AP Inter 1st Year Telugu Study Material Poem 4 శ్మశానవాటి

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material పద్య భాగం 4th Poem శ్మశానవాటి Textbook Questions and Answers, Summary.

AP Inter 1st Year Telugu Study Material 4th Poem శ్మశానవాటి

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
శ్మశానవాటి పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
జవాబు:
శ్మశానవాటి జీవిని లౌకిక జగత్తు నుండి అలౌకిక జగత్తుకు స్వాగతించే మహాప్రస్థానం. అయ్యో ! ఎన్నో సంవత్సరములు (అనంతమైన కాలం) గడిచిపోయాయి. కానీ ఈ శ్మశానవాటికలో ప్రాణాలు కోల్పోయిన దురదృష్టవంతుడు ఒక్కడంటే ఒక్కడైనా తిరిగి లేచి వచ్చాడా ? ఎంతకాలము, నిశ్చలమైన ఈ శాశ్వత నిద్ర. ఎందరు తల్లులు గర్భ శోకంతో అల్లాడిపోయారో కదా ! ఇక్కడి శిలలపై పడిన కన్నీటికి కఠిన శిలలు కూడా కరిగిపోయాయి. ఇది నిజం.

ఆకాశంలో నల్లని మబ్బులు పూర్తిగా ఆక్రమించుకున్నాయి. గుడ్లగూబలు, దయ్యాలతో ఆటలాడుకుంటున్నాయి. నలుదిక్కులా బొంతకాకులు గుండెలు ఝల్లుమనేటట్లు ఘోషిస్తున్నాయి. గాలి వీచడం లేదు. ఆకులు కూడా కదలడం లేదు. సుఖం ఇక్కడ ఆనందిస్తూ ఆటలాడుకుంటుంది కదా.

ఈ శ్మశానవాటిలోనే గొప్ప కవి యొక్క మధురమైన రచనలు నిప్పులతో కలిసి పోయాయి. ఇక్కడే దేశాలను పాలించే రాజశ్రేష్ఠుల రాజచిహ్నాలు అంతరించిపోయాయి. ఇక్కడే నవవధువు మాంగల్య సౌభాగ్యం నీటిలో కలిసిపోయింది. ఇక్కడే ప్రసిద్ధికెక్కిన చిత్రకారుని కుంచె నశించిపోయింది. ఈ శ్మశానం దెయ్యాలతో శివుడు గజ్జెకట్టి నర్తించి ఆడే రంగస్థలం. ఈ శ్మశానం యమదూతల కఠిన చూపులతో సమస్త భూమండలాన్ని పరిపాలించే భస్మ సింహాసనం.

చిక్కని చీకటిలో, కొత్తగా కట్టిన ఒక సమాధి గూటిలో ప్రమిదలో ముదం అయిపోయినా, ఆరిపోక మిణుగురు పురుగులాగా వొత్తి కాలుతూనే ఉంది. దానిని దీపం అందామా ? చనిపోయిన కుమారుని శ్మశానంలో పెట్టి ఏడుస్తూ పోయిన ఒక దురదృష్టవంతురాలైన తల్లి హృదయమందామా ?

AP Inter 1st Year Telugu Study Material Poem 4 శ్మశానవాటి

ఈ శ్మశానంలో ఎందరో కవులు, గాయకులు ధూళిగా మారి నడిచేవారి కాళ్ళతో తొక్కబడుతున్నాయి. ఒకానొకనాడు ప్రసిద్ధికెక్కిన కాళిదాసు, భారవుల వంటి మహాకవుల శరీరాలు ప్రకృతి అనే ఈ రంగస్థలంలో చిన్న ధూళికణాలుగా మారి ఏ కుమ్మరివాని చక్రంపైనున్న మట్టిలో కలిసాయో కదా !

ఈ పిల్లల సమాధులలో ఎన్ని లేత బుగ్గల అందం నశించిపోయిందో, ఎందరు తల్లుల గర్భకుహరాలు శోకంతో దహించుకుపోయి జీవచ్ఛవంలా బతుకుతున్నారో, ఎన్ని అనురాగాల ముద్దులు దీర్ఘ నిద్రపోయాయో, వృద్ధిలోకి రావలసిన ఏ విద్యలు అల్లాడి పోయాయో ఆలోచిస్తే గుండెలు కరిగి ప్రవహిస్తాయి. ఇక్కడ అంటరానితనం పాటించుటకు స్థానం లేదు. విష్ణుమూర్తి కపట లీలలతో ప్రాణాలు తీసి మట్టిలో కలిసిపోయేటట్లు చేసి, మదించిన క్రూరమైన పులిని, బలహీనమైన సాత్వికమైన మేకను పక్కపక్కనే చేర్చి, జోలపుచ్చి వాటికి ఉపశమనం కలిగిస్తాడు. ధనిక, బీద, శక్తివంతుడు, బలహీనుడు వంటి భేదభావనలు చూపించక సమానత్వ ధర్మం ఇక్కడ పాటించ బడుతుంది.

చెప్పలేనంత గొప్ప ధనవంతుడిని నునుపైన చలువరాతి సమాధిలో ఉంచుతారు. ఆ ప్రక్కనే చినిగిన గుడ్డలతో పొరలుతున్న భూతం, ఏ ఆకలి బాధతో దుఃఖించి, నశించి ప్రాణాలు కోల్పోయిన పేదవాడిదో కదా ! ఆ పేదవాని కోసం ఒక్కడు కూడా దుఃఖించడు. కానీ ఈ శ్మశానం దేనినీ దాచదు. ఈ విధంగా మానవుడి అంతిమ గమ్యస్థానం గురించి జాషువా తాత్వికంగా వర్ణించాడు.

సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు

ప్రశ్న 1.
గుఱ్ఱం జాషువా రచనలను పేర్కొనండి.
జవాబు:
జాషువా రచించిన అనేక ఖండకావ్యాలు ఆధునిక తెలుగు కావ్యావరణంలో సరికొత్త వాతావరణానికి ఊపిరులూదాయి. గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, కాందిశీకుడు, క్రీస్తు చరిత్ర, ముసాఫరులు, నేతాజీ, బాపూజీ వంటి కావ్యాలు జాషువాకు ఎనలేని గౌరవాన్ని సంతరింపచేశాయి.

AP Inter 1st Year Telugu Study Material Poem 4 శ్మశానవాటి

ప్రశ్న 2.
‘సౌఖ్యం బెంత క్రీడించునో’ అని జాషువా ఎందుకన్నాడు ?
జవాబు:
ఆకాశంలో కారుమబ్బులు కమ్మి, గుడ్లగూబలు, దయ్యాలు ఆటలాడుకుంటున్నాయి. నలుదిక్కులా బొంతకాకులు గుండెలు ఝల్లుమనేట్లు ఘోషిస్తున్నాయి. అయినప్పటికీ శ్మశానంలో ఆకు కూడా కదలడం లేదు అని జాషువా గారు వర్ణిస్తారు. ఇవన్నీ మానవుడి నిత్యజీవితంలో కష్టాలని, పోరాటాలని కవి ఇలా పోల్చాడు. మానవుడు జన్మించినది మొదలుగా అనుక్షణం పోరాటం చేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో కష్టాలు, నష్టాలు, ఆనందం, దుఃఖం, ఆరోగ్యం, అనారోగ్యం ఇలా అనుభవిస్తుంటాడు. కానీ శ్మశానంలో అలాంటివి ఏమీ ఉండదు. అక్కడ అంతా ప్రశాంతతే. అందుకే ఇక్కడ సుఖం క్రీడిస్తుంది అని జాషువా అన్నారు.

ప్రశ్న 3.
శ్మశానంలోని అభేద భావాన్ని తెలపండి.
జవాబు:
శ్మశానవాటి అంటే మన జీవితంలో ఉండే అంటరానితనం వంటి దురాచారాలకి తావులేని ప్రదేశం. ఇక్కడ విష్ణువు తన కపట లీలలతో ప్రాణాలు తీసి, మట్టిపాలు , చేస్తాడు. క్రూరమైన, మధించిన పెద్దపులిని, బలహీనమైన సాధుజీవియైన మేకను పక్కపక్కనే పెట్టి జోలపాట పాడతాడు. సామాజిక అసమానతలకు, హెచ్చుతగ్గులకు, వివక్షలకు, పీడనలకు, ఆధిక్య, అనాధిక్య భావనలకు తావులేని ప్రదేశం. అందరినీ అభేదంగా (సమానంగా) అక్కున చేర్చుకునే నిశ్చల స్థలం అని కవి పేర్కొన్నాడు.

వికవాక్య / పదరూప సమధాన పశ్నలు

ప్రశ్న 1.
శ్మశానవాటి పాఠ్యభాగ రచయిత ఎవరు ?
జవాబు:
గుఱ్ఱం జాషువా.

ప్రశ్న 2.
జాషువా జన్మస్థలం ఏది ?
జవాబు:
వినుకొండ.

ప్రశ్న 3.
జాషువా బిరుదులేవి ?
జవాబు:
కవికోకిల, నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ.

AP Inter 1st Year Telugu Study Material Poem 4 శ్మశానవాటి

ప్రశ్న 4.
ఖండ కావ్యాలకు అఖండ ఖ్యాతిని తెచ్చిన కవి ఎవరు ?
జవాబు:
గుఱ్ఱం జాషువా.

ప్రశ్న 5.
సత్కవీంద్రుని కమ్మని కలము ఎక్కడ కరిగింది ?
జవాబు:
శ్మశానంలో.

ప్రశ్న 6.
నిటలాక్షుడు ఎవరు ?
జవాబు:
శివుడు.

ప్రశ్న 7.
అస్పృశ్యత సంచరించుటకు తావులేని ప్రదేశం ఏది ?
జవాబు:
శ్మశానం.

సందర్భ సహిత వ్యాఖ్యలు

ప్రశ్న 1.
అధికార ముద్రికలంతరించె.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం గుఱ్ఱం జాషువా గారిచే రచించబడిన శ్మశానవాటి అనే పాఠ్యాంశం నుండి స్వీకరింపబడింది.

సందర్భం :
కవి శ్మశానం యొక్క ప్రాశస్త్యాన్ని వర్ణించే సందర్భంలోనిది.

అర్థం :
రాజముద్రలు (అధికారం) అంతరించిపోయాయి.

భావం :
ఈ శ్మశానంలోనే గొప్ప కవి యొక్క కలం నిప్పులలో కరిగిపోయింది. ఇక్కడే దేశాన్నేలే రాజు యొక్క అధికార దర్పం, అధికార చిహ్నాలు అంతరించిపోయాయి. ఇక్కడే నవవధువు యొక్క మాంగల్యం నీట కలిసిపోయింది. ఇక్కడే ప్రఖ్యాత చిత్రకారుడి కుంచె నశించింది అంటూ శ్మశాన గొప్పతనాన్ని కవి చాటాడు.

AP Inter 1st Year Telugu Study Material Poem 4 శ్మశానవాటి

ప్రశ్న 2.
సౌఖ్యంబెంత క్రీడించునో.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం గుఱ్ఱం జాషువా గారిచే రచించబడిన శ్మశానవాటి అనే పాఠ్యాంశం నుండి స్వీకరింపబడింది.

సందర్భం :
శ్మశానంలోని సుఖాన్ని గురించి కవి వర్ణించిన సందర్భంలోనిది.

అర్థం :
సౌఖ్యం ఎంతో ఆనందిస్తుంది.

భావము :
మానవుడు జన్మించినది మొదలుగా అనుక్షణం పోరాడుతూనే ఉంటాడు. ఈ క్రమంలో కష్టాలు, నష్టాలు, ఆనందం, దుఃఖం, ఆరోగ్య, అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి. కానీ శ్మశానంలో అలాంటివి ఏమీ ఉండవు. ఇక్కడ అంతా ప్రశాంతతే. అందుకే ఇక్కడ సుఖం క్రీడిస్తుంది (ఆటలాడుకుంటుంది) అని జాషువా గారు అన్నారు.

ప్రశ్న 3.
ఏ ముద్దు నిద్రించెనో.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం గుఱ్ఱం జాషువా గారిచే రచించబడిన శ్మశానవాటి అనే పాఠ్యాంశం నుండి స్వీకరింపబడింది.

సందర్భం :
తమ చిన్నారులను కోల్పోయిన మాతృమూర్తుల గర్భశోకాన్ని కవి వర్ణిస్తున్న సందర్భంలోనిది.

అర్థం :
ఏ ముద్దు ముచ్చట్లు నిదురిస్తున్నాయో !

భావము :
తమ చిన్నారుల సమాధులలో ఎన్ని లేత బుగ్గల అందం నశించిపోయిందో, ఎందరు తల్లులు గర్భశోకంతో దహించుకుపోయి జీవచ్ఛవంలా జీవిస్తున్నారో, ఎన్ని అనురాగాల ముద్దులు దీర్ఘ నిద్రపోయాయో, వృద్ధిలోకి రావలసిన ఎన్ని విద్యలు అల్లాడిపోయాయో ఆలోచిస్తే గుండెలు కరిగిపోయాయి అని భావము.

AP Inter 1st Year Telugu Study Material Poem 4 శ్మశానవాటి

ప్రశ్న 4.
వానికై వగవదొక్కడు.
జవాబు:
కవి పరిచయం :
ఈ వాక్యం గుఱ్ఱం జాషువా గారిచే రచించబడిన శ్మశానవాటి అనే పాఠ్యాంశం నుండి స్వీకరింపబడింది.

సందర్భం :
శ్మశానంలో పొరలుతున్న పేదవాని ప్రేతాత్మను గురించి వర్ణించే సందర్భం లోనిది.

అర్థం :
అతనికై ఎవరూ దుఃఖించరు.

భావము :
చెప్పలేనంత గొప్ప ధనవంతుడిని నునుపైన చలువరాతి సమాధిలో ఉంచుతారు. ఆ ప్రక్కనే చినిగిన గుడ్డలతో పొరలుతున్న భూతం ఏ ఆకలి బాధతో దుఃఖించి నశించి ప్రాణాలు కోల్పోయిన పేదవాడిది అయ్యుంటుంది కదా ! ఆ పేదవాని కోసం ఒక్కడు కూడా దుఃఖించడు. కానీ ఈ శ్మశానం’ దేనినీ దాచదు.

సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి సూత్రం :
అ, ఇ, ఉ, ఋలకు సవర్ణములైన అచ్చులు పరమైనపుడు వాటి దీర్ఘములు ఏకాదేశమగును.

  1. కవీంద్రుడు = కవి + ఇంద్రుడు = సవర్ణదీర్ఘ సంధి.

2. ఉకార సంధి సూత్రం :
ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధియగు.

  1. లేదిచట = లేదు + ఇచట = ఉకార సంధి.
  2. పేరెన్నిక = పేరు + ఎన్నిక = ఉకార సంధి.

AP Inter 1st Year Telugu Study Material Poem 4 శ్మశానవాటి

3. సరళాదేశ సంధి సూత్రాలు :

  1.  ద్రుతము మీద పరుషములకు సరళములగు.
  2. ఆదేశ సూత్రమునకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాషనగును.
    1. పారవేయఁబడి = పారవేయన్ + పడి = సరళాదేశ సంధి.
    2. అవనిఁబ్రాలించు = అవనిన్ + పాలించు = సరళాదేశ సంధి.

4. యడాగమ సంధి సూత్రం :
సంధి లేనిచోట స్వరంబు కంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు.

  1. కదిలించియాడు = కదిలించి + ఆడు = యడాగమ సంధి.

సమాసాలు

1. కారుమబ్బులు – నల్లని మబ్బులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
2. కమ్మని కలము – కమ్మనైన కలము – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
3. నల్ల పూసలు – నల్లనివైన పూసలు – విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
4. ప్రకృతి రంగము – ప్రకృతి అనెడి రంగము – రూపక సమాసం
5. అభాగ్యము – భాగ్యము లేనిది – న; తత్పురుష సమాసం
6. నల్గిక్కులు – నాలుగు అను సంఖ్య గల దిక్కులు – ద్విగు సమాసం
7. కాళిదాస భారవులు – కాళిదాసు మరియు భారవి – ద్వంద్వ సమాసం.

పద్యాలు – ప్రతి పదార్థం – భావం

ప్రశ్న 1.
శా. ఎన్నోయేండ్లు గతించి పోయినవి గానీ, యీ శ్మశాన స్థలిన్
గన్నుల్ మోడ్చిన మందభాగ్యుఁ డొంకడైనన్ లేచిరాఁ డక్కడా
యెన్నాళ్ళీ చలనంబు లేని శయనం బే తల్లు లల్లాడిరో
కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్.
జవాబు:
ప్రతిపదార్థం :
అక్కడ = అయ్యో
ఎన్నోయేండ్లు = ఎన్నో సంవత్సరములు (అనంతమైన కాలం)
గతించిపోయినవి = గడిచిపోయాయి
ఈ శ్మశానస్థలిన్ = ఈ శ్మశానవాటికలో
కన్నుల్ మోడ్చిన = ప్రాణాలు కోల్పోయిన
మందభాగ్యుఁడు = దురదృష్టవంతుడు
ఒకడైనన్ = ఒక్కడంటే ఒక్కడైనా
లేచిరాఁడు = తిరిగి లేచివచ్చాడా
ఎన్నాళ్ళు = ఎంత కాలము
చలనంబు లేని = నిశ్చలమైన
శయనంబు = శాశ్వత నిద్ర
ఏ తల్లులు = ఎందరు తల్లులు
అల్లాడిరో = గర్భశోకంతో శోకించారో
నిక్కం = నిజం
పాషాణములు = కఠిన శిలలు
కన్నీటంబడి = కన్నీటిలో
క్రాఁగిపోయినవి = కరిగిపోయినవి

భావము :
అయ్యో ! ఎన్నో సంవత్సరములు (అనంతమైన కాలం) గడిచిపోయాయి. కానీ ఈ శ్మశానవాటికలో ప్రాణాలు కోల్పోయిన దురదృష్టవంతుడు ఒక్కడంటే ఒక్కడైనా తిరిగి లేచి వచ్చాడా ! ఎంత కాలం నిశ్చలమైన ఈ శాశ్వత నిద్ర. ఎందరు తల్లులు గర్భశోకంతో అల్లాడిపోయారో కదా ! ఇక్కడి శిలలపై పడిన కన్నీటికి కఠిన శిలలు కూడా కరిగిపోయినవి. ఇది నిజం.

AP Inter 1st Year Telugu Study Material Poem 4 శ్మశానవాటి

ప్రశ్న 2.
శా. ఆకాశంబును కాఱు మబ్బుగములాహారించె, దయ్యాలతో.
ఘకంబుల్ జెరలాడసాంగినవి, వ్యాఘోషించే నల్గిక్కులన్
గాకోలంబులు, గుండె ఝల్లుమనుచున్నంగాని, యిక్కాటియం
దాకల్లాడిన జాడ లేదిచట సౌఖ్యంబెంత క్రీడించునో.
జవాబు:
ప్రతిపదార్థం :
ఆకాశంబును = ఆకాశంలో (నింగిలో)
కొఱుమబ్బుగములు = నల్లని మబ్బులు
ఆహారించే = ఆక్రమించుకున్నాయి
దయ్యాలతో = దయ్యాలతో
ఘకంబుల్ = గుడ్లగూబలు
చెరలాడసాగినవి = ఆటలాడుకుంటున్నాయి
నల్గిక్కులన్ = నాలుగు దిక్కులా
కాకోలంబులు = బొంతకాకులు (నల్లని కాకులు)
గుండె ఝల్లుమనుచున్నం గాని = గుండెలు ఝల్లుమనేటట్లు
వ్యాఘోషించె = ఘోషిస్తున్నాయి
ఈ + కాటియందు = ఈ శ్మశానంలో
ఆకు + అల్లాడిన = ఆకు అల్లాడినట్లు, కదిలినట్లు
జాడలేదు = కన్పించలేదు (గాలి లేదు)
సౌఖ్యంబు = సుఖం
ఎంత = ఎంత
క్రీడించునో = ఆనందిస్తూ, ఆటలాడుకొనునో కదా !

భావం :
ఆకాశంలో నల్లని మబ్బులు పూర్తిగా ఆక్రమించుకున్నాయి. గుడ్లగూబలు, దయ్యాలతో ఆటలాడుకుంటున్నాయి. నలుదిక్కులా బొంతకాకులు గుండెలు ఝల్లు మనేటట్లు ఘోషిస్తున్నాయి. గాలి వీచడం లేదు. ఆకులు కూడా కదలటం లేదు. సుఖం ఇక్కడ ఆనందిస్తూ ఆటలాడుకుంటుంది కదా ! .

ప్రశ్న 3.
సీ. ‘ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోనఁ గజలగిపోయె
యిచ్చోటనే భూములేలు రాజమ్యుని యధికార ముద్రిక లంతరించె
యిచ్చోటనే లేఁతయిల్లాలి నల్ల పూసల గారు గంగలోఁ గలసి పోయె
యిచ్చోటనే నెట్టి పేరెన్నికం గనుగొన్న చిత్రలేఖకుని కుంచియ నశించె.

AP Inter 1st Year Telugu Study Material Poem 4 శ్మశానవాటి

తే. ఇది పిశాచులతో నిటాలేక్షణుండు
గజ్జ గదలించి యాడు రంగస్థలంబు
యిది మరణదూత తీక్షణదృష్ట లొలయ
నవని బాలించు భస్మ సింహాసనంబు
జవాబు:
ప్రతిపదార్థం :
ఇచ్చోటనో = ఈ ప్రదేశంలోనే (శ్మశానవాటి)
సత్కవీంద్రుని = గొప్ప కవి
కమ్మని = తీయని / మధురమైన
కలము = కలము / రచన
నిప్పులలోనన్ = నిప్పులలో
కఱఁగిపోయె = కలిసిపోయింది (దహింపబడింది)
ఇచ్చోటనే = ఈ శ్మశానవాటిలోనే
భూములు + ఏలు = దేశాలను పాలించే
రాజన్యుని = రాజశ్రేష్ఠుల
అధికార ముద్రిక = రాజ చిహ్నములు
అంతరించె = అంతరించిపోయాయి
ఇచ్చోటనే = ఇక్కడే
లేత యిల్లాలి = నవవధువు
నల్లపూసల = మాంగల్యం
సౌరు = సౌభాగ్యం
గంగలో = నీట
కలసిపోయె = కలిసిపోయింది (వైధవ్యం ప్రాప్తించింది)
ఇచ్చోటనే = ఇక్కడే
ఎట్టి పేరెన్నికన్ = ఎంతో పేరున్న
గనుగొన్న = ప్రసిద్ధికెక్కిన
చిత్రలేఖకుని = చిత్రకారుని
కుంచియ = కుంచె
నశించె = నశించిపోయింది
ఇది = ఈ శ్మశానవాటి
పిశాచులతో = దెయ్యా లతో
నిటాలేక్షణుండు = శివుడు
గజ్జె కదలించి = గజ్జె కట్టి నర్తించి
ఆడు రంగస్థలంబు. = ప్రదర్శనశాల
యిది = ఈ శ్మశానం
మరణదూత = యమదూత
తీక్షణ దృష్టులు = తమ కఠిన చూపులతో
ఒలయ = వ్యాపించగా
అవని = భూమండలాన్ని
పాలించు = పరిపాలించే
భస్మ సింహాసనంబు = బూడిదతో కూడిన సింహాసనం

భావం :
ఈ శ్మశానవాటిలోనే గొప్ప కవి యొక్క మధురమైన రచనలు నిప్పులలో కలిసిపోయింది. ఇక్కడే దేశాలను పాలించే రాజశ్రేష్ఠుల, రాజ చిహ్నములు అంతరించి పోయాయి. ఇక్కడే నవవధువు మాంగల్య సౌభాగ్యం నీటిలో కలిసిపోయింది. ఇక్కడే ప్రసిద్ధికెక్కిన చిత్రకారుని కుంచె నశించిపోయింది.

ఈ శ్మశానవాటి దెయ్యాలతో శివుడు గజ్జెకట్టి నర్తించి ఆడే ప్రదర్శనశాల. ఈ శ్మశానం యమదూతల కఠిన చూపులు వ్యాపించగా సమస్త భూమండలాన్ని పరిపాలించే బూడిదతో కూడిన సింహాసనం.

ప్రశ్న 4.
చం. ముదురు తమస్సులో మునిగి పోయిన క్రొత్త సమాధి మీదఁ బై
బొదలు మిణుంగురుంబురువు పోలిక వెల్లుచునున్న దివ్వె ఆ
ముద మువోడి వోయినన్ సమసి పోవుట లేదది దీప మందుమా ?
హృదయము సుమ్మి నిల్పి చనియెన్ గతపుత్రక యే యభాగ్యమో !
జవాబు:
ప్రతిపదార్థం :
ముదురు = చిక్కని
తమస్సులో = చీకటిలో
మునిగిపోయిన = మునిగిపోయిన వ్యాపించగా)
కొత్త సమాధి = కొత్తగా కట్టబడిన సమాధి
మీదన్ = పైన
పొదలు = వర్ధిల్లుచున్న
మిణుంగురుంబురువు = మిణుగురు పురుగులు
పోలిక = లాగా
వెల్గుచున్న = వెలుగుతున్న
దివ్వె = దీపం Jr. తెలుగు
ఆముదము = ఆముదం
ఉడిపోయినన్ = తరిగిపోయినను
సమసి పోవుట = అంతరించి పోవుట
లేదు = లేదు
అది దీపమందుమా = దానిని దీపం అందామా !
హృదయమ్ము సుమ్మి = హృదయం అందాము !
చనియెన్ = వెళ్ళారు
గతపుత్రక = పుత్రుని కోల్పోయిన,
ఏ అభాగ్యయో = ఏ దురదృష్టవంతురాలు
నిల్పి = వెలిగించి

భావం :
చిక్కని చీకటిలో కొత్తగా కట్టిన ఒక సమాధి గూటిలో ప్రమిద ఆముదం అయిపోయినా ఆరిపోక, మిణుగురు పురుగు లాగా వొత్తి కాలుతూనే ఉంది. దానిని దీపం అందామా ! చనిపోయిన కుమారుని శ్మశానంలో పెట్టి, ఏడుస్తూ పోయిన ఒక దురదృష్టవంతురాలైన తల్లి హృదయమందామా !

AP Inter 1st Year Telugu Study Material Poem 4 శ్మశానవాటి

ప్రశ్న 5.
మ. కవుల కలాలు, గాయకుల కమ్మని కంఠములీశ్మశాన పుం
గవనులఁ దొక్కి చూచెడి నొకానొకనాఁ దలకాళిదాస భా
రవుల శరీరముల్ ప్రకృతి రంగమునం దిపుడెంతలేసి రే
ణువులయి, మృత్తికం గలిసెనో ! కద ? కుమ్మరివాని సారెపై
జవాబు:
ప్రతిపదార్థము :
కవుల కలాలు = కవుల రచనలు
గాయకుల = పాటలు పాడేవారి
కమ్మని కంఠములు = మధుర స్వరం
ఈ శ్మశానపుం = ఈ శ్మశానంలోని
కవనులన్ = ధూళి / కసవు
డ్రొక్కి చూచెడి = తొక్కుతున్నారు
ఒకానొఁకనాఁడు = ఒకానొక సమయములో
అల = ప్రసిద్ధికెక్కిన
కాళిదాస భారవుల = మహాకవి కాళిదాసు, భారవుల
శరీరముల్ = దేహములు
ప్రకృతి రంగము నందు = ప్రకృతి అనే రంగస్థలం నందు
ఇపుడు = ఇపుడు
ఎంతలేసి = ఎంత చిన్న
రేణువులు = ధూళి కణాలుగా
అయి = మారి
కుమ్మరివాని = కుండలు చేయువాని
సారెపై = చక్రంపై
మృత్తికం మట్టిలో
కలిసెనో = కలిసాయో
కదా = కదా

భావం :
ఈ శ్మశానంలో ఎందరో కవులు, గాయకుల మధుర స్వరాలు ధూళిగా మారి నడిచేవారి కాళ్ళతో తొక్కబడుతున్నాయి. ఒకానొకనాడు ప్రసిద్ధి కెక్కిన కాళిదాసు, భారవుల వంటి మహాకవుల శరీరాలు ప్రకృతి అనే ఈ రంగస్థలంలో చిన్న ధూళి కణాలుగా మారి ఏ కుమ్మరివాని చక్రంపై ఉన్న మట్టిలో కలిసాయో కదా !

విశేషం :
కవి మానవ శరీరం యొక్క అశాశ్వతత్వాన్ని తాత్వికంగా వర్ణిస్తున్నాడు. అశాశ్వతమైన ఈ దేహం, దాని చుట్టూ ఆవరించుకొని ఉండే భేదాలు, అసూయా ద్వేషాలు అనవసరమని బోధిస్తున్నాడు. చనిపోయిన తర్వాత ఏమౌతామో, మన దేహం ఏమౌతుందో తెలియని చోట ఇంత స్వార్థం ఎందుకు అని బోధిస్తున్నాడు.

ప్రశ్న 6.
శా. ఆలోకించిన గుండియల్లబగు నాయా పిల్ల గోరీలలో :
నే లేబుగ్గల సౌరు రూపడియెనో ! యేముద్దు నిద్రించెనో
యే లీలావతి గర్భగోళమున వహ్నిజ్వాల జీవించునో –
యీ లోకంబున వృద్ధిగాందగిన యే యే విద్యలల్లాడెనో !
జవాబు:
ప్రతిపదార్థం :
ఆలోకించిన = చూసిన
గుండియల్ = గుండెలు
కఱగున్ = కరిగిపోతాయి
ఆయా = ఆ
పిల్లగోరీలలోన్ = పిల్లల సమాధులలో
ఏ లే బుగ్గల = ఎన్ని లేత బుగ్గల
సౌరు = అందం
రూపటియెనో = నశించిపోయిందో
ఏ ముద్దు = ఎన్ని అనురాగాల ముద్దులు
నిద్రించెనో = దీర్ఘ నిద్రపోయాయో
ఏ లీలావతి = ఏ స్త్రీమూర్తి
గర్బగోళమున = గర్భ కుహరము
వహ్ని జ్వాల = అగ్ని జ్వా లలు
జీవించునో = జీవచ్ఛవంలా బతుకులు
ఈ లోకంబున = ఈ లోకంలో
వృద్ధిగాదగిన = వృద్ధిలోకి రావలసిన
ఏఏ విద్యలు = ఏ విద్యలు
అల్లాడెనో = అల్లాడి పోయినవో

భావము :
ఈ చిన్నారుల సమాధులలో ఎన్ని లేత బుగ్గల అందం నశించిపోయిందో, ఎందరు తల్లుల గర్భకుహరాలు శోకంతో దహించుకుపోయి జీవచ్చవంలా బతుకుతున్నారో, ఎన్ని అనురాగాల ముద్దులు దీర్ఘ నిద్ర పోయాయో, వృద్ధిలోకి రావలసిన ఏ విద్యలు అల్లాడిపోయాయో ! ఆలోచిస్తే గుండెలు కరిగి ప్రవహిస్తాయి.

AP Inter 1st Year Telugu Study Material Poem 4 శ్మశానవాటి

ప్రశ్న 7.
ఇట నస్పృశ్యత సంచరించుటకుఁ ధావే లేదు, విశ్వంభరా
నటనంబున్ గబళించి, గర్భమున విన్యస్తంబు గావించి, యు
త్కటపుం బెబ్బులితోడ మేఁక నొఁక ప్రక్కన్ జేర్చి జోకొట్టి, యూ
అంటఁ గల్పించున భేద భావమును, ధర్మం బిందుఁ గారాడెడిన్.
జవాబు:
ప్రతిపదార్థం :
ఇటన్ = ఇచ్చట (శ్మశానంలో)
అస్పృశ్యత = అంటరానితనం
సంచరించుటకున్ = పాటించుటకు
తావే లేదు = స్థానం లేదు
విశ్వంభర = విష్ణుమూర్తి
కరు ఆంధ్రప్రదేశ్ ముందుకు
నటనంబున్ = కపట లీలలతో
కబళించి = ప్రాణాలు తీసి
గర్భమున = భూగర్భంలో (భూమిలో)
విన్యస్తంబు = ఉంచి
గావించి = చేసి
ఉత్కటపున్ = మదించిన
బెబ్బులితోడ = పులితో
మేఁకన్ = మేకను
ఒఁక ప్రక్కన్ = పక్కపక్కనే చేర్చి
జోకొట్టి = జోలపుచ్చి
ఊఱటన్ = ఉపశమనం
కల్పించున్ = కలిగిస్తాడు
అభేద = ఎటువంటి భేదం లేకుండా (పేద, ధనిక, శక్తివంతుడు, బలహీనుడు వంటి)
భావమున = అభిప్రాయమున
ధర్మంబు = సమానత్వ ధర్మం
ఇందున్ = ఇక్కడ (శ్మశానం)
కారాడెడిన్ = నడుస్తుంది / పాటించబడుతుంది

భావం :
ఈ శ్మశానంలో అంటరానితనం పాటించుటకు స్థానం లేదు. విష్ణుమూర్తి కపట లీలలతో, ప్రాణాలు తీసి భూగర్భంలో (మట్టిలో) కలిసిపోయేట్లు చేసి, మదించిన క్రూరమైన పులిని, బలహీనమైన సాత్విక మేకను పక్కప్రక్కనే చేర్చి జోలపుచ్చి వాటికి ఉపశమనం కలిగిస్తాడు. ధనిక, బీద, శక్తివంతుడు, బలహీనుల వంటి భేద భావనలు చూపించక సమానత్వ ధర్మం ఇక్కడ పాటించబడుతుంది.

AP Inter 1st Year Telugu Study Material Poem 4 శ్మశానవాటి

ప్రశ్న 8.
ఉ. వాకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపుఁబాలరాతి గో
రీ కడఁ బారవేయఁబడి, ప్రేలికలం బొరలాడు ప్రేత మే
యాకఁటి చిచ్చునన్ గుమిలి, మార్చి, గతించిన పేదవాని దౌ
నో కద ! వానికై వగవఁ డొక్కఁడు, దాచడు కాటినేలయున్.
జవాబు:
ప్రతిపదార్థం :
వాకొనరాని = చెప్పలేనంత
గొప్ప = గొప్ప
ధనవంతుని = ధనం కలవాడిని
నిద్దపున్ = నునుపైన
పాలజాతి = చలువరాళ్ళ
గోరీకడన్ = సమాధిలో
పారవేయబడి = పారవేస్తారు (ఉంచుతారు)
ప్రేలికలం = చినిగిన గుడ్డలతో
పొరలాడు = పొరలుతున్న
ప్రేతము = భూతం
ఏ ఆకఁటి = ఏ ఆకలి
చిచ్చునన్ = బాధతో
కుమిలి = దుఃఖించి
ఆర్చి = నశించి
గతించిన = ప్రాణాలు కోల్పోయిన
పేదవాని = పేదవాడు
ఔనోకదా = అయ్యుంటుంది కదా
వానికై = ఆ పేదవాని కోసం
ఒక్కడు = ఒక్కడు కూడా
వగవఁడు = దుఃఖించడు
కాటి నేలయున్ = ఈ శ్మశానం
దాచదు = దేనినీ దాచదు

భావం :
చెప్పలేనంత గొప్ప ధనవంతుడిని నునుపైన చలువరాతి సమాధిలో ఉంచుతారు. ఆ ప్రక్కనే చినిగిన గుడ్డలతో పొరలుతున్న భూతం ఏ ఆకలి బాధతో . దుఃఖించి నశించి ప్రాణాలు కోల్పోయిన పేదవాడిది అయ్యుంటుంది కదా ! ఆ పేదవాని కోసం ఒక్కడు కూడా దుఃఖించడు. కానీ ఈ శ్మశానం దేనినీ దాచదు.

కవి పరిచయం

తెలుగు పద్యానికి సుమధుర సౌరభాన్ని అద్దిన కవుల్లో ప్రముఖులు గుఱ్ఱం జాషువా. గుంటూరు జిల్లాలోని వినుకొండలో 28.09.1895న జన్మించారు. వీరయ్య, లింగమాంబ తల్లిదండ్రులు.

జాషువా ఉభయభాషా ప్రవీణులు. ప్రాథమికోపాధ్యాయునికి ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. కొంతకాలం మూకీ చలన చిత్రాల వ్యాఖ్యాతగా పనిచేశారు. మరికొంత కాలం ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో యుద్ధ ప్రచారకునిగా తన సేవలందించారు. ఇంకొంత కాలం ఆకాశవాణిలో తెలుగు కార్యక్రమాల రూపకర్తగా వ్యవహరించారు.

AP Inter 1st Year Telugu Study Material Poem 4 శ్మశానవాటి

సామాజిక, సాహిత్య అననుకూల వాతావరణంలో వికసించిన కవి గుఱ్ఱం జాషువా. తెలుగులో ఖండకావ్య ప్రక్రియకు అఖండ ఖ్యాతిని సంతరింపచేసిన జాషువా అనేక ఖండకావ్యాలు, కావ్యాలు రచించారు. ఆధునిక తెలుగు కవితా వికాస కాలంలో సరి కొత్త వెలుగులనిచ్చాయి. గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, కాందిశీకుడు, క్రీస్తు చరిత్ర, ముసాఫరులు వంటివి జాషువాకు ఎనలేని గౌరవాన్ని సంతరింపజేశాయి.

జాషువా కవితావస్తువు సమకాలీన కవుల వస్తువు కంటే భిన్నమైనది. అంశం వర్తమానమైనా, గతకాలమైనా, సామాజికమైనా, చారిత్రకమైనా జాషువా ఆ వస్తుతత్త్వాన్ని భిన్నంగా వ్యక్తపరచేవారు. అందుకే ఎన్నో గౌరవాలు, బిరుదులు వరించాయి. కవికోకిల, కవితా విశారద, కవిదిగ్గజ, నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్, కళాప్రపూర్ణ, పద్మభూషణ్ వంటివి బిరుదులు. గండపెండేరాలు, కనకాభిషేకం, గజారోహణం, పల్లకీ ఊరేగింపులు, స్వేచ్ఛా పౌరసత్వం వంటి సత్కారాలు పొందారు. జాషువా గారు 24.07.1971న కన్నుమూశారు.

పాఠ్యభాగ సందర్భం

బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు రచించిన సత్యహరిశ్చంద్ర నాటకంలోని ‘కాటి సీను’ గా ప్రసిద్ధికెక్కిన ఘట్టం ‘ఇది. ఈ ‘కాటి సీను’ పద్యాలను రచించింది గుఱ్ఱం జాషువా గారు. శ్మశానవాటి పేరుతో తన ఖండకావ్యంలో రాసుకున్న పద్యాలు హరిశ్చంద్ర నాటకంలోకి వచ్చి, అటుపై జనాలలో అత్యంత ప్రాచుర్యం పొందాయి.

విశ్వామిత్రునికి ఇచ్చిన మాటకు కట్టుబడిన సత్యహరిశ్చంద్రుడు కాశీ నగరంలోని శ్మశానవాటికలో కాటికాపరిగా ఉంటాడు. ఆ సందర్భంలో శ్మశానవాటికలోని ప్రజల దుఃఖాన్ని, వైరాగ్యాన్ని చూసిన హరిశ్చంద్రుడు శ్మశానవాటి లక్షణాన్ని చెప్పటం జరిగింది. ఆ సందర్భానికి గుఱ్ఱం జాషువా గారి పద్యాలు ప్రాణం పోసాయి.

పాఠ్యభాగ సారాంశం

శ్మశానవాటి ఖండకావ్యం జాషువాకి విశిష్ఠ గుర్తింపు తెచ్చి పెట్టింది. ఇది వైరాగ్యాన్ని బోధించేది కాదు. జీవిత తాత్త్వికతను సామాజికతతో ముడి పెట్టి చెప్పే లోతైన ఖండిక. శ్మశానవాటి అంటే లౌకిక స్థితిలో ఉండే అనేకానేక సామాజిక అంశాలకు, అసమానతలకు, హెచ్చుతగ్గులకూ, వివక్షలకు, పీడనలకు, ఆధిక్య, అనాధిక్య భావనలకు తావులేని తలం. అందరికీ సమానంగా అక్కున చేర్చుకునే నిశ్చల స్థలం. జీవిని లౌకిక జగత్తు నుండి అలౌకిక జగత్తుకు స్వాగతించే మహాప్రస్థాన జీవితం.

AP Inter 1st Year Telugu Study Material Poem 4 శ్మశానవాటి

పాఠ్యభాగ ఉద్దేశ్యం

జీవిత ప్రస్థానంలోని తాత్త్విక వాస్తవాన్ని కావ్యముఖంగా విద్యార్థులకు అందించడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం.

Leave a Comment