शकुन्तला पतिगृहं प्रतिष्ठते Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Sanskrit Study Material Pdf उपवाचकम् 1st Lesson शकुन्तला पतिगृहं प्रतिष्ठते Questions and Answers Summary.

Inter 2nd Year Sanskrit शकुन्तला पतिगृहं प्रतिष्ठते Questions and Answers

अभ्यासः

प्रश्नाः

प्रश्न १.
काव्येषु किं म्यम् ?
(కావ్యాలన్నింటిలోనూ ఏది అత్యంత సుందరమైనది ?
What is the most beautiful among all literary works (Kavyas)
जवाब:
काव्येषु नाटकं रम्यम् ।
కావ్యాలన్నింటిలోనూ ‘నాటకం’ అత్యంత సుందరమైనది.
Drama (Natakam) is the most beautiful among all literary works.

प्रश्न २.
कदा शकुन्तलयाः उत्सवः भवति ?
(శకుంతలకు ఎప్పుడు పండుగలా ఉంటుంది. ?)
(When does it feel like a festival for Shakuntala ?)
जवाब:
वृक्षाणाम् आद्ये कुसुमप्रसूति-समये शकुन्तलायाः उत्सवः भवति । చెట్లకు తొలిసారి పూలు పూచినప్పుడు శకుంతలకు పండుగలా ఉంటుంది. (At the time of the First flowering (blossoming) of the trees.

प्रश्न ३.
शकुन्तला आश्रमात् क्व याति ?
(శకుంతల ఆశ్రమం నుండి ఎక్కడికి వెళ్తంది ?)
(Where is Shakuntala going from the hermitage?)
जवाब:
शकुन्तला आश्रमात् पतिगृहंयाति ।
శకుంతల ఆశ్రమం నుండి భర్త ఇంటికి వెళుతోంది.
To her husband’s home.

प्रश्न ४.
कः पापशड्किं ?
(ఏది కీడును లేదా అశుభాన్ని శంకిస్తుంది)
(What is it that suspects evil or misfortune?)
जवाब:
अति स्नेहः पापशङ्की ।
అమితమైన ప్రేమ కీడును శంకిస్తుంది.
“Excessive affection”

शकुन्तला पतिगृहं प्रतिष्ठते Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

शकुन्तला पतिगृहं प्रतिष्ठते Summary in Telugu & English

पाठ्यभाग परिचयः

काव्येषु दृश्यकाव्यानि श्रव्यकाव्यानीति च द्विधा विभागः । येषां श्रवणेन वाचनेन वा रसास्वादोपयोगिता तानि श्रव्यकाव्यानि । येषां साभिनयप्रयोगसाध्यदर्शनसहकृतं श्रवणमेव रसास्वादोपयोगि भवति तानि दृश्यकाव्यानि इति प्रथन्ते । एतानि च दृश्यकाव्यानि दशरूपकाणीत्यपि व्यवह्रियन्ते । तेषु प्रधानत्वात्प्रमुखत्वाच्च नाटकस्य पुरातनानां महाकवीनां स्वारसिकी तत्र प्रवृत्तिः । नाटकेष्वपि

‘काव्येषु नाटकं रम्यं,
तत्रापि च शकुन्तला ।
तत्रापि च चतुर्थोऽङ्कः
तत्र श्लोकचतुष्टयम्’ |

“కావ్యేషు నాటకం రమ్యం,
తత్రాపిచ శకుంతలా |
తత్రాపిచ చతుర్ధాంకో,
తత్ర శ్లోక చతుష్టయమ్” ||

కావ్యాలు దృశ్యకావ్యాలు, శ్రవ్యకావ్యాలు అని రెండు రకాలు. ఏవైతే అభినయపూర్వక ప్రదర్శన ద్వారా చూడదగినవిగా ఉంటాయో అవి దృశ్య కావ్యాలు. ఏవైతే కేవలం వినడం ద్వారా లేదా చదవడం ద్వారా ఆనందాన్ని ఇస్తాయో అవి శ్రవ్య కావ్యాలు. ఈ దృశ్య కావ్యాలనే ‘దశ రూపకాలు’ అని కూడా అంటారు. వీటిలో ‘నాటకం’ అనేది ప్రధానమైనది మరియు ముఖ్యం కావడమే కాకుండా, పురాతన మహాకవులందరూ నాటక రచన పట్ల ఆసక్తి చూపేవారు.

ఈ క్రింది శ్లోకం నాటక ప్రాశస్త్యాన్ని వివరిస్తుంది.

భావం :
కావ్యాలన్నింటిలోనూ నాటకం చాలారమ్యమైనది (అందమైనది).
నాటకాలన్నింటిలోనూ ‘శకుంతల’ (అభిజ్ఞాన శాకుంతలం) నాటకం అత్యంత శ్రేష్ఠమైనది.
ఆ నాటకంలో నాల్గవ అంకం ఎంతో హృద్యంగా ఉంటుంది.
ఆ నాల్గవ అంకంలో ఉన్న నాలుగు శ్లోకాలు మరీ ముఖ్యమైనవి.

Literature (Kavyas) is divided in to two types. Drishya kavyas (visual literature) and shravya kavyas (Aural literature)

Drishya kavyas:
Those which are capable of being seen through” acting and performance

Sravya kavyas:
Those with provide aesthetic pleasure only through listening or reading.

These Drishya Kavyas are also referred as ‘Dasarupakas’ Among them, the ‘Nataka’ (Drama) is the most prominent and important. Since ancient times, great poets have naturally shown a great inclination toward writing dramas.

Kavyeshu

Among all forms of literature, Drama is the most beautiful.
Even among dramas, they play ‘Shakuntala’ is the finest.
In that play, the fourth act is the most heart-touching.
And within that forth act, the four specific verses are the most sublime.

इति साहित्यविदां प्रसिद्ध्या शाकुन्तलनाटकस्य प्रथमगणनीयता । अस्य नाटकस्य कर्ता प्रसिद्धो महाकविः कालिदासः ।

సాహిత్యకారుల అభిప్రాయం ప్రకారం నాటకాలన్నింటిలో ‘శాకుంతల నాటకం’ మొదటి వరుసలో ఉంటుంది. ఈ నాటక కర్త జగత్ప్రసిద్ధుడైన మహాకవి కాళిదాసు.

According to literary scholars. The play ‘Shakuntala’ holds the fore most position among all dramas. The author of this play is the world renowned great poet kalidasa.

अत्र चोद्धृतो भागश्चतुर्थाङ्कगतः । अत्र पुत्रप्रेमास्पदां शकुन्तलां मृगयाव्याजेनाश्रमपदं प्राप्ते महाराजदुष्यन्ते बद्धभावां तेन च परिणीतामन्तर्दृशा ज्ञातवान् काश्यपस्तां सानन्दमभिनन्द्य पतिगृहं प्रेषयितुकामो दुहितृवियोगप्रयुक्तां वेदनामनुभवति । एवं गुरुजनाधिकारमनुध्यायन् तामुपदिशति, तथा दुष्यन्तं सन्दिशति च । तत्र ‘यास्यत्यद्य शकुन्तलेति, सेयं याति शकुन्तला पतिग्रहम्, अस्मान् साधु विचिन्त्य, शुश्रूषस्व गुरून् अन्ते च ‘अर्थो हि कन्या परकीय एव इत्यादिभिः कण्वमुखेन प्रकटितस्य कुटुम्बिजनव्यवहारस्य अक्षरशोऽनुभववेद्यस्य निर्माता कविर्यत्सत्यं कविकुलगुरुरेव । ईदृशीनां रसभावाविष्करणपटीयसीनां महाकविकृतीनामास्वादयितारो न केवलं भारतीयाः किन्तु परम्परातः संस्कृतवाङ्मये परिचयरहिताः पाश्चात्या अपि महता प्रयासेन संस्कृतभाषाज्ञानं कथञ्चित्सम्पाद्य तावन्मात्रेणैव नाटकीयरसास्वादमनुभवन्ति । श्रूयते किल गटे नामा जर्मनदेशीयः पण्डितो नाटकमिदं वाचयित्वा हर्षनिर्भरं ननर्त इति । अपरे च पाश्चात्यपण्डिता एतन्नाटककर्तारं कालिदासं षेक्स्पियर् सदृशमेव मन्यन्ते | वस्तुतस्तु नायं षेक्स्पियर् सदृशः, किन्तु स एव कालिदाससदृश इति वक्तुं युज्यते ।

ఇక్కడ ఇవ్వబడిన భాగం నాల్గవ అంకం నుండి గ్రహించబడినది. వేటనెపంతో ఆశ్రమానికి వచ్చిన దుష్యంతుడిని, తన కూతురితో సమానమైన శకుంతల ప్రేమించి వివాహం చేసుకున్నదని కణ్వమహర్షి (కాశ్యపుడు) తన దివ్యదృష్టితో తెలుసుకుంటాడు. ఆయన దానిని సంతోషంగా అంగీకరించి, ఆమెను అత్తవారింటికి పంపాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో ఒక తండ్రిగా తన కుమార్తె ఎడబాటు పట్ల కశ్యపుడు పొందే వియోగ వేదనను ఈ పాఠం వివరిస్తుంది.

The excerpt provided here is from the fourth act. Sage kanva (Kasyapa) learns through his divine vision that Shakuntala, who is like a daughter to him, has fallen in love with and married king Dushyanta, who had visited the hermitage on the pretext of hunting, welcoming this union happily, the sage prepares to send her to her husband’s home, experiencing the profound sorrow of separation from his daughter.

ఈ విధంగా పెద్దల ఆజ్ఞలను అనుసరించమని ఆమెను (శకుంతలకు) ఉపదేశిస్తూ, దుష్యంతుడికి కూడా సందేశాన్ని పంపుతాడు. అక్కడ యాస్యత్యద్య ….. (ఈ రోజు శకుంతల వెళ్తంది. మరియు అర్ధోహికన్యా పరకీయ ఏవ …. (కన్య నిశ్చయముగా పరాయిధనమే ….) వంటి శ్లోకాల ద్వారా కణ్వమహర్షి నోట పలికించిన కటుంబ జీవన ధర్మం, కాళిదాసు యొక్క లోకజ్ఞతకు మరియు కవిత్వ పటిమకు నిదర్శనం ఇలాంటి రసభావాలను వ్యక్త పరచడంలో మేటి అయిన మహాకవి కాళిదాసును ‘కవికులగురువు’ అని పిలవడం సముచితం.

‘ ……………….experience the pain (of separation). In this manner, while advising her to follow the commands of her elders, he also sends a message to Dushyanta. In this context, through verses like ‘Yaasyatyadya… Shakuntala departs today…) and Artho hi kanya parakiya eva…. (A daughter is indeed someone else’s property….) The depiction of family values and worldly wisdom through sage Kanva’s words reflects Kalidasa’s mastery over poetry and life. Because of his unparalleled ability to express such deep emotions and aesthetics (Rasas), it is appropriate that he is honored as ‘Kavikula Guru) (The preceptor of all poets).

సంస్కృత భాష తెలియని పాశ్చాత్యులు కూడా ఎంతో శ్రమించి సంస్కృతాన్ని నేర్చుకుని ఈ నాటకాన్ని చదివి ఆనందించారు. జర్మనీ దేశానికి చెందిన గోథే (Goethe) అనే పండితుడు ఈ నాటకాన్ని చదివి పరవశించి నాట్యం చేశాడని మరికొందరు పాశ్చాత్య పండితులు కాళిదాసును ‘భారతీయ షేక్స్పియర్’ అని కొనియాడారు. కానీ నిజానికి “షేక్స్పియర్ కాళిదాసు వంటివాడని” చెప్పడమే సరైనది.

Even westerners who were initially unacquainted with Sanskrit took great pains to learn the language just to appreciate this play. It is said that the famous German scholar Goethe was so overwhelmed with joy upon reading this drama that he danced in ecstasy. Some Western scholars have called Kalidasa the Shakespeare of India. “However, It is more accurate to say that Shakespeare is like Kalidasa.”

शकुन्तला पतिगृहं प्रतिष्ठते Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

(ततः प्रविशति स्नानोत्तीर्णः काश्यपः )

“తరువాత స్నానం ముగించుకుని కణ్వమహర్షి (కాశ్యపుడు) ప్రవేశిస్తాడు

There upon enters sage Kanva (Kashyapa) having finished his ceremonial bath”.

काश्यपः :- यास्यत्यद्य शकुन्तलेति हृदयं संस्पृष्टमुत्कण्ठया,
कण्ठः स्तम्भितबाष्पवृत्तिकलुषश्चिन्ताजडं दर्शनम् ।
वैक्लव्यं मम तावदीदृशमहो स्नेहादरण्यौकसः,
पीड्यन्ते गृहिणः कथं नु तनयाविश्लेषदुःखैर्नवैः ॥ ॥१॥

యాస్యత్యద్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా,
కంఠః స్తంభిత బాష్పవృత్తికలుషశ్చింతా జడం దర్శనమ్ |
వైక్లవ్యం మమ తావదీదృశమహో స్నేహాదరణ్యాకసః
పీడ్యంతే గృహిణః కథం ను తనయా విశ్లేషదుఃఖైర్నవైః ||

पतिपदार्थः

अद्य = ఈ రోజు = Today
शकुन्तला = శకుంతల = Shakuntala
यास्यति = వెళ్ళిపోతోంది అని = That she will depart
हृदयं = నా మనస్సు = My Heart
उत्कण्ठया = దు:ఖము కూడిన ఉద్వేగముచే = With intense grief
संस्पृष्टं = నిండిపోయింది = Is overwhelmed
कण्ठः = గొంతు = My throat
स्तन्भितः = అణచిపెట్టిన = Suppressed
बाष्पवृत्ति = కన్నీటి ప్రవాహముచే = By the flow of tears
कलुषः = బొంగురుపోయినది = Is choked hoarse
दर्शनम् = నా చూపు = My vision
चिन्ताजडं = విచారముచే మొద్దుబారిపోయినది = Is benumbed by worry
अरण्यौकसः = అడవిలో నివసించే మునినైన = For a forest dweller
ममतावत् = నాకే = For me indeed
स्नेहात् = ప్రేమ వలన = Due to affection
ईदृशं = ఇటువంటి = Such
वैकलब्यं = వ్యాకులత = State of distress
अहो = ఆశ్చర్యము ! = Oh !
गृहिणः = గృహస్థులు (తండ్రులు) = Householders (fathers)
र्नवैः = కొత్తదైన = New
तनयाविश्लेष = కూతురి = By the grief
दुःखै = ఎడబాటు బాధలచే = Of seperation from daughters
कथं न पीड्यन्ते = ఇంకెంతగా పీడించబడతారో = How much more would they suffer

भावः- “శకుంతల ఈ రోజు అత్తవారింటికి వెళ్ళిపోతోందని తెలియగానే, నా హృదయం ఉద్వేగంతో నిండిపోయింది. కన్నీళ్ళు, ఆపుకోవడం వల్ల నా గొంతు బొంగురుపోయింది. విచారం వల్ల కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు. అడవిలో ఉంటూ వైరాగ్యంతో ఉండే నాకే పెంచిన కూతురి మీద ప్రేమతో బాధ కలుగుతుంటే, మొదటిసారి కూతురిని అత్తవారింటికి పంపే గృహస్థులు ఇంకెంతటి నరకాన్ని అనుభవిస్తారో కదా !” అని కణ్వ మహర్షి వాపోయారు.

“Today Shakuntala is departing (to her husband’s house) at this thought, my heart is overwhelmed with grief my throat is chocked due to suppressed tears, and my vision is blurred by deep anxiety. If I, mere forest dweller an (ascetic), feel such intense agony out of sheer affection for an adopted daughter, then how much more would householders (fathers) suffer from the fresh pangs of separation when their daughters leave home for the first time?”

सख्यौ : हला शकुन्तले, अवसितमण्डनासि । परिधत्स्व साम्प्रतं क्षौमयुगलम् (शकुन्तला उत्थाय परिधत्ते )

“సఖీ శకుంతలా ! నీ అలంకరణ పూర్తయింది. ఈ పట్టు వస్త్రాల జంటను ధరించు. (అని చెబుతూ శకుంతలను ప్రయాణానికి సిద్దం చేస్తారు.)

Friends (Anasuya & Priyamvada) “Friend Shakuntala, your dressing is complete. Now put on this pair of silken garments.”
(Shakuntala stands up and puts them on).

गौतमी : जाते, एष त आनन्दपरिवाहिणा चक्षुषा परिष्वजमान इव गुरुरुपस्थितः । आचारं तावत्प्रतिपद्यस्व ।

గౌతమి : “బిడ్డా ! ఆనందబాష్పాలు నిండిన కళ్ళతో నీ తండ్రి (కణ్వమహర్షి) ఇక్కడే ఉన్నారు. ఆయనకు నమస్కరించు.”

Gautami : “child ! here is your father, whose eyes are overflowing with tears of joy. waiting to em- brace you Go and pay your respect to him,”

शकुन्तला : (सव्रीडम्) तात, वन्दे ।

శకుంతల : తండ్రీ ! నమస్కారములు

Shakuntala : “Father ! I Salute you”

काश्यप : वत्से,

కాశ్యపః బిడ్డా !

Kashyapa : “child”

ययातेरिव शर्मिष्ठा भर्तुर्बहुमता भव ।
सुतं त्वमपि सम्राजं सेव पूरुमवाप्नुहि ॥

యయాతేరివ శర్మిష్ఠా భర్తృర్భహుమతా భవ |
సుతం త్వమసి సామాజ్యం సేవ పురుమవాప్నహి ||

प्रतिपदार्थः

ययातेः शर्मिष्ठाइव ययातेः = మహారాజుకు = To king Yayathi
शर्मिष्ठा इव = వలె = Like Sharmistha
भर्तृ = నీ భర్తకు = To your husband
बहुमता भव = అత్యంత ప్రియమైన దానివి కావలెను = Become highly esteemed
त्वम् अपि = నీవు కూడా = You too
स = ఆమె (శరిష్ఠ) = She
पुरुम् इव = పురుమహారాజు = Like puru
साम्राज्यं सुतम् = చక్రవర్తి కాగల కుమారుడిని = Son who is a sovereign – ruler
अवाप्नुहि = పొందుము = My you obtain

भाव :- పురాణాలలో యయాతి మహారాజుకు శర్మిష్ఠ ఎలాగైతే ఇష్టమైన భార్య అయ్యిందో, నువ్వు కూడా నీ భర్త అయిన దుష్యంతుడికి అంతటి ప్రేమాభిమానాలు పొందే భార్యవు కావాలి. ఆమెకు పూరువు అనే గొప్ప చక్రవర్తి జన్మించినట్లు, నీకు కూడా ఒక గొప్ప సామ్రాజ్యాన్ని ఏలే కుమారుడు కలగాలి.

“May you be highly cherished and estmeed by your husband, just as Sharmistha was by king Yayati. And just she gave birth to pura (a great emperor), may you also be blessed with a son who shall be- come a sovereign ruler of the entire empire”.

शकुन्तला पतिगृहं प्रतिष्ठते Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

गौतमी : भगवन् ! वरः खल्वेषः, नाशी |

గౌతమి : స్వామీ ! ఇది కేవలం ఆశీర్వాదం మాత్రమే కాదు, ఒక గొప్ప వరం !
O Holy one ! This is truly a boon, not just a blessing.

काश्यप : वत्से, इतः सद्यो ह्रुतग्नीन् प्रदक्षिणीकुरुष्व |

(కాశ్యప:) : అమ్మా ! ఇక్కడ ఇప్పుడే హోమం చేసిన అగ్నులకు ప్రదక్షిణ చేయి.

“My Dear child, come and perform a circumambulation around these sacred fires that have just been fed with offerings.

( शकुन्तला प्रदक्षिणं करोति)
प्रतिष्ठस्वेदानीम् । ( सर्वे परिक्रामन्ति) भो भोः । सन्निहितास्तपोवनतरवः ।

ఓ ! ఓ ! ఇక్కడే తపోవనములో ఉన్న చెట్లులా ! ఇప్పుడు (శకుంతల) బయలు దేరుతున్నది.

‘O! O! You trees of the penance grove who are present here ! Now, Shakuntala is departing

पातुं न प्रथमं व्यवस्यति जलं युष्मास्यपीतेषु या,
नादत्ते प्रियमण्डनापि भवतां स्नेहेन या पल्लवम् ।
आद्ये वः कुसुमप्रसूतिसमये यस्या भवत्युत्सवः,
सेयं याति शकुन्तला पतिगृहं सर्वैरनुज्ञायताम् ॥

పాతుం న ప్రథమం వ్యవస్యతి జలం యుష్మాస్వపీతేషు యా,
నా దత్తే ప్రియమండనాపి భవతాం స్నేహేన యా పల్లవమ్ |
ఆద్యే వ: కుసుమ ప్రసూతి సమయే యస్యా భవత్యుత్సవః,
సేయం యాతి శకుంతలా పతిగృహం సర్వైరనుజ్జాయతామ్ ॥

प्रतिपदार्थः

या = ఏ శకుంతల అయితే = She who
युष्मासु = మీకు వృక్షాలకు = To you (the trees)
अपीतेषु = నీరుపోయకుండా = Without water in
प्रथमं = మొదట = First
जलपातुं = నీరుత్రాగడానికి = To drink water
व व्यवस्यति = ప్రయత్నించదో = Does not attempt
प्रियमन्दना अपि = అలంకారము ప్రియమైనదైనా= Though fond of Ornaments
स्नेहेन = ప్రేమతో = Out of affection
पल्लवम् = చిగురుటాకును = A sprout
नादव्ते = కోయదో = Does not pluck
वः = మీ యొక్క = Your
कुसुमप्रसूति समये = తొలిసారి పూలు పూచినప్పుడు = At the time of first flowering
यस्याः उत्सवः भवति = ఎవరికైతే పండుగలా ఉంటుందో = To whom it is a festival
सेयं शकुन्तला = అటువంటి ఈ శకుంతల = That very same Shakuntala
पतिगृहं याति = భర్త ఇంటికి వెళ్తంది = Is going to her husband’s home
सर्वैः अनज्ञायताम् = అందరూ అనుమతించండి = May be permitted by all

भावः- “ఏ శకుంతల అయితే మీకు (చెట్లకు) నీరుపోయకుండా తాను ముందుగా నీరు తాగడానికి ఇష్టపడదో, అలంకరణలంటే ఎంతో ఇష్టమున్నా కూడా, మీమీద ఉన్న ప్రేమతో చిగురుటాకులను కూడా కోయడానికి మనస్కరించదో, మీ చెట్లకు మొదటిసారి పూలు పూచినప్పుడు పండుగలాగా ఎంతో సంబరపడి పోతుందో… అటువంటి ఈ శకుంతల నేడు తన భర్త ఇంటికి (అత్తవారింటికి బయలుదేరుతోంది. ఓ తపోవన వృక్షాల్లారా ! మీరందరూ దయతో ఆమెకు వీడ్కోలు పలికి అనుమతించండి.”

“She who never thought of drinking water before watering you first. She, who out of pure affection never plucked a single sprout from you, despite her fondness for ornaments, and she, for whom your first flowering was always a grand festival – that very Shakuntala is now departing for her husband’s home. May you all give her your blessings and permissions to leave”.

शकुन्तला : ( जनान्तिकम्) हला प्रियंवदे, आर्यपुत्रदर्शनोत्सुकाया अप्याश्रमपदं परित्यजन्त्या दुःखेन मे चरणौ पुरतः प्रवर्तेते ।

प्रियंवदा : न केवलं तपोवनविरहकातरा सख्येव । त्वयोपस्थितवियोगस्य तपोवनस्यापि तावत्समवस्था दृश्यते ।

శకుంతల : ఆత్రుత ఉన్నా, ఈ తపోవనాన్ని విడిచి వెళ్ళాలంటే నా పాదాలు ముందుకు పడటంలేదు.

Shakuntala : “Friend Priyamvada! Even though I am eagar to see my noble husband (Aryaputra ), as I leave this hermitage (Ashram) my feet move forword only with great difficulty due to sorrow.

ప్రియంవద : “సఖీ ! కేవలం నీవేకాదు, నీ వియోగం వల్ల ఈ తపోవనం కూడా బాధపడుతోంది. అదిగో చూడు.

Priyamvada : “Friend! it is not just you who is feeling the pain of separation. Look at the condition of the entire penance grove (Tapovana) as your departure approaches! Everything here seems overwhelmed with the same grief”.

शकुन्तला पतिगृहं प्रतिष्ठते Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

उद्गलितगर्भकबला मृगाः
परित्यक्तनर्तना मयूराः ।
अपसृतपाण्डु पत्रा
मुञ्चन्त्यश्रूणीव लताः ॥

ఉద్గలిత దర్భకవలామృగాః
పరిత్యక్తనర్తనా మయూరాః ।
అపసృత పాండు పత్రా
ముంచంత్య శ్రుణీవ లతాః ॥ ४ ॥

प्रतिपदार्थः

मृगाः = లేళ్ళు = The deer
उद्गलित = నోటినుండి జారిన = Dropped from the mouth
दर्भकवलाः = దర్భగడ్డి ముద్దలు కలవి = Having mouthful of grass
मयूराः = నెమళ్ళు = The peacks
परित्यक्त = విడిచిన = Stopped
नर्तनाः = నాట్యము కలవి = Their dancing
लताः = తీగలు = The creepers
अपसृर्त्य = రాలుతున్న = Falling off
पन्डुपत्राः = తెల్లబారిన (పండిన) ఆకులు కలవి = Having pale leaves
अश्रुणि मुन्यन्ति इव = కన్నీళ్ళు విడిస్తున్నాయా అన్నట్లు = As if shedding tears

भावः- శకుంతల వెడలిపోతుందన్న విచారంతో, తపోవనంలోని జింకలు తాము తింటున్న గడ్డి – పరకలను నోటి నుండి క్రింద పడవేస్తున్నాయి. నెమళ్ళు నాట్యం చేయడం మానేశాయి. తీగలు తమ పండిన ఆకులను రాలుస్తూ, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయా అన్నట్లుగా కనిపిస్తున్నాయి.

Due to the sorrow of Shakuntala’s departure, the deer are drop- ping half chewed grass from their mouths. The peacocks have stopped dancing. The creepers are shedding their pale leaves, appearing as if any they are shedding tears in grief.

शकुन्तला : (स्मृत्वा) तात ! लथभगिनी वनज्योत्सनां तावदामन्त्रयिष्ये

శకుంతల : (గుర్తు తెచ్చుకుని) తండ్రీ ! నా సోదరి వంటి ఈ వన జోత్స్న (వనానికి వెలుగునిచ్చే చంద్రిక వంటిది) (మల్లెతీగ) కు వీడ్కోలు పలుకుతాను.

Shakuntala : (Remembering) Father ! I shall bid farewell to this ‘Vanajyotsna’ (the forest moonlight creeper) who is like a sister to me.

काश्यपः : अवैमि ते तस्यां सौहार्दम् । इयं तावत दक्षिणेन ।

కాశ్యపుడు: అమ్మా ! నీకు దానిపై ఉన్న సోదర ప్రేమాభిమానాలు నాకు తెలుసు. అదిగో, అది నీకు కుడివైపున ఉంది.

Kasyapa: Child! I am well aware of your sister affection for her, There she is to you right.

शकुन्तला: (लतामुपेत्य) वनज्योत्सने, प्रत्यालिङ्गैस्ताभिः शाखाबाहाभिः । अद्यप्रभृति दूरवर्तिनी ते खलु भविष्यामि । ( सख्यौ प्रति) हला एषा द्वयोर्युवयोर्हस्ते निक्षेपः ।

శకుంతల : (తీగ వద్దకు వెళ్ళి) ఓ వనజ్యోత్స్నా ! నీవు మామిడి చెట్టుతో కలిసి ఉన్నావు. నీ కొమ్మలనే చేతులతో నన్ను కూడా ఒక్కసారి కౌగిలించుకో. ఈ రోజు నుండి నేను నీకు దూరమవుతున్నాను. (చెలికత్తెలతో) సఖులారా ! ఈమెను మీ యిద్దరి చేతుల్లో ‘న్యాసం’ గా (జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యతగా) పెడుతున్నాను.

Shakuntala : (Approaching the creeper) O Vanajyotsna ! Though you are united with the mango tree, embrace me too with your branch – like arms; From today, I shall be for away from you, (To her friends) Friends! I entrust her to both of your hands as sacred trust.

सख्यौ : अयं जनः कस्य हस्ते समर्पितः (बाष्पं विसृजतः)

సఖులు : (కన్నీరు కారుస్తూ) సఖీ ! మరి మమ్మల్ని ఎవరి చేతుల్లో పెట్టి వెళ్తున్నావు ?

Sakhulu : Shedding tears (Friend! Then, in whose hands are you leaving us ?

काश्यपः : अनसूये, अलं रुदित्वा । ननु भवतीभ्यामेव स्थिरीकर्तव्या शकुन्तला ।

కాశ్యపుడు : అనసూయా ! ఏడవకండి శకుంతలనే మీరు ఓదార్చాలి కానీ, మీరే ఇలా ఏడవకూడదు.

Kasyapa : Anasuya ! Enough of weeping. You both should be the ones strengthening Shakuntala’s heart, not giving in to tears yourselves.

शकुन्तला : ताता ! एषोटजपर्यन्तचारिणी गर्भमन्थरा मृगवधूर्यदाऽनघप्रसवा भविष्यति, तदा मह्यं किमपि प्रिय निवेदयितृकं विसर्जयिष्यथ ।

శకుంతల : (తాత్ ! ) ఓ తండ్రీ ! కుటీరం దగ్గర తిరుగుతూ, గర్భంతో ఉండి మెల్లగా నడిచే ఆ జింక పిల్ల ప్రసవించిన తర్వాత, ఆ శుభవార్తను నాకు మనిషి ద్వారా పంపండి. మర్చిపోకండి.

Shakuntala : Father! When that pregnant doe, who wanders near out hut and walks slowly, gives birth, please send someone to deliver that good news to me. Do not forget.

काश्यपः : नेदं विस्मरिष्यमिः

కాశ్యపః : “నేను దీనిని (నీవు చెప్పిన విషయాన్ని) మరచిపోను.”

Kashyapa : “I shall not forget this”.

शकुन्तला : (गतिभङ्गं रूपयित्वा ) को नु खल्वेष निवसने मे सज्जते ? (परावर्तते)

శకుంతల : (నడకకు ఆటంకం కలిగినట్లుగా అభినయించి) ఎవరు ? నిశ్చయంగా ఇతడు నా వస్త్రమునందు నా యొక్క చీరకొంగును లాగుతున్నాడు. అని వెనక్కి తిరిగి చూస్తుంది.

Shakuntala : (Obstruction to her movement Acting) who indeed is this (person/ creature) to my garment my tugging at “Turns back” or Turns around.

शकुन्तला पतिगृहं प्रतिष्ठते Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

काश्यपः : वत्से !

కాశ్యపః : వత్సే ! ఓ బిడ్డా !

Kashyapa : Child !

यस्य त्वया व्रणविरोपणमिङ्गुदीनां,
तैलं न्यषिच्यत मुखे कुशसूचिविद्धे ।
श्यामाकमुष्टिपरिवर्धितको जहाति,
सोऽयं न पुत्रकृतकः पदवीं मृगस्ते ॥

యస్య త్వయా వ్రణవిరోపణ మింగుదీనాం
తైలం న్యషిచ్యతా ముఖే కుశసూచివిద్దె
శ్యామాక ముష్టిపరివర్థితకో జహాతి
సోఁయ నపుత్రకృతకః పదవీం మృగస్తే

प्रतिपदार्थः

यजय = దేనియొక్క = Whose
कुशसूचिविद्ये = దర్భగడ్డి కొనలచే గుచ్చబడిన = Pierced by sharp tips of Kusha grass
मुख्ये = నోటియందు = In the mouth
त्यया = నీ చేత = By you
व्रणविरोपणम् = Healing the wound
इंगुदीनां तैलं = ఇంగుదీ గింజల నూనె = The oil of Ingudi nuts
न्यपिच्यत = పూయబడినదో = Was applied
श्यामाकमुष्टि = పిడికెడు శ్యామాక గింజలతో పెంచబడినదో = Reared with handfuls of Syamaka-grain
पुत्रकृतकः = కొడుకులా భావించబడిన = Treated like a son
जहाति = వదలడం లేదు = Is not leaving
ते पदवीं = నీ దారిని = Your path
मृगस्ते = నీ యొక్క జింక = Your deer

भावः- “అమ్మా శకుంతలా ! దర్భ గడ్డి చివరలు గుచ్చుకోవడం వల్ల నోటి దగ్గర గాయమైనప్పుడు, ఏ జింక పిల్లకైతే నీవు ఇంగుదీ నూనెను పూసి ఆ గాయాన్ని మాన్పావో…. పిడికెడు శ్యామాక గింజలను నీ చేతులతో తినిపించి కొడుకులా పెంచావో…. అటువంటి ఈ జింక పిల్ల నిన్ను విడిచి ఉండలేక, నీ వస్త్రాన్ని పట్టుకుని నీ వెంటే వస్తోంది.

“O Shakuntala! This is the same deer whose mouth was once pierced by the sharp points of kusha grass, and you applied healing Ingudi oil to soothe its pain. You reared it with handfuls of shyamaka grains as if it were your own son. That very deer, unable to bear your separation, is now tugging at your garment and refusing to leave your path.”

शकुन्तला : अचिरप्रसूतया जनन्या विना विवर्धित एव । इदानीमपि मया विरहितं त्वां तातश्चिन्तयिष्यति । निवर्तस्व तावत् ।
(रुदति प्रस्थिता)

శకుంతల : ఓ బిడ్డా ! (జింక పిల్ల) నీతోడును వదిలి వెళుతున్న నన్ను ఎందుకు అనుసరిస్తున్నావు ? నీవు పుట్టిన కొద్దికాలానికే తల్లిని కోల్పోయినా నా దగ్గర పెరిగావు. ఇప్పుడు నేను లేకపోయినా తండ్రి (కణ్వ మహర్షి) నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంక వెనక్కి వెళ్ళు”.

Shakuntala : “My child, why do you follow me, who am abandoning your company? you were raised by me even though you lost your mother shorly after birth. Even now in my absence, Father kanva will take care of you. Please, turn back now.”

शार्ङ्गरवः : भगवन्, ओदकान्तं स्निग्धो जनोऽनुगन्तव्य इति श्रूयते । तदिदं सरस्तीरम् । अत्र सन्दिश्य प्रतिगन्तुमर्हसि ।

శార్ఙ్గరః : (Seas ०६६) के! we (చెరువు లేదా నది) గట్టు వరకు సాగనంపాలని పెద్దలు చెబుతారు. ఇదిగో చెరువు గట్టు వచ్చేసింది. ఇక్కడ మీ చివరి సందేశాన్ని చెప్పి, మీరు వెనక్కి వెళ్ళడం మంచిది”.

Shargarava: “O Holy one! It is said that one should follow their loved ones only as for as the water’s edge. This is the shore of the lake. Therefore, you should give your final message here and return to the hermitage”.

काश्यपः : तेन हि क्षीरवृक्षच्छायामाश्रयामः ।

(सर्वे परिक्रम्य स्थिताः )

काश्यपः : (आत्मगतम्) किं नु खलु तत्रभवतो दुष्यन्तस्य युक्तरूपमस्माभिः सन्देष्टव्यम् ? ( चिन्तयति ) शार्ङ्गरव ! इति त्वया मद्वचनात् स राजा शकुन्तलां पुरस्कृत्य वक्तव्यः ।

కాశ్యపః “అయితే అలాగే, మనం ఈ పాలచెట్టు నీడన కాసేపు నిలబడదాము. (తర్వాతి మాటలు తనలో తాను ఆలోచిస్తూ…) గౌరవనీయుడైన ఆ దుష్యంతుడికి మన తరపున ఎటువంటి సందేశాన్ని పంపడం యుక్తంగా (తగినదిగా) ఉంటుంది

Kasyapa : In that case, let us stand under the shade of this milky tree. (All walk around and stand). (To himself) what message would be most appropriate for us to send to the noble Dushyanta ? (He begins to think deeply).”

शार्ङ्गरवः आज्ञापयतु भवान्

శార్ఙ్గరః : గురువు గారూ ! ఆజ్ఞాపించండి.

Shargarava : Command me, O Teacher !

వివరణ : కణ్వమహర్షి దుష్యంతుడికి పంపాల్సిన సందేశం గురించి తనలో తాను ఆలోచించుకుని, ఒక నిర్ణయానికి వస్తారు. అప్పుడు తన శిష్యుడైన శార్జరవుడిని పిలుస్తారు. దానికి సమాధానంగా శార్జరవుడు ఈ మాట అంటాడు. “ ప్రభూ ! ఆజ్ఞాపించండి” లేదా “చిత్తం గురువు గారు, సెలవియ్యండి”.

Command me, O Holy One!” or please give your instructions. Sir”.

शकुन्तला पतिगृहं प्रतिष्ठते Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

काश्यपः

अस्मान् साधु विचिन्त्य संयमधनानुच्चैः कुलं चात्मनः
त्वय्यस्याः कथमप्यबान्धवकृतां स्नेहप्रवृत्तिं च ताम् ।
सामान्यप्रतिपत्तिपूर्वकमियं दारेषु दृश्या त्वया
भाग्यायत्तमतः परं न खलु तद्वाच्यं वधूबन्धुभिः ।

అస్మాన్ సాధు విచింత్య సంయమధనాను చ్చై: కులం చాత్మనః
త్వయ్యస్యాః. కథమప్య బాంధవ కృతాం స్నేహ ప్రవృత్తిం చ తామ్ |
సామాన్య ప్రతిపత్తి పూర్వకమియం దారేషు దృశ్యాత్వయా
భాగ్యాయత్తమత: పరం న ఖలు తద్వాచ్యం వధూ బంధుభి:

प्रतिपदार्थः

अस्मान् = తపస్వులను, మమ్ములను = us
साधु विचिन्त्य = బాగా ఆలోచించి = thing well rich in
संयमधनान् = ఇంద్రియ నిగ్రహమే ధనముగా కలవారిని = self restaint
आत्मनः उच्चैः कुलम् = నీ యొక్క గొప్ప వంశాన్ని = your noble lineage
त्वयि अस्याः = నీ యందు ఈమెకు = towards you,
अबन्धवकृतां = బంధువుల ప్రమేయం లేకుండా కలిగిన= not brought about by kin
स्नेह प्रवृत्तिं = ప్రేమ ప్రవృత్తిని = flow of affection
सामान्य प्रतिपत्ति = మిగిలిన భార్యలతో = remaining wives
पूर्वकम् = సమానమైన గౌరవంతో = with equal honor
दारेषु दृश्या = భార్యల యందు చూడదగినది = to be regarded among wives
अतः परम् = దీనికంటే మించి = beyond this
भाग्यात्तम् = అదృష్టంపై అధారపడి ఉంటుంది = depends on fortune
वधूबंधुभिः = వధువు తరపు బంధువులచే = by the bridel’s kinsmen
न खलु वाच्यं = నిశ్చయముగా చెప్పదగినదికాదు = surely is not be said

కాశ్యపః : (కణ్వమహర్షి దుష్యంతుడికి ఇలా సందేశం పంపుతున్నారు) “రాజా ! మేము ఇంద్రియ నిగ్రహమే ధనముగా గల తపస్వులమని, నీది ఉన్నతమైన వంశమని, అలాగే మా ప్రమేయం లేకుండానే నీపై శకుంతలకు కలిగిన గాఢమైన అనురాగాన్ని మనసులో ఉంచుకో. నీవు మిగిలిన భార్యలతో పాటు ఈమెను కూడా సమానంగా గౌరవంతో చూడు.

అంతకుమించి ఆమెకు దక్కే స్థానం ఆమె అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అంతకంటే ఎక్కువ కోరడం వధువు తరపు బంధువులైన మాకు ధర్మం కాదు”.

Kasyapa: Considering us ascetics rich in self-restraint, your own noble lineage, and the spontaneous love she felt for you without our involvement – you should treat her with the same honor as your other wives. Beyond that, her future status depends on her own fortune, that is not something the bride’s kinsmen should demand or speak of.

साङ्गरवः : गृहीतः संदशः ।

శార్జరవ : (गृहीतः संदशः)

“సందేశము గ్రహించబడినది” (లేదా) మీరు చెప్పిన సందేశాన్ని నేను మనసు కెక్కించుకున్నాను.

Shargarava : “The message has been received understood.”

काश्यपः : वत्से, त्वमिदानीमनुशासनीयासि । वनौकसोऽपि सन्तो लौकिकज्ञा वयम् ।

కాశ్యపః : ఓ పుత్రికా ! (అమ్మా !) నీవు ఇప్పుడు ఉపదేశించదగిన దానివి. అడవిలో నివసించే వారమైనప్పటికి అయి ఉండి కూడా మేము లోక వ్యవహారం తెలిసినవారము కావున అత్తవారింటికి వెళుతున్న నీకు కొన్ని హితబోధలు చేయాలి.

Kasyapa : “My child, you are now to be instructed (in your duties) Even though we are forest – dwellers, we are well – acquainted with the ways of the world”.

साङ्गरवः : न खलु धीमतां कक्षिदविषयो नाम ।

శార్జరవ: “బుద్ధిమంతులకు లేదా జ్ఞానులకు తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు”.

Shargarava: “Indeed, there is nothing that is unknown or beyond the reach of the wise”.

వివరణ : కణ్వమహర్షి శకుంతలకు ఉపదేశం చేసే ముందు “మేము అడవిలో…. మాకు లోకరీతులు తెలుసు” అని అంటారు. దానికి శార్జరవుడు బదులిస్తూ “గురువు గారూ ! మీ వంటి మహాజ్ఞానులకు ఈ లోకంలో తెలియని విషయం అంటూ ఏముంటుంది ?” అని ఆయన పాండిత్యాన్ని లోకజ్ఞానాన్ని ప్రశంసిస్తూ అన్న సందర్భంలోనిది ఈ మాట.

काश्यपः : सा त्वमितः पतिकुलं प्राप्य ।

కాశ్యపః : అటువంటి నీవు ఇక్కడి నుండి అత్తవారింటికి చేరుకున్న తర్వాత

Kasyapa : You, being such (as I have instructed ) From here Husband’s home, having reached….

शुश्रूषस्व गुरून् कुरु प्रियसखीवृत्तिं सपत्नीजने,
भर्तुर्विप्रकृतापि रोषणतया मा स्म प्रतीपं गमः ।
भूयिष्ठं भव दक्षिणा परिजने भाग्येष्वनुत्सेकिनी
यान्त्येवं गृहिणीपदं युवतयो बामाः कुलस्याधयः ॥ ॥ ७ ॥

శుశ్రూషస్వ గురూన్ కురు ప్రియసఖీవృత్తిం సపత్నీ జనే
భర్తుర్విప్రకృతాపి రోషణతయా మాస్మప్రతీపం గమ: |
భూయిష్టం భవ దక్షిణ పరిజనే భాగ్యేష్వనుత్సేకినీ
యాంత్యేవం గృహిణీపదం యువతయో వామాః కులస్యాధయం: ॥

प्रतिपदार्थः

गुरून् = పెద్దలను = Elders
शुशृषस्व = సేవించుము = serve
सपत्नी जने = తోడికోడళ్ళయందు = Towards co-wives
प्रिय सखी वृत्तिं कुरु = ప్రాణ స్నేహితురాలిలా ఉండు = Act like a dear friend
भर्तुः विप्रकृता अपि = భర్తకోపగించినప్పటికీ = Even if wronged by husband
रोषणतया = కోపముతో = out of anger
प्रतीपं मा स्म गमाः = ఎదురు తిరగవద్దు = Do not go against him
परिजने = సేవకులయందు = Towards the servents
भूयिष्ठं दक्षिणा भव = మిక్కిలి దయతో ఉండు = Be very generous
भाग्येषु = సుఖ సంతోషాల యందు = In times of good fortune
अनुत्सेकिनी = గర్వము లేని దానివిగా = without being arrogant
एवं युवतयः = ఇలా నడుచుకునే యువతులు = women who behave this
गृहिणी पदं यान्ति = ఇల్లాలు అన్న గౌరవం పొందుతారు = Attain the status of a ‘Grihini’
वामाः = దీనికి విరుద్ధంగా ఉండేవారు = Those who are the opposite
कुलस्य अधयः = వంశానికి మనోవేదన = Are a source of misery to the family

भाव:- “అమ్మా ! శకుంతలా ! అత్తవారింట్లో పెద్దలను సేవించు. తోడికోడళ్ళను నీ ప్రాణ స్నేహితురాళ్ళలా చూసుకో. ఒక వేళ నీ భర్త నీపై కోపగించినా, నువ్వు మాత్రం ఎదురు తిరగవద్దు, సేవకులపట్ల దయతో ఉండు. ఐశ్చర్యం వచ్చినప్పుడు గర్వపడకు ఇలా ప్రవర్తించే స్త్రీలే ఉత్తమ ఇల్లాలు అనిపించుకుంటారు. దీనికి విరుద్ధంగా నడిచేవారు వంశానికి తీరని బాధను మిగిల్చేవారవుతారు.”

“Serve your elders. But like a dear friend to your co-wives. Even if treated harshly by your husband, do not act against him in anger. Be very kind to the servants. Do not be arrogant in your good fortune. Women who behave in this way attain the esteened position of a housewife, those who act otherwise are a bane to their families”.

कथं वा गौतमी मन्यते ?

“గౌతమి దీని గురించి ఏమనుకుంటోంది? (లేదా) గౌతమి అభిప్రాయం ఏమిటి ?

“What does Gowtami that think about this? (or) What is Gouthami’s opinion?”

వివరణ : కణ్వమహర్షి శకుంతలకు అత్తవారింట్లో ఎలా నడుచుకోవాలో సుదీర్ఘంగా ఉపదేశిస్తారు. ఆ ఉపదేశం ముగిసిన తరువాత, ప్రక్కనే ఉన్న వృద్ధురాలైన గౌతమిని ఉద్దేశించి “నేను చెప్పిన ఈ విషయాలపై నీ అభిప్రాయం ఏమిటి ?” అని అడిగిన సందర్భంలోనిది ఈ వాక్యం.

After giving a detailed and profound lecture to Shakuntala on the duties of a virtuous wife (through the verse “Sushrushasva…) sage Kanva turns to Gautami. He seeks her validation and ask, “What is Gautami’s opinion on this ? or “Does Goutami agree with these instructions ?”

गौतमी : एतावान् वधूजनस्योपदेशः । जाते ! एतत् खलु सर्वमवधारय ।

గౌతమి : వధూజనానికి (కోడలికి) ఇవ్వవలసిన ఉపదేశం ఇంతే. అమ్మా! వీటన్నింటినీ మనసులో భద్రంగా ఉంచుకో”.

शकुन्तला पतिगृहं प्रतिष्ठते Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

Gowthami : This is the complete instructions for a bride. My child ! keep all of this firmly in your heart”.

शकुन्तला : तात ! इत एव किं प्रियंवदानसूये सख्यौ निवर्तिष्येते ?

శకుంతల : ఓ తండ్రీ ! స్నేహితురాళ్ళు (అనసూయ, ప్రియంవద) కూడా నాతో పాటు వస్తారా !

Shakuntala : “Father! Will my friends (Anasuya and Priyamvada) also return along with me?

काश्यपः वत्से, इमे अपि प्रदेये ? न युक्तमनयोस्तत्र गन्तुम् । त्वया सह गौतमी यास्यति ।

కాశ్యపుడు : అమ్మా! వీరికి కూడా పెళ్ళిళ్ళు చేయాల్సి ఉంది కాబట్టి వీరు నీతో రావడం ఉచితం కాదు. నీతో పాటు గౌతమి వస్తుంది.”.

Kashyapa : “Child, they too are to be given in marriage; hence, it is not proper for them to go there. Gouthami will accompany you”.

शकुन्तला : (पितरमालिङ्ग्य) कथमिदानीं तातस्याङ्कात्परिभ्रष्टा मलयतटोन्मूलिता चन्दनलतेव देशान्तरे जीवितं धारयिष्ये ?

శకుంతలా : (తండ్రిని కౌగిలించుకుని) మలయ పర్వతం నుండి వేరుచేయబడిన చందనపు తీగల మీకు దూరంగా నేను ఎలా జీవించగలను ?

Shakuntala : (Embracing her father) “Like a sandal wood creeper uprooted from the Malaya mountains, how can I surrive in a foreign land, separated from you”?

काश्यपः वत्से ! किमेवं कातरासि ?

కాశ్యపః : అమ్మా ! ఎందుకంతలా ఆవేదన చెందుతున్నావు ?

Kashyapa : “child why are you so distressed?

अभिजनवतो भर्तुः श्लाघ्ये स्थिता गृहिणीपदे,
विभवगुरुभिः कृत्यैस्तस्य प्रतिक्षणमाकुला ।
तनयमचिरात्प्रायीवार्कं प्रसूय च पावनम्,
मम विरहजां न त्वं वत्से शुचं गणयिष्यसि ॥ ॥ ८ ॥
(शकुन्तला पितुः पादयोः पतति)

అభిజనవతో భర్తు: శ్లాఘ్యేస్ధితాగృహిణీపదే
విభవగురుభి: కృత్యైస్తస్య ప్రతిక్షణమాకూలా ।
తనయమచిరాత్రా చీవార్కం ప్రసూయ చపావనమ్
మమ విరహజాం న త్వం వత్సే శుచం గణయిష్యసి ॥

प्रतिपदार्थः

अभिजनवतः = గొప్పవంశం కల = of a husband of
भर्तुः = భర్త యొక్క = noble lineage
श्लाघ्ये = ప్రశంసనీయమైన = In the praise
गृहिणीपदे = ఇల్లాలు పదవిలో = worthy status of a house wife
विभवगुरुभिः = ఆయన వైభవానికి = with duties
कृत्यैः = తగిన పనులతో = matching his grandeur
प्रतिक्षणम् आकुला = ప్రతీక్షణం తీరిక లేకుండా ఉండి = being busy every moment
प्रचिअर्कम् = తూర్పు దిశ సూర్యునివలె = like the East (gives birth to) the sun
पावनं = పవిత్రుడైన = a pure
तनयम् = పుత్రుడిని = son
अचिरान् = త్వరలోనే కని = giving birth to soon
मम विरहजां शुचम् = నా ఎడబాటు వల్ల కలిగే బాధను = the sorrow born of separation from me
न गणयिष्यसि = లెక్కచేయవు = you will not mind

भावः- “అమ్మా ! శకుంతలా ! నీవు ఉత్తమ వంశజాతవు. నీ భర్త కూడా గొప్ప వంశానికి చెందినవాడు. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత నీవు ప్రశంసనీయమైన పట్టపురాణి (గృహిణి) పదవిని పొందుతావు. నీ భర్త యొక్క ఐశ్వర్యానికి తగినట్లుగా అనేక బాధ్యతలను నిర్వర్తించడంలో నీవు ప్రతిక్షణం నిమగ్నమై ఉంటావు. ఆ తర్వాత, తూర్పు దిక్కు సూర్యుడిని కన్నట్లుగా, నీవు ఒక పవిత్రుడైన పుత్రుడినికంటావు. ఆ పుత్రోత్సవంలోనూ, గృహిణిగా నీ బాధ్యతలలోనూ మునిగిపోయి, నా ఎడబాటు వల్ల కలిగే ఈ దు:ఖాన్ని నీవు అసలు లెక్కచేయవు (అంటే పూర్తిగా మర్చిపోతావు”.

“Child! once you occupy the esteemed position of a housewife in your noble husband’s home, you will be constanlty occupied with duties matching his gender. Soon, just as the East gives birth to sun, you will no longer feel the sorrow of being separated from me”.

काश्यपः यदिस्छामि ते तदस्तु ।

కశ్యపః “నేను నీ గురించి ఏమేమి శుభాలు కోరుకుంటున్నానో, అవన్నీ నీకు సిద్ధిస్తాయి”.

“May it happen for you exactly as I desire”.

వివరణ : అత్తవారింటికి బయలుదేరుతున్న కూతురికి తండ్రి ఇచ్చే అత్యున్నతమైన ఆశీర్వచనంగా ఇది నిలుస్తుంది. ఇది శకుంతల కొత్త జీవితం సంతోషంగా సాగాలని కోరుతూ కణ్వమహర్షి తెలిపిన ఆశీర్వాదం.

It reflects a father’s well – wish for his daughter. Sage kanva is saying that all the virtues, happiness and prosperity he envisions for Shakuntala’s future should manifest in her life.

शकुन्तला पतिगृहं प्रतिष्ठते Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

सख्यौ : सखि ! यदि नाम स राजा प्रत्यभिज्ञानमन्थरो भवेत्ततस्तस्येदमात्मना मधेयाङ्कित मङ्गुलीयकं दर्शय । शकुन्तला अनेन सन्देहेन वामा कम्पिताऽस्मि ।

सख्यौ : मा बिभीहि । अतिस्नेहः पापशङ्की ।

సఖులు : సఖీ ! ఒకవేళ ఆరాజు నిన్ను గుర్తు పట్టకపోతే, ఆయన నీవేలికి తొడిగిన ఆ ముద్రికను (ఉంగరాన్ని) చూపించు. “(ఇది నాటకంలోని రాబోయే మలుపుకు సంకేతం) ఈ మాటవినగానే శకుంతల భయంతో వణికిపోతుంది. అప్పుడు వారు “అతి స్నేహ : పాప శంక్కీ (అమితమైన ప్రేమే కీడును శంకిస్తుంది) అని ఆమెను ఓదారుస్తారు.

“Friend! If by any chance that king (Dushyanta) fails to recognize you, “Do not afraid. Excessive affection always suspects some evil (misfortune)”.

शंकुन्तला : ( आश्रमाभिमुखी स्थित्वा) तात ! कदा नु खलु भूतस्तपोवनं प्रेक्षिष्ये ?

శకుంతలా : (आश्रमाभिमुखी ….)

(ఆశ్రమంవైపు తిరిగి చూస్తూ!) తండ్రీ! మళ్ళీ నేను ఈ తపోవనాన్ని ఎప్పుడు చూడగలను ?”

“Standing with her face turned toward the hermita”).
“Father! when indeed shall I behold this penance grove again?”

काश्यपः : श्रूयताम्

కాశ్యపః : వినవమ్మా ! (లేదా) “శ్రద్ధగా విను”
“Listen” (or) “Hear me”

भूत्वा चिराय चतुरन्तमहिसपत्नी,
दौषयन्तिमप्रतिरथं तनयं निवेश्य ।
भर्त्रा तदर्पितकुटुम्बभरेण सार्धं,
शान्ते करिष्यसि पदं पुनराशरामेंस्मिं

భూత్వా చిరాయ చతురంత మహీసపత్నీ
దౌష్యంతిమ ప్రతిరథం తనయం నివేశ్య |
భర్రా తదర్పిత కుటుంబ భరేణ సార్ధం
శాంతే కరిష్యసి పదం పునరాశ్రమేకాస్మిన్ ||

प्रतिपदार्थः

चिराय = చిరాయ – చాలాకాలం = For a long time
चतुरन्तमहीसपत्नी = నాలుగు సముద్రాల వరుకు ఉన్న భూమికి పట్టపురాణిపై = Queen of the earth bounded by four oceans
दौष्यन्तिम् = దుష్యంతుడి కుమారుడైన = Dusyantha’s son
अप्रतिरथं तनयम् = సాటిలేని వీరుడైన పుత్రుడిని = matchless heroic son
निवेश्य = రాజ్య బాధ్యతల్లో నిలిపి = Having established (on the throne)
भर्त्रा सार्थम् = భర్తతో కలిసి = Along with your husband
तदर्पित कुटुम्ब भरेण = కొడుకుకు కుటుంబ బాధ్యతలు అప్పగించి = Trasferring family duties to him
शान्ते अस्मिन् आश्रमे = ప్రశాంతమైన ఈ ఆశ్రమంలో= In this peaceful hermitage
पुनः पदं करिष्यसि = మళ్ళీ అడుగు పెడతావు= will set foot once again

भावः- అమ్మా ! నీవు చాలా కాలం పాటు ఈ భూమండలానికి పట్టపురాణిగా ఉండి, సాటిలేని వీరుడైన నీ కుమారుడికి (భరతుడికి రాజ్య బాధ్యతలు అప్పగిస్తావు. ఆ తర్వాత వృద్ధాప్యంలో నీ భర్తతో కలిసి, ప్రశాంతమైన ఈ ఆశ్రమంలో మళ్ళీ నివసించడానికి వస్తావు.”

“Having been the co-queen of the earth bounded by the four oceans for a long time, and having established your matchless son (born of Dushyanta) on the throne, you shall, along with your husband who has transferred the family responsibilities to the son, set foot once again in this peaceful hermitage”.

गौतमी : जाते ! परिहीयते गमनवेला । निवर्तय पितरम् । अथवा चिरेणापि पुनः पुनरेषैवं मन्त्रयिष्टयते । निवर्ततां भवान् ।

గౌతమీ : బిడ్డా ! ప్రయాణ సమయం మించిపోతోంది. ఇక తండ్రిగారిని వెనక్కి పంపించు”.

Gouthami : “Child ! The time for departure is passing, send you father back now”.

शकुन्तला : तपश्चरणपीडितं तातशरीरम् । तन्मातिमात्रं मम कृत उत्कण्ठस्व ।

శకుంతల : “तपश्चरण ………….. తపశ్చరణ ………….
“ఓ తండ్రీ ! మీ శరీరం నిరంతరం తపస్సు వల్ల ఇప్పటికే ఏంటో అలిసిపోయి (కృశించి) ఉంది. కావున, నా గురించి మీరు మరీ అంతగా విచారించకండి”.

Shakuntala : Father! Your body is already strained by rigorous penance. Therefore, do not grieve too much for me”.

काश्यपः : शममेष्यति मे शोकः कथं नु वत्से त्वया रचितपूर्वम् ।
उटजद्वारि विरूढं नीवारबलिं विलोकयतः ॥ ॥ १० ॥

శమమేష్యతి శోకః కథం నువత్సే త్వయా రచిత పూర్వమ్ ।
ఉటజద్వారి విరూఢం నీవారబలిం విలోకయతః ||

प्रतिपदार्थः

वत्से = ఓ పుత్రికా = O Daughter !
त्वया रचितपूर्वम् = నీవు ఇంతకు ముందు చల్లిన = Scattered previously by you
उटज द्वारि = పర్ణశాల వాకిలి వద్ద = All the door of the cottage
विरुढ़ं = మొలకెత్తిన = sprouted
नीवारबलिम् = నీవార ధాన్యపు = wild grain Offerings
विलोकयतः = చూస్తున్న = To who is looking at
मेशीक: = నా దు:ఖము = my grief
कथंनु शममेष्यति = ఎలా తగ్గుతంది ? = How Indeed shall it subside?

गच्छ, शिवास्ते पन्थानः सन्तु ।
(निष्क्रान्ता शकुन्तला सहयायिनश्च)

కాశ్యపః : గచ్చ, శివాస్తె పన్దానః సన్తు ।
(నిష్క్రిన్తా శకున్తలా సహయాయినస్చ)
“అమ్మా ! మన కుటీరం వాకిలి వద్ద నీవు పక్షుల కోసం చల్లిన ధాన్యపు గింజలు ఇప్పుడు మొలకెత్తుతున్నాయి. వాటిని చూసినప్పుడల్లా నాకు నీవే గుర్తుకువస్తావు. అలాంటప్పుడు నా దు:ఖం ఎలా తగ్గుతుంది ?”

Kasyapa : “Child! How shall my grief subside when I look at the wild grains (Nivara) that you once scattered at the door of our cottage and which have now sprouted ?”

కాశ్యపః : వెళ్ళు తల్లీ!నీ ప్రయాణం సుఖమయం (శుభప్రదం) అవుగాక! “Go, and may your path be auspicious”.

शकुन्तला पतिगृहं प्रतिष्ठते Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

सख्यौ : (शकुन्तला विलोक्य) ह धिक् ! अन्तर्हिता शकुन्तला वनराज्या

సఖులు : (అనసూయ, ప్రియంవద) (శకుంతల వెళుతున్న వైపు చూసి) అయ్యో ఎంతకష్టం ! శకుంతల ఆ అడవి చెట్ల మాటున కనుమరుగైపోయింది. (అంటే ఇక మనకు కనిపించడంలేదు).”
Friends (Looking towards Shakuntala) Alas! Oh, what a pity! Shakuntala has now disappeared behind the rows of forest trees.”

काश्यपः : (सनिः श्वासं अनसूये)

కాశ్యపః : ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి, ఓ అనసూయా !

Kasyapa : “(With a sigh) oh Anasuya !”

వివరణ : శకుంతల వెళ్ళిపోయిన తర్వాత ఒక తండ్రిగా కణ్వమహర్షి అనుభవించిన మానసిక వేదన మరియు ఒక బాధ్యత తీరనప్పుడు కలిగే బరువు కలగలిసిన ఒక నిట్టూర్పు ఇది. దీని తర్వాత ముని ….

The emotion “Deep Sigh” represents a complex mix of emotions felt by sage Kanva. The natural sorrow of a father whose fulfiling a great responsibility (sending a daughter to her rightful home)

काश्यपः : : गतवती वां सहधर्मचारिणी । निगृह्य शोकमनुगच्छतं मां प्रस्थितम् ।

కాశ్యపః : మీ తోటి సహచరి (స్నేహితురాలు) వెళ్ళిపోయింది. దు:ఖమును అదుపుచేసుకుని, ఆశ్రమం వైపు వెళుతున్న నా వెనుక రండి”.

Kasyapa : “Your companion (Shakuntala) has departed. Now, control your grief and follow me as I set out (back to the hermitage)”.

उभे : तात ! शकुन्तलाविरहितं शून्यमिव तपोवनं कथं प्रविशावः ।
(ఇరువురు ప్రియంవద, అనసూయ)

తండ్రీ ! శకుంతల లేని శూన్యంవలె (ఖాళీగా ఉన్న) ఈ తపోవనంలో ఎలా ప్రవేశించగలము ?

వివరణ : శకుంతల అత్తవారింటికి వెళ్ళిపోతూ, కంటిచూపుమేర దాటిపోయిన తరువాత, ఆమె లేని ఆశ్రమం వెలవెలబోతోందని వారు తమ ఆవేదనను కణ్వమహర్షితో పంచుకుంటారు.

(Friends Priyamvada, Anasuya) “Father ! The penance grove seems completely empty without Shakuntala. How shall we enter it now ?” The trees, animals, and cottages all seem lifeless now that she gone. It highlights the theme of separation (viraha) that dominates the 4th Act of Abhijnana Shakuntalam.

అందులకు కణ్వమహర్షి ….

काश्यपः : स्नेहप्रवृत्तीरेवन्दर्शिनि (सविमर्श परिक्रम्य)

కాశ్యపః : స్నేహ ప్రవృత్తి ఇలాగే ఉంటుంది. అని వారిని ఓదారుస్తూ, తిరిగి ఆశ్రమానికి తీసుకెళ్తారు.

Sage Kanva comforts them by saying, “Sneha pravrittievam-darsini (The nature of affection seen things in this way), acknowledging that their grief makes the physical space feel empty.

(సవిమర్మం …
“లోతైన ఆలోచనతో అటు ఇటు తిరుగుతూ”

“Walking around thoughtfully”

हन्त भोः शकुन्तलां पतिकुलं विसृज्य लब्धमिदानीं स्वास्थ्यम् । कुतः

ఆహా ! (నిట్టూర్పు / ఉపశమనం) శకుంతలను భర్త ఇంటికి పంపి ఇప్పుడు మనశ్శాంతిని పొందితిని ఎందుకంటే –

Ah ! Having sent Shakuntala to her husband’s home, I have now regained my peace of mind. Because.

अर्था हि कन्या परकीय एव
तामद्य सम्प्रेष्य परिग्रहीतुः ।
जातो ममायं विशदः प्रकामे,
प्रत्याप्रीतनयास इवान्तरात्मा ।।

అహి కన్యాపరకీయ ఏవ
తామద సంప్రేష్య పరిగ్రహీతు: ।
జాతో మమాయం విశద: ప్రకామమ్,
ప్రత్యర్పిత వ్యాస ఇవాంతరాత్మా ॥

प्रतिपदार्थः

कन्या = కూతురు = Daughter
अर्थः = ధనము = wealth
परकीयएव = నిశ్చయముగా పరాయి వాడికి చెందినదే = Truly belongs to another
तम् = అట్టి ఆమెను = Her
अद्य = ఈ రోజు = Today
परिग्रहीतुः = ఆమె భర్త వద్దకు = To her husband
संप्रेक्ष्य = పంపించి = Having sent
मम अयम् = నా యొక్క ఈ అంతరాత్మ = Like a returned ‘trust’
प्रकामम् = మిక్కిలి / పరిపూర్ణంగా = Exceedingly
विशदः जातः = ప్రశాంతమైనది / స్వచ్ఛమైనది = Has become clear

शकुन्तला पतिगृहं प्रतिष्ठते Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

भावः- “నిజానికి కూతురు అంటే పరాయివాడికి (భర్తకు) చెందిన ధనం వంటిది. అటువంటి నా కూతురు శకుంతలను ఈ రోజు ఆమె భర్త వద్దకు పంపించాను. ఒకరి వద్ద దాచిన సొత్తును (న్యాసాన్ని) తిరిగి దాని యజమానికి అప్పగిస్తే కలిగేంతటి గొప్ప ప్రశాంతతను నా మనస్సు ఇప్పుడు పొందుతోంది.”

“A daughter is indeed someone else’s property. Having sent her today to her husband, my inner soul has become extremely serene, as if I have returned a “trust’ (something held in safekeeping) to its rightful owner”.

Leave a Comment