AP Inter 2nd Year Commerce Notes Chapter 3 Business Services

Students can go through AP Inter 2nd Year Commerce Notes 3rd Lesson Business Services will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Commerce Notes 3rd Lesson Business Services

→ Business services would facilitate flow of goods from producers to consumers by eliminating hindrances of place, time, exchange and persons. Some of the business services are banks, insurance, warehousing and transport.

→ Banking means accepting deposits from the public for the purpose of lending or investment, repayable on demand or otherwise, withdrawable by cheque, order or otherwise.

→ E-banking is a banking with the use of electronic tools and facilitate through electronic delivery channels.

→ ATM, Any where banking, Tele banking, internet banking, mobile banking are the different services of E – Banking. .

→ Insurance is a social device for pooling and dividing risk among large number of persons.

→ The different kinds of insurance are
a) Life Insurance
b) Marine Insurance
c) Fire Insurance.

→ Life insurance is a contract by which one party called the assurer agrees to pay certain sum of money in consideration of payment called premium on the happening of certain event that is death or reaching a certain age.

AP Inter 2nd Year Commerce Notes Chapter 3 Business Services

→ Marine insurance is a contract which covers the risks of loss arising from and incidental to marine adventure.

→ Fire insurance is a type of insurance in which the insurer under takes to identify the insured against any loss due to fire caused to the property in consideration of premium paid by the insured.

→ Transport is the physical means of moving goods and persons from one place to another.

→ The different modes of transport are
a) Road transport
b) Rail transport
c) Water transport
d) Air transport
e) Pipelines.

→ In road transport both men and animals are used to carry goods and people.

→ Rail transports are the cheapest and quickest means of transport for carrying heavy goods over a long distance.

→ Water transport is the largest carrying capacity and is most suitable for carrying heavy goods over long distance.

→ Air transport does not need a specific surface track for its operations.

→ Pipe line transport is used for the movement of liquid commodities like crude oil, natural gas and other petroleum products.

→ Warehouse is a building or a room for storing goods.

→ Warehouse perform marketing functions like assembling, grading and transportation.

→ సేవలు అనేవి ఆర్థిక అంశాలు మరియు వాటికి భౌతిక రూపం లేదు. సేవలు, సేవలు అందించే వ్యక్తికి మరియు వినియోగదారునికి మధ్య సంబంధాన్ని తెలియచేస్తాయి.

AP Inter 2nd Year Commerce Notes Chapter 3 Business Services

→ వ్యాపార సేవలు అనగా వ్యాపార సంస్థ నిర్వహించు సేవలు. అవి ఏమనగా

  • బాంకింగ్,
  • బీమా,
  • గిడ్డంగులు మరియు
  • రవాణా మొదలైనవి.

→ ద్రవ్యం మరియు పరపతితో కార్యకలాపాలను నిర్వహించు వ్యాపార సంస్థలను బాంకు అంటారు.

→ “ఖాతాదార్ల డిమాండ్పై చెక్కుద్వారా గాని, డ్రాఫ్టు ద్వారాగాని, మరేదైనా పత్రం ద్వారా గాని, తిరిగి వారికి చెల్లించే షరతుమీద డిపాజిట్లు స్వీకరించి ఆ సొమ్మును రుణాలు ఇవ్వడానికి గాని, పెట్టుబడి కోసంగాని ఉపయోగించడం బాంకింగ్ వ్యాపారం” అంటారు.

→ బాంకులు నిర్వహించే విధులను స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చును. అవి ఎ) ప్రాథమిక విధులు, బి) అనుషంగిక విధులు.

→ బాంకులను ఈ విధంగా వర్గీకరించవచ్చును.

  • వాణిజ్య బాంకులు,
  • సహకార బాంకులు,
  • ప్రత్యేక బాంకులు,
  • కేంద్రబాంకు

→ ఖాతాదారులకు బాంకింగ్ సేవలు ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా ఆఫీసుకు గాని లేదా ఇంటి వద్దకు గాని అందించడాన్ని ఎలక్ట్రానిక్ బాంకింగ్ అంటారు.

→ ఎ.టి.యం (A.T.M) ను ఎనీటైమ్ మనీ మిషన్ అని కూడా అంటారు.

→ ఇంటర్నెట్ ద్వారా బాంకింగ్ లావాదేవీలను నిర్వహించడాన్ని ఆన్లైన్ లేదా ఇంటర్నెట్ బాంకింగ్ అంటారు. వ్యాపార సేవలు)

→ ఖాతాదారులు సెల్ఫోన్ ద్వారా బాంకు సేవలను వినియోగించుకొను పద్ధతినే మొబైల్ బాంకింగ్ అంటారు.

→ మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సమాచారాలను పంపడాన్ని ఎస్.ఎమ్.ఎస్. బాంకింగ్ అంటారు.

→ భవిష్యత్లో ఒక సంఘటన జరిగినపుడు అందుకు సొమ్ము చెల్లించుటకు అంగీకరించిన వారిని ‘బీమా సంస్థ’ లేదా ఇన్సురర్ అంటారు.

→ తనకు అనుకోకుండా జరిగే నష్టానికి భద్రత కోరుతూ, అందుకోసం కొంత సొమ్మును సంస్థకు చెల్లించే వ్యక్తిని ‘బీమాదారు’ లేదా ‘బీమా పాలసీదారు’ లేదా ‘ఇన్సూర్డ్’ అంటారు.

→ బీమాదారునకు కలిగే నష్టానికి రక్షణ కల్పించినందుకు బదులుగా, బీమా సంస్థకు నిర్ధిష్ట బీమాదారుడు చెల్లించే సొమ్మును ‘ప్రీమియం’ అంటారు.

→ బీమా సంస్థ బీమాదారునకు జారీచేసిన ఒక అధికార పత్రమును ‘పాలసీ’ అంటారు.

→ బీమా పాలసీ మొత్తాన్ని పాలసీ ముఖ విలువ లేదా ఇన్సూర్డ్ మొత్తము అని కూడా అంటారు.

→ బీమాదారునికి భవిష్యత్లో జరిగే నష్ట భయానికి బీమా సంస్థ రక్షణ కల్పించడానికి అందుకు ప్రతిఫలంగా బీమాదారు కొంత సొమ్మును సంస్థకు చెల్లించడానికి ఇరువురూ కుదుర్చుకున్న ఒప్పందాన్ని “బీమా కాంట్రాక్టు” అంటారు.

→ “బీమాసంస్థ. తాను పొందిన ప్రీమియంకు బదులుగా, ఆ ప్రీమియం ఒకే మొత్తం గాని లేదా నిర్ణీత వాయిదాలలో గాని, బీమాదారుడు మరణించినప్పుడు లేదా నిర్ణీతమైన సమయం పూర్తి అయినపుడు నిర్దిష్టమైన సొమ్ము చెల్లింపుకు ఇచ్చిన కాంట్రాక్టును జీవితబీమా తెలియచేస్తుంది”.

→ “ఇతర రకాల బీమా వ్యాపారంతో సంబంధము లేకుండా, ఉదహరించిన బీమా ఆస్తికి అగ్నివలన సంప్రదాయసిద్ధంగా అగ్నితో సంబంధము కలిగి ఉండిగాని కలిగే నష్టభయానికి ఇచ్చిన హామీ బీమా కాంట్రాక్టు” అగును.

→ “సముద్ర బీమా ఒక పార్టీ ఎదుటవ్యక్తి నుండి ప్రతిఫలము పొంది అందుకుగాను ఆ వ్యక్తికి సముద్ర ప్రయాణంలో ప్రమాదాలు మరియు ఓడలోనికి సరుకు ఎక్కించుచున్నప్పుడు భవిష్యత్లో అనగా నిర్ణీత వయస్సు లేదా సమయంలో సంభవించిన నష్టాన్ని భర్తీ చేయుటకు చేసుకొనుటకు ఒక కాంట్రాక్టు”.

AP Inter 2nd Year Commerce Notes Chapter 3 Business Services

→ రెండు లేదా ఎక్కువ బీమా సంస్థల మధ్య జరిగిన బీమా కాంట్రాక్టును పునర్బీమా అంటారు.

→ ద్వంద్వ బీమా అంటే ఒకే ఆస్తిపై ఒకటికంటే ఎక్కువబీమా పాలసీలు తీసుకోవడం.

→ గిడ్డంగి అనేది ఒక వాణిజ్య భవనము. ఇది వస్తువులను నిల్వ ఉంచుతుంది.

→ భౌతికంగా వస్తువులను, వ్యక్తులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడమే ‘రవాణా’.

→ సాధారణ పరిభాషలో రవాణా అనగా వస్తువులను ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశానికి తరలించడం.

→ వ్యాపార సేవలు వస్తు పంపిణీ మార్గములోని అవరోధాలను తొలగిస్తాయి.

→ ఖాతాదారుల డిమాండ్లపై చెక్కు డ్రాఫ్ట్ లేదా మరేదైనా పత్రము ద్వారా తిరిగి చెల్లించే షరతు మీద డిపాజిట్లను స్వీకరించి, ఆ సొమ్మును అప్పులివ్వడానికి, పెట్టుబడి కోసం ఉపయోగించే వ్యాపారము బ్యాంకింగ్ వ్యాపారము.

→ ఈ – బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ సేవలు ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా అందించడము. ఎ.టి.యం, టెలీ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వీటిలో ముఖ్యమైనవి.

→ భీమా అనేది ఒక సామాజిక పరికరము. దీనిలో కొంత మందికి జరిగిన నష్టాన్ని ఎక్కువ మందికి పంచడం జరుగును.

→ భీమాలో ముఖ్యముగా మూడు రకాలు ఎ) జీవిత భీమా, బి) అగ్ని భీమా, సి) సముద భీమా.

→ జీవిత భీమా అంటే భీమా సంస్థ తాను పొందిన శ్రీమియంనకు బదులుగా భీమాదారుడు మరణించినపుడు లేదా నిర్ణీతకాలము పూర్తి అయిన తర్వాత నిర్ధిష్టమైన సొమ్మును చెల్లించడానికి ఏర్పాటు చేసుకున్న ఒప్పందము.

→ సముద్ర భీమా అనేది ఒక భీమా కాంట్రాక్టు. దీనిలో సముద్రమార్గములో జరిగే నష్టాలకు భర్తీచేయడానికి ఏర్పరచుకున్న ఒప్పందము.

→ అగ్ని భీమాలో ఉదహరించిన ఆస్తికి అగ్ని వలన లేదా ఇతర అగ్నితో సంబంధమున్న కారణాల వలన కలిగే నష్ట భయానికి హామీ ఇచ్చే ఒప్పందము.

→ భౌతికముగా వస్తువులను, వ్యక్తులను ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి తరలించడమే రవాణా.

→ రవాణాలో ఉపయోగించే పద్ధతులు –

  • రోడ్డు రవాణా,
  • రైలు రవాణా,
  • జల రవాణా,
  • వాయు రవాణా.

→ రోడ్డు రవాణాలో వ్యక్తులను, వస్తువులను, మనుష్యులు, జంతువులను ఉపయోగించి రవాణా చేయడం జరుగుతుంది.

→ ఎక్కువ బరువుగల వస్తువులను దూరప్రాంతాలకు, వేగముగాను తక్కువ ఖర్చుతో తరలించడానికి రైలు రవాణా అనుకూలమైనది.

→ జల రవాణా చౌకైన రవాణా. భారీ వస్తువులను దూర ప్రాంతాలకు తరలించడానికి అనుకూలమైనది.

→ వాయు రవాణా నిర్వహణకు ప్రత్యేకమైన ఉపరితల రోడ్లు అవసరము లేదు. అతి వేగవంతమైనది.

AP Inter 2nd Year Commerce Notes Chapter 3 Business Services

→ ఫైన్ల ద్వారా ముడి చమురు, సహజవాయువు, మరియు ఇతర పెట్రోలియం ఉత్పత్తులను సైలైన్ల ద్వారా పంపబడతాయి.

→ గిడ్డంగి అనేది వాణిజ్య భవనము. ఇది వస్తువులను నిల్వ ఉంచుతుంది.

→ గిడ్డంగులు assembling, గ్రేడింగ్, రవాణా మొదలైన మార్కెటింగ్ విధులను నిర్వహిస్తుంది.

Leave a Comment