Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Sanskrit Study Material Pdf पद्यभागः 4th Poem ऋतुषट्कम् Questions and Answers Summary.
Inter 2nd Year Sanskrit ऋतुषट्कम् Questions and Answers
अभ्यासः
1. निबन्धप्रश्नौ
1. श्री ओगेटि परीक्षित् शर्माभिः कृतं षड् ऋतुवर्णनम् विवृणुत ।
శ్రీ ఓగేటి పరీక్షిత్ శర్మ గారిచే వర్ణింపబడిన ఆరుఋతువుల విశేషాలను వివరించండి?
Explain the description of the six seasons as given by Sri Ogeti Parikshit Sharma.
2. “ऋतुषट्कम्” इति पाठ्यभागस्य सारांश लिखत ।
“ऋतुषट्कम्” పాఠ్యాంశ సారాంశమును వ్రాయండి.
Write the summary of the lesson “ऋतुषट्कम्” (“Rutu Shatkam”)
जवाब:
కవిపరిచయం : ప్రస్తుత పాఠ్యాంశము శ్రీ ఓగేటి పరీక్షిత్ శర్మ గారిచే రచించబడిన యశోధరా మహాకావ్యము నందలి పదిహేడవ (17) సర్గ నుండి స్వీకరించబడినది. ఓగేటి పరీక్షిత్ శర్మ గారు బహుభాషా కోవిదులు. తెలుగు మరియు సంస్కృత భాషలలో అసాధారణమైన పాడిత్యం కలవారు. ఈయన గొప్ప కవి మరియు సంగీత విద్వాంసులు.
ఈయన యశోధరామహాకావ్యం, శ్రీమత్ ప్రతాపరాణాయణం, లలితగీతలహరి మొదలగు కావ్యాలు రచించారు. ఓగేటి పరీక్షిత్ శర్మ గారు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు సంస్కృత కవిగా గుర్తింపు పొందారు.
వీరి రచనలలో భాష సరళంగా ఉంటూనే భావం లోతుగా ఉంటుంది. ప్రకృతిని వర్ణించడంలోనూ, మానవ మనస్తత్వాలను చిత్రించడం లోనూ వీరు సుప్రసిద్దులు (సిద్ధహస్తులు).
పాఠ్యభాగ పరిచయం, ఇతివృత్తం :
ప్రస్తుత పాఠ్యాంశము ऋतुषट्कम् శ్రీ ఓగేటి పరీక్షిత్ శర్మగారిచే రచించబడిన ‘యశోధరా మహాకావ్యం’ పదిహేడవ (17) సర్గ నుండి స్వీకరించబడినది.
సిద్ధార్ధుడు (బుద్ధుడు) మహాభినిష్క్రమణం గూర్చి తెలుసుకున్న యశోధర ఆవేదన చెందుతుంది. అతడు, చెప్పకుండా వెళ్ళినందుకు మనస్తాపం చెందుతుంది. తన భర్త అడవిలో మునిలా జీవిస్తున్నాడని తెలుసుకున్న యశోధర, రాజభవనంలో ఉంటూనే విలాసాలను త్యజిస్తుంది. ‘నిష్కామయోగిని’ వలె జీవిస్తుంది. అనగా భర్త బయట తపస్సు చేస్తుంటే, ఆమె అంత:పురంలో ఉండి మానసిక తపస్సు చేస్తుంది.
ఈ క్రమంలో గడిచే కాలం, ఋతువులు (వసంతం నుండి శిశిరం వరకు) ఆమెలో విరహవేదనను, ధీరత్వాన్ని ఎలా పెంచాయో కవి . ऋतुषट्कम् ద్వారా వివరించారు. పురుషుని ఆశయాల్లో సగభాగం పంచుకోగల శక్తి స్వరూపిణి గా, యశోధర చేసిన మౌనత్యాగం సాటిలేనిదిగాను, పురుషుల గొప్పతనాన్ని చాటే కావ్యాలమధ్య, ఒక స్త్రీ దృక్కోణం నుండి ధర్మం మరియు త్యాగాన్ని వివరించడమే ఈ మహాకావ్య ఇతివృతం.
ప్రస్తుతపాఠ్యభాగ వివరణ :
ఓగేటి పరీక్షిత్ శర్మ గారు రచించిన యశోధరా మహాకావ్యంలోని మొదటి ఋతువర్ణన ‘వసంత ఋతువు’ వర్ణన ప్రధానమైనది.
వసంత ఋతువు : చైత్ర, వైశాఖ మాసాలతో కూడిన వసంతకాలంలో ప్రకృతి అంతా సరికొత్తగా మారుతుంది. ఎండుటాకులు రాలిపోయి, చెట్లు సరికొత్త చిగుళ్ళతో కళకళలాడుతుంటాయి. వసంతంలో మామిడి చెట్లు పూతపూస్తాయి.
మామిడి చిగుళ్ళను ఆస్వాదించే కోకిలలు కుహూ కుహూ రావాలు వనం అంతటా ప్రతిధ్వనిస్తాయి. ఇది విరహ వేదనలో ఉన్న యశోధరకు తన భర్త సిద్ధార్ధుడి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. అంతేగాక వసంతకాలంలో మల్లెలు, అశోకవృక్షాలు వికసించి గాలిలో మధురమైన సువాసనలను నింపుతాయి. గాలి కదలికలకు పూలరేకులు రాలడం ఒక అందమైన దృశ్యంలా వర్ణించబడింది.
సాధారణంగా వసంతం అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. కానీ భర్తకు దూరమైన యశోధరకు ఈ ప్రకృతి సౌదర్యం విరహ తాపాన్ని కలిగిస్తుంది. సిద్ధార్ధుడు లేని ఈ వసంతం తనకు అర్ధం లేనిదిగా ఆమె భావిస్తుంది. కవి పరీక్షిత్ శర్మ గారు కేవలం ప్రకృతిని వర్ణించడమే కాకుండా, ప్రకృతిలోని ప్రతి మార్పుని యశోధర అంతరంగంలోని భావాలతో ముడిపెట్టి వసంతఋతువును వర్ణించారు.
గ్రీష్మ ఋతువు : ఈ ఋతువును కేవలం ఎండాకాలంగానే కాకుంగా, జీవితంలోని కష్టాలకు, పరీక్షలకు ప్రతీకగా కవి చిత్రించారు. సిద్ధార్ధుడు వెళ్ళిపోయాక యశోధర జీవితం ఒక ఎడారిలా మారిందని చెప్పడం ఈ ఋతువు వర్ణనయందలి ఉద్దేశం. ఎండాకాలంలో సూర్యుడు తన ప్రచండమైన కిరణాలతో భూమిని దహిస్తున్నట్లుగా ఉంటాడు. చెరువులు, కుంటలు ఎండిపోయి భూమి నెర్రలు చాస్తుంది. వసంతకాలంలో చిగురించిన పచ్చదనం గ్రీష్మ తాపానికి వాడిపోతుంది. పక్షులు, జంతువులు నీడకోసం, నీటికోసం అలమటించే తీరును కావ్యం నందు కవి హృద్యంగా వర్ణించారు.
బయట ఉన్న ఎండవేడిమి కంటే సిద్ధార్ధుని ఎడబాటు వల్ల యశోధర మనసులో కలుగుతున్న విరహ తాపం (బాధ) మిన్నగా ఉందని కవి పోల్చారు. సూర్యుని వేడిమి ఆమె శరీరానికి కష్టం కలిగిస్తే, భర్త దూరమవ్వడం ఆమె మనస్సును దహిస్తోందని వర్ణించబడినది. గ్రీష్మ కాలంలో వికసించే మల్లెలు కుసుమరాగాల పూల సువాసనలు కొంత ఉపశమనాన్ని ఇస్తాయి. కానీ మనసులో ప్రశాంతత లేని యశోధరకు ఆ చల్లని వెన్నెల కూడా వేడిగా అనిపిస్తుంది.
వర్షఋతువు : వర్షం ప్రకృతికి జీవాన్ని ఇస్తుంది. కానీ యశోధర జీవితంలో మాత్రం ఆమె ఏకాంతాన్ని, దిగులును రెట్టింపు చేస్తుంది.
వర్షాకాలంలో ఆకాశం నల్లని మేఘాలతో నిండిపోతుంది. ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంది. లోవమంతా చల్లబడుతున్నా, యశోధర హృదయం మాత్రం సిద్ధార్ధుని జ్ఞాపకాలతో ఉడికిపోతుంటుంది. ఎండిపోయిన భూమి వర్షపు చినుకులతో తడిసి, భూమి నుండి వచ్చే మట్టి వాసన పర్యావరణాన్ని నింపుతుంది. నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తాయి. కానీ ఈ ఉత్సాహం యశోధరకు మరింత బాధను కలిగిస్తుంది. ఆకాశం నుండి కురిసే వర్షధారలు యశోధర కనుల నుండి కారుతున్న కన్నీళ్ళలా ఉన్నాయని కవి వర్ణించారు. మేఘం గర్జించడం ఆమె గుండె ఘోషలా అనిపిస్తుంది.
వర్షాకాలం సాధారణంగా ప్రేమికులు, దంపతులు కలిసి ఉండే కాలం, అటువంటి సమయంలో భర్త పక్కన లేకపోవడంతో ఆ చల్లని జల్లులు కూడా ఆమెకు బాణాల్లా గుచ్చుకుంటాయి.
శరత్ ఋతువు : ఈ కావ్యంలో కవి శరత్ ఋతువును యశోధర యొక్క విరహవేదన తో మరియు ప్రకృతి సౌందర్యంతో ముడిపెట్టి అద్భుతంగా చిత్రించారు.
యశోధర తన భర్త సిద్ధార్ధుడి రాక కోసం వేచి చూస్తూ, ఈ ప్రకృతి అందాలను చూసి తన మనసులోని ఆవేదనను వ్యక్తపరుస్తుంది. ఈ ఋతువులో ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉన్నా ఆమె హృదయం మాత్రం విరహంతో తపిస్తూ ఉంటుంది. వర్షాకాలం ముగిసి, మేఘాలు తొలగిపోయి, ఆకాశం స్వచ్ఛంగా నీలంగా మారుతుంది. ఈ నిర్మలత్వం మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది.
శరత్ ఋతువులో వెన్నెల అత్యంత కాంతివంతంగా పాలసముద్రంలా ఉంటుంది. కానీ విరహంలో ఉన్న యశోధరకు ఈ చల్లని వెన్నెల కూడా తాపాన్ని (వేడిని) కలిగిస్తున్నట్లుగా వర్ణించబడింది.
మానస సరోవరం నుండి హంసలు తిరిగి వచ్చేకాలం ఇది. తెల్లని హంసలు నిర్మలమైన జలాల్లో విహరించడం శరత్ శోభకు చిహ్నం. శరత్కాలంలో రాత్రివేళ వికసించే కలువపూలు (కుముదములు) వెన్నెల కాంతిలో మెరుస్తూ సరస్సులకు అందాన్నిస్తాయి. నదులు తమ ఉధృతిని తగ్గించుకుని, స్వచ్ఛమైన నీటితో నిశ్శబ్దంగా ప్రవహిస్తాయి. తామరపూలు, తుమ్మెదల ఝంకారాలతో ప్రకృతి పులకిస్తుంది. ఈ విధంగా కవి శరత్కాలపు ప్రకృతిని యశోధర యొక్క విరహాగ్నికి అభేదంగా వర్ణించారు.
హేమంత ఋతువు : “యశోధరామహాకావ్యం” లో హేమంత ఋతువు వర్ణన యశోధర విరహ వేదనను ప్రతిబింబించేలా సాగుతుంది. హేమంత ఋతువు మార్గశిర, పుష్య మాసాలలో వస్తుంది. ఇది చలికాలం ప్రారంభం అయ్యేసమయం. మంచుకురవడం, చల్లనిగాలులు వీయడం మరియు సూర్యుని ప్రకాశం మందగించడం వంటి ప్రకృతి లక్షణాలను కవి వర్ణించారు. యశోధర తన భర్త సిద్ధార్ధుని ఎడబాటు కలిగి ఉన్నందున, బయట కురిసే మంచు మరియు చలి ఆమె విరహాగ్నిని (వేదనను మరింతంగా పెంచుతున్నట్లు, ప్రకృతిలోని ప్రతి మార్పును యశోధర మనఃస్థితితో కవి వర్ణించెను.
శిశిర ఋతువు : సంస్కృత సాహిత్యంలో ‘శిశిర’ అనే పదాన్ని కొన్నిచోట్ల ‘శశి’ (చంద్రుని వంటి చల్లదనం) తో పోలుస్తూ వర్ణిస్తారు. ఈ కావ్యంలోని శిశిర ఋతువు వర్ణన యశోధర విరహవేదనకు పరాకాష్ఠగా నిలుస్తుంది. శిశిర ఋతువు మాఘ మరియు ఫాల్గుణ మాసాలలో వస్తుంది. ఇది అత్యంత చల్లనికాలం చెట్లు ఆకులు రాల్చడం (పతనం), మంచు కురవడం ఈ ఋతువు ప్రత్యేకత. వనమంతా వెలవెలబోయినట్లు కనిపిస్తుంది.
చెట్లు ఆకులురాల్చినట్లుగా, యశోధర కూడా తన అలంకారాలను త్యజించి, విరహంతో కృశించిపోతున్నట్లుగా కవి వర్ణించారు. బయట వీచే ‘శిశిర’ (చల్లని) గాలులు ఆమెకు సెగలు చిమ్ముతున్నట్లు అనిపిస్తాయి. పక్షులు తమగూళ్ళకు చేరుకుంటున్నాయి. కానీ తన భర్త సిద్ధార్ధుడు మాత్రం తిరిగి రావడం లేదని ఆమె పడే ఆవేదన ఈ ఋతువర్ణనలో హృదయవిదారకంగా
ఉంటుంది.
ముగింపు : ఈ ఋతువర్ణల ద్వారా శ్రీ ఓగేటి పరీక్షిత్ శర్మ గారు కేవలం ప్రకృతిని మాత్రమే వర్ణించలేదు. ప్రకృతిలోని ప్రతిమార్పు యశోధర మానసిక స్ధితిని ఎలా ప్రభావితం చేసిందో అద్భుతంగా చిత్రించారు. యశోధర ఒక సాధారణ విరహ నాయిక మాత్రమే కాదు, ఆమె ఆత్మస్థైర్యం, త్యాగనిరతిని, వ్యక్తిత్వాన్ని చివరకు బుద్ధుని బోధనలను అర్ధం చేసుకునే పరిణితిని ఈ కావ్యం వివరిస్తుంది. సాధారణంగా బుద్ధుని జీవితంలో అతనికి లభించిన జ్ఞానోదయానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ కవి శ్రీ ఓగేటి పరీక్షిత్ శర్మ గారు యశోధర కోణం నుండి ఈ కావ్యాన్ని రచించి, ఆమెను ఒక మహోన్నత త్యాగమయిగా చిత్రించారు.
![]()
Introdution :
The lesson is an extract from the great Kavyam – “Yashodhara Mahakavyam” written by ”श्री ओगेटि परीक्षित् शर्मा”. He possessed extraordinary mastery over both Telugu and Sanskrit Languages. Beyond being a great poet, he was also an accomplished musician.
Context of the lesson: The ‘Itivrittass’ of “Yashodhara Mahakavyam” centres on the sacrifice, self-respect, and spiritual endurance of Yashodhara, the wife of Prince Siddhartha (Gauthama Buddha). The story begins with the Poignant moment when Siddhartha leaves the place at midnight, leaving behind his sleeping wife, Yashodhara.
Upon waking, Yashodhara is pain stems not just from his departure, but from the fact he left “Stealthily” without telling her. Upon learning that Siddhartha is living like an ascetic in the forest, Yashodhara decides to lead a similar life within the palace. She renounces jewellery, wears simple robes eats only once a day. She becomes a “Nishkama Yogini” matching her husband’s spiritual rigor.
The passage of time and the changing of the six seasons (Ritus) act as a backdrop to her suffering and strength. Each season reflects different shades of her emotional and spiritual journey. The poet “श्री ओगेटि परीक्षित् शर्मा” portrays Yashodhara as a symbol of strength and silent sacrifice. The epic highlights that a woman is not just a companion in worldly life but an equal partner in a man’s spiritual and dharmic journey. The plot shifts the focus from the Buddha’s enlightenment to the unseen sacrifice of the woman he left behind. It establishes Yashodhara as a pinnacle of patience, loyalty, and self-respect.
Present Lesson: The lesson from Ogeti Parikshit Sharma’s ‘Yashodhara Mahakavyam’ beautifully describes the six seasons (Ritus) The poet uses these seasons to mirror the emotions of Yashodhara and the beauty of nature.
1. Vasantha Ritu (Spring): This is the ‘King of Seasons’. The poet describes the gentle southern breeze (Malayamarutham) that brings new life. Trees like Mango and Ashoka blooms and cuckoo sing melodiously. For Yashodhara, however, this beauty highlights the pain of being away from Siddhartha.
2. Grishma Ritu (Summer): As the sun’s heat intensifies, the earth becomes parched. The poet describes people seeking shade and cool water. This season represents the tapa (burning heat) of Yashodhara’s inner grief and her burning desire for her husband’s return.
3. Varsha Ritu (Monsoon): The sky is filled with dark clouds and thunder. The rain falling on the dry earth is compared to the tears of Yashodhara falling for Siddhartha. The Peacocks dance in the rain, but Yashodhara’s heart is heavy with the thunder-like echoes of her loneliness.
4. Sharad Ritu (Autumn): After the rains, the sky becomes clear and blue, and the moon shines brightly. The lotus flowers bloom in the lakes. This season represents a period of clarity and hope, where Yashodhara tries to find peace through meditation and spiritual discipline.
5. Hemanta Ritu (Pre-winter) : The weather turns cold, and the mornings are covered in mist. The harvest is ready, bringing a sense of fulfillment to the world. However, the biting cold symbolizes the chill of loneliness in the palace for Yashodhara.
6. Shishira Ritu (Winter) : The leaves fall from the trees (deciduous nature), leaving them bare. This represents the renunciation and the shedding of worldly comforts. Just as the trees wait for a new spring. Yashodhara lives in a state of silent waiting and austerity (Tapasya).
Conclusion: Ogeti Parikshit Sharma uses these six seasons to show that nature and human emotions are deeply connected. He portrays Yashodhara as a ‘Pativrata’ (Loyal wife) whose life remains constant in its devotion, even as the seasons around her change.
![]()
2. लघुसमाधानप्रश्नाः
प्रश्न 1.
वसन्तर्तौ मञ्जुरागं कः कूजति ?
जवाब:
वसन्ततौ मञ्जुरागं मत्तः पुंसकोकिलः कूजति ।
प्रश्न 2.
ग्रीष्मत जगत् कथं बभूव ?
जवाब:
ग्रीष्मतौ जगत् प्रचण्ड- सूर्यतप- दीपितं बभूव ।
प्रश्न 3.
ऋतुषट्कम् इति पाठ्यभागः कस्मात् काव्यात् स्वीकृतम् ?
जवाब:
ऋतुषट्कम् इति पाठ्यभागः ‘यशोधरामहाकाव्यत्” स्वीकृतम् ।
3. एकपदसमाधानप्रश्नाः
प्रश्न 1.
सान्द्रघानावृतः ऋतुः कः ?
जवाब:
सान्द्रघनावृतः ऋतुः वर्षर्तुः ।
प्रश्न 2.
शीतोष्णसमानदर्शी ऋतुः कः ?
जवाब:
शीतोष्णसमानदर्शी ऋतु: हेमन्तर्तुः ।
प्रश्न 3.
कः ऋतुः जाड्यभावं वितनोति ?
जवाब:
शिशिरर्तुः जाड्यभाव वितनोति ।
![]()
4. सन्दर्भवाक्यानि
प्रश्न 1.
सत्वं ननु चेतनं सदा ।
जवाब:
परिचय : इदं वाक्यं ऋतुषट्कम् पाठ्यभागात् स्वीकृतः ।
कविः श्री ओगेटि परीक्षित् शर्मा ( शर्मः )
सन्दर्भः कविः यत्र वसन्त ऋतुवर्णनं करोति तस्मात् सन्दर्भात् एतत् वाक्यम् अस्ति ।
भावः वसन्त वायुः चित्तस्य चैतन्यं प्रबोधयति इति कवि अवदत् ।
प्रश्न 2.
गभिस्तिमान् नैव सहिष्णुभावः ।
जवाब:
परिचय : इदं वाक्यं ऋतुषट्कम् पाठ्यभागात् स्वीकृतः ।
कविः श्री ओगेटि परीक्षित् शर्मा ( शर्मः )
सन्दर्भः इदं वाक्यं ग्रीष्मत्रस्तु वर्णन कवि अवदत् ।
भावः कविः सूर्य उष्णक्रोधेन धैर्यं विना जगत् दहति इति वर्णयति ।
प्रश्न 3.
सस्यावृतो जीवन जीवदायी ।
जवाब:
परिचय : इदं वाक्यं ऋतुषट्कम् पाठ्यभागात् स्वीकृतः ।
कविः श्री ओगेटि परीक्षित शर्मा ( शर्मः )
सन्दर्भः इदं वाक्यं हेमन्त ऋतु वर्णन कवि अवदत् ।
भावः कविः हेमन्तर्तुः सस्यानां सजीवीकर णस्य, जगतः पोषणस्य च समयः इति वर्णितवान ।
![]()
ऋतुषट्कम् Summary in Telugu & English
कवि परिचयः
आधुनिक संस्कृतवाङ्मयक्षेत्रे बहुधा लब्धप्रतिष्ठः कविपुङ्गवस्तत्रभवान् श्री ओगेटि परीक्षित् शर्मा महाशयः १९३० तमे वर्षे आन्ध्रप्रदेशराज्यस्य गुण्टूरुमण्डलान्तर्गते पोन्नूरूपत्तने लब्धजन्मा आसीत् । पोन्नूरुस्थ – वेदपाठशालायां प्राथमिकविद्यां पठित्वा, पश्चिमे गोदावरीमण्डले विद्यामाने कोव्वरुपत्तने राराजमाणे आन्ध्रगीर्वाणविद्यापीठे प्रविश्य संप्राप्तोभयभाषा (तेलुगु – संस्कृतयोः) प्रवीणः समभूत् । किञ्च आङ्ग्ल- प्राकृतभाषयोरपि लब्धाधिकारः संवृत्तः श्रीशर्मामहोदयः । असाधारणपाण्डिती-मण्डितः श्री परीक्षित् शर्मामहाभागः केन्द्रीयसर्वकारीयैः साहित्याकाडमी पुरस्कारेण, अखिलभारतीय कालिदास पुरस्कारेण च सत्कृतः ।
कविवृषभस्यास्य लेखनीतः विनिर्गताः कृतिविशेषाः – ललितगीतालहरी, यशोधरा-महाकाव्यम्, श्रीमत्प्रतापराणायणाख्यं महाकाव्यम्, परीक्षिन्नाटकचक्रम्, कालाय तस्मै नमः नवला चेति ।
కవి పరిచయం:
ఆధునిక సంస్కృత సాహిత్యరంగంలో గొప్ప ఖ్యాతి గడించిన కవి, శ్రీ ఓగేటి పరీక్షిత్శర్మ గారు. వీరు 1930వ సం||లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందలి గుంటూరు జిల్లా, పొన్నూరు పట్టణం లో జన్మించారు. పొన్నూరు వేదపాఠశాల నందు ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసిన అనంతరం పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణంలో రారాజమాణే (పురుషుల) ఆంధ్రగీర్వాణ విద్యాపీఠం లో చేరి ఆంధ్రము, సంస్కృతము రెండు భాషలలోనూ ప్రావీణ్యం పొందారు. అంతేకాకుండా శ్రీ శర్మ కు ఆంగ్లము మరియు ప్రాకృత భాషలనందు కూడా ప్రావీణ్యం కలదు. అసాధారణ పాండిత ప్రతిభా సంపన్నులైన శ్రీ ఓగేటి పరీక్షిత్ శర్మ మహాశయుని కేంద్రప్రభుత్వం సాహిత్య అకాడమీ (అవార్డు) పురస్కారం, మరియు అఖిల భారత కాళిదాస పురస్కారంతో సత్కరించింది.
ఈ కవివృషభుని యొక్క లేఖిని నుండి వెలువడిన కృతివిశేషాలు :-
లలితగీతలహరి, యశోధర మహాకావ్యం, శ్రీమత్ ప్రతాపరాణాయణాఖ్యం మహాకావ్యం, పరీక్షిన్నాటక చక్రమ్, కాలాయ తస్మై నమః నవల మొదలగునవి శ్రీ ఓగేటి పరీక్షిత్ శర్మ రచనలు.
Poet Introduction
A poet who has achieved great fame in the field of modern San- skrit literature, Sri Ogeti Parikshith Sharma was born in 1930 in Ponnur town, Guntur district, Andhra Pradesh. After completing his primary education at Ponnur Vedapatashala, he joined the Rarajamane (Male) Andhra Girvana Vidyapeeth in Kovvur town, West Godavari district and became proficient in both Andhra and Sanskrit languages. In addi- tion, Sri Sharma is also proficient in English and Prakrit languages. Sri Ogeti Parikshith Sharma Mahasaya, who is endowed with extraordi- nary scholarly talent, was honored by the Central Government with the Sahitya Academi ( Award) and the all India Kalidasa Award.
The works that emerged from the pen of this poet- Vrishabhu are: Lalitagitalahari, Yashodhara Mahakavyam, Srimat Prataparanayanakhyam Mahakavyam, Parikshinnataka Chakram, Kalaya Tasmai Namah: Novel etc., are the works of Sri Ogeti Parikshith Sharma.
पाठ्यभाग परिचयः
“ऋतुषट्कम्” इति शीर्षिकाङ्कितः प्रकृतपाठ्यभागस्तु ‘यशोधरा’ महाकाव्यस्य सप्तदशसर्गात् संगृहीतः । महानिर्वाणाधिगमाय महाभिनिष्क्रमणं कृतवतः भगवतः बुद्धस्य विरहानलेन दूयमानमानसायाः काव्यकथानायिकायाः यशोधरायाः चरितं महाकाव्यस्येतिवृत्तमास्ते । करुणरसस्तु महाकाव्येऽस्मिन् अङ्गिरसत्वेनोपनिबद्धः । माधुर्य प्रसाद गुणसम्भरिता कवितैषा सहृदयमनोल्लासिनी विलसति । प्रस्तुतपाठ्यभागे षण्णाम् ऋतूणां सुचारुवर्णनं गोचरीक्रियते ।
![]()
పాఠ్యభాగ పరిచయం:
“ऋतुषट्कम्” అనే శీర్షికతో పరిచయం చేయబడిన ప్రస్తుత పాఠ్యభాగము శ్రీ ఓగేటి పరీక్షిత్ శర్మ రచించిన యశోధరా- మహాకావ్యము నందలి పదిహేడవ సర్గ నుండి స్వీకరింపబడినది.
సిద్ధార్థుడు (బుద్ధుడు) జ్ఞానోదయం కోసం ఇల్లు విడిచి వెళ్ళిన తరువాత, యశోధర పడిన విరహవేదన, ఆత్మస్థైర్యం, మరియు చివరకు బుద్ధుని బోధనలను అర్ధం చేసుకునే పరిణితిని ఈ కావ్యం వివరిస్తుంది.
అంతేగాక ఈ పాఠ్యభాగం యశోధర అంతరంగాన్ని ప్రకృతిలోని మార్పులను అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. ఈ కావ్యం కరుణ రసం అంగిరస బద్ధమైన అలరారింది. ప్రస్తుత పాఠ్యభాగమైన “యశోధరా మహాకావ్యం” నందు ఆరు బుతువులు విశేషంగా వర్ణింపబడి హృదయోల్లాసము కలిగించును.