AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 6 దహేజ్

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material Non-Detailed 6th Lesson దహేజ్ Textbook Questions and Answers, Summary.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed 6th Lesson దహేజ్

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
‘దహేజ్’ కథ లోని వివాహ సంప్రదాయాన్ని వివరించండి.
జవాబు:
సుల్తానా రెహమాన్ల వివాహం జరిగింది. పెండ్లికి వచ్చిన వారు పూర్వపు సంప్రదాయాలను గుర్తు చేసుకుంటారు.నిక్కా అంటే పెళ్ళి. ఒకప్పుడు ఈ పెళ్ళి వేడుకలు ఏడు రోజులు జరిగేవి సాయిబుల ఇళ్ళలో ఒక రోజు పెళ్ళికి ముందు రోజు రాత్రి చేసే కార్యక్రమాలు దీనినే షుక్రానా అంటారు.

రెండోరోజు నిక్కా అంటే పెళ్ళి జరిగేది. ఆ మరుసటి రోజు వలీమా అంటే మరుసటి రోజు పెండ్లి కొడుకు ఇంటి దగ్గర నిర్వహించే విందు వినోదాలు తర్వాత ఐదు శుక్రవారాలు ఐదు జుమాగీలు జరిగేవి. ఇప్పుడు ఆ పద్దతులేవీ లేవని వాపోయింది. ఓ మధ్య వయసున్న పెద్దమ్మ పెళ్ళికొడుకు అక్క పర్వీన్ మేకప్ వేసుకుంటూ” మీ కాలంతో పోలిస్తే ఎట్లా ఇప్పుడు ఎవరికి టైము, తీరిక ఉన్నాయి? అప్పుడు కాళ్ళతో నడిచే కాలం అది. ఇప్పుడు విమానాలతో పరిగెత్తే కాలం వచ్చేసింది. ఒక్కరోజులోనే అన్నీ సాంగ్యాలు అవజేస్తున్నారు” అని అన్నది.

ఇంతలో ఓ అవ్వ “అవునే తల్లి మేము కూర్చొని నీళ్ళు తాగేవాళ్ళం కొంతకాలానికి నిలబడి నీళ్ళు తాగేవాళ్ళు. ఇప్పుడు పరిగెత్తి పాలు తాగుతున్న కాలమిది ఇంకా రాను రాను ఏం చూడాలో?” అని అన్నది. ఇంతలో కళ్యాణ మండపాన్ని పూలతో అలంకరించారు. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు మండపంలో కూర్చున్నారు. మండ పైకి వచ్చి వధూవరుర్ని ఆశీర్వదించండి అంటూ, పెళ్ళిళ్ళ పేరమ్మ జులేఖ అందర్ని పిలిచింది.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 6 దహేజ్

పెళ్ళి మండపంపై పూలచారులు రంగులైట్లతో అత్తరు గుబాళింపులతో అందంగా అమర్చిన మంచం పూలతో అలంకరించి ఉంది. రంగురంగుల దోమ తెరలు రాజఠీవిని ప్రదర్శిస్తున్నాయి. పెళ్ళి కూతురు సర్గా ముసుగు అనగా పెళ్ళి సమయంలో వేసే ముసుగులో ఉంది. మంచానికి ఆవలి వైపు పెళ్ళి కొడుకు ఆడపడుచుల కలకల నవ్వుల మధ్య కూర్చున్నాడు.

వధూవరుల మధ్య ఎర్రని తెర అడ్డంగా ఉంది. ఒకరి తలపై ఒకరు తలంబ్రాలు పోసుకున్నారు. ముసుగులోనుండే అద్దంలో పెళ్ళికూతురు మొకం చూడమన్నారు. అలాగే చేసాడు పెళ్ళికొడుకు. తొలిసారి వధువును చూసినప్పుడు శుభ సూచకంగా, ఉంగరం తొడిగే ఆచారం ఉంటుంది. కలకండను వరునికి ఆడపడుచులు అందిస్తారు. దానిని సగం కొరికి వధువుకి ఇస్తాడు. ఆడపడుచులు వధువును ఆటపట్టిస్తారు.

వరుని దగ్గరకు వచ్చి కలకండ తీయగా ఉందా? వధువు తీయగా ఉందా అని అడుగుతారు. కలకండ తీయగా నా నాలుకకు అనిపించింది. వధువు నాబ్రతుక్కి తీయగా ఉంది వధువు అని అంటాడు పెళ్ళికొడుకు. వధువును భుజాన్ని వేసుకునే సంప్రదాయం ఉంటుంది.

బ్రతుకంతా ఆమె బరువు బాధ్యతలు భుజాన వేసుకున్నట్లు అనుకుంటారు. పెళ్ళికూతురు తండ్రి దహేజ్ అనగా సారె అత్తగారింటికి కూతుర్ని పంపుతూ అక్కడకు సరిపడే వస్తువులు అన్నీ దహేజ్ లో అమరుస్తారు. పెళ్ళి కొచ్చిన వారందరూ వాటిని చూసి ముచ్చట పడతారు. కాపురానికి కావాల్సిన సామాగ్రీ అంతా దహేజ్ లో ఉంటుంది. దీనిలోనే ‘కఫన్’ అని ఎర్ర గుడ్డ తెల్ల గుడ్డ కూడా ఇచ్చే సాంప్రదాయం ఉంటుంది.

భర్త ఉండగా భార్య చనిపోతే ఎర్ర కఫన్ గుడ్డ, భర్త పోయాక భార్య చనిపోతే తెల్ల కఫన్ గుడ్డ ఈ సారెలో దహేజ్ లో పెళ్ళి కూతురు తండ్రి ఇస్తాడు. ప్రతి ఆడ బిడ్డ తండ్రి దీనిని గుర్తుంచుకోవాలని అంటాడు వధువు తండ్రి.

ప్రశ్న 2.
‘దహేజ్’ కథా సారాంశాన్ని రాయండి.
జవాబు:
సుల్తానా-రెహమాన్ల వివాహం జరిగింది. రాత్రికి శోభనం. వివాహానికి వచ్చిన బంధువులంతా హడావిడిగా ఉంటారు. కొంతమంది పూర్వకాలం వారు వారి కాలంలో జరిగే పెళ్ళి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. పూర్వం ఏడు రోజుల పెళ్ళిళ్ళు జరిగేవని వారి భావన. కాలం మారిపోయింది. ఒక్కరోజులోనే పెళ్ళి శోభనం కాపురానికి పంపించడం సహజమైపోయింది. ఈ రోజుల్లో.

కళ్యాణ మండపం పూలతోను రంగురంగుల కాగితాలతోను రంగుల దోమ తెరలతో మండపం ఆకర్షణీయంగా ఉంటుంది. పూల మంచానికి ఒకవైపు ముసుగులో పెళ్ళి కూతురు. మరొక వైపు ఆడపడుచుల మధ్య పెళ్ళి కొడుకు ఉంటారు. ముసుగులోనుండే అద్దంలో పెళ్ళి కూతుర్ని చూడమంటారు. అలాగే చేస్తాడు రెహమాన్.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 6 దహేజ్

మొదటిసారి చూసినందుకు శుభసూచకంగా ఉంగరం తొడుగుతాడు వరుడు. ఆడపడచులు కలకండ ఇచ్చి సగం కొరికి వధువుకి ఇవ్వమంటారు. అలాగే చేస్తాడు వరుడు. పెళ్ళి కూతుర్ని భుజాన వేసుకోమంటారు. కొంత తటపటాయించి ఒక్కసారిగా భుజాన వేసుకుంటాడు వరుడు. అనగా జీవితంలో బరువు బాధ్యతలు భుజాన వేసుకున్నట్లు దానర్థం. గడపకు అరచేతులతో గంధం ముద్రలు వేయిస్తారు.

ఇదంతా పెళ్ళిళ్ళ పేరమ్మ చేయిస్తుంది. ఇక దహేజ్ అనగా కాపురానికి కావలసిన సామాగ్రీని చూడమని చెప్తుంది. అందరూ దహేజ్ ను చూస్తారు. ఇంతలో వరుని తల్లి పెద్ద పెద్దగా అరుస్తూ భర్తను పిలుస్తుంది. అంతవరకు వధువు తండ్రి సులేమాన్. వరుని తండ్రి ఫకదీన్ భాయికి . తన కూతుర్ని అప్పగిస్తూ బాధపడతాడు. సులేమాన్ని ఓదారుస్తూ ఉంటాడు ఫకదీనాభాయ్ దహేజ్లో ఉన్న సామాన్లు చూసి అందరూ సంతోషిస్తారు.

అమ్మాయి తండ్రి బాగానే పెట్టాడనుకుంటారు కాని వరుని తల్లి రుబియాబీ భర్తను ఉద్దేశించి మన పరువు ఏమయిపోవాలి అని అంటుంది. సంబంధం కుదిర్చిన జులేఖాను పిలిచి కలర్ టి.వి లేకుండా ఏ ఆడపిల్ల అయినా అత్తగారింటికి వస్తుందా? అని ప్రశ్నిస్తుంది. కలర్ టి.వి ముందుగా మాట్లాడుకోలేదు. అయినా వియ్యంకులు వారు వద్దన్నారని అంటాడు సులేమాన్. కాని రుబియాబీ ఒప్పుకోలేదు. రాత్రి అయినా, వెళ్ళి షాపు తెరిపించి టి.వి తెచ్చిస్తాడు సులేమాన్. దానితో శాంత పడుతుంది వరుని తల్లి.

అయినా దహేజ్ లో ముఖ్యమైనది మరిచిపోయారంటు కఫన్ గుడ్డలు రెండు. ఒకటి ఎర్రని గుడ్డ రెండవది తెల్లని గుడ్డ తీసుకొచ్చి దహేజ్ లో ఉంచుతాడు. ఏ ఆడపిల్ల తండ్రి అయినా ఈ కఫన్ గుడ్డ మరచి పోకూడదని అంటాడు.

రచయిత పరిచయం

1. ‘దహేజ్’ పాఠ్యభాగ రచయిత శశిశ్రీ.

2. మూడు దశాబ్దాలుగా తెలుగు పాఠకలోకానికి సుపరిచితులు. శశిశ్రీ అసలు పేరు షేక్ బేపారి రహమతుల్లా, శశిశ్రీ ఆయన కలం పేరు.

3. వీరు కడప జిల్లా సిద్దిపేటలో 5-12-1957 లో జన్మించారు. షేక్ బేపారి సలీమాచీ, ఆ షేక్ బేపారి రసూల్ సాబ్ వీరి తల్లిదండ్రులు.

4. శశిశ్రీ కేవలం కథకులే కాదు మంచి కవి. వక్త కూడా.

5. పల్లవి, శబ్దానికి స్వాగతం, జేబులో సూర్యుడు, కాలాంతవేళ, మొదలైనవి వీరి వచన కావ్యాలు విస్తృత ప్రాచుర్యం పొందాయి.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 6 దహేజ్

6. ‘సీమగీతం’ పద్య కావ్యం, ‘మనకు తెలియని కడప’ చరిత్ర గ్రంథం ‘చూపు’ వ్యాస సంపుటి, దహేజ్ రాతిలో తేమ, Tunes of life, రాతి పూలు అనేవి కథా సంపుటాలు.

7. ప్రసార భారతిలో న్యూస్ రిపోర్టర్ గా పనిచేసారు. సాహిత్య నేత్రం పత్రికా సంపాదకులుగా ఉన్నారు.

8. ఆరసం (అభ్యుదయ రచయితల సంఘం) కార్యవర్గ సభ్యులుగా పనిచేసారు.

9. యోగి వేమన విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులు వీరు.

10. వివిధ రంగాలలో పురస్కారాలు అందుకున్నారు. (2007) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

11. (2010) ఉగాది విశిష్ట సాహిత్య పురస్కారం లభించింది.

12. అంతర్జాతీయ సంస్థ యునిసెఫ్ (2010) లో అవార్డు పొందారు.

13. ఇంతేకాక ‘పట్టాభి రామిరెడ్డి లిటరరీ అవార్డు’ ‘కొండే పూడి శ్రీనివాసరావు’ సాహిత్య పురస్కారం.

14. ఉత్తమ సాహిత్య సంపాదకుడుగా గుర్తింపు పొందిన అనతికాలంలోనే 31-3-2015లో కన్ను మూసారు.

15. ‘దహేజ్’ రాతిలో తేమ కథా సంపుటిలోనిది. 27-12-2006లో తొలిసారిగా నవ్యవార పత్రికలో ప్రచురించబడింది.

పాత్రల పరిచయం

1. సుల్తానా :
పెళ్ళి కూతురు. తండ్రిని వదిలి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు దు:ఖాన్ని ఆపుకోలేక ఏడుస్తుంది.

2. రెహమాన్ :
పెండ్లికొడుకు, హుందాగా ఉంటాడు. మామ గారిని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు.

3. సులేమాన్ :
సుల్తానా తండ్రి. ఏ లోటు లేకుండా కూతురి పెళ్ళి చేసాడు. ఏ లోటు లేకుండా దహేజ్ కూడా ఏర్పాటు చేసాడు. చాల మర్యాదగా నడుచుకుంటాడు. కూతుర్ని అప్పగించేటప్పుడు సహజంగానే దు:ఖిస్తాడు. చివరిలో దహేజ్ లో ‘కఫన్’ కూడా ఇస్తాడు. తెల్లరంగుది, ఎర్ర రంగుది రెండు కఫన్లు ఇచ్చి సొమ్మసిల్లి పోతాడు.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 6 దహేజ్

4. ఫకర్ దీన్ భాయ్ :
పెండ్లి కొడుకు తండ్రి. చాల మంచివాడు. నెమ్మదస్తుడు. కోడలిని పరువుగా చూసుకొంటామని సులేమాన్ కి మాట ఇస్తాడు.

5. రబియాబీ :
పెళ్ళి కొడుకు తల్లి. పెళ్ళి అయినాక అమర్చిన దహేజ్ చూసి పెద్ద పెద్ద కేకలు వేస్తుంది. అందరూ నిర్ఘాంతపోతారు. ఏమి లోపం వచ్చిందని సులేమాన్ అడుగుతాడు. ఇచ్చిన మాట ప్రకారం దహేజ్ లో కలర్ టి.వి ఇవ్వలేదని గోల చేస్తుంది. ముందు మాటల్లో లేదని చెప్పిన కలర్ టి.వి ఇప్పుడు కావాలంటుంది. 3 లక్షల కట్నం ఇచ్చిన తర్వాత కూడా కలర్ టి.వి కావాలని పట్టుబడుతుంది. చివరకు కలర్ టి.వి తెచ్చిన తర్వాత శాంతిస్తుంది.

6. జులేఖా :
పెండ్లిండ్ల (పెళ్ళిళ్ళ) పేరమ్మ. ఈ సంబంధం కుదిర్చిన ఆమె. ఇటు అటు మధ్య వర్తిగా వ్యవహరిస్తుంది.

7. జైనబ్ బి :
వధువు సుల్తానా తల్లి. దహేజ్ లో గోలచేసిన వియ్యపు రాలితో ప్రాధేయ పూర్వకంగా మాట్లాడుతుంది. వాళ్ళ పరువు, మర్యాద పోతాయని బ్రతిమలాడు కుంటుంది.

పాఠ్యభాగ సారాంశం

సుల్తానా, రెహమాన్ పెండ్లి జరిగింది. రాత్రి 11 గంటలకు శోభనం. పెండ్లి కొచ్చిన కొంత మంది. ఈ కాలం పెండ్లికి పూర్వకాలం పెండ్లికి ఉన్న వ్యత్యాసాన్ని పోల్చుకుంటూ మాట్లాడుకుంటారు. ఒకప్పుడు ఏడు రోజులు పెళ్ళిళ్ళు ఉండేవని ఈ రోజుల్లో చాల మార్పు వచ్చిందని అనుకుంటూ ఉంటారు. పెళ్ళి మండపం దగ్గరకు రమ్మని పెళ్ళి కుదిర్చిన జులేఖా అందర్ని ఆహ్వానిస్తుంది.

పెళ్ళి మండపం అంతా అలంకరించబడి ఉంటుంది. పెండ్లి కొడుక్కి పెండ్లి కూతురికి మధ్య ఎర్రని గుడ్డ అడ్డు తెరగా ఉంటుంది. తలంబ్రాలు పోసుకున్నాక అడ్డు తెర వారిద్దరి తలలపై కప్పారు. వధువు ముఖాన్ని ముసుగులో నుండి అద్దంలో చూపిస్తారు. ఉంగరం తొడుగుతాడు పెండ్లి కొడుకు, కలకండ తినిపిస్తారు.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 6 దహేజ్

పరిహాసాలతో ఆడపడుచులు హడావిడితో నిండి ఉంటుంది. ఆ మండపం వధువును భుజంపై వరుడు ఎత్తుకోవాలన్నారు. కొంత తటపటాయించి ఒక్క ఊపులో వధువును భుజం పైకి ఎత్తుకున్నాడు. గడపకు గంధం పూయించారు. ఇక వీరి సంప్రదాయాలు పూర్తి చేసుకున్నాక దహేజ్ అమర్చారు. జులేఖా అందర్ని పిలిచి దహేజ్ చూడమని చెప్పింది. కాపురానికి కావలసిన సామానంతా సులేమాన్ సిద్ధం చేసాడు.

ఫ్రిజ్, గ్యాస్ సిలెండర్, స్టావ్, కిచెన్ స్టాండ్, వంట పాత్రలు, వరుని కొరకు మోటార్ సైకిల్ బీరువా డైనింగ్ టేబుల్ డ్రస్సింగ్ టేబుల్, ఎయిర్ కూలర్, ఇరవై జతల బట్టలు మొదలైనవన్నీ అమర్చాడు సులేమాన్. ఇంతలో అత్తగారు వచ్చి ఇదేం దహేజ్ అంటూ గోల చేసింది. ఏమిటి లోపం అనడిగితే కలర్ టి.వి లేదంది.

అది వియ్యంకుల వారే వద్దని చెప్పారని సులేమాన్ చెప్పినా వినలేదు వియ్యపురాలు అప్పటికప్పుడు రాత్రి షాపు తెరిపించి కలర్ టి.వి తెచ్చి ఇస్తాడు వధువు తండ్రి. అన్నీ సరిపోయాయా అంటు అంటూ గట్టిగా అడుగుతాడు. జులేఖా కూడా సరిపోయాయని అంటుంది.

సులేమాన్ మీరనుకున్నట్లు ఈ దహేజ్ పూర్తి కాలేదని రెండు కఫన్లు ఒకటి తెల్లది ఒకటి ఎర్రవి తెచ్చి ఇస్తాడు. ఇది నేను దహేజ్ లో మరిచి పోయిన అసలైన దహేజ్. ఏ ఆడపిల్ల తండ్రి అయినా గుర్తుంచు కోవలసిన దహేజ్ అది అని కళ్ళు తిరిగి పడిపోతాడు సులేమాన్.

కఠిన పదాలకు అర్ధాలు

నిక్కా = పెళ్ళి
జుల వా = శోభనం, తలంబ్రాలు
షుక్రానా = పెళ్ళికి ముందురోజు రాత్రి చేసే కార్యక్రమం – సాంగ్యం లాంటిది
వలీమా = మలి పెళ్ళి – పెళ్ళి తరువాత మరుసటి రోజు పెళ్ళి కొడుకు ఇంటి దగ్గర నిర్వహించే విందు భోజన కార్యక్రమం
రసం = సాంగ్యం
పేరమ్మ = పెళ్ళిళ్ళ పేరయ్యకు స్త్రీవాచకం
పూలబారు = పూలదండలు
తగట్ కాగితాలు = తళుకులీనే కాగితాలు
రంగు లైట్ల సరాలు = వివిధ రంగుల బల్పుల దండలు, వీటినే మనం సీరియల్ లైట్స్ అని వ్యవహరిస్తున్నాం
బార్ లైట్లు = ట్యూబులైటులు, ఫోకస్ లైటులు
సర్గాముసుగు = పెళ్ళి సమయంలో వేసే ముసుగు

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 6 దహేజ్

దుల్హన్ = వధువు
పత్తేకి అంఝాటి = ఆకు ఆకారంతో ఉన్న ఉంగరం
వారా పేరి = దిష్టితీసే సాంగ్యం
గడపమాను = గుమ్మం
దూలా = దుర్ఘ వరుడు
కార్యం = శోభనం
హజరత్ = మసీదులో ప్రార్థన చేయించే మత పెద్ద
అల్వి దా = వీడ్కోలు
సాకినాను = పెంచినాను, పెంచాను
సందావ = వియ్యంకులు
నిస్ బత్ = సంబంధం
రివాజ్ = సంప్రదాయం, అలవాటు
మేరే మెహర్బాన్ భాయో! బహేనో = నా ప్రియమైన సోదర సోదరీ మణులారా!
కఫన్ = శవంపై కప్పే వస్త్రం
పాన్ దాన్ = తమలపాకుల పెట్టె
వకాల్ దాన్ = చేతులు కడిగే పాత్ర
షాన్ = మర్యాద, గౌరవం, తేజస్సు
దువా = ఆశీర్వాదం

Leave a Comment