Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Sanskrit Study Material Pdf पद्यभागः 5th Poem विवेकानन्दः Questions and Answers Summary.
Inter 2nd Year Sanskrit विवेकानन्दः Questions and Answers
अभ्यासः
1. निबन्धप्रश्नौ
१. विवेकानन्द इति पाठ्यभागस्य सारांशं सङ्ग्रहेण लिखत ।
వివేకానందః పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని సంక్షిప్తంగా రాయండి.
Write a brief Summary of the lesson “VIVEKANANDA.
२. छात्रावस्थायां विवेकानन्देन विहितानि कार्याणि लिखत ।
విద్యార్థి దశలో వివేకానందుడు చేసిన పనులు (సాధించిన విజయాలు) రాయండి.
Describe the activities and accomplishments of Vivekananda during his student days.
जवाब:
కవిపరిచయం (कवि परिचयः):
ప్రస్తుత పాఠ్యభాగం ‘विवेकानन्द’ కవి శ్రీ సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రిగారిచే రచించబడిన (వివేకానందము) ‘194461-1-74’ అనే పద్యకావ్యము నుండి గ్రహించబడినది.
సూర్యనారాయణశాస్త్రిగారు వివేకానందము, తత్సమచంద్రిక, కావ్యాలంకార సంగ్రహ వివరణం మొదలైన కావ్యాలు రచించారు.
వీరికి ‘విద్వత్రత్న’ ‘ఆజన్మసిద్ధకవి’ అనే బిరుదులు కలవు.
పాఠ్యభాగ నేపథ్యం / ఇతివృత్తం : ప్రస్తుత పాఠ్యభాగం యొక్క ప్రధాన ఇతివృత్తం మహాపురుషుల బాల్యం, వారి సర్వతోముఖాభివృద్ధి మరియు ఆధ్యాత్మిక పరివర్తన.
ఒక సామాన్యబాలుడైన నరేంద్రుడు ‘విశ్వవిఖ్యాత’ స్వామి వివేకానందుడిగా ఎదిగే క్రమంలో ఉన్న విద్యార్థి దశను ఆదర్శంగా చూపడం ఇందలి ఇతివృత్తం.
భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో స్వామి వివేకానంద ఒక ధ్రువతార (ధృవతార). ఆయన అసలు పేరు నరేంద్రనాథ దత్తా. 19వ శతాబ్దంలో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉండి తన సాంస్కృతిక వైభవాన్ని మరచిపోతున్న తరుణంలో కలకత్తాలో నరేంద్రుడి ఆవిర్భావం జరిగింది. వీరి తల్లిదండ్రులు భువనేశ్వరీదేవి, విశ్వనాథదత్తా.
వివేకానంద చిన్నతనం నుండే అద్భుతమైన జ్ఞాపకశక్తిని, ధైర్యాన్ని కలిగి ఉండేవారు.
రామకృష్ణ పరమహంస పరిచయంతో నరేంద్రుడి జీవితం మలుపు తిరిగింది. ఆయన మార్గదర్శకత్వంలో తన ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేసుకుని, ప్రియశిష్యుడిగా మారడమే కాకుండా ప్రపంచ దేశాల నడుమ ప్రసంగించి భారతదేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పారు.
ప్రస్తుత పాఠ్యభాగం నందు నరేంద్రుడి బాల్య విశేషాలను, ఆయన విద్యార్థి దశను, మనసులో మెదిలే వైరాగ్యభావాలు వివరిస్తూ, ఒక సామాన్య విద్యార్థి ఒక మహోన్నత ఆధ్యాత్మిక వేత్తగా, నేతగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎలా పరివర్తన చెందారో ఈ పాఠం ద్వారా కవి తెలియజేశారు.
ప్రస్తుత పాఠ్యభాగ వివరణ :
బాల్యం మరియు విద్యార్థి దశ: నరేంద్రుడు తోటి బాలుర మధ్య నక్షత్రాల మధ్య ప్రకాశించే చంద్రుడిలా, ముత్యాలహారంలో మెరిసే నాయకమణిలా ప్రత్యేకంగా కనిపించేవాడు. నరేంద్ర వ్యక్తిత్వానికి ముగ్ధులైన తోటి స్నేహితులు ఆయన సాన్నిహిత్యాన్ని కోరుకునేవారు. నరేంద్రుడు పాఠశాలకు రానిరోజు పగలే అమావాస్యలా చీకటిగా ఉండేది. నరేంద్రుడు ఉండే ఆ విద్యాలయం పౌర్ణమిరోజు కాంతిలా వెలిగిపోయేది.
బహుముఖ ప్రజ్ఞ : నరేంద్రుడు కేవలం చదువుకే పరిమితం కాలేదు. ఆయన ఒక అడుగు తరగతి గదిలో ఉంటే మరొక అడుగు ఆటస్థలంలో ఉండేది. ఆయన ఏకసంధాగ్రాహి. పాఠశాలలో పుస్తకాలతో ఎక్కువ సమయం గడపకపోయినా, తరగతిలో ఎప్పుడూ నరేంద్రుడే ప్రథముడిగా (వర్గముఖ్యః) నిలిచేవాడు. వ్యాసరచన, చర్చాపోటీలు మరియు ఉపన్యాసాలలో తన ప్రతిభతో ఎన్నో అమూల్యమైన బహుమతులు సాధించాడు.
కళలు మరియు శారీరక దారుఢ్యం : నరేంద్రుడు శాస్త్రాలతో పాటు సంగీతం, మల్లయుద్ధం (కుస్తీ) పాకకళ (వంట) వంటి వివిధ రంగాలలో ప్రావీణ్యం సంపాదించాడు. ఆయన కంఠస్వరం మధురంగా ఉండేది. నరేంద్రుడి కంఠధ్వనికి కోయిల సైతం సిగ్గుపడి మౌనం వహించేది. నరేంద్రుడి శారీరక సామర్థ్యాన్ని చూసి తోటి మల్లయోధులు భయపడేవారు.
ఆధ్యాత్మిక చింతన మరియు వైరాగ్యం : యవ్వనంలో అడుగుపెట్టిన నరేంద్రుడు లోతైన ఆలోచనలలో మునిగిపోయేవాడు. చిన్నవయసులోనే ఆయన సమాధి స్థితిని (ధ్యానం) అభ్యసించడం చూసి, ప్రజలు అతడిని పునర్జన్మ ఎత్తిన ‘ధ్రువుడు’ అని లేదా ‘గొప్పయోగి’ అని ప్రశంసించేవారు. మొగలిపువ్వు వికసించడంతోటే సువాసనను వెదజల్లినట్లుగా నరేంద్రుడిలోని మహోన్నత భావాలు చిన్ననాడే వ్యక్తమయ్యాయి.
సంసార స్వభావంపై విశ్లేషణ నరేంద్రుడు ఈ ప్రపంచాన్ని మేడిపండుతో పోల్చాడు. మేడిపండు పైకి చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నా, లోపల పురుగులు ఎలా ఉ ంటాయో ఈ లోకంలో సుఖాలు కూడా పైకి ఆనందంగా అనిపించినా, లోపల అంతా దుఃఖమయమని ఆయన గ్రహించాడు. ఈ సంసారం లోతు తెలియని బావి లాంటిదని, కోరికలనే ముళ్ళు నిండిన కష్టమైన మార్గమని ఆయన ఆవేదన చెందాడు. బ్రహ్మదేవుడి నుండి చిన్న చీమ వరకు ప్రతిజీవి ఈ మాయాజాలంలో ఎందుకు చిక్కుకుంటుందో అని నరేంద్రుడు తీవ్రంగా ఆలోచించేవాడు.
ముగింపు : తన అద్భుతమైన ప్రతిభతో, క్రమశిక్షణతో మరియు లోతైన ఆధ్యాత్మిక జిజ్ఞాసతో నరేంద్రుడు ఒక సాధారణ విద్యార్థి స్థాయి నుండి ప్రపంచం మెచ్చిన మార్గదర్శి, ఆధ్యాత్మిక గురువు మరియు మహోన్నత మూర్తిమత్వం కలిగిన ధార్మికుడు.
![]()
Introduction : The lesson ‘विवेकानन्द’ is an extract from ‘विवेकानन्दम नामक पद्यकाव्यात्’ Written by Shri Sannidhanam Suryanarayana Sastry.
He was a renowned scholar in both Sanskrit and Telugu. He was honored with titles like ‘Vidwadratna’ ‘Ajanmasiddhakavi’. His notable works include ‘Vivekanandamu’, ‘Tatsama Chandrika’, Kavyalankara Sangraham and Keera Sandesham.
Context of the lesson: The primary theme of this lesson is the holistic development of a student. It illustrates how young Narendra (Vivekananda) balanced academics, Physical fitness, arts and Spiritual inguiry. It serves as an inspiration for students to develop leadership qual ties and a strong character alongside formal education.
In this lesson the poem Chronicles the life of Swami Vivekananda. This specific portion focuses on his childhood and student life highlight- ing the extraordinary traits that hinted at his future greatness as a world leader. It beautifully describes the child hood, education, and spiritual transformation of Swami Vivekananda.
PRESENT LESSON:
A Natural Leader: In school, Narendra was like the moon among the stars and the central gem in a necklace. He was the most prominent student, and his classmates loved him so much that they always vied to sit next to him.
On the days Narendra was absent, the school felt as gloomy as a moonless night (Amavasya) even during the day, when he was present, the institution radiated like a full moon light (Purnima).
Education and Talent: Narendra showed euqal excellence in both studies and sports. He was an “Ekasanthagrahi” (One who learns and remebers everything in a single hearing) Although he did not spend all his time with books, he consistently remained the class topper (Vargamukhyah). He won numerous valuable prizes through his extraor- dinary talent in essay writing, debates, and elocution competitions.
Beyond academics, he mastered various fields such as music, wres- tling, and culinary Arts (cooking).
Spiritual Inclination : Even at a young age, people were amazed to see Narendra in a state of deep, unwavering meditation (samadhi). They described him as the rein carnation of the child saint ‘Dhruva’ or as a great yogi. Just as a Ketaki (Screwpine) flower spreads its fragrance as soon as it blooms, his greatness was evident from his very childhood.
Philosophical Out look (Vairagya) : Narendra compared this worldly life (samsara) to the Udumbara (Fig) fruit. Just as a fig fruit looks attractive and bright on the outside but is filled with worms inside, he realized that worldly pleasures appear joyful on the surface but are essentially filled with sorrow. He contemplated that this world is like a bottomless well and a difficult path filled with the throns on desires. He often pon- dered deeply why every living being, from a tiny ant to the creator Brahma, remains trapped in the illusion (maya).
Conclusion: Through his extraordinary talent, discipline, and profound spiritual inquiry, Narendra evolved from an ordinary student into a world – renowned spiritual leader, Swami Vivekananda.
![]()
2. लघुसमाधानप्रश्नाः
प्रश्न १.
कक्ष्यार्भकेषु नरेन्द्रः कथं बभौ ?
जवाब:
कक्ष्यार्भकेषु नरेन्द्रः नक्षत्रसंघाते अमृतांशुरिव प्रमुखो बभौ ।
प्रश्न २.
हारावलौ नरेन्द्रः कीदृशः ?
जवाब:
हारावलौ नरेन्द्रः नायकरत्नकल्पः ।
प्रश्न ३.
नरेन्द्रः एकं पादं कुत्र निदधाति ?
जवाब:
नरेन्द्रः एकं पादं क्रीडाङ्गणेषु निदधाति ।
3. एकपदसमाधानप्रश्ना:
प्रश्न १.
नरेन्द्रः किं चकमे ?
जवाब:
नरेन्द्रः लोक कल्याणम् (अथवा ) ज्ञानम् चकमे ।
प्रश्न २.
नरेन्द्रसाहचर्येण सहपाठिनः किं लभन्ते ?
जवाब:
नरेन्द्रसाहचर्येण सहपाठिनः मुदम् लभन्ते ।
प्रश्न ३.
नरेन्द्रः विद्यालयस्य कः बभूव ?
जवाब:
नरेन्द्रः विद्यालयस्य वर्गमुख्यः बभूव ।
![]()
५. सन्दर्भवाक्यानि
प्रश्न १.
विद्यालयस्यायमपूर्वतेजः ।
जवाब:
परिचयः इदं वाक्यं श्री सन्निधानं सूर्यनारायण शास्त्रि विरचित, विवेकानन्दः पाठ्यभागात स्वीकृतः ।
सन्दर्भ:- नरेन्द्रस्य विद्यालय उनिकिं वर्णयन् कविः एवम अवीचत् )
भावः – नरेन्द्रः तस्य विद्यालयस्य अद्वितीयः प्रकाशः आसीत् । यस्मिन् दिने सः विद्यालयम् अगच्छति, तद्यिवसं पौर्णमासी इव भवति ।
प्रश्न २. आह्लादयत्नेव हि केतकस्य ।
जवाब:
परिचयः – इदं वाक्यं श्री सन्निधानं सूर्यनारायण शास्त्रि विरचित, विवेकानन्दः पाठ्यभागात स्वीकृतः ।
सन्दर्भः – नरेन्द्रस्य विद्यालय उनिकिं वर्णयन् कविः एवम अवीचत् )
भावः यथा केतक पुष्पं विकसन समये स्वगंधेन सर्वान् आह्लदयति । तथैव नरेन्द्रः अपि स्वगुणैः सर्वान् सन्तोषयति ।
प्रश्न ३.
अद्योतयद्यं मणिदीपरूपः ।
जवाब:
परिचयः- इदं वाक्यं श्री सन्निधानं सूर्यनारायण शास्त्रि विरचित, विवेकानन्दः पाठ्यभागात स्वीकृतः ।
सन्दर्भः- नरेन्द्रस्य विद्यालय उनिकिं वर्णयन् कविः एवम अवीचत् ।
भावः- नरेन्द्रः उन्नत विद्यालयम् (कलाशालाम्) प्रविश्य, तत्र मणिदीपः इव प्रकाशितः ।
![]()
विवेकानन्दः Summary in Telugu & English
कवि परिचयः
श्री सन्निधानं सूर्यनारायणशास्त्रिमहोदयः पश्चिमगोदावरीजनपदे भीमडोलु समीपस्थे खण्ड्रिकाख्ये अग्रहारे नरसम्मा, सुब्बय्याख्ययोः पुण्यदम्पत्योः १०- १२- २८९७ दिनाङ्के समजनि । शास्त्रिमहाशयस्तु लोकप्रसिद्धानां शतावधानिनां श्री वेलूरि शिवरामशास्त्रिमहोदयानां सविधे चिरिवाडग्रामे रामशब्दादारभ्य महाभाष्यपर्यन्तमध्यय – नमकरोत् । ततः महाभाष्यम् अलङ्कारशास्त्रम्, आन्ध्रसंस्कृतयोरनेकानि काव्यानि च शास्त्रिमहोदयः अधीत वान । श्लोकरचनासामर्थ्यमपि सम्पादितवान्, ततः श्रीकालहस्तिगुरुकुले व्याकरणादिकं साधु समधीतवान् ।
श्री शास्त्रिमहाभागः स्व त्रयोदशवर्षे एव श्लोकान् विलिख्य स्वविद्यागुरुभ्यः शिवरामशास्त्रि महोदयेभ्यः अभिनन्दनानि प्राप । शास्त्रिवर्यस्य रचनासु पूर्णपात्रम्, एकलव्यम्, रुरुप्रमद्वरम्, चिक्रोडकथा, कीरसन्देशम्, विप्रवीरम्, विवेकानन्दम् इत्यादि पद्यकाव्यानि प्रसिध्दानि ।
आन्ध्रदेशहास्यकथाः, आन्ध्रकाव्यकथाः, प्रभावतीप्रद्युम्नम्, विजयविलासम्, सारङ्गधरम् इत्यादीनि गद्यकाव्यानि च प्रसिध्दानि । “विद्यारत्न” ’आजन्मसिद्धकविः” इत्यादीनि बिरुदानि शास्त्रिवर्यमलञ्चक्रुः । ‘तत्समचन्द्रिका’ “काव्यालङ्कारसङ्ग्रह विवरणम्” इति लक्षणग्रन्थौ च शास्त्रिवर्येण संरचितौ, साहित्यजगति प्रसिद्धौ च ।
श्री शास्त्रिमहाभागः सिकिन्दराबादनगरे राष्ट्रपतिमर्गे महबूब कलाशाला- उन्नतपाठशालायाम् आन्ध्रोपाध्यायरूपेण २९२२ तः त्रिंशत् वर्षाणि यावत् सेवामकरोत् । १९८२ संवत्सरे अक्टोबर् मासे शास्त्रिवर्यः अनायासेन तनुं त्यक्तवान् ।
विवेकानन्दनामकः प्रस्तुतपाठ्यभागः ‘विवेकानन्दम्’” नामकपद्यकाव्यात् संगृहीतः ।
కవి పరిచయం:
శ్రీ సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి మహోదయులు పశ్చిమగోదావరిజిల్లా, భీమడోలు సమీపంలోని కండ్రిగ, (ఖండ్రిక) అనెడి అగ్రహారంలో నరసమ్మ, మరియు “సుబ్బయ్య దంపతులకు 10-12 – 1897వ తేదీన జన్మించారు. శాస్త్రిగారు ప్రాథమిక విద్యానంతరం చిరవాడ గ్రామంలో గల లోకప్రసిద్ధ పండితాగ్రేసరులైన శతావధాని శ్రీ వేలూరి శివరామశాస్త్రి మహోదయుని సన్నిధానంలో చేరి, రామశబ్దము నుండి మహాభాష్య పర్యంతము అభ్యసించారు.
అక్కడ ఆ సమయంలో మహాభాష్యం, అలంకారశాస్త్రం అనేక సంస్కృత, ఆంధ్రకావ్యాలను, సాహిత్యాన్ని అభ్యసించడమే కాకుండా శ్లోకరచనయందు పట్టు సాధించారు. అటుపిమ్మట శ్రీకాళహస్తి గురుకులంలో వ్యాకరణ శాస్త్రాన్ని అభ్యసించారు.
శ్రీ శాస్త్రి మహోదయులు స్వయంగా శ్లోకాలను రచించి వారి విద్యాగురువులైన శివరామశాస్త్రి మహోదయుల నుండి అభినందనలు పొందారు. వీరి రచనలలో పూర్ణపాత్రమ్, ఏకలవ్యమ్, రురుప్రమద్దరమ్, చి క్రోడకథా, కీరసందేశమ్, విప్రవీరమ్, వివేకానందమ్ మొదలైన పద్యకావ్యాలు ప్రసిద్ధమైనవి.
ఆంధ్రదేశహస్తకథా, ఆంధ్రకావ్యకథా, ప్రభావతీ ప్రద్యుమ్నమ్, విజయవిలాసమ్, సారంగధరమ్ మొదలగు గద్యకావ్యాలు, “తత్సమచంద్రికా”, “కావ్యాలంకార సంగ్రహము” వంటి లక్షణ గ్రంథాలు శ్రీ శాస్త్రిగారు రచించారు. శాస్త్రి మహోదయులకు ‘విద్యారత్న’, ‘ఆజన్మ సిద్ధాంతకవి’ అను బిరుదులు కలవు.
శ్రీశాస్త్రి మహోదయులు సికింద్రాబాదు (సికిందరాబాదు) నందలి రాష్ట్రపతి మార్గ్ నందు గల మహబూబ్ కళాశాల నందలి ఉన్నత పాఠశాలలో ఆంధ్రోపన్యాస కులుగా 1921నుండి దాదాపు ముప్ఫయి సంవత్సరాలు పనిచేశారు.
1982వ సంవత్సరంలో అక్టోబరు మాసంలో శాస్త్రిగారు ప్రశాంతంగా తనువు చాలించారు.
ప్రస్తుత పాఠ్యభాగం ‘వివేకానందః’ శాస్త్రి మహోదయులు రచించిన ‘వివేకానందమ్’ అనే పద్యకావ్యం నుండి స్వీకరించబడినది.
![]()
Sri Sannidhanam Suryanarayana Sastry was born on 10-12-1897, to the couple Narasamma and Subbayya in ‘Kandriga’ village near ‘Bhimadolu, West Godavari District. After his primary education, he studied literature and scriptures from ‘kavya’ up to ‘Mahabhashya’ under the guidance of the world-renowned scholar Sri Veluri Siva Rama Sastry. After studying numerous Sanskrit and Telugu works, he mastered grammar (Vyakarana) at the Srikalahasti Gurukulam.
Sri sastry composed verses (Slokas) of his own and received accolades from his mentor, Shivarama Sastry. Among his works, poetic compositions (Padyakavyas) such as Purapatram, Ekalavyam, Rajupramaddaram, Chikroda Katha, Keera Sandesham, Vipra veeram, and Vivekanandam are very famous.
His prose works (Gadyakavyas) like Andhra Desha Hasta Ktha, Andhra Kavyakatha, Prabhavathi – Pradyumnam, Vijaya vilasam, and Sarasangraham are also well-known. He was honored with titles like ‘Vidwadratna’ and “Ajanma Siddhakavi” for his profound Scholarship. He also authored technical works (Lakshana Granthas).
Such as “Tatsama Chandrika” and “Kavyalankara Sangraha Vivaranam’, which are highly regarded in the literary world.
Sri Sannidhanam Suryanarayana Sastry served as a Telugu teacher at Mahaboob College High School, Secunderabad, for about 30 years starting from 1921. In October 1982, Sastry garu passed away peacefully.
The current lesson titled ‘Vivekanandah’ is extracted from his poetic work (Padyakavya) named ‘Vivekanandam’.