धर्मपरीक्षा Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Sanskrit Study Material Pdf गद्यभागः 4th Lesson धर्मपरीक्षा Questions and Answers Summary.

Inter 2nd Year Sanskrit धर्मपरीक्षा Questions and Answers

अभ्यासः

1. निबन्धप्रश्नौ

१. “धर्मपरीक्षा” इति पाठ्यभागस्य सारांशं लिखत ।
‘ధర్మ పరీక్షా’ పాఠ్య – భాగ సారాంశాన్ని రాయండి.
Write the Summary of the lesson “Dharmapariksha.”

२. महेन्द्रविहितां युधिष्ठिरधर्मपरीक्षां विवृणुत ।
దేవేంద్రుడు ధర్మరాజు చేసిన ధర్మపరీక్షను వివరించండి. (దేవేంద్రుడు ధర్మరాజును పరీక్షించిన విధానాన్ని తెలపండి)
Explain the test of righteousness conducted by (Indra on Yudhishthira.)
जवाब:
పరిచయం : ప్రస్తుత పాఠ్యాంశం “धर्मपरीक्षा” “ధర్మపరీక్షా” लक्ष्मण सूरिः विरचित भारत सङ्ग्रहंः కావ్యం నందలి स्वर्गारोहणपर्वात् स्वीकृतः ।

ప్రస్తుత పాఠ్యాంశం ‘ధర్మపరీక్షా’ మహామహోదయ లక్ష్మణసూరి గారిచే రచించబడిన ‘భారత సంగ్రహం’ – స్వర్గారోహణపర్వం నుండి స్వీకరించబడినది.

పాఠ్యనేపథ్యం : కురుక్షేత్ర యుద్ధం ముగిసిన పిదప పాండవులు ధర్మబద్దంగా ముఫ్పైఆరు సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించారు.

శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి పరమదించాడని తెలిసినప్పుడు, పాండవులకు ఈ లోకంపై విరక్తి కలుగుతుంది.

మహాప్రస్థానం : ధర్మరాజు తనమనుమడైన పరీక్షిత్తుకు, వైశ్యాపుత్రునకు రాజ్యపాలన బాధ్యతలు అప్పగించి కృపాచార్యుని వారికి రక్షకునిగా నియమించాడు. ద్రౌపది మరియు పంచపాండవులు రాజ్యాభరణాలను వదిలి, నారవస్త్రాలను ధరించి ‘మహాప్రస్థానానికి’ (హిమాలయాలవైపు చివరి యాత్రకు బయలుదేరుతారు.

ప్రధాన ఉద్దేశం : “భయం వల్ల గానీ, లోభం వల్ల గాని, ప్రాణ రక్షణ కోసం కూడా ధర్మాన్ని ఎన్నడూ వదలరాదు” అనే సత్యాన్ని ధర్మరాజు జీవితం ద్వారా నిరూపించడమే ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం.

ప్రస్తుత పాఠ్యభాగ సారాంశం :

మహాప్రస్థానం : శ్రీకృష్ణుడు పరమపదించిన తర్వాత, పాండవులు రాజ్యభోగాల పట్ల విరక్తి చెందారు. ధర్మరాజు తన మనుమడైన పరీక్షిత్తుకు హస్తినాపుర పట్టాభిషేకం చేసి, ద్రుతరాష్ట్రుని వంశంలో మిగిలిన వైశ్యపుత్రునకు రాజ్యపాలన బాధ్యతలను అప్పగించి అతనికి గురువుగా కృపాచార్యుని నియమించెను. అనంతరం ద్రౌపది మరియు సోదరులతో కలిసి ఉత్తరదిశగా (హిమాలయాలవైపు) ‘మహాప్రస్ధానం’ ప్రారంభించాడు.

మార్గమధ్యలో పతనం : వారు ప్రయాణిస్తున్నప్పుడు మొదలు ద్రౌపది, తర్వాత సహదేవుడు, నకులుడు, అర్జునుడు మరియు భీముడు ఒక్కొక్కరుగా వారి వారి పాపకర్మలచే కిందపడి మరణించారు. వారిలో ఉన్నట్టి చిన్నపాటి బలహీనతలు (పక్షపాతం, మేధోగర్వం రూప గర్వం, అసత్య ప్రతిజ్ఞ, అతిభోజనం) కారణంగా వారు సశరీరంగా స్వర్గానికి వెళ్ళలేకపోయారని ధర్మరాజు భీముడికి వివరించాడు.

శునకరూపంలో పరీక్ష: అందరూ పడిపోయిన ధర్మరాజు చలించకుండా ముందుకు సాగాడు. అతడిని ఒక కుక్క అనుసరించింది. అప్పుడు ఇంద్రుడు దివ్య విమానంతో వచ్చి ధర్మరాజును సశరీరంగా స్వర్గానికి ఆహ్వానించాడు. కానీ తన వెంట ఉన్న కుక్కను రానివ్వకపోతే తాను స్వర్గానికి రానని ధర్మరాజు పట్టుబట్టాడు. తనని ఆశ్రయించిన ప్రాణిని వదిలివేయడం ‘అధర్మం’ అని ధర్మరాజు వాదించాడు. అప్పుడు ఆ కుక్క రూపంలో ఉన్న యమధర్మరాజు తన నిజస్వరూపాన్ని ధరించి, తన కుమారుడైన ధర్మరాజు ధర్మనిరతిని మెచ్చుకున్నాడు.

స్వర్గంలో వింతదృశ్యం : ధర్మరాజు స్వర్గానికి వెళ్ళగానే అక్కడ దుర్మార్గుడైన దుర్యోధనుడు వైభవంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. తన తమ్ముళ్ళు, భార్య ద్రౌపది అక్కడ కనిపించకపోవడంతో కోపగించుకున్నాడు. తనవారు లేని స్వర్గం తనకు కూడా వద్దని, వారు ఎక్కడ ఉంటే తాను అక్కడే ఉంటానని భీష్మించాడు.

धर्मपरीक्षा Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

నరకదర్శనం మరియు అంతిమ పరీక్ష : దేవదూత ధర్మరాజును నరకానికి తీసుకువెళ్లాడు. అక్కడ భయంకరమైన దుర్వాసన, చీకటి బాధలు ఉన్నాయి. అక్కడ తన సోదరుల ఆవేదన విని ధర్మరాజు తల్లడిల్లిపోయాడు. స్వర్గసుఖాల కంటే, తన వారితో కలిసి నరకంలో ఉండటమే మేలని నిర్ణయించుకుని అక్కడే ఉండిపోయాడు.

ముగింపు : వెంటనే ఆ నరకదృశ్యాలన్నీ మాయమైపోయాయి. ఇంద్రుడు ప్రత్యక్షమై “రాజా ! అశ్వత్థామ మరణం విషయంలో నీవు ఆడిన చిన్న అబద్ధం వల్ల నీకు ఈ నరక భ్రాంతిని చూపించాము నీవు ఈ పరీక్షలో కూడా నెగ్గావు” అని వివరించాడు. ధర్మరాజు తన మానుష దేహాన్ని వదిలి. దివ్య దేహంతో తన వారందరితో కలిసి శాశ్వత స్వర్గ సుఖాలను అనుభవించాడు.

పాఠ్య సందేశం : సుఖాలలోనైనా, దుఃఖంలో ఉన్నప్పుడయినా సరే ధర్మాన్ని వీడరాదు” అనే నీతిని ధర్మరాజు వ్యక్తిత్వం ద్వారా ఈ పాఠ్యంశం నందు తెలియజేయబడినది. “ధర్మోరక్షతి రక్షితః” – అంటే మనం ధర్మాన్ని రక్షిస్తే, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. వ్యక్తిగత సుఖంకంటే నైతిక విలువలే గొప్పవని ధర్మరాజు పాత్ర ద్వారా కవి సందేశమిచ్చెను.

Introduction : The Lesson “धर्मपरीक्षा” is an extract from the (Swargarohana Parva) स्वर्गारोहणपर्व of the book भारत सङ्ग्रहंः written by ‘लक्ष्मण सूरिः’ । एष महाशयः व्याकरण वेदन्तशास्त्रे चक्रुतभूरिपरिश्रमः । He is famously known as the “Modern Mallinatha Suri” due to his deep scholarly insight and commentary style.

CONTEXT OF THE LESSON:

The central theme of this lesson is unwavering Adherence to Righteousness (Dharma) and compassion for Dependents. “It illustrates that one should never abandon Dharma for personal gain, pleasure, or out of fear.

Present story : Viragya – After lord Krishna’s departure, the pandavas develop a sense of detachment toward wordly life. Yudhisthira crown his grandson Parikshit and sets out on the ‘Mahaprasthana” (The great journey toward the Himalayas)

Fall due to ego: During the journey. Draupadi and the four brothers fall one by one. Yudhishthira explains that their fall was due to subtle flaws like partiality, pride in beauty, pride in knowledge or unfulfilled boasts.

The Test of the Dog: A dog follows Yudhishthira to the gates of heaven. When Indra asks him to abandon the dog to enter heaven, Yudhishthira refuses, stating that abandoning a loyal dependent (Ashrita) is a great sin. This proves his impartially and loyalty.

The illusion of Hell: In heaven, Yudhishthira is shocked to see ‘Duryodhana’ in comfort while his own brothers are in hell, seeing his brother’s suffering, he decides to stay in hell with them rather than enjoy heaven alone, this proves his selflessness and sacrifice.

Conclusion: Having passed all tests of Character, Yudhishthira is praised by the Gods and the God of Justice (Dharma Deva). He eventually attains the eternal heavenly realms in his physical body.

Moral Message :
“Dharmo Rakshati Rakshitah” – Dharma protects those who protect it. The story emphasizes that moral values are superior to personal comfort.

धर्मपरीक्षा Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

2. लघुसमाधानप्रश्नाः

प्रश्न १.
भारतसङ्ग्रहः केन विरचितः ?
जवाब:
भारत सङ्ग्रहः लक्ष्मण सूरिणा विरचितः ।

प्रश्न २.
“धर्मपरीक्षा” इति पाठ्यभागः कस्मात् स्वीकृतः ?
जवाब:
“धर्मपरीक्षा” इति पाठ्यभागः भारतसस्वर्गारोहणपर्वात् स्वीकृतः ।

प्रश्न ३.
युधिष्ठिरः भीमार्जुनौ विहाय कस्य जीवितमवृणीथाः ?
जवाब:
युधिष्ठरः भीमार्जुनौ विहाय नकुलस जीवितमवृणीथाः । ( यक्षप्रश्नाः )

3. एकपदसमाधानप्रश्नाः

प्रश्न १.
देवराजराजधानी का ?
जवाब:
अमरावती । (देवराजधानी अमरावती 1)

प्रश्न २.
वृथाप्रतिज्ञाकरणं कस्य दोषः ?
जवाब:
वृथा प्रतिज्ञाकरणं अर्जुनस्य दोषः ।

प्रश्न ३.
देवपुर्यां युधिष्ठिरः वासवमिव कं दृष्टवान् ?
जवाब:
देवपुर्यां युधिष्ठिरः वासवमिव ‘दुर्योधनम्’ दृष्टवान् ।

धर्मपरीक्षा Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

4. सन्दर्भवाक्यानि

प्रश्न १.
परबलमविज्ञायैव स्वबल श्लाघी |
जवाब:
परिचयः- इदं वाक्यम् महामहोपद्याय लक्ष्मण सूरि महोदयेन विरचितात् ‘भारतसङ्ग्रः इति ग्रान्थात् “धर्मपरीक्षा” पाठ्यभागात् स्वीकृतम् ।

सन्दर्भः- महाप्रस्थान मार्गे अर्जुनस्य पतनान्तरम् भीमेन पृष्टः सन् धर्मरजः एवमुक्तवान् ।

भावः- अर्जुनः शतॄन् बलमज्ञा त्वैव, “अध्मैकदिने सर्वान् शतॄन् हनिष्यामि ” इति आत्मस्तुति ( श्लाघं) कृतवान् । तस्य गर्वकारणादेव तस्य पतनं जतमिति अस्य वाक्य भावः ।

प्रश्न २.
आश्रितत्यागी नारकी स्यादिति न खलु ।
जवाब:
परिचयः- इदं वाक्यम् महामहोपद्याय लक्ष्मण सूरि महोदयेन विरचितात् ‘‘भारतसङ्ग्रः इति ग्रान्थात् “धर्मपरीक्षा’ पाठ्यभागात् स्वीकृतम् ।

सन्दर्भः- स्वर्गद्वारे इन्द्रैण ” श्वानम् त्यज इति उक्ते सति, धर्मराजः तं प्रति एवमुक्तवान् ।

भावः- यः मानवः तम् आश्रितम् भक्तं वा त्यजति, सः निश्चयेन नरकं गच्छति । आश्रित त्यागः महा पापम् इति धर्मराजस्य अभिप्रायः ।

प्रश्न ३.
दुःखिषु करुणा हि महतां शैली ।
जवाब:
परिचय:- इदं वाक्यम् महामहोपद्याय लक्ष्मण सूरि महोदयेन विरचितात् “भारतसङ्ग्रः इति ग्रान्थात् ” धर्मपरीक्षा” पाठ्यभागात् स्वीकृतम् ।

सन्दर्भः- निरयलोके दुःखितानाम् भातॄणां वचनान् शृत्वा, दयालुः धर्मराजः एवं चिन्तितवान् ।

भावः- ये कष्टषु सन्ति, तेषां उपरि दया प्रदर्शनमेव सज्जनानां लक्षणम् | स्वसुखं विहाय अन्येषां कष्टनिवारण कर्तव्यमिति अस्य सारांशः ।

धर्मपरीक्षा Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

विशेषतो ज्ञेयाः

कठिन शब्दार्थाः

अनुव्रजनं = शिष्टानां गमनसमये पश्चाद्गमनरूप शिष्टाचारं
गन्धवाहः = गन्धं वहतीति गन्धवाहः
गोप्तारं = रक्षकं
नरकः = नृणाति क्लेशं प्रापयतीति
प्रज्ञा = प्रकर्षेण जानतीति
मघवा = इन्द्रः
युधिष्ठिरः = युद्धे स्थिरः
वराकी = मूढा

सन्धयः

इति + उच्चैः = इत्युच्चैः – यणादेशसन्धिः
पञ्चसु + अस्मासु = पञ्चस्वस्मासु – यणादेशसन्धिः

समासाः

दुर्योधनः – दुःखेन युध्यतेऽसौ
अजातशत्रुः – नजातः अजातः, अजातः शत्रुः यस्य सः ।

धर्मपरीक्षा Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

धर्मपरीक्षा Summary in Telugu & English

पाठ्यभाग परिचयः

महामहोपाध्यायपण्डितलक्ष्मणसूरि महोदयस्य जन्म तिरुनल्वेलि जनपदे १८५९ वर्षे पुनलवेलि ग्रामे अभवत् । अस्य पिता मुत्तुसुब्बकविरपि प्रख्यातपण्डितः । एषः महाशयः व्याकरणे वेदान्तशास्त्रे चकृतभूरिपरिश्रमः । संस्कृतसाहित्ये मल्लिनाथानुयायी इति प्रसिद्धिं प्राप्तवान् । अनेन महोदयेन रामायणसङ्ग्रहः, भारतसङ्ग्रहः, नलोपाख्यानस ग्रहः, भीष्मविजयः इत्यादि गद्यकाव्यानि, भगवत्पादाभ्युदयः, कृष्णलीलामृतम् इति महाकाव्यद्वयम्, डेल्हिसाम्राज्यम्, पौलस्थ्यवधम्, घोषयात्रेति नाटकत्रयम्, दशोपनिषत् कारिकाः इति वेदान्तशास्त्रग्रन्थाश्च विलिखिताः ।

धर्मपरीक्षाख्यः प्रस्तुतपाठ्यभागः भारतसङ्ग्रहस्य महाप्रस्थान, स्वर्गारोहणपर्वयोः स्वीकृतः । न जातु कामान्न भयान्न लोभाद्धर्मं त्यजेज्जीवि तस्यापि हेतोः ।” इत्यस्याः आर्योक्तेः मूर्तिमान् विराजते युधिष्ठिरः ।

పాఠ్యభాగ పరిచయం

మహామహోపాధ్యాయ పండిత లక్ష్మణసూరి మహోదయ 1859వ సంవత్సరంలో తిరునల్వేలి జిల్లాలోని పునల్వేలి గ్రామంలో జన్మించారు ఈయన తండ్రి ముత్తు సుబ్బకవి. ఈయన కూడా ప్రముఖ పండితులు.

లక్ష్మణ సూరి గారు వ్యాకరణ, వేదాంతశాస్త్రాలలో గొప్ప పండితులు. వీరిని సంస్కృత సాహిత్యంలో ‘మల్లినాధసూరి’ గా పేర్కొంటారు.

మహోదయ లక్ష్మణ సూరి గారు భారతసంగ్రహః, రామాయణ సంగ్రహః, నలోపాఖ్యాన గద్యసంగ్రహ:, భీష్మ విజయః మొదలగు గద్యకావ్యాలు. భగవత్పా దాభ్యుదయః, కృష్ణలీలామృతం, అనే మహాకావ్యం, ఢిల్లీ సామ్రాజ్యం, పౌలస్త్యవధమ్, ఘోషయాత్ర అనెడి నాటకాలు (నాటకత్రయం) దశోపనిషత్కారికా: మరియు వేదాంత శాస్త్రగ్రంథాలు వ్రాసారు.

ప్రస్తుతపాఠ్యభాగం ‘ధర్మపరీక్షా’ లక్ష్మణ సూరి రచించిన ‘భారత సంగ్రహంలోని మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలనుండి (తీసుకోబడింది) స్వీకరించబడింది.

పాఠ్యపరిచయం

పాండవుల అంతిమప్రయాణం (మహా ప్రస్థానం) లో ధర్మరాజు యొక్క ధర్మనిరతిని పరీక్షించే ఘట్టం ఈ పాఠ్యభాగమునందు వివరింపబడెను. “భయం వల్ల గానీ, లోభం వల్ల గానీ, ప్రాణరక్షణ కోసం కూడా ధర్మాన్ని వదలరాదు” అనే ‘ఆర్యోక్తి’ కి నిలువెత్తు రూపం (ధర్మరాజు) యుధిష్టరుడు అని ప్రస్తుత పాఠ్యాంశమైన “ధర్మపరీక్షా” నందు తెలుపబడెను.

About the Author

Mahamahopadhyaya Lakshmana Suri was born in 1859 in the village of punalveli, located in the Tirunelveli district.

His father was the renowned scholar muttusubba kavi. Lakshmana Suri was a profound scholar in vyakarana (Grammar) and vedanta (philosophy).

He is famously known as the “Mallinatha Suri”, due to his deep scholarly insight and commentary style.

Gadya Kavyas: Bharata Sangraham, Ramayana Sangraham, and Nalopakhyana Sangraham.

Natakas : Bhishma vijayam, paulastyavadham, and Ghoshayatra.

Other works: Bhagavat padabhyudayam, Krishna lilamrutam (an epic poem), Delhi Samrajyam and commentaries on the Dashopanids.

पाठ्यभाग परिचयः

This lesson is extracted from the Mahaprasthanika and Svargarohana parva of Lakshmana Suri’s Bharata Sangraham”.

It depicts the final journey of the pandavas. It highlights the character of Yudhisthira as the embodiment of Dharma, illustrating the principle. “One should not abandon Dharma out of fear, greed, or even for the sake of saving one’s life.

పాఠ్యాంశ पाठ्यशः

राजा तु पृथिवीललामभूतस्य कृष्णस्य वियोगं, कृष्णद्वैपायनस्य नियोगं, भ्रातॄणामुद्योगं च पुनः पुनर्विमृश्य, स्वयमपि जातवैतृष्ण्यो महाप्रस्थानाय मतिं चक्रे । तथा निश्चितार्थः सः पौत्रं परीक्षितं राज्येऽभिषिच्य, वेश्यापुत्रं युयुत्सुं तस्य गोप्तारं कृपं विद्यासु विनेतारं च विधाय, आनुपूर्व्यानुव्रजद्भिः भीमादिभिरनुजैः भार्यया केनचिच्च्छुना चानुव्रज्यमान उदीचीं दिशं प्रति प्रवव्राज । तथा प्रव्रजत्सु तेषु, पथि पावकेनार्जुनाद्गाण्डीवे प्रतिगृहीते, मेरोरुपकण्ठे निपतितां द्रौपदीं वीक्ष्य ‘आर्य ! केन कर्मणा भुवि पतितेयं वराकी कृष्णा’ इति पृच्छति भीमे, गच्छन्नेव युधिष्ठिरः प्रत्याह – ‘“भद्र ! पञ्चस्वस्मासु पतिषु धनञ्जयेऽस्या अभिमानः ।

तेनैव भ्रष्टा” इति । ततश्च गच्छतामेव तेषां क्रमेण सहदेवादिषु पतितेषु गच्छत्सु च शेषेषु तत्पतनकारणं भीमेन पृष्टो युधिष्ठिरः स्वयं गच्छन्नेव प्राज्ञं मन्यत्वं सहदेवस्य, रूपवन्मानित्वं नकुलस्य, “एकाहेन सर्वं परबलं शातयामि” इति वृथाप्रतिज्ञाकरणमर्जुनस्य च क्रमेण दोषं व्याचचक्षे | तावत्स्वयं भुवि पतितो भीमः “आर्य ! केन दोषेण ममायं भ्रंशः ।” इत्युच्चैः पृच्छन् गच्छतैव तेनाख्यायि “भद्र ! भीम ! त्वमतिभोजनः । परबलमविज्ञायैव स्वबलश्लाघी । अयमेव दोषस्ते पतनहेतुः” इति । श्वा केवलमेकाकिनं यान्तं तमनुसरति स्म । तदनु शक्रो दिव्येन विमानेन वैमानिकैश्च तस्य पुरः प्रादुर्भूय “राजन्नजातशत्रो ! आरोहेदं यानम् । तव सुकृतैः प्रीणितोऽहं त्वां मल्लोकं निनीयुरागतोऽस्मि’ इति तं प्रोवाच ।

ధర్మరాజు అయితే భూలోకాన్ని విడిచి వెళ్ళిన శ్రీ కృష్ణుని వియోగాన్ని, వేదవ్యాసుని ఆజ్ఞను, తన సోదరుల (పాండవుల) సిద్ధతను, మాటిమాటికి ఆలోచించి, స్వయంగా వైరాగ్యం చెందినవాడై, మహాప్రస్థానానికి (చివరి యాత్రకు) వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఆ విధంగా నిశ్చయించుకున్న ధర్మరాజు తన మనవడైన పరీక్షిత్తుకు పట్టాభిషేకం (రాజ్యాన్ని అప్పగించి….) చేసి, వైశ్యాపుత్రుడైన యుయుత్సుడిని పిలిచి, అతనికి హస్తినాపుర బాధ్యతలను అప్పగించి, అతనికి మార్గదర్శిగా కృపాచార్యుని నియమించి, ప్రజలందరి వద్ద సెలవు తీసుకొని అడవులకు బయలుదేరాడు. ధర్మరాజు తనసోదరులు, భార్య ద్రౌపదితో కలిసి మొదట తూర్పు దిశగా, అటుపిమ్మట దక్షిణ దిశగా, తరువాత పశ్చిమ దిశగా ప్రయాణించి చివరకు ఉత్తరదిశ వైపు సాగిపోయారు. వారు అలా ముందుకు సాగి గంగానదిని దాటి తూర్పు సముద్రతీరానికి చేరుకున్నారు. వారి వెంట ఒక కుక్క కూడా వారిని అనుసరించి వెళ్ళసాగింది. అప్పుడు వారికి అగ్నిదేవుడు ప్రత్యక్షమై అర్జునుడికి ఇచ్చిన గాండీవాన్ని వరుణదేవుడికి అప్పగించమన్నాడు. అర్జునుడు గాండీవాన్ని సముద్రపు నీటిలో వదిలాడు.

అటుపిమ్మట మేరుపర్వతం దిశగా పయనించారు. ముందుగా ద్రౌపది ఇంక నడవలేక నేలమీద పడిపోయింది. ఈ విషయాన్ని భీముడు ధర్మరాజు కు తెలిపాడు. ఆర్యా ! ఈమె ఏ పాపం చేయడం వలన ఇలా కిందపడిపోయింది అని అడిగాడు. ధర్మరాజు భీముడితో భీమా ! పాంచాల రాజపుత్రి ద్రౌపదిని అర్జునుడు (ధనుంజయుడు) మత్స్యయంత్రము కొట్టి గెలుచుకున్నాడు. కనుక ఈమెకు అర్జునుడంటే మిక్కిలి ప్రేమ. కావున ఆమె ప్రేమలో పక్షపాతము ఉన్నది కావున ఈమె చేసిన పుణ్యఫలములు ఫలించక ఇలా పడిపోయింది. అని జవాబిచ్చాడు.

వారు ముందుకు సాగుతుండగా క్రమంగా సహదేవుడు పడిపోయాడు. సహదేవుని గురించి భీముడు, ధర్మరాజును అడగగా – ధర్మరాజు “తనకంటే తెలివైన వారు ఎవరూ లేరననే గర్వంతో సహదేవుడు పడిపోయాడు అని బదులిచ్చాడు. తరువాత తనరూపంపై గర్వంతో నకులుడు కూడా పడిపోయాడు.

धर्मपरीक्षा Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

అటుపిమ్మట “నేను ఒక్కరోజులోనే శత్రువులందరినీ అంతం చేస్తాను” అని ప్రగల్భాలు పలికిన అర్జునుడు కూడా కింద పడిపోయాడు. చివరగా భీముడు పడిపోతూ ‘ఆర్య ! ఏ దోషం వలన నేను పడిపోతున్నాను ? అని అడుగగా, ధర్మరాజు “భీమా ! నీవు విపరీతంగా భోజనం చేసేవాడివి (అతి భోజనం) మరియు నీ బలాన్ని ఇతరులకు ప్రదర్శించేవాడివి. అదే నీ పతనానికి కారణం” అని చెప్పాడు.

అందరూ పడిపోయినా, ధర్మరాజు మాత్రం చలించకుండా ముందుకు సాగాడు. అతనిని కేవలం ఒక కుక్క మాత్రమే అనుసరించింది. అప్పుడు దేవేంద్రుడు ఒక దివ్య విమానంతో ప్రత్యక్షమై, “రాజా ! నీవు సశరీరంగా స్వర్గానికి రావడానికి అర్హుడవు. నీ పుణ్యకార్యాల వల్ల నేను సంతోషించాను. ఈ విమానం ఎక్కు అని పలికాడు.”

While they were proceeding, Draupadi fell on the path. Seeing her fallen, Bhima asked Yudhishthira, ‘O Noble Brother ! By what act (sin) did the poor Draupadi fall on the earth ? “Yudhishthira replied, ‘O Brother! Though she and Five husbands, she was especially partial toward Dhananjaya (Arjuna). That was her flaw.

As they continued, Sahadeva fell, Yudhishthira explained that it was because he considered himself the most learned. Then Nakula fell due to his pride in his physical beauty. When Arjuna fell, the reason given was his unfulfilled boast that he would destroy all his enemies in a single day.

Finally, Bhima himself fell and asked ‘O Master! By what fault did I fall ? Yudhishthira replied, ‘O Bhima! you were a glutton (ate excessively) and you used to boast about your strength without regard for other. That is the reason for your fall.

Yudhishthira continued the journey alone, followed only by a dog. Then Lord Indra (Shakra) appeared before him a divine Chariot and said, ‘O King! you are worthy of reaching the heavens in this very body. I am pleased with your righteous deeds, mount this chariot. I have come to take you to the world of the immortals.”

स तु साञ्जलिः प्रणम्य तं प्रत्याह “भगवन् । यदि मयि भवान् प्रीतस्तर्हि मम भ्रातृभिर्भार्यया च सहैव मम स्वर्गे वासोऽस्तु । न ह्येकप्राणानेकार्थांश्च तान्विहाय स्वसुखमभिलषति मे चेतः । तैः सहैव स्वर्गो नरको वा अविभज्य भोक्तव्य इति मे निश्चयः । अतः प्रसीद” इति । तच्छ्रुत्वा मघवा प्रत्याह ” ननु राजन् ! पूर्वमेव गता हि ते भ्रातरो भार्या च स्वर्गम् । तव गुणैः प्रीणितोऽहं सशरीरं त्वां नेतुमाशंसे । अतो निःशङ्कमारोहेदं विमानम्” इति । एवं प्रोत्साहितोऽपि स पुनरसम्भ्रान्तः प्राह – “भगवन् ! भवति प्रसन्ने किमस्माकमलभ्यम् । किं तु अयं श्वा विषमेष्वपि मां न जहाति । आश्रितत्यागी नारकी स्यादिति न खलु भवद्भ्योऽपि मादृशेन निवेद्यम् । तत्प्रसीदन्तु भवन्तः शुना प्रसितचित्ते मयि’ इति । एवं सप्रश्रयं तेन याचितः शतक्रतुः प्रत्यूचे “ननु राजन् ! धर्मज्ञस्य तवापि कथमयं दुरभिनिवेशः ।

किं न विदितं त्वया श्ववतां स्वर्गद्वारं संवृतमिति । तदलमस्मिन् गतिबन्धिन्यभिमानेन एनं परिहृत्य स्वैरं स्वर्गमाप्नुहि” इति । एवं बहुविधैरपि वाक्यैः स्वाश्रितत्यागेन स्वसुखमनभिनन्दति तस्मिन् धर्मसुते तच्छवरूपं परित्यज्य स्वरूपं गृह्णन् धर्मराजः सादरं तमाह ” वत्स ! युधिष्ठिर ! अहं नाम तव पिता, त्वत्परीक्षार्थं श्वरूपेण त्वामन्वसरम् । मघोनि प्रसन्नोऽपि स्वाश्रिते शुनि प्रसक्तेन त्वया दर्शिता धर्मपरता । पूर्वं च वने मया परीक्षितस्त्वं समवर्तित्वं प्रकाशयन् मदंशत्वं व्याकरोः । यत्प्रियतरौ भीमार्जुनौ विहाय मातुः सपत्न्या अपि निवापलोपाभावाय माद्रेयस्य जीवितमवृणीथाः तद्विस्रब्धो भव” इति वदंस्तं तद्विमानमारोपयामास । तेन विमानेनोर्ध्वं नीयमानो राजा युधिष्ठिरः भास्वरां मनसाप्यचिन्त्यवैभवाममरावतीं नाम देवराज राजधानीमीक्षांचक्रे ।

ధర్మరాజు దోసిలి జోడించి నమస్కరిస్తూ ఇలా బదులిచ్చాడు. భగవంతుడా ! నాపై మీకు నిజంగా అనుగ్రహం ఉంటే నా సోదరులు మరియు నా భార్యతో (ద్రౌపది) కలిసే నాకు స్వర్గవాసం లభించాలి.

“ప్రాణసమానులైన వారిని వదిలి, ఒంటరిగా సుఖపడాలనే కోరిక తన మనసులో లేదని ధర్మరాజు పేర్కొన్నాడు. “నాకు ఒక్కడికే స్వర్గ సుఖాలు వద్దు. వారు ఎక్కడ ఉంటే (స్వర్గం లేదా నరకం) నేను కూడా వారితో పాటే ఉండి, ఆ ఫలితాన్ని పంచుకుంటాను”

“కావున నాయందు ప్రసన్నుడవు కావాలి.” అని ధర్మరాజు అన్నాడు.

He (Yudhishthira), with folded hands, prostrated and replied – ‘O Lord! if you are pleased with me, then let my stay in heaven be only along with my brothers and my wife”.

“For my heart does not desire its own happiness by abandoning them, who are like my very own breath and have shared the same goals as mine”.

It is my firm resolve that whether it be heaven or hell, it must be shared and experienced only also along with them (my brothers and wife). This is my firm decision. Therefore, be gracious.

అది విని ఇంద్రుడు (మాఘవ) ఇలా బదులిచ్చాడు. ఓ రాజా ! నీ సోదరులు మరియు భార్య ఇప్పటికే స్వర్గానికి చేరుకున్నారు.

Hearing that, Indra (Maghava) said “Oking ! your brothers and wife have indeed already reached heaven before you.”

“నీ సద్గుణాలకు సంతసించి, నిన్ను శరీరంతో సహా (సశరీరంగా) తీసుకువెళ్ళడానికి నేను వచ్చాను.”

Pleased by your virtues, “I have come to take you to heaven with your physical body (in your mortal form).

కాబట్టి, ఎటువంటి సందేహం లేకుండా ఈ విమానం ఎక్కు” అని అన్నాడు.
“Therefore, ascend this divene chariot without any hesitation.”

(अतोनिः शड्कमारोहेदं विमानम्” इति )
(एवं प्रोत्सहितोऽपि ………..)

“ఈ విధంగా (ఇంద్రుడి చేత) (ప్రోత్సహింపబడినప్పటికీ, అతడు (ధర్మరాజు, ఏ మాత్రం తడబాటు లేకుండా ప్రశాంతంగా ఇలా అన్నాడు. ‘భగవంతుడా ! మీరు ప్రసన్నులైతే మాకు లభించనిది ఏముంటుంది ? (అంటే అంతా సాధ్యమేనని అని అర్ధం). ”

“Even though he was encouraged in this manner (by indra), he (Yudhishthira) spoke again without any confusion and with composure ‘O Lord ! when you are pleased. what is unattainable for us ?”

“కానీ, ఈ కుక్క క్లిష్ట పరిస్థితుల్లో (కష్ట కాలంలో) కూడా నన్ను వదిలిపెట్టలేదు !”

But this dog has not abandoned me even in difficult times (or adversities)!”

ఆశ్రయించిన వారిని వదిలిపెట్టేవాడు నరకానికి వెళ్తాడు అని నావంటి వాడు మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా !”

It is certainly not for someone like me to tell you that one who abandons a dependent is destined for hell.”

కావున, ఈ కుక్కతో కలిసి ఇక్కడే నిలిచి ఉన్న నాపై తమరు అనుగ్రహం చూపవలసిందిగా ప్రార్ధిస్తున్నాను.

Therefore, please be gracious toward me, who stands here accompanied by this dog”.

“ఈ విధంగా అతను (ధర్మరాజు) ఎంతో వినయంగా వేడుకోగా, శతక్రతువు (నూరు యజ్ఞాలు చేసిన దేవేంద్రుడు) ఇలా బదులిచ్చాడు ‘ ఓ రాజా ! ధర్మం తెలిసిన వాడయ్యుండి కూడా నీకు ఈ మొండి పట్టుదల ఏమిటి ?”

धर्मपरीक्षा Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

“When he (Yudhishthira) entreated thus with great humility. Indra (Shatakrutu) replied – ‘O king! Being a knower of Dharma yourself, why do you have such a stubborn obsession (or misguided persistence) ?” (about the dog ?)

స్వర్గ ద్వారాలు (కుక్కలకు) మూసివేయబడతాయని నీకు తెలియదా ?

It is known to you that the gates of heaven are closed (for dogs)?”

కాబట్టి నీ ప్రయాణానికి ఆటంకం కలిగిస్తున్న ఈ పట్టుదలను వదిలి, దీనిని ఇక్కడే విడిచిపెట్టి స్వేచ్ఛగా స్వర్గానికి చేరుకో”.

Therefore, enough with this pridel stubbornness that is obstructing your path, abandon it and attain heaven freely.”

ఈ విధంగా రకరకాలుగా చెప్పినప్పటికీ ధర్మరాజు చలించలేదు. అప్పుడు కుక్క రూపంలో ఉన్న నీ తండ్రి (యమధర్మరాజు) – “ఓయీ ! నేను నీ తండ్రిని, నిన్ను పరీక్షించడానికి కుక్క రూపంలో నీ వెంట వచ్చాను.”

Despite being told in various ways, Yudhishthira did not waver. Then (the dog revealed)” O ! I am indeed your father (Dharma Deva) I followed you in the form of a dog to test you.”

నీవు నిన్ను ఆశ్రయించిన కుక్క పట్ల చూపిన ఈ అనురాగం, నీ ధర్మనిరతిని చాటిచెప్పింది. నేను నీ పట్ల ఎంతో ప్రసన్నుడనయ్యాను.”

Your devotion to Dharma, shown through your attachment to the dog that sought refuge in you, has been witnessed by me. I am very pleased with you.”

గతంలో అడవిలో (యక్ష ప్రశ్నల సమయంలో) కూడా నిన్ను పరీక్షించినప్పుడు, నీవు నీ సమభావంతో నా దగ్గర ధర్మాన్ని నిరూపించుకున్నావు.”

Previously in the forest as well, when tested by me, you demonstrated your impartiality/equanimity in my presence.”

“నాడు నీవు నీతోడబుట్టిన భీమార్జులను వదిలి, నీ సవతి తల్లి (మాద్రి) పుత్రుడైన నకులుడికి ప్రాణభిక్ష కోరి నీ ధర్మాన్ని చాటుకున్నావు.”

Where-in, leaving aside Bhima and Arjuna, you chose the life of Madri’s son (Nakula) so that your stepmother would also have a descendant to offer oblations.

నీవు ఎప్పటికీ ఇలాగే ధర్మ బద్ధుడవై ఉండు” అని దీవిస్తూ, ఇంద్రుడు అతడిని విమానం ఎక్కించుకున్నాడు.

Saying “Be like that always (righteous)”, he was made to mount that celestial chariot.

तेन विमानेनोर्ध्वं नीयमानो राजा युधिष्ठिरः भास्वरां मनसाप्य चिन्त्यवैभवाममरावतीं नाम देवराजराजधानीमीक्षांचक्रे ।

ఆ విమానం పైపైకి వెళ్తూ, ధర్మరాజు మనసులో కూడా ఊహించలేనంత వైభవం కలిగిన అమరావతి అనే దేవరాజధానిని (ఇంద్రుడి నగరాన్ని) చూశాడు.

While being carried up wards by that chariot, king Yudhishthira beheld the capital of the king of gods called Amaravathi, which possessed a splendor inconceivable even to the mind.

प्रविशंश्च स तां पुरीं तत्र देवैः सभाज्यमानं वरासनस्थं साक्षादिव वासवं तं दुर्योधनं दृष्ट्वा स्वांश्च कर्णभीमादीन् दृष्ट्वा, सामर्षं प्रतिनिवर्तमानः सन्, पथि सङ्गतेन नारदेन ‘भोः । किमिति विमना इव भासि ।

ఆ నగరంలోకి ప్రవేశిస్తూ (అమరావతి), అక్కడ దేవతలందరిచే గౌరవింప బడుతూ, శ్రేష్ఠమైన సింహాసనం పై సాక్షాత్తు ఇంద్రుడిలా కూర్చుని ఉన్న దుర్యోధనుడిని చూసి ….

While entering that city (Amaravathi) having seen Duryodhana seated on a grand throne like Indra himself, being honored by the gods ….

తన వారైన కర్ణుడు, భీముడు మొదలైన వారిని అక్కడ చూడకపోవడంతో కోపంతో వెను దిరుగుతుండగా మార్గం మధ్యలో నారదుడు కలిసి “ఓయీ! ఎందుకు మనస్తాపం చెందిన వానిలా కనిపిస్తున్నావు ? అని అడిగాడు.

and not seeing his own people like Karna, Bhima and other, as he was returning with indignation (anger) he was addressed by Narada, who met him on the way – “O! why do you appears as it your mind is troubled ?”

कुतो वा वरासन मनादृत्य …………….

ఎక్కడి నుండి ఈ శ్రేష్ఠమైన ఆసనాన్ని పొందావు ? (లేదా దుర్యోధనుడికి ఈ ఉన్నత స్థానం ఎలా దక్కిందని ధర్మరాజు ఆలోచించడం)

From where did you get this grand seat?” (Referring to the elevated position/ status).

प्रतिनिवर्तसे इति पृष्टः प्राह – “भगवन् । नाहमेतेन दुरात्मना धार्तराष्ट्रेण सह वस्तुमुत्सुकोऽस्मि ” इति । ” ननु राजर्षे ! कथं स्वर्गेऽपि ज्ञातेयं पुरस्कृत्य धार्तराष्ट्रेण वैरायसे । तदलमसूयया । निःसापत्न्येन भोगान् भुङ्क्ष्व” इति तेन मुनिनोक्ते स राजा पुनरपि तमब्रवीत् “ननु भगवन् ! यद्यधर्मैकरतेरस्याप्ययं लोकः, तदा क्व मे धर्मनित्या भ्रातरः । तेषु न कोऽपीह दृश्यते । क्व ते स्थिताः । तान्दिदृक्षे” इति ।

“ఎందుకు వెనుదిరుగుతున్నావు.” అని అడిగిన నారదుడితో ధర్మ ఇలా అన్నాడు. – “భగవంతుడా ! దుర్మార్గుడైన ఈ ధృతరాష్ట్ర కుమారుడితో (దుర్యోధనుడితో కలిసి నివసించడానికి నేను ఇష్టపడటం లేదు.

Asked why he was returning, he said “O Lord! I do not wish to dwell together with this evil – minded son of Dhritarashra (Duryodhana).”

“వీడి వల్లనే కదా మేము భరించలేనన్ని కష్టాలను అనుభవించాము !”

For it was because of him that we endured unbearable sufferings”.

ఓ భగవంతుడా (ఇంద్ర దేవా !) అధర్మంలోనే నిమగ్నమై ఉండేవాడు (దుర్యోధనుడు) కూడా ఈ లోకానికి (స్వర్గానికి) రాగలిగితే, మరి ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా జీవించిన నా సోదరులు ఎక్కడ ఉన్నారు ? వారిలో ఒక్కరు కూడా ఇక్కడ కనిపించడం లేదే ! వారు ఎక్కడ ఉన్నారు ? నేను వారిని చూడాలనుకుంటున్నాను.”

“O Lord ! If this world (Heaven) belongs even to the one who was solely devoted to unrighteousness (Duryodhana), then where are my brothers who were always committed to Dharma? Not one of them is seen here. Where are they staying ? I wish to see them”.

“भो राजन् ! यदि त्वं स्ववर्ग्यान्द्रष्टुकामोऽसि, तदेहि, दर्शयामि तत्स्थानं” इति पुरोगामिनि देवदूते तमनुगच्छन् स युधिष्ठिरस्तमोजर्ज रिततया निरालोके कण्टकशर्करातप्तवालुकाप्राये सर्वतो विसर्पिकृमिकीट सरीसृपाक्रान्ततले दंशमशकसरघादिभिर्नीरन्ध्रीकृते पथि कृतपदः, पूतिगन्धिमनाघ्रेयं दुःसहं गन्धवहं जिघ्रन्, अश्राव्याण्यसौम्यानां खगमृगाणां तुमुलानि वाशितान्याकर्णयन्, अस्पृश्यानि मांसशोणितानि पथि चितानि पद्भ्यां स्पृशन्, पदे पदे जुगुप्समानः ” नाहमत्र गन्तुमुत्सहे ।’ इति निववृते । निवर्तमानश्च सः “राजन् युधिष्ठिर ! मुहूर्तमत्रैव तिष्ठ । त्वदागमनेन सुरभिगन्धिर्गन्धवहो वहति । वयं च वीतयातनाः स्मः |

ఓ రాజా ! ఒక వేళ నీవు నీ కర్మానుసారం పొందిన లోకాలను చూడాలనుకుంటే, ఇవే నీవు చూడవలసిన ప్రదేశాలు “అని ముందు వెళ్తున్న దేవదూతను అనుసరిస్తూ………………..

“O King! If you desire to see the world attained through your own deeds, the be holds these places of yours “following the celestial – messenger who was leading the way……..

ఆ ధర్మరాజు చీకటితో నిండిన, వెలుతురు లేని, ముళ్ళతోనూ, ఇసుకతోనూ నిండిన, అన్ని వైపులా పురుగులు మరియు సరీసృపాలు (పాములు వంటివి) తిరుగుతున్న నరకలోకాన్ని చూశాడు.

That Yudhishthira beheld the hellish world enveloped in darkness, lightless, filled with thorns and sand, and infested every where with crawing insects and reptiles…….

దోమలు, పాములు వంటి వాటితో పీడించబడుతూ, నరకయాతనలు అనుభ విస్తున్న వారి మధ్య ప్రయాణిస్తూ, భరించలేని దుర్వాసన పీలుస్తూ (ముందుకు సాగాడు).

Inhaling the unbearable stench while walking on a path where people were tormented by mosquitoes and reptiles, suffering terrible agonies ……

శరీరాలు లేని పక్షులు, జంతువుల భయంకరమైన అరుపులను వింటూ, దారి పొడవునా పడి ఉన్న మాంసాన్ని, నెత్తురును తన పాదాలతో తాకుతూ (వెళ్లాడు).

Hearing the tumultous and pitiless cries of bodiless birds and beasts, and touching with his feet the flesh and blood scattered along the path.

అసహ్యించుకుంటూ (విసుగు చెందుతూ) “నేను ఇక్కడ ఉండలేను (ముందకు వెళ్ళలేను)” అని వెనుదిరగసాగాడు.

Being disgusted, he returned back saying, “I do not wish to go further here.”

निवर्तमानश्च सः ……………….त्वदागमनेन सुरभिगन्धिर्गन्धवहो वहति । वयं च वीतयातनाः स्मः ।

వెనుదిరుగుతున్న ధర్మరాజుతో అక్కడి వారు రాజా ! యుధిష్ఠరా ! ఒక్క క్షణం ఇక్కడే ఉండు. నీవు రావడం వల్ల ఇక్కడ సుగంధం వెదజల్లుతోంది, మరియు మా బాధలన్నీ తొలగిపోయాయి.

To him who was turning back, they said – “O king Yudhishthira! stay for just a moment. Due to your arrival, a fragrant breeze is blowing, and we are freed from our torments.”

धर्मपरीक्षा Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

“दुःखिषु करुणा हि महतां शैली” इत्युच्चैराक्रन्दितं शुश्राव । तच्छ्रवणेनैव रश्मिषु गृहीत इव सपदि जडीभूतस्तिष्ठन्, प्रसक्ताश्रुः सन्ननुभूतपूर्वमपि तत्स्वरं स्वयमप्रत्यभिजानानः स राजा ” के यूयं ? का युष्माकमार्तिः ? कथं वा मया युष्माकं प्रतिकर्तव्यम् ?” इति तान् पप्रच्छ । ‘“भो राजन् । कथमस्मान्न प्रतिपद्यसे ?” “कर्णोऽहं”, “भीमोऽहं “, “अर्जुनोऽहं” “इत्यादि स्वं स्वं नामोद्घोष्य ” पाह्यस्मान्निरयनिमग्नान्” इत्याक्रोशत्सु तेषु, मुक्तकण्ठं रुदन् स राजा धर्मपुत्रः “कथं युष्माकमपीयं दशा । धिग्दैवमसमीक्ष्यकारि !’ इति गर्हयन्, “नाहमिदमवस्थान् भ्रतॄन् भार्यां चोपेक्ष्य सुखीयामि । तद्गम्यताम्’ इति देवदूतं विसृज्य तेषां हितकाङ्क्षी तत्रैव तस्थौ ।

“దుఃఖంలో ఉన్న వారిపై కరుణ చూపడమే మహాత్ములకు శ్రేయస్కరం” అని గట్టిగా ఏడుస్తూ మొరపెట్టుకుంటున్న అరుపులను ధర్మరాజు విన్నాడు.

He heard loud cries saying, “Compassion towards those in distress is indeed the greatest virtue or noble souls.”

అది విన్న ధర్మరాజు నిశ్చేష్టుడై (స్తంభించి పోయి) నిలబడ్డాడు. మళ్ళీ ఆ రాజు, (ధర్మరాజు) ఇలా పలుకుతున్నాడు – ” మీరు ఎవరు ? ఎందుకు ఇలా ఉన్నారు ? మీకు నేను చేయవలసిన సహాయం ఏమిటి ?” అని వారిని అడిగాడు.

Upon hearing that, the king stood as if frozen/paralyzed. He then asked them, “Who are you ? Why are you here ? What service can I do for you?”

“ఓ రాజా ! మమ్మల్ని ఎందుకు వదిలి వెళ్తున్నావు ? అంటూ నేను కర్ణుడిని, నేను భీముడిని, నేను అర్జునుడి- ని” అని ఎవరి పేర్లు వారు చెప్పుకుంటూ, మమ్మల్ని ఈ నరక కూపం నుండి కాపాడు” అని వారు రోదించగా ….

“O king! why are you leaving us? thus crying out, each identifying themselves – “I am Karna,” “I am Bhima,” “I am Arjuna” – and pleading, “save us from this fall into hell”!……..

అది విన్న ధర్మరాజు (ధర్మపుత్రుడు) గొంతు ఎత్తి ఏడుస్తూ “మీకు ఇలాంటి స్థితి కలగడం ఏమిటి ? ఆలోచించకుండా ఇలా చేసిన ఆ దైవానికి ధిక్కారం!” అని నిందిస్తూ…………….

That king, the son of Dharma, weeping aloud, lamented, “How has such a state befallen you? Fie upon the God who acts without discernment !” thus censuring (fate ) ……………

“नाहमिदमवस्थान् भ्रातॄन् भार्यां चोपेक्ष्य सुखीयामि । तद्गम्यताम्” इति । देवदूतं विसृज्य तेषां हितकाङ्क्षी तत्रैव तस्थौ ।

నా సోదరులను, భార్యను ఇలాంటి స్థితిలో వదిలి నేను ఒంటరిగా ఉండలేను.” అని చెప్పి, ఆ దేవదూతను పంపించి వేసి, వారి క్షేమాన్ని కోరుతూ అక్కడే ఉండిపోయాడు.

“I will not leave this place to be happy alone, abandoning my brothers and wife,” saying this, he dismisied the messenger and stayed right there, wishing for their welfare.

ततो निमेषमात्रेण प्रकाशीभूतास्वाशासु, सर्वतस्तिरोहितेष्वमङ्गलेषु, प्रादुर्भूतेषु च सर्वेषु दिव्यमङ्गलवस्तुषु, वसुभीरुद्रैरादित्यैर्मरुद्भिरन्यैश्चदेवैर्मुनिभिः सिद्धैश्चरणैर्यक्षैर्विद्या धरैर्गन्धर्वैरप्स – रोभिरितरैर्दिक्पालैश्च परिवृतः सहस्राक्षः सहस्त्रधुर्येण ज्योतिर्मयेन विमानेन तत्राविर्भवन्, युधिष्ठिरमामन्त्र्य तारस्वरेणा बभाषे – भो राजन्नजातशत्रो ! पाण्डव ! सर्वैरपि राजभिरवश्यं नरको द्रष्टव्यः । अस्त्वं दर्शितोऽसि । किञ्च द्वाविह राशी सुकृतं दुष्कृतं च, फलमपि स्वर्गो नरकश्च । तयोर्यल्लघुभोगेन क्षय्यं तत्प्रथमतरं भुज्यते । अत एवाद्य तव नरकदर्शनं, त्वद्भ्रातॄणां तदनुभवः, त्वद्भ्रातृव्यस्य दुर्योधनस्य स्वर्गप्राप्तिश्चेत्यवधेहि । अपरं च । आचार्य द्रोणमवसाने च्छलेन किल त्वमुपाचीर्णवानसि । अत एव त्वं च छलेन निरयं दर्शितोऽसि । तदस्यां स्नात्वा, तेन धूतमानुषभावो राजसूयेनाश्वमेधैरन्यैश्च पुण्यैरार्जितान् लोकान् स्वैर्वग्यैः समं कामं भुङ्क्ष्व इति । तद्वाक्यान्ते धर्मराजोऽपि प्राह ‘वत्स । एषा तृतीया परीक्षा । त्वया पुत्रेण पुत्रवानस्मि ।

ఆ తర్వాత రెప్పపాటు కాలంలోనే దిక్కులన్నీ ప్రకాశవంతమయ్యాయి. అరిష్టాలన్నీ (నరక దృశ్యాలు) మాయమైపోయాయి. మరియు అన్నివైపులా మంగళకరమైన (అన్ని) దివ్య వస్తువులు ప్రత్యక్షమయ్యాయి.

Then, in the blink of an eyes, all directions became illuminated, all inauspicious things vanished and all divine auspicious objectes appeared.

వసువులు, రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు అశ్విని దేవతలు, సిద్ధులు, గంధర్వులు, కిన్నెరులు, విద్యాధరులు, అప్సరసలు మరియు దిక్పాలకులతో పరివేష్ఠితుడై దేవేంద్రుడు వేల ధ్వజాలు కలిగిన జ్యోతిర్మయమైన విమానం పై అక్కడ ప్రత్యక్షమయ్యాడు.

“Surrounded by Vasus, Rudras, Adityas, Maruts, Ashvins, celestial sages, Siddhas, Gandharvas, Kinnara, Vidyadharas, Apsaras and the guardians of directions, Indra (the thousandeyed one) appeared there in a radiant chariot adorned with a thousand banners”.

యుధిష్టరుడిని సంబోధిస్తూ గంభీర స్వరంతో ఇలా అన్నాడు – “ఓ అజాత శత్రువైన రాజా ! పాండవా ! రాజర్షులందరూ ఏదో ఒక సమయంలో నరకాన్ని చూడవలసి ఉంటుంది. (నియమం), అందుకే నీకు ఈ నరక దర్శనం కలిగింది.”

addressing Yudhishthira, he spoke in a loud voice – “O King Ajatashatru! ‘O Pandava ! All royal sages must witness hell once, therefore, it was shown to you.”

పుణ్యపాపాలు అనేవి రెండు రాశులు (రాశులుగా ఉంటాయి). వాటి ఫలితాలు స్వర్గ – నరకాలు. ఏ ఫలితం తక్కువగా ఉంటే దానిని మొదట అనుభవించడం ఆనవాయితీ”.

“In the dual accumulation of good and bad deeds, the fruits are heaven and hell. Whichever fruit is lesser is enjoyed / suffered first to clear its account.”

అందుకే నీకు ఈ నరక దర్శనం కలిగింది అశ్వత్థామ మరణం విషయంలో నీవు ఆడిన చిన్న అబద్ధం (కపటం) వల్ల నీకు మరియు నీ సోదరులకు ఈ నరక భ్రాంతిని చూపించాము.

Hence this vision of hell for you,”your brothers experienced it too because you were shown hell through a deception (referring to the half- truth told about Ashwatthama).”

కాబట్టి ఇక్కడ ఉన్న గంగానదిలో స్నానం చేసి నీ మానుష భావాలను (దేహాన్ని) వదిలి, రాజసూయ, అశ్వమేధ యాగాల ద్వారా నీవు సంపాదించుకున్న పుణ్యలోకాలను నీ సోదరులతో కలిసి స్వేచ్ఛగా అనుభవించు”.

Therefore, bathe here, wash away your human form, and along with you kin, freely enjoy the worlds earned by the merits of your Raj’ asuya and Ashvamedha sacrifices.

ఆ మాటలు విన్న ధర్మరాజు ఇలా అన్నాడు. “వత్సా ! ఇది నీ మూడవ పరీక్ష. నీ వంటి పుత్రుడు ఉండటం వల్ల నేను ధన్యుడను.” (ఇక్కడ యమధర్మరాజు తాను తండ్రిగా ధర్మరాజు ను మెచ్చుకుంటాడు.)

Hearing those words Yama (the lord of Dharma) said – “O dear child! This was your third test. Having a son like you, I have truly become a father who possesses a worthy son.”

धर्मपरीक्षा Questions and Answers Summary Inter 2nd Year Sanskrit

यत्स्वसुखनिरपेक्षतया स्वाश्रितेषु प्रसितेन त्वया धर्ममयत्वं दर्शितम् । सर्वात्मना श्लाघ्योऽसि’ इति तमालिङ्ग्य प्रशशंस । इत्थं त्रिदशनाथैरनुमोदितः स राजा पाण्डवो युधिष्ठिरः पञ्चभिर्भ्रातृभिर्भार्यया च सह दिव्यानक्षय्यांश्च भोगान् भुञ्जानः सुखमासांचक्रे ।

యమధర్మరాజు ధర్మరాజును మెచ్చుకుంటూ నీవు స్వసుఖాన్ని కూడా లెక్కచేయకుండా ఆశ్రితుల పట్ల చూపిన కరుణ నీ ధర్మాన్ని చాటిచెప్పింది. నీవు అజేయుడివి’ అని ఆశీర్వదించాడు. ఆ తర్వాత ధర్మరాజు తన సోదరులు మరియు ద్రౌపదితో కలిసి స్వర్గసుఖాలను అనుభవించాడు.

The God of Justice (Dharma Deva) praised him, saying – your selfless nature and the compassion you showed towards those who sought refuge in you, even at the cost of your own happiness, has demonstrated your true righteousness. You are indeed invincible. “Thus honored by the gods, king Yudhishthira, along with his five brothers and Draupadi, began to enjoy the divine pleasures of heaven.

Leave a Comment