AP Inter 2nd Year Economics Notes Chapter 5 Industrial Sector

Students can go through AP Inter 2nd Year Economics Notes 5th Lesson Industrial Sector will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Economics Notes 5th Lesson Industrial Sector

→ Role of industrial sector in Indian economy – share of industries in the GDP – Increase in employment opportunities- share of industrial sector in national income – Growth of large scale industries – Growth in the production of durable consumer goods.

→ Industrial policy aims at systematic development of industries. The pattern of industrilisation to be achived by the Government indicated through the policy.

→ 1948 policy contents – Classification of industries – Small scale industries – Labour mangement relations, Foreign capital tarriff policy.

→ 1956 policy contents – Classification of industries – Small scale industries, Labour management relations – Reduction of regional imbalances, Technical and managerial personnel.

AP Inter 2nd Year Economics Notes Chapter 5 Industrial Sector

→ 1991 policy contents – Objectives – Abolition of industrial licensing policy regarding public sector, MRTP unit foreign investment and technology – Removal of mandatory converterbility – Providing small scale industries.

→ The Government of India brings back industrial policy into focus in the form of National manufacturing policy on November 4, 2011 – Objectives – Zones.

→ Disinvestment – The Govt of India initiated the process in 1991 – features.

→ Foreign direct investment -FDI is a major source of non – debt financial resource for the economic development of India – FDI flows.

→ Special Economic zones : The SEZ Act came in to force in 2006. Objectives – Advantages.

→ Causes of industrial backwardness in India – under utlisation of resources – Political factors – Infrastructural constraints – Saps between targets – Emergency challenger.

→ Small scale Enterprises (MSMES) – Importance Problems.

→ Industrial Estates – Industrial Finance – IFCI, SFC – ICICI – IDBI – SIDBI – V.C. F, L.I.C – G.I.C

→ Industrial development plans from 1st plan to 12th plan.

→ IDBI: The Industrial Development Bank of India. The IDBI was set up 1st 1964. The IDBI was initially set up as a wholly owned subsidiary of the R.B.I. In February 16, 1976 the IDBI was made an autonomous institution and its ownership passed on from the RBI to the Government of India.

AP Inter 2nd Year Economics Notes Chapter 5 Industrial Sector

→ Disinvestment : The Government of India in July 1991 initated the disinvestment process in India. The new industrial policy provides that in order to raise resources and encourage wide public participation, apart of the government share, holding in the public sector would be offered to mutual funds financial institutions, general public and employees.

→ Special Economic Zones : The Government of India announced Special Economic zones policy in April 2000. This policy objective is at rapid economic growth supported by quality infrastructure complemented by an attractive fiscal package both at central and state level with minimum possible regulations. This act came into effect from February 2006.

→ Industrial Estates : It was established in the year 1955 by small scale industries board for the development of small scale industries. An industrial estate is a group of small scale units constructed on an economic scale in suitable sizes with facilities of water transport, electricity, banks and is provided with special arrangements for technical guidance and common service facilities.

→ ICICI: Industrial Credit and Investment Corporation India. It was set up in January 1955 and it commenced business in March of the same year. It was second all India development financial institution to be established in the country. It was a private sector development financial institution.

→ Globalization : It is the process of integrating various economies of the world without creating and hindrances the free flow of goods and services, technology, capital even labour or human capital.

→ దేశంలో లభ్యమవుతున్న ముడిసరుకులను ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించి ఉత్పాదక వస్తువులుగా, వినియోగ వస్తువులుగా తయారుచేయడమే పారిశ్రామికీకరణ.

→ హాన్స్ సింగర్ అనే ఆర్థికవేత్త ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగంపై ఆధారపడే ప్రజలు 80 శాతం నుండి 15 శాతానికి తగ్గితే ఆర్థికాభివృద్ధి సాధించినట్లని అభిప్రాయపడెను.

→ అభివృద్ధి చెందుతున్న భారతదేశంలాంటి దేశానికి పారిశ్రామికీకరణ అత్యావశ్యకము.

→ పారిశ్రామికీకరణ వలన ఆదాయాభివృద్ధి, ఆర్ధికవ్యవస్థ నిర్మాణములో మార్పు. అధికాదాయ వర్గాల డిమాండ్ను తీర్చుట. విదేశీ వ్యాపారంలో వృద్ధి, ఉద్యోగ అవకాశాల కల్పన, సాంకేతిక పురోగతి, ఆర్థిక వ్యవస్థ బలపడటం మొదలైన ప్రయోజనాలు చేకూరుతాయి.

→ స్వాతంత్ర్యము పొందిన తరువాత 1948, 1956, 1991 సం॥లలో పారిశ్రామిక తీర్మానాలు చేయటం జరిగింది.

→ 2011వ సంవత్సరమున ప్రభుత్వము ఒక బృహత్తర పారిశ్రామిక తీర్మానాన్ని ప్రకటించింది. వ్యాపార నియంత్రణలను సడలిస్తూ దేశ ప్రయోజనాలు బలహీనపరచని విధంగా భారత జాతీయ తయారీ విధానాన్ని ప్రకటించడమైనది. ఈ విధానము వలన ప్రయోజనాలున్నాయి. ఈ విధానంలో లోపాలు కూడా ఉన్నాయి.

→ నూతన ఆర్థిక విధానములో భాగముగా ప్రభుత్వము జూలై 1991 నుండి పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని అనుసరిస్తున్నది.

→ భారత ప్రభుత్వం నవంబర్ 3, 2005 వ సం॥లో ‘జాతీయ పెట్టుబడి నిధి’ ని ఏర్పాటు చేసింది.

→ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 1991 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రోత్సహించింది.

→ భారత ప్రభుత్వం మే నెల 2005 సం॥లో ప్రత్యేక ఆర్థిక మండళ్ళు ఏర్పాటుకు చట్టాన్ని రూపొందించి ఫిబ్రవరి 2006 సం॥ నుండి కార్యకలాపాలను కొనసాగిస్తున్నది. వీటి వలన అనేక ప్రయోజనాలున్నాయి.

AP Inter 2nd Year Economics Notes Chapter 5 Industrial Sector

→ భారత ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకొన్నప్పటికి పారిశ్రామికరంగం వెనుకబడే ఉంది. దానికి కారణం; ఉత్పాదక సామర్థ్యాన్ని తక్కువగా వినియోగించుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు, రాజకీయ కారణాలు, అవస్థాపనా సౌకర్యాల కొరత, లక్ష్యాలను మరియు సాధించిన ప్రగతికి మధ్య వ్యత్యాసము, తక్షణ సవాళ్ళు.

→ భారత ప్రభుత్వం 1948, 1956, 1977 పారిశ్రామిక తీర్మానాలు చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాయి.

→ భారతదేశ ఆర్థికాభివృద్ధిని ముందుకుతీసుకు వెళ్ళటంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ప్రముఖ పాత్ర వహించాయి.

→ ఆధునిక చిన్న పరిశ్రమలను అభివృద్ధి పరచటానికి పారిశ్రామిక క్షేత్రాలు ఎంతగానో తోడ్పడ్డాయి.

→ భారత ప్రభుత్వము పారిశ్రామిక విత్తమును సమకూర్చటానికి IFCI, SFC’s, ICICI, IDBI, SIDBI, IIBI మొదలైన విత్తసంస్థలను ప్రారంభానికి సూత్రదారి అయింది.

→ భారతదేశ పంచవర్ష ప్రణాళికలలో పారిశ్రామికాభివృద్ధి కొరకు సముచితమైన కేటాయింపులు చేసింది.

→ దేశంలో లభ్యమవుతున్న ముడి సరుకులను ఉత్పత్తి ప్రక్రియలో వినియోగించి ఉత్పాదక, వినియోగ వస్తువులుగా తయారు చేయడాన్ని పారిశ్రామికీకరణ అంటారు.

→ పారిశ్రామికీకరణ ఫలితంగా ఉద్యోగిత, ఆదాయాల పెరుగుదలే కాక తలసరి ఆదాయం వినియోగ వ్యయంతో పాటు జీవన ప్రమాణం పెరుగుతుంది.

→ 1948వ పారిశ్రామిక విధాన తీర్మానం భారతదేశాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా మార్చింది.

→ 1956లో ప్రారంభం కానున్న రెండవ పంచవర్ష ప్రణాళిక పారిశ్రామికీకరణకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక, భారీ పరిశ్రమల స్థాపనకు పూనుకొంది.

→ 1991 పారిశ్రామిక విధాన తీర్మానం భారతీయ పరిశ్రమ సామర్థ్యాన్ని పెంచి, ప్రపంచ దేశాలతో పోటీపడేలా చేయాలని, అవసరమైన నియంత్రణలన్నింటిని తొలగించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

→ ప్రభుత్వ రంగం నుంచి ప్రభుత్వము తన వాటాను ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తులకు అమ్ముటను పెట్టుబడి ఉపసంహరణ అంటారు.

→ అవస్థాపనా సౌకర్యాలు, పన్ను రాయితీలు ఇచ్చుట ద్వారా ఒక ప్రాంత శీఘ్రు పారిశ్రామికీకరణకు తోడ్పడునది ప్రత్యేక ఆర్థిక మండళ్ళు.

→ భారతదేశం పారిశ్రామికంగా వెనుకబడి ఉండటానికి గల కారణాలు సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోలేక పోవడం, ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు, అవస్థాపనా సౌకర్యాల కొరత, ప్రాంతీయ అసమానతల వృద్ధి, పారిశ్రామిక రుగ్మత.

→ చిన్న తరహా పరిశ్రమల ప్రాధాన్యత, ఉద్యోగ అవకాశాలు, ఉత్పత్తిలో ప్రగతి, తక్కువ మూలధనం, ప్రాంతీయాభివృద్ధి మొదలగునవి.

→ చిన్న తరహా పరిశ్రమల సమస్యలు – పెట్టుబడి కొరత, పురాతన యంత్రాలు, అవస్థాపనా సౌకర్యాల కొరత, ప్రపంచీకరణ, సరళీకరణ ప్రభుత్వ విధానాలు.

→ పారిశ్రామిక విత్తం, చర మూలధనం, స్థిర మూలధనం, వీటిని సమకూర్చడానికి భారత పారిశ్రామిక విత్త సంస్థ, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ, భారత పారిశ్రామిక పరపతి పెట్టుబడి సంస్థ, భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు మొదలగునవి ప్రారంభించటం జరిగింది.

Leave a Comment