AP Inter 2nd Year Zoology Important Questions Chapter 2(a) శరీరద్రవాలు, ప్రసరణ

Students get through AP Inter 2nd Year Zoology Important Questions Lesson 2a శరీరద్రవాలు, ప్రసరణ which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Zoology Important Questions Lesson 2(a) శరీరద్రవాలు, ప్రసరణ

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
వివృత (స్వేచ్ఛాయుత రకం) మరియు సంవృత రక్త ప్రసరణ వ్యవస్థల భేదాలను వివరించండి.
జవాబు:

  1. వివృత (స్వేచ్ఛాయుత రకం) ప్రసరణ:రక్తం, రక్తనాళాలు మరియు కోటరాల ద్వారా ప్రవహిస్తుంది. రక్తకేశనాళికలు ఉండవు.
    ఉదా: జలగ, ఆర్థ్రోపోడా, మొలస్కాన్లు, ఇఖైనోడెర్మలు, అసీడియన్లు.
  2. సంవృత రక్తం ప్రసరణ : రక్తం, రక్తనాళాల గుండా ప్రవహిస్తుంది. రక్తకేశనాళికలు ఉంటాయి.
    ఉదా: అనెలిడా, సెఫలోపోడా, సెఫలో కార్డేటా, సకశేరుకాలు.

ప్రశ్న 2.
సిరాకర్ణికా కణుపును లయారంభకం అని ఎందుకు అంటారు? [TS MAY-22]
జవాబు:

  1. సిరాకర్ణిక కణుపు బాహ్య ప్రేరణ లేకుండా క్రియాశక్మాలను ఉత్పత్తి చేయగలదు. కావున దీన్ని ‘లయారంభకం’ అని అంటారు.
  2. ఇది గుండె కొట్టుకోవటాన్ని ప్రారంభిస్తుంది. ఇది కుడి ప్రక్కన కుడికర్ణిక పై భాగంలో అమరి ఉంటుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 2(a) శరీరద్రవాలు, ప్రసరణ
ప్రశ్న 3.
గుండె పనిచేయడంలో కర్ణికా – జఠరికా కణుపు, కర్ణికా జఠరికా కట్ట ప్రాముఖ్యాన్ని తెలపండి.
జవాబు:

  1. ‘కర్ణికా జఠరికా కణుపు’ కుడికర్ణిక ఎడమవైపు క్రిందుగా కర్ణికా జఠరికా విభాజకం వద్ద ఉంటుంది. A.V. కణుపు అనేది ‘రిలేపాయింట్’. ఇది క్రియా శక్మలను సిరాకర్ణికా కణుపు నుంచి గ్రహిస్తుంది.
  2. కర్ణికా ‘జఠరికా గుచ్ఛం ( బండిల్ ఆఫ్ హిస్ ) అనే కణుపు పోగులు అంతర జఠరికా విభాజకంలోకి వ్యాపిస్తాయి. ‘ఇది విద్యుత్ ప్రచోదనాలను (క్రియాశక్మాలను) A.V. కణుపు నుంచి గ్రహించి జఠరికా గోడలలో ఉన్న పుర్కింజే తంతువులకు అందిస్తాయి.

ప్రశ్న 4.
మానవుడిలో కుడి, ఎడమ కర్ణికా జఠరికా రంధ్రాలను ఆవరించిన కవాటాలను పేర్కొనండి. ITS MAR-15]
జవాబు:

  1. ఎడమ కర్ణికా జఠరికా రంధ్రం ద్విపత్ర కవాటం (లేదా మిట్రల్ కవాటం) ద్వారా సంరక్షించబడతాయి.
  2. కుడి కర్ణికా జఠరికా రంధ్రం త్రిపత్ర కవాటం ద్వారా సంరక్షించబడతాయి.

ప్రశ్న 5.
మానవుడి గుండెలో థెబేషియస్ కవాటం ఎక్కడ ఉంటుంది? [AP MAY-19]
జవాబు:
కెరోనరి కోటరం కుడి కర్ణికలోకి తెరుచుకొనే రంధ్రం వద్ద ‘థెబేషియస్ కవాటం’ ఉంటుంది.

ప్రశ్న 6.
మానవుడి గుండె జఠరికల నుంచి ఏర్పడిన మహాధమనులను తెలపండి.
జవాబు:

  1. పుపుస చాపము కుడి జఠరిక యొక్క ఎడమ పూర్వభాగం నుంచి బయలుదేరుతుంది. ఇది ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు చేరవేస్తుంది.
  2. దైహిక చాపం ఎడమ జఠరిక యొక్క కుడివైపు నుంచి ఆమ్లజనిసహిత రక్తాన్ని దేహం యొక్క వివిధ భాగాలకు అందిస్తుంది.

ప్రశ్న 7.
గుండె శబ్దాలను పేర్కొని అవి ఎప్పుడు వెలువడుతాయో తెలపండి.
జవాబు:

  1. ‘లబ్’ మరియు ‘డప్’ అనేవి గుండె యొక్క శబ్దాలు.
  2. గుండె మొదటి శబ్దం ‘లబ్’ ఇది కర్ణికా జఠరికా కవాటాలు దగ్గరగా ఉండటం వలన, జఠరికలు సంకోచించే సమయంలో ఆ శబ్దం ఏర్పడుతుంది.
  3. గుండె రెండవ శబ్దం ‘డప్’ ఇది అర్ధచంద్రా కార కవాటాలు దగ్గరగా ఉండటం వలన, హర్ధిక విస్ఫారం జరిగే సమయంలో ఏర్పడుతుంది.

ప్రశ్న 8.
హార్దిక వలయం, హార్దిక వెలువరింతను నిర్వచించండి. [AP MAR-20]
జవాబు:

  1. హార్దిక వలయం: ఒక హృదయ స్పందన మొదలు కావడం నుంచి మరొక హృదయ స్పందన మొదలయ్యే వరకు జరిగే హృదయ ప్రక్రియలను ‘హార్దిక వలయం’ అంటారు. హార్దిక వలయం అవధి 0.8 సెకన్లు
  2. హార్దిక వెలువరింత : ఒక నిమిషానికి జఠరిక పంపే రక్త ఘనపరిమాణాన్ని ‘హార్దిక వెలువరింత’ అంటారు. ఇది దాదాపు 5 లీటర్లు ఉంటుంది.

ప్రశ్న 9.
ద్వంద్వ ప్రసరణ అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యాన్ని తెలపండి.
జవాబు:

  1. ఒక పూర్తి రక్తప్రసరణలో రక్తం గుండె ద్వారా రెండుసార్లు రక్తప్రసరణలో ప్రయాణిస్తుంది. దీనినే ద్వంద్వ ప్రసరణ అంటారు. ఇది పుపుస ప్రసరణ మరియు దైహిక ప్రసరణను కలిగి వుంటుంది.
  2. ప్రాముఖ్యత:ఇది ఆమ్లజని సహిత మరియు ఆమ్లజని రహిత రక్తంను ఒక దానితో ఒకటి కలవకుండా చేస్తుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 2(a) శరీరద్రవాలు, ప్రసరణ

ప్రశ్న 10.
ధమనులు సిరల కంటే ఎందుకు ఎక్కువ స్థితిస్థాపకతతో ఉంటాయి?
జవాబు:

  1. హృదయం నుంచి ప్రసరించే అధిక పీడన రక్తాన్ని ధమనులు కలిగి ఉంటాయి కావున అవి ఎక్కువ స్థితిస్థాపకతతో ఉంటాయి.
  2. సిరలు యందు ఈ పీడనం తక్కువగా ఉంటుంది. కావున వీటి గోడలు తక్కువ స్థితిస్థాపకతను కలిగి ఉంటాయి.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
సకశేరుకాలలో హృదయము – నిర్మాణ పద్ధతులలో జీవపరిణామరీత్యా ఏర్పడిన మార్పులను తెలపండి.
జవాబు:
సకశేరుకాలలో హృదయంలోని జీవ పరిణామాలు:

  1. హృదయం అనేది రూపాంతరం చెందిన రక్తనాళం అని అభివృద్ధి దశలలో ఇది స్పష్టంగా నిరూపించబడింది.
  2. చేపలలో ఒక కర్ణిక, ఒక జఠరిక గల రెండు గదుల గుండె ఉంటుంది. ఆమ్లజని రహిత రక్తం మొప్పలకు ఆక్సీకరణం కొరకు రవాణా చేయబడుతుంది. రక్తం ప్రసరణ వ్యవస్థ అనేది ఏకప్రసరణ వ్యవస్థ.
  3. ఉభయచరాలలో, రెండు కర్ణికలు మరియు ఒక జఠరిక గల మూడు గదుల గుండె ఉంటుంది. ద్వంద్వప్రసరణ వ్యవస్థకు ఇది ప్రారంభం.
  4. సరీసృపాలలో కూడా మూడు గదుల హృదయం ఉంటుంది. జఠరీక మాత్రం అసంపూర్తిగా విభజన చెంది వుంటుంది.
  5. మొసళ్ళు, పక్షులు మరియు క్షీరదాలలో హృదయం నాలుగు గదులుగా విభజన చెంది ద్వంద్వ ప్రసరణను కలిగి వుంటుంది.అనగా పుపుస మరియు దైహిక ప్రసరణలను ప్రత్యేకంగా కలిగి ఉంటుంది.

ప్రశ్న 2.
మానవ హృదయం కర్ణికలను గురించి వివరించండి.
జవాబు:
కర్ణికలు:

  1. మానవుని హృదయంలో రెండు కర్ణికలు ఉంటాయి.
  2. ఇవి పలుచని గోడలు గల ‘స్వీకరణ గదులు’.
  3. కుడి కర్ణిక, ఎడమ కర్ణిక కంటే పెద్దది.
  4. కర్ణికాంతర పటలం రెండుకర్ణికలను వేరు చేస్తుంది.
  5. పటలం యందు ఒక గర్తం ఉంటుంది. దీనినే ‘ఫోసా ఒవాలిస్’ అంటారు. ఇది పిండదశలో ఏర్పడిన చిన్న రంధ్రం యొక్క శేషం. దీనినే ‘ఫారామెన్ ఒవేల్’ అంటారు. పిండదశ ప్రసరణలో ఇది చాలా ముఖ్యమైనది.
  6. కుడి కర్ణిక ఊపిరితిత్తులు తప్ప దేహంలో మిగిలిన అన్ని భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని రెండు మహసిరల ద్వారా గ్రహిస్తుంది.
  7. ఎడమ కర్ణిక చిన్నది. ఇది ఆమ్లజనియుత రక్తాన్ని పుపుస సిరల ద్వారా ఊపిరితిత్తుల నుండి గ్రహిస్తుంది.
  8. కర్ణికా, జఠరికలు ఒకదానితో ఒకటి కర్ణికా జఠరికా రంధ్రం ద్వారా కలుపబడి ఉంటాయి. వీటిని ద్విపత్ర మరియు త్రిపత్ర కవాటాలు సంరక్షిస్తూంటాయి.

ప్రశ్న 3.
జఠరికలను గురించి వివరించండి.
జవాబు:
జఠరికలు: ఇవి హృదయం యొక్క మందమైన గోడలు కలిగిన రెండు గదులు.

  1. ఇవి రక్తాన్ని రవాణా చేయు గదులు.
  2. ఎడమ జఠరిక గోడలు కుడి జఠరిక గోడల కంటే మందంగా ఉంటాయి.
  3. రెండు జఠరికలు జఠరికాంతర పటలంలో వేరు చేయబడి ఉంటాయి.
  4. ఎడమ జఠరిక ఊపిరితిత్తులకు తప్ప దేహంలోని మిగతా అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది.
  5. కుడి జఠరిక ఊపిరితిత్తులకు మాత్రమే రక్తాన్ని సరఫరా చేస్తుంది.
  6. జఠరికల యొక్క లోపలి తలం కండరాలతో ఏర్పడి గట్లను కలిగి ఉంటుంది. వీటిని ‘కాలమ్నేకార్నే’ లేదా ‘ట్రాబిక్యులేకార్నే’ అంటారు.
  7. కొన్ని గట్లు శంకాకారంగా మరియు పెద్దగా ఉంటాయి, వీటిని ‘పాపిల్లరీ కండరాలు’ అంటారు.
  8. స్నాయురజ్జువులు అనేకొల్లాజెన్ కీలితాలు పాపిల్లరీ కుండరాలను త్రిపత్ర మరియు మిట్రల్ కవాటాలకు కలుపుతాయి.

ప్రశ్న 4.
మానవ హృదయం నిలువుకోత పటం గీచి, భాగాలను గుర్తించండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 2(a) శరీరద్రవాలు, ప్రసరణ 1

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 2(a) శరీరద్రవాలు, ప్రసరణ

ప్రశ్న 5.
హార్దిక వలయ సంఘటనలను క్లుప్తంగా రాయండి.
జవాబు:
1) హార్దిక వలయం: హార్దిక వలయం నందు మూడు దశలు ఉంటాయి. అవి కర్ణికల సంకోచం, జఠరికల సంకోచం, మరియు హార్దిక విస్ఫారం (హృదయ డయాస్టోల్).

  • రక్తం పుపుససిరలు మరియు మహసిరల ద్వారా కర్ణికలను చేరుతుంది.
  • కర్ణికల నుంచి రక్తం కర్ణికాజఠరికా రంధ్రాల ద్వారా జఠరికలలోకి చేరుతుంది.
  • ఈ దశలో పుపుస మరియు మహధమని యొక్క అర్ధచంద్రాకార కవాటాలు మూసుకొని ఉంటాయి.

2) కర్ణికల సంకోచం:

  • సిరాకర్ణికా కణుపు జనింపజేసిన క్రియాశక్మం (విద్యుత్ ప్రచోదనాలు) కర్ణికా గోడలను తాకుతుంది.
  • కర్ణిక సంకోచం చెంది రక్తాన్ని జఠరికలలోకి పంపుతుంది. దీనినే కర్ణికల సంకోచం అంటారు.

3) జఠరికల సంకోచం :

  • కణుపు నుంచి క్రియాశక్మాలు కర్ణికా జఠరికా కణుపుకు చేరతాయి. అవి AV కణుపు నుంచి బండిల్ ఆఫ్ హిస్ మరియు పుర్కింజ్ పొగులను చేరతాయి. జఠరికా సంకోచం చెంది రక్తాన్ని పుపుస మరియు దైహిక చాపాలలోకి సరఫరాచేస్తుంది.
  • మిట్రల్ కవాటం మరియు త్రిపత్ర కవాటాలు మూసుకొని మొదటి శబ్దమైన ‘లబ్’ ను ఉత్పత్తి చేస్తాయి.

4) హృదయ డయాస్టోల్:

  • జఠరికలు సడలిస్తాయి. అర్ధచంద్రాకార కవాటాలు మూసుకొనే సమయంలో రెండవ శబ్దమైన ‘డప్’ వినిపిస్తుంది.
  • జఠరికల పీడనం తగ్గగానే కర్ణికా జఠరికా కవాటాలు తెరచుకొంటాయి.
  • వలయం యొక్క ప్రక్రియ మరల ప్రారంభమవుతుంది.
  • హర్దిక వలయం యొక్క అవధి 0.8 సెకనులు.

ప్రశ్న 6.
రక్త స్కందన యాంత్రికం గురించి వివరించండి.
జవాబు:
రక్త స్కందన సం నాళ సంకోచం:గాయమైన ప్రాంతంలోని రక్తనాళం సంకోచం చెంది రక్తప్రసరణను ఆపుతుంది. ఇది గాయం జరిగిన ప్రాంతంలో ఏర్పడుతుంది. రక్తస్కందనం దశలవారీగా మూడు దశలలో జరుగుతుంది. అవి

  1. రక్తనాళసంకోచం
  2. ఫలకికల (అవరోధం బిరడా) ఏర్పడటం
  3. ఫైబ్రిన్ ప్రోటీన్ల జాలకం ఏర్పడటం.

1) రక్తకొన్ని ఫలకికలు అంటుకునేలా చేస్తాయి. ఈ రకంగా ఫలకికలు బిరడాను ఏర్పరుస్తాయి.

2) ఫలకికల బిరడా ఏర్పడటం: అంతరస్తరం చిట్లినపుడు ఫలకికలు కొల్లాజిన్కు అంటుకొంటాయి. ఫలకికలు గట్టిగా అంటిపెట్టుకుని, మరివిధానం: రక్తస్కందనం అనేది ‘రక్త స్రావనివారణ’.

3) ఫైబ్రిన్ ప్రోటీన్ల జాలకం ఏర్పడటం: గాయమైన ప్రాంతంలోకి ప్రేరణ పదార్థాలు. ఫలకికలు, రక్త ప్రోటీన్లు, ఫైబ్రిన్ ప్రోటీన్ల జాలకం ను ఏర్పరుస్తాయి.

విధానం:
1) ప్రోత్రాంబిన్ ఉత్తేజకం క్లిష్టమైన జలపాత చర్యల ద్వారా రెండు పదాలలో ఏర్పడుతుంది.
అంతర్జన్య పధం:కారకం XII హేజ్మాన్ కారకం గాయమైన రక్తంనాళం యొక్క కొల్లాజిన్ తో ఉత్తేజితం చేయబడుతుంది. ఈ కారకం ఇంకొక స్కందన కారకమైన ప్రోత్రాంబిన్ ను ఉత్తేజితం చేస్తుంది.
బహిర్జన్య పధం: గాయమైన ప్రాంతంలోని కణజాలం నుంచి త్రాంబోప్లాస్టిన్ విడుదలవుతుంది. ఇది కారకం VII ప్రోకన్వర్టిన్ ను ఉత్తేజితం చేసి ‘ప్రోత్రాంబిన్ ఉత్తేజితంను’ ఏర్పరుస్తుంది.

2) ప్రోత్రాంబిన్ ఉత్తేజితం Ca++ సమక్షంలో ప్రోత్రాంబిన్ ను ఉత్తేజితం చేసి త్రాంబిన్గా మారుస్తుంది.

3) త్రాంబిన్ కరిగే ఫైబ్రినోజన్ న్ను కరగని ఫైబ్రిన్ గా మారుస్తుంది. ఇది బలహీన H బంధనాలను కలిగి ఉంటుంది.

4) కారకం XIII ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ కారకం వదులైన హైడ్రోజన్ బంధాలను కోవలెంట్ బంధాలతో మార్చి ఫైబ్రిన్ ను స్టెబిలైజ్ చేస్తుంది.

5) ఫైబ్రిన్దారాల వల నిర్మాణం రక్తకణాలను మరియు ఫలకికలను బంధించి ఉంచుతుంది. ఈ దారాల వల నిర్మాణం కణాలను సంకోచం చెందించడంవలన ‘సీరం’ ఏర్పడుతుంది. దీనినే ‘స్కందన నివర్తనం’ అంటారు.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 2(a) శరీరద్రవాలు, ప్రసరణ

ప్రశ్న 7.
సిరాకర్ణికా కణుపు, కర్ణికా జఠరికా కణుపు భేదాలను తెలపండి.
జవాబు:
సిరాకర్ణికా కణుపు

  1. SAN (సిరా కర్ణికా కణుపు) కుడికర్ణిక కుడి పైభాగాన ఊర్ఛ్వ మహసిర రంధ్రం వద్ద వుంటుంది.
  2. SAN క్రియాశక్మాలను ఉత్పత్తి (విద్యుత్ ప్రచోదనాలను) చేసి గుండె యొక్క గోడలకు అందిస్తుంది.

కర్ణికా జఠరికా కణుపు

  1. AVN( కర్ణికా జఠరికా కణుపు) అనేది కుడి కర్ణిక ఎడమవైపు కిందుగా కర్ణికా జఠరికా విభాజకం వద్ద ఉంటుంది.
  2. AVN క్రియాశక్మాలను గ్రహించి బండిల్ ఆఫ్ హిస్కి అందిస్తుంది.

ప్రశ్న 8.
ధమనులు, సిరల మధ్య తేడాలను గుర్తించండి.
జవాబు:
ధమనులు

  1. ధమనులు అనేవి రక్తనాళాలు. ఇవి గుండె నుండి రక్తాన్ని దేహంలోని అన్ని అవయవాలకు అందిస్తాయి.
  2. ధమనులు లేత ఎరుపు రంగులో ఉంటాయి.
  3. శరీరం లోపల అమరి ఉంటాయి.
  4. ధమనుల కుడ్యం మందంగా, రెండు ఎలాస్టిన్ తంతువులు మరియు నునుపు కండరాలతో ఉంటుంది.
  5. ధమనులు ఇరుకైన కుహరాన్ని కలిగి ఉంటాయి.
  6. ధమనులలో కవాటాలు ఉండవు.
  7. ధమనులలో రక్తం అధిక పీడనంతో ప్రవహిస్తుంది.
  8. ధమనులు కేశనాళికలతో అంతమవుతాయి.

సిరలు

  1. సిరలు వివిధ అవయవాల నుండి రక్తాన్ని సేకరించి గుండెకు చేరుస్తాయి.
  2. సిరలు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి.
  3. శరీర ఉపరితంలో ఉంటాయి.
  4. సిరలు కుడ్యం పలుచగా, ఒక ఎలాస్టిన్ తంతువు మరియు పలుచని కండరాలను కలిగి ఉంటుంది.
  5. సిరలు విశాలమైన కుహరాన్ని కలిగి ఉంటాయి.
  6. సిరలు కవాటాలను కలిగి ఉంటాయి.
  7. సిరలలో రక్తం నెమ్మదిగా తక్కువ పీడనంతో ప్రవహిస్తుంది.
  8. సిరలు కేశనాళికలతో ప్రారంభమవుతాయి.

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
మానవుడి గుండె నిర్మాణాన్ని చక్కటి పటాలతో వివరించండి. [TS MAY-19] [AP MAR-18,22] [TS MAR-16, 17, 20, 22]
జవాబు:
మానవుని గుండె నిర్మాణం: మానవుని హృదయం బోలుగా కండరయుతంగా, శంఖు ఆకారంలో మరియు స్పందించే అవయవంగా, రెండు ఊపిరితిత్తుల మధ్య (మీడియాస్టీనం) కుహరంలో అమరి ఉంటుంది.

1) హృదయావరణం: హృదయం రెండు పొరల హృదయావరణం త్వచంతో ఆవరించబడి ఉంటుంది. వెలుపలి పొర ‘తంతుయుత హృదయావరణం’ అని మరియు లోపలి పొర ‘సీరస్ హృదయావరణం’ అని అంటారు. రెండు పొరల మధ్య హృదయావరణ ద్రవం ఉంటుంది. ఇది రాపిడిని తగ్గించి, గుండె యొక్క స్వేచ్ఛా కదలికలను అనుమతిస్తుంది.

2) గుండె గోడ: ఇది మూడు పొరలను కలిగి ఉంటుంది.

  • వెలుపలి ఎపికార్డియం
  • మధ్య మయోకార్డియం
  • లోపలి ఎండోకార్డియం

3) బాహ్యనిర్మాణం: మానవుని గుండెలో నాలుగు గదులు ఉంటాయి.

  1. పై రెండు చిన్న గదులను ‘కర్ణికలు’ అంటారు.
  2. దిగువ రెండు పెద్ద గదులను ‘జఠరికలు’ అంటారు.
  3. కర్ణికలు మరియు జఠరికలను వేరు చేస్తు లోతైన అడ్డుగాడి వుంటుంది. దీనిని ‘కరోనరి సల్కస్’ అంటారు.
  4. ప్రతి కర్ణిక ఒక చిన్న చెవి వంటి నిర్మాణాన్ని కలిగి వుంటుంది. దీనిని ‘కర్ణికా ఉండూకం’ అంటారు.
  5. జఠరికలు రెండు, జఠరికాంతర గాడులతో వేరు చేయబడతాయి. దీనిలో కరోనరి ధమని మరియు దానిశాఖలు ఇమిడి ఉంటాయి.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 2(a) శరీరద్రవాలు, ప్రసరణ 2

4. అంతర్నిర్మాణం:
హృదయ అంతర్నిర్మాణ భాగాలు: (a) కర్ణికలు (b) జఠరికలు (c) కణపు కణజాలం (d) ధమనీ చాపాలు

(a) కర్ణికలు:

  • కర్ణికలు పలుచటి గోడలను కలిగి రక్తాన్ని సేకరిస్తాయి. కుడి కర్ణిక ఎడమ కర్ణిక కంటే పెద్దది.
  • కర్ణికలు రెండూ పలుచని కర్ణికాంతర పటలం ద్వారా వేరు చేయబడతాయి.
  • పిండదశలో కర్ణికాంతర పటలంకు ఒక చిన్న రంధ్రం ఉంటుంది. దీనినే ‘ఫారామెన్ ఒవేల్’ అంటారు.
  • పెద్దవారి యందు కర్ణికాంతర పటలం యొక్క రంధ్రం మూసుకుపోయి గర్తం మిగులుతుంది. దీనినే ‘ఫోసాఒవాలిస్’ అంటారు.
  • కుడి కర్ణిక ఆమ్లజని రహిత రక్తాన్ని దేహం యొక్క వివిధ భాగల నుండి సేకరిస్తుంది. (ఊపిరితిత్తులు తప్ప)
  • ఎడమ కర్ణిక ఆమ్లజని సహిత రక్తాన్ని ఊపరితిత్తుల నుంచి రెండు జతల పుపుస సిరలు ద్వారా గ్రహిస్తుంది.
  • కర్ణిక మరియు జఠరికలు రెండూ కర్ణికా జఠరికా పటలం ద్వారా వేరు చేయబడతాయి.

(b) జఠరికలు :

  1. ఇవి మందమైన గోడలను కలిగి రక్తాన్ని పంప్ చేయడానికి సహాయపడతాయి.
  2. జఠరకిలు రెండూ జఠరికాంతర పటలంతో వేరు చేయబడి ఉంటాయి.
  3. ఎడమ జఠరిక యొక్క గోడలు కుడి జఠరిక యొక్క గోడలకంటే మందంగా ఉంటాయి.
  4. జఠరికల యొక్క లోపలి తలం కండరాలతో ఏర్పడిన గట్లను కలిగి ఉంటుంది. వీటినే కాలమ్నే కార్ని అంటారు.
  5. వీటిలో కొన్ని గట్లు పెద్దవిగాను మరియు శంకాకారంగా ఉంటాయి, వీటిని ‘పాపిల్లరీ కండరాలు’ అంటారు.
  6. కొల్లాజెన్ కీలితాలైన ‘స్నాయురజ్జువులు’ పాపిల్లరీ కండరాలను, త్రిపత్ర మరియు మిట్రల్ కవాటాలను కలుపుతాయి.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 2(a) శరీరద్రవాలు, ప్రసరణ

(c) కణుపు కణజాలం :

  1. ఇది గుండె యొక్క రూపాంతరం చెందిన కణం. ఇది రెండు కణుపులను మరియు తంతువులను కలిగి ఉంటుంది.
  2. సిరాకర్ణిక కణుపు (SAN) కుడి కర్ణిక కుడి పై భాగాన ఊర్ధ్వమహసిర రంధ్రం వద్ద ఉంటుంది.
  3. కర్ణికా జఠరికా కణుపు (AVN) కుడి కర్ణిక ఎడమవైపు కిందుగా కర్ణికా జఠరికా విభాజకం వద్ద ఉంటుంది.
  4. AVN కణపు, AV పోగులు లేదా హిస్ పోగులను ఏర్పరుస్తుంది. ఇది కుడి మరియు ఎడమ శాఖలుగా చీలుతుంది.

(d) ధమనీ చాపాలు: మానవుని యందు రెండు ధమనీ చాపాలు ఉన్నాయి.
(i) పుపుస చాపం: ఇది కుడి జఠరిక యొక్క ఎడమ పూర్వ భాగం నుంచి బయలుదేరుతుంది. కుడి జఠరిక పుపుస చాపంలోకి తెరచుకునే రంధ్రాన్ని సంరక్షిస్తూ ‘పుపుస కవాటం’ ఉంటుంది. ఇది ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు చేరవేస్తుంది.

(ii) దైహిక చాపం: ఇది ఎడమ జఠరిక నుంచి బయలుదేరుతుంది. దైహిక చాపంలోనికి తెరచుకునే రంధ్రాన్ని ‘మహధమనీ కవాటం’ సంరక్షిస్తుంది. ఇది ఆమ్లజని యుత రక్తాన్ని దేహంలోని వివిధ భాగాలకు దాని యొక్క శాఖల ద్వారా అందిస్తుంది.
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 2(a) శరీరద్రవాలు, ప్రసరణ 3

ప్రశ్న 2.
మానవుడి గుండె పనిచేసే విధానాన్ని వివరించండి.
జవాబు:
గుండె పనిచేయు విధానం:

  1. క్రియాశక్మాల ఉత్పత్తి మరియు రవాణా
  2. హర్ధిక వలయం
  3. ద్వంద్వ ప్రసరణ

1. క్రియాశక్మాల ఉత్పత్తి మరియు రవాణా :కణుపు కణజాలం ఉత్పత్తి చేసిన క్రియాశక్మాల వలన గుండె గదులు సంకోచం చెందుతాయి. ఇవి కర్ణికల సంకోచాన్ని ప్రేరేపిస్తాయి.

2. హర్ధిక వలయం: ఒక హృదయ స్పందన మొదలు కావడం నుంచి మరొక హృదయ స్పందన మొదలయ్యే వరకు జరిగే హృదయ ప్రక్రియలను ‘హర్ధిక వలయం’ అంటారు. హర్ధిక వలయం 0.8 సెకనులలో పూర్తి అవుతుంది. హర్ధిక వలయం మూడు దశలలో జరుగుతుంది. (a) కర్ణికల సిస్టోల్ (b) జఠరికల సంకోచం (c) హర్ధిక విస్ఫారం.

(a) కర్ణికల సంకోచం: సిరాకర్ణిక కణుపు జనింపజేసిన క్రియాశక్మం రెండు కర్ణికలను ప్రేరేపించి, కర్ణికా సంకోచాన్ని కలిగిస్తుంది.

  1. ఇది సుమారు 0.1 సెకను ఉంటుంది.
  2. ఈ ప్రక్రియ జఠరికలలో సుమారు 30% రక్తాన్ని నింపుతుంది.
  3. మిగిలిన రక్తం కర్ణిక సంకోచం కంటే ముందుగానే జఠరికలోకి ప్రవహిస్తుంది.

(b) జఠరికల సంకోచం: క్రియాశక్మాలు కర్ణికా జఠరికా కణుపును చేరతాయి. ఇది రిలే కేంద్రంగా పనిచేస్తుంది. విద్యుత్ ప్రచోదనాలు బండిల్ ఆఫ్ హిస్ మరియు పుర్కింజీపోగుల ద్వారా జఠరికలను చేరి, జఠరికల సంకోచాన్ని కలిగిస్తాయి.

  1. ఇది సుమారు 0.3 సెకనులు పాటు జరుగుతుంది.
  2. కర్ణికల సడలిక మరియు జఠరికల సంకోచం ఒకేసారి జరుగుతుంది.
  3. జఠరికలు సంకోచించే సమయంలో వాటిలో పీడనం పెరుగుతుంది. దీనివలన కర్ణికా జఠరికా కవాటాలు మూసుకొంటాయి.
  4. అందువలన రక్తం వెనకకు ప్రవహించకుండా నిరోధించబడుతుంది.
  5. ఫలితంగా మొదటి గుండె చప్పుడు ‘లబ్’ ఏర్పడుతుంది.
  6. జఠరికలలో పీడనం ఇంకా పెరగడం వల్ల అర్ధచంద్రాకార కవాటాలు తెరచుకుంటాయి. దీనివలన రక్తం ధమనీ చాపాలలోకి ప్రవహిస్తుంది.

(c) హర్ధిక విస్ఫారం : జఠరికలు సడలడం మరియు వాటిలో పీడనం తగ్గడం జరుగుతుంది. దీనివలన అర్ధచంద్రాకార కవాటాలు మూసుకొంటాయి.

  1. ఇది సుమారు 0.4 సెకనులు పాటు జరుగుతుంది.
  2. ఫలితంగా గుండె యొక్క రెండవశబ్దం ‘డప్’ వినిపిస్తుంది.
  3. గుండె యొక్క అన్ని గదులు విరామస్థితిలో (ఉమ్మడి విస్ఫారదశ) ఉంటాయి. వెంటనే ఇంకొక హర్ధిక వలయం ప్రారంభమవుతుంది.
  4. సాధారణంగా మానవుని యొక్క గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది.
  5. ప్రతి గుండె స్పందనకు జఠరికల నుంచి సరఫరా చేయబడే రక్తం సుమారుగా 70 మి. లీ. మరియు ఒక నిమిషానికి సుమారుగా 5 లీటర్లు ఉంటుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 2(a) శరీరద్రవాలు, ప్రసరణ

3) ద్వంద్వ ప్రసరణ: ఇది రెండు ఏకాంతర ప్రసరణలను కలిగి ఉంటుంది.

  1. పుపుస ప్రసరణ: కుడి జఠరిక నందు ఉన్న రక్తం పుపుస ధమనిలోకి మరియు అక్కడి నుంచి ఊపిరితిత్తులను ‘ చేరుతుంది. ఆమ్లజనియుత రక్తం పుపుస సిరల ద్వారా ఎడమ కర్ణికను చేరుతుంది.
  2. దైహిక ప్రసరణ: ఎడమ దైహిక చాపం అనేది ఎడమ జఠరిక నుంచి బయలుదేరి ధమనుల ద్వారా రక్తాన్ని దేహంలోని వివిధ భాగాలకు సరఫరా చేస్తుంది. సిరలు అనేవి దేహంలోని వివిధ భాగాల నుండి రక్తాన్ని సేకరించి కుడి కర్ణిక యొక్క మహసిర ద్వారా గుండెకు చేరుస్తాయి.

Leave a Comment