Andhra Pradesh BIEAP AP Inter 2nd Year English Study Material Poetry 5th Poem A Challenge to Fate Textbook Questions and Answers, Summary.
AP Inter 2nd Year English Study Material 5th Poem A Challenge to Fate
Paragraph Questions
Answer the following in 10 – 15 lines each :
Question 1.
Why are people generally afraid of fate ? How did Sarojini Naidu challenge such a fearful fate?
Answer:
‘A challenge to Fate’ is an interesting poem written by Sarojini Naidu. She was a great poet and an orator. She was called ‘The Nightingale of India’, ‘Fate’-generally dominates the lives of people. The writer does not like this. She feels that Fate is a foolish thing. The writer has many delightful experiences. She asks Fate, why it spoils the happy things. The bright mountains, and the blue sky gives pleasure to the mind. Beautiful valleys are filled with the echo of the odes and songs. The spring provides joyful experience. Inspite of all these happy moods, the only problem of the Fate trying to challenge has been a hinderance. But Sarojini Naidu challenges Fate and wins in her attempt.
సాధారణంగా ప్రజలు దురదృష్టం అంటే ఎందుకు భయపడతారు ? సరోజినీ నాయుడు అట్టి భయంకరమైన Fate ను ఏవిధంగా సవాలు చేశారు ?
‘A Challenge to fate’ అనునది సరోజినీ నాయుడు వ్రాసి ఆకర్షణీయమైన పద్యము. ఆమె గొప్పకవయిత్రి మరియు వక్త. ఆమె Nightingale of India అని పిలువబడుతుంది. Fate సాధారణంగా మనుష్యుల జీవితాలను అధిగమిస్తుంది. రచయిత్రికి అనేక సంతోషకరమైన అనుభవాలున్నాయి. ఆమె Fate ను ప్రశ్నిస్తున్నారు. “జీవితంలో సంతోషాన్ని ఎందుకు పాడుచేస్తున్నావు ?” మంచి మంచి కొండలు, నీలాకాశము మన మనసుకు ఆనందం ఇస్తాయి. పద్యాలు, పాటల శబ్దంతో లోయలు మారు మ్రోగుతున్నాయి. వసంత ఋతువు మంచి ఆహ్లాదకరమైన అనుభవాన్నిస్తుంది. వీటినన్నింటిని మించి, fate చేస్తున్న సవాలు అనునది ఒక ఆటంకంగానున్నది. కానీ సరోజినీనాయుడు Fate కు సవాలు విసిరి, విజయం సాధించింది.
Question 2.
What is the theme of the poem ‘A Challenge to Fate’? What is the life lesson we can learn from the poem ?
Answer:
‘A challenge to Fate’ is an interesting poem written by Sarojini Naidu. She was a great poet and an Orator. She was called the ‘Nightingale of India’. The poem is a celebration of the writer’s courage to challenge ‘Fate’. Everybody is afraid of Fate. It leads the individual into a pitiable condition. But the writer does not hesitate to describe the events of happiness. The natural beauty around, the melodious music of the birds and creatures, the sweet memories of life can be taken away by Fate. The power of Oratory and the courage may be subdued by Fate. But all the trials of Fate, shall become void. She will not come under Fate’s spell. One has to know that whatever problems crop up, in our way of progress, we have to attack them and move forward.
‘A Challenge to Fate’ అనే పద్యం యొక్క సారాంశము వ్రాయుము. ఈ పద్యం నుండి మనం నేర్చుకొనదగు పాఠము ఏమి ?
‘A Challenge to Fate’ అను పద్యము సరోజినీ నాయుడు వ్రాశారు. ఆమె గొప్ప కవయిత్రి మరియు వక్త. ఆమెను Nightingale of India అని అంటారు. Fate కు సవాలు విసిరే కవయిత్రి ధైర్యాన్ని విశదీకరిస్తున్న పద్యము ఇది. ప్రతి వారికి Fate అంటే భయము. అది వ్యక్తిని దయనీయమైన స్థితికి నడిపిస్తుంది. కానీ సంతోషాన్ని కలిగించే విషయాలను చెప్పడానికి వెనుకాడడం లేదు. చుట్టూర వున్న సహజ సౌందర్యము, పక్షులు, కీటకముల యొక్క కమ్మని పాటల సంగీతము, జీవితంలో జరిగే కమ్మని అనుభవాలు అనునవి Fate ద్వారా లాగి వేయబడవచ్చును. “ఉపన్యాసధోరణి యొక్క శక్తి, మరియు ధైర్యము ‘Fate’ చేత అణచివేయబడును. కానీ Fate యొక్క ప్రయత్నములన్నియు వ్యర్థం కాగలవు. ఆమె Fate కు లోబడదు. మన మార్గంలో వచ్చే సమస్యలు ఏమైనను, అధిగమిస్తూ, ఎదిరిస్తూ ముందుకు పోవాలి.
Annotations
Question 1.
For all the cruel folly you pursue
I will not cry with suppliant hands to you.
Answer:
Context : These lines are taken from the poem “A Challenge to Fate” written by Sarojini Naidu. It is about the courageous behaviour of the writer. It is a challenge against Fate.
Explanation : The poetess is challenging Fate itself. Generally Fate causes disaster. The writer is not afraid of its deeds. Fate tries to divert people from happiness. People will be happy enjoying, natural beauty, the echoing sounds of the valleys, personal talents and others. Fate cruelly disturbs all this joy. So the writer blames Fate that it was foolish. She will never extend her hands before Fate, for pity.
General Relevance : The writer has a courageous heart. She does not bow down before Fate. Moreover she challenges Fate, which challenges each and every person.
సందర్భము : “A Challenge to Fate” అనబడే సరోజినీ నాయుడు వ్రాసిన పద్యము నుండి ఈ లైనులు తీసుకొనబడినవి. అది రచయిత్రి యొక్క ధైర్యాన్ని గురించియైయున్నది. అది Fate మీద, ఒక సవాలులాంటిది.
వివరణ : ఆ రచయిత్రి, Fate ను సవాలు చేస్తున్నది. సాధారణంగా Fate అనేది నాశనాన్ని సృష్టిస్తుంది. రచయిత్రికి జరుగుతున్న పనులను బట్టి భయపడరు. ప్రజలను త్రోవ తప్పించడానికి ప్రయత్నిస్తుంది. ప్రజలు సహజమైన అందాన్ని, సృష్టి యొక్క అందం, లోయలలోని మారుమ్రోగుతున్న శబ్దాలు వ్యక్తిగత శక్తియుక్తులు అనుభవిస్తూ ఆనందిస్తారు. ఈ సంతోషాన్నంత Fate పాడుచేస్తుంది. అందుచేత రచయిత Fate ను దూషిస్తున్నాడు. అది బుద్దిహీనమైనది. ఆమె Fate యొక్క దయ కొరకు ఎన్నడూ అర్రులు చాచను అంటున్నారు.
సామాన్య అవగాహన : రచయిత్రికి చాలా ధైర్యం’ వుంది. Fate ముందు ఆమె తలయెగ్గదు.. అంతేకాక అందరికి సవాలు విసరుతున్న Fate కు ఆమె సవాలు విసరుచున్నది.
Question 2.
Yea, you may smite my mouth to throbbing silence
Pluck from my lips power of articulate words.
Answer:
Context : These lines are taken from the poem “A Challenge to Fate” written by Sarojini Naidu. It is about the courageous behaviour of the writer. It is a challenge against Fate.
Explanation : The poetess is not afraid of Fate. It is natural that Fate will cause problems. But the writer does not hesitate to fight against Fate. She has many talents. She can speak fluently. Her oratory is of high range. Eventhough, every sort of merit in herself is taken away, she does not yield to Fate. Just like the spring birds, she continues her talent. Thus Fate was challenged and it was defeated.
General Relevance : The decision of the poetess is a challenge to Fate. She is not afraid of the deeds of Fate but wants to fight against it. The writers courage is of great value.
సందర్భము : “A Challenge to Fate” అనబడే సరోజినీ నాయుడు వ్రాసిన పద్యము నుండి ఈ లైనులు తీసుకొనబడినవి. అది రచయిత్రి యొక్క ధైర్యాన్ని గురించియైయున్నది. అది Fate మీద ఒక సవాలులాంటిది.
వివరణ : రచయిత్రికి Fate అంటే భయము లేదు. అది సమస్యలు సృష్టిస్తుంది. కానీ దీనిమీద పోరాడడానికి రచయిత్రి వెనుకాడటం లేదు. ఆమెకు మంచి తలాంతున్నాయి. ఆమె అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె ఉపన్యాస ధోరణి ఎంతో గొప్పది. ఆమెలోనున్న ప్రతి విధమైన మంచి లక్షణాన్ని తీసివేసిననూ, ఆమె Fate కు లోబడదు. వసంత ఋతువులోని పక్షుల వలె ఆమె తన తలాంతును కొనసాగిస్తుంది. ఈ విధంగా Fate కు సవాలు విసిరి దానిని ఓడించారు. సామాన్య అవగాహన : ఆ రచయిత్రి యొక్క నిర్ణయము Fate కు సవాలు. ఆమె Fate యొక్క కార్యకలాపములకు భయపడదు. కానీ వాటి పై యుద్ధం ప్రకటిస్తుంది. ఆమె ధైర్యము గొప్పది.
Question 3.
How will you daunt my free, far-journeying fancy
That rides upon the pinions of rain.?
Answer:
Context : These lines are taken from the poem “A Challenge to Fate” written by Sarojini , Naidu. It is about the courageous behaviour of the writer. It is a challenge against Fate.
Explanation : The writer is an individual having many talents. She can speak well, she can freely travel in the world, she has gather own freedom of thought. Fate cannot dominate her movements. She has a challenging career before her. How can all this be removed by ‘Fate’. She thinks that the efforts of Fate shall become unsuccessful. Her dreams cannot be spoiled.
General Relevance : These two lines depict the free movement. The weakness of Fate is also touched here. Happy experience of the writer cannot be altered by Fate.
సందర్భము : “A Challenge to Fate” అనబడే సరోజినీనాయుడు వ్రాసిన పద్యము నుండి ఈ లైనులు తీసుకొనబడినవి. అది రచయిత్రి యొక్క ధైర్యాన్ని గురించియైయున్నది. అది Fate మీద ఒక సవాలులాంటిది.
వివరణ : రచయిత్రి అనేక తలాంతులు కలిగియున్న వ్యక్తి. ఆమె చక్కగా మాట్లాడగలదు, ప్రయాణించగలదు, ఆమెకు స్వతంత్ర భావనలున్నాయి. Fate ఆమె కదలికలను అజమాయిషీ చేయలేదు. ఆమె ముందు ఒక సవాలుతో కూడిన స్థితియున్నది. ఇది అంతయు Fate చేత ఎలా తప్పించబడుతుంది. Fate యొక్క ప్రయత్నములు వ్యర్థము అని ఆమె తలంచుచున్నారు. ఆమె కలలు నాశనం చేయరాదు.
సామాన్య అవగాహన : ఈ రెండు లైనులు, స్వతంత్రించి కదలుచుండుట యొక్క వివరణ కలిగియున్నవి. Fate యొక్క బలహీనత కూడా చెప్పబడిన రచయిత్రి యొక్క ఆనందం, Fate వలన మార్పు చేయబడదు.
Question 4.
Yet will I slake my individual sorrow,
At the deep source of universal joy.
Answer:
Context : These lines are taken from the poem “A Challenge to Fate” written by Sarojini Naidu. It is about the courageous behaviour of the writer. It is a challenge against Fate.
Explanation : After discussing all the matters connected the writer comes to a conclusion. The writer wants to enjoy her talents. She wants to have a free thought, free movement and free speech. Fate wants to control but it cannot. It is undone before the talents of the writer. Universal joy is there in the mind of the writer. The writer cannot become a puppet in the hands of Fate.
General Relevance : It is known that, inspite of all the efforts of Fate,’ the writer wins the battle. The brave heart is led to victory.
సందర్భము : “A Challenge to Fate” అనబడే సరోజినీ నాయుడు వ్రాసిన పద్యము నుండి ఈ లైనులు తీసుకొనబడినవి. అది రచయిత్రి యొక్క ధైర్యాన్ని గురించియైయున్నది. అది Fate మీద ఒక సవాలులాంటిది.
వివరణ : అన్ని విషయాలు పరిశీలించి రచయిత్రి ఒక నిర్ణయానికి వచ్చారు. రచయిత్రి తనకున్న తలాంతులు అనుభవించాలి అని అనుకొంటున్నారు. ఆమె స్వేచ్ఛగా ఆలోచించాలి, స్వేచ్ఛగా కదలాలి, స్వేచ్ఛగా మాట్లాడాలని కోరుకొంటున్నారు. Fate దీనిని అదుపు చేయాలి అనుకొంటున్నది కానీ దానివల్ల కాదు, రచయిత్రి తలాంతుల ముందు అది ఎందుకు పనికి రాదు. ఆమె యొక్క మనసులో విశ్వజనీనమైన ఆనందము వున్నది. రచయిత్రి Fate యొక్క చేతులలో ఆటవస్తువు కానేరదు.
సామాన్య అవగాహన : Fate యొక్క ప్రయత్నములన్నింటికీ బదులుగా రచయిత్రి యుద్ధం గెలిచారు. ధైర్యం కలిగిన ఆ హృదయం విజయానికి నడిపించబడినది.
A Challenge to Fate Poem Summary in English
Sarojini Naidu was a great writer and Orator. She was called “The Nightingale of India”. Her poems are melodious1. She wrote on common experiences like forests and mountains, common people like weavers2, snake3 charmers, palanquin4 bearers and etc. Here the poem ‘A Challenge to Fate’ is with a different subject. The idea of fate is exposed here.
The writer feels that there is a challenge from ‘Fate’. She does not accept fate. She thinks that fate is a foolish thing. The challenge of fate becomes futile5. It wants to dominate the writer’s views. The joy of delightful scenery, the bright mountains and the blue sky, gives pleasure to her mind. Great histories are known to her. The beautiful valleys ringing with the echo7 of odes and songs make her happy. The spring season having melodious music created by the birds and creatures is another attraction for her. Fate wants to show its authority over these experiences.
There is some sorrowful experience in life by sudden events. The writer has the fancy of going round the places to gain experience. The love, the joy and the peaceful atmosphere cannot be overpowered by fate. Thus fate is a failure. Ultimate8 victory of the writer is to be experienced
1. కమ్మనైన
2. నేతపనివారు
3. పాములవారు
4. పల్లకీలు మోసేవారు
5. ఎత్తి చూపబడినది
6. పనికిరానిది
7. ప్రతిధ్వని
8. అంతిమంగా
A Challenge to Fate Poem Summary in Telugu
సరోజినీ నాయుడు గొప్ప రచయిత మరియు వక్త. ఆమెను “The Nightingale of India” అంటారు. ఆమె పద్యాలు సంగీతబద్దంగా వుంటాయి. ఆమె సామాన్య అనుభవాలు అనగా అడవులు, పర్వతాలు, నేత పనివారు, పాములవారు, పల్లకీ మోసేవారు మొదలైన వాని మీద వ్రాశారు. ‘A Challenge to Fate’ అనేది భిన్నమైన విషయముతో నిండియున్నది. అదృష్టము లేక దురదృష్టము అనేది ఇక్కడ చూపబడినది.
దురదృష్టము నుండి ఒక సవాలు వచ్చింది అని రచయిత భావిస్తున్నారు. ఆమె Fate ను అంగీకరించరు. Fate అనేది బుద్ధిహీనత అంటారు. Fate యొక్క సవాలు వ్యర్థము అవుతుంది. అది రచయిత అభిప్రాయాలను అధిగమించాలి అనుకొంటుంది. సంతోషాన్ని కలిగించే దృశ్యము, ఆ కొండలు, ఆ నీలాకాశము అనునవి ఆమె మనసుకు ఆనందం కలిగిస్తున్నాయి. ఆమెకు గొప్ప చరిత్రలు తెలియును. చక్కని పద్యముల మారుమ్రోత ఆ లోయలలో ఆమెకు ఆనందం కలిగిస్తోంది. తియ్యనైన సంగీతము గల స్ప్రింగ్ సీజన్, పక్షుల కిలకిలరావములతో ఆనందం, ఆకర్షణ కలిగిస్తోంది. Fate అనునది ఈ అనుభవాల మీద అజమాయిషీ కోరుతున్నది.
ఆకస్మికంగా జరిగే సంఘటనల వల్ల కొంత విచారకరమైన అనుభవము వుంటుంది. ఆయా ప్రదేశములకు తిరిగి అనుభవము సాధించే పరిస్థితి కలదు. ప్రేమ, ఆనందము మరియు ప్రశాంతమైన వాతావరణము అనునవి Fate చేత సాధింపబడని అనుభవములు. ఈ విధంగా Fate అనునది అపజయము కలిగియున్నది. చివరికి విజయము అనుభవించాలి ఈ రచయిత.
A Challenge to Fate Poem Glossary
1. Futile (adj) : /’fju:taıl (ఫ్యుటైల్) :
(M) pointless, having no purpose because there is no chance of success; వ్యర్ధము.
(U) The doctors effort to revive him were futile.
2. Poignant(adj) : // (పోయినెంట్) :
(M) incisive, penetrating, having a strong effect on your feelings, especially in a way that makes you feel sad; ఎక్కువ ప్రభావముగల.
(U) It was a poignant the effects of a war that touched every aspect of society.
3. Subtle (adj) : /’s\(\boldsymbol{\Lambda}\)tl/ (సటిల్) :
(M) not very noticeable or obvious; సూక్ష్మమైన.
(U) There are subtle differences between the two versions.
4. Malice (n) : /’mælıs/(మ్యాలిస్) :
(M) a feeling of hatred for somebody that causes a desire to harm them; మాలిన్యము.
(U) The ghosts are described as if they bear actual malice towards humans.
5. Usurp (v) : /Ju:’z3:p/ (యుజర్ప్) :
(M) to take somebody’s position and / or power without having the right to do this; ఇతరుల అధికారము బలవంతంగా లాగివేసుకొనుట.
(U) This decision will usurp the powers of the committee.
6. Scatheless (n) : (సేత్ లెస్) :
(M) harmless; హాని లేకుండా
(U) He felt like a man who has just come scatheless through the horrible crisis, and once more knows the sweet sensation of safety.
7. Pageant (n) : /’pædzənt/ (పేజంట్):
(M) an elaborate public display; బయటికి కన్పించు పెద్ద ప్రదర్శన అంశము
(U) Once the pageant was over, all the participants took their dresses back home.
8. Smite (V) : /smaıt/ (స్మైట్) :
(M) to hit somebody / something hard; కొట్టుట.
(U) He vowed that he would smite his enemy.
9. Mellifluous (adj) : /me’lıfluəs/ :
(M) sounding sweet and smooth; very pleasant to listen to; ఆహ్లాదకరమైన.
(U) She sounded quite mellifluous on the phone.
10. Quell (V) : /kw’el/ (క్వెల్) :
(M) to stop something such as violent behaviour or protests; అణచివేయుట.
(U) Extra police were called into quell the disturbances.
11. Anguish (n) : /’æŋgwıs/ (యాంగ్విష్) :
(M) Severe pain, mental suffering or un- happiness; మానసిక బాధ
(U) tears of anguish filled her eyes.
12. Pinion (V) : /’pınjən/ (పినియన్) :
(M) to hold or tie somebody, especially by their arms; మనిషిని పట్టుకొనుట
(U) His arms were pinioned to his sides.
13. Betray (V) : /bı’trəı/ (బిట్రే) :
(M) to give information about somebody / something to an enemy; మోసగించుట.
(U) He was offered money to betray his company.
14. Hanker (V) : /’hæŋkə(r)/ (హ్యాంకర్) :
(M) to have a strong desire for something; గట్టి కోరిక కలిగియుండుట.
(U) He had hankered after fame all his life.
15. Slake (v) : /’m()sı\(\Lambda\) (స్లేక్) :
(M) to lessen the force of; అధికారము తగ్గించుట.
(U) The electrolyte water should help slake the runners’ thirst during marathon.