Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Sanskrit Study Material Pdf पद्यभागः 2nd Poem कृष्णाप्रबोधः Questions and Answers Summary.
Inter 2nd Year Sanskrit कृष्णाप्रबोधः Questions and Answers
अभ्यासः
1. निबन्धप्रश्नौ
1. “कृष्णाप्रबोधः” इति पाट्याभागस्य सड़श्रेपेण लिखत ।
2. कृष्णया धर्मजं प्रति प्रोक्तनि कर्तव्यबोधकवाक्यानि लिखत ।
जवाब:
కవి పరిచయం :
ప్రస్తుత పాఠ్యభాగం ” : ” భారవి మహాకవిచే రచించబడిన పంచమహాకావ్యాలందు ప్రసిద్ధిగాంచిన ‘కిరాతార్జునీయం’ – ప్రథమసర్గ నుండి గ్రహింపబడినది.
పాఠ్యభాగ-పరిచయం (इतिकृतं):
“కిరాతార్జునీయ కావ్యం” వేదవ్యాస విరచిత శ్రీమన్మహాభారతము-అరణ్యపర్వం నుండి స్వీకరింపబడినది. ఈ మహా కావ్యమును భారవి మహాకవి 18 సర్గములతో రచించెను. (మహాకావ్యము నందు సర్గములు ఎనిమిదికి తక్కువగా కానీ, ముప్పదికి ఎక్కువగా కానీ ఉండరాదు. సర్గము నందలి ఆ పద్యముల సంఖ్య ముప్పదికి తగ్గరాదు. రెండువందలకు మించరాదు.
కపటద్యూత పరాభూతులై పాండవులు నియమానుసారము అరణ్య వాసము చేయుచు ద్వైతవనము నందుండిరి. వనవాసకాలము చాలా వరకు గడిచినది. సమయపాలనానంతరము తమ రాజ్యము తమకు రావలసి యున్నది కనుక ధర్మరాజు ఎప్పటికప్పుడు గూఢచారులద్వారా కురురాజ్య మందలి విశేష వ్యవహారములను తెలిసికొనుచుండెను. దుర్యోధనుని పాలనమున ప్రజలు తృప్తి చెందియున్నచో తమకు రాజ్యం దక్కుట దుర్లభ మగును. దుర్యోధనుడు మోసముతో సంపాదించిన రాజ్యమును నీతిచే సుస్థిరం గావించుకొనుటకు ప్రయత్నించుచుండును. అయితే అట్టి విషయమునే గూఢచారిగా నియోగింపబడిన వనేచరుడు ధర్మరాజుకు ఇవ్విధముగా తెలియజేసెను ….
ప్రస్తుత పాఠ్యభాగ వివరణ : (प्रस्तुतः पाट्यभागः)
పత్నీ సోదరసమేతుడై ధర్మరాజు అరణ్యవాసము చేయుచు ద్వైతవనమునందు నివసించుచుండిన ధర్మరాజు దుర్యోధనుని పరిపాలనా విధానమును గూర్చి తెలిసికొనుటకు ఒక వనచరుని గూఢచారిగా కురురాజ్యమునకు పంపించెను. అతడు బ్రహ్మచారి వేషధారియై రాజ్యమంతటా పర్యటించి, దుర్యోధనుని పరిపాలనా విధానమును సమగ్రముగా తెలుసుకొని ధర్మరాజు వద్దకు తిరిగి వచ్చి ఏమాత్రం వ్యధ చెందకుండా, అసత్యములు పలుకకుండా, సాధుత్వము, అర్ధగాంభీర్యము, ఉట్టిపడుచుండగా వినిశ్చితమైన అర్ధములు గల మాటలతో ఈ విధంగా చెప్పనారంభించెను.
వనచరుని నివేదిక
ఓ రాజా ! రాజకార్యములందు నియుక్తులైన భృత్యులచే చారులే కన్నులుగా గల ప్రభువులు వంచనీయులు కారు. అందువల్ల అప్రియమైనను, ప్రియమైనను (నేను చెప్పబోవుదానిని క్షమింపదగుదువు. హితకరములైన వాక్యము దుర్లభము గదా !
ఏ సఖుడు ప్రభువునుద్దేశించి హితవాక్యమును ఉద్దేశింపడో ఆ సఖుడుకు కుత్సిత సఖుడు. ఏ ప్రభువు హితోపదేశములను చక్కగా ఆలకింపడో ఆ ప్రభువు కుత్సిత ప్రభువు. మంత్రులను రాజులను సదా పరస్పరానురాగయుక్తులై యున్నప్పుడు సర్వసంపదలు వారిపట్ల ప్రీతిపొందును.
సహజముగా గ్రహింపశక్యము గాని ప్రభువుల ప్రవర్తన ఎక్కడ ? అజ్ఞానోపహతులైన మావంటి పామరులు ఎక్కడ ? శత్రువుల నిగూఢమైన రాజనీతి మార్గమును నేను గ్రహింపగలిగినచో దానికి కారణము తమ మహత్వమే. అందువల్ల ఓ రాజా ! నీయందు కపటమును ఆచరించుటకు పూనిన ఆ దుర్యోధనుని యందు చేయదగిన ప్రతీకారము శ్రీఘ్రముగా జేయుము. పరులచే పలుకబడిన మాటలను సంగ్రహించు మావంటివారి వచనములు కేవలము వార్తాప్రధానములే అగును కదా !” అని పలికి, కిరాతనాయకుడు పొందబడిన సత్కారములు గలవాడై వెడలిపోగా, అనంతరము ధర్మరాజు ద్రౌపదీ భవనమున ప్రవేశించి తమ్ముల సమక్షమున ఆ వనచరుడు చెప్పిన మాటలను చెప్పెను.
ద్రౌపది యుపదేశము :
ద్రౌపది శత్రువుల యొక్క అభివృద్ధిని గురించి విని, వారి వలన కలిగిన అపకారములను నిరోధించుటకు అశక్తురాలయిన ద్రౌపది ధర్మరాజు యొక్క క్రోధమును, ప్రయత్నమును ఉద్దీపింపజేయు వాక్కులను ఇట్లు పలికెను …………
“నీవంటి వారి పట్ల నావంటి స్త్రీలు పలికెడు ఉపదేశవాక్యములు అధిక్షేపముగా తోచవచ్చును. అయినప్పటికీ స్త్రీ జనోచిత్తములైన యాచారములను తొలగద్రోయు మానసికవ్యధలు నన్ను మాట్లాడుటకు ప్రేరేపించుచున్నవి. దేవేంద్రునితో సమానమైన ప్రభావముగల కురువంశ భూపతులు చిరకాలము అవిచ్ఛిన్నముగా ధరించిన ఈ భూమిని మదము స్రవించుచున్న ఏనుగు చేత పూలదండవలె నీచేతిచే విసిరివేయబడినది.
ఎవ్వరు మాయావుల విషయమున మాయావులుగా ప్రవర్తింపరో అట్టి మందబుద్ధులు పరాభవము పొందుదురు. ధూర్తులు అట్టి అమాయకులను కవచాదులచే కప్పబడని యంగములు గలవారిని వాడియైన బాణముల వలె చొచ్చి హింసింతురు గదా ! అనుకూలమైన సహాయసంపత్తి కలిగి కులాభిమానము గలవాడు నీవు తప్ప వేరెవ్వడు. సౌందర్యాది గుణములచే అనురక్తయు, సద్వంశ జాతయు, మనోరమయునైన భార్యను వలె సంధ్యాది గుణములచే అనుకూలము, కులక్రమాగతము, మనోహరములైన రాజ్యలక్ష్మిని శత్రువులు పరాభవించుచుండగా ఊరకుండును ?
ఓ నరేశ్వరా ! అయినప్పటికి మానధనములచే గర్హింపబడిన మార్గమున వర్తించుచున్న నిన్ను ఎండిన జమ్మిచెట్టును అగ్నివలె ఉద్రేకపరచు క్రోధము ఏల జ్వలింపచేయకున్నది ? వ్యర్థము కాని కోపము కలిగి, యాపదలను నాశనము చేయగల మహాత్మునకు జనులు తమంతతామే వశవర్తులగుదురు. క్రోధరహితుడైన మానవుడు స్నేహము కలవాడైనను ప్రీతికలుగదు. శత్రువైనను భీతి కలుగదు.
పూర్వము రక్తచందన లేపనమునకు అలవాటుపడిన మహారథుడైన ఈ భీమసేనుడు ఇప్పుడు ధూళిధూసరితుడై పాదచారియై పర్వతముల నడుమ సంచరించుచుండగా తిలకించి సత్యధనుడవైన నీ చిత్తము పరితపించుటలేదా ? దేవేంద్ర సమానుడై ఉత్తర కురుభూములను జయించి పూర్వము నీకు అపారమైన ధనరాసులను తెచ్చి యిచ్చిన అర్జునుడు నేడు నీకు నారచీరలు తెచ్చి ఇచ్చుచుండ నీకు క్రోధము, దుఃఖము కలుగుట లేదా ? అరణ్యభూమి యందు పరుండుటచే కఠినములైన శరీరములు కలిగి అంతటను కేశములచే వ్యాపింపబడి అడవి ఏనుగు గున్నలవలె నున్న నకులసహదేవులను చూచుచు నీవు సంతృప్తిని నిగ్రహమును ఎట్లు వహించుచున్నావు ? ఇటువంటి నీ చిత్తవృత్తిని నేను గ్రహింపజాలకున్నాను. లోకమున మనోవృత్తులు నానా విధములుగా ఉండును. కానీ నీ ఆపదను గురించి చింతించుచున్న నా చిత్తమును మనోవ్యధలు బలాత్కారముగా పీడింపబడుచున్నవి.
మిక్కిలి విలువగల శయ్యపై పరుండి స్తుతులచేత, గానములచేత, మంగళధ్వనులచేత మేల్కాంచుచుండిన నీవు ఇప్పుడు విస్తారమైన దర్భలు గల కటికనేలపై శయనించి అమంగళకరములైన ఆడునక్కలకూతలచే నిద్ర వీడుచున్నావు. బ్రాహ్మణులు భుజింపగా మిగిలిన అన్నముచే రమణీయమై వర్థిల్లిన ఈ నీ శరీరము అరణ్య భవములైన ఫలములను భుజించుటచే ఇప్పుడు నీ కీర్తితో పాటు మిక్కిలి కృశించిపోయినది.
ఎల్లప్పుడూ మణిపీఠమందు ఉండునట్టి నీచరణములను పూర్వము రాజుల శిరస్సులందలి పుష్ప మాలికల యొక్క పరాగము రంజిల్లజేయు చుండెడిదో ఆ చరణములు నేడు లేళ్ళ చేతను, విప్రులచేతను త్రుంచబడిన అగ్రములుగా గల దర్భలవనమునందు ఉన్నవి.
ఇటువంటి దురవస్థ శత్రువుల కారణంగా గలదనుట వల్ల అది నాయొక్క మనస్సును నిశ్లేషముగా పెళ్లగించుచున్నదా యన్నట్లున్నది. శత్రువులచే ధ్వంసము చేయబడని వీర్యసంపదగల అభిమానవంతులకు అవమానం కూడా ఉత్సవమే అగును కదా !
ఓ రాజా ! శాంతిని విడిచి ఆ తేజమును శత్రువధ కొఱకు మరల స్వీకరింపుము. దయజూడుము. నిష్కాములైన మునులు శత్రువులను జయింపక శాంతము చేతనే మోక్షము పొందుదురు. రాజులు మాత్రము పొందురు.
తేజశ్శాలురలో అగ్రేసరులు, యశస్సే ధనముగా గలవారునైన తమవంటి వారు సహింపశక్యముగాని ఇటువంటి అవమానమును పొందియు తృప్తిని స్వీకరింతురేని అయ్యో ! అభిమానశాలిత్వము దిక్కులేనిదై నశించును.
ఒకవేళ విడువబడిన పరాక్రమము గలవాడవై చిరకాలము సహనమునే సుఖసాధనముగా స్వీకరించితివా ? అట్లయినచో రాజచిహ్మమైన కార్ముకమును విడిచి జడధారివై ఈ వనమున అగ్నికి హోమము చేయుచుండుము. శత్రువులు అవమానవు చేయుటచే ప్రధానముగా గలవారై ఉన్నప్పుడు మహాతేజశ్శాలివైన నీకు ప్రతిజ్ఞాపాలనము యుక్తము కాదు. ఎట్లనగా విజయార్థులైన రాజులు శత్రువులపట్ల కపటముతో సంధి భంగిమలు చేయుచుందురు.
విధియొక్కయు, కాలము యొక్కయు నియమము వలన అగాధమైన ఆపద సమయాన సముద్రమున మునిగినట్టియు, ప్రతాపము యొక్క సంకోచము వల్ల అప్రసన్నుడైనట్టియు, శిధిలమైన ధనము గలనట్టియు, అంధకారము వంటి శత్రువులను పారద్రోలి ఉదయించుచున్నట్టియు నిన్ను ప్రాతఃకాలమున సూర్యునివలె తిరిగి పొందునుగాక.
![]()
Introduction :
“Krishna probodhah” from Bharavi’s Kiratarjuniyam.
Context of the lesson:
After losing everthing in the deceitful game of dice (Dyuta krida) the pandavas, along with their wife Draupadi, were living in exile in the Daita Forest.
To understand how Duryodhana was managing the kingdom and whether he was treating the subject well, yudhisthira sent a forest dweller (vanechara) as a spy disguised as a celibate scholar.
The spy returned and reported that Duryodhana was ruling the kingdom with great skill, winning the loyalty of his subjects through righteous administration and becoming increasingly powerful.
Yudhisthira shared this information with Draupadi and his brothers. Hearing about the enemy’s success and prosperity while they lived in misery filled Draupadi (krishna) with intense grief and indignation.
Draupadi felt that Yudhisthira’s excessive patience and forgiveness were being mistaken for weakness by their enemies. She decided to speak up to reignite the warrior spirit in yudhisthira.
Summary of the lesson:
(Present lesson)
The spy’s report:
The story begins in the Dvaita forest where the pandavas are living in exile. Yudhisthira (Dharma Raja) sends a forest – dweller (vanechara) as a spy to the Kuru Kingdom to observe Duryodhana’s rule. The spy returns and reports that Duryodhana’s is ruling very effectively and winning the hearts of his subjects through righteous governance. Hearing this, Yudhisthira informs Draupadi and his brothers about the enemy’s growing strength.
Draupadi’s Agony and Anger: Upon hearing about the enemy’s success, Draupadi (referred to as krishna) is filled with intense grief and anger. She realizes that Yudhisthira’s passive patience is becoming a weakness. She delivers powerful speech to awaken his warrior spirit.
Deceit for Deceit: She warns that those who are straightforward with deceitful people are bound to fail. Like sharp arrows piercing an unarmored body, wicked enemies destroy those who do not use strategy against him.
The plight of the brothers: She questions Yudhisthira’s calmness by pointing out the miserable state of his brothers. Bhima, who used red sandalwood, is now covered in forest dust, Arjuna, the great conqueror, now wears bark clothes, and the twins. Nakula and Sahadeva, sleep on the hard forest floor. Past Glory vs. present plight: She reminds his that he once slept on luxurious beds and woke up to auspicious chants, but now he sleeps on sharp grass and wakes up to the howling of jackals.
The Definition of true defeat: Draupadi famously states that for men of self-respect, even a defeat is like a festival if they fight with prowess. However, surrendering to insults without a fight is the ultimate humiliation.
The Final call to Action:
She sarcastically tells Yudhisthira that if he values “Peace” above everything else, he should give up his bow, grow matted hair like an ascetic and perform rituals in the forest. She asserts that “Peace is for sages (munis), not for kings”. A king must use his powers to destroy his enemies. She concludes by wishing that yudhisthira rises like the morning sun to dispel the darkness of his enemies and reclaim his kingdom.
Conclusion: The lesson emphasizes that righteousness (Dharma) must be protected with strength and that the leader should not remain passive when his honor and kingdom are at stake.
![]()
2. लघुसमाधानप्रश्नाः
प्रश्न १.
युधिष्ठिरं द्वैतवने कः समाययौ ?
जवाब:
युधिष्ठरं द्वैतवने वर्णिलिङगी वनेचरः समाययौ ।
प्रश्न २.
वनेचरः कां वेदितुम् अयुङ्क्त ?
जवाब:
वनेचरः कुरुणां अधिपस्य शियः पालनीम् प्रजासु वृत्तिं वेदितुम् अयुङ्कत ।
प्रश्न ३.
कीदृशं वचः दुर्लभम् ?
जवाब:
हितं मनोहरि च वचः दुर्लभं |
![]()
3. एकपदसमाधानप्रश्नाः
प्रश्न १.
चित्तवृत्तयः कीदृश्यः ?
जवाब:
चित्तवृत्तयः विविधरूपाः खलु ।
प्रश्न २.
नृपस्य मन्युव्यवसायदीपनीः गिरः का उदाजहार ?
जवाब:
नृपस्य मन्युव्यवसाय दीपनीः गिरः द्रुपदात्मजा उदाजहार ।
प्रश्न ३.
मतङ्गजेन स्रगिव धर्मजेन का अपवर्जिता ?
जवाब:
मतङ्गजेन स्रगिव धर्मजेन मही अपवर्जिता ।
![]()
4. सन्दर्भवाक्यानि
प्रश्न १.
मनोरमामात्मवधूमिव श्रियम् ।
जवाब:
परिचयः- इदं वाक्यं “कृष्णाप्रबोधः ” पाठ्यभागात स्वीकृतः ।
कविः भारवि महाकविः काव्यम् – किरातार्जनीयम् आदिमसर्गः ।
संदर्भः – एतत् वाक्यं द्रौपदी राजधर्मराजं प्रति भाषणस्य सन्दर्भे अस्ति ।
भावः – ‘’कुलाभिमानी स्त्वदन्यः कः कुलजां, मत्मवधूमिव मनोरमां श्रियः परैः अपहारयेत् । इति भावः द्रौपदी धर्मराजे उक्तवती ।
प्रश्न २.
रुजन्ति चेतः प्रसभं ममाधयः
जवाब:
परिचयः- इदं वाक्यं “कृष्णाप्रबोधः ” पाठ्यभागात स्वीकृतः ।
कविः भारवि महाकविः, काव्यम् – किरातार्जनीयम् – आदिमसर्गः ।
संदर्भः – एतत् वाक्यं द्रौपदी राजधर्मराजं प्रति भाषणस्य सन्दर्भे अस्ति ।
भावः – ”परां भवदापदां विचिन्तयन्त्याः मम चेतः आधयः प्रसभं रुजति । इति भावः द्रौपदी धर्मराजे उक्तवती ।
प्रश्न ३.
शमेन सिद्धिं मुनयो न भूभृतः ।
जवाब:
परिचयः- इदं वाक्यं “कृष्णाप्रबोधः ” पाठ्यभागात स्वीकृतः ।
कविः भारवि महाकविः, काव्यम् – किरातार्जनीयम् – आदिमसर्गः ।
संदर्भः – एतत् वाक्यं द्रौपदी राजधर्मराजं प्रति भाषणस्य सन्दर्भे अस्ति ।
भावः – निः स्पृहाः मुनयः शत्रून् अवधूय शमेन सिद्धिं व्रजन्ति । भूभृतः न व्रजन्ति इति भावः द्रौपदी धर्मराजे उक्तवती ।
![]()
कृष्णाप्रबोधः Summary in Telugu & English
परिचयः
संस्कृतकाव्यवाङ्मये ‘बृहत्त्रयी’ ‘ति प्रथितायां महाकाव्यपरम्परायाम् आदिमं महाकाव्यं किरातार्जुनीयम् । एतन्महाकाव्यकर्ता भारविमहाकविः, यस्तावत् संस्कृतप्रौढकविषु प्रमुखः प्रोल्लसति । सोऽयं कविशेखरः क्रिस्तोः परं ६३४ तः पूर्वम् अर्थात् षष्ठशतकस्य पूर्वार्धे विष्णुवर्धनभूपतेः आस्थानसभां विभूषयामासेति संस्कृतसाहित्यचरित्रकारैः निर्धारितः । महाकवेरस्य कविता तु ओजेगुणगुम्फिता, वीर- रौद्र रससंभरिता च विलसति । एतन्महाकाव्यस्य इतिवृत्तं श्रीमन्महाभारतेतिहासात् संगृहीतम् । एतस्मिन् महाकाव्ये अष्टादश सर्गाः विद्यन्ते ।
‘’कृष्णाप्रबोधाख्यः” प्रस्तुतपाठ्यभागः किरातार्जुनीयस्य महाकाव्यस्या दिमसर्गात् स्वीकृतः । द्यूतक्रीडायां पराजितः धर्मराजः पत्नी – अनुजसमेतः द्वैतवनम् अध्यतिष्ठत् । तदा दुर्योधनस्य पालनविधिं ज्ञातुं कश्चन वनेचरः धर्मनन्दनेन संप्रेषितः । सः राज्यपर्यटनं कृत्वा युधिष्ठिरम् उपसृत्य सुयोधनपालनपद्धतिं निवेदयामास । तदनन्तरं धर्मनन्दनः एतद्विषयं पत्नी – अनुजसन्निधौ वदति । वनेचरवचनश्रवणसमनन्तरं द्रौपदी युधिष्ठिरमुद्दिश्य सद्यः प्रत्युद्यमः कार्यः इति प्रबोधयति ।
కవి పరిచయం:
సంస్కృత కావ్యాలలో మహాకావ్య లక్షణాలు గల బృహత్తరమైన కావ్యాలు పంచమహాకావ్యాలుగా పేరుగాంచినవి. వానిలో భారవి మహాకవిచే రచించబడిన కిరాతార్జునీయమ్ కూడా మహాకావ్యంగా ప్రసిద్ధిచెందింది.
భారవి మహాకవి ప్రౌఢకవులలో ప్రముఖునిగా కీర్తింపబడెను. ఈయన కాలము కీ. శే. 634, అనగా 6వ ० २२४० ७९% పండితుడిగా ఉండేవాడని సంస్కృత సాహిత్య చరిత్రకారుల ద్వారా తెలియుచున్నది.
భారవి మహాకవిచే విరచితమైన కిరాతార్జునీయ కావ్యమందు, నవరసాలు అత్యద్భుతంగా ఓలలాడినవి అనుటలో అతిశయోక్తి లేదు. అందుకే “భారవేః అర్థగౌరవమ్” అని భారవి మహాకవి కీర్తింపబడెను. ఈ కావ్యమందలి ఇతివృత్తం “శ్రీమన్మహాభారతం” నుండి గ్రహించబడినది. కిరాతార్జునీయం పద్దెనిమిది సర్గలతో కూడిన మహాకావ్యంగా మహాకవి భారవి విరచించెను.
ప్రస్తుత పాఠ్యభాగమై “कृष्णाप्रबोधाख्यः” కిరాతార్జునీయ మహాకావ్యమందలి – ప్రథమసర్గనుండి స్వీకరింపబడినది. జూదంలో ఓడిపోయిన ధర్మరాజు, తన భార్యయైన ద్రౌపది, సోదరులైన భీమ, అర్జున, నకుల సహదేవులతో కలిసి ద్యూతవనము నందు నివసించెను. ఆ సమయమునందు ధర్మరాజు, దుర్యోధనుని యొక్క రాజ్యపాలనా విధివిధానాలను తెలుసుకోవాలనే ఆకాంక్షతో అక్కడ ఉన్న వనేచరుని అందు కార్యమై వినియోగించెను. వనేచరుడు దుర్యోధనుని పరిపాలనా దక్షతను గాంచి, తిరిగివచ్చి ధర్మరాజుకు నివేదించి, ధర్మనందనుని అనుమతితో సెలవు తీసుకున్నాడు. (అక్కడి నుండి నిష్క్రమించాడు).
అటు పిమ్మట ధర్మరాజు వనేచరుని వాక్యములను భార్యద్రౌపది మరియు సోదరులకు తెలిపెను. ధర్మరాజు ద్వారా వనేచరుని మాటలను గ్రహించిన ద్రౌపది ధర్మరాజును ఉద్దేశించి అతడికి తక్షణ కర్తవ్యాన్ని ప్రబోధించినట్టి (సందర్భము) వచనములు ప్రస్తుత పాఠ్యభాగమునందు వివరింపబడినవి.
![]()
In the famous tradition of Sanskrit mahakavyas (epic poems) known as the “Brihattrayi” (The Great Three), Kiratarjuniyam is considered the first and foremost.
The creator of this epic is the great poet Bharavi, who shines prominently among the elite Sanskrit poets.
Based on historical records and inscriptions, its time is determined to be before 634 AD, specifically the first half of the 6th century. He graced the royal court of King Vishnuvardhana.
Bharavi’s poetry is characterized by “ojo Guna” (a vigorous and powerful style). It is beautifully enriched with veera (Heroic) and Randra (Furious) sentiments (Rasas).
The plot of this mahakavya is drawn from the Mahabharata. This epic consists of 18 parvas (sargas) (cantos)
This lesson is taken from the first canto of the epic (Dyuta krida), Dharmaraja (yudhisthira), along with his wife and brothers, resided in the Dvaitavana forest.
To understand Duryodhana’s administrative methods and governance, Dharmaraja sent a forest dweller (vanechara) as a spy. The spy returned from his travels and reported Duryodhana’s successful ruling style to yudhisthira.
After hearing the vanachara’s words, yudhisthira speaks in front of his wife and brothers.
कृष्णा addresses Yudhisthira and exhorts (Prabadhayati) him that immediate action (Pratyudyamah) must be taken. She argues against passive endurance and urges him to prepare for war to reclaim their kingdom.