AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం

Students get through AP Inter 2nd Year Zoology Important Questions Lesson 1a జీర్ణక్రియ, శోషణం which are most likely to be asked in the exam.

AP Inter 2nd Year Zoology Important Questions Lesson 1(a) జీర్ణక్రియ, శోషణం

Very Short Answer Questions (అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
మానవ ప్రౌఢదశలోని దంత ఫార్ములాను తెలపండి. [TS MAY-19][TS MAR-15]
జవాబు:

  1. మానవుడి దంత సూచిక = \(\frac{2123}{2123}\)
  2. ఈ దంత సూచిక ప్రతి దవడ సగభాగంలో ఉండే దంతాల అమరికను తెలియజేస్తుంది.
  3. అవి కుంతకాలు (I) = 2/2; రదనికలు (C) = 1/1; అగ్ర చర్వణకాలు (PM) = 2/2; చర్వణకాలు (M) = 3/3

ప్రశ్న 2.
పైత్యరసంలో జీర్ణ ఎన్జైమ్లు ఉండవు. అయినా జీర్ణక్రియలో ముఖ్యమైంది. ఎలా? [TS MAR-16]
జవాబు:

  1. పైత్యరసంలో ఎటువంటి జీర్ణ ఎన్జైమ్లు ఉండవు, కాని అది పైత్యలవణాలను కలిగి ఉంటుంది. ఈ పైత్యలవణాలు క్రొవ్వులను ఎమల్సీకరణం ద్వారా చిన్న మైసెల్లెలుగా మారుస్తాయి.
  2. పైత్యరసం లైపేజ్ను ఉత్తేజపరుస్తుంది. ఇది ఎమల్సీకరణం చెందిన క్రొవ్వులను క్రొవ్వు ఆమ్లాలుగా మరియు గ్లిసరాల్గా మారుస్తుంది. ఈ రకంగా పైత్యరసం క్రొవ్వుల జీర్ణక్రియలో సహాయపడుతుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం
ప్రశ్న 3.
కైమోట్రిప్సిన్ పాత్రను వివరించండి. ఇదే రకానికి చెంది ఇదే గ్రంథి స్రవించిన రెండు ఎన్ఎమ్లను పేర్కొనండి.
జవాబు:

  1. క్లోమగ్రంధి యొక్క ‘ కైమోట్రిప్సిన్’ ప్రోటీన్ల జీర్ణక్రియలో ముఖ్యపాత్రను పోషిస్తుంది. ఇది ప్రోటీన్లను ప్రోటిమేజ్లుగా, పెప్టోన్లను ట్రైపెప్టైడ్లు మరియు డైపెప్టైడ్లుగా మారుస్తుంది.
  2. క్లోమ గ్రంథి స్రవించే మరో రెండు ఎన్ఎమ్లు ట్రిప్సిన్ మరియు కార్బాక్సిపెప్టిడేజ్.

ప్రశ్న 4.
జీర్ణాశయంలో HCl స్రవించకపోతే ఏమి జరుగుతుందో తెలపండి.
జవాబు:
జీర్ణాశయంలో HCl స్రవించకపోతే

  1. ఆమ్ల pH (1.8) అనేది కొనసాగదు.
  2. పెప్సిన్ ఉత్తేజితం కాదు.
  3. ప్రోటీన్ జీర్ణక్రియ మరియు పాలపదార్థాల జీర్ణక్రియ జరగదు.
  4. ఆహారం ద్వారా ప్రవేశించిన సూక్ష్మజీవులు చంపబడవు.

ప్రశ్న 5.
గర్తదంతి (thecodont) ద్వివార దంతి పదాలను వివరించండి.
జవాబు:
1) గర్తదంతి: దంతాలు దవడ ఎముక గర్తాలలో ఇమిడి ఉండే దంత అమరికను ‘గర్తదంతి’ అంటారు. ఉదా: మానవుల దంతాలు.

2) ద్వివార దంతి: జీవితకాలంలో రెండు సార్లు దంతాలు ఏర్పడటాన్ని ద్వివార దంత అంటారు. మొదటిసారివి ఊడిపోయే దంతాలు(పాలదంతాలు). ఊడిపోయిన తరువాత రెండవసారి శాశ్వత దంతాలతో భర్తి చేయబడతాయి. ఉదా: అనేక క్షీరదాలు మరియు మానవులు.

ప్రశ్న 6.
‘స్వయం ఉత్ప్రేరణ’ అంటే ఏమిటి? రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:

  1. స్వయం ఉత్ప్రేరణ: ఉత్ప్రేరణ చర్యలో దేనినైతే ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారో అదే ఆ చర్యలో ఒక ఉత్పన్నంగా వస్తే అటువంటి చర్యను స్వయం ఉత్ప్రేరణ చర్య అంటారు. (or)
  2. ఉదా: పెప్సిన్, ట్రిప్సిన్
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 1

ప్రశ్న 7.
కైమ్ అంటే ఏమిటి? [TS MAR, MAY-17,19][AP MAR-15,17]
జవాబు:

  1. కైమ్: జీర్ణాశయంలో అసంపూర్ణంగా జీర్ణమై, ఆమ్లయుతంగా వున్న ఆహారాన్ని ‘కైమ్’ అంటారు.
  2. జీర్ణాశయ కండరాల చిలకబడే కదలికల వలన ఇది ఏర్పడుతుంది.

ప్రశ్న 8.
మానవుడిలోని వివిధ రకాల లాలాజల గ్రంథులను పేర్కొని అవి నోటిలో ఏ ప్రాంతాల్లో ఉన్నాయో తెలపండి. [AP MAR-20]
జవాబు:
మానవుని యందు 3 జతల లాలాజల గ్రంధులు కలవు.

  1. ‘పెరోటిడ్ గ్రంధులు’: ఇవి వెలుపలి చెవి యందు ఉంటాయి (చెవిలంబిక).
  2. ‘అధోజంభికా గ్రంధులు (లేదా) సబ్మండిబులార్ గ్రంధులు’ : క్రింది దవడ మూలం నందు అమరి ఉంటాయి.
  3. ‘అధిజిహ్వికా గ్రంధులు’: నాలుక క్రింది భాగంలో అమరి ఉంటాయి.

ప్రశ్న 9.
మానవుడి నాలుకపై గల వివిధ సూక్ష్మాంకురాలను పేర్కొనండి. [APMAY-19][APMAR-19][TSMAR-18]
జవాబు:
నాలుక పై మూడు రకాల సూక్ష్మాంకురాలు ఉంటాయి. (నాలుక పైభాగంలో చిన్నగా పొడుచుకొని వచ్చే నిర్మాణాలు)

  1. ‘ఫంజీఫామ్’ సూక్ష్మాంకురాలు: ఇవి పూర్వ ఉపాంతలో నాలుకచివర ఉంటాయి
  2. ‘తంతురూప’ సూక్ష్మాంకురాలు: ఇవి నాలుక ఉపరితలంలో ఉంటాయి.
  3. ‘సర్కంవెల్లేట్’ సూక్ష్మాంకురాలు:ఇవి నాలుక ఆధార భాగంలో ఉంటాయి.

ప్రశ్న 10.
మానవుడి దేహంలో అత్యంత కఠిన పదార్థం ఏది? అది ఏ విధంగా ఏర్పడుతుంది?
జవాబు:

  1. మానవుని దేహంలో అత్యంత కఠిన పదార్థం పింగాణి (దంత యొక్క కిరీట భాగాన్ని ఏర్పరుస్తుంది.)
  2. బహిస్త్వచం నుంచి ఏర్పడిన ఎమియోబ్లాస్ట్లు స్రవించడం వలన ఇది ఏర్పడుతుంది.

ప్రశ్న 11.
మానవుడి జీర్ణనాళంలో అవశేష అవయవంగా ఉండి, శాకాహారులలో బాగా అభివృద్ధి చెందిన ఈ భాగం ఏది? ఏ రకపు కణ జాలంతో ఏర్పడుతుంది?
జవాబు:

  1. క్రిమిరూప ఉండూకం అనేది మానవుల యందు అవశేష అవయవం ఇది శాఖాహారుల జీర్ణక్రియా వ్యవస్థ నందు బాగా అభివృద్ధి చెందినది మరియు ఉపయోగకరమైనది.
  2. ఉండూకం శోషరస కణజాలంతో ఏర్పడుతుంది.

ప్రశ్న 12.
మింగడం, నమలడం మధ్య బేధాన్ని తెల్పండి.
జవాబు:
మింగడం

  1. ఇందులో ఆహారం లాలాజలం మరియు శ్లేష్మంతో కలిసి ముద్దగా మారి అది గ్రసని నుంచి ఆహారవాహికకు మింగడం ద్వారా చేరుతుంది.
  2. మింగే ప్రక్రియ నందు ఆహారం ఎటువంటి ఎన్ఎమ్లతో కలువదు.

నమలడం

  1. ఇందులో ఆహారాన్ని దంతాలతో నమలడం ద్వారా నాలుక మరియు లాలాజలం సహాయంతో చిలకడం మరియు మదించడం చేయబడుతుంది.
  2. నమిలే ప్రక్రియలో ఆహారం లాలాజల గ్రంధులతో కలుస్తుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం

ప్రశ్న 13.
నీళ్ల విరేచనాలు, మలబద్ధకం మధ్య భేదాన్ని తెలపండి.
జవాబు:
నీళ్ల విరేచనాలు

  1. నీళ్ళ విరేచనాలంటే జీర్ణంకాని ద్రవరూప ఆహారం పెద్దప్రేగుని చేరి అసాధారణ ఆంత్ర కదలికల ద్వారా బయటకు పంపబడటం.
  2. దేహానికి నీటి నష్టం (నిర్జలీకరణ) జరుగుతుంది.

మలబద్ధకం

  1. మలబద్దకం అనగా నీరు తక్కువై పెద్ద పేగు కదలికలు తగ్గి మలం పురీషనాళంలో నిల్వ ఉండటం.
  2. మలం గట్టిగా తయారవుతుంది.

ప్రశ్న 14.
ఆంత్రమూలంలోని శ్లేష్మస్తరం స్రవించే రెండు హార్మోనులను పేర్కొనండి
జవాబు:
ఆంత్రమూలంలోని శ్లేష్మస్తరం స్రవించే హర్మోనులు:

  1. జఠర నిరోధక పెప్టైడ్ (GIP)
  2. సెక్రెటిన్
  3. కొలెసిస్టోకైనిన్ (CCK)

ప్రశ్న 15.
శోషణ, స్వాంగీకరణం మధ్య బేధాన్ని తెలపండి. [TS MAR-20]
జవాబు:
శోషణ

  1. జీర్ణక్రియలో జీర్ణం కాబడిన ఆహారం జీర్ణవ్యవస్థ నుంచి రక్తంలోకి గ్రహింపబడే ప్రక్రియనే శోషణ అంటారు.
  2. ఇది చిన్న పేగులో జరుగుతుంది.

స్వాంగీకరణం

  1. శోషణ చెందిన పోషక పదార్ధాలు, కణాలు మరియు కణజాలలచే గ్రహించబడే ప్రక్రియనే స్వాంగీకరణం అంటారు.
  2. ఇది దేహం యొక్క ప్రతికణంలో జరుగుతుంది.

Short Answer Questions (స్వల్ప సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
దంతం నిలువుకోత పటం గీచి, భాగాలు గుర్తించండి. [TS MAR, MAY-17] [ AP MAR-16,17,18,19,20][AP_MAY-19] [ AP MAR-15][TS MAR-19]
జవాబు:
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 2

ప్రశ్న 2.
జీర్ణాశయంలో మాంసకృత్తుల జీర్ణక్రియను వివరించండి.
జవాబు:
జీర్ణాశయంలో మాంసకృత్తుల జీర్ణక్రియ:

  1. ప్రోటీన్ల జీర్ణక్రియ జీర్ణాశయంలో ప్రారంభమై చిన్నపేగులో ముగుస్తుంది.
  2. ఆహారం జీర్ణాశయంలో చేరగానే, జఠర రసం అనే జీర్ణక్రియా ఆమ్ల రసం స్రవించబడుతుంది.
  3. ఆహారం ఈ జఠర రసంతో కలిసి ‘కైమ్’ అనే పాక్షిక ద్రవపదార్ధంగా మారుతుంది.
  4. ఈ జఠర రసం HCI, పెప్సినోజన్ న్ను, రెనిన్ను మరియు శ్లేష్మాన్ని కల్గి ఉంటుంది.
  5. HCl ‘పెప్సిన్ చర్యకు’ సరిపడా ఆమ్ల pH (1.8) ను కొనసాగిస్తుంది.
  6. పెప్సిన్ మాంసకృత్తులను (ప్రోటీన్ల) జీర్ణం చేసే ఎన్జైమ్.
  7. HCl చైతన్య రహిత పెప్సినోజన్ ను చైతన్యవంతమైన పెప్సిన్గా మారుస్తుంది.
  8. ‘క్రియాశీల పెప్సిన్’ ప్రోటీన్లను ప్రోటియేజ్లు మరియు పెప్టోన్లుగా మారుస్తుంది.
  9. శిశువులలో HCl చైతన్య రహిత ప్రోరెనిన్ను చైతన్యవంతమైన రెనిన్ ఎన్జైమ్ మారుస్తుంది.
  10. రెనిన్ ఎన్ఎమ్ కెసీన్ (పాలప్రోటీన్)ను కాల్షియం అయానుల సమక్షంలో కాల్షియం పారాకేసినేట్ (CP) మారుస్తుంది.
  11. పెప్సిన్’ CP ను పెప్టోన్లుగా మారుస్తుంది.
  12. ఈ పూర్తి ప్రక్రియ జీర్ణాశయంలో 4-5 గంటల పాటు జరుగుతుంది.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 3

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం

ప్రశ్న 3.
మాంసకృత్తుల జీర్ణక్రియలో క్లోమ రసం పాత్రను వివరించండి.
జవాబు:
ప్రోటీన్ల జీర్ణక్రియలో క్లోమరసం పాత్ర :-

  1. క్లోమగ్రంధి క్లోమరసాన్ని స్రవిస్తుంది.
  2. ఇది మూడు రకాల క్రియారహిత ఎన్జైమ్లను కల్గి ఉంటుంది.
    (i) ట్రిప్సినోజన్ (ii) కైమోట్రిప్సినోజన్ (iii) ప్రోకార్బాక్సి పెప్టిడేజ్
  3. ఆంత్రశ్లేష స్తరం ‘ఎంటిరోకైనేజ్’ అనే ఎన్జైము స్రవిస్తుంది.
  4. క్రియారహిత ట్రిప్సినోజన్ ‘ఎంటిరోకైనేజ్ ఎన్జైమ్ చర్య’ వలన క్రియాశీల ట్రిప్సిన్గా మారుతుంది.
  5. ఈ ట్రిప్సిన్ క్రియారహిత కైమోట్రిప్సినోజనన్ను క్రియాశీల కైమోట్రిప్సిన్ గా మారుస్తుంది.
  6. అంతేకాకుండా ట్రిప్సిన్, టిప్సినోజెన్ ను ట్రిప్సిన్గా స్వయంగా (స్వయం ఉత్ప్రేరణ) మారుస్తుంది.
  7. క్లోమరసం యొక్క ప్రోటియోలైటిక్ ఎన్ఎమ్లు క్రైమ్లో ఉండే ప్రోటీనులు, ప్రోటియోజ్లు మరియు పెప్టోన్ల పై చర్యజరిపి ట్రైపెప్టైడ్లు మరియు డైపెప్టైడ్లుగా మారుస్తాయి.
  8. ట్రైపెప్టైడ్లు మరియు డైపెప్టైడ్లు రెండూ కూడా జీర్ణరస ఎన్జైమ్లుగా పనిచేస్తాయి.
  9. చివరగా ఇవి చిన్నపేగులో అమైనో ఆమ్లాలుగా మార్చబడతాయి. ఇవే ప్రోటిన్ల జీర్ణక్రియ యొక్క అంత్య ఉత్పన్నాలు.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 4

ప్రశ్న 4.
పాలిశాకరైడ్, డైశాకరైడ్లు ఏ విధంగా జీర్ణమవుతాయి?
జవాబు:
పాలిశాకరైడ్లు మరియు డైశాకరైడ్ (కార్బోహైడ్రేట్లు) జీర్ణక్రియ, నోరు మరియు చిన్న పేగు యందు జరుగుతుంది. HCl ఉండటం వలన కార్బోహైడ్రెట్ల జీర్ణక్రియ జీర్ణాశయం నందు జరగదు.
(a) నోటియందు జీర్ణక్రియ:

  1. నోటియందు విడుదలయ్యే లాలాజలం, కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేసే లాలాజల ఎమైలేజ్ ఎన్జైమన్ను కలిగి ఉంటుంది.
  2. ఈ ఎన్ఎమ్ కార్బోహైడ్రేట్లోని (30% పిండిపదార్థాన్ని) కొంత భాగాన్ని జలవిశ్లేషణ చేసి మాల్టోజ్ (డై శాకరైడ్)గా మారుస్తుంది.

(b) చిన్నపేగు యందు జీర్ణక్రియ:

  1. మిగిలిన కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ చిన్నపేగు యందు, క్లోమరసం యొక్క ఎమైలేజ్ మరియు జీర్ణరసం యొక్క డైశాకరైడేజ్ ద్వారా జరుగుతుంది.
  2. ఇక్కడ, కార్బోహైడ్రేట్లు మాల్టోజ్లు సూక్రోజ్లు మరియు లాక్టోజ్లుగా మార్చబడతాయి.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 5
  3. ఈ డైశాకరైడ్లు, మోనోశాకరైడ్లుగా డైశాకరైడెజ్ ఎన్ఎమ్ ద్వారా మార్చబడతాయి.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 6
  4. చివరగా అన్ని కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్, జీర్ణాశయం త్వరగా శోషించే విధంగా మార్చబడతాయి.

ప్రశ్న 5.
మీ ఆహారంలో వెన్న తీసుకుంటే, అది ఏ విధంగా జీర్ణం అవుతుందో, శోషణం చెందుతుందో వివరించండి. [TS MAR-16]
జవాబు:
వెన్న యొక్క జీర్ణక్రియ:

  1. వెన్న అనేది క్రొవ్వు (లిపిడ్)
  2. ఇది చిన్న పేగులో మాత్రమే జీర్ణమవుతుంది.
  3. పైత్యరసం, పైత్య లవణాలను కలిగి వుంటుంది. ఇవి ఎమల్సీకరణం ద్వారా కొవ్వును చిన్న మెసెల్లెలుగా మారుస్తాయి.
  4. పైత్యరసం, లైపేజ్నకూడా క్రియాశీలం చేస్తుంది. ఈ లైపేజ్ ఎమల్సీకరణం చెందిన కొవ్వులను ఫాటీ ఆమ్లాలు మరియు గ్లిసరాల్గా మారుస్తుంది.

వెన్న యొక్క శోషణ:

  1. ‘ఫాటీ ఆమ్లాలు మరియు గ్లిసరాల్’, రెండూ నీటిలో కరగలేని కారణంగా రక్తంలోకి ప్రత్యక్షంగా శోషించబడవు.
  2. ఇవి మొదట చిన్న మైసెల్లెలుగా మార్చబడి, జీర్ణాశయ గోడల పై ఉండే శ్లేష్మస్తరంను చేరుతాయి.
  3. అక్కడ అవి ప్రోటీన్లతో ఆవరింపబడి చిన్న చిన్న కొవ్వు గుళికల రూపంలోకి మారుతాయి.
    వీటినే కైలోమైక్రాన్లు అంటారు.
  4. ఈ కైలోమైక్రాన్లు, శోషరస సూక్ష్మనాళికలోకి రవాణా చేయబడతాయి.
  5. శోషరస నాళాలు చివరికి, శోషణం చెందిన కొవ్వు పదార్ధాలను రక్త ప్రవాహంలోకి విడుదల చేస్తాయి.
  6. ఈ కైలోమైక్రాన్లు, లైపోప్రోటీన్ లైపేజ్ ఎన్జైమ్ చర్య ద్వారా విచ్ఛిన్నం చెంది కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిసరాల్గా మారతాయి.
  7. ఇవి ఎడిపోస్ కణజాలంలోని ఎడిపోసైట్ మరియు కాలేయంలోకి వ్యాపనం చెంది అక్కడ నిల్వగా ఉంటాయి.

ప్రశ్న 6.
కాలేయం విధులను పేర్కొనండి. [ TS MAY-19][ TS MAR-15,20]
జవాబు:
కాలేయం యొక్క విధులు:

  1. కాలేయం సంశ్లేషణ, నిలువ మరియు స్రవించుట వంటి అనేక విధులను నిర్వర్తిస్తుంది.
  2. కాలేయం పైత్యరసాన్ని స్రవిస్తుంది. ఇది కొవ్వులు ఎమల్సీకరణం మరియు జీర్ణక్రియకు సహాయపడుతుంది.
  3. కాలేయం విషపదార్ధాలను విషరహితం చేయడంలో ముఖ్యమైన అవయవం. ఆహారం ద్వారా పేగుతో ప్రవేశించిన విషపదార్ధాలను తొలగిస్తుంది .
  4. కాలేయం ఉష్ణక్రమత అవయవంగా పని చేస్తుంది.
  5. కార్బోహైడ్రేట్ల జీవక్రియలో కాలేయం ముఖ్యపాత్రను పోషిస్తుంది.
  6. లిపిడ్ల జీవక్రియలో కూడా కాలేయం యొక్క పాత్ర ఉంటుంది.
  7. కాలేయంలో డి-ఎమినేషన్ మరియు ‘యూరియా తయారీ’ ఈ రెండూ కూడా ఆర్నిధిస్ వలయం ద్వారా జరుగుతాయి.
  8. కాలేయం పిండదశలో రక్త కణోత్పాదక అంగముగా మరియు ప్రౌఢ దశలో ఎర్రరక్తకణ విచ్ఛిత్తి అంగముగా పనిచేస్తుంది.
  9. కాలేయం ప్లాస్మా ప్రోటీన్లైన ఆల్బుమిన్లు మరియు గ్లోబ్యులీన్లు రక్తస్కందన కారకాలైన ఫైబ్రినోజన్, ప్రోత్రాంబిన్లు మరియు ప్రతిస్కందకం అయిన హెపారిన్లను సంశ్లేషణ చేస్తుంది.
  10. కాలేయ రజ్జువుల మధ్య ఉన్న కోటరాభాలలో కుఫర్ కణాలు ఉంటాయి. ఇవి అనవసర పదార్థాలను మరియు సూక్ష్మజీవులను తొలగిస్తాయి.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం

Long Answer Questions (దీర్ఘ సమాధాన ప్రశ్నలు)

ప్రశ్న 1.
మానవుడి జీర్ణవ్యవస్థలో వివిధ రకాల ఆహార పదార్ధాల జీర్ణక్రియా విధానాన్ని వివరించండి.
జవాబు:
మానవులలో జీర్ణక్రియ: జీర్ణక్రియ విధానంలో సంక్లిష్టమైన, శోషింపబడలేని ఆహార పదార్ధం సరళమైన, శోషించబడగలిగిన పదార్థంగా మార్చబడుతుంది.
జీర్ణక్రియలో యాంత్రిక మరియు రసాయనిక విధానాలు ఉంటాయి.
ఈ క్రింది రెండు భాగాలుగా జీర్ణక్రియ గురించి వివరించవచ్చు.
A) వివిధ భాగాలలో జీర్ణక్రియ
B) వివిధ రకాల ఆహార పదార్థాల జీర్ణక్రియ

A) వివిధ భాగాలలో జీర్ణక్రియ:
1) ఆస్యకుహరంలో జీర్ణక్రియ: ఆస్యకుహరంలో ఆహారం నమలడం మరియు మింగడం జరుగుతుంది.

  1. దంతాలు ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడతాయి.
  2. నాలుక ఆహార కదలికలకు సహాయపడుతుంది. ‘
  3. ఆహారం లాలాజలంతో కలిసి ‘బోలస్ ‘గా ఏర్పడుతుంది.
  4. లాలాజలంలో ఉన్న శ్లేష్మంతో కలిసి ‘బోలస్’ మింగబడుతుంది.
  5. ఇక్కడ సుమారు 30% పిండి పదార్థం జలవిశ్లేషణ చెంది డైశాకరైడ్ అయిన మాల్టోక్గా మారుతుంది.
  6. లాలాజలంలో వున్న లైసోజైమ్ సూక్ష్మజీవ హరిణిగా పనిచేస్తూ సంక్రమణలను నియంత్రిస్తుంది.

2) జీర్ణాశయంలో జీర్ణక్రియ:

  1. ఆహారం జీర్ణాశయంలో చేరగానే, జఠర రసం అనే జీర్ణక్రియా ఆమ్ల రసం స్రవించబడుతుంది.
  2. ఆహారం ఈ జఠర రసంతో కలిసి ‘కైమ్’ అనే పాక్షిక ద్రవపదార్ధంగా మారుతుంది.
  3. ఈ జఠర రసం HCl, పెప్సినోజనన్ను, రెనిన్ను మరియు శ్లేష్మాన్ని కలిగి ఉంటుంది.
  4. HCl పెప్సిన్ చర్యకు’ సరిపడా ఆమ్ల pH (1.8) ను కొనసాగిస్తుంది.
  5. పెప్సిన్ మాంసకృత్తులను (ప్రోటీన్ల) జీర్ణం చేసే ఎన్జైమ్.
  6. HCl చైతన్య రహిత పెప్సినోజను చైతన్యవంతమైన పెప్సిన్గా మారుస్తుంది.
  7. ‘క్రియాశీల పెప్సిన్’ ప్రోటీన్లను ప్రోటియేజ్లు మరియు పెప్టోన్లుగా మారుస్తుంది.
  8. శిశువులలో HCl చైతన్య రహిత ప్రోరెనిన్ను చైతన్యవంతమైన రెనిన్ ఎన్జైమ్ మారుస్తుంది.
  9. రెనిన్ ఎన్ఎమ్ కెసీన్ (పాలప్రోటీన్)ను కాల్షియం అయానుల సమక్షంలో కాల్షియం పారాకేసినేట్ (CP) మారుస్తుంది.
  10. ‘పెప్సిన్’ CP ను పెప్టోన్లుగా మారుస్తుంది.
  11. ఈ పూర్తి ప్రక్రియ జీర్ణాశయంలో 4-5 గంటల పాటు జరుగుతుంది.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 7

3) చిన్న పేగులో జీర్ణక్రియ: చిన్న పేగు కుడ్యంలోని బాహ్యకండరస్తరంలోని కండరాలు అనేక రకాల కదలికలను కలుగచేస్తాయి. ఈ కదలికలు పైత్యరసం, క్లోమరసం, ఆంత్రరసాలను కైమ్ బాగా కలపడం వల్ల పేగులో జీర్ణక్రియ సులువుగా జరుగుతుంది. క్లోమం స్రవించే శ్లేష్మం బైకార్బోనేట్లు ఆంత్ర శ్లేష్మస్తరాన్ని ఆమ్ల మాధ్యమం నుంచి రక్షిస్తూ ఆమ్ల మాధ్యమాన్ని క్షారయుతంగా (pH 7.8) మార్చి ఎన్జైమ్ చర్యలకు కావలసిన క్షారమాధ్యమాన్ని కలుగజేస్తాయి.
క్లోమరసం యొక్క అన్ని ఎన్ఎమ్లు మరియు ఆంత్రరసాలు క్షార మాధ్యమంలోనే సమర్ధవంతంగా పనిచేస్తాయి.

B) వివిధ రకాలు ఆహారపదార్థాల జీర్ణక్రియ:
1) ప్రోటీన్ల జీర్ణక్రియ:

  1. క్లోమరసం ప్రోఎన్జైమ్లయిన ట్రిప్సినోజెన్, కైమోట్రిప్సినోజెన్ మరియు ప్రోకార్బాక్సి పెప్టిడేజ్లను కలిగివుంటుంది.
  2. ఆంత్రశ్లేష్మస్తరం స్రవించే ఎంటిరోకైనేజ్ అనే ఎన్జైమ్ ట్రిప్సినోజెన్ను ట్రిప్సిన్ గా మారుస్తుంది.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 8
  3. ట్రిప్సిన్ స్వయం ఉత్ప్రేరణగా మారి ట్రిప్సినోజెన్ నన్ను ట్రిప్సిన్ గా మారుస్తుంది.
  4. కైమోట్రిప్సినోజెన్ ఎన్జైమ్ కైమోట్రిప్సిన న్ను ట్రిప్సిన్ గా మారుస్తుంది.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 9
  5. కైమ్ నందు ప్రోటీన్లు, ప్రోటియేజ్లు మరియు పెప్టోన్లు ఉంటాయి. ఇవి ట్రైపెప్టైడ్లు మరియు డైపెప్టైడ్లుగా మార్చబడతాయి.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 10
  6. జీర్ణాశయ రసంలో ఎన్జైమ్లు ట్రైపెప్టైడేజ్ మరియు డైపెప్టిడేజ్లు ట్రైపెప్టైడ్ ను మరియు డైపెప్టైడ్లను అమైనో ఆమ్లాలుగా మారుస్తాయి.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 10
  7. ప్రోటీన్ల జీర్ణక్రియలో అమైనో ఆమ్లాలు అంత్య ఉత్పన్నాలు. ఇవి రక్తంలోకి శోషణ చెందుతాయి.

2) కొవ్వుల జీర్ణక్రియ: పైత్యరసం, క్లోమరసం మరియు ఆంత్రరసం ముఖ్యమైన జీర్ణక్రియా రసాలు.

  1. పైత్యరసం ఎటువంటి ఎన్ఎమ్లను కలిగి ఉండరు. పైత్య లవణాలు కొవ్వులను ఎమల్సీకరణం చేస్తాయి.
  2. క్లోమరస లైపేజ్ మరియు ఆంత్రరసలైపేజ్లు ఎమల్సీకరణం చెందిన కొవ్వులను గ్లిసరాల్ మరియు ఫాటీ ఆమ్లాలుగా మారుస్తాయి.
  3. 0
  4. AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 12
  5. డై గ్లిసరైడ్స్ మరియు మోనోగ్లిసరైడ్స్ కొవ్వుల జీర్ణక్రియలో మాధ్యమిక దశలు.

3) కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియ:

  1. క్లోమరసం యొక్క ఎమైలేజ్ కార్బోహైడ్రేట్లను మాల్టోజ్, సుక్రోజ్ మరియు లాక్టోజ్లో మారుస్తుంది.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 13
  2. ఆంత్రరసంలోని డైశాకరైడ్లు డైశాకరైడ్లను గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోక్గా మారుస్తాయి.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 14

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం

4) కేంద్ర ఆమ్లాల జీర్ణక్రియ: క్లోమరసంలో ఉన్న న్యూక్లియేజ్లు కేంద్రకామ్లాలను న్యూక్లియోటైడ్లు, న్యూక్లియోసైడ్లుగా మారుస్తాయి.

  1. న్యూక్లియోటైడెజ్లు న్యూక్లియోటైడ్లను నూక్లియోసైడ్లు మరియు ఫాస్ఫేట్లు గా మారుస్తాయి.
  2. న్యూక్లియోసైడేజ్లు న్యూక్లియోసైడ్లను చక్కెర మరియు నత్రజని క్షారాలుగా విడగొడతాయి.
    AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 15

ప్రశ్న 2.
మానవ జీర్ణవ్యవస్థ పటం గీచి, భాగాలు గుర్తించి, వివరించండి.
జవాబు:
మానవుని జీర్ణవ్యవస్థ:
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 16
జీర్ణక్రియా వ్యవస్థలోని భాగాలు:
A) ఆహార నాళం B) అనుబంధ గ్రంధులు

A) ఆహారనాళం (పేగు): ఇది పూర్వభాగంలో నోరు మరియు పరభాగం పాయువును కల్గి ఉన్న గొట్టం. ఇందులోని భాగాలు:

  1. ఆస్యకుహరం
  2. గ్రసని
  3. ఆహారవాహిక
  4. జీర్ణాశయం
  5. చిన్నపేగు
  6. పెద్ద పేగు

1) ఆస్యకుహరం (ముఖకుహరం):

  • నోరు పై, క్రింది పెదవులతో ఆవరించి ఉంటుంది. ఇది ఆస్యకుహరంలోనికి తెరుచుకుంటుంది.
  • తాలువు ఉదర ఆస్యకుహరాన్ని, పృష్ఠనాసికా కక్షనందు వేరు చేస్తుంది.
  • తాలువు పూర్వాంతం అస్థి నిర్మితమైన కఠిన అంగిలి మరియు పాలటైన్ రుగేలతో కలుపుకుని ఉంటుంది.
  • తాలువు పరభాగంలో మృదుతాలువు అయిన యువులా వేలాడుతూ ఉంటుంది.

(a) దంతాలు: దంత నిర్మాణం: గర్తదంత, విషమదంత, ద్వివార దంత.
నాలుగు రకాల దంతాలు: కుంతకాలు, రదనికలు అగ్ర చర్వణకాలు, చర్వణకాలు. కావున ఇది విషమ దంతరకం.
దంతాలు దవడ ఎముక గర్తాలలో ఇమిడి ఉంటాయి. కనుక ఇవి గర్తదంతి.
జీవిత కాలంలో రెండు రకాల దంతవిన్యాసాలు ఉంటాయి. పాల దంతాలు మరియు శాశ్వత దంతాలు. కావున ఇవి ద్వివార దంతరకం.
AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం 17

(b)నాలుక: ఇది రుచిని తెలిపే స్వేచ్ఛగా, కదిలే, కండర యుతమైన జ్ఞానాంగం. ఇది నమలడం మరియు బోలస్ తయారీలో, మింగడంలో సహాయపడుతుంది. ఇది ఆస్యకుహరం అడుగు భాగంలో ఫ్రెన్యులమ్ ద్వారా అతకబడి ఉంటుంది. నాలుక పైభాగంలో చిన్న నిర్మాణాలు ఉంటాయి. వీటిని సూక్ష్మాంకురాలు అంటారు. ఇవి ఫంజీఫామ్, తంతురూప మరియు సర్కంవేల్లేట్ సూక్ష్మాంకురాలు.
నాలుక ట్రూత్ బ్రష్ వలె పని చేస్తుంది.

2) గ్రసని: ఆహారం మరియు గాలి ప్రయాణించుటకు ఉన్న ఒకే ఒక మార్గం గ్రసని. ఇది నాసికాగ్రసని, ఆస్యగ్రసని మరియు స్వరపేటికా గ్రసని అని మూడు రకాలుగా విభజించబడింది.
స్వరపేటికా గ్రసని చివరి భాగంలో ఉపజిహ్విక ఉంటుంది.
దీనియందు ఒకజత ఎడినాయిడ్స్ (గవదబిళ్లలు), ఒక జత తాలవ్య గవదబిళ్లలు మరియు ఒక జత జిహ్వగవదబిళ్లలు ఉంటాయి. ఇది శోషరస కణజాలాయుతమైనది.

3) ఆహరవాహిక: ఇది ఒక పలుచని, పొడవైన నాళం. ఉరఃకుహరం మరియు విభాజక పటలం ద్వారా జీర్ణాశయం లోకి తెరచుకుంటుంది. ఆస్యకుహరం ప్రారంభంలో ఆహారవాహిక సంవరణి మరియు జీర్ణాశయం ప్రారంభంలో హృదయ సంవరణి ఉంటాయి.

4) జీర్ణాశయం: ఇది వెడల్పైన, స్పీతి చెందగల, కండరయుత సంచి. ఉదర కుహర పూర్వభాగంలో ఎడమవైపున విభాజక పటలానికి కింద అమరి ఉంటుంది. దీనియందు హృదయ, ఫండిక్ మరియు జఠరనిర్గమ భాగం అనేవి
ఉంటాయి.

5) చిన్నపేగు: చిన్నపేగు ఆహారనాళం యొక్క పొడవైన భాగం. దీనిలోని భాగాలు:

  1. ఆంత్రమూలం
  2. జెజునం మరియు
  3. శేషాంత్రికం

ఐక్యకాలేయ క్లోమనాళం ఆంత్రమూలంలోనికి తెరుచుకుంటుంది.
శేషాంత్రికము మరియు పురీషనాళం కలిసే చోట ఒక కవాటం ఉంటుంది.

AP Inter 2nd Year Zoology Important Questions Chapter 1(a) జీర్ణక్రియ, శోషణం

6) పెద్దపేగు: ఇది అంధనాళం, కొలాన్ మరియు పురీష నాళంను కలిగి ఉంటుంది.
అంధనాళం చిన్న అంధకోశాన్ని కలిగి, సహజీవనం చేసే సూక్ష్మ జీవులను కలిగి ఉంటుంది.
సన్నని, వేలు వంటి పొడుచుకొని వచ్చే నిర్మాణాన్ని క్రిమిరూప ఉండూకం అంటారు. ఇది అంధనాళం నుంచి ఏర్పడుతుంది.
కొలాన్ ఆరోహ, అడ్డు మరియు అవరోహ భాగాలను మరియు సిగ్మాయిడ్ కోలాన్ కలిగి ఉంటుంది. ఇది హస్ట్రా అనే కోష్ఠకాలను ఏర్పరుస్తుంది.
టినియా కోలి, మూడు ఆయత కండరాల ముడతలను కొలాన్ లోపల కలిగి ఉంటుంది.
పురీషనాళం చిన్న, విస్ఫారితతిత్తి, చిన్న పాయు కాలువగా పాయువు ద్వారా బయటకు తెరుచుకుంటుంది.

B) జీర్ణగ్రంధులు: ఇవి ఐదు రకాలు: లాలాజల గ్రంధులు, జఠరగ్రంధులు, జీర్ణాశయ గ్రంధులు, కాలేయం, క్లోమ గ్రంధులు.
1) లాలాజల గ్రంధులు: ఇవి మూడు రకాలు.

  • ఒక జత పెరోటిడ్ గ్రంధులు. ఇవి వెలుపలి చెవి పీఠ భాగంలో ఉంటాయి.
  • ఒక జత అధోజంబికా గ్రంధులు. ఇవి క్రింది దవడ మూలంలో ఉంటాయి.
  • ఒక జత అధోజిహ్వికా గ్రంధులు. ఇవి నాలుక క్రింది భాగంలో ఉంటాయి.
  • సీరస్ కణాలు టయలిన్ ఎన్జైమ్ను మరియు శ్లేష్మ కణాలు శ్లేష్మం ను స్రవిస్తాయి.

2) జఠర గ్రంధులు: ఇవి జీర్ణాశయ గోడలలో ఉపకళా తలానికి దిగువన ఉంటాయి. జఠర గ్రంథులు మూడు రకాలు

  1. హర్ధిక గ్రంధులు (రక్షణ కొరకు శ్లేష్మాన్ని స్రవిస్తాయి)
  2. జఠరనిర్గమ గ్రంధులు (శ్లేష్మాన్ని మరియు గాస్ట్రిన్ను స్రవిస్తాయి)
  3. ఫండిక్ (లేదా) ఆక్సింటిక్ గ్రంధులు. ఇవి మూడు రకాల కణాలను కలిగి ఉంటాయి.
    a) గ్రీవకణాలు – శ్లేష్మాన్ని స్రవిస్తాయి.
    b) పెప్టిక్ – పెప్సినోజెన్, ప్రోరెనిన్ మరియు జఠర లైపేజ్ను స్రవిస్తాయి.
    c) ఆక్సింటిక్ (కుడ్యకణాలు) HCl మరియు కాసిల్ ఇంట్రిన్సిక్ కారకాన్ని స్రవిస్తాయి.
    జఠరరసం యొక్క pH 0.9 మరియు 1.8 వరకు ఉంటుంది.

3) ఆంత్ర గ్రంధులు: ఇవి శ్లేష్మంలో ఉంటాయి. ఇవి రెండు రకాలు i. బ్రన్నర్ గ్రంధులు ii. లేబర్ కూన్ గుహికలు.

4) కాలేయం: కాలేయం మానవులలో అతి పెద్ద గ్రంధి. ఇది పైత్యరసాన్ని స్రవిస్తుంది. దీనియందు పైత్య లవణాలు ఉంటాయి. ఇవి లిపిడ్ల జీర్ణక్రియలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. రెండు లంబికల మధ్యలో పిత్తాశయం ఉంటుంది. ఇది కాలేయ కణాల ద్వారా స్రవించబడిన పైత్యరసాన్ని నిలువ చేస్తుంది.

5) క్లోమం: క్లోమం మానవులలో రెండవ అతి పెద్ద గ్రంధి. ఇది మిశ్రమ గ్రంధి. ఆంత్రమూలం యొక్క రెండు లంబికల మధ్యలో ఇమిడి ఉంటుంది.
నాళగ్రంధి భాగం యొక్క ఎసినై, క్షారయుత క్లోమ రసాన్ని (pH 8.4) స్రవిస్తుంది. కొన్ని కణాల సమూహన్ని లాంగర్ హన్స్ పుటికలు (వినాళ గ్రంధి భాగం) అంటారు. ఇది ఇన్సూలిన్ మరియు గ్లుకగానన్ను స్రవిస్తుంది.

Leave a Comment