AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Telugu Study Material పద్య భాగం 1st Poem సత్య ప్రాశస్త్యము Textbook Questions and Answers, Summary.

AP Inter 2nd Year Telugu Study Material 1st Poem సత్య ప్రాశస్త్యము

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
గృహస్థ ధర్మం గొప్పదనాన్ని, గృహిణి ప్రాధాన్యాన్ని గురించి శకుంతల తెలిపిన తీరును వివరించండి.
జవాబు:
పరిచయం : భారతీయులకు ఎంతో పవిత్రమైన వేదాల సారాన్ని ఆకట్టుకొనే కథల రూపంలో అందించిన మహాభారతం పంచమవేదంగా ప్రసిద్ధి చెందింది. మహాభారతంలో భారతీయ జీవన విధానంలో ప్రాముఖ్యం కలిగిన ఎన్నో అంశాలు ముఖ్యంగా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ మొదలైన ధర్మాలు అపూర్వంగా వర్ణించబడ్డాయి. ‘సత్య ప్రాశస్త్యము ‘ అనే ప్రస్తుత పాఠ్యభాగంలో నన్నయ గృహస్థధర్మం గొప్పదనాన్ని గృహిణి ప్రాధాన్యాన్ని శకుంతల చేత హృద్యంగా చెప్పించాడు.

శకుంతలా దుష్యంతులు : వేటాడటానికి అరణ్యంలో సంచరిస్తూ దుష్యంత మహారాజు ‘కణ్వమహర్షి ఆశ్రమాన్ని సందర్శించాడు. అక్కడ శకుంతల సౌందర్యాన్ని చూసి మోహించి గాంధర్వ వివాహం చేసుకున్నాడు. . దుష్యంతుని వల్ల గర్భవతి అయిన శకుంతల’ కొంతకాలానికి భరతుడికి జన్మనిచ్చింది. శకుంతల పుట్టింట్లో ఎక్కువకాలం ఉండకూడ దని భావించిన కణ్వమహర్షి శకుంతలను దుష్యంతుడి దగ్గరకు పంపించాడు. రాజసభలో దుష్యంతుడు శకుంతల ఎవరో తనకు తెలియదు పొమ్మన్నాడు. అపుడు శకుంతల ‘గృహస్థ ధర్మం గొప్పదనాన్ని, గృహిణి ప్రాధాన్యాన్ని ఇట్లా వివరించింది.

గృహస్థ ధర్మం : పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను తిరస్కారభావంతో చూసే దుష్టుడిని ఇహలోకంలోనే కాదు పరలోకంలో కూడా సుఖం ఉండదు. అనుకూలవతి అయిన భార్య కలవాడు ఎన్నో కర్మలు ఆచరించ గలుగుతాడు, ఇంద్రియాలను వశం చేసుకోగలుగుతాడు, పుత్రసంతానాన్ని పొంద గలుగుతాడు, గృహస్థు పొందే ఫలాన్ని అంతటినీ పొందగలుగుతాడు.

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

గృహిణి ప్రాధాన్యం : లోకంలో సరుషుడికి భార్యకంటే ప్రధానమైనది ఏదీ లేదు. ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాలను సాధించటానికి తగిన సాధనం గృహిణి మాత్రమే. అంతేకాక గృహనీతి అనే విద్యకు ఆమె నెలవైనది. నిర్మలమైన శీలాన్ని నేర్పించే గురుస్థానము కూడా వంశం నిలవటానికి ఆమె ‘ఆధారం.. పురుషుడు ఉత్తమగతులు పొందడానికి ఆమె ఊతకర్ర వంటిది. గౌరవానికి ముఖ్య – హేతువు కూడా గృహిణియే. అందరికీ ఆమె ఆదర్శం. ఆమె కలకాలం వెలిగే మణులవంటి గుణాలకు నెలవైనది. భర్తకు హృదయానందాన్ని కలిగించేది భార్య మాత్రమే. భర్తకు భార్య కంటే ప్రియమైనది మరొకటి లేదు. అందువల్ల భార్యబిడ్డల పట్ల అసురాగం కలవారికి ఎక్కడైనా, ఎప్పుడైనా ఆపదలన్ని తొలగిపోతాయి.

భార్య భర్తలో సగభాగం. కనుకనే ముందుగా మరణించిన భార్య పరలోకంలో ‘ . కూడా తన భర్త రాక కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఒకవేళ భర్త ముందుగా మరణిస్తే తాను కూడా వెనువెంట వెళ్ళి భర్తతో కలిసి ఉండాలనుకుంటుంది భార్య. అటువంటి భార్యను అవమానించటం ధర్మవిరోధం. అంతేకాక భర్తె భార్య గర్భంలోకి – ప్రవేశించి వసించి పుత్రుడిగా జన్మిస్తాడు. ‘అంగాత్ అంగాత్ సంభవసి’ అనే వేదవాక్యం వల్ల తండ్రీ కొడుకులకు భేదం లేదు.

ముగింపు : గృహిణికి ఉండవలసిన గొప్ప లక్షణాలు అన్నీ కలిగినది కనుకనే ఆకాశవాణి. చేత శకుంతల సాధ్వీమతల్లి, సద్వినుత, మహాపతివ్రత అని ప్రశంసించబడింది. ధర్మానికి కట్టుబడి సత్యంతో దేవతలను మెప్పించింది. పరమసాధ్వి అయిన శకుంతల చేత . . నన్నయ పలికించిన ఈ మాటలు తెలుగు సాహిత్యంలో అమూల్యములు అజరామరములు.

ప్రశ్న 2.
సత్య ప్రాశస్త్యాన్ని గురించి శకుంతల ఏమని పలికింది ?
జవాబు:
పరిచయం : పవిత్రమైన వేదార్పాలను ప్రజలందరికీ అర్థమయ్యే భాషలో ఆకట్టుకొనే కథల రూపంలో రచించబడ్డ మహాభారతం పంచవేదంగా ఖ్యాతి పొందింది. భారతంలో రాజధర్మాలు, వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు మొదలైన ఎన్నో అంశాలు మనోహరంగా వర్ణించబడ్డాయి. వేదం అంటే సత్యం అని కూడా అర్థం. ప్రస్తుత ‘సత్య ప్రాశస్త్యము అనే పాఠ్యభాగంలో సత్యము గొప్పదనాన్ని శకుంతలచేత అపూర్వంగా చెప్పించాడు నన్నయ.

శకుంతలా దుష్యంతులు : వేటకోసం అడవికి వెళ్ళిన దుష్యంత మహారాజు కణ్వమహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అక్కడ శకుంతల సౌందర్యాన్ని చూసి మోహించాడు. ఆ సమయంలో మహర్షి ఆశ్రమంలో లేడు. శకుంతలను దుష్యంతుడు గాంధర్వ వివాహం చేసుకున్నాడు. దుష్యంతుని వల్ల గర్భం దాల్చిన శకుంతల భరతుడికి జన్మనిచ్చింది. కణ్వమహర్షి శకుంతలనూ, భరతుణ్ణి దుష్యంతుడి దగ్గరకు పంపించాడు. కానీ నిండు సభలో దుష్యంతుడు శకుంతల ఎవరో తెలియదు పొమ్మన్నాడు. అబద్దమాడ సాహసించిన దుష్యంతుడికి శకుంతల సత్య ప్రాశ్యస్త్యాన్ని గురించి ఇట్లా వివరించింది.

సత్య ప్రాశస్త్యం : ఓ రాజా ! అన్నీ తెలిసిన నీవు ఏమీ తెలియనివాడిలాగా ఎందుకు మాట్లాడుతున్నావు ? నేను’ తప్ప ఇతరులు ఎవరూ సాక్షులు లేరని ధర్మాత్ములైనవారు అబద్ధమాడకూడదు. ఋక్, యజుర్, సామ, అధర్వణ అనే నాలుగు వేదాలూ, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అనే పంచభూతాలూ ; ధర్మం, ఉదయం, సాయంత్రం అనే రెండు సంధ్యలూ, హృదయం, యముడు, చంద్రసూర్యులు, రాత్రీపగలూ అనే మహా పదార్థాలు మనిషి నడవడికను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాయి. ఆ మహా పదార్థాలు ఉండగా సత్యాన్ని ఎవరూ దాచలేరు.

సత్యమే వ్రతంగా గలిగిన ఓ రాజా ! నూరు మంచి నీటి బావులకంటే ఒక దిగుడు బావి మేలు. నూరు దిగుడు బావుల కంటే ఒక యజ్ఞం మేలు. అటువంటి నూరు యజ్ఞాల కంటే ఒక పుత్రుడు మేలు. అటువంటి నూరుగురు పుత్రులకంటే ఒక సత్య వాక్యం మేలైనది. అంతేకాక ఒక త్రాసులోని తక్కెడలలో వేయి అశ్వమేధ యాగాల ఫలాన్ని ఒకవైపునా, సత్యాన్ని మాత్రమే మరొకవైపునా ఉంచి తూచితే ముల్లు సత్యంవైపే మొగ్గుచూపుతుంది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

తీర్థాలన్నింటినీ సేవించటం కానీ, వేదాలన్నింటినీ అధ్యయనం చేయటంకానీ సత్యవ్రతానికి సాటిరావు. ధర్మజ్ఞులైన మహర్షులు అన్ని ధర్మాలకంటే సత్యమే గొప్పదని ఎల్లప్పుడూ చెబుతూ ఉంటారు.

ముగింపు : ఇట్లా సత్య ప్రాశస్త్యం గురించి ఎన్ని విశేషాలు చెప్పినా దుష్యంతుడు శకుంతలను భార్యగా అంగీకరించలేదు. పైగా ఆమెను తిరిగి ఆశ్రమానికి పొమ్మన్నాడు. శకుంతల దుఃఖంతో వెనుదిరుగుతున్న వేళ ఆకాశం నుంచి దివ్యవాణి మాటలు వినిపించాయి. సత్యమే జయించింది. శకుంతలను పట్టమహిషిగా స్వీకరించాడు. దుష్యంతుడు భరతుణ్ణి ఎత్తుకొని ముద్దాడాడు. యౌవరాజ్య పట్టాభిషేకం చేశాడు. పరమసాధ్విగా, కీర్తిమంతురాలుగా, మహాపతివ్రతగా శకుంతల దేవతలచే ప్రశంసించ బడింది.

సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
పురుషుని కార్యాలను ఎల్లప్పుడు చూసేవి ఏవి ?
జవాబు:
ఋక్, యజుర్, సామ, అధర్వణ అనే వేదాలు; నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అనే పంచభూతాలు; ధర్మం; ఉదయం, సాయంత్రం అనే రెండు సంధ్యలూ; హృదయం; యముడు; చంద్రుడు; సూర్యుడూ; రాత్రీ; పగలూ అనే మహాపదార్థాలు పురుషుని కార్యాలను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటాయి.

ప్రశ్న 2.
భార్యను ఎలా గౌరవించాలని శకుంతల పేర్కొంది ?
జవాబు:
పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను తిరస్కార భావంతో చూచే దుష్టుడికి ఇహపరసుఖాలు ఉండవు. అనుకూలవతి అయిన భార్య గలవాడు అన్ని కర్మలను ఆచరించగలుగుతాడు. ఇంద్రియాలను వశం చేసుకో గలుగుతాడు. పుత్రసంతానాన్ని పొందగలుగుతాడు. గృహస్థు పొందే ఫలాన్నంతటినీ పొందగలుగుతాడు. అందువల్ల భార్యను ఉచిత రీతిలో గౌరవించాలి.

అంతేకాక ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాలను సాధించటానికి తగిన సాధనం భార్యయే. ఇంకా భార్య గృహనీతి అనే విద్యకు నెలవైనది. నిర్మలమైన శీలాన్ని నేర్పించే గురుస్థానం, వంశం నిలబడటానికి ఆధారం, ఉత్తమగతులు పొందటానికి ఊతమైనది, మన్ననకు ముఖ్య కారణం. అందరికీ ఆదర్శమై కలకాలం నిలిచే మణులవంటి గుణాలకు నెలవైనదీ, హృదయానందాన్ని కలిగించేదీ భార్య మాత్రమే. భర్తకు భార్య కంటే ప్రియమైనది మరొకటి లేదు. భార్యా బిడ్డలను అనురాగంతో చూసుకొనే వారికి అన్ని దుఃఖాలూ తొలగిపోతాయి. ఈ లోకంలోనే కాక పరలోకంలో కూడా భర్త కోసం పరితపించే భార్యను అవమానించటం ధర్మవిరుద్ధం. అందువల్ల భార్యను గౌరవించాలని శకుంతల హితబోధ చేసింది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

ప్రశ్న 3.
సత్యవాక్యం వేటికంటే గొప్పది ?
జవాబు:
నూరు మంచినీటి బావుల కంటే ఒక దిగుడు బావి మేలు, నూరు దిగుడు. బావులకంటే ఒక యజ్ఞం మేలు. అటువంటి నూరు యజ్ఞాలకంటే ఒక పుత్రుడు మేలు. అటువంటి పుత్రులు నూరుమంది కంటే ఒక సత్యవాక్యం మేలైనది. అంతేకాక ఒక త్రాసులో వేయి అశ్వమేధ యాగాల ఫలాన్ని . ఒకవైపునా, సత్యాన్ని మాత్రమే మరొకవైపునా ఉంచి తూచగా ముల్లు సత్యంవైపే మొగ్గుచూపుతుంది. తీర్థాలన్నింటినీ సేవించటం కానీ, వేదాలన్నింటినీ అధ్యయనం చేయటం కానీ సత్యవ్రతానికి సాటిరావు. అందువల్లనే ధర్మజ్ఞులైన మహర్షులు అన్ని ధర్మాలకంటే సత్యమే గొప్పదని ఎప్పుడూ చెబుతూ ఉంటారు.

ప్రశ్న 4.
శకుంతల ‘బాధపడిన విధమెట్టిది ?
జవాబు:
తనను భార్యగా గుర్తించని దుష్యంత మహారాజుకు శకుంతల గార్హస్య ధర్మ వైశిష్ట్యాన్ని, గృహిణి ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పదనాన్ని వివరించింది. అయినప్పటికి దుష్యంతుడు ఆమెను అంగీకరించలేదు. పైగా ఆమె మాటలన్నీ అసత్యాలని తిరిగి ఆశ్రమానికి వెళ్ళి . పొమ్మని చెప్పాడు. దుష్యంతుని కాఠిన్య శకుంతలను ఎంతో బాధించింది.

నేను పుట్టిననాడే తల్లిదండ్రులచేత విడువబడ్డాను. ఇప్పుడు భర్తచేత కూడా … విడువబడతాను కాబోలు. పూర్వం ‘నేను నోచిన నోముల ఫలితం ఇంతే కాబోలు అనుకొంటూ దుఃఖిస్తూ, ఆశలు వదలుకొని, కన్నీరు తుడుచుకుంటూ. తనకు ఇక . దైవమే దిక్కని భావించింది, శకుంతల కొడుకుని వెంటబెట్టుకొని తిరిగి వెళ్ళిపోబోతున్న సమయంలో ఆకాశం నుంచి దివ్యవాణి శకుంతల పతివ్రత అని ప్రకటించింది.

ఏకవాక్య / పదరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
నన్నయకు గల బిరుదులేవి ?
జవాబు:
ఆదికవి, శబ్దశాసనుడు లేక వాగనుశాసనుడు అనేవి నన్నయకు గల బిరుదులు.

ప్రశ్న 2.
నన్నయ ఎవరి ఆస్థానకవి ?
జవాబు:
నన్నయ రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన చాళుక్య ప్రభువైన రాజరాజనరేంద్రుని ఆస్థానకవి.

ప్రశ్న 3.
శకుంతలను పెంచిన తండ్రి ఎవరు ?
జవాబు:
శకుంతలను పెంచిన తండ్రి కణ్వమహర్షి.

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

ప్రశ్న 4.
శకుంతలను దుష్యంతుడు ఏ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు ?
జవాబు:
శకుంతలను దుష్యంతుడు గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు.

ప్రశ్న 5.
శకుంతలకు, దుష్యంతునికీ జన్మించినదెవరు ?
జవాబు:
శకుంతలకు, దుష్యంతునికీ జన్మించిన భరతుడు.

ప్రశ్న 6.
నన్నయ రచించిన, వ్యాకరణ గ్రంథం పేరేమిటి ?
జవాబు:
నన్నయ రచించిన వ్యాకరణ గ్రంథం పేరు ‘ఆంధ్రశబ్ద చింతామణి’.

సందర్భ సహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
దుర్మతి కిహముం బరముఁ గలదె.
జవాబు:
కవిపరిచయం . : ఈ వాక్యం ఆదికవి నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం – చతుర్థాశ్వాసం నుంచి గ్రహించిన ‘సత్య ప్రాశస్త్యము’ అనే పాఠ్యభాగం లోనిది.

సందర్భం : ఈ మాటలు పతివ్రత అయిన భార్యను అవమానించకూడదని చెబుతూ శకుంతల దుష్యంతుడితో పలికిన సందర్భంలోనిది.

భావం : భార్యను గౌరవించని దుష్టుడికి ఇహపర సుఖాలు ఉండవని భావం. – వ్యాఖ్య : దుష్యంత ‘మహారాజు గాంధర్వ పద్ధతిలో వివాహం వల్ల భార్య అయిన తలనూ, పుత్రుడైన భరతుణ్ణి గుర్తించలేదు. అపుడు శకుంతల దుష్యంతుడికి గార్హస్థ్య ధర్మాన్ని, గృహిణి ప్రాధాన్యాన్ని వివరించింది. పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను తిరస్కార భావంతో చూసే దుష్టుడికి ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా సుఖం ఉండదని శకుంతల దుష్యంతుడికి వివరించింది.

ప్రశ్న 2.
జీవులకు హృద్యంబే కడున్ శీతమే.
జవాబు:
కవిపరిచయం : ఈ వాక్యం ఆదికవి నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం – చతుర్థాశ్వాసం నుంచి గ్రహించిన ‘సత్య ప్రాశస్త్యము’ అనే పాఠ్యభాగం లోనిది.

సందర్భం : ఈ మాటలు తనను భార్యగా గుర్తించని దుష్యంతుడికి కుమారుని కౌగిలిలోని అనురాగాన్ని ఆస్వాదించమని చెబుతూ శకుంతల పలికిన సందర్భంలోనిది.

భావం : పుత్రుణ్ణి కౌగిలిలోని ఆనందంకంటే మనుషులకు మనోహరం, చల్లదనం : ఏమి ఉంటుందని భావం.

వ్యాఖ్య : తనను భార్యగా గుర్తించని దుష్యంత మహారాజుకు శకుంతల ఎన్నో ధర్మాలను వివరించింది. ఒక్కసారి పుత్రుణ్ణి కౌగిలించుకొని అందులోని ఆనందాన్ని ఆస్వాదించమని కోరింది. కొడుకు కౌగిలిని మించి మనుషులకు మనోహరమైనది, చల్లదనాన్ని ఇచ్చేది మరొకటి లేదని శకుంతల వివరించింది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

ప్రశ్న 3.
ఒక సూనృత వాక్యము మేలు సూడఁగన్.
జవాబు:
కవిపరిచయం : ఈ వాక్యం ఆదికవి నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం – చతుర్థాశ్వాసం నుంచి గ్రహించిన ‘సత్య ప్రాశస్త్యము’ అనే పాఠ్యభాగం లోనిది.

సందర్భం : ఈ మాటలు సత్య ప్రాశస్త్యాన్ని వివరిస్తూ దుష్యంతునితో శకుంతల పలికిన సందర్భంలోనిది.

భావం : నూరుగురు కుమారుల కంటే ఒక్క సత్యవాక్యము మేలైనది అని భావం.

వ్యాఖ్య : నూరు చేదుడు బావులు కంటే ఒక దిగుడు బావి మేలు. అటువంటి నూరు దిగుడు బావులకన్నా ఒక్క గొప్ప యజ్ఞం మేలు. అటువంటి నూరు యజ్ఞాలకన్నా గుణవంతుడైన ఒక్క కుమారుడు మేలు. అటువంటి నూరుగురు కుమారులు కన్నా ఒక్క సత్యవాక్యం మేలైనది.

ప్రశ్న 4.
ఇట్టులసత్య భాషణం బుచితంబే.
జవాబు:
కవిపరిచయం : ఈ వాక్యం ఆదికవి నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం – చతుర్థాశ్వాసం నుంచి గ్రహించిన ‘సత్య ప్రాశస్త్యము’ అనే పాఠ్యభాగం లోనిది.

సందర్భం : ఈ మాటలు నీ మాటలన్నీ అబద్దాలంటూ దుష్యంతుడు శకుంతలతో పలికిన సందర్భంలోవి.

భావం : ఇట్లా అసత్యపు మాటలు చెప్పటం నీకు తగదని భావం.

వ్యాఖ్య : నేనెక్కడ ? నీవెక్కడ ? కుమారుడు ఎక్కడ ? నేను నిన్ను ఇంతకు ముందు ఎన్నడూ చూడనేలేదు. స్త్రీలు అబద్దాల కోరులు అన్నట్లు ఇట్లా అసత్యపు మాటలు ఆడటం నీకు తగదు అని దుష్యంతుడు శకుంతలతో అన్నాడు.

అలంకారాలు

ప్రశ్న 1.
దీపము వలన నొండొక దీపము ప్రభవించినట్లు ….” అనే పద్యంలో ఉపమాలంకారం ఉంది.
జవాబు:
లక్షణం : సమానధర్మాన్ని అనుసరించి ఉపమేయాన్ని ఉపమానంతో మనోహరంగా పోల్చి చెబితే దానిని ఉపమాలంకారం అంటారు.
లక్ష్యము : “నీ పుణ్య తనువు వలనన
యీ పుత్రకుఁడు ద్భవిల్లి యెంతయు నొప్పున్
దీపంబు వలన నొఁడొక
దీపము ప్రభవించినట్లు తేజం బెసఁగన్”.

భావం : ఒక దీపం నుంచి మరొక దీపం పుట్టి వెలుగొందినట్లు నీ పుణ్య శరీరం నుంచి ఈ పుత్రుడు పుట్టి ప్రకాశిస్తున్నాడు అని భావం.

సమన్వయం :

  1. ఉపమేయం . : “నీ పుణ్య తనువు వలనన యీ పుత్రకుఁడుద్భవిల్లి”
  2. ఉపమానం . : “దీపంబు వలనన నొండొక దీపము ప్రభవించి ….”
  3. సమాన ధర్మం : తేజం బెసఁగన్
  4. ఉపమావాచకం : అట్లు

ఇందులో ప్రకాశించటం అనే సమానధర్మంతో ఉపమేయాన్ని ఉపమానంతో మనోహరంగా పోల్చి చెప్పటంవల్ల ఇది ఉపమాలంకారం.

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

ప్రశ్న 2.
“సతియును గుణవతియుఁ …. ” అనే పద్యంలో వృత్యనుప్రాసాలంకారం ఉంది.
జవాబు:
లక్షణం : ఒక అక్షరాన్ని పద్యంలో అనేకమార్లు ప్రయోగించటం ద్వారా శబ్ద మాధుర్యాన్ని సాధిస్తే దానిని వృత్త్యనుప్రాసాలంకారం అంటారు.

లక్ష్యము : “సతియును గుణవతియుఁ బ్రజా
వతియు ననువ్రతయునైన వనిత నవజ్ఞా
న్విత దృష్టిఁ జూచునతి దు
ర్మతి కిహముం బరముఁగలదె మతిఁబరికింపన్.

సమన్వయం : ఈ పద్యంలో ‘త’ వర్ణం అనేకమార్లు ఆవృత్తం కావటం ద్వారా శబ్దమాధుర్యం సాధించబడటం వల్ల ఇది వృత్త్యనుప్రాస అనే శబ్దాలంకారం.

ప్రతిపదార్థ తాత్పర్యాలు

ప్రశ్న 1.
ఆ. ఏల యెఱుక లేని యితరులయట్ల నీ ఉన్న
వెఱుఁగ ననుచుఁబలికె దెఱిఁగి యెఱింగి
యేన కాని దీని నెఱుఁగ రిందొరు లని
తప్పఁబలుక నగునె ధార్మికులకు.
జవాబు:
ప్రతిపదార్థం :
నీవు = నువ్వు (దుష్యంతుడు)
ఎఱిఁగి + ఎటిఁగి = అన్ని విషయాలు బాగా తెలిసి కూడా
ఎఱుఁగను + అనుచున్ = తెలియదు అంటూ
ఎఱుకలేని = ఏమి తెలియని
ఇతరులు + అ + అట్లు + అ  = ఇతరులు ఎవరో మాట్లాడినట్లు
పలికెదు = మాట్లాడుతున్నావు
ఇందున్ = ఇక్కడ
దీనిని = ఈ విషయాన్ని
ఏను + అ, కాని : నేను (శకుంతలను) మాత్రమే కానీ
ఒరులు = ఇతరులు
ఎఱుఁగరు + అని = తెలియరని
ధార్మికులకున్ = ధర్మాత్ములైన మీకు
తప్పన్ + పలుకన్ +
అగును + ఎ = అబద్ధం ఆడటం తగునా ? (తగదని భావం)

తాత్పర్యం :
ఓ రాజా ! నీవు అన్ని విషయాలు బాగా తెలిసి కూడా ఏమీ తెలియని ఇతరులు ఎవరో మాట్లాడినట్లు తెలియదు అని అంటున్నావు. ఇక్కడ. ఉన్నవారిలో ఈ విషయం నాకు తప్ప ఎవరికీ తెలియదని ధర్మాత్ములైన మీకు అబద్ధం ఆడటం భావ్యమా ! అని తాత్పర్యం.

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

ప్రశ్న 2.
చ. విమలయశోనిధీ ! పురుషవృత్త మెఱుంగుచునుండుఁ జూవె వే
దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు సంతరాత్మయున్
యముఁడును జంద్రసూర్యులు సహంబును రాత్రియు నన్మహాపదా
ప్రములివి యుండంగా నరుఁడు దక్కొన నేర్చునే తన్ను మ్రుచ్చిలన్.
జవాబు:
కవిపరిచయం : ఈ పద్యం ఆదికవి నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం చతుర్థా శ్వాసం నుంచి గ్రహించిన సత్యప్రాశస్త్యము అనే పాఠ్యభాగంలోది.

సందర్భం : ఈ మాటలు తనను భార్యగా గుర్తించని దుష్యంతునితో శకుంతల పలికిన సందర్భం లోనివి.

ప్రతిపదార్థం :
విమల యశోనిధీ ! = నిర్మలమైన కీర్తికి నెలవైన ఓ రాజా !
వేదములను = ఋక్, యజుర్, అధర్వణ, సామ – అనే నాలుగు వేదాలూ
పంచభూతములు = నేల, నింగి, నీరు, నిప్పు, గాలి – అనే అయిదు భూతాలూ
ధర్మువు = ‘ధర్మమూ
సంధ్యలు = ఉదయసంధ్య, సాయంసంధ్య అనే రెండు సంధ్యలూ
అంతః + ఆత్మయున్ = మనస్సూ
యముఁడును = మృత్యుదేవత అయిన యముడూ
చంద్రసూర్యులు = చంద్రుడూ, సూర్యుడూ
అహంబును రాత్రియున్ = పగలూ, రాత్రీ
అన్ = అనే
మహత్ + పదార్థములు = మహా పదార్థాలు
పురుషవృత్తము = మనిషి చేసే పనులను
ఎఱుంగుచున్ + ఉండున్ + చూవె = నిత్యం గమనిస్తూనే ఉంటాయి సుషూ !
ఇవి = ఈ మహాపదార్థాలు
ఉండఁగాన్ = ఉండగా
నరుఁడు = మానవుడు
తన్ను = తనను తాను
మ్రుచ్చిలన్ = వంచింపగా
తక్కొనన్; నేర్చునే – పూనుకోగలడా ? (పూనుకోలేడని భావం)

తాత్పర్యం :
నిర్మలమైన కీర్తికి నెలవైన ఓ రాజా ! ఋక్, యజుర్, సామ, అధర్వణ అనే నాలుగు వేదాలూ, నేల, నింగి, నీరు, నిప్పు, గాలి – అనే అయిదు భూతాలూ (ప్రకృతులూ), ధర్మమూ, ఉదయం, సాయంత్రం – అనే రెండు సంధ్యలూ, మనస్సూ, మృత్యుదేవత అయిన యముడూ, చంద్రుడూ, సూర్యుడూ, పగలూ, రాత్రీ అనే మహా పదార్థాలు మనిషి నడవడికను నిత్యం గమనిస్తూనే ఉంటాయి సుమా ! ఈ మహా పదార్థాలు ఉండగా మనిషి తనను తాను వంచించుకోవటానికి సిద్ధపడగలడా ? (లేడని భావం).

విశేషాంశాలు :
1) దుష్యంతుడు స్వచ్ఛమైన కీర్తి కలవాడు. అంత గొప్పవాడు శకుంతల ఎవరో తెలియదు అనటం అతని కీర్తికి మచ్చతెచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల రాజును శకుంతల ‘విమల యశోనిధీ’ అని సంబోధించటం ద్వారా అబద్ధమాడి నీ కీర్తికి కళంకం తెచ్చుకోకు అనే హెచ్చరిక స్ఫురిస్తుంది.

2) మహా పదార్థాలలో వేదాలకు మొదటి స్థానం ఇవ్వటం విశేషం. శకుంతల సత్యం కోసం పోరాడుతున్నది. వేదం అంటే సత్యం అని కూడా అర్థం. భారతీయ సంస్కృతికి వేదాలు పరమ ప్రమాణాలు, మహాభారతం కూడా వేదవిహితము, వేదసారభూతమూ అయిన రచన. అందువల్లనే పంచమవేదంగా ప్రసిద్ధి చెందినది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

ప్రశ్న 3.
క. నా యెంగినట్ల యన్నియు
నీ యిచ్చినవరము ధారుణీవర ! యెణఁగున్
నా యందుఁ దొంటియజుల కల
చేయు మసుగ్రహ మవజ్ఞ సేందగునే.
జవాబు:
ప్రతిపదార్థం :
ధారుణీవర ! = ఓ రాజా !
నీ + ఇచ్చిన వరము = నాడు నీవు నాకు ఇచ్చిన వరాన్ని గురించి
నా, ఎటిఁగిన + అట్లు + అ = నాకు తెలిసినట్లుగానే
ఇన్నియున్ = ఈ మహా పదార్థాలన్నింటికీ
ఎఱుఁగన్ = తెలుసు
తొంటి + అట్టులు + అ = కనుక మునుపటిలాగానే
నా + అందున్ = నాపైన
చేయుము + అనుగ్రహము = దయచూపు
అవజ్ఞ + చేయన్ = నన్ను అవమానించ
తగున్ + ఏ = నీకు తగునా ? (తగదని భావం).

తాత్పర్యం :
ఓ రాజా ! నాడు నీవు నాకు ఇచ్చిన వరాన్ని గురించి నాకు తెలిసినట్లుగానే వేదాలు. మొదలైన ఈ మహా ‘పదార్థాలకు కూడా తెలుసు. కనుక మునపటి లాగానే నన్ను దయతో ఆదరించు. నన్ను అవమానించటం నీకు తగునా ? (తగదని భావం).

ప్రశ్న 4.
క. సతియును గుణవతియుఁ బ్రా
వతియు ననువ్రతయునైన వనిత నవజ్ఞా
న్విత దృష్టిఁ జూచునతి దు
ర్మతి కిహముం బరముఁ గలదె మతిఁబరికింపస్.
జవాబు:
కవిపరిచయం : ఈ పద్యం ఆదికవి నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం చతుర్గా శ్వాసం నుంచి గ్రహించిన ‘సత్య ప్రాశస్త్యము’ అనే పాఠ్యభాగంలోనిది.

సందర్భం : ఈ మాటలు తనను భార్యగా గుర్తించని దుష్యంతునితో శకుంతల పలికిన సందర్భం లోనివి.

ప్రతిపదార్థం :
మతిన్ = బుద్ధితో
పరికింపన్ = ఆలోచించగా
సతియును = పతివ్రతా
గుణవతియున్ = గుణవంతురాలూ
ప్రజావతియున్ = సంతానవతీ
అనుప్రతియున్ + ఐన = అనుకూలవతీ అయిన
వనితన్ = భార్యను
అవజ్ఞా + అన్విత దృష్టిన్ = తిరస్కార భావంతో
చూచు = చూసే
అతి దుర్మతికిన్ = మిక్కిలి దుర్మార్గుడికి
ఇహమున్ + పరమున్ = ఈ లోకంలోనూ, పరలోకంలోనూ
కలదు + ఎ = సుఖం ఉంటుందా ? (ఉండదని భావం)

తాత్పర్యం :
ఓ రాజా ! బాగా ఆలోచిస్తే – పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను తిరస్కార భావంతో చూసే దుష్టుడికి ఇహపరసుఖాలు ఉంటాయా ? (ఉండవని భావం) అటువంటి దుర్మార్గుడు బ్రతికి ఉన్నా, చచ్చినా సుఖపడలేడని తాత్పర్యం.

విశేషాంశాలు :
పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను గౌరవించాలి అని దుష్యంతుడికి శకుంతల చెప్పిన ఈ మాటలు భారతీయ సంస్కృతిలో స్త్రీ స్థానాన్ని చాటుతున్నాయి. అంతేకాక ఇవి స్త్రీలను గౌరవించాలని ప్రపంచానికి బోధించే అర్థవంతమైన సూక్తులు.

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

ప్రశ్న 5.
క. సంతత గృహమేధిఫలం
బంతయుఁ బడయంగనోపు ననుగుణ భార్యా
వంతుండగువాఁడు క్రియా
వంతుఁడుఁ దాంతుండు బుత్రవంతుండు నగున్.
జవాబు:
ప్రతిపదార్థం :
అనుగుణ = అనుకూలవతియైన
భార్యావంతుండు + అగు = భార్య కలవాడు
క్రియావంతుఁడు = కర్మలను ఆచరించేవాడూ,
దాంతుండున్ = ఇంద్రియ నిగ్రహం కలవాడూ
పుత్తవంతుండున్ = పుత్ర సంతానం కలవాడూ
అగున్ = అవుతాడు
సంతత గృహమేధి ఫలంబు సంతత = ఎల్లప్పుడూ
గృహమేధిఫలంబు = గృహ యజమాని పొందే ఫలాన్నంతటినీ
పడయంగన్ + ఓపున్ = పొందగలుగుతాడు

తాత్పర్యం :
ఓ రాజా ! అనుకూలవతి అయిన భార్య కలవాడు కర్మలు ఆచరించగలుగుతాడు. ఇంద్రియాలను నిగ్రహించగలుగుతాడు. పుత్ర సంతానాన్ని పొందగలుగుతాడు. గార్హస్థ ధర్మాన్ని నియమనిష్ఠలతో ఆచరించే గృహస్థుడు పొందే ఫలాన్నంతటినీ పొందగలుగు తాడు అని తాత్పర్యం..

ప్రశ్న 6.
వ. మణియును. ,
తాత్పర్యం :
మరియు
ప్రశ్న 7.
సీ. ధర్మార్థకామసాధన కుపకరణంబు
గృహనీతివిద్యకు గృహము విమల
చారిత్రశిక్ష కాచార్యకం బన్వయ
స్థితికి మూలంబు సద్గతికి నూఁత
గౌరవంబున కేకకారణం బున్నత
స్థిరగుణమణుల కాకరము హృదయ
సంతోషమునకు సంజనకంబు భార్యయ
చూవెభర్తకు నొండ్లుగావు ప్రియము.

ఆ. లెట్టి ఘట్టములను నెట్టి యాపదలను
నెట్టి తీఱములను ముట్టఁబడిన
వంతలెల్లఁ బాయు నింతులఁ జలను
నొనరఁ జూడఁగనిన జనుల కెందు.
జవాబు:
ప్రతిపదార్థం :
ధర్మ+అర్థ, కామ సాధనకున్ = ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాలను సాధించటానికి
ఉపకరణంబు = సాధనం
గృహనీతి విద్యకు = గృహనీతి అనే విద్యకు
గృహము = నెలవైనది
విమల చారిత్ర శిక్షకున్ = నిర్మలమైన శీలాన్ని బోధించే
ఆచార్యకంబు = గురువు
అన్వయ స్థితికిన్ = వంశం నిలబడటానికి
మూలంబు = ఆధారం
సత్ + గతికిన్ = ఉత్తమగతియైన మోక్షానికి
ఊఁత = ఊతకర్ర
గౌరవంబునకు = గౌరవానికి
ఏక కారణంబు = ముఖ్యహేతువు
ఉన్నత = ఉన్నతమైన
స్థిరగుణమణులకున్ = కలకాలం నిలిచే మణులవంటి గుణాలను
ఆకరము = నెలవైనది
హృదయ సంతోషమునకున్ = మాససిక ఆనందాన్ని
సంజనకంబు = కలిగించేది
భార్య + అ, చూ . = భార్యయే సుమా
భర్తకున్ = మగనికి
ప్రియములు = ఇష్టమైనవి
ఒండ్లు + కావు = ఇతరమైన కావు
ఇంతులన్ = భార్యలను
ప్రజలను = సంతానాన్ని
ఒనరన్ + చూడన్ + కనిన జనులకు = చక్కగా ఆదరింపగలిగిన వారికి
ఎందున్ = ఎక్కడైనా
ఎట్టి ఘట్టములను = ఎటువంటి పరిస్థితులలోనైనా
ఎట్టి + ఆపదలను = ఎటువంటి ఆపదలలోనైనా
ఎట్టి తీఱములను = ఎటువంటి ఇబ్బందులలోనైనా
ముట్టన్ + పడిన = ఆవరించిన
వంతలు + ఎల్లన్ = దుఃఖాలన్నీ
పాయున్ = తొలగిపోతాయి

తాత్పర్యం :
ఓ రాజా ! భర్తకు ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాలను సాధించటానికి అనువైన సాధనమూ, గృహనీతి అనే విద్యకు నెలవైనదీ, నిర్మలమైన శీలాన్ని ప్రబోధించే గురుస్థానమూ, వంశం నిలవటానికి ఆధారమైనదీ, ఉత్తమగతులు పొందటానికి ఊతకర్ర అయినదీ, గౌరవానికి ముఖ్య హేతువైనదీ, ఆదర్శప్రాయమైనవీ, కలకాలం నిలిచేవీ అయిన మణులవంటి గుణాలకు నెలవైనదీ, హృదయానందాన్ని కలిగించేదీ భార్యయే సుమా ! మగనికి ఇల్లాలికంటే ఇంపైనది వేరొకటి లేదు. ఆలిబిడ్డలను ఆప్యాయంగా చూసేవారికి ఏ చోటైనా, ఎటువంటి పరిస్థితులలోనైనా, ఎలాంటి ఆపదలలోనైనా, ఇబ్బందులలోనైనా చుట్టుముట్టిన దుఃఖాలన్నీ తొలగిపోతాయి అని తాత్పర్యం.

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

ప్రశ్న 8.
వ. మఱియు భార్య పురుషునం దగ్ధం బగుటంజేసి పురుషునకు మున్న పరేత
యైన పతివ్రత పరలోకంబునం దన పురుషుం గూడఁ దదాగమనంబు ప్రతీక్షించు
చుండు బురుషుందు మున్న పరేతుండైనఁ బదంపడి తానును బరేతయై తన
పురుషుంగూడ నరుగునట్టి భార్య నవమానించుట ధర్మవిరోధంబు, మఱియునుం
బురుషుండు భార్యయందుఁ బ్రవేశించి గర్భంబునఁ బుత్రుండై తాన
యుద్భవిల్లుఁ గావున ‘నష్టాదభైత్సమ్భవసి’ యనునిది యాదిగాఁగల
వేదవచనంబుల యందును జనకుండును బుత్రుండును ననుభేదంబు లేదు.
జవాబు:
ప్రతిపదార్థం :
మఱియున్ = అంతేకాక
భార్య = ఇల్లాలు
పురుషునందుస్ = మగనిలో
అర్ధంబు = సగం
అగుటన్ + చేసి – కావటం వల్ల
పురుషునకున్ = పురుషుడికంటే
మున్ను + అ = ముందే
పరేత + ఐన = మరణించిన
పతివ్రత = పతివ్రత
పరలోకంబునన్ = స్వర్గలోకంలో కూడా
తన = తన యొక్క
పురుషున్ + కూడన్ = భర్తను కలుసుకోవటానికి
తత్ + ఆగమనంబు = అతడి రాకకోసం
ప్రతీక్షించుచున్ + ఉండున్ = ఎదురుచూస్తూ ఉంటుంది.
పురుషుడు = ఒకవేళ పురుషుడు
మున్ను + అ = ముందుగా కనుక
పరేతుండు + ఐనన్ = మరణించినట్లయితే
పదంపడి = తరువాత
తానును = తానుకూడా
పరేత + ఐ = మరణించి
తన = తన యొక్క
పురుషున్ + కూడన్ = భర్తను కలుసుకోవటానికి
అరుగునట్టి భార్యన్ = వెళ్ళే భార్యను
అవమానించుట = అవమానించటం
ధర్మవిరోధంబు = ధర్మవిరుద్ధమైనది
మఱియున్ = అంతేకాక
పురుషుండు = భర్త
భార్యయందున్ = భార్య శరీరంలోకి ప్రవేశించి
గర్భంబునన్ = గర్భంలో
పుత్రుండు + ఐ = పుత్రుడై
తాను + ఏ = తానే
ఉద్భవిల్లున్ = జన్మిస్తాడు
కావుననన్ = కాబట్టి
అంగాత్ + అంగాత్ = శరీరం నుంచి
సంభవసి = పుడుతున్నావు
అను + అది = అనే వాక్యం
ఆదిగాన్ + కల = మొదలైన
వేదవచంబుల + అంధును = వేదవాక్యాలలో కూడా
జనకుండును = తండ్రి
పుత్రుండును = కుమారుడు
అను = అనే
భేదంబు లేదు = భేదం లేదు.

తాత్పర్యం :
అంతేకాక, భార్య భర్తలో సగభాగం. కనుకనే మగనికంటే ముందే చనిపోయిన పతివ్రత స్వర్గలోకంలో కూడా తన భర్తను కలుసుకోవాలని అతని రాకకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఒకవేళ భర్త ముందుగా చనిపోతే తాను కూడా వెనువెంటనే వెళ్ళి భర్తను చేరుకొనే భార్యను అవమానించటం ధర్మ విరుద్ధం. అంతేకాదు. భర్త భార్య శరీరంలోని ప్రవేశించి గర్భంలో వసించి పుత్రుడై జన్మిస్తాడు కాబట్టి ‘అంగాత్ అంగాత్ సంభవసి, (= శరీరం నుండి పుడుతున్నావు) మొదలైన వేదవాక్యం వల్ల కూడా తండ్రీ కొడుకులకు భేదం లేదు.

ప్రశ్న 9.
క. విను గార్హపత్యమను న
య్యనలము విహరింపఁబడి తదాహవనీయం
బున వెలుఁగునట్ల వెలుఁగును
జనకుఁడు దాఁబుత్రుఁడై నిజద్యుతితోడన్.
జవాబు:
ప్రతిపదార్థం :
విను = తెలుసుకో
గార్హపత్యము + అను = గార్హపత్యం అని పిలువబడే
ఆ + అనలము = ఆ అగ్ని
విహరింపఁబడి = ప్రజ్వలింపచేయబడి
తత్ + ఆహవనీయంబున = ఆ ఆహవనీయం అనే అగ్నిలో
వెలుఁగున్ + అట్లు + అ = వెలుగునట్లుగానే
జనకుఁడు = తండ్రి
తాన్ = తానే
పుత్రుఁడు + ఐ = పుత్రుడై
నిజ ద్యుతితోన్ = తన యొక్క కొంతితో
వెలుగును = ప్రకాశిస్తాడు.

తాత్పర్యం :
ఓ రాజా ! గార్హపత్యం అని చెప్పబడే అగ్ని ప్రజ్వలించి ఆహవనీయం అనే అగ్నిలో ఎట్లా వెలుగొందుతుందో అట్లాగే తండ్రి తానే పుత్రుడై తన ప్రకాశంతో వెలుగొందుతాడని తెలుసుకో అని భావం.

ప్రశ్న 10.
క తాన నీడ నీళ్ళుల
లో నేర్పడం జూచునట్లు లోకస్తుత ! త,
త్సూను జనకుండు సూచి మ
అని – హానందముఁ బొందు నతిశయ ప్రీతిమెయిన్.
జవాబు:
ప్రతిపదార్థం : లోకస్తుత ! = లోకులచేత కీర్తింపబడిన దుష్యంతా !
తాను + అ = తానే
తన నీడ = తన నీడను
నీళ్ళులలోన్ = నీళ్ళల్లో
ఏర్పడన్ = స్పష్టంగా
చూచున్ + అట్లు = చూసే విధంగా
జనకుండు = తండ్రి
తత్ + సూను = అతని కుమారుడిని
చూచి = చూచి
అతిశయప్రీతి మెయిన్ = మిక్కిలి సంతృప్తితో
మహత్ + ఆనందమున్ = గొప్ప ఆనందాన్ని
పొందును = పొందుతాడు.

తాత్పర్యం :
ఓ రాజా ! నీళ్ళల్లో తన నీడను తానే స్పష్టంగా చూచినట్లు తండ్రి తన కొడుకును చూచి ఎంతో సంతృప్తితో మహదానందాన్ని పొందుతాడు.

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

ప్రశ్న 11.
వ. ‘పున్నామ్నో నరకా త్రాయత ఇతిపుత్ర’ యను వేద వచనంబు గలదుఁ గావునఁ
బుణ్యాచారుండయిన పుత్రుండుభయపక్షంబులవారి నుద్ధరించుఁ; గావున.
జవాబు:
ప్రతిపదార్థం :
పుత్ + నామ్న . = ‘పుత్’ అనే పేరు కల
నరకాత్ = నరకం నుంచి
త్రాయతే + ఇతి = కాపాడతాడు కాబట్టి
పుత్రః = పుత్రుడు అంటారు
అను = అనే
వేదవచనంబు = వేదవచనం
కలదు = ఉన్నది
కావునన్ = కనుక
పుణ్య + ఆచారుండు + అయిన = చక్కని నడవడిక కలవాడైన
పుత్రుండు = పుత్రుడు
ఉభయపక్షంబుల వారినిన్ = ఇటు తండ్రివైపు వారికీ అటు తల్లివైపు వారికీ
ఉద్దరించున్ = ఉత్తమలోకాలను కలిగిస్తాడు
కావున = కాబట్టి

తాత్పర్యం :
ఓ రాజా ! ‘పుత్’ అనే పేరు గల నరకం నుంచి తల్లిదండ్రులను కాపాడతాడు కాబట్టి పుత్రుడు అనే పేరు ఏర్పడింది అని వేదం చెప్పింది. కాబట్టి ఉత్తమశీలుడైన పుత్రుడు అటు తల్లివైపు వంశాన్నీ ఇటు తండ్రివైపు వంశాన్ని ఉద్దరిస్తాడు కాబట్టి.

ప్రశ్న 12.
క. నీ పుణ్య తనువువలనన
యీ పుత్రకుఁడు ద్భవిల్లి యెంతయు నొప్పున్
దీపంబు వలన నొండొక
దీపము ప్రభవించినట్లు తేజం బెసఁగన్.
జవాబు:
ప్రతిపదార్థం :
దీపంబు వలనన్ = ఒక దీపం నుంచి
ఒండు + ఒక = మరొక
దీపము = దీపం
తేజంబు + ఎసఁగన్ = వెలుగొందగా
ప్రభవించిన + అట్లు = పుట్టినట్లు
నీ = నీ యొక్క
పుణ్య తనువు వలనన్ + అ = పవిత్రమైన శరీరం వలననే
ఈ పుత్తకుఁడు = భరతుడు అనే ఈ కుమారుడు
ఉద్భవిల్లి = పుట్టి
ఎంతయున్ = ఎంతగానో
ఒప్పున్ = ప్రకాశిస్తున్నాడు

తాత్పర్యం :
ఓ రాజా ! ఒక దీపం నుంచి మరొక దీపం పుట్టి వెలుగొందునట్లు నీ పుణ్య శరీరం నుంచి ఈ పుత్రుడు పుట్టి ప్రకాశిస్తున్నాడు అని తాత్పర్యం.

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

ప్రశ్న 13.
మ. విపరీత ప్రతిభాష లేమిటికి నుర్వీనాథ ! యీ పుత్ర గా
త్ర పరిష్వంగ సుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాం
ద్ర పరాగప్రసరంబుఁ జందనముఁ జంద్రజ్యోత్స్నయుం బుత్ర గా
త్ర పరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే.
జవాబు:
కవి పరిచయం : ఈ పద్యం ఆదికవి నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం – చతుర్థాశ్వాసం నుంచి గ్రహించిన ‘సత్య ప్రాశస్త్యము’ అనే పాఠ్యభాగంలోనిది.

సందర్భం : ఈ మాటలు తనను భార్యగా గుర్తించని దుష్యంత మహారాజుతో శకుంతల పలికిన ” సందర్భంలోనివి.

ప్రతిపదార్థం :
ఉర్వీనాథ ! = భూమికి నాధుడవైన ఓ రాజా !
విపరీత ప్రతిభాషలు = విరుద్ధమైన సమాధానాలు
ఏమిటికి = ఎందుకు ?
ఈ = ఈ
పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు పుత్ర = కుమారుని యొక్క
గాత్ర = శరీరాన్ని
పరిష్వంగ సుఖంబు = కౌగిలించుకోవటం ద్వారా కలిగే సుఖాన్ని
చేకొనుము = ఆస్వాదించు
ముక్తాహార కర్పూర సాంద్రపరాగ ప్రసరంబు – ముక్తాహార = ముత్యాల హారాలుగా
కర్పూర = పచ్చకర్పూరం యొక్క
సాంద్ర = దట్టమైన
పరాగ = పొడియొక్క
ప్రసరంబున్ = వ్యాపనమూ
చందనమున్ = మంచి గంధమూ
చంద్ర జ్యోత్స్నయున్ = వెన్నెలా
జీవులకున్ = ప్రాణులకు
పుత్రగాత్ర పరిష్వంగమునట్లు పుత్ర = పుత్రుని యొక్క
గాత్ర = శరీరాన్ని
పరిష్వంగము + అట్లు = కౌగిలించుకొన్నట్లు
హృద్యంబు + ఏ = మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయా ?
కడున్ = మిక్కిలి
శీతమే = చల్లదనంతో ఉంటాయా ? (ఉండవని భావం)

తాత్పర్యం :
ఓ రాజా ! విరుద్ధమైన మాటలు ఎందుకు ? ఈ కుమారుణ్ణి కౌగిలించుకొని ఈతని కౌగిలివల్ల కలిగే సుఖాన్ని ఆస్వాదించు. ముత్యాలహారాలూ, పచ్చకర్పూరపు దట్టమైన పొడి సువాసనలూ, మంచిగంధమూ, వెన్నెలా మొదలైనవేవీ జీవులకు పుత్రుని కౌగిలిని మించిన సుఖాన్నీ, మంచి చల్లదనాన్ని కలిగించలేవు అని తాత్పర్యం.

విశేషాంశాలు : నవమాసాలు మోసి కని పెంచి పోషించే తల్లులకు బిడ్డలే సర్వస్వం. తన కుమారుడైన భరతుడిని కేవలం స్పర్శించటం వల్లనే కలిగే సాటి లేని అనుభూతిని ఆస్వాదించమని
శకుంతల దుష్యంతుణ్ణి కోరింది.

ప్రశ్న 14.
క. అనఘుఁడు వంశకరుండై
పెనుపున నీసుతుఁడు వాజపేయంబులు నూ
తొనరించు నని సరస్వతి
వినిచె మునులు వినఁగ నాకు వినువీథి దెసన్.
జవాబు:
ప్రతిపదార్థం :
నీ సుతుఁడు = నీ కుమారుడు
అనఘుఁడు = పాపరహితుడూ
వశంకరుండు+ఐ = వంశకర్త అయి
పెనుపునన్ = గొప్పదనంతో
వాజపేయంబులు = వాజపేయం అనే పేరు గల యాగాలను
నూరు + ఒనరించున్ + అని = నూరింటిని చేస్తాడని
వినువీధిదెసన్ = ఆకాశమార్గంలో
సరస్వతి = వాణి
మునులు = ఋషులందరూ
వినఁగన్ = వింటూండగా
నాకున్ = నాకు
వినిచెన్ = చెప్పింది.

తాత్పర్యం :
ఓ రాజా ! ‘పుణ్యాత్ముడైన నీ కుమారుడు వంశకర్తయై దీక్షతో నూరు వాజపేయ యాగాలను చేస్తాడు’ అని ఆకాశవీధిలో ఆకాశవాణి (సరస్వతి) మునులందరూ . వింటూండగా నాతో చెప్పింది అని తాత్పర్యం.

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

ప్రశ్న 15.
క. భూరిగుణు నిట్టి కుల వి
స్తారకు దారకు నుదార ధర్మప్రియ ని
ష్కారణమ తప్పఁ జూడఁగ
సారమతీ ! చనునె నాఁటి సత్యము గలుగన్.
జవాబు:
ప్రతిపదార్థం :
ఉదార ధర్మప్రియ ! = ఉత్తమమైన ధర్మమునందు ప్రీతికలవాడా !
సారమతీ = సారవంతమైన బుద్ధి కలిగిన ఓ రాజా !
నాఁటి సత్యము = మన వివాహం నాటి వరమనే సత్యం
కలుగన్ = వాస్తవమై ఉండగా
భూరి గుణున్ = మంచి గుణాలు కలవాడిని
ఇట్టి = ఆకాశవాణి కీర్తించిన ఇటువంటి
కుల విస్తారకున్ = వంశాన్ని విస్తరించే వాడిని
దారకున్ = పుత్రుడిని
నిష్కారణము + అ = కారణం లేకుండానే
తప్పన్ + చూడఁగన్ = కాదనటం
చనువు + ఎ = తగునా ? (తగదని భావం)

తాత్పర్యం :
ఉత్తమమైన ధర్మమునందు ప్రీతి కలవాడా ! సారవంతమైన బుద్ధి కలవాడా ! మన వివాహం జరిగిననాడు నీవు నాకు ఇచ్చిన వరం అనే సత్యం నిలిచి ఉండగా, మంచి గుణాలు కలవాడూ, వంశాన్ని ఉద్దరించేవాడూ అయిన ఈ పుత్రుడిని ఏ కారణం లేకుండానే కాదనటం తగునా ? (తగదని భావం).

ప్రశ్న 16.
చ. నుతజలపూరితంబులగు నూతులు నూడిటికంటె సూనృత
ఈ వ్రత ! యొక బావి మేలు; మణి బావులు నూడిటికంటె నొక్క స
క్రతువది మేలు; తత్మతు శతంబునకంటె సుతుండు మేలు; త
త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్.
జవాబు:
కవిపరిచయం : ఈ పద్యం ఆదికవి నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం – చతుర్థాశ్వాసం నుంచి గ్రహించిన ‘సత్య ప్రాశస్త్యము’ అనే పాఠ్యభాగంలోనిది.

సందర్భం : ఈ మాటలు తనను భార్యగా గుర్తించని దుష్యంత మహారాజుతో శకుంతల పలికిన సందర్భంలోనిది.

ప్రతిపదార్థం :
సూనృతవ్రత ! = సత్యం మాట్లాడటమే నియమంగా కలిగిన ఓ రాజా !
నుతజల పూరితంబులగు – నుతజల = మంచినీటి చేత తెలుగు.
పూరితంబులు + అగు = నిండినవైన
సూదులు = చేదుడు బావులు
నూటిటికంటెన్ = వంద కంటే
ఒక బావి = ఒక దిగుడు బావి
మేలు = ఉత్తమమైనది
మటి = అంతేకాక
బావులు = దిగుడుబావులు
నూటిటి కంటెన్ = వంద కంటే
ఒక్క = ఒక
సత్ + క్రతువు + అది = మంచి యజ్ఞం
మేలు = ఉత్తమమైనది
తత్ + క్రతుశతంబున కంటెన్ = అటువంటి నూరు యజ్ఞాల కంటే
సుతుండు = ఒక్క కొడుకు
మేలు = మేలు తత్, సుతశతకంబుకంటెన్ = అటువంటి కొడుకులు వందమంది కంటే
చూడఁగన్ = పరిశీలించగా
ఒక = ఒక్క
సూనృత వాక్యము = సత్యవాక్యం
మేలు = ఉత్తమమైనది

తాత్పర్యం :
సత్య వాక్పాలనమే వ్రతంగా కలిగిన ఓ రాజా ! మంచి నీటితో నిండిన చేదుడు బావులు నూరింటికంటే ఒక దిగుడుబావి మేలు. అంతేకాక నూరు దిగుడుబావులకంటే ఒక మంచి యజ్ఞం మేలు. అటువంటి నూరు యజ్ఞాల కంటే ఒక పుత్రుడు మేలు. అటువంటి పుత్రులు నూరుమందికంటే ఒక సత్యవాక్యం మేలైనది అని తాత్పర్యం.

విశేషాంశాలు :
గొప్ప గుణాలు కలిగిన దుష్యంత మహారాజు తాను గాంధర్వ వివాహం చేసుకున్న శకుంతల ఎవరో తనకు తెలియదని అసత్యం పలికాడు. అటువంటి దుష్యంతుణ్ణి సూసృతవ్రత ! అని సంబోధించటం అతడి అసహజ ప్రవర్తనను ఎత్తి చూపటమే. వేదార్థాలను విపులీకరిస్తూ వేద ప్రామాణ్యాన్ని నిరూపిస్తూ సాగిన పంచమవేదంగా కీర్తించబడిన మహాభారతంలో సత్యవైశిష్ట్యాన్ని ఔన్నత్యాన్ని వర్ణించిన ఈ పద్యం ఎంతో ప్రసిద్ధిచెందిన గొప్ప సూక్తి.

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

ప్రశ్న 17.
క. వెలయంగ నశ్వమేధం
బులు వేయును నొక్క సత్యమును నిరుగదలంలు
దుల నిడి తూఁపఁగ సత్యము
వలనన ములు సూపు గౌరవంబున పేర్మిన్.
జవాబు:
కవి పరిచయం : ఈ పద్యం ఆదికవి నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం – చతుర్థాశ్వాసం నుంచి గ్రహించిన ‘సత్య ప్రాశస్త్యము’ అనే పాఠ్యభాగంలోనిది.

సందర్భం : ఈ మాటలు తనను భార్యగా గుర్తించని దుష్యంత మహారాజుతో శకుంతల పలికిన సందర్భంలోనిది.

ప్రతిపదార్థం :
తులన్ – ఒక త్రాసులో
వెలయంగన్ = అమరేటట్లు
వేయునున్ = వేయి
అశ్వమేధంబులు = అశ్వమేధయాగాలు ఒకవైపుగా
ఒక్క సత్యమును = ఒక్క సత్యాన్ని మాత్రమే ఒకవైపుగా
ఇరుగజలన్ = రెండు తక్కెడలలోనూ
ఇడి = ఉంచి
తూఁపగన్ = తూచగా
గౌరవంబున. = బరువు యొక్క
పేర్మిన్ = ఆధిక్యంతో
సత్యము వలనన = సత్యంవైపు మాత్రమే
ములు + చూపున్ = మొగ్గు చూపుతుంది (సత్యమే గొప్పదని భావం)

తాత్పర్యం :
ఓ రాజా ! ఒక త్రాసులోని రెండు తక్కెడలలోనూ వేయి అశ్వమేధ యాగాల ఫలాన్ని ఒకవైపునా, ఒక్క సత్యాన్ని మాత్రమే మరొకవైపునా ఉండేటట్లు అమర్చి తూచగా సత్యం గొప్పదనం వల్ల ముల్లు సత్యం ఉన్న తక్కెడ వైపే మొగ్గు చూపుతుంది. అనగా సత్యమే గొప్పదని నిరూపణ జరుగుతుందని తాత్పర్యం.

విశేషాంశాలు :
వేదం అంటే సత్యం అని కూడా అర్థం. భారతీయ సంస్కృతిలో పరమ పవిత్రమైన వేదాలు నాలుగు. వేద సారభూతమైన మహాభారతం పంచమ వేదంగా ప్రసిద్ది చెందింది.
యాగాల కంటే కూడా సత్యమే గొప్పదని ఈ పద్యంలో చెప్పబడింది.

ప్రశ్న 18.
తే. సర్వతీర్థాభిగమనంబు సర్వవేద
సమధిగమము సత్యంబుతో సరియుఁ గావు
ఎఱుఁగు మెల్లధర్మంబుల కెందుఁ బెద్ద
యండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు.
జవాబు:
ప్రతిపదార్థం :
సర్వతీర్థ + అభిగమనంబు = సకల తీర్థాలనూ దర్శించటం, సర్వ వేద, వేదాలను అన్నింటినీ
సమధిగమము = అధ్యయనం చేయటం
సత్యంబుతోన్ = సత్యంతో
సరియున్ + కావు = సాటి కావు
ధర్మజ్ఞులు + ఐన = ధర్మం బాగా తెలిసిన
మునులు = ఋషులు
ఎందున్ = ఎప్పుడైనా
సత్యంబు = సత్యమే
ఎల్ల ధర్మంబులకున్ = ధర్మాలన్నింటికంటే
పెద్ద + అండ్రు = గొప్పది అంటారు అని
ఎఱుఁగుము = తెలుసుకో.

తాత్పర్యం :
ఓ రాజా ! సకల తీర్థాలనూ సేవించటంగానీ, వేదాలను అన్నింటినీ ఆధ్యయనం : చేయటంగానీ సత్యానికి సాటిరావు, ధర్మం బాగా తెలిసిన ఋషులు ఎల్లప్పుడూ అన్ని ధర్మాలకంటే సత్యమే గొప్పదని అంటారని గమనించు అని తాత్పర్యం.

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

ప్రశ్న 19.
క. కావున సత్యము. మిక్కిలి
గా విమల ప్రతిభందలఁచి కణ్వాశ్రమ సం
భావిత సమయస్థితి దయం
గావింపుము; గొడుకుఁజూడు కరుణా దృష్టిన్.
జవాబు:
ప్రతిపదార్థం :
కావునన్ = కాబట్టి
విమల ప్రతిభన్ = నిర్మలమైన బుద్ధితో
సత్యమున్ = సత్యాన్ని
మిక్కిలిగాన్ = గొప్పదానినిగా
తలఁచి = భావించి
కణ్వాశ్రమ సంభావిత సమయస్థితి – కణ్వ + ఆశ్రమ = కణ్వమహర్షి ఆశ్రమంలో
సంభావిత = చేసిన
సమయస్థితి = ప్రతిజ్ఞను
దయన్ = దయతో
కావింపుము = నెరవేర్చు
కొడుకును = నీ కొడుకైన ఈ భరతుణ్ణి
కరుణాదృష్టిన్ = దయాభావంతో
చూడుము = చూడు

తాత్పర్యం :
ఓ రాజా ! కాబట్టి నిర్మలమైన బుద్ధితో సత్యం గొప్పదిగా భావించి, కణ్వమహర్షి ఆశ్రమంలో నీవు చేసిన ప్రతిజ్ఞను దయతో నెరవేర్చు. నీ కొడుకును దయతో చూడు అని తాత్పర్యం.

ప్రశ్న 20.
క. క్షత్రవరుఁడైన విశ్వా ,
మిత్రునకుఁ బవిత్రయైన మేనకకున్ స
త్పుత్తినయి బొంకువలుకఁగ
ధాత్రీతల నాథ ! యంత ధర్మేతరనే ?
జవాబు:
ప్రతిపదార్థం :
ధాత్రీతలనాథ ! = భూమిని పాలించే ఓ రాజా !
క్షత్రవరుఁడు + ఐన = క్షత్రియులలో ఉత్తముడైన
విశ్వామిత్రునకున్ = విశ్వామిత్రుడికే
పవిత్ర + ఐన = పవిత్రురాలు అయిన
మేనకకున్ = మేనకకూ
సత్ + పుతిన్ + అయి = యోగ్యురాలైన కుమార్తెనైన నేను
బొంకు + పలుకఁగన్ = అబద్దమాడటానికి
అంత = అంత
ధర్మ+ఇతరను+ఏ = అధర్మపరురాలనా ? (కాదని భావం)

తాత్పర్యం :
భూమిని పాలించే ఓ రాజా ! క్షత్రియులలో ఉత్తముడైన విశ్వామిత్రుడికీ, పవిత్రురాలైన మేనకకూ యోగ్యురాలైన కుమార్తెనైన నేను అబద్ధమాడటానికి అంత అధర్మపరురాలను కాను అని తాత్పర్యం.

ప్రశ్న 21.
వ.. అనిన శకుంతల పలుకులు సేకొన నొల్లక దుష్యంతుం డిట్లనియె.
జవాబు:
ప్రతిపదార్థం :
అనిన = ఇట్లా పలికిన
శకుంతల పలుకులు = శకుంతల మాటలను
చేకొనన్ + ఒల్లక = అంగీకరించక
దుష్యంతుండు = ఆ దుష్యంత మహారాజు
ఇట్లు + అనియె = ఇట్లా అన్నాడు

తాత్పర్యం :
ఇట్లా పలికిన శకుంతల మాటలను ఒప్పుకోవటానికి ఇష్టపడని ఆ దుష్యంత మహారాజు శకుంతలతో ఇట్లా అన్నాడు అని తాత్పర్యం.

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

ప్రశ్న 22.
క. ఏ నెట ? నీ వెట ? సుతుఁడెట ?
యే నెన్నఁడు దొల్లి చూచియెఱుఁగను నిన్నున్;
మానినుల సత్య వచనలు
నా నిట్టు లసత్యభాషణం బుచితంటే ?
జవాబు:
ప్రతిపదార్థం :
ఏన్ + ఎట = నేను ఎక్కడ ?
నీవు + ఎట = నీవు ఎక్కడ ?
సుతుఁడు + ఎట = కుమారుడు ఎక్కడ ?
ఏన్ = నేను
నిన్నున్ = నిన్ను
తొల్లి = పూర్వం
ఎన్నఁడున్ = ఎప్పుడూ
చూచి + ఎఱుఁగను = చూచినట్లు గుర్తులేదు
మానినులు = ఆడువారు
అసత్యవచనలు = అబద్దాలు ఆడుతారు
నాన్ = అన్నట్లుగా
ఇట్టులు = ఈ విధంగా
అసత్య భాషణంబు = అబద్దాలు ఆడటం
ఉచితంబు + ఏ = నీకు తగునా ? (తగదని భావం)

తాత్పర్యం :
నేనెక్కడ ? నీవెక్కడ ? కుమారుడెక్కడ ? నిన్ను ఇంతకు పూర్వం ఏనాడూ చూచి ఎరుగను. ‘ఆడువారు అబద్ధాలాడతారు’ అన్నట్లుగా ఈ విధంగా అసత్యం పలకటం నీకు తగదని తాత్పర్యం.

ప్రశ్న 23.
క. పొడువునఁ బ్రాయంబునఁ గడుఁ,
గడింది బలంబునను జూడఁగా నసదృశు నీ
కొడుకని యీతని నెంతయు
నెడమడుగుగఁ జూపఁ దెత్తె యిందఱు నగఁగన్.
జవాబు:
ప్రతిపదార్థం :
ఈతనిన్ = ఈ భరతుణ్ణి
చూడంగాన్ = పరిశరించగా
పొడువనన్ = ఆకారంలోనూ
ప్రాయంబునన్ : వయస్సులోనూ
కడున్ = మిక్కిలి
కడిఁది బలంబునను = శక్యంకాని బలంలోనూ
అసదృశున్ = సాటిలేనివాడిని
నీ కొడుకు + అని = నీ కుమారుడు అని
ఎంతయున్ = ఎంతో
ఎడమడుగుగన్ = విరుద్ధంగా
ఇందఱున్ = ఇంతమంది
నగఁగన్ = నవ్వేటట్లు
చూపన్ = నాకు చూపించటానికి
తెత్తు + ఎ = తెస్తావా ?

తాత్పర్యం :
చూడగానే రూపంలోనూ వయస్సులోనూ శక్యంకాని బలంలోనూ సాటిలేనివాడుగా కనబడుతున్న ఈ బాలుణ్ణి నీ కుమారుడు అని ఎంతో విరుద్ధంగా అందరూ నవ్వేటట్లు నాకు చూపటానికి తీసుకొని వచ్చావా ?

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

ప్రశ్న 24.
వ. ‘ఇట్టి లోకవిరుద్ధంబుల కే మూడుదు, మయుక్తంబు లయిన పలుకులు పలుకక నీ
యాశ్రమంబునకుం బొమ్మనిన శమంతల యత్యంత సంతా వికాంఈ కరణమై.
జవాబు:
ప్రతిపదార్థం :
ఇట్టి = ఇటువంటి
ఇటువంటి లోక విరుద్దంబులకున్ . : వాస్తవానికి వ్యతిరేకంగా ఉండేవాటికి
ఏము = మేము
ఓడుదుము = భయపడతాం / అంగీకరించం
అయుక్తంబులు + అయిన = తగనివి అయిన
పలుకులు = మాటలు
పలుకక = మాట్లాడక
నీ ఆశ్రమంబునకున్ = నీ ఆశ్రమానికి
పొమ్ము + అనినన్ = తిరిగి వెళ్ళిపో అని చెప్పగా
శకుంతల = శకుంతల
అతి + అంత = మిక్కిలి
సంతాపిత + అంతఃకణ + ఐ = తపింపబడిన హృదయం కలిగినదై

తాత్పర్యం :
ఇటువంటి లోక విరుద్ధమైన అంశాలను మేం అంగీకరించం. తగని మాటలు మాట్లాడకుండా నువ్వు నీ ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపో, అని దుష్యంతుడు చెప్పగా శకుంతల మనస్సులో -మిక్కిలి సంతాపాన్ని పొందినదని తాత్పర్యం.

ప్రశ్న 25.
మధ్యా. ‘తడయక పుట్టిననాఁడ తల్లిచేఁ దండ్రిచే విడువఁ –
బడి; నిప్పుడు పతిచేతను విడువఁబడియెదనొక్కా
నుడువులు వేయు నింకేల ? యిప్పాటి నోములు దొల్లి
కడంగి నోఁచితిని గాకేమి’ యనుచును గందె డెందమున’
జవాబు:
కవిపరిచయం : ఈ పద్యం ఆదికవి నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం – చతుర్థాశ్వాసం నుంచి గ్రహించిన ‘సత్య ప్రాశస్త్యము’ అనే పాఠ్యభాగంలోనిది.

సందర్భం : ఈ మాటలు తనను భార్యగా గుర్తించకుండా తెలియదు పొమ్మన్న దుష్యంత మహా రాజుతో శకుంతల పలికిన సందర్భంలోనివి.

ప్రతిపదార్థం :

పుట్టిననాఁడు + అ = పుట్టిననాడే
తడయక = వెంటనే
తల్లిచేన్ = తల్లి అయిన మేనకచేత
తండ్రిచేన్ = తండ్రి అయిన విశ్వామిత్రునిచేత
విడువఁబడితిన్ = వదలివేయబడ్డాను.
ఇప్పుడు = ఇప్పుడు
పతి చేతను = భర్తచేత కూడా
విడువబడియెదన్ + ఒక్కొ = వదలివేయబడతానో ఏమో
నుడువులు వేయున్ = వేయి మాటలు
ఇంకన్ + ఏల = ఇంకెందుకు
ఈ + పాటి = ఇటు వంటి ఫలితాన్ని ఇచే
నోములు = నోములు
తొల్లి = పూర్వం
కడఁగి = పూనుకొని
నోచితిని = నోచాను
కాక + ఏమి = కాబోలు
అనుచును = అంటూ
డెందమునన్ = హృదయంలో
కందెన్ = ఎంతో దుఃఖించింది.

తాత్పర్యం :
పుట్టిననాడే వెంటనే తల్లిదండ్రులచేత విడిచివేయబడ్డాను. ఇప్పుడు భర్తచేతకూడా విడువబడతాను కాబోలు. ఇక వేయిమాటలెందుకు ? పూర్వం నేను ఇటువంటి ఫలితాలను ఇచ్చే అరకొర నోములే నోచాను కాబోలు అని శకుంతల మనసులో ” – బాధపడింది.

విశేషాంశాలు :
తన భర్త అయిన దుష్యంతుడే తనను భార్యగా గుర్తించకపోవటంతో శకుంతల ఎంతో దుఃఖించింది. అంతటి క్లిష్ట పరిస్థితులలో కూడా ఆమె అధైర్యపడలేదు. తన కుమారుని కోసం, సత్యం కోసం ఆమె పోరాడింది.

ఛందస్సు :
మధ్యాక్కర అనే ఈ ఛందస్సు దేశీయమైనది. అరుదైన ఈ ఛందస్సులో శకుంతల శోక స్థితిని కళ్ళకు కట్టించాడు నన్నయ. నాలుగు పాదాలు ఉండే, ఈ ఛందస్సులో ప్రాసనియమం ఉన్నది. ప్రతిపాదంలో రెండు ఇంద్రగణాలు + ఒక సూర్యగణం + రెండు ఇంద్రగణాలు + 1 సూర్యగణం కలిసి ఆరుగణాలు ఉంటాయి. నన్నయ ఈ పద్యంలో ప్రతిపాదంలోనూ మొదటి గణంలోని మొదటి అక్షరానికి అయిదవ గణంలోని మొదటి అక్షరానికీ యతి ‘పాటించాడు.

దేశ్యపదప్రయోగం :
దేశీయ ఛందమైన మధ్యాక్కర ఎన్నుకున్న నన్నయ. ఈ పద్యంలో ‘పతి’ అనే ఒక్క పదం తప్ప తక్కిన పదాలన్నీ దేశ్యపదాలు కావటం విశేషం.

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

ప్రశ్న 26.
వ. ఇట్లు దద్దయు దుఃఖించి విగతాశయై బోరనఁ దొరఁగు బాష్పజలంబు
లందంద మొత్తికొనుచు ‘నింక దైవంబకాని యొందు శరణంబులేదని
యప్పరమ పతివ్రత తనయుం దోడ్కొని క్రమ్మతి పోవనున్న యవసరంబున్న
జవాబు:
ప్రతిపదార్థం :
ఇట్లు = ఈ విధంగా
తద్దయున్ = మిక్కిలి
దుఃఖించి = ఏడ్చి
విగత+ఆశ+ఐ = ఆశలు వదులుకొని
బోరనన్ = ఎడతెరిపి లేకుండా
తొరఁగు = కారుతున్న
బాష్పజలంబులు = కన్నీళ్ళను
అందు + అందు + అ = అప్పుడప్పుడూ
ఒత్తికొనుచున్ = చెంగుతో అద్దుకుంటూ
ఇంకన్ = ఇకపై
దైవంబు+అ, కాని = దైవం తప్ప
ఒండు శరణంబు = మరొక దిక్కు
లేదు + అని = లేదని
ఆ + పరమపతివ్రత = ఆ గొప్ప ఇల్లాలు
తనయున్ + తోడ్కొని – కొడుకును వెంటబెట్టుకొని
క్రమ్మటి = వెనుదిరిగి
పోవన్ + ఉన్న = పోబోతున్న
అవసరంబునన్ = సమయంలో

తాత్పర్యం :
ఈ విధంగా మిక్కిలి బాధపడి, ఆశలు వదలుకొని, ఎడతెరిపి లేకుండా కారే కన్నీళ్ళను అప్పుడప్పుడూ ఒత్తుకుంటూ ఇకపై నాకు దైవమే శరణ్యమని భావించి, ఆ పతివ్రతా శిరోమణి కొడుకును వెంటబెట్టుకొని తిరిగి వెళ్ళిపోబోతున్న సమయంలో అని తాత్పర్యం.

ప్రశ్న 27.
చ. ‘గొనకొని వీఁడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు సే
కొని భరియింపు మీతని శకుంతల సత్యము వర్కె సాధ్వి న
ద్విసుత మహాపతివ్రత వివేకముతోనని దివ్యవాణి దా
వినిచె ధరాధినాథునకు విస్మయమందంగం దత్సభాసదుల్.
జవాబు:
కవిపరిచయం : ఈ పద్యం ఆదికవి నన్నయ రచించిన ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం – చతుర్థాశ్వాసం నుంచి గ్రహించిన ‘సత్య ప్రాశస్త్యము’ అనే పాఠ్యభాగంలోనిది.

సందర్భం : ఈ మాటలు నీవెవరో తెలియదు పొమ్మన్న దుష్యంతుని మాటలకు దుఃఖంతో శకుంతల తిరిగి వెళ్ళిపోబోగా ఆకాశవాణి పలికిన సందర్భంలోనిది.

ప్రతిపదార్థం :
గొనకొని = అతిశయించి
వీఁడు = ఈ భరతుడు
నీకును = నీకూ
శకుంతలకున్ = శకుంతలకూ పుట్టిన
ప్రియనందనుండు = ముద్దుబిడ్డడు
ఈతనిన్ = ఈ పుత్రుణ్ణి
చేకొని = స్వీకరించి
భరియింపుము = పోషించు
సాధ్వి = ఇల్లాలు
సత్ + వినుత = ఉత్తములచేత కీర్తింపబడిన
మహాపతివ్రత = గొప్ప పతివ్రత అయిన
శకుంతల = శకుంతల
వివేకముతోన్ = వివేకంతో
సత్యము + పల్కెన్ = నిజం చెప్పింది
అని = అని
తత్, సభాసదుల్ = ఆ సభలో ఉన్నవారు
విస్మయము + అందఁగన్ = ఆశ్చర్యపడగా
దివ్యవాణి = ఆకాశవాణి
ధరా + అధినాదునకున్ = ఆ దుష్యంత మహారాజుకు
వినిచెన్ = వినిపించింది.

తాత్పర్యం :
ఓ రాజా ! ఈ భరతుడు నీకూ శకుంతలకూ ముద్దు బిడ్డ. ఈతణ్ణి స్వీకరించి పోషించు. ఇల్లాలు, ఉత్తమ కీర్తి కలిగినది, మహాపతివ్రత అయిన శకుంతల వివేకంతో నిజమే చెప్పింది’ అంటూ ఆకాశవాణి ఆ సభలోని వారంతా విని ఆశ్చర్యపడేటట్లు దుష్యంత మహారాజుకు చెప్పింది.

విశేషాంశాలు :
మానవుని ప్రవర్తనను నిత్యం గమనిస్తూ ఉండే మహా పదార్థాలుగా శకుంతల చెప్పినవాటిలో ఆకాశం కూడా ఒకటి. గృహిణి గొప్పదనాన్ని వివరించిన శకుంతల గొప్ప సాధ్విగా, వివేకవంతురాలుగా, మహా పతివ్రతగా సత్యవ్రతగా, ఆకాశవాణి మాటలద్వారా నిరూపింపబడింది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

ప్రశ్న 28.
వ. ఇథైల్లవారలకు నతిహర్షంబుగా శకుంతల పతివ్రతాత్వంబును
సత్యంబును భరతోత్పత్తియుఁ బ్రశంసించు వేలుపుల పలుకులతి వ్యక్తంబులయి
యాకాశంబు వలన వీతెంచిన విని దుష్యంతుండు సభాసదులు
విన నిట్లనియె.
జవాబు:
ప్రతిపదార్థం :
ఇట్లు = ఈ విధంగా
ఎల్లవారలకున్ = అందరికీ
అతీ, హర్షంబుగాన్ = మిక్కిలి సంతోషంతో
శకుంతల = శకుంతల యొక్క
పతివ్రతాత్వంబును = పాతివ్రత్యాన్ని గురించి
సత్యంబును = సత్యాన్ని గురించి
భరత + ఉత్పత్తియున్ = భరతుని యొక్క పుట్టుకను గురించి
ప్రశంసించు = ప్రశంసించే
వేలుపుల = దేవతల
మాటలు = మాటలు
అతి వ్యక్తంబులు + అయి = మిక్కిలి స్పష్టంగా
ఆకాశంబువలనన్ = ఆకాశం నుంచి
వీతెంచినన్ = వెలువడగా
విని = విని
దుష్యంతుండు = దుష్యంత మహారాజు
సభాసదులు = సభలోని వారంతా
వినన్ = వినగా
ఇట్లు + అనియెన్ = ఇట్లా అన్నాడు.

తాత్పర్యం :
ఈ విధంగా శకుంతల పాతివ్రత్యాన్ని గురించి, సత్యాన్ని గురించి, భరతుడి పుట్టుకను గురించి మిక్కిలి సంతోషంతో కీర్తించే దేవతల మాటలు విస్పష్టంగా ఆకాశం నుంచి వెలువడగా విన్న దుష్యంతుడు సభాసదులందరితో ఇట్లా అన్నాడు అని తాత్పర్యం.

ప్రశ్న 29.
తే. ఏను నీ యింతియును గాని యెఱుఁగ రన్యు
లర్థిఁ గణ్వమహాముని యాశ్రమంబు
నందు గాంధర్వవిధి వివాహమునఁ గరము
నెమ్మిఁ జేసితి దీనిఁ బాణిగ్రహణము.
జవాబు:
ప్రతిపదార్థం :
అర్డిన్ = కోర్కెతో
కణ్వమహాముని = కణ్వుడు అనే మహాముని యొక్క
ఆశ్రమంబునందున్ = ఆశ్రమంలో
గాంధర్వవిధిన్ = గాంధర్వ పద్ధతిలో చేసుకున్న
వివాహమునన్ = పెళ్ళి
కరమున్ = మిక్కిలి
నెమ్మిన్ = ప్రీతితో
చేసిన = చేసిన
దీని = ఈ శకుంతలతోడి
పాణిగ్రహణము = వివాహం
ఏనున్ = నేనూ
ఈ + ఇంతియున్ = ఈ శకుంతలా
కాని = తప్ప
అన్యులు = ఇతరులు
ఎఱుఁగరు = తెలియరు (తెలియదని భావం)

తాత్పర్యం :
ఆనాడు కోరి కోరి కణ్వమహర్షి ఆశ్రమంలో గాంధర్వ వివాహ పద్ధతిలో శకుంతలను ఎంతో ప్రేమతో చేసుకున్న పెళ్ళి నాకూ ఈ శకుంతలకూ తప్ప ఇంతరులకు ఎవ్వరికీ తెలియదు అని తాత్పర్యం.

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

ప్రశ్న 30.
తే. అన్యు లెఱుఁగమిఁ జేసి లోకాపవాద
భీతి నెఱిఁగియు నిత్తన్విఁ బ్రీతి దప్పి,
యెఱుఁగ నంటిని నిందఱ కిప్పు డెఱఁగఁ
జెప్పె నాకాశవాణి యచ్చెరువుగాఁగ.
జవాబు:
ప్రతిపదార్థం :
అన్యులు = ఇతరులు
ఎఱుఁగమిన్ + చేసి = ఎరుగకపోవటం చేత
లోక + అపవాదభీతిన్ = లోకనింద కలుగుతుందనే భయంతో
ఈ + తన్విన్ = ఈ వనితను
ఎఱింగియున్ = తెలిసివుండికూడా
ప్రీతి, తప్పి = కఠిన మనస్కుడనై
ఎఱుఁగను + అంటిని = తెలియదు అన్నాను
ఇందఱకున్ = ఇంతమందికి
ఇప్పుడు = ఇప్పుడు
ఆకాశవాణి = దివ్యవాణి
అచ్చెరువు + కాఁగన్ = ఆశ్చర్యం కలిగేటట్లు
ఎఱుఁగన్ + చెప్పెన్ = తెలియజెప్పింది.

తాత్పర్యం :
ఇతరులకు ఎవ్వరికీ తెలియదు కాబట్టి లోకనింద కలుగుతుందేమో అన్న భయంతో నాకు ఈమె తెలిసినప్పటికీ కఠినుడనై ‘నాకు తెలియదు’ అన్నాను. కానీ ఇప్పుడు ఆకాశవాణి అందరికీ తెలిసేటట్లు ప్రకటించింది అని తాత్పర్యం.

ప్రశ్న 31.
వ. అని మహానురాగంబునం గొడుకు నెత్తికొని, హర్షపులక లెసఁగ నాలింగనంబు
సేసి, శకుంతలా మహాదేవి నతిప్రణయగౌరవంబున
సంభావించి, యౌవరాజ్యంబునకు భరతు సభిషికుంజేసి, పెద్దకాలంబు
రాజ్య సుఖంబు లనుభవించి, తన రాజ్యభారంబంతయు భరతుం
బూన్చి దుష్యంతుండు తపోవనంబున కరిగె..
జవాబు:
ప్రతిపదార్థం :
అని = అని పలికి
దుష్యంతుడు = దుష్యంత మహారాజు
మహత్ + అనురాగంబునన్ = మిక్కిలి ప్రేమతో
కొడుకున్ = కుమారుడైన భరతుణ్ణి
ఎత్తికొని = ఎత్తుకొని
హర్షపులకలు + ఎసఁగన్ = ఆనందంతో తనువు పులకరించగా
ఆలింగనంబు + చేసి = కౌగిలించుకొని
శకుంతలా మహాదేవిన్ = పట్టమహిషి అయిన శకుంతలను
అతి ప్రణయ గౌరవంబునన్ = ప్రేమాతిశయంతో
సంభావించి = సమ్మానించి
భరతున్ = భరతుణ్ణి
యౌవరాజ్యంబునకున్ = యౌవరాజ్య పదవిలో
అభిషిక్తున్ + చేసి = పట్టాభిషిక్తుని చేసి
పెద్దకాలంబు = చాలాకాలం
రాజ్య సుఖంబులు = రాజ్యంవల్ల కలిగే భోగాలు
అనుభవించి = పొంది
తన = తన యొక్క
రాజ్య భారంబు + అంతయున్ = రాజ్యభారాన్నంతటినీ
భరతున్ + పూన్చి = భరతునికి అప్పగించి
తపోవనంబునకున్ + అరిగె = తపస్సుకు అనువైన అరణ్యానికి వెళ్ళాడు.

తాత్పర్యం :
అని పలికిన దుష్యంతుడు అమిత ప్రేమతో కొడుకును ఎత్తుకున్నాడు. ఆనందంతో . తనువంతా నిండిన పులకరింతలతో అతణ్ణి కౌగిలించుకున్నాడు. పట్టమహిషి అయిన శకుంతలను ప్రేమాతిశయంతో సమ్మానించాడు. భరతుణ్ణి యౌవరాజ్య పదవిలో అభిషేకించాడు. చాలాకాలం రాజ్యభోగాలు అనుభవించాడు. చివరికి తన రాజ్య భారాన్నంతా భరతుడికి అప్పగించి తాను తపోవనానికి బయలుదేరి వెళ్ళాడు అని తాత్పర్యం.

కవి పరిచయం

ఆదికవి : సంస్కృత భాషలో వేదవ్యాసుడు రచించిన మహాభారతాన్ని నన్నయ (11వ శతాబ్దం), తిక్కన (13వ శతాబ్దం), ఎఱ్ఱన (14వ శతాబ్దం ) అనే ముగ్గురు కవులు ఆంద్రీకరించారు. నన్నయ, తిక్కన, ఎఱ్ఱనలను కవిత్రయం అంటారు. నన్నయ కవిత్రయంలోనే కాక తెలుగు సాహిత్యంలో కూడా మొదటి కవిగా ప్రసిద్ధుడు.

కాలం : క్రీ.శ. 11వ శతాబ్దంలో జీవించిన నన్నయ రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన చాళుక్యవంశ ప్రభువైన రాజ రాజ నరేంద్రుని ఆస్థానకవి.

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

భారతరచన : నన్నయ ఆంధ్ర మహాభారతంలోని ఆది సభాపర్వాలను పూర్తిగానూ అరణ్యపర్వంలో చతుర్థాశ్వాసంలోని 142 పద్యాల వరకూ రచించాడు. మిగిలిన భారతాన్ని తిక్కన ఎఱ్ఱనలు పూర్తిచేశారు.

భారతంలోని పర్వాలు – 18 : ఆదిపంచకం (5) : 1) ఆది 2) సభా 3) అరణ్య 4) విరాట 5) ఉద్యోగ,

యుద్ధషట్కం (6) : (6) భీష్మ (7) ద్రోణ (8) కర్ణ (9) శల్య (10) సౌప్తిక (11) స్త్రీ,

శాంతిసప్తకం (7) : (12) శాంతి (13) అనుశాసనిక (14) అశ్వమేధ (15) ఆశ్రమవాస (16) మౌసల (17) మహాప్రస్థానిక (18) స్వర్గారోహణ,

ఇతర రచనలు : ఆంధ్ర మహాభారతంలోని రెండున్నర పర్వాలేకాక ఆంధ్ర శబ్ద చింతామణి (తెలుగు వ్యాకరణ గ్రంథం), చాముండికా విలాసము, ఇంద్రవిజయము, లక్షణసారము, రాఘవాభ్యుదయము అనేవి నన్నయ ఇతర రచనలు.

బిరుదులు : (1) ఆదికవి (2) శబ్దశాసనుడు (వాగనుశాసనుడు).

నన్నయ రచనాశైలి : నన్నయ భారతరచనలో నైతిక దృష్టి, కావ్యకళాదృష్టి కనిపిస్తాయి. వర్ణనా విధానం, రసపోషణ, పాత్రచిత్రణ మొదలైన అంశాలలో ‘ నన్నయ బాణీ ప్రత్యేకంగా కనిపిస్తుంది. తెలుగువారి మనస్తత్వం, ఆచారాలు, సంప్రదాయాలు ఉట్టిపడేవిధంగా నన్నయ ప్రతి పాత్రను తీర్చిదిద్దాడు. కావ్య నిర్మాణంలో ఆది కవి నన్నయ ప్రదర్శించిన ‘అధికధీయుక్తి’ వెయ్యేళ్ళు దాటినా తెలుగు సాహిత్యంపై ప్రభాత కిరణంలా ఇంకా ప్రసరిస్తూనే ఉన్నది.

పాఠ్యభాగం : ప్రస్తుత పాఠ్యభాగం నన్నయ రచించిన ఆంధ్రమహా భారతం లోని ఆదిపర్వంలోని చతుర్ధాశ్వాసం నుంచి గ్రహించినది.

పాఠ్యభాగ సందర్భం

వైశంపాయనుడు అనే మహర్షి పరీక్షిత్తు కుమారుడైన జనమేజయ మహారాజుకు మహాభారత కథను వివరించాడు. యయాతి మహారాజు కుమారుడైన పూరుని వంశ క్రమాన్ని విశదీకరించాడు.

పూరు వంశానికి చెందిన మహారాజు ఇలిలుడు. ఇలిలుని భార్య పేరు రథంతరి. వీరి కుమారుడు దుష్యంతుడు. దుష్యంతుడు గొప్ప పరాక్రమం కలవాడు. అతడు చిన్న వయసులోనే పులులు, సింహాలు వంటి అనేక క్రూర మృగాలను వేటాడేవాడు.

ఒకరోజు దుష్యంతుడు ఒక పెద్ద అడవికి వేటకు బయలుదేరాడు. మాలిని అనే పవిత్రమైన నది ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ నదికి ఆవలివైపు ప్రశాంతమైన ఒక తపోవనం ఉన్నది. అక్కడ మనోహరమైన ఆశ్రమాన్ని చూశాడు. . అది కణ్వమహర్షి ఆశ్రమం అని తెలుసుకున్నాడు.

కణ్వమహర్చి కశ్యప ప్రజాపతి వంశానికి చెందినవాడు. అతడు భూతభవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగల తపశ్శక్తి కలవాడు. కణ్వమహర్షికి నమస్కరించి వస్తానని తన భటులకు చెప్పి దుష్యంతుడు ఒక్కడే ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ దుష్యంతుడు శకుంతలను చూశాడు. ఆమె పుట్టుపూర్వోత్తరాలను అడిగి తెలుసుకున్నాడు.

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

శకుంతలా దుష్యంతులు ఒకరినొకరు ఇష్టపడ్డారు. దుష్యంతుడు శకుంతలను వివాహం చేసుకోవాలనుకున్నాడు. కణ్వుడు ఆశ్రమంలో లేనప్పటికీ శకుంతల ఆమోదంతో దుష్యంతుడు ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తలైన శకుంతలా దుష్యంతులు ఇష్టసుఖాలు అనుభవించారు. ఆశ్రమం విడిచివెడుతూ దుష్యంతుడు “రాచమర్యాదలతో నిన్ను తీసుకురావటానికి మంత్రులను పంపుతాను” అని చెప్పి శకుంతలను సమాధానపరిచాడు.

జరిగినదంతా తన తపశ్శక్తితో గ్రహించిన కణ్వమహర్షి శకుంతలను దీవించాడు. దుష్యంతునివల్ల గర్భం ధరించిన శకుంతల నవమాసాలు నిండాక భరతునికి జన్న నిచ్చింది. పెళ్ళైన స్త్రీలు పుట్టినింట్లో ఎక్కువకాలం ఉండటం భావ్యం కాదనీ, భార్యలు భర్తల దగ్గరే ఉండటం ధర్మమని నిశ్చయించిన కణ్వుడు తన శిష్యులను తోడిచ్చి శకుంతలను దుష్యంత మహారాజు వద్దకు పంపించాడు.

ఎన్నో ఆశలతో, ఎంతో ఆనందంతో శకుంతల దుష్యంతుని దగ్గరకు వెళ్ళింది. తనను గుర్తుపట్టని దుష్యంతునికి జరిగినదంతా వివరించింది. ఎన్ని చెప్పినా “నీవెవరివో తెలియదనీ, ఎక్కడినుంచి వచ్చావో అక్కడికే వెళ్ళమనీ” దుష్యంతుడు అన్నాడు. దుష్యంతుని మాటలకు శకుంతల ఎంతో దుఃఖించింది. ఆశ్యర్యంతో, దుఃఖంతో, కోపంతో ఆమె ఎంతో వేదనను అనుభవించింది. ఉబికివస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, మనోవేదనను అణచుకుంటూనే శకుంతల తన భర్త అయిన దుష్యంత మహారాజుతో చెదరని ఆత్మ విశ్వాసంతో మాట్లాడే మాటలతో ఈ పాఠ్యభాగం ప్రారంభమౌతుంది.

పాఠ్యభాగ సారాంశం

శకుంతల దుష్యంతునితో ఇలా అంటున్నది – “ఓ రాజా ! అన్నీ తెలిసిన నీవు ఏమీ తెలియనివానిలాగా ఎందుకు మాట్లాడతావు ? నేను తప్ప ఇతరులు ఎవరూ సాక్షులు లేరని ధర్మాత్ములైనవారు అబద్ధమాడవచ్చా ? (ఆడకూడదని భావం.)

నిర్మలమైన కీర్తికి నిధివంటివాడవైన ఓ రాజా ! వేదాలు, పంచభూతాలు (నింగి, నేల, నీరు, నిప్పు, గాలి), ధర్మం ఉభయసంధ్యలు, హృదయం, యముడు, సూర్య చంద్రులు, రాత్రిపగలు – అనే మహాపదార్థాలు మానవుల ప్రవర్తనలను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాయి సుమా ! ఆ మహా పదార్థాలు ఉండగా మనిషి సత్యాన్ని దాచ గలడా ? (దాచలేడని భావం).

ఓ రాజా ! నువ్వు నాకు ఇచ్చిన వరాన్ని గురించి వేదాలు మొదలైన మహా పదార్థాలకు కూడా తెలుసు.. కనుక మునుపటి అనురాగాన్ని విడిచి ఇట్లా నన్ను అవమానించటం నీకు తగునా – ? (తగదని భావం). పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను తిరస్కారభావంతో చూచే దుష్టుడికి ఇహపరసుఖాలు ఉంటాయా ? (ఉండవని భావం).

అనుకూలవతి అయిన భార్య గలవాడు కర్మలు ఆచరించగలుగుతాడు, ఇంద్రియా లను వశం చేసుకోగలుగుతాడు, పుత్రసంతానాన్ని పొందగలుగుతాడు, గృహస్థు పొందే
ఫలాన్నంతటినీ పొందగలుగుతాడు.

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాలను సాధించటానికి తగిన సాధనమూ, గృహనీతి అనే విద్యకు నెలవైనదీ, నిర్మలమైన శీలాన్ని నేర్పించే గురుస్థానమూ, వంశం నిలవటానికి ఆధారమైనదీ, ఉత్తమగతులు పొందటానికి ఊతమైనదీ, మన్ననకు ముఖ్య హేతువైనదీ, ఆదర్శమై కలకాలం నిలిచే మణులవంటి గుణాలకు నెలవైనదీ, హృదయానందాన్ని కలిగించేదీ భార్య మాత్రమే సుమా ! భర్తకు భార్య కంటే ప్రియమైనది మరొకటి లేదు. భార్యాబిడ్డలపై అనురాగం చూపేవారికి ఎక్కడైనా, ఏ పరిస్థితులలోనైనా, ఆపదలలోనైనా కలిగే దుఃఖాలన్నీ తొలగిపోతాయి.

అంతేకాక భార్య భర్తలో సగభాగం. కనకనే ముందుగా మరణించిన భార్య పరలోకంలో కూడా తన భర్త రాకకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఒకవేళ భర్త ముందుగా మరణిస్తే తానుకూడా వెనువెంట వెళ్ళి భర్తతో కలిసి ఉండాలనుకుంటుంది భార్య. అటువంటి భార్యను అవమానించటం ధర్మవిరోధం. అంతేకాక భర్తె భార్య . గర్భంలోకి ప్రవేశించి వసించి పుత్రుడై జన్మిస్తాడు. “అంగాత్ అంగాత్ సంభవసి” (= శరీరం నుండి పుడుతున్నావు) అనే వేదవాక్యం వల్ల కూడా తండ్రీ కొడుకులకు భేదం లేదు.

ఓ రాజా ! గార్హపత్యం అనే అగ్ని జ్వలించి ఆహవనీయం అనే అగ్నిలో వెలుగొంది నట్లుగానే తండ్రి తానే పుత్రుడై తన ప్రకాశంతోనే వెలుగొందుతాడని తెలుసుకో. లోకులచేత కీర్తింపబడే ఓ రాజా ! పురుషుడు నీళ్ళలో తన నీడను తాను స్పష్టంగా చూచినట్లుగా తండ్రి కొడుకును చూసి ఎంతో సంతృప్తితో గొప్ప ఆనందాన్ని పొందుతాడు. అంతేకాక ‘పుత్’ అనే పేరుగల నరకం నుంచి కాపాడతాడు కాబట్టి పుత్రుడు అనే పేరు ఏర్పడినట్లు వేదం చెప్పింది. కనుక ఉత్తమ గుణాలు కలిగిన పుత్రుడు తల్లిదండ్రుల వంశాలవారిని ఉద్దరిస్తాడు. ఒక దీపం నుంచి మరొక దీపం పుట్టి ప్రకాశించునట్లు నీ పుణ్య శరీరం నుంచి పుట్టి ఈ పుత్రుడు ప్రకాశిస్తున్నాడు.

ఓ రాజా ! ఇన్ని మాటలు ఎందుకు ? ఈ పుత్రుని కౌగిలించుకో. ఆ కౌగిలివల్ల కలిగే సుఖాన్ని ఆస్వాదించు. ముత్యాలహారాలూ, దట్టమైన పచ్చ కర్పూరపు పొడి, మంచి గంధం, వెన్నెల మొదలైనవేవీ పుత్రుని కౌగిలిని మించి సుఖాన్నిగానీ చల్లదనాన్ని గానీ అందించలేవు. ‘పుణ్యాత్ముడైన నీ కుమారుడు వంశకర్తగా కీర్తిపొంది దీక్షతో నూరు వాజపేయయాగారలను చేస్తాడని’ ఆకాశవాణి మునులందరూ వింటూండగా నాతో చెప్పింది.

ఉత్తమమైన ధర్మమందు ప్రీతి కలవాడా ! సారవంతమైన బుద్ధి కలవాడా ! మన వివాహం జరిగినరోజున నీవు నాకు ఇచ్చిన వరం అనే సత్యం ఉండగా అమిత – గుణవంతుడు, వంశవిస్తారకుడు అయిన పుత్రుడిని ఏ కారణం లేకుండానే కాదనటం తగునా ? (తగదని భావం). సత్యవ్రతుడవైన ఓ రాజా ! నూరు మంచినీటి బావులకంటే ఒక దిగుడుబావి మేలు. నూరు దిగుడు బావులకంటే ఒక యజ్ఞం మేలు. అటువంటి నూరు యజ్ఞాలకంటే ఒక పుత్రుడు మేలు. అటువంటి పుత్రులు నూరుమందికంటే ఒక సత్యవాక్యం మేలైనది.

ఓ రాజా ! ఒక త్రాసులో వేయి అశ్వమేధ యాగాల ఫలాన్ని ఒకవైపునా, సత్యాన్ని . మాత్రమే మరోవైపునా ఉంచి తూచగా ముల్లు సత్యంవైపే మొగ్గు చూపుతుంది. తీరాలన్నింటినీ సేవించటం కానీ, వేదాలన్నింటినీ అధ్యయనం చేయటం కానీ సత్య వ్రతానికి సాటిరావు. ధర్మజ్ఞులైన మహర్షులు అన్ని ధర్మాలకంటే సత్యమే గొప్పదని ఎప్పుడూ అంటూ ఉంటారని గమనించాలి. కాబట్టి నిర్మలమైన మనసుతో సత్యం గొప్పదనాన్ని గ్రహించి, కణ్వమహర్షి ఆశ్రమంలో నీవు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చు. నీ కొడుకుపై దయఉంచు. క్షత్రియులలో ఉత్తముడైన విశ్వామిత్రునికే, దివ్యస్త్రీ అయిన మేనకకు జన్మించిన నేను అబద్ధములాడే అధర్మపరురాలను కాను.

శకుంతల మాటలను దుష్యంతుడు అంగీకరించలేదు. ఇట్లా బదులిచ్చాడు. ‘నేనెక్కడ ? నీవెక్కడ ? కుమారుడెక్కడ ? నేను నిన్ను ఇంతకు ముందెప్పుడూ కనీసం చూడనైనా లేదు. ‘ఆడవారి మాటలు అబద్దాల మూటలు’ అన్నట్లు ఇట్లా అసత్యాలు చెప్పటం నీకు తగునా ? (తగదని భావం). రూపంలోనూ, వయసులోనూ, బలంలోనూ సాటిలేనివాడుగా కనబడుతున్న. ఈ బాలుణ్ణి ‘నీ కొడుకు’ అని ఎంతో విరుద్ధంగా అందరూ నవ్వేటట్లు నాకు చూపటానికి తీసుకువచ్చావా ? ఇటువంటి వాస్తవ దూరమైన అంశాలను మేం అంగీకరించం. తగని మాటలు కట్టి పెట్టి నీవు నీ ఆశ్రమానికి తిరిగి వెళ్ళు అని దుష్యంతుడు పలకగా శకుంతల ఎంతో బాధతో ఇట్లా పలికింది.

AP Inter 2nd Year Telugu Study Material Poem 1 సత్య ప్రాశస్త్యము

పుట్టిననాడే తల్లిదండ్రులచేత విడువబడ్డాను. ఇప్పుడు భర్తచేత కూడా విడువ బడతాను కాబోలు. ఇక వేయిమాటలెందుకు ? పూర్వం నేను నోచిన నోముల ‘ఫలితం ఇదే కాబోలు అనుకుంటూ శకుంతల దుఃఖించింది. ఇట్లా ఎంతో దుఃఖించి, ఆశలు వదలుకొని, కన్నీరు తుడుచుకుంటూ ఇక నాకు దైవమే శరణ్యమని భావించిన ఆ పతివ్రతా శిరోమణి కొడుకును వెంటబెట్టుకొని తిరిగి వెళ్ళిపోబోతున్న సమయంలో వినబడ్డ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు.

” ఓ రాజా ! ఈ భరతుడు నీకూ శకుంతలకూ ముద్దుబిడ్డడు. ఈతణ్ణి స్వీకరించి పోషించు. సాధ్వి, మహాపతివ్రత అయిన శకుంతల వివేకంతో సత్యం పలికింది, అని ఆకాశవాణి రాజుకు చెప్పింది. ఈ విధంగా శకుంతల పాతివ్రత్యాన్ని గురించి, సత్యాన్ని గురించి, భరతుడి పుట్టుకను గురించి కీర్తించే దేవతల మాటలు, ఆకాశం నుంచి వెలువడగా విన్న దుష్యంతుడు సభాసదులతో ఇట్లా అన్నాడు.

నాడు కణ్వమహర్షి ఆశ్రమంలో ఎంతో అనురాగంతో గాంధర్వ పద్ధతిలో చేసుకున్న వివాహం శకుంతలకూ నాకూ తప్ప ఎవ్వరికీ తెలియదు. కనుక లోకనిందకు జంకి నాకు ఈమె ఎవరో తెలియదు అన్నాను. కానీ ఇప్పుడు అందరికీ తెలిసేటట్టు అద్భుతంగా ఆకాశవాణి ప్రకటించింది, అని పలికి దుష్యంతుడు ఎంతో ప్రేమతో తన పుత్రుణ్ణి ఎత్తుకున్నాడు. సంతోషం వల్ల కలిగిన పులకలతో ‘కౌగిలించుకున్నాడు. పట్టమహిషి అయిన శకుంతలను ప్రణయ గౌరవంతో సమ్మానించారు. భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. చాలాకాలం రాజ్యసుఖాలు అనుభవించాడు. తన రాజ్య భారాన్ని అంతా భరతుడికి అప్పగించి తపోవనానికి బయలుదేరాడు.

Leave a Comment