Andhra Pradesh BIEAP AP Inter 2nd Year Sanskrit Study Material Pdf गद्यभागः 1st Lesson विश्वामित्रचरितम्ः Questions and Answers Summary.
Inter 2nd Year Sanskrit विश्वामित्रचरितम् Questions and Answers
अभ्यासः
1. निबन्धप्रश्नौ
१. शतानन्देनोक्तं विश्वामित्रचरितम् समालिखत ।
శతానంద మహర్షి శ్రీరామునికి వివరించిన విశ్వామిత్ర మహర్షి చరిత్రను వివరంగా రాయండి.
Write in detail the history of sage Vishwamitra as narrated by sage Shatananda to Lord Rama.
२. चम्पूरामायणोक्तं विश्वामित्रगाथां विवृणुत ।
భోజరాజు తన ‘చంపూరామాయణం’లో వర్ణించిన విశ్వామిత్రుని కథను వివరించండి.
Explain the story of Vishwamitra as described in king Bhoja’s Champu Ramayanam’.
जवाब:
कविपरिचयः – “विश्वामित्रचरितम्’ इति पाठ्यभागः भोजः विरचित् चम्पूरामायणस्य बालकाण्डात् स्वीकृतः । गद्य-पद्यमयी काचिच्चम्पूरि- त्यभिधीयते ” इति चम्पूकाव्यं संलक्षितम् । चम्पूकाव्यवाङ्गये भोजराजस्य चम्पूरामायणं विशिष्टं स्थानमलंकरोति ।
“విశ్వామిత్రచరితమ్” పాఠ్యభాగం 11వ శతాబ్దానికి చెందిన, ధారానగర ప్రభువయిన భోజరాజుచే రచించబడిన చంపూరామాయణం నందలి బాలకాండ నుండి స్వీకరింపబడినది.
ఈయన సంస్కృత సాహిత్యంలో గొప్పవిద్వాంసుడు మరియు కవి. గద్యపద్యమయం కావ్యం చంపూరిత భి ధీయతే అన్నట్లుగా భోజరాజ విరచిత చంపూరామాయణం అత్యంత విశిష్టమైనది.
పాఠ్యభాగ నేపథ్యం / ఇతివృత్తం : पाठ्यभाग परिचयः- విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను వెంటబెట్టుకుని యాగ రక్షణ కోసం సిద్ధాశ్రమానికి తీసుకువెళ్తాడు. అక్కడ తాటక సంహారం, యాగ రక్షణ ముగిసిన తరువాత వారిని మిథిలానగరానికి తీసుకు వస్తాడు. మిథిలకు వెళ్ళే దారిలో గౌతమమహర్షి ఆశ్రమం వద్ద రాముని పాదధూళి సోకి అహల్యకు శాపవిమోచనం కలుగుతుంది.
అటుపిమ్మట వారు జనకమహారాజు భవనానికి చేరుకుంటారు. జనకమహారాజు వారిని సగౌరవంగా ఆహ్వానిస్తాడు. ఆ సమయంలో జనకమహారాజు యొక్క ఆస్థాన పురోహితుడు, అహల్యాగౌతముల కుమారుడైన శతానందుడు, అక్కడకు వస్తాడు. తన తల్లికి శాపవిమోచనం కలిగించినందుకు రాముడిపై కృతజ్ఞతతో అట్టి పుణ్యకార్యానికి కారణమైనట్టి, రామ లక్ష్మణుల గురువు అయిన విశ్వామిత్ర మహర్షి యొక్క గొప్పతనాన్ని, ఆయన పట్టుదలను, బ్రహ్మర్షిగా మారడానికి చేసిన కఠోర తపస్సును శ్రీరామునికి వివరిస్తాడు.
ఒక సాధారణ మనిషి లేదా రాజు తన పట్టుదలతో మరియు సాధనతో దైవత్వానికి సమానమైన అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చునని ఈ పాఠ్యాంశం ద్వారా తెలియజేయబడినది. విశ్వామిత్రుడు తాను శత్రువుగా భావించిన వశిష్ఠ మహర్షి చేతనే ‘బ్రహ్మర్షి’ అని పిలిపించుకోవడంలో ఈ ఇతివృత్తం పరిపూర్ణమవుతుంది.
ప్రస్తుత పాఠ్యాంశ వివరణ : గెరా: శ్రీరామచంద్రుడు, లక్ష్మణస్వామి అహ్యల్యాగౌతముల ఆతిథ్యం స్వీకరించి విశ్వామిత్ర మహర్షితో కలిసి మిథిలానగరానికి చేరుకుంటారు. అక్కడ జనకమహారాజు పురోహితుడైన శతానందుడు (అహల్యా గౌతముల కుమారుడు) శ్రీరామునికి విశ్వామిత్రుని అసాధారణమైన చరిత్రను వివరిస్తాడు.
వశిష్ఠునితో వివాదం – క్షత్రియబల పరాభవం :
పూర్వం విశ్వామిత్రుడు గొప్పరాజు, గాధి తనయుడు. కుశిక వంశానికి చెందినవాడు. పరాక్రమవంతుడైన విశ్వామిత్రుడు ఒకసారి తన సైన్యంతో బ్రహ్మర్షి అయిన వశిష్ఠమహర్షి ఆశ్రమాన్ని దర్శిస్తాడు. వశిష్ఠ రాజును, సైన్యాన్ని, సాదరంగా ఆహ్వానించి తనవద్దనున్న కామధేనువు మహిమతో అద్భుతమైన ఆతిథ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ కామధేనువు మహిమను చూసి ఆశ్చర్యపడిన రాజు దానిని తనకు యివ్వమని కోరతాడు. అందులకు వశిష్ఠుడు నిరాకరించగా విశ్వామిత్రుడు ఆ గోవును బలవంతంగా లాక్కొని వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ కామధేనువు సృష్టించిన అపారమైన సైన్యబలం ముందు ఓడిపోయి భయంతో వెనుతిరిగాడు. అటుపిమ్మట ఆశ్చర్యపోయిన విశ్వామిత్రుడు కఠోర తపస్సు చేసి శివుని నుండి అనేక దివ్యాస్త్రాలను పొందాడు. ఆ గర్వంతో మళ్ళీ కామధేనువు కోసం వశిష్ఠునిపై యుద్ధానికి వెళ్ళాడు. కానీ అరుంధతి ప్రాణనాథుడైన వశిష్ఠుడు తన బ్రహ్మదండంతో ఆ దివ్యాస్త్రాలన్నింటినీ అడ్డుకుంటూ అచలంగా నిలబడ్డాడు.
తన అస్త్రాలన్నీ విఫలం కావడంతో సిగ్గుపడిన విశ్వామిత్రుడు “క్షత్రియబలం కంటే బ్రహ్మతేజస్సే గొప్పది” అని గ్రహించి, దానిని సాధించడం కోసం దక్షిణ దిశగా వెళ్ళి తపస్సు చేశాడు.
త్రిశంకువుకు స్వర్గప్రాప్తి : అదే సమయంలో సూర్యవంశపు రాజైన త్రిశంకువు, తన శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని కోరగా వశిష్ఠుడు నిరాకరించాడు. వశిష్ఠుని కుమారులు కూడా కోపించి అతడిని చండాలుడిగా మారమని శపించారు. ఆ స్థితిలో దిక్కుతోచని త్రిశంకువు విశ్వామిత్రుని శరణువేడాడు. సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలనుకున్న త్రిశంకువు కోరికను తీర్చడానికి విశ్వామిత్రుడు పూనుకుంటాడు. ఇంద్రుడు అడ్డుపడి త్రిశంకువును స్వర్గం నుండి క్రిందకు త్రోసివేయగా, విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో అతడిని మధ్యలోనే నిలిపి ‘త్రిశంకు స్వర్గాన్ని’ సృష్టిస్తాడు.
శునశ్శేపుడి రక్షణ : శునశ్శేపుడు ఋచీకముని కుమారుడు. అంబరీష మహారాజు యొక్క యాగ పశువు తప్పిపోయింది. దానితో అంబరీషుడు యజ్ఞం కోసం బలివ్వడానికి ఋచీకుని కుమారుని కొనుగోలు చేసి తీసుకువెళుతుండగా, శునశ్శేపుడు విశ్వామిత్రుని ఆశ్రయించి శరణువేడుకుంటాడు. విశ్వామిత్రుడు శునశ్శేపుడికి బదులుగా తన కుమారులను వెళ్ళమని కోరగా వారు నిరాకరిస్తారు. వారు కూడా వశిష్ఠుని కుమారుల వలె జీవించమని శపిస్తాడు. అటుపిమ్మట శునశ్శేపుడికి మంత్రోఛ్ఛారణ చేసి, బాలుడిని రక్షించి, ఇంద్రో పేంద్రుల అనుగ్రహంతో అంబరీషుని కోరిక నెరవేర్చాడు.
తపోభంగం : విశ్వామిత్రుని తపస్సును భంగం చేయడానికి ఇంద్రుడు మేనకను, రంభను పంపిస్తాడు. మేనక కారణంగా తపోభంగం కావడంతో, విశ్వామిత్రుడు పశ్చాత్తాపంతో కౌశికీ నదీ తీరానికి వెళ్ళి ఘోరతపస్సు చేశాడు.
అక్కడ రంభ తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నించగా ఆమెను శాపంతో రాయిగా మారుస్తాడు.
బ్రహ్మర్షిత్వం : చివరకు తన కోపాన్ని, ఇంద్రియాలను జయించి, జితేంద్రియుడై తూర్పు దిశలో ఘోరతపస్సు చేస్తాడు. ఆయన దీక్షకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ‘బ్రహ్మర్షి’ అని పిలుస్తాడు. వశిష్ఠమహర్షి కూడా విశ్వామిత్రుని ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ అని సంబోధిస్తాడు.
మిథిలానగర ప్రవేశం : ఈ విధంగా జనకమహారాజు పురోహితుడైన శతానందుడి చేత ప్రశంసించబడిన గాధి పుత్రుడైన విశ్వామిత్రుడు, ఆ రాత్రి రామలక్ష్మణు లతో కలిసి అక్కడే గడిపి, మరుసటిరోజు మిథిలానగరంలోకి ప్రవేశించారు. దశరథ పుత్రులను చూసి మిథిల ప్రజలు ఎంతో ఆనందించారు. ఆనగరంలోనే యజ్ఞాన్ని ప్రారంభించిన జనకమహారాజు అదృష్టం వల్ల, భూమి నుండి ‘సీత’ అనే పేరుగల కన్యారత్నం ఉద్భవించింది.
సందేశం : అకుంఠిత దీక్ష, పట్టుదల మరియు ఇంద్రియ నిగ్రహం ఉంటే అసాధ్యమైన దానిని కూడా సాధించవచ్చని విశ్వామిత్రుని చరిత్ర నిరూపిస్తుంది. (విశ్వామిత్రుని చరిత్ర ద్వారా నిరూపితమగుచున్నది).
![]()
Introduction: This lesson is an extracted from the ‘Balakanda’ section of the “Champu Ramayanam”, written by the famous scholar-king Bhoja Raja.
Context of the Lesson: After sage vishwamitra successfully completes his sacrifice (yajna) with the help of Rama and Lakshmana, he leads them toward the city of Mithila to witness king Janaka’s sacrifies and the famous Shiva Dhanush (bow).
Upon reaching Mithila, Shatananda (the son of sage Gautama and Ahalya), who is the royal priest ofking – Janaka, narrates the extraordinary life story of Vishwamitra to Lord Rama.
The background serves to introduce Rama to the immense spiri- tual power, determination, and the glorious past of his mentor, Vishwamitra.
The central theme is the transformation of a person from a Kshatriya (warrior king) to a Brahmarshi (divine sage) through sheer will power and penance.
It highlights the realization that Brahmateja (spiritual brillianee) is far superior to Kshtrabala (Physical or military power). This is ignited by Vishwamitra’s defeat at the hands of sage Vashistha. The story illustrates that no obstacle is too great if one has an unwavering focus on their goal.
The ultimate theme is Jitendriyatvam (mastery over the senses). It teaches that true greatness is achieved not by conquering lands, but by conquering one’s own ego, lust and anger.
Present Story: After accepting the hospitality of Ahalya and sage Goutama, Vishwamitra reached the outskirts of mithila and arrived at the palace of king Janaka along with Rama and Lakshmana. There, king Janaka worshipped them according to the scriptures. At that moment, Shatananda, the son of Goutama and the priest of Janaka, spoke thus to the son of Dasaratha (Rama)….
The Battle and Realization
In the past, while staying true to his royal duties as a king, this sage (Vishwamitra) visited the hemitage of Vashistha, the son of Brahma. There he received limitless hospitality due to the divine power of the cow, surabhi (kamadhenu). Being amazed by this, he requested the sage for the cow, when the great sage (vashistha refused, he forcefully dragged the crying cow. Then facing the vast army cre- ated by that very cow, Vishwamitra became terrified and fled the battle field.
Even through he was a master of all divine weapons, Vishwamitra found his valor neutralized by Vashistha’s ‘Brahmadanda’ (Spiritual staff)
Realizing that spiritual power is far superior to royal, physical power (Kshatrabalam), he decided to attain the status of a ‘Brahmarshi’ through penance and went to the south to begin his meditation.
Trishanku’s Refuge: At that same time, a king named Trishanku desired to reach heaven with his physical body. When Vashistha rejected his request, and Vashistha’s sons cursed him to become a ‘Chandala’ out of anger, Trishanku sought refuge under Vishwamitra. Vishwamitra used his spiritual powers to send him to heaven. When Indra pushed Trishanku back-down. Vishwamitra halted him mid-air and began creating a new universe (Trishanku swarga) shocasing his immense determination.
Protection of Shunahshepa
During his penance at Pushkara, a young boy named shunahshepa sought refuge with Vishwamitra. The boy was being taken as a human sacrifice for king Ambarisha’s ritual. Vishwamitra saved the boy’s life by granting him his own spiritual merit (Tapas) proving his compassion.
Overcoming obstacles (Menaka and Rambha): To disrupt his penance, Indra sent the celestial nymphs Menaka and Rambha. While Menaka succeeded initially. Vishwamitra soon realized his mistake and returned to his authorities with even more focus. When Rambha tried to distract him later, he cursed her to turn into stone, though he latet regretted the loss of his merit due to anger.
Attaining Brahmarshi Status : Finally, after thousands of years of severe penance in the East and gaining complete control over his senses (Jitendriya), Lord Brahma appeared and hailed him as a ‘Brahmarshi’. Even sage Vashistha acknowledged his greatness and accepted him as a Brahmarshi.
Conclusion: The story concludes with Vishwamitra leading Rama and Lakshmana to Mithila. Where Rama eventually marries Sita. The central theme of this lesson is that through unwavering determination, hard work, and self-control one can achieve even the most impossible goals.
![]()
2. लघुसमाधानप्रश्नाः
प्रश्न १.
वसिष्ठविश्वामित्रयोः मध्ये किमर्थं समरः समारब्धः ?
जवाब:
वसिष्ठस्य समीपे विद्यामानां ‘सुरभि’ नम्नी कामधेनुं विश्वामित्रः प्रर्थितवान् वसिष्ठः तां दातुं निराकृतवान् । अतः वसिष्ठविश्वामित्रयोः मध्ये समरः समारब्धः ।
प्रश्न २.
विश्वामित्रचरितम् इत्ययं पाठ्यभागः कस्मात् सङ्गृहीतः ?
जवाब:
विश्वामित्र चरितमम् इत्ययं पाठ्यभागः भोजराजेन विरचितात् ‘चम्पूरामायणम्’ इति काव्यस्य भालकान्डात् सङ्गृहीतः ।
प्रश्न ३.
शतानन्दस्य मातापितरौ कौ ?
जवाब:
शतानन्दस्य पिता गौतम महर्षिः माता च अहल्या ।
3. एकपदसमाधानप्रश्नाः
प्रश्न १.
शुनः शेपः कस्य पुत्रः ?
जवाब:
शुनश्शेपः ऋचीकस्य पुत्रः ।
प्रश्न २.
धारानगराधीशः कः ?
जवाब:
धारानगराधीशः भोजराजः ।
प्रश्न ३.
कुशिकनन्दनः कः ?
जवाब:
कुशिकनन्दनः विश्वामित्रः ।
![]()
4. सन्दर्भवाक्यानि
प्रश्न १.
क्षात्रात तेजसः परंब्राह्ममेव महो महीयः ।
जवाब:
परिचयः इदं वाक्यं भोजराजेन विरचितात् ‘चम्पूरामायणम्’ इति काव्यस्य ‘बालकान्डात्’, ”विश्वामित्र चरितम् ” पाठ्यभागात् स्वीकृतम् ।
सन्दर्भः – विश्वामित्रः वसिष्ठेन परानितः भूत्वा एवमवदत् ।
भावः क्षत्रियबलम् बहुस्वल्पम् । ब्रह्मतेजः एव परमश्रेष्ठम् इति अस्य भावः ।
प्रश्न २.
आरोचयामास दिवं त्रिशङ्कुम् ।
जवाब:
परिचयः इदं वाक्यं भोजराजेन विरचितात् ‘चम्पूरामायणम्’ इति काव्यस्य ‘बालकान्डात्’, ”विश्वामित्र – चरितम् ” पाठ्यभागात् स्वीकृतम् ।
सन्दर्भः – विश्वामित्रस्यतपः प्रभावं वर्णयन् कविः एकमवदत् ।
(अथवा )
(विश्वामित्रः त्रिशङ्कोः सशरीर – स्वर्गयानार्य कं क्रतुम् आरब्दवान् इति वर्णन सन्दर्भे कविः एवम् अवदत् )
भावः विश्वामित्रः स्वस्य तपः प्रभावेन त्रिशङ्कुम् स्वर्गम् प्रति प्रेषितवान् इति भावः ।
प्रश्न ३.
जितेन्द्रियत्वाद् ब्रह्मर्षिरसि ।
जवाब:
परिचयः इदं वाक्यं भोजराजेन विरचितात् ‘चम्पूरामायणम्’ इति काव्यस्य ‘बालकान्डात्’, ’विश्वामित्र – चरितम्” पाठ्यभागात् स्वीकृतम् ।
सन्दर्भः – विश्वामित्रस्य कठोरतपसा संतृप्तः ब्रह्मदेवः तं प्रति एवम् उक्तवान् ।
भावः हे कोशिक ! त्वं सर्वाणि इन्द्रियाणि जितवान्, अतः त्वं ‘ब्रह्मर्षिः” अभवः इति अस्य भावः ।
![]()
विशेषतो ज्ञेयाः
कठिनशब्दार्थाः
रत्नकल्पः = रत्नसदृशः
अभ्यर्चिते = पूजिते
निमिकुलपुरोधाः = निमिनामजनकवंशस्य कुलक्रमागतः पुरोहितः
कान्दिशीक: = भयद्रुतः
तपोबलाधिगता = तपोबलेन तपस्यया अधिगतः प्राप्तः
अरुन्धतीजानिः = अरुन्धती जाय यस्य सः वसिष्ठः
क्षात्रतेजसः = क्षात्रात् क्षत्रिय सम्बन्धिनः पराक्रमः, तस्य
महीय = महः तेजः ओव महीय
तीव्रतरं = घोरतरम्
सावित्रः = सवितुः सूर्यस्यापत्यं पुमान्
प्राक्रमत = प्रारब्धवान्
शतमन्युः = शतं मन्यवो यागा यस्य सः
शैली भव = शिलाभावं भजस्व इति
विश्वामित्र = विश्वं मित्रमस्य
सन्धयः
दिव्य + अस्त्रपरम्पराम् = दिव्यास्त्रपरम्पराम् – सवर्णदीर्घसन्धिः
तपः + चचार = तपश्चार – विसर्गसन्धिः
तत् + मनोरथ = तन्मनोरथ – अनुनासिकसन्धिः
नील + अम्बरम् = नीलाम्बरम् – सवर्णदीर्घसन्धिः
समासाः
सशरीरम् – शरीरेण सह वर्तते इति – बहुव्रीहिसमासः
स्वर्गसिद्धिम् – स्वर्गस्य सिद्धिः, तम् – षष्ठीतत्पुरुषसमासः
नीलाम्बरम् – नीलम् अम्बरं यस्य सः, तम् – बहुव्रीहिसमासः
इन्द्रोपेन्द्राभ्याम् – इन्द्रश्च उपेन्द्रश्च, ताभ्याम् – द्वन्द्वसमासः
![]()
विश्वामित्रचरितम् Summary in Telugu & English
पाठ्यभाग परिचयः
संस्कृतलाक्षणिकविचक्षणैः आदौ काव्यं द्विधा विभक्तम् – श्रव्यं, दृश्यं चेति । श्रोतुं योग्यं श्रव्यमिति, द्रष्ठं योग्यं दृश्यमिति व्युत्पत्तिः । श्रव्यकाव्यं पुनः त्रिधा वर्गीकृतम् – पद्यकाव्यम्, गद्यकाव्यम्, चम्पूकाव्यं चेति । आलङ्कारिकेषु इदं प्रथमतया दण्ड्याचार्येण “गद्यपद्यमयी काचिच्चम्पूरित्यभिधीयते ” इति चम्पूकाव्यं संलक्षितम् । चम्पूकाव्यवाङ्मये भोजराजस्य सम्पूरामायणं विशिष्टं स्थानमलंकरोति ।
धारानगरधीशः भोजः एकादशशतकसमुद्भवः इति संस्कृतसाहित्य चरित्रकारैः निर्णीतः । भोजराजमधिकृत्य अभियुक्तोरेषा सुप्रसिद्धा
“कविषु वादिषु भोगिषु देहिषु
द्रविणवत्सु सतामुपकारिषु ।
धनिषु धन्विषु धर्मधनेष्वपि
क्षितितले न हि भोजसमो नृपः ।” इति ।
आदिकाव्यं वाल्मीकि रामायणम् अनुसृत्य चम्पूकाव्यमेतत् प्रणीतमिति भोजभूपालेन समुदीरितम् ।
“गद्यानुबन्धरसमिश्रितपद्यसूक्तिः
हृद्या हि वाद्यकलया कलितेव गीतिः ।
तस्मात् दधातु कविमार्गजुषां सुखाय
चम्पूप्रबन्धरचना रसना मदीया ||” इति ।
‘’विश्वामित्रचरितम्” इति शीर्षिकाङ्कितः प्रस्तुत पाठ्यभागः चम्पूरामायणस्य बालकाण्डात् स्वीकृतः । इह अहल्या – गौतममहर्षिदम्पत्योः सुतः शतानन्दः अधीतवेद – वेदाङ्गः जनकमहाराजस्य आस्थाने पुरोहित पदमलङ्कृत्य स्वकर्तव्यं साधु निर्वहति । पाठ्यभागेऽस्मिन् शतानन्दः श्रीराम- लक्ष्मणौ आचार्यवर्यस्य कुशिकनन्दनस्य विश्वामित्रस्य ब्रह्मर्षित्वसाधनं विवृणोति ।
పాఠ్యభాగ పరిచయం
సంస్కృత సాహిత్యంలో కావ్యం రెండు రకాలుగా విభజించబడినది. దృశ్యకావ్యం మరియు శ్రవ్యకావ్యం. శ్రవ్యకావ్యం మళ్ళీ మూడు రకాలు. పద్యకావ్యం, గద్యకావ్యం మరియు చంపూ కావ్యం.
గద్యము మరియు పద్యము రెండింటి కలయికతో మిశ్రమంగా ఉండేదానిని చంపూ కావ్యం అంటారు. (“గద్య పద్య మయం కావ్యం చంపూరిత్యభిధీయతే”)
ధారానగరాన్ని పరిపాలించిన భోజరాజు 11వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన సంస్కృత సాహిత్యంలో గొప్ప విద్వాంసుడు మరియు కవి. ఆయన అనేక గ్రంథాలు రచించారు. అందులో (చంపూరామాయణం’ అత్యంత విశిష్టమైనది.)
“కవిషు వాదిషు వాగ్మిషు భోగిషు”
“ద్రవిణవత్సు మతాముపకారిషు |”
“ధనిషు ధన్విషు ధర్మధనేష్వపి”
“క్షితితలే న హి భోజసమో నృపః ||”
भावः- ఈ భూమండలం మీద కవులలో, వాదించే వారిలో, గొప్ప వక్తలలో, భోగాలను అనుభవించే వారిలో, దానశీలులలో, ఉపకారులలో, ధనవంతులలో, విలువిద్య తెలిసిన వారిలో మరియు ధర్మాన్ని ధనంగా భావించే వారిలో భోజరాజుతో సమానమైన రాజు మరెవ్వరూ లేరు. (అంటే అన్ని రంగాల్లోనూ ఆయన మేటి అని అర్థం).
ఆదికవి వాల్మీకి రామాయణాన్ని అనుసరించి భోజరాజు చంపూకావ్యాన్ని రచించారు.
![]()
In Sanskrit literature, “Kavya” is categorized into two types. Drishya Kavya (Visual/Drama) and Shravya kavya (Literature meant to reading/listening). Shravya kavya is further divided into three forms. Padyakavya (pure poetry), Gadya kavya (pure prose) and Champu Kavya – A beautiful blend of both poetry and prose (Gadya Padyamayam kavyam Champurityabhidhiyate” (गद्य-पद्यमयि काचिच्चम्पूरित्य भिधीयते “)
King Bhoja (Bhoja Raju), the ruler of Dharanagara in the 11th Century A.D., was a legendary scholar, poet and partron of arts.
Note: “Slokam- He authored the Champu Ramayanam (also known as Bhoja Champu) based on the original “Adikavi Valmiki Ramayana”.
“कविषु वादिषु भोगिषु देहिषु
द्रविणवत्सु सतामुपकारिषु ।
धनिषु धन्विषु धर्मधनेष्वपि
क्षितितले न हि भोजसमः नृपः ।” इति ।
भावः – This verse praises the extraordinary and multifaceted personality of king Bhoja. It states that on this entire earth, there is no other king who can match him because he was simultaneously a great poet, a brilliant orator, a brave warrior, a generous philanthropist, and a deeply righteous ruler. He excelled in every virtue and field of knowledge.
(or)
Among poets, debaters, orators, and those who enjoy life, among the wealthy, the well-regarded, and the helpful, among the rich, the archers (warriors) and those who consider righteousness (Dharma) as their true wealth – there is no king on this earth to king Bhoja.
Note: He authored the champu Ramayanam (also known as Bhoja Champu based on the original “Adi Kavi Valmiki Ramanaya).
“गद्यानुबन्धरसमिश्रितपद्यसूक्तिः
हृद्या हि वाद्यकलया कलितेव गीतिः ।
तस्मात् दधातु कविमार्गजुषां सुखाय
चम्पूप्रबन्धरचना रसना मदीया ||” इति ।
“గద్యాను బంధరసమిశ్రిత పద్యసూక్తిః
హృద్యా హి వాద్యకలయా కలితేవ గీతిః |
తస్మాద్దధాతు కవిమార్గజుషాం సుఖాయ
చంపూ ప్రబంధరచనా రసనామదీయా ॥”
भावः కేవలం పాటపాడటం కంటే, ఆ పాటను వాయిద్య సంగీతంతో కలిసి పాడితే అది వినడానికి ఎంత హృద్యంగా (మనోహరంగా ఉంటుందో, అలాగే కేవలం పద్యం కంటే గద్యము మరియు పద్యము కలిసి ఉన్న ‘చంపూ కావ్యం చదవడానికి అంతటి ఆనందాన్ని ఇస్తుంది. అందుకే, కవిత్వ మార్గాన్ని ఇష్టపడేవారికి ఆనందం కలిగించడం కోసం నా నాలుక ఈ చంపూ ప్రబంధాన్ని రచిస్తోంది”. (అని భోజరాజు ఈ శ్లోకంలో పేర్కొనెను)
“విశ్వామిత్ర చరితమ్” అనేది ప్రస్తుత పాఠ్యాంశం ‘చంపూరామాయణమ్’ – “బాలకాండ” నుండి స్వీకరింపబడినది.
అహల్య మరియు గౌతమ మహర్షి దంపతుల కుమారుడైన శతానందుడు జనకమహారాజు యొక్క ఆస్థాన పురోహితునిగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు.
ప్రస్తుత పాఠ్యభాగంలో శతానందుడు రామలక్ష్మణులకు వారి గురువు మరియు కుశికనందనుడు అయినట్టి విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారడానికి చేసిన సాధనను గురించి వివరించిన సందర్భము తెలియజేయబడెను.
![]()
In this verse, king Bhoja explains why he chose the ‘Champu’ style. He compares pure poetry to a song and prose to instrumental music. Just as a song becomes much more melodious and captivating whey played with instruments, a story becomes more powerful and enjoyable when told through a mix of poems and prose.
(or)
A literary composition that blends prose (Gadya) with poetry (padya) is a pleasing to the heart as a song (Giti) accompained by beautiful instrumental music (vadya). Therefore, to provide joy to those who appreciate the path of poetry, my tongue is engaged in composing this Champu (the mixed form of literature.)
This lesson titled “VISHWAMITRA CHARITAM”, (विश्वामित्र चरितम्) is taken from the Balakanda of the Champu Ramayanam; (authored by king Bhoja).
Shatananda, the son of sage Goutama and Ahalya, is the speaker here. He is the priest in king Janaka’s court. He narrates the glorious history of Vishwamitra to Rama and Lakshmana, specifically focusing on how Vishwamitra achieved the status of a ‘Brahmarshi’ (supreme sage).