Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Sanskrit Study Material Pdf पद्यभागः 3rd Poem सूक्तिरत्नावली Questions and Answers Summary.
Inter 2nd Year Sanskrit सूक्तिरत्नावली Questions and Answers
अभ्यासः
1. लघुसमाधानप्रश्नाः
प्रश्न 1.
केषां वसुधैव कुटुम्बकम् भवति ?
जवाब:
उदारचरितानांतु वसुधैक कुटुम्बकम् भवति ।
प्रश्न 2.
कथं मित्राणि रिपवः जायन्ते ?
जवाब:
व्यवहारेण मित्राणि रिपवः जायन्ते ।
प्रश्न 3.
धीमतां कालः कथं गच्छति ?
जवाब:
धीमतां काव्यशास्त्रविनोदेन कालोगच्छति ।
प्रश्न 4.
गीर्वाणभारती कीदृशी ?
जवाब:
गीर्वाण भारति काव्यं मधुरं तस्मादपि सुभाषितम् ।
प्रश्न 5.
किमर्थं सतां विभूतयः ?
जवाब:
परोपकारेण सतां विभूतयः
![]()
2. एकपदसमाधानप्रश्नाः
प्रश्न 1.
वृत्तं कथं रक्षेत्
जवाब:
वृत्तं यत्नेन रक्षेत् ।
प्रश्न 2.
कः सर्वत्र पूज्यते ?
जवाब:
विद्वान् सर्वत्र पूज्यते ।
प्रश्न 3.
कृतमुपकारं के न विस्मरन्ति ?
जवाब:
न हि कृतमुपकारं साधवो विस्मरन्ति ।
सूक्तिरत्नावली Summary in Telugu & English
पाठ्यभाग परिचयः
संस्कृतसाहित्ये नीतिग्रन्धानां सुमहत् स्थानं वर्तते । नीतिशास्त्रग्रन्थाः बहवः विरचिताः सन्ति । काव्य-पुराण – इतिहासेषु प्रसङ्गानुगुणं तत्तत्सन्दर्भेषु, नीतिबोधनं कृतम् । मानवीयमनसः सदालोचनाभ्यसनम्, बोधनम् कर्तव्यनिर्देशनं च नीतेः मुख्यं लक्ष्यम् । संस्कृतसाहित्ये तत्र तत्र तैः तैः कविभिः प्रसङ्गवशात् कृतं तत्तन्नीतिबोधनम् आधुनिक कलाशालाविद्यार्थिनां व्यक्तित्वविकासाय, आत्मविश्वासवर्धनाय, निर्णयस्वीकाराय, कार्यानुष्ठानाय, मानवीय प्रमाणानाम् अवगमनाय, अभ्यसनाय च बहु उपकरोति इति मत्वा प्रकीर्णतया स्थिताः केचन श्लोकाः अत्र प्रस्तुताः । विद्यार्थिनः तान् एतान् श्लोकान् पठित्वा अवगत्य च देश- काल-पात्रतादेः औचित्यं जानीयुरिति आशास्यते । सूचना – अत्र * चिह्निताः प्रितिपदार्थभावबोधपूर्वकं कण्ठस्थीकरणीयाः ।
పాఠ్యభాగ పరిచయం:
సంస్కృత సాహిత్యం నందు నీతి గ్రంథాల స్థానం ప్రముఖమైనది. పలువురు కవులు లోకం నీతిని తెలిపే, నైతిక విలువలు అందించే గ్రంథాలను వ్రాసారు.
సంస్కృత సాహిత్యంనందు నీతిగ్రంథాల స్థానం ప్రముఖమైనదని చెప్పవచ్చును. నీతిగ్రంథాలను అనేకమంది కవులు రచించారు. కావ్యముల యందు, పురాణాలయందు, ఇతిహాస కావ్యములందు ఆయా సందర్భానుసారంగా నీతిని బోధించే రత్నాలవంటి పద్యాలను, శ్లోకాలను అందించారు.
మానవులలో నైతికవిలువలను పెంపొందించడమే నీతిశాస్త్రాల ముఖ్య ఉద్దేశ్యం.
ప్రస్తుత పాఠ్యాంశమునందు సంస్కృత సాహిత్యంలో సందర్భానుసారంగా వివిధకవులు వ్రాసిన, ఆయాగ్రంథాల నుండి శ్లోకాలను సేకరించి ఇవ్వబడినవి. వీటి ముఖ్య ఉద్దేశం కళాశాల విద్యార్థులలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుటకు, ఆత్మవిశ్వాసాన్ని వృద్ధి చేసుకొనుటకు, స్వయం నిర్ణయాత్మక దృక్పథం అలవరచుకొనుటకు కార్యోన్ముఖులుగా సిద్ధపడుట మరియు మానవీయ విలువలను పెంపొందించుకొని ఆచరించుట మొదలగు ఆచరణీయాత్మ సుగుణాలు అలవడేందుకు, విద్యార్థులకు ఇట్టి శ్లోకముల ద్వారా తెలుపబడెను. అంతేగాక ఈ శ్లోకములందు తెలియజేయబడిన వివిధ విషయాల ద్వారా విద్యార్థులకు మనదేశం యొక్క చరిత్ర, సంస్కృతి, ఔచిత్యం మొదలగు అనేక విశేషాలు కూడా తెలియును.
కావుననే ప్రస్తుతపాఠ్యాంశమునందు విద్యార్థులకు ఉపకరించునట్టి, వివిధ కవులచే విరచితమైన శ్లోకాలను (సూక్తిరత్నావళి) “सूक्तिरत्नावली” ద్వారా తెలియజేయబడెను.
![]()
Introduction to the Lesson:
It can be said that the position of moral texts in Sanskrit literature is very prominent. Many poets have composed ethical books. In various contexts within kavyas (epics/poems), puranas and itihasas (historical epics), they have provided gemstone-like poems and shlokas (verses) that teach morality.
The main purpose of moral sciences (Neetishastras) is to foster ethical values in human beings.
In the present lesson, shlokas have been collected and given from various books written by different poets in Sanskrit literature according to the context. Their main purpose is to help college students develop personality development, build self-confidence, cultivate a self decisive/ independent attitude, prepare themselves to be action-oriented, and practice human values by fostering them. These practicable virtues are explained to the students through these shlokas. Furthermore, through the various matters conveyed in these shlokas, students will also learn about many special aspects of our country’s history, culture, and propriety (auchitya).
Therefore, in the current lesson, verses composed by various poets that are beneficial to students are presented through “Sukti Ratnavali” (“सूक्तिरत्नावली”).
सूचना – अत्र * चिन्हता : प्रतिपदार्थ भाव – बोधकपूर्वकं कण्ठस्थीकरणीया (కంఠస్థ శ్లోకములు – ప్రతిపదార్థాలు – భావాలు)
पाठ्याशः
अथं निजः परो वेति गणना लघुचेतसाम् ।
उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ॥
అయం నిజఃపరోవేతి గణనా లఘుచేతసామ్ |
ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకమ్ || ॥ १ ॥
भाव: ఈ శ్లోకము నారాయణ పండితుడు సంస్కృత భాషలో రచించిన ‘హితోపదేశము’ గ్రంథంలోని మిత్రలాభము అను విభాగము నుండి స్వీకరించబడినది.
వీడు నావాడు, వీడు పరాయివాడు అనే ఆలోచన అల్పబుద్ధివాళ్లకే. ఉదారమైన మనసు కలవారికి మాత్రమే ఈ భూమి అంతా తన కుటుంబమే.
సాధారణంగా ప్రపంచంలోని వ్యక్తులందరూ విశాల దృక్పథాన్ని కలిగి ఉంటారు. అట్టివారికి, ప్రాంతము, దేశము, మతము, సంపద వీటి అన్నింటియందు ఇది నాది, వారిది అనే బేధభావాలు ఉంటాయి. ఇటువంటి ఆలోచనలు గలవారిని అల్పబుద్ధి కలవారంటారు. కానీ నిశితంగా పరిశీలిస్తే, అది సరియైన దృక్పథం కాదు అని స్పష్టమవుతుంది. అట్టి విభిన్నమైన ఆలోచనా సరళిలో భూమి అంతా ఒక్కటీ, ప్రకృతిలోని వనరులు మన అందరినీ, మానవులంతా ఒక్కటే అనే ఆలోచన కలవారు ఉదారచరితులు. అటువంటివారే విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రవహించే వారిగా పరిగణింపబడతారు. వారికి ఈ ప్రపంచమంతా వారి కుటుంబమే. వారికి స్వభేదం ఉండదు.
People who think in a narrow vision will consider so and so as mine or so and so as other’s where as people with elevated thinking consider every one as same and such people consider the entire world as one family and love the entire humanity as one.
दुर्बलस्य बलं राजा, बालानां रोदनं बलम् ।
बलं मूर्खस्य मौनित्वं, चोराणाम् अनृतम् बलम् || ॥ १ ॥
దుర్బలస్య బలం రాజా బాలానం రోదనం బలమ్ |
బలం ముర్ఖస్య మౌనిత్వం చోరాణామ్ అనృతమ్ బలమ్ ||
परिचय: ఈ శ్లోకము వివిధ కవులచే రచించబడిన ‘సూక్తిరత్నావళి’ అను పాఠ్యాంశం నుండి గ్రహింపబడినది.
पदविभाग: दुर्बलस्य, बलम् , राजा, बालानां, रोदनं, बलम् । बलम् मूर्खस्य, मौनित्वंम्, चोराणाम्, अनृतम् बलम् ॥
प्रतिपदार्थ:
दुर्बलस्य = బలహీనమైన వ్యక్తికి, (a weak person);
राजा = రాజు, ప్రభుత్వం, (king, government);
बलम् = బలము, (strength);
बालनाम् = పిల్లలకు, (of children);
रोदनम् = ఏడుపు, (weeping);
बलम् = బలము, (strength);
मूर्खस्य = మూర్ఖునికి, (of a foolish person);
मौनित्वम् = మాట్లాడకుండా ఉండుటయే, (not speaking, silent)
बलम् = బలము, (strength);
चोराणाम् = దొంగలకు, చోరులకు, (of thieves);
अनृतम् = అబద్ధము, అసత్యము, (lies);
बलम् = బలము, (strength).
भाव: బలహీనంగా ఉన్నవారికి బలం రాజులో ఉంటుంది. అనగా అటువంటివారికి రక్షణ కల్పించే బాధ్యత రాజు వహించవలెను. పిల్లలు తమకోరికలు తీర్చుకోవడానికి ఏడుస్తారు. కావున పిల్లలకు ఏడుపే బలం. అదేవిధంగా ఒకమూర్ఖుడు మౌనంగా ఉన్నంతసేపు పండితునిగా నటించగలడు. కావున మూర్ఖునికి మౌనమే బలం.
అలాగే దొంగ పట్టుబడినప్పుడు, తాను ఆ సమయంలో అక్కడ లేనట్టు చెప్పి : తనను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దొంగలకు అబద్ధాలు లేదా అసత్యాలు పలుకుటయే బలం.
Those persons who are weak in all respects have to depend on the king (State Administration in modern times) for their protection, children resort to weaping to get their wishes fulfilled, and a foolish person can pose as a learned person so long he does not open his mouth to speak, and a thief on being caught saves himself by giving an alibi (lies).
विद्वत्वं च नृपत्वं च नैव तुल्यं कदाचन ।
स्वदेशे पूज्यते राजा, विद्वान् सर्वत्र पूज्यते ॥ ॥ ३॥
విద్వత్వం చ నృపతం చ నైవ తుల్యం కదాచన ।
స్వదేశీ పూజ్యతే రాజా విద్యాన్ సర్వత పూజ్యతే ॥
भाव: ఒక వ్యక్తి విద్యావంతుడు కానప్పటికీ, తెలివితేటలు సందర్భానుసారంగా ప్రదర్శించలేకపోయినప్పటికీ తన స్వగృహమునందు (గత్యంతరంలేక గౌరవింపబడతాడు. అదేవిధంగా అధికారి కూడా తన స్వగ్రామం నందు అతడికున్న అధికారం చేత గౌరవింపబడతాడు.
కానీ విద్యావంతుడు, విద్వాంసుడైనవాడు (పండితుడు) తన గ్రామమునందేకాక, ఎల్లచోట్లా గౌరవింపబడతాడు. కావున విద్వత్తు (పాండిత్యం) మరియు రాజాధిపత్యం ఎప్పుడూ కూడా సమానము కావు అని శ్లోకభావము.
Being a scholar and being a king are never ever comparable and cannot be weighted together. A king is respected in his own country whereas a scholar is respected every where.
विद्या विवादाय धनं मदाय
शक्तिः परेषां परपीडनाय ।
खलस्य साधोः विपरीतमेतद्
ज्ञानाय दानाय च रक्षणाय ॥
విద్యా వివాదాయ, ధనం మదాయ
శక్తిః పరేషాం పరపీడనాయ |
ఖలసస్య సాధోః విపరీతమేతద్
జ్ఞానాయ దానాయ చ రక్షణాయ || ॥ ४॥
भाव: దుష్టులు వారి యొక్క చదువు, విజ్ఞానం, జగడాలకు, ధనం అహంకారాన్ని, శక్తి సామర్థ్యాలు ఇతరులను పీడించడానికి ఉపయోగిస్తారు. కానీ సాధుజనులు అనగా సజ్జనులు వారియొక్క విద్య, విజ్ఞానం, ధనం మరియు శక్తి సామర్థ్యాలు మొదలగు సుగుణాలను సాటి ప్రజల దానాలకై, రక్షణ కొరకై వినియోగిస్తారు.
A wicked person uses his knowledge for argumentation or confronation, his wealth for egotistic actions, and his power for harming others. The opposite is true of a saintly person. His knowledge is used for good purposes. His wealth is used for good causes to help others and his might is used to protect the weak.
![]()
अर्थानामार्जने दुःखम्, आर्जितानां च रक्षणे ।
आये दुःखं, व्यये दुःखं किमर्थाः कष्टसंश्रयाः ॥ ॥ ५॥
అర్ధనామార్జనే దుఃఖమ్, ఆర్జితానామ్ చ రక్షణే |
ఆయే దుఃఖం వ్యయే దుఃఖం కిమార్థాః కష్టసంశ్రయాః ||
भाव: ఈ శ్లోకం భర్తృహరి మహాకవిచే రచించబడిన సుభాషితాల నుండి స్వీకరించబడినది. ధనంతో మనిషికి ఎప్పుడూ కష్టాలే ఎదురవుతాయి. అది ఎట్లనగా ………………….. మనిషి ధనం సంపాదించడానికి చాలా కష్టపడతాడు. సంపాదించిన ధనాన్ని దొంగలు, ఆపదల బారినుండి కాపాడుకోవడం ఒక పెద్ద సమస్య. అంతేగాక ధనాన్ని ఖర్చుచేసేటప్పుడు లేదా అది నశించినప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది. కావున ధనం కారణంగా మనిషి ఏదో ఒక విధంగా కష్టాలను అనుభవిస్తూ ఉ ంటాడనేది ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం.
This is a famous hymn in the ‘Bhartuhari’ – Subhashitani.
The implication of this is that a person will always face difficulties with money. This is explained as follows. Earning money is a very difficult task. Protecting the money you earn from thieves and danger is a big problem. We feel sorrow when we spend money or when it is lost. Overall, the main point of this verse is that as long as one has money. One does not have peace of mind, and it always brings hardships.
अलसस्य कुतो विद्या अविद्यस्य कुतो धनम् ।
अधनस्य कुतो मित्रम् अमित्रस्य कुतस्सुखम् ||
అలసస్య కుతో విద్యా అవిద్యస్య కుతో ధనమ్ ।
అధనస్య కుతో మిత్రమ్ అమిత్రస్య కుతస్సుఖమ్ || || ६ ||
परिचयः ఈ శ్లోకము వివిధ కవులచే రచించబడిన ‘సూక్తిరత్నావళి’ అను పాఠ్యాంశం నుండి గ్రహింపబడినది.
पदविभाग: अलसस्य, कुतः, विद्या, अविद्यस्य, कुतः, धनम्, अधनस्य, कुतः, मित्रम् अमित्रस्य, कुतः, सुखम् ||
प्रथिपदार्थ्:
अलसस्य = బద్ధకస్తునికి, సోమరితనం గలవానికి, (to a lazy per- son)
विद्या = చదువు, జ్ఞానం, (education);
कुतः = ఎక్కడి నుండి వస్తుంది ?, (from where);
अविद्यस्य = విద్యలేనివారికి, (to an uneducated person);
धनम्= ధనము, సంపద, (money, wealth);
कुतः = ఎక్కడి నుండి వస్తుంది ?, (form where);
अधनस्य = సంపదలేనివానికి, (one without wealth);
मित्रम् = స్నేహితులు, (friends);
कुतः = ఎక్కడ ఉంటారు ?, (how can there be);
अमित्रस्य = మిత్రులు లేనివారికి, (to one without friends);
सुखम् = సుఖసంతోషాలు, (happiness);
कुतः = ఎక్కడి నుండి వస్తాయి ?, (how can they come ?).
भाव: సోమరిగా బద్ధకంతో ఉండేవారికి జ్ఞానం అలవడదు. చదువు లేకుంటే సంపాదన (ధనం) ఉండదు. ధనం లేకపోతే బంధుమిత్రులు ఉండరు. మిత్రులు లేకపోతే సుఖశాంతులు ఉండవు.
To achieve success in life, one must give up laziness, study hard and acquire knowledge. Education gives a person income, income gives friends, and friends give happiness. Therefore, laziness is the root cause of everything.
पिबन्ति नद्यः स्वयमेव नाम्भः
स्वयं न खादन्ति फलानि वृक्षाः |
नादन्ति सस्यं खलु वारिवाहाः
परोपकाराय सतां विभूतयः ॥
పిబంతి సద్యః స్వయమేవ నామ్భః
స్వయం న ఖాదంతి ఫలాని వృక్షాః |
నాదంతి తస్య సస్యం ఖలు వారివాహాః
పరోపకారాయ సతాం విభూతయః ॥ ॥ ७ ॥
भाव: నదులు తమ నీటిని తాము త్రాగవు. మేఘాలు తమ వర్షాన్ని తాము అనుభవింపవు. చెట్లు తమ పండ్లను తాము తినవు. అదేవిధంగా సజ్జనుల సంపదకూడా ఇతరుల (పరుల) కోసమే వినియోగింపబడును.
Rivers do not drink their water themselves. Trees do not eat their fruits themselves. Indeed, clouds do not eat the crops they help grow. The welath/resources of noble people are meant for helping others.
वृत्तं यत्नेन संरक्षेत् वित्तमेति च याति च ।
अक्षीणो वित्ततः क्षीणो वृत्ततस्तु हतो हतः ॥ ॥ ८ ॥
వృత్తం యత్నేన సంరక్షేత్ విత్తమేతి చ యాతి చ ।
అక్షీణో విత్తతః క్షీణో వృత్తతస్తు హతోహతః ॥ (‘విదురనీతి’ – మహాభారతం)
भाव: ప్రయత్నపూర్వకంగా శీలాన్ని కాపాడుకోవాలి. ధనం ఒకసారి రావచ్చు, పోవచ్చు. దాని గురించి ఆందోళన చెందవలసిన పనిలేదు. ఎందుకంటే ధనం పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. ధనం ద్వారా బీదవాడైనవాడు బీదవాడు కాదు, కానీ మనిషి తన మంచి నడవడికను ఉన్నతమైన వ్యక్తిత్వం, నైతిక ప్రవర్తన, న్యాయం, సత్యం, ధర్మం, నిజాయితీ, సంఘంలో మర్యాద వంటి సుగుణాలను వీడితే తన శీలాన్ని కోల్పోయినట్లే. శీలంతో బీదవాడు అయినట్టివాడు బ్రతికి ఉన్నా చనిపోయినట్లే (అనగా శీలం పోతే చనిపోయినట్లే అని అర్థం).
శీలం అంటే ‘స్త్రీ’లకు సంబంధించినది కాదు. ఉన్నత పురుషుడే శీలవంతుడు అని సంస్కృత ఆర్యోక్తి. (‘విదురనీతి’ – ‘మహాభారతం’)
One should protect character with effort. Wealth comes and goes. A person is not destroyed if wealth is lost, but if character is lost, he is completely destroyed.
(Character should be zealously guarded. Wealth is transient. A man is not ruined by the loss of wealth, but the loss of character spells his down.
![]()
न कश्चित् कस्यचिन्मित्रं न कश्चित् कस्यचिद्रिपुः |
व्यवहारेण जायन्ते मित्राणि रिपवस्तथा ॥ ॥ ९ ॥
న కశ్చిత్ కస్య చిన్మిత్రం న కశ్చిత్ కస్యచిద్రిపుః |
వ్యవహారేణ జాయంతే మిత్రాణి, రిపవస్తథా ॥
भाव: ఎవరూ ఎవరికీ శాశ్వత మిత్రులు కారు. అదేవిధంగా శాశ్వత శత్రువులు కాదు. మనప్రవర్తన వలననే మిత్రులు, శత్రువులు ఏర్పడతారనేది గ్రహించాలి. ఈ సమాజంలో మనుషుల మధ్య బంధాలు, స్నేహాలు, శత్రుత్వాలు అన్నీ స్వార్థం లేదా అవసరం మీద ఆధారపడి ఉంటాయి. ప్రవర్తన బాగుంటే శత్రువు కూడా మిత్రుడు అవుతాడు. మన నడవడిక ఇతరులను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉంటే మిత్రులు కూడా శత్రువులుగా మారతారు. మానవుడు సంఘజీవి. కావున అందరితో ఐకమత్యంతో మెలగవలెనని శ్లోక భావము.
No one is a permanent friend to anyone. No one is anyone’s permanent enemy. Friends and enemies are created by out behaviour.
The relationships and attachments between people in the society depend on our needs and our behaviour. Good behaviour can turn even enemies into friends. While bad behaviour can turn friends into enemies.
आचार्यात् पादमादत्ते पादं शिष्यः स्वशक्तितः ।
पादं सब्रह्मचारिभ्यः, पादं कालक्रमेण च ॥
ఆచార్యాత్ పాదమాదత్తే, పాదం శిష్యః స్వశక్తితః |
పాదం సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ చ ॥ ॥ १ ० ॥
भाव: గురుకులములో కుల, మత, వర్గ, ప్రాంత అభేదంగా విద్యార్థులంతా అక్కడే ఉండి గురువుకు సేవ చేస్తూ తమ తమ శక్తిసామర్థ్యాలను గురించి విద్యలను నెరవేర్చుకునేవారు. దీనితో వారికి పాతిక శాతం విద్య పట్టుబడేది. రెండవ భాగము విద్యార్థి తన మేథో సంపత్తిని వినియోగిస్తూ నేర్చుకునేవాడు. మూడవ భాగము, సహవిద్యార్థులతో కలిసి చర్చల ద్వారా జ్ఞానాభివృద్ధిని పెంపొందించుకునేవాడు.
ఇక చివరి భాగం విద్యార్థి ఎదుగుతూ, తన చుట్టూ ఉన్న సమాజమును చూసి, ఆలోచనా పూర్వకముగా, అనుభూతిపూర్వకముగా, ఆజన్మాంతమూ నేర్చుకుంటూనే ఉంటాడు. (అనగా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థులే. విద్య అనేది ఒక ఊట చెలమ వంటిది. నీరు తోడేకొద్దీ ఊరుతూనే ఉంటుంది. అందుకే పరిపూర్ణత, వయోభేదం అన్నది విద్యకు వర్తించవు.
One gains 1/4 of the knowledge from the Acharya (the teacher), 1/4 from his own self-study and intellect, 1/4 from his classmates and the remaining 1/4 is gained as a person becomes matured at time passes. What is understood over time with life experience.
जनिता, चोपनेता, च यस्तु विद्यां प्रयच्छति ।
अन्नदाता, भयत्राता, पञ्चैते पितरः स्मृताः ॥ ॥ १ १ ॥
జనితా, చోపనేతా, చ యస్తు విద్యాం ప్రయచ్ఛతి ।
అన్నదాతా, భయత్రాతా, పంచైతే పితరః స్మృతాః ॥
भाव: జన్మనిచ్చిన తండ్రి, ఉపనయనం చేసినవారు, విద్య గరిపినవారు, అనగా గురువు, అన్నం పెట్టి పోషించిన వారు, కష్టాలలోనూ, ఆపదలలోనూ ఉన్నప్పుడు భయాన్ని పోగొట్టి ఆదుకునేవారు. కన్నతండ్రితో సహా మిగిలిన ఈ నలుగురిపట్ల కూడా తండ్రితో సమానమైన పితృతుల్యపూజ్య భావాన్ని కలిగి ఉండవలెనని ఈ శ్లోకార్థం.
This sloka is significant as it encapsulates the various dimensions of fatherhood, extending beyond biological connections to include soci- etal roles and responsibilities. The give of food, the protector from fear, the given of a daughter in marriage, the one who begets children, and the who governs are the five fathers.
Thus, the sloka presents a comprehensive view of fatherhood, encapsulating both the social and emotional responsibilities involved.
राजपत्नी, गुरोः पत्नी, मित्रपत्नी तथैव च ।
पत्नीमाता, स्वमाता च पञ्चैता मातरः स्मृताः ॥ ॥ १२ ॥
రాజపత్నీ, గురోఃపత్నీ, మిత్రపత్నీ తథైవ చ ।
పత్నీమాతా, స్వమాతా చ పంచైతా మాతరః స్మృతాః ॥
भाव: ఈ సుభాషితము చాణక్యుని నీతిశాస్త్రము నుండి గ్రహింపబడినది. రాజుగారి భార్య, గురువు గారి భార్య, మరియు స్నేహితుని భార్య, అలాగే భార్య తల్లి అనగా అత్తగారు, మరియు కన్నతల్లి ఈ ఐదుగురిని పఞ్చమాతరులు అని స్మృతులు తెలియజేస్తున్నాయి.
అనగా తన కన్నతల్లితో పాటుగా పైన ఉదహరించిన వారికి కూడా గౌరవించాలని, ఆదరించాలని స్మృతులయందు తెలియజేయబడెను.
Wife of a king, the queen, wife a teacher, the Guru, wife of a friend and the same way wife’s mother, the mother-in-law and your own mother are the five women treated as mothers according to the scripts.
सद्भिस्तु लीलया प्रोक्तं शिलालिखितमक्षरम् ।
असद्भिः शपथेनापि जले लिखितमक्षरम् ॥ ॥ १३ ॥
సద్భిస్తు లీలయా ప్రోక్తం శిలా లిఖితమక్షరమ్ |
అసద్భి శపథే నాపి(నోక్తం) జలే లిఖితమక్షరమ్ ॥
परिचयः ఈ శ్లోకము వివిధ కవులచే రచించబడిన ‘సూక్తిరత్నావళి’ అను పాఠ్యాంశం నుండి గ్రహింపబడినది.
पदविभाग: सद्भि, तु, लीलया, प्रोक्तं, शिलालिखितम्, अक्षरम् | असद्भिः, शपथेनः, अपि, जले, लिखितम्, अक्षरम् ॥
प्रथिपदार्थ्:
सद्भि = సజ్జనులచే, (upright and truthful persons);
तु = కానీ, (but); శ్రేణిల
लीलया = సరదాగా, సులభంగా, (casually, playfully);
प्रोक्तं = చెప్పబడినది, (spoken, declared);
शिला = రాయి మీద, (a slab of stone);
लिखितम् = చెక్కబడిన, (written);
अक्षरम् = అక్షరం వలె ఉండును, (words);
असद्धिः = దుర్జనులచే, (people of evil treatment);
शपथेनः + अपि = ప్రమాణాలు కూడా, (by swearing, under an oath);
जले = నీటియందు, (wa- ter);
लिखितम् = వ్రాయబడిన, (written);
अक्षरम् = అక్షరాలవలె ఉండును, (words).
भाव: దుర్జనులు (చెడ్డవారు) వాగ్దానాలు (శపథాలు) చేస్తూ పలికే మాటలు నీటిమీద వ్రాసిన వ్రాతలవలె వెంటనే చెరిగిపోతాయి. కానీ సజ్జనులు (మంచివారు) సరదాగా ఆడిన మాట కూడా శిలపై చెక్కిన అక్షరం లాగా స్థిరంగా నిశ్చయంగా ఉంటుంది. ఇది సజ్జనుల నిజాయితీని, మాట నిలబెట్టుకునే గుణాన్ని తెలియజేస్తుందని భావము.
The commitments made by person of evil temperament even un- der oath are just like words written on the surface of water (which dis- appear immediately) and are not honoured by them. On the other hand commitments made by upright and truthful persons even casually are like the words engraved on a slab of stone and are duly honoured by them.
![]()
यथा चतुर्भिः कनकं परीक्ष्यते
निघर्षण – च्छेदन-ताप-ताडनैः ।
तथा चतुर्भिः पुरुषः परीक्ष्यते
त्योगेन, शीलेन, गुणेन, कर्मणा ॥ ॥ १४ ॥
యథా చతుర్భిః కనకం పరీక్ష్యతే
నిఘర్షణచ్ఛేదనతాపతాడనైః ।
తథా చతుర్థిః పురుషః పరీక్ష్యతే
త్యాగేన శీలేన గుణేన కర్మణా ॥
भाव: ఈ శ్లోకం చాణక్యనీతి నుండి గ్రహింపబడినది. బంగారం నాణ్యతను నాలుగు విధాలుగా అనగా గీటు పెట్టడం, కత్తిరించడం, కాల్చడం, కొట్టడం విధానాలతో ఎలా పరీక్షిస్తారో, అలాగే ఒక వ్యక్తి యొక్క గుణాలను నాలుగు అంశాల ద్వారా అంచనా వేయవచ్చని ఈ శ్లోకార్థం. అవి ఏమనగా
త్యాగం – ఇతరులకు సహాయపడేగుణం,
శీలం – మంచి నడవడిక,
గుణం – మంచి లక్షణాలు / నైతికత,
కర్మ – వ్యక్తి చేసే పనులు (లోకహితైక లక్ష్యమైన పనులు)
ఈ విధంగా వ్యక్తిలోని గుణగణాలను అంచనా వేయవచ్చునని ఈ శ్లోకం ద్వారా తెలియుచున్నది.
यथा चतुर्भि: कनकं परीक्ष्यते is a famous Chanakya Nithi verse. It means that just as the quality of gold is tested in four ways (making, cutting, burning and striking).
Similarly, the verse tells us that a person’s qualities can be assessed through four factors. As it is, the fourfold test is the cessation of conflict.
Thus, the four fold test of human renunciation, virtue, and action. The future worth of a person should be judged by his sacrifice, Character, virtue and karma during difficult times (such as being shot beaten etc., …..) not just by his outward.
राज्ञि धर्मिणि धर्मिष्ठाः पापे पापाः समे समाः ।
राजानमनुवर्तन्ते यथा राजा तथा प्रजाः ॥
రాజ్ఞి ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాపః సమే సమాః ।
రాజా నమనువర్తంతే యథా రాజా తథా ప్రజాః ॥ १५ ॥
भाव: రాజు ధర్మమునందు వర్థిల్లినచో రాజ్యం ధర్మమార్గంలో, పాపమునందు వర్ధిల్లినచో పకిలమౌవుతుంది. రాజ్యమంతా రాజును ఎల్లప్పుడూ అనుసరిస్తారు. రాజు ఎలాంటివాడైతే ప్రజలు కూడా అలాంటివారే అవుతారు. (యథారాజా తథా ప్రజాః) రాజు ధర్మపరుడయితే రాజ్యం ధర్మపంథంలో నడుస్తుంది. రాజు పాపవర్తనుడయితే రాజ్యం పాపపంకిలం అవుతుంది.
ఎంత ఎప్పుడూ కూడా ధర్మాధర్మాలు రాజుని అనుసరించి నడుస్తూ ఉంటాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలు అలాగే నడుచుకుంటారు. (నరసింహ సుభాషితం).
When the king is in righteous path, the kingdom will be in the righteous way follows him. If he is unlawful always, then kingdom also will be in the unlawful path.
After all, people of the kingdom always follow the king. Like the king like the people.
उदये सविता रक्तो रक्तश्चास्तमये तथा ।
सम्पत्तौ च विपत्तौ च महतामेकरूपता ॥ ॥ १६ ॥
ఉదయే సవితా రక్తోః రక్తశ్చాసమయే తథా ।
సమ్పత్తా చ విపత్తే చ మహతామేకరూపతా ॥
परिचयः ఈ శ్లోకము వివిధ కవులచే రచించబడిన ‘సూక్తిరత్నావళి’ అను పాఠ్యాంశం నుండి గ్రహింపబడినది.
पदविभाग: उदये, सविता, रक्तः, रक्तः च तथा, अस्तमये, सम्पत्तौ, च विपत्तौ च, महतम्, एकरूपता
प्रतिपदार्थ्:
उदये = ఉదయిస్తున్నప్పుడు, (at sunrise);
सविता = సూర్యుడు, (the sun);
रक्तः = ఎర్రగా, (is red);
च = మరియు, (and);
अस्तमये = అస్తమించునప్పుడు, (at sunset);
रक्तः = ఎర్రగా ఉండును, (and red);
तथा = అదేవిధంగా, అలాగే, (thus (or) so);
सम्पत्तौ च = సంపద నందును, (in prosperity);
विपत्तौ च = మరియు ఆపదలయందు, (misfortune or “in ad- versity”);
महतम् = గొప్పవ్యక్తులు, (of the virtuous ones);
एकरूपता = ఒకేలా ఉంటారు, (consistent nature).
भाव: సూర్యుడు సూర్యోదయ సమయము నందు, సూర్యాస్తమయ సమయమునందు ఎర్రని వర్ణంలోనే ఉంటాడు. అలాగే సంపదలలో ఉన్నా ఆపదల్లో (కష్టాలలో) ఉ న్నా గొప్పవారు ఒకేవిధంగా ఉంటారు. (ఉంటారని భావం).
At sunrise, the sun is red, at sunset, it is also red. In prosperity and adversity, the nature of the virtuous remains the same.
![]()
प्रारभ्यते न खलु विघ्नभयेन नीचैः
प्रारभ्य विघ्ननिहताः विरमन्ति मध्याः ।
विघ्नैर्मुहुर्मुहरपि प्रतिहन्यमानाः
प्रारब्धमुत्तमगुणा न परित्यजन्ति ॥ ॥ १७ ॥
ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః,
ప్రారభ్య విఘ్న నిహతాః విరమంతి మధ్యా ।
విఘ్నేఃర్ముహుర్ముహురపి ప్రతిహన్యమానాః
ప్రారబ్ధముత్తమగుణా న పరిత్యజన్తి ॥
भाव: ఈ శ్లోకం కవి భర్తృహరి సుభాషితం – నీతిశతకం నుండి స్వీకరింపబడినది. ఆటంకాలు కలుగుతాయేమోననే భయంతో చేద్దామనుకున్న పనిని ఆరంభించనే ఆరంభించరు నీచమానవుడు. ప్రారంభించిన తరువాత అడ్డంకులు ఏర్పడితే చేస్తున్న పనిని మధ్యలోనే వదిలేవారు మధ్యములు. కానీ ధీరులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రారంభించిన పనిని గమ్యాన్ని చేరకుండా ఎట్టిపరిస్థితులలోను వదిలిపెట్టరు. అట్టివారిని ఉత్తమజనులని, ధీరోదాత్తులని అంటారు.
The men of very low stature do not even start and take up any endeavor with the fear of obstructions and meeting with failures. Average men start and take up the tasks but quickly give up when they are faced with problems. The men, who are classified to be of higher stature by their strong will and determinations are however, never give up their tasks even though they meet with failures repeatedly.
काव्यशास्त्रविनोदेन कालो गच्छति धीमताम् ।
व्यसनेन च मूर्खाणां निद्रया, कलहेन वा ॥ ॥ १८ ॥
కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం ।
వ్యసనేన చ మూర్ఖణాం నిద్రయా, కలహేన వా ॥
भाव: ఈ శ్లోకం ‘నారాయణ’ పండితునిచే రచించబడిన ‘హితోపదేశము’లోని ‘మిత్రలాభము’ అనే విభాగము నుండి స్వీకరించబడినది. ధీమంతులు (లేదా) బుద్ధిమంతులు వారి యొక్క సమయములను వృథా చేయకుండా కావ్యశాస్త్రాల చర్చల ద్వారా కాలాన్ని సద్వినియోగపరచుకుంటాడు. కావ్యాలు అనగా పద్యగ్రంథాలు మొదలైనవి. శాస్త్రాలు అనగా ఉదా : ధర్మశాస్త్రం, మీమాంశ, వ్యాకరణశాస్త్రం, ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం, గణిత శాస్త్రం, అలంకారశాస్త్రం వీనితో పాటుగా వేదాలు, పురాణాలు మొదలగునవి.
కానీ సమయం విలువ తెలియనివాడు, విద్య మరియు విద్య ద్వారా వచ్చే విజ్ఞానం యొక్క విలువని అర్థం చేసుకోలేనివాడు అయినట్టి మూర్ఖుడు వాని సమయాన్ని వ్యసనములతో గానీ, నిద్రపోతూ కానీ, దెబ్బలాటలు, అనవసరమైన వాగ్వివాదాలతో సమయాన్ని వెలిబుచ్చుతూ కాలాన్ని వృథాగా గడుపుతాడు. కావున యువత సమయం విలువ తెలుసుకొని ఆహ్లాదకరమైన, విశ్లేషణాపూర్వకమైన వివిధ అంశాల మీద చర్చలు, ఆ చర్చల ద్వారా స్వీయ ప్రతిభాపాటవాలని పెంపొందించుకోవాలనేది శ్లోక భావము.
An intelligent and wise man spends his time more usefully in the studies and discussions of various subjects of Kavyas and Shastras like veda shastra, dharma Shastra etc., or in other words the subjects are means of his knowledge and gives him a sense of satisfaction.
In contrast, an unintelligent, non-wise, ‘moorkha’ spends his time in bad habits, all sorts of vices, being lazy sleeping confrontations.
Means, there is a clear message to all as to how one should his time wisely and in a more useful manner.
अष्टादशपुराणानां सारं व्यासेन कीर्तितम् ।
परोपकारः पुण्याय पापाय परपीडनम् ॥ ॥ १९ ॥
అష్టాదశ పురాణానాం సారం వ్యాసేన కీర్తితమ్ ।
పరోపకారః పుణ్యాయ, పాపాయ పరపీడనమ్ ॥
भाव: ఈ శ్లోకము వివిధ కవులచే రచించబడిన ‘సూక్తిరత్నావళి’ అను పాఠ్యాంశం నుండి గ్రహింపబడినది.
पदविभाग: अष्टादश, पुराणानां, सारं, व्यासेन, कीर्तितम्, परः, उपकारः (परोपकारः), पुण्याय, पापाय, परः पीडनम् ॥
अष्टादश, पुराणानाम्, सारम्, व्यसेन, कथितम् । परः, उपकारः, पुण्याय, पापाय, परः पीडनम् ॥
प्रतिपदार्थ्:
अष्टादश = పదునెనిమిది, (eighteen);
पुराणानाम् = పురాణాల యొక్క (of the Puranas);
सारम्= సారము ఏమనగా, (essence);
व्यसेन = వ్యాసునిచేత, (by Vyasa);
(कथितम्) कीर्तितम् = కీర్తింపబడినది, (declared);
परः = ఇతరులకి, (others);
उपकारः = ఉపకారము, (help or benefit);
पुण्याय = పుణ్యము కొరకు, (for virtue, merit);
पापाय = పాపము కొరకు, (for sin, (sin or wrong doing);
परः = ఇతరులను, (to tohers);
पीडनम् = పీడించడం, (causing distress);
भाव: వేదవ్యాసమహర్షిచే కీర్తించబడిన అష్టాదశ పురాణాల సారము – పరోపకారం పుణ్యానికి దారితీస్తుంది. ఇతరులను పీడించడం (హింసించడం పాపానికి దారితీస్తుంది). కావున సదా పరోపకారానికై ధర్మకార్యములను చేయవలెనని భావం. (కావున సదా పరోపకారులై జీవింపవలెనని భావము).
“The essence of the eighteen puranas is declared by Vyasa, ben- efiting others is virtuous, while causing distress to others is sinful.”
![]()
भाषासु मुख्या मधुरा दिव्या गीर्वाणभारती ।
तस्यां हि काव्यं मधुरं तस्मादपि सुभाषितम् ॥ ॥ २० ॥
భాషాసు ముఖ్యా మధురా దివ్యాగీర్వాణ భారతీ ।
తస్యాం హి కావ్యం మధురం తస్యాదపి సుభాషితం ॥
भाव: భాషలన్నిటిలోనూ ముఖ్యమైనది, తీయనిది, దివ్యమైనది (విశేషమైనది) గీర్వాణ భారతి అనగా సంస్కృత భాష. అందులో కూడా కావ్యం మధురమైనది అని సుభాషితాన్ని గురించి చెప్పటమే శ్లోకార్థం.
Among languages, the important, sweet and splendorous language is the language of gods ‘गीर्वाण भारती’ Sanskrit. In that, the ‘Kavyam’ i.e, Poetry the collection of poems is sweeter. But still within that poetry subhashitam, a ‘wise saying’ is sweeter.
उत्तमं प्रणिपातेन, शूरं भेदेन योजयेत् ।
नीचमल्पप्रदानेन, समशक्तिं पराक्रमैः ॥ ॥ २१ ॥
ఉత్తమ ప్రణిపాతేన, శూరం భేదేన యోజయేత్ |
నీచమల్పప్రదానేన, సమశక్తిమ్ పరాక్రమైః ॥
भाव: ఈ శ్లోకం నీతిశాస్త్రం నుండి స్వీకరించబడినది. సాధారణంగా ఈ శ్లోకం దౌత్యనీతి మరియు సామ, దాన, భేద, దండోపాయాలను తెలియజేస్తుంది.
ఉత్తములను మన దారిలోకి తెచ్చుకోవాలంటే వినయముతో లేదా నమస్కారం ‘(ప్రణిపాతం)తో ప్రయత్నించాలి. శూరులను (ధైర్యవంతులను) వారిలోని బలహీనతలను ఉపయోగించుకుని లొంగదీసుకోవాలి.
నీచులను (మంచిగుణం లేనివారు) చిన్నపాటి బహుమతులు (లేదా) ప్రలోభాల ద్వారా ఒప్పించవచ్చు. సమంశక్త్యా ప్రయోజయేత్ – సమానమైన వారిని శక్తిసామర్థ్యాలు ఉపయోగించి దారికి తెచ్చుకోవాలి. ఈ విధంగా నీతిశాస్త్రంలోని ఈ శ్లోకం ద్వారా ఏ ఏ గుణాలు కలిగిన వారితో పనులు సులభంగా ఏవిధంగా అమలుచేసుకోవచ్చునో, వారిని ఏవిధంగా లొంగదీసుకోవచ్చుననే మెలకువలు తెలియుచున్నవి.
This sloka is often found in teachings related to leadership, strategy, and interpersonal relationships. Particularly in ancient Indian texts like the ‘Arthashastra.’ It emphasizes the approach one should take when dealing with different types of individuals based on their qualities and status.
The superior should be approached with humility, a brave person should be associated with through division, and an inferior should be
managed with modest contributions, leveraging equal strength through efforts”.
कामधेनुगुणा विद्या ह्यकाले फलदायिनी ।
प्रवासे मातृसदृशी विद्या गुप्तं धनं स्मृतम् ॥ ॥ २२ ॥
కామధేను గుణా విద్యా హ్యకాలే ఫలదాయినీ ।
ప్రవాసే మాతృసదృశీ విద్యా గుప్తం ధనం స్మృతమ్ ॥
भाव: జ్ఞానం అనేది కోరికలు తీర్చే ఆవులాంటిది. అనూహ్య సమయాలలో ఫలాలను ఇస్తుంది. ఎటువంటి కష్టసమయాలలో ఉన్నా విద్య అనేది తల్లివలె అండగా నిలుస్తుంది. ఊరుకాని ఊరులో అనగా మన ప్రాంతం విడిచి వేరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు విద్య మనల్ని రక్షిస్తుంది. విద్యను పరులు దొంగిలించలేరు. విద్య గుప్తనిధి వంటిది. అనగా రహస్యంగా దాచుకున్న ధనం వంటిది. కావుననే విద్య మనిషికి అత్యంత విలువైన ఆస్తి. అందుకే కోరిన కోరికలు తీర్చే కామధేనువు వంటిదని ఈ శ్లోకార్థం.
(చాణుక్యనీతి – చతుర్ద కధ్యాయః)
This sloka can be found in discussions regarding the value of education and wisdom in ancient Indian texts. It emphasizes the universal importance of knowledge and its ability to provide sustenance and support, especially during challenging times. It may be recited in educational settings, motivational speeches, or discussions focused on the pursuit of knowledge.
Knowledge, like the 14 (wish-fulfilling cow), gives fruits even at the wrong time in exile; knowledge is like a mother and secret wealth. The phrase “yatry” it indicates that knowledge is often personal can be an intangible asset that remains secure and valuable like hidden wealth. It implies that this asset may not be overtly visible but is crucial for survival and success.
![]()
मित्रद्रोही कृतघ्नश्च यश्च विश्वासघातुकः ।
त्रयस्ते नरकं यान्ति यावच्चन्द्रदिवाकरम् ॥ ॥ २३ ॥
మిత్రద్రోహీ కృతఘ్నశ్చ యశ్చ విశ్వాసఘాతుకః |
త్రయస్తే నరకం యాంతి యావచ్చంద్ర దివాకరమ్ ॥
भावः ఈ శ్లోకం “పంచతంత్రం నందలి ‘మిత్రభేదం’ నుండి స్వీకరించబడినది.
స్నేహితుడికి ద్రోహం (వెన్నుపోటు పొడిచేవాడు) చేసేవాడు, మేలును, ఉ పకారాలను చేసినవారిని మరచిపోయేవాడు, నమ్మినవారికి మోసం చేసేవాడు ఈ ముగ్గురూ సూర్యచంద్రులు ఉన్నంతకాలం (శాశ్వతంగా) నరకంలో యాతన అనుభవిస్తారు అని శ్లోకార్థం. కావున యీ ముగ్గురి వలెనే కాకుండా లోకహితంగా బ్రతికేలా మానవుడు తన జీవనమార్గాన్ని సరిదిద్దుకోవాలి.
This (Sanskrit verse sloka is an extract) from the ‘Panchatantra’ – ‘Mitrabheda’.
A traitor, an ungrateful, a traitorous, a traitor to faith; The land of Hell is the one who will bring you to the day of the moon. One who betrays a friend (one who stabs in the back). One who forgets the favours and good deeds done. One who deceives those who trust him (a traitor).
The traitor, the ungrateful, and the unfaithfull those three will suf- fer in hell (forever) as long as the son and moon exist. This verse warns that preserving friendship and trust is a virtue and that those who break them will incur a grate sin.
क्षमा धनुः करे यस्य दुर्जनः किं करिष्यति ।
अतृणे पतितो वह्निः स्वयमेवोपशाम्यति ॥ ॥ २४ ॥
క్షమా ధనుః కరే యస్య దుర్జనః కిం కరిష్యతి ।
అతృణే పతితో వహ్నిః స్వయమేవోపశామ్యతి ॥
भाव: ఈ శ్లోకం సుభాషితాల నుండి స్వీకరింపబడినది. ఎవరి చేతిలో ‘క్షమ’ అనే ధనస్సు (ఆయుధం) ఉంటుందో అట్టివారిని దుర్మార్గులు ఏమి చేయగలరు (ఏమీ చేయలేరని భావం). అదెట్లనగా ……… గడ్డిలేని (తృణం లేని) నేల మీద పడిన నిప్పు తనంతట తానే చల్లారిపోతుంది కదా !
మనం ఎదుటివారి కోపానికి కోపంతో ప్రతిస్పందించకుండా క్షమించేస్తే, వారి దుష్టత్వం లేదా కోపం వారి దగ్గరే ఉండి చల్లారిపోతుంది. కావున క్షమ (సహనం) అనేది బలహీనత కాదు. బలవంతుల ఆయుధం. అందుకే కోపం కంటే క్షమ గొప్పదని ఈ శ్లోకం ద్వారా గ్రహించవలెను.
నేల మంట తనని కాలుస్తున్నా కూడా ఏమీ చేయకుండా క్షమించడం వలన వహ్నిలో కూడా దహించే గుణం వదిలి చల్లారిపోతుంది.
Forgiveness is the weapon of evil and it is not harmful.
He who has the weapon of ‘Kshama’ in his hand. (‘kshama’ patience) What can the evil one do to them ? (cannot do anything). Fire that fell on an empty space without grass (Atrune). It will extinguish on its own (because there is nothing to burn).
If we have the weapons of patience and forgiveness, the wicked will not be able to harm us. Just as a fire that falls on a field without grass cannot burn anything and cools down on its own, similarly, the efforts of those who want to oppress us will anger will be futile in the face of our forgiveness.
क्षणशः कणशश्चैव विद्याम् अर्थञ्च साधयेत् ।
क्षणे नष्टे कुतो विद्या कणे नष्टे कुतो धनम् ॥ ॥ २५ ॥
క్షణశః కణశశ్చైవ విద్యామర్థం చ సాధయేత్ ।
క్షణే నష్టే కుతో విద్యా కణే నష్టే కుతో ధనమ్ ॥
परिचयः ఈ శ్లోకము వివిధ కవులచే రచించబడిన ‘సూక్తిరత్నావళి’ అను పాఠ్యాంశం నుండి గ్రహింపబడినది.
पदविभाग: क्षणशः, कणशः, च, एव, विद्याम्, अर्थ, च, साधयेत् । क्षणः, नष्टः, कुतो (कुतः), विद्या, कणः, नष्टः, कुतो धनम् ॥
प्रतिपदार्थ्:
क्षणशः = క్షణక్షణం, (moment by moment);
साधयेत् = సాధనవలననే, (to achieve);
विद्याम् = విద్య వృద్ధినొందును, (knowledge);
च एव = మరియు అలాగే, (and);
कणशः = ప్రతిగింజ, (grain by grain);
साधयेत् = కూడబెట్టుట వలన, (to achieve);
अर्थ = ధనం సమకూరును, (wealth);
क्षणः = ప్రతిక్షణం, (moment);
नष्टे = నష్టపరచుకుంటే, వృథాచేస్తే, (giveup or sacrifice);
विद्या = జ్ఞానం, (knowledge); gord:
कुतः = ఎక్కడి నుండి వస్తుంది, (from where (or) how);
कणः = ధాన్యపు గింజను, (small measure);
नष्टे = వృథాచేస్తే, (giving up);
धनम् = ధనము, సంపద, (wealth (or) money).
कुतः = ఏ విధంగా సమకూరుతుంది ? (from where (or) how ?).
भाव: క్షణక్షణమును ఉపయోగించుకొని విద్యను, కణము, కణమూ చొప్పున సేకరించి ధనమును సేకరించవలెను. అనగా విద్యను గ్రహించవలసివచ్చినప్పుడు, అలసత్వమునకు తావు లేకుండా వెంటనే నేర్చుకోవలెను. ఒక్క క్షణాన్ని కూడా వృథా చేయరాదు. అదేవిధంగా ధనాసక్తులు ఒక క్షణమైనను వృథా చేయరాదు. కణము కణము చొప్పున సేకరించి ధనమును కూడబెట్టవలెనని భావము.
“One should pursue knowledge and wealth moment by moment without time, where is knowledge ? Without measure, where is wealth ? it suggests that neglecting time or minimising effort can lead to a barren pursuit – illustrating how essential it is to merge discipline with time in any productive endeavour.
![]()
यथा कन्दुकपातेनोत्पतत्यार्यः पतन्नपि ।
तथात्वनार्यः पतति मृत्पिण्डपतनं यथा ॥ ॥ २६ ॥
యథా కందుకపాతే నోత్పతత్యార్యః పతన్నపి ।
తథాత్వనార్యః పతతి మృత్పిండపతనం యథా ॥
कवि परिचयः ఈ శ్లోకము భర్తృహరి మహాకవి రచించిన ‘నీతిశతకం’ నుండి స్వీకరించబడినది.
भावः బంతి నేలకు కొట్టినప్పుడు ఏ విధంగానైతే పైకి లేస్తుందో, ఉత్తముడు (సజ్జనుడు) కష్టాలు ఎదురైనప్పుడు భీతి నొందక బంతిలాగా మళ్ళీ పైకిలేచి (అభ్యున్నతి నొంది) ఎప్పటివలెనే సుఖంగా జీవనాన్ని సాగిస్తాడు.
అథముడు (దుర్జనుడు) కష్టాలు ఎదురైనప్పుడు ఎదుర్కొనే ప్రయత్నం చేయకుండా మృత్పిండం అనగా మట్టిముద్ద నేలకు కొట్టినప్పుడు ఎలాగైతే ముక్కలై అక్కడే ఉ ండిపోతుందో (మళ్ళీ పైకి లేవదు) అలాగే పడిపోతాడు.
కావున సజ్జనులు కష్టాలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా, బంతిలాగా తిరిగి పుంజుకుంటారనీ, దుర్జనులు ఒకసారి కష్టాల్లో పడితే తిరిగి కోలుకోలేరని ఈ శ్లోకం ద్వారా తెలియుచున్నది.
It is a famous verse from Bhartruhari’s Nitishatakam. Even if a virtuous person falls into difficulties, he rises again (improves) like a ball. Even if a wicked person (evil person) falls, just as a lump of clay (a dead body) falls to the ground and remains there in pieces (not rising again), so too does he fall.
Good people bounce back like a ball, without getting discouraged when faced with difficulties. But evil people crumble like a lump of clay when faced with difficulties. Once they are in trouble, never recover. Noble persons indicates self confidence and karma. ‘Anaryah’ – (wicked person) indicates an unstable personality.
यस्य नास्ति स्वयं प्रज्ञा शास्त्रं तस्य करोति किम् ।
लोचनाभ्यां विहीनस्य दर्पणः किं करिष्यति ॥ ॥ २७ ॥
యస్య నాస్తి స్వయం ప్రజ్ఞాశాస్త్రం తస్యకరోతి కిం ।
లోచనాభ్యాం విహీనస్య దర్పణః కిం కరిష్యతి ॥
कवि परिचयः ఈ శ్లోకము వివిధ కవులచే రచించబడిన ‘సూక్తిరత్నావళి’ అను పాఠ్యాంశం నుండి గ్రహింపబడినది.
पदविभागः यस्य, न + अस्ति, स्वयं, प्रज्ञा, शस्त्रं, तस्य, करोति किं ।
लोचनाभ्यां, विहीनस्य, दर्पणः, किम् करिष्यति ॥
प्रतिपदार्थः
यस = ఎవనికైతే, (who so ever);
स्वयं = స్వతఃసిద్ధమైన (him-self);
प्रज्ञा = తెలివి, (mental faculty for deciding – what is right or wrong, intelligence);
नास्ति = ఉండదో, (not possess have);
तस्य = వానికి, (his);
शास्त्रं = శాస్త్రము, (scientific and religious treatises covering various diciplin of knowledge);
किम् = ఏమి, (what);
करोति = చేయును ?, (does)
लोचनाभ्यां = కన్నులు, (a pair of eyes);
विहीनस्य = లేనివానికి, (not having);
दर्पणः = అద్దము, (a mirror);
किं = ఏమి, (what);
करिष्यति = చేయును (ప్రయోజనము లేదని భావము), (does).
भावः కళ్ళులేనివాడికి, అద్దం ఏవిధంగా నిరర్థకమో, విచక్షణ జ్ఞానం లేనివాడు ఎన్ని చదువులు చదివినా, ఎన్ని శాస్త్రాలు అభ్యసించినా ప్రయోజనం ఉండదు. ఆత్మజ్ఞానం లేదా స్వయం ప్రతిభ లేని వానికి అంధునికి ఒక దర్పణం ఇచ్చినట్లు ఏవిధమైన విషయాశక్తి లేనివానికి శాస్త్రము ఏరకమైన ఉత్ప్రేరకమూ కాజాలదు.
(ఈ శ్లోకము నారాయణ పండితునిచే రచించబడిన ‘హితోపదేశ’ గ్రంథము నందలి విగ్రహము అను విభాగం లోనిది).
One who does not have any stuff with in him or does not have inherent capabilities and grasping of things, what a ‘saastra’ or subject can do to him? Means, subjects simply cannot help any one who is incapable of understanding them and master them.
It is like, the one who has both the eyes from non functioning totally, what a mirror can do it him? Means mirror cannot give him vision, noth- ing can be done. A mirror is not a means to give him vision. Such a person cannot get vision by external means.
प्रथमवयसि पीतं तोयमल्पं स्मरन्तः
शिरसि निहितभारा नारिकेला नराणाम् ।
सलिलममृतकल्पं दद्युराजीवितान्तं
न हि कृतमुपकारं साधवो विस्मरन्ति ॥ ॥ २८ ॥
ప్రథమ వయసి పీతం తోయమల్పమ్ స్మరంతం
శిరసి నిహిత భారా నారికేళ నరాణామ్ ।
సలిల మమృత కల్పం దద్యురాజీవితాంతం
న హి కృత ముపకారం సాధవో విస్మరన్తి ॥
परिचयः ఈ శ్లోకము వివిధ కవులచే రచించబడిన ‘సూక్తిరత్నావళి’ అను పాఠ్యాంశం నుండి గ్రహింపబడినది.
भावः కొబ్బరి మొక్క మానవుడు పోసే నీరు త్రాగుతుంది. తాను పెరిగిన తరువాత అమృతజలనిధులను (కొబ్బరికాయలను నెత్తిన పెట్టుకొని తన జీవితాంతము, ఆ సుధాస్రవంతిని తొణకని, బెణకని పాత్రలను పోలిన నారికేళము నందుంచి మనకు అందించి ఋణాన్ని తీర్చుకుంటుంది. కావున సద్గుణ సంపన్నులు తమకు ఇతరులు చేసిన మేలును జీవితాంతము గుర్తుంచుకుంటారు గానీ, ఒకవేళ వారు కీడు తలపెట్టినప్పటికి బహిర్గతము కానివ్వరు.
The sibling of a coconut tree grasps water given by the human. When once it becomes adult it gives nectar like water by keeping loads of coconuts on its head upto the end. That is the attitude of the people having unflinching gratitude. Just look at this how the people of reverence do.
![]()
ऋतुर्व्यतीतः परिवर्तते पुनः
क्षयं प्रयतः पुनरेति चन्द्रमाः ।
गतं गतं नैव तु सन्निवर्तते
जलं नदीनां, नृणां च यौवनम् ॥ ॥ २९ ॥
ఋతుర్వ్యతీతః పరివర్తతే పునః
క్షయం ప్రయాతః పునరేతి చంద్రమాః ।
గతం గతం నైవ తు సన్నివర్తతే
జలం నదీనాం, నృణాం చ యౌవనమ్ ॥
परिचयः ఈ శ్లోకం కాలచక్రం యొక్క నిరంతర ప్రవాహాన్ని తెలియజేస్తుంది.
भावः ఋతువులు గడిచిపోతాయి. మళ్ళీ కొత్తగా పరివర్తన చెందుతాయి. ప్రకృతిలో కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వసంతం, గ్రీష్మం ………. మొదలైన ఋతువులన్నీ ఒకదాని తరువాత ఒకటి రావడం, కాలచక్రంలో భాగంగా మళ్ళీ తిరిగి రావడం జరుగుతాయి.
చంద్రుడు క్షీణించినా మళ్ళీ పౌర్ణమి నాటికి కాంతితో ప్రకాశిస్తాడు. పునరుత్తేజం పొందుతాడు, కానీ గడిచిపోయిన కాలం (గతం) తిరిగిరాదు. అదెట్లనగా నదీప్రవాహం, మనిషి వయసు (యవ్వనం) తిరిగిరావు. కావున మానవుడు కష్టసుఖాలను స్థితప్రజ్ఞతతో స్వీకరిస్తూ కాలాన్ని సద్వినియోగపరచుకోవాలనేది శ్లోకార్థము.
Expressess the continuous flow of the cycle of time. This means “seasons pass, and change again”.
Time is never the same in nature. It is natural for the seasons of spring, summer, rain etc., …………….. and spring to come one after the other, and the return again as part of the cycle of time. This is a symbol of the Joys and sorrows, the hardships and pleasures of our lives. It means that just as happiness comes after hardship, and hardship after happiness, so too does one season pass and another season come.
In short this sentence reminds us that time is constantly changing and change is a law of nature.
यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः ।
स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥ ॥ ३० ॥
యద్య దాచరతి శ్రేష్ఠసత్త దేవేతరో జనః ।
స యత్ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే ॥
परिचयः ఈ శ్లోకము వివిధ కవులచే రచించబడిన ‘సూక్తిరత్నావళి’ అను పాఠ్యాంశం నుండి గ్రహింపబడినది.
पदविभागः यत्, यत्, आचरति, श्रेष्ठः, तत्, तत्, एव, इतरः, जनः, सः, यत्, प्रमाणं, कुरुते, लोकः, तत्, अनुवर्तते
प्रतिपदार्थ्ः
श्रेष्ठ = ఉత్తముడు, (best / superior person);
यत्, यत् = ఏఏ విధంగా, (in whatever way);
आचरति = ఆచరిస్తాడో, (practices);
इतरः = ఇతరులు, (others);
जनः = జనులు, (people);
तत्, तत् = అదేవిధంగా, (in that way);
प्रमाणं = మాత్రమే, (only);
सः = అతడు, శ్రేష్ఠుడు, (he);
यत् = దేనిని, (which);
प्रमाणं = ప్రమాణంగా, (as a standard);
कुरुते = చేస్తున్నాడో, (does);
लोकः = సమస్తలోకం, (whole world);
तत् = దానినే, (the same);
अनुवर्तते = అనుసరిస్తుంది, (follows).
![]()
भावः శ్రేష్ఠులైన వ్యక్తులు దేనిని ఆచరిస్తారో సామాన్య జనులు కూడా వానినే అనుకరిస్తారు. అనగా గొప్పవారు (లేదా) ఉన్నతస్థానంలో ఉన్నవారు దేనిని ప్రామాణిక బుద్ధితో అనుష్ఠిస్తారో, అట్టి దానినే సాధారణ జనులు కూడా ఆచరిస్తారు. కావున ఉన్నతస్థానంలో ఉన్నవారు తమ ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వేసిన బాటలోనే మిగతా జనం నడుస్తారు. కాబట్టి వారు చేసే పనులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. శాస్త్రానికి విరుద్ధమైన పనులు చేయరాదని శ్లోక భావము.
Whatever path the leaders, Intellectuals or elders follow in the society, the common people follow the path. Their practices and standards become an ideal for the world. Therefore this verse indicates that the great should always follow a righteous and good path.