AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 5 ఎచ్చరిక

Andhra Pradesh BIEAP AP Inter 1st Year Telugu Study Material Non-Detailed 5th Lesson ఎచ్చరిక Textbook Questions and Answers, Summary.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed 5th Lesson ఎచ్చరిక

ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న 1.
‘ఎచ్చరిక’ పాఠ్యభాగం ద్వారా భూస్వాముల దౌర్జన్యాన్ని వివరించండి.
జవాబు:
నర్సిరెడ్డి పటేలు దగ్గర పెంటయ్య పని చేస్తూ ఉంటాడు. నిజాం పాలనలో పటేలు, పట్వారీ వ్యవస్థ ఉండేది. పెంటయ్య కొడుకు రాములు 20 సంవత్సరాల యువకుడు.

రాత్రి బడిలో వయోజన విద్య ద్వారా చదువుకుంటాడు. తరతరాలుగా పటేలు దగ్గర పనిచేయడాన్ని ఇష్టపడడు రాములు. పెంటయ్యను ఉద్దేశించి “నీ కొడుకు ఇక్కడ ని జీతానికి ఉండనంటున్నాడట మరి బాకీ ఎవరు తీరుస్తారు? మా బాకీ తీర్చి ఎక్కడికైనా పొండి అని అంటాడు ఫటేలు. అప్పటివరకు మేపిన బర్రెను ,కొట్టంలో కట్టి దూడకి కాస్త గడ్డి వేసి వస్తాడు రాములు. ఏమిరా జీతానికి ఉండనని అంటున్నావట అని రాములుని పటేలు ప్రశ్నించాడు మారు మాటాడలేదు రాములు: చేతిలో కాని ఉంటే ఎవరైనా వస్తారు. మా అప్పు చెల్లగొట్టి ఎటైనా పోవచ్చునని అన్నాడు పటేలు.

అప్పుడే వచ్చిన పెంటయ్యతో ఆ సాతాని పంతుల్ని పిలిపించి కాగితాలతో పటేలు వస్తాడు. పంతులు పెంటయ్య ముందు కాగితాలు పెడతాడు. కాస్త లెక్కలు చూడండి – వీళ్ళు తొందర చేస్తున్నారని అంటాడు. పెంటయ్య తాత పెళ్ళికి చేసిన అప్పు ఒక కాగితం.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 5 ఎచ్చరిక

పెంటయ్య తండ్రి పెళ్ళికి చేసిన అప్పు మరొక కాగితం, పెంటయ్య పెళ్ళికి చేసిన అప్పు మరొక కాగితం ఇలా మూడు తరాలుగా వాళ్ళ ఇంట్లో పెళ్ళి పేరంటం అయినా పురుడు అయినా తీసుకున్న దానికి వాళ్ళ జీవితాంతం వాళ్ళ దగ్గర పాలేర్లుగా పనిచేయాలనేది ఆనాటి భూస్వాముల అభిప్రాయం. పెంటయ్య కూడా చిన్ననాటి నుండి పటేలు ఇంట్లో చాకిరీ చేస్తూనే ఉన్నాడు.

వారి కష్టాన్ని వడ్డీ కింద జమచేసి అసలు అప్పు అలాగే ఉంచేవారు. వాళ్ళు బయటకు వెళ్ళి బ్రతకకూడదు. వాళ్ళకు జబ్బు చేసినా మళ్ళీ వాళ్ళ దగ్గరే అప్పు తీసుకోవాలనే వాళ్ళు ఆనాటి పటేళ్ళు. వీళ్ళ కష్టం వల్ల వాళ్ళ ఆస్తిపాస్తులు పెరుగుతాయి గాని వీళ్ళ అప్పు తీరదు. ఇది అన్యాయ మనిపించే రాములు పటేలు దగ్గర పనిచేయనని చెప్పాడు.

పంతులు లెక్కగట్టి 2 వేల రూపాయిలు దాకా అప్పు ఉన్నట్లు చెప్పగానే రాములు ఈ కాగితాలు ఎందుకు దాచిపెట్టారు? మా పాడి ఆవును తీసుకున్న దానికి అప్పులో తగ్గించలేదా ? మేకపోతును కోసుకుని తిన్నదానికి అయిన పైసలు అప్పులోనుండి తగ్గించలేదా ? అని రాములు అడుగుతాడు. కూలి పనిచేయించుకునే వారు వాళ్ళను బానిసల్లా చూడడమే తెలుసు ఆనాటి భూస్వాములకు.

ఏది ఏమైనా అప్పు తీర్చి ఎటైనా పొండి అని పటేలు తండ్రీ కొడుకులతో అంటాడు. పెదపటేలు ఈ పటేలు తండ్రి అప్పుడు రెండు దున్నలు, ఒక బర్రె ఉన్న సంసారం వారిది. ఇప్పుడు మూడు దొడ్ల పశువులు అయినాయి. ఇరవై ఎకరాల భూమి ఇప్పుడు ఏభై ఎకరాలు అయింది. ఇలా వాళ్ళ ఆస్తి పాస్తులు పెంచుకోవడమే గాక, పనివాళ్ళను వదిలిపెట్టకుండా వాళ్ళ అవసరాలకు కొంత డబ్బు ఇచ్చి వడ్డీలు . వేసి చాకిరి చేయించుకుని వాళ్ళు స్థితిమంతులయ్యే వాళ్ళు ఆనాటి పటేళ్ళు.

ప్రశ్న 2.
ఎచ్చరిక పాఠ్యభాగ సారాంశాన్ని తెలియజేయండి.
జవాబు:
పెంటయ్య నర్సిరెడ్డి పటేలు దగ్గర పనిచేస్తూ ఉంటాడు. పొలం నుండి నాగలి కొట్టంలో పెట్టి వెళ్ళబోతాడు పెంటయ్య. పటేలు పెంటయ్యను ఉద్దేశించి “నీ కొడుకు పనిలోకి రానంటున్నాడట” అని అంటాడు. వాడు నా మాట వినటం లేదండీ అంటాడు పెంటయ్య.

అయితే అప్పు ఎలా తీరుతుంది? మీ అప్పు తీరుస్తాను ఎవరికైనా ఋణం ఎందుకు ఉంటాము అని పెంటయ్య అనగా నీవు కాదు నీ కొడుకు తీర్చాలి. ఎందుకంటే 50 ఏళ్ళు వచ్చిన నీవు ఇంకా ఎంతని కష్టపడతావు అని జాలి పడ్డాడు పటేలు పెంటయ్య మీద. ఇంటికి బయలదేరిన పెంటయ్యకు బండిలో పటేలు కొడుకు ఎదురయ్యేడు. ఏం పెంట బాగాన్నావా? అనగానే ఆఁఏదో బాగానే ఉన్నానని సమాధానమిచ్చాడు పెంటయ్య.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 5 ఎచ్చరిక

పెంటయ్య తన కొడుకును బడికి పంపుదామనుకుంటాడు. పటేలు వాడికి చదువెందుకురా? ఈ భూమి ఈ వ్యవసాయం ఎవరు చేసుకోవాలి అని అంటాడు. పెంటయ్యకు తన పరిస్థితి అర్థం అయింది. అప్పుడే బర్రెను తోలుకొచ్చిన రాములు దూడను బర్రె దగ్గరకు వదలగానే తన్నింది. కొమ్ములతో నెట్టేసింది. దూడ మూతికి . ముండ్లు ఉన్న బుట్ట కట్టేసి ఉంది. అందుకనే అది అలా చేసింది.

పటేలు దూడమూతికి ముండ్ల బుట్ల వీరి నెత్తిన అప్పు బరువు పెట్టాడని, రాములు అర్థం చేసుకుంటాడు. అందుకనే పనిచేయనని అంటాడు. వాళ్ళ అప్పు ఎంత ఉందో తేల్చమని అంటాడు. పంతులు గారు వచ్చి కాగితాలన్నీ చూసి రెండు వందలు తక్కువ రెండు వేలు అప్పు ఉన్నట్లు లెక్కలు చెప్పగానే మూడు తరాలుగా వీళ్ళ కింద పనిచేస్తున్నా ఇంత అప్పు ఎందుకుందో అర్థం కాలేదు రాములుకి. ఈ కాగితాలన్నీ ఎందుకు దాచారు?

మా కష్టాన్ని జమవేయలేదా? కేవలం వడ్డీల కింద లెక్కగట్టి అసలు అలానే చూసిస్తున్నట్లు గ్రహించాడు. రాములు. వాళ్ళ ఇంట ఆవును, మేక పోతును తీసుకున్నారు. వాటికి అప్పులో ధర కట్టి తగ్గించాలి కదా అని అంటాడు.

మా తాత కష్టం, మా అయ్య కష్టం, నా కష్టం కలిపినా మీ అప్పు తీరలేదా? మా రెక్కల కష్టం అంతా ఎటు బోయినట్లు మా కష్టానికి మేము కొలిచిన ధాన్యానికి బదులు అప్పు తీరినట్లు ఏమన్నా వ్రాసారా? పంతులు కాగితాలు తిరగేసి కొంత ధాన్యం ఇచ్చినట్టు మళ్ళీ తీసుకున్నట్లు ఉంది.

పెంటయ్యకు తన తండ్రి యిస్తాం మాటలు గుర్తు కొచ్చాయి. వారి ఆస్తి ఎలా పెరిగిందో అర్థం అయింది. మా పిల్లలు కష్టం చేసినా ఈ అప్పు పెరుగుతుందే కాని తీరదు అని గట్టిగానే అన్నాడు. నర్సిరెడ్డి పటేలు ఏదైనా పార్టీలో జేరినావా అన్నాడు అనుమానంగా పూటకు లేని వాళ్ళము మాకెందుకు పార్టీలు అని అంటాడు పెంటయ్య.

పార్టీ గర్టీ కాదు పెంటయ్య బిడ్డ మొగుడు దుబాయ్ వెళ్ళాడు. వాళ్ళను చూసి ఈ రాములు ఇలా మాట్లాడుతున్నాడు. ఏది ఏమైనా.మా బాకీ తీర్చి ఎటైనా పొండి అన్నాడు పటేలు దానికి రాములు కష్టం ఎక్కడైనా తప్పదు పంతులు అని అంటాడు. ముసలి ఎద్దుని దొడ్లో వదిలి వెళ్ళారు దానికి ఇన్ని నీళ్ళు పెట్టి గడ్డి వెయ్యమంటాడు పటేల్ కొడుకు సీన్ రెడ్డి తో ఇంకెన్నాళ్ళు ఈ ముసలి ఎద్దును మేపడం అని విసుక్కుంటాడు.

ఆ ఎద్దును ఏడేండ్ల క్రితం తొమ్మిది వందలకు కొన్నాను. దానివల్ల ఎంతో కలసి వచ్చింది. కాబట్టి చచ్చిందాకా సాకి బొంద పెడతానని పటేలు అంటాడు. అది విన్న రాములు ఆ గొడ్డు కన్నా మా బ్రతుకులు హీనమైపోయాయి. ఇప్పటికైనా తెలుసుకోమని పెంటయ్యతో కొడుకు రాములు అంటాడు.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 5 ఎచ్చరిక

మూడు తరాల నుండి మేము చేసే చాకిరీ కలసి రాలేదా ? అని అనగానే పంతులు కూడా ఆలోచనలో పడ్డాడు. మా లెక్క సరిగా తేలిందా సరేసరి అప్పటివరకు మేము పనిలోకి రాము అంటూ తండ్రి పెంటయ్య రాములు వెళ్ళిపోతారు. పెంటయ్యకు తన కొడుకు ఉదయిసున్న సూర్యునిలా కనబడ్డాడు. వారి మాటలకు పటేలు నోటమాట రాక నిలబడి పోయాడు. పటేలు కాళ్ళ క్రింద భూమి కదిలి పోయినట్లు అనిపించింది.

రచయిత పరిచయం

1. ‘ఎచ్చరిక’ పాఠ్యభాగ రచయిత బోయ జంగయ్య.

2. వీరు నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం లింగారెడ్డి గూడెంలో 1-9-1942 లో జన్మించారు.

3. వీరి తల్లిదండ్రులు ఐలమ్మ, మల్లయ్యలు.

4. వీరి స్వస్థలం యాదాద్రి జిల్లా పంతంగి గ్రామం.

5. జంగయ్య ఎన్నో కష్టనష్టాలకోర్చి బి.ఏ. పూర్తి చేశారు. జీవనోపాధి కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు.

6. జంగయ్య సాహిత్య ప్రయాణం 1960లో మొదలైంది.

7. విద్యార్థి దశ నుండి రచనలు చేయటం ప్రారంభించారు. కథలే కాక, ఇతర ప్రక్రియల్లోను రచనలు చేశారు.

8. కష్ట సుఖాలు, దేశం కోసం, కొత్త బాటలు, ఆలోచించండి మొదలైన నాటికలు, లోకం, గొర్రెలు, ఎచ్చరిక, దున్న, రంగులు, చీమలు, తెలంగాణా వెతలు మొదలైన కథా పంకలనాలు రచించారు.

9. నడుస్తున్న చరిత్ర, వెలుతురు, బోజ కవితలు, పంచనామా కవితా సంపుటాలు, జాతర, జగడం పుట్టుమచ్చ మొదలైన నవలలు రచించారు.

10. జంగయ్య అనేక సన్మానాలు, పురస్కారాలు పొందారు. జాతర నవలకు 1989లో ఉత్తమ నవలా అవార్డు, ఎచ్చరికకు శ్రీశ్రీ స్మారక స్వర్ణ పతకం 1983లో లభించాయి.

11. బోయ జంగయ్య గారి సామాజిక సాహిత్య సేవలకు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటును, ప్రతిభా పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 5 ఎచ్చరిక

12. జీవితచరిత్రలు, బాలల సాహిత్యం , తెలుగు కల్పనా సాహిత్యాన్ని ఎంతగానో ఇనుమడింప జేసిన బోయ జంగయ్య గారు 07-05-2016లో కన్నుమూసారు.

పాత్రల పరిచయం

1. పెంటయ్య :
50 ఏళ్ళ వయస్కుడు. పాలేరు. తాతల నుండి పటేలు దగ్గర పనిచేస్తూ జీవిస్తూ ఉంటారు. పెంటయ్య కొడుకు పటేలు దగ్గర పనిచేయనని తెగేసి చెప్తాడు. పెంటయ్య ఎంత చెప్పినా వినడు. ఇటు కొడుక్కి అటు పటేలుకి చెప్పలేక నలిగి పోతుంటాడు. పటేలు దగ్గర అప్పుచేసి తరాలు పనిచేస్తున్నా ఆ అప్పు తీరటం లేదని బాధపడతాడు. పటేలు అప్పు తీర్చమన్నప్పుడు నీ అప్పుతీర్చే మేము పోతామని దు:ఖ పడతాడు.

2. పటేలు :
నర్సిరెడ్డి ఆర్థికంగా డబ్బున్నవాడు’ సామాజికంగా పై కులానికి చెందిన వాడు. నిజాం పాలనలో ఈ .పటేలు, పట్వారీ వ్యవస్థ ఉండేది. వీళ్ళు, సమాజంలో లేని వాళ్ళను ఆదుకున్నట్లు డబ్బు అప్పు ఇచ్చి దానికి వడ్డీ నిమిత్తం వారింట్లో సర్వ చాకిరీలు చేయించుకునేవారు. అప్పు తీరదు వాళ్ళు బయట బ్రతకలేరు. ఇంటిల్లి పాది చేత పనిచేయించుకుంటారు. పసువులను మేపడం దగ్గర నుండి వాటిని పెంచడం.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 5 ఎచ్చరిక

ఇలా పటేళ్ళ ఆస్తి పాస్తులు పెరుగుతాయి. కూలి చేసే వాళ్ళ జీవితాలు తరతరాలు వారికి ఊడిగం చేస్తూనే ఉంటారు. బయటకి వెళ్ళి బ్రతకలేక ఇక్కడే జీవితాలు చాలిస్తూ ఉంటారు. పటేళ్ళు మాత్రం రాజకీయంగా అధికారం చేపడుతూ ఉంటారు. పటేలు కొడుకుని చదివిస్తున్నాడు. కాని పెంటయ్య కొడుకు వాళ్ళ క్రింద బానిసల్లా బ్రతకాలను కునేవాడు కాదు.

3. రాములు :
పెంటయ్య కొడుకు రాములు. తమ తాత,ముత్తాత, తాతయ్యలు, తండ్రిలా పటేలు దగ్గర పనిచేయడానికి ఇష్టపడడు. రాములుకి 20 సంవత్సరాలు. నల్లగా, సన్నగా ఉంటాడు. ఆ ఊరి పంతులు దగ్గర రాత్రి పూట అక్షరాలు, లెక్కలు నేర్చు” కుంటున్నారు.

ఒక రోజు రాములు ఆ సాతాని పంతుల్ని తీసుకొని రమ్మని తండ్రి పెంటయ్యకు : చెప్పాడు. కాస్సేపటికి పంతులు పెంటయ్య రాగానే ఆ పటేలు దగ్గర తీసుకున్న అప్పు కాగితాలను పెట్టి ఎంత అప్పు ఉందో చెప్పమన్నాడు. పంతులు అన్నీ లెక్కగట్టి రెండు వందలు తక్కువ రెండు వేల రూపాయిలు అని లెక్కతేల్చాడు. పెంటయ్య నివ్వేరపోయాడు.

రాములు మాత్రం ఎన్నో ఆలోచనలతో “ఇన్నాళ్ళు ఈ కాగితాలు ఎందుకున్నాయి ? పుట్టి పెరిగినట్టు ఈ అప్పును ఎందుకు దాచారు? అప్పు తీర్చడానికి సిద్ధమే. కాని మేము చేసిన కష్టం ఎటుపోయింది? ఏటా ఇచ్చే మడి గింజలు అప్పు కింద జమ చేయలేదా ? మరి బాకీ ఎందుకు తగ్గలేదు?”

మా అమ్మమ్మగారిచ్చిన ఆవును కట్టి ఆ పాలను తీసుకున్నారుకదా? పూటకు సర్వెడు పాలు ఎటుపోయినట్టు? పంతులుగారు మేము చేసిన పనికి అప్పు లెక్క గడితే ఇంకెక్కడ ఉంటుందీ అప్పు? మేము తీసుకున్న అప్పు లెక్క చేసారు గాని మేము తీర్చిన దానిని ఎందుకు లెక్క గట్టలేదు? మా మడి గాసం ఎటు పోయినట్లు? మా తాత కష్టం. మా అయ్య కష్టం.

నేను చేసిన కష్టం మూడు తరాల రెక్కల కష్టం ఎటు పోయిందో కాస్త చూసి చెప్పండి అని పంతులు గారిని ప్రశ్నించాడు రాములు. ఇంటిల్లి పాది కష్టపడి పనిచేసి కాస్త ఉన్న ఆస్తిని ఇంత చేశాము. ఈ నాటికి తన తండ్రి బాకీ ఎందుకు తీరదు? వాళ్ళకు ఆస్తి పెరిగితే మాకు అప్పు పెరుగుతుందా? అని బయటకే అనేసాడు రాములు. రాములు మాటలు పటేలు హృదయాన్ని తాకాయి. అప్పు తీర్చి పొమ్మన్నాను కదా అన్నాడు పటేలు.

తొమ్మిది వందలు పెట్టి కొన్న దున్న ముసలిదైపోతే దాన్ని చచ్చేంత వరకు సాకి బొంద పెడతామన్న పటేలు మాటలు విన్న రాములు ఆ ఎద్దు కన్నా మా బతుకులు అద్వాన్నం అన్న సంగతిని గ్రహించమంటాడు తండ్రితో. చూడండి పంతులు గారు ఆ ఎద్దు వల్ల ఎంతో కలసి వచ్చిందంటున్నాడు కాబట్టి దాన్ని సాకుతారట, మూడు తరాలుగా మనుషులు చేసే కష్టం ఆ సామికి కలసిరాలేదు.

ఇదెక్కడ న్యాయం అంటూ రాములు అనే సరికి పంతులు ఆలోచనలో పడ్డాడు. “మా లెక్క సరిగా తేలిందా సరేసరి. అప్పటివరకు మేము పనిలోకి రాం” అని రాములు పెంటయ్య అక్కడ నుండి వెళ్ళిపోయారు. వాళ్ళ మాటలకు పటేలు బొమ్మలా నిలబడి పోయాడు. పెంటయ్యకు
చీకటి బతుకుల్లో సూర్యుడిలా కనిపించాడు రాములు.

4. పంతులు : సాతాని పంతులు నశ్యం పీలుస్తూ ఉంటాడు. ఏమైనా లెక్కలు అటువంటివి చదివి వివరంగా చెప్తాడు. పటేలు దగ్గర పెంటయ్య చేసిన అప్పు పత్రాలు చదివి లెక్కలు చెప్తాడు.

పార్వభాగ సారాంశం

పెంటయ్య ఏభై ఏండ్ల వయస్సులో నాగలిని కొట్టంలో పెట్టి వస్తుంటాడు. ఎదురుగా నర్సిరెడ్డి పటేల్ పెంటయ్యని ఉద్దేశిస్తూ “నీ కొడుకు జీతానికి ఉండనంటున్నాడట” ఏమిటి సంగతి? నా బాకీ తీర్చి ఎక్కడికైనా పొమ్మను” అని అంటాడు. నా బాకీ తప్పించుకునే ఎత్తులు నా దగ్గర సాగవు అని హెచ్చరిస్తాడు. పెంటయ్య కొడుకు రాములు పటేలు దగ్గర పనిచెయ్యనని తెగేసి చెప్పాడు. వాడు నా మాట వినటం లేదని పెంటయ్య నర్సిరెడ్డి పటేలుతో అంటాడు.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 5 ఎచ్చరిక

మూడు తరాలుగా పెంటయ్య కుటుంబం పటేలు దగ్గర పనిచేస్తున్నారు. 20 సంవత్సరాల క్రిందటే కొడుకును బడికి పంపిద్దామనుకుంటే ఎందుకురా చదివి ఏమి వెలగబెడతాడు? అని పటేలు పెంటయ్య ఆలోచనల్ని తుంచేశాడు ఆనాడు. ఈనాడు రాములు 20 సంవత్సరాల వాడయ్యాడు. పటేలు దగ్గర వెట్టి చాకిరి చేయలేనని చెప్పేసాడు.

అయితే అప్పు తీర్చి పొమ్మన్నాడు పటేలు. సాతాని పంతుల్ని పిలిపించి ఎంత అప్పు ఉన్నది లెక్క చూడమన్నాడు రాములు. కాగితాలన్నీ చినిగి జీర్ణావస్థలో ఉన్నాయి. అన్నీ చూసి రెండువందలు తక్కువ రెండు వేలు అని లెక్క చెప్పాడు పంతులు. రాములు మనస్సులో ఎన్నో ఆలోచనలు ఇన్ని కాగితాలు ఎందుకున్నాయి.

ఈ ఇంటి మీద వాన కురవలేదా ? ఇల్లు కాలి పోలేదా ? పుట్టి పెరిగినట్లు మా అప్పు పెరిగి పోయింది. ఇన్నాళ్ళుగా మేము చేసిన కష్టానికి ఏటా మేము ఇచ్చే గింజలకి అప్పు జమ వేయలేదా? మా ఆవును, మేక పోతును తీసుకున్నారు గాని అప్పు జమలోకి అవి రావా? ఇలా అన్నింటిని లెక్కగడితే ఇంక అప్పు ఎక్కడ ఉంటుంది?

పంతులుగారు “మేము తీసుకున్న అప్పునే లెక్కించారు మేము తీర్చిన రకాన్ని ఏమంటారు? మా తాత కష్టం, మా అయ్య కష్టం నేను ఇప్పటివరకు చేసిన కష్టం మూడు తరాలుగా ఎటుబోయింది? చూడండి పంతులుగారు మా కష్టాన్ని అప్పు బదులు రాసారా ? కొంత ధాన్యం ఇచ్చినట్లు ఉంది మళ్ళీ తీసుకున్నట్లు ఉందని పంతులు చూసి చెప్పాడు.

పెంటయ్యకు తన తండ్రి మాటలు గుర్తుకొస్తాయి. ఒక బర్రె ఉన్న సంసారం తనకు తెలిసి రెండు దొడ్ల పసులు ఇప్పుడు మూడు దొడ్ల పసులయ్యాయి. 20 ఎకరాల భూమి ఏభై ఎకరాలయ్యింది. రెండు కొత్త బావులు తవ్వించి కరంటు పెట్టించాడు పటేలు. తల్లి తండ్రి భార్య, తాను మోట బావి కొట్టి కొట్టి నిద్రలేని రోజులు పెంటయ్యకు గుర్తుకొచ్చాయి.

ఇంతకష్టం చేసి ఇంత ఆస్తిని చేస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు తన తండ్రి పెళ్ళి బాకీ తీరలేదు. వాళ్ళకు ఆస్తి పెరుగుతుంది, మాకు అప్పు పెరుగుతుంది. ఇలా ఆలోచిస్తూ బయటకే అనేసాడు రాములు. అయితే మీ వల్లనే మా ఆస్తి పెరిగిందంటావా? అని అంటాడు పటేలు. చూడు పంతులు వీళ్ళ తమాషా? ఏదైనా పార్టీలో చేరావా ? అని అంటాడు పటేలు.

పూటకు లేని వాళ్ళము మా కెందుకీ పార్టీలు అని పెంటయ్య అంటాడు. నీ బిడ్డ మొగడు దుబాయ్ పోయాడు కాస్త సంపాదించాడు కదా. అందుకని నీ బిడ్డ వాళ్ళను చూసి సర్దుకుంటున్నట్లుంది. నా బాకీ తీర్చి పొమ్మంటున్నాను కదా! అని అంటాడు పటేలు. దుబ్బును సరిగా దున్నడం రాని వాడు దుబాయ్ కి పోతాడట.

అక్కడ మన దేశంలో లాగా కాదు. ఇక్కడైతే మన ఇష్టమొచ్చిన చోట బ్రతకవచ్చు. కాని అక్కడ ఇవన్నీ సాగవు. ఎక్కువ మాట్లాడితే వేట నరికినట్లు నరుకుతారు. అక్కడ మనమతం కాదు అని పటేలు అంటాడు. కష్టం చేస్తేనే కదా కడుపు నిండేది అని అంటాడు రాములు. ఇక మీరే న్యాయం చెప్పండి పంతులు అని పటేలు అంటాడు.

పటేలు దొడ్లో ముసలి ఎద్దును నడవలేదని వదిలి పెడతారు. దానికి కాసినినీళ్ళు పెట్టి కాస్త గడ్డి వెయ్యమంటాడు కొడుకుతో పటేలు. ఇంకెన్నాళ్ళు ఈ ముసలి ఎద్దును పెంచుతారు అంటూ సీన్ రెడ్డి విసుగ్గా దొడ్లోకి నడుస్తాడు. ఆ ఎద్దును ఏడేండ్ల క్రిందట తొమ్మిది వందలకు కొన్నాను. పొలాలు దున్నడమే గాక బళ్ళు లాగింది.

దానివల్ల ఎంతో కలసివచ్చింది దాన్ని చచ్చేంత వరకు సాకి బొంద పెడతాను గాని కోతకు అమ్మనని అంటాడు పటేలు. ఆ మాటలు రాములు తలలో కొత్త ఆలోచనలు కలిగించాయి. పెంటయ్య కూడా ఆలోచిస్తున్నాడు. రాములు పెంటయ్యతో తమ బ్రతుకులు గొడ్డు కన్నా ఆద్వాన్నం అని వివరంగా చెప్తాడు.

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 5 ఎచ్చరిక

“చూడండి పంతులుగారు ఆ ఎద్దు వల్ల కలిసొచ్చిందని చచ్చేంత వరకు సాకి కడతేరుస్తారు. మేము మూడు తరాలుగా కష్టం చేస్తున్నా వాళ్ళకు కలసిరాలేదని అంటున్నారు.మా అప్పు పెరుగుతూనే ఉంది. మేము ఛస్తే మళ్ళీ అప్పు తీసుకోవాలి. ఎద్దు కంటే హీనమైన బ్రతుకులు మావి” అని అనగానే పంతులు కూడా ఆలోచనల్లో పడ్డాడు. మా లెక్క సరిగ్గా తేల్చండి.

అంతవరకు మేము పనిలోకి రాము అని రాములు హెచ్చరించాడు. పెంటయ్యకు తనకొడుకు చీకట్లో ఉదయిస్తున్న సూర్యునిలా కనిపించాడు. రాములు నిర్ణయంతో పటేల్ కు నోటమాట రాలేదు. కాళ్ళ క్రింద భూమి కదిలి పోయినట్లు అనిపించి బొమ్మలా నిలబడిపోయాడు.

కఠిన పదాలకు అర్ధాలు

కొట్టం = పశువుల శాల
జీతగాడు = పనిచేసే పాలేరు
ఉన్న తాడికి = ఇష్టమొచ్చిన చోటుకి
మలిచి = మడత పెట్టి
ఇంటలేడు = వినడం లేదు
కూరు పట్లు = కునికి పాట్లు పడినా
దిన బత్తెం = తిండి
వుర్కి = పరిగెత్తి
పసులు = పశువులు
జర = కొంచం
ప్రాణం ముక్కలకొచ్చె = ప్రాణం పోతోంది
కచ్చడం = బండి
పోరడు = పిల్లగాడు
ముండ్లగోరు = దూడల మూతికి కట్టే బుట్ట
దుగ్గాని = రెండు కొణులు
ఎచ్చరిక = హెచ్చరిక
పటేలు = సామాజికంగా, ఆర్థికంగా పై స్థాయికి చెందిన వారిని గౌరవంతోనో, భయంతోనో పిలిచే సంబోధన – నిజాం పాలనలో పటేలు, పట్వారీ వ్యవస్థకిది ఆనవాలు
ఉన్నతాడికి = ఉన్న చోటుకి
మలిచి = మడిచి
జల్మ = జన్మ
ఇంటలేడాయె = వినటం లేదాయె

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 5 ఎచ్చరిక

కూరుపట్ల బడ్డా = కునికిపాట్లు పడ్డా
వుర్కి = పరుగెత్తి
సెల్ల గట్టి = చెల్లుచేసి, తీర్చి
చితపాలకాయ = సీతాఫలం
అమీన్ సాబ్ = పోలీసు అధికారి, సబ్ ఇన్ స్పెక్టర్
ముండ్లగోరు = పాలు తాగే దూడకు మూతికి కట్టడం కోసం ముళ్ళతో తయారు చేసిన బుట్ట
బర్రెగాడి = పశువులు గడ్డి మేయడానికి వీలుగా గాడి (చిన్న గోడ) కట్టి నిర్మించిన ప్రత్యేక స్థలం
దోతి = దోవతి, పురుషులు కట్టుకొనే పంచె
దుగ్గాని = రెండు కాణులు, ఒక కాణికి ఆరు పైసలు
మిత్తి = వడ్డీ
హాలి = నైజాం కరెన్సీ – బ్రిటీషు పాలకులతో, ప్రభుత్వంతో సంబంధం లేకుండా నిజాం రాజు ఏర్పరచుకున్న ప్రత్యేక కరెన్సీ
కుచ్చాలు = కుంచాలు – ధాన్యాన్ని కొలిచే ఒక కొలమానం
గుండు గుత్త = పదితో శేషం లేకుండా భాగించడానికి వీలైన సంఖ్య. దీనినే మనం ‘రౌండ్ ఫిగర్’ అని వ్యవహరిస్తున్నాం
ఆన = వాన
ఆవు కట్టి, కోడెను పెట్టి = ఆవును, కోడెను తాకట్టు పెట్టి
సర్వెడు = శేరెడు – ధాన్యాన్ని కొలిచే ఒక కొలమానం
యిత్తు పాలుకు = పండిన పంటను ఆసామి, రైతుకూలి ముందుగా అనుకున్న ప్రకారం భాగం పంచుకోవడం
మల్లేసుకున్న = మలుపుకున్న, తిప్పుకున్న
మడిగాసం = చేయించుకున్న సేవలకు గాను కులవృత్తిదార్లకు ఫలసాయం పంచడానికి ఆసామి ప్రత్యేకంగా కేటాయించిన మడి. (గాసం = గ్రాసం)
వొజాత్ = బదులుగా
గల్ల = ధాన్యం
తరి = మాగాణి భూమి
చెలక = మెట్ట భూమి

AP Inter 1st Year Telugu Study Material Non-Detailed Chapter 5 ఎచ్చరిక

మోట = కపిల
పైంట్లిచ్చింది = ప్యాంటు వచ్చింది
ఈనగోసి = పంట చేతికొచ్చాక (ఈనగాసి నక్కలపాలు అయినట్టన్న సామెత ఉంది)
ఏట = మేక, గొర్రె
ముసలి పయ్యెద్దు = తెల్లని ముసలి ఎద్దు
బంతి తొక్కడం = నూర్పిడి సమయంలో పంటను పశువులతో తొక్కించడం
అటెంక = ఆ వెనుక, ఆ తరువాత
బొంద = పూడ్చి పెట్టడం, సమాధి చేయడం

Leave a Comment