AP Inter 2nd Year Economics Notes Chapter 4 Agriculture Sector

Students can go through AP Inter 2nd Year Economics Notes 4th Lesson Agriculture Sector will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Economics Notes 4th Lesson Agriculture Sector

→ Agriculture sector is the dynamic force behind the development of industrial sector as well as the economy.

→ Agricultural sector contributed to the economy – Product contribution – Factor contribution – Market contribution. _

→ Importance of Agriculture in Indian economy – Contribution to the GDP – Employment generation – Development of industries – Achievement of food security – Expansion of exports – Provides better nutrition – Other factors.

→ Causes for Low productivity – General factors – Institutional factors – Technical factors – Environmental factors’.

→ Green revolution was also called as “new strategy of agricultural development”.

→ Impact of green revolution – Increase in food grain production – Boost employment generation – Improvement in income – Improvement in exports.

AP Inter 2nd Year Economics Notes Chapter 4 Agriculture Sector

→ Rural Inf restructure Development Fund (RIDF) was created in 1995 – 96 from out of short fall of commercial banks lending to priority sectors and agriculture.

→ Kissan credit cards was introduced in August 1998 to facilitate the flow for crop loan by providing adequate, timely – cost – effective short term loans.

→ SGSY – Institutional credit is Swarnajayanthi Gram Swarozgar Yojana started on April 1st 1999.

→ Consolidation of land holdings, creation of economic land holdings and co-operative farming are the measure to increase the size of land holdings.

→ Agricultural development, economic development, enhancing agricultural productive and social justice are the objectives of land reforms.

→ Abolition of intermediaries, tenancy reforms and ceiling on land – holdings are introduced by the Government as land reforms.

→ The revolutionary growth in the agriculture sector can described as green revolution.

→ Ancestral debt, poverty, natural calamities, money lenders, litigation etc., are the causes for rural indebtedness.

→ RBI, SBI, ARDC, RRB’s and NABARD are providing rural credit for the development of agriculture.

→ The agricultural market system in India is defective and consists of many drawbacks. Therefore Government has been taken a number of steps to improved.

AP Inter 2nd Year Economics Notes Chapter 4 Agriculture Sector

→ Agriculture sector : It is the sector which includes forestry, fishing, mining and quarrying and allied activities like animal husbandry etc., along with agriculture.

→ Agro based industries : Industries which depend an agriculture products for their raw materials are called agro based industries. Ex : Cotton, Textile, Flour mills, Sugar etc., directly depend on agriculture for raw materials.

→ Organic farming : It is the farming which uses natural fertilizers and pesticides.

→ Economic holdings : Economic holdings is the size of holdings which provides a decant standard of giving of the members of the family.

→ Co-operative farming : Co-operative farming means where the total land of village pooled into one unit and farmed together.

→ Green revolution : William S. Gand is the first economist who used the term green revolution. It was also called a “new strategy of agriculture development”. It is the result of the technological break through composed of improved irrigation facilities, better agricultural practices and mechanisation of agricultural operations.

→ Kisan credit cards : It was introduced in 1998 to facilitate the flow for crop loan by providing adequate, timely cost, effective short term loans. It also enables the farmers to purchase agriculture inputs and to draw cash for their production needs.

→ Micro Finance: It is the provision of finance on a small scale to the rural and urban poor.

→ AGMARK: It is simply an abbreviation for agriculture marketing which is the symbol of quality of produce.

→ Rythu Bazar : It is a market where there is no existence of middle men between farmer Vs buyer.

→ మన దేశంలో వ్యవసాయం ప్రజలకు వృత్తిగానే కాకుండా వారి జీవన విధానంలో ప్రధాన అంశముగా రూపొందినది.

→ వ్యవసాయరంగం మూడు రకాలైన సహకారాన్ని అందిస్తూ ఉంటుంది. అవి :

  • ఉత్పత్తి సహకారం,
  • ఉత్పత్తి కారకాల అనుకూల సహకారం,
  • మార్కెట్ సహకారం.

→ భారత ఆర్థికవ్యవస్థలో వ్యవసాయ రంగం చాలా ప్రాధాన్యతను కలిగిఉంది. స్థూలదేశీయోత్పత్తి, ఉపాధికల్పన, పారిశ్రామికాభివృద్ధికి సహకారం, పారిశ్రామిక వస్తువులకు మార్కెట్, ఆహార భద్రత, ఎగుమతులు మొదలైన విషయాలలో తోడ్పడుతుంది.

→ నిర్ణీతకాలంలో ఒక దేశంలో వ్యవసాయభూమిని వివిధ పంటలలో పండించటానికి ఉపయోగిస్తున్న రీతిని ‘పంటల తీరు’ అంటారు.

→ వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండటానికి సాధారణ కారణాలు, వ్యవస్థ పూర్వకారణాలు, సాంకేతికపరమైన కారణాలు. పర్యావరణ పరమైన కారణాలున్నాయి.

→ ప్రకృతిసిద్ధంగా లభించే ఎరువులను, క్రిమిసంహారక మందులను ఉపయోగించి వ్యవసాయం చేయడాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు.

AP Inter 2nd Year Economics Notes Chapter 4 Agriculture Sector

→ భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచటానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంది. పంటలకు మద్దతు ధరల ప్రకటన. పంట ఋణాలు, దీర్ఘకాలిక ఋణాలు, భూసంస్కరణ అమలు మొదలైనవి.

→ గురుత్వం, సామాజిక న్యాయం కలగలిపి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించటానికి వీలుగా భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు భూసంస్కరణలను అమలుపర్చాలని నిర్ణయించాయి.

→ మధ్యవర్తుల తొలగింపు. భూమి అనుభవ సంస్కరణలు, వ్యవసాయ పునఃవ్యవస్థీకరణ, భూకమతాలపై గరిష్ఠ పరిమితిని విధించడం, కమతాల సమీకరణ, సహకార వ్యవసాయం మొదలైనవి భూసంస్కరణలలోని ముఖ్యాంశాలు.

→ హరిత విప్లవం వ్యవసాయాభివృద్ధికి అవలంబించే ఒక నూతన వ్యూహము.

→ హరిత విప్లవం వలన ఆహారధాన్యాలు పెరిగాయి. ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఆదాయాలు పెరిగాయి, ఎగుమతులు పెరిగాయి.

→ రైతులు ఋణాలను చెల్లించలేనపుడు ఋణం భారంగా మారుతుంది. క్రమంగా ఈ ఋణాలు పెరిగి గ్రామీణులు ఋణగ్రస్తులౌతారు.

→ గ్రామీణ ఋణభారానికి పేదరికం, అతివృష్టి – అనావృష్టి. అనుత్పాదక పనులపై ఖర్చు, వారసత్వపు ఋణాలు, పంటలకు మద్దతు ధరలు లేకపోవటం, అనారోగ్యం, వ్యవసాయ సంబంధమైన అవస్థాపనా సౌకర్యాలపై ప్రభుత్వం పెట్టుబడి తగ్గటం మొదలైనవి.

→ నాబార్డ్ సహకార పరపతి వ్యవస్థను బలోపేతం చేయడానికి విశేష కృషి చేస్తోంది. వ్యవసాయాభివృద్ధికే కాకుండా వ్యవసాయేతర రంగాల అభివృద్ధికి కూడ కృషి చేస్తోంది. ప్రభుత్వము, RBI, సహకార పరపతి సంఘాలు, వాణిజ్యబాంకులు మొదలైనవి వ్యవసాయాభివృద్ధి పరపతి సహకారం అందజేస్తున్నాయి.

→ భారతదేశ వ్యవసాయ మార్కెట్లలో అనేక సమస్యలున్నాయి. గిడ్డంగి సౌకర్యాలు లేకపోవడం, బలవంతపు అమ్మకాలు, సరైన శ్రేణీకరణ లేకపోవడం, దళారీలు ఎక్కువగా ఉండటం, మార్కెట్లో జరిగే మోసాలు, మార్కెట్ సమాచారం సరిగా అందకపోవటం. రైతులు అసంఘటితంగా ఉండటం మొదలైనవి.

AP Inter 2nd Year Economics Notes Chapter 4 Agriculture Sector

→ మార్కెట్ సమస్యల పరిష్కారానికి, క్రమబద్ధమైన మార్కెట్ల ఏర్పాటు, రైతుబజార్ల ఏర్పాటు, పరపతి విధానాన్ని మార్కెట్తో సంధానం చేయటం, ప్రమాణీకరించిన తూనికలు, కొలతలను ఉపయోగించటం, గిడ్డంగి సౌకర్యాలు కల్పించటం మొదలైనవి.

→ భారతదేశంలో వ్యవసాయం ప్రజల యొక్క ప్రధాన వృత్తిగానే కాకుండా వారి జీవన విధానంలో ప్రధాన అంశంగా ఉంది.

→ మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగ పాత్ర కీలకమైనది. స్థూలదేశీయోత్పత్తి ఉపాధికల్పన, పారిశ్రామికాభివృద్ధికి, పారిశ్రామిక వస్తువుల మార్కెట్ కు, ఎగుమతుల విషయంలో తోడ్పడుతుంది.

→ మనదేశంలో వ్యవసాయ రంగం లక్షణాలు – అనిశ్చితమైన వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ రంగంలో భూస్వామ్యం – గ్రామీణ రుణగ్రస్తత, శ్రామిక మార్కెట్లో ద్వంద్వత్వం వ్యవసాయరంగంలో భిన్నత్వం.

→ భారతదేశంలో వ్యవసాయ శ్రామికులు – అల్ప సాంఘిక, తోద అసంఘటిత శ్రామికులు – రుణ సంబంధిత ఉద్యోగిత – అల్ప వేతనాలు – గ్రామీణ రుణగ్రస్తత – అధిక సంఖ్యలో బాల కార్మికులు – వ్యవసాయేతర వృత్తుల కొరత.

→ పంటల తీరును ప్రభావితం చేసే అంశాలు

  • భౌతికాంశాలు
  • ఆర్థికాంశాలు.

→ భారతదేశంలో నీటిపారుదల సౌకర్యాలు- ఉపరితల నీటిపారుదల, స్థానీకీకరణ నీటిపారుదల, బిందు నీటిపారుదల, తుంపరల నీటిపారుదల, ఉపనీటి నీటిపారుదల.

→ వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండటానికి సాధారణ కారణాలు, వ్యవస్థాపూర్వక కారణాలు, సాంకేతిక పరమైన కారణాలు, పర్యావరణ కారణాలు.

→ సామాజిక న్యాయం అందించేందుకు భూసంస్కరణ ప్రభుత్వం అమలు పరిచింది.

→ మధ్యవర్తుల తొలగింపు, భూమి సంస్కరణలు, భూకమతాలపై గరిష్ట పరిమితి విధించడం. కమతాల సమీకరణ, సహకార వ్యవసాయ భూసంస్కరణలోని ముఖ్యాంశాలు.

→ హరిత విప్లవం వ్యవసాయాభివృద్ధికి అవలంభించే ఒక నూతన వ్యూహము.

→ వ్యవసాయ పరిపతి వర్గీకరణ – స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పరపతి.

→ భారతదేశంలో వ్యవసాయ పరపతి ఆధారాలు – సంస్థాగత మూలాధారాలు – సంఘేతర మూలాధారాలు.

→ గ్రామీణ రుణగ్రస్తదారు కారణాలు – వారసత్వపు అప్పులు – పేదరికం, ప్రకృతి వైపరీత్యాలు రైతుల దుబారా వ్యయం – వడ్డీ వ్యాపారులు, అల్పకమతాలు, న్యాయపరమైన వ్యవహారాలు భూమిపై మక్కువ – ఇతరకారణాలు.

→ వ్యవసాయ మార్కెటింగ్ లోపాలు – మధ్యవర్తుల జోక్యం – మోసపూరిత విధానాలు రవాణా సౌకర్యాల కొరత – గిడ్డంగి సౌకర్యాల కొరత – మార్కెట్ సమాచారం లోపం పరపతి సౌకర్యాల కొరత, రైతులు అసంఘటితంగా ఉండటం.

→ నివారణ చర్యలు – క్రమబద్ధమైన మార్కెట్లు- సహకార మార్కెటింగ్, ఒప్పందపు వ్యవసాయం, రైతు బజార్లు, గిడ్డంగి సదుపాయాలు – రవాణా సౌకర్యాలు, పరపతి సౌకర్యాలు – మార్కెట్ ధరల సమాచారం.

Leave a Comment