AP Inter 2nd Year Commerce Notes Chapter 1 Entrepreneurship

Students can go through AP Inter 2nd Year Commerce Notes 1st Lesson Entrepreneurship will help students in revising the entire concepts quickly.

AP Inter 2nd Year Commerce Notes 1st Lesson Entrepreneurship

→ Entrepreneur is the person, entrepreneurship is the process and enterprise is the creation of the person and output of the process.

→ Entrepreneurs play important role both in relation to economic development and in relation to the enterprise.

→ In relation to economic development, entrepreneurs contribute to the growth of GDP, capital formation and employment generation, creating business opportunities for others and improving the quality of life.

AP Inter 2nd Year Commerce Notes Chapter 1 Entrepreneurship

→ In relation to enterprise, they perform number of roles right from the conception of business ideas, examining the feasibility and mobilisation resources. They bear the uncertainities and risks associated with business activity, introduce product in the market and other innovations.

→ There are so many opportunities for the entrepreneurship in Andhra Pradesh for the enthusiastic entrepreneurs.

→ ఈ రోజుల్లో దేశ ఆర్థికాభివృద్ధికి వ్యవస్థాపకుల అభివృద్ధి చాలా ఆవశ్యకము. పారిశ్రామిక అభివృద్ధి, ప్రాంతీయ అభివృద్ధి మరియు ఉద్యోగాలు కల్పించడం వంటి లక్ష్యాలు వ్యవస్థాపకుల అభివృద్ధిపై ఆధారపడి ఉన్నాయి.

→ “ఎంట్రప్రిన్యూర్” అనే పదం ఫ్రెంచి మూలమైన “entrepredre” అను పదం నుండి ఆవిర్భవించింది. “entrepredre” అనగా ఒక కొత్త పనిని చేపట్టడమని అర్ధము.

→”రిస్కుతో కూడిన ఒక వ్యాపారాన్ని వ్యవస్థీకృతం చేసి, నడిపే వాడిని ఎంట్రప్రిన్యూర్ “గా నిర్వచించడమైనది.

→ సాధారణ వ్యక్తుల కంటే ఎంట్రప్రిన్యూర్కు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి.

→ వ్యవస్థాపకుడు ఆలోచన మొదలైనప్పటి నుండి, సంస్థను స్థాపించే వరకు అన్ని రకాల విధులు నిర్వహిస్తాడు.

→ ఎపుడైతే ఆర్థికాభివృద్ధి అభివృద్ధి చెందనారంభించిందో వ్యవస్థాపకులలో నూతన ఉత్సాహము, ఉత్తేజము కలిగినది. దీని ఆధారంగా వీరిని నాలుగు రకాలుగా విభజించారు.

→ ఆంధ్రప్రదేశ్లో అతి విలువైన సహజ వనరులు పుష్కలంగా ఉండడమే కాక వ్యవసాయ మరియు అటవీ సంపదతో వ్యవస్థాపకులకు పెట్టుబడులు పెట్టుటకు అనువైన అవకాశాలు ఉన్నవి.

→ ఎంట్రప్రిన్యూర్ అనువాడు కర్త, ఎంట్రప్రిన్యూర్ షిప్ అనునది ఒక ప్రక్రియ. ఎంట్రప్రైజ్ అనేది ఒక వ్యక్తి సృష్టి మరియు ఒక ప్రక్రియ ద్వారా ఏర్పడినది (కర్మ).

AP Inter 2nd Year Commerce Notes Chapter 1 Entrepreneurship

→ ఎంట్రప్రిన్యూర్ విధులను సంఘటితము గావించి, సమన్వయ పరిచి నిర్వహణ జరపడాన్ని ఎంట్రప్రిన్యూర్ అంటారు. ఎంట్రప్రిన్యూర్ షిప్కు ముందు వచ్చినదే ఎంట్రప్రిన్యూర్.

→ ఆర్థికాభివృద్ధిలో ఎంట్రప్రిన్యూర్ షిప్ పాత్ర ఒక ఆర్థిక వ్యవస్థకు మరో ఆర్థిక వ్యవస్థకు వస్తు వనరుల మీద, పారిశ్రామిక వాతావరణం మరియు రాజకీయ వ్యవస్థపై మారుతూ ఉండును.

→ ఎంట్రప్రిన్యూర్ అనువాడు కర్త. ఎంట్రప్రిన్యూర్షిప్ అనేది ఒక ప్రక్రియ. ఎంటర్ప్రైజ్ అనేది ఒక వ్యక్తి వలన సృష్టించబడినది మరియు ప్రక్రియ యొక్క ఫలితము.

→ వ్యవస్థాపకులు సంస్థలకు, ఆర్థికాభివృద్ధికి ముఖ్య పాత్రను వహిస్తారు. ఆర్థికాభివృద్ధిలో వ్యవస్థాపకులు స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధికి, మూలధనము సమకూర్చుటకు, ఉద్యోగ అవకాశాలకు తోడ్పడతారు. ఇతరులకు వ్యాపార అవకాశాలు కల్పించి, జీవన ప్రమాణాలు మెరుగుపడుటకు దోహదపడతారు.

→ ఎంట్రప్రిన్యూర్ ఆలోచన వచ్చినప్పటి నుంచి సాధ్యాసాధ్యాలు పరిశీలించడం, వనరులు సమకూర్చడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడతారు. వ్యాపార వ్యవహారాలకు సంబంధించి, అనిశ్చితను రిస్ను భరిస్తారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రతిదినము వ్యాపార సంస్థను నిర్వహించడం బాధ్యతగా భావిస్తారు.

Leave a Comment