Students can go through AP Inter 2nd Year Commerce Notes 4th Lesson Financial Markets will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Commerce Notes 4th Lesson Financial Markets
→ A financial market is a place where buyers and sellers participate in the trade of financial assets such equities, bonds, currencies etc.
→ A financial market is classified into money market and capital market.
→ The money market is a market for short term funds which deals in financial assets whose period of maturity is less than one year.
→ The components of money market are
- Call money market
- Acceptance market
- Bill market
- Collateral loan market.
→ The instruments in money market are
a) Treasury bills
b) Commercial paper
c) Call money
d) Certificates of deposits
e) Commercial bills
f) Collateral loans.
→ Capital market is a place where institutional arrangements are made for long-term funds both equity and debt.
→ Capital market is classified into primary market and secondary market. In primary market new securities are issued for first time. Secondary market or stock exchange is a market for purchase and sale of existing securities.
→ Capital markets instruments are SPN, deep discount bohds, equity shares with detachable warrants, fully convertible debentures with interest, sweat equity shares, disaster bonds, foreign currency convertible bonds are derivaties.
→ Stock exchange is a body of individuals, constituted for the purpose of assisting, regulating or controlling the business of buying and selling or dealing in securities.
→ SEBI was established by the Government of India as an interim administrative body to promote orderly and healthy growth of securities market and to protect investors.
→ ద్రవ్యత్వ ఆస్తులైన వాటాలు, బాండ్లు, కరెన్సీ నోట్లు మరియు డెరివేటివ్స్ వర్తకం కొరకు కొనుగోలు మరియు అమ్మకందార్లు పాల్గొనే ఏ మార్కెట్ స్థలమైన అది విత్తమార్కెట్ అవుతుంది.
→ ఒక సంవత్సరంలోపు కాలపరిమితి గల స్వల్పకాలిక నిధులు / ద్రవ్యత్వ ఆస్తులతో వ్యవహారాలు జరిపే మార్కెట్ను ద్రవ్య మార్కెట్ అంటారు.
→ ద్రవ్య మార్కెట్ యొక్క ప్రాథమిక భాగాలు :
- పిలుపు ద్రవ్య మార్కెట్,
- అంగీకార మార్కెట్,
- బిల్ మార్కెట్,
- అనుషంగిక ఋణ మార్కెట్
→ నిర్ణీత కాలపరిమితికి జారీచేసి, తిరిగి విముక్తి చేయు సెక్యూరిటీ లేని ప్రామిసరీ నోటు, అన్యాక్రాంత మరియు బదిలీ యోగ్యతగల పత్రాన్ని ‘వాణిజ్య పత్రం’ అంటారు.
→ వ్యాపారం చేసే వివిధ సంస్థలు నిర్వహణ మూలధన అవసరాలకు జారీ చేసే బిల్లులను వాణిజ్య బిల్లులంటారు.
→ ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లు ఆధారంగా వాణిజ్య బాంకులు అందజేసే ఋణాలను ‘అనుషంగిక ఋణాలు’ అంటారు.
→ మూలధన మార్కెట్ అనే పదం దీర్ఘకాలిక ఋణాలు సమకూర్చే సంస్థలు మరియు సదుపాయాలను తెల్పుతుంది.
→ మూలధన మార్కెట్ను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి :
- ప్రాథమిక మార్కెట్ మరియు
- ద్వితీయ మార్కెట్.
→ ప్రాథమిక మార్కెట్ను నూతన జారీల మార్కెట్ అని కూడా అంటారు.
→ ద్వితీయ మార్కెట్ను స్టాక్ మార్కెట్ లేదా స్టాక్ ఎక్సేంజ్ అని కూడా అంటారు.
→ ప్రీమియంతో విమోచనం కాగల మరియు వేరు చేయగల వారంటీతో నాలుగు నుండి ఏడు సం॥ల కాలవ్యవధిలో జారీచేసిన డిబెంచర్లను ‘రక్షిత ప్రీమియం నోట్లు’ అంటారు.
→ కాలవ్యవధి తీరిన తర్వాత సమాన విలువకు విమోచనం చేసే ఉద్దేశంతో డిస్కౌంటు విక్రయించే బాండ్లను ‘డిస్కౌంట్ బాండ్లు’ అంటారు.
→ ఉద్యోగులు లేదా డైరెక్టర్లు చేసిన పనికి గుర్తింపుగా సంస్థ వారికి జారీ చేసే ఈక్విటీ వాటాలను ‘స్వెట్ ఈక్విటీ వాటాలు’ అంటారు.
→ భారతదేశంలో మొట్టమొదటి స్టాక్ ఎక్సేంజ్ నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ను బొంబాయి నగరంలో 1875 సం॥లో స్థాపించినారు.
→ భారతీయ మార్కెట్లలో BSE – SENSEX మరియు NSE – NIFTY లు ముఖ్యమైన సూచీలు.
→ సెన్సెక్స్ను సెన్సిటివ్ ఇండెక్స్ అంటారు. సెన్సెక్స్ అనేది BSE యొక్క బెంచ్ మార్క్ ఇండెక్స్. BSE -సెన్సెక్స్ను BSE – 30 అని కూడా అంటారు.
→ జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీని నిఫ్టీ అంటారు.
→ ఎలక్ట్రానిక్ రూపంలో సెక్యూరిటీలను కలిగి ఉండే విధానాన్ని ‘డిమెటీరియలైజేషన్’ అంటారు.
→ ద్రవ్యత్వ ఆస్తులైన వాటాలు, బాండ్లు, కరెన్సీ నోట్లు మరియు డెరివేటివ్స్ ట్రేడింగ్ కొరకు కొనుగోలుదారులు, అమ్మకపు దారులు పాల్గొనే ఏ మార్కెట్ స్థలమైనా విత్తమార్కెట్. విత్తమార్కెట్లో రెండు భాగాలుంటాయి. అవి ద్రవ్య మార్కెట్ మరియు మూలధన మార్కెట్.
→ ఒక సంవత్సరంలోపు కాలపరిమితిగల స్వల్పకాలిక నిధులు ద్రవ్యత్వ ఆస్తులతో, వ్యవహారాలు జరిపే మార్కెట్ను ద్రవ్య మార్కెట్ అంటారు. దీనిలో పిలుపు ద్రవ్య మార్కెట్, స్వీకృతి మార్కెట్, బిల్ మార్కెట్, అనుషంగిక ఋణ మార్కెట్లు ఉంటాయి. ద్రవ్య మార్కెట్లో ముఖ్య సాధనాలు ట్రెజరీబిల్, వాణిజ్యపత్రము, పిలుపు ద్రవ్యం, డిపాజిట్ సర్టిఫికేటు, వాణిజ్యబిల్లు మరియు అనుషంగిక ఋణం.
→ మూలధన మార్కెట్ అనే పదము దీర్ఘకాలిక ఋణాలను సమకూర్చే సంస్థలు మరియు సదుపాయాలను తెలుపుతుంది. ఇది సంవత్సరంకంటే ఎక్కువ కాలపరిమితిగల నిధులకు చెందిన మార్కెట్. మూలధన మార్కెట్లో లో సాధనాలు రక్షిత ప్రీమియం నోట్లు, అధిక డిస్కౌంట్ బాండ్లు, వేరుచేయగలిగిన వారంట్లతో ఈక్విటీ వాటాలు, వడ్డీ పూర్తిగా మారే డిబెంచర్లు, స్వెట్ ఈక్విటీ వాటాలు, విపత్తు బాండ్లు, విదేశీ కరెన్సీ మారకపు బాండ్లు, డెరివేటివ్స్,
→ సెక్యూరిటీల కాంట్రాక్టు (రెగ్యులేషన్స్) చట్టం, 1956 ప్రకారము స్టాక్ ఎక్సేంజి అంటే నమోదైన లేదా నమోదుకాని సంఘము, సంస్థ లేదా వ్యక్తుల సంఘము. సెక్యూరిటీల అమ్మకము, కొనుగోలు వ్యవహారాలలో సహాయకారిగా ఉండటానికి, క్రమబద్దీకరించడానికి, నియంత్రించడానికి స్థాపించిన సంస్థ.
→ సెక్యూరిటీస్ మరియు ఎక్సేంజి బోర్డు ఆఫ్ ఇండియా క్రమబద్ధమైన మరియు ఆరోగ్యకరమైన సెక్యూరిటీల అభివృద్ధికి మరియు పెట్టుబడిదారుల రక్షణకు భారత ప్రభుత్వముచే స్థాపించబడినది.