Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Telugu Study Material గద్య భాగం 4th Lesson వేమన కవిత్వము Textbook Questions and Answers, Summary.
AP Inter 2nd Year Telugu Study Material 4th Lesson వేమన కవిత్వము
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వేమన పద్యాలలో హాస్యాన్ని వివరించండి.
జవాబు:
వేమన కవిత్వము అను పాఠ్యభాగము రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ వేమనపై చేసిన ఉపన్యాస పరంపరలోని “వేమన కవిత్వము, హాస్యము, నీతులు” అను ఏడవ ఉపన్యాసమునకు సంక్షిప్త రూపం.
వేమన కవిత్వానికి బలము, భాగ్యము హాస్యము. హాస్యాన్ని పండించటం చేత వేమన కవితకు ప్రజాదరణ లభించింది. పూర్వము హాస్యాన్ని పండించే పాత్రగా విదూషకుడుండేవాడు. ఆ హాస్యం అసహ్యానికి ప్రతీకగా ఉండేది. తెలుగు భాషకు హాస్యరసాన్ని అద్భుతంగా అందించినవాడు గురజాడ. కన్యాశుల్కం దానికి ఉదాహరణ.
వేమన గొప్ప బోధకుడు, సంఘసంస్కర్త అక్కడక్కడా హాస్యం పండించటంలో అసభ్యత కన్పించినా మిగిలిన చోట్ల స్వచ్ఛమైన హాస్యరచన చేశాడు.
“పాలసాగరమున పవ్వళ్ళించువాఁడు
గొల్లయిండ్ల పాలు కొరనేల”
అని ప్రశ్నవేసి ఇవి బూటక పురాణాలని తేల్చేశాడు. అలాంటి భావనకు కొద్దిగా హాస్యాన్ని జోడించి “ఎదుటివారి సొమ్ము లెల్లవారికి తీపు” అని కొట్టి వేశాడు. ఇది విన్నప్పుడు ఎంతటి కృష్ణ భక్తుడైనా నవ్వకుండా ఉండడు. వేమన రచనలలో సునిసితమైన హాస్యం తొంగి చూస్తుంది. శ్రోతలకు, పాఠకులకు నవ్వు కలిగించటానికే కొన్ని కొసరు మాటలను చేర్చి హాస్యాన్ని పండించాడు.
“గొడ్డుటావును పితికినట్లు, మేక మెడ చన్ను గుచినట్లు” అని చెప్పిన లోభివాని గుణాలను అర్థం చేసుకోవచ్చు కాని హాస్యాన్ని జోడించాలి కదా ! అందుకే “పండ్లు రాలదన్ను పాలనీదు” అని కొసరు మాటలను చేర్చి హాస్యాన్ని పండించ వేమన ప్రయత్నించాడు.
ప్రశ్న 2.
వేమన నీతులను వివరించండి.
జవాబు:
వేమన కవిత్వము అను పాఠ్యభాగము రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ వేమనపై చేసిన ఉపన్యాసపరంపరలోని “వేమన కవిత్వము, హాస్యము, నీతులు అను ఏడవ ఉపన్యాసము నకు సంక్షిప్తరూపము.
వేమన కవిత్వం తెలుగు సాహిత్యంలోను, తెలుగు నేలపైన ఇంతకాలం నిలవడానికి ప్రజాదరణ పొందడానికి అసలు కారణం ఆయన బోధించిన నీతి. లోకములో ఇతరులకు, తనకు సౌఖ్యమును కలిగించేవి నీతులు. ఈ నీతులు రెండు రకాలు.
ఒకటి స్వార్థములు, రెండు పరార్థములు. వేమన మంచి చెడులను రెండింటిని తాను చూసి అందులోని తత్వాన్ని తెలుసుకొని లోకానికి తెలియజేశాడు. కావుననే సామాన్య నీతి గ్రంథాలలో లేని తీవ్రత ఇతని పద్యాలలో కన్పిస్తుంది.
దానమునకు తగినవాడెవరు అన్న అంశాన్ని చర్చిస్తూ కులము, జాతి, గుణము దానమును గ్రహించుట పరిగణలోనికి తీసుకోకూడదని పేదరికాన్ని మాత్రమే తీసుకోవాలన్న నీతిని వివరించాడు.
దోసకారియైన దూసరికాఁడైన
పగతుఁడైన వేదబాహ్యుఁడైన
వట్టిలేని పేదవాని కీఁదగు నీవి
ధనికునకు నొసంగఁదగదు వేమ
దాన విషయాన్ని చెప్తూ అన్ని దానములతో పాటు కన్యాదానమును కూడా చేయాలన్నాడు. అహింసను గూర్చి చెప్తూ
“జీవి జీవిఁజంప శివుని జంపుటె యగు .
జీవుఁడరసి తెలియ శివుఁడు కాఁడె”
అంటాడు. చంపదగిన శత్రువు తన చేత చిక్కి అతనికి కీడు చేయకుండా ఎంతో కొంత మేలు చేసి పంపించాలని వివరించాడు. శత్రుత్వము చావాల్సిందీ శత్రువు చావాలనుకోవటం నీతికాదంటాడు.
నీతిని చెప్పటం ఒక తీరు. వాటిని ఆచరించిన చెప్పటం మంచి తీరు. వేమన తానన్నింటిని ఆచరించి నీతి ప్రబోధాన్ని చేశాడు.
“ఆలిమాటలు విని అన్నదమ్ముల రోసి
వేట పోవువాఁడు వెట్టివాఁడు
కుక్క తోఁక బట్టి గోదావరీఁదునా ?”
ఇలా ధర్మాన్ని, తత్వాన్ని, పరమత ఖండన మంచిది కాదని లోక సహజమైన నీతులను వేమన తన రచనల ద్వారా తెలియజేశాడు.
సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వేమన కవిత్వంలోని భాషను వివరించండి.
జవాబు:
వేమన కవిత్వము అను పాఠ్యభాగము ‘రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ’ వేమనపై చేసిన ఉపన్యాస పరంపరలోని “వేమన కవిత్వము, హాస్యము, నీతులు అను ఏడవ ఉపన్యాసమునకు సంక్షిప్తరూపము.
వేమన తీవ్రములైన భావనలు, అడ్డులేని నాలుక గలవాడు కనుకనే అతని పద్యాలలో భావము భాష ఒకదానితో ఒకటి పందెం వేసుకొని పాఠకులను అలరిస్తాయి. ఛందస్సు యతి ప్రాసలకు తడుముకొనే తత్వం వేమనది కాదు. వేమనది నిజమైన అచ్చ తెలుగు. ప్రాచీనులకు సంస్కృతం, ఆధునికులకు ఆంగ్లం భాషల వలన వచ్చే పరభాషా పదాలు వేమనకు తెలియవు. గొప్ప తత్వ విషయాలను వ్రాసేటపుడు కూడా తెలుగు పదాలలోనే పూరించేవాడు. వేమన ఉపయోగించిన ఉపమానాలు కూడా ఊహా కల్పితాలు కావు. సామాజికమైనవే ! అందువల్లనే వేమన పద్యాలకు ఆ సొగసు బిగువు వస్తుంది.
“పసుల వన్నెవేఱు పాలేక వర్ణమౌ
పుష్పజాతివేలు పూజయొకటి
దర్శనములు వేఱు దైవం బదొక్కటి”
ఈ పద్యంలోని పదాలన్నీ సామాజికమైనవే ! వేమన పద్యములలోని ఉపమాన ఉపమేయములన్నీ మన సమాజంలోనివే ! అందుకే వేమన పద్యం అలా నిలబడి పోయింది.
ప్రశ్న 2.
లోభి వాని స్వభావాన్ని తెలుపండి ?
జవాబు:
వేమన కవిత్వము అను పాఠ్యభాగము ‘రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ’ వేమన పై చేసిన ఉపన్యాస పరంపరలోని “వేమన కవిత్వము, హాస్యము, నీతులు అను ఏడవ ఉపన్యాసమునకు సంక్షిప్తరూపము.
వేమన తన రచనలలో ‘లోభి’ వానిని గురించి చక్కగా వివరించాడు. లోభి వానిని అడగటంలో ప్రయోజనం ఉండదని వేమన భావన. లోభి యొక్క గుణములను వర్ణిస్తూ లోభిని ఆశించటం వృధా అని అన్నాడు. లోభిని అడగటం ఎలాంటిదంటే గొడ్డులావును పితికినట్లు, మేక మెడ చన్ను కుడిచినట్లు అని చెప్తూ అంతటితో తృప్తి పడక
గొడ్డుటావుఁ బితుకఁ గుండ గొంపోయిన
పండ్లు రాలఁదన్ను పాలనీదు
లోభివాని నడుగ లాభంబు లేదయా
అంటాడు. గొడ్డుపోయిన ఆవు వద్దకు పాలు పిండటానికి కుండ తీసుకు వెళ్లే పాలను ఇవ్వకపోగా పండ్లు రాలేటట్లు తంతుంది. అలానే లోభివానిని అడిగినా లాభముండదని వేమన చెప్పాడు.
ప్రశ్న 3.
అహింస గురించి వేమన అభిప్రాయం ఏమిటి ?
జవాబు:
వేమన కవిత్వము అను పాఠ్యభాగము ‘రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ’ వేమనపై చేసిన ఉపన్యాస పరంపరలోని “వేమన కవిత్వము, హాస్యము, నీతులు అను ఏడవ ఉపన్యాసము నకు సంక్షిప్తరూపము.
అహింస వేమనకు ఆరో ప్రాణం. ఒక జీవిని మరొక జీవి చంపటం ధర్మం కాదన్నాడు.
జీవి జీవిఁజంప శివుని జంంపుటె యగు
జీవుఁడరసి తెలియ శివుఁడె కాఁడె అంటాడు.
అలాగే పూర్వం యజ్ఞయాగాదుల యందు జరుగు బలులు హింస కాదని సమజంలోకి ఎక్కించారు. అది హింస కాక మరి ఏమౌతుందని వేమన వాదన. వేమనకు హింస మాత్రమే కాదు తన శత్రువును హింసించటానికి కూడా ఇష్టపడడు.
చంపఁదగినయట్టి శత్రువు తనచేత
చిక్కెనేని కీడు చేయరాదు
పొసఁగ మేలుచేసి పొమ్మనుటే చాలు
చంపదగిన శత్రువు మనచేతికి చిక్కినా వానికి కీడు చేయకూడదు. మనకు చేతనైన సహాయం చేసి వదిలిపెట్టటం కన్నా మేలు ధర్మములు ఏమీ ఉండవని వేమన భావన.
ప్రశ్న 4.
వేమన తెలిపిన దానగుణాన్ని వివరించండి.
జవాబు:
వేమన కవిత్వము అను పాఠ్యభాగము ‘రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ’ వేమనపై చేసిన ఉపన్యాస పరంపరలోని “వేమన కవిత్వము, హాస్యము, నీతులు అను ఏడవ ఉపన్యాసమునకు సంక్షిప్తరూపము.
దాన విషయంలో వేమనది స్పష్టమైన ఆలోచన. ఎవడు దానమును పుచ్చుకొనుటకు తగినవాడు అనిన పేదరికంతో ఉన్నవాడు దానమును స్వీకరించుటకు అర్హుడు అని అన్నాడు. అతడి కులము, జాతి, గుణములను కూడా ఆలోచించనవసరం లేదంటాడు. పేదరిక మొక్కటి ఉంటే చాలంటాడు.
“దోసకారియైన దూసరికాఁడైన
పగతుఁడైన వేదబాహ్యుండైన
వట్టిలేని పేదవాని కీఁదగు నీవి
ధనికునకు నొసంగఁదగదు వేమ”
పేదయైనవాడు దోషము చేసిన వాడైనా, తిరస్కరింపదగినవాడైనా, శత్రువు అయినా, వేదములు తెలియనివాడైనా, వానికి తప్పక దానమివ్వవలెనని వేమన ఆలోచన.
వేమనకు అన్నదానము కన్నా కన్యాదానము పట్ల అభిమానమెక్కువ. పూర్వం పేదవారికి పెళ్ళి అవటం కష్టంగా ఉండేది. అందువలనే కన్యాదానం కూడా పేదవారికే చేయాలని వేమన శాసించాడు.
ఏకవాక్య / పదరూప సమాధాన ప్రశ్నలు
ప్రశ్న 1.
వేమన కవిత్వము పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ.
ప్రశ్న 2.
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ ఎప్పుడు జన్మించారు ?
జవాబు:
జనవరి 23, 1893న జన్మించారు.
ప్రశ్న 3.
శర్మ గారి జన్మస్థలం ఏది ?
జవాబు:
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దగ్గరలోని రాళ్ళపల్లి గ్రామం.
ప్రశ్న 4.
రాళ్ళపల్లి తల్లిదండ్రులెవరు ?
జవాబు:
అలివేలు మంగ, కృష్ణమాచార్యులు.
ప్రశ్న 5.
రాళ్ళపల్లి తొలి గురువు ఎవరు ?
జవాబు:
ఆయన తండ్రి కృష్ణమాచార్యులు.
ప్రశ్న 6.
రాళ్ళపల్లి సంస్కృతాన్ని ఎక్కడ చదువుకున్నారు ?
జవాబు:
మైసూరులోని పరకాల మఠంలో.
ప్రశ్న 7.
రాళ్ళపల్లి తెలుగు పండితులుగా ఎక్కడ పని చేశారు ?
జవాబు:
మైసూరు మహారాజ కళాశాలలో పని చేశారు.
ప్రశ్న 8.
రాళ్ళపల్లి వారి విమర్శనా గ్రంథాలు ఏవి ?
జవాబు:
నిగమశర్మ అక్క, నాచన సోముని నవీన గుణములు, తిక్కన తీర్చిదిద్దిన సీతమ్మ, రాయలనాటి రసికత.
ప్రశ్న 9.
రాళ్ళపల్లి వ్యాసాలు ఏ పేరుతో ప్రచురించబడ్డాయి.
జవాబు:
సారస్వతా లోకము, నాటకోపన్యాసములు పేరుతో ప్రచురించబడ్డాయి.
ప్రశ్న 10.
రాళ్ళపల్లి వారి అనువాద గ్రంథాలేవి ?
జవాబు:
కాళిదాసు రఘువంశం, నృత్త రత్నావళి, శాలివాహన గాథా సప్తశతీ.
ప్రశ్న 11.
రాళ్ళపల్లి వారి ఖండ కావ్యాలేవి ?
జవాబు:
తారాబాయి, మీరాబాయి.
ప్రశ్న 12.
‘సారస్వతా లోకము’ ఎవరు వ్రాశారు ?
జవాబు:
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ.
ప్రశ్న 13.
రఘువంశాన్ని తెలుగులోకి అనువదించిన దెవరు ?
జవాబు:
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ.
ప్రశ్న 14.
రఘువంశాన్ని సంస్కృతంలో రచించినదెవరు ?
జవాబు:
కాళిదాసు.
ప్రశ్న 15.
వేమన పద్యాలలోని ఛందస్సు ఏది ?
జవాబు:
ఆటవెలది ఛందస్సు.
ప్రశ్న 16.
ప్రాచీన నాటకాలలో హాస్య పాత్ర ఏది ?
జవాబు:
విదూషకుడు.
ప్రశ్న 17.
దానమునకెవడు పాత్రడు ?
జవాబు:
పేదవాడు.
ప్రశ్న 18.
రాళ్ళపల్లి ఎవరి కీర్తనలకు స్వరకల్పన చేశారు ?
జవాబు:
అన్నమాచార్య కీర్తనలకు.
ప్రశ్న 19.
రాళ్ళపల్లికి డి.లిట్ పట్టానిచ్చిన విశ్వవిద్యాలయం ఏది ?
జవాబు:
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం.
ప్రశ్న 20.
రాళ్ళపల్లి అందుకున్న బిరుదులేవి ?
జవాబు:
గాన కళాసింధు, గాన కళానిధి, సంగీత కళారత్న.
ప్రశ్న 21.
కావ్యం పట్ల తెలుగువారిలో నెలకొన్న సిద్ధాంతం ఏమిటి ?
జవాబు:
‘కావ్యం యశసే అర్ధకృతే’ అన్న సిద్ధాంతం.
ప్రశ్న 22.
ఊరక కృతుల్ రచయింపుటమన్న శక్యమే ! ఇది ఎవరి మాట ?
జవాబు:
పెద్దన కవి మాట.
ప్రశ్న 23.
తెలుగు భాషకు మొదటిగా హాస్యరచనను అందించిన వారెవరు ?
జవాబు:
గురజాడ.
కవి పరిచయం
కవి పేరు : రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ
పుట్టిన తేదీ : జనవరి 23, 1893.
తల్లిదండ్రులు : అలివేలు మంగ, కృష్ణమాచార్యులు.
పుట్టిన ఊరు : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దగ్గరున్న రాళ్ళపల్లి గ్రామం.
విద్యాభ్యాసం : మైసూరులోని పరకాల మఠంలో సంస్కృత విద్య.
ఉద్యోగం : మైసూరు మహారాజ కళాశాలలో తెలుగు పండితులుగా.
రచనలు :
- వ్యాసాలు :
- నిగమశర్మ అక్క
- నాచన సోముని నవీన గుణములు
- తిక్కన తీర్చిదిద్దిన సీతమ్మ
- రాయల నాటి రసికత. .
- అనువాదాలు :
- రఘువంశాన్ని తెలుగులోకి అనువదించటం.
- నృత్త రత్నావళిని తెలుగులోకి అనువదించటం.
- శాలివాహన గాథాసప్తశతీసారము తెలుగులోకి అనువదించటం.
- ఖండ కావ్యాలు :
- తారాబాయి
- మీరాబాయి.
బిరుదులు, సత్కారాలు :
- గాన కళాసింధు,
- గాన కళానిధి,
- సంగీత కళారత్న,
- వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారిచే డి.లిట్ పట్టా బహూకరణ,
మరణం : మార్చి 11, 1979.
తెలుగువారిలో సంగీత సాహిత్యాలలో ప్రావీణ్యం ఉన్నవారు చాలా అరుదుగా ఉన్నారు. అలాంటి సవ్యసాచులలో రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ ఒకరు. వీరు జనవరి 23, 1893లో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దగ్గరలోని రాళ్ళపల్లిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు అలివేలు మంగమ్మ, కృష్ణమాచార్యులు. కృష్ణమాచార్యులు సాహిత్యం లోను, అలవేలు మంగమ్మ సంగీతంలోను మంచి అభినివేశం ఉన్నవారు. తల్లి నుండి సంగీతాన్ని తండ్రి నుండి సాహిత్యాన్ని ఔపోసన పట్టినవాడు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ.
శర్మగారి తొలిగురువులు వారి తల్లిదండ్రులే. వారివద్దే సంస్కృతాన్ని నేర్చారు. ఆ తరువాత మైసూరులోని పరకాల మఠంలో ఉన్నత సంస్కృతాన్ని నేర్చుకుని మైసూరు మహారాజ కళాశాలలోనే అధ్యాపకులుగా పనిచేశారు. తెలుగులో తొలి సామాజిక విమర్శకులు రాళ్ళపల్లి. అందుకు నిగమశర్మ అక్క నాచన సోముని నవీన గుణములు, తిక్కన తీర్చిదిద్దిన సీతమ్మ, రాయలనాటి రసికతలు ప్రబల నిదర్శనం. వీరి విమర్శనా వ్యాసాలు, సారస్వతాలోకము, నాటకోపన్యాసాలు, అన్న పేరుపై వచ్చాయి.
రాళ్ళపల్లి వారు సంస్కృతంలోని కాళిదాసు రఘువంశాన్ని తెలుగులోకి అనువదించారు. నృత్తరత్నావళి, శాలివాహన గాథాసప్తశతి సారములను తెలుగులోకి అనువదించారు. తారాబాయి మీరాబాయి వంటి ఖండ కావ్యాలను రచించారు.
శాస్త్రీయ సంగీతాన్ని నేర్చిన రాళ్ళపల్లి తి.తి.దే వారి కోరికపై కొన్ని అన్నమయ్య సంకీర్తనలను స్వరపరచారు. వివిధ సంస్థల నుండి ‘గానకళాసింధు, గాన కళానిధి’, సంగీత కళారత్న బిరుదులను పొందారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు డి.లిట్ డిగ్రీ ప్రదానం చేశారు.
మార్చి 11, 1979న కాలం చేశారు.
పాఠ్యభాగ సారాంశం
వేమన కవిత్వము అను పాఠ్యభాగం రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ వేమనపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1928లో చేసిన ఉపన్యాస పరంపరలో ఏడవ ఉపన్యాసం “వేమన కవిత్వము, హాస్యము, నీతులు” అను వ్యాసం నుండి గ్రహించబడింది.
వేమన ప్రజల కోసం కవిత్వాన్ని వ్రాశాడు. ఈయన తీవ్రములైన భావములు. అడులేని నాలుక గలవాడు. ఎవరికి భయపడనివాడు. ఆయన రచనలో భాష భావనలు ఉపతున ఎగసిపడుతుంటాయి. ఆ సమయంలో చంధస్సులు యతిప్రాసలు వాటంతట అవే పద్యంలో సర్దుకుంటాయి. ప్రాచీన కవులకు వలె సంస్కృత ఛాయలుగాని ఆధునిక కవులవలె ఆంగ్ల ఛాయలు గాని ఆయన రచనలలో ఉండవు. కేవలం తెలుగు భాషలో అందంగా, హాస్యంగా, సున్నితంగా, పాఠకుల హృదయాలలో ఉండే పద్యాలను వేమన వ్రాశాడు. గొప్పతాత్విక విషయాలను చెప్పేటప్పుడు కూడా వేమన ధార అట్లే ఉంటుంది. తాను చెప్పే ప్రతి విషయానికి ఒక ఉపమానాన్ని వాడతాడు. ఆ ఉపమానాలు కూడా ఊహా కల్పితాలు కాకుండా యింటి చుట్టు ముట్టుగల వస్తువులగుటచే ఆయన పద్యాలకు ఆదరణ లభించింది.
“పసుల వన్నెవేఱు పాలేక వర్ణమౌ
పుష్పజాతివేజు పూజయొకటి
దర్శనములు వేఱు దైవం బదొక్కటి”
ఇలాంటి ఉపమానాలు ఆయన పద్యాలన్నింటి యందు కన్పిస్తాయి.
వేమన కవిత్వానికి బలం చేకూర్చేది హాస్యము.
“పాలసాగరమున పవ్వళ్ళించువాడు
గొల్లయిండ్ల పాలు కోరనేల ?”
అన్న ప్రశ్న వేసి ఉపమానంగా ఒక హాస్య పాదాన్ని “ఎదుటివారి సొమ్ము లెల్లవారికి తీపు” అని హాస్యాన్ని నింపుతాడు.
లోభిని అడుగుట వలన ప్రయోజనం ఉండదని గొడ్డుటావును పితికినట్లు, మేక మెడ చన్ను కుడిచినట్లు అని ఊరుకోక “పండ్లు రాలఁదన్ను పాలనీదు” అని నవ్విస్తాడు.
దానగుణాన్ని వివరిస్తూ దానాన్ని స్వీకరించటానికి కులము, జాతి, గుణము అక్కర లేదు. పేదరికం అన్నింటికన్నా ముఖ్యం అంటాడు వేమన. హింస ధర్మం కాదు. యజ్ఞములలోని జీవహింస హింస కాదని సమర్థింపరాదంటాడు. వేమనకు ఈ హింసే కాదు శత్రువును కూడా హింసించకూడదంటాడు.
జీవి జీవి (జంప శివుని జంపుటే యగు అని
చంపఁదగినయట్టి శత్రువు తనచేత
చిక్కెనేని కీడు చేయరాదు,
పొస గ మేలుచేసి పొమ్మనుటే చాలు
అంటాడు. ఇది నిజమే కదా ! శత్రుత్వం చావవలసినది శత్రువు చావాలనుకోవటం ధర్మం కాదంటాడు.
వేమన పద్యాలు లోకంలో ఇంతకాలం ప్రజాదరణ పొందటానికి మరొక ముఖ్య కారణం ఆయన బోధించే నీతి.
“ఆలి మాటలు విని అన్నదమ్ముల రోసి
వేతా పోవువాఁడు వెట్టివాఁడు
కుక్కతోఁకబట్టి గోదావరీఁదునా ? ……… .
ధర్మాన్ని, తత్వాన్ని, నీతిని, పరమత ఖండనను ఇతర విషయాలను చెప్పినప్పటికి సరసత, సారళ్యం, ధార మొదలగునవి అంతటా విశేషంగా కన్పిస్తాయి. వేమన పద్యం యొక్క ఆకర్షణ శక్తి మరే ఇతర కవులెవ్వరి వద్ద కనపడదు.
కఠిన పదాలకు అర్థాలు
హేతువులు= కారణాలు
అభిరుచి = ఇష్టము
వెఱచి = భయపడి
త్రోవ = మార్గము
ద్రవ్యము = డబ్బు
ఇనాములు / అగ్రహారాలు
చెఱచునట్టి = రాజులిచ్చు భూదానాలు
ఎరుగడు = చెడగొట్టునట్టి
ఉపమానము = తెలిసికోడు
దుర్వారబలము = ఉదాహరణం
లోభి = గొప్పబలము
కుతిక = పిసినిగొట్టువాడు
ఉపకరించు = పీక
పేడితనము = ఉపయోగపడు
దుర్బలులు = మగతనం కాదు
ఆచంద్రార్కము = బలము లేనివారు
గొడ్డుటావు = సూర్యచంద్రులున్నంత వరకు
విదూషకుడు = పాలు ఇవ్వని ఆవు : హాస్యగాడు
ధీరులు = గొప్పవాడు
నైర్మల్యము = నిర్మలత్వం