AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం

Students get through AP Inter 2nd Year Zoology Important Questions Lesson 1b శ్వాసించడం, వాయువుల వినిమయం which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Zoology Important Questions Lesson 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న1.
వైటల్ కెపాసిటిని నిర్వచించండి. దాని ప్రాముఖ్యం ఏమిటి?
జవాబు:

  1. వైటల్ సామర్ధ్యం (VC): బలవంతపు నిశ్వాసం తరువాత ఒక మనిషి పీల్చగల గాలి యొక్క గరిష్ట ఘనపరిమాణాన్ని ‘వైటల్ సామర్ధ్యం’ అంటారు.
  2. వైటల్ సామర్ధ్యం అనునది టైడల్ వాల్యుమ్, ఉచ్ఛ్వాస నిలవ వాల్యుమ్ మరియు నిశ్వాస నిలవ వాల్యుమ్ల మొత్తానికి సమానం. అనగా VC = TV+ ERV+ IRV
  3. ప్రాముఖ్యం: వైటల్ సామర్ధ్యం (VC) ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించుటకు సహాయపడుతుంది.

ప్రశ్న 2.
మాములు నిశ్వాసంలో ఊపిరితిత్తులలో మిగిలిన గాలి ఘనపరిమాణం ఎంత?
జవాబు:
సాధారణ నిశ్వాసం తరువాత ఊపిరితిత్తులలో మిగిలి ఉన్న గాలి ఘనపరిమాణాన్ని క్రియాత్మక అవశేష సామర్థ్యం (FRC) అంటారు. సూత్రం: FRC = ERV + RV

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం

ప్రశ్న 3.
ఆక్సిజన్ వ్యాపనం వాయుకోశ ప్రాంతంలో మాత్రమే జరుగుతుంది. శ్వాసవ్యవస్థ మిగిలిన భాగాలలో జరగదు. మీరు దీన్ని ఏవిధంగా సమర్థిస్తారు?
జవాబు:

  1. వాయుకోశాలు ఏకత్వచయుత ఉపకళతో ఆవరించి, రక్త కేశనాళికలను కలిగి ఉంటాయి. కావున ఇవి శ్వాసక్రియ యొక్క వాయువుల వినిమయం జరిగే భాగాలు.
  2. వాయునాళం, శ్వాస నాళాలు మరియు శ్వాస నాళికలు రక్తకేశనాళికలు లేకుండా అనేక త్వచలను కలిగి ఉంటాయి.
    ఈ మూడు నాళాలు వాయువుల రవాణాకు ఉపయోగపడతాయి కాని, వినిమయం కొరకు కాదు.

ప్రశ్న 4.
ఆక్సిజన్ రవాణాలో pCO2 ప్రభావం ఏమిటి?
జవాబు:

  1. pCO2 పెరుగుదల, హిమోగ్లోబిన్ నందు ఆక్సిజన్ యొక్క లభ్యత తగ్గుదలను సూచిస్తుంది.
  2. pCO2 తరుగుదల, హిమోగ్లోబిన్ నందు ఆక్సిజన్ యొక్క లభ్యత పెరుగుదలను సూచిస్తుంది.

ప్రశ్న 5.
మానవుడు కొండలను ఎక్కుతున్నప్పుడు శ్వాసక్రియ ఏవిధంగా జరుగుతుంది?
జవాబు:

  1. ఎత్తు పెరిగే కొలది వాతావరణంలో p02 తగ్గుతూ ఉంటుంది.
  2. మనిషి కొండపైకి వెళితే అక్కడ ప్రతీ శ్వాసకు ఆక్సిజన్ తక్కువ మోతాదులో అందుతుంది.
  3. రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుట వలన శ్వాసక్రియా రేటు పెరుగుతుంది.
  4. అదే సమయంలో రక్తంలో ఆక్సిజన్ సరఫరాను పెంచుటకు హృదయ స్పందన పెరుగుతుంది.

ప్రశ్న 6.
టైడల్ వాల్యూమ్ అంటే ఏమిటి? ఆరోగ్యవంతుడైన మానవుడిలో టైడల్ వాల్యూమ్ (సుమారు విలువ) ఒక గంటకు ఎంత ఉంటుంది?
జవాబు:

  1. టైడల్ విలువ (T.V) అంటే సాధారణ ఉచ్ఛ్వాస (లేదా) నిశ్వాసాలలో పీల్చుకొనే (లేదా) విడుదల చేసే గాలి ఘనపరిమాణం.
  2. ఇది సుమారు 500 మి.లీ వుంటుంది.
  3. ఆరోగ్యవంతుడైన మానవునిలో T.V విలువ నిమిషానికి 6000 ml నుండి 8000ml; లేదా గంటకు 360000 ml నుండి 480000 ml ఉంటుంది.

ప్రశ్న 7.
ఆక్సీ హీమోగ్లోబిన్ వియోగ వక్రరేఖను నిర్వచించండి. సిగ్మాయుడల్ వ్యూహనానికి మీరు ఏదైన కారణాన్ని సూచించగలరా?
జవాబు:

  1. ఆక్సిజన్ పాక్షిక పీడనానికి, హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో సంతృప్తి చెందిన శాతానికి సంబంధాన్ని సూచిస్తూ గీచే వక్రరేఖను O2 హీమోగ్లోబిన్ వియోజన వక్రరేఖ అంటారు.
  2. సాధారణ స్థితి వద్ద ఆ వక్రరేఖ సిగ్మాయిడ్గా మరియు సాధారణంగా ఉంటుంది.
  3. CO2 గాఢత పెరిగినపుడు, వక్రరేఖ కుడివైపునకు విస్ధాపనం చెందుతుంది.
  4. CO2 గాఢత తగ్గినపుడు, వక్రరేఖ ఎడమవైపునకు వంగుతుంది. ఈ రకంగా వక్రరేఖ సిగ్మాయిడల్ వ్యూహనాన్ని ఏర్పరుస్తుంది.

ప్రశ్న 8.
కాంకే అంటే ఏమిటి?
జవాబు:

  1. ముక్కు భాగం నందు ఉండే మూడు మెలితిరిగిన అస్ధి ఫలకాలను కాంకే అంటారు.
  2. ఇవి లోపలికి పీల్చిన గాలి ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం

ప్రశ్న 9.
క్లోరైడ్ విస్తాపం అంటే ఏమిటి? [TS MAY-22] [AP MAR-16]
జవాబు:
క్లోరైడ్ విస్తాపం: కణజాలాల వద్ద ప్లాస్మా మరియు RBC మధ్య జరిగే క్లోరైడ్ మరియు బైకార్బోనేట్ అయాన్ల వినిమయాన్ని క్లోరైడ్ విస్తాపం (హంబర్గర్ దృగ్విషయం) అంటారు .

ప్రశ్న 10.
ఏవైన రెండు వృత్తిపర శ్వాసరుగ్మతలను (occupational respiratory disorders) తెలిపి, అవి మానవుడిలో కలుగచేసే లక్షణాలను తెలపండి. [AP MAR-18]
జవాబు:
వృత్తిపర శ్వాసరుగ్మతలు: కొన్ని పరిశ్రమల నుంచి వెలువడే హానికర పదార్ధాలు గాలిలోకి విడుదలవుతాయి. వీటికి ఎక్కువ కాలం గురైతే శ్వాసరుగ్మతలు కలుగుతాయి.

  1. ఆస్బెస్టాసిస్ : ఆస్బెస్టాస్ రేణువులకు గురికావడం వలన ‘ఆస్బెస్టాసిస్’ వ్యాధి కలుగుతుంది.
  2. నలుపు ఊపిరితిత్తివ్యాధి: ఇది బొగ్గుగనులలో పనిచేసే వారిలో బొగ్గు ధూళిని పీల్చడం వల్ల వస్తుంది. ఇతర రుగ్మతలు సిలికోసిస్ (క్వారిలలో), సిడిరోసిస్ (ఇనుము)లు ఏర్పడతాయి.

ప్రశ్న 11.
మామూలు శ్వాసకదలికలకు తోడ్పడే కండరాలేవి? [TS MAY-22] [AP MAY-22]
జవాబు:
సాధారణ శ్వాసక్రియా చలనములలో తోడ్పడే కండరాలు :

  1. విభాజక పటం కండరాలు
  2. వెలుపలి మరియు లోపలి పర్శుకాంతర కండరాలు (ప్రక్కటెముకల కండరాలు)

ప్రశ్న 12.
ఆక్సీహీమోగ్లోబిన్ వియోజన రేఖ పటం గీయండి.
జవాబు:
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం 1

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
సాధారణ పరిస్థితులలో ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను వివరించండి. [TS MAY-22] [TS MAR-15]
జవాబు:
ఉచ్ఛ్వాసం:

  1. ఊపిరితిత్తుల ద్వారా పరిసరాలలోని గాలిని లోపలికి తీసుకోవడాన్ని ‘ఉచ్ఛ్వాసం’ అంటారు.
  2. ఇది క్రియాశీల ప్రక్రియ. విభాజక పటల కండరాల కదలిక వలన ఈ ప్రక్రియ జరుగుతుంది. దీనివలన విభాజక పటలం యొక్క పూర్వ – పర అక్షంలో ఉరఃకుహర ఘనపరిమాణం పెరుగుతుంది.
  3. వెలుపలి పర్శుకాంతర కండరాల సంకోచం వల్ల పర్శుకల ప్రక్కలు మరియు ఉరఃకుహర పృష్టోదర అక్షంలో విశాలమవుతాయి.
  4. పర్శుకలు మరియు విభాజక పటలములను లాగితే అవి ఊపిరితిత్తులకు అతుక్కొని ఉన్న పుపుస త్వచమును గుంజుతాయి.
  5. దీని వలన పుపుస అంతర పీడనము, వాతావరణ పీడనం కంటే తగ్గుతుంది.

నిశ్వాసం:

  1. ఊపిరితిత్తుల నుండి గాలిని బయటకు పంపుటను ‘నిశ్వాసం’ అంటారు.
  2. ఇది నిష్క్రియాత్మక ప్రక్రియ వెలుపలి పర్శుకాంతర కండరాల సడలిక వలన జరుగుతుంది.
  3. ఉరఃకుహర ఘనపరిమాణం యధాస్థానానికి చేరుకోవడం వలన పుపుస ఘనపరిమాణం తగ్గుతుంది.
  4. గాలి ప్రయాణించే మార్గాల ద్వారా ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు పోతుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం

ప్రశ్న 2.
CO2 రవాణాకు వివిధ యంత్రాంగాలు ఏవి? వివరించండి? [ TS MAR-17][AP MAR,MAY-19] [ TS MAY-19]
జవాబు:
CO2 రవాణా ప్రక్రియ:
ఊపిరితిత్తులకు CO2 ఈ క్రింది మూడు రకాలుగా రవాణా అవుతుంది.

  1. 7% కార్బానిక్ ఆమ్లం
  2. 20-25% కార్బమైనో సమ్మేళనం
  3. 70% బైకార్బొనేట్

1) కార్బానిక్ ఆమ్లం: 7% CO2, H2O తో కలిసి కార్బోనిక్ ఆమ్లంను ఏర్పరుస్తుంది. ఇది ఊపిరితిత్తులకు చేరగానే CO2 మరియు H2O గా విడగొట్టబడుతుంది.

2) కార్బ్మైనో సమ్మేళనం: దాదాపు 20-25%, CO2 హీమోగ్లోబిన్ యొక్క స్వేఛ్చా అమైనో సముదాయంతో కలిసి కార్బఎమైనో హీమోగ్లోబిన్ ను ఏర్పరుస్తుంది. ఇది విలోమ చర్య.
Hb-NH2 + CO2 → Hb – NHCOO+H+

3) బైకార్బోనేట్ : 70% CO2 కార్బోనిక్ ఎనైడ్రేజ్ సమక్షంలో నీటితో కలిసి H2CO3 గా మారుతుంది. కార్బోనిక్ ఎన్హైడ్రేజ్ అనే ఎన్ఎమ్ RBC లో అధికంగా మరియు ప్లాస్మాలో స్వల్పంగా ఉంటుంది. RBC లో కార్బానిక్ ఆమ్లం HCO3, H+ అయాన్లుగా వియోజనం చెందుతుంది.

4) pCO2 తక్కువగా ఉన్న వాయుకోశాల వద్ద ఈ చర్య వ్యతిరేక దిశలో జరిగి CO2 మరియు H2O లను ఏర్పరుస్తుంది.

5) ఈ విధంగా కణజాలాలు CO2 ను బైకార్బోనేట్గా గ్రహించి, వాయుకోశాలకు రవాణా చేస్తాయి. ఇక్కడ నుంచి అది CO2 గా విడుదలవుతుంది.

ప్రశ్న 3.
మానవుడిలో శ్వాసకదలికలు ఏవిధంగా నియంత్రించబడతాయి?
జవాబు:
శ్వాస కదలికల నియంత్రణ:

ప్రశ్న 4.
బలమైన ఉచ్ఛ్వాస మరియు నిశ్వాస కాకుండా మిగిలిన శ్వాసక్రియా కదలికలు అన్నీ అనియంత్రితాలే. శ్వాసక్రియా నియంత్రణ అనేది ఈ క్రింది వాటిపై ఆధారపడి ఉంటుంది.
జవాబు:

  1. శ్వాసక్రియా జనక కేంద్రం (RRC) మెదడులోని మజ్జా ముఖంలో ఒక ప్రత్యేక కేంద్రం.
  2. మెదడు కాండంలోని పాన్లోని ‘న్యూమోటాక్సిక్ కేంద్రం’.
  3. ‘శ్వాసలయ కేంద్రం’ ప్రక్కన ఉండే ‘రసాయన జ్ఞానప్రాంతం’.
  4. మహధమని చాపం మరియు కారోట ధమనులపై గల రసాయన గ్రాహకాలు.
  5. శ్వాస కదలిక నియంత్రణ ప్రధానంగా ‘శ్వాసలయ జనక కేంద్రం’ పై ఆధారపడి ఉంటుంది.
  6. ‘న్యూమోటాక్సిక్ కేంద్రం’ RRC కి సంకేతాలను పంపి, శ్వాసక్రియా రేటు గురించి హెచ్చరిస్తుంది.
  7. ‘రసాయన జ్ఞానప్రాంతం’ CO2 మరియు H+ అయాన్లకు సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది. రక్తం నందు CO2 మరియు H+ అయాన్ల గాఢత పెరిగినపుడు ఇది RRC కి సంకేతాలను పంపుతుంది. కావున RRC శ్వాసక్రియా రేటును పెంచి CO2 మరియు H+అయాన్ల గాఢతను తొలగిస్తుంది.

మహధమని చాపం మరియు కెరోటిడ్ ధమనులపై గల రసాయన గ్రాహకాలు కూడా CO2 మరియు H+అయానుల గాఢత రక్తంలో పెరిగినపుడు RRC కి సంకేతాలను పంపుతాయి. వెను వెంటనే అవసరమైన చర్యలు తీసుకోబడతాయి.

కింది వాటి మధ్య భేదమేమిటి? (a) IRV మరియు ERV (b) ఇన్ స్పిరేటరీ సామర్థ్యం, ఎక్స్పిరేటరీ సామర్థ్యం (c) వైటల్ కెపాసిటి, పూర్ణ పుపుస సామర్థ్యం.

a) ఉచ్ఛ్వాస నిలవ ఘనపరిమాణం (IRV):బలవంతంగా ఊపిరిపీల్చినపుడు టైడల్ ఘనపరిమాణం కంటే అధికంగా పీల్చుకోగలిగిన గాలి ఘనపరిమాణాన్ని ‘ఉచ్ఛ్వాస నిలువ ఘనపరిమాణం’ అంటారు. ఇది సుమారు 2500 మి.లీ నుంచి 3000 మి.లీ వరకు ఉంటుంది.

నిశ్వాస నిలవ ఘనపరిమాణం (ERV) :బలవంతపు నిశ్వాసంలో టైడల్ ఘనపరిమాణం కంటే అధికంగా బయటకు వదిలిన గాలి ఘనపరిమాణాన్ని ‘నిశ్వాస నిలవ ఘనపరిమాణం’ అంటారు. ఇది సుమారు 1000 మి.లీ నుంచి 1100 మి.లీ.

b) ఉచ్ఛ్వాస సామర్ధ్యం (IC): సాధారణ నిశ్వాసం తరువాత ఒకవ్యక్తి లోపలికి తీసుకోగల గాలి మొత్తం ఘనపరిమాణాన్ని ‘ఉచ్ఛ్వాస సామర్ధ్యం’ అంటారు. ఇది టైడల్ విలువ మరియు IRV ల మొత్తం. ఇది సూమారు 3000 మి.లీ నుంచి 3500 మ.లీ వరకు ఉంటుంది.

నిశ్వాస సామర్ధ్యం (EC): సాధారణ ఉచ్ఛ్వాసం తరువాత ఒకవ్యక్తి బయటకు వదిలిన గాలి మొత్తం ఘనపరిమాణాన్ని ‘నిశ్వాస సామర్ధ్యం’ అంటారు. ఇది టైడల్ విలువ మరియు ERV లమొత్తం. ఇది సుమారు 1100 మి.లీ నుంచి 1600 మి.లీ వరకు ఉంటుంది.

c) వైటల్ సామర్ధ్యం(VC): ఇది బలవంతపు ఉచ్ఛ్వాసం తరువాత పీల్చగల గరిష్ట గాలి ఘనపరిమాణం.
సూత్రం: VC = IRV + ERV + TV.
పూర్ణ పుపుస సామర్ధ్యం: బలవంతపు ఉచ్ఛ్వాసం తరువాత ఊపిరితిత్తులలో ఉండే గాలి మొత్తం ఘనపరిమాణం ఇది వైటల్ సామర్ధ్యం మరియు అవశేష ఘనపరిమాణాల మొత్తం.

ప్రశ్న 5.
శ్వాస వ్యవస్థ రుగ్మతలను వివరించండి. [ AP MAR-15,16,17,20,22] [TS MAR-16,18,19,20,22][ TS MAY-17]
జవాబు:
శ్వాస వ్యవస్థ యొక్క రుగ్మతలు:
A) ఉబ్బసవ్యాధి
B) బ్రాంకైటిస్
C) ఎంఫైసీమా
D) న్యూమెనియా
E) వృత్తిపర శ్వాసరుగ్మతలు

A) ఉబ్బసవ్యాధి: ఉబ్బస వ్యాధి నందు శ్వాసనాళం మరియు శ్వాసనాళికా రెండింటిలోను వాపు ఏర్పడటం వలన శ్వాసించడం కష్టంగా ఉంటుంది. దగ్గు, ఈల లాంటి శబ్దం, ఛాతి బిగపట్టినట్లుగా ఉండి, శ్వాసించడం కష్టంగా ఉండటం ఇవన్నీ ఉబ్బసం యొక్క లక్షణాలు.

B) బ్రాంకైటిస్: శ్వాసనాళికలలో శ్లేష్మస్తరంలో వాపు ఏర్పడటం వల్ల శ్లేష్మం ఉత్పత్తి అధికవుతుంది. దీర్ఘకాలం దగ్గు, దీనితోపాటు చిక్కటి శ్లేష్మం మరియు కఫం ఏర్పడుట దీని లక్షణాలు.

C) ఎంఫైసీమా: ఇది ఒక రకమైన దీర్ఘకాలిక పుపుస శ్వాస ఇబ్బంది కలిగించే రుగ్మత. వాయుకోశాల త్వచాలు బాగుచేయుటకు పనికిరానంతంగా దెబ్బతింటాయి. ఊపిరితిత్తుల యందు చిన్న గాలి సంచులు ఏర్పడి గాలిని గ్రహిస్తాయి. ఈ వ్యాధికి ముఖ్యకారణం పొగత్రాగడం. ఈ వ్యాధిగ్రస్తులు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందికి గురవుతారు.

D) న్యూమోనియా: ఇది ‘స్ట్రెప్టోకోకస్ న్యూమోనియే’ అనే బాక్టీరియా ఊపిరితిత్తులో సంక్రమణం చెందడం వలన కలుగుతుంది. మిగతా సంక్రమణ వైరస్లలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్లు మరియు మైకోప్లాస్మాల వలన జరుగుతుంది. ఊపిరితిత్తులలో వాపు, వాయుకోశాలలో నీటి శాతం అధికంగా కలిగిన శ్లేష్మం చేరడం, అనేవి దీని యొక్క లక్షణాలు.
ఉబ్బసం వ్యాధి, బ్రాంకైటిస్ మరియు ఎంఫెసీమా అనేవి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు.

E) వృత్తి పర శ్వాస రుగ్మతలు:
ఎక్కువకాలం కొన్ని పరిశ్రమలు యందు పనిచేసినపుడు వివిధ రకాల రుగ్మతలు ఏర్పడతాయి. అవి.

  1. ఆస్బెస్టాసిస్: ఆస్బెస్టాసిస్ పరిశ్రమలో పని చేసే వారికి వస్తుంది.
  2. సిలికోసిస్: గనులలో మరియు క్వారీలలో పని చేసే వారికి వస్తుంది.
  3. సిడిరోసిస్ :స్టీల్ మరియు ఇనుమ పరిశ్రమలలో పని చేసే వారికి వస్తుంది.
  4. నలుపు ఊపిరితిత్తి వ్యాధి: బొగ్గు గనులలో ఎక్కువకాలం పని చేసే వారికి వస్తుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
మానవుడి శ్వాస వ్యవస్థను వివరించండి.
జవాబు:
I) శ్వాసక్రియా వ్యవస్థ: మానవుని శ్వాసక్రియా అంగాలు ఊపిరితిత్తులు మరియు దాని అనుబంధ నాళాలు. ఈ వ్యవస్థ గాలి మరియు శ్వాసక్రియా భాగాలు రెండింటిని కలిగి ఉంటుంది.
గాలి రవాణా భాగం ఈ క్రింది నిర్మాణాలను కల్గి ఉంటుంది.

  1. బాహ్య నాసికా రంధ్రాలు
  2. నాసికా కక్ష్యలు
  3. నాసికా గ్రసని
  4. స్వరపేటిక
  5. వాయునాళం
  6. శ్వాసనాళాలు మరియు శ్వాసనాళికలు

a) బాహ్య నాసికా రంధ్రాలు: ముక్కు చివర ఒకజత రంధ్రాలు పైపెదవి పైన అమరి ఉంటాయి . ఇవి నాసిక కక్ష్యల్లోకి తెరచుకుంటాయి.

b) నాసికా కక్ష్యలు: ఇవి తాలువుకు పై భాగాన ఉంటాయి. రెండు కక్ష్యలు నాసిక విభాజకం ద్వారా వేరు చేయబడతాయి. ప్రతి కక్ష్యలో మూడు భాగాలు ఉంటాయి.

  1. ‘అళింద భాగం’: ఇందులో రోమాలు మరియు చర్మస్రావ గ్రంధులు ఉంటాయి.
  2. ‘శ్వాస భాగం’: ఇది మూడు మెలితిరిగిన అస్థిఫలకాలైన ‘కాంకే’ (టర్బినల్స్) ను కలిగి ఉంటుంది. ఇది గాలి ఉష్ణోగ్రత నిబంధనకారిగా పనిచేస్తుంది.
  3. ఘ్రాణభాగం: ఇది ఘ్రాణ ఉపకళతో ఆవరించబడి ఉంటుంది.

c) నాసిక గ్రసని: ఇది మృదుతాలువు పై అమరి ఉంటుంది. నాసిక కక్ష్యలు ఒకజత అంతర నాసిక రంధ్రాల ద్వారా నాసిక గ్రసనిలోకి తెరుచుకుంటాయి..

d) స్వరపేటిక: స్వరపేటికను ‘ధ్వని పేటిక’ అని కూడా అంటారు. తొమ్మిది మృదులాస్థులు దీనికి ఆధారంగా ఉంటాయి.అవి థైరాయిడ్, క్రికాయిడ్, ఉపజిహ్విక అనే అద్వంద్వ మృదులాస్థులు, కార్నిక్యులేట్, ఎరిటినాయిడ్ మరియు క్యునిఫామ్ అనే మృదులాస్థుల జతలుగా ఉంటాయి.

ఉపజిహ్విక అనేది పలుచని మృదులాస్థి. ఇది జిహ్వికను కప్పుతూ, ఆహరాన్ని లేదా నీటిని స్వరపేటికలోకి పోకుండా నిరోధిస్తుంది. స్వరతంత్రులు అనేవి పసుపు పచ్చని స్థితిస్థాపక తంతువులు. ఇవి థైరాయిడ్ మరియు ఎరిటినాయిడ్ మృదులాస్థుల మధ్య ఉంటాయి. స్వర తంత్రుల మధ్య ఉన్న సన్నని ఖాళీ ప్రదేశాన్ని ‘రిమా గ్లాటిడిస్’ అంటారు. థైరాయిడ్ మృదులాస్థి ఉదరభాగం నందు ఉన్న ఉబ్బెత్తును ‘ఆడమ్స్ ఆపిల్’ అంటారు.

e) వాయునాళం: ఇది పొడవైన నిటారు నాళం. ఇది ‘C’ ఆకారపు మృదులాస్థిని ఆధారంగా కలిగి ఉంటుంది. కాచాభ మృదులాస్థి వలయాలు పృష్ఠతలంలో అసంపూర్ణంగా ఉంటాయి. వాయునాళపు లోపలి తలం మిథ్యాస్తరిత శైలికామయ ఉపకళతో ఆవరించి ఉంటుంది.

f) శ్వాసనాళాలు మరియు శ్వాసనాళికలు: వాయునాళం అయిదో ఉరః కశేరుకస్థాయి వద్ద రెండు ప్రాధమిక శ్వాసనాళాలుగా ఏర్పడుతుంది.

  1. ప్రతి ప్రాధమిక శ్వాసనాళం ద్వితీయ శ్వాస నాళాలుగా మరల తృతీయ శ్వాసనాళాలుగా చీలి శాఖలను ఏర్పరుస్తాయి.
  2. ప్రతి తృతీయ శ్వాసనాళం ప్రాథమిక, ద్వితీయ, తృతీయ మరియు చివరి శ్వాసనాళికలుగా విభజించబడుతుంది.
  3. శ్వాస నాళికలు వాయు కోశాలతో అంతమయ్యే వాయు కోశగోణుల గుంపులోకి తెరచుకుంటాయి.
  4. ఈ పూర్తి అమరిక తల కిందులుగా ఉండే వృక్షంలా ఉంటుంది.

II) శ్వాసక్రియా భాగం: ఇది వాయుకోశ నాళాలు మరియు వాయుకోశాలను కలిగి ఉంటుంది. ఊపిరితిత్తులు: ఇవి ఉరఃకుహరంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తాయి. వీటిని ఆవరించి రెండు పొరల పుపుస త్వచం ఉంటుంది. ఈ రెండుపొరల మధ్య పుపుస ద్రవం ఉంటుంది. ఇది లోపలి పుపుస త్వచం ఊపరితిత్తుల బాహ్యతలాన్ని అంటి పెట్టుకుని, వెలుపలి పుపుస త్వచం ఉరఃకుహరం యొక్క లోపలి తలాన్ని అంటిపెట్టుకుని వుంటుంది.
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం 2

ఉరః కుహరం గాలి చొరబడని గది. ఉరఃకుహర ఘనపరిమాణంలో ఏవిధమైన మార్పు ఏర్పడినా దాని ప్రభావం ఊపిరితిత్తులపై పడుతుంది.

ప్రశ్న 2.
రక్తంలో ఆక్సిజన్, కార్బడై ఆక్సైడ్ రవాణా గురించి వ్యాసం రాయండి?
జవాబు:
వాయువుల రవాణా: ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్లు రక్తం ద్వారా రవాణా చేయబడతాయి. ఆక్సిజన్ రవాణా: ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ 97% RBC ద్వారా మరియు 3% ఆక్సిజన్ కరిగిన స్థితిలో ఉన్న ప్లాస్మా ద్వారా కణజాలాలకు రవాణా చెందుతుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం

RBC ద్వారా ఆక్సిజన్ రవాణా: ఎర్ర రక్తకణాలలో హీమోగ్లోబిన్ ఉంటుంది. ప్రతి హీమోగ్లోబిన్ అణువు నాలుగు ఆక్సిజన్ అణువులను రవాణా చేయగలుగుతుంది. ఆక్సిజన్ అణువు వాయుకోశాలలోని హీమోగ్లోబిన్ ను పాక్షిక పీడనం ఎక్కువగా ఉండటం వలన బంధించి ఉంచుతుంది. దీనివలన ఆక్సీ హీమోగ్లోబిన్ ఏర్పడుతుంది. వాయుకోశాల యందు ఉష్ణోగ్రత, PCO2 తక్కువగా మరియు pH అధికంగా ఉంటాయి. ఈ విధానాన్ని ఆమ్లజనీకరణం అంటారు.

Hb+4O2 ⇌ Hb(O2)4

కణజాలాలలో PO2 పాక్షికపీడనం తక్కువగా ఉంటుంది. PCO2, ఉష్ణోగ్రత అధికంగాను మరియు pH తక్కువగా వున్నటువంటి పరిస్థితులలో ఆక్సీహిమోగ్లోబిన్ ఆక్సిజన్ మరియు హీమోగ్లోబిన్గా వియోజనం చెందుతుంది.
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం 3

హీమోగ్లోబిన్ తో సంతృప్తశాతాన్ని PO2 కు వ్యతిరేకంగా వక్రరేఖను గీసినపుడు సిగ్మాయిడ్ రేఖ ఏర్పడుతుంది. దీనినే ‘ఆక్సీ హీమోగ్లోబిన్ వియోజన వక్రరేఖ’ అంటారు.

వాయుకోశాలలో PO2 అధికంగా లేదా PCO2 తక్కువగా లేదా PH అధికంగా లేదా ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నపుడు సిగ్మాయిడ్ వక్రం అనేది ఎడమవైపునకు విస్థాపనం చెందుతుంది. సంతృప్తత అనేది 97% వరకు ఉంటుంది.

వాయుకోశాలలో PCO2 అధికంగా లేదా PH తక్కువగా లేదా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వక్రం కుడివైపుకు విస్థాపనం చెందుతుంది.

హీమోగ్లోబిన్ 70% ఆక్సిజన్ ను రవాణా చేయగా 25-27% ఆక్సిజన్ మాత్రమే కణజాలాలలో వియోజనం చెందుతుంది. ఆక్సీ హీమోగ్లోబిన్ల వియోజనం పై PCO2 మరియు pH ల ప్రభావాన్ని ‘బోర్ ప్రభావం’ అంటారు. CO2 రవాణా:CO2 ఈ క్రింది మూడు రకాలుగా రవాణా అవుతుంది.

  1. 7% కరిగిన స్ధితి
  2. 20-25% కార్ఎమైనో సమ్మేళనం
  3. 70% బైకార్బోనేట్

1) కరిగిన స్థితి: CO్క నీటితో కలిసి H2O ను ఏర్పరచి ప్లాస్మాకి రవాణా చెందుతుంది.
CO2 + H2O →H2CO3

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం 4

2) కార్బ్మైనో సమ్మేళనం: కణజాలాల యందు CO2 కేశనాళికల లోపల హీమోగ్లోబిన్ యొక్క ఎమైనో సముదాయంతో కలిసి కార్బోఎమైనోహీమోగ్లోబిన్ ను ఏర్పరుస్తుంది. ఇది విలోమచర్య
Hb-NH2 + CO2 ⇌ Hb-NHCOO + H+

వాయుకోశాలలో CO2 విడుదలవుతుంది.

3) బైకార్బొనేట్: 70% CO2 సోడియం బైకార్బొనేట్గా ప్లాస్మాలోకి రవాణా అవుతుంది.

క్లోరైడ్ విస్ధాపనం: RBC యందు కార్బోనిక్ ఎన్డ్రేజ్ ఎన్జైమ్ ఉంటుంది. దీని సమక్షంలో CO2, H2O తో కలిసి H2CO3 ని ఏర్పరుస్తుంది.

H2CO3 వియోజనం చెంది HCO3 మరియు H+ అయాన్లుగా మారుతుంది. విద్యుత్ సమతుల్యతను కాపాడటానికి HCO3 అయాన్లు ప్లాస్మాలోకి వ్యాపనం చెందుతాయి.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(b) శ్వాసించడం, వాయువుల వినిమయం

ప్లాస్మాలో ఉన్న క్లోరైడ్ అయాన్లు RBC లోకి వ్యాపనం చెందుతాయి. H+ అయాన్లు హీమోగ్లోబిన్ కలిసి HHbను ఏర్పరుస్తాయి. ప్రక్రియనే ‘క్లోరైడ్ విస్తాపం’ (లేదా) ‘హంబర్గర్ దృగ్విషయం’ అంటారు. వాయుకోశాల యందు అధిక PO2 వలన,CI అయాన్లు ప్లాస్మాలోకి వ్యాపనం చెందుతాయి.

HCO3 అయాన్లు RBC లోకి వ్యాపనం చెంది అక్కడ ఉన్న H+ అయాన్లతో కలిసి H2CO3 ను ఏర్పరుస్తాయి. H2CO3 వియోజనం చెంది H2O మరియు CO2గా మారుతుంది CO2 వాయుకోశాలలోకి బదిలి చెందుతుంది.

Leave a Comment