AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Telugu Study Material పద్య భాగం 4th Poem కన్యక Textbook Questions and Answers, Summary.

AP Inter 2nd Year Telugu Study Material 4th Poem కన్యక

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రాజు కన్యకను చెరపట్టడానికి ఎలా ప్రయత్నించాడు ?
జవాబు:
పరిచయం : గురజాడ అప్పారావు రచించిన ‘కన్యక’ అనే కవితాఖండికలో ఒక రాజు ‘కన్యక’ అనే కన్యను చెరపట్టడానికి ప్రయత్నించటం, ఆమె ప్రతిఘటించటం అనే అంశాలు వర్ణించబడ్డాయి.

రాజు దౌర్జన్యం : ఒక సెట్టి కూతురు అయిన కన్యక గొప్ప అందగత్తె. ఒకసారి ఆమె బంగారు రంగు చీరను కట్టి, జడలో పూలదండలు పెట్టి నుదుటున కుంకుమ పెట్టుకొని పూజ కోసం గుడికి బయలుదేరింది. రాచవీధుల గుండా వెడుతున్న ఆమె వెంట పాలు, పండ్లు, పూలు మొదలైన పూజాద్రవ్యాలు పట్టుకున్న చెలికత్తెలు కూడా ఉన్నారు. అపుడు అటుగా వెడుతున్న ఆ రాజ్యాన్ని పాలించే రాజు కన్యకను చూశాడు. అతని కన్ను చెదిరింది.

చుక్కల్లో చంద్రునిలాగా వెలుగుతున్న ఆమె టి అందగత్తె తన అంతఃపురంలో లేదు అనుకున్నాడు. ఆమెను బలవంతంగానైనా పొందాలని, రసికులలో గొప్పవాడిగా పేరుపొందాలని భావించాడు. వెంటనే దుర్మార్గులైన తన మంత్రులతో ఆమెను చుట్టుముట్టాడు. పట్టపగలే నడివీధిలోనే ఆమెను బలాత్కరించబోయాడు. కన్యక ఏమాత్రం భయపడకుండా దైవపూజ ముగించుకొని వస్తాను అని చెప్పింది.

సెట్టి వేడుకోలు : రాజు దౌర్జన్యాన్ని గమనించిన కన్యక తండ్రి అయిన సెట్టి రాజుకు — నమస్కరించి ఇలా అన్నాడు. ‘రాజా ! నువ్వు నా కూతుర్ని బలవంతం చేయవలసిన పనిలేదు. నువ్వు ఈ దేశానికి రాజువు. కనుక ఈ కన్యక కూడా నీ సొత్తే. నా కూతుర్ని నువ్వు కోరుకోవటం కంటే నాకు అదృష్టం ఏముంటుంది ? నువ్వు దయతో మా మనవి ఆలకించాలి. మా ‘కులం వారికి ఒక ధర్మం ఉన్నది. నువ్వు ఆ ధర్మాన్ని గౌరవించాలి. అగ్నిసాక్షిగా నా కూతుర్ని పెళ్ళి చేసుకో. నీకు కావలసినన్ని కానుకలు సమర్పించుకుంటాను. మా జాతి ధర్మాన్ని కాపాడు” అని సెట్టి రాజును వేడుకున్నాడు.

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

రాజు అహంకారం.: సెట్టి మాటలు విని రాజు ఎగతాళిగా నవ్వి ఇట్లా అన్నాడు. “రాజ్యాన్ని పాలించే రాజుకు ధర్మశాస్త్రాన్ని ఒక సెట్టి నేర్పించడమా.? అసలు రాజు అనుకున్నదే ధర్మం. రాజు చెప్పినదే శాస్త్రం. గాంధర్వం అనే వివాహ పద్ధతి . రాజకుమారులకు ఆమోదయోగ్యమైనదేననే విషయం తెలియదా ? కనుక ఆలస్యం వద్దు. బాధపడనూ వద్దు. ఇవాళ, రేపు అంటూ గడువులు పెట్టవద్దు. నీకు ఇష్టమైతే నీ కూతుర్ని ఇవ్వు లేకపోతే ఇక్కణ్ణుంచి వెళ్ళిపో ! డేగ తాను పట్టిన పిట్టను విడిచిపెట్టదు. అలాగే నేను కూడా నీ కూతుర్ని విడిచిపెట్టను, ‘ఆమె’ ఇక నీ ఇంటికి తిరిగిరాదు.

నువ్వు ఇస్తానన్న కానుకలను ఇక్కడికే తీసుకొని రా ! నువ్వు వచ్చేవరకు నేను ఇక్కడే ఉంటాను” అని రాజు తన అహంకారాన్ని ప్రదర్శించారు. అపుడు సెట్టి “రాజు పనికంటే దేవుని పూజ ముఖ్యమైనది కదా ! మీరు దయచూపితే నేను మా కులదైవమైన .. వీరభద్రస్వామి ఆలయానికి వెళ్ళి పూజ పూర్తిచేసుకొని వస్తాను” అని రాజును అనుమతి కోరాడు. . అపుడు “మేము కూడా నీతో పాటు గుడికి వస్తాం” అక్కడే అగ్నిసాక్షిగా కన్యకను స్వీకరిస్తాం” అంటూ రాజు కూడా గుడికి బయలుదేరాడు.

ముగింపు : ఈ విధంగా రాజు కన్యకను చెరపట్టడానికి ప్రయత్నించాడు.

ప్రశ్న 2.
రాజును కన్యక ప్రతిఘటించిన విధానాన్ని వివరించండి.
జవాబు:
పరిచయం ; కన్యక’ అనే కవితాఖండికలో గురజాడ అప్పారావు ఒక రాజు ‘కన్యక’ అనే కన్యను చెరపట్టటానికి ప్రయత్నించటం, ఆమె ప్రతిఘటించటం అనే అంశాలు. వర్ణించబడ్డాయి.

రాజు దౌర్జన్యం : సెట్టి కూతురు అయిన కన్యక గొప్ప అందగత్తె. ఆమే ఒకసారి , బంగారు రంగు చీరను కట్టి, జడలో పూలదండలు పెట్టి, నుదుటున కుంకమ పెట్టుకొని. పూజ కోసం’ గుడికి బయలుదేరింది. రాచవీధుల గుండా వెడుతున్న ఆమె వెంట పూజాద్రవ్యాలు పట్టుకున్న చెలికత్తెలు కూడా ఉన్నారు. అపుడు అటుగా వెడుతున్న ఆ రాజ్యాన్ని పాలించే రాజు కన్యకను చూశాడు. అతని కన్ను చెదిరింది. చుక్కల్లో చంద్రుని లాగా వెలుగుతున్న ఆమెవంటి అందగత్తె తన అంతఃపురంలో లేదు అనుకున్నాడు.

ఆమెను బలవంతంగానైనా పొందాలని, రసికులలో గొప్పవాడిగా పేరు పొందాలనీ భావించాడు. వెంటనే దుర్మార్గులైన తన మంత్రులతో ఆమెను చుట్టుముట్టాడు. పట్టపగలే నడివీధిలోనే ఆమెను బలాత్కరించబోయాడు. కన్యక ఏమాత్రం భయపడకుండా దైవపూజ ముగించుకొని వస్తాను అని చెప్పింది. సెట్టి ఎన్ని రకాలుగా వేడుకున్నా రాజు తన అహంకారాన్ని వీడలేదు. పైగా తాను కూడా ఆలయానికి బయలుదేరాడు.

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

కన్యక ప్రాణత్యాగం : గుడిలో కన్యక దుర్గాదేవిని పూజించింది. తన నగలు అన్నీ దుర్గాదేవికి సమర్పించింది. అగ్నిగుండం చుట్టూ చేరిన ప్రజలను ఉద్దేశించి రాజులకే రాజులుగా బతకాలని హితబోధ చేసింది. తర్వాత కన్యక రాజు ముందుకు నడిచింది. పట్టపగలు, నడివీధిలో విటులు, దొంగలు అయినా స్త్రీలను పట్టుకోరు కదా ! నువ్వు మాత్రం పట్టణానికి రాజువై ఉండి కూడా ఒక స్త్రీని నడివీధిలో పట్టబోయావు. నువ్వు ఒక రాజువేనా ! అధికార మదంతో నువ్వు చేసిన ఈ దౌర్జన్యాన్ని చూసిన దేవుడు నిన్ను దండించకుండా ఉండడు. ఇదిగో ! మా కులం పెద్దలు వచ్చారు. వివాహానికి సాక్షిగా అగ్ని ఉన్నది. నువ్వు కన్నేసిన కన్యను నేను నీ ఎదురుగానే ఉన్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు ? నువ్వు నిజంగా రాజువే అయితే నన్ను పట్టుకో ! అంటూ రాజుతో పలికి కన్యక అగ్నిగుండంలో దూకింది.

రాజుకు అపకీర్తి : కన్యక ప్రాణత్యాగంతో రాజు గర్వం నశించింది. అతని అధికారం మట్టిలో కలిసిపోయింది. కోటమేడలు కూలిపోయి, నక్కలకు నిలయమయ్యాయి. కన్యక ఆత్మాహుతి చేసుకున్న చోట ఒక పెద్ద మేడ వెలసింది. ఈ ఘటనలో రాజుకు మాత్రం శాశ్వతంగా అపకీర్తి మిగిలిపోయింది.

ముగింపు : ఈ విధంగా కన్యక రాజును ప్రతిఘటించింది.

సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
గురజాడ రచనలను పేర్కొనండి.
జవాబు:
ఆధునిక తెలుగు సాహిత్యానికి గురజాడగా నిలిచిన గురజాడ అనేక రచనలు చేశారు.
భావకవిత్వం ఒరవడిలో మాటల ‘మబ్బులు, పుష్పలావికలు. మెరుపులు అనే ఖండకావ్యాలను రచించాడు. అంతేకాక సుభద్ర అనే అసంపూర్ణ కావ్యాన్ని కూడా రచించారు. ఇంకా ఋతుశతకం, నీలగిరి పాటలు రచించారు. కన్యాశుల్కం, బిల్హణీయం, కొండుభట్టీయం అనేవి గురజాడ రచించిన నాటకాలు. వీటిలో ‘కన్యాశుల్కం’ ఎంతో ప్రసిద్ధి చెందినది. మీ పేరేమిటి ? మెటిల్డా, పెద్ద మసీదు, సంస్కర్త హృదయం అనేవి గురజాడ కథానికలు. ఆధునికతను సంతరించుకొన్న కథానికగా గురజాడ ‘దిద్దుబాటు’కు గొప్ప గుర్తింపు ఉంది.

కర్ణాటక భాషలోని ఒక షట్పది, పారసీ భాషలోని ఒక గజల్, వృషభగతి రగడ మొదలైనవి గురజాడలో ఒక కొత్త లయకు స్ఫూర్తినిచ్చాయి. ఫలితంగా ముత్యాల సరాలు అనే మాత్రాఛందస్సులో, కొత్త పాటల మేలు కలయికతో ముత్యాలసరాలు’ కావ్యాన్ని కూర్చాడు. ముత్యాల సరాల సంపుటిలో దేశభక్తి, ముత్యాలసరాలు, కాసులు, లవణరాజు కల, పూర్ణమ్మ, కన్యక, మనిషి, దేశభక్తి వంటి ప్రసిద్ధ గేయ ఖండికలు ఉన్నాయి.

ప్రశ్న 2.
కన్యక ప్రజలకిచ్చిన సందేశమేమిటి ?
జవాబు:
గుడిలో అగ్నిగుండం చుట్టూ చేరిన ప్రజలకు ఇట్లా సందేశం .ఇచ్చింది. “అన్నలారా ! తండ్రులారా ! నా విన్నపాన్ని వినండి. మీరు మీ భార్యాబిడ్డలను రక్షించుకోలేరా ? రాజ్యాన్ని ఏలడానికి రాజు ఉంటే. ఆ రాజును ఏలడానికి దైవం లేదా ? మీ పరువును నిల్పుకొనే పౌరుషం మీకు లేదా ? చదువుకున్నవాడే బ్రాహ్మణుడు. వీరత్వం కలవాడే క్షత్రియుడు అనే పెద్దల మాట మరిచారా ? పదవుల మీద ఆశపడడం, సంపదలను చూసుకొని మురిసిపోవడం సరికాదు. చదువుకోకుండా, పరాక్రమం లేకుండా తెలివి తక్కువగా ఉన్నవారికి కష్టాలు తప్పవు. ఇప్పటికైనా మేల్కొనండి. దైవబలంతో రాజులకే రాజులుగా బతకండి” అంటూ కన్యక ప్రజలకు హితబోధ చేసింది.

ప్రశ్న 3.
రాజు గర్వం ఏమైంది ?
జవాబు:
గుడిలో అగ్నిగుండం చుట్టూ చేరిన ప్రజలకు హితబోధ చేసిన కన్యక తరువాత రాజుతో ఇట్లా అన్నది. పట్టపగలు, నడివీధిలో విటులు, దొంగలు కూడా స్త్రీలను పట్టుకోరు కదా ! నువ్వు మాత్రం పట్టణానికి రాజువై ఉండి కూడా ఒక స్త్రీని నడివీధిలో పట్టబోయావు. నువ్వూ ! ఒక రాజువేనా ! అధికార మదంతో నువ్వు చేసిన ఈ దౌర్జన్యాన్ని చూసిన దేవుడు నిన్ను దండించకుండా ఉండడు. ఇదిగో మా కులం పెద్దలు వచ్చారు. వివాహానికి ‘సాక్షిగా అగ్ని అదిగో. నువ్వు కన్నేసిన కన్యను నేను నీ ఎదురుగానే ఉన్నాను చూడు. ఇంకా ఆలస్యం ఎందుకు ? నువ్వు నిజంగా రాజువే అయితే నన్ను పట్టుకో ! అంటూ పలికి కన్యక అగ్నిగుండంలోకి దూకింది.

కన్యక ప్రాణత్యాగంతో రాజు గర్వం నశించింది. అతని అధికారం మట్టిలో కలిసి పోయింది. కోటపేటలు కూలిపోయి నక్కలకు నిలయమయ్యాయి. ‘కన్యక ఆత్మాహుతి చేసుకున్న చోట ఒక పెద్ద మేడ వెలిసింది. ఈ ఘటనలో రాజుకు మాత్రం శాశ్వతంగా అపకీర్తి మిగిలిపోయింది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

ప్రశ్న 4.
కన్యక తండ్రికీ, రాజుకూ మధ్య జరిగిన సంభాషణను తెల్పండి.
జవాబు:
గొప్ప అందగత్తె అయిన కన్యక ఒక పెద్ద కూతురు. తన చెలికత్తెలతో దైవపూజ కోసం రాచవీధులలో వెడుతున్న కన్యకను రాజు చెరపట్టబోయాడు. వెనుక వస్తున్న కన్యక తండ్రి అయిన సెట్టి రాజుకు నమస్కరించి ఇట్లా అన్నాడు.

‘రాజా ! నువ్వు ఈ రాజ్యాన్ని పాలించే ప్రభువువు. కనుక నా కూతుర్ని బలవంతంగా పొందవలసిన అవసరం నీకు లేదు. ఆమె కూడా నీ సొత్తే కదా ! నీ వంటి మహారాజు సెట్టిని అయిన నా కూతుర్ని కోరడం కంటే మా జాతికి కీర్తి ఏముంటుంది ? దయతో నా మాట మన్నించండి.

మాకు కులధర్మం ఒకటి ఉన్నది. మా కులం పెద్దలు, బంధువులూ మెచ్చేటట్లు మీరు కూడా ఆ ధర్మాన్ని పాటించండి. అగ్నిసాక్షిగా నా కూతుర్ని పెళ్ళాడండి. అదే మాకు ఎంతో గౌరవాన్నిస్తుంది. మీకు కానుకలు ఏమి కావాలో చెప్పండి. తెచ్చి ఇస్తాను. మీరు నా కూతుర్ని పెళ్ళాడితే మా జాతి ధర్మం నిలబడుతుంది” అని సెట్టి రాజుతో అన్నాడు.

సెట్టి మాటలకు రాజు, ఎగతాళిగా నవ్వి ఇట్లా అన్నాడు. ‘రాజ్యాన్ని పాలించే ప్రభువును నేను. సెట్టివైన నువ్వు నాకు ధర్మం నేర్పుతావా ? అసలు రాజు. అనుకున్నదే ధర్మం. రాజు చెప్పిందే శాస్త్రం. రాజులకు గాంధర్వ వివాహ పద్ధతి అందరూ ఆమోదించిన ఆచారమే కదా ! కనుక ఆలస్యం వద్దు. బాధపడవద్దు. ఇవాళో, రేపో అంటూ గడువు పెట్టవద్దు. ఇష్టమైతే నీ కూతుర్ని ఇచ్చి పెళ్ళి చెయ్యి. లేకపోతే ఇక్కణ్ణుంచి వెళ్ళిపో ! డేగ పిట్టను పట్టుకుంటే విడిచిపెడుతుందా ? అలాగే నేను నీ కూతురిని విడిచిపెడతానా ? ఆమె తిరిగి నీ ఇంటికి రాదు. నువ్వు ఇస్తానన్న కానుకలు ఇక్కడికే , తీసుకొనిరా. అప్పటివరకూ నేను ఇక్కడే ఉంటాను అని రాజు అన్నాడు.

అపుడు సెట్టి “రాజా ! దైవకార్యం తరువాత కదా రాచకార్యం. కనుక ముందు వీరభద్రుని దేవాలయానికి వెళ్ళి పూజలు చేసి వస్తాను” అన్నాడు. అపుడు రాజు సరే! పదా ! నేను కూడా నీతోనే వస్తాను. దేవాలయంలోనే అగ్నిసాక్షిగా కన్యకను అందు కుంటాను, అని చెప్పి రాజు తాను కూడా దేవాలయానికి బయలుదేరాడు.

ఏకవాక్య / పదరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
‘ఆధునిక మహిళలు చరిత్రను తిరిగి రచిస్తారు’ అన్న కవి ఎవరు ?
జవాబు:
ఆధునిక మహిళలు చరిత్రను తిరిగి రచిస్తారు అన్న కవి గురజాడ వెంకట అప్పారావు.

ప్రశ్న 2.
గురజాడ రాసిన కొత్త ఛందస్సు పేరేమిటి ?
జవాబు:
గురజాడ సృష్టించిన కొత్త ఛందస్సు పేరు ‘ముత్యాలసరాలు’.

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

ప్రశ్న 3.
కన్యకను అగ్నిసాక్షిగా వివాహం చేసుకోమన్నదెవరు ?
జవాబు:
కన్యకను అగ్నిసాక్షిగా వివాహం చేసుకోమన్నది ఆమె తండ్రి అయిన సెట్టి.

ప్రశ్న 4.
పట్టమేలే రాజు గర్వం ఏమైంది ?
జవాబు:
పట్టమేలే రాజు గర్వం మట్టిలో కలిసిపోయింది.

ప్రశ్న 5.
గురజాడ రచించిన ప్రసిద్ధ నాటకం పేరేమిటి ?
జవాబు:
గురజాడ రచించిన ప్రసిద్ధ నాటకం పేరు కన్యాశుల్కం.

సందర్భ సహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
చెలికత్తెల్ వెంట నడిచిరి.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం గురజాడ అప్పారావు రచించిన ‘ముత్యాలసరాలు’ అనే కవితా సంపుటి నుంచి గ్రహించిన ‘కన్యక’ అనే పాఠ్యభాగంలోనిది.

సందర్భం : ఈ మాటలు పాలు, పెరుగులతో, పూలూపళ్ళతో చెలికత్తెలతో గుడికి వెడుతున్న కన్యకను వర్ణిస్తున్న సందర్భంలోనిది.

భావం : చెలికత్తెలు వెంట రాగా ఆనందంతో కన్యక గుడికి బయలుదేరింది అని భావం.

వ్యాఖ్య : అందగత్తె అయిన కన్యక దైవపూజ కోసం రాచవీధుల గుండా గుడికి బయలు దేరింది. బంగారపు కడవలలో పాలు, పెరుగు, వెండిపళ్ళాలలో పళ్ళూపువ్వులూ తీసుకొని . ఎంతో సంతోషంతో చెలికత్తె వెంట రాగా కన్యక గుడికి బయలుదేరింది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

ప్రశ్న 2.
రాజునేలే దైవముండడా ?
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం గురజాడ అప్పారావు రచించిన ‘ముత్యాల సరాలు’ అనే కవితా, సంపుటి నుంచి గ్రహించిన ‘కన్యక’ అనే పాఠ్యభాగంలోనిది.

సందర్భం : ఈ మాటలు గుడిలో అగ్నిగుండం చుట్టూ చేరిన ప్రజలకు సందేశం ఇస్తూ కన్యక పలికిన సందర్భంలోవి.

భావం : పట్టణాన్ని ఏలడానికి రాజు ఉంటే ఆ రాజును ఏలడానికి దైవం ఉండడా ? అని భావం.

వ్యాఖ్య : కన్యక గుడిలో అమ్మవారిని పూజించింది. అగ్నిగుండం చుట్టూ చేరిన ప్రజలకు హితబోధ చేసింది. అన్నలారా ! తండ్రులారా ! ఒక్కమాట వినండి. ప్రజలకు తమ భార్యాబిడ్డలను కాపాడుకొనే ఆశ లేదా ? పట్టణాన్ని పాలించడానికి రాజు ఉంటే ఆ రాజును పాలించడానికి దైవం ఉండడా ? అని కన్యక పలికింది.

ప్రశ్న 3.
నీవొక పట్టమేలే రాజువట !
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం గురజాడ అప్పారావు రచించిన ‘ముత్యాలసరాలు’ అనే కవితా సంపుటి నుంచి గ్రహించిన ‘కన్యక’ అనే పాఠ్యభాగంలోనిది.

సందర్భం : ఈ మాటలు గుడిలో రాజును నిలదీస్తూ కన్యక పలికిన సందర్భంలోవి.

భావం : రక్షించవలసిన నీవే చెరపట్టాలనుకున్నావు. నువ్వూ ఒక రాజువేనా ! అని భావం.

వ్యాఖ్య : కన్యక గుడిలో దుర్గామాతను పూజించింది. అగ్నిగుండం చుట్టూ చేరిన ప్రజలకు హితబోధ చేసింది. రాజును ఇట్లా నిలదీసింది. విటులు, దొంగలు కూడా పట్టపగలు నడివీధిలో ఒక స్త్రీని పట్టుకోరు కదా ! అటువంటిది నువ్వు చెరపట్టటానికి ప్రయత్నించావు. నువ్వూ ఒక రాజువేనా ! అని కన్యక రాజును నిలదీసింది.

ప్రశ్న 4.
పదం పద్యం పట్టి నిలిచెను కీర్తులపకీర్తుల్.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం గురజాడ అప్పారావు రచించిన ‘ముత్యాలసరాలు’ అనే కవితా సంపుటి నుంచి గ్రహించిన ‘కన్యక’ అనే పాఠ్యభాగంలోనిది.

సందర్భం : ఈ మాటలు కన్యక ప్రాణత్యాగం తరువాత రాజుకు శాశ్వతమైన అపకీర్తి కలిగిందని వివరిస్తూ కవి పలికిన సందర్భంలోవి.

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

భావం : కథలు కథలుగా చెప్పుకొనే కన్యక కీర్తి, రాజు అపకీర్తి పదాలలోనూ, పద్యాలలోనూ, శాశ్వతంగా నిలిచిపోయాయి అని భావం.

వ్యాఖ్య : కన్యక ప్రాణత్యాగం చేసిన చోట ఆమె కీర్తికి గుర్తుగా ఒక ఆకాశసౌధం వెలిసింది. తర్వాత పట్టణాన్ని ఏలే రాజు మరణించాడు. అతని కోటపేటలు మట్టిలో ‘కలిసి పోయాయి. సాహిత్యంలో పదాలుగా, పద్యాలుగా కథలు కథలుగా కన్యక కీర్తి, . రాజు అపకీర్తి శాశ్వతంగా నిలిచిపోయాయి.

గేయాలు – అర్థాలు – భావాలు

ప్రశ్న 1.
తగటు బంగరు చీరెకట్టి
కురుల పువ్వుల సరులు జుట్టీ
నుదుట కుంకుమ బొట్టు పెట్టి
సొంపు పెంపారన్,
జవాబు:
ప్రతిపదార్థం :
తగటు = జరీ, జలతారు
బంగరు = బంగారు రంగు కల
చీరె కట్టి = చీరను కట్టుకొని
కురుల = తలవెంట్రుకలకు
పువ్వుల సరులు = పూలమాలలు
చుట్టి = చుట్టుకొని
నుదుట = నుదుటి మీద
కుంకుమబొట్టు – కుంకుమబొట్టు
పెట్టి = పెట్టుకొని
సొంపు = అందం
పెంపు + ఆరన్ = ఇనుమడించగా

భావం :
కన్యక జరీ అంచు గల బంగారు రంగు గల చీర కట్టుకున్నది. తలలో పూల మాలలు చుట్టుకున్నది. నుదుటి మీద కుంకుమబొట్టు పెట్టుకున్నది. ఈ అలంకారాలతో ఆమె అందం ద్విగుణీకృతం అయింది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

ప్రశ్న 2.
తొగల కాంతులు కనులు పరపగ
మించు తళుకులు నగలు నెరపగ
నడక లంచకు నడలు కరపగ
కన్నె పరతెంచెన్
రాజవీథిని.
జవాబు:
ప్రతిపదార్థం :
తొగల కాంతులు = కలువల కాంతులు
కనులు = ఆమె కన్నులలో
పరపగ = ప్రకాశించగా
మించు తళుకులు = గొప్ప మెరుపులు
నగలు = ఆమె ధరించిన నగలలో
నెరపగ = ఉట్టిపడగా
నడకలు = ఆమె నడకలు
అంచకు = హంసలకు
నడలు = నడకలు
కరపగ = నేర్పుతున్నట్లు అందంగా ఉండగా
కన్నె= ఆ కన్యక
రాజవీధిని = రాజువీధిలోకి
పరతెంచెన్ = వచ్చింది

భావం :
ఆమె. అందమైన కన్నులు కలువలలాగా ప్రకాశిస్తున్నాయి. ఆమె పెట్టుకున్న నగలు తళతళా మెరుస్తున్నాయి. ఆమె నడకలు హంసలకే నడకలు నేర్పగలిగినంత వయ్యారంగా ఉన్నాయి. అంత అందగత్తె అయిన కన్యక రాజవీధిలోకి వచ్చింది.

ప్రశ్న 3.
పసిడి కడవల పాలు పెరుగులు
పళ్ళెరమ్ముల పళ్ళు పువ్వులు
మోము లందున మొలకనవ్వులు
చెలగ చెలికత్తెల్
వెంట నడిచిరి.
జవాబు:
ప్రతిపదార్థం
పసిడి కడవల = బంగారపు బిందెలలో
పాలు పెరుగులు = పాలు, పెరుగులూ
పెళ్ళెరమ్ముల = పళ్ళేలలో
పళ్ళుపువ్వులు = పళ్ళూ, పువ్వులు
మోములు + అందున = ముఖాలలో
మొలక నవ్వులు = చిరునవ్వులు
చెలగన్ = వ్యాపించగా
చెలికత్తెల్ = స్నేహితురాండ్రు
వెంట నడిచిరి = ఆమె వెంట నడిచారు

భావం :
బంగారపు బిందెలతో పాలూ పెరుగూ తీసుకొని, పళ్ళేలలో ‘పళ్ళూ పూలూ పట్టుకొని, ముఖాలలో, చిరునవ్వులు చిందిస్తూ చెలికత్తెలు కన్యక వెంట నడిచారు.

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

ప్రశ్న 4.
అంత పట్టపు రాజు యెదురై
కన్నె సొగసుకు కన్ను చెదురై
మరుని వాడికి గుండె బెదురై
యిట్లు తలపోసిన్,
జవాబు:
ప్రతిపదార్థం :
అంత = అపుడు
పట్టపు రాజు = పట్టణాన్ని పాలించే రాజు
ఎదురై = వారికి ఎదురయి
కన్నె సొగసుకు = ఆ కన్యక అందానికి
కన్ను చెదురై = కన్ను చెదరినవాడై
మరుని = మన్మథుని
వాడికి = చురుకైన బాణానికి
గుండె బెదురై = గుండెలు అదిరినవాడై
ఇట్లు = ఈ విధంగా
తలపోసెన్ = అనుకున్నాడు

భావం :
అపుడు ఆ పట్టణాన్ని పాలించే రాజు వారికి ఎదురయ్యాడు. కన్యక అందాన్ని చూసి అతని కన్ను చెదిరింది. మదనుడి వాడి అయిన బాణాలకు అతని గుండె అదిరింది. అతడు ఈ విధంగా అనుకున్నాడు.

ప్రశ్న 5.
ఔర ! చుక్కల నడుమ చందురు .
నట్లు వెలిగెడు కన్నె ముందర
వన్నె తాంచిన నగరి సుందరు
ఆ లంద రొక లెక్కా !
జవాబు:
ప్రతిపదార్థం :
ఔర ! = ఆహా !
చుక్కల నడుమ = ఆకాశంలో చుక్కల మధ్యలో
చందుదునట్లు = చంద్రునిలాగా
వెలిగెడు = వెలిగే
కన్నె ముందర = ఈ కన్నె ముందర
వన్నె కాంచిన = పేరు పొందిన
నగరి సుందరులు = అంతఃపురంలో ఉండే స్త్రీలు
అందరు = ఎవరూ
ఒక లెక్కా ! = లెక్కలోకి రారు

భావం :
ఆహా ! చుక్కల్లో చంద్రునిలాగా వెలిగే ఈ కన్నె ముందర అంతఃపురంలో ఉండే అందగత్తెలు ఎవరూ లెక్కలోకి రారు.

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

ప్రశ్న 6.
“పట్టవలెరా దీని బలిమిని
కొట్టవలెరా మరుని రాజ్యం
కట్టవలెరా గండపెండెం
రసిక మండలిలో
జవాబు:
ప్రతిపదార్థం :
దీనిన్ = ఈ కన్యను
బలిమిని = బలవంతంగానైనా
పట్టవలెరా = పొందాలి
మరుని రాజ్యం = దానితో మన్మథ రాజ్యాన్ని
కొట్టవలెరా = జయించాలి
రసిక మండలిలో = రసికుల సమూహాలలో
గండపెండెం = ప్రత్యేకతను
కట్టవలెరా = చాటుకోవాలి

భావం :
బలవంతంగా అయినా ఈ కన్యను పొందాలి. మన్మథ రాజ్యాన్ని జయించాలి. రసికుల సమూహంలో గొప్పవాడినని అనిపించుకోవాలి.

ప్రశ్న 7.
నాల నడుమను నట్టి వీథిని
దుష్ట మంత్రులు తాను పెండెం
గట్టి కన్నెను చుట్టి నరపతి
పట్ట నుంకించెన్.
జవాబు:
ప్రతిపదార్థం :
ఆల నడుమను = స్త్రీల మధ్య
నట్టివీధిని = నడివీధిలో
దుష్టమంత్రులు = దుర్మార్గులైన మంత్రులూ
తాను = రాజూ
పెండెంగట్టి = అడ్డగించి
కన్నెను = ఆ కన్యకను
చుట్టి = చుట్టుముట్టి
నరపతి = రాజు
పట్టన్ = పట్టుకోవడానికి
ఉంకించెన్ = ప్రయత్నించాడు

భావం :
నడివీధిలో చెలికత్తెల మధ్య ఉన్న ఆ కన్యకను రాజు తన దుర్మార్గపు మంత్రులతో కలసి అడ్డగించాడు. ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించాడు.

ప్రశ్న 8.
మట్టి వచ్చిన దైవగతి కిక
దైవమే గతి యని తలంచుక
దిట్టతనమును బూని కన్నియ
నెట్ట నిటు పలికెన్.
జవాబు:
ప్రతిపదార్థం :
మట్టి వచ్చిన = నాశనానికి వచ్చిన
దైవ గతికి = దైవ నిర్ణయానికి
దైవమే = ఆ దైవమే
గతి + అని = దిక్కు అని
తలంచుక = భావించి
దిట్టతనమును + పూని = ధైర్యం తెచ్చుకొని
కన్నియ = ఆ కన్యక
నెట్టన్ = తప్పనిసరియై
ఇటు పలికెన్ = ఈ విధంగా పలికింది.

భావం :
కన్యక విధివశాత్తూ తనకు వచ్చిన ఆపదను ఎదుర్కోవడానికి దైవమే దిక్కని భావించింది. ధైర్యం కూడగట్టుకొని తప్పనిసరి పరిస్థితులలో ఆమె ఇట్లా అన్నది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

ప్రశ్న 9.
“ముట్టబోకుడు, దేవకార్యం
తీర్చివచ్చెద, నీవు పట్టం
యేలు రాజువు, సెట్టి కూతుర,”
నేటకు పోనేరున్.
జవాబు:
ప్రతిపదార్థం :
ముట్టబోకుడు = నన్ను తాకవద్దు
దేవకార్యం = దైవపూజ
తీర్చివచ్చెద = చేసుకొని వస్తాను
నీవు = నువ్వు
పట్టంయేలు = పట్టణాన్ని పాలించే
రాజువు = రాజువు
సెట్టి కూతురన్ = నేనేమో పెట్టి కూతుర్ని
ఎటకు = ఎక్కడికి
పోనేరున్ = పోగలను

భావం :
నన్ను తాకవద్దు. నేను దేవునికి పూజ ముగించుకొని వస్తాను. నీవు పట్టణాన్ని పాలించే రాజువు. నేను పెట్టి కూతుర్ని. నీ నుంచి తప్పించుకొని ఎక్కడికి పోగలను ?

ప్రశ్న 10.
చుట్టములు తన చుట్టు నిలవగ
భృత్యవర్గం కాచి తొలవగ
సెట్టి కరములు మోడ్చి రాజుకు
ఇట్లు వినిపించెన్.
జవాబు:
ప్రతిపదార్థం :
చుట్టములు = చుట్టాలు
తన చుట్టూ = తన చుట్టూ
నిలవగ = నిలిచి ఉండగా
భృత్యవర్గం = సేవకులు అందరూ
కాచి = రక్షకులై
కొలవగ = సేవించగా
సెట్టి = సెట్టి
కరములు మోడ్చి = చేతులు జోడించి
రాజుకు = రాజుతో
ఇట్లు = ఈ విధంగా
వినిపించెన్ = అన్నాడు

భావం :
చుట్టాలందరూ తన చుట్టూ నిలబడి ఉండగా, సేవకులు అందరూ తనను సేవిస్తూ ఉండగా కన్యక తండ్రి అయిన సెట్టి రాజుకు నమస్కరించి ఇట్లా అన్నాడు.

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

ప్రశ్న 11.
పట్టమేలే రాజ ! బలిమిని,
పట్టవలెనా ? నీదు సామ్మే
కాద కన్నియ ? నీవు కోరుట
అ కన మరి కలదాన
వైశ్యజాతికి వన్నె ?
జవాబు:
ప్రతిపదార్థం :
పట్టము + ఏలు + ఏ = పట్టణాన్ని పాలించే
రాజ ! = ఓ రాజా !
బలిమిని = ఇలా బలవంతంగా
పట్టవలెను + ఆ = పట్టుకోవాలా ?
నేను = నీ యొక్క
సొమ్ము + ఏ = సొత్తే
కాదు + అ = కాదా !
కన్నియ = ఈ కన్నెపిల్ల
నీవు = నువ్వు
కోరుటకన్న = కోరడం కంటే
వైశ్యజాతికి = మా వైశ్యజాతికి
మరి = వేరే
వన్నె = గొప్ప
కలదు + ఆ = ఉంటుందా ?

భావం :
పట్టణాన్ని పాలించే ఓ రాజా ! నా కూతుర్ని ఇలా బలవంతం చేయాలా? ఈ కన్య నీ సొత్తు కాదా ? మా బిడ్డను నువ్వు కోరుకోవడం కంటే మా వైశ్య జాతికి కావలసినది వేరే ఏముంటుంది ?

ప్రశ్న 12.
“గాని మన్ననజేసి మమ్ముల
బంధువర్గం. కులం పెద్దల
ధర్మమన్నది అరపి కొంచెం
దారి కనబడితే
జవాబు:
ప్రతిపదార్థం :
కాని = కానీ
మమ్ముల = మమ్ములనూ
బంధువర్గం = మా బంధువర్గాన్నీ
కులం పెద్దల = మా కులం పెద్దలను
మన్ననజేసి = మన్నించి
ధర్మము + అన్నది = ధర్మం అన్నదాన్ని
అరపి = పాటించి
కొంచం = కాస్త
దారి = దారి
కనబడితే = చూపండి.

భావం :
రాజా ! మమ్మల్నీ, మా బంధువర్గాన్నీ, మా కులం పెద్దలనూ మన్నించండి. . ధర్మాన్ని పాటించండి. దయచేసి మాకు దారి చూపండి.

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

ప్రశ్న 13.
“అగ్ని సాక్షిగ కన్నె గైకొని తన
ఆదరించుము మమ్ము, కామక
లందుకొ మ్మెంతెంత వలసిన,
మనుచు మా జాతిన్”
జవాబు:
ప్రతిపదార్థం :
అగ్నిసాక్షిగ = అగ్నిసాక్షిగా
కన్నెన్ = ఈ కన్యను
కైకొని = పెళ్ళి చేసుకొని
మమ్ము = మమ్మల్ని
ఆదరించుము = ఆదరించండి
కానుకలు = కానుకలు
ఎంతెంత వలసిన = ఎన్ని కావలసినా
అందుకొమ్ము = తీసుకో
మా జాతిన్ = మా జాతి పరువును
మనుచు = కాపాడు

భావం :
రాజా ! అగ్నిసాక్షిగా ఈ కన్యను పెళ్ళి చేసుకొని మమ్మల్ని ఆదరించండి. మీకు ఎన్ని కానుకలు కావాలన్నా ఇస్తాము తీసుకోండి. మా జాతి పరువును మాత్రం కాపాడండి.

ప్రశ్న 14.
నవ్వి హేళననవ్వు, నరపతి
పల్కె, నోహో ! ధర్మమార్గం
పట్టమేలే రాచబిడ్డకు
సెట్టి కరపడమా !
జవాబు:
ప్రతిపదార్థం :
హేళన నవ్వు = ఎగతాళి నవ్వు
నవ్వి = నవ్వి
నరపతి = రాజు
పల్కెన్ = ఇలా అన్నాడు
ఓహో ! = అబ్బో !
పట్టము + ఏలే = పట్టణాన్ని ఏలే
రాచబిడ్డకు = రాజకుమారుడికి
ధర్మమార్గం = ధర్మమార్గం గురించి
సెట్టి = ఒక సెట్టి
కరపడమా ! = నేర్పించడమా !

భావం :
రాజు ఎగతాళిగా నవ్వి ఇలా అన్నాడు. “పట్టణాన్ని పాలించే రాచబిడ్డనైన నాకు సెట్టివైన నువ్వు ధర్మ పన్నాలు బోధించడమా ?” అన్నాడు.

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

ప్రశ్న 15.
రాజు తలచిందేసు ధర్మం ”
రాజు చెప్పిందెల్ల శాస్త్రం,
రాజులకు పేరైన పద్ధతి ఆ
కాద గాంధర్వం ?
జవాబు:
ప్రతిపదార్థం :
రాజు = రాజు
తలచింది + ఏను = అనుకొన్నదే
ధర్మం = ధర్మం
రాజు = రాజు
చెప్పింది + ఎల్ల = చెప్పినదంతా
శాస్త్రం = శాస్త్రం
గాంధర్వం = గాంధర్వం అనే ఒక వివాహ పద్ధతి
రాజులకు = రాజులకు
పేరు + ఐన = ఆమోదయోగ్యమైన
పద్ధతి = పద్ధతి
కాదు + అ = కాదా ?

భావం :
రాజు అనుకున్నదే ధర్మం. రాజు చెప్పిందే శాస్త్రం. గాంధర్వం అనే వివాహ పద్ధతి రాజులకు ఆమోదయోగ్యమైన పద్ధతే కదా !

ప్రశ్న 16.
తడవు చెయ్యక, తల్లడిల్లక,
నేడు రేపని గడువు పెట్టక,
నెమ్మి గోరితివేని కన్నియ నిమ్ము !
లేకుంటే, పామ్ము !
జవాబు:
ప్రతిపదార్థం :
తడవు చెయ్యక = ఆలస్యం చెయ్యకుండా
తల్లడిల్లక = బాధపడకుండా
నేడు రేపు + అని = ఇవాళ రేపు అని
గడువు పెట్టక = గడువు పెట్టకుండా
నెమ్మి + కోరితివి + ఏని = స్నేహం కోరినట్లయితే
కన్నియన్ + ఇమ్ము = కన్యను ఇవ్వు
లేకుంటే = లేకపోతే
పొమ్ము = పో

భావం :
ఆలస్యం చేయవద్దు. బాధపడవద్దు. నేడు రేపు అని గడువు పెట్టవద్దు. నువ్వు స్నేహం కోరినట్లయితే కన్యకను ఇవ్వు లేదంటే వెళ్ళిపో.

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

ప్రశ్న 17.
‘డేగ, పిట్టను పట్టి విడుచున ?
కన్నె, యింటికి మరలి నడుచున ?
తెమ్ము తానుక లిమ్ము, నీ విటు
వచ్చినందాకన్.
జవాబు:
ప్రతిపదార్థం :
డేగ = డేగ
పిట్టను = తన ఆహారమైన పిట్టను
పట్టి = పట్టుకొంటే విడుచున ?
విడుచున ? = విడిచిపెడుతుందా ?
కన్నె = ఈ కన్నెపిల్ల
ఇంటికి = ఇంటికి
మరలి = తిరిగి
నడచున ? = వస్తుందా ?
కానుకలు = నువ్వు ఇస్తానన్న కానుకలు
తెమ్ము = తీసుకువచ్చి
ఇమ్ము = ఇవ్వు
నీవు + ఇటు = నువ్వు ఇక్కడికి
వచ్చినందాకన్ = వచ్చేవరకూ నేను కదలను

భావం : డేగ తన ఆహారమైన పిట్టను పట్టుకొంటే విడిచిపెడుతుందా ? ఈ కన్నెపిల్ల ఇంటికి తిరిగి వస్తుందా ? నువ్వు ఇస్తానన్న కానుకలు తీసుకువచ్చి ఇవ్వు నువ్వు ఇక్కడికి వచ్చేవరకూ నేను కదలను.

ప్రశ్న 18.
కదల నంతట సెట్టి పలికెను,
దేవకార్యం ముందు, ఆవల
రాచకార్యం కాద, రాజా !
శలవు నీ విస్తే
జవాబు:
ప్రతిపదార్థం :
అంతట = అప్పుడు
సెట్టి = సెట్టి
పలికెను = ఇట్లా అన్నాడు
రాజా ! = రాజా !
ముందు = ముందు
దేవకార్యం = దేవుని పూజ
ఆవల = తరువాతే
రాచకార్యం = ప్రభువుల పని
కాద = కదా !
నీవు = మీరు
శలవు ఇస్తే = అనుమతిస్తే

భావం :
అప్పుడు సెట్టి ఇట్లా అన్నాడు. రాజా ! ముందు దేవుని పూజ. తరువాతే ప్రభువుల పని కదా ! మీరు అనుమతిస్తే.

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

ప్రశ్న 19.
“యింటి దైవం వీరభద్రుడి
దేవళానికి పోయి యిప్పుడే
పల్లెరం సాగించి వత్తును,
పైని తమ చిత్తం !”
జవాబు:
ప్రతిపదార్థం :
ఇంటిదైవం = కులదైవం అయిన
వీరభద్రుడి = వీరభద్రుని
దేవళానికి = ఆలయానికి
పోయి = వెళ్ళి
ఇప్పుడే = ఇప్పుడే
పెళ్ళెరం = పూజాద్రవ్యాలు ఉన్న పళ్ళెం
సాగించి వత్తును = సమర్పించి వస్తాను
పైని = తరువాత
తమ చిత్తం = మీ ఇష్టం !

భావం :
రాజా ! మా కులదైవమైన వీరభద్రుని గుడికి వెళ్ళి పూజాద్రవ్యాలు ఇచ్చి వస్తాను. తరువాత మీ ఇష్టం.

ప్రశ్న 20.
“మంచిదే, మరి నడువు, మేమును
తోడ వత్తుము, దేవళంలో
అగ్నిసాక్షిగ కన్యకను మే
మందుకొన గలము”
జవాబు:
ప్రతిపదార్థం :
మంచిదే = సరే
మరి = ఇక
నడువు = పద
మేమును = మేం కూడా
తోడవత్తుము = నీతో వస్తాం
దేవళంలో = గుడిలో
అగ్నిసాక్షిగ = అగ్నిసాక్షిగ
కన్యకను = కన్యకను
మేము = మేం
అందుకొనగలము = స్వీకరిస్తాం

భావం :
సరే ఇక పద. మేం కూడా నీతో వస్తాం. గుడిలో అగ్నిసాక్షిగా కన్యకను మేం స్వీకరిస్తాం.

ప్రశ్న 21.
నాడు గుడిలో మండె గుండం
మంట మింటిని ముట్టి యాడగ
కన్న నరపతి గుండె దిగులై
పట్టు విడజొచ్చెన్.
జవాబు:
ప్రతిపదార్థం :
నాడు = ఆరోజు
గుడిలో = గుళ్ళో
మంట = మంట
మీంటిని = ఆకాశాన్ని
ముట్టి + ఆడగ = తాకేటట్లు
గుండం = అగ్నిగుండం
మండె = మండింది
కన్న = అది చూచిన
నరపతి = రాజు యొక్క
గుండె = గుండె
దిగులు + ఐ  = దిగులుతో కూడినదై
పట్టు = తన పంతాన్ని
విడజొచ్చెన్ = విడిచి పెట్టసాగింది

భావం :
ఆ రోజు గుడిలోని అగ్నిగుండంలోని మంట ఆకాశాన్ని తాకినట్లు మండింది. అది చూసిన రాజు గుండె దిగులుతో తన పంతాన్ని విడువసాగింది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

ప్రశ్న 22.
భక్తి పరవశమైన మనసున
దుర్గనప్పుడు కొలిచి, కన్యక,
ముక్తి వేడుచు వూడి నగలను
శక్తి కర్షించెన్.
జవాబు:
ప్రతిపదార్థం :
అప్పుడు = అప్పుడు
కన్యక = కన్యక
భక్తిపరవశమైన = భక్తి నిండిన
మనసున = మనసుతో
దుర్గను = దుర్గాదేవిని
కొలిచి = పూజించి
ముక్తి వేడుచు = మోక్షాన్ని కోరుకుంటూ
నగలను = తన శరీరంపై ఉన్న నగలను
ఊడ్చి = మొత్తాన్ని తీసి
శక్తికి = ఆ దుర్గామాతకు
అర్పించెన్ = సమర్పించినది

భావం :
అప్పుడు కన్యక మనసు నిండిన భక్తితో దుర్గామాతను పూజించింది. మోక్షాన్ని ప్రసాదించమని కోరుకున్నది. తాను ధరించిన నగలను అన్నింటినీ తీసి ఆ దుర్గామాతకు సమర్పించింది.

ప్రశ్న 23.
దుర్గ కొలనున గ్రుంకి పిమ్మట
రక్తగంధం రక్తమాల్యం
దాల్చి, గుండం చుట్టు నిలిచిన
జనుల కిట్లనియెన్.
జవాబు:
ప్రతిపదార్థం :
దుర్గ కొలనున : ఆ దుర్గామాత ఆలయం దగ్గర ఉన్న కొలనులో
క్రుంకి = మునిగి
పిమ్మట = తరువాత
రక్తగంధం = ఎర్రని గంధాన్ని
రక్తమాల్యం = ఎర్రని పూలదండనూ
తాల్చి = ధరించి
గుండం చుట్టూ = అగ్నిగుండం చుట్టూ
నిలిచిన = నిలబడిన
జనులకు = జనులతో
ఇట్లు + అనియెన్ .. ఇలా అన్నది

భావం :
కన్యక దుర్గ గుడిలోని కొలనులో స్నానం చేసింది. ఎర్రని గంధాన్నీ, ఎర్రని పూలమాలలనూ ధరించింది. అగ్నిగుండం చుట్టూ నిలిచిన జనాలతో ఈ విధంగా అన్నది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

ప్రశ్న 24.
“అన్నలారా ! తండ్రులారా !
ఆలకించం డొక్క విన్నప
మాలు బిడ్డల కాసుకొనుటకు ”
ఆశ లేదాళ్కి
కులము లోపల ?
జవాబు:
ప్రతిపదార్థం :
అన్నలారా ! = ఓ అన్నలారా !
తండ్రులారా ! : ఓ తండ్రులారా ! .
ఒక్క విన్నపము = ఒక మనవిని
ఆలకించండి = వినండి
కులము లోపల = కులంలో
ఆలుబిడ్డల = భార్యాబిడ్డలను
కాచుకొనుటకు = కాపాడుకొనే
ఆశ = ఆశ
లేదు + ఒక్కో = లేదా ?

భావం :
ఓ అన్నలారా ! ఓ తండ్రులారా ! నేను చేసే ఒక్క విన్నపాన్ని వినండి. – కులంలో భార్యాబిడ్డలను కాపాడుకొనే ఆశ లేదా ?

ప్రశ్న 25.
పట్టమేలే రాజు అయితే
రాజు నేలే దైవ ముండడొ ?
పరువు నిలపను పౌరుషము మీ
కేల కలుగదొరో ?
జవాబు:
ప్రతిపదార్థం :
రాజు = రాజు
పట్టమేలే = పట్టణాన్ని ఏలేవాడే
అయితే = అయితే
రాజులే = ఆ రాజును ఏలే
దైవము + ఉండడు + ఒ = దైవము ఉండడా ?
పరువు నిలపను = పరువు నిలబెట్టుకోవాలనే
పౌరుషము = పౌరుషం
మీకు = మీకు
కలుగదు + ఒకో = లేదా ?

భావం :
రాజు పట్టణాన్ని ఏలేవాడే అయితే, ఆ రాజును ఏలడానికి దైవం ఉండడా? పరువు నిలబెట్టుకోవాలనే పౌరుషం మీకు లేదా ?

ప్రశ్న 26.
“విద్య నేర్చినవాడు విప్రుడు ,
వీర్యముండినవాడు క్షత్రియు
డన్న పెద్దల ధర్మ పద్ధతి
మరచి, పదవులకై
జవాబు:
ప్రతిపదార్థం :
విద్య నేర్చినవాడు = విద్య నేర్చినవాడే
విప్రుడు = బ్రాహ్మణుడు
వీర్యముండినవాడు = పరాక్రమం ఉన్నవాడే
క్షత్రియుడు = రాజు
అన్న = అని చెప్పిన
పెద్దల = పెద్దల
ధర్మపద్ధతి = ధర్మాన్ని
మరచి = మరచిపోయి
పదవులకై = పదవుల కోసం

భావం :
విద్య నేర్చినవాడు బ్రాహ్మణుడు, పరాక్రమం ఉన్నవాడు క్షత్రియుడు అని పెద్దలు చెప్పిన ధర్మాన్ని మరచిపోయి పదవుల కోసం (తరువాతి పద్యంతో అన్వయం)

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

ప్రశ్న 27.
“ఆశచేయక, కాసు వీసం
కలిగివుంటే చాలు ననుకొని,
వీర్య మెరగక, విద్య నేర్చక,
బుద్ధి మాలినచో,
జవాబు:
ప్రతిపదార్థం :
ఆశ చేయక = ఆశ పడకుండా
కాసువీసం = డబ్బు మాత్రమే
కలిగివుంటే = ఉంటే
చాలుననుకొని = చాలు అనుకుంటూ
వీర్య మెరగక = పరాక్రమం లేకుండా
విద్య నేర్చక = విద్యలు ఏవీ నేర్చుకోకుండా
బుద్ధి మాలినచో = తెలివితేటలు లేకుండా

భావం :
ఆశ పడకుండా, డబ్బు మాత్రమే ఉంటే చాలు అనుకుంటూ పరాక్రమాన్ని సాధించకుండా, విద్యలు ఏవీ నేర్చుకోకుండా తెలివితేటలు లేకుండా ఉంటే కష్టాలు కలగవా మరి ? .

ప్రశ్న 28.
కలుగవా యిక్కట్లు ? మేల్కొని,
బుద్ధి బలమును బాహుబలమును
పెంచి, దైవమునందు భారం
వుంచి, రాజులలో
జవాబు:
ప్రతిపదార్థం :
ఇక్కట్లు = కష్టాలు
కలుగవా = కలగవా
బుద్ధిబలమును = బుద్ధిబలం
బాహుబలమును = భుజబలం కూడా
పెంచి = పెంచుకొని
దైవమునందు = దేవుని మీద
భారం వుంచి. = భారం వేసి
రాజులలో = రాజులలో

భావం :
మేల్కొనాలి. బుద్ధిబలం, భుజబలం పెంచుకోవాలి. దేవుని మీద భారం వేసి రాజుల్లో రాజుల్లా బతకండి.

ప్రశ్న 29.
రాజులై మనుడయ్య !” ఇట్లని ,
కన్య నరపతి కప్పు డెదురై
నాలుగడుగులు నడిచి ముందు
పలికె నీరీతిన్
జవాబు:
ప్రతిపదార్థం :
రాజులై . = రాజులులాగా
మనుడు + అయ్య = బతకండి
ఇట్లు + అని = ఈ విధంగా చెప్పి
కన్య = ఆ కన్యక
నరపతికి = ఆ రాజుకు
అప్పుడు = అప్పుడు
ఎదురు + ఐ = ఎదురుగా వచ్చి
నాలుగు + అడుగులు = నాలుగు అడుగులు
ముందుకు = ముందుకు
నడిచి = నడిచి
ఈ రీతిన్ = ఈ విధంగా
పలికెన్ = అన్నది

భావం :
ఈ విధంగా చెప్పిన కన్యక రాజుకు ఎదురుగా వచ్చింది. నాలుగు అడుగులు ముందుకు నడిచింది. ఇంకా ఇట్లా అన్నది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

ప్రశ్న 30.
“పట్టపగలే నట్టి వీథిని
పట్టబోరే జారచోరులు,
పట్టదలచితి వింక నీవొక
పట్టమేలే రాజువట !
జవాబు:
ప్రతిపదార్థం :
పట్టపగలే = పట్టపగలే
నట్టి వీధిని = నడివీధిలో
జారచోరులు = విటులు, దొంగలు అయినా
పట్టన్ + పోరు + ఏ = పట్టుకోరు కదా !
నీవు = నువ్వు
ఇంక = మాత్రం
పట్టన్ + తలచితివి = పట్టాలని అనుకున్నావు
ఒక = నువ్వు కూడా ఒక
పట్టము + ఏలే = పట్టణాన్ని పాలించే
రాజువు + అట = రాజువేనా ?

భావం :
పట్టపగలే నడివీథిలో స్త్రీని ఇట్లా విటులు, దొంగలు కూడా పట్టుకోరు కదా! నువ్వు మాత్రం పట్టాలని అనుకున్నావు. నువ్వూ ఒక రాజువేనా ?

ప్రశ్న 31.
“కండ కావర మెక్కి నీవీ
దుండగము తలపెట్టినందుకు
వుండడా వాత దైవమంటూ,
వుండి వూర్కొనునా ?
జవాబు:
‘ప్రతిపదార్థం :
కండకావరము : అధికార బలం వల్ల కలిగిన మదం
ఎక్కి = బాగా పెరిగిపోయి
నీవు = నువ్వు
ఈ దుండగము = ఇటువంటి దుండగాన్ని
తలపెట్టిన + అందుకు = పూనుకున్నందుకు
దైవమంటూ = దైవమనేవాడు
ఒక = ఒకడు
ఉండడా = ఉండడా
ఉండి = అలా చూస్తూ
ఊర్కొనునా ? = ఊర్కొంటాడా ?

భావం : కండకావరంతో నువ్వు ఇటువంటి దుండగానికి పూనుకున్నావు. దైవమనేవాడు ఒకడు ఉండడా ? ఉండి ఇలాంటి దుర్మార్గాలను చూస్తూ ఊరుకుంటాడా ?

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

ప్రశ్న 32.
కులం పెద్దలు కూడి రధిగో !
అగ్నిసాక్షికి అగ్ని అదుగో !
కన్నుకోరిన కన్నె యిదిగో !
జాల మేలొక్కో ?
జవాబు:
ప్రతిపదార్థం :
అదిగో ! = అదుగో అక్కడే
కులం పెద్దలు = కులం పెద్దలు
కూడిరి = ఉన్నారు
అగ్నిసాక్షికి = పవిత్రమైన సాక్ష్యానికి
అగ్ని = అగ్ని
అదుగో ! = అదుగో సిద్ధంగా ఉన్నది
కన్ను కోరిన = నువ్వు కోరుకున్న
కన్నె= కన్యను
ఇదుగో = ఇదిగో ! ఇక్కడ ఉన్నాను
జాలము = ఇక ఆలస్యం
ఏల + ఒక్కో = ఎందుకు

భావం :
అదుగో అక్కడే కులం పెద్దలు ఉన్నారు. పవిత్రమై సాక్ష్యానికి అగ్ని అదుగో సిద్ధంగా ఉంది. నువ్వు కోరుకున్న కన్యను ఇదిగో ! ఇక్కడ ఉన్నాను. ఇక ఆలస్యం ఎందుకు ?

ప్రశ్న 33.
“పట్టమేలే రాజువైతే
పట్టు సనిపు” డనుచు కన్యక
చుట్టుముట్టిన మంటలోనికి
మట్టి తా జనియెన్.
జవాబు:
ప్రతిపదార్థం :
పట్టము + ఏలే = పట్టణాన్ని పాలించే
రాజువు + ఐతే = రాజువే గనక అయితే
నన్ను = నన్ను
ఇపుడు = ఇప్పుడే
పట్టు = పట్టుకో
అనుచు = అంటూ
కన్యక = ఆ కన్యక
చుట్టుముట్టిన = ఎగసిపడుతున్న
మంటలోనికి మట్టి = మంటల్లోనికి ఒక్కసారిగా
తాన్ + చనియెన్ = ఆమె ప్రవేశించింది

భావం :
నువ్వు పట్టణాన్ని పాలించే రాజువే గనక అయినట్లయితే నన్ను ఇప్పుడే పట్టుకో అంటూ ఆ కన్యక ఎగసిపడుతున్న మంటల్లోకి ఒక్కసారిగా దూకింది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

ప్రశ్న 34.
పట్టమేలే రాజు గర్వం
మట్టి గలిసెను, కోట పేటలు
కూలి, నక్కల రాటపట్టి
అమరె.
జవాబు:
ప్రతిపదార్థం :
పట్టమేలే = పట్టణాన్ని
ఏలే రాజు గర్వం = రాజు యొక్క గర్వం
మట్టి గలిసెను = నాశనమై పోయింది
కోట పేటలు = పట్టణం, అందులోని కోట
కూలి = కూలిపోయి
నక్కలకు = నక్కలకు
ఆటపట్టు + ఇ = నివాసాలై
అమరె = అమరాయి

భావం :
పట్టణాన్ని ఏలే రాజు యొక్క గర్వం అణగిపోయింది. అతని పట్టణం, అందులో ఉన్న అతని కోట కూలిపోయాయి. అవి నక్కలకు నివాసాలైపోయాయి.

ప్రశ్న 35.
యెక్కడైతే కన్య మానం
కాచుకొనుటకు మాట గలిసెనో,
అక్కడొక్కటి లేచె సౌధము
ఆకసము పాడుగై
జవాబు:
ప్రతిపదార్థం :
ఎక్కడైతే = ఏ ప్రదేశంలో అయితే
కన్య = కన్యక
మానం = తన మానాన్ని
కాచుకొనుటకు = కాపాడుకోవడానికి.
మంట గలిసెనొ = మంటల్లో కలిసిపోయిందో
అక్కడ + ఒక్కటి = అక్కడ ఒక
సౌధము = పెద్ద భవనం
ఆకసము = ఆకాశమంత
పొడుగై = ఎత్తులో
లేచే = లేచింది.

భావం :
ఏ ప్రదేశంలో కన్యక తన మానాన్ని కాపాడుకోవడానికి మంటల్లో కలసి … పోయిందో అక్కడ ఆకాశమంత ఎత్తులో ఒక పెద్ద భవనం వెలసింది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

ప్రశ్న 36.
పట్టమేలే రాజు పోయెను
మట్టి కలసెను కోటపేటలు
పదం పద్యం పట్టి నిలిచెను
కీర్తు లపకీర్తుల్
జవాబు:
ప్రతిపదార్థం :
పట్టమేలే = పట్టణాన్ని పాలించే
రాజు = రాజు
పోయెను = చనిపోయాడు
కోటపేటలు = కోటపేటలు
మట్టి కలిసెను = నాశనమయ్యాయి
కీర్తులపకీర్తుల్ = ఎవరిది కీర్తో, ఎవరిది అపకీర్తో చెప్పడానికి మాత్రం
పదం పద్యం = పదం, పద్యం మాత్రం
పట్టి నిలిచెను = శాశ్వతంగా నిలచిపోయాయి

భావం :
పట్టణాన్ని పాలించే రాజు చనిపోయాడు. కోటపేటలు నాశనమై పోయాయి. ఈ ఘటనలో కీర్తి ఎవరిదో, అపకీర్తి ఎవరిదో చెప్పడానికి మాత్రం పదం, పద్యం మాత్రం శాశ్వతంగా నిలిచిపోయాయి.

కవి పరిచయం

ఆధునిక ఆంధ్ర కవిత్వానికి గురజాడ గురువు వంటి వాడని సాహితీవేత్తల అభిప్రాయం. వస్తువులో, శైలిలో, భాషలో కవిత్వ లక్ష్యంలో కొత్త ఒరవడిని ప్రవేశపెట్టిన గురజాడ రచనలు ఆధునిక ఆంధ్ర సాహిత్యయుగంలో శ్రీశ్రీ వంటి మహాకవులకు మార్గదర్శ కాలయ్యాయి.

విశాఖపట్టణం జిల్లా, ఎలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో సెప్టెంబరు 21, 1862 న జన్మించిన గురజాడ వెంకట అప్పారావు తల్లి కౌసల్యమ్మ, తండ్రి వెంకట రామదాసు. గురజాడ 1892 లో మెట్రిక్యులేషను, 1886 లో బి.ఏ. పూర్తి చేశాడు. తరువాత విజయనగరం మహారాజా వారి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, పరిశోధకుడిగా పనిచేశారు. మద్రాసు విశ్వవిద్యాలయ ‘ఫెలో’గా కూడా గురజాడ నియమించబడ్డారు. నవంబరు 30, 1915 న మరణించారు.

“అడుగుజాడ గురజాడది
అది భావికి బాట” ,

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

అని శ్రీశ్రీ చేత ప్రశంసలు పొందిన గురజాడ రచనలలో జాలి శ్రేయస్సు, సంఘ సంస్కరణ, సత్యదృష్టి కనిపిస్తాయి. గిడుగు వెంకట రామమూర్తి ప్రారంభించిన వ్యవహార భాషోద్యమానికి బలం చేకూరే విధంగా గురజాడ వాడుక భాషలో రచనలు చేశాడు. వాడుక భాషకు గుర్తింపు రావడానికి ఎంతో కృషి చేశాడు.

గురజాడ సారంగధర కథను మొదట ఇంగ్లీషులో రచించారు. ఆ తరువాత నీలగిరి పాటలు, ముత్యాలసరాలు, భావకవితా ఒరవడిలో మాటల మబ్బులు, పుష్పలావికలు, మెరుపులు అనే ఖండ కావ్యాలనూ, సుభద్ర అనే అసంపూర్ణ కావ్యాన్ని, ఋతుశతకాన్ని రచించారు. కన్యాశుల్కం, కొండుభట్టీయం, బిలణీయం అనే నాటకాలను రచించాడు. ఈ నాటకాలలో నాటి సమాజంలో ఉన్న కన్యాశుల్కం, బాల్యవివాహాలు, వేశ్యావ్యవస్థ, ఖూనీలు, దొంగ సంతకాలు, మోసాలు, కుట్రలు, అబద్ధపు సాక్ష్యాలు, డాంబికాలు మొదలైన ఎన్నో దురాచారాలను విమర్శిస్తూ ఆసాంతం హాస్య, వ్యంగ్య సంభాషణలతో సాగే “కన్యాశుల్కం” అనే నాటకం ఎంతో ప్రజాదరణ పొందింది. వాస్తవికవాద సాహిత్య ప్రపంచంలో మేలైనదిగా ప్రసిద్ధి పొందింది. ఈ నాటకాన్ని గురజాడ విజయనగర ప్రభువైన ఆనందగజపతికి అంకితం చేశాడు.

గురజాడ రచించిన దిద్దుబాటు అనే కథ తెలుగులో మొదటి కథానికగా మన్ననలు పొందింది. ఆయన రచించిన “మీ పేరేమిటి ?, మెటిల్డా పెద్ద మసీదు, సంస్కర్త హృదయం” వంటి కథలలో ఉన్న ఇతివృత్తాలు కూడా నాటి సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తాయి. అందరినీ ఆలోచింపజేస్తాయి.

కర్ణాటక భాషలోని ఒక షట్పది, పారశీ భాషలోని గజల్, వృషభగతి రగడ — స్పూర్తితో గురజాడ కూర్చిన “ముత్యాలసరాలు” అనే కొత్త ఛందస్సు తెలుగు పద్య రచనలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ మాత్రాఛందస్సులో గురజాడ రచించిన “దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్” వంటి సందేశాత్మక దేశభక్తి గేయాలు ఆబాలగోపాలాన్ని నేటికీ అలరిస్తున్నాయి.

గురజాడ సృష్టించిన “కన్యక, పూర్ణమ్మ కథ, లవణరాజు కల” వంటి కథాగేయాలు నేటికీ నవీనమైనవిగా అనిపిస్తాయి.

గురజాడ రచించిన ప్రస్తుత పాఠ్యభాగమైన ‘కన్యక’ అనే కవితా ఖండిక ‘ముత్యాలసరాలు’ అనే కవితా సంపుటి నుంచి గ్రహించబడ్డది. ఈ ఖండిక తొలిసారి 1912లో ‘ఆంధ్ర భారతి’లో ప్రచురించబడింది. ఇది కరుణ రసభరితమైన ఒక కన్య కథ. పర స్త్రీ వ్యామోహం తగదని, స్త్రీలను తగిన విధంగా గౌరవించాలని ఈ పాఠ్యభాగం తెలుపుతుంది. అలా గౌరవించకపోవడం వల్ల అనర్థాలు కలుగుతాయని హెచ్చరిస్తుంది.

పాఠ్యభాగ సందర్భం

ఒక పట్టణంలో కన్యక అనే అందాలబరిణ ఉంటుంది. ఆమె అందానికి కన్ను చెదరి తన అధికార మదంతో ఆమెను చెరపట్టబోతాడు ఆ దేశపు రాజు. దుర్మార్గుడు, అహంకారి అయిన ఆ రాజుకు గుణపాఠం చెప్పడం కోసం తన అభిమానాన్ని కాపాడుకోవడం కోసం ఆ కన్యక అగ్నిలో దూకి కాలిబూడిదవుతుంది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

రాజు అనేవాడు ప్రజలను రక్షించాలే గానీ భక్షించకూడదు. అట్లా ప్రజలకు హాని చేసినవాడి పరువు మంట కలవక తప్పదు అనే సందేశాన్ని అందిస్తుంది ఈ కథ.

పాఠ్యభాగ సారాంశం

కన్యక అనే ఒక కన్య బంగారపు రంగు చీర కట్టుకున్నది. తలనిండా పూలదండలు ధరించింది. నుదుటన కుంకుమబొట్టు పెట్టుకున్నది. అందంగా మెరిసే ఆమె కళ్ళు కలువ రేకుల్లాగా ఉన్నాయి. ఆమె పెట్టుకున్న నగలు తళతళా మెరుస్తున్నాయి. ఆమె నడకలు హంసలకే నడకలు నేర్పగలిగినట్లు వయ్యారంగా ఉన్నాయి. అట్లా ఆమె రాజవీధిలో బయలుదేరింది. బంగారపు కడవలలో పాలూ, పెరుగులూ, పళ్ళేలలో పళ్ళూ, పూలూ పెట్టుకొన్న చెలికత్తెలు మురిపెపు నవ్వులతో ఆమె వెంట నడిచారు. అపుడు ఆ దేశపు రాజు వారికి ఎదురుపడ్డాడు. కన్యక అందచందాలకు రాజు కన్ను చెదిరింది. ఆమె మీద మోజుపడ్డ ఆ రాజు ఇట్లా అనుకున్నాడు.

“ఆహా ! చుక్కల్లో చంద్రునిలాగా వెలుగుతున్న ఈ కన్నె ముందర అంతఃపుర కాంతల అందాలు ఏపాటివి? ఈమెను చెరపట్టి మదన రాజ్యాన్ని జయించాలి. రసికులలో గొప్పవాడని పేరు పొందాలి అనుకున్నాడు. చెలికత్తెల మధ్యలో నాలుగు వీధుల కూడలిలో నడచి వెడుతున్న ఆ కన్యకను రాజు, అతని దుష్టమంత్రులూ, చుట్టుముట్టారు. రాజు ఆమెను పట్టుకో బోయాడు. అప్పుడు ఆ కన్యక తనకు వచ్చిన ఈ ఆపదకు దైవమే గతి అని భావించింది. వెంటనే తేరుకొని నన్ను తాకవద్దు. నేను దైవకార్యానికి వెడుతున్నాను. పూజ ముగించుకొని వస్తాను. నువ్వు ఈ దేశాన్ని ఏలే రాజువు. నేను ఒక సెట్టి కూతురును. నేను ఎక్కడికి పోతాను ” అని పలికింది.

అప్పుడు సెట్టి చుట్టూ తన బంధువులు, సేవకులు ఉండగా రాజుకు నమస్కరిస్తూ ఇట్లా అన్నాడు. “ఓ రాజా ! నువ్వు దేశాన్ని పాలించే రాజువు. నువ్వు నా కూతురును బలవంతం చేయవలసిన అవసరం ఏముంది ? ఈ కన్య నీ సొత్తు కాదా ! మా కన్యను రాజువైన నువ్వు కోరుకోవడం కంటే మా వైశ్యజాతికి కావలసినది ఏమున్నది? కానీ దయవుంచి మా మాట ఆలకించండి. మా బంధువులకూ, కులపెద్దలకూ ఒక పద్ధతి ఉన్నది. దానిని మీరు దయతో పరిశీలించి మమ్ములను మన్నించి నా కూతురును అగ్నిసాక్షిగా పెళ్ళి చేసుకోండి. మీరు కోరిన కానుకలు సమర్పించుకుంటాం. మా జాతిని కాపాడండి” అని పెట్టి వేడుకున్నాడు.

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

సెట్టి మాటలకు రాజు ఎగతాళిగా నవ్వాడు. ధర్మం తప్పక ప్రజాపాలన చేసే రాజునైన నాకు ఒక సెట్టి ధర్మాలు నేర్పించడమా ! అంటూ గేలి చేశాడు. పైగా రాజు తలచిందే ధర్మం, రాజు చెప్పిందే శాస్త్రం. రాజులకు గాంధర్వ వివాహ పద్ధతి న్యాయ సమ్మతమైనదే గదా ! కనుక ఆలస్యం వద్దు. రేపని మాపని గడువులు వద్దు. నువ్వు నాతో నిజంగా స్నేహాన్నే కోరుకుంటే కన్యకను ఇవ్వు. లేకపోతే ఇక్కణ్ణుంచి వెళ్ళిపో ! డేగ తాను పట్టిన పట్టును విడిచిపెడుతుందా ? అట్లాగే నే కన్నేసిన నీ కూతురు మళ్ళీ నీ ఇంటికి వస్తుందా ? అంటూ సెట్టిని బెదిరించాడు రాజు. అంతేగాక నువ్వు ఇస్తానన్న కానుకలు పట్టుకొనిరా. నువ్వు వచ్చేదాకా నేను కదలకుండా ఇక్కడే ఉంటాను అని పట్టుపట్టాడు రాజు.

అప్పుడు పెట్టి “రాజా ! ముందు దేవకార్యం. తరవాతే రాచకార్యం. ముందు మా కులదైవమైన వీరభద్రుడి దేవాలయానికి వెళ్ళి పళ్ళెరం ఇచ్చి వస్తాను. ఆ తరవాత తమరి దయ” అన్నాడు సెట్టి. “సరే ! మంచిది.వెళ్ళు. నీతోనే మేం కూడా వస్తాం. ఆ దేవాలయంలోనే అగ్నిసాక్షిగా ఈ కన్యకను చేపడతాము అన్నాడు రాజు.

అక్కడ గుడిలో అగ్నిగుండం వెలుగుతున్నది. ఆ మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అపుడు కన్యకను పట్టుకోవడానికి వచ్చిన ఆ రాజు గుండెల్లో దిగులు పుట్టింది. ఆ దిగులుతో నిదానంగా రాజు పట్టుదల తగ్గుతోంది. కన్యక ఎంతో భక్తితో మనసులో దుర్గామాతను పూజించింది. మోక్షాన్ని కోరుకుంటూ తన శరీరం మీద ఉన్న నగలను దేవతకు సమర్పించింది. అక్కడి కొలనులో స్నానం చేసింది. ఎర్రని గంధాన్ని, ఎర్రని పూలమాలలనూ ధరించింది. ఆ అగ్నిగుండం చుట్టూ నిలిచివున్న ప్రజలతో ఇట్లా అన్నది.

“అన్నలారా ! తండ్రులారా ! నా విన్నపాన్ని వినండి. కులంలో భార్యాబిడ్డలను రక్షించుకొనే ఆశ లేదా ? పట్టణాన్ని పాలించేవాడు రాజు అయితే ఆ రాజును పాలించే దేవుడు ఉండడా ? పరువు ప్రతిష్ఠలు నిలుపుకోవడానికి మీకు పౌరుషం ఎందుకు కలగడం లేదు ? చదువుకున్నవాడు బ్రాహ్మణుడు, పరాక్రమం ఉన్నవాడు క్షత్రియుడు అని పెద్దలు అన్నారు కదా ! ఆ విషయాన్ని మరచిపోయి పదవుల కోసం, సంపద ఉంటే సరిపోతుందనుకొని పరాక్రమం అంటే ఏమిటో తెలియని, ఎటువంటి విద్యలు నేర్చుకోని తెలివితక్కువవాళ్ళు రాజ్యాలను పాలిస్తే ప్రజలకు కష్టాలు కలుగవా మరి ? మీరంతా బాగా ఆలోచించండి. కనుక బుద్ధిబలాన్ని, బాహుబలాన్ని పెంచుకోండి. దైవం పట్ల భక్తిశ్రద్ధలు ఉంచి రాజులకే రాజులుగా జీవించండి” అని అన్నది.

తరువాత కన్యక రాజుకు ఎదురుగా నడిచింది. “రాజా ! పట్టపగలే, నట్టనడివీధిలో తిరిగే విటునిలాగా, దొంగలాగా నన్ను పట్టుకోవాలి అనుకున్నవాడివి నువ్వొక రాజ్యానికి ప్రభువువా ? కండ కావరంతో మదమెక్కి నువ్వు చేసిన ఈ దుర్మార్గపు పనిని చూసే దైవం అంటూ ఒకడు ఉండడా ? ఉండి నిన్ను చూస్తూ ఊరుకుంటాడా ? అదిగో ! కులం పెద్దలు అంతా ఉన్నారు. ఇదిగో ! అగ్నిసాక్షిగా పెళ్ళి చేసుకోవడానికి ఇక్కడ అగ్ని ఉంది. నీకు నచ్చిన కన్నెను, నేను ఎదురుగానే ఉన్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు ? నువ్వు నిజంగా రాజ్యాన్ని ఏలే రాజువే అయితే ఆ అర్హత నీకు ఉంటే నన్ను పట్టుకో ! అంటూ కన్యక అక్కడి అగ్ని గుండంలో దూకింది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 4 కన్యక

రాజు గర్వం నశించింది. పరువు మంటగలిసింది. కోటపేటలు కూలిపోయాయి. అవి నక్కలకు నివాసాలయ్యాయి. కన్యక తన మానం కాపాడుకోవటానికి ఏ ప్రదేశంలో నిప్పుల్లోకి దూకిందో అక్కడ ఆకాశాన్ని తాకే ఒక పెద్ద మేడ లేచింది. రాజ్యాన్ని పాలించే రాజు మరణించాడు. కోటపేటలు మట్టిలో కలిసిపోయాయి. కానీ కన్యక కీర్తి, రాజు అపకీర్తి గురించి చెప్పే ఈ కథ మాత్రం పదాలలోనూ, పద్యాలలోనూ నిలిచిపోయింది.

Leave a Comment