सङ्कल्पदृढता Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Sanskrit Study Material Pdf उपवाचकम् 3rd Lesson सङ्कल्पदृढता Questions and Answers Summary.

Inter 2nd Year Sanskrit सङ्कल्पदृढता Questions and Answers

अभ्यासः

प्रश्नाः

प्रश्न १.
पथिकः केन श्रान्तः ?
(బాటసారి దేనివల్ల అలసిపోయాడు)
(By what (or why) was the traveler tired?)
जवाब:
पथिकः दूरप्रयाणेन श्रान्तः ।
బాటసారి దూరప్రయాణం వల్ల అలసిపోయాడు. (The traveler was tired due to a long journey.)

प्रश्न २.
इन्द्रः पथिकाय किं ददाति ?
(ఇంద్రుడు బాటసారికి ఏమి ఇస్తున్నాడు ?) (What does Indra give to the traveller?
जवाब:
इन्द्रः पथिकाय अमृतपात्रं ददाति ।
ఇంద్రుడు బాటసారికి అమృత పాత్రను ఇస్తున్నాడు.
(Indra gives a vessel of nectar (Amrita) to the traveler.)

प्रश्न ३.
देवनाम् अधिपः कः ?
(దేవతలకు అధిపతి ఎవరు ?)
(Who is the lord of the gods ?)
जवाब:
देवनाम् अधिपः इन्द्रः ।
దేవతలకు అధిపతి ఇంద్రుడు.
(Indra is the lord of the gods.)

प्रश्न ౪.
निःस्प्रुस्य तृणं किम् ?
(కోరికలు లేనివానికి గడ్డిపోచతో సమానమైనది ఏది ?)
What is like a blade of grass to one who has no desires ?)
जवाब:
निःस्प्रुस्य तृणं जगत् ।
కోరికలు లేనివానికి ఈ జగత్తు లేదా అమృతం గడ్డిపోచతో సమానం.
To one who is desireless, the world (or even nectar) is like a blade of grass.

सङ्कल्पदृढता Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

सङ्कल्पदृढता Summary in Telugu & English

पाठ्यभाग परिचयः

“सङ्कल्प दृढता” च इत्ययं पाठ्यभागः “नवरुपकम्” इत्यस्मात् ग्रन्थात् स्वीकृतः । ग्रन्थेऽस्मिन् बालानां कृते नैतिक जीवनं यापयितुम् उपयुक्तानि रूपकाणि विद्यन्ते । ग्रन्थस्यास्य रचयिता जनार्दन हेगडे महाभागः। अयं महोदयः संस्कृतभारत्याः उद्यमारम्भकेषु अन्यतमः। नैकानि पुस्तकानि रचितवान्, अनेकाभिः संस्थाभिः पुरस्कृतः अयं विद्वान्। अधुना ‘“सम्भाषणसन्देशः” इति संस्कृतमासपत्रिकायाः सम्पादकः भूत्वा बेंगलूरु नगरे वसति । राष्ट्रियसंस्कृत विद्यापीठेन ‘वाचस्पति’ पुरस्कारेण सभाजितोऽयं महाभागः ।

“సంకల్ప దృఢతా” అనే ఈ పాఠ్యభాగం “నవరూపకమ్” అనే గ్రంథం నుండి తీసుకోబడింది. ఈ గ్రంథంలో పిల్లలు నైతిక జీవితాన్ని గడపడానికి ఉపయోగపడే నాటకాలు (రూపకాలు) ఉన్నాయి. ఈ గ్రంథం యొక్క రచయిత జనార్దన హెగ్దేగారు.

ఈ మహానుభావుడు సంస్కృతభారతి మార్గదర్శకులలో ఒకరు. వీరు ఎన్నో పుస్తకాలు రచించారు. మరియు అనేక సంస్థలచే పురస్కారాలు అందుకున్నారు.

ఈ పండితుడు ప్రస్తుతం “సంభాషణ సందేశః” అనే సంస్కృత మాసపత్రికకు సంపాదకులుగా ఉంటూ బెంగుళూరు నగరంలో నివసిస్తున్నారు.

వీరు రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం చేత “వాచస్పతి” అనే పురస్కారంతో సత్కరించబడ్డారు.

This lesson titled “Sankalpadridhata” is taken from the book “Nava Rupakam”.

This book contains plays (Rupakas) that are useful for children to lead a moral life. The author of this book is Shri Janardana Hegde. This gentleman is one of the prominent guides of “Samskrita Bharathi”

He has written several books and has been honored by numer- ous organizations. This scholar is currently the editor of the sanskrit monthly magazine “Sambhashana Samdesha” and resides in Bengalore.

This distinguished person has been honored with the “vachaspati” award by the Rastriya sanskrit vidyapeetha.

पाठ्यांशः

(अरण्यप्रदेशः । कश्चन सात्त्विकः पुरुषः गच्छन् अस्ति । तस्य स्कन्धे दण्डः । पृष्ठतः दण्डस्य अन्ते वस्त्राणां बन्धः । दूरप्रयाणेन श्रान्तः सः उत्तरीयेण स्वेदं मार्जयति ।)

(అడవి ప్రాంతంలో ఒక సాత్విక గుణమున్న వ్యక్తి వెళ్తున్నాడు. అతని భుజంపై కర్ర ఉన్నది. వెనుకవైపున ఆ కర్ర చివర బట్టల మూట కట్టబడి ఉంది. దూరప్రయాణం కారణంగా అలసిపోయిన అతను, తన ఉ త్తరీయంతో (పై వస్త్రంతో) చెమటను తుడుచుకుంటున్నాడు.)

(A forest area : A virtuous / simple man is walking). There is a staff ( stick) on his shoulder.

At the back, a bundle of clothes is tied to the end of the staff. Tired from the long journey, he is wiping sweat with his upper garment.

पथिकः : अहो उष्णता ! असह्यः खलु चण्डातपः । क्षामपीडिता भूमिः इयम् । कीदृशी दुरवस्था मम ! तीर्थक्षेत्राणि अटन् अहं ह्यः सूर्यास्तसमये मार्गभ्रष्टः अभवम् । अग्रे गच्छन् अहं मरुभूमिं प्रविष्टवान् । आरात्रि अटन् कथञ्चित् मरुभूमिम् अतिक्रम्य अत्र आगतवान् अस्मि । अत्रापि किं पश्यमि ? सर्वत्र क्षामः । शुष्काः वृक्षाः । शुष्काः नद्यः । न प्राणिनां कोलाहलः, न पक्षिणां कलरवः । अहो, बलवती पिपासा बाधते माम् । जलार्थं कुत्र गच्छेयम् ? कां दिशम् अनुसरेयम् ?

పథికః, (బాటసారి) : ఆహా ! ఎంతవేడి ! ఎండ మంట నిజంగా భరించలేనట్లుగా ఉంది. ఈ భూమి కరువుతో పీడించబడుతోంది. నా పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో కదా! తీర్థయాత్రలు చేస్తూ తిరుగుతున్న నేను, నిన్న సూర్యస్తమయ సమయంలో దారి తప్పిపోయాను. ముందుకు వెళ్తూ నేను ఎడారి (మరుభూమి) లోకి ప్రవేశించాను. రాత్రంతా తిరుగుతూ ఎలాగోలా ఎడారిని దాటి ఇక్కడికి చేరుకున్నాను. ఇక్కడ కూడా నేను ఏమి చూస్తున్నాను ? అంతటా కరువు. చెట్లు ఎండిపోయాయి. నదులు ఎండిపోయాయి. ప్రాణాల అలికిడి లేదు. పక్షుల కిలకిలరావాలు లేవు. అయ్యో ! తీవ్రమైన దాహం నను వేధిస్తోంది. నీటి కోసం ఎక్కడికి వెళ్లాలి? ఏ దిక్కున వెతకాలి ?

पथिकः : Traveler : Oh, what heat ! The scorching sun is truly unbearable. This land is stricken by famina. What miserable state I am in! While wandering through piligrimage sites, I lost my way yesterday at sunset. As I moved forward, I entered a desert. Wondering all night, I somehow crossed the desert and have come here. What do I see even here ? Famine every where, Trees are dried up. Rivers are dried up.

There is no noise of animals, nor the chirping of birds. Oh, intense thirst is tormenting me.

Where should I go for water? which direction should I follow ?

उपविशति । क्षणकालानन्तरम् उत्कर्णं शृण्वन् उत्थाय )
पक्षिणां कलरवः इव श्रूयते दिशि एव । दूरे ……………… आम्, अस्यां

(కూర్చుంటాడు. కొద్దిసేపటి తర్వాత చెవియొగ్గి వింటూ లేచి నిలబడి) ఆహా, దూరంగా….అవును ఈ దిశలో పక్షుల అరుపులు వినిపిస్తున్నట్లు ఉన్నాయి.

(Sits down, After a moment, listening intently, he stands up)

Oh, far away …. yes, the chirping of birds seems to be heard in this direction.

(निष्क्रामति अन्यदित्तः पुनः प्रविश्य)

अहो ! हरितायमानः प्रदेशः । परितः शुष्कता, अत्र तु हरित्समृद्धिः । केनचित् मुनिना अत्र तपः कृतं स्यात् । कस्याश्चित् देवतायाः वासभूमिः स्यात् अयं प्रदेशः । अत्र समीपे जलं भवेत् एव । अस्तु तावत्, क्षणं विश्रम्य जलान्वेषणं करिष्यामि । ( वृक्षमूले उपविशति) यदि अत्रैव जलं प्राप्तं स्यात् ………।

నిష్క్రమిస్తాడు । మరోదిక్కు నుండి తిరిగి ప్రవేశిస్తాడు, ప్రవేశించి) ఆహా ! ఈ ప్రాంతమంతా పచ్చదనంతో కళకళలాడుతోంది. చుట్టూ ఎడారి. కానీ ఇక్కడ మాత్రం పచ్చదనం నిండుగా ఉంది. ఏ మునియైనా ఇక్కడ తపస్సు చేసి ఉండవచ్చు. ఈ ప్రదేశం ఏదైనా దేవత నివసించే చోటు అయి ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా దగ్గరలోనే నీరు ఉంటుంది. సరే కాసేపు విశ్రాంతి తీసుకుని నీటి కోసం వెతుకుతాను. (చెట్టు మొదట్లో కూర్చున్నాడు) ఒకవేళ ఇక్కడే దొరికితే ఎంత బాగుంటుందో ………..

(He exit. Re-entering from another direction)

Oh ! What a lush green place. There is dryness all around, but here there is an abundance of greenery. Some sage might have performed penance here. This place might be the dwelling of some goddess.

The must surely be water nearby. Let it be for now, I will rest for a moment and then search for water. (Sits at the base of a tree) Ifonly water could be found right here ….

(मधुराधिदेवता प्रत्यक्षा भवति । तस्याः वस्त्रेषु तत्र तत्र शष्कुली-लड् डुक-मोदकादयः उत्तोलिताः सन्ति । हस्ते च मधुरभक्ष्याणां पात्रम् ।)

తీపి పదార్థాలకు అధిదేవత ప్రత్యక్షమవుతుంది. ఆమె చేతుల్లో అక్కడక్కడ జంతికలు, లడ్డూలు, మోదకాలు వంటివి కనిపిస్తున్నాయి. ఆమె చేతిలో ఒక పిండి వంటల పాత్ర కూడా ఉంది.

The Goddess of sweets appears, In her hands, sweets like shashkuli, laddus, and modakas are adorned. She also holds a vessel of sweet treats.

सङ्कल्पदृढता Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

म. देवता : (स्वगतम्) अहम् अस्मि मधुराधिदेवता । ज्ञातुम् इच्छामि एतस्य सात्त्विकताम् । (तस्य समीपं गत्वा) वत्स ! उत्तिष्ठतु । उत्तिष्ठतु वत्स !

మ. దేవత : (తనలో తాను) నేనే మధురాధి దేవతను. ఇతని సాత్విక గుణాన్ని (మంచి తనాన్ని) పరీక్షించాలనుకుంటున్నాను.
(అతని దగగ్రికి వెళ్ళి)
నాయనా ! (కుమారా !)
లే, లే కుమారా ! (లేదా) కుమారా ! మేల్కొనుము, మేల్కొనుము కుమారా !

म. देवता : Goddess of sweets (To herself) I am the Goddess of sweets. I wish to test his virtuous nature. (Going near him.) Child ! wake up ! wake up, child!

पथिकः : (स्वगतम्) अये ! काऽपि तेजस्विनी ! (प्रकटम् ) आर्ये, क्षन्तव्यः अयं जनः । श्रान्तिवशात् निमीलितनेत्रः आसम् ।

म. देवता: चिन्ता मास्तु वत्स ! उत्तिष्ठतु । (पथिकः उत्तिष्ठति ) भवान् एतानि मधुरभक्ष्याणि स्वीकरोतु ।

पथिकः : मधुरभक्ष्याणि ! मह्यं किमर्थम् ?

म. देवता : भवदर्थम् एव आनीतानि एतानि । स्वीकरोतु । पिपासितः बुभुक्षितः चापि खलु भवान् ? एतानि खादतु । बुभुक्षां प्रथमं निवारयतु । तदनन्तरं भवान् जलं पातुम् अर्हति ।

पथिकः : अहं जलं पातुम् इच्छामि इति तु सत्यमेव । किन्तु भक्ष्याणि मया मनसा अपि न सम्प्रार्थितानि । प्राणधारणार्थं यावत् आवश्यकं तावत् एव स्वीकरोमि अहम् । कदाचित् कन्दमूलानि, कदाचित् भिक्षान्नम् । इतोऽपि अधिका अपेक्षा नास्ति मम ।

म. देवता : भवतः व्यवहारेण सन्तुष्टा खलु ददामि ? अयाचितं प्राप्तं चेत् तस्य स्वीकरणे का हानिः ?

బాటసారి : (తనలో తాను) ఆహా ! ఎవరీ తేజోమూర్తి ! (పైకి) అమ్మా, వందనాలు. అలసట వల్ల కళ్ళు మూసుకుని ఉన్నాను.

మ. దేవతా : దిగులు పడకు నాయనా! లే ! నువ్వు ఈ పిండి వంటలను (మిఠాయిలను) తీసుకో,

బాటసారి : పిండివంటలా ! నాకు ఎందుకు ?

మ. దేవతా : నీ కోసమే వీటిని తెచ్చాను తీసుకో నువ్వు దాహంతోనూ, ఆకలితోనూ ఉన్నావు కదా ! వీటిని తిను, ముందు నీ ఆకలి తీర్చుకో. ఆ తర్వాత నువ్వు నీళ్ళు తాగవచ్చు.

బాటసారి : నేను నీళ్ళు తాగాలనుకుంటున్న మాట నిజమే. కానీ ఈ పిండి వంటలను నేను మనసులో కూడా కోరుకోలేదు. ప్రాణాలను నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంతే తీసుకుంటాను. ఒక్కోసారి దుంపలు, వేర్లు లేదా ఒక్కోసారి అడిగి తెచ్చుకున్న అన్నం తింటాను. అంతకు మించి నాకు వేరే కోరికలు లేవు.

మ. దేవతా : నీ ప్రవర్తన చూసి సంతోషించి కదా ఇస్తున్నాను. అడగకుండానే లభించిన దానిని తీసుకోవడంలో తప్పేముంది ?

(Pathikah : (Swagatham) Aye ! Kapi Tejaswinee ! (Prakatam) Arye, Dhanyavadah ayam Janah! ….)

Traveler : (To himself….) Oh! Who is this radiant one!
(Aloud) Noble lady. salutations
I had my eyes closed due to exhaustion.

M. Devata : Do not worry, child, Rice ! please accept these sweet treats.

Traveler : Sweets ! Why for me ?

M. Devata : (Bhavadartham eva aneetani ….)
These have been brought only for you. Please take them, you are both thirsty and hungry. aren’t you ? Eat these. First, satisfy your hunger. After that, you may drink water.

Traveler : It is true that I wish to drink water. However, I have not even desired these sweets in my mind. I only take as much as necessary to sustain life- sometimes roots and tubers, sometimes alms. I have no greater desire than that.

M. Devata : I am giving these because I am pleased with your conduct, am I not? If something is obtained without asking, what is the harm in accepting it?

पथिकः : देवि, केनापि कारणेन अहं व्रतभङ्गं कर्तुं न इच्छामि । यदि भवती दातुम् एव इच्छति तर्हि दीनदरिद्रेभ्यः ददातु । दुःखितबन्धुभ्यः ददातु । एकदा वा तेषां मुखे हासः विलसतु ।

म. देवता : वत्स ! भवतः निष्ठया अहं सन्तुष्टा अस्मि | चिरं जीवतु भवान् । (मधुराधिदेवता निर्गच्छति । दीपः मन्दायते । पुनः यदा प्रकाशमानः भवति तदा इन्द्रः पुरतः आगत्य तिष्ठति ।)

इन्द्रः : (स्वगतम्) देवेन्द्रोऽहम् । देवानाम् अधिपोऽहम् । मम प्रथमपरीक्षायाम् एषः सज्जनः उत्तीर्णः अभवत् । अन्यां परीक्षाम् आयोज्य एतं परीक्षितुम् इच्छामि । पश्यामि तावत् किं भवेत् इति । (प्रकटम्) वत्स । ! अये वत्स !

पथिकः प्रभो ! महात्मन ! एषोऽहम् अभिवादये ।

इन्द्रः : दीर्घायुष्मान् भवतु । इन्द्रोऽहं ददामि एतत् अमृत-पात्रम् । एतत् पिबतु । तेन भवतः पिपासा किं, पुनर्जन्म-प्राप्तिः एव शाश्वततया निवारिता भविष्यति ।

पथिकः : पिपासितः अहं जलमात्रं कामये, न तु अमृतम् ।

इन्द्रः अये ! किम् एवं मूर्खः इव वदति भवान् ? यत् प्राप्तुं महात्मानः अपि न शक्नुयुः, यस्य प्राप्त्या ऋषिमुनयः मोक्षं प्राप्नुयुः, यच्च प्राप्य देवाः अमराः संवृत्ताः, तत् अमृतं भवतः पुरतः अस्ति । अतः कीदृश्म् अमूल्यं वस्तु तिरस्क्रियमाणम् अस्ति इति किं भवता ज्ञायते ? जन्मनः अन्तिमं लक्ष्यं मोक्षः एतेनैव खलु सिद्ध्येत् ?

బాటసారి : దేవీ, ఏ కారణం చేతనైనా సరే నేను నా వ్రతాన్ని (నియమాన్ని) భంగం చేసుకోవాలని అనుకోవడం లేదు. ఒకవేళ మీరు ఇవ్వాలని అనుకుంటే, పేదవారికి, దీనులకు ఇవ్వండి. దుఃఖంలో ఉన్నవారికి ఇవ్వండి. ఒక్కసారైనా వారి ముఖాల్లో చిరునవ్వు కనిపించనీయండి.

మ. దేవత : నాయనా ! నీ నిష్ఠకు నేను చాలా సంతోషించాను. నువ్వు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి. (మధురాధిదేవత వెళ్ళిపోతుంది. వెలుతురు తగ్గుతుంది. మళ్ళీ వెలుగు వచ్చినప్పుడు ఇంద్రుడు ఎదురుగా వచ్చి నిలబడతాడు.)

బాటసారి : (తనలో తాను) నేను దేవేంద్రుడిని, దేవతలకు అధిపతిని, నా మొదటి పరీక్షలో ఈ సజ్జనుడు నెగ్గాడు. మరో పరీక్షను కూడా ఏర్పాటు చేసి ఇతనిని పరీక్షించాలనుకుంటున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. (పైకి) నాయనా! ఓ నాయనా !

బాటసారి : ప్రభూ ! మహాత్మా ! ఇదిగో నేను మీకు నమస్కరిస్తున్నాను.

ఇంద్రుడు : దీర్ఘాయుష్మంతుడవు కావాలి. నేను ఇంద్రుడిని, నీకు ఈ అమృతపాత్రను ఇస్తున్నాను. దీనిని త్రాగు. దీనివల్ల నీ దాహమే కాదు, నీకు మళ్ళీ పుట్టుక అనేది లేకుండా శాశ్వతంగా నివారించబడుతుంది. (మోక్షం లభిస్తుంది)

బాటసారి : దాహంతో ఉన్న నేను కేవలం నీటిని మాత్రమే కోరుకుంటున్నాను. అమృతాన్ని కాదు.

ఇంద్రుడు : ఏంటి ! ఇలా మూర్ఖుడిలా మాట్లాడుతున్నావేంటి? ఏది పొందడానికి గొప్ప తపస్సంపన్నులు కూడా శక్తులు కారో, దేనిని పొందితే ఋషులు, మునులు మోక్షాన్ని పొందుతారో, దేనిని పొందడం వల్ల దేవతలు అమరులయ్యారో, అటువంటి అమృతం నీ ముందు ఉంది. ఎంతటి అమూల్యమైన వస్తువును నీ నువ్వు కాదంటున్నావో నీకు అర్థమవుతుందా? జన్మ యొక్క చివరి లక్ష్యం, మోక్షం దీని వల్ల అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. కదా?

Traveler : Goddess, for no reason do I wish to break my vow. If you truly wish to give, then give to the poor and needy. Give to those in distress. Let a smile bloom on their faces at least once.

M. Devata : Child! I am pleased with your dedication. May you live long. (The Goddess of sweets departs. The light dims. When it brightens again, Indra stands in front.

Indra : (To himself) I am Devendra. I am the lord of gods. This vitrtuous man has passed my first test. I wish to test him further with another trial. Let’s see what happens. (Aloud) Child ! Oh Child !

Traveler : Lord ! O Great one ! Here I am, offering my salutations.

Indra : May you have a long life. I am Indra, and I give you this vessel of nectar (Amrita). Drink this By this, not just your thirst, but even the cycle of rebirth will be permanently averted for you.

Traveler : Being thirsty, I only desire water, not nectar.

Indra : Oh! Why are you speaking like a fool? That which even great ascetics might not be able to obtain, by attaining which seers and sages gain liberation, and by receiving which the gods become immortl – that nectar is before you. Do you realize what a priceless thing you are rejecting? The ultimate goal of life is liberation (moksha). won’t it be achieved through this?

सङ्कल्पदृढता Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

पथिकः : निःस्पृहस्य तृणं जगत् । अमृतं चापि अहं तृणाय मन्ये । विना प्रयत्नेन प्राप्तं स्वर्गाधिपत्यं वा कुतः न भवेत्, अहं तत् न इच्छामि एव । किम् अधिक प्रलोभनेन ?

इन्द्रः : (कोपेन) भोः, ज्येष्ठानां सन्तोषः कोपश्चापि महान् एव भवति इति भवान् जानाति खलु ?

पथिकः : यदि व्रतनिष्ठता अपि भवतः कोपाय भवेत् तर्हि तस्य फलं सोढुम् अहं सिद्धः एव ।

इन्द्रः : अनुभवतु तर्हि । (इन्द्रः शापं दातुम् उद्युक्तः भवति । तावति काले कल्पवृक्षाधिदेवता प्रत्यक्षा भवति ।)

म. देवता : देवेन्द्र | अलं कोपेन । क्षणकालं तिष्ठतु । उपसंहरतु कोपम् । शापेन न सन्तापनीयः अयं सज्जनः । (पथिकम् उद्दिश्य) महात्मन् ! किमर्थं गृहम् आगतां लक्ष्मी तिरस्करोति भवान् ?

पथिकः : देवि ! भवती ……………….. ?

म. देवता : अहम् एतस्य प्रदेशस्य अधिष्ठात्री देवता । यस्य आश्रये भवान् स्थितवान् स एषः कल्पवृक्षः | अहम् अस्मिन् वृक्षे निवसामि ।

బాటసారి : కోరికలు లేని వారికి ఈ జగత్తు గడ్డిపోచతో సమానం. అమృతాన్ని కూడా నేను గడ్డిపోచలాగే భావిస్తాను. ప్రయత్నం లేకుండా లభించే స్వర్గాధిపత్యం అయినా సరే, నాకు అది వద్దు. ఇంకా నన్ను ఎందుకు ప్రలోభపెడతారు ?

ఇంద్రుడు : (కోపంతో) ఓయీ ! పెద్దల సంతోషమైనా, కోపమైనా గొప్పగానే ఉంటుందని నీకు తెలుసు కదా !

బాటసారి : నా వ్రతనిష్ఠ కూడా మీకు కోపం కలిగిస్తే, ఆ కోపం వల్ల కలిగే ఫలితాన్ని (శిక్షను) అనుభవించడానికి నేను సిద్ధమే.

ఇంద్రుడు : అయితే అనుభవించు! (ఇంద్రుడు శాపం ఇవ్వడానికి సిద్ధమవుతాడు. అంతలో కల్పవృక్షానికి అధిదేవత ప్రత్యక్షమవుతుంది.)

మ. దేవతా : దేవేంద్రా ! కోపం వద్దు. ఒక్క క్షణం ఆగు. నీకోపాన్ని ఉపసంహరించుకో. శాపంతో ఈ సజ్జనుడిని కష్టపెట్టకూడదు. (బాటసారితో) మహాత్మా! ఇంటికి వచ్చిన లక్ష్మిని (అదృష్టాన్ని) నువ్వు ఎందుకు తిరస్కరిస్తున్నావు ?

బాటసారి : దేవీ ! మీరు …………… ?

మ. దేవతా : నేను ఈ ప్రాంతానికి అధిష్ఠాన దేవతను, నువ్వు ఏ చెట్టు నీడనైతే ఉన్నావో, అది ఈ కల్పవృక్షమే. నేను ఈ చెట్టులోనే నివసిస్తున్నాను.

Traveler : For one who has no desires, the whole world like a blade of grass. I consider even nectar to be like a blade of grass. Even if it is the lordship of heaven obtained without effort, I simply do not want it. Why tempt me further?

Indra : (with anger) O man, don’t you know that both the pleasure and the anger of elders are equally significant?

Traveler : If even my dedication to my vow causes you anger, then I am indeed ready to endure the consquencess of that anger.

Indra : Then endure it ! (Indra prepare to give a curse. At that moment, the Goddess of the kalpavriksha appears).

M. Devata : Devendra! Enough with the anger. Stay for a moment withdraw your anger. This virtuous man should not be tormented with a curse. (To the travelers) O Great soul ! Why are you rejecting Lakshmi (fortune) that has come to your doorstep ?

Traveler : Goddess! You are…. ?

M. Devata : I am the presiding deity of this region. The tree under whose shelter you are stying in this very kalpavriksha (the wish-fulfilling tree). I reside in this tree.

पथिकः : आर्ये, नमस्करोमि । ( नमस्कृत्य) परितः क्षामः । मध्ये कुत्रचित् हरितायमानः प्रदेशः । तेनैव अहं ज्ञातवान् यत् एषः कस्याश्चित् देवतायाः एव वासभूमिः स्यात् इति । भवतोः दर्शनेन अहम् आत्मानं धन्यं मन्ये ।

म. देवता : वत्स ! कल्पवृक्षम् आश्रितः यत् इच्छति तत् प्राप्नोति । पिपासितः भवान् जलम् इष्टवान् । तेन अमृतम् एव उपस्थितम् अभवत् । भवतः पुण्यम् इहैव फलितम् इति भावयतु | अपेक्षितं पृच्छतु ।

पथिकः : लोकहितं मम लक्ष्यम् । एतद्विना न किञ्चित् इच्छामि अहम् ।

म. देवता : भवदर्थं किमपि पृच्छतु ।

पथिकः : मदर्थम् । अहं नाम कः ? आत्मस्वरूपी । लोकसेवया एव आत्मनः सार्थक्यम् एतत् शरीरं तु क्षणविध्वंसि । एतदर्थं किमिति कामये ? यदि केनापि अनुग्रहणीयम् इत्येव भवती इच्छति तर्हि सस्यसमृद्धिं फलसमृद्धिं लोकसम्पत्समृद्धिं च ददातु । एतद् वनं हरिद्वर्णेन सुशोभितं भवतु । पक्षिणां कलरवः अत्र प्रतिध्वनितः भवतु | जनानां मृदुमधुर हासः सर्वत्र विलसतु ।

म. देवता : सर्वथा निरपेक्षः दृढसङ्कल्पः च भवान् । भवान् यथा इच्छति तथैव भवतु । एतद् वनं हरितायमानं भविष्यति । भवान् यत्र निवसेत् तत्र सुभिक्षा सिद्ध्येत् । यावज्जीवं लोकोपकारकः भवतु भवान् ।

पथिकः : देवि ! देवेन्द्र ! भवतोः कृपया अनुगृहीतोऽस्मि ।

सङ्कल्पदृढता Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

( पटाक्षेपः )

బాటసారి : అమ్మా ! నమస్కరిస్తున్నాను. (నమస్కరించి) అంతటా కరువు ఉన్నది. మధ్యలో మాత్రం ఎక్కడో ఒకచోట ఇలా పచ్చని ప్రాంతం ఉంది. దానిని బట్టే ఇది ఏదో ఒక దేవత నివసించే చోటు అని నాకు అర్థమైంది. మీ దర్శనంతో నేను ధన్యుడినయ్యాను.

మ. దేవత : నాయనా ! కల్పవృక్షాన్ని ఆశ్రయించిన వారు కోరుకున్నది పొందుతారు. దాహంతో ఉన్న నువ్వు నీటిని కోరుకున్నావు. అందుకే నీ ముందు అమృతమే ప్రత్యక్షమైనది. ఇది నీ పుణ్యఫలమే అని భావించు. నీకు ఏం కావాలో కోరుకో.

బాటసారి : లోక కళ్యాణమే నా లక్ష్యం. అది తప్ప నాకు వేరే కోరిక ఏదీ లేదు.

మ. దేవత : నీ కోసం ఏదైనా కోరుకో.

బాటసారి : నా కోసమా ! నేను అంటే ఎవరు ? ఆత్మస్వరూపుడిని. లోకసేవ ద్వారానే ఆత్మకు సార్థకత లభిస్తుంది. ఈ శరీరం క్షణభంగురం. (ఎప్పుడైనా నశించేదే). దీని కోసం నేను ఏం కోరుకుంటాను. ఒకవేళ మీరు నన్ను అనుగ్రహించాలనే అనుకుంటే, పంటలు బాగా పండాలి. పండ్లు సమృద్ధిగా దొరకాలి. లోకమంతటా సుభిక్షంగా ఉండాలి. ఈ అడవి ఎప్పుడూ పచ్చదనంతో కళకళలాడాలి. పక్షుల కిలకిలరావాలు ఇక్కడ ప్రతిధ్వనించాలి. ప్రజలందరి ముఖాల్లో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలి.

మ. దేవత : నువ్వు ఏ కోరికలు లేనివాడివి మరియు దృఢ సంకల్పం కలవాడివి. నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది. ఈ వనం ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సుభిక్షం (క్షేమం) కలుగుతుంది. నువ్వు జీవితాంతం లోకోపకారిగా వర్థిల్లు.

బాటసారి : దేవీ ! దేవేంద్రా ! మీ కృప వల్ల నేను అనుగ్రహించబడ్డాను.

Traveler : Noble lady, I bow to you, (After bowing) There is famine all around. Yet in the middle, there is this lush green place. By this, I understood that this must be the dwelling of some Goddess. I consider myself blessed by your sight.

M. Devata : Child! Who ever seeks shelter under the kalpavriksha gets what they desire. Being thirsty, you desired water. Thus, nectar itself appeared, consider this the fruit of your own merit. Ask for what you desire.

Traveler : The welfare of the world is my goal. Other than that, I desire nothing.

M. Devata : Ask for something for yourself.

Traveler : For me! Who am I? I am the embodiment of the soul. Fulfillment of the soul is achieved only through ‘service to the world. This body is momentary, why should I desire any thing for it? If you truly wish to bless me, let there be an abundance of crops and fruits and let the world prosper. Let this forest be beautiful with greenary. Let the chirping of birds echo here. Let smiles flourish every where on people’s faces.

M. Devata : You are completely desireless and firm in your resolve. Let it be exactly as you wish. This forest shall remain green, wherever you reside, prosperity shall prevail. May you remain a benefactor to the world as long as you live.

Traveler : Goddess! lord Indra! I am graced by the kindness of you both.

Leave a Comment