Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Sanskrit Study Material Pdf उपवाचकम् 2nd Lesson रघुकौत्सम् Questions and Answers Summary.
Inter 2nd Year Sanskrit रघुकौत्सम् Questions and Answers
अभ्यासः
प्रश्नाः
प्रश्न १ .
रघुमहाराजः किं यागं कृतवान् ?
(రఘు మహారాజు ఏ యాగం చేశాడు ?)
Did king Raghu perform?
जवाब:
रघुमहाराजः विश्वजित् यागं कृतवान् ।
రఘు మహారాజు విశ్వజిత్ యాగం చేశాడు.
King Raghu performed the ‘Vishwajit’ sacrifice.
प्रश्न २.
महाभागः कौस्तः कीदृशः
(మహాభాగ్యుడైన కౌత్సుడు ఎటువంటివాడు ?)
What kind of Person was the noble Kautsa?
जवाब:
कौत्सः सम्प्राप्तविद्यः, गुरुभक्ति परः, शिष्यकौस्तुभः च आसीत् ।
కౌత్సుడు విద్యను పూర్తిచేసినవాడు, గురుభక్తి గలవాడు, శిష్యులలో కౌస్తుభ మణి వంటి వంటివాడు.
Kautsa was a highly learned scholar and a devoted disciple with great integrity.
प्रश्न ३.
कौत्सः कियत् गुरुदक्षिणां दातुं गुरुणा आदिष्टः ?
(కౌత్సుడు ఎంత గురుదక్షిణ ఇవ్వాలని గురువుచేత ఆదేశించబడ్డాడు ?)
How much Guru Dakshina was Kautsa commanded to give by his Guru ?)
जवाब:
कौत्सः चतस्रो दश कोटी: । (चतुर्दश कोटीः) सुवर्ण मुद्रिकाः गुरुदक्षिणां दातुम् गुरुणा अदिष्टः ।
పధ్నాలుగు కోట్ల బంగారు నాణేలను గురుదక్షిణగా ఇవ్వాలని ఆదేశించబడ్డాడు.
Kautsa was commanded by his Guru to give fourteen crores of gold coins.
प्रश्न ४.
प्रतिग्रहः केषां न शोभते ?
(ఇతరుల నుండి తీసుకోవడం ఎవరికి శోభించదు ?
For whom is receiving a gift (or begging) not appropriate?
जवाब:
प्रतिग्रहः रघूणां (रघुवंशजानां) न शोभते ।
ప్రతిగ్రహం రఘువంశపు రాజులకు శోభించదు.
(లేదా)
రఘువు వంటి గొప్పచక్రవర్తులకు ఇతరుల నుండి దానం తీసుకోవడం శోభించదు.
Receiving gifts or begging does not suit mighty emperors like Raghu.
![]()
रघुकौत्सम् Summary in Telugu & English
I. पाठ्यभाग परिचय
आधुनिक संस्कृतवाङ्मये लब्धप्रतिष्ठोऽयं कविवरः मेल्लचेर्यु वेङ्कटशास्त्रिमहोदयः आन्ध्रप्रदेशे प्राक्तन गुण्टूरु जनपदे स्थित तेनालि पट्टणे मेल्लचेर्वु जगन्नाथशास्त्रि महलक्ष्माम्बदम्पत्योः पुण्यफलेन पुत्ररूपेण १५.०५.१९४९ वर्षे जनिमलभत । अस्य महोदयस्य विद्याभ्यासः प्रथमतः पितुस्समीपे, अनन्तरं चन्दोलु ग्रामे सुप्रसिद्धस्य ब्रह्मश्री ताडेपल्लि राघवनारायण शास्त्रि महोदयस्य समीपे, तदनन्तरं तेनालिपट्टणस्थ के यल्. यन्. संस्कृतकलाशालायां समभवत् । आन्ध्रविश्वविद्यालयात् भाषाप्रवीण, विद्याप्रवीण, संस्कृत तेलुगुभाषयोः एम्. ए. उपाधिभाजोऽयं महाभागः । अस्य महोदयस्य उद्योगप्रस्थानं तेनालि तालूका उन्नतपाठशालायाम् आरब्धम्, अनन्तरं यस्. डि. यम् प्राच्योन्नत पाठशालायां अध्यापकरूपेण, तदनन्तरं श्री ताडेपल्लि राघवनारायणशास्त्र संस्कृतकलाशालायां, गोरण्ट्ल वेङ्कन्न संस्कृतकलाशालायां संस्कृतोपन्यासकरूपेण कार्यं कृत्वा २००८ वर्षे पदवीतः विश्रान्तोऽयं कविवरेण्यः इदानीं तेनालि पार्श्वस्थग्रामे वसति । अयम् अष्टोत्तर शताधिक ग्रन्थकर्ता, संस्कृतान्ध्र भाषाप्रवीणः ग्रन्थकर्ता च । अस्य कविपुङ्गवस्य लेखनीतः रघुकौत्सम्, श्रीकृष्णरासलीला- योगत्रयी हेला, कुजसप्ततिः इत्यादयः ग्रन्थाः निर्गताः ।
प्रस्तुत पाठ्यभागस्तावत् अनेन महोदयेन विरचित “रघुकौत्सम्” इति एकाङ्किकातः स्वीकृतः ।
ఆధునిక సంస్కృత సాహిత్య రంగంలో ప్రసిద్ధి చెందిన కవిరేణ్యులు (శ్రేష్ఠులు) మేళ్ళ చెరువు వేంకట సుబ్రహ్మాణ్య మహోదయ: వీరు ఆంధ్రప్రదేశ్లోని పూర్వపు గుంటూరు జిల్లా, తెనాలి పట్టణ మందలి మేళ్ళ చెఱువు జగన్నాథ శాస్త్రి, మహాలక్ష్మమ్మ దంపతులకు పుణ్యఫలం వలె పుత్రినిగా 15.05.1945 వ సం లో జన్మించారు.
ఈ మహాశయుని విద్యాభ్యాసం మొదట తండ్రి వద్ద, ఆ తర్వాత చందోలు గ్రామమందలి సుప్రసిద్ధ బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణశాస్త్రి గారి వద్ద, అనంతరం తెనాలి పట్టణంలోని కె.ఎల్.ఎన్ సంస్కృత కళాశాలలో జరిగింది.
వీరు ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి భాషాప్రవీణ, విద్యాప్రవీణ పట్టాలను మరియు సంస్కృత, తెలుగు భాషల్లో ఎం.ఏ పట్టాలను (పొందారు) పొందిన గొప్పవారు.
(అస్య) ఈ మహోదయుని ఉద్యోగ ప్రస్ధానం తెనాలి తాలూకా ఉన్నత పాఠశాలలో ప్రారంభమైనది. ఆ తర్వాత ఎస్.డి.ఎమ్. ప్రాచీన ఉన్నత పాఠశాలలో అధ్యాపకుడిగా, ఆపై శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి సంస్కృత కళాశాలలో మరియు గోరంట్ల వేంకన్న సంస్కృత కళాశాలయందు సంస్కృత ఉపన్యాసకుడిగా పనిచేసి 2008 సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. (ఇప్పుడు ప్రస్తుతం ఈ కవివరేణ్యులు తెనాలి సమీప గ్రామంలో నివసిస్తున్నారు.
ఈయన 108 పైచిలుకు గ్రంథాలను రచించారు. వీరు సంస్కృతాంధ్ర భాషలలో గొప్ప పండితులు మరియు గ్రంధకర్త.
ఈ కవిశ్రేష్ఠుని కలం నుండి రఘుకౌత్సమ్, శ్రీ కృష్ణరాసలీలా, యోగత్రయీ హేలా, కుజసప్తతి: మొదలైన గ్రంథాలు వెలువడ్డాయి.
ప్రస్తుత పాఠ్యాంశం ఈ మహానుభావుడు రచించిన “రఘు కౌత్సమ్” అనే ఏకాంకిక నుండి స్వీకరింపబడినది.
“Sri Mellacheruva Venkata Subrahmanya Sastri is a highly ac- claimed poet in the field of modern sanskrit literature. He was born on May 15, 1949, as the son of the blessed couple jagannadha Sastri and Mahalakshmamma in Tenali Taluka of the erst while Guntur district in – Andhra Pradesh.
His education began under his father’s guidence and continued under the renowed scholar Brahmasri Tadepalli Raghava Narayana Sastri in Chandolu village. Later, he studied at the K.L.N. Sanskrit college in Tenali and earned the titles of Bhashapraveena, and Vidyapraveena from Andhra University, along with M.A. degrees in both Sanskrit and Telugu.
His professional journey started as a teacher at Tenali Taluka High school. Subsequently, he served as a Sanskrit Lecturer at Sri Tadepalli Raghava Narayana Sastri Sanskrit college and Gorantla Venkanna Sanskrit college, eventually retiring in 2008, currently, he resides a village near Tenali.
An expert in both Sanskrit and Telugu, he has authored over 108 books. Notable works from his prolific pen include Raghu Kautsam, Sri Krishna Rasalila, Yogini Hela, and Kuja saptati. The current lesson is an expert from the one – act play titled ‘Raghu Kaustam’ composed by this eminent scholar.”
![]()
पाठ्यांशः
प्रविश्य सूत्रधारः
“जयन् स्वकरवैभवात् अरसयन् महीभृद्गणम्”
किरन् रसधुनीः पुनः कृतरसांश्च कुर्वन् द्विजान् ।
अकिञ्चनघनैः वृतः रघुकुलस्य बीजं रविः
कुबेरदिशि जृम्भते शरदि पद्मकान्तीः सृजन् ॥
इति पुष्पाञ्जलिम् विकीर्य
(नेपथ्याभिमुख मवलोक्य)
रे पारिपार्श्विक !
पारिपार्श्विकः : (आगत्य ) भाव ! अयमस्मि
सूत्रधारः : अत्र तिम्मसमुद्रनामक ग्रामे महावदान्यस्य श्री गोरण्ट्ल वेङ्कन्न महाशयस्य “वर्धन्ति महोत्सवे ”
రఘుమహారాజు పరంగా!
- జయన్ స్వకరవైభవాత్ – తన బాహుబలంతో శత్రువులను జయించినవాడు.
- అసృజన్ మహీభృద్గణమ్ – ఇతర రాజులను గౌరవించేవాడు.
- కృతరసాంశ్చ కుర్వన్ ద్విజాన్ – విద్వాంసులను (ద్విజులను తన దానగుణంతో తృప్తి పరిచేవాడు.)
- అకించన ఘనైః వృతః – ఏమీ లేని (పేద) యాచకుల సమూహంతో . ఎప్పుడూ చుట్టూ ముట్టబడి ఉండేవాడు (ఎందుకంటే రఘుమహారాజు గొప్పదాత.)
- కుబేరదిశిః తన దానగుణానికి మెచ్చి కుబేరుడు పంపిన బంగారు ధనరాశులతో శరత్కాల సూర్యుడిలో రఘువు ప్రకాశిస్తున్నాడు.
“इति पुष्पाञ्जलिम् विकीर्य”
“ఇలా పుష్పాంజలిని (సభకు ూలు) చల్లి,” (స్టేజ్ వెనుక వైపు) చూసి తన సహాయకుడికి పిలుస్తాడు.
नेपथ्याभिमुख मवलोक्य
(నేపథ్యం వైపు (స్టేజ్ వైపు తిరిగి)
रेरे पारिपार्श्विकः !
“ఓయీ ! పారిపార్శ్వికుడా ! (సహాయకుడా) ! ఇటురా !”
పారిపార్శ్వికుడు : (వచ్చి, ప్రవేశించి) మిత్రమా ! ఇదిగో వచ్చాను.
సూత్రధారుడు : ఇక్కడ తిమసముద్రం అనే గ్రామంలో మహాదాత అయిన శ్రీగోరంట్ల వెంకన్న మహాశయుని యొక్క వర్ధంతి ఉత్సవాల సందర్భంగా, ఇక్కడి విజ్ఞులైన ప్రేక్షకులను అలరించడానికి ఏదైనా ఒక రూపకాన్ని (నాటకాన్ని) ప్రదర్శించమని మనకు ఆదేశం వచ్చింది.”
సారిపార్శ్యతుడు : “దాని పేరేమిటి” ?
సూత్రధారుడు : (ఆలోచిస్తున్నట్లుగా నటిస్తూ) “ప్రస్తుత సందర్భానికి ఏది సరైనదై ఉంటుంది ?
పారిపార్శ్వికుడు : (ఆలోచిస్తున్నట్లుగా నటిస్తూ)
సూత్రధారుడు : “ఏమిటి (మిత్రమా) ! నేను నాటక ప్రదర్శన గురించి ఆలోచిస్తుంటే, నువ్వు ఇలా మౌనంగా, శూన్య హృదయం తో కనిపిస్తున్నావు ?”
పారిపార్శ్వికుడు : ‘ఏమీలేదు’
(सूत्रधारः)
సూత్రధారుడు : “చెప్పు నీ మనసులో ఏముందో చెప్పు” మిత్రుడితో పంచుకుంటే దుఃఖం తగ్గుతుంది. సుఖం పెరుగుతుంది.”
పారిపార్శ్వికుడు : అయ్యా ! నేను దురదృష్టవంతుడిని. నా కుమారుడు విద్య పూర్తికాగానే గురువుకు దక్షిణను ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. ఆ దక్షిణ ఇవ్వడానికి కావలసిన సంపద ఇప్పుడు సాధ్యపడటం లేదు.”
Enter suthradhara (The Director) : (Recites the opening prayer/Naneli Slokal)
“Triumphant by the glory of his own hand, creating a multitude of kings, scattering streams of essence, and making the twice – born (scholars) full of delight, surrounded by clouds of the destitute – the sun, the seed of Raghu’s clan, shines in the direction of kubera (North) Creating the beauty of lotuses in autumn.”
(Having scattered a handful of flowers)
(Looking towards the backstage)
Sutradhara : Hey, pariparsika ! (Assistant)
Pariparsvika : (Entering) Bhava!
(Noble friend) here I am.
Sutradhara : Here in the village of Thimmasamudram, on the occation of the death anniversary celebrations of the great philonthropist Sri Gorentla Venkanna. Mahasaya, I have been commanded to perform some play to please the gathered audience.
Pariparsiva : What is that play?
Sutradhara : I am considering that what would be appropriate for this context?
Pariparsvika : (Mimics thinking)
Sutradhara : Bhava ! (O’ Friend !) why do you seem silent and empty hearted while I am pondering the performance?
Pariparsvika : Nothing at all
Sutradhara : Speak, truly, this person (me) is close to you, when shared with a friend, even sorrow turns into joy.
Pariparsvika : Alas ! I am unfortunate.
What shall I say? my son, vaving completed his education (sam prapta – vidyo) is determined to give guru Dakshina (teacher is fee). But providing that Dakshina seems impossible at this time.
![]()
“अकिञ्चनोऽहम् दयितो ममात्मजः
गुरुः प्रचण्डः बृहती च दक्षिणा ।
भृशं हि दूये तनयश्च दूयते
यथा च कौत्सो वरतन्तुबोधितः ॥”
సూత్రధారుడు :
(పారిపార్శ్వికుడి పరిస్థితిని ఉద్దేశించి ఈ క్రింది శ్లోకాన్ని చెబుతున్నాడు. ) “నేను పేదవాడిని, నా కుమారుడు నాకు అత్యంత ప్రియమైనవాడు, గురువుగారు చాలా కఠినమైనవారు. ఆయన అడిగిన దక్షిణేమో చాలా పెద్దది. నిజానికి, ఈ రెండు విషయాల మధ్య నలిగిపోతూ నా కుమారుడు బాధపడుతున్నాడు. పూర్వం వరతంతు మహర్షి శిష్యుడైన కౌత్సుడు ఎలాగైతే ఇబ్బంది పడ్డాడో, ఇప్పుడు నీ కుమారుడి పరిస్థితి కూడా అలాగే ఉంది”.
Sutradhara (Director) :
(Speaking a verse to describe the assistant’s situation)
“I am penniless, and my son is dear to me, the teacher is fierce, and the required fee (Dakshina) is enormous. Truly, my son is deeply pained by these two factors – just as kautsa was when pressured by his teacher varatantu”
नेपथ्ये నేపథ్యే (తెర వెనుక నుండి)
अरे कोऽयम् धूर्तः माम् गुरुबाधितम् प्रकटयति
सूत्रधार :-
(नेपथ्याभिमुखमवलोक्य)
“अयम् कौत्सो महाभागः चतुर्दशकलापटुः ।
बोधितम् बाधितं श्रुत्वा भ्रान्त आयाति कोपतः ॥
तस्मात् शीघ्रमपसरावः (निष्क्रान्तौ)
“ఓరీ ! ఎవడు రా అక్కడ ? నన్ను నా గురువు గారు వేధిస్తున్నట్లుగా చిత్రీకరిస్తున్న ఈ ధూర్తుడు ఎవరు ?”
సూత్రధారుడు : (తెర వైపు చూస్తూ)
“ఈయన గొప్ప విద్యావంతుడైన కౌత్సుడు. పదునాలుగు విద్యలలో ఆరితేరినవాడు. “గురువుగారు తనను ఇబ్బంది పెడుతున్నారు.” అనే మాట వినగానే అది తప్పుగా అర్థం చేసుకొని తీవ్రమైన కోపంతో ఇటువైపు వస్తున్నాడు.”
సూత్రధారుడు : “అందువల్ల మనం ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోదాం” ! (ఇద్దరూ నిష్క్రమిస్తారు)
వివరణ : ఇక్కడితో నాటక పరిచయం పూర్తి అయింది.
అసలు కథానాయకుడు కౌత్సుడిని రంగస్థలం పైకి ప్రవేశపెట్టారు.
(From behind the scenes/offstage) :
“Hey! who is this rouge depicting me as some one troubled by my Guru?”.
Sutradhara : (Looking towards the backstage) “This is the noble
Kausta, an expert in the fourteen branches of knowledge. Having heard himself described as ‘troubled’ or ‘pestered’ (by his teacher), he is coming here in a state of confused rage. Therefore, let us move away from here quickly!”
(Both Exit)
![]()
II. ततः प्रविशति कौत्सः
अरे ! वावदूक ! कुशीलवाधम ! नाहम् वरतन्तु बाधितः । किन्तु बाधकः । शुश्रूषयैव सन्तृप्तम् गुरुम् अहमेव “बैदम् उत्तङ्क इव” बाधित्वा बृहतीं गुरुदक्षिणाम् दातुम् आज्ञप्तः ।
(नेपथ्याभिमुखमवलोक्य)
सखे ! उपमन्यो ! क्वासि । इत आगच्छ !
(प्रविश्य उपमन्युः )
वयस्य ! किमर्थम् आहूतः ?
कौत्सः
सखे ! जानासि खलु । अहं चतुर्दशकोटिसुवर्णपरिमिताम् गुरुदक्षिणाम् दातुम् गुरुणा आदिष्टः । किन्तु तावत् द्रव्यम् कथम् साध्यम् ? कस्मात् साध्यम् ? इति चिन्तया न मे हस्तपादौ प्रसरतः ।
उपमन्युः : अलमत्र विचारणया ।
II. ద్వితీయ అంకం
తర్వాత కౌత్సుడు ప్రవేశిస్తాడు.
కౌత్సుడు : ఓరి వాచాలుడా ! కుశీలవుడా (నటుడా) ! నన్ను నా గురువు వరతంతు మహర్షి బాధించలేదు. నిజానికి, నేనే ఆయనను బాధించాను. శ్రద్ధతో కూడిన నా సేవలతో సంతుష్టుడైన గురువుగారిని ‘వద్దు’ అని ఆయన చెబుతున్నా వినకుండా, పట్టుబట్టి బలవంతం చేసి భారీ గురుదక్షిణ ఇచ్చేలా ఆజ్ఞను పొందాను”.
(నేపథ్యం వైపు చూస్తూ)
(తెర వెనుక వైపుకు చూస్తూ …..)
‘మిత్రమా! ఉపమన్యువు! ఎక్కడ ఉన్నావు ?
ఇటు రా !”
(ఉపమన్యువు ప్రవేశించి)
“మిత్రమా ! ఎందుకు పిలిచావు ?”
కౌత్సుడు : “మిత్రమా ! నీకు తెలుసు కదా ! పద్నాలుగు కోట్ల బంగారు నాణేలను గురుదక్షిణగా ఇవ్వమని గురువుగారు నన్ను ఆజ్ఞాపించారు. కానీ అంత ధనం ఇప్పుడు నాకు ఎలా లభిస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? అనే ఆలోచనతో నా కాళ్ళు, చేతులు ఆడటం లేదు (దిక్కు తోచడం లేదు)”.
ఉపమన్యువు : “దీని గురించి ఆలోచించి బాధపడకు.” “(అలమత్ర విచారణయా !)
“अस्ति प्रतापभरतापितराजलोकः
सम्पादिताखिलमहीधनधान्यरत्नः ।
आषाढमेघ इव याचकतर्पणश्रीः
श्रीमान् रघुः घनकरो रघुवंश दीपम् ॥”
कौत्सः : सखे ! सुष्ठु स्मारितः । तत्रैव गच्छामि, यत्र हघुचक्रवर्ती विराजते ।
“ఎందుకంటే, తన పరాక్రమంతో శత్రువులను దహించేవాడు, సమస్త భూమండలంలోని సంపదలను, ధాన్యాలను, రత్నాలను సేకరించినవాడు, యాచకుల పాలిట కల్పవృక్షం వంటివాడు అయిన రఘుమహారాజు ఉండనే ఉన్నాడు.
వివరణ : ఈ అంకంలోని ముఖ్యాంశాలు :
కౌత్సుడి నిజాయితీ ! గురువుగారు తనను వేధించడం లేదని, తనే పట్టుబట్టి గురుదక్షిణ అడిగానని కౌత్సుడు ఒప్పుకుంటున్నాడు.
సమస్య : 14 కోట్ల బంగారు నాణేలను సంపాదించడం కౌత్సుడికి అసాధ్యంగా కనిపిస్తోంది.
పరిష్కారం : రఘుమహారాజు దగ్గరకు వెళ్తే ఈ సమస్య తీరుతుందని ఉపమన్యువు ధైర్యం చెబుతున్నాడు.
II. (The enters Kautsa)
Kautsa: “Oh! What a talkativa person!
I did not want to trouble my teacher varatantu. But like an obstacle, I troubled my teacher and asked him repeatedly. Consequently, he became angry and ordered me to give this” huge fee.”
(Looking towards the backstage)
“Friend Upamanyu ! Where are you?
Came here!”
(Upamanyu enters)
Upamanyu : “Friend !” Why have you called me ?”
Kautsa : “Friend! You know, did not you?
I have been ordered by my Guru to give fourteen crore gold coins as Guru Dakshina. But how can such a vast amount of wealth be a acquired? From where? Thinking about this, I am unable even to move my hands and feet (Paralyzed by worry)”.
Upamanyu : “Enough of this worry!
There exists a king, a light of the Raghu clan, a protector of the earth, who has acquired all the wealth and grains of the world. Like a rain-could in the month of Ashadha that satisfies the thirsty, the glorious king Raghu is the bestower of wealth”.
The crore theme is the transition from despair to hope. Kautsa represents the struggling, honest individual, while king Raghu represents the divine like provider who can solve any worldly problem.
कौत्या:- सखे! सुष्ठु स्मारितः । तत्रैव गच्छामि, यत्र रघुचक्रवर्ती विराजते ।
“स विश्वजित् विश्वजिदध्वरेन्द्रे
दत्तप्रतापार्जितरश्मिराशिः ।
सहस्ररश्मेः घनवंश रत्नम्
अकिञ्चनम् श्राययथि ध्रुवम् ॥
“స విశ్వజిత్ విశ్వజిదధ్వరేంద్రే
దత్త ప్రతాపార్జితరశ్మిరాశిః
సహస్ర రశ్మేః ధనవంశ రత్నమ్
అకించనత్వమ్ శ్రావయతి ధ్రువమ్ మాయ్ ॥
(इति गच्छति)
(ततः प्रविशति मृण्मयपात्रहस्तः रघुः पूजितः कौत्सश्च )
भावः విశ్వజిత్ యాగాన్ని పూర్తిచేసి, తన పరాక్రమంతో సంపాదించిన సంపదంతా దానం చేసినవాడు, సూర్యవంశపు రత్నం వంటివాడైన ఈ రఘుమహారాజు, ఇప్పుడు మట్టిపాత్రను ధరించి తన అకించనత్వాన్ని (పేదరికాన్ని లేదా ఏమీ లేని స్థితిని నాకు చాటి చెబుతున్నాడు.
(ఆ తర్వాత చేతిలో మట్టిపాత్రను పట్టుకుని రఘు మహారాజు ప్రవేశిస్తాడు. కౌత్సుడు ఆయనను ఆర్ఘ్యపాద్యాలతో పూజిస్తాడు.
Kautsa : “Friend! You reminded me well. I am going exactly where emperor Raghu resides.” (Exit)
(Then enters king Raghu holding earthen vessel, kausta is honored by him)
Having performed the vishvaj sacrifice and given away all the wealth earned through his valor, king Raghu – the jewel of the solar dynasty-now proclaims his state of having nothing (poverty) to me by holding this earthen vessel.
रघु: : मुनिचन्द्र !
“कुशाग्रबुद्धे कुशली गुरुस्ते
विद्यावदान्यो वरतन्तुमौनी ।
कीर्तिध्वजो यस्य भवान् सजीवः
पवित्रयत्यङ्घ्रिकणैरयोध्याम् ॥
“కుశాగ్రబుద్ధే కుశలీ గురుస్తే
విద్యావదాన్యో వరతంతుమౌనీ
కీర్తిధ్వజో యస్య భవాన్ సజీవః
పవిత్రయత్యంమ్రి కణైరయోధ్యామ్
రఘువు : “మునిచంద్రా (ఓ ముని శ్రేష్ఠుడా!)
भावः- (కుశాగ్రబుద్ధి గల నీ గురువు వరతంతు మహర్షి కుశలమే కదా? ఆయన కీర్తికి ఒక ధ్వజం (జెండా) వంటి వాడైన నీవు చిరంజీవివి కమ్ము. పవిత్రమైన ఈ అయోధ్యానగరానికి” – నీకు స్వాగతం !”
भावः- కుశాగ్ర బుద్ధి కలవాడా ! గొప్ప విద్యాదాత అయిన నీ గురువు వరతంతు మహర్షి క్షేమమే కదా ? ఆయన కీర్తిని దశదిశలా చాటే జెండా వంటి నీవు చిరంజీవివి కమ్ము. నీ పాద స్పర్శతో ఈ అయోధ్య పవిత్రమైనది.
Raghu : “O Moon among sages !
Is your teacher, the sharp – minded varatantu, doing well ? may you, who are like the banner of his fame, live long, welcome to this sacred city of Ayodhya !”
कौत्सः – सार्वभौम ।
“त्वयि धर्मपरे भाति धार्मिकाणाम् कुतोऽसुखम् ।
“తయి ధర్మపరే భాతి ధార్మికాణామ్ కుత్యోశుఖమ్ |
वंशवृद्धे तवानन्ते भाति भानौ कुतस्तमः ॥”
వంశవృద్ధే తవానంతే భాతి భానౌ కుతస్తమః ॥
కౌత్సుడు : “సార్వభౌమా !
भावः- ధర్మపరాయణుడైన నీవు పాలిస్తుండగా, ధర్మాత్ములకు అశుభం ఎక్కడి నుండి వస్తుంది ? వంశాన్ని ఉద్ధరించే సూర్యుడు ప్రకాశిస్తుంటే చీకటి ఎలా ఉండదో, నీ పాలనలో కష్టాలు అలా ఉండవు.
Kautsa : “O sovereign ! When you, the most righteous one, are reigning, how can any misfortune be fall the virtuous? Just as there can be no darkness while the eternal sun is shining, there can be no misery under your rule.
रघु : अद्य राजा संवृत्तः । प्रार्थये युष्मदाज्ञा निर्वहणसपर्यया मां कृतार्थयितुम् ।
कौत्सः (आत्मगतम्) अयं वदान्यः मृण्मयपात्रैः मम स्वागतिकः । मन्ये अयम् दानेन एवंविधाम् दशामनुभवति । न युक्तमेनम् पीडयितुम् । (प्रकाशम्) वदान्यसार्वभौम !
రఘువు : “ఈ రోజు నా జన్మ ధన్యమైనది. నీ వంటి మహానుభావుడికి సేవచేసే భాగ్యం కలిగించినందుకు కృతజ్ఞుడను”.
కౌత్సుడు : (తనలో తాను – ఆత్మగతమ్) :
“ఈయన ఎంతటి గొప్ప దాత ! తన సంపదనంతా దానం చేసి ఇప్పుడు మట్టిపాత్రను వాడుతున్నాడు, ఇంతటి త్యాగమూర్తిని అడిగి మరిన్ని కష్టాలు పెట్టడం ధర్మం కాదు. (ప్రకాశం – బయటకు) ఓ దానగుణశీల సార్వభౌమా !”
Raghu : “My life is fulfilled today. I pray that you allow me to serve you and make my life meaningful.”
Kautsa : (To himself)
“What a great giver he is! Having donated every thing. He is now using an earthen vessel. It is not right to troubled such a selfless soul with its nectar – like rays and like a pure white authmn cloud”.
![]()
सीसम् :
मुनिराजनखलून फलवृद्धिरतएव
तनुशेषनीवार इव विभासि
अमृताशिसुरवृन्द मुखपीत इत एव
कृशबिम्ब पीयूषकर इवासि
सकलप्रपञ्च निर्वृष्टाम्बुरत एव
धवलशारद वारिधर इवासि
याजकयाचक परिखात इत एव
मृच्छेष निक्षेप इव चकासि |
तेट :
नृप ! भवन्तमशेषलोक प्रदत्त
वित्तमद्य मृदर्घ्यपात्रावशिष्ट !
नैव याचे, किमर्दति बालकोपि
शिखिनमाकृष्टचन्द्रकम् चन्द्रकाय ॥
సీసం :
మునిరాజనఖలున ఫలవృద్ధిరత ఏవ
తనుశేష నీవార ఇవ విభాసి ।
అమృతాశిసురబృంద ముఖపీత ఇత ఏవ
కృశబింబ పీయూషకర ఇవాసి
శిఖినమాకృష్ణ చంద్రకం చంద్రకాయ ||”
సకల ప్రపంచ నిర్వృష్టాంబురత ఏవ
ధవళశారద వారి ధర ఇవాసి
యాజకయాచక పరిఖాత ఇత ఏవ
మృచ్ఛేష నిక్షేప ఇవ చకాసి ।
తేటగీతి :
నృప ! భవంతమశేషలోక ప్రదత్త
విత్తమద్య మృదర్ఘ్యపాత్రావశిష్ట !
నైవ యాచే, కిమర్దతి బాలకోపి
भावः- మునితో పోలిక : ” ఓ రాజా ! యజ్ఞం పూర్తి చేసి తన సంపదనంతా దానం చేసిన నీవు, కేవలం తన ప్రాణాలను నిలబెట్టుకోవడానికి సరిపడా ‘నీవార’ ధాన్యాన్ని (మునులు తినే అడవి ధాన్యం) మాత్రమే ఉంచుకున్న మునిలా ప్రకాశిస్తున్నావు”.
చంద్రుడితో పోలిక : అమృతాన్ని దేవతలు తాగేయగా కేవలం ఒక్క కళతో మిగిలి ఉండి కూడా ఆహ్లాదాన్నిచ్చే చంద్రుడిలా నీవు కనిపిస్తున్నావు.
శరత్కాలమేఘంతో పోలిక : ప్రపంచమంతటికి వర్షాన్ని కురిపించి, ఇప్పుడు నీరులేక తెల్లగా, తేలికగా మారిన శరత్కాలపు మేఘంలా, నిర్మలంగా ఉన్నావు”
తవ్విన కందకంతో పోలిక : “యాచకులు, విద్వాంసులు అనేవారు తవ్వగా, కేవలం మట్టి మాత్రమే మిగిలి ఉన్న నిధి (లేదా కందకం) లాగా నీవు ఉన్నావు.”
ఓ రాజా ! లోకమంతటికీ దానాలు చేసి, ఇప్పుడు కేవలం మట్టి పాత్ర మాత్రమే మిగిలి ఉన్న నీ దగ్గర నేను ఏమీ అడగదలచుకోలేదు. నెమలి పింఛం మీద ఉన్న ‘చంద్రకం’ (కన్నువంటి ఆకారం) కోసం ఏ బాలుడైనా
ఆకాశంలోని చంద్రుడినే లాగాలని కోరుకుంటాడా ? (అంటే నీకున్న కొద్దిపాటిని కూడా నేను అడగను అని అర్థం)
Sisam poem (Summery) : O’ great sage ? you shine with the fruit of your penance. You appear like the moon with its nectar-like rays and like a pure with autumn cloud. You penance has sanctioned even these clay vessels of ours.” O’ king! you have given away all your wealth to the entire world and are now left only with an earthrn vessel for worship! I shall not ask you for anything does even a child try to pull the man from the sky just to get the ‘moon’ (eye) on a peacock’s feather ?”
![]()
III.
रघुः (सशडंकम्) ब्रह्मचारिन् ! नूनं त्वम् धनार्थी आगतः । प्रथमं प्रशान्तचित्तेन सर्वम् वृत्तान्तम् कथय । अनन्तरम् ‘शक्या शक्य विचारणाम्’ कुर्वः ।
कौत्सः । महाराज! अहम् मम गुरवे वरतन्तुमुनीन्द्राय समर्पणीयाम् गुरुदक्षिणाम् याचितुम् भवत्समीपमागतः ।
रघुः : तर्हि ? किमर्थमन्यत्र साधनापेक्षा ?
कौत्सः : महती धनराशिरिति ।
रघुः : कियती ?
कौत्सः : चतुर्दशकोटि सुवर्णमुद्राः ।
रघुः : (सविस्मयम्) अश्रुतपूवीसौ गुरुदक्षिणा तृणीकृतक्षमाभोगः श्रूयते ते गुरुर्मुनिः । इयद्धनम् कथं वाञ्छेत् दुर्लभम् शिष्यवत्सलः ।
कौत्सः : चक्रवर्तिन् ! तस्य वाञ्छा नात्र हेतुः । किन्तु ममैव निर्बन्धः ।
रघुः : कथमिव ?
రఘువు : (చిరునవ్వుతో) “బ్రహ్మచారీ! నీవు ఏదో ఒక కోరికతో ఇక్కడికి వచ్చావు. మొదట నీ రాకకు గల కారణాన్ని చెప్పు. ఆ తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం.”
కౌత్సుడు: “మహారాజా ! నా గురువు గారైన వరతంతు మహర్షికి సమర్పించాల్సిన గురుదక్షిణను అర్థించడానికి (అడగడానికి) మీ వద్దకు వచ్చాను.”
రఘువు : “అయితే ఇక్కడ ధనంతో పని ఉందన్న మాట ?”
కౌత్సుడు : అవును, చాలా పెద్ద మొత్తంలో ధనం అవసరం.
రఘువు : ఎంత కావాలి ?
కౌత్సుడు : “పదునాలుగు కోట్ల బంగారు నాణేలు !”
రఘువు : (ఆశ్చర్యంతో) అనురూపమైన గురుదక్షిణే! నీవు గురువు పట్ల చూపే భక్తికి ఇది తార్కాణం. కానీ ఇంతటి అరుదైన ధనం నీ గురువుగారు ఎందుకు కోరారు ?”
కౌత్సుడు : “చక్రవర్తీ ! దీనికి కారణం ఆయన కోరిక కాదు. నా మొండితనం (నిబంధః) మాత్రమే”.
రఘువు : “అది ఎలా ”
Raghu : (with a smile) “O Brahmachari ! you have come here with some purpose. First, tell me the reason for your visit. We shall discuss other matters later.”
Kaustsa : “Great King! I have come to you to seek (beg for) the Guru Dakshina that I must offer to my teacher, sage varatantu”.
Raghu : “So there is a need for wealth here ?”
Kaustsa : “Yes, a vast amount of wealth is required”.
Raghu : “How much?”
Kaustsa : “Fourteen crores (140 million) gold coins !”
Raghu : (with surprise) “A fitting Guru Dakshina indeed ! It shows your great devotion to your teacher. But why did your Guru desire such an immense and rare amount of wealth?”
Kaustsa : “O Emperor ! His desire is not the reason for this, it is only because of my own stubbornness (Nibandhah)”.
Raghu : “How is that so” ?
కౌత్సుడు : శ్లోకం :
‘शुश्रूषा गुरुदक्षिणेत्यलमियम् गच्छेति’ सोन्वादिशत्
निर्बद्धश्च मया दुराग्रहधिया ‘दद्याम् वृणीष्वेति’ सः ।
क्रुद्धस्सोऽवददाहरेति सहसा ‘कोटीः चतस्रो दश’
प्राय स्त्वन्नु लभेय तद्धनमिति प्रत्याशयात्रागतः ॥
“శుశ్రూషా గురుదక్షిణేత్యలమియమ్ గచ్ఛేతి” సోన్వశాసన్
నిర్బంధశ్చ మయా దురాగ్రహధియా ‘దద్యాంవృణీష్వేతి సః ॥
క్రుద్దస్సో వదదాహరేతి సహసా “కోటీఃచతస్రోదశ”
ప్రాయస్త్వన్నృ లభేయ తర్ధనమితి ప్రత్యాశయాత్రాగతః ॥
भाव:- నేను చదువు పూర్తి చేసుకున్నాక నా గురువుగారు “నీవు చేసిన సేవలే నాకు గొప్ప గురుదక్షిణ, ఇక ఏమీ వద్దు. నువ్వు వెళ్ళవచ్చు” అని చెప్పారు. కానీ నేను మొండితనంతో ‘ఏదైనా కోరుకోండి. నేను ఇస్తాను. అని ఆయనను బలవంతం చేసాను. దానితో ఆయన కోపించి – ‘అయితే, నువ్వు నేర్చుకున్న పద్నాలుగు విద్యలకు ప్రతిగా వెంటనే పదునాలుగు కోట్ల బంగారు నాణేలను తీసుకురా ! అని ఆజ్ఞాపించారు. ఆ ధనం నీ వంటి మహానుభావుడి ద్వారానే లభిస్తుందనే ఆశతో నీ వద్దకు వచ్చాను.”
Kaustsa : (slokam) “The Guru said, “Your service itself is my fee (Dakshina), this is enough, you may go. ‘But out of my stubbornness, I insisted, please ask for some- thing, I shall give it. “Angered by any persistence, he suddenly said, ‘Then bring fourteen crore of gold coins. Thinking that I might obtain such wealth from a king like you, I have come here with hope.”
रघुः : कथम् प्रत्याशा नाम
” वदान्यम् मां परित्यज्य वदान्यम् यासि कम् प्रति ? |
ज्ञानाग्निः त्वम् चतुर्थः स्याः अग्निहोत्रगृहे मम” ॥
अपिच
“వదాన్యమ్ మామ్ పరిత్యజ్య వదాన్యమ్ యాసికమ్ ప్రతి ? |
జ్ఞానాగ్ని త్వమ్ చతుర్ధః స్యాః అగ్నిహోత్రగృహే మమ ॥
भाव:- “ఓ కౌత్సా ! దాత నైన నన్ను వదిలిపెట్టి, నీవు వేరే ఏ దాత దగ్గరకు వెళ్తావు ? (అంటే వెళ్ళకూడదు) నా అగ్ని హోత్ర గృహంలో ఇప్పటికే మూడు పవిత్ర అగ్నులు (గార్హపత్య, ఆహవనీయ, దక్షిణాగ్నులు) ఉన్నాయి. గొప్ప విద్యావంతుడివైన నీవు అక్కడ ‘జ్ఞానాగ్ని’ రూపంలో నాలుగవ అగ్నివి కావాలి. (అంటే నా అతిథిగా ఉండినా ఇంటిని పవిత్రం చేయాలి)”.
అపిచ – మరియు, అంతేకాకుండా
Raghu : “Leaving a giver like me, to which other giver would you go ? In my house of sacred fires, you, the fire of knowledge, shall be the fourth fire.
चन्द्रम् चकोर इव सुर्यमुपेक्ष्य गन्ता
मां सुर्यवंशतनयम् परिमुच्य मागः
तिष्ट द्विज क्षनमकिञ्चनवत् प्रतीक्ष्य
पर्जन्यवत् कनकवर्षमहम् करिष्ये ॥
చంద్రమ్ చకోర ఇవ సూర్యముపేక్ష్య గంతా ఇల్లు
మాం సూర్యవంశతనయమ్ పరిముచయ మాగాః ।
తిష్ఠ ద్విజ క్షణమకిఇ్చనవత్ ప్రతీక్ష్య
పర్జన్యవత్ కనకవర్షమహమ్ కరిష్కే” ॥
రఘువు : ఎలా? ఎందుకు? (అల్పమైన ఆశ లేదా నిరాశ అని అంటున్నావు ?)
भावः- చకోర పక్షి వెన్నెలను యిచ్చే చంద్రుడిని వదిలి, సూర్యుడి దగ్గరకు వెళ్తుందా? (వెళ్ళదు) అలాగే సూర్యవంశపు రాజునైన నన్ను వదిలి నీవు వేరే ఎవరినీ యాచించవద్దు. ఓ ద్విజుడా ! ఏమీ లేని వాడిలా (అకించనుడిలా) కొంచెం సేపు ఓపికతో వేచి ఉండు. ఆకాశం నుండి మేఘం వర్షం కురిపించినట్లుగా, నీ కోసం నేను బంగారు వర్షాన్ని (కనకవర్షం) కురిపిస్తాను !”
అంతేకాకుండా / Further more / also “Does a chakora bird ever leave the moon to go to the sun? Do not leave me, ascion of the solar dynasty, to seek elsewhere. O leaned one ! wait for a mo- ment, I shall shower a rain of gold for you just like a cloud.”
![]()
IV.
(ततः प्रविशतः रघुवशिष्ठौ)
रघुः : ब्रह्मन् ! अद्य वरतन्तु शिष्यस्य कौत्सस्य सारस्वतमनोरथमपूरयित्वा कुतो मे विश्वजितः प्रशस्तिः ? हन्तभोः ! किमर्ककुलस्य अपकीर्तिच्छायाग्रहः ?
वशिष्टः : आयुष्मन् ! अलम् विषादेन । धर्मसङ्कल्प एवं स्वयम् इष्टेषु चेष्टते ।
रघुः : किन्तु कथङ्कारमिदानीम् साधयामि ।
(అప్పుడు రఘువు మరియు వసిష్ఠుడు ప్రవేశిస్తారు)
రఘువు : “భగవాన్ ! వరతంతు మహర్షి, శిష్యుడైన కౌత్సుని కోరిక తీర్చలేకపోతే, నేను చేసిన ఈ ‘విశ్వజిత్’ యాగానికి ఏం ప్రయోజనం ? అయ్యో ! రఘు వంశానికి అపకీర్తి వస్తుందేమో అని భయంగా ఉంది”.
వసిష్ఠుడు : “ఆయుష్మాన్ ! (చిరంజీవి) బాధపడకు. ధర్మ సంకల్పం ఎప్పుడూ సిద్ధినే ఇస్తుంది. దానికి మార్గం సుగమం అవుతుంది”.
రఘువు : “కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి ? నేను చక్రవర్తినే కానీ … (Then enter Raghu and Vasistha)
Raghu : “O Holyone! Ifthe desire of kausta, the disciple of sage varatantu, remains unfulfilled, what the point of my fame as a ‘world conqueror’ (vishvajit) ? Alas. If the Raghu dynasty defined to be overshad- owed by the stain of ill Repute?
Vasistha: “O long-lived one ! Enough with this despair. A righteous resolve itself to find its own path to fullfillment.
Raghu : “But how can it be achieved now ?
” न कोऽपि जेयो मम विश्वजेतुः
गृहीतपूर्णा बलयः प्रजाभ्यः ।
पुनर्विधानञ्च बलेः यदि स्यात्
समं हि मुष्टिम्पचयाचनेन ॥”
“న క్కోపి జేయో మమ విశ్వజేతుః
గృహీతపూర్ణా బలయః ప్రజాభ్యః ।”
“పునర్విధాతుం చ బలైః యది స్యాత్
సమం హి ముష్టిష్మచయాచనేన ॥”
वशिष्ठः : शुणु ! अस्ति कक्ष्चित् अपूर्वः उपायः ।
వసిష్ఠుడు : “వినూ! (శృణు!) దీనికి ఒక పూర్వమైన ఉపాయం ఉంది.”
भावः- “నేను విశ్వజిత్ యాగాన్ని గెలిచాను. ప్రజల నుండి కేవలం పుణ్యాన్ని (పన్నుల రూపంలో) మాత్రమే తీసుకున్నాను. నా వద్ద ఇప్పుడు ఏమీ లేదు. మళ్ళీ సైన్యాన్ని పంపి ఎవరినైనా జయించి ధనం తేవడం అనేది, ఒక చక్రవర్తిగా నా గౌరవానికి తగదు. యాచించడం కంటే అది హీనమైన పని”.
“No Other king remains to be conquered by me, the winner of the world; I have only taken the merit of good deeds as taxes from my subjects. To attempt to gather wealth again by force would be as demening as begging.”
मनुष्यवाहोस्ति हि राजराजः
त्वया स जेयो मनुजेश ! शेषः
अभुक्तदत्तम् यदमुष्य वित्तम्
जित्वार्पय त्वम् गुरुदक्षिणायै ॥
“మనుష్య వా హోస్తి హి రాజరాజః
త్వయా స జేయో మనుజేశ ! శ్రేషః ?
అభీప్సితం యదముష్య విత్తం
జిత్వార్పయ త్వం గురుదక్షిణాయై |
भावः- ఓ రాజా ! మనుషులచే మోయబడే వాహనం కలిగినవాడు, యక్షులకు రాజైన కుబేరుడు ఉన్నాడు. నీవు ఆయనను జయించి, ఈ బ్రాహ్మణుడైన కౌత్సుడు తన గురుదక్షిణ కోసం కోరుకున్న పధ్నాలుగు కోట్ల బంగారు నాణేలను ఆయన నుండి సాధించి ఇవ్వు”.
Vasistha : “Listen ! There is an extraordinary(Apporva) way”. There is a king of kings (Kubera) who lives beyond the reach of ordinary men. You must conquer him and obtain the wealth required for your guest’s Dakshina”.
रघुः : दिष्टया ! भवन्मन्त्रितरथस्य मे सर्वत्र अप्रतिहता गतिः । इदानीमेव कुबेरम् अभिषेणयामि (इति उत्तिष्ठति)
वशिष्ठः : (उत्याय) राजराजम् जित्वा राजधिराजो भव |
రఘువు : అదృష్టవశాత్తూ సరైన సమయంలో మంచి మార్గం చూపారు. మీ దీవెన వల్ల నాకు ఎక్కడా అడ్డంకులు ఉండవు. ఇప్పుడే కుబేరుని పై దండయాత్రకు బయలుదేరుతాను !” (అని యుద్ధానికి సిద్ధమై నిలబడతాడు)
వసిష్ఠుడు : (లేచి నిలబడి) “వెళ్ళు రాజా ! ఆ రాజ రాజును (కుబేరుని) జయించి చక్రవర్తివి కమ్ము”.
రఘువు (వినయంగా) “నేను ధన్యుడిని”. (అంతలో తెర వెనుక నుండి “అయ్యో ఇదేమి ఆశ్చర్యం!” అనే కేకలు వినిపిస్తాయి.
Raghu : “By luck ! I have been guided correctly at the right time. By your grace, my path is unobstructed. I shall set out right now to march against Kubera!” (He stands up, ready for battle)
Vasistha : “Go, O king! conquer the king of kings and be- come the Emperor of Emperors”.
Raghu : (Humbly) “I am blessed”.
(Suddenly, voice from backstage
Cry out : “Oh ! what a miracle !”)
Raghu : “What is this wonder ?”
![]()
“ना कोऽपि जेयो मम विश्वजेतुः
तथैव सूर्योऽस्ति न मेघराजिः
पतन्ति चित्रम् करकास्सुवर्णाः |
तत्रापि कोशान्तरमी पतन्ति
शृङ्गं यथा मेरुगिरेः विशीर्णम् ॥
(पटाश्रेपेण प्रविश्य )
తథైవ సూర్యోవస్తి మేఘరాజః
పతంతి చిత్రం కరకాస్సువర్ణాః ।
తత్రాపి కోశాంతరమీ పతంతీ శృంగం
యథా మేరుగిరేః విశీర్ణమ్ ॥”
भाव:- ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. మేఘాలే లేవు. కానీ ఆశ్చర్యకరంగా బంగారు వడగళ్ళు కురుస్తున్నాయి. అవి నేరుగా రాజభవనంలోని ఖజానాలో పడుతున్నాయి. మేరు పర్వతం యొక్క బంగారు శిఖరం ముక్కలై నా కోశాగారంలో పడుతుందా అన్నట్లుగా ఈ దృశ్యం కనిపిస్తోంది.”
వివరణ : ధర్మ విజయం : రఘువు యుద్ధానికి వెళ్ళక ముందే, ఆయన సంకల్పానికి భయపడి కుబేరుడు ధనాన్ని పంపాడు.
కనక వర్షం : దీనినే ‘బంగారు వర్షం’ అంటారు.
దీనితో కౌత్సుడి 14 కోట్ల కోరిక తీరుతుంది.
(पटाश्रेपेण प्रविश्य )
(తెరను వేగంగా ప్రక్కకు నెట్టి లోపలికి ప్రవేశించడం)
The sun is shining and there are no clouds in the sky. Yet a strange rain is falling! Golden coins are falling like hailstones right into my treasury, as if the golden peaks of mount meru are crumbling down!”
The play high lights that when a leader is truly righteous and a seeker is truly honest, even the Gods (Kubera) must serve them. (पटाश्रेपेण प्रविश्य )
“Entering with the toss of the curtain”
भट : देव ! आश्चर्य, माश्चर्यम् |
उत्पूयमान रवि रश्मि कडङगराभः
मूर्ता वरा इव च विष्णुपदावतिर्णाः |
ताराकणा इव पतन्ति विचित्रवर्णाः
कोशे नृपेन्द्र ! तव प पद्यकटाक्षधाराः ॥
ఉత్పశ్యమాన రవి రశ్మి కడంగరాభాః
మూర్తా వర ఇవ చ విష్ణుపదావతీర్ణః |
తారాకణా ఇవ పతంతి విచిత్ర వర్ణాః
కోశే నరేంద్ర ! తవ పాద్య కటాక్ష ధారాః ॥
భటుడు : (ప్రవేశించి) “దేవా ! ఆశ్చర్యం ! మహాశ్చర్యం !
भाव:- “ఓ రాజా ! నీ కోశాగారంలో అద్భుతమైన బంగారు వర్షం కురుస్తోంది. ఆ బంగారు నాణేలు ఉదయించే సూర్యుడి కిరణాలవలె ఎర్రని కాంతితో మెరుస్తున్నాయి. ఆకాశం నుండి జాలువారుతున్న ఆ నాణేలు, మూర్తీభవించిన దేవతల వరాల వలె మరియు ఆకాశం నుండి రాలిపడుతున్న నక్షత్రాల వలె వింతైన రంగులతో ప్రకాశిస్తూ నీ ఖజానాలో వచ్చి పడుతున్నాయి.”
Soldier (Entering) “My Lord ! Amiracle ! A great miracle !”
भाव:- “Like the rays of the rising sun, like the celestial Ganges flowing from vishnu’s feet, and like stars falling from the sky golden coins of various hues are showering into your treasury. O king of men!”
वशिष्ठः : सुदक्षिणामातः ! कुबेरः त्वामनुगृह्वति
रघुः : भवत्प्रसादेन एतत् संवृत्तम् । देवाः धर्मपक्षपातिनः खलु । वरतन्तु शिष्यम् विदित वृत्तान्तम् कृत्वा धनम् समर्पयामि ।
वशिष्ठ: : बाढम् गच्छावः ।
వసిష్ఠుడు : “రఘు మహారాజా ! కుబేరుడు నీకు అనుకూలుడయ్యాడు.” (నీ పరాక్రమానికి లొంగిపోయాడు)
రఘువు : “మీ అనుగ్రహం వల్లే ఇదంతా సాధ్యమైంది. దేవతలు ఎప్పుడూ ధర్మాన్ని రక్షిస్తారు. వరతంతు మహర్షి శిష్యుడైన కౌత్సుడికి ఈ శుభవార్త తెలిపి, ఆ ధనాన్ని ఆయనకు సమర్పిస్తాను.”
Vasistha : “O son of sudhakshina ! Kubera has favored you (submitted to you)”.
Raghu : “Every thing has happened by your grace. Truly, the gods always protect those who follow Dharma. Having informed kautsa, the disciple of varatantu, of this news, I shall hand over the wealth to him”.
Vasistha : “Very well, tell us go”.
![]()
V:
(ततः प्रविशन्ति रघुकौत्सवशिष्ठाः)
कौत्सः : रघुवीर ! विजयीभव !
“अहो ! रघोरद्य महो महो मे
श्रुतम् न दृष्टम् न कृतम् कदापि ।
दिवौकसोऽप्याशु वनौकसो मे
राजर्षिमन्त्रेण भटन्ति वश्याः ॥
అహో ! రఘోరద్య మహోమహోమే
శ్రుతం నా దృష్టమ్ నా కృతం కదాపి
దివోక్కసోSప్యాసు నౌకసో మే
రాజరివనేన ఘటంతి వశ్యాః ||”
(అప్పుడు రఘువు, కౌత్సుడు మరియు వసిష్ఠుడు ప్రవేశిస్తారు)
కౌత్సుడు : ఓ రఘు వీరా ! నీవు విశ్వజిత్తువు (లోకాన్ని జయించినవాడివి) కమ్ము !”
भावः- ఆహా! రఘుమహారాజు పరాక్రమం ఎంత అద్భుతమైనది ! ఇటువంటి వింతను నేను ఇంతకు ముందెన్నడూ వినలేదు, చూడలేదు. అడవిలో నివసించే ఒక సామాన్య బ్రాహ్మణుడి (నా) కోసం, ఈ రాజర్షి తన పరాక్రమంతో సాక్షాత్తు స్వర్గంలోని దేవతలను (కుబేరుడిని) కూడా వశం చేసుకున్నాడు. ఒక మనిషి కోసం దేవతలు ధనాన్ని వర్షించడమనేది నిజంగా మహాద్భుతం !”
(“Then, Raghu, Kautsa and Vasistha enter the stage)”
“Oh, how wondrous! How magnificent is the glory of king Raghu ! I have never heard of, never seen, not has any one ever performed such a feat. For the sake of a forest – dweller like me (a poor student), this Rajasri (Royal sage) has through his sheer power, made even the residents of heaven (the Gods/Kubera) submit to his will !”
వివరణ : ఈ ఘట్టంలో కౌత్సుడు ఒక ముఖ్య విషయం చెబుతున్నాడు. రఘుమహారాజు కేవలం ఒక రాజు మాత్రమే కాదు, ఆయన ఒక ‘రాజర్షి’ ఆయనకున్న ధర్మబలం మరియు పరాక్రమం వల్లనే కుబేరుడు యుద్ధం చేయకుండానే లొంగిపోయి బంగారు వర్షం కురిపించాడు.
Kautsa adressess Raghu as a Rajarsi, acknowledging that his power comes from his saintly character, not just his weapons. The play concludes by showing that when both the ruler and the scholar are selfless, even the God of wealth (kubera) becomes their servant.
रघुः : वर्णिन् ! अयम् तवैव प्रभावः कुतविद्यस्य | इदानीम सर्वं धनम् गृहीत्वा त्वाम् माञ्च कृतार्थं कुरु |
कौत्सः : नहि नहि सर्वं धनमिति । केवल मपेक्षितमेव ग्रहीष्यामि।
रघुः : भवदर्थम् सङ्कल्पितम् कुबेरेण समर्पितम्, धनम् ईषदपि अहम् कथम् गृह्णीयाम् ? न शोभते खलु क्षत्रियाणाम् प्रतिग्रहः ।
कौत्सः : राजर्ष ! अहम् गुर्वर्थमेव याचितवान् । अधिकम् कथम् लोभेन स्वीकरोमि ।
वशिष्ठ: : ननु ब्रह्मचारिन् ! उभावपि युवाम् अभिनन्द्यसत्वौ । किन्तु अत्र एवम् कर्तव्यम् । दानसाद्गुण्यार्थम् अधिकद्रव्यस्य उपयोगो भवतु । एवं न दोषः, नापि लोभः । मन्ये कुबेरस्यापि अधिकम् वर्षतः अयमेव सङ्कल्पः ।
రఘువు : “బ్రహ్మచారీ ! ఇదంతా నీ పుణ్యఫలమే. ఇప్పుడు ఈ ధనాన్ని అంతా స్వీకరించి నన్ను ధన్యుడిని చేయి”.
కౌత్సుడు : “లేదు రాజా, లేదు ! నాకు కావలసింది కేవలం గురుదక్షిణకు సరిపడా ధనం మాత్రమే. అంతకు మించి నేను ఒక్క కాణీ కూడా తీసుకోను”.
రఘువు : “నీకోసం కుబేరుడు పంపిన ఈ ధనాన్ని నేను తిరిగి తీసుకోలేను. ఇది నీకోసమే వచ్చింది. ఒక క్షత్రియుడిగా ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోకూడదు”.
కౌత్సుడు : “మహారాజా ! నేను నా గురువు గారికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ధనాన్ని లోభంతో (ఆశతో) ఎలా స్వీకరించగలను ? అది నాకు తగదు”.
వసిష్టుడు : “ఓ పుణ్యాత్ములారా ! మీ ఇద్దరి వాదనలూ ధర్మబద్ధమైనవే. కానీ నాదొక సూచన మిగిలిన ఈ ధనాన్ని ‘దానశాలలు’ కోసం లేదా ప్రజా ప్రయోజనాల కోసం కోసం ఉపయోగించండి. దీనివల్ల ఎవరికీ దోషం ఉండదు. లోభం ఉండదు. కుబేరుడు పంపిన ఈ అధిక ధనాన్ని మంచి కార్యాలకు వాడటమే సరైన మార్గం.”
Raghu : “O learned Brahmin ! This miracle is the fruit of your own merit. Now, please accept this entire heap of gold and make me fulfilled”.
Kautsa : “No, O king! Seek only the amount required for my Guru’s Dakshina. I shall not touch even a single coin beyond those fourteen crores”.
Raghu : “This wealth was sent by Kubera specifically for your cause. As a king, I cannot take back what has already been designated for a guest, It is yours”.
Kausta : “O emperor ! How can a seeker of truth, be tempted by greed? Taking more than what my Guru prescribed would be a violation of my principles”.
Vashistha (Intervening): “O noble souls! Both of you are standing firm on the path of Dharma. Here is the solution: Let the required amount go to the Guru, and let the remaining surplus be used for the welfare of the public and the construction of rest houses (Dharamsalohs) in this way, the wealth serves a divine purpose without burdening either of you with greed”.
![]()
कौत्सः : यथा भगवान् विधिपुत्रो विधत्ते ।
रघुः : ( कौत्सस्य हस्ते मृण्मयपात्रेण जलम् विकिरति)
कौत्सः : ( हस्तमुद्यम्य, सानन्दम्) चक्रवर्तिन् !
కౌత్సుడు : “వశిష్ఠ మహర్షి చెప్పినట్లే జరుగుగాక ! (యథా భగవాన్ ….)
రఘువు : – కౌత్సుడి యొక్క చేతిలో మట్టిపాత్రతో నీటిని చల్లుతున్నాడు. (దానధారపోస్తూన్నాడు).
కౌత్సుడు : (చేతులు జోడించి, సంతోషంతో) “చక్రవర్తివి కమ్ము !”
Kausta : “As the sage Vashistha ordains, shall it be done.”
Raghu : Sprinkles water from an earthen vessels on Kautsa’s hands as a ritual of offering Holding Kousta’s hand with joy) “O Emperor of knowledge!”
Kausta : (Recites a blessing verse for Raghu)
“विद्यावंशमुपास्य वाञ्छितगुरुद्रव्यम् महीदुर्लभम्
दत्वाहम् कृतकृत्यशिष्यतनयः शौण्डीर्यतस्ते रघो ! ।
तस्मात्ते सकलश्रियः त्वदधिकश्रीमङ्गला अन्वये
जायन्ताम् पुरुषोत्तमाः तव यशःप्रख्यापका राघवाः ॥”
“విద్యావంశముపాస్య వాంఛిత గురుద్రవ్యమ్ మహీదుర్లభమ్
దత్వాహమ్ కృతకృత్యశిష్యతనయః శాన్డీర్యతస్తే రఘో ?
తస్మాత్తే సకల శ్రియః త్వదధిక శ్రీమంగళా అన్వయే.
జాయంతామ్ పురుషోత్తమాః తవ యశః ప్రఖ్యాపకా రాఘవః ॥
भावः- “ఓ రఘువంశ తిలకా ! వశిష్ఠుని వంటి గొప్ప గురువుల వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న నీవు, నా గురుదక్షిణ కోసం సాక్షాత్తు భూమండల సంపదనంతా నాకు దానంగా ఇచ్చావు. నీ త్యాగ గుణానికి, గొప్ప కీర్తికి కౌత్సుడనైన నేను ఎంతో సంతృప్తి చెందాను. పురుషోత్తముడవైన నీ కీర్తి లోకమంతటా ఎల్లప్పుడూ వ్యాపించి ప్రకాశిస్తూ ఉండాలి. నీ వంశ గౌరవం దశదిశలా వ్యాపించుగాక !
“O Raghu ! Having attained rare knowledge and having obtained from you the immense wealth for my Guru – which is otherwise impossible to find on this earth – 1, your son like disciple, have become fulfilled through your valor! Therefore, may men greator than you, endowed with all prosperities and supreme among all (purushottamas), be born in your line age to spread your fame as the Raghus (Raghavas)!”
रघुः : (प्रणम्य) धन्योस्मि
कौत्सः : भगवन् ! ब्रह्मपुत्र ! भवतः कृपया कृतार्थीकृतोहम् गुरुदर्शनाय अनुमतिम् अर्थये ।
वशिष्ठः कौत्स ! शिष्यकौस्तुभ ! तथास्तु ! किन्ते भूयः प्रियमुपहरामि,
రఘువు : (వినయంగా నమస్కరిస్తూ) నేను ధన్యుడిని.
కౌత్సుడు : “భగవాన్ ! వశిష్ఠా ! నీ కృపవల్ల నేను నా గురుదక్షిణ సమర్పించడానికి అనుమతి పొంది కృతార్ధుడినయ్యాను.”
వశిష్ఠుడు : “కౌత్సా ! నీకు శుభం కలుగుగాక ! నీకు ఇంకేదైనా కోరిక ఉందా ?” నీకు ఇంకా ప్రియమైనది ఏమి చేయగలను ?
Raghu : (Bowing with humility) “I am blessed”.
Kausta : “O Holyone! Son of Brahma (Vashishta) ! By your grace, I have achieved my goal. Now, I seek your permission to depart for the sight (Darshana) of my Guru”.
Vashishta : “O Kaustsa the jewel (kaustubha) among disciples So be it. Is there anything else you desire ?”
“आचर्यदीपवरतन्तुशिखाप्रदीप्ता
वर्तिः भवान् किरतु बोधरुचीः समन्तात्
स्नेहोस्तु तत्र रगुदत्तमनन्तिवित्तम्
राज्यम् समुज्ज्वलतु निस्तिमिरम् रघूणाम् ॥
ఆచార్య దీపవర తంతు శిఖాప్రదీప్తా
వర్తి: భవాన్ కిరతు బోధరుచీః సమంతాత్
స్నేహోస్తు తత్ర రఘుదత్తమనంతవిత్తమ్
రాజ్యమ్ సముజ్జ్వలతు నిస్తిమిరమ్ రఘూణామ్ ||
(सर्वे निष्क्रान्ताः)
भावः:- “ఓ కౌత్సా ! నీ గురువు వరతంతు అనే దీపం నుండి వెలిగిన ఈ విద్యా ప్రకాశం లోకమంతటా జ్ఞానాన్ని వెదజల్లుగాక ! నీ హృదయం ఎప్పుడూ అనంతమైన ప్రేమతో, దయతో నిండి ఉండుగాక ! రఘువంశపు పాలనలో అజ్ఞానమనే చీకటి తొలగిపోయి, రాజ్యం ఎప్పుడూ వెలుగులతో విరాజిల్లుగాక !’
![]()
“O kautsa! you are the bright flame to the lamp that is your teacher varatantu may you spread the light of your knowledge every-where. With the oil (sneha / affection) ofthe vast wealth given by Raghu, may the kingdom of the Raghus shine forever, free from the darkness of ignorance”.