AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 1 గవేషణ

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed 1st Lesson గవేషణ Textbook Questions and Answers, Summary.

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed 1st Lesson గవేషణ

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
గవేషణ నాటిక సారాంశాన్ని తెల్పండి.
జవాబు:
భూలోకంలో 35 సంవత్సరాలకే ఒక మానవుడు చనిపోతాడు. మృత్యుదూతలు అతన్ని యమలోకం తీసుకొని వెళుతుంటారు. మానవుడు తానింకా బ్రతికే ఉన్నానని ఎంత వాదించినా వినకుండా మృత్యుదూతలు న్యాయమూర్తికి అప్పగిస్తారు. న్యాయమూర్తి.

అతని జీవితపు కాగితాన్ని పరిశీలించి ఎక్కడో పొరపాటు జరిగిందని – గ్రహిస్తాడు. తిరిగి భూలోకం వెళ్ళిపో ఇంకా 5 సంవత్సరాల ఆయషు ఉందని చెప్తాడు ధర్మమూర్తి. తిరిగి భూలోకం చేరుకున్న మానవునికి తన శరీరం కనబడలేదు. అప్పటికే బంధువులు కళేబరాన్ని దహనం చేశారు. ఈ శరీరం లేని ఆత్మతో ఎలా జీవించాలో అర్థంకాక తిరిగి ధర్మమూర్తి దగ్గరకు వెళదామని నిర్ణయించుకుంటాడు. తిరిగి మరో ప్రపంచపు సొరంగాల దగ్గరకు వెళతాడు.

అక్కడ ఒక నవ్వు వినబడుతుంది. ఎవరు ఎందుకు నవ్వుతున్నావని మానవుడు ఆ నవ్విన వ్యక్తిని ప్రశ్నిస్తాడు. ఎందుకొచ్చావని తిరిగి మానవుణ్ణి నవ్విన వ్యక్తి ప్రశ్నించగా తనకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తాడు. నవ్విన వ్యక్తి సానుభూతితో మానవునికి సహాయం చేయాలనుకుంటాడు. న్యాయమూర్తి దర్శనం కలిగిస్తాడు.

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 1 గవేషణ

ధర్మదేవత తిరిగి వచ్చిన మానవునికి పూర్ణ ఆయుర్ధాయం కలిగేలా వరం ఇస్తుంది. జన్మరాహిత్యాన్ని ఇవ్వలేను. కాని తిరిగి ఏదైనా శరీరంలో ప్రవేశించి బ్రతకమంటుంది. కాని మానవుడు తన 35 ఏళ్ళ జీవితంలో ఎలా ఉన్నాడో అలా ఉండే శరీరం ఎక్కడ లభిస్తుంది అని బాధపడతాడు. దేవతల మీద నమ్మకం లేకపోయినా ఫర్వాలేదు కాని మానవత్వం పై నమ్మకాన్ని వదులుకోవద్దని అయినా దేవతల వల్ల జరిగిన పొరపాటుని నేనే ధర్మదేవతను క్షమించమని కోరుతున్నానని మానవుని చేతులు పట్టుకుంటుంది.

ఈ అల్ప మానవులు దేవతలను క్షమించటమా అంతమాట అనవద్దని మానవుడు తిరిగి భూలోకానికి వెళ్ళిపోతానని సెలవు తీసుకుంటాడు. తనకు తనలాగా బ్రతికే అవకాశం లేనప్పుడు ఏ బ్రతుకైతేనేం ? అని కొత్త జీవితాన్ని ప్రారంభించాలను కుంటాడు. తనని ఓ అమ్మ కడుపులో పడేయమని ప్రార్థిస్తాడు. నేను తిరిగి సృష్టించలేనని ధర్మదేవత భూలోకంలో ఇప్పుడే ఒక అమ్మాయి ప్రసవించింది. శిశువు మృతుడయ్యాడు.

ఆ శిశువులో నీ ఆత్మని ప్రవేశపెట్టుకో. నీకు పూర్ణ ఆయుర్దాయం ఇస్తున్నానని చెప్పింది. మానవుడు ఆ వైద్యశాల చేరుకొని శిశువు శరీరంలో ప్రవేశించాడు. అంతవరకు అష్టకష్టాలు పడ్డ వైద్యులు శిశువు క్యారు మనడంతో ఊపిరి పీల్చుకున్నారు. మృత శిశువని ఏడ్చిన తల్లి ఆనందంతో బిడ్డను చూసుకుంది.

ప్రశ్న 2.
‘గవేషణ’ నాటికలో మరణించిన వ్యక్తి ఆవేదనను తెల్పండి.
జవాబు:
భూలోకంలో 35 సంవత్సరాలకే ఒక మానవుడు చనిపోతాడు. మృత్యుదూతలు అతని ఆత్మను వేరు చేసి న్యాయమూర్తికి అప్పగించాలని వెళుతుంటారు. మానవునికి మెలకువ వచ్చి తనని ఎక్కడికి తీసుకొని వెళుతున్నారు ? నేను చచ్చిపోలేదు బ్రతికే వున్నాను. నన్ను వదిలి పెట్టండి మా యింటికి వెళ్ళిపోతాను అని ఎంత అరిచినా భటులు మానవుని మాటలను పట్టించుకోరు.

ఏది పుణ్యం ఏది పాపం అని ఆవేదనతో తనకు అన్యాయం జరుగుతోందని నరకం చూపిస్తున్నారని రోదిస్తాడు. బ్రతికుండగానే కాల్చేస్తున్నారని త్వరగా న్యాయమూర్తి దగ్గరకు తీసుకొని వెళ్ళమని ప్రాధేయపడతాడు. భూలోకంలో లాగానే మరో లోకంలో కూడా అన్యాయపు అధికారులున్నారని వాపోతాడు. — న్యాయమూర్తికి అప్పగించి మృత్యుదూతలు వెళ్ళిపోతారు.

న్యాయమూర్తి ఎక్కడో పొరపాటు జరిగినట్లు గ్రహిస్తాడు. ఒక చిన్న ఉద్యోగి తప్పు లెక్క వల్ల యమదూతలు నిన్ను ఇక్కడకు తెచ్చారు. అనగానే మానవుడు తాను బ్రతికున్నట్లా ? చచ్చినట్లా ? అని తన ఆవేదనను సందేహాన్ని అడుగుతాడు. జరిగిన పొరపాటుకు క్షమించమని నీకు ఇంకా 5 సంవత్సరాల ఆయుష్షు ఉందని భూలోకానికి పంపించాడు న్యాయమూర్తి. బ్రతుకు జీవుడా అనుకొని తిరిగి భూలోకానికి చేరిన మానవునికి శరీరం లేదు.

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 1 గవేషణ

బంధువులు దహనం చేశారు. శరీరం లేని ఈ ఆత్మతో ఎలా బ్రతకాలి అని శోకించాడు మానవుడు. తిరిగి మరో ప్రపంచం చేరి ధర్మదేవతకు తన బాధను వివరించాడు. ధర్మదేవత మానవుని అవస్థకు జాలిపడింది. కాని జన్మరాహిత్యాన్ని గాని, సృష్టించే శక్తి గాని తనకు లేవని ఏదో ఒక శరీరంలో ప్రవేశించి నూతన జీవితాన్ని ప్రారంభించ మని చెప్పింది. దేవతల వల్ల జరిగిన తప్పుకి మానవుణ్ణి క్షమాపణ కోరి పూర్ణ ఆయుర్దాయాన్ని వరంగా ఇస్తుంది. ఇంతలో భూలోకంలో అప్పుడే వైద్యశాలలో మృతశిశువును ఒక అమ్మాయి ప్రసవించింది.

తన జీవితం కానిది ఏది అయితే నేమి ఏదో ఒక బ్రతకు తప్పదని ఆ శిశువు శరీరాన్ని చేరింది ఆ ఆత్మ. అంతవరకు మృత శిశువుని చూసి దుఃఖించిన తల్లి ఆనందించింది. ఎవరో చేసిన పొరపాటుకు ఈ మానవుడు తనదైన జీవితం లేక నూతన జీవితాన్ని ప్రారంభించాడు.

ప్రశ్న 3.
‘గవేషణ’ నాటికలో న్యాయమూర్తికి, మరణించిన వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణ తెల్పండి.
జవాబు:
మరణించిన మానవుని ఆత్మను మరో ప్రపంచపు న్యాయస్థానానికి చేర్చారు మృత్యుదూతలు. అక్కడ రక్షకభటులు ధర్మాసనం మీద కూర్చున్న న్యాయమూర్తి సమక్షంలో హాజరు పరిచారు ఆ మానవుణ్ణి. న్యాయమూర్తి వయస్సులేని, నేత్రాలు లేని ఒక స్త్రీ మూర్తి. ఎదురుగా ఉన్న మానవున్ని ఉద్దేశించి “నాకు కళ్ళు లేవు అయినా చూడగలను.

భూలోకంలో నీకింకా ఐదు సంవత్సరాల ఆయుర్దాయం ఉంది. మా కార్యాలయంలో ఉన్న చిన్న ఉద్యోగి తప్పు లెక్కవల్ల మృత్యుదూతలు నిన్ను ఇక్కడకు తెచ్చారు” అని అనగా “మీరు ధర్మప్రభువులు దేవతల పొరపాటువల్ల మానవులు బాధ పడుతున్నారు నేను బ్రతికున్నట్టా ? చనిపోయినట్టా ? ఈ సందేహం నన్ను బాధిస్తోంది” అని మానవుడు ప్రశ్నించాడు. “మృత్యురాజ్యపు చట్ట ప్రకారం నీవు మృతి చెందావు. కనుకనే మా మృత్యుదూతలు నీ శరీరం నుండి ఆత్మను తొలగించారు. నీ కాగితాలు తెప్పించి పై అధికారులతో నీ విషయమై వాదించాను.

ఇక్కడ వ్యవస్థలో ఏదో పొరపాటు జరిగిందనే అందరూ అనుకుంటున్నారు. నీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయదలిచాను. నువ్వింక భూలోకానికి వెళ్ళిపోవచ్చు. జరిగిన పొరపాటుకు సిగ్గు పడుతున్నాను” అని న్యాయమూర్తి అన్నాడు. భగవంతుడు కూడా నీకు జరిగిన అన్యాయానికి బాధపడుతూ ఉంటాడని అన్నాడు న్యాయమూర్తి. మీరు ధర్మదేవతను చూడలేదా అన్నాడు మానవుడు. భగవంతుడు కూడా ధర్మానికి అతీతుడు అయినా ఈ చర్చ అవసరం అని న్యాయమూర్తి సభ చాలించాడు.

పల్లెటూల్లో మానవుని ఆత్మను దిగవిడిచారు మృత్యుదూతలు: తన శరీరం కనిపించక ఆ మానవుని ఆత్మ అల్లాడిపోయింది. తిరిగి మరో ప్రపంచంలో తన శరీరం గురించి ‘అడగడానికి నిశ్చయించుకుంది ఆత్మ. మరో ప్రపంచపు గోడల దగ్గర తచ్చాడుతున్న ఆత్మను అక్కడ ఒక భటుడు చూస్తాడు. ఆ ఆత్మ వివరాలడిగి సాయం చేయదలచి న్యాయమూర్తి దగ్గరకు తీసుకొని వెళతాడు. తిరిగి ఎందుకొచ్చావని న్యాయమూర్తి మానవుని ఆత్మను ప్రశ్నించాడు.

ధర్మదేవత నా జీవితం ప్రసాదించినా నా శరీరాన్ని నా బంధువులు దహనం చేశారు. ఏ చెట్టు కొమ్మనో పట్టుకొని వేలాడలేను. నిన్న రాత్రంతా చాలా యాతన పడ్డాను. గబ్బిలం శరీరంలో ప్రవేశించాను. కాని గబ్బిలం బ్రతుకు దుర్భరం అనిపించింది. ఒక కప్పలో ప్రవేశించాను కాని బావిలో కప్ప జీవితం ఉక్కిరిబిక్కిరి అనిపించింది. మీరిచ్చిన ఐదేళ్ళు మీరే తీసుకోండి అని మానవుడు న్యాయదేవతకు విన్నవించుకున్నాడు. కొత్త జీవితం ప్రారంభిస్తావా ? అని అడిగాడు న్యాయమూర్తి తిరిగి భూలోకానికి ప్రయాణమయ్యాడు.

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 1 గవేషణ

మృత్యుదూతలు తిరిగి మానవుణ్ణి పల్లెటూరికి తీసుకొని వెళ్ళారు. కాని అప్పటికే బంధువులు అతని శరీరాన్ని దహనం చేశారు. ఇంకా ఐదు సంవత్సరాలు ఆత్మకి శరీరం లేకుండా ఎలా జీవించాలో అర్థం కాలేదు. మళ్ళీ ధర్మదేవత దర్శనం అయితే బాగుండుననిపించింది. కాని ఈ లోకంలో ఉన్నతాధికారుల దర్శనం కావాలంటే ఎన్నెన్నో తిప్పలు పడాలి. ఇంక ఆ లోకంలో అధికారుల దర్శనం అంటే మాటలా .? ఇదేమిటీ ఉపద్రవం ? అని బాధపడ్డాడు మానవుడు. అయినా ఎక్కడో ఎవరో చేసిన పొరపాటుకి, తానెందుకు బాధపడాలి ?

మరల తన శరీరాన్ని తిరిగి ఇప్పించమని న్యాయమూర్తికి ఫిర్యాదు చెయ్యడానికి : నిశ్చయించుకున్నాడు. జీవన్మరణాల మధ్య అల్లాడుతున్న ఆత్మగా మిగిలిపోయానే అని దుఃఖిస్తూ మరో ప్రపంచం దగ్గరకు చేరుకుంది ఆత్మ. ఆ మానవుని దీనావస్థతో న్యాయమూర్తీ అన్న పిలుపుకి ఒక వ్యక్తి నవ్వు వినబడింది. ఆ నవ్విన వ్యక్తి ఎవరవయ్యా నీవు అనగా ఇంకా 5 ఏళ్ళు ఆయుర్దాయం ఉన్న ఆత్మను అని సమాధానం ఇచ్చాడు మానవుడు. సరే నీకేం సాయం కావాలి అన్నాడు నవ్విన వ్యక్తి. న్యాయమూర్తి చేసేది లేక మానవునికి పూర్ణ ఆయుషుని ఇచ్చాడు.

ఐదేళ్ళ కాలపరిమితిని తొలగిస్తూ ‘నీ ఇష్టం వచ్చిన శరీరంలో ప్రవేశించి బ్రతక మంటాడు న్యాయమూర్తి. నన్ను జన్మదుఃఖపు చెర విడిపించండి అని వేడుకుంటాడు మానవుడు. తనకు జన్మరాహిత్యం గాని సృష్టించడంగాని, తెలియవని అశక్తుడనని అంటాడు దేవతలే తమ అశక్తతను మానవుని దగ్గర తెలియజేస్తుంటే ఏమనాలో అర్థం కాలేదు మానవునికి.

జరిగిందేదో జరిగింది ఏదో ఒక బ్రతుకు, ఎలాగో ఒక లాగా బ్రతుకుతాను భూలోకానికి వెళ్ళిపోతాను. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడే వస్తాను నేను మీ చేతిలో ఆటవస్తువును. మీరు మరొకరిచేతిలో ఆటవస్తువులు. ఇది అంతం లేనిది అంటాడు మానవుడు. ఇదే సృష్టి రహస్యం అని తెలియజేస్తాడు న్యాయమూర్తి.

దేవతల్లోను మానవుల పైనా నాకు నమ్మకం పోతోందని మానవుడంటే దేవతలపై నమ్మకం లేకపోయినా మానవులపై, మానవత్వంపై విశ్వాసం సడలసీయకు అని న్యాయమూర్తి అంటూ జరిగిన మా పొరపాటుకు క్షమించమని మానవుణ్ణి కోరుకుంటాడు. ఇక భూలోకంలో ఒక స్త్రీ అప్పుడే ప్రసవించిన శిశువును చూపిస్తాడు. ఆ మృతశిశువు శరీరంలో ప్రవేశిస్తాడు మానవుడు. అంతవరకు ఆరాటపడ్డ డాక్టర్లు, చనిపోయిన శిశువుని చూసి బోరుమన్న తల్లి తిరిగి శిశువు క్యారుమనడంతో ఆనందిస్తారు.

రచయిత పరిచయం

1. గవేషణ పాఠ్యభాగ రచయిత శ్రీశ్రీ.
2. శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు.
3. శ్రీశ్రీ విశాఖపట్టణంలో 30.4. 1910న జన్మించారు.
4. అప్పలకొండ, పూడిపెద్ది వెంకట రమణయ్య శ్రీశ్రీ తల్లిదండ్రులు.
5. శ్రీశ్రీ తండ్రి శ్రీరంగం వారింటికి దత్తత వెళ్ళాడు. అందువల్ల శ్రీశ్రీ ఇంటి పేరు శ్రీరంగం అయ్యింది.
6.. విశాఖపట్టణంలో ప్రాథమిక విద్యతో ప్రారంభించి ఎ.వి.ఎన్. కాలేజీలో కళాశాల విద్యను అభ్యసించారు.

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 1 గవేషణ

7. మద్రాసులో క్రిస్టియన్ కాలేజీలో బి.ఎ. పట్టాను పొందారు.
8. విశాఖలో ఎ.వి.ఎన్. కాలేజీలో డిమాను స్టేటర్ గా పని చేశారు.
9. తరువాత శ్రీశ్రీ ఆంధ్రప్రభలోనూ, ఆకాశవాణిలోనూ కొన్నాళ్ళు ఉద్యోగం చేశారు.
10. శ్రీశ్రీ ఎనిమిదేళ్ళ వయస్సులోనే కందపద్యం రాసే ప్రయత్నం చేశారు.
11. చెన్నపట్నంలో సాహితీమిత్రుల పరిచయాలతో చిన్ననాటి సృజనాత్మకత శక్తితో రచనా శక్తి పెంపొందింది.
12. శ్రీశ్రీ తొలికావ్యం ప్రభవ. ‘మహాప్రస్థానంతో అభ్యుదయ కవి అయ్యారు.
13. తన కలాన్ని గళాన్ని సోషలిస్టు వ్యవస్థకు సాధనంగా ఉపయోగించారు.
14. మహాప్రస్థానం,మరో ప్రస్థానం, ఖడ్గసృష్టి, మరో ప్రపంచం, చరమరాత్రి వంటి అనేక రచనలు చేశారు.
15. 1948లో చలనచిత్ర రంగంలో ప్రవేశించి తెలుగు సినిమా పాటకు తనదైన ముద్రవేశారు.
16. తెలుగు కవిత్వాన్ని భూమార్గం పట్టించిన కవి శ్రీశ్రీ.
17. పతితులకు, భ్రష్టులకు, బాధాసర్ప ద్రష్టులకు కన్నీళ్ళు తుడిచిన మహాకవి శ్రీశ్రీ.
18. 15.6.1983న మహాప్రస్థానం చేంది మరో ప్రపంచం చేరిన మహానీయుడు శ్రీశ్రీ. తెలుగు

పాత్రల పరిచయం

1. మానవుడు :
35వ ఏట ఒక మానవుని ప్రాణం పోయింది. మృత్యుదూతలు వచ్చి ఆ మానవుని ఆత్మని తీసుకొని వెళుతున్నారు. ఆ మానవునికి ఇంకా 5 సంవత్సరాలు ఆయువు మిగిలే ఉంది. మృత్యుదూతలతో వాగ్వివాదం చేస్తుంటాడు ఆ మానవుడు. మానవుడు తాను చనిపోలేదు అని ఎంత చెప్పినా వినకుండా మృత్యుదూతలు న్యాయమూర్తి ముందు నిలబెట్టాలని మాకు ఆజ్ఞ వచ్చింది మాట్లాడవద్దని హెచ్చరించారు. బ్రతికుండగానే కాల్చేస్తున్నారని వాపోతాడు.

న్యాయమూర్తి ఎవరో చూపించండి అని ప్రశ్నిస్తాడు. మృత్యుదూతలు న్యాయమూర్తికి ఆ మానవుని ఆత్మను అప్పగిస్తారు. తాను చచ్చిపోలేదని ఎంత చెప్పినా వినకుండా నన్ను ఇక్కడకు తీసుకొని వచ్చారు. ఎక్కడో జరిగిన చిన్న పొరపాటుకి ముందుగానే నన్ను చంపేస్తారా ? అని ఆ ఆత్మ ఘోషించింది. జరిగిన పొరపాటు తెలుసుకొని భూలోకంలో విడిచిపెట్టారు దేవదూతలు. ఆ మానవుని ఆత్మకు శరీరం లేదు. అతి ప్రయత్నం మీద ధర్మదేవతను దర్శించాడు మానవుడు. ఎక్కడో ఎవరో చేసిన పొరపాటుకు తానెందుకు బాధపడాలి ? ఎలాగైనా తన శరీరాన్ని ఇప్పించమని ‘ న్యాయమూర్తిని ఆశ్రయించింది ఆత్మ. ఆ లోకంలో న్యాయం కోసం తిరుగుతున్న మానవునికి నవ్వుతూ ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ నవ్విన వ్యక్తిని న్యాయమూర్తి దగ్గరకు తీసుకెళ్ళమంటాడు మానవుడు.

ధర్మదేవతను కలుసుకుంటాడు. తనను తానుగా జీవించే మార్గం చూపమని ప్రార్థిస్తాడు. తాను బ్రతకటానికి ఒక శరీరాన్ని చూషించమని వేడుకుంటాడు. ధర్మదేవత కరుణించి అప్పుడే ప్రసవించిన బిడ్డ శరీరంలో బ్రతకమని పూర్ణ ఆయుర్దాయం ఇస్తుంది. అదే మహాప్రసాదం అని మానవుడు చనిపోయిన శిశువు శరీరంలో తన ఆత్మను ప్రవేశపెడతాడు. శిశువు కెవ్వుమని ఏడవడంతో మానవునికి తిరిగి బ్రతికే అవకాశం వచ్చింది.

2. నవ్విన వ్యక్తి (ఆనందం) :
యమలోకపు అదృశ్యభటుడు భగవంతుని స్థానంలో మానవునికి సహాయపడాలనుకున్న వ్యక్తి. పేరు ఆనందం. తనలో రెండవ కోణం కూడా ఉన్నదని మానవునికి తెలియజేస్తాడు. ఉదాహరణకి న్యాయమూర్తి దర్శనం చేయిస్తే నాకేమిస్తావు అని (లంచం) అడిగిన వ్యక్తి. అన్నీ మీరే కల్పించుకొని బాధపడే వాళ్ళు మీ పులని నిష్కల్మషంగా సహాయపడదామనుకున్నాను. హవిస్సులతో సంతోషపెట్టు- నీవు కోరిన వరమీయగలనని అంటాడు.

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 1 గవేషణ

నీకేదో అన్యాయం జరిగిందని విన్నాను. దావా – గెలిచావట. అందుకే నీకు సహాయం చేయాలని అనుకుంటున్నాను. నీవు మానవుడవు దేవతల శక్తిపై అమిత విశ్వాసం కలవాడవు. అందుకే ధర్మదేవతను చూపిస్తానని న్యాయమూర్తి దగ్గరకు తీసుకెళతాడు ఆనందం.

3. అమ్మాయి :
భూలోకంలో ఒక అమ్మాయి నెలలు నిండగానే ప్రసవించిన స్త్రీ. శిశువు పుట్టగానే మృతి చెందాడు. ప్రసూతి వైద్యశాలలో డాక్టరు ఎదుట ఉంటాడు. అప్పుడే మెలకువ వచ్చిన. ఆ అమ్మాయి తన బిడ్డను చూపించమంటుంది. మగపిల్లాడా ? ఆడపిల్లా అని ఆరాటపడుతుంది. అబ్బాయి కదలిక లేకపోవడంతో కంగారు పడి చచ్చిపోయాడా అంటూ ఏడుస్తూ ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళు శిశువుని బ్రతికించే ప్రయత్నంలో ఉంటారు. ఆ అమ్మాయికి ధైర్యం చెప్తూ ఉంటారు.
ఇంతలో శిశువు రోధన వినిపిస్తుంది. అమ్మాయి మనసు కుదుటపడుతుంది.

4. 1వ మృత్యుదూత :

చనిపోయిన మానవుని న్యాయశాలకు చేర్చడమే తమ పని అని మాట్లాడవద్దని మానవుని. విసుక్కుంటాడు. మానవుడు ఎంత చెప్పినా పట్టించుకోడు. నువ్వు బ్రతికే ఉన్నామా ఉత్తరువులను ఉల్లంఘించలేము. మా లోకంలో పొరపాట్లు జరగవు అని స్వర్గ, నరకాలు విడిగా లేవు నీ పుణ్యమే స్వర్గం, పాపమే నరకం అని వివరించాడు. నిన్ను విచారణ చేసే అధికారం మాకు లేదని నిర్ధారించుకుంటాడు.

కాని అతని అంతఃకరణకి ఈ మానవుడు చనిపోలేదని హెచ్చరిస్తున్నట్లుగా ఉంటుంది. ఇతడు బ్రతికే ఉన్నాడు న్యాయమూర్తి ఎదుట నిలబెట్టడానికి వీలులేదని అనుకుంటాడు. ఏదో సంకట స్థితిలో పడి చివరకు ‘మానవుడు మరణించాడనే నిర్ణయించుకున్నాడు. మానవుని చావు బ్రతుకులకు మేము కారణం కాదని చెప్పి న్యాయశాలలో విడిచిపెడతాడు మొదటి దూత.

5. 2వ మృత్యుదూత :
నీకు శరీరం లేదు. కళేబరం వల్లకాటిలో ఉంది కాబట్టి నీవు చచ్చిపోయావు. ఏమి మాట్లాడవద్దు అంటూనే చనిపోయిన వ్యక్తి ఎలా మాట్లాడతాడు అని సంశయిస్తాడు. ఏదో పొరపాటు జరిగిందని గ్రహిస్తాడు. చచ్చిపోయిన మానవుడు మాట్లాడటమేమిటని భయపడతాడు. ఏదో తప్పు జరిగిందని తెలిసినా ఎవరి మీద నేరం ఆరోపించగలం అని అనుకుంటాడు. మానవుడు మాట్లాడి ఎంత హడలు గొట్టించాడో అని అంటాడు.

న్యాయశాల రక్షక భటులకు అప్పగించి ఓ మానవుడా ! నీ నీద్ర చూసి భయమేసింది. విచారణలో నీవు గెలవాలని త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాం. దేవతలు కూడా పొరపాటు చేస్తారని నీ జీవితంలో ఋజువు చేశావు నువ్వు జీవించే ఉన్నావు. చల్లగా జీవించు అంటూ మృత్యుదూతలు వెళ్ళిపోతారు.

6. న్యాయమూర్తి :
ఎన్నడూ లేని పొరపాటు ఈ లోకంలో జరిగింది. నీ కాగితాలన్నీ పరిశీలించాను ఇంకా నీకు. 5 సంవత్సరాల ఆయుర్దాయం ఉంది. మా కార్యాలయంలో చిన్న ఉద్యోగి తప్పు వల్ల మృత్యుదూతలు నిన్ను చనిపోయావని – తీసుకొచ్చారు. మా రాజ్యపు చట్టంలో నువ్వు చనిపోయినట్లు ఉత్తరువు పడింది.

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 1 గవేషణ

తక్షణమే మృత్యుదూతలు నీ ఆత్మను తొలగించారు. మా అధికారులతో చర్చించి నిన్ను తిరిగి భూలోకానికి పంపించాలని నిర్ధారణ చేశాను. జరిగిన పొరపాటుకు క్షమించమని మానవుని చేతులు పట్టుకున్నాడు. నువ్వింక భూలోకంలో వెళ్ళవచ్చు. మావల్ల జరిగిన పొరపాటుకు సిగ్గుతో తలవంచుకుంటున్నాము అని మానవుణ్ణి భూలోకానికి పంపించాడు న్యాయమూర్తి.

7. డాక్టరు :
ప్రసూతి వైద్యశాలలో ఆపరేషన్ గది. ఒక అమ్మాయి మృతశిశువును ప్రసవించింది. డాక్టరు అప్పుడే మెలకువ వచ్చిన అమ్మాయితో ప్రమాదం ఏమీ లేదమ్మా అంతా అయిపోయింది. బిడ్డను చూద్దువుగాని ముందు విశ్రాంతి తీసుకో అని ధైర్యం చెప్తాడు. శిశువు గురించి నువ్వు ఆలోచించకు మాట్లాడకుండా పడుకోమని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. ఆశ లేకపోలేదని శిశువుని పరీక్షిస్తుంటాడు.

పాఠ్యభాగ సారాంశం

భూలోకంలో ఒక మానవుడు 35 సంవత్సరాలకే చనిపోతాడు. యమదూతలు వచ్చి అతని ఆత్మని యమలోకానికి తీసుకెళుతుంటారు. అక్కడ న్యాయమూర్తికి అప్పగించాలని యమభటులకు ఉత్తర్వులు ఇస్తారు. హఠాత్తుగా మానవుడు మేలుకొని తాను బ్రతికే ఉన్నానని ఎంతగా చెప్పినా యమదూతలు పట్టించుకోరు. నేనేం పాపం చేశాను ? నన్ను న్యాయశాలకు తీసుకొని రమ్మని ఎవరు ఉత్తర్వునిచ్చారు ?

నన్ను వదిలి పెట్టండి మాయింటికి వెళ్ళిపోతానని మానవుడు ఎంత వాదించినా వారు వినరు. అయినా చనిపోయినవాడు తాను చావలేదని ఎలా మాట్లాడుతున్నాడో అని యమభటులు సంశయించారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్లు గ్రహించారు. అయినా వాళ్ళు పట్టించుకోకుండా మానవుణ్ణి తీసుకొని వెళుతుంటారు. నాకు అన్యాయం చేస్తున్నారు.

నా ప్రాణాలు తీస్తున్నారు. నాకు నరకం చూపిస్తున్నారేంటి అని మానవుడు ఎంత వాదించినా వాళ్ళు వినలేదు. అయ్యె ! నన్ను తగలబెట్టేస్తున్నారు అని వాపోయాడు ఆ మానవుడు. ఆ యమదూతలు న్యాయమూర్తికి ఆ మానవుని ఆత్మని అప్పగించారు.

మృత్యుదూతలు అప్పగించిన ఆత్మని మరో ప్రపంచపు రక్షక భటులు మానవుణ్ణి హాజరు పరచారు. కళ్ళు లేని స్త్రీ న్యాయమూర్తి ఆ మానవుని జీవితాన్ని పరిశీలించి ఏదో పొరపాటు జరిగినట్లు గ్రహించింది. నీకింకా భూలోకంలో 5 సంవత్సరాల ఆయుషు ఉంది. మా కార్యాలయంలో చిన్న ఉద్యోగి చేసిన తప్పుకి మృత్యుదూతలు నిన్ను ఇక్కడకు తీసుకొని వచ్చారు అని ధర్మమూర్తి అన్నారు.

మీరు ధర్మస్వరూపులు దేవతల పొరపాట్ల వల్ల ఈ మానవులు బాధలు పడుతున్నారు. నన్ను కూడా ఈ సందేహం బాధిస్తోంది. నేను బ్రతికున్నట్లా లేనట్లా అని అడిగాడుమానవుడు. మృత్యు రాజ్యపు చట్టం ప్రకారం చనిపోయావు. నీ శరీరం నుండి దూతలు ఆత్మను వేరు చేశారు. పై అధికారులతో చర్చించి నీ విషయంలో న్యాయం చేయదలిచాను. ‘ నీకు అన్యాయం జరిగింది. నీకింకా ఐదు సంవత్సరాల ఆయువు వుంది. నీకింక భూలోకానికి పోవచ్చు అని ధర్మదేవత తీర్పునిచ్చింది.

ధన్యవాదాలు తెలిపి మానవుడు తిరిగి భూలోకానికి ప్రయాణమయ్యాడు. మృత్యుదూతలు తిరిగి మానవుణ్ణి పల్లెటూరుకి తీసుకొని వచ్చారు. కాని అప్పటికే అతని బంధువులు అతని శరీరాన్ని దహనం చేశారు. ఇంకా 5 సంవత్సరాలు ఆత్మకి శరీరం లేకుండా ఎలా జీవించాలో అర్థం కాలేదు. మళ్ళీ ధర్మదేవత దర్శనం కోసం వెళ్ళాలని నిశ్చయించు కున్నాడు. ఉన్నతాధికారుల దర్శనం అంటే మాటలా ? ఎన్ని తిప్పలు పడాలో ? ఇదేమిటీ ఉపద్రవం అని చింతించాడు మానవుడు. ఎవరో చేసిన పొరపాటుకు తానెందుకు బాధపడాలి అని బాధపడ్డాడు. అయినా న్యాయమూర్తికి ఫిర్యాదు చేయాలనే నిశ్చయించుకొని మరో ప్రపంచం దగ్గరకు వెళ్ళాడు.

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 1 గవేషణ

అక్కడే తిరుగుతున్న ఒక వ్యక్తి ఎవరది ? ఎందుకొచ్చావని ప్రశ్నించాడు. తనకు ఇంకా 5 సంవత్సరాల ఆయుష్షు ఉందని న్యాయం కోసం న్యాయమూర్తికి ఫిర్యాదు చేయాలని వచ్చానని సమాధాన మిచ్చాడు మానవుడు. దానికి ఆ ప్రపంచపు వ్యక్తి నవ్వు వినబడుతుంది. మానవుని దీనావస్థకు నవ్వుతాడు ఆ భటుడు. మొదట ఆ మానవుడు దావాలో గెలిచినట్లు తెలుసుకొని సాయం చేయాలనుకుంటాడు.

ఇదేదో స్వర్గంలా ఉంది అని మానవుడు అన్నాడు. ఇక్కడ కొంతమంది ఉద్యోగుల్ని చూస్తే నరకం అని నీవే అంటావు. వాళ్ళ దాహం నీవు తీర్చలేవు లంచాల మీదే పనులు చేస్తారు. నీకు న్యాయమూర్తిని చూపిస్తే ‘నాకేమీ ఇస్తావు అన్నాడా వ్యక్తి. నన్ను నేనే హోమం చేసుకుంటున్నాను. నిన్ను నూటఎనిమిది నామాలతో పూజ చేస్తాను. ధర్మదేవతని చూపించు అన్నాడు. ఆత్మ రూపంలో మానవుడు ఇంతకీ ధర్మదేవతను ఎందుకు చూడాలి ? మీకు తెలియదా మళ్ళీ నాచేత చెప్పించాలనుకుంటున్నారా ? నువ్వు దావా గెలిచావని విన్నాను అంటాడు నవ్విన వ్యక్తి. గెలిచానో ఓడానో నా శరీరం నాకు దొరికితే బాగుండును అని ఎదురుచూస్తున్నాను.

ఎక్కడ పారేసుకున్నావు అని అడిగాడు ఆ వ్యక్తి. మీ న్యాయస్థానంలో పొరపాటువల్ల నన్ను చంపి తీసుకొచ్చారు. ఇంతలో మావాళ్ళు నన్ను దహనం చేశారు. ధర్మమూర్తి తిరిగి భూలోకం వెళ్ళమన్నా నా శరీరం లేదు. నిన్న రాత్రి ఒక చచ్చిన గబ్బిలంలో ప్రవేశించాను. గబ్బిలం లాగా , బ్రతకడం ఎంత కష్టమో అనిపించింది. ఒక కప్పలో ప్రవేశించాను. కప్పలా బ్రతకలేక పోయాను. మనిషిగా బ్రతకలేకపోయావా అన్నాడు నవ్విన వ్యక్తి. భూలోకంలో మనుష్య శరీరాలకు కళేబరాలకేం తక్కువ ? అనుక్షణం ఎందరో మరణిస్తుంటారుగా.

35 సంవత్సరాలు నేను నేనుగా జీవించాను. నా శరీరంతో సమాధానపడగలను. ఇంకొకరిలా నేను బ్రతకలేదు. ఆ అబద్ధపు బ్రతుకు ఒక బ్రతుకేనా ? అన్నాడు ఆ మానవుడు. ధర్మదేవత దర్శనం ఇప్పిస్తాను. మీ మానవులకు దేవతల శక్తి పై విశ్వాసం ఉంటుంది. కాని ఆ ధర్మదేవత కాలాన్ని వెనక్కి మళ్ళించలేదు అన్నాడు ఆ వ్యక్తి. ధర్మదేవత దర్శనం అయితే చాలు ఆమె ఏం చెయ్యమంటే అది చేస్తానన్నాడు మానవుడు.

ధర్మదేవత మళ్ళీ ఎందుకొచ్చావు మానవా ? అనగా నా శరీరం దగ్ధమైపోయింది. నాకు నిలువనీడ లేదు. మీరిచ్చిన ఐదు సంవత్సరాలు .మీరే తీసుకోండి. నన్ను నిరాశ్రయంగా వదిలెయ్యకండి అని వేడుకున్నాడు. నేనేమీ చెయ్యగలను అని ధర్మదేవత తిరిగి ప్రశ్నించింది. ఇంకొకరి బ్రతుకు బ్రతకలేను. కాందిశీకుణ్ణి అయిన నాకీ బ్రతుకు వద్దు. 5 ఏళ్ళు’ మీరే తీసుకొండి అని మానవుడు వాపోయాడు.

ధర్మదేవత కరుణించి మరల కొత్త బ్రతుకు బ్రతుకుతావా. ? నీ కాలపరిమితిని తొలగిస్తాను. నీ. ఇష్టం వచ్చిన శరీరంలో ప్రవేశించు అనగా వద్దు తల్లీ నన్ను ఈ జన్మదుఃఖపు చెర నుండి విడిపించండి. అయ్యో జన్మరాహిత్యం నన్ను అడక్కు అని ధర్మదేవత ఇంకొక జీవితాన్ని ఇవ్వగలనని అన్నది. సర్లేండి మీ దేవతల అశక్తతను చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. ఏదో ఒక శరీరంలో ప్రవేశిస్తాను.

ఏదో ఒక బ్రతుకు బ్రతుకుతాను మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను. మీచేతిలో ఈ మానవుని జీవితం ఆటవస్తువు అయింది. మీరు ఇంకొకని చేతిలో ఆటవస్తువులు అర్థం అయింది. ఇదే సృష్టి రహస్యం అంటూ న్యాయమూర్తి ఏ శరీరంలో ప్రవేశిస్తావు అనగా ఏ శరీరం అయినా నాకొకటే దేవతల్లో మానవుల్లో నాకు నమ్మకం పోతోంది అని అంటున్న మానవునితో దేవతపై నమ్మకం పోయినా ఫర్వాలేదు. మానవత్వంలో నమ్మకం ఉంచు అని న్యాయమూర్తి క్షమించమని కోరుకున్నాడు. తమ తప్పులకు ఒప్పుకుంది ధర్మదేవత.

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 1 గవేషణ

మీ మానవుల హృదయం విశాలమైనది అందుకే నీకు ఈ వరమిస్తున్నాను కొత్త జీవితం ప్రారంభించు. నిన్ను ఒక శిశువు శరీరంలో ప్రవేశించమని పూర్ణాయుర్దాయం ఇస్తూ ఆశీర్వదిస్తున్నాను.. ఈ క్షణంలో భూలోకంలో ఒక అమ్మాయి ప్రసవిస్తోంది. ప్రాణంలేని శిశువు ఆ బిడ్డ శరీరంలో నీ ఆత్మని ప్రవేశపెట్టా తిరిగి నూతన జీవితాన్ని ప్రారంభించు అంటూ ధర్మదేవత వరం ఇచ్చింది.

మహాప్రసాదం అంటూ మానవుడు భూలోకంలో ఆ మృతశిశువు శరీరంలో ప్రవేశించాడు. అంతవరకు కదలిక లేని బిడ్డను చూస్తూ తల్లి, వైద్యులు ఆందోళన పడ్డారు. అంతలో శిశువు కెవ్వుమనగానే అందరూ సంతోషించారు.

కఠిన పదాలకు అర్థాలు

మృత్యుదూతలు . = యమకింకరులు
పహారా= వరుసలు
ఉత్తరువు = ఆజ్ఞ
హఠాత్తుగా = ఉన్నట్లుండి
విడ్డూరం = వింత
కళేబరం = ప్రాణం లేని శరీరం
ఉల్లంఘించు = అతిక్రమించు
చట్టవిరుద్ధంగా = శాసనధిక్కారంగా
అంతఃకరణ = మనస్సు
స్ఫురించు = తోచుట
సంకటం =కష్టం
భ్రాంతి = భ్రమ
హడలు = భయపెట్టు
రౌద్రం = కోపం

AP Inter 2nd Year Telugu Study Material Non-Detailed Chapter 1 గవేషణ

త్రికరణ శుద్ధి = మనసా, వాచా, కర్మణా చేసే పని
ధర్మాసనం = న్యాయం చెప్పే స్థలం
సమక్షం = కళ్ళ ఎదురుగా
అతీతుడు = శక్తికి మించినవాడు
దహనం = తగలబెట్టుట
ఉపద్రవం = కష్టకాలం
నిష్కల్మషంగా = కల్మషం లేని
హవిస్సులు = అగ్నిలో వేసే సమిధలు
హోమం = అగ్ని హోత్రం
యాతన = కష్టం
విశ్వాసం = నమ్మకం
పురోగమన = తిరిగి వచ్చుట .
క్షోభ = బాధ
అభియోగం = వ్యాజ్యం
దగ్ధమైపోవు = కాలిపోవు
నిరాశ్రయం = ఆశ్రయం లేకపోవుట
అనంత విశ్వం = అంతులేని ప్రపంచం
పరిభ్రమించు = తిరుగాడుట
కాందిశీకుడు = ఆశ్రయంలేని వలస వచ్చిన వ్యక్తి
జన్మరాహిత్యం = తిరిగి జన్మ లేకుండా
రోదన = ఏడుపు

Leave a Comment