AP Inter 2nd Year Telugu Study Material Chapter 5 నా జీవిత యాత్ర

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Telugu Study Material గద్య భాగం 5th Lesson నా జీవిత యాత్ర Textbook Questions and Answers, Summary.

AP Inter 2nd Year Telugu Study Material 5th Lesson నా జీవిత యాత్ర

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రావూరి భరద్వాజ బాల్యాన్ని గురించి తెల్పండి.
జవాబు:
‘నా జీవిత యాత్ర’ అనుపాఠ్యభాగం రావూరి భరద్వాజ వ్రాసుకున్న ‘నా గురించి నాలుగు మాటలు’ అన్న వ్యాసానికి సంక్షిప్త రూపం.

– రావూరి భరద్వాజ తాడిత పీడిత జన జీవన సమరాన్ని తన అక్షరాల్లో ఆవిష్కరించిన మంచి రచయిత. వీరు జులై 5, 1927న మల్లికాంబ కోటయ్య దంపతులకు జన్మించారు. వీరిది కృష్ణాజిల్లా నందిగామ దగ్గరున్న మోగులూరు గ్రామం. పేదరికం వల్ల ఆయన చదువు సాగలేదు. వారికి 20 ఎకరాల పొలం ఉండేది. అందులో 17 ఎకరాలు నాన్నగారు దుబారా చేసేశారు. భరద్వాజకు ఐదవ ఏటనే అక్షరాభ్యాసం చేశారు.

కొల్లిపర కోటయ్య ఆయన తొలి గురువు. ఆయన చదువుకు గండి కొట్టింది స్కూలు హెడ్మాస్టారయితే మరోకారణం వారి కుటుంబం అనుసరిస్తున్న దారిద్ర్యం. స్కూళ్ళ ఇన్స్పెక్టర్ తనిఖీకి వచ్చిన రోజున చిరిగిన బట్టలు వేసుకున్నావని మాష్టారు కఠినంగా దండించారు. పుస్తకాలను ఆయన మీద గిరాటువేసి బెత్తాన్ని రెండు ముక్కలు చేసి బండబూతులు తిడుతూ అక్కడి నుండి పారిపోయాడు. అంతే చదువు ఆగిపోయింది.

తిండికోసం, పిడికెడు మెతుకుల కోసం వ్యవసాయ కూలీగా, పశువుల కాపరిగా, సరుకులు అందించే ‘కుర్రాడిగా, .పేపరు బాయ్ గా, పొగాకు బారెలో బొగ్గు వేసేవానిగా, కలప అడితీలో రంపం లాగే పనివాడిగా, కమ్మరి దగ్గర పొయ్యి తిత్తిని ఆడించేవానిగా వివిధ అవతారాలను ఎత్తవలసి వచ్చింది. చివరకు ఆయనకు జరిగిన అవమానం ఆయనను చదువరిగా ఒక గొప్ప రచయితగా తీర్చిదిద్దింది.

శేషయ్య అనే భరద్వాజ నాన్నగారి స్నేహితుడు మను చరిత్రలోని ఒక పద్యాన్ని అప్పగించిన కుర్రోడితో పోల్చి అవమానించటం ఆయన మనసును గాయపరిచింది. ఈ అవమానం ఆయనను 17సం||లకే రచయితగా తీర్చిదిద్దింది. ముందుగా పద్యాలు వ్రాశారు. అందులో గణ యతిప్రాసలు తప్ప కవిత్వం ఏదీ కన్పించేది కాదు. ఆ తరువాత పుస్తక పఠనం ఆయనను మహాకవిగా తీర్చిదిద్ది ‘పాకుడు రాళ్ళ
ద్వారా’ జ్ఞానపీఠ అవార్డు అందుకునేలా చేసింది.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 5 నా జీవిత యాత్ర

ప్రశ్న 2.
రావూరి భరద్వాజ రచనా వ్యాసంగాన్ని వివరించండి.
జవాబు:
‘నా జీవిత యాత్ర’ అను పాఠ్యభాగం రావూరి భరద్వాజ వ్రాసుకున్న ‘నా గురించి నాలుగు మాటలు’ అన్న వ్యాసానికి సంక్షిప్త రూపం.

తాడిత, పీడిత జన జీవన సమరాన్ని తన అక్షరాలలో ఆవిష్కరించిన రచయిత డా||రావూరి భరద్వాజ. చదువులో అంతగా రాణించక పోయినప్పటికి జీవిత పాఠాలు బాగా నేర్చినవాడు. భరద్వాజ పెద్దల సహకారంతో గ్రంథాలయంలోని పుస్తకాలను చదవటం ద్వారా సాహిత్యం వంటబట్టింది. ముందుగా ఆయన పద్యరచనకు సాహసించాడు. అందులో గణ, యతి ప్రాసలు తప్ప కవిత్వం కనపడదు. తరువాత జీషన్ ప్రభాత్ ప్రోత్సాహంతో కొవ్వలి వారి నవలలు, చలంగారి పుస్తకాలు, కొడవటి గంటి కుటుంబరావు, గోపీచంద్ రచనలు చదివాడు.

కథలు వ్రాయటం ప్రారంభించాడు. భరద్వాజ రచించిన తొలికథ ‘విమల’ ఆగష్టు 26, 1946న ‘ప్రజామిత్ర’ వార పత్రికలో అచ్చయింది. జమీన్ రైతు, దీనబంధు, జ్యోతి, సమీక్ష, యువ పత్రికలలో వివిధ హోదాలలో పనిచేసిన అనుభవం ఆయన రచనలోని మెరుపులకు దారితీసింది.

1947లో సుప్రభాతం’ అన్న పుస్తకాన్ని వీధి వీధి తిరిగి అమ్మారు. ఆయన తొలికథ 1946లో అచ్చవగా తొలిపుస్తకం ‘రాగిణి’ 1950లో అచ్చయింది. భరద్వాజ రెండవ పుస్తకం కూడా 1950లోనే అచ్చయింది. అది “కొత్త చిగుళ్ళు”. దీనిని చలంగారికి అంకితం చేశాడు. వీరి పుస్తకాలు ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళ, మళయాళ భాషలలోనికి అనువదించబడ్డాయి. వీరి నవల “పాకుడు రాళ్ళు” జ్ఞానపీఠ అవార్డు అందుకున్నది.

1956లో వీరి రచనకు ‘జ్యోతి’ పాఠకుల నుండి స్వర్ణపతకాన్ని అందుకున్నది. ‘వీరి విజయ విలాసం’ అన్న కథా సంపుటానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1983లో ‘జీవన సమరం’ పుస్తకం కేంద్రరాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నది. విద్యాగంధం అంతగా లేకపోయినా గ్రంథ పఠనం ద్వారా భరద్వాజ ఆకాశమంత ఎత్తుకు ఎదిగారంటే అతిశయోక్తి లేదు.

సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
రావూరి భరద్వాజకు చదువు పట్ల ఆసక్తిని కలిగించిన సంఘటనను తెల్పండి.
జవాబు:
నా జీవిత యాత్ర’ అను పాఠ్యభాగం రావూరి భరద్వాజ వ్రాసుకున్న ‘నా గురించి నాలుగు మాటలు’ అన్న వ్యాసానికి సంక్షిప్త రూపం.

రావూరి భరద్వాజ 8వ తరగతిలోనే చదువు మానేశారు. దానికి ఒక కారణం స్కూలు హెడ్మాస్టారైతే రెండవ కారణం ఆ కుటుంబాన్ని ముసిరిన దరిద్రం. స్కూలు ఇన్స్పెక్టర్ తనిఖీకి వచ్చిన రోజు చిరిగిన దుస్తులు ధరించినందుకు మాష్టారు చితక బాదాడు. దానితో చదువుకు స్వస్తి చెప్పాడు. తరువాత రావూరికి జరిగిన అవమానం ఆయనలో చదువు పట్ల ఆసక్తిని కలిగించింది.

ఆయనకన్నా చిన్నవాడు ఒకడు మనుచరిత్ర పద్యాన్ని అప్పగించాడు. అందరూ ఆ కుర్రాడిని మెచ్చుకున్నారు. భరద్వాజ నాన్నగారి స్నేహితుడు శేషయ్య ఆ కుర్రాడితో పోలుస్తూ ఆయనను తిట్టాడు. నాటినుండి పగలంతా కూలి పని చేసుకొని రాత్రిపూట శివాలయంలోని ప్రమిద దగ్గర చదువు కొనేవాడు. ఈయనకు గ్రంథాలయంలో పుస్తకాలు చదవటానికి సహాయపడిన వారు కొల్లూరి వెంకటేశ్వరరావు గారు.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 5 నా జీవిత యాత్ర

ప్రశ్న 2.
రావూరి భరద్వాజ పెళ్ళి సంబంధ వృత్తాంతాన్ని తెల్పండి.
జవాబు:
‘నా జీవిత యాత్ర’ అను పాఠ్యభాగం రావూరి భరద్వాజ వ్రాసుకున్న ‘నా గురించి నాలుగు మాటలు’ అన్న వ్యాసానికి సంక్షిప్తం రూపం.

భరద్వాజకు కులాల పట్టింపు లేదని, ఎక్కడబడితే అక్కడే తింటాడని, ఆస్తిపాస్తులేవీ లేవని, ఏ ఉద్యోగము లేదని, ఏ పనీ చేతగాదని పిల్లను ఇచ్చి పెళ్ళి చేయటానికి ఎవరూ మందుకు రాలేదు. ఆయనకు కూడా అలానే అన్పించింది. అదే సమయంలో కృష్ణాజిల్లా తోటరావులపాడు గ్రామానికి చెందిన మేడూరి మల్లయ్య తన కుమార్తె ‘కాంతాన్ని’ భరద్వాజకు ఇవ్వటానికి ముందుకొచ్చారు. ఆయనకు పెళ్ళి కాదేమోనన్న భయంతో భరద్వాజ మేనమామ మల్లయ్యగారికి చాలా అబద్దాలు చెప్పారు.

అవన్నీ అబద్దాలని మల్లయ్యగారికి భరద్వాజ చెప్పుకున్నాడు. ఆయన మాటలలోని నిజాయితీని గ్రహించి ,మల్లయ్యగారు నిజం చెప్పిన వారికి పిడికెడు మెతుకులు దొరకుతాయి. మీకో పిడికెడు దొరికితే సగం మీరు తిని మిగిలిన సగం నా కూతురుకు పెడతారన్న నమ్మకం నాకున్నదని జవాబిచ్చారు. భరద్వాజ గారు పిల్లను కూడా 1948 మే 28న రాత్రి పెళ్ళిలో జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడే చూశారు.

పెళ్ళి అయింది. వంటి నిండా నగలతో లక్ష్మీదేవిలా కాంతం భరద్వాజ యింటికి వచ్చింది. కాని మూడు సంవత్సరాలు గడవక ముందే ఆమె భరద్వాజ గారి దరిద్రత వలన నిరాభరణ సుందరిగా మారిపోయింది. ఆగష్టు 1, 1986న కాంతం గారు కాలం చేశారు.

ప్రశ్న 3.
పాకుడు రాళ్ళు నవల గురించి రాయండి.
జవాబు:
‘నా జీవిత యాత్ర’ పాఠ్యభాగం రావూరి భరద్వాజ వ్రాసుకున్న ‘నా గురించి నాలుగు మాటలు’ అన్న వ్యాసానికి సంక్షిప్తరూపం.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 5 నా జీవిత యాత్ర

భరద్వాజ అంతగా చదువుకోలేదు. ఆయన 8వ తరగతిలోనే చదువుకు కుటుంబ దారిద్ర్యం వల్ల స్వస్తి చెప్పాడు. తనకు తన వూరిలో జరిగిన అవమానం వలన చదువుపై శ్రద్ధ పెట్టి తన వూరి గ్రంథాలయంలోని ప్రాచీన గ్రంథాలను ఔపోసన పెట్టారు. తనకు గ్రంథాలయంలో చదువుకునేందుకు సహాయం చేసిన కొల్లూరు వెంకటేశ్వర్లు గారి ఋణం తీర్చుకోవటం కోసం 1965సం||లో ‘పాకుడు రాళ్ళు’ నవల వ్రాసి ఆయనకు అంకితం చేశాడు.

భరద్వాజ 1956లో మద్రాసు వెళ్ళారు. అక్కడ ఆయన చాలా నేర్చుకున్నారు. వందలాది మంది రచయితలతో కవులతో పత్రికా సిబ్బందితో, సినీరంగ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఊహకు అందని విషయాలను కూడా అక్కడ ఆయన ఎదుర్కొన్నారు. ఆ సినీరంగం ఆధారంగా చేసికొని అక్కడ ఉండే ప్రతి మనసును అర్థం చేసుకుని “పాకుడు రాళ్ళు” నవలను రచించారు. ఆ నవలలోని అన్ని పాత్రలు ఆయనకు పరిచయం అయినవే.

అన్ని సంఘటనలు ఆయనకు తెలిసిన వారి జీవితాలలో నుండి ఎన్నుకున్నవే! చివరకు ఆ నవలే ఆయనకు జ్ఞానపీఠ అవార్డును అందించింది. దురదృష్ట మేమంటే ఆయన ఆ మెమెంటోను కళ్ళారా చూసుకోక మందే అక్టోబరు 18, 2013న కాలం చేశారు.

ఏకవాక్య / పదరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
తాడిత పీడిత జన జీవన సమరాన్ని అక్షరాల్లో ఆవిష్కరించిందెవరు ?
జవాబు:
రావూరి భరద్వాజ.

ప్రశ్న 2.
భరద్వాజ ఎప్పుడు జన్మించారు ?
జవాబు:
జులై 5, 1927న జన్మించారు.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 5 నా జీవిత యాత్ర

ప్రశ్న 3.
భరద్వాజ జన్మస్థలం ఏది ?
జవాబు:
కృష్ణాజిల్లా నందిగామ దగ్గరలోని మాగులూరు గ్రామం.

ప్రశ్న 4.
రావూరి భరద్వాజ తల్లిదండ్రులెవరు ?
జవాబు:
మల్లికాంబ కోటయ్యలు.

ప్రశ్న 5.
రావూరి భరద్వాజ విద్యార్హత ఏమిటి ?
జవాబు:
7వ తరగతి.

ప్రశ్న 6.
రావూరి చదువు సాగటానికి అడ్డంకి ఏమిటి ?
జవాబు:
పేదరికం.

ప్రశ్న 7.
భరద్వాజ ఏఏ పత్రికలలో పనిచేశారు ?
జవాబు:
జమీన్ రైతు, దీనబంధు, జ్యోతి, యువ పత్రికలలో పనిచేశారు.

ప్రశ్న 8.
ఆకాశవాణిలో భరద్వాజ ఏ పాత్ర నిర్వహించారు ?
జవాబు:
స్క్రిప్ట్ రైటరుగా, తెలుగు ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా నిర్వహించారు.

ప్రశ్న 9.
భరద్వాజ తన జీవిత కాలంలో ఎన్ని రచనలు చేశారు ?
జవాబు:
సుమారు 140 రచనలు.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 5 నా జీవిత యాత్ర

ప్రశ్న 10.
భరద్వాజ వ్రాసిన కథలెన్ని ?
జవాబు:
400 లకు పైగా.

ప్రశ్న 11.
రావూరి భరద్వాజ వ్రాసిన నవలలు ఏవి ?
జవాబు:
పాకుడు రాళ్ళు, కాదంబరి, ఇదంజగత్, కరిమింగిన వెలగపండు.

ప్రశ్న 12.
భరద్వాజ రాసిన సినీరంగ సంబంధ నవల ఏది ?
జవాబు:
పాకుడు రాళ్ళు.

ప్రశ్న 18.
జ్ఞానపీఠ అవార్డు అందించిన భరద్వాజ నవల ఏది ?
జవాబు:
పాకుడు రాళ్ళు.

ప్రశ్న 14.
రావూరి భరద్వాజ భార్య పేరేమిటి ?
జవాబు:
కాంతం.

ప్రశ్న 15.
భరద్వాజ తొలిగురువు ఎవరు ?
జవాబు:
కొల్లిపర కోటయ్య.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 5 నా జీవిత యాత్ర

ప్రశ్న 16.
భరద్వాజకు బాలభారతి గ్రంథాలయంలో చదువుకునే అవకాశాన్నిచ్చింది ఎవరు ?
జవాబు:
కొల్లూరు వెంకటేశ్వర్లు.

ప్రశ్న 17.
పాకుడు రాళ్ళు నవల ఎవరికి అంకితం చేశారు ?
జవాబు:
కొల్లూరు వెంకటేశ్వర్లు గారికి.

ప్రశ్న 18.
రావూరి వారి రచనలకు వైలెట్ పెన్సిలు దస్తా తెల్ల కాగితాలు ఇచ్చింది ఎవరు ?
జవాబు:
త్రిపురనేని శివరామ కృష్ణయ్య గారు.

ప్రశ్న 19.
రావూరి వారి ఇదంజగత్ నవల ఎవరికి అంకితం చేశారు ?
జవాబు:
త్రిపురనేని శివరామ కృష్ణయ్యగారికి.

ప్రశ్న 20.
రావూరి భరద్వాజ గారు రచించిన తొలి కథ ఏది ?
జవాబు:
విమల.

ప్రశ్న 21.
విమల కథ ఏ పత్రికలో అచ్చయింది ?
జవాబు:
ప్రజామిత్ర వార పత్రికలో.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 5 నా జీవిత యాత్ర

ప్రశ్న 22.
దీనబంధు పత్రికను స్థాపించిందెవరు ?
జవాబు:
పెళ్ళకూరు గోపాల కృష్ణారెడ్డి.

ప్రశ్న 23.
కాంతం కథల రచయిత ఎవరు ?
జవాబు:
మునిమాణిక్యం నరసింహారావు గారు.

ప్రశ్న 24.
భరద్వాజ తొలికథ ఎప్పుడు అచ్చయింది ?
జవాబు:
1946లో.

ప్రశ్న 25.
భరద్వాజ తొలిపుస్తకం ఎప్పుడు అచ్చయింది ?
జవాబు:
1950లో దాని పేరు ‘రాగిణి’ రెండవది ‘కొత్త చిగుళ్ళు’.

ప్రశ్న 26.
భరద్వాజ గారి ‘కొత్త చిగుళ్ళు’ ఎవరికి అంకితం చేశారు ?
జవాబు:
చలంగారికి.

కవి పరిచయం

కవి పేరు : రావూరి భరద్వాజ.

పుట్టిన తేదీ : జులై 5, 1927.

పుట్టిన వూరు : కృష్ణాజిల్లా నందిగామ దగ్గరున్న మోగులూరు.

తల్లిదండ్రులు : మల్లికాంబ, కోటయ్య.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 5 నా జీవిత యాత్ర

విద్యాభ్యాసం : గుంటూరు జిల్లా తాడికొండలో 7వ తరగతి వరకు మాత్రమే !

ఉద్యోగం : జమీన్ రైతు, దీనబంధు, జ్యోతి, సమీక్ష, యువ వంటి పత్రికలలో, ఆకాశవాణిలో జూనియర్ స్క్రిప్టు రైటర్ గా పనిచేశారు. :

రచనలు :

  1. మొత్తం 140 దాకా ఉన్నాయి. 400 పైగా కథలున్నాయి.
  2. నవలలు: పాకుడు రాళ్ళు, కాదంబరి, ఇదంజగత్, కరిమింగిన వెలగపండు.

అవార్డులు :

  1. జ్ఞానపీఠ అవార్డు (పాకుడు రాళ్ళుకు)
  2. పలువిశ్వవిద్యాలయాలు పోటీపడి గౌరవ డాక్టరేట్లను అందించాయి.

1968లో జీవన సమరం పుస్తకానికి రాష్ట్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చాయి. 1668 లోనే ‘విజయ విలాసం’ కథా సంపుటానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

మరణం : అక్టోబరు 18, 2013.

తాడిత, పీడిత జన జీవన సమరాన్ని తన అక్షరాల్లో ఆవిష్కరించిన రచయిత డా||రావూరి భరద్వాజ. ఈయన జులై 5, 1927న మల్లికాంబ కోటయ్య దంపతులకు కృష్ణాజిల్లా నందిగామ దగ్గరున్న మోగులూరు గ్రామంలో జన్మించారు. 7వ తరగతి వరకే చదువుకున్నారు. పెద్ద చదువులు లేకపోయినా లోకాన్ని చక్కగా చదివినవాడు భరధ్వాజ.

ఆయన విద్యాభ్యాసానికి పేదరికం ప్రధాన కారణం అయింది. జీవించటం కోసం అనేక పనులు చేశాడు. ప్రతి పనిని గౌరవంగానే స్వీకరించాడు. జీవితం నేర్పిన పాఠాల వలన ఆయన 17సం||ల నాటికే కవిగా మారాడు. కొంతకాలం మిలటరీలో సాంకేతిక నిపుణుడిగా పొట్టకూటికోసం పనిచేశాడు.

జమీన్ రైతు, దీనబంధు, జ్యోతి, సమీక్ష, యువ వంటి పత్రికలలోను, ఆకాశ వాణిలో ‘స్క్రిప్ట్ రైటర్’గా పనిచేశారు. తెలుగు ప్రసంగ కార్యక్రమాలకు ప్రయోక్తగా వ్యవహరించారు. భరద్వాజ మొత్తం 140 దాకా రచనలు చేశారు. 400 లకు పైగా కథలు వ్రాశారు. పాకుడు రాళ్ళు, కాదంబరి, ఇదంజగత్, కరిమింగిన వెలగ పండు వంటి నవలలను రచించారు.

వీరు వ్రాసిన ‘పాకుడు రాళ్ళు’ నవల ఆయనకు జ్ఞానపీఠ అవార్డును అందించింది. రాష్ట్రంలోని పలువిశ్వవిద్యాలయాలు భరద్వాజకు గౌరవ డాక్టరేట్లను అందించాయి. అక్టోబరు 18, 2013న ఆయన లోకాన్ని విడిచారు.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 5 నా జీవిత యాత్ర

‘నా జీవిత యాత్ర’ అను పాఠ్యభాగం రావూరి భరద్వాజ గారిచే రచించబడిన ‘నా గురించి నాలుగు మాటలు’ అనే వ్యాసానికి సంక్షిప్తరూపం.

పాఠ్యభాగ సారాంశం

‘నా జీవిత యాత్ర’ అను పాఠ్యభాగం రావూరి భరద్వాజ వ్రాసుకున్న ‘నా గురించి నాలుగు మాటలు’ అన్న వ్యాసానికి సంక్షిప్త రూపం. తాడితపీడిత జన జీవన సమరాన్ని తన అక్షరాలలో ఆవిష్కరించిన కవి భరద్వాజ. ఆయన జీవితంలోని కష్టాలను, కన్నీళ్ళను, విషాదాలను రంగరించి వ్రాసిన ఈ వ్యాసం విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని భావిద్దాం.

భరద్వాజకు 5వ ఏటనే అక్షరాభ్యాసం జరిగింది. కొల్లిపర కోటయ్యగారు ఆయన గురువులు. వారి పెదనాన్నకు, నాన్నకు వీరే అక్షరాభ్యాసం చేశారు. కాని ఎవరికి చదువబ్బలేదు. భరధ్వాజ కూడా 7వ తరగతి. చదివి 8వ తరగతిలో చదువుకు స్వస్తి చెప్పాడు. దానికి కారణం స్కూలు హెడ్మాష్టరు ఒకరైతే రెండవ కారణం ఆ కుటుంబాన్ని ముసిరిన దరిద్రం. తిండి కోసం, పిడికెడు మెతుకుల కోసం కూలీగా, పశువుల కాపరిగా,, అడితీలో రంపం పనివానిగా, పేపరు బాయ్ గా ఎన్నో అవతారాలెత్తాడు.

ఆయనకు జరిగిన ఒక అవమానం ఆయనను మరలా చదువుల వైపు మళ్ళించింది. గ్రంథాలయాలలోని పుస్తకాలను చదివి, సమాజంలోని వ్యక్తుల జీవితాలను చదివి కవి అయ్యాడు. ముందుగా పద్యాలు వ్రాశాడు. గణ యతి ప్రాసలు తప్ప ఆ పద్యాలలో కవిత్వం కన్పించలేదు.

జీషన్ ప్రభాత్ అనే కథా రచయిత ఇచ్చిన ప్రోత్సాహంతో చలం గారి, కుటుంబరావు గారి పుస్తకాలను, గోపీచంద్ రచనలను చదివి వారిలా కథలు వ్రాయటం ప్రారంభించారు. అచ్చయిన ఆయన తొలికథ ‘విమల’. ఇది 1946 ఆగష్టు 26న ‘ప్రజామిత్ర’లో అచ్చయింది.

జమీన్ రైతు, దీనబంధు, జ్యోతి యువ వంటి పత్రికలలో పనిచేయటం, ఆకాశవాణిలో పనిచేయటం ఆయన రచనలకు బాగా ఉపకరించాయి. 1956లో భరద్వాజ మద్రాసు వెళ్ళారు. అక్కడ కవులు, రచయితలు, పత్రికా సిబ్బందితో, సినిమా నటీనటులు దర్శకులతో పరిచయం జరిగింది.

ఆ సినీ రంగాన్ని ఆధారంగా చేసికొని ‘పాకుడు రాళ్ళు’ నవలను వ్రాశాడు. ఈ నవలను తనకు చదువుకోవడానికి సహాయం చేసిన కొల్లూరు వెంకటేశ్వర్లు గారికి అంకితం చేశాడు. ఇది ఆయన జీవితాన్ని మార్చివేసింది. ఈ నవలే భరద్వాజకు “జ్ఞానపీఠ” అవార్డును తెచ్చి పెట్టింది.

AP Inter 2nd Year Telugu Study Material Chapter 5 నా జీవిత యాత్ర

భరద్వాజ తొలికథ 1946లో అచ్చయింది. తొలి పుస్తకం 1950లో అచ్చయింది. దాని పేరు “కొత్త చిగుళ్ళు”. దీనిని గుడిపాటి వెంకట చలంగారికి అంకితం చేశారు. వీరి అచ్చయిన పుస్తకాలు 140 వరకు ఉన్నాయి. వీరి కథలు కొన్ని భారతీయ భాషలైన హిందీ, గుజరాతీ, కన్నడ, తమిళ, మళయాళములతోపాటు ఆంగ్లం లోనికి కూడా అనువదించబడ్డాయి. 1956లో జ్యోతిపాఠకులు ఎంపిక చేసిన కథకు స్వర్ణపతకం లభించింది.

1968లో ‘విజయ విలాసం’ అన్న కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు లభించింది. 1983లో ‘జీవన సమరం’ అన్న పుస్తకానికి కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి.

1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1987లో జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, 1991లో నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లను అందించాయి. ఆయనకు ఆకలి తెలుసు, అవిద్య తెలుసు, అవమానం తెలుసు నిరుద్యోగం తెలుసు, అన్యాయం తెలుసు, అక్రమం తెలుసు వీటన్నింటిని పుష్కలంగా అనుభవించాడు. కావున అవి లేని సమాజాన్ని కోరుకున్నాడు.

కఠిన పదాలకు అర్థాలు

గిరాటువేయు = విసరివేయు
కో ఆపరేటీవ్ స్టోర్స్ : సహకారసంస్థ
పొగాకు బారన్ = పొగాకును ఉడకబెట్టే పొయ్యి
బోధపడు = అర్ధం చేసికొను
ఉబికించి చెప్పు = ఎక్కువ చేసి చెప్పు
తొలిరోజుల్లో = మొదటి రోజుల్లో
నిరాభరణ సుందరి = ఆభరణాలు లేని సుందరి
చవిచూడు = తెలిసికొను
స్క్రిప్టు రైటర్ = మాటలను వ్రాసేవాడు

AP Inter 2nd Year Telugu Study Material Chapter 5 నా జీవిత యాత్ర

అధమాధములు = చెడు ఆలోచనలు గలవారు
సోదాహరణంగా = ఉదాహరణ పూర్వకంగా
స్వర్ణపతకం = బంగారు పతకం
జీవిత భాగస్వామి = భార్య లేక భర్త
నిర్గమనం = వెళ్ళిపోవటం
ఉపకరించు = ఉపయోగపడు
అధర్మం = ధర్మంకానిది
అనునిత్యం = ప్రతిరోజు
జగత్తు = ప్రపంచం

Leave a Comment