపునకు పంపిస్తుంది.
  6. మూత్రం విడుదలవుతుంది.
  7. మూత్రపిండాలకు ఉన్న నాడీ యాంత్రికతను ‘మిక్టురిషన్ రిప్లెక్స్’ (ప్రతి చర్య) అంటారు.

ప్రశ్న 6.
మూత్రపిండం విధులలో జక గ్లామరులార్ పరికరం పాత్ర ఏమిటి?
జవాబు:
1) జక్టా గ్లామరులార్ పరికరం (JGA): జక్స్ గ్లామరులార్ పరికరం అనేది మూత్రపిండం యొక్క మరో ముఖ్యమైన నిర్మాణం. ఇది మూత్రపిండాల యొక్క విధులను నియంత్రిస్తుంది. మూత్రపిండాల యొక్క విధుల నియంత్రణలో (అధోపర్యంకం) హైపోథాలమస్ మరియు గుండె యొక్క పాత్ర ఉంటుంది. ప్రతీ వృక్క ప్రమాణంలో అభివాహి ధమనిక, దూరస్థ సంవళిక నాళికతో సంబంధాన్ని ఏర్పరుచుకొనే ప్రాంతంలో ‘జక్టా గ్లామరులార్ పరికరం’ ఉంటుంది.

ఈ ప్రాంతంలో కొన్ని మార్పు చెందిన ఉపకళాకణాలు గుంపుగా ఏర్పడి ‘మాక్యులా డెన్సా’ ను ఏర్పరుస్తాయి. అభివాహి వృక్క ధమనిక కుడ్యంలో మార్పుచెందిన నునుపు కండర కణాలు ఉంటాయి. వీటినే ‘జక్ట్స్ గ్లామరులార్ కణాలు ‘(J.G కణాలు)అంటారు.

2) విధులు:
‘జక్ట్స్ గ్లామరులార్ కణాలు’ మరియు ‘మాక్యులా డెన్సా’ కలిసి ‘జక్టా’ J.G కణాలను మూడు కారకాలు ఉత్తేజపరుస్తాయి. అవి

  1. కేశనాళికా గుచ్ఛరక్త ప్రవాహం పడిపోవటం.
  2. రక్త పీడనం పడిపోవటం.
  3. కేశనాళికా గాలనరేటు పడిపోవటం.

ఉత్తేజితమైన J.G కణాలు ‘రెనిన్’ ఎన్జైమ్ ను విడుదల చేస్తాయి.
గ్లామరులార్ పరికరాన్ని’ ఏర్పరుస్తాయి.

ఈ ఎన్ఎమ్ ఆంజియోటెన్సినోజన న్ను ఆంజియోటెన్సిన్ -I గా మార్చగా, ఇది ఆంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎన్ఎమ్ వల్ల ఆంజియోటెన్సిన్-II గా మారుతుంది.

ఈ మార్పు అనేది ఊపిరితిత్తుల కేశనాళికలలో జరుగుతుంది. ఆంజియోటెన్సిన్-II అధివృక్క గ్రంధిలోని వల్కలాన్ని ప్రేరేపించి ‘ఆల్డోస్టిరాన్’ను స్రవించేటట్లు చేస్తుంది. ఆల్డోస్టిరాన్ దూరాగ్ర సంవళిత నాళం మరియు సంగ్రహణ నాళం నుంచి Na+ అయాన్ల పునఃశోషణ మరియు K+ అయాన్లను స్రవించడంలో పాత్ర వహిస్తుంది. దీని ఫలితంగా ‘రక్త పీడనం’ మరియు కేశనాళికా ‘గుచ్ఛగాలనరేటు’ పెరుగుతుంది.

ప్రశ్న 7.
ప్రతిప్రవాహ యాంత్రికతను గురించి రాయండి.
జవాబు:
1) ప్రతిప్రవాహ యాంత్రికత:మూత్ర గాఢత అనేది నీరు మరియు (Na+) సోడియం క్లోరైడ్ల పునఃశోషణ వలన పెరుగుతుంది, దీనినే ప్రతిప్రవాహ యాంత్రికత అంటారు. వృక్క ప్రమాణం యందు మూడు రకాల ప్రతి ప్రవాహకాలు ఉంటాయి. అవి

  1. గాలిత ద్రవ ప్రతిప్రవాహం హెన్లీ శక్యం యొక్క అవరోహ మరియు ఆరోహ నాళికల యందు జరుగుతుంది.
  2. రక్తం యొక్క ప్రతి ప్రవాహం వాసారెక్టా యందు జరుగుతుంది.
  3. గాలితద్రవం రక్తానికి వ్యతిరేక దిశలో ప్రయాణించి మూత్రపిండాల నుంచి నీరు మరియు లవణాలను బయటకు విడుదల చేస్తుంది.

2) వల్కలం యందు అవరోహ నాళిక యొక్క ద్రవాభిసరణ స్థాయి 300 mosml/లీ మరియు దవ్వలోని హెన్లీశక్యం యొక్క చివరిభాగంలో 1200 mosml/లీ ఉంటుంది.

3) హెన్లీశక్యం నుంచి నీటి ప్రసరణ అనేది అధికగాఢతను ఏర్పరుస్తుంది.

4) ఆరోహనాళిక ద్వారా NaCl హెన్లీశక్యం నుంచి బయటకు విడుదలవుతుంది. ద్రవాభిసరణ స్థాయి తిరిగి 300లకు చేరుతుంది.

5) ADH హర్మోను చర్యవలన ద్రావితంలో ఉన్న అధిక నీరు సంగ్రహణ నాళిక ద్వారా శోషింపబడుతుంది. గాఢతయుత మూత్రం ద్రోణిలోకి విసర్జింపబడుతుంది. NaCl మరియు నీరు వాసారెక్టా ద్వారా సేకరించబడి మూత్రపిండాలకు రవాణా చేయబడతాయి.

6) మానవుడి మూత్రపిండాలు గాలితద్రవానికి నాలుగు రెట్లు అధిక గాఢమైన ముత్రాన్ని ఏర్పరుస్తాయి.
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన 2

ప్రశ్న 8.
విసర్జనలో కాలేయం, ఊపిరితిత్తులు, చర్మం పాత్రను వివరించండి.
జవాబు:

  1. GFR అనగా గుచ్ఛగాలన రేటు.
  2. రెండు మూత్రపిండాలు నిమిషానికి ఉత్పత్తి చేసే గాలిత ద్రవ పరిమాణాన్ని ‘రక్తనాళిక గుచ్ఛగాలితరేటు’ అంటారు.
  3. ఆరోగ్యకరమైన వ్యక్తిలో గాలితరేటు సుమారు నిమిషానికి 125మి.లీ, అంటే రోజుకు 180 లీటర్లు.
  4. కాని ఒక మనిషి నుండి కేవలం 1 నుంచి 1.5 లీటర్లు మూత్రం మాత్రమే విసర్జించబడుతుంది.
  5. సుమారు 99% గాలిత ద్రవం పునఃశోషణ చెందుతుంది.
  6. గాలిత ద్రవం రేటు పడిపోయిన వెంటనే ‘జక్సాటాగ్లోమెరులార్’ కణాలు ‘రెనిన్’ ఎన్జైమన్ను విడుదల చేస్తాయి. (ఆంజియోటెన్సినోజన్)
  7. ఈ ‘రెనిన్’ ఎన్టైమ్ ఆంజియోటెన్సినోజనన్ను ఆంజియోటెన్సిన్-Iగా మారుస్తుంది.
  8. ఆంజియోటెన్సిన్ I, ఆంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎన్జైమ్ వలన ఆంజియోటెన్సిన్-II గా మార్చబడుతుంది.
  9. ఊపిరితిత్తులలో ఈ ఎన్జైమ్ ఉండటం వలన ఊపిరితిత్తుల కేశనాళికలలో ఈ చర్య జరుగుతుంది.
  10. ఆంజియోటెన్సిన్ II, అదివృక్క గ్రంధిలోని వల్కలాన్ని ప్రేరేపించి ఆల్డోస్టిరాన్ హర్మోను స్రవించేటట్లు చేస్తుంది.
  11. ఆల్డోస్టిరాన్ దూరాగ్ర సంవళిత నాళం మరియు సంగ్రహణ నాళం నుంచి Na+ మరియు నీటిని పునఃశోషణ చేసి, DCT మరియు CD లలో K+ అయాన్లు స్రవించబడేలా చేస్తుంది.
  12. ‘రెనిన్’-ఆంజియోటెన్సిన్ – ఆల్డోస్టిరాన్ ‘ వ్యవస్థ కుడికర్ణికలోని గోడలు సాగడం వల్ల ఏట్రియల్ నాట్రియురిటిక్ కారకం (ANR) విడుదలవుతుంది. ఇది రక్తనాళ వ్యాకోచాన్ని కలిగించి రక్తపీడనాన్ని తగ్గించి మరియు GFR తగ్గించి ప్రక్రియ మరలా ప్రారంభించేలా చేస్తుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన

ప్రశ్న 9.
విసర్జనలో కాలేయం, ఊపిరితిత్తులు, చర్మం పాత్రను వివరించండి.
జవాబు:
ఊపిరితిత్తులు, కాలేయం మరియు చర్మం విసర్జక అవయవాలుగా పనిచేయు విధానం:
1) ఊపిరితిత్తులు: ఇది CO2 విడుదల యందు మరియు అనేక భాష్పశీల పదార్థాలను వెలుపలికి పంపించేందుకు సహాయపడతాయి. ఒక అంచనా ప్రకారం ఒక రోజులో ఊపిరితిత్తులు 18 లీ. CO2 ను వెలుపలికి పంపుతాయి.

2) కాలేయం: ఇది మానవుని శరీరంలో అతి పెద్ద గ్రంధి, దేహం మధ్యలో వయస్సుడిగిన RBC లను విచ్ఛిన్నం చేసే కేంద్రం. బైల్ వర్ణకాలను హీమోగ్లోబిన్ బైల్రూబిన్ మరియు బైల్వర్డిన్ గా మారుస్తుంది. ఇవి ఆహార నాళం ద్వారా విసర్జింపబడతాయి. కాలేయం కొలెస్టిరాల్, పతనం చెందిన స్టెరాయిడ్ హర్మోన్లను, అధిక విటమిన్లను మరియు మందులను పైత్యరసంతో పాటు విసర్జిస్తుంది.

3) చర్మం: ఇది స్వేదగ్రంధులు మరియు చర్మస్రావగ్రంధులను కలిగి ఉంటుంది.
‘స్వేదగ్రంధులు’ లవణాలు, యూరియా మరియు లాక్టిక్ ఆమ్లంను విసర్జిస్తాయి. శరీర ఉపరితలానికి చల్లదనాన్ని కలిగించడం దీని యొక్క ప్రధమ విధి.
చర్మస్రావ గ్రంధులు స్టీరాల్స్, హైడ్రోకార్బన్స్ మరియు వాక్స్లను ‘సీబం’ ద్వారా తొలగిస్తాయి. ఈ స్రావకం చర్మంపై రక్షణగా తైలంపూతను ఏర్పరుస్తాయి.

ప్రశ్న 10.
కింది వాటిని పేర్కొనండి.
a) ప్రాథమిక వృక్కాలు ఉన్న కార్డేటా జీవి
b) మానవుడి మూత్రపిండంలో దవ్వ శృంగాల మధ్యకు చొచ్చుకొని ఉన్న వల్కల భాగం
c) హెన్లీ శిక్యానికి సమాంతరంగా ఉన్న కేశ రక్తనాళికల వల
d) హరిత గ్రంథులను విసర్జక నిర్మాణాలుగా కలిగి ఉన్న అకశేరుకం.
జవాబు:
a) ప్రాధమిక వృక్కాలుగలిగిన కార్డేటా జీవి ‘ఆంఫీయాక్సిస్’
b) మానవుడి మూత్రపిండంలోని దవ్వ శృంగాల మధ్యకు చొచ్చుకొని ఉన్న వల్కల భాగమును ‘బెర్టిని స్తంభాలు’ అంటారు.
c) హెన్లీ శిక్యానికి సమాంతరంగా ఉన్న కేశరక్తనాళికల వలను ‘వాసారెక్టా’ అంటారు.
d) హరిత గ్రంథులను విసర్జక అవయవాలుగా కలిగి ఉన్న అకశేరుక జీవులు ‘రొయ్య’ మరియు ‘పీత’

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
మానవ విసర్జక వ్యవస్థను, వృక్క ప్రమాణం నిర్మాణాన్ని వివరించండి. [AP MAY-19][TS MAR-15,19]
జవాబు:
I. మానవ విసర్జ వ్యవస్థ: ఇది క్రింది భాగాలను కలిగి ఉంటుంది.

  1. ఒక జత మూత్రపిండాలు
  2. ఒక జత మూత్రనాళాలు
  3. మూత్రాశయం
  4. ప్రసేకం.

1. మూత్రపిండాలు:

  1. ఇవి ముదురు ఎరుపు రంగులో, తిరో ఆంత్రవేష్టన త్వచంతో, చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి.
  2. ఇవి కశేరుదండానికి ఇరువైపులా చివరి ఉరః కశేరుకం యొక్క కటికశేరుకంకు అంటుకొని ఉంటాయి.
  3. కాలేయం ఉండటం వలన కుడివైపు మూత్రపిండం, ఎడమ మూత్రపిండం కంటే కొద్దిగా దిగువగా అమరి వుంటుంది.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన 3
  4. మూత్రపిండం యొక్క వెలుపలి తలం ‘కుంభాకారంగా’ వుంటుంది.
  5. లోపలితలం ‘పుటాకారంగా’ మధ్య హైలమ్’ అనే లోతైన నొక్కును కలిగి ఉంటుంది.
  6. మూత్రపిండము ధృడమైన, తంతుయుత వృక్క గుళికతో సంరక్షించబడివుంటుంది.
  7. మూత్రపిండము అంతరంగా రెండు భాగాలను కలిగి ఉంటుంది. అవి వెలుపలి వల్కలం మరియు లోపలి దవ్వ భాగాలు.
  8. వల్కలం వృక్క ప్రమాణం యొక్క గ్లియల్ నాళికలు, సమీప మరియు దూరాగ్ర సంవళిత నాళికలను కలిగి ఉంటుంది.
  9. దవ్వ అనేక శంఖాకార, కణజాల యుత నిర్మాణాలుగా ఏర్పడుతుంది. వీటినే ‘వృక్కశృంగాలు’ అంటారు.
  10. వృక్కశృంగాలలోనికి చొచ్చుకొని పోయిన వల్కల ‘ప్రొద్ధాల’ స్తంభాలను ‘బెర్టిని స్తంభాలు’ అంటారు.

2. మూత్రనాళాలు:

  1. విసర్జక వ్యవస్థలో రెండు మూత్రనాళాలు ఉంటాయి.
  2. ఇవి మూత్రపిండాల ద్రోణి నుంచి వెలువడే సన్నటి తెల్లనాళాలు.
  3. వీటి కుడ్యా తలం మధ్యాంతర ఉపకళచే ఆవరించబడి ఉంటుంది. ఇవి కిందికి ప్రయాణించి ముత్రాశయంలోకి తెరచుకుంటాయి.

3. మూత్రాశయం:

  1. ఇది ఉదర కుహరం దిగువన మధ్య భాగంలో ఉండె ‘నిలవకోశం’
  2. ఇది మందమైన కుడ్యాన్ని కలిగి, కండరయుతంగా, విప్పారగలిగిన తలంలో మధ్యాంతర ఉపకళను కలిగి ఉంటుంది.

4. ప్రసేకం:

  1. మూత్రాశయం యొక్క మెడ భాగం ప్రసేకంలోకి ప్రవేశిస్తుంది. ఈ భాగం ‘అంతర్ ప్రసేక సంవరణి’ మరియు ‘బాహ్య ప్రసేక సంవరణి’ ని కలిగి ఉంటుంది.
  2. ప్రసేకం స్త్రీలలో యోని రంధ్రం వద్ద మరియు పురుషులలో మేహనం కొనవద్ద తెరుచుకొంటుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన

II. వృక్క ప్రమాణం నిర్మాణం ప్రతి మూత్రపిండం సుమారు ఒక మిలియన్ వృక్క ప్రమాణాలను కలిగి ఉంటుంది. ‘వృక్క ప్రమాణం’ నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం. ఇది రెండు భాగాలను కలిగి ఉంటుంది. అవి

  1. బౌమన్గుళిక మరియు
  2. వృక్క నాళిక

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన 5

 

1. బౌమన్స్ గుళిక:

  1. ఇదివల్కలం యందు ఉంటుంది.
  2. ఇది రెండు కుడ్యాలు గలిగిన కప్పులాంటి నిర్మాణం.
  3. బౌమన్స్ గుళిక లోపలి కుడ్యం నందు ‘పాదకణాలు’ అని పిలువబడే ప్రత్యేక కణాలు ప్రతికేశనాళికను ఆవరించి ఉంటాయి.
  4. ‘పాదకణాలు’ చిక్కైన అమరికతో అమరి ఉండి, ‘గాలన చీలికలు’ లేదా ‘చీలిక రంధ్రాలు’ అనే సూక్ష్మ అంతరాలను ఏర్పరుస్తాయి.
  5. ‘బౌమన్స్ గుళిక అనేక రక్తకేశనాళికలతో ఒక గుచ్ఛంలా ఏర్పడుతుంది. దీనినే ‘రక్త కేశనాళిక గుచ్ఛం’ (గ్లామరూలస్) అంటారు. రక్తకేశనాళికా గుచ్ఛం మరియు బౌమన్స్ గుళిక యొక్క లోపలి కుడ్యం రెండు కలిసి ఒక రంధ్రాన్ని ఏర్పరుస్తాయి. రక్తనాళిక గుచ్ఛం ద్వారా రక్తం అభివాహి వృక్క ధమనికను చేరి అక్కడ నుంచి అపవాహి వృక్క ధమనిక ద్వారా బయటకు వెళుతుంది.

2. వృక్క నాళిక:ఇది మూడు భాగాలను కలిగి ఉంటుంది.
(a) సమీప సంవళిత నాళం
(b) హెన్లీశిక్యం
(c) దూరాగ్ర సంవళిత నాళం

(a) సమీప సంవళిత నాళం (PCT): (i) ఇది వల్కలం యందు ఉంటుంది (iii) ఇది ఉపరితలం యందు కుంచె

(b) హెన్లీశిక్యం :

  1. ఇది ‘దవ్వ’ భాగంలో ఉంటుంది.
  2. ఇది చాలా పెద్దది మరియు చుట్టుకొని ఉంటుంది. అంచుగల సాధారణ ఘనాకార ఉపకళను కలిగి ఉంటుంది.
  3. ఇది ‘తలపిన్ను ఆకారంలో ఉంటుంది. దీనియందు అవరోహనాళిక మరియు ఆరోహనాళిక అను భాగాలు ఉంటాయి.
  4. ఆరోహనాళిక పూర్వభాగం పలచగా మరియు పరభాగం మందంగా ఉంటాయి.
  5. మందమైన ఆరోహనాళిక ‘దూరాగ్ర సంవళిత నాళం’తో కలుస్తుంది.

(c) దూరాగ్ర సంవళిత నాళం (DCT):

  1. ఇది వల్కలం యందు ఉంటుంది.
  2. దూరాగ్ర సంవళిత నాళం వల్కలంలో ‘ప్రారంభ సంగ్రహణ నాళం’గా సాగుతుంది.
  3. కొన్ని ‘ప్రారంభ సంగ్రహణ’ నాళికలు కలిసి ‘ నిటారు సంగ్రహణ నాళం’ గా ఏర్పడి, దవ్వశృంగాల ద్వారా ప్రయాణిస్తాయి.
  4. దవ్వ యందు, ప్రతీ శృంగ నాళికలు కలిసి ‘బెల్లిని నాళం’ను ఏర్పరుస్తాయి. ఇవి వృక్క సూక్ష్మాంకురం అగ్రభాగాన తెరచుకొంటుంది.

వృక్క ప్రమాణాలు రకాలు: ఇవి రెండు రకాలు (i) వల్కల వృక్క ప్రమాణాలు (ii) జాక్టా మెడుల్లరీ వృక్క ప్రమాణాలు ‘వల్కల వృక్క ప్రమాణాలు’ చిన్న హెనీశిక్యంను కలిగి, దేహభాగం ఎక్కువగా వల్కలంలోనే ఉండునట్లుగా ఉంటాయి. ‘జక్స్ట్రామోడుల్లరీ వృక్క ప్రమాణాలు’ పొడవు హెన్లీశిక్యంను కలిగి, దవ్వలోపలి భాగానికి చేరుతాయి.

ప్రశ్న 2.
మూత్రం ఏర్పడే విధానాన్ని వివరించండి. [AP MAR-20]
జవాబు:
మూత్రం ఏర్పడే విధానం: మానవులలో మూత్రపిండాలు అనేవి ప్రధాన ‘విసర్జక అవయవాలు’. ఇది మూడు ప్రక్రియలుగా జరుగుతుంది.

  1. గుచ్ఛగాలనం
  2. వరణాత్మక పునఃశోషణం
  3. నాళికా స్రావం

1) గుచ్ఛగాలనం లేదా సూక్ష్మగాలనం: బౌమన్ గుళిక యొక్క లోపలి కుడ్యం మరియు రక్తనాళికా గుచ్ఛం రెండు కలిసి ఒక రంధ్రంను ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియనందు పాదకణాలు మరియు చీలిక రంధ్రాలు సహాయపడతాయి. రక్తం నికరవడపోత పీడనం 10 మిల్లీమీటర్ Hg వద్ద వడపోయబడుతుంది. ఈ ప్రక్రియ నందు కణద్రవ్యం మొత్తం వడపోయ బడుతుంది, కాని ప్రోటీనులు మరియు రక్తకణాలు వడపోయబడవు. ఈ గాలిత ద్రవాన్ని ‘సూక్ష్మగాలన మూత్రం’ అంటారు. ఆరోగ్యకరమైన వ్యక్తిలో గాలితరేటు సుమారు 125 మి.లీ/ని అంటే రోజుకు 180లీటర్ గాలితం ఉత్పత్తి అవుతుంది.
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన 6

2) వరణాత్మక పునఃశోషణం, స్రావం: 99% ప్రాధమిక మూత్రం మరియు ఆవశ్యక పదార్ధాలు వృక్క నాళిక ద్వారా శోషించుకోబడతాయి. 85% ప్రాధమిక మూత్రం నికరంగా ఎలాంటి నియంత్రణ లేకుండా అవికల్ప పునఃశోషణ చేందుతుంది. వృక్కనాళిక ద్వారా వివిధ స్ధాయిలలో పునఃశోషణ అనేది జరుగుతుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 2(b) విసర్జక పదార్థాలు, వాటి విసర్జన

3) నాళికా స్రావం: మూత్రం ఏర్పడే సమయంలో నాళికా కణాలు H+, K+ మరియు NH3 అయాన్లను గాలిత ద్రవంలోకి స్రవిస్తాయి. మూత్రం ఏర్పడే విధానంలో నాళికా స్రావం కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇది శరీరద్రవాల అయాన్లు మరియు ఆమ్ల-క్షార సమతుల్యతకు సహాయపడుతుంది.
వృక్కప్రమాణంలోని వివిధ భాగాలలో వరణాత్మక పునఃశోషణం మరియు స్రావం కింది విధంగా జరుగుతుంది.

a) సమీప నాళికలో పునఃశోషణ:ఇది కుంచె అంచుగల ఘనాకార ఉపకళను కలిగి ఉంటుంది. సుమారు 80% విద్యుద్విశ్లేషకాలు మరియు నీరు పునఃశోషణ చెందుతాయి. నీరు ద్రవాభిసరణ పద్ధతిలో విసరణ చెందుతుంది. Na+, గ్లూకోజ్ అమైనోఆమ్లాలు మరియు ఆవశ్యక పదార్ధాలు సక్రియా రవాణా ద్వారా H+ మరియు అమ్మోనియా స్రవించబడతాయి. HCO3 శోషణం చేయబడుట వలన శరీరద్రవాల pH మరియు అయాన్ల సమతుల్యత నిర్వహించబడుతుంది.

b) హెన్లీ శిక్యం: అవరోహనాళిక నందు ఉన్న నీరు విసరణ పద్ధతి ద్వారా పునఃశోషణ చెందుతుంది. ఆరోహ నాళిక పలుచని మరియు మందమైన భాగాలను కలిగి ఉంటుంది. NaCl నిష్క్రియా పద్దతిలో పలుచని భాగం ద్వారా మరియు సక్రియా రవాణా ద్వారా మందమైన హెనీశక్యం నందు వల్కలం వైపుగా తక్కువ ఆస్మోలారిటి (300) మరియు అధిక ఆస్మోలారిటి (1200) దవ్వ కొన భాగంలో నిర్వహించబడుతుంది.

వాసారేక్టా ద్వారా ప్రతిప్రవాహంలోని రక్తం నందలి నీరు NaCl మరియు పునఃశోషణ చెందిన పదార్థాలు నిరంతరం తొలగించబడతాయి.

e) దురాగ్ర సంవళిత నాళిక (DCT): ADH (యాంటీ డై యూరిటిక్ హర్మోను)చర్య వలన నీరు పునఃశోషణ చెందుతుంది. HCO3 శోషించుకోబడుతుంది. pH స్థాయిని నిర్వహించుట కొరకు H+, K+ మరియు NH+ లు స్రవించబడతాయి.

d) సంగ్రహణ నాళం (CD): ఈ నాళం దవ్వ మిధ్యాంతర భాగానికి కొంత యూరియాను అనుమతించి దాని ‘ఆస్మోలారిటీని’ కాపాడుతుంది. ద్రోణిలోనికి గాఢయుతమైన మూత్రం విడుదల చేయబడుతుంది. మూత్రం రక్తం కంటే అధిక గాఢతను కలిగి ఉంటుంది.

Leave a Comment