AP Inter 2nd Year English Study Material Poem 3 The Builders

Andhra Pradesh BIEAP AP Inter 2nd Year English Study Material Poetry 3rd Poem The Builders Textbook Questions and Answers, Summary.

AP Inter 2nd Year English Study Material 3rd Poem The Builders

Paragraph Questions

Question 1.
What is the appropriateness of the title “The Builders” ? Do you agree with the poet about building one’s own life ?
Answer:
‘The Builders’ is an interesting poem written by the great American poet H.W. Longfellow. The poet compares men to builders. An individual’s life is controlled by time and he is the one who constructs the building of life. According to the poet, everybody plans his life according to his will. He experiences something and advances based on the previous experience. Everyday’s work is taken as a block in the construction of the building. There are people who build their character on good behaviour, with good blocks. Those lives have become buildings suitable for the dwelling of God. Thus people have to build huge buildings of character. The poet suggests the title, ‘The Builders’ and it is quite apt. The Builders’ అనే పేరు ఎట్లు తగియున్నది ? ఒక వ్యక్తి తన జీవితానికి తానే నిర్మాణకుడు అనే కవి అభిప్రాయంతో ఏకీభవిస్తారా ?

జ. H.W. Longfellow వ్రాసిన మంచి పద్యము “The Builders”. కవి మనుష్యులను నిర్మాణకులుగా పోలుస్తున్నారు. ఈ వ్యక్తి జీవితము కాలము చేత అజమాయిషీ చేయబడుతుంది మరియు జీవిత కట్టడాన్ని అతడే నిర్మిస్తాడు. కవి అభిప్రాయంలో ప్రతి వారు తన ఇష్ట ప్రకారము తన జీవితాన్ని నడుపుకొనుటకు యత్నిస్తాడు. అతనికి అనుభవం వస్తుంది. దాని మీద ఆధారపడి ముందుకుపోతాడు. ప్రతిరోజూ చేసే పని ఆ కట్టడానికి ఒక రాయి వంటిది. మంచి రాళ్ళతో, మంచి ప్రవర్తనతో, శీలం కలిగి యుండేవారున్నారు. ఈ కట్టడాలు భగవంతుడు ఉండటానికి తగిన జీవితాలుగా అవుతున్నాయి. ఈ విధంగా ప్రజలు శీలము అనే గొప్ప కట్టడాలు నిర్మించుకొనాలి. కవి “నిర్మాణకులు” అని పేరు పెట్టాడు అది చాలా తగియున్నది.

AP Inter 2nd Year English Study Material Poem 2 The Tables Turned

Question 2.
What is the central idea of the poem “The Builders’ ?
Answer:
‘The Builders is an interesting poem written by the great American poet “H.W. Longfellow”. The poet compares men to builders. The poet tells that all the people are the builders of their fate. Yesterday’s experience becomes today’s base and the experience is like a block, used in the construction. Everything is useful for the construction of the building. There should be no short comings in one’s behaviour. God should accept the brick. The building tumbles down, if the small mistakes in character are accepted. Today’s experience is the base for tomorrow. Thus the building of character, depends upon the person himself. In the poem, the rhyme scheme is, ABAB. It is a lyric poem.
The Builders’ పద్యం యొక్క సారాంశం వ్రాయుము.

జ. The Builders అనేది H.W. Longfellow అనే అమెరికా రచయిత వ్రాసిన మంచి పద్యము. మనుష్యులను నిర్మాణకులుగా పోలుస్తున్నాడు. ప్రపంచంలో అందరూ తమ యొక్క అదృష్టానికి నిర్మాణకులైయున్నారు. నిన్నటి అనుభవము ఈనాటికి పునాది. అది ఒక రాయివలె, నిర్మాణంలో పనికివస్తున్నది. కట్టడానికి ప్రతిదీ పనికివస్తుంది. ప్రవర్తనలో ఎట్టి లోట్లు ఉండరాదు. దేవుడు ఆ రాయిని అంగీకరించాలి. ప్రవర్తనలో చిన్న లోట్లు ఉంటే నిర్మాణము పడిపోతుంది. ఈ రోజు అనుభవము రేపటికి పునాది. ఈ విధంగా ప్రవర్తనా నిర్మాణము, ఆ వ్యక్తి మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ పద్యంలో rhyme ABAB గా ఉన్నది. ఇది ఒక సంగీతబద్ధమైన పద్యము.

Annotations

Question 1.
All are architects of Fate,
Working in these walls of time;
Answer:
Context: These lines are taken from the poem “The Builders”. written by H.W. Longfellow. Here people are compared to builders. The life is the structure and time controls it.

Explanation : These two lines reveal the aim of the poet. People in this life lead their life in the order they want to have for themselves. Time moves on, deciding the fate of each and every person. The experience they have each day can be compared to a block, in the construction of the building. The future, whether great or small depends upon the things used for the construction.

General Relevance : The comparison of life with a building makes one, thoughtful. Time is the main source of construction which controls the quality of the building.

సందర్భము : ‘The Builders” అనబడే H.W. Longfellow వ్రాసిన పద్యము నుండి ఈ లైనులు తీసుకొనబడినవి. ఇక్కడ ప్రజలు కట్టడ నిర్మాణకులుగా చెప్పబడ్డారు. జీవితము ఒక కట్టడమైతే దానిని సమయం అజమాయిషీ చేస్తుంది.

వివరణ : ఈ రెండు లైనులలో కవి తన అభిప్రాయాన్నిస్తున్నాడు. తమ జీవితాంతము అనుకొనిన రీతిగా తమ కొరకు ప్రజలు నడుపుకొంటారు. కాలం వారి అదృష్టాన్ని నిర్ణయిస్తూ సాగిపోతుంది. ఈ కట్టడ నిర్మాణంలో రాళ్ళవలె, ప్రతిదినము జరుగుతున్న అనుభవాన్ని పోల్చవచ్చును. భవిష్యత్తు గొప్పదైనా లేక తక్కువదైనా, ఆ కట్టడ ‘నిర్మాణంలోని రాళ్ళ మీద ఆధారపడి యుంటుంది.

సాధారణ అవగాహన : జీవితాన్ని ఒక కట్టడంలా పోల్చడం, ఆలోచింపజేస్తుంది. ఒక కట్టడం యొక్క ముఖ్య లక్షణాన్ని, కాలం అజమాయిషీ చేస్తుంది.

Question 2.
Time is with materials filled;
our todays and yesterdays, Are the blocks with which we build.
Answer:
Context: These lines are taken from the poem “The Builders” written by H.W. Longfellow. Here people are compared to builders. The life is the structure and time controls it.

Explanation : The poet aims at constructing the building of life, based on time. There is one experience today and it is like a block for the construction. Today’s block shall become a base for the next day’s construction. The blocks make the building qualitative. So one should look to the blocks and utilise them as time passes. The life of an individual should become great by changing according to time.

General Relevance : Whatever be the experience of today, is like a base for the next day. Time will decide the changes and the life style can be improved, accordingly.

సందర్భము : The Builders” అనబడే. H.W. Longfellow వ్రాసిన పద్యము నుండి ఈ లైనులు తీసుకొనబడినవి. ఇక్కడ ప్రజలు కట్టడ నిర్మాణకులుగా చెప్పబడ్డారు. జీవితము ఒక కట్టడమైతే దానిని సమయం అజమాయిషీ చేస్తుంది.

వివరణ : కవి, కాలం మీద ఆధారపడి జీవితసౌధాన్ని నిర్మిస్తాడు. ఈ రోజు ఒక అనుభవము ఉంటుంది అది నిర్మాణంలో ఒక రాయివలె ఉంటుంది. ఈ రోజు రాయి మరుసటి రోజు నిర్మాణానికి మూలంగా ఉంటుంది. రాళ్ళు కట్టడాన్ని బలంగా ఉంచుతాయి. కాలం జరిగిన కొలది, రాళ్ళను ఉపయోగించుకొని వానిని గమనించాలి. ఒక వ్యక్తి జీవితము కాలాన్ని బట్టి మార్చుకొంటూ గొప్ప చేసికొనాలి.

సాధారణ అవగాహన : ఈ రోజు అనుభవం ఏదైనా అది మరుసటి రోజుకు మూలము. కాలం మార్పులను నిర్దేశిస్తుంది. ఆ విధంగా జీవిత విధానం ఘనత నొందాలి.

AP Inter 2nd Year English Study Material Poem 2 The Tables Turned

Question 3.
Let us do our work as well,
Both the unseen and the seen
Answer:
Context: These lines are taken from the poem “The Builders” written by H.W. Longfellow. Here people are compared to builders. The life is the structure and time controls it.

Explanation : According to the poet, an individual is the builder of his own life. While the building of life is constructed, it is obvious that lapses exist. One may think them to be negligible but the poet warns to be careful about everything. Whether small or big, the block should be acceptable to God. The qualities of the individuals, should be good without any blemish. Life shall be meritorious only when each and every minute is particular about the quality.

General Relevance : Life’s merits like beauty, tranquility and peace should be observed. minutely. The poet expects perfect quality in one’s life.

సందర్భము : The Builders” అనబడే H.W. Longfellow వ్రాసిన పద్యము నుండి ఈ లైనులు తీసుకొనబడినవి. ఇక్కడ ప్రజలు కట్టడ నిర్మాణకులుగా చెప్పబడ్డారు. జీవితము ఒక కట్టడమైతే దానిని సమయం అజమాయిషీ చేస్తుంది.

వివరణ : కవి ఉద్దేశ్యంలో, ఒక వ్యక్తి తన యొక్క జీవితానికి నిర్మాణకుడైయున్నాడు. ఒక కట్టడం నిర్మిస్తుంటే, దానిలో లోపాలుండడం సహజము. వాటిని లక్ష్యపెట్టనక్కరలేదు అని అతడు అనుకొనవచ్చును. కానీ కవి యుద్దేశ్యంలో అది పెద్దదైనను లేక చిన్నదైనను జాగ్రత్త కలిగి యుండాలి. అది దేవునికి అంగీకారంగా ఉండాలి. మనిషి లక్షణాలు ఏ మాత్రం మచ్చలు లేనివిగా ఉండాలి. మంచి లక్షణాన్ని గురించి, ప్రతి నిమిషము జాగ్రత్తగా ఉంటేనే జీవితం ఘనంగా ఉంటుంది.

సాధారణ అవగాహన : అందము, శుద్ధత, శాంతి అనే లక్షణాలు జాగ్రత్తగా పరిశీలనలో ఉంచాలి. జీవితంలో మంచి లక్షణాన్ని కవి కాంక్షిస్తున్నాడు.

Question 4.
Thus alone can we attain,
To those turrets, where the eye
sees the world as one vast plain.
Answer:
Context: These lines are taken from the poem “The Builders”.written by H.W. Longfellow. Here people are compared to builders. The life is the structure and time controls it.’

Explanation : The poet wants to find the builder quite worthy. One’s life is built based on one’s behaviour. In this world every minute is valuable. The construction of the building of life is based on time. Time gives experience and experience is life. People should not be restricted to one place. They should become great citizens of the world. If there is magnanimity, the individual has a pleasing construction of life and he becomes great in life.

General Relevance : The poet wishes that an individual should not be limited to a country but they should be world citizens.

సందర్భము : The Builders” అనబడే H.W. Longfellow వ్రాసిన పద్యము నుండి ఈ లైనులు తీసుకొనబడినవి. ఇక్కడ ప్రజలు కట్టడ నిర్మాణకులుగా చెప్పబడ్డారు. జీవితము ఒక కట్టడమైతే దానిని సమయం అజమాయిషీ చేస్తుంది. వివరణ : నిర్మాణకుడు తగినవాడై ఉండాలి అని కవి కోరుతున్నాడు. ఒకని జీవితము అతని ప్రవర్తన మీద నాధారపడుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి నిమిషము విలువైనది. ఈ కట్టడ నిర్మాణము కాలము అనే పునాది మీద నాధారపడుతుంది. కాలము అనుభవాన్నిస్తుంది. అనుభవమే జీవితము. ప్రజలు ఒకే స్థానానికి అంటి పెట్టుకుని యుండరాదు. వారు ప్రపంచ పౌరులు కావాలి. వారికి విశాలభావము ఉంటే ఒక మంచి జీవితాన్ని నిర్మించవచ్చును. అతడు జీవితంలో గొప్పవాడవుతాడు.

సాధారణ అవగాహన : ప్రజలు ఒక జాతికి కట్టుబడిపోకూడదు. వారు ప్రపంచ పౌరులు కావాలని కవి యుద్దేశము.

The Builders Poem Summary in English

H.W. Longfellow wrote the poem ‘The Builders’. He was an American poet of the 19th century. His poems are musical in nature. The present poem gives a philosophical1 bent of mind.

The poet thinks that people in this world have to know a fact. We are like the builders. We are the builders of our own fate2. Time speaks of the things in our life. The doings of today are the steps for tomorrow. If there are any limitations3, they have to be corrected in course of time. There may be some secret4 lapses in our character. But they should be recognised and corrected.

We can reach the heights through hardwork, commitment5, honesty6 and integrity7. When we accept that we are the builders of ourselves, everyday becomes a part of its construction. High values are to be wrought8 by our deeds. Our life should become worthy to be pleasing God, to dwell9 in. If the weaknesses exist, the base shall be weak and the life of an individual becomes a weak building. We have to possess a wide angle of .. perception’. The building shall become strong and grow like a huge one, reaching the heights of the sky. So, the poet suggests that time has to be used carefully and the character should be built with high values.

1. వేదాంతపరమైన
2. అదృష్టము
3. లోపములు
4. లోపములు
5. కట్టుబడియుండుట
6. నిజాయితీ
7. సమగ్రత
8. సాధించబడెను
9. భావన

The Builders Poem Summary in Telugu

The Builders’ అనే ఈ పద్యాన్ని H.W. Longfellow వ్రాశారు. ఈయన 19వ శతాబ్దపు అమెరికా కవి. ఆయన పద్యములు సంగీతబద్ధంగా ఉంటాయి. ప్రస్తుత పద్యము ఆధ్యాత్మికతను చూపుచున్నది. ఈ ప్రపంచంలోని ప్రజలు ఒక సత్యాన్ని తెలుసుకొనాలి. మనము నిర్మాణకులవలె ఉన్నాము. మనం మన అదృష్టాన్ని మనమే నిర్మించుకొంటాము. మన జీవితంలోని విషయాలను కాలము తెలుపుతుంది. ఈనాటి పనులు రేపటికి ఆధారమైన మెట్ల వంటివి. ఏవైనా లోపాలు ఉంటే వాటిని కాలక్రమంలో సరిచేసుకోవాలి. మన ప్రవర్తనలో రహస్య లోట్లు ఉండవచ్చును. కానీ వాటిని గమనించి, సరిచేసికొనాలి.

మనం కష్టపడి పనిచేయడం, బాధ్యత వహించడం, నిజాయితీగా ఉండటం మరియు సమగ్రత కలిగి ఉండటం అనే వాని ద్వారా ఉన్నత శిఖరాలనందుకోవాలి. మన నిర్మాణకులం మనమే అని అంగీకరిస్తే మనము ప్రతి వారం దాని నిర్మాణంలో ఒక భాగం అవుతాము. మన చేష్టల ద్వారా ఉన్నత విలువలు సాధించాలి. మన జీవితం ద్వారా భగవంతుణ్ణి సంతృప్తిపరచే ఘనత కలిగియుండాలి. బలహీనతలు ఉంటే మనిషి యొక్క జీవిత కట్టడము బలహీనమౌతుంది. మనం ఒక విశాలమైన భావన కలిగియుండాలి. అప్పుడు ఆ కట్టడము బలం కలదై, భారీగా ఉండి ఆకాశాన్నంటుకొంటుంది. అందుచేత సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకొని, ప్రవర్తనను ఉన్నత విలువలతో నింపుకొనాలి.

The Builders Poem Glossary

1. Massive (adj) : /’mæssive/ (మ్యూసీవ్)
: (M) very large, heavy and solid; చాలా పెద్దదైన.
(U) The explosion made a massive hole in the ground.

2. Yawning(v) : /jAP Inter 2nd Year English Study Material Poem 3 The Builders 1n/ (యానింగ్)
: (M) to open your mouth wide and breathe in deeply through it, usually because you are tired or bored; అలసటతో నోరు వెళ్లబెట్టుట.
(U) We couldn’t help yawning during the speech.

3. Wrought (v) : /rAP Inter 2nd Year English Study Material Poem 3 The Builders 1t/ (రాట్) :
: (M) {{formal or literary) used only in past tense}
caused something to happen, especially a change; సంభవించెను.
(U) The Hud-Hud cyclone wrought havoc in the city of Vizag.

AP Inter 2nd Year English Study Material Poem 2 The Tables Turned

4. Stumble (n) : /s\(t \Lambda\)mbl/ (స్టంబుల్)
: (M) a problem or temporary failure when you are on the way to achieve something, an act of falling; ఆటంకము.
(U) After a slight stumble backwards, he regained his balance.

5. Ample (adj) : / ‘æmpl/ (యాంపుల్)
: (M) enough or more than enough; తగినంత.
(U) There was ample time to reach the airport.

6. Turret (n) : /\(t \Lambda\)ət/ (టరెట్)
: (M) a small tower on top of a building, especially a castle; ఒక భవంతి పైభాగము.
(U) A turret containing a huge bell was added to the castle.

Leave a Comment