AP Inter 2nd Year Telugu Study Material Chapter 6 జాతీయోద్యమ కవిత్వం

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Telugu Study Material గద్య భాగం 6th Lesson జాతీయోద్యమ కవిత్వం Textbook Questions and Answers, Summary.

AP Inter 2nd Year Telugu Study Material 6th Lesson జాతీయోద్యమ కవిత్వం

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాతీయోద్యమం అనగానేమిటి ? ఇది భారతదేశంలో ఏ విధంగా ఎలా వ్యాపించింది ?
జవాబు:
జాతీయోద్యమ కవిత్వం అను పాఠ్యభాగం త్రిపురనేని మధుసూదనరావుచే రచించబడిన “సాహిత్యంలో వస్తు శిల్పాలు” గ్రంథంలోని వ్యాసానికి సంక్షిప్త రూపం.

సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాన్ని జాతీయోద్యమం అంటాము. ఆధునిక ప్రపంచ చరిత్రలో సామ్రాజ్య వాద వ్యతిరేక పోరాటాలు అనేక రూపాలలో జరిగాయి. సామ్రాజ్య వాదము జాతీయ వాదము అను ఈ రెండూ ఆధునిక భావాలే! 1857 లో సిపాయిల . తిరుగుబాటు జరిగింది. ఆంగ్లేయులు సంస్థానాధీశుల అధికారాలను రద్దు చేశారు. సిక్కుల రాజ్యాన్ని బలవంతంగా కలుపుకున్నారు.

సైనికులలో చాలా తక్కువ స్థాయి ఉద్యోగాలలో భారతీయులు నియమించబడ్డారు. ఆవు కొవ్వును పంది కొవ్వును తూటాలకు వినియోగించారు. సిపాయిల తిరుగుబాటుకు బర్హంపూరు, బారప్పూరు, మీరట్, ఢిల్లీ, కాన్పూరులు వేదికలయ్యాయి.

భారతదేశాన్ని ఒక మార్కెట్ గా చేసే క్రమంలో ముడిపదార్థాలను కొల్లగొట్టటానికి సామ్రాజ్యవాదులు చేసిన ఆధునికీకరణంతో దేశంలో జాతీయ భావం వ్యాపించింది. ఉద్యోగాలు, పారిశ్రామిక సౌకర్యాలు, నీటి పారుదల సౌకర్యాలను కల్పించటం సామ్రాజ్య వాదుల ప్రయోజనాలు భారతీయ మేధావులను కలవరపరచాయి. గ్రామీణ ప్రాంతంలో దారిద్ర్యం తారాస్థాయికి చేరింది. కరువు కాటకాలు విజృంభించాయి.

సంస్కరణ వాదులైన మరాఠీ బెంగాలీ మేధావులు బ్రిటీషువారి విధానాలను బాహాటంగా విమర్శించటం చేశారు. 1876లో సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనందమోహన్ బోస్టు ‘ఇండియన్ అసోసియేషన్’ ను స్థాపించారు. ప్రభుత్వ చట్టాల మీద దేశ వ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తమయింది. ఈ పరిస్థితులలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సయోధ్యను కుదర్చటానికి ఎ.ఓ.హ్యూమ్ 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను స్థాపించాడు. ఈ వేదికే చివరకు జాతీయోద్యమానికి కేంద్రంగా పనిచేసింది.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 6 జాతీయోద్యమ కవిత్వం

ప్రశ్న 2.
తెలుగులో వచ్చిన జాతీయోద్యమ కవిత్వాన్ని వివరించండి.
జవాబు:
జాతీయోద్యమ కవిత్వం అను పాఠ్యభాగం త్రిపురనేని మధుసూదనరావుచే రచించబడిన ‘సాహిత్యంలో వస్తు శిల్పాలు’ గ్రంథంలోని వ్యాసానికి సంక్షిప్త రూపం.

సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాన్ని ‘జాతీయోద్యమం’ అంటారు. ఆధునిక చరిత్రలో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు పలురూపాలలో జరిగాయి. తెలుగు నేలపై జాతీయోద్యమ ప్రభావం వందేమాతర ఉద్యమ ప్రచారానికి బిపిన్ చంద్రపాల్ ఆంధ్రప్రాంతానికి వచ్చిన నాటి నుండి ప్రారంభమయింది. ఆయన ఆంగ్ల ఉపన్యాసాలకు తెలుగు అనువాదంగా

“భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి”

ఇది వందేమాతరం గురించి రాసింది కాదు. బ్రిటీషువారి దోపిడీని ప్రజలకు తెలియజేయటానికి వ్రాసింది. చిలకమర్తి కవితల స్ఫూర్తితో సామ్రాజ్యవాదుల దోపిడీ మీద, భారత ప్రజలు అనుభవిస్తున్న దారిద్ర్యం మీద తెలుగు కవులు పద్యాలు గేయాలు వ్రాశారు. చెన్నాప్రగడ భానుమూర్తి ‘డ్రెయిను’ సిద్ధాంతం గురించి, చిదంబరరావు మితవాద రాజకీయాలను గురించి వ్రాశారు.

“మేలుకొనుమీ భరత పుత్రుడ
మేలుకొనుమీ సుజన పుత్రుడ
…………..
ఇలా మితవాద, వందేమాతరం, హోంరూల్ ఉద్యమాల మీద కవితలు వెల్లువలా వచ్చా యి.

సత్యాగ్రహం, సహాయనిరాకరణోద్యమం, శాశనోల్లంఘనం వంటి గాంధీ పోరాట రూపాలన్నీ తెలుగు పాటలు గాను గేయాలుగాను, కవితలుగాను వెలువడ్డాయి. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా, ఖిలాఫత్ ఉద్యమం మీద, రాట్నం మీద, ‘ మద్యపాన నిషేధం మీద తెలుగు కవుల పద్యాలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 6 జాతీయోద్యమ కవిత్వం

జలియన్ వాలాబాగ్ ఉదంతానికి బ్రిటీషువారు డయ్యరును అభినందించినపుడు
“దయ్యమునకు నిముడు
అలడయ్యరు అధముడని గరిమెళ్ళ
పశుబలమునకు భక్తుండొకడు బడాయి ఓ” డయ్యరు
…………. అని చిల్లరిగె శ్రీనివాసరావు విమర్శల వర్షం కురిపించారు. “మా కొద్దీ తెల్లదొరతనం”, జాతీయోద్యమ తెలుగు కవితలలో ప్రజాదరణను పొందింది.

సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
చిలకమర్తి తెలిపిన ఆనాటి పన్నులను పేర్కొనండి.
జవాబు:
జాతీయోద్యమ కవిత్వం అను పాఠ్యభాగం త్రిపురనేని మధుసూదనరావుచే రచించిబడిన “సాహిత్యంలో వస్తు శిల్పాలు” గ్రంథంలోని వ్యాసానికి సంక్షిప్త రూపం.

వందేమాతరం ఉద్యమాన్ని ప్రచారం చేయటానికి బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు. బ్రిటీషువారు భారతీయులను ఎలా దోపిడీ చేస్తున్నారో “భరత ఖండంబు చక్కని పాడియావు” అన్న పద్యం ద్వారా వివరించారు. బ్రిటీషు ప్రభుత్వం ప్రజలపై విధించే వివిధ పన్నులను గురించి కూడా వివరించారు.

నేల దున్నటానికి జాలతరము పన్ను, నీటికోసం నీటి పన్ను వ్యాపారం చేస్తే రాబడి మీద పన్ను, సరుకులు అమ్ముకుంటే సంత పన్ను, కట్టెలు అమ్ముకుంటే దాని పై మరొక పన్ను, పట్టణాలలో మునిసిపాలిటీ పన్ను, పారిపోదామంటే బండి హాసీల పన్ను, ఇంటిని అమ్ముకుందామంటే స్టాంపు పన్ను, తృప్తిగా తిందామంటే ఉప్పు పన్ను ఇలా ఎన్నో విధాలుగా బ్రిటీష్ ప్రభుత్వం ప్రజలను పన్నుల బాధతో పీడించేదని చిలకమర్తి వారు వివరించారు.

ప్రశ్న 2.
బలిజేపల్లి వారి స్వరాజ్య కాంక్షను తెలుపండి.
జవాబు:
జాతీయోద్యమ కవిత్వం అను పాఠ్యభాగం ‘త్రిపురనేని మధుసూదనరావు’ గారిచే రచించబడిన “సాహిత్యంలో వస్తు శిల్పాలు” అను గ్రంథంలోని వ్యాసానికి సంక్షిప్రరూపం.

జాతీయోద్యమ కాలంలో తెలుగు సాహిత్యంలో రచనలు చేయని కవులు లేరంటే లేరు. వారిలో చిలకమర్తి, చన్నా ప్రగడ భానుమూర్తి, బలిజేపల్లి వార్లు ముఖ్యులు.
“వడకు నూలు వలువలు నేసి
చేతివృత్తులు లేవదీసి
కల్లు సారా లెల్లరోసి
జైళ్ళలోకి కెళ్ళివద్దాం”

అని స్వరాజ్య ఉద్యమానికి ప్రజా సంఘాలను ఉసిగొలిపారు. ఆంగ్లేయుల పాఠశాలలను పాడు పెట్టమని, వారి కోర్టులను కూలదోయమని, సీమ గుడ్డలను చింపివేసి స్వదేశీ బట్టలను ధరించమని, అందుకోసం జైలుకైనా వెళ్ళాలని స్వరాజ్య కాంక్షను బలిజేపల్లి వారు ప్రజలలో రేకెత్తించారు.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 6 జాతీయోద్యమ కవిత్వం

ప్రశ్న 3.
డయ్యరును తెలుగు కవులు ఎలా నిరసించారు.
జవాబు:
జాతీయోద్యమ కవిత్వం అను పాఠ్యభాగం త్రిపురనేని మధుసూదనరావుచే రచించబడిన ‘సాహిత్యంలో వస్తు శిల్పాలు’ గ్రంథంలోని వ్యాసానికి సంక్షిప్త రూపం.

జలియన్ వాలాబాగ్ ఉదంతానికి ముఖ్య కారకుడైన డయ్యరను తెలుగు కవులంతా నిరసించారు. వారిలో చిల్లరిగి శ్రీనివాసరావు డయ్యర్ అకృత్యాలను తీవ్రంగా నిరసించాడు. డయ్యరు పశుబలానికి ప్రతినిధి. ప్రొద్దున లేచిన దగ్గర నుండి అతని మనసులో మెదిలే దేవుడు పిరంగులు. భారతీయులను ముప్పై కోట్ల పప్పు సుద్దలుగా భావించాడు.

పంజాబు రాష్ట్రం పై గుర్రపు సవారీ చేసాడు. కాలుకదిపితే జైలేనని శాసించాడు. నిరంతరం ప్రజలపై భారతీయులపై గుళ్ళ వర్షాన్ని కురిపించేవాడు. పారిపోతున్న ప్రజలపై దాడి చేసి హింసకు గురిచేసిన డయ్యర్‌ను తెలుగు కవులందరూ దూషించారు.

ప్రశ్న 4.
గరిమెళ్ళ సత్యనారాయణ ప్రజలలో ఎలా స్వాతంత్ర్య చైతన్యాన్ని కలిగించారు ?
జవాబు:
జాతీయోద్యమ కవిత్వం అను పాఠ్యభాగం త్రిపురనేని మధుసూదనరావుచే రచించబడిన ‘సాహిత్యంలో వస్తు శిల్పాలు’ గ్రంథంలోని వ్యాసానికి సంక్షిప్త రూపం.

గురజాడ నుండి 1947 వరకు జాతీయోద్యమ సాహిత్యమే తెలుగు సాహిత్య ప్రధాన చరిత్ర. 1947. తరువాత కూడా జాతీయోద్యమ దశలను తీసుకొని తెలుగు సాహిత్యం వచ్చింది అలా వ్రాసిన వారిలో గరిమెళ్ళ సత్యనారాయణ ఒకరు. ఆయన “మా కొద్దీ తెల్లదొరతనం” అన్న గేయం ప్రజల హృదయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.

రౌలట్ చట్టం మీద, ఖిలాఫత్ ఉద్యమం మీద, రాశుల కొద్దీ కవిత్వాన్ని కవులు ఆవేశంగా వ్రాశారు. రాట్నం మీద, విదేశీ వస్తు బహిష్కరణ మీద, మద్యపాన నిషేధం మీద ఎందరో కవులు తమ కలాలను ఝళిపించారు. జైళ్ళ మీద భయాన్ని పోగొట్టారు.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 6 జాతీయోద్యమ కవిత్వం

“దయ్యమునకు నిముడు
అలడయ్యరను నధముడు
ఆంగ్లసీమ కెల్ల వాడయ్యెను
ప్రియతముడు ………….
జనరల్ డయ్యరు జలియన్ వాలాబాగ్ కిరాతకుడు. అతడు దయ్యంతో సమానుడు. ఆంగ్లేయులకు వాడు ఎంతో ప్రియతముడని గరిమెళ్ళ .తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించాడు.

ఏకవాక్య పదరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
త్రిపురనేని మధుసూదనరావు ఎప్పుడు ఎక్కడ జన్మించాడు ?
జవాబు:
జనవరి 14, 1937 న కృష్ణాజిల్లా అంగలూరులో జన్మించాడు.

ప్రశ్న 2.
త్రిపురనేని తల్లిదండ్రులెవరు ?
జవాబు:
నాగభూషణమ్మ, చలమయ్య.

ప్రశ్న 3.
త్రిపురనేని విద్యార్హతలేవి ?
జవాబు:
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. ఆనర్స్.

ప్రశ్న 4.
త్రిపురనేని రచనలేవి ?
జవాబు:
కవిత్వం-చైతన్యం, సాహిత్యంలో వస్తు శిల్పాలు, మార్క్సిజం సాహిత్య విమర్శ, గతి తార్కిక మానవతా వాదం.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 6 జాతీయోద్యమ కవిత్వం

ప్రశ్న 5.
త్రిపురనేని రచనలు ఏ పేరుతో సంపుటాలుగా వెలువడ్డాయి.
జవాబు:
త్రిపురనేని మధుసూదనరావు సాహిత్య సర్వస్వం పేరున వెలువడ్డాయి.

ప్రశ్న 6.
‘జాతీయోద్యమ కవిత్వం’ ఎక్కడి నుండి గ్రహించబడింది ?
జవాబు:
సాహిత్యంలో వస్తు శిల్పాలు గ్రంథంలోని వ్యాసం నుండి గ్రహించబడింది.

ప్రశ్న 7.
సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది ?
జవాబు:
1857లో జరిగింది.

ప్రశ్న 8.
సిపాయిల తిరుగుబాటుకు ప్రధాన కేంద్రాలేవి ?
జవాబు:
బర్హంపూరు, బారక్ పూరు, మీరట్, ఢిల్లీ, కాన్పూరులు.

ప్రశ్న 9.
ఇండియన్ అసోసియేషన్ సంస్థను ఎవరు స్థాపించారు ?
జవాబు:
1876లో సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద మోహన్ బోన్లు

ప్రశ్న 10.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను ఎప్పుడు స్థాపించారు ?
జవాబు:
1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను స్థాపించారు.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 6 జాతీయోద్యమ కవిత్వం

ప్రశ్న 11.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను స్థాపించిందెవరు ?
జవాబు:
ఎ.ఓ.హ్యూమ్.

ప్రశ్న 12.
బెంగాల్ విభజనను చేసిన వాడెవరు ?
జవాబు:
లార్డ్ కర్జన్.

ప్రశ్న 13.
బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది ?
జవాబు:
1905లో జరిగింది.

ప్రశ్న 14.
బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం ఏది ?
జవాబు:
వందేమాతరం ఉద్యమం.

ప్రశ్న 15.
బెంగాల్ విభజన రద్దయిందెపుడు ?
జవాబు:
1911 వ సంవత్సరంలో రద్దయింది.

ప్రశ్న 16.
హోంరూల్ ఉద్యమాన్ని నడిపిందెవరు ?
జవాబు:
అనిబిసెంట్, తిలలు.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 6 జాతీయోద్యమ కవిత్వం

ప్రశ్న 17.
వందేమాతరం ఉద్యమ ప్రచారానికి ఆంధ్ర ప్రాంతానికి వచ్చిందెవరు ?
జవాబు:
బిపిన్ చంద్రపాల్.

ప్రశ్న 18.
‘భరత ఖండంబు చక్కని పాడియావు’ అన్న గేయ రచయిత ఎవరు ?
జవాబు:
చిలకమర్తి లక్ష్మీనరసింహం.

ప్రశ్న 19.
జలియన్ వాలాబాగ్ హత్యాకాండకు కారకుడెవరు ?
జవాబు:
జనరల్ డయ్యర్.

ప్రశ్న 20.
‘మా కొద్దీ తెల్లదొరతనం’ గీతాన్ని రాసిందెవరు ?
జవాబు:
గరిమెళ్ళ సత్యనారాయణ.

ప్రశ్న 21.
జాతీయోద్యమ కవిత్వం ఎప్పుడు ఆగిపోయింది ?
జవాబు:
1947 తో జాతీయోద్యమ కవిత్వం సహజంగానే ఆగిపోయింది.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 6 జాతీయోద్యమ కవిత్వం

ప్రశ్న 22.
తెలుగు కవులు ‘ఎలిజీ’ లను ఎప్పుడు వ్రాశారు ?
జవాబు:
గాంధీజీ హత్య జరిగినపుడు.

రచయిత పరిచయం

రచయిత పేరు : త్రిపురనేని మధుసూదనరావు.

పుట్టిన తేదీ : జనవరి 14, 1937

పుట్టిన ఊరు : కృష్ణా జిల్లా అంగలూరు

విద్యాభ్యాసం : బి.ఏ. ఆనర్స్

తల్లిదండ్రులు : నాగభూషణమ్మ, చలమయ్య

వృత్తి : కాకినాడ పి.ఆర్.కళాశాలలో, ఎస్.వి. ఆర్ట్స్ కళాశాలలో, ఎస్.జి.యస్ కళాశాలలో సుదీర్ఘ అధ్యాపకవృత్తి చేశారు.

రచనలు : కవిత్వం – చైతన్యం
సాహిత్యంలో వస్తు శిల్పాలు
మార్క్సిజం సాహిత్య విమర్శ
గతితార్కిక మానవతా వాదం

మరణం : అక్టోబరు 8, 2004

జాతీయోద్యమ .కవిత్వం అను పాఠ్యభాగం త్రిపురనేని మధుసూదనరావుచే రచించబడిన సాహిత్యంలో వస్తు శిల్పాలు అను గ్రంథంలోని వ్యాసానికి సంక్షిప్త రూపం. త్రిపురనేని పదునైన సాహిత్య విమర్శకు నిలువెత్తు రూపం. ప్రముఖ హేతువాద కవి త్రిపురనేని రామస్వామి చౌదరి మనుమడీయన. కృష్ణాజిల్లా అంగలూరులో జనవరి 14, 1937న జన్మించారు. వీరి తల్లిదండ్రులు నాగభూషణమ్మ, చలమయ్యలు గుడివాడ ఉన్నత పాఠశాల విద్య, కళాశాల విద్యను ముగించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఏ.ఆనర్స్ డిగ్రీ పొందారు.

కొంతకాలం కాకినాడ పి.ఆర్ కళాశాలలోను, తిరుపతి ఎస్.వి. ఆర్ట్స్ కళాశాలలోను, ఎస్.జి.యస్. కళాశాలలోను అధ్యాపక వృత్తిని నిర్వహించారు.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 6 జాతీయోద్యమ కవిత్వం

మార్క్సిస్ట్ తత్వశాస్త్రంలో లోతైన అభినివేశం ఉన్న వీరి రచనలు ప్రజాదరణను పొందాయి. కవిత్వం – చైతన్యం సాహిత్యంలో వస్తు శిల్పాలు, మార్క్సిజం సాహిత్య విమర్శ గతితాల్కిక మానవతా వాదం వంటివి వాటిలో ముఖ్యమైనవి. వీరి రచనలన్నీ ‘త్రిపురనేని మధుసూదనరావు సాహిత్య సర్వస్వం’ పేరున మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. వీరు జనవరి 8, 2004న కాలం చేశారు.

పాఠ్యభాగ సారాంశం

జాతీయోద్యమ కవిత్వం అను పాఠ్యభాగం త్రిపురనేని మధుసూదనరావుచే రచించబడిన “సాహిత్యంలో వస్తురూప శిల్పాలు” గ్రంథంలోని వ్యాసానికి సంక్షిప్తరూపం.

సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాన్ని జాతీయోద్యమం అంటారు. సామ్రాజ్య వాదము జాతీయవాదాలు రెండూ ఆధునిక భావనలే! 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. బ్రిటీషు వారు సంస్థానాధీశుల అధికారాలను రద్దు చేశారు. సిక్కుల రాజ్యాన్ని బలవంతంగా కలుపుకున్నారు. భారతదేశాన్ని ఒక మార్కెట్ గా చేసే క్రమంలో దేశంలోని ముడిపదార్థాలను సంపదను కొల్ల గొట్టటానికి సామ్రాజ్యవాదులు చేసిన దేశ ఆధునికీకరణం భారతీయ మేధావులలో ఆలోచనలను రేకెత్తించింది.

గ్రామీణ ప్రాంతాలలో దరిద్రం తారాస్థాయికి చేరుకుంది. కరువు కాటకాలు వచ్చాయి. సంస్కరణ వాదులైన మహారాష్ట్ర బెంగాల్ మేధావులు దేశానికి జరుగుతున్న అన్యాయాలను బాహాటంగా విమర్శించటం .మొదలు పెట్టారు. ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావటానికి మేధావులు కదిలారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సయోధ్య కుదర్చటానికి 1885 ఏ.ఓ హ్యూమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను స్థాపించారు. ఇది బ్రిటీషు సామ్రాజ్య వాదుల వేదిక కాదు ప్రజల్లో పెరుగుతున్న అశాంతికి ఉపశమనం.

బ్రిటీషు సామ్రాజ్యవాద కాంక్ష పెరగటంతో 1905లో బెంగాల్ విభజనను చేశారు. దానికి వ్యతిరేకంగా వందేమాతరం ఉద్యమం వచ్చింది. ఇది స్వరాజ్య భావాలను స్వదేశీ ఉద్యమానికి దారితీసింది. 1911లో బెంగాల్ విభజన రద్దయింది. బ్రిటీషువారికి విధేయులుగా ఉంటూ పార్లమెంటరీ ఆంతరంగిక వ్యవహారాలలో అధికారం కోసం హోంరూల్ ఉద్యమాన్ని అనిబిసెంట్ తిలలు నడిపారు.

వందేమాతరం ఉద్యమాన్ని ప్రచారం చేయటానికి బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశానికి వచ్చారు. ఆయన ఆంగ్ల ఉపన్యాసాన్ని తెలుగుకు అనువదించిన చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఆశువుగా

“భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి”.

ఇది వందేమాతరం ప్రధాన నినాదం మీద రాసింది కాదు. బ్రిటీషు వారి దోపిడీని ప్రజలకు తెలియజేయటానికి రాసింది. చిలకమర్తి దీనితో పాటుగా ఆంగ్లేయులు ప్రజలపై మోపుతున్న పన్నులను గురించి కూడా కవితా రూపాన వ్రాశారు.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 6 జాతీయోద్యమ కవిత్వం

వందేమాతరం ఉద్యమంలో స్వదేశీ ఉద్యమం కూడా వచ్చే విధంగా చన్నాప్రగడ భానుమూర్తి.
“ప్రొద్దున లేవంగ పొయి రాజవలెనన్న
నగ్నిహోత్రము స్వేడనంపవలయు …………….
……………… అన్న పద్యాన్ని వ్రాశారు
“మేలుకొనుమీ భరత పుత్రుడు
మేలుకొనుమీ సుజన పుత్రుడ
మేలుకొనుమీ సచ్చరిత్రుడ మేలుకొనవయ్యా అని ఎన్నో జాతీయోద్యమ కవితలు వెలువడ్డాయి”.

వందేమాతర ఉద్యమం దశలో వచ్చిన ‘భారతమాత’ భావాన్ని సాత్విక నిరోధ పోరాట రూపాన్ని స్వరాజ్య నినాదాన్ని గరిమెళ్ళ వంటి వారు వ్రాశారు. గరిమెళ్ళ గీతం ప్రజాచైతన్యానికి కారణమయింది.

Leave a Comment