నాన్నకోసం Questions and Answers Summary Inter 2nd Year Telugu

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Telugu Study Material Pdf పద్యభాగం 4th Poem నాన్నకోసం Questions and Answers Summary.

Inter 2nd Year Telugu నాన్నకోసం Questions and Answers

అభ్యాసము

I. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
“నాన్నకోసం” పాఠ్యభాగ సారాంశాన్ని వ్రాయండి.
జవాబు:
నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లవాడు తన తల్లి దగ్గరకు వచ్చి, “అమ్మా ! నాన్న ఎక్కడికి వెళ్ళాడు? చాలా రోజులైంది కదా ! ఇంకా ఎందుకు తిరిగిరాలేదు ? అని అమాయకంగా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. సమయంలో ఆ తల్లి మనసు తీవ్రమైన ఆందోళనతో ఉంది. ఎందుకంటే ఆమె భర్త దేశసరిహద్దులో (కాశ్మీర్) యుద్ధం చేస్తున్న సైనికుడు. కొడుకు అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక, ఆమె యాంత్రికంగానే పిల్లవాడి తలపై చేయి వేసి నిమురుతోంది.

ఆమె దృష్టంతా రేడియోలో వస్తున్న యుద్ధ వార్తలపైనే ఉంది. తన భర్త క్షేమ సమాచారం ఏమైనా తెలుస్తుందేమోననే చిన్న ఆశతో ఆమె వార్తలను వింటోంది. రేడియోలో యుద్ధవార్తలు వింటున్నప్పుడు ఆమె మనోఫలకంపై యుద్ధరంగ దృశ్యాలు కదలాడుతున్నాయి. శత్రువుల యుద్ధ విమానాలు ఎగురుతున్నట్లు, వాటి రెక్కల నీడలు ఆమె కళ్ళ ముందు కదులుతున్నట్లు అనిపిస్తోంది.

కాశ్మీరు సరిహద్దుల్లోని కఠినమైన చలిలో, పొగమంచు మధ్య దేశాన్ని కాపాలా కాస్తున్న తన భర్త రూపం ఆమె కళ్ళముందు కదలాడింది. శత్రువుల మధ్య భర్త క్షేమంగా ఉన్నాడో లేదోనని ఆమె మనసు ఒక్కసారిగా కంగారుపడింది. (కళవళపడింది). కానీ అంతలోనే దేశరక్షణ కోసం పోరాడుతున్న ఒక వీరసైనికుడి భార్యననే అమితమైన గౌరవం, ఒక చిన్న గర్వపు గీత ఆమె పెదవులపై చిరునవ్వుగా మారింది.

దేశంకోసం ప్రాణాలర్పించిన, పేరు తెలియని లక్షలాది మంది అజ్ఞాత సైనికులకు దేశంలోని పిల్లలనుండి పెద్దల వరకు (ఆబాలగోపాలం) అందరూ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆ రోజు కూడా ఆమె ఎప్పటిలాగే తన కుమారుడిని తీసుకుని పార్కుకు వచ్చింది. ఎప్పటిలాగే తెల్లటి చీర కట్టుకుంది. కానీ, నుదుట ఎర్రటి బొట్టులేదు. ఆమె భర్త యుద్ధంలో వీరమరణం పొందాడని ఆమె ఆహార్యం సూచిస్తోంది.

భర్త మరణ వార్త విన్న తరువాత ఆమె ఎంతో ఏడ్చింది. ఇప్పుడు ఆమె కన్నీళ్ళు ఆగిపోయాయి. వానపడి వెలిసిన తర్వాత ఆకాశం ఎలాగైతే ఎంతో ప్రశాంతంగా, శూన్యంగా కనిపిస్తుందో, ఆమె కళ్ళు కూడా అలాగే ఉన్నాయి.

భర్తమరణ వార్త విన్న ఆమె దు:ఖాన్ని దిగమింగుకుంటూ, వణుకుతున్న తన పెదవులను పంటితో నొక్కి పెట్టి బాధను భరిస్తోంది. పార్కులో చేరిన ప్రజలంతా దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులను స్మరిస్తూ “జైహింద్” అని గట్టిగా నినాదాలు చేశారు. అప్పుడు ఆ తల్లి “అమ్మా…. నాన్న ఎప్పుడు వస్తాడు ?” అని అడుగుతున్న తన నాలుగేళ్ళ కొడుకును గుండెలకు హత్తుకుంది. ఎంతో బాధతో నిండిన హృదయంతో ఆమె కూడా మెల్లగా “జైహింద్” అని పలికింది.

నాన్నకోసం Questions and Answers Summary Inter 2nd Year Telugu

II. సంక్షిప్తరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
నాన్నకోసం కవితలో తల్లి స్పందనను తెలపండి.
జవాబు:
నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లవాడు తన తల్లి దగ్గరకు వచ్చి, “అమ్మా ! నాన్న ఎక్కడికి వెళ్ళాడు? చాలా రోజులైంది కదా ! ఇంకా ఎందుకు తిరిగిరాలేదు ? అని అమాయకంగా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. సమయంలో ఆ తల్లి మనసు తీవ్రమైన ఆందోళనతో ఉంది. ఎందుకంటే ఆమె భర్త దేశసరిహద్దులో (కాశ్మీర్) యుద్ధం చేస్తున్న సైనికుడు. కొడుకు అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక, ఆమె యాంత్రికంగానే పిల్లవాడి తలపై చేయి వేసి నిమురుతోంది.

ఆమె దృష్టంతా రేడియోలో వస్తున్న యుద్ధ వార్తలపైనే ఉంది. తన భర్త క్షేమ సమాచారం ఏమైనా తెలుస్తుందేమోననే చిన్న ఆశతో ఆమె వార్తలను వింటోంది.

కాశ్మీరు సరిహద్దుల్లోని కఠినమైన చలిలో, పొగమంచు మధ్య దేశాన్ని కాపాలా కాస్తున్న తన భర్త రూపం ఆమె కళ్ళముందు కదలాడింది. శత్రువుల మధ్య భర్త క్షేమంగా ఉన్నాడో లేదోనని ఆమె మనసు ఒక్కసారిగా కంగారుపడింది. (కళవళపడింది). లోలోపల ఒక నిట్టూర్పు విడిచి, తనను తాను సమాధాన పరుచుకుంటూ పైట సరిచేసుకుంది. కానీ అంతలోనే దేశరక్షణ కోసం పోరాడుతున్న ఒక వీరసైనికుడి భార్యననే అమితమైన గౌరవం, ఒక చిన్న గర్వపు గీత ఆమె పెదవులపై చిరునవ్వుగా మారింది. AP* Sr. Inter* తెలుగు ??

ప్రశ్న 2.
నాన్నకోసం కవితలో సైనికుడి భార్య ఆవేదన తెలపండి.
జవాబు:
దేశంకోసం ప్రాణాలర్పించిన, పేరు తెలియని లక్షలాది మంది అజ్ఞాత సైనికులకు దేశంలోని పిల్లలనుండి పెద్దల వరకు (ఆబాలగోపాలం) అందరూ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

భర్త మరణ వార్త విన్న తరువాత ఆమె ఎంతో ఏడ్చింది. ఇప్పుడు ఆమె కన్నీళ్ళు ఆగిపోయాయి. వానపడి వెలిసిన తర్వాత ఆకాశం ఎలాగైతే ఎంతో ప్రశాంతంగా, శూన్యంగా కనిపిస్తుందో, ఆమె కళ్ళు కూడా అలాగే ఉన్నాయి. ఆ కళ్ళల్లో భర్తను కోల్పోయిన అమితమైన దుఃఖం, గుండె నిండా నిశ్శబ్దం, దేశం కోసం భర్త చేసిన త్యాగానికి సంబంధించిన ఒక గంభీరమైన ప్రశాంతత కనిపిస్తున్నాయి.

భర్త మరణ వార్త విన్న ఆమె దుఃఖాన్ని దిగమింగుకుంటూ, వణుకుతున్న తన పెదవులను పంటితో నొక్కి పెట్టి బాధను భరిస్తోంది. పార్కులో చేరిన ప్రజలంతా దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులను స్మరిస్తూ “జైహింద్” అని గట్టిగా నినాదాలు చేశారు. ఎంతో బాధతో నిండిన హృదయంతో ఆమె కూడా మెల్లగా “జైహింద్” అని పలికింది.

నాన్నకోసం Questions and Answers Summary Inter 2nd Year Telugu

III. ఏకవాక్యరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
జాతికి మతావేశం పొదిగితే ఏమవుతుంది ?
జవాబు:
జాతికి మతావేశం పొదిగితే కోతి అవుతుంది.

ప్రశ్న 2.
పాకిస్తాన్ – చైనా మైత్రి ఎలాంటిది ?
జవాబు:
పాకిస్తాన్ – చైనా మధ్య మైత్రి పాము, తోడేలు కలయిక లాంటిది.

ప్రశ్న 3.
పార్కులో చేరిన గుంపులు ఏమని నినాదం చేశారు ?
జవాబు:
పార్కులో చేరిన గుంపులు “జైహింద్” అన్న నినాదం చేశారు.

ప్రశ్న 4.
నాలుగేళ్ళ పిల్లవాడు తల్లిని ఏమని ప్రశ్నించాడు ?
జవాబు:
నాలుగేళ్ళ పిల్లవాడు తల్లిని “అమ్మా! నాన్న ఎక్కడికి వెళ్ళాడు ? ఇంకా రాడేం?” అని ప్రశ్నించాడు.

ప్రశ్న 5.
‘నాన్నకోసం’ పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
‘నాన్నకోసం’ పాఠ్యభాగ రచయిత “దేవరకొండ – బాలగంగాధర తిలక్”.

ప్రశ్న 6.
‘నాన్నకోసం’ పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి గ్రహించబడింది ?
జవాబు:
“నాన్నకోసం’ పాఠ్యభాగం “అమృతం కురిసిన రాత్రి” అనే వచన కవితా సంపుటి నుండి గ్రహించబడింది.

నాన్నకోసం Questions and Answers Summary Inter 2nd Year Telugu

IV. సందర్భసహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
ఆమె కళ్ళ ముందు నిలిచాడు.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవి “దేవరకొండ బాలగంగాథర తిలక్ చే రచించబడిన “అమృతం కురిసిన రాత్రి” వచన కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
సందర్భం : భారత్ – పాకిస్తాన్ యుద్ధ సందర్భంగా సైనికుని భార్య స్పందనను గూర్చి కవి వర్ణించుచున్న వాక్యమిది.
భావం : సైనికుడు దేశసరిహద్దుల్లో యుద్ధం చేస్తున్నాడు. అతడి భార్య దృష్టంతా ఇక్కడ రేడియోలో వస్తున్న వార్తలపైనే ఉంది. యుద్ధరంగంలో జరుగుతున్న దృశ్యాలన్నీ ఆమె కళ్ళముందు కదులుతుండగా మనసు అలజడి చెందగా, కాశ్మీరు సరిహద్దుల్లో కఠినమైన చలిలో, పొగమంచు మధ్య దేశాన్ని కాపాలాకాస్తున్న తన భర్త రూపం ఆమె కళ్ళముందు కదలాడగా ఆమె మనసు భర్త క్షేమాన్ని గురించి ఒక్కసారిగా కంగారుపడిందని వాక్య భావము (కవి తెలిపెనని భావము).

ప్రశ్న 2.
నిర్ణిద్ర హర్యక్షమై జాతి నిలబడి గర్జించింది.
జవాబు:
కవి పరిచయం :ఈ వాక్యం కవి “దేవరకొండ బాలగంగాథర తిలక్” చే రచించబడిన “అమృతం కురిసిన రాత్రి” వచన కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
సందర్భం : భారత సైనికులు శత్రువులపై విజయం సాధించిన సమయంలో భారతీయుల హర్షాన్ని కవి వర్ణించు సందర్భంలోనిది – ఈ వాక్యము. భావం : మన వీర భారత సైనికులు సముద్రపు అలల్లా విరుచుకుపడి శత్రువులను అణచివేశారు. ఆ విజయంతో దేశమంతా నిద్రలేని కళ్ళతో, గర్వంతో ఒకే తాటిపై నిలబడి సింహంలా గర్జించిందని వాక్యభావము (కవి తెలిపెనని భావము)

ప్రశ్న 3.
ఒక వీరునికి హాయిగా, తీయగా వినపడింది.
జవాబు:
కవి పరిచయం : ఈ వాక్యం కవి “దేవరకొండ బాలగంగాథర తిలక్” చే రచించబడిన “అమృతం కురిసిన రాత్రి” వచన కవితా సంపుటి నుండి గ్రహించబడింది.
సందర్భం : సైనికుడి భార్య ఆవేదనను గూర్చి కవి వర్ణించిన సందర్భంలోనిది ఈ వాక్యం.
భావం : తన బాధను అణచివేస్తూ, జనసమూహంతో కలిసి సైనికుడి భార్య ‘జైహింద్’ అని నినాదం చేయగా ఆ మాట స్వర్గంలో ఒక వీరునికి (ఆమె భర్తకు) హాయిగా, తీయగా వినపడిందని వాక్యభావము (కవి తెలిపెనని భావము).

నాన్నకోసం Questions and Answers Summary Inter 2nd Year Telugu

విశేషాంశాలు

భారత్ – పాక్ యుద్ధాలు:

1947 దేశవిభజన మొదలు పాకిస్తాన్ భారతదేశంపై దాడులు, ఉగ్రవాద దాడులను ప్రోత్సహించడం, ఏర్పాటువాదాన్ని సమర్థించడం లాంటి చర్యలు నిరంతరం చేస్తూనే ఉంది.

  1. 1947 – 48 : మొదటిసారి కాశ్మీర్ విషయంలో భారత్ – పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగింది.
  2. 1965 : కాశ్మీరు కాపాడుకోవడం కోసం రెండోసారి భారత్ – పాకిస్తాన్ పై యుద్ధం చేయవలసి వచ్చింది.
  3. 1971 : మూడవసారి జరిగిన యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ ప్రాంతం విషయంపై భారత్ – పాకిస్తాన్ను ఓడించి బంగ్లాదేశ్ను ఏర్పరిచింది.
  4. 1999: కాశ్మీర్లో చొరబడిన పాకిస్తాన్ చొరబాటుదారులను వెనుకకు తరిమివేయడానికి నాల్గవసారి భారత్ – పాకిస్తాన్పై ‘కార్గిల్’ యుద్ధం చేసింది.

1965 సెప్టెంబర్ నెలలో జరిగిన భారత్ – పాకిస్తాన్ యుద్ధంలో భారతసైన్యం వీరోచితంగా పోరాడి సరిహద్దు దాటి వెళ్ళి సెప్టెంబర్ 6న లాహోర్న చుట్టుముట్టింది. 17 రోజులపాటు జరిగిన ఈ యుద్ధంలో భారత్-పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పింది.

నాన్నకోసం Questions and Answers Summary Inter 2nd Year Telugu

నాన్నకోసం Summary in Telugu

కవి పరిచయం

“గాలి మూగదయి పోయింది
పాట బూడిదయి పోయింది.
‘వయస్సు సగం తీరకముందే
అంతరించిన ప్రజాకవి
వయస్సు సగం చేరకముందే
అస్తమించిన భారవి”………….

వివరణ : తిలక్ గారు కేవలం 44 సంత్సరాల చిన్న వయసులోనే మరణించారు. ఆయన అకాలమరణానికి కలత చెందిన మహాకవి “శ్రీశ్రీ” ఈ విధంగా నివాళు లర్పించారు. తిలక్ మరణం తో “కవిత్వపు గాలి” మూగపోయింది. ఆయన పాడే అమృత గీతం బూడిదైపోయింది. నిండు వయస్సు రాకముందే, జీవితంలో సగభాగం కూడా తీరకముందే ప్రజలహృదయాలను గెలుచుకున్న ఈ ప్రజాకవి అంతమైపోయాడు. సంస్కృతంలో గొప్ప కావ్యాన్ని రాసిన ‘భారవి’ కవి కవితా ప్రతిభ గల తిలక్, తన వయసు సగం కూడా చేరకముందే అస్తమించాడు (మరణించాడు) అని శ్రీశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు.

“దేవరకొండ బాలగంగాధర తిలక్” జీవిత విశేషాలు : దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలంలోని మండపాక గ్రామంలో 1921 ఆగస్టు 1వ తేదీన జన్మించారు. తల్లిదండ్రులు సత్యనారాయణ మూర్తి, రామసోదెమ్మ. తిలక్ పాఠశాల విద్య తణుకులో సాగింది. ఇంటర్మీడియట్ విద్య సగంలో ఆగిపోయింది.

కవితాశైలి : తిలక్ ఎంత సుకుమారుడో అతని కవిత అంత నిశితమైనది. తిలక్ మొదట భావకవుల ప్రభావంతో గోరువంకలు, స్వయంవరం, మధురవిరహం మొదలైన ఖండకావ్యాలు రచించినప్పటికీ ఆధునిక జీవితాన్ని అభివర్ణించడానికి వచన గేయాన్ని ఎన్నుకున్నాడు. మనకు వీధులలో తారసిల్లె బిచ్చగాళ్ళు, అనాథలు, అశాంతులు, పడుపు గత్తెలు, చీకటిబజారు చక్రవర్తులు, దగాపడ్డ తమ్ముళ్ళు, ఇంకా ఎందరినో ఆయన పాత్రలుగా తీసుకొని అసలు వేషాలలో పాఠకుల ముందు నిలబెడతాడు. తిలక్ రచనల్లో “అమృతం కురిసిన రాత్రి” అనే వచన కవితాసంపుటి నుండి గ్రహించబడింది.

పాఠ్యభాగ ఉద్దేశ్యం

యుద్ధాలు ప్రతికూల వాతావరణాలు సృష్టిస్తాయి. వార్తా పత్రికల్లో, రేడియోల్లో యుద్ధబీభత్సాలు విన్న కవి తిలక్ ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలు పడే ఆవేదనను చూసి చలించిపోయాడు. తన భావావేశానికి కవితారూపమిచ్చాడు. కఠిన వాస్తవాలను కళ్లముందుంచాడు. వీరసైనికుల త్యాగానికి అక్షరంతో అమరత్వాన్ని అందించాడు. విద్యార్థుల్లో దేశభక్తిని కలుగచేయడం ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశ్యం.

నాన్నకోసం Questions and Answers Summary Inter 2nd Year Telugu

పాఠ్యభాగ నేపథ్యం

నాలుగు సంవత్సరాల వయసు కలిగిన పిల్లవాడు తల్లిని నాన్న ఎక్కడికి వెళ్ళాడు, ఇంకా ఎందుకు రాలేదని ప్రశ్నిస్తాడు. ఆ సమయంలో రేడియో వార్తలు వింటున్న తల్లి గుండెల్లో యుద్ధ వాతావరణం అలుముకుంది. కాశ్మీర్లో యుద్ధం చేస్తున్న భర్త ఆమె కళ్లముందు కనిపించాడు.

ఆమె రోజూ వార్తల కోసం ఆ పార్కుకి వస్తుంది. రేడియోలో వార్తలు వింటుంది. జాతుల మధ్య మతదురహంకారం వైషమ్యాలను సృష్టిస్తుంది. భారత్, పాకిస్తాన్ పై చేస్తున్న యుద్ధం సాధారణమైనది కాదు, ప్రపంచంలో విలువలను కాపాడటానికి చేసే ప్రయత్నం. భారతదేశం లాహెర్ పై చేసే యుద్ధాన్ని, సైన్యం చూపే ధైర్య సాహసాలను జాతి అంతా మెచ్చుకొని కృతజ్ఞతలు తెలియజేసింది.

యుద్ధంలో భర్త మరణించడం వలన ఆమె సర్వస్వాన్ని కోల్పోయానన్న బాధతో పార్కుకు వచ్చింది. ఆ రోజు యుద్ధంలో భారత సైన్యం చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్కడ సమూహంతో పాటు సైనికుని భార్య కూడా కుమారుని కౌగిలించుకుంటూ జైహింద్ అని పలికింది.

కవితావాక్యాలు

అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా రాడేం?
అని అడిగాడు నాలుగేళ్ళ పిల్లవాడు మరోసారి –
అలవోకగా, వాడి తల నిమురుతూ ఆమె అలాగే
ఆశతో వింటోంది రేడియోలో వార్తలు
ఆమె కళ్ళల్లో విమానాల రెక్కలు కదలిన నీడలు
ఆమె గుండెల్లో మర ఫిరంగులు పేలిన జాడలు….

భావము : నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లవాడు తన తల్లి దగ్గరకు వచ్చి, “అమ్మా ! నాన్న ఎక్కడికి వెళ్ళాడు? చాలా రోజులైంది కదా ! ఇంకా ఎందుకు తిరిగిరాలేదు ? అని అమాయకంగా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. ఆ సమయంలో ఆ తల్లి మనసు తీవ్రమైన ఆందోళనతో ఉంది. ఎందుకంటే ఆమె భర్త దేశసరిహద్దులో (కాశ్మీర్) యుద్ధం చేస్తున్న సైనికుడు. కొడుకు అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక, ఆమె యాంత్రికంగానే పిల్లవాడి తలపై చేయి వేసి నిమురుతోంది.

ఆమె దృష్టంతా రేడియోలో వస్తున్న యుద్ధ వార్తలపైనే ఉంది. తన భర్త క్షేమ సమాచారం ఏమైనా తెలుస్తుందేమోననేచిన్న ఆశతో ఆమె వార్తలను వింటోంది. రేడియోలో యుద్ధవార్తలు వింటున్నప్పుడు ఆమె మనోఫలకంపై యుద్ధరంగ దృశ్యాలు కదలాడుతున్నాయి. శత్రువుల యుద్ధ విమానాలు ఎగురుతున్నట్లు, వాటి రెక్కల నీడలు ఆమె కళ్ళ ముందు కదులుతున్నట్లు అనిపిస్తోంది. యుద్ధరంగంలో శత్రువులపైకి పేలుస్తున్న ఫిరంగుల భీకరశబ్దాలు, ఆ బాంబులు పేలుళ్ళు నేరుగా తన గుండెల్లోనే జరుగుతున్నంతగా ఆమె భయాందోళనలకు గురవుతోంది. భర్త ప్రాణాలకు ఏ మవుతుందోననే భయం ఆమె గుండెల్లో అలజడి రేపుతోంది.

కాశ్మీర్ సరిహద్దుల్లో పొగలమధ్య కాలూని నిల్చున్న సైనికుడు.
ఆమె కళ్ళ ముందు నిలిచాడు.
ఆమె కళవళపడింది – నిట్టూర్చింది పైట సరిచేసుకుంది.
అంతలో మృదు గర్వ రేఖ ఆమె పెదాల చిరునవ్వుతో కలిసి పోయింది….

భావము : కాశ్మీరు సరిహద్దుల్లోని కఠినమైన చలిలో, పొగమంచు మధ్య దేశాన్ని కాపాలా కాస్తున్న తన భర్త రూపం ఆ తల్లి కళ్ళముందు కదలాడింది. శత్రువుల మధ్య భర్త క్షేమంగా ఉన్నాడో లేదోనని ఆమె మనసు ఒక్కసారిగా కంగారుపడింది. (కళవళపడింది). లోలోపల ఒక నిట్టూర్పు విడిచి, తనను తాను సమాధాన పరుచుకుంటూ పైట సరిచేసుకుంది. కానీ అంతలోనే దేశరక్షణ కోసం పోరాడుతున్న ఒక వీరసైనికుడి భార్యననే అమితమైన గౌరవం, ఒక చిన్న గర్వపు గీత ఆమె పెదవులపై చిరునవ్వుగా మారింది.

నాన్నకోసం Questions and Answers Summary Inter 2nd Year Telugu

… ఆమె రోజూ వస్తుంది పార్కులోకి వార్తల కోసం.
అల్లాగే తెల్లని చీర కట్టుకొని యెర్రని బొట్టు పెట్టుకుని
నల్లని వాల్జెడలో తెల్లని సన్నజాజులు తురుముకొని….
………….జాతికి మతావేశం పొదిగితే కోతి అవుతుంది
పాకిస్తాన్ చైనాల మధ్య మైత్రి, పామూ తోడేలూ కలిసినట్టు
ఇది రెండు దేశాల మధ్య యుద్ధమే కాదు….
ప్రపంచ భవితవ్యానికి ప్రధానమైన విలువల్ని కాపాడే ప్రయత్నం ఇది…….

భావము : ఆమె ప్రతిరోజూ రేడియోలో దేశ సరిహద్దు వార్తలను వినడం కోసం పార్కుకు వస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో ఆమె తెల్లటి చీర కట్టుకుని, నుదుటన ఎర్రటిబొట్టు పెట్టుకుని, తన నల్లని జడలో తెల్లటి సన్నజాజులు ముడుచుకొని ఎంతో లక్షణంగా, అందంగా వచ్చేది.

ఏదైనా ఒక జాతికి మతావేశం (మతపిచ్చి) తలకెక్కితే, అది విచక్షణ కోల్పోయి కోతిలా ప్రవర్తిస్తుంది. ఆనాడు పాకిస్తాన్, చైనాల మధ్య కుదిరిన స్నేహం ఎలాంటిదంటే…. పాము, తోడేలు కలసినట్లుగా అత్యంత ప్రమాదకరమైనది. ఈ యుద్ధం కేవలం రెండు దేశాల సరిహద్దుల మధ్య జరుగుతున్న పోరాటం మాత్రమే కాదు. ఇది ప్రపంచ భవిష్యత్తుకు అవసరమైన శాంతి, న్యాయం, మానవీయ విలువలను కాపాడటానికి భారత్ చేస్తున్న ధర్మపోరాటం.

…….. శత్రువుల టాంకులు విమానాలు యెన్నో కూలిపోయాయి
సాహసోపేతమైన భారత సైన్య తరంగం
లాహెూర్ సరిహద్దుల మీద విరుచుకు పడింది.
నిర్ణిద్ర హర్యక్షమై జాతి నిలబడి గర్జించింది

భావము : మన వీరభారత సైనికులు సముద్రపు అలల తరంగాల్లా ఉవ్వెత్తున లేచి శత్రువులపై విరుచుకుపడ్డారు. శత్రుదేశానికి చెందిన ఎన్నో యుద్ధ ట్యాంకులను, విమానాలను కూల్చివేస్తూ, లాహోర్ సరిహద్దుల వరకు దూసుకువెళ్ళారు. ఆ విజయంతో దేశమంతా నిద్రలేని కళ్ళతో, గర్వంతో ఒకే తాటిపై నిలబడి సింహంలా గర్జించింది.

……….. లక్షలాది అజ్ఞాత సైనికులకాబాలగోపాలం కృతజ్ఞతాంజలి సమర్పించింది.
ఆమె ఆరోజు కూడా కొడుకుతో పార్కుకి వచ్చింది
అలాగే తెల్లచీర కట్టుకుందిగాని యెర్రని బొట్టులేదు…
……………ఆమె సోగకన్నులలో వాన కురిసి వెలిసిన ఆకాశం స్ఫురించింది

భావము : దేశంకోసం ప్రాణాలర్పించిన, పేరు తెలియని లక్షలాది మంది అజ్ఞాత సైనికులకు దేశంలోని పిల్లలనుండి పెద్దల వరకు (ఆబాలగోపాలం) అందరూ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆ రోజు కూడా ఆమె ఎప్పటిలాగే తన కుమారుడిని తీసుకుని పార్కుకు వచ్చింది. ఎప్పటిలాగే తెల్లటి చీర కట్టుకుంది. కానీ, నుదుట ఎర్రటి బొట్టులేదు. ఆమె భర్త యుద్ధంలో వీరమరణం పొందాడని ఆమె ఆహార్యం సూచిస్తోంది.

భర్త మరణ వార్త విన్న తరువాత ఆమె ఎంతో ఏడ్చింది. ఇప్పుడు ఆమె కన్నీళ్ళు ఆగిపోయాయి. వానపడి వెలిసిన తర్వాత ఆకాశం ఎలాగైతే ఎంతో ప్రశాంతంగా, శూన్యంగా కనిపిస్తుందో, ఆమె కళ్ళు కూడా అలాగే ఉన్నాయి. ఆ కళ్ళల్లో భర్తను కోల్పోయిన అమితమైన దుఃఖం, గుండె నిండా నిశ్శబ్దం, దేశం కోసం భర్త చేసిన త్యాగానికి సంబంధించిన ఒక గంభీరమైన ప్రశాంతత కనిపిస్తున్నాయి.

నాన్నకోసం Questions and Answers Summary Inter 2nd Year Telugu

ఆమె చీటికి మాటికి అదిరే పెదవిని మునిపంట నొక్కుతోంది
అక్కడ చేరిన గుంపులు “జైహింద్” అన్న నినాదం చేసారు
అమ్మా, నాన్న…… అని అడుగుతున్న కుమారుణ్ణి అక్కున చేర్చుకుని
ఆమె కూడా బాధాతప్త హృదయంతో “జైహింద్” అని మెల్లగా పలికింది
ఆ మాట స్వర్గంలో ఒక వీరునికి హాయిగా, తీయగా వినపడింది.

భావము : భర్తమరణ వార్త విన్న ఆమె దు:ఖాన్ని దిగమింగుకుంటూ, వణుకుతున్న తన పెదవులను పంటితో నొక్కి పెట్టి బాధను భరిస్తోంది. పార్కులో చేరిన ప్రజలంతా దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులను స్మరిస్తూ “జైహింద్” అని గట్టిగా నినాదాలు చేశారు. అప్పుడు ఆ తల్లి “అమ్మా…. నాన్న ఎప్పుడు వస్తాడు ?” అని అడుగుతున్న తన నాలుగేళ్ళ కొడుకును గుండెలకు హత్తుకుంది. ఎంతో బాధతో నిండిన హృదయంతో ఆమె కూడా మెల్లగా “జైహింద్” అని పలికింది.

ఆ మాట దేశం కోసం అమరుడై స్వర్గంలో ఉన్న ఆమె భర్తకు (ఆ వీరునికి) ఎంతో హాయిగా, తీయగా వినిపించింది.

Leave a Comment