Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Sanskrit Study Material Pdf गद्यभागः 2nd Lesson दयावीरो विक्रमः Questions and Answers Summary.
Inter 2nd Year Sanskrit दयावीरो विक्रमः Questions and Answers
अभ्यासः
1. निबन्धप्रश्नौ
१. ‘दयावीरो विक्रमः’ इति पाठ्यभाग सारांशं लिखत ।
‘దయావీరో విక్రమః’ పాఠ్యభాగ సారాంశాన్ని వ్రాయండి.
Write the summary of ‘Dayaveero Vikramah’ ?
२. विक्रमस्य दयावीरत्वं विवृणुत ।
విక్రమార్కుని దయావీరత్వాన్ని వివరించండి.
Describe how king Vikramaditya proved himself to be a ‘Dayaveera’ in the lesson”.
(Explain the heroic compassion of king Vikramaditya. (देयावीरो विक्रमः)
जवाब:
कविपरिचयः – “दयावीरोविक्रमः” इति पाठ्यभागः वररुचि विरचित् “सिंहासन द्वात्रिंशिका” इति कथासङ्ग्रहात् रक्षोभीतिवारणं नाम एकादशोध्यायात् स्वीकृतः ।
కవి పరిచయం : “దయావీరో విక్రమః” పాఠ్యభాగము వరరుచి చే రచించబడిన “సింహాసనద్వాత్రింశికా” అనే పేరు గల కథాకావ్యము నందలి 11వ అధ్యాయంలోని “రాక్షసభీతివారణం” అనెడి కథ నుండి గ్రహింపబడినది. ప్రాకృతభాషలో రచించబడిన ప్రాకృతప్రకాశమును మొట్టమొదటి వ్యాకరణగ్రంథాన్ని వరరుచియే రచించెనని పండితుల అభిప్రాయము. విక్రమాదిత్యుని ఆస్థానంలో ‘నవరత్నాలు’ అనెడి పేరుతో కవిపండితు లుండేవారు. వారిలో వరరుచి కూడా ఒకరని ప్రతీతి.
పాఠ్యభాగ నేపథ్య / ఇతివృత్తం:- విక్రమార్క చక్రవర్తి మరణించిన తరువాత, అతని దివ్య సింహాసనం భూస్థాపితం అవుతుంది. అనేక సంవత్సరాల తర్వాత భోజరాజు ఆ సింహాసనాన్ని కనుగొంటాడు.
భోజరాజు సింహాసనాన్ని అధిష్ఠించడానికి ప్రయత్నించిన ప్రతీసారీ, దానికి ఉన్న 32 సాలభంజికలు ఒక్కొక్కటిగా విక్రమార్కుని గొప్పతనాన్ని వివరించే కథలను చెబుతాయి.
తన స్వంత సుఖాలను, చివరికి ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఇతరుల కష్టాలను తీర్చడమే ఉత్తమమైన మానవ లక్షణమని విక్రమార్కుని పాత్రద్వారా ఈ కథనందు నిరూపించబడినది.
ఒక బ్రాహ్మణ కుటుంబం పడుతున్న ఆవేదనను చూసి చలించిపోయి, ఆ బ్రాహ్మణుని ఏకైక పుత్రుడిని కాపాడటానికి రాజు స్వయంగా రాక్షసుడికి ఆహారంగా వెళ్ళడం ఈ కథనందలి నేపథ్యం.
కేవలం యుద్ధాలతోనే కాకుండా, ప్రేమానురాగాలతో మరియు త్యాగాలతో శత్రువుల మనస్సును కూడా మార్చవచ్చని ఈ ఇతివృత్తం చెబుతుంది. విక్రమార్కుని త్యాగానికి చలించిపోయిన రాక్షసుడు, సజ్జనుడిగా మారి అహింసాధర్మాన్ని, బోధించడం ఈ కథనందలి విశేషం.
లోక కళ్యాణం కోసం పాలకుడు తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించాలి అనే ఉన్నతమైన ఆశయం ఈ పాఠం యొక్క ఇతివృత్తం. అటువంటి ఉన్నతాశయము గల విక్రమార్కుడి సాహసం, దయ మరియు పరోపకార గుణం వంటి గుణాలు ఎవరికి ఉంటాయో వారే ఈ సింహాసనాన్ని అధిష్ఠించడానికి అర్హులు అని భోజరాజుకు హితబోధ చేయడం ఈ కథల · ప్రధాన ఉద్దేశం.
ప్రస్తుత పాఠ్యభాగ వివరణ (సారాంశము) :
కథా ప్రారంభం : అప్పుడు భోజరాజు సింహాసనాన్ని అధిష్ఠించుటకు సిద్ధపడుచుండగా సింహాసనంపై గల మరొక సాలభంజిక ఈ విధంగా పలికెను.
ఓ రాజా ! విను, విక్రమార్క మహారాజు వంటి రాజు మరొకరు లేరు. ఆయన తనదగ్గరకు వచ్చిన అర్ధులకు ఆశ్రయమిచ్చి, వారు కోరినవన్నీ ఇచ్చి, ధన్యులను చేసేవాడు. అందుకే …………….. “ఆజ్ఞా మాత్రా ఫలం రాజ్యం” ………….. దత్తభుక్త ఫలం ధనమ్ ॥ అంటారు.
ఒకప్పుడు విక్రమార్కుడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి తాను స్వయంగా ఒక యోగి వేషంలో దేశాటనకు బయలుదేరాడు. ఎక్కడ చూసినా ఆయనకు ఆశ్చర్యకరమైన విషయాలే కనిపించేవి. అలా తిరుగుతూ ఒకరోజు సూర్యాస్తమయం సమయంలో ఒక పెద్ద అడవిలో ప్రవేశించాడు. సూర్యాస్తమయం కావడంతో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. ఆ చెట్టుపైన చిరంజీవి అనే వృద్ధ పక్షిరాజు ఉండేవాడు. అతని పిల్లలు, మనుమలు ఆహారం సంపాదించుకుని తిరిగి వచ్చేటప్పుడు తమ తండ్రి (పక్షిరాజు) కోసం పండ్లు తీసుకువచ్చి ఇచ్చేవారు.
అయితే …. ఆ రాత్రివేళ, చిరంజీవి (పక్షిరాజు) సుఖంగా కూర్చుని ఉన్న పక్షులను చూసి, ఈ విధంగా అడిగాడు. “చెట్టు మొదలున (చెట్టుక్రింద) కూర్చున్న రాజు కూడా ఈ మాటలను వింటున్నాడు. ఓ పుత్రులారా ! మీరు రకరకాల దేశాలు తిరుగుతున్నప్పుడు చూసిన వింతలేమిటి ?” అని అడగ్గా, అప్పుడు వాటిలో ఒక పక్షి తాను ఎలాంటి వింతలూ, చూడలేదని, కానీ తన మనస్సు చాలా దుఃఖంగా ఉందని చెబుతుంది. అప్పుడు చిరంజీవి, ఆ పక్షి దుఃఖానికి కారణాన్ని చెప్పమని అడిగాడు.
“కేవలం చెప్పడం వలన ఏమవుతుంది ?” అని పక్షి అడిగింది. “దుఃఖంలో ఉన్నవాడు తన మిత్రులకు ఆ బాధను చెప్పుకుంటే మనశ్శాంతిని పొందుతాడు.” అని పక్షిరాజు పలుకగా ఆ వాక్యం విని ఆ పక్షి తన దుఃఖానికి గల కారణాన్ని ఈ విధంగా వివరించింది.
బ్రాహ్మణుని ఆవేదన : ఓ తండ్రీ ! ఉత్తర దేశంలో ‘శౌవాల ఘోషో’ అనే పేరుగల పర్వతం దగ్గర పలాశ అనే నగరం ఉంది. ఆ పర్వతం దగ్గర నివసిస్తున్న రాక్షసుడు ఒకడు ప్రతిరోజు నగర సమీపానికి వచ్చి నగరంలోని ప్రజలను, పశువులను ఎత్తుకెళ్ళి భుజిస్తూ ఉండేవాడు. ఒకసారి నగరవాసులు అందరూ కలిసి వాడికి రోజుకు ఒకరు చొప్పున తామే ఆహారంగా వస్తామని చెప్పి వేడుకుంటారు. అందుకు వాడు సరేనన్నాడు. ఈ విధంగా రోజూ ఇంటికొకరు చొప్పున రాక్షసుడికి ఆహారంగా వెళుతున్నారు.
ఇప్పుడు పూర్వజన్మ స్నేహం వలన తనకు మిత్రుడైన ఒక బ్రాహ్మణుని వంతు వచ్చింది. అతనికి ఒక్కడే కొడుకు. వారి ఇంటి నుండి తండ్రి, కొడుకు, బ్రాహ్మణుడి భార్య ఎవరు వెళ్ళినా వారి కుటుంబానికి హాని చేకూరునని దుఃఖిస్తున్నారు. అందుకే తాను కూడా దుఃఖపడుతున్నానని పక్షి పక్షిరాజుకు వివరిస్తుంది.
అప్పుడు అక్కడున్న పక్షులు…. సుఖితే సుఖీ…. శశిన్యస్తమయతి సుక్షీణః అని పక్షి యొక్క స్నేహశీలతను ప్రశంసించాయి.
విక్రమార్కుని ఉదారత : ఈ విధంగా పక్షి చెప్పిన మాటలు విని, విద్వాంసుడైన ఆ విక్రమార్క మహారాజు ఆ నగరంలోని వధ్యశిల (బలిపీఠం) సమీపానికి వెళ్ళాడు. అక్కడ ఆ బ్రాహ్మణుని ఆవేదనను చూసి చలించిపోతాడు. “సజ్జనులు ఇతరుల కష్టాలను చూసి, దుఃఖిస్తారు. అని భావించి అతనికి ధైర్యం చెప్పి ఇంటికి పంపిచేశాడు. అటుపిమ్మట రాజు వధ్యశిల సమీపంలో ఉన్న సరస్సులో స్నానంచేసి, బలిపీఠం మీద కూర్చున్నాడు.
రాక్షసుని ఆశ్చర్యం : మరణాన్ని చూసి భయపడకుండా, నవ్వుతూ తన శరీరాన్ని ఆహారంగా తీసుకోమని కోరుతున్న విక్రమార్కుడిని చూసి రాక్షసుడు ఆశ్చర్యపోతాడు. రాజులోని దయావీరః (దయతో కూడిన వీరత్వం) గుణాన్ని చూసి రాక్షసుడి మనసు మారుతుంది. అతడిని ఆశ్రయించి ఉన్న క్రూరత్వం నశిస్తుంది. “తన సుఖాన్ని వదులుకొని ఇతరుల కోసం ప్రాణత్యాగం చేసే నీవంటివారి జీవితమే ధన్యం” అని రాక్షసుడు రాజును కొనియాడతాడు.
రాక్షసుని హితబోధ : రాక్షసుడు విక్రమార్కుని గొప్పతనాన్ని ప్రశంసిస్తూ “కేవలం తమ పొట్ట నింపుకోవడానికి పశువులు కూడా జీవిస్తాయి. కానీ ఇతరుల కోసం ప్రాణత్యాగం చేసే నీవంటి వారి జీవితమే ధన్యం అని రాక్షసుడు రాజుకు అహింసా ధర్మాన్ని వివరిస్తూ “మన ప్రాణాలు మనకు ఎంత తీపియో, సమస్త ప్రాణులకు వాటి ప్రాణాలు అంతే ప్రియమైనవి. కాబట్టి ఎవరికీ మృత్యు భయం కలిగించకూడదు,” అని చెబుతాడు.
ముగింపు : విక్రమార్కుని త్యాగానికి మెచ్చిన రాక్షసుడు అతన్ని వరాన్ని కోరుకోమంటాడు. రాజు పరోపకారార్ధం ఆ రోజు నుండి మనుష్యులను తినడం మానేయాలని రాక్షసుడిని కోరతాడు. రాక్షసుడు అందుకు అంగీకరిస్తాడు. ఆ విధంగా బ్రాహ్మణుడి ప్రాణాలను కాపాడిన విక్రమార్క మహారాజు తన నగరానికి తిరిగి వెళ్తాడు.
ఈ విధంగా కథను చెప్పిన సాలభంజిక భోజరాజుతో – విక్రమార్కుడికి గల ఔదార్యగుణం, దయాగుణం ఉంటే సింహాసనాన్ని అధిష్ఠించమని చెబుతుంది. అదివిని భోజరాజు మౌనంగా ఉండిపోతాడు.
పాఠ్యాంశ సందేశం : “త్యక్త్వాత్మాతీయ – సుఖదుఃఖేచ్చాం…. భవన్తి పరదుఃఖేన సాధవోత్యంత దుఃఖినః”
సజ్జనులు తమ సొంత సుఖాలను వదులుకుని, ఇతరుల బాధను తమ బాధగా భావించి సహాయం చేస్తారు.
![]()
Introduction: The lesson “Dayaveero Vikramah” fashч: is taken from the 11th story of (i) Simhasana Dwatrimsika also known as Vikrama Charitha written by the ancient scholar vararuchi. It illustrates the supreme selflessness of king Vikramaditya.
Context of the lesson: After the death of the legendry king Vikramaditya, his divine throne was buried under the earth, cen- turies later, king Bhoja discovered this throne.
Whenever king Bhoja tried to ascend the throne, one of the 32 statues carved on its steps would come to life. East statue narrated a story illustrating a specific virtue of Vikramaditya.
This specific lesson is one of those 32 stories. It describes an incident where Vikramaditya risked his own life to save a Bhraman’s (Brahmana’s) son from a demon Rakshasa.
The primary objective of these stories was to challenge king Bhoja. The statue told him, only a person who possesses the courage, compassion, and selflessness of Vikramaditya is worthy of sitting on this throne.”
Present story of the lesson :
The problem of ‘Palasanam’: Oneday, king Vikramaditya heard from a bird about the plight of people in the city of Palasanam. A cruel demon lived on a nearby mountain and was terrorizing the citizens. To protect his subjects the king immediately travelled to that city.
The Brahmin’s Dilemma: While in the city, the king encountered a Brahmin family crying in despair. He larned that the citizens has reached an agreement with the demon they would provide one human as food everyday to prevent mass slaugher. Thad day, it was the turn of the Brahmin’s only son. The Brahmin was heart-broken losing his son meant the end of his lineage.
The king’s ultimate sacrifice: Moved by the family’s grief, Vikramaditya decided to intervene. He told the Brahmin, “Noble people are those who treat the sorrow of others as their own”. He instructed the Brahmin to stay back and went to the mountain of offer himself as food to the demon in place of the boy.
The Demon’s Transformation: The demon was shocked to see a man approaching him wihtout any fear. Usually, people would tremble in his presence, but the king was smiling while offering his body witnessing this extraordinary ” (Heroic Mercy), the demon’s heart was moved. He realized that a person who sacrifices his own life for a stranger is a true saint.
The teaching of Non-violence (Ahimsa): The demon praised the king, saying that even animals live to fill their own stomachs, but only those who live for others are truly praise worthy. He preached that “Life is as dear to all creatures as it is to us”. He realized the sin of killing and decided to change his nature.
Conclusion: The demon offered the king a boon. Vikramaditya asked the demon to renounce the eating of human beings forever. The demon agreed and gave up his cruel ways. The statue (Salabhanjika) narrating this story concluded by telling king Bhoja. “Sit on this throne only if you have such a selfless heart. “King Bhoja remained silent.
Moral of the lesson: The life of a person who lives for the welfare of others is the only one truly worth living.
![]()
2. लघुसमाधानप्रश्नाः
प्रश्न १.
पक्षिणो वचः श्रुत्वा राजा कुत्र गतः ?
जवाब:
पक्षिणो वचः श्रुत्वा राजा उत्तराशां गतः ।
प्रश्न २.
बुधैः प्राणिनः कस्मात् त्रातव्याः ?
जवाब:
बुधैः प्राणिनः मृत्युभयात् त्रातव्याः ।
प्रश्न ३.
चिन्तातुराणां किं नास्ति ?
जवाब:
चिन्तातुराणां सुखंनिद्रा च नास्ति ।
3. एकपदसमाधानप्रश्नाः
प्रश्न १.
पक्षिराजस्य नाम किम् ?
जवाब:
पक्षिराजस्य नाम चिरञ्जीवि ।
प्रश्न २.
ज्ञानमात्रफला का ?
जवाब:
ज्ञानमात्रफला विद्या ।
प्रश्न ३.
पर्वतसमीपे स्थितस्य नगरस्य नाम किम् ?
जवाब:
पर्वत समीपे स्थितस्य नगरस्य नाम “पलाश” ।
![]()
4. सन्दर्भवाक्यानि
प्रश्न १.
तस्यैव जीवितं श्लाघ्यं यः परार्थे हि जीवति ।
जवाब:
परिचयः- इदं वाक्यं ‘वररुचि’ प्रणीत “सिंहासन द्वात्रिंन्थशिका’ इति · ग्रन्थात् गृहीत, दयावीरोविक्रमः पाठ्यभागात् स्वीकृतः ।
सन्दर्भः- विक्रमार्कस्य परोपकारगुणं दृष्ट्वा राक्षसः एवं अवदत् ।
भावः थः मानवः परोपकारार्थ जीवति, तस्यै व जन्म सार्थकं श्लाघनीं च भवति ।
(“तथैव जीवितं श्लाघ्यं यः परयै हि जीवति’’)
प्रश्न २.
न हि स्वदेहशैत्याय जायन्ते चन्दनद्रुमाः ।
जवाब:
परिचयः- इदं वाक्यं ‘वररुचि’ प्रणीत “सिंहासन द्वात्रिंशिका’ इति ग्रन्थात् गृहीत, दयावीरोविक्रमः पाठ्यभागात् स्वीकृतः ।
सन्दर्भः- सज्जनानां स्वभावं वर्णयन् राक्षसः एवं अवदत् ।
भावः- चन्दनवृक्षाः यथा परर्थं सुगन्धं शैत्यं च यच्छन्ति, तथैव सज्जनाः परोपकाराथैव जीवन्ति ।
प्रश्न ३.
परेषामपि रक्ष जीवितम् ।
जवाब:
परिचयः इदं वाक्यं ‘वररुचि’ प्रणीत “सिंहासन द्वात्रिंशिका’ इति ग्रन्थात् गृहीत, दयावीरोविक्रमः पाठ्यभागात् स्वीकृतः ।
सन्दर्भः- विक्रमार्कम् प्रति अहिंसाधर्मं बोधयन् एवं अवदत् ।
भावः- यथा आत्मनः जीवितं प्रियं भवति । तथैव सर्वेषां प्राणिनां जीवितं प्रियं भवति । अतः अन्येषां प्रणिनां रक्षणम् कर्तव्यम् ।
![]()
विशेषतो ज्ञेयाः
कठिनशब्दार्थाः
समाचङ्क्रम्यमाणे = यदा आरोढुम् उद्युक्तः तदा
पिशुनः = दुर्जनः
तस्करः = स्तेनः
अर्थिभूभुजः = सामन्तराजानः
देशान्तरम् = अन्यः देश:
सन्धयः
पुत्तलिका + अन्या = पुत्तनिकाऽन्या – सवर्णदीर्घसन्धिः
पद्मा + आश्रितान् = पद्माश्रितान् – सवर्णदीर्घसन्धिः
कतिचित् + दिनानि = कतिचिद्दिनानि – तवसन्धिः
वृक्षस्य + उपरि = वृक्षस्योपरि – गुणसन्धिः
समासाः
यथेच्छम् – इच्छाम् अनतिक्रम्य – अव्ययीभावसमासः
प्रतिदिनम् – दिने दिने – अव्ययीभावसमासः
सन्ततिच्छेदः – सन्ततेः च्छेदः – षष्ठीतत्पुरुषसमासः
महद्दुखम् – महत् च तत् दुःखम् च – विशेषणपूर्वपद कर्मधारयसमासः
आश्रमभ्रंशः – आश्रमात् भ्रंशः – पञ्चमीतत्पुरुषसमासः
वध्यशिला – वध्याय शिला – चतुर्थीतत्पुरुषसमासः
जीवमारणम् – जीवानां मारणम् – षष्ठीतत्पुरुषसमासः
![]()
दयावीरो विक्रमः Summary in Telugu & English
पाठ्यभाग परिचयः
वररुचिः प्राचीनभारतीयः ग्रन्थकर्ता अस्ति । भारतदेशस्य अनेकेषु भागेषु पुराणेतिहासस्य, शास्त्राणां च प्रसङ्गेषु वररुचेः नाम श्रूयते । किन्तु अयं सः वररुचिः यः वार्तिककारः कात्यायनः इति प्रथितः । प्राकृतभाषायाः सर्वप्रथमव्याकरणग्रन्थस्य प्राकृतप्रकाशस्य रचयिता अयमेव वररुचिः इति पण्डितानाम् अभिप्रायः । शकपुरुषस्य राज्ञः विक्रमादित्यस्य आस्थाने विद्यमानेषु नवरत्नेषु (नव पण्डितेषु) अन्यतमः । एकादशशतकगते कथासरित्सागरनामके प्रसिद्धे गद्यकाव्ये वररुचिः इति नाम प्रधानपात्रं वहति ।
पाठ्यभागोऽयं “सिंहासनद्वात्रिंशिका” नामक कथासंङ्ग्रहात् रक्षोभीतिवारणं नाम एकादशोऽध्यायात्स्वीकृतः । अस्य ग्रन्थस्य कर्ता वररुचिर्नामा कश्चित् कविरिति श्रूयते ।
अस्मिन् कथासङ्ग्रहे द्वात्रिंशत् कथाः वर्तन्ते । अस्मिन् पाठ्यभागे विक्रमादित्यस्य परोपकारपरायणता हृदयङ्गमरीत्या वर्णिता । आत्मनः सुखदुःखेच्छां त्यक्त्वा सर्वसत्त्वसुखैषिणः साधवः परदुःखेन नितरां दुःखिनः भवन्ति इति सन्देशः अत्र वर्तते ।
పాఠ్యభాగ పరిచయం
వరరుచి ప్రాచీన భారతీయ పురాణేతిహాసాలలో, వివిధ శాస్త్రాలలో పేరుగాంచిన గ్రంథకర్త. ఈయననే ‘కాత్యాయనుడు’ అని కూడా పిలుస్తారు. పాణిని వ్యాకరణానికి “వార్తికములను” వ్రాసింది, అదేవిధంగా ప్రాకృత భాషయందు ప్రథమ వ్యాకరణ గ్రంథమైన ‘ప్రాకృతప్రకాశము’ అనెడి గ్రంథాన్ని కూడా వరరుచియే వ్రాసినట్లు పండితుల యొక్క అభిప్రాయము. శకపురుషునిగా పేరుగాంచిన విక్రమాదిత్యుని ఆస్థానంలో “నవరత్నాలు”గా పేరుగాంచిన పండితకవులలో వరరుచి ఒకరు.
ప్రసిద్ధ పదకొండవ శతాబ్దపు గద్యకావ్యం ‘కథాసరిత్సాగరం’లో వరరుచి ప్రధానపాత్ర పోషించారు. ప్రస్తుత పాఠ్యభాగం సింహాసనద్వాత్రింశిక అనే కథల సంకలనంలోని ‘రాక్షస భయాన్ని నివారించడం’ అనే పదకొండవ అధ్యాయం నుండి స్వీకరింపబడినది. (ప్రస్తుత పాఠ్యభాగం ‘సింహాసనద్వాత్రింశిక’ అనే కథల సంకలనం నందలి పదకొండవ అధ్యాయంలోని రాక్షసభయాన్ని నివారించడం’ అనే కథ నుండి స్వీకరించబడినది). ప్రస్తుత కథకు కావ్యకర్త ‘వరరుచి’ అని పండితుల అభిప్రాయం. ఈ కథా సంకలనమునకే ‘విక్రమార్క చరిత’ అనే పేరుకూడా కలదు. ప్రస్తుత కథాసంకలనం నందు 32 కథలు కలవు. ప్రస్తుతం ఇవ్వబడిన కథలో విక్రమార్కుని యొక్క పరోపకారగుణం, దయాస్వభావం వర్ణింపబడెను.
“సత్పురుషులు ఇతరుల కష్టాలను చూసి చలించిపోతారు. తమ సుఖాలను త్యాగం చేసి అయినా సరే, ఇతరులకు మేలు చేయడమే సజ్జనుల లక్షణం”. అనేది ఈ పాఠం యొక్క ముఖ్య సందేశం.
Vararuchi is a renowned ancient author featured in Indian puranas, epics and various scientific treatises (Shastras).
He is celebrated as one of the ‘Navaratnas’ (the nine Scholarly gems) in the court of the legendary Emperor Vikramaditya.
He is also known by the name Katyayana. Scholars believe that he is the same Vararuchi who authored the ‘Prakrita – Prakasha’. (the first grammar book for the (Prakrit language) and the “Vartikas’ (explanatory notes) on Panini’s Sanskrit Grammar.
He is associated with the collection of stories titled ‘Simhasana Dwatrinsika’ (also known as Vikrama Charita) which highlights the life and virtues of king Vikramaditya.
This is extracted from the 11th chapter of the book – “Simhasana Dwatrinsika”.
It depicts the heroic compassion, selflessness, and charitable nature of Emperor Vikramaditya.
Moral: The text emphasizes that nobel people are deeply moved by the suffering of others and are willing to sacrifies their own comfort to help those in need.
अथ भोजे समाचङ्क्रम्यमाणे सिंहासनं पुत्तलिकाऽन्या कथयति – भो राजन् । श्रूयतां – विक्रमे राज्यं कुर्वति, भूमण्डले पिशुनः तस्करश्च पापकर्मनिरते नासीत् । अन्यच्च यस्य राज्ञः सदा राज्यभारचिन्ता बलवद्वैरिविजय चिन्ता च अस्ति, स रात्रौ निद्रामपि नाधिगच्छति । उक्तञ्च-
అప్పుడు భోజరాజు సింహాసనాన్ని అధిష్ఠించడానికి సిద్ధపడుచుండగా సింహాసనంపై ఉన్న మరొక సాలభంజిక (బొమ్మ) ఇలా పలికెను.
ఓ రాజా ! విను, విక్రమార్క మహారాజు రాజ్యాన్ని పాలించే కాలంలో, భూమండలం మీద ఎక్కడా కొండెగాడు (చాడీలు చెప్పేవాడు), దొంగ లేదా పాపపు పనులు చేసేవాడు ఉండేవాడు కాదు. మరొక విషయం – ఏ రాజుకైతే ఎల్లప్పుడూ రాజ్యభారమును మోయాలనే ఆలోచన బలంగా ఉంటుందో, అతనికి ఎప్పుడూ చింత (బాధ్యతాయుతమైన ఆలోచన) ఉంటుంది. అతడు రాత్రిపూట నిద్రను కూడా పొందలేడు. ఎందుకంటే ……..
Then, as king Bhoja was about to ascend the throne, a doll (statue) said – “O king ! listen during the reign of king Vikramarka, there was no slanderer, no thief and no sinner on this earth. Furthermore, a king who is always burned with the heavy responsibility of ruling his kingdom remains constantly anxious (contemplative) he does not even get sleep at night. Because ….
![]()
अर्थातुराणां न पिता, न बन्धुः
कामातुराणां न भयं न लज्जा ।
चिन्तातुराणां न सुखं, न निद्रा
क्षुधातुराणां न रुचिः, न पक्वं ॥
అర్థాతురాణాం న పితా, న బంధుః
కామాతురాణాం న భయం న లజ్జా ।
చింతాతురాణాం న సుఖం, న నిద్రా
క్షుధాతురాణాం న రుచిః, న పక్వం ॥
→ అర్థాతురాణాం న పితా, న బంధుః
ధనంపై అత్యాశ ఉన్నవాడికి తండ్రి అని కానీ, బంధువులని కానీ గౌరవం ఉండదు. (ధనమే ముఖ్యం).
→ కామాతురాణాం న భయం, న లజ్జా
కోరికలతో మనసంతా నిండిపోయిన వాడు దేనికీ భయపడడు. సిగ్గు (బిడియం) కూడా ఉండదు.
→ చింతా తురాణాం న సుఖం, న నిద్రా
ఎప్పుడూ ఏదో ఒక బాధ లేదా ఆలోచనలో మునిగిపోయేవారికి సుఖం ఉండదు. నిద్రపట్టదు.
→ క్షుధాతురాణాం న రుచిః, న పక్వమ్ః
తీవ్రమైన ఆకలితో ఉన్నవాడికి రుచి గురించి కానీ, పదార్థం సరిగ్గా ఉడికిందా లేదా అనే అంశంతో గానీ సంబంధం ఉండదు. (దేనినైనా ఎలా ఉన్నా తినేస్తాడు).
భావము : ఈ విధంగా విక్రమార్కుడు తన ప్రజల క్షేమం కోసం నిరంతరం ఆలోచిస్తూ, నిద్రను కూడా లెక్కచేయకుండా రాజ్యపాలన చేసేవాడని పై శ్లోకం వివరించుచున్నది.
→ For these obsessed with Wealth :
There is no father and no relative (money) becomes their only priority.
→ For those overcome by lust/desire:
There is no fear and no shame.
→ For those overcome by worry/anxiety:
There is no comfort and no sleep.
→ For those overcome by intense :
Hunger: There is no concern for taste or whether the food is well-cooked.
Meaning: The passage explains that king Vikramarka was so dedicated to his people that his sense of responsibility kept him con- stantly watchful, ensuring a kingdom free of crime and sin.
अयं विक्रमादित्यो राजा तथाविधो न भवति । सर्वान् अर्थिभूभुजः स्वपादपद्माश्रितान् विधाय आज्ञाप्रदानेन राज्यं करोति । उक्तञ्च
భావము : ఈ విక్రమార్క మహారాజు వంటి మహారాజు లేడు. ఆయన తన దగ్గరకు వచ్చిన అర్ధులకు (సహాయం కోరేవారికి ఆశ్రయమిచ్చి, వారు కోరినవన్నీ ఇచ్చి వారిని ధన్యులను చేసేవాడు. అందుకే ఈ విధంగా అంటారు …..
![]()
There is no king like this Vikramarka. He provided shelter to all those who sought his help and fulfilled all their desires through his generosity.