AP Inter 2nd Year Economics Notes Chapter 9 Economy of Andhra Pradesh

Students can go through AP Inter 2nd Year Economics Notes 9th Lesson Economy of Andhra Pradesh will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Economics Notes 9th Lesson Economy of Andhra Pradesh

→ Andhra Pradesh was first state in India to form as a seperate state purely on the basis of language and culture. It was formed 1st October, 1953 Kurnool aS capital.

→ Andhra Pradesh consists of three regions.
Coastal Andhra (9 Districts)
Rayalaseema (4 Districts)

→ Total area of A.P is 160.21 lakh hectares, sq. km.

→ Three sectors A.P economy – Primary sector – Secondary sector – Tertiary sector.

→ State Gross Domestic Product (SGDP) is defined as the total value of final goods and services produced within geographical of the state-during a year.

AP Inter 2nd Year Economics Notes Chapter 9 Economy of Andhra Pradesh

→ Andhra Pradesh is considered as the Annapurna i.e. granary of South India.

→ Health for all of world health Organisation; govt of A.P is implementing different programmes like National Meternity Benefit programme, Integrated Child  Development Programme, Janani Suraksha Yojana.

→ Education – School education – Intermediate education. – Collegiate education – Technical education.

→ Agriculture sector – Share in GSDP – Source of livelihood – land utilisation – Area under Food crops – Irrigation.

→ Industrial sector – Share in GSDP – Employment Opportunities – Plan allocation for industries – Number of factories registered.

→ Service sector – Share in GSbP – Employment Generation-Irrigation – Power – Transportation.

→ IT / Softwcire industry – Latest IT Policy of AP – 2014.

→ Tourism – Tourism types.

→ Andlra Pradesh and welfare Programmes/Schemes.

→ SGDP : The State Gross Domestic Product may also be called as the State Income. The State gross domestic product is defined as the total value of the final/finished goods and services produced within the geographical boundaries of the State during a year.

AP Inter 2nd Year Economics Notes Chapter 9 Economy of Andhra Pradesh

→ Density of population : The density of population determines the magnitude of the burden that State is being called upon to carry and to determine the future potential of growth.

→ Sarva Siksha Abhiyan : This was introduced during 2001 – 2002 with an aim to provide universal elementary education for all children in the 6 to 14 age group by 2014 SSA has been renamed as ‘Rajiv Vidya Mission1 in A.P.

→ Eco- Tourism : Andhra Pradesh Vision -2020 envisaged East Godavari tourism as a growth engine. It is one of the important type of tourism in A.P. Maredumilli, Nelapattu (Nellore), Mamandur, Talakona (Chittoor), Balapalli (Kadapa), Ethipothala (Guntur), Kambala Konda (Visakhapatnam) are the famous eco-tourism centres in A.P.

→ ఆంధ్రప్రదేశ్ భారతదేశ భూభాగంలో 4.96 శాతం భూమి కలిగి, దేశంలో 8వ పెద్ద రాష్ట్రంగా ఉంది.

→ ఒక సంవత్సరకాలంలో రాష్ట్ర భౌగోళిక ఎల్లలలో ఆర్థిక కార్యకలాపాల వలన ఉత్పత్తైన మొత్తం వస్తు సేవల అంతిమ విలువను రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (GSDP) అంటారు.

→ 2013-14 (PE) సం॥ నాటి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి వృద్ధి శాతం కాగా భారతదేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు 4.74 శాతంగా ఉంది. (2004-05 నిలకడ ధరలలో).

→ 2011 సం॥ జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4.96 కోట్లతో దేశంలో 10వ స్థానంలో ఉంది.

→ 2011-12 లో టెండూల్కర్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో పేదరికం 9.2 శాతం కాగా దేశంలో పేదరికం 21.92 శాతంగా ఉంది.

→ 2011-12 సం॥ NSS వారి 68వ రౌండు అంచనాల ప్రకారం రాష్ట్ర నిరుద్యోగిత రేటు 43 శాతంకాగా దేశ సగటుకన్నా 34 శాతం ఎక్కువగా నమోదు అయ్యింది.

→ 2011 సం॥ జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత రేటు 67.41 శాతం. ఇందులో 74.83 శాతం పురుష అక్షరాస్యత కాగా 60.01 శాతం స్త్రీ అక్షరాస్యత. ఇది జాతీయ అక్షరాస్యత రేటుకన్నా రాష్ట్ర అక్షరాస్యత 5.58 తక్కువ.

→ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో 2013-14 (PE) లో వ్యవసాయ రంగం వాటా 23.33 శాతం, పారిశ్రామిక రంగం వాటా 20.71 శాతం, సేవల రంగం వాటా 55.96 శాతంగా ఉంది.

→ 2013-14 సం॥లో మొత్తం 81.28 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిలో 67.57 శాతం భూమిలో ఆహార పంటలు, 32.43 శాతం భూమిలో వాణిజ్య పంటలను పండిస్తున్నారు.

→ 2013-14 సం॥ నాటికి సేవల రంగం ఆర్జించినది రూ. 1,40,054 కోట్లు.

→ 2015-16 ఆర్థిక సం॥రానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతర విద్యుత్ సప్లైని ప్రకటించింది.

AP Inter 2nd Year Economics Notes Chapter 9 Economy of Andhra Pradesh

→ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర, జాతీయ రహదారుల మొత్తం 1,46,954 కి.మీ.

→ భారతదేశంలో గుజరాత్ తర్వాత 972 కి.మీ. సముద్రతీర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రెండవస్థానంలో ఉంది.

→ దేశ భూభాగంలో 496% భూమిని కల్గిన 8వ పెద్ద రాష్ట్రముగా ఉన్నది. రాష్ట్రం 4.6 కోట్ల జనాభాతో దేశ జనాభాలో 4.10% కల్గి ఉండి జనాభా దృష్ట్యా 10వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది.

→ ఒక సంవత్సర కాలంలో రాష్ట్ర భౌగోళిక ఎల్లల్లో ఆర్థిక కార్యకలాపాల వల్ల ఉత్పత్తైన మొత్తం వస్తు సేవల అంతిమ విలువను రాష్ట్ర స్థూల అంతర్గత ఆదాయం (SGDP) అంటారు.

→ రాష్ట్ర (GSDP) భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో 4.36% కల్గిఉంది.

→ 2011 జనాభా లెక్కల ప్రకారం 13 జిల్లాలలోని మరియు 4.96 కోట్ల జనాభాతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 10వ స్థానంలో నిలిచింది.

→ రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో వివిధ రంగాల వాటా 2013-14 సం॥లలో వ్యవసాయ రంగం 29.85% ; పారిశ్రామిక రంగం 21.61%; సేవారంగం 48.54%.

→ ఆరోగ్య రంగం ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషించుచున్నది.

→ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పథకాలు – జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ – జవహర్ బాల ఆరోగ్య రక్ష – ఆరోగ్యశ్రీ పథకం, జనని శిశు సురక్ష కార్యక్రమం – జనని సురక్ష యోజన.

→ మన రాష్ట్రంలో కూడా సేవారంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. 2013-14 లో GSDP. 55.99 శాతంగా సేవారంగం అందించుచున్నది. ఉపాధి కల్పనలో సేవారంగం రెండవ స్థానాన్ని ఆక్రమించినది.

→ ప్రస్తుతం రాష్ట్రంలో జలయజ్ఞం భాగంగా 52 లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో 54 భారీ, మధ్యతరహా, ఇతర ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్నాయి.

→ పోలవరం ప్రాజెక్టు ఒక బహుళార్థక సాగు నీటి ప్రాజెక్టుగా చేపట్టబడి ఇటీవల కేంద్ర ప్రభుత్వంచే “జాతీయ ప్రాజెక్ట్ హోదా” పొందినది.

→ 2015 – 16 ఆర్థిక సం॥రానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం విద్యుత్ సప్లైని ప్రకటించినది. ప్రస్తుతం A.P. రాష్ట్రం 16,717 MW ల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యాన్ని కల్గిఉంది. ఇందులో థర్మల్ 70% కాగా, 21 శాతం హైడల్ ద్వారా సాధిస్తున్నది.

→ రవాణా వ్యవస్థలో రోడ్లు అతిముఖ్యమైనది. ఇది 80% ప్రయాణికులకు వస్తు రవాణా అవసరాలు తీరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ 42,511 కి.మీ.ల రాష్ట్ర రహదార్లు, 3, 144 కి.మీ. జాతీయ రహదార్లు, 1,01,484 కి.మీ. జిల్లా రోడ్లను కలుపుకొని మొత్తం 1,46,954 కి.మీ. విస్తారమైన నెట్వర్క్ కల్గిఉంది. రాష్ట్రంలోని రోడ్డు రవాణా అభివృద్ధి సంస్థ నిర్వహణ బాధ్యత కల్గి ఉంది.

→ సాఫ్ట్వేర్ పరిశ్రమ, సమాచార సాంకేతిక రంగంలోని ప్రధాన అంశం. విభజనానంతరం వైజాగ్ నగరం ఐ.టి. సెంటర్గా అభివృద్ధి చెందుటకు అన్ని అనుకూల అంశాలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది.

→ విభజనానంతరం ఐ.టి. రంగ అభివృద్ధిలో తలెత్తే సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వం ఐ.సి.టి పరిశ్రమను అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ పునర్ చిత్రీకరణ “ఈ – గవర్నెన్స్ – ఎలక్ట్రానిక్స్ మరియు ఐ.టి. రంగాలు” తయారు చేసింది.

→ ఆంధ్రప్రదేశ్ “”భారతదేశ కోహినూర్” గా మరియు పర్యాటకం విషయంలో దేశంలోనే గమ్యస్థాన రాష్ట్రంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ అనునది రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రభుత్వ ఏజెన్సీ సంస్థ.

→ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సాంఘిక సంక్షేమ పథకాలను అమలుచేయుచున్నది.

Leave a Comment